చుట్టూ మనోళ్లే ఉండాలి.. సరికొత్త కోటరీ నిర్మాణం
అమెరికా నుంచి దిగుమతి అయిన వాడిగా చెప్పుకుంటున్న పార్వతీపురం టీడీపీ ఎమ్మెల్యే స్థానిక నేతలను దగ్గరకు రానివ్వడంలేదు. తన కోసం కొద్దిమంది లీడర్లను బయటినుంచి తెచ్చుకుని వారితోనే దందాలు చేస్తున్నారు.. సెటిల్మెంట్స్.. లిక్కర్ ఇవన్నీ వాళ్లతోనే చేయిస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలకు ఏమాత్రం ప్రాధాన్యం లేకుండా పోయింది. పార్వతీపురం (ఎస్సీ) నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే విజయ చంద్ర ఎన్నారై అనే బ్రాండ్ వేసుకొని లోకేష్ తాలూకా అని చెప్పుకుంటూ జస్ట్ ఎన్నికలకు ముందు పార్టీలో చేరారు. వస్తూనే హడావుడి చేసి అందర్నీ కలుపుకొని వెళ్తున్నట్టు నటించి గెలిచేశారు.
తెలిసిన మరుక్షణం నుంచి తన గురువు చంద్రబాబు పంథాలోనే వెళుతున్నారు. అంటే గెలిచిన తర్వాత అదంతా తన గొప్పతనమేనని స్థానికంగా ఎవరు తనకు సపోర్ట్ చేయలేదని, తన సామర్థ్యం.. తన తెలివితేటలే తనని గెలిపించాలని చెప్పుకుంటూ వస్తున్నారు. వాస్తవానికి ఆయనకు మొన్నటి ఎన్నికల వరకు నియోజకవర్గంలో ఎన్ని గ్రామాలు ఎన్ని పంచాయతీలు ఉన్నాయి అన్నది కూడా స్పష్టంగా తెలియదు. ఎక్కడో వ్యాపారం చేసుకుంటూ భారీగా డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని అకస్మాత్తుగా ఎమ్మెల్యే అభ్యర్థి అయిపోయారు గెలిచేసారు. మాజీ ఎమ్మెల్యే చిరంజీవి.. మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్.. ఇంకా గొట్టపు వెంకట్ నాయుడు.. తదితరులంతా ఆయన కోసం పనిచేసి.. ఆయన్ని గెలిపించారు. అయితే తాను మాత్రం కార్యకర్తల ను ఏ మాత్రం లెక్క చేయకపోగా స్థానిక నాయకత్వాన్ని కూడా పూర్తిగా ఇగ్నోర్ చేశారు.
సరికొత్త టీం దిగుమతి
ఇదిలా ఉండగా కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే అని ఎవరైనా స్థానికంగా అప్పటికే ఉంటున్న టీడీపీ క్యాడర్‌తో కలిసి మెలిసి పనిచేసుకుంటూ పోతారు. వారు చెప్పినట్లు చేయాలని లేకుండా వారిని కూడా కలుపుకొని పోవడం అనేది రాజకీయంగా ఒక ఆరోగ్యకరమైన వాతావరణం. కానీ విజయ్ చంద్ర మాత్రం ఎక్కడెక్కడో వేరే జిల్లాల నుంచి కొంత మందిని తీసుకొచ్చి తన చుట్టూ ఉంచుకొని వాళ్ల ద్వారా నియోజకవర్గంలో దందా చేస్తున్నారు. రెండు మూడు సార్లు ఎంపీపీలు జడ్పిటిసిలుగా చేసిన వాళ్ల సైతం విజయ్ చందన కలవాలంటే ముందు ఆ కోటరీని కలవాల్సి ఉంటుంది. వాళ్లను సంతృప్తి పరిస్తే తప్ప ఎమ్మెల్యే దర్శనం దక్కదు.. ప్రతి చిన్న విషయంలోనూ ఎమ్మెల్యే ఆయన బ్యాచ్ ఇన్వాల్వ్ అయిపోతూ బెదిరింపులు బ్లాక్ మెయిల్ వసూళ్లకు దిగుతున్నట్లు స్థానిక వ్యాపారులు చెబుతున్నారు. ఎక్కడి నుంచో వచ్చాడని గెలిపిస్తే ఇలా పీక మీద కత్తి పెడితే ఎలా అని వారు భీతిల్లిపోతున్నారు.
లిక్కర్ దందా మనదే
మొన్నామధ్య లాటరీల లిక్కర్ షాపులు దక్కించుకున్న వాళ్లని సైతం ఎమ్మెల్యే పేరట అనుచరులు బెదిరించి 20 శాతం వాటా ఇస్తారా 10% కమిషన్ ఇస్తారా తేల్చుకోవాలని అల్టిమేటం జారీ చేశారు. ఇప్పటికీ మార్జిన్లు లేక నష్టాల బాటలో షాపులు నడుపుతుంటే రాబందుల్లా ఎమ్మెల్యే బ్యాచ్ దిగిపోయిందని పెట్టుబడి పెట్టకపోయినా వ్యాపారం వాటా ఇవ్వాల్సిందిగా బెదిరిస్తున్నారని లిక్కర్ లైసెన్సీలు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: ఓరి మీ యేశాలో!.. కాకినాడ పోర్టు కబ్జాకు బాబు, పవన్ ఎత్తులు
ఇది కాకుండా రియల్ ఎస్టేట్.. ఇసుక.. కన్స్ట్రక్షన్ వంటి అన్ని వ్యాపారాల్లోనూ విజయ చందర్ జోరుగా జోకింగ్ చేసుకుంటూ కమిషన్లు నొక్కుతున్నారు. గట్టిగా మాట్లాడితే దాని దళిత ఎమ్మెల్యే అని అంటూ సరికొత్త బ్లాక్ మెయిల్‌కి దిగుతున్నారు. మాటకు మన ఉద్యోగులు బదిలీల విషయంలో కూడా సిఫార్సు లెటర్స్ కు రేటు పెట్టి మరి వసూలు చేసుకున్నారని.. గ్రామస్థాయి ఉద్యోగాల బదిలీల్లోనూ ఆయన డబ్బులు తీసుకుని లెటర్ ఇచ్చారని ఉద్యోగులు గొల్లుమంటున్నారు. రాజకీయాలకు కొత్తగా అయినా దందాలు చేయడంలో ఆరు నెలల్లోనే ఆరితేరిపోయారని మున్ముందు ఆయన ఇంకెంత రెచ్చిపోతారో తెలీదని స్థానిక వ్యాపారుల సైతం భయపడుతున్నారు.
-సిమ్మాదిరప్పన్న
Comments
Please login to add a commentAdd a comment