bomb threats
-
ముంబై ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపులు
ముంబై: మహారాష్ట్రలోని ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎయిర్‌పోర్టును బాంబులో పేల్చివేసేందుకు కుట్ర జరుగుతోందని గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి తెలిపాడు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసిన ఆ వ్యక్తి.. ముంబయి నుంచి అజర్‌బైజాన్‌కు వెళ్తున్న విమానంలో పేలుడు పదార్థాలు ఉన్నాయని చెప్పాడు. దీంతో సీఐఎస్ఎఫ్ సిబ్బంది వెంటనే సహార్ పోలీసులను అప్రమత్తం చేసింది. ప్రయాణికుల భద్రత కోసం.. ఎయిర్పోర్ట్ ఆవరణంలో పోలీసులు, అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఎటువంటి పేలుడు పదార్థాలు లభించకపోవటం గమనార్హం. మరోవైపు.. నాగ్‌పూర్-కోల్‌కతా విమానానికి సైతం బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో రాయ్‌పూర్ విమానాశ్రయంలో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి చేశారు. ఇక.. విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు. -
విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్
న్యూఢిల్లీ: దుబాయ్ నుంచి వచ్చిన ఎయిరిండియా విమానంలో బుల్లెట్ల కాట్రిడ్జ్ కనిపించడం కలకలం రేపింది. దేశీయ విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు వస్తున్న వేళ్ల చోటుచేసుకున్న ఈ ఘటన అలజడి సృష్టించింది. నంబర్ ఏఐ 916 ఎయిరిండియా విమానం అక్టోబర్ 27వ తేదీన దుబాయ్ నుంచి న్యూఢిల్లీలోని అంతర్జాతీయ వి మానాశ్రయంలో ల్యాండయ్యింది. ప్ర యాణికులంతా సురక్షితంగా కిందికి దిగి న తర్వాత ఒక సీటుపైనున్న బుల్లెట్ల కాట్రిడ్జ్‌ను సిబ్బంది గమనించారు. దీనిపై వెంటనే వారు విమానాశ్రయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటువంటి వాటిని విమానంలోకి తీసుకురావడం పూర్తి నిషేధం ఉంది. ఇప్పటికే 400కు పైగా విమాన సర్వీసులకు బాంబు బెదిరింపులు రావడం..అవన్నీ ఉత్తుత్తివేనని తేలడం తెలిసిందే. భద్రతా చర్యలను తనిఖీలను ముమ్మరం చేసినా పేలుడు సామగ్రి కనిపించడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలా ఉండగా, సోమవారం నేపాల్‌లోని త్రిభువన్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రావాల్సిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు అందింది. విమానాశ్రయం అధికారులు వెంటనే సిబ్బందిని కిందికి దించి పూర్తి స్థాయిలో సోదాలు జరిపారు. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లేకపోవడంతో కొద్ది సేపటికి విమానం టేకాఫ్ తీసుకుంది. -
తిరుపతి హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
సాక్షి, తిరుపతి: నగరంలోని హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. తిరుపతి పోలీసులకు బెదిరింపు కాల్స్ సవాల్‌గా మారగా, మూడు హోటల్స్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఐఎస్ఐ పేరుతో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లేకపోవడంతో పోలీసులు వెనుదిరిగారు.తిరుపతి, తిరుమల అత్యంత సేఫ్‌గా ఉన్నాయని ఎస్పీ సుబ్బారాయుడు తెలిపారు. తిరుపతి వాసులు, భక్తులు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎస్పీ సుబ్బారాయుడు అన్నారు. కాగా, తిరుపతిలోని ప్రధాన హోటళ్లకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. మరోపక్క బాంబు బెదిరింపులకు సంబంధించి ఫేక్ మెయిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.మరోవైపు ఇటీవల దేశవ్యాప్తంగా విమానాలకు ఇటీవల బాంబు బెదిరింపు కాల్స్, మెయిళ్లు పెరిగిపోయిన విషయం తెలిసిందే. వీటిపై విమానయాన శాఖ సీరియస్‌గా తీసుకుంది. విమానాలకు బెదిరింపు మెయిళ్లు పంపిస్తే బ్లాక్ లిస్టులో పెడతామని హెచ్చరించింది. -
మా వైపే బెదిరింపు వస్తుంది సార్!
-
బాంబు బెదిరింపుల వెనక నాగ్‌పూర్‌కు చెందిన పుస్తక రచయిత..
న్యూఢిల్లీ: బాంబు బెదిరింపులతో యావత్ దేశం హడలిపోతోంది. విమానాలు, హోటళ్లు, విద్యాసంస్థలు.. ఇలా ప్రతిచోటా బాంబులు పెట్టినట్టు ఈమెయిల్, సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా బెదిరింపుల వరద ముంచెత్తుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలు ఎక్కువగా వస్తుండటంతో పోలీసు బృందాలు, బాంబు స్క్వాడ్ రంగంలోకి దిగి తనిఖీలు చేయడం.. బాంబు లేదని నిర్ధారించడం ప్రహసనంగా మారింది.ఈనేపథ్యంలో బెదిరింపులకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు గుర్తించారు.ఈ బూటకపు బెదిరింపుల వెనక గోండియాకు చెందిన 35 ఏళ్ల వ్యక్తి ప్రమేయం ఉన్నట్లు తెలిపారు. అయితే నిందితుడు గతంలో ఉగ్రవాదంపై ఓ పుస్తకాన్ని రచించడం గమనార్హం. నిందితుడిని జగదీష్ యూకీగా గుర్తించామని, ఓ కేసులో 2021లో అరెస్ట్ కూడా అయినట్లు నాగ్‌పూర్ సిటీ పోలీస్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తెలిపారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని. అతడిని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు చెప్పారు.జగదీశ్ యూకీ అనే వ్యక్తి ఇ-మెయిల్ ద్వారా పలు ఎయిర్‌లైన్స్‌లకు నకిలీ బాంబు బెదిరింపులు పంపించాడు. దీని కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. దీంతోపాటు ప్రధానమంత్రి కార్యాలయం, రైల్వే మంత్రి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం కార్యాలయాలతోపాటు పలు ఎయిర్‌లైన్స్ కార్యాలయాలకు, డీజీపీ, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్పీఎఫ్)తో సహా వివిధ ప్రభుత్వ సంస్థలకు బెదిరింపు మెయిల్స్ పంపినట్లు డీసీపీ శ్వేతా ఖేద్కర్ వెల్లడించారు. సోమవారం నాగ్‌పూర్ పోలీసులు ముంబైలోని ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు సైతం బెదిరింపులు రావడంతో ఆయన నివాసం వెలుపల భద్రతను పెంచారు. తాను తెలుసుకున్న రహస్య ఉగ్రవాద కోడ్‌పై సమాచారం ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకపోతే నిరసన తెలుపుతానంటూ నిందితుడు బెదిరింపు మెయిల్లో పేర్కొన్నాడు. ఉగ్రవాద బెదిరింపులపై తనకున్న అవగాహన గురించి చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం కావాలని కూడా అభ్యర్థించారు. -
తిరుపతిలో వరుస బాంబు బెదిరింపులు
తిరుపతి క్రైమ్: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో వరసగా బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గత వారం రోజుల్లో పలుమార్లు నగరంలోని ప్రముఖ హోటల్స్‌ను టార్గెట్ చేస్తూ బాంబులు పెట్టామని మెయిల్స్ ద్వారా బెదిరిస్తున్న దుండగులు తాజాగా తిరుపతిలోని ఇస్కాన్ టెంపుల్లో బాంబు పెట్టామని ఆదివారం బెదిరింపులకు దిగారు.దీంతో పోలీసు యంత్రాంగం ఇస్కాన్ టెంపుల్ వద్ద డాగ్, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టింది. జాఫర్ సాధిక్ అనే పేరుతో బాంబు బెదిరింపు మెయిల్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. -
గుడ్ న్యూస్ సార్! ఈ రోజు కేవలం 25 బెదిరింపులే వచ్చాయ్! వాళ్లకే బోర్ కొట్టి తగ్గించుకుంటూ వస్తున్నారు!
-
ఆగని బాంబు బెదిరింపులు.. తిరుపతిలో మళ్లీ కలకలం
సాక్షి, తిరుపతి: నగరంలో మరోసారి బాంబు బెదిరింపులు రావడంతో కలకలం రేగింది. వరద రాజస్వామి గుడిలో బాంబు పెట్టినట్లు మెయిల్ వచ్చింది. బాంబ్‌స్క్వాడ్ తనిఖీలు చేస్తున్నారు. వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో తిరుపతిలో హై టెన్షన్ నెలకొంది. ఆదివారం కూడా మరోసారి బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మూడో రోజులుగా బెదిరింపు మెయిల్స్ వస్తుండగా, జాఫర్ సాదిక్ పేరుతో మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. హోటళ్లు, ఆలయాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. గత మూడు రోజులుగా అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ పార్క్, పాయ్ వైస్రాయ్ హోటల్ సహా మరో రెండు ప్రాంతాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వరుసగా బెదిరింపు మెయిల్స్ రావడంతో భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ఈసారి 33 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. శనివారం మరో 33 విమానాలకు ఈ హెచ్చరికలు అందాయని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో, గత 13 రోజుల్లో 300కు పైగా విమానాలకు ఉత్తుత్తి బెదిరింపులు అందినట్లయింది. ఇండిగో, విస్తార, ఎయిరిండియాలకు చెందిన 11 చొప్పున విమానాలకు శనివారం సామాజిక మాధ్య మ వేదికల ద్వారానే చాలా వరకు బెదిరింపులు అందాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమ వేదికలకు అడ్వైజరీ జారీ చేసింది. బెదిరింపులు శాంతియుత వాతావరణానికి, దేశ భద్రతకు భంగం కలిగించడంతోపాటు దేశ ఆర్థిక భద్రతకు ముప్పుగా పరిణమించాయని ఆందోళన వ్యక్తం చేసింది. వీటి వల్ల విమాన ప్రయాణికులు, భద్రతా విభాగాలపై ప్రతికూల ప్రభావం చూపిందని, విమానయాన సంస్థలు తమ సాధారణ కార్యకలాపాలు కొనసాగించ లేకపోయాయని తెలిపింది. ఐటీ నిబంధనల మేరకు ఇటువంటి తప్పుడు సమాచారంపై ఓ కన్నేసి ఉంచాలని, కనిపించిన వెంటనే తొలగించడం లేదా నిలిపివేయాలని కోరింది. భారత సార్వ¿ౌమత్వం, భద్రత, సమగ్రత, ఐక్యతలకు భంగం కలిగించే చర్యలపై ప్రభుత్వానికి సమాచారం అందించడం తప్పనిసరని స్పష్టం చేసింది. ఆయా మాధ్యమ వ్యవస్థలు తమ నియంత్రణ లేదా ఆ«దీనంలో సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా లేదా 72 గంటల్లోగా అందించడంతోపాటు సంబంధిత దర్యాప్తు సంస్థలకు విచారణలో సహకరించాల్సి ఉంటుందని గుర్తు చేసింది. ఏ యూజర్ అయినా చట్ట విరుద్ధమైన లేదా తప్పుడు సమాచారం ప్రచురణ, ప్రసారం, ప్రదర్శించడం, అప్లోడ్, స్టోర్, అప్డేట్, షేర్ వంటివాటిని అడ్డుకునేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత సామాజిక మాధ్యమ వేదికలదేనని పేర్కొంది. ఉల్లంఘించిన వారిపై ఐటీ చట్టం, భారతీయ న్యాయ సంహిత–2023 ప్రకారం చర్యలుంటాయని తెలిపింది. విషయ తీవ్రత దృష్యా్ట ఈ అడ్వైజరీ జారీ చేస్తున్నట్లు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ తెలిపింది. విమానయాన సంస్థలకు అందుతున్న ఉత్తుత్తి బెదిరింపులకు సంబంధించిన సమాచారాన్ని అందజేయాలంటూ రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం మెటా, ఎక్స్ వంటి సామాజిక మాధ్యమ వేదికలను కోరడం తెలిసిందే. -
తిరుపతిలో హోటల్సు కు బాంబు బెదిరింపు..
-
తిరుపతిలో హోటళ్లకు బాంబు బెదిరింపు కాల్స్
-
తిరుపతి హోటళ్లకు మరోసారి బాంబు బెదిరింపులు
తిరుపతి, సాక్షి: తిరుపతిలోని హోటళ్లకు మరోసారి వచ్చిన బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు హోటళ్లలో తనిఖీలు చేపట్టారు. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు చేస్తున్నారు. ఐఎస్ఐ ఉగ్రవాదుల పేరుతో బెదిరింపు మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధిలో రాజ్‌పార్క్, పాయ్ వైస్రాయి హోటళ్లకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే.. నాలుగు రోజుల క్రితం తిరుపతిలోని 4 హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టి.. వాటిని ఫేక్ మెయిల్స్‌గా నిర్ధారించారు. ఫేక్ బాంబు మెయిల్స్‌పై నిన్న(శుక్రవారం) తిరుపతి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.చదవండి: పట్టణాల్లో 83 లక్షల టన్నుల చెత్త -
మరో 25 విమానాలకు బెదిరింపులు
న్యూఢిల్లీ/ముంబై: దేశీయ విమానయాన సంస్థల విమానాలకు బాంబు బెదిరింపులు ఆగేలా కనిపించడం లేదు. శుక్రవారం మరో 25కు పైగా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో బాంబులు పెట్టామని, పేల్చాస్తామంటూ బెదిరింపులు అందాయి. పూర్తి తనిఖీల అనంతరం ఎటువంటి అనుమానాస్పద వస్తువులు కనిపించకపోవడంతో ఉత్తుత్తి బెదిరింపులేనని అధికారులు తేల్చారు. కోజికోడ్–దమ్మమ్ (సౌదీ)సర్వీసు సహా మొత్తం ఏడు విమానాలకు హెచ్చరికలు అందాయని ఇండిగో సంస్థ తెలిపింది. విస్తారా, స్పైస్‌జెట్ సంస్థలకు చెందిన ఏడేసి విమానాలు, ఎయిరిండియాకు చెందిన ఆరు విమానాలకు బెదిరింపులు అందినట్లు సమాచారం. దీంతో, గత 12 రోజుల్లో 275కు పైగా విమానాలకు ఎక్కువగా సామాజిక మాధ్యమాల ద్వారా బాంబు హెచ్చరికలు అందాయి. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు సహకరించాల్సిందిగా కేంద్రం ఎక్స్, మెటా నిర్వాహకులను కోరింది. -
ఈసారి 95 విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ విమానయాన సంస్థలకు చెందిన దేశీయ, అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. గురువారం మొత్తం 95 విమానాల సర్వీసుల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ వట్టివేనని తేలింది. ఇందులో ఆకాశ ఎయిర్‌కు చెందిన 25, ఎయిరిండియా, ఇండిగో, విస్తారలకు చెందిన 20 చొప్పున, స్పైస్ జెట్, అలయెన్స్ ఎయిర్‌లకు చెందిన ఐదేసి విమానాలు ఉన్నాయి. దీంతో గడిచిన 11 రోజుల్లో 250కు పైగా సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. సామాజిక మాధ్యమాల ద్వారా ఆగంతకులు చేసిన హెచ్చరికలతో అధికార యంత్రాంగం, రక్షణ బలగాలు, విమా నాశ్రయాల సిబ్బందితోపాటు ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు, అసౌకర్యానికి లోనయ్యారు. విమానయాన సంస్థలకు ఆర్థికంగా నష్టం వాటిల్లింది. ఇండిగోకు చెందిన హైదరాబాద్– గోవా, కోల్‌కతా–హైదరాబాద్, కోల్‌కతా–బెంగళూరు, బెంగళూరు–కోల్‌కతా, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, బెంగళూరు– ఝర్సుగూడ, హైదరాబాద్–బగ్దోరా, కోచి– హైదరాబాద్ తదితర సర్వీసులున్నాయి. బుధవారం మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్లో ఉన్న దుమ్నా విమానాశ్రయాన్ని పేల్చి వేస్తానంటూ ఆ ఆగంతకుడు ఫోన్లో చేసిన బెదిరింపు వట్టిదేనని తేలింది.మెటా, ఎక్స్‌లను సమాచారం కోరిన కేంద్రంవిమానాలకు బాంబు బెదిరింపులు కొనసా గుతుండటాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. వీటి వెనుక ఉన్న వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ప్రజా సంక్షేమంతో ముడిపడి ఉన్న అంశం కావడంతో పలు విమానయాన సంస్థలకు పదేపదే అందుతున్న బెదిరింపు హెచ్చరికలకు సంబంధించిన పూర్తి డేటాను అందజేయాలని సామాజిక మాధ్యమ వేదికలైన మెటా, ఎక్స్‌లను కోరింది. -
కొనసాగుతున్న బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులకు బాంబు బెదిరింపు హెచ్చరికలకు తెరపడటం లేదు. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు సుమారు 50 విమానాల్లో బాంబులు పెట్టామంటూ ఆగంతకులు సోషల్ మీడియా ద్వారా బెదిరించారు. ఇందులో ఎయిరిండియా, ఇండిగోకు చెందిన 13 చొప్పున విమానాలు, ఆకాశ ఎయిర్‌కు చెందిన 12, విస్తార విమానాలు 11 ఉన్నాయి. బెదిరింపుల నేపథ్యంలో సోమవారం రాత్రి ఇండిగో తన మూడు సర్వీసులను సౌదీ అరేబియా, ఖతార్లకు మళ్లించాల్సి వచ్చింది. అయితే, ఇవన్నీ వట్టివేనని తేలింది.తాజా ఘటనతో కలిపి 9 రోజుల్లో 170కి పైగా విమాన సర్వీసులకు బెదిరింపులు అందినట్లయింది. బాంబు హెచ్చరికల కారణంగా బెంగళూరు–జెడ్డా సర్వీసును దోహా(ఖతార్)కు, కోజికోడ్–జెడ్డా విమానాన్ని రియాద్(సౌదీ అరేబియా)కు, ఢిల్లీ–జెడ్డా సర్వీసును మదీనా(సౌదీ అరేబియా)కు మళ్లించామని ఇండిగో తెలిపింది. ప్రయాణికులందరినీ సురక్షితంగా దించి వేసి, విమానంలో పూర్తి స్థాయిలో తనిఖీలు జరిపామని వివరించింది. ఢిల్లీ–దమ్మమ్, ఇస్తాంబుల్–ముంబై, ఇస్తాంబుల్–ఢిల్లీ, మంగళూరు–ముంబై, అహ్మదాబాద్–జెడ్డా, హైదరాబాద్–జెడ్డా, లక్నో–పుణే విమానాలకు కూడా బాంబు హెచ్చరికలు అందాయని ఇండిగో వెల్లడించింది. అయితే, ఎయిరిండియా తమ విమాన సర్వీసులకు అందిన బాంబు బెదిరింపులపై ఎటువంటి ప్రకటన చేయలేదు.సోషల్ మీడియా ద్వారా తమ విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని విస్తార ప్రతినిధి చెప్పారు. మిగతా వివరాలను ఆయన తెలపలేదు. బాంబు బెదిరింపులు వట్టివేనని తెలిసినా, ఈ విషయాన్ని సీరియస్‌గానే తీసుకుంటున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు. 1982 నాటి సప్రెషన్ ఆఫ్ అన్ లాఫుల్ యాక్ట్స్ ఎగెనెస్ట్ సేఫ్టీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ యాక్ట్(ఎస్యూఏఎస్సీఏ)కు సవరణలు చేయాలని కేంద్రం యోచిస్తోంది. దీని ప్రకారం బెదిరింపులకు పాల్పడే వారిని కోర్టు ఉత్తర్వులతో పనిలేకుండానే వెంటనే అరెస్ట్ చేసి, విచారణ చేపట్టేందుకు అవకాశమేర్పడుతుంది. అలాగే, దోషులకు కఠిన శిక్షలు పడేలా విమాన భద్రతా నిబంధనలను మార్చాలని కూడా కేంద్రం భావిస్తోంది.9 రోజుల్లో రూ.600 కోట్ల నష్టంతొమ్మిది రోజులుగా కొనసాగుతున్న బాంబు బెదిరింపుల కారణంగా విమానయాన సంస్థలకు రూ.600 కోట్ల మేర నష్టం వాటిల్లి ఉంటుందని విమానయాన సంస్థల మాజీ అధికారులు అంటున్నారు. దేశీయ విమానాలకైతే నష్టం సుమారుగా రూ.1.5 కోట్ల చొప్పున, అంతర్జాతీయ సర్వీసులకైతే రూ.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల వరకు నష్టం ఉంటుందని చెప్పారు. దేశీయ, అంతర్జాతీయ విమానాలకు కలిపి సగటున రూ.3.5 కోట్ల మేర నష్టం ఉంటుందని, ఈ లెక్కన 170 విమానాలకు కలిపి ఈ నష్టం రూ.600 కోట్ల వరకు ఉంటుందని వారు అంచనా వేశారు. ఎయిర్ పోర్టులో పార్కింగ్ చార్జీలు, ఇంధనం వంటి ప్రత్యక్ష ఖర్చులతోపాటు ఇతర విమానాల షెడ్యూళ్లపై పడే పరోక్ష ప్రభావాన్ని కూడా లెక్కించాల్సి ఉంటుందన్నారు. ఇందులో చిన్న, పెద్ద విమానాలు, వాటి ప్రయాణ వ్యవధిని బట్టి కూడా నష్టం వేర్వేరుగా ఉంటుందని చెప్పారు. -
వారంలో 100కుపైగా బెదిరింపులు.. ‘నో-ఫ్లై లిస్ట్‌లో చేరుస్తాం’
విమానాల్లో బాంబు ఉందంటు తప్పుడు సమాచారం అందించి పట్టుబడిన వారిని ‘నో ఫ్లై లిస్ట్’లో పెడతామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దీన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్)గా పరిగణిస్తుందన్నారు. గత వారం రోజులుగా పలు విమానాల్లో దాదాపు 100కుపైగా బాంబు బెదిరింపులు రావడంతో ప్రభుత్వం ఈ చర్యలను తీవ్రంగా పరిగణించింది.ఈ సందర్భంగా మంత్రి స్పందిస్తూ..‘బాంబు బెదిరింపు చర్యల వల్ల విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దేశీయ, అంతర్జాతీయ ఎయిర్‌క్రాఫ్ట్ రాకపోకలు తాత్కాలికంగా కొన్నిచోట్ల నిలిపేశారు. మరికొన్ని ప్రాంతాల్లో చాలా ఆలస్యంగా నడిచాయి. విమానాశ్రయ భద్రతా సిబ్బంది తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. ఈ పరిణామాలకు కారణమవుతున్న వారిపట్ల ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. వీరిని ‘నో ఫ్లైలిస్ట్’(ఎలాంటి కమర్షియల్ విమానాల్లో ప్రయాణించకుండా నిరోధించడం)లో చేరుస్తాం. ఈ నేరాన్ని గుర్తించలేని నేరం(నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్-క్రిమినల్ కేసు)గా పరిగణిస్తాం’ అని చెప్పారు.సమాచారం అందిన వెంటనే ఏం చేస్తారంటే..బాంబు బెదిరింపు సమాచారం అందిన వెంటనే విమానాశ్రయంలోని బాంబు బెదిరింపు అంచనా కమిటీ (బీటీఏసీ) అత్యవసర సమావేశం అవుతుంది. బీటీఏసీలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్), సంబంధిత విమానయాన సంస్థ, విమానాశ్రయ నిర్వాహకులు సభ్యులుగా ఉంటారు. విమానంలో బాంబు ఉందని అందిన సమాచారం మేరకు ఈ కమిటీ ముప్పును ‘నిర్దిష్ట’, ‘నాన్-స్పెసిఫిక్(అస్పష్టమైన)’ అనే రెండు విధాలుగా వర్గీకరిస్తుంది. నిర్దిష్ట ముప్పులో ఫ్లైట్ నంబర్, తేదీ, బయలుదేరే సమయం, ఎయిర్‌పోర్ట్‌కు రావాల్సిన సమయం..వంటి నిర్దిష్ట సమాచారంతో బెదిరింపులు వస్తాయి. దాంతో కమిటీ వెంటనే సదరు పైలట్లను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)ని సంప్రదించమని కోరతారు. తదుపరి చర్యల కోసం గ్రౌండ్ సిబ్బందితో మాట్లాడి చర్యలు తీసుకుంటారు. ఇదీ చదవండి: అమ్మో ఏఐ.. ఉద్యోగాలు ఊడుతున్నాయ్!నాన్-స్పెసిఫిక్ థ్రెట్ విషయంలో ఎయిర్‌లైన్, ఫ్లైట్ నంబర్, తేదీ, షెడ్యూల్ సమయం స్పష్టంగా తెలియజేయరు. టేకాఫ్ అయిన కాసేపటికే బెదిరింపు వస్తే తిరిగి విమానం బయలుదేరిన ఎయిర్‌పోర్ట్‌కు రమ్మని పైలట్‌కు చెబుతారు. లేదా అప్పటికే చాలా దూరం ప్రయాణం చేస్తే దగ్గర్లోని ఎయిర్‌పోర్ట్‌లో జనావాసం ఎక్కువగా లేని బే(విమానాలు నిలిసే ప్రదేశం)కు రప్పిస్తారు. వెంటనే ప్యాసింజర్లను వేరేచోటుకు మారుస్తారు. బ్యాగేజీ, కార్గో, క్యాటరింగ్ మెటీరియల్ స్కాన్ చేస్తూ షిఫ్ట్ చేస్తారు. బాంబు స్వ్కాడ్, స్కానర్ల సాయంతో విమానాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు. అనుమానాస్పదంగా ఏమీ కనిపించకుంటే విమానాన్ని తిరిగి ఆపరేట్ చేస్తారు. ఏదైనా అనుమానాస్పద వస్తువులుంటే మాత్రం భద్రతా సిబ్బంది, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు అందుకు అనుగుణంగా చర్యలు చేపడుతారు. -
మరో 25 విమానాలకు బాంబు బెదిరింపు
ముంబై/న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం దేశీయ విమానయాన సంస్థలకు చెందిన 25 సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు అందాయి. దీంతో, ఈ వారంలో ఇప్పటి వరకు విమానాలకు అందిన బాంబు బెదిరింపుల సంఖ్య 90 దాటింది. అయితే ఇవన్నీ వట్టివేనని తేలిందని అధికారులు వివరించారు. ఆదివారం హెచ్చరికలు అందిన వాటిలో ఇండిగో, విస్తార, ఆకాశ ఎయిర్, ఎయిరిండియా విమానాలున్నాయి. తమ జెడ్డా–ముంబై, కోజికోడ్–దమ్మమ్, ఢిల్లీ–ఇస్తాంబుల్, ముంబై–ఇస్తాంబుల్, పుణె–జోధ్‌పూర్ సర్వీసులకు ఆన్లైన్లో బెదిరింపులొచ్చాయని ఇండిగో తెలిపింది. ఢిల్లీ–ఫ్రాంక్ఫర్ట్, సింగపూర్–ముంబై, బాలి–ఢిల్లీ, సింగపూర్–ఢిల్లీ, సింగపూర్–పుణె విమానాలకు బెదిరింపులందాయని విస్తార వెల్లడించింది. అహ్మదాబాద్–ముంబై, ఢిల్లీ–గోవా, ముంబై–బగ్డోగ్రా, ఢిల్లీ–హైదరాబాద్, కొచ్చి–ముంబై, లక్నో–ముంబై విమాన సర్వీసులకు బాంబు పెట్టామనే హెచ్చరికలు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఆన్లైన్లో వచ్చాయని ఆకాశ ఎయిర్ వివరించింది. అదేవిధంగా, ఎయిరిండియాకు చెందిన ఏడు విమానాలకు కూడా బెదిరింపులు వచ్చాయని అధికారులు తెలిపారు. వీటిపై ఆ సంస్థ స్పందించలేదు. -
70 విమానాలకు బాంబు బెదిరింపులు.. ఎయిర్‌లైన్స్ సీఈఓలతో భేటీ
భారత్‌కు చెందిన విమానాలకు బాంబు బెదిరింపుల పర్వం తీవ్ర కలకలం రేపుతోంది. అటు దేశీయంగా నడిచే వాటితోపాటు విదేశాలకు వెళ్తున్న అనేక ఎయిర్‌లైన్స్ వరసగా బాంబు బెదిరింపులు వస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. గడిచిన ఆరు రోజుల్లో ఏకంగా 70 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయంటే.. వీటి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓవైపు అధికారులు, కపౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ నకిలీ బెదిరింపులపై దర్యాప్తు జరుపుతున్నప్పటికీ పరిస్థితులో మార్పు కనిపించడం లేదు.ఈ క్రమంలో తాజాగా ‘బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ’ (బీసీఏఎస్) అప్రమత్తమైంది. విమానయాన సంస్థల సీఈఓలతో శనివారం సమావేశమైంది. ఢిల్లీలోని రాజీవ్ గాంధీ భవన్‌లోని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో.. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే బెదిరింపులను ఎదుర్కోవడానికి స్టాండర్డ్ ఆపరేటింగ్ విధానాన్ని (ఎస్ఓపీ) అనుసరించాలని సీఈవోలను కోరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.బాంబు బెదిరింపులు ఆందోళన కలిగిస్తున్న వేళ.. ప్రయాణికులకు అసౌకర్యం, క్యారియర్లకు నష్టం కలగకుండా ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలని సూచించింది. బెదిరింపులు, వాటి పట్ల తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని కోరింది.ఇక గత వారం రోజులుగా 70కి పైగా విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. శనివారం ఒక్కరోజే వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానాలకు 30కి పైగా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పటివరకు జరిపిన విచారణలో బెదిరింపులు వచ్చిన బెదిరింపులు వాటిలో ఐపీ (ఇంటర్నెట్ ప్రోటోకాల్) చిరునామాలు లండన్, జర్మనీ, కెనడా, యూఎస్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: విమానాలకు ఉత్తుత్తి బాంబు బెదిరింపుల బెడద ఇటీవలి కాలంలో విపరీతంగా పెరిగిపోయింది. గురువారం ముంబై నుంచి లండన్‌కు బయలుదేరిన ఎయిర్ఇండియా విమానం ఏఐసీ129కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. లండన్ గగనతలంపై ప్రయాణిస్తుండగా ‘స్క్వాకింగ్ 7700’ సంకేతాలు అందాయి. ఇదొక అత్యవసర సంకేతామని అధికారులు దాంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఇటీవల 14 భారత విమానాలను వేర్వేరు దేశాల్లో ఇలాంటి కారణంతోనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇదిలా ఉండగా, విమానాల్లో బాంబులు అమర్చామంటూ బెదిరింపులకు పాల్పడుతున్న 10 సోషల్ మీడియా ఖాతాలను సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు రద్దు చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో ఎక్కువ ఖాతాలు ‘ఎక్స్’కు సంబంధించినవేనని తెలిపాయి. ముంబై నుంచి బయలుదేరే మూడు విమానాల్లో బాంబులు పెట్టానని ఎక్స్‌లో పోస్టు చేసిన 17 ఏళ్ల బాలుడిని ముంబై పోలీసులు చత్తీస్‌గఢ్‌లో ఇటీవల అరెస్టు చేశారు. -
వారిక ‘నో ఫ్లై లిస్టు’లో
న్యూఢిల్లీ: విమానాలకు బాంబు బెదిరింపులతో హడలెత్తిస్తున్న ఆకతాయిలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇలాంటి ఉత్తుత్తి బాంబు బెదిరింపులతో ప్రమాణికులకు తీవ్ర అసౌకర్యం కల్పిస్తున్న వారిని, భయాందోళనలకు గురిచేస్తున్న వారిని ఇకమీదట విమాన ప్రయాణానికి అనర్హుల జాబితా (నో ఫ్లై లిస్టు)లో చేర్చనున్నారు. మూడు రోజుల్లో మొత్తం 19 జాతీయ, అంతర్జాతీయ విమానా లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. కొన్ని విమానాలను దారిమళ్లించి దగ్గర్లోని విమానాశ్రయాల్లో దింపి తనఖీలు పూర్తి చేశారు. ఇవన్నీ ఉత్తుత్తి బాంబు బెదిరింపులేనని తేలింది. సమస్య తీవ్రతను గుర్తించిన కేంద్ర పౌర విమానయాన శాఖ అధికారులు బుధవారం సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ, కేంద్ర హోంశాఖ అధికారులతో సమావేశమై తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించారు. నిఘా సంస్థలు, పోలీసుల సహకారంతో బాంబు బెదిరింపులకు దిగుతున్న వారిని గుర్తించే ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. ప్రభుత్వం పరిస్థితిని నిశితంగా గమనిస్తోందని, చట్టసంస్థలు ప్రతికేసులోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నాయని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడు బుధవారం తెలిపారు. మరో ఏడు విమానాలకు బెదిరింపులుబుధవారం మరో ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇవన్నీ ఉత్తవేనని తేలింది. నాలుగు ఇండిగో విమానాలు, రెండు స్పైస్‌జెట్ విమానాలు, ఒక ఆకాశ ఎయిర్ విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. రియాద్–ముంబై ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో దాన్ని దారి మళ్లించి మస్కట్ (ఒమన్)లో దింపారు. చెన్నై– లక్నో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో లక్నోలో దిగగానే ప్రయాణికులను సురక్షితంగా దింపి.. విమానాన్ని నిర్జన ప్రదేశానికి తీసు కెళ్లారు. అలాగే ఢిల్లీ– బెంగళూరు ఆకాశ ఎయిర్ విమానానికి బెదిరింపు రావడంతో దాన్ని తిరిగి దేశ రాజధానికి మళ్లించి.. క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. ఇలాగే ముంబై– ఢిల్లీ ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అహ్మదాబాద్‌కు మళ్లించారు. మైనర్ అరెస్టు: ముంబై: మూడు విమానాలను లక్ష్యంగా చేసుకొని సోషల్‌మీడియాలో బాంబు బెదిరింపులు పంపిన చత్తీస్‌గఢ్‌లోని ఒక 17 ఏళ్ల మైనర్‌ను బుధవారం ముంబై పోలీసులు అరెస్టు చేశారు. -
విమానాలకు వరుస బాంబు బెదిరింపులు.. అనుమానితుల జాడ గుర్తింపు
న్యూఢిల్లీ: భారత్‌కు చెందిన పలు విమానాలకు వరుస బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపుతున్నాయి. గడిచిన మూడు రోజుల్లో వివిధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన 12 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఈ ఘటనలు అటు విమానయాన సంస్థలు, ఇటు ప్రయాణికుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి.అయితే విమానాల్లో బాంబు బెదిరింపులును కేంద్రం తీవ్రంగా పరిగణిస్తోంది. ఇదే అంశంపై చర్చిందేందుకు రవాణాపై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం భేటీ అయ్యింది.తొలుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మంత్రిత్వ శాఖ అధికారులు, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు ఈ అంశంపై చర్చించి ఆ వివరాలను కమిటీకి వెల్లడించారు. ఈ ఘటనల్లో కొంతమంది అనుమానితుల జాడ గుర్తించినట్లు, కీలక సమాచారాన్ని సేకరించామని చెప్పినట్లు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. అబద్దపు బెదిరింపు కాల్స్ చేసిన వారిని 'నో-ఫ్లై లిస్ట్'లో చేర్చాలని, అదేవిధంగా విమానాల్లో ఎయిర్ మార్షల్స్ సంఖ్యను పెంచడం వంటి చర్యలను ప్రబుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం.48 గంటల్లో 10 విమానాలకు బాంబు బెదిరింపులుకాగా బుధవారం బెంగళూరు వెళ్తున్న అకాశా ఎయిర్ ఫ్లైట్, ఢిల్లీకి వస్తున్న ఇండిగో విమానానికి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరింపులకు పాల్పడ్డారు. ఇకమంగళవారం ఏకంగా పలు సంస్థలకు చెందిన ఏడు విమానాలకు ఇలాంటి బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీ-చికాగో ఎయిర్ ఇండియా విమానం, జైపూర్-బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, దమ్మం-లక్నో ఇండిగో విమానం, దర్భంగా-ముంబై స్పైస్‌జెట్ విమానం, సిలిగురి-బెంగళూరు అకాశ ఎయిర్ విమానం, అలయన్స్ ఎయిర్ అమృత్సర్-డెహ్రాడూన్-ఢిల్లీ విమానం, మధురై నుంచి సింగపూర్ వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం సహా ఏడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి.సోమవారం రెండు ఇండిగో, ఎయిరిండియా విమానాలకు ఇలాంటి నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీలు పోలీసులతో కలిసి బెదిరింపుల వెనుక ఉన్న నిందితులను కనిపెట్టడానికి పని చేస్తోంది -
మూడు విమానాలకు బాంబు బెదిరింపులు
న్యూఢిల్లీ: ముంబై నుంచి బయలుదేరిన మూడు అంతర్జాతీయ విమానాలకు సోమవా రం బాంబు బెదిరింపులు రావడంతో భద్ర తా సంస్థలు ఉలిక్కిపడ్డాయి. ముంబై నుంచి న్యూయార్క్ వెళ్తున్న ఎయిరిండియా విమా నంతో పాటు మస్కట్ (ఒమన్), జెడ్డా (సౌదీ అరేబియా)కు వెళ్తున్న రెండు ఇండిగో విమా నాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చా యి. న్యూయార్క్ బయలుదేరని విమానాన్ని ఢిల్లీకి దారి మళ్లించారు. ఇండిగో విమానాలకు టేకాఫ్‌కు ముందే బెదిరింపులు రావడంతో భద్రతా తనిఖీల కోసం ఐసోలేషన్ బేలకు తరలించారు. ఢిల్లీకి దారి మల్లించిన ఎయిర్ ఇండియా విమానంలో 239 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. ప్రయాణికులను దింపేసి.. క్షుణ్ణంగా తనిఖీ చేశామని, విమానం లోపల ఎటువంటి అనుమానాస్పద వస్తువు కనిపించలేదని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 14న ముంబై నుంచి జేఎఫ్ కెనడీ విమానా శ్రమయానికి వెళ్తున్న ఏఐ 119 విమానానికి నిర్దిష్ట భద్రతా హెచ్చరికలు అందాయని, ప్రభుత్వ భద్రతా నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఢిల్లీకి మళ్లించామని ఎయి రిండియా ఒక ప్రకటనలో తెలిపింది. -
రాజస్థాన్‌లో హై అలర్ట్.. రైల్వేస్టేషన్లకు బాంబు బెదిరింపులు
జైపూర్: దేశంలో రోజూ ఎక్కడో ఓ చోట బాంబు బెదిరింపు వస్తూనే ఉంది. స్కూళ్లు, ఎయిర్‌పోర్టులు, రైల్వేస్టేషన్లు, ఆస్పత్రులు ఇలా దేన్నీ వదలకుండా ఫోన్లు, మెయిళ్లు, లేఖల ద్వారా భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. తాజాగా రాజస్థాన్‌లోని పలు రైల్వేస్టేషన్లకు బుధవారం(అక్టోబర్2) బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాజస్థాన్‌లోని హనుమాన్‌ఘర్ జంక్షన్‌లోని స్టేషన్ సూపరింటెండెంట్‌కు గుర్తుతెలియని నుంచి ఓ లేఖ వచ్చింది. లేఖ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ పేరుతో ఉంది. బికనీర్, శ్రీరంగానగర్, జోధ్‌పుర్, బుందీ, కోట, జైపూర్, ఉదయర్‌పుర్ సహా పలు రైల్వేస్టేషన్లలో బాంబు దాడులు జరగనున్నాయనేది లేఖ సారాంశం.లేఖ చదవిన వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు. బీఎస్ఎఫ్, జీఆర్పీ, ఆర్పీఎఫ్ బలగాలు రైల్వేస్టేషన్లను జల్లెడ పట్టాయి. తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు దొరకలేదని అధికారులు తెలిపారు.ఇదీ చదవండి: పుణెలో కూలిన హెలికాప్టర్.. ముగ్గురు మృతి -
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు
ముంబై: ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ముంబై నుంచి బయలుదేరిన ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. విమానం ఉదయం 8 గంటలకు విమానాశ్రయంలో ల్యాండ్ అయిందని, ఐసోలేషన్ బేకు తరలించామని తెలిపారు. వెంటనే విమానం నుంచి ప్రయాణికులను ఖాళీ చేయిస్తున్నామని అధికారులు తెలిపారు. విమానం తిరువనంతపురం విమానాశ్రయానికి చేరుకోగానే పైలట్‌కి బాంబు బెదిరింపు సమాచారం అందింనట్లు అధికారలు తెలిపారు. విమానంలో 135 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. బాంబు బెదిరింపలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవటం కోసం దర్యాప్తుకు ఆదేశించినట్లు అధికారులు తెలిపారు.#news #India #kerela #AirIndia #ndtv Thiruvananthapuram: A full emergency was declared at the Thiruvananthapuram International Airport today following a bomb threat on an Air India flight from Mumbai, airport sources said.The flight landed at the airport around 8 am. pic.twitter.com/BeSgwkJsRT— Manuj jha (@manuj_jha) August 22, 2024 -
ఢిల్లీలో ఉత్తుత్తి బాంబు బెదిరింపులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానికి బాంబు బెదిరింపుల బెడద ఎక్కువైంది. ఢిల్లీలోని మ్యూజియాలు, ఆస్పత్రులను బాంబులతో పేల్చేస్తున్నట్లు ఆగంతకులు పంపిన ఈ మెయిల్స్ బుధవారం పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించాయి. ముమ్మర తనిఖీలు చేసి అవన్నీ ఉత్తుత్తి బెదిరింపులేనని లేదని తేల్చారు. నేషనల్ మ్యూజియం, రైల్వే మ్యూజియం, ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ బిహేవియర్, విద్యాసాగర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, న్యూరో, అలైడ్ సైన్సెస్ మానసిక వైద్యాలయాలకు బాంబు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. ఢిల్లీలో ఎయిర్‌పోర్టులు, స్కూళ్లు, ఆస్పత్రులు, ఆఫీసులకు నెల రోజులుగా బెదిరింపు మెయిల్స్ వస్తున్నాయి.