ప్యారిస్: ఫ్రాన్స్‌లో బాంబు బెదిరింపులు కలవరం రేపాయి. దేశవ్యాప్తంగా ఆరు విమానాశ్రయాలలో బాంబు పేలుళ్లు జరగనున్నాయని దుండగులు ఈమెయిళ్ల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారు. అప్రమత్తమైన అధికారులు ఆయా ఎయిర్‌పోర్టులను ఖాలీ చేయించారు. బాంబు స్క్వాడ్ బృందాలు తనిఖీల్లో నిమగ్నమయ్యారు.
పారిస్‌కు సమీపంలో ఉన్న లిల్లే, లియోన్, నాంటెస్, నైస్, టౌలౌస్, బ్యూవైస్ విమానాశ్రయాల్లో బాంబులు పేలుళ్లు జరగనున్నాయని ఈమెయిల్స్ ద్వారా బెదిరింపులు వచ్చాయని పోలీసులు తెలిపారు. దీనిని ధ్రువీకరించిన అధికారులు తనిఖీలు చెపడుతున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: గాజా ఆస్పత్రిపై దాడి.. హమాస్ పనే.. ఇజ్రాయెల్ ఆధారాలు వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment