
ఇస్లామాబాద్: పాకిస్తాన్‌లో ఘోర భూకంపం చోటు చేసుకుంది. గురువారం సంభవించిన భూకంపంలో 20 మృతి చెందగా, సుమారు 200 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక అస్పత్రులకు తరలిస్తున్నారు. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో భూకంపం తీవ్రతగా అధికంగా ఉండటంతో పలు ఇళ్లు, భవనాలు కూలిపోయాయి.
ఈ ఘటనపై బలూచిస్తాన్ హోంమంత్రి మీర్ జియా ఉల్లా లాంగా స్పందిస్తూ.. ఉదయం చోటు చేసుకున్న భూకంపంలో 20 మంది మృతి చెందారని తెలిపారు. మృతి చెందిన 20 మందిలో ఒక మహిళా, ఆరుగురు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. 200 మంది క్షతగాత్రులకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామని తెలిపారు. సహాయక చర్యలు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment