పార్వతీపురం: ఎన్‌సీఎస్ సుగర్స్ ఫీల్డ్‌మన్ చేతివాటానికి చెరుకు రైతులు బలయ్యూరు. గతంలో కర్మాగార యూజమాన్యం చేతిలో ముప్పతిప్పలకు గురైన రైతులు నేడు ఫీల్డ్‌మన్ చేతిలో దారుణంగా దెబ్బతిన్నారు. తీసుకున్న పంటకు సంవత్సరాల తరబడి బిల్లులు చెల్లించక యూజమాన్యం మోసం చేసిన సంగతి తెలిసిందే. ఎన్నో పోరాటాల నడుమ బిల్లులు ఇవ్వడానికి యూజమాన్యం ముందుకు రాగా, తాజాగా ఆ కంపెనీలో పనిచేస్తున్న ఫీల్డ్‌మన్ శేఖర్ రైతులకు రావాల్సిన సొమ్మును సొంతానికి వాడుకుని మోసం చేశాడు.
సొమ్ము తిరిగి ఇవ్వడానికి లేనిపోని ఇబ్బందులు పెడుతుండడంతో చివరకు బాధిత రైతులు గేదెల రాంబాబు, గేదెల సత్యనారాయణ, గేదెల రామినాయుడు, రాగాల గోవిందరావు, తదితరులు సీపీఎం నాయకుడు రెడ్డి శ్రీరామ్మూర్తి ఆధ్వర్యంలో బుధవారం స్థానికా ఆర్డీఓ కార్యాలయంలో ఏఓ టి. రామకృష్ణారావుకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్‌సీఎస్ సుగర్స్ కర్మాగార ప్రతినిధులు 2013-14, 2014-15 సంవత్సరాలకు సంబంధించి బిల్లులు చెల్లించలేదు. ఈ విషయమై కర్మాగారం సీఈఓను అడగ్గా, ఫీల్డ్‌మన్ వై. శేఖర్ ద్వారా బిల్లులు చెల్లించామని చెప్పినట్లు తెలిపారు.
దీంతో శేఖర్‌ను నిలదీస్తే ఆ సొమ్ము సొంతానికి వాడుకున్నానని చెప్పి తన సొంత ఖాతాకు చెందిన చెక్కులిచ్చాడన్నారు. తీరా ఆ చెక్కులు పట్టుకుని బ్యాంకుకు వెళితే అందులో డబ్బులేవని వాపోయూరు. గంగన్నపాడుతో పాటు కూనయ్యవలస, నందిగాం, తదితర గ్రామాలకు చెందిన పలువురి రైతుల బిల్లులు స్వాహా చేశాడని ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రైతులకు న్యాయం చేయూలని కోరారు.
ఫీల్డ్‌మన్ చేతివాటం ..
Published Thu, Jun 16 2016 9:57 AM | Last Updated on Mon, Sep 4 2017 2:33 AM
Advertisement
Advertisement