న్యూఢిల్లీ: ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఉద్యోగావకాశాల వివరాలు ఇక నుంచి నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్‌సీఎస్) పోర్టల్‌లో దర్శనమీయనున్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖతో అమెజాన్ రెండేళ్ల కాలానికి ఒప్పందం చేసుకుంది. ఎన్‌సీఎస్ పోర్టల్‌లో నమోదైన అభ్యర్థులు అమెజాన్ చేపడుతున్న నియామకాల వివరాలు తెలుసుకోవడంతోపాటు దరఖాస్తు చేసుకోవచ్చు.
మోడల్ కెరీర్ సెంటర్స్ వద్ద జాబ్ ఫెయిర్స్ సైతం కంపెనీ నిర్వహించనుంది. ఇందుకు మంత్రిత్వ శాఖ సాయం చేయనుంది. ఇలా ఒప్పందం చేసుకున్న తొలి ఈ–కామర్స్ కంపెనీ తామేనని అమెజాన్ తెలిపింది. ఎస్‌సీఎస్ పోర్టల్‌లో ప్రస్తుతం 60 లక్షల పైచిలుకు ఉద్యోగార్థులు, 33.5 లక్షల కంపెనీలు సభ్యులుగా ఉన్నాయి. ప్రతిభను పెంపొందించడంలో అమెజాన్ నిబద్ధత దేశంలోని యువతకు కొత్త ఉపాధి అవకాశాలను అందిస్తుందని విశ్వసిస్తున్నామని కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ మండావియా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment