NCS
-
ఎన్సీఎస్ పోర్టల్‌లో అమెజాన్ జాబ్స్
న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగావకాశాల వివరాలు ఇక నుంచి నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్‌లో దర్శనమీయనున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో అమెజాన్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదైన అభ్యర్థులు అమెజాన్ చేపడుతున్న నియామకాల వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవచ్చు.మోడల్ కెరీర్ సెంటర్స్ వద్ద జాబ్ ఫెయిర్స్ సైతం కంపెనీ నిర్వహించనుంది. ఇందుకు మంత్రిత్వ శాఖ సాయం చేయనుంది. ఇలా ఒప్పందం చేసుకున్న తొలి ఈ–కామర్స్ కంపెనీ తామేనని అమెజాన్ తెలిపింది. ఎస్సీఎస్ పోర్టల్‌లో ప్రస్తుతం 60 లక్షల పైచిలుకు ఉద్యోగార్థులు, 33.5 లక్షల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రతిభను పెంపొందించడంలో అమెజాన్ నిబద్ధత దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తుందని విశ్వసిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మండావియా అన్నారు. -
వాస్తవాలపై ‘ఉక్కుపాదం’
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఉపాధి కార్యాలయాల ద్వారా నిరుద్యోగులకు నిరంతరం సేవలు అందిస్తున్నట్లు ఉపాధి, శిక్షణ శాఖ డైరెక్టర్ బి.నవ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ కెరీర్ సర్వీసు(ఎన్సీఎస్) ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రంలో 29 మోడల్ కెరీర్ సెంటర్ల(ఎంసీసీ) అభివృద్ధి ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి, ప్రణాళికాబద్ధంగా నిధులు విడుదల చేస్తోందని పేర్కొన్నారు. కానీ, ఈనాడు పత్రిక వాస్తవాలను వక్రీకరిస్తూ ‘ఉపాధిపై ఉక్కుపాదం’ పేరుతో అసత్య కథనాన్ని వండివార్చిందని ఆమె మండిపడ్డారు. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.4.99 కోట్ల ఎన్సీఎస్ నిధులతో 12 ఉపాధి కార్యాలయాలకు మరమ్మతులు చేసి కంప్యూటర్ పరికరాలను సమకూర్చడంతోపాటు పూర్తిస్థాయిలో ఎంసీసీ సెంటర్లను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ఉపాది కార్యాలయాలు/ఎంసీసీ కేంద్రాల్లో అభ్యర్థుల వ్యక్తిగత హాజరు మేరకే రిజిస్ట్రేషన్లు, రెన్యువల్ ప్రక్రియ జరుగుతుందన్న విషయాన్ని ఈనాడు పత్రిక గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. నిరుద్యోగులు తమ ధ్రువీకరణపత్రాలతో జిల్లా ఉపాధి కార్యాలయాల్లో అధికారులను సంప్రదిస్తే ఉచిత రిజిస్ట్రేషన్, కెరీర్ కౌన్సెలింగ్ అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2,07,971 మంది అభ్యర్థులు ఎన్సీఎస్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారని వివరించారు. ఈ డేటా ఆధారంగా ప్రణాళిక ప్రకారం ప్రతి నెలా ఉద్యోగ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంసీసీ, ఏపీఎస్ఎస్డీసీ, సీడాప్ సమన్వయంతో 516 జాబ్ మేళాలు నిర్వహించి 28,362 మందికి ఉపాధి కల్పించినట్టు వివరించారు. ఇప్పటికే కొత్త జిల్లాల్లోనూ ఎంసీసీల నిర్వహణ కోసం కార్యాలయాల ఎంపిక చేసి అధికారులను నియమించామని నవ్య స్పష్టంచేశారు. -
నల్లమలలో స్వల్పంగా కంపించిన భూమి
అచ్చంపేట: నాగర్‌కర్నూల్ జిల్లా నల్లమల ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించింది. సోమవారం ఉదయం 5 గంటల సమయంలో రెండు సెకండ్ల పాటు భూ ప్రకంపనలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లలోని సామగ్రి కదలడంతో ఏమి జరుగుతుందో తెలియక జనం ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. అచ్చంపేట, బల్మూర్, లింగాల, అమ్రాబాద్, పదర, ఉప్పునుంతల, తెలకపల్లి మండలాల్లో భూప్రకంపనలు సంభవించాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్సీఎస్) వెల్లడించింది. దీని ప్రభావం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. శ్రీశైలం జలాశయం బ్యాక్‌వాటర్‌కు 35 కి.మీ. ఎగువన ఈ భూకంపం సంభవించినట్లు గుర్తించారు. హైదరాబాద్‌కు దక్షిణంగా 150 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని ఎన్సీఎస్ వెల్లడించింది. భూగర్భంలో ఏడు నుంచి 10 కిలోమీటర్ల లోతు నుంచి ప్రకంపనలు వచ్చాయని తెలిపింది. -
అసోంలో ఒకే రోజు రెండుసార్లు కంపించిన భూమి
గువాహటి: అసోంలో మరోసారి భూమి కంపించింది. ఈ రోజు ఉదయం 7.05 గంటలకు నగౌన్ సమీపంలో భూకంపం ఏర్పడింది. భూకంపం 26. 49 డిగ్రీల అక్షాంశాలు, 92.46 డిగ్రీల రేఖాంశాల వద్ద 23 కిలోమీటర్ల లోతులో భూకంపం కేంద్రీకృతమైంది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.0గా నమోదయ్యిందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ (ఎన్సీఎస్) ప్రకటించింది.ఈ భూకంపంతో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం కానీ జరగలేదని వెల్లడించింది. కాగా, అర్ధరాత్రి కూడా భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై 3.7 గా నమోదైంది. గత కొన్నిరోజుల నుంచి వరుసగా అసోంలో భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. Earthquake of Magnitude:3.0, Occurred on 10-05-2021, 07:05:52 IST, Lat: 26.49 & Long: 92.46, Depth: 23 Km ,Location: Nagaon, Assam, India for more information download the BhooKamp App https://t.co/YZP6L7RAQ5 @ndmaindia @Indiametdept pic.twitter.com/rrQxJn1QZI — National Center for Seismology (@NCS_Earthquake) May 10, 2021 చదవండి: భారీ భూకంపం: వీడియో వైరల్ -
ఫీల్డ్‌మన్ చేతివాటం ..
పార్వతీపురం: ఎన్సీఎస్ సుగర్స్ ఫీల్డ్‌మన్ చేతివాటానికి చెరుకు రైతులు బలయ్యూరు. గతంలో కర్మాగార యూజమాన్యం చేతిలో ముప్పతిప్పలకు గురైన రైతులు నేడు ఫీల్డ్‌మన్ చేతిలో దారుణంగా దెబ్బతిన్నారు. తీసుకున్న పంటకు సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించక యూజమాన్యం మోసం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో పోరాటాల నడుమ బిల్లులు ఇవ్వడానికి యూజమాన్యం ముందుకు రాగా, తాజాగా ఆ కంపెనీలో పనిచేస్తున్న ఫీల్డ్‌మన్ శేఖర్ రైతులకు రావాల్సిన సొమ్మును సొంతానికి వాడుకుని మోసం చేశాడు. సొమ్ము తిరిగి ఇవ్వడానికి లేనిపోని ఇబ్బందులు పెడుతుండడంతో చివరకు బాధిత రైతులు గేదెల రాంబాబు, గేదెల సత్యనారాయణ, గేదెల రామినాయుడు, రాగాల గోవిందరావు, తదితరులు సీపీఎం నాయకుడు రెడ్డి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో బుధవారం స్థానికా ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ టి. రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్సీఎస్ సుగర్స్ కర్మాగార ప్రతినిధులు 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి బిల్లులు చెల్లించలేదు. ఈ విషయమై కర్మాగారం సీఈఓను అడగ్గా, ఫీల్డ్‌మన్ వై. శేఖర్ ద్వారా బిల్లులు చెల్లించామని చెప్పినట్లు తెలిపారు. దీంతో శేఖర్‌ను నిలదీస్తే ఆ సొమ్ము సొంతానికి వాడుకున్నానని చెప్పి తన సొంత ఖాతాకు చెందిన చెక్కులిచ్చాడన్నారు. తీరా ఆ చెక్కులు పట్టుకుని బ్యాంకుకు వెళితే అందులో డబ్బులేవని వాపోయూరు. గంగన్నపాడుతో పాటు కూనయ్యవలస, నందిగాం, తదితర గ్రామాలకు చెందిన పలువురి రైతుల బిల్లులు స్వాహా చేశాడని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయూలని కోరారు. -
అనుకున్నట్టే అయ్యింది...
సీతానగరం, బొబ్బిలి: అంతా ఊహించినట్టే ఎన్సీఎస్ యాజమాన్యంపై చెరుకు రైతులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఫ్యాక్టరీ ఎం.డి., డెరెక్టర్, ప్రజాప్రతినిధులను చుట్టుముట్టి తమ బకాయిల మాటేంటని నిలదీశారు. గత ఏడాది ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరుకుకు సంబంధించిన బకాయిలు చెల్లించేవరకూ క్రషింగ్ మాటను ఎత్తవద్దని రైతులు కరాఖండీగా చెప్పడంతో యాజమాన్యం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ఏడాది తరువాత మళ్లీ మమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా, మా జీవితాలతో ఆటలాడింది చాలదా అం టూ రైతులు దుమ్మెత్తి పోశారు. దీంతో ఆ ప్రాంగణంలో కొద్ది సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. క్రషింగ్ మొదలు పెట్టే ముందు ఆనవాయితీ ప్రకారం రైతులతో ప్రజాప్రతినిధులతో ఏర్పాటు చేసే సమావేశాన్ని శనివారం సాయంత్రం లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం ఆవరణలో నిర్వహించారు. ఎప్పటిలాగే ఎం.డి. చాంబర్లో నిర్వహించడానికి ఎం.డి. నాగేశ్వరరావు, డెరైక్టరు శ్రీనివాస్‌లు ఏర్పాట్లు చేశారు. కేవలం 50 మంది రైతులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే సమావేశానికి రమ్మని సమాచారం అందించారు. అయితే సమావేశం పెడుతున్నారన్న సమాచారం తెలుసుకొని రైతులు వందల సంఖ్యలో ఫ్యాక్టరీ వద్దకు చేరుకున్నారు. నాలుగు గోడల మధ్య సమావేశం సరికాదని, ఆరుబయట పెట్టాలంటూ డిమాండ్ చేయడం కార్యాలయం ఫోర్ట్కో వద్దకు మార్చారు. రైతులు, ప్రజాప్రతినిధులు, యాజమాన్యం వచ్చి కూర్చున్నా పార్వతీపురం ఎమ్మెల్యే చిరంజీవులు రాలేదు. ఆయన కోసం కొంత సేపు వేచి చూశారు. ఎమ్మెల్యే చిరంజీవులు వచ్చాక ఎం.డి. నాగేశ్వరరావు ప్రసంగం మొదలు పెట్టారు. జాతీయ వ్యాప్తంగా సుగర్ ఫ్యాక్టరీల పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పడంతో రైతులు ఒకే సారి అడ్డుతగిలారు. ఇక్కడ రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే, బకాయిలు చెల్లించమని అడుగుతుంటే ఎక్కడ సంగతులో ఎందుకు చెబుతున్నారంటూ ఒకే సారి రైతులంతా అందోళనకు దిగారు. బకాయిలు చెల్లింపులు, ఈ ఏడాది మద్దతు ధర గురించి చెప్పకుండా మాట్లాడుతుండడంతో వేదిక వద్దకు వెళ్లి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. ఏపీ చెరుకు రైతు సంఘ నాయకులు రెడ్డి శ్రీరాంమూర్తి, లక్ష్ముంనాయుడు, గేదెల సత్యనారాయణ, సీడీసీ డెరైక్టరు బేతనపల్లి శ్రీరాంమూర్తి, ఆదర్శ రైతు ముప్పాల మురళీకృష్ణ తదితరులు ఎం.డీ, డెరైక్టరు, ఎమ్మెల్యేలతో వాగ్వాదానికి దిగారు. బకాయిలు చెల్లింపులు ఎప్పుడు చేస్తారో చెప్పాలంటూ పట్టుబట్టారు. ఇంకా పది కోట్ల రూపాయల బకాయి ఉందని, ఈ నెలాఖరునాటికి కొంత, డిసెంబరు పదో తేదీనాటికి పూర్తిగా చెల్లింపులు చేస్తామని ఎం.డీ ప్రకటించారు. దీంతో మరింత ఆవేదనకు గురైన రైతులు తీవ్ర పదజాలంతో యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. మీ ఫ్యాక్టరీకి చెరుకును తోలుతున్నామంటే మా పిల్లలకు సంబంధాలు కూడా రావడం లేదని కొందరు రైతులు, మీరు సకాలంలో చెల్లింపులు చేయకపోవడం వల్ల మా ఇళ్లలో శుభ కార్యాలు జరగడం లేదని మరికొందరు యాజమాన్యం, ప్రజాప్రతినిధులు వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమయంలో రైతులు, యాజమాన్యం ప్రతినిధుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. బొబ్బిలి డీఎస్పీ ఇషాక్ మహ్మద్ ఆధ్వర్యంలో సీఐలు చంద్రశేఖర్, కాంతారావులు, ఎస్ఐలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకొని అందోళన చేస్తున్న వారిని అదుపు చేశారు. దీంతో ఈ సమావేశానికి పోలీసులను ఎందుకు పిలిచారని, మీకు రక్షణగా ఉండడానికా, మమ్మల్ని బయటకు పంపడానికా అంటూ మరో సారి విరుచుకుపడ్డారు. ఈలోగా ఎమ్మెల్యే చిరంజీవులు కలగజేసుకొని యాజమాన్యం వ్యవహార శైలి ఏమీ బాగోలేదంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. బకాయిలు చెల్లించాకే క్రషింగ్ చేయాలని సూచిస్తూ అక్కడ నుంచి వె ళ్లిపోయారు. ఆ తరువాత ఎం.డీ, డెరైక్టరు, సీఈఓలు కూడా అక్కడ నుంచి ఛాంబర్‌లోనికి వెళ్లిపోయారు. దీంతో రైతులు తక్షణమే బకాయిలు చెల్లించాలంటూ కార్యాలయం ముందు నినాదాలు చేసి కొంత సేపు బైఠాయించారు. ఈ సమావేశానికి మాజీ ప్రభుత్వ విప్ శంబంగి వెంకటచినప్పలనాయుడు, మాజీ మంత్రి డాక్టరు పెద్దింటి జగన్మోహనరావు, మాజీ జెడ్పీ చైర్మన్ వాకాడ నాగేశ్వరరావు, సీడీసీ చైర్మన్ నడిమింటి రామకృష్ణ, సీడీసీ అసిస్టెంటుకేన్ కమిషనర్ ముత్యాలు తదితరులు హాజరయ్యారు. -
క్రషింగ్‌కు సిద్ధమవుతున్న ఎన్సీఎస్
బొబ్బిలి : చెరకు రైతుల అనుమానాలకు అధికారులు తెరదించారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం పరిధిలో ఉన్న వేలాది ఎకరాల చెరకును అదే ఫ్యాక్టరీలో క్రషింగ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రైతుల కష్ట, నష్టాలు, ఇబ్బందులను గుర్తించిన అధికారులు స్వీయ పర్యవేక్షణలో ఈ ఏడాది క్రషింగ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు చెరకు అభివృద్ధి మండలి అధికారులు, ఉద్యోగులు దగ్గరుండి మిల్లు అయిలింగ్ పనులను చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ యాజ మాన్యం మూడేళ్లగా బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం, ఈ ఏడాది జనవరి నుంచి బిల్లులు చెల్లింపు పూర్తిగా నిలిపి చేయడంతో ఏపీ చెరకు రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేసిన సంగతి విధితమే. రైతులతో పాటు, బ్యాంకులు, కార్మికులు, కూలీలకు దాదాపు రూ.50 కోట్ల వరకూ యాజమాన్యం చెల్లించవలసి ఉంది. ఆర్ఆర్ యాక్టు ప్రకారం ఎన్సీఎస్ ఆస్తులను వేలంవేయడానికి కూడా రెవెన్యూ శాఖ సిద్ధమైంది. ఫ్యాక్టరీ ఎండీ., డైరక్టర్లును పోలీసులు అరె స్టు చేశారు. దాదాపు 20రోజుల తరువాత వారు బెయిల్‌పై బయటకు వచ్చారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఈఫ్యాక్టరీలో క్రషింగ్ జరిగే పరిస్థితి కనిపించకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. వేలాది ఎకరాల్లో చెరుకు పండించామని ఇప్పుడు తమగతేంకానని వా పోరారు. దీంతో అధికారులు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు వైపు దృష్టి సారించారు. జిల్లాలో బీమసింగి వద్ద సహకార రంగంలో నడుస్తున్న చక్కెర కర్మాగారంలో లచ్చయ్యపేట పరిధిలోని రైతులు సంబంధించిన చెరకును రోజుకు రెండు వందల టన్నులు ఆడేవిధంగా ఏర్పాట్లు చేశారు. అయితే దీనివల్ల రవాణా ఖర్చు పెరగడంతో పాటు చిన్న, సన్నకారు రైతులు ఇబ్బందులు మరీ అధికమవుతాయని భావించిన అధికారులు లచ్చయ్యపేట ఫ్యాక్టరీ ద్వారా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయించాలని నిర్ణయించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా ఈ ఏడాది చెరుకును క్రషింగ్ చేయడానికి సుముఖత వ్యక్తంచేస్తూ ఈ నెల 3న అధికారులకు లేఖ పంపింది. దీంతో చెరకు అభివృద్ధి మండలి అధికారులు దగ్గరుండి ఆయిలింగ్ పనులు చేయిస్తున్నారు. ఫ్యాక్టరీలో కొన్ని ప్రధానమైన భాగాలు పాడైతే వాటిని ఇతర ప్రాంతాల నుంచి తెప్పిస్తున్నారు. ఈ ఆయిలింగ్ పనులకు దాదాపు కోటీ 25 లక్షల రూపాయల వరకూ ఖర్చు కానుంది. ఎండీ, డైరక్టర్లు బెయిల్‌పై బయటకు వచ్చేశారు కాబట్టి ఫ్యాక్టరీని క్రషింగు చేయడానికి, ఇతర విషయాలపై ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే ఈఏడాది క్రషింగ్‌కు చెరుకు తీసుకువచ్చిన వారికి బిల్లులు వెంట వెంటనే చెల్లించే విధంగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఫ్యాక్టరీ పరిధిలో 17 మండలాలకు చెందిన దాదాపు 16 వేల మంది రైతులు 6వేల 900 హెక్టార్లలో చెరకు పంటను వేశారు. దాని ద్వారా సుమారు 3 లక్షల 61 వేల టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నారు. లచ్చయ్యపేట చక్కెర కర్మాగారం రోజుకు 4 వేల నుంచి 4200 టన్నుల వరకూ క్రషింగును చేస్తుంది. -
ఇద్దరు ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల అరెస్ట్
-
ఇద్దరు ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్ల అరెస్ట్
విజయనగరం: జిల్లాలోని చెరుకు రైతుల తిరుగుబాటు ఫలించింది. సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీకి చెందిన ఇద్దరు డైరెక్టర్లు శ్రీనివాస్, మురళీలను పోలీసులు అరెస్ట్ చేశారు. బకాయిలు చెల్లించాలని చెరుకు రైతులు వారం రోజులుగా రోడ్డు ఎక్కారు. నిన్న మండలంలోని రోడ్లను దిగ్బంధనం చేశారు. ఎన్‌సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం 11వేల మంది చెరుకు రైతులకు 24 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించవలసి ఉంది. ఇదుగో ఇస్తాం, అదుగో ఇస్తాం అని చెబుతూ యాజమాన్యం 18 సార్లు వాయిదా వేసింది. దాంతో రైతులు ఆందోళనను ఉధృతం చేశారు. వారం రోజుల నుంచి ఫ్యాక్టరీ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత వారంలో రైతులు షుగర్ ఫ్యాక్టరీ లోపలకు చొచ్చుకుపోయారు. లోపల యంత్రాలను, అద్దాలను ధ్వంసం చేశారు. ఫ్యాక్టరీ ఆవరణలోని చెట్లను కూడా పెకలించివేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా తమను బాధలకు గురిచేస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమసొమ్ముతో వ్యాపారం చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. అప్పులు చేసి చెరకు పండించి ఫ్యాక్టరీకి సరఫరా చేశామని చెప్పారు. ఏడాదిన్నర నుంచి తమకు రావాల్సిన సొమ్మును ఇవ్వకుండా యాజమాన్యం వేధిస్తోందని వారు వాపోయారు. అధికారులు, పాలకులు కూడా తమను పట్టించుకోవడంలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో చెరుకు రైతుల ఆందోళనపై పోలీసులు స్పందించారు. ఫ్యాక్టరీ ఇద్దరు డైరెక్టర్లను అరెస్ట్ చేశారు. ఎన్సీఎస్ సుగర్స్ యాజమాన్యానికి సంబంధించిన ఆస్తులను వేలం వేసి రైతులకు బిల్లులు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు నాలుగు రోజుల క్రితం సబ్ కలెక్టర్ శ్వేతా మహంతి చెప్పారు. లచ్చయ్యపేటలోని భూముల రికార్డులను అనుసరించి గురువారం సర్వే నిర్వహించారు. షుగర్స్‌కు చెందిన 75.11 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని చెరుకు రైతుల బకాయిలు చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. **