తిరుపతి, సాక్షి: తిరుపతిలోని హోటళ్లకు మరోసారి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఐఎస్‌ఐ ఉగ్రవాదుల పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్‌పార్క్, పాయ్ వైస్రాయి హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది.
అయితే.. నాలుగు రోజుల క్రితం తిరుపతిలోని 4 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టి.. వాటిని ఫేక్ మెయిల్స్‌గా నిర్ధారించారు. ఫేక్ బాంబు మెయిల్స్‌పై నిన్న(శుక్రవారం) తిరుపతి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.
చదవండి: పట్టణాల్లో 83 లక్షల టన్నుల చెత్త
Comments
Please login to add a commentAdd a comment