
పాకిస్థాన్‌లో ఇవాళ మధ్యాహ్నం మరోసారి భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.6 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) వెల్లడించింది. భూకంప తీవ్రత స్వల్పంగా ఉన్నప్పటికి పలు ప్రాంతాల్లో భారీగా ప్రకంపనలు వచ్చినట్లు సమాచారం. భూకంప కేంద్రం తజికిస్తాన్‌లోని అష్కాషెమ్‌కు పశ్చిమాన ఆఫ్ఘనిస్తాన్ నుండి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు ఎన్‌సీఎస్ తెలిపింది.
కాగా, అంతకుముందు.. ఈ నెల 10న భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆందోళనకు గురైన పాకిస్థాన్ ప్రజలు భయంతో వీధుల్లోకి పరుగులు తీశారు. తాజాగా, మరో భూకంపం రావడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. ఎన్‌సీఎస్ నివేదిక ప్రకారం.. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉందని.. 29.67 డిగ్రీల ఉత్తర అక్షాంశం... 66.10 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద నమోదైంది.