ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, హాస్పిటాలిటీలదే జోరు | Jobs and professional networking platform Apna co revealed in the study | Sakshi
Sakshi News home page

ఈ–కామర్స్, బీఎఫ్‌ఎస్‌ఐ, హాస్పిటాలిటీలదే జోరు

Published Mon, Jun 3 2024 3:48 AM | Last Updated on Mon, Jun 3 2024 3:48 AM

Jobs and professional networking platform Apna co revealed in the study

జాబ్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అప్నా.కో అధ్యయనంలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో విభిన్నరంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగైనట్టుగా వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోల్చితే మొదటి 4 నెలల్లో 31 శాతం జాబ్‌ పోస్టింగ్స్‌ పెరిగినట్టు వెల్లడైంది. ఉద్యోగ అవకాశాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా ఆర్థికరంగం తిరిగి పుంజుకోవడంతోపాటు, జాబ్‌ సెక్టార్‌ల పురోగతితో జాబ్‌ మార్కెట్‌ పుంజుకుంటున్నదని జాబ్స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ నెట్‌వర్కింగ్‌ ప్లాట్‌ఫామ్‌ అప్నా.కో తాజా అధ్యయనం వెల్లడించింది. 

ఈ–కామర్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్విసెస్, ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ), హాస్పిటాలిటీలదే జోరు అని అప్నా.కో నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఈ–కామర్స్‌ 21 శాతం, బీఎఫ్‌ఎస్‌ఐ 17 శాతం, హాస్పిటాలిటీ రంగాల్లో 13 శాతం మేర ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు తెలిపింది.  

సేల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, బ్రాండ్, మార్కెటింగ్, కస్టమర్‌ సపోర్ట్‌ డొమైన్‌లలో వృత్తి నిపుణులకు డిమాండ్‌ గణనీయంగా పెరిగినట్టుగా పేర్కొంది. దక్షి ణాది రాష్ట్రాల్లో ఈ రంగాల్లో 23 శాతం వృద్ధి నమోదైనట్టుగా, ఆయా రంగాల్లో జాబ్‌ పోస్టింగ్‌ల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ముందువరుసలో నిలుస్తున్నట్టుగా తెలిపింది.  

లక్‌నవూ, కోయంబత్తూరు, గ్వాలియర్‌ వంటి రెండో, మూడో శ్రేణి నగరాల్లో నూ డిజిటలైషన్‌ అమలు చేస్తుండడంతో ఆయా నగరాల్లోనూ జాబ్‌పోస్టింగ్స్‌ పెరుగుతున్నాయని చెప్పింది.  

 తమ కంపెనీకి సంబంధించినంత వరకు చూసినా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కొత్తగా ఉద్యోగార్థుల (ఫ్రెష్‌ అప్లికెంట్స్‌) నుంచి ‘జాబ్‌అప్లికేషన్లు’21 శాతం పెరిగినట్టు, వారిలో మహిళలే 18 శాతం ఉన్నట్టుగా ఈ సంస్థ తెలిపింది. గతేడాదితో పోల్చితే 2024లో జనవరి–ఏప్రిల్‌ల మధ్య జాబ్‌ అప్లికేషన్స్‌ 15 శాతం పెరుగుదల నమోదైనట్టు (1.7 కోట్లు పెరుగుదల) అప్నా.కో ఈ నివేదికలో పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement