Professional
-
ఈ–కామర్స్, బీఎఫ్ఎస్ఐ, హాస్పిటాలిటీలదే జోరు
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది తొలి నాలుగు నెలల్లో విభిన్నరంగాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగైనట్టుగా వివిధ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గతేడాదితో పోల్చితే మొదటి 4 నెలల్లో 31 శాతం జాబ్ పోస్టింగ్స్ పెరిగినట్టు వెల్లడైంది. ఉద్యోగ అవకాశాల వృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల్లో మంచి అవకాశాలు లభిస్తున్నట్టు తేలింది. దేశవ్యాప్తంగా ఆర్థికరంగం తిరిగి పుంజుకోవడంతోపాటు, జాబ్ సెక్టార్ల పురోగతితో జాబ్ మార్కెట్ పుంజుకుంటున్నదని జాబ్స్ అండ్ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అప్నా.కో తాజా అధ్యయనం వెల్లడించింది. ⇒ ఈ–కామర్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్విసెస్, ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), హాస్పిటాలిటీలదే జోరు అని అప్నా.కో నివేదిక వెల్లడించింది. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ఈ–కామర్స్ 21 శాతం, బీఎఫ్ఎస్ఐ 17 శాతం, హాస్పిటాలిటీ రంగాల్లో 13 శాతం మేర ఉద్యోగ అవకాశాలు పెరిగినట్టు తెలిపింది. ⇒ సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, బ్రాండ్, మార్కెటింగ్, కస్టమర్ సపోర్ట్ డొమైన్లలో వృత్తి నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరిగినట్టుగా పేర్కొంది. దక్షి ణాది రాష్ట్రాల్లో ఈ రంగాల్లో 23 శాతం వృద్ధి నమోదైనట్టుగా, ఆయా రంగాల్లో జాబ్ పోస్టింగ్‌ల విషయంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ముందువరుసలో నిలుస్తున్నట్టుగా తెలిపింది. ⇒ లక్నవూ, కోయంబత్తూరు, గ్వాలియర్ వంటి రెండో, మూడో శ్రేణి నగరాల్లో నూ డిజిటలైషన్ అమలు చేస్తుండడంతో ఆయా నగరాల్లోనూ జాబ్పోస్టింగ్స్ పెరుగుతున్నాయని చెప్పింది. ⇒ తమ కంపెనీకి సంబంధించినంత వరకు చూసినా గతేడాదితో పోల్చితే ఈ ఏడాది కొత్తగా ఉద్యోగార్థుల (ఫ్రెష్ అప్లికెంట్స్) నుంచి ‘జాబ్అప్లికేషన్లు’21 శాతం పెరిగినట్టు, వారిలో మహిళలే 18 శాతం ఉన్నట్టుగా ఈ సంస్థ తెలిపింది. గతేడాదితో పోల్చితే 2024లో జనవరి–ఏప్రిల్ల మధ్య జాబ్ అప్లికేషన్స్ 15 శాతం పెరుగుదల నమోదైనట్టు (1.7 కోట్లు పెరుగుదల) అప్నా.కో ఈ నివేదికలో పేర్కొంది. -
అచ్చం బిచ్చగాడిలా నమ్మించి..
అతనో నటుడు.. చిన్నచిన్న వేషాలు వేస్తుంటే వచ్చే డబ్బుతో ఇల్లు గడవట్లేదు. ఎలాగా అని ఆలో చించి ఓ కొత్త వేషం వేశాడు. అది సినిమాల్లోనో, సీరి యళ్లలోనో కాదు.. బయట జనం మధ్యలో నటించడం మొదలుపెట్టాడు. ఈ వేషం సూపర్ సక్సెస్ అయింది. నెలకు ఎనిమిది లక్షల రూపాయలకుపైనే సంపాదించి పెట్టేస్తోంది. అది కూడా ఆదాయ పన్ను వంటివేమీ కట్టాల్సిన అవసరం లేని సంపాదన. మరి ఆ వేషమేంటో తెలుసా..? ‘బిచ్చగాడు’. చైనాలో ని హెనాన్ ప్రావిన్స్‌కు చెందిన లు జింగాంగ్ కథ ఇది. అతను సుమారు పన్నెండేళ్ల కింద ఓ రోజు ‘నటన’ మొదలుపెట్టాడు. అక్కడ ఎప్పుడూ కిటకిటలాడుతూ ఉండే పర్యాటక ప్రదేశం ‘కిన్మింగ్ షాంగే గార్డెన్’ను ఎంచుకున్నాడు. ముఖానికి కాస్త మసి, చిరుగులు– అతుకులతో ఉన్న బట్టలు వేసుకుని.. ఓ చేతి లో కర్ర, మరో చేతిలో చిప్ప పట్టుకుని.. చూడగానే జాలి కలి గేలా అమాయ కపు మొహం వేసుకుని అడుక్కోవడం మొదలుపెట్టాడు. మనోడి నటనా కౌశలానికి పర్యాట కులు పడిపోయి దండిగానే డబ్బులు వేయడం మొదలుపెట్టారు. అలా నెలకు రూ.8లక్షలకుపైనే సంపాదిస్తున్నాడట. జింగాంగ్ అడుక్కోవడం మొదలుపెట్టిన కొత్తలో అతడి కుటుంబ సభ్యులు ఛీకొట్టి వదిలేసి పోయారట. కానీ బాగా డబ్బులు వెనకేశాక.. మళ్లీ అంతా తిరిగొచ్చేశారట. అంతా ‘నటన’!? -
ఉపాధి కోసం క్యూ కడుతున్న మహిళలు
ముంబై: ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి మరింత మంది మహిళలు ఉపాధి కోసం ముందుకు వస్తున్నారు. 2023లో 13 శాతం అధికంగా సుమారు కోటి మంది మహిళలు ఉపాధి కోసం దరఖాస్తు చేసుకున్నట్టు జాబ్స్, ప్రొఫెషనల్ నెట్వర్క్ ప్లాట్‌ఫామ్ ఆప్నా డాట్ కో నివేదిక వెల్లడించింది. 2022లో ఇవే పట్టణాల నుంచి మొత్తం 2.7 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు రాగా, అందులో మహిళలకు సంబంధించినవి 87 లక్షలుగా ఉన్నాయి. మహిళలు ఆర్థిక స్వేచ్ఛను కోరుకుంటున్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. 2023లో ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల నుంచి వచి్చన ఉద్యోగ దరఖాస్తులు 3.2 కోట్లుగా ఉన్నాయి. ప్రతి నిమిషానికి మహిళల నుంచి 100 ఉద్యోగ దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో 80 శాతానికి పైగా కార్యాలయ విధులకు సంబంధించినవే ఉన్నాయి. ఇంటి నుంచి పనిచేయడానికి బదులు, కార్యాలయం నుంచి పని చేయడం, కెరీర్ వృద్ధి కోసం మహిళలు చూస్తున్నట్టు ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఆప్నా నివేదిక తెలిపింది. 2022, 2023 సంవత్సరాల్లో తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైన జాబ్ పోస్టింగ్‌లు, దరఖాస్తుల ఆధారంగా ఆప్నా ఈ వివరాలను విడుదల చేసింది. సేల్స్ సపోర్ట్, ఎంటర్ప్రైజ్ సేల్స్, అడ్వరై్టజింగ్, రియల్ ఎస్టేట్, ఇన్‌సైడ్‌సేల్స్, బ్రాండ్ మార్కెటింగ్, ఈ కామర్స్ తదితర విభాగాల్లో నిర్వహణ విధులకు సంబంధించి పోస్టింగ్‌లు పది రెట్లు పెరిగాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లో 60 శాతం జాబ్ పోస్టింగ్‌లు ఫ్రెషర్లకు సంబంధించినవే ఉన్నట్టు ఆప్నా నివేదిక తెలిపింది. -
టెక్స్టైల్స్ టెక్నాలజీతో మంచి ఉద్యోగాలు
సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగం జౌళి పరిశ్రమ. జౌళి రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ వేగంగా పురోగమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔళి పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నప్పటికీ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా జౌళి మిల్లులు ఉన్నాయి. వీటికి ఏటా వందలాది మంది నిపుణులు అవసరం. అయినా ఏడాదికి 50 మంది కూడా దొరక ట్లేదు. భవిష్యత్తులో జౌళి రంగంలో విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఎగుమతుల విభాగాల్లో అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని గవర్న మెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ సంస్థ జౌళి రంగ నిపుణులను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది. మూడున్నరేళ్ల పాలిటెక్నిక్ కోర్సు టెక్స్టైల్స్ డిప్లొమా కోర్సులు చదివిన వారికి మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ డిప్లొమా కోర్సు మూడేళ్లు ఉంటే.. టెక్స్టైల్స్ టెక్నాలజీ కోర్సు మాత్రం మూడున్నరేళ్లు ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన వారికి స్పిన్నింగ్, వీవింగ్, కెమికల్ ప్రాసెసింగ్, టెస్టింగ్, ఆధునిక టెక్నికల్ టెక్స్టైల్, అపారల్ మాన్యుఫాక్చరింగ్ వంటి విభాగాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కోర్సు పూర్తి చేసిన వెంటనే స్థానికంగా ప్రారంభ వేతనం కనీసం రూ.20 వేలు ఉంటుంది. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం సైతం ఇండస్ట్రీ కనెక్ట్ విధానాన్ని అమలు చేస్తూ సిలబస్‌ను ఆధునీకరించింది.ఇందులో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక పారిశ్రామిక శిక్షణనిస్తూ నెలకు రూ.7 వేల వరకు స్టైపెండ్ ఇస్తోంది. ‘పూర్వ విద్యార్థుల ద్వారా ప్రేరణ సదస్సులు, క్యాంపస్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చివరి సెమిస్టర్ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కి సగటున మూడు సంస్థల్లో రూ.20 వేలకు పైగా జీతభత్యాలతో ఉద్యోగాలు వస్తున్నాయి. 8 నుంచి 10 ఏళ్ల అనుభవంతో కెరీర్లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు’ అని గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ శాఖాధిపతి కె.మహమ్మద్ తెలిపారు. గుంటూరులోని టెక్స్టైల్స్ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాల్లోని ప్రముఖ పరిశ్రమల్లో సుమారు రూ.3 లక్షల జీతంతో జనరల్ మేనేజర్, టెక్నికల్ మేనేజర్, మిల్ మేనేజర్, గ్రూప్ మేనేజర్ హోదాల్లో రాణిస్తుండటం విశేషం. ఇది మంచి అవకాశం గుంటూరులో 1986లో స్థాపించిన ఈ కాలేజీ 1997కి స్వయం ప్రతిపత్తి సాధించింది. 2023 పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్, ఎంటెక్, పీహెచ్డీ చేసి ప్రముఖ విద్యా సంస్థల్లోనూ అధ్యాపకులుగా, పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా రాణించవచ్చు. ఇందులో అత్యధిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లేమితో విద్యార్థులు నష్టపోతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, ప్రాక్టికల్స్, ఇండ్రస్టియల్ ట్రైనింగ్, పరిశ్రమ ప్రముఖుల ద్వారా సెమినార్స్ ద్వారా సమగ్ర శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు, వివరాలకు 9848372886, 8500724006 నంబర్లను సంప్రదించవచ్చు. – కేవీ రమణ బాబు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్స్టైల్స్ టెక్నాలజీ, గుంటూరు -
ఫ్యాషన్ టాక్: వెరైటీ చీరకట్టుతో కార్పోరేట్ లుక్ (ఫోటోలు)
-
ఆఫీస్‌లకి పర్ఫెక్ట్ చీరకట్టు ఇది..స్టైల్‌తో పాటు ఫార్మల్ కూడా
కుర్తాసెట్ ధరించిన సౌకర్యం కావాలి. సంప్రదాయం కాకుండా స్టయిలిష్‌గా కనిపించాలి. క్యాజువల్ వేర్ అనిపించాలి.కార్పొరేట్ లుక్‌తో ఆకట్టుకోవాలి. ఇవన్నీ ఒకచోట కొలువుండాలంటే ఎవర్గ్రీన్ చీరకట్టును మోడర్న్‌గా మెరిపించాలి. ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి లాంగ్ బ్లౌజ్‌లు, ఓవర్‌కోట్స్, పెప్లమ్, షర్ట్ స్టైల్... ఇలాంటి వాటితో కాటన్ లేదా సిల్క్ చీరకట్టును మ్యాచ్ చేస్తే స్టయిల్ లుక్ సొంతం కాకుండా ఉండదు. కాటన్, సిల్క్, బెనారస్ డిజైనర్ టాప్స్‌తో తీసుకువచ్చే ఈ లుక్ క్యాజువల్ వేర్‌గానూ, పార్టీవేర్‌గానూ ఆకట్టుకుంటుంది. -
కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్.. దూల తీరింది!
కుక్కతో రెజ్లింగ్ మ్యాచ్.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. కుక్క రెజ్లింగ్ మ్యాచ్ ఆడడం అంటే కండలు పీక్కుతినడమే కనిపిస్తుంది. ఇక రింగ్‌లోకి దూసుకొచ్చిన సదరు కుక్కగారు తన ప్రత్యర్థిని మట్టికరిపించి అతని సరదాను తీర్చింది. అయితే ఇదంతా కేవలం ఫన్ కోసం మాత్రమే. బార్డర్ కోలి అనే కుక్క బర్త్‌డే సందర్భంగా దాని యజమాని ఇలా ప్లాన్ చేశాడు. వెస్ట్రన్ఫేర్లోని రెజ్లింగ్ రింగ్‌లోకి అడుగుపెట్టిన వెంటనే మ్యాట్ అంతా కలియతిరిగిన బార్డర్ కోలి ప్రేక్షకులకు అభివాదం చేసింది. తన ప్రత్యర్థి సైకో మైక్‌తో మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ట్రెయినర్ ఇచ్చిన ఆదేశాలను అనుసరిస్తూ బార్డర్ కోలి మ్యాచ్ ఆడింది. ముందుగా అనుకున్న ప్రకారం కుక్క సైకో మైక్ మీదకు రాగానే అతను కిందపడిపోయాడు. ఆ తర్వాత రెజ్లర్‌ను పైకి లేవకుండా మూడుసార్లు జంప్ చేసింది. బార్డర్ కోలి షాట్లపై సైకో మైక్ తప్పంటూ అప్పీల్ చేశాడు. ఆ తర్వాత అంపైర్ మూడుసార్లు కౌంట్ చేసి బార్డర్ కోలిని విజేతగా ప్రకటించాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సాధారణంగానే మనం పెంచుకునే కుక్కులు విశ్వాసంగా ఉంటాయి. యజమాని మాటను తుచా తప్పకుండా పాటిస్తుంటాయి. బాంబ్ స్క్వాడ్, స్పిపర్ డాగ్స్ అంటూ కొన్ని కుక్కలు విన్యాసాల్లో ఆరితేరి ఉంటాయి. వాటికిచ్చే స్పెషల్ ట్రైనింగ్ వల్ల మనషులతో సమానంగా పనిచేస్తాయి. ఇక విదేశాల్లో రాట్ వీలర్స్, పిట్‌బుల్స్ లాంటి కుక్కలకు ఫైటింగ్‌లు ఏర్పాటు చేస్తారు. ఈ ఫైట్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. ఈ ఫైట్స్‌పై పెద్ద మొత్తంలో బెట్లు కాస్తూ కాసుల వర్షం పండించుకుంటారు. Who wants to see a BIRTHDAY-slam?! Wishing a big happy birthday to @iAmPsychoMike We hope it goes better for him than this surprise match on Saturday did... Big thanks to @JenandDaiquiri for joining forces to put on a one of a kind match at @WesternFair pic.twitter.com/iRY9R6SSO6 — Smash Wrestling (@smashwrestling) September 21, 2022 -
రాసలీలల స్కాం: WWE చైర్మన్ పదవి నుంచి వైదొలిగిన మెక్‌మ్యాన్
ప్రపంచంలోనే అత్యధిక బుల్లితెర వీక్షణ ఉన్న రియాలిటీ ఎంటర్టైన్మెంట్ రెజ్లింగ్ షో డబ్ల్యూడబ్ల్యూఈ. ఈ షో నుంచి ఊహించని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. డబ్ల్యూడబ్ల్యూఈ చైర్మన్, సీఈవో విన్స్ మెక్‌మ్యాన్(76) తన పదవుల నుంచి వైదొలిగారు. రాసలీలల స్కాం ఆరోపణల నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మాజీ ఉద్యోగితో ఎఫైర్ నడిపిన విన్స్.. ఆ విషయం బయటకు పొక్కుండా ఉండేందుకు సదరు ఉద్యోగిణితో 3 మిలియన్ డాలర్లు(దాదాపు రూ.23.4 కోట్లు) మేర ఒప్పందం చేసుకున్నట్లు ఈమధ్య ఆరోపణలు వచ్చాయి. ఈ తరుణంలో కంపెనీ బోర్డు ఆయనపై విచారణకు ఆదేశించింది. ఈ దరిమిలా తన సీఈవో, చైర్మన్ పదవులకు స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు విన్స్ మెక్‌మ్యాన్ ప్రకటించారు. మాజీ ఉద్యోగిణితో ఎఫైర్ గురించి బయటకు చెప్పకుండా ఉండేందుకు ఆమెకు విన్స్ మెక్‌మ్యాన్ డబ్బు ఇచ్చాడని, ఈ మేరకు ఒప్పందం కూడా జరిగిందంటూ వాల్‌స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం ప్రచురించింది. అయితే ఈ వ్యవహారంపై డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు దర్యాప్తు ఏప్రిల్‌లోనే మొదలైందని, దర్యాప్తులో ఎన్నో సంచలన విషయాలు వెలుగు చూశాయని ఆ కథనం సారాంశం. మెక్మ్యాన్తోపాటు డబ్ల్యూడబ్ల్యూఈ టాలెంట్ రిలేషన్స్ హెడ్‌గా ఉన్న జాన్ లారినైటిస్ మీద కూడా ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఇద్దరి మీద ప్రత్యేక కమిటీ దర్యాప్తు కొనసాగిస్తోందని డబ్ల్యూడబ్ల్యూఈ ఒక ప్రకటనలో తెలిపింది. అప్పటివరకు చైర్మన్, సీఈవో బాధ్యతలకు దూరంగా ఉన్నప్పటికీ.. క్రియేటివ్ కంటెంట్(డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రిప్ట్)లో మాత్రం విన్స్ మెక్‌మ్యాన్ జోక్యం ఉంటుందని డబ్ల్యూడబ్ల్యూఈ బోర్డు స్పష్టం చేసింది. మెక్‌మ్యాన్ వైదొలగడంతో ఆయన కూతురు స్టెఫనీ మెక్మ్యాన్కు తాత్కాలిక సీఈవో బాధ్యతలు అప్పజెప్పింది దర్యాప్తు కమిటీ. 76 ఏళ్ల వయసున్న విన్సెంట్ కెనెడీ మెక్‌మ్యాన్.. తండ్రి అడుగు జాడల్లోనే రెజ్లింగ్ ఫీల్డ్‌లోనే అడుగుపెట్టాడు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ (ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ అయ్యింది)లో రింగ్ అనౌన్సర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. కామెంటేటర్‌గా పని చేశాడు. ఆపై భార్య లిండాతో కలిసి సొంత కంపెనీ పెట్టి.. అటుపై డబ్ల్యూడబ్ల్యూఎఫ్, డబ్ల్యూడబ్ల్యూఈ నెట్‌వర్క్‌లతో ఎంటర్టైన్మెంట్ రంగంలో రారాజుగా ఎదిగాడు. విన్స్మెక్మ్యాన్ భార్య లిండా, గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కీలక బాధత్యలు నిర్వహించారు. ఇక మెక్‌మ్యాన్ కొడుకు షేన్ మెక్‌మ్యాన్, కూతురు స్టెఫనీ మెక్‌మ్యాన్, అల్లుడు ట్రిపుల్ హెచ్(పాల్ మైకేల్ లెవెస్క్యూ) కూడా డబ్ల్యూడబ్ల్యూఈలో రెజర్లుగానే కాకుండా.. కంపెనీ బోర్డు వ్యవహారాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉంటే.. డబ్ల్యూడబ్ల్యూఈలో విన్స్ మెక్మ్యాన్పై ఈ తరహా ఆరోపణలు గతంలోనూ వచ్చినా.. ఇప్పుడు వృత్తిపరమైన నియమావళికి సంబంధించినవి కావడంతో విన్స్ మెక్‌మ్యాన్ తప్పనిసరిగా వైదొలగాల్సి వచ్చింది. -
న్యాయమూర్తులకు నైతికతే కీలకం
న్యూఢిల్లీ: సమాజంలో న్యాయమూర్తులు అత్యున్నత నైతిక స్థలాన్ని ఆక్రమిస్తారని, న్యాయ కల్పనపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడంలో వీరు ఎంతదూరమైనా వెళ్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఏస్థాయిలోని న్యాయమూర్తైనా అత్యున్నత ప్రమాణాలను ఆచరించాలని తెలిపింది. సివిల్ జడ్జిగా నియమించేందుకు తాను అనర్హుడినంటూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో అప్పీలు చేశారు. దీన్ని విచారించిన కోర్టు న్యాయమూర్తి, నైతికతపై వ్యాఖ్యలు చేసింది. పిటీషనర్‌పై కొన్ని ఎఫ్ఐఆర్లు దాఖలైనట్లు, కొన్నికేసుల్లో రాజీ కుదుర్చుకున్నట్లు గమనించామని కోర్టు తెలిపింది. ఏ కేసులో శిక్ష పడనందున ఈ విషయంలో హైకోర్టు ఆదేశాలను పక్కనబెడుతున్నట్లు తెలిపింది. సివిల్ జడ్జి పోస్టుకు సరైనవారిని ఎంపిక చేయడం హైకోర్టు బాధ్యతని, కానీ ఈ సందర్భంలో హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపింది. చదవండి: ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా ఆదిత్యనాథ్ దాస్ -
ప్రతిభను పక్కన పెడ్తారా?
ఇండస్ట్రీ థూ అనిపించుకుంటోంది!ఒకళ్లిద్దరు చాలు కదా... మంచి ఇండస్ట్రీని థూ అనిపించడానికి!యాక్టింగ్ అంటే ఏంటీ? ప్రతిభను ధరించి ముందుకు రావడం!ఆ ప్రతిభను వొలుస్తానంటారా?పక్కలో ఉండమంటారు.. లేకపోతే పక్కన పెడ్తామంటారు!కాంప్రమైజ్ కాకపోతే ఇండస్ట్రీలో ప్రామిస్ లేదంటారు!ఈ అపశ్రుతిని శ్రుతి మళ్లీ బహిర్గతం చేసింది! ‘‘పదహారేళ్లుగా సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నా. తెర ముందు సత్కారాలు.. తెర వెనక అవమానాలు. మేము చాలా కంఫర్టబుల్ లైఫ్‌ను లీడ్ చేస్తామని.. గొప్ప మహర్జాతకులమని మాగురించి సామాన్య జనాల్లో ఓ అపప్రథ ఉంటుంది. కాని అది నిజం కాదు. మాకు నచ్చినా నచ్చకపోయినా.. తప్పనిపించినా.. కరెక్ట్ అనిపించినా.. అందరూ మెచ్చేలాగే ఉండాలి. నాకు బాగా గుర్తు.. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో.. దక్షిణాది సినిమా ఒకటి చేశాను. బికినీ వేసుకొమ్మని అడిగారు.రెండో ఆలోచన లేకుండా ఓకే అన్నాను. బికినీ వేసుకొని నటిస్తున్న సీన్‌ను ఎలా షూట్ చేయబోతున్నారు? అసలు ఆ సీన్‌కి బికినీ అవసరమా? వంటి ప్రశ్నలేవీ నా మైండ్‌లో. అలా అడగాలనీ తెలియదు. ఓ సినిమాలో అవకాశం వచ్చింది.. చేయాలి.. అంతే! అప్పుడు నా ముందున్న లక్ష్యం అదే. తర్వాతర్వాత మరాఠీ షోలతో నేను పాపులర్ అయ్యాక.. ఆ బికినీ సీన్‌ను చూసిన జనం ఆ ఫొటోస్‌తో ట్రోల్ చేశారు. అది మన సెల్ఫ్ఎస్టీమ్ను ఎంత దెబ్బతీస్తుంది? బికినీ వేసుకుని నటించాలి.. అడగ్గానే అలాగే నటించాను. నటిగా నన్ను యాక్సెప్ట్ చేయలేదు. ఆబ్జెక్టిఫై చేశారు. అయినా ఏమీ పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూనే ఉన్నాను. నాకున్న కల ఒక్కటే.. మంచి నటిగా పేరు తెచ్చుకోవాలని. దాన్ని సాకారం చేసుకోవడానికి కష్టపడ్డాను. ఎవరో ఏదో అన్నారని కుంగిపోలేదు. నా దారిలో వాళ్లు లేరుకదా! నేనేంటో నాకు తెలుసు. ఎదురుదెబ్బలు తగిలినప్పుడల్లా.. నెమ్మది నెమ్మదిగా నాకు నేనే ధైర్యం చెప్పుకుంటూ నిలబడ్డాను. ఈరోజుకి స్ట్రాంగ్ అయ్యాను. ఈ మధ్య ఒకసారి ఓ సినిమాలో లీడ్ రోల్ చేసే చాన్స్ వచ్చింది. డిస్కషన్స్‌లో భాగంగా ప్రొడ్యూసర్ని కలిశాను. స్టార్టింగ్‌లో చాలా ప్రొఫెషనల్‌గానే ఉన్నాడు. తర్వాతే కాంప్రమైజ్.. వన్ నైట్ అంటూ మాట్లాడ్డం మొదలుపెట్టారు. ఆయన మాటలను అడ్వాన్స్ కానివ్వకుండా అడిగా.. ‘‘హీరోయిన్ అవకాశం ఇవ్వడం కోసం నన్ను నీతో పడుకోమంటున్నావ్. మరి హీరోను ఎవరితో పడుకోబెడ్తున్నావ్?’’ అని. కంగుతిన్నాడు ఆ ప్రొడ్యూసర్. ఈ విషయాన్ని వెంటనే ఆ ప్రాజెక్ట్‌లోని క్రూ మెంబర్స్ అందరికీ చెప్పేశారు. అది ఓ కొలాబరేషన్ ప్రాజెక్ట్. మిగిలిన వాళ్లంతా అతనిని టీమ్ నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు. ఆ రోజు నేను ఆ నిర్ణయం తీసుకోవడానికి ఒక్క నిమిషం పట్టలేదు. నేను ధైర్యం చేసింది ఒక్క నాకోసమే కాదు.. నాలా ఆబ్జెక్టిఫై అవుతున్న చాలా మంది మహిళల కోసం. ఈజీగా ఇతరుల జడ్జ్‌మెంట్‌కు బలవుతున్న అమ్మాయిల కోసం. యాంబిషస్గా ఉండడమే తప్పా? నన్ను నిర్వచించేది నేను వేసుకున్న దుస్తులతో కాదు. నా ప్రతిభ, పని పట్ల నా నిబద్ధత, నా సక్సెస్.. నా వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. ఈ సత్యాన్ని జనాలు గ్రహించే టైమ్ వచ్చిందనే భావిస్తున్నా!ఫేస్‌బుక్‌లోని ‘అఫీషియల్ హ్యూమన్స్ ఆఫ్ బాంబే’ అనే పేజీలో మరాఠీ నటీమణి శ్రుతి మరాఠే రాసిన సత్యం అది. అవకాశం కోసం శ్రుతి మరాఠేను అనుచితమైన కోరిక కోరిన ప్రొడ్యూసర్‌ను ఆ ప్రాజెక్ట్ నుంచే తొలగించేలా చేసిన ఆమె సాహసానికి స్ఫూర్తి ‘మీ టూ’ ఉద్యమమే. జరిగినప్పుడే చెప్పకుండా కొన్నేళ్ల తర్వాత ఎందుకు చెప్తారు? అన్న నోళ్లకు సమాధానం ఆమె. ఎప్పుడో జరిగిన అవమానాలను ఎన్నేళ్లకైనా బయటపెట్టేందుకు మీ టూ వేదికైంది. పెట్టొచ్చు అనే ధైర్యాన్నీ ఇచ్చింది కాబట్టే తాజాగా ఎదురైన ఇన్సల్ట్ను దిగమింగుకోకుండా వెంటనే ఎదురించగలిగారు శ్రుతి. చేదు గతం బహిర్గతమవుతేనే వర్తమానంలో నివారణ దొరుకుతుంది. భవిష్యత్ భద్రంగా ఉంటుంది. మీ టూది అలాంటి ప్రయత్నమే. మలయాళ నటి భావన కిడ్నాప్, లైంగిక దాడితో మన దగ్గర సినిమా ఇండస్ట్రీలో మీ టూ ఉద్యమం ప్రారంభమైంది. ప్రీతి జింటా.. తన ఆత్మగౌరవం మీద జరిగిన దాడి గురించి కంప్లయింట్ చేసిన మొదటి ఉత్తరాది నటి అనుకోవచ్చు. ఆ తర్వాతే తనుశ్రీ దత్తా, ఇటు చిన్మయీ శ్రీపాద నిర్భయంగా ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. ‘‘అప్పుడే ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎందుకు’’ అంటూ వచ్చిన ఎదురు దాడికీ వెరవలేదు. భయంకరమైన ట్రోలింగ్‌కూ గురయ్యారు. అయినా వెనక్కి తగ్గకుండా స్థిరంగా నిలబడ్డారు.. అందువల్లే శ్రుతి మరాఠే లాంటి వాళ్లు సినిమా మెన్ క్వాయిష్‌ను తిప్పికొట్టగలిగారు. ఫీల్డ్‌లో లేకుండా చేస్తారు ‘కాస్టింగ్ ఏజెంట్ నుంచి సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరో దాకా.. అందరితో (లేదా కొందరితో) కాంప్రమైజ్ (ఇది సినిమా భాషే) అయితేనే చాన్స్. నో అని చెప్పినా.. కంప్లయింట్ చేసినా.. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగి.. ఫీల్డ్‌లో లేకుండా చేస్తారు’’ అని చెప్తారు బాలీవుడ్‌కు చెందిన ఓ వర్ధమాన నటి. ‘‘నాకూ ఇంచుమించు ఇలాంటి ఎక్స్‌పీరియన్సే ఎదురైంది. చాన్స్ ఇస్తానని, డిస్కషన్స్‌కి పిలిచి.. ఫేవర్ అడిగాడు.. తనతో టైమ్ స్పెండ్ చేయమని. నో అన్నాను. ‘నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గరైనా నువ్ కాంప్రమైజ్ కావాల్సిందే. లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేవు. నీకు సినిమాలు లేకుండా చేయగలను’ అంటూ శపించాడు. అయినా నేనేం భయపడలేదు’’ అని చెప్పారు ప్రముఖ మరాఠీ నటీమణి, ‘ఫైర్‌బ్రాండ్’ హీరోయిన్ ఉషా జాధవ్. తనూ వెడ్స్ మను, నిల్ బట్టి సన్నాట, అనార్కలీ ఆఫ్ ఆరా ఫేమ్.. స్వర భాస్కర్ తెలుసు కదా! అంత టాలెంట్ ఉన్నా తగినన్ని అవకాశాలు ఎందుకు లేవు ఆమెకు? నో ‘కాంప్రమైజ్’ అంటుంది కాబట్టి. ‘‘కుదరదు అని చెప్పినందుకు చాలా రోల్స్ మిస్ చేసుకున్నా. నేను ఫోన్ చేస్తే కొంతమంది డైరెక్టర్స్ ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయరో కూడా నాకు తెలుసు. ఎందుకంటే సబ్జెక్ట్ తప్ప వాళ్లను ఇంకేరకంగానూ ఎంటర్టైన్ చేయను కదా.. ఐ మేడ్ ఇట్ క్లియర్’’ అంటారు స్వర భాస్కర్. మోనా మాథ్యూస్ అనే బెల్లీ డ్యాన్సర్, క్యారెక్టర్ నటి కూడా వేషాల కోసం కాంప్రమైజ్ కాలేదు.. కాదల్చుకోలేదు. ‘‘ఫలానా పాత్రకు నేను బాగుంటాను అనుకొని వచ్చిన పాత్రలను అంగీకరించడం తప్ప నాకై నేను అవకాశాల కోసం కాస్టింగ్ స్టూడియోస్‌కు వెళ్లట్లేదు. కొత్తలో వెళ్లేదాన్ని.. కాంప్రమైజ్ కావడానికి సిద్ధమేనా? అని అడిగారు. నో అని చెప్పి అప్పటి నుంచి కాస్టింగ్ స్టూడియోస్‌కు వెళ్లడం మానేశాను’’ అని చెప్పారు మోనా మాథ్యూస్. సో... అప్పుడే ఎందుకు చెప్పలేదు లాంటి సన్నాయి నొక్కుళ్లకు కాలం చెల్లింది.. కరెంట్ యాక్షన్స్‌కు షాకింగ్ రిజల్ట్స్ ఇవ్వడానికి మహిళలు సిద్ధమయ్యారనడానికి శ్రుతి, ఉషాలాంటి వాళ్లే ఉదాహరణలు. మీ టూ ‘నెవర్’గా స్థిరపడేందుకు ఇదో శుభసూచకం. సరస్వతి రమ తెలుగులో కూడా నో కాంప్రమైజ్ అని ముక్కు పగలగొట్టిన నటీమణులు, మహిళా టెక్నీషియన్లు ఉన్నా రు. ఫిదా ఫేమ్ గాయత్రీ గుప్తా, పాటల రచయిత్రి శ్రేష్ట అలాంటి ధీరవనితలే. ‘‘ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడే అనుకున్నా... ప్రతిభకే తప్ప ఇంకే చాన్స్కీ చోటివ్వొద్దని. అద్దంలో నన్ను నేను చూసుకుంటే ప్రౌడ్ ఫీలవ్వాలి. ఆత్మగౌరవాన్ని మించింది లేదు. నా యాక్టింగ్ స్కిల్ నా పర్సనాలిటీకొక క్రౌన్ కావాలి తప్ప నా పర్సనాలిటీని తగ్గించకూడదు కదా! అయితే నాలాంటి వాళ్లు ఇలా ముక్కుసూటిగా మాట్లాడ్డం వల్ల ‘అమ్మో వీళ్లకు చాన్స్‌లు ఇస్తే కంప్లయింట్లు చేస్తారు ఎందుకొచ్చిన గోల’ అంటూ అవకాశాలే ఇవ్వరు. కాని ఇండస్ట్రీలో అందరూ పాజిటివ్‌గా ఆలోచిస్తే పరిస్థితి తప్పకుండా మెరుగుపడుతుంది. ఇంతకుముందు జరిగిన పొరపాట్లు ఇక నుంచి జరగనివ్వకుండా... స్త్రీ,పురుషులు ఒకరిపట్ల ఒకరు గౌరవంతో.. టాలెంట్‌ను గుర్తించి, రెస్పెక్ట్ ఇచ్చేలా మారితే బాగుంటుంది. వస్తుందని ఆశిద్దాం..’’ అంటారు గాయత్రీ గుప్తా. -
పది చేతులు చాలవు
యోషికా నిషిమాస ప్రతిరోజూ పేపరు మీద పెద్ద లిస్టు రాయాలి. ప్రతిరోజూ జరిగిన సంవాదాలు, పనులు, భోజన సమయాలు... డైలీ రికార్డును పూర్తిచేస్తూనే ఉండాలి.ఆవిడ ఒక మార్కెటింగ్ ప్రొఫెషనల్. ఈ లిస్టు ఆమె వృత్తికి సంబంధించినది కాదు. తన పిల్లల ప్రీస్కూల్‌కి సంబంధించిన విషయాలు. ఈ పనులన్నీ ఆవిడ ఆఫీసుకి వెళ్లేలోపు పూర్తి కావాలి. జపాన్‌లో ఉద్యోగాలు చేస్తున్న ఎంతోమంది మహిళలలాగే 38 సంవత్సరాల నిషిమాస కూడా ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. జపాన్‌లో ఆడవారి నుంచే ఎక్కువ పనిని ఆశిస్తోంది ప్రభుత్వం. జపాన్ ప్రధాని షింజో అబే, జపాన్‌లోని మహిళలతో ఎక్కువ పని చేయించి, జాతీయ ఆదాయాన్ని పెంచుకోవాలని చూస్తున్నారు. ఇందుకోసం మహిళలను ‘ఉమెనోమిక్స్’ (ఉమెన్+ఎకనామిక్స్) అంటున్నారు. ఈ జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్‌లో షింజో అబే, ‘జపాన్‌లో 67 శాతం మంది మహిళలు ఎంతో చక్కగా ఉద్యోగాలు చేస్తున్నారు, ఈ సంఖ్య అమెరికా దేశం కంటే చాలా ఎక్కువ ’ అని గొప్పలు పలికారు. ఎక్కువ మంది పనిచేయడం ఆ దేశానికి గర్వకారణమా! వారు చిన్న పదవులలో మాత్రమే ఎందుకు ఉంటున్నారో అవసరం లేదా! ఇంటి బాధ్యతల కారణంగా జపాన్ మహిళలు ఉన్నతస్థానాలకు ఎదగాలని కలలు కంటున్నా ముందుకు వెళ్లలేక పోతున్నారు. కానీ యాజమాన్యాలు మాత్రం వారి నుంచి ఎక్కువ పని ఆశిస్తున్నాయి. మగవారు సహాయం చేయరు ఇక్కడ పనిచేస్తున్న మహిళల శాతం చాలా ఎక్కువే. కానీ, వంచిన నడుము ఎత్తకుండా ఇంటి పని చేయడం, ఇంట్లో వారందరినీ బాధ్యతగా చూసుకోవడంతో వారు అలసిపోతున్నారు, దీనికితోడు ఇంట్లోని మగవారు ఆడవారికి చేదోడువాదోడుగా ఉండరు. ప్రపంచంలోని ఇతర సంపన్న దేశాలతో పోలిస్తే జపాన్‌లో ఇంటిపనులు, పిల్లలను చూడటం వంటి పనులు చేసే మగవారు చాలా తక్కువ. ‘నోరికో ఓ ట్సుయా’ అనే ప్రభుత్వ ఉద్యోగి చేసిన సర్వే ప్రకారం మహిళల కంటే పురుషులు ఇంటి పనులు తక్కువ చేస్తున్నారు. ఈ కారణంగా ఉద్యోగాలలో ఎదగలేకపోతున్నారు, ఇంటి దగ్గర కూడా బంధాన్ని పటిష్టపరచుకోలేకపోతున్నారు స్త్రీలు. నిషిమాస జీవితాన్ని పరిశీలిస్తే... ఆమెకు ప్రీస్కూల్ చదువుతున్న ఇద్దరు చిన్నపిల్లలు. నిత్యం వారి ఆరోగ్యం గురించి, రెండు పూటలా ఏం తింటారు, మూడ్స్‌ని బట్టి ఏ టైమ్‌లో ఏం చేస్తారు, ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు ఆడుకుంటారు వంటివన్నీ రికార్డు రాసి ఆ పిల్లలను క్రెచ్‌లో దింపాలి. నిత్యం ఈ పని చేయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవాలి. ఇవి కాకుండా ఎలిమెంటరీ స్కూల్లో చదువుతున్న ఎనిమిది సంవత్సరాల మరో కొడుకు గురించి చూసుకోవాలి. స్కూల్ అయిపోయాక ఆ పిల్లవాడు ట్యూటర్ దగ్గరకు వెళ్లాలి. అందుకోసం హోమ్‌వర్క్ అసైన్మెంట్ మీద సంతకం చేయాలి. వీటిలో ఏ ఒక్క పని మరచిపోయినా ఇబ్బందే. పేపర్ మీద ఇవన్నీ రాయడంతో ఆమె పనులు ప్రారంభమవుతాయి. ఆ తరువాత వంట చేయడం, ఇల్లు శుభ్రం చేయడం, బట్టలు ఉతికి ఇస్త్రీ చేయడం... ఇలా లెక్కలేనన్ని పనులు చేయాలి. ఇక వంటకాల విషయానికి వస్తే, రకరకాల జపనీస్ వంటకాలు తయారుచేయడం చాలా కష్టం. ఆ తరువాత లంచ్ బాక్సులను అందంగా, పిల్లలకు తినాలనిపించేలా సర్దాలి. పనివాళ్లు దొరకరు కనుక, అంట్లు, బట్టలు... ఈ పనులన్నీ పూర్తిచేయాలి. నిషిమాస ఈ పనులన్నీ ఒంటిచేత్తో చేస్తోంది. నిషిమాస భర్త ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్. అప్పుడప్పుడు ఆయనకు ఆఫీసులో పని ఆలస్యం అవుతుంది. ఒక్కోసారి క్లయింట్లతో బయటకు పార్టీలకు వెళ్తుంటాడు. జపాన్‌కి నిషిమాసలాంటి చదువుకున్నవారి అవసరం చాలా ఉంది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్ ఆర్థికంగా చాలా వేగంగా ఎదిగింది. పెళ్లి అయిన తరువాత, గర్భిణులుగా ఉన్న సమయంలోను మహిళలు ఆఫీసు నుంచి చాలా వేగంగా ఇంటికి వెళ్లిపోయేవారు. దేశ ఆర్థిక వనరులను పెంచడం కోసం, ఆ సమయంలో వారి భర్తలు ఆఫీసులో మిగతా పని పూర్తి చేసేవారు. 1970 తరువాత వివాహితమహిళలు పనినంతావారే స్వయంగా చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ముగింపు: జపాన్‌లో మరమనుషులు ఎక్కువంటారు, అందుకేనేమో అక్కడ స్త్రీలను కూడా మరమనుషులుగా భావిస్తున్నారు. ఆమెకు ఒక మనసు ఉంటుందని, ఆమె అలసిపోతుందని, ఆమె కూడా ఉద్యోగంలో పైస్థాయికి ఎదగాలనుకుంటుందని అర్థం చేసుకునేలోగా ఎంతోమంది ఆత్మన్యూనతకు గురవుతూనే ఉంటారు. మరెంతోమంది చిన్న ఉద్యోగాలలోనే పదవీ విరమణ చేసేస్తారు. నిషిమాస ఒక పెద్ద యూనివర్సిటీ నుంచి పట్టా పొందాక, ఒక టెక్ట్స్‌బుక్ పబ్లిష్ చేయడానికి ఒక సంస్థలో పనిచేసింది. అక్కడ ఆమె చాలా బాగా, చురుకుగా పనిచేయడంతో త్వరగా పైస్థాయికి ఎదిగింది. నాలుగు సంవత్సరాల తరువాత వివాహం చేసుకుంది. పెళ్లయిన వారిని ఆ కంపెనీలో పార్ట్ టైమర్లుగా మారుస్తారు. నిషిమాస విషయంలో అదే జరిగింది. ప్రతిరోజూ బాస్ ‘నువ్వు ఆఫీసులో ఎక్కువ సమయం ఉండట్లేదు, నీ పిల్లల కోసం నువ్వు తొందరగా వెళ్లిపోతున్నావు’ అని సాధించడం మొదలుపెట్టడంతో, మరో ఉద్యోగం కోసం వేట మొదలుపెట్టింది నిషిమాస. ‘నువ్వు ఎక్కువసేపు పనిచేయలేవు కదా? ఆలస్యం అయితే నీర్త నిన్ను అర్థం చేసుకుంటాడా’ అని అడిగారు అక్కడ.తను పనిచేసిన పబ్లిషర్ మాత్రం తన వివాహం గురించి అడగలేదు కానీ పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉండేది. నిషిమాస 29వ ఏట గర్భం దాల్చింది. అయినా ఆమెకు ఎటువంటి సౌకర్యం లేదు ఆఫీసులో. ఒక్కోసారి అర్ధరాత్రి వరకు ఉండేది. దాంతో మొదటిసారి గర్భస్రావం అయ్యింది. ఆ తరువాత కొన్నాళ్లకి మళ్లీ గర్భిణి అయ్యింది. అయినా ఆఫీసులో చాలాసేపు పనిచేస్తూనే ఉంది. తన పనిలో కొంత భాగాన్ని మరొకరికి పంచమని అడగలేకపోయింది. రాత్రి పది గంటలకు ఇంటికి వెళ్లిన వెంటనే బాస్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేది, ‘‘అందరి కంటే ముందుగా ఇంటికి వెళ్లిపోయావు, నీ కొలీగ్స్‌ని క్షమాపణలు అడుగు’ అని. ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నిషిమాస ఉద్యోగం మానేయాలనుకోలేదు. భర్త తాను పై పదవులకు ఎదగాలనుకున్నాడు. అందువల్ల పిల్లల బాధ్యత పూర్తిగా నిషిమాస తీసుకోవలసి వచ్చింది. తాను చాలా ఎక్కువసేపు కష్టపడుతున్నట్లు చెప్పేవాడు భర్త. కష్టపడుతున్నది ఎవరో అందరికీ తెలిసిందే. -
ఫీజుల భారం తగ్గేదెప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్యాకోర్సుల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచకపోవడంతో విద్యార్థులపై పెనుభారం పడుతోంది. ఈ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కుటుంబాలు భారీగా ఉన్న ఫీజులు చెల్లించడానికి అప్పులు చేసి రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అప్పులు చేసే స్థోమత కూడా లేని విద్యార్థులు ఫీజులను చెల్లించలేక మధ్యలోనే చదువు మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మరికొంతమందికి చదువులు ముగిసినా ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా కాలేజీలు సర్టిఫికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో విద్యార్థులే ఆ డబ్బునూ చెల్లించి తమ సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. ఆయా కోర్సుల ఫీజులను ప్రతి మూడేళ్లకోసారి పెంచుతున్న ప్రభుత్వం ఆ మేరకు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఫార్మా తదితర కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రీయింబర్స్మెంట్పెంచకుండా ఫీజుల పెంపు ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం ప్రతి మూడేళ్లకు పెంచుతోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు కాలేజీల నిర్వహణకు అయ్యే ఖర్చులకు అనుగుణంగా ఈ ఫీజులను ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) ఖరారు చేస్తుంటుంది. 2016–17, 2018–19 విద్యా సంవత్సరాల ఫీజులను మూడేళ్ల క్రితం ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకురాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో అన్ని కోర్సుల ఫీజులు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఫీజులను పెంచిన చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులపై ఆ భారం పడకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచకుండా రూ.35 వేలకే పరిమితం చేసింది. దీంతో విద్యార్థులపై ఫీజుల భారం తడిసిమోపెడైంది. బీటెక్ కోర్సునే తీసుకుంటే విద్యార్థులు అదనంగా రూ.70 వేల వరకు భరించాలి. నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేటప్పటికీ ప్రతి విద్యార్థి దాదాపు రూ.3 లక్షలు అప్పు చేయాల్సి వస్తోంది. ఇది ఫీజు వరకు మాత్రమే. దీనికి అదనంగా వసతి, భోజన ఖర్చులను కూడా కలుపుకుంటే ఈ అప్పుల భారం మరింత పెరుగుతుంది. నిపుణుల నివేదికనుపెండింగ్లో పెట్టిన ప్రభుత్వం విద్యార్థులపై ఫీజుల భారం అధికంగా ఉంటోందని, ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. నిపుణులు కూడా ఫీజురీయింబర్స్‌మెంట్ పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. దీనిపై గతేడాది ప్రభుత్వం.. అధికారులు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఫీజులు భారీగా ఉన్నందున ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని రూ.35 వేల నుంచి రూ.65 వేలకు పెంచాలని కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఈ నివేదికను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను పెంచకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫీజుల పెంపునకు ఏఎఫ్ఆర్సీ కసరత్తు మరోవైపు 2019–20, 2021–22 విద్యా సంవత్సరాలకు ఫీజులు నిర్ణయించడానికి ఏఎఫ్ఆర్సీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా కాలేజీల నుంచి ప్రతిపాదనలను కోరింది. ఆయా కోర్సుల నిర్వహణకయ్యే వ్యయంపై కాలేజీలు సమర్పించే ఖర్చులను పరిశీలించి ప్రస్తుత ఫీజులను పెంచనున్నారు. ఏఐసీటీఈ నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు ఫీజులు పెంచాలని కాలేజీలు ప్రభుత్వాన్ని, ఏఎఫ్ఆర్సీని కోరుతున్నాయి. ఏఐసీటీఈ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న ప్రమాణాల మేరకు కాలేజీలను నిర్వహించాలంటే ప్రస్తుత ఫీజులు సరిపోవడం లేదని అంటున్నాయి. బీటెక్‌లో గరిష్ట ఫీజు రూ. 1.44 లక్షల నుంచి రూ.1.58 లక్షలుగా, బీఫార్మసీలో రూ.1.41 లక్షల నుంచి రూ.1.55 లక్షలుగా, ఎంబీఏలో రూ.1.57 లక్షల నుంచి రూ.1.71 లక్షలుగా, ఎంటెక్‌లో రూ.2.31 లక్షల నుంచి రూ.2.51 లక్షలుగా ఉండొచ్చని శ్రీకృష్ణ కమిటీ సూచించింది. ఈ మేర ఫీజులు పెరిగితే విద్యార్థులకు ఇచ్చే ఫీజురీయింబర్స్‌మెంట్‌ను కూడా పెంచాల్సిన అవసరముంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
పాపుల పరమ వైద్యుడాయన...
పన్నువసూలు చేసే వృత్తిలో ఉన్న మత్తయిని చూసి యేసుప్రభువు ‘నన్ను వెంబడించు’ అని పలకగానే అతను వచ్చి ఆయన శిష్య బృందంలో చేరాడు. ప్రభువు పలికిన ఆ ఒక్కమాట అతని జీవిత గమ్యాన్ని సమూలంగా మార్చేసింది. మత్తయి జీవితంలోకి ప్రభువు ఆహ్వానం ఎంతటి ఆనందాన్ని నింపిందంటే, అది వెల్లడించడానికి ఒక గొప్ప విందు చేసి ప్రభువును కూడా ఆహ్వానించాడు. నాటి రోమా ప్రభుత్వానికి తొత్తులైన పన్నులు వసూలు చేసే మత్తయి లాంటి సుంకరులను సాధారణ ప్రజలు ఏవగించుకునేవారు. శాస్త్రులు పరిసయ్యుల వంటి యూదు మత ప్రముఖులు ఎలాగూ రోమాప్రభుత్వానికి మద్దతుదారులు కాబట్టి వారు సుంకరులకు కూడా స్నేహితులు. అందువల్ల ఆ విందుకు పాపులుగా ప్రజలు ముద్రవేసిన ఎంతోమంది సుంకరులు, పరిసయ్యులు కూడా హాజరయ్యారు. యేసుప్రభువు ఎంతో ఆనందంగా వారందరితో కలిసి విందారగించడం యూదుమత ప్రముఖులైన పరిసయ్యులకు నచ్చలేదు. ‘మీ బోధకుడు సుంకరులతో, పాపులతో కలిసి భోజనం ఎందుకు చేస్తున్నాడు’ అని పరిసయ్యులు ఆయన శిష్యులను ప్రశ్నించారు. పరిసయ్యులు తమకు తాము చాలా నీతిమంతులమని భావిస్తారు. యూదు మత సంబంధమైన దాదాపు 615 నియమాలను ఎంతో నిష్టగా పాటిస్తారు. అవి పాటించని యూదులు, అన్యులతో కలిసి భోజనం చేయకూడదన్నది వాటిలో ఒకటి. అందువల్ల ఆ విందులో పరిసయ్యుల కోసం ఏర్పాట్లు ప్రత్యేకంగా చేసి ఉంటారు కానీ తమతో కలిసి భోంచేస్తాడనుకున్న యేసుప్రభువు సుంకరులతో కలిసి వారి విభాగంలో కూర్చోవడంతో వాళ్ళు ఈ వివాదానికి తెర లేపారు. ‘వైద్యుని అవసరం రోగులకే గాని ఆరోగ్యవంతులకు కాదుకదా. నేను నీతిమంతులను కాదు, పాపులనే పిలవవచ్చాను. బలిని కాదు, కనికరాన్నే కోరుతున్నాను. ఆ వాక్యభావమేమిటో ముందు నేర్చుకోండి’ అంటూ ఒక్కమాటతో ప్రభువు వారి నోళ్లు మూసివేశాడు (మత్త 9:9–13).నిజానికి ఆ రాత్రి విందులో సుంకరులను చూసీ చూడగానే ‘మీరెప్పుడు మారుతారు?’ అని ప్రభువు వారిని నిలదీస్తూ ప్రశ్నించాలి. అక్కడికక్కడే ఎడాపెడా ‘మారుమనస్సు’ అనే అంశంపై ప్రసంగం చేసి వారినందరిని గద్దించాలి. నిజానికి తన శిష్యుడిగా చేర్చుకున్న మత్తయికే ప్రభువు ఆ ప్రశ్న వెయ్యలేదు. అది ఎవరో తనను అతిథిగా ఆహ్వానించిన ఒక విందు స్థలం. అందువల్ల అక్కడి వాతావరణాన్ని పాడుచెయ్యకుండా, విందు సాంప్రదాయాన్ని గౌరవించి తన పద్ధతి చొప్పున ఆయన అందరితో కలిసిపోయాడు. అదే ఆయన సంస్కారం, గొప్పదనం. అందరినీ తిట్టి దూరం పెట్టగలిగిన స్థాయి తనకున్నా వాళ్ళందరినీ అక్కున చేర్చుకున్న ఎంతో విశాల హృదయమున్న గొప్ప రక్షకుడాయన. అయితే కొన్ని నియమాలను నిష్టగా పాటిస్తున్నారన్న మాటే గాని దేవుని హృదయాన్ని ఏమాత్రం ఎరుగని పరిసయ్యులు మాత్రం యేసుప్రభువు పాపులతో ప్రభువు కలవడమేమిటన్న వివాదాన్ని విందులో లేపి తమ కుసంస్కారాన్ని చాటుకున్నారు. ఈనాడు విశ్వాసులది కూడా అదే పద్ధతి. చర్చిల్లో తమకన్నా ఆత్మీయంగా తక్కువ స్థాయి గలవారొస్తే వారితో కలవరు, మాట్లాడరు సరికదా సూటిపోటిమాటలంటారు. చర్చిలు పాపుల వైద్యశాలలుగా ఉండాలని ప్రభువు నిర్దేశిస్తే, ‘నీతిమంతుల’ విశ్రామ స్థలాలు, సోషల్ క్లబ్బులుగా మారాయి. పాపిగా ముద్రపడ్డ వ్యక్తి చర్చికి పరుగెత్తుకెళ్లి అక్కడి విశ్వాసుల ప్రేమతో తడిసి పరివర్తన చెంది సమాజామోదం పొందే పరిస్థితి లేదు సరికదా, చర్చి దరిదాపుల్లోకి కూడా వెళ్లలేని పరిస్థితిని ఈనాటి పరిసయ్యుల్లాంటి విశ్వాసులు కల్పించారు. ఇదే ఈనాటి అతి పెద్ద విషాదం. ప్రభువు హృదయాన్ని తెలుసుకోకుండా ప్రభువు అనుచరులమని చెప్పుకునే ‘నకిలీ క్రైస్తవం’ బాగా ప్రబలుతోంది. చర్చిల్లో దేవుని మాటలు వినబడతాయి, కానీ దేవుని హృదయం, ఆయన ప్రేమ, కనికరం మాత్రం కనిపించడం లేదు. పాటలు, ప్రసంగాలు, ప్రార్థన చేసే కొద్ది సమయం వదిలేస్తే మిగతా సమయమంతా ‘గెట్ టుగెదర్’లు, సోషల్ క్లబ్బుల కార్యకలాపాలే! అన్యులతో కాదు కదా, కనీసం ఇతర చర్చిలవారితో కూడా చాలామంది విశ్వాసులు కలవరు, ఇతరులను తమతో కలవనివ్వరు. ఇలా తమను తాము గొప్పగా, ఎంతో ప్రత్యేకమైన వారుగా భావించుకునే సంçస్కృతిని యేసుప్రభువు ఏవగించుకుంటాడు, అలాంటి జీవనశైలికి తన ఆమోదాన్ని అసలే ఇవ్వడు. అపురూపం స్వర్ణముఖి శిల పంచాయతన పూజలో కీలకంగా ఉపయోగించే స్వర్ణముఖి శిల చాలా అరుదైన వస్తువు. దక్షిణభారత దేశంలో చిత్తూరు జిల్లా మీదుగా ప్రవహించే స్వర్ణముఖి నది ఒడ్డున స్వర్ణముఖి శిలలు అక్కడక్కడా దొరుకుతాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా తలచే స్వర్ణముఖి శిలకు బంగారాన్ని ఆకర్షించే శక్తి ఉందని నమ్ముతారు. ముఖ్యంగా అక్షయతృతీయ నాడు స్వర్ణముఖి శిలను శాస్త్రోక్తంగా పూజించిన ఇంట సంపద దినదిన ప్రవర్ధమానంగా వృద్ధిచెందుతుందని పురాణాలు చెబుతున్నాయి. స్వర్ణముఖి శిలలు మామూలు రాళ్లమాదిరిగానే ఉన్నా, వాటిలో బంగారు వెండి కలగలసిన ఛాయ కనిపిస్తుంది. స్వర్ణముఖి శిలను ఇళ్లలోను, కార్యాలయాల్లోను, వ్యాపార ప్రదేశాల్లోనూ ఎక్కడైనా సరే, పూజమందిరం ఏర్పాటు చేసిన చోట ఉంచి పూజించుకోవచ్చు. స్వర్ణముఖి శిలకు నిత్య ధూపదీప నైవేద్యాలు సమర్పించే చోట సంతోషానికి, సంపదకు లోటు ఉండదు. స్వర్ణముఖి శిలను ఏదైనా సుముహూర్తంలో తీసుకువచ్చి, పూజమందిరంలో పసుపు వస్త్రంపై ఉంచి ధూప దీప నైవేద్యాలను సమర్పించి, పూజించాలి. దీనిని పూజించడం వల్ల ఆర్థిక పరిస్థితి వేగంగా మెరుగుపడుతుంది. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. అనాయాసంగా కార్యసిద్ధి కలుగుతుంది. – పన్యాల జగన్నాథదాసు -
అడ్మినిస్ట్రేషన్ స్కిల్ (పాలనా నైపుణ్యం) మీలో ఉందా?
అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నారా? వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొం టున్నారా? కంపెనీ లాభాల బాటలో నడవటానికి పరిపాలనా విభాగం సరిగా ఉండాలి. అడ్మినిస్ట్రేషన్ స్కిల్ ఉన్నవారు క్లిష్టమైన సమస్యలు పరిష్కరించటంతో పాటు, ఉద్యోగులందరిలో పాజిటివ్ ఆటిట్యూడ్‌ను కలిగిస్తారు. సమన్వయంతో ఉంటూ, ఉద్యోగస్తులందరిలో స్ఫూర్తిని నింపుతారు. ఆపదలో కంపెనీకి అండగా నిలుస్తారు. అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలియక మీరు ఇబ్బంది పడుతున్నారా? వృత్తిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? లేక గుడ్ అడ్మినిస్ట్రేటర్‌గా పేరు తెచ్చుకుంటున్నారా? పరిపాలనా నైపుణ్యం మీలో ఎలా ఉందో తెలుసుకోండి. 1. మీ దగ్గరకొచ్చేవారి పేర్లను బాగా గుర్తుంచుకుంటారు. వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ప్రవర్తిస్తారు. (సిగరెట్ తాగటం, చూయింగ్ గమ్ నమలటం, మాటలకు అడ్డురావటం లాంటివి చేయరు). ఎ. కాదు బి. అవును 2. సమయపాలనను అనుసరిస్తారు. ఇలానే ఉద్యోగులందరూ ఉండాలని సూచిస్తారు. ప్రొఫెషనల్‌గా డ్రెస్ చేసుకుంటారు. ఉద్యోగు లందరితో స్నేహభావంతో ఉంటారు. ఎ. కాదు బి. అవును 3. వృత్తిలో జాగరూకతతో ఉంటారు. ఎటువంటి తప్పులకు తావివ్వరు. పాలనా పరమైన అంశాలను సమర్థంగా నిర్వహిస్తారు. ఎ. కాదు బి. అవును 4. వినయంగా ఉంటారు. ఆచితూచి మాట్లాడతారు. సమయస్ఫూర్తితో మెలుగుతారు. ఎ. కాదు బి. అవును 5. వ్యక్తిగత సమస్యలను ఆఫీసు దాకా తీసుకు రారు. ఎప్పుడూ నవ్వుతూ, ప్రశాంతంగా ఉంటారు. ఎ. కాదు బి. అవును 6. వృత్తిలో పారదర్శకత చూపిస్తారు. తోటివారి సలహాలు సూచనలు అవలంబిస్తారు. వారిని కించపరచరు. క్లిష్ట సమయంలో ధైర్యంగా నిర్ణయం తీసుకోగలరు. ఎ. కాదు బి. అవును 7. ప్రతిమాటని ఆలోచించి మాట్లాడతారు. మీపై గౌరవం పెరగటానికి ఇది చాలా ముఖ్యమని మీకు తెలుసు. ఇదేవిధంగా మీటింగ్‌లలో మాట్లాడతారు. ఎ. కాదు బి. అవును 8. ఓపిక, దయ, జాలి, క్షమల ద్వారా సహనాన్ని పొందుతారు. ఈ విధంగా అడ్మినిస్ట్రేష¯Œ ని సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఎ. కాదు బి. అవును 9. పనిచేస్తున్న సంస్థ పట్ల చాలా విశ్వాసంగా, నిజాయితీగా ఉంటారు. అవిశ్వాసం మీ కెరియర్ని మెరుగుపరచదని మీరు గ్రహిస్తారు. ఎ. కాదు బి. అవును 10. వృత్తిని ఇష్టంగా చేస్తారు. చాలా రెస్పాన్సిబుల్‌గా ఉంటారు. సెన్సాఫ్ హ్యూమర్ మీలో ఉంది. మిమ్మల్ని మీరు నియంత్రించుకోగలరు. ఎ. కాదు బి. అవును ‘బి’ సమాధానాలు ఏడు దాటితే మీలో పాలనా నైపుణ్యం పూర్తిస్థాయిలో ఉంటుంది. మీలో ఉన్న ఈ ప్రత్యేక లక్షణం వల్ల ఎక్కడకు వెళ్లినా పేరు తెచ్చుకుంటుంటారు. మేనేజ్మెంట్ దృష్టిలో గుర్తింపు పొందుతారు. సాటి ఉద్యోగుల దగ్గర మన్ననలు పొందుతారు. ఈ ఆటిట్యూడ్ మీ కుటుంబాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి, ఆర్థికంగా బలపరచటానికి కూడ ఉపయోగపడుతుంది. ‘ఎ’ లు ఆరు దాటితే మీకు అడ్మినిస్ట్రేషన్ స్కిల్ లేదనే చెప్పాలి. ఇతరులమీద ఆధార పడటమే కాని స్వతంత్రంగా వ్యవహరించటం మీకు తెలియదు. ‘బి’ లను సూచనలుగా భావించి పాలనా నైపుణ్యం ఎలా పొందవచ్చో తెలుసుకోండి. -
మీ జీవితాశయం ఏమిటో మీకు తెలుసా?
బతకడానికి మీరేం చేస్తుంటారు? అన్న ప్రశ్నకు జవాబిస్తాం. కాని దేనికోసం మీరు బతుకుతున్నారు? అనే ప్రశ్నను మాత్రం దాటవేస్తాం. డబ్బు, పేరు, అధికారం కోసమే బతికే వాళ్ళున్నా ఆ మాట ఒప్పుకొనే నిజాయితీ వారికుండకపోవచ్చు. జాలరిగా వృత్తిలో ఎంతో ప్రావీణ్యమున్న పేతురు యేసును ఎరుగక ముందు గలిలయ సరస్సులో ఒక రాత్రంతా శ్రమించినా ఒక్క చేప కూడా పట్టలేకపోయాడు. పేతురుకు అది ఘోర వైఫల్యం, అవమానం కూడా. అలా కుమిలిపోతున్న పేతురును మరునాడు ఉదయమే యేసు కలుసుకొని, దోనెలో అతనితో పాటు సరస్సు లోతుల్లోకి వెళ్ళాడు. అక్కడ యేసు మాట మేరకు పేతురు మళ్ళీ వలలు వేస్తే ఈ సారి విస్తారంగా చేపలు దొరికాయి. ’నేను చేపలు పట్టలేని అసమర్ధుణ్ణి ప్రభువా !!’ అని అంతకు మునుపు వాపోయిన పేతురు (లూకా 5:5), యేసు మహాత్మ్యాన్ని కళ్లారా చూసిన తర్వాత ఇపుడు ’నేను పాపాత్ముడను ప్రభువా !!’ (8:8) అంటూ సాగిలపడ్డాడు. మనుషుల కోసం చేపలు పట్టడం కాదు, ఇకనుండి నాకోసం మనుషులనే పట్టమంటూ యేసుప్రభువు అతనికి మేలుకొల్పునిస్తే, పేతురు, అతని పాలివారైన యాకోబు, యోహాను అన్నీ అక్కడికక్కడే వదిలేసి యేసును వెంబడించారు. చేపలు పట్టి జీవిస్తున్నామని చెప్పుకునే స్థాయి నుండి, యేసుప్రేమను ప్రకటించడానికి జీవిస్తున్నామని సగర్వంగా చెప్పుకునే అత్యున్నతమైన ఆత్మీయ స్థాయికి వారు ఎదిగారు. మేధావులమైనా, ఎంతటి ఉన్నత స్థితిలో ఉన్నా, చాలా మంచివారమని లోకం ఎంతగా పొగిడినా, మనం పాపులమేనని బైబిల్ చెబుతోంది (రోమా 3:23). ఇది చాలామందికి రుచించని విషయం. బంగారాన్ని నగ రూపంలో మెడలో వేసుకున్నప్పుడు దానికున్న సౌందర్యం, గనుల్లో ముడిసరుకుగా ఉన్నపుడు బంగారానికుండదు. నిజానికపుడది వికారంగా ఉంటుంది. అయితే ముడిసరుకుగా ఉన్నా, మెడలో నగగా మెరిసినా బంగారం విలువ మాత్రం ఏ మాత్రం తగ్గదు. పాపియైనంత మాత్రాన అతనిపట్ల దేవుని ప్రేమ కూడా అణుమాత్రమైనా తగ్గదు సరికదా, ఒక పరమ కంసాలి లాగా దేవుడు పాపిని ప్రేమతో తన చేతుల్లోకి తీసుకొని, ప్రక్షాళన చేసి, ఆత్మీయ వన్నెతో కూడిన ఒక దివ్యరూపాన్నిచ్చి దిశానిర్దేశం చేసేందుకు పాపి కోసం ఆయన నిరంతరం తపిస్తాడని బైబిల్ చెబుతోంది (యెషయా 30:18). మన జీవనోపాధి ఏమిటి? అన్నది లోకానికి ముఖ్యం, కాని మన జీవితాశయం ఏమిటి? అన్నది దేవుని దృష్టిలో అత్యంతవిలువైన అంశం. శక్తి నిండిన జీవితాన్నంతా జీతం కోసం ఎవరికో ధారపోసి, రిటైరయ్యి, రోగాల పుట్టగా మారి, బతుకు మీద ఆశలుడిగిపోతున్నపుడు, చేవ చచ్చి కేవలం ఇక ‘చావు ఘడియ’ కోసం దీనంగా ఎదురుచూసే పరిస్థితి తన పిల్లల జీవితాల్లో ఎన్నటికీ ఉండకూడదన్నదే దేవుని అభీష్టం. జీవితాన్ని చేజార్చుకొని బాధపడుతూ కేవలం చావడానికి బతికే బదులు, ‘నాకున్న ఈ ఒక్క రోజైనా దేవుని కోసం బతుకుతాను. ఒక నిరాశ్రయుడు లేదా నిర్భాగ్యుని ఆదుకొని, అతని మొహాన దేవుని పేరిట చిరునవ్వు వెలిగించి, ఒక సదాశయాన్ని నెరవేర్చుకున్న సంతృప్తితో సగర్వంగా చనిపోతాను’ అని ఎవరన్నా తీర్మానించుకుంటే దేవుడే ఎక్కువగా సంతోషిస్తాడు, తన పరలోక ద్వారాలు తెరిచి మీకు నిత్యత్వమనే వెలలేని బహుమానమిస్తాడు. ఒకసారి కారులో ఊరికెళ్తున్న ఒక జంటకు దారిలో తమ చిన్నపాప కోసం పాలు అవసరమైతే అక్కడి ఒక ఫైవ్ స్టార్ట్ హోటల్లో 500 రూపాయలు తీసుకొని ఒక చిన్న సీసాలో పాలు అమ్మారట. కాసేపయ్యాక మధ్య దారిలో పాపకు మళ్ళీ పాలు అవసరమై అక్కడున్న చిన్న గుడిసెలాంటి హోటల్ లోని ఒక పేద ముసలాయన్నడిగితే, సీసానిండా పాలు నింపి ఇచ్చాడు. అతనికి వంద రూపాయలివ్వబోతే, నేను పేదవాణ్ణే కాని ఒక పసిపాప కడుపు నింపి పైసలు సంపాదించే దౌర్భాగ్యం నాకు లేదమ్మా! పాపకు దారిలో మళ్ళీ పాలు అవసరమవుతాయేమో, ఇదిగో మరో సీసా పాలు కూడా తీసుకెళ్లండి, అన్నాడట ఆ పేద వృద్ధుడు. ప్రతి వ్యక్తినీ దేవుడు మరొక వ్యక్తికి ఆసరాగా ఉండాలనే సృష్టించాడు. అదే ఆయన సృష్టి ధర్మం. కాని దైవ నిర్దేశిత విలువలకు పాడె కడుతున్నాం. అదీ మన దౌర్భాగ్యం!! – రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
అమ్మాయిలూ.. చలో
ప్రయాణాలు ఎదుగుదలకు తోడ్పతాయి. కెరియర్లోనే కాదు, మనిషిగా కూడా ఎదుగుతాం! ఎదిగాక చేయవలసిన ప్రయాణాలు కొన్ని ఉంటాయి. అవి ఎంతో ఆసక్తికరంగా సాగుతాయి. ఆహ్లాదం కలిగిస్తాయి. ఆదర్శవంతంగా ఉంటాయి.పెద్దపెద్ద హోదాల్లోని మహిళలు కొందరుఎప్పుడూ ప్రొఫెషనల్ ట్రిప్పుల్లో ఉంటారు. వాళ్ల ట్రిప్ స్టెయిల్లో మనకు పనికొచ్చే టిప్స్ ఇవి. ఫర్జానా హక్ (ముంబై) హెడ్, యూరప్ టెలికామ్ బిజినెస్ యూనిట్గ్లోబల్ హెడ్, స్ట్రాటెజిక్ గ్రూప్ అకౌంట్స్, టి.సి.ఎస్.టాటా గ్రూప్‌లో ట్రైనీగా చేరి, ఉన్నతస్థాయికి ఎదిగిన ఫర్జానా ఏడాదికి 180 నుంచి 200 రోజులు ప్రయాణాల్లోనే ఉంటారు. ఎక్కువగా ఐరోపా దేశాలకు ప్రొఫెషనల్ ట్రిప్ కొట్టి వస్తారు. ప్రయాణ సమయంలో పుస్తకాలు చదవడం ఇష్టం. పుస్తకాల్లో ముఖ్యమైన పాయింట్స్ ఉంటే ఫ్లయిట్లోనే నోట్ చేసుకుంటారు. ఫర్జానా దగ్గర తాతగారు కానుకగా ఇచ్చిన ఇంకు పెన్ను ఉంది. ఇప్పటికీ ఆ పెన్ను వాడుతున్నారు.అమ్మాయిలకిచ్చే సలహా : జర్నీని ఎంజాయ్ చెయ్యండి. ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి మీ లైఫ్‌లో ప్రాధాన్యం ఇవ్వండి. అవనీ బియానీ (ముంబై) కాన్సెప్ట్ హెడ్, ఫుడ్‌హాల్ ఈ రిటైల్ ఫుడ్ చెయిన్... అసలు బియానీ ఐడియాల వల్లే నడుస్తోంది. నెలలో కొన్నిరోజులైనా ఈమె బిజినెస్ ట్రిప్ ఉంటారు. ముఖ్యంగా లండన్, న్యూయార్క్, స్విట్జర్లాండ్లలో పనులు చక్కబెట్టుకొస్తుంటారు. బీచ్ లవర్. స్కీయింగ్ ఇష్టం. తెల్లవారక ముందే బయల్దేరే విమానాల ప్రయాణం బియానీకి అస్సలు ఇష్టం ఉండదు. కొన్ని మనుషులు, కొత్త ప్రదేశాలు ఆమె నిరంతర ఉల్లాస రహస్యం. ఐప్యాడ్ లేకుండా బియానీ అడుగు బయటపెట్టరు. అమ్మాయిలకిచ్చే సలహా : కొత్త రుచులకోసమైనా ప్రయాణాలు చేసి తీరవలసిందే. ప్రియా పాల్ (కోల్‌కతా) చైర్ పర్సన్, ది పార్క్ హోటల్స్నెలలో కనీసం 10 నుంచి 12 రోజులో విమానాల్లో చక్కర్లు కొడుతుంటారు! నవీ ముంబై, బెంగళూరు, చెన్నై, గోవా, హైదరాబాద్, ప్యారిస్, లండన్లలో ఆమెకు పని ఉంటుంది. ఎక్కువగా న్యూయార్క్ వెళుతుంటారు. అక్కడి ‘నోమాడ్’ లో దిగుతారు. ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడ మళ్లీ వెహికిల్స్ ఎక్కకుండా.. వీలైనంత వరకు బ్రేక్‌ఫాస్ట్‌కీ, లంచ్‌కీ, డిన్నర్‌కి, ఇంకా.. సైట్ సీయింగ్‌లకు నడిచే వెళ్లమని ఆమె సలహా ఇస్తారు.అమ్మాయిలకిచ్చే సలహా : మీరు ఉన్న చోటి నుంచి కొత్తగా ఎక్కడికైనా సరే నాలుగు అడుగులు వేసి రండి. గుంజన్ సోనీ (బెంగళూరు) హెడ్, జబాంగ్ అండ్ సీఎంవో, మింత్రాఫ్యాషన్ పోర్టల్ హెడ్డుగా ఏడాదికి 200 రోజులు బిజినెస్ ట్రిప్పులోనే ఉంటారు. ఢిల్లీ, హాంకాంగ్, సింగపూర్, లండన్, యు.ఎస్. ఆమె తరచూ వెళ్లే ప్రదేశాలు. మీటింగ్ ఉన్న దేశంలో లేదా సిటీలో ఇరవై నాలుగు గంటల ముందే సోనీ సిద్ధంగా ఉంటారు. ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకు గుర్తుపెట్టుకుని మరీ గిఫ్టులు కొంటారు.అమ్మాయిలకిచ్చే సలహా : తప్పనిసరిగా ప్రయాణాలు చెయ్యాలి. అందువల్ల మన ప్రపంచం విస్తృతమౌతుంది. విష్పలరెడ్డి (న్యూఢిల్లీ) చీఫ్ పీపుల్స్ ఆఫీసర్, ఊబర్ ఇండియా అండ్ సౌత్ ఏషియాఎక్కువగా హైదరాబాద్, బెంగళూరు, శాన్ఫ్రాన్సిస్కోలకు ట్రావెల్ చేస్తుంటారు. కొండప్రాంతపు బీచ్‌లను ఇష్టపడతారు. వెళ్లిన చోట పని పూర్తి కాగానే తప్పనిసరిగా అక్కడి ఫ్రెండ్స్‌ని కలుస్తారు. లండన్ వెళ్లినప్పుడు బకింగ్‌హామ్ ప్యాలెస్ సమీపంలోని గోరింగ్ హోటల్లో స్టే చేస్తారు. ఒంటరిగా ప్రయాణం చేయడం ఇష్టం. ఏకాంతం లభిస్తుందట. అమ్మాయిలకిచ్చే సలహా : ఒంటరిగా ప్రయాణించడంలోని స్వేచ్ఛను అనుభూతి చెందండి. అవనీ దావ్దా (ముంబై) మేనేజింగ్ డైరెక్టర్, గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్ఏడాదిలో 40 రోజులు టూర్లోనే ఉంటారు. బెంగళూరు, పుణె, ఢిల్లీ, దుబాయ్, ఆస్ట్రేలియా, ఐరోపా దేశాలకు తిరుగుతుంటారు. ఆహార ఉత్పత్తులను విక్రయిస్తుండే కంపెనీకి ఎం.డీ. అయిన దావ్దాకు లండన్ వెళ్లినప్పుడు సెయింట్ జేమ్స్ కోర్ట్‌లో లంచ్గానీ, డిన్నర్ గానీ చేయడం ఇష్టం. మాయిశ్చరైజర్, సౌకర్యవంతంగా ఉండే కాలిజోళ్లను దగ్గర ఉంచుకోవడం మర్చిపోరు. టూర్లో రూమ్ సర్వీస్‌ని అస్సలు ఉపయోగించుకోరు. బయటికి వెళ్లే తిని వస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : ప్రయాణాలు మీ జీవితానికి సహజసిద్ధమైన పౌష్టికాహారాన్ని అందిస్తాయి. అపూర్వ పురోహిత్ (ముంబై) ప్రెసిడెంట్, జాగరణ్ ప్రకాశన్ లిమిటెడ్మీడియా పరిశ్రమలో మూడు దశాబ్దాల అనుభవం ఉన్న అపూర్వ ప్రింట్, రేడియో, డిజిటల్ కంటెంట్ కోసం గత ఐదేళ్లలో దాదాపుగా ప్రతి వారం విదేశీయానంలోనే ఉన్నారు! యు.కె. సింగపూర్, హాంకాంగ్, న్యూఢిల్లీ బెంగళూరు.. ప్రధానంగా ఆమె ప్రయాణ ప్రదేశాలు. ఎప్పుడూ తను వాడే షాంపూ, కండిషన్ కూడా ఆమె బ్యాగ్‌లో ఉంటాయి. అమ్మాయిలకిచ్చే సలహా : కెరీర్, కుటుంబం.. ఈ రెండింటి లోనూ సక్సెస్ సాధించాలి. రాధా కపూర్ (ముంబై) ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఐ.ఎస్.డి.ఐ.ఐ.ఎస్.డి.ఐ. అంటే ఇండియన్ స్కూల్ ఆఫ్ డిజైన్ అండ్ ఇన్నోవేషన్. ఇక చెప్పేదేముందీ డిజైనింగ్ ఒక సృజనాత్మక అన్వేషణ. ప్రపంచమంతా తిరుగుతారు రాధ. ముఖ్యంగా ప్యారిస్, న్యూయార్క్ మీటింగులకు. ఫ్లయిట్ దిగాక పనుల్లో బిజీ అయిపోతారు కానీ, ఫ్లయిట్లో ఉన్నప్పుడు ఏమీ తినరు. ఫ్లయిట్ దిగాక పనులు అయ్యాక కానీ తన సొంత పనులు చూసుకోరు. యోగాకి మాత్రం టైమ్ అడ్జెస్ట్ చేసుకుంటారు. అమ్మాయిలకిచ్చే సలహా : ఎక్కువ తినకండి. స్లిమ్‌గా ఉండండి. ప్రయాణాలు చేస్తూ ఉండండి. ఉపాసన టాకు (న్యూఢిల్లీ) కో–ఫౌండర్, మొబీక్విక్ ఈ మొబైల్ పేమెంట్ కంపెనీ సారథి నెలలో కనీసం రెండుసార్లు జర్నీ చేస్తారు. కొన్నిసార్లు తన రెండేళ్ల బిడ్డను కూడా వెంట తీసుకెళతారు. తరచూ సింగపూర్, యు.కె., యు.ఎస్. వెళ్లొస్తుంటారు. ఆమె హ్యాండ్‌బ్యాగ్‌లో ఏ సమయంలోనైనా దువ్వెన, చార్జర్, ఎలర్జీ మందులు ఉంటాయి. వెళ్లిన చోట వీలుని బట్టి స్నార్కెలింగ్, హైకింగ్, సైక్లింగ్ చేస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : మీ సంపాదనలో కొంత భాగాన్ని తప్పనిసరిగా టూర్ల కోసం తీసిపెట్టుకోండి. డాక్టర్ హర్ష బిజ్లానీ (ముంబై) మెడికల్ హెడ్, ది ఏజ్‌లెస్ క్లినిక్ అండ్ సెలబ్రిటీ స్కిన్ ఎక్స్పర్ట్ప్రయాణాలు చేయడమే కాదు, ప్రయాణించి వచ్చిన వారికి స్కిన్ మళ్లీ ‘గ్లో’అవడానికి సలహాలు ఇస్తుంటారు. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు తరచూ నీళ్లు తాగుతుండాలని, క్రమం తప్పకుండా తినాలని చెబుతారు. లాస్ ఏంజిల్స్, లండన్, న్యూయార్క్, సింగపూర్.. ఇలా అనేక దేశాల్లో కాన్ఫరెన్స్‌లకు వెళ్లొస్తుంటారు బిజ్లానీ. ఏడాదిలో 30 నుంచి 45 రోజులు ఆమెకు టూర్లు ఉంటాయి. వెళ్లినచోట కొత్త కొత్త రెస్టారెంట్లను కనిపెట్టడం, జిమ్‌కు వెళ్లడం ఆమె అలవాటు. అమ్మాయిలకిచ్చే సలహా : నిరంతరం ప్రయాణిస్తూ ఉండండి. ప్రపంచాన్ని శోధించండి. తెలుసుకునే ఆసక్తి ఉంటే తెలియని వాటి గురించి భయమే ఉండదు.ఇన్పుట్స్: సిఎన్ ట్రావెలర్ రాధికా ఘాయ్ (న్యూఢిల్లీ) కో–ఫౌండర్, చీఫ్ బిజినెస్ స్టాఫ్, షాప్‌క్లూస్.కామ్ ఏడాదికి 120 రోజులు ప్రయాణాల్లోనే ఉంటారు. ఈ వ్యవధిలో ఆకాశంలో ఆమె ప్రయాణించే దూరం 6 లక్షల 70 వేల మైళ్లు. సింగపూర్ ఆమెకు ఇష్టమైన డెస్టినేషన్. వెస్టిన్‌లో ఓ కప్పు కాఫీ తాగి, మీటింగ్స్‌ని ముగించుకుని మెరీనా బే శాండ్స్‌లో షాపింగ్ చేసి, డెంప్సీహిల్లోని ఏ రెస్టారెంట్‌లోనైనా లంచ్, డిన్నర్ చేయడం.. సింగపూర్‌లో ఆమెకు ప్రియమైన వ్యాపకాలు. పెద్దగా లగేజ్ తీసుకెళ్లరు. ఓ చిన్న సూట్‌కేస్‌లో అన్నీ సర్దేసుకుంటారు. స్నీకర్స్ (తేలికపాటి షూజ్) తప్పనిసరి. విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు పుస్తకం చదువుతూ, కునుకుతీస్తారు. అమ్మాయిలకిచ్చే సలహా : విహరించండి, విందులు ఆరగించండి. -
పొలం పొమ్మంది.. ఇల్లు రమ్మంది
ఒక తరం పోయి మరో తరం వస్తుంది.. ఒక పాత కనుమరుగై... మరో కొత్తకు నాంది అవుతుందిమార్పు సంస్కృతిలో భాగం... మారి తీరాల్సిందే... మార్పును స్వాగతించాల్సిందే.నాగలి పోయి ట్రాక్టర్ వచ్చింది...రోకలి పోయి మిక్సీ వచ్చింది. వాకర్ వచ్చింది... మూడు చక్రాల బండిని పక్కకు తోసేసింది.పొలం... ‘నీకిక్కడ ఇంకేం పనుంది’ అన్నది... పట్టణాల్లో ఇళ్లు ‘పని చేద్దువురా’ అని పిలిచాయి.వడ్రంగి ఊరిని వెనక్కి తిరిగి తిరిగి చూస్తూ... సిటీలో అడుగుపెట్టాడు.సమాజంలో వచ్చిన మార్పుకు... ప్రత్యక్ష సాక్షి అయ్యాడు. ‘‘మా నాన్న పేరు సాంబాచారి. ఆయన ఊరందరికీ చుట్టమే. మా ఇంటికి పని కోసం వచ్చినవాళ్లను, పని కోసం ఇంటికి పిలిపించుకునే వాళ్లను ఎవరినైనా సరే ‘మామా, చిన్నాన్నా’ అని వరుస పెట్టి పిలిచేవాడు. చేతిలో పనితోపాటు మాట మంచితనంతోనే మా ముగ్గురు అక్కలు, ముగ్గురు చెల్లెళ్ల పెళ్లిళ్లు చేశాడాయన. మార్పు నా కళ్ల ముందే! నేను మా నాన్న చేతికింద పన్నెండేళ్లు పని చేశాను. సొంతంగా పని చేయడం మొదలు పెట్టి ముప్పై ఏళ్లు దాటిపోయింది. ఇన్నేళ్లలో నేను పెద్ద మార్పునే చూశాను. మా ఉలి, బాడిశె, కలప కోసే రంపం, తోపుడు రంపం వంటి వస్తువులు అలాగే ఉన్నాయి. కానీ వాటితో మేము తయారు చేసే వస్తువులు మారిపోయాయి. ఒకప్పుడు మా పనంతా వ్యవసాయం ప్రధానంగా ఉండేది. వ్యవసాయానికి వాడే పనిముట్లంటే... నాగలి, ఎడ్లబండి, ఏతం తొక్కడానికి ఏతం మాను, కపిల బావి నీరు తోడడానికి గిలక, గింజలు నాటడానికి జడ్డిగం గొర్రు, పళ్లమాను, గెడ్లమాను, మాను అడ్డ, గుంటక అడ్డ, కర్రల మాను, కాడి, కొడవలి ముఖ్యంగా ఉండేవి. ఇక ఇంట్లో రోజువారీ వాడకంలో... నులకమంచం, మడతమంచం, మడత కుర్చీ, బల్ల, కుర్చీ, పిల్లలకు ఊయల, చక్రాలబండి, గిలక్కాయలు ఉండేవి. వంటగదికోసం వాడే రోకలి, కత్తిపీట, పప్పుగుత్తి, తెడ్డు, కవ్వం, పీటలు, తిరగలి పిడి, రుబ్బురోలు పిడి వంటివన్నీ వడ్రంగి చేయాల్సినవే. ఇప్పుడు వంటగది మా కోసం చూసేది ఒక్క పప్పుగుత్తి కోసమే. మిగిలిన అన్నింటికీ ప్రత్యామ్నాయాలు వచ్చేశాయి. ఇంటి నిర్మాణంలో అయితే పునాది వేసిన తరవాత మొదట ద్వారబంధాలు నిలబెట్టేవాళ్లు. ఇంటి తలుపులు, దంతులు, కిటికీలు, అల్మరాలు వడ్రంగి చేతి నుంచే రావాలి. మా నాన్న దగ్గర నేను అవన్నీ నేర్చుకున్నాను.అప్పట్లో దీపావళి వరకు వ్యవసాయ పనులుంటే ఆ తర్వాత వరికోతల వరకు పని ఉండేది కాదు. శీతాకాలం, ఎండాకాలాల్లో కొట్టాలు వేసేవాళ్లు. ఇప్పుడు తాటాకు కొట్టాల్లేవు. అన్నీ రేకుల కొట్టాలే. వాటిలో మా పని పెద్దగా ఉండదు. పెంకుటిళ్లు కూడా లేవు. అన్నీ స్లాబ్ ఇళ్లే. అన్నింట్లోనూ కొత్తదనం వచ్చి పాతదనం కొట్టుకుపోయినట్లే ఇది కూడా. చిన్న కుటుంబాలూ కారణమే! ఇప్పుడు ఇళ్లు కట్టడం బాగా ఎక్కువైంది. అప్పట్లో ఉన్నట్లు ఉమ్మడి కుటుంబాల్లేవిప్పుడు. ఇంటికి ఇద్దరున్నా సరే ప్రతి ఇంటికీ ఒక డైనింగ్ టేబుల్, సోఫాసెట్ తప్పనిసరిగా ఉంటున్నాయి. డ్రెస్సింగ్ మిర్రర్లు, కార్నర్ స్టాండ్, చెక్క బీరువా, టీపాయ్, దివాన్ సెట్ వంటివి చాలా మంది వాడుతున్నారు. గ్రామంలో మేము చేసే పనులు తగ్గినప్పుడు ఊరినే నమ్ముకుంటే గడవడం కష్టమే. అందుకే వడ్రంగులం పట్టణాల బాట పట్టాం. ఫర్నిచర్ షాప్‌లతో కలిసి పని చేస్తున్నాం. వాళ్లయితే రోజూ పని చూపిస్తారు. పీస్ లెక్కన పేమెంట్ ఇస్తారు. మేము సొంతంగా పని చేసుకోలేకపోతున్నాం... అనే మాట నిజమే. కానీ ఇప్పుడు మాకు నెలకింత డబ్బు వస్తుందనే భరోసా ఉంటోంది. నిజానికి అప్పట్లో కంటే ఇప్పుడే మాకు పని పెరిగింది. అందరూ ఇళ్లను బాగా అందంగా కట్టుకుంటున్నారు. సిమెంట్ పనికి ఉన్నంత విలువ మా కొయ్యపనికి కూడా ఉంటోంది. మార్పు మంచిదే! అప్పట్లో మా పని ఎక్కువగా రైతుల కోసమే ఉండేది. మాకు ఆత్మీయులూ వాళ్లే. ఇప్పుడు మాకు పని చూపించేది యజమాని, ఆ యజమానితోపాటు యజమాని దగ్గర పని చేసే మా లాంటి మరికొందరు కార్పెంటర్లతోనే స్నేహమైనా, ఆత్మీయత అయినా. మా వృత్తిలో ఎప్పుడూ మాట మెత్తగా ఉండాలి. కస్టమర్లు వాళ్లకు ఏం కావాలో చెప్తారు. ఒక్కో డిజైన్ నుంచి ఒక్కో పార్ట్ చెప్పి అన్నింటినీ కలిపి కొత్త డిజైన్ కావాలంటారు. కొన్నిసార్లు ఆ ప్రయత్నంతో మేము కూడా కొత్త డిజైన్ నేర్చుకుంటాం. ఒక్కోసారి వాళ్లడిగినట్లు చేయడం కుదరదు. ఉడ్ పట్టు నిలవదు. అలాంటప్పుడు ఎందుకు కుదరదో వాళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పాలి. ఆ సూత్రాన్ని ఒంటబట్టించుకుంటే మా వృత్తి అన్నమే కాదు పరమాన్నం కూడా పెడుతుంది. ఈ వృత్తి ఎన్ని తరాలైనా ఎక్కడికీ పోదు. చెట్టు ఉన్నంత కాలం మేమూ ఉంటాం’’. యంత్రసాయం! వ్యవసాయంలో మా పనిముట్ల స్థానంలో ట్రాక్టర్, కరెంట్ మోటార్, వరికోత మెషీన్ వచ్చేశాయి. వాటి వల్ల రైతుకి పని చాలా సులువైంది. గ్రామాల్లో ఒక్కో ట్రాక్టర్ పెరిగే కొద్దీ నాగళ్లు అటకెక్కసాగాయి. పొలం దున్నేవాళ్లు తగ్గిపోసాగారు. గొర్రుతో సేద్యం చేసేవాళ్లు లేరిప్పుడు. – అలజంగి వెంకటాచారి, కార్పెంటర్ ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వృత్తికి గులాం
గులాం అలీ ఖాన్ సూదీదారం పట్టుకుని యాభై ఏళ్లవుతోంది. ఇరవై మూడేళ్ల వయసులో మెడలో వేసుకున్న టేప్ ఇప్పటికీ ఉంది. చేతిలో కత్తెర మెత్తగా పని చేసుకుపోతూనే ఉంది. మెషీన్ చక్రం గిర్రున తిరుగుతూనే ఉంది. అది బతుకు చక్రం. జీవితాన్ని మలిచిన చక్రం. వృత్తిలో చక్రం తిప్పాడు గులాం. దుకాణం అంటే అన్నం పెట్టిన అమ్మ అంటాడు. దుకాణం తెరవని రోజు అమ్మను చూడని రోజేనంటాడు. అమ్మకు సలాం... వృత్తికి గులాం అంటున్నాడు హైదరాబాద్, హెచ్ఎఫ్ నగర్‌కు చెందిన ఈ సీనియర్ టైలర్. గులాం అలీ తండ్రి కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా రాలేదేంటి అని అమ్మను అడుగుతున్నాడు. మాటల్లోనే వచ్చాడు నాన్న. అమ్మ చాయ్ ఇచ్చే వరకు ఉగ్గబట్టుకున్నాడు. ఆయన చాయ్ కప్పు కింద పెట్టగానే...‘‘నాన్నా నేను టైలరింగ్ నేర్చుకుంటా’’ ఉపోద్ఘాతం ఏమీ లేదు. విషయం చెప్పేశాడు గులాం అలీ.‘‘మనోళ్లలో ఎవరికీ రాదు బేటా, ఎక్కడ నేర్చుకుంటావ్’’‘‘దర్జీ దుకాన్కెళ్లి నేర్చుకుంటా అప్పా’’ ‘‘..........’’‘‘సరేనంటే రేపే వెళ్తా’’కొడుకు ఆరాటం అర్థమవుతోంది. ‘అలాగే’ అన్నాడు ముక్తసరిగా. గులాం అలీకి మెషీన్ మీద కూర్చున్నట్లే ఉంది. చక్రం గిర్రున తిరగడం, మెషీన్ టకటకలాడడం వింటుంటే తానే మెషీన్ కుడుతున్నట్లు ఉంది. షర్ట్ కుడుతున్న సీనియర్ వైపు తదేకంగా చూస్తున్నాడు. హెమ్మింగ్ చేసే నీడిల్ ఎడమ చేతి చూపుడు వేలిలో గుచ్చుకున్నది. ‘అబ్బా...’ అంటూ ఈ లోకంలోకి వచ్చాడు. ‘‘ఏంట్రా! ఏ లోకంలో ఉన్నావ్’’ గద్దించాడు మాస్టర్.మాస్టర్ చేతిలోని కత్తెర వంపు తిరుగుతూ క్లాత్‌ను కట్ చేస్తుంటే ఆకాశంలో వంగిన ఇంద్రధనుస్సును చూసినంత సంబరంగా ఉంది గులాంకి. తానెప్పుడు అలా కట్ చేసేది. మెడలో టేప్ వేసుకుని కత్తెరతో సర్రున మెత్తగా కట్ చేసి, చెవిలో ఉన్న పెన్సిల్ తీసి మార్క్ చేసి వాటిని చుట్ట చుట్టి మెషీన్ మీదున్న టైలర్ వైపు విసిరేస్తున్నాడు మాస్టర్. యాక్షన్ సీన్ చూస్తున్నట్లే ఉంది గులాంకి. ‘‘నాన్నా! పదిహేను రూపాయలు. నెల జీతం. రోజుకు యాభై పైసలు. నే పనికి ఒక్క రోజు కూడా డుమ్మా కొట్టలే. అందుకే మొత్తం జీతం వచ్చింది. అమ్మకిస్తున్నా’’ అంటూ తల్లి చేతిలో పెట్టాడు. గులాం తెచ్చిన డబ్బుకంటే... అతడి కళ్లలోని ఆనందాన్ని చూసి మురిసి పోయారు అతడి తల్లిదండ్రులు.‘‘నాన్నా! నేను సొంతంగా దర్జీ దుకాన్ పెడతా’’ అన్నాడోరోజు.‘‘ఎక్కడ పెడతావు, ఆబిడ్స్లోనేనా’’‘‘దర్జీలంతా ఆబిడ్స్లోనే ఉన్నట్లున్నారు. నేను ఎర్రగడ్డలో పెడతా, అఫ్జల్ కాకా స్టీల్ దుకాణం పక్కనే అద్దెకు గది ఉంది’’‘‘అన్నీ చూసుకున్నావ్. నేను చెప్పేదేంటి కానివ్వు’’ అలా... 1969లో మొదలైంది గులాం అలీ ఖాన్ సొంత దర్జీ దుకాణం. నెలకు పాతికరూపాయల అద్దె. ఒక బ్లవుజ్ కుడితే నాలుగు నుంచి ఐదు రూపాయలు నడుస్తున్న రోజులవి. ఐదు లేదా ఆరు బ్లవుజ్‌లు కుడితే రెంట్ వచ్చేస్తుంది. మిగిలిన డబ్బుతో జామ్‌జామ్‌గా బతికేయవచ్చు. ఇక ప్యాంట్ షర్టులకు లెక్కేలేదు. గవర్నమెంట్ ఉద్యోగుల కంటే పెద్ద రాబడి. ఒకరి దగ్గర పని చేయాల్సిన అవసరం లేదు. సొంతంగా ఎవరికీ తల వంచని దర్జీలా దర్జాగా జీవించవచ్చు. గులాం ముందున్న చిత్రం ఇది. కుర్రాడు మంచి పని వాడేననే పేరుతో పాటు పిల్లనిచ్చే వాళ్ల క్యూ రెడీ అయింది. షహనాజ్బేగంను పెళ్లి చేసుకున్నాడు. ఆరుగురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు. తొమ్మిది మందినీ చదివించాడు. ఏడుగురికి పెళ్లిళ్లు చేశాడు గులాం అలీ ఖాన్. ఇక ఇద్దరికి పెళ్లి చేయాలి. ఇప్పుడతడి వయసు 71. 23 ఏళ్ల వయసులో సొంత దుకాణం తెరిచారు. అప్పటి నుంచి ఇప్పటికీ మడత నలగకుండా చక్కగా ఐరన్ చేసిన ఖరీదైన షర్టు, ప్యాంట్‌తో గెజిటెడ్ ఆఫీసర్లాగా ఉంటాడు. డ్రస్ అలాగే మెయింటెయిన్ చేస్తాడని చెప్తారు బాగా తెలిసిన వాళ్లు. పిల్లలు టేప్ పట్టుకోలేదు! గులాం ఆరుగురు కొడుకులనూ చదివించాడు. ఒక కొడుకు ఓలా క్యాబ్ నడుపుతున్నాడు. మున్సిపాలిటీ ఆఫీస్‌లో ప్రైవేట్ వర్క్, డీఎల్ఎఫ్లో ఉద్యోగం, టైలరింగ్ మెటీరియల్ షాప్, మొబైల్ షాప్, చిన్న కొడుకు డీజె. కొడుకులలో ఒక్కరినైనా దర్జీని చేయాలనుకున్నాడు గులాం. ‘‘ఈ దుకాణం మీదనే అందరినీ చదివించాను, పెళ్లిళ్లు చేశాను. అప్పట్లో చేతి నిండా పని. ఇప్పుడు నెలలో పదిహేను రోజులు పని ఉంటే చాలా బాగున్నట్లు. మిగిలిన రోజులు షాపు తెరిచి కూర్చోవాల్సిందే. అద్దెలు కట్టుకుంటూ, కరెంట్ బిల్లు కట్టుకుంటూ గిరాకీల కోసం ఎదురు చూస్తున్నాను. ‘మేమంతా పని చేస్తున్నాం, ఇంక దుకాణం బంద్ చేయ’మంటారు పిల్లలు. దుకాణం బంద్ చేయాలంటే అమ్మను చూడకుండా ఆమె ముఖాన తలుపేసినట్లే, అట్లా మనసు రాదు. పాణం సుస్తీ చేసినా సరే, సాయంత్రం ఓ గంటయినా వచ్చి కూర్చుంటాను. అప్పుడు పాతిక... ఇప్పుడు తొమ్మిది వేలు! అప్పట్లో ఐదారు బ్లవుజ్‌ల డబ్బు అద్దెకెళ్లేది. ఇప్పుడు బ్లవుజ్కు 175 రూపాయలు తీసుకుంటున్నాను. షాపు అద్దె తొమ్మిది వేలు, కరెంటు బిల్లు ఆరొందలు. ఎన్ని బ్లవుజ్‌లు కుడితే షాపు రెంటు గడవాలి. నేను లేడీస్, జెంట్స్ ఇద్దరికీ కుడతాను కాబట్టి ఈ మాత్రమైనా బండిని నడిపిస్తున్నాను. మగవాళ్ల దుస్తులు మాత్రమే కుట్టే వాళ్లు దుకాణాలు బంద్ చేసేశారు. మగవాళ్లంతా రెడీమేడ్ ప్యాంట్, షర్ట్ కొనుక్కుంటారు. వాళ్లకు దర్జీతో పనే ఉండటం లేదు. లేడీస్‌కి అలా కాదు. కరెక్ట్ ఫిట్టింగ్ రెడీమేడ్లో దొరకక టైలర్‌తో కుట్టించుకునే వాళ్లుంటారు. రెడీమేడ్ కొని ఆల్టరేషన్కి వచ్చేవాళ్లుంటారు. ఇప్పుడు టైలర్లను బతికిస్తున్నది ఆడవాళ్లే. రెడీమేడ్ దుస్తులు కుట్టడం ఈజీ! మూడు వందలకు రెడీమేడ్ కుర్తా వస్తుంది. మేము కుట్టడానికే 225 తీసుకుంటాం. మరి మా దగ్గరకు ఎందుకు వస్తారు? అలా చార్జ్ చేయకపోతే మేము బతకలేం. రెడీమేడ్లో లాగ మేము కుర్తాను బారుగా కుట్టేస్తే సరిపోదు. కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా కుట్టాలి. దానికి టైమ్ పడుతుంది. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్లు కూడా పెద్ద పెద్ద దుస్తుల తయారీ కంపెనీలలో ఉద్యోగానికి వెళ్లిపోతున్నారు. అక్కడ ఐదు వేలిస్తారు. సైజ్‌ల వారీగా కామన్‌గా కుట్టేస్తారు. దాంతో దర్జీ దుకాన్ తెరమరుగు అవ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది’’ అన్నారు గులాం అలీ ఖాన్ ఆవేదనగా.దర్జీలు తెరమరుగవడానికి రెడీమేడ్ దుస్తులు మార్కెట్‌ని వెల్లువలా ముంచేయడం ఒక కారణమైతే, ఫ్యాషన్ డిజైనింగ్ మరో కారణం. పెద్దగా నైపుణ్యం లేని వాళ్లు తక్కువ జీతాలతో రెడీమేడ్ దుకాణాల కార్ఖానాల్లో చేరిపోతున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ రంగం వేళ్లూనుకోవడంతో స్కిల్ ఉన్న టైలర్లు డిజైనర్‌తో కలిసి పని చేస్తున్నారు. సొంతంగా పనిచేసుకుంటూ నేను దర్జీని అని చెప్పుకునే వాళ్లు కనిపించడం లేదు. నా దగ్గరకు క్లాత్ తెచ్చి కుట్టించుకునే వాళ్లకు నేనెలా కుడతానో చెప్పేది నా డ్రస్సే. నేను రెడీమేడ్ డ్రస్ వేసుకుని టేప్ మెడలో వేసుకుని కొలతలు తీసుకుంటుంటే, కొలతలిచ్చే వాళ్లకు నా పని మీద నమ్మకం కలగదు. ఇతర కంపెనీలను ప్రమోట్ చేయడం కాదు, నాకు నేనే ప్రమోషన్ ఇచ్చుకోవాలి. నేను శుభ్రంగా, నీట్‌గా కనిపిస్తే నా దగ్గర కుట్టించుకోవడానికి వస్తారు. ఇది వృత్తి సూత్రం – వాకా మంజులారెడ్డి -
ఏ వృత్తి అయితేనేం..?
గండకి ఒక అందమైన యువతి. భక్తిపరురాలు. సంస్కారవంతురాలు. పెద్దలను గౌరవించడం, సాధుసన్యాసులకు భిక్ష పెట్టడం, అతిథులను ఆదరించడం ఆమె నిత్యకృత్యాలు. ఇన్ని సుగుణాలున్న గండకి తల్లి ఒక వెలయాలు. ఆమె కడుపున పుట్టినందువల్ల గండకి కూడా ఆ వృత్తినే స్వీకరించక తప్పని దుస్థితి. ఒకవేళ గండకి వేరే వృత్తితో ఉదర పోషణ చేసుకుందామన్నా, ఆ నాటి సమాజం అందుకు అంగీకరించేది కాదు. ఎవరు ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తిని స్వీకరించక తప్పదు. దాంతో గండకి తల్లిలాగే వేశ్యావృత్తిలో గడపసాగింది. అయితే అందరు వేశ్యల్లా కాకుండా, తన దగ్గరకు వచ్చిన విటుని తన భర్తగా, తాను అతని భార్యగా భావించుకుంటూ, అతనికి అన్నివిధాలైన సపర్యలూ చేస్తూ, అందరు గృహిణుల్లానే తాను కూడా పూజలు, వ్రతాలు చేస్తూ ఉండేది. ఇదంతా చూసేవారు ఆమెవి విపరీతమైన చర్యలుగా భావిస్తూ, ఆమెను చులకనగా చూస్తూ, చాటుగా నవ్వుకునేవారు. అయితే ఎవరెన్ని విధాలుగా పరిహాసం చేసినా, గండకి తన ధోరణి మార్చుకోలేదు. ఇలా ఉండగా, ఓ సాయంత్రం వేళ, గండకి వాకిటి వద్దకు సుందరాకారుడైన ఓ యువకుడొచ్చి నిలబడ్డాడు. అతన్ని సాదరంగా ఇంటిలోకి ఆహ్వానించింది. పనిమీద ఏదో ఊరికి వెళ్లి, అలసటతో ఇల్లు చేరిన భర్తకు చేసినట్లు సపర్యలు చేసింది. ఆ యువకుడు ఆమెకు బంగారు నగలు, వజ్రవైఢూర్యాలు బహూకరించాడు. అయితే, ఆ రాత్రికి ఆమెతో గడపలేదతను. కనీసం ఆమె ముఖాన్ని కూడా దగ్గరగా చూడలేదు. చివాల్న లేచి ఎటో వెళ్లిపోయాడు. దాంతో గండకి మనసు చివుక్కుమంది. తెలిసీ తెలియక అతనికి తానేమయినా అపరాధం చేసిందేమోనని బాధపడుతూ నిద్రపోకుండా అలాగే ఉండిపోయింది. ఇంతలో అతను తిరిగి వచ్చాడు. సంతోషంతో ఆమె అతని వద్దకు చేరబోగా, అతని వళ్లంతా చెమటతో తడిసి ముద్దయి ఉంది. దాంతో అతన్ని స్నానం చేసి రమ్మంటూ అతని దుస్తులు తీసిన గండకి అతని వంటిని చూసి నిర్ఘాంతపోయింది. కారణం అతను కుష్ఠువ్యాధిగ్రస్థుడు కావడమే! అతని వొళ్ళంతా రసికారుతున్న పుళ్ళు..! అయినా సరే, అసహ్యించుకోకుండా అతనికి సపర్యలు చేస్తూ ఉండిపోయింది. అలా రాత్రి గడిచిపోయింది. ఇద్దరూ తమకు తెలియకుండానే నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారి లేచిన గండకి తన నిత్యకృత్యాలు ముగించుకుని, అతన్ని లేపడానికి ప్రయత్నించింది. అతను విగతజీవుడై కనిపించాడు. దాంతో ఆమె పెద్దపెట్టున రోదిస్తూ ఉండడంతో చుట్టుపక్కలవారంతా వచ్చి, ఎవరికి తోచిన సాంత్వన వచనాలు వారు చెప్పడం మొదలు పెట్టారు. దుఃఖసాగరంలో మునిగిపోయిన గండకి అవేవీ చెవిన వేసుకోలేదు. ఆ యువకుని శవం ముందు ముకుళిత హస్తాలతో కూర్చుండిపోయి, సహగమనం చేయడానికి సిద్ధపడింది. ఎవరెంతగా చెప్పిన వినలేదు. సరే, చేసేదేమీ లేదు, జరిగేది జరగక మానదు అని గ్రామస్థులు వారి చితికి నిప్పంటించబోయారు. అప్పుడే ఓ అద్భుతం జరిగింది. అప్పటిదాకా విగతజీవుడై పడి ఉన్న ఆ యువకుడు శంఖ చక్ర గదాయుధాలు ధరించి, చతుర్భుజుడైన విష్ణుమూర్తిలా దర్శనమిచ్చాడు. పంకిలమైన వేశ్యావృత్తిలో ఉన్నప్పటికీ, మానసికంగా పవిత్రమైన గృహస్థ ధర్మాన్ని అనుసరించిన గండకి పట్ల శ్రీమన్నారాయణుడికి అమితమైన వాత్సల్యం కలిగింది. ఆమెను కరుణించిన స్వామి, విపత్కర పరిస్థితుల్లో ఆమె ఏమి చేస్తుందో చూడాలన్న కోరికతో పెట్టిన పరీక్షలో ¯ð గ్గింది గండకి. ఆమెను మూడువరాలు కోరుకోమన్నాడు స్వామి. అందుకు ఆమె అంగీకరించలేదు. ‘నా ధర్మాన్ని నేను నెరవేర్చినందుకు నాకు వరాలెందుకు స్వామీ!’’ అంది. శ్రీమహావిష్ణువు ఆమెను ఎంతో బలవంత పెట్టిన మీదట తాను ఎల్లప్పుడూ స్వామివారి చరణ సన్నిధిలో ఉండిపోవాలన్న ఒకే ఒక్క వరం కోరుకుంది. అప్పుడు విష్ణుమూర్తి, రానున్న కాలంలో ఒక పతివ్రత శాపకారణాన తాను సాలగ్రామకొండగా మారుతానని, కొండ పాదాలచెంత గండకీ నదిగా ఉండి, నిత్యం తననే సేవించుకుంటూ ఉండిపోతావని వరమిచ్చాడు. ఆనందపారవశ్యంతో గండకి విష్ణుమూర్తి పాదాలకు ప్రణమిల్లింది. పరమపవిత్రమైన గండకీ నదిలో స్నానం చేసిన వారికి సకల పాపాలూ తొలగిపోతాయనీ, తనను స్మరిస్తూ, నిశ్చలమైన భక్తివిశ్వాసాలతో నదిలో స్నానం చేసిన వారి వ్యాధులను స్వయంగా తానే నిర్మూలిస్తానని వరమిచ్చాడు విష్ణువు. తామరపూవు తాను బురదలో ఉన్నానని బాధపడదెప్పుడూ! స్వామిని సేవించుకునేందుకు తనకు అవకాశమెప్పుడెప్పుడు వస్తుందా అని వేచి చూస్తుంటుంది! -
మొహమాటం వదిలేయాలి!
చుట్టూ నలుగురు ఉంటేనే చాలామందికి నోట మాట రాదు. మరి.. సినిమా తారల చుట్టూ వందల మంది ఉంటారు. ఎలా నటించగలుగుతారబ్బా? అనే డౌటు చాలామందికి వస్తుంటుంది. ఇదే విషయం గురించి ఇటీవల తమన్నా దగ్గర ప్రస్తావిస్తే - ‘‘ఆర్టిస్టుగా నటించాలంటే పరిసర ప్రాంతాలను మర్చిపోవాలి. మనల్ని ఎవరూ చూడటంలేదు అనుకోవాలి. ముఖ్యంగా మొహమాటం వదిలేయాలి. చేస్తున్న పాత్రకు న్యాయం చేయాలనే విషయాన్ని మాత్రమే మనసులో పెట్టుకుని, నటించాలి. నేనలానే చేస్తాను. చుట్టూ ఎంతమంది ఉన్నా టైపిస్ట్‌లు కీ-బోర్డ్‌ని టపటపలాడిస్తూ తమ పని తాము చేసుకుపోతారు. కండక్టర్లూ, డాక్టర్లూ.. ఇలా ఎవరికివాళ్లు తమ పని తాము చేస్తారు. మేం కూడా అంతే. మా పని మేం చేస్తున్నాం. చుట్టూ వేల మంది ఉన్నా మా పని మేం చేయాలి. అందరి గురించీ ఆలోచించి, బాగా చేయకపోతే మేం మాటలు పడాల్సి వస్తుంది. దాంతో పాటు వృత్తి మీద భక్తి, శ్రద్ధలు లేవని కూడా అనిపించుకోవాల్సి వస్తుంది. అందుకే కెమెరా ముందుకెళ్లాక నన్ను మర్చిపోతాను. ఇతరులనూ మర్చిపోతాను. పాత్రను మాత్రమే గుర్తుపెట్టుకుని చేస్తాను’’ అన్నారు. -
నచ్చనిది చేయలేను... నచ్చినట్టు బతకలేను... ఎలా?
జీవన గమనం నా వయసు 24. మంచి ఆడిటర్‌ని కావాలని సీఏని ఓ పవిత్రమైన వృత్తిగా భావించి ఎంచు కున్నాను. కానీ ఆర్టికల్‌షిప్ చేస్తున్న సమయంలో ఆ వృత్తిమీద అసహ్యం ఏర్పడింది. 2013లో నేను మా గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యాను. అందులో మద్యం, డబ్బు కూడా భాగమయ్యాయి. మా నాన్న నేను వద్దన్నా వాటిని పంచారు. నిజాయతీగా బతకాలని, వచ్చింది రూపాయి అయినా దాన్ని నీతిగానే సంపాదించాలనేది నా అభిలాష. కానీ చుట్టూ అవినీతే. సేంద్రియ వ్యవసాయం, ఆధ్యాత్మిక అంశాలంటే నాకు చిన్నప్పట్నుంచీ పిచ్చి. కానీ అమ్మానాన్నలకు ఇష్టం లేదు. దర్జాగా బతక మని పోరుతుంటారు. దాంతో నచ్చినట్టు చేయలేకపోతున్నాన్న బాధ నన్ను నలిపే స్తోంది. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. - ఓ సోదరుడు ప్రతి మనిషికీ గమ్యం (ఉ॥బాగా చదవడం), కోరిక (ఉ॥సినిమాలు చూడటం) అని రెండు ఉంటాయి. ఆ రెంటికీ తేడా ఎక్కువయ్యే కొద్దీ మనిషి కలత పడతాడు. విజయం అంటే ‘బతుకుతున్న జీవిత విధానం పట్ల పూర్తి సంతృప్తితో ఉండటం’. ఇంతకన్నా గొప్ప నిర్వచనం నాకింతవరకూ దొరకలేదు. మీరు ఆర్టికల్‌షిప్ చేస్తున్నప్పుడు మీ యజమాని అవలం బించే విధానాలు చూసి సీఏ వృత్తిమీద అసహ్యం ఏర్పడి ఉండ వచ్చు. లేదంటే అంత కష్టమైన కోర్సు చదవలేని మీ అశక్తతకి అసహ్యం అని పేరు పెట్టుకుని ఉండ వచ్చు. ఏది నిజమో మీరే మీ మనస్సాక్షిని అడగండి. కేవలం మీకు నచ్చలేదు కాబట్టి సీఏ అనేదే ఒక అపవిత్రమైన వృత్తి అనడం తగదు. నేనూ చార్టెడ్ అకౌం టెంట్నే. లంచాలు సంపాదించడానికి ఎన్నో అవకాశాలున్న ప్రభుత్వ ఆర్థిక సంస్థల్లో పదిహేను సంవత్సరాలు పని చేసి, ఇప్పుడు ప్రైవేటు ప్రాక్టీసు చేస్తు న్నాను. ఇంతకాలం లంచాలకు దూరం గానే ఉంటూ వచ్చాను. ఎన్ని అవకాశాలు వచ్చినా నయాపైసా స్వీకరించలేదు. కాబట్టి సీఏ అంటే తప్పకుండా లంచంతో కూడిన వృత్తి అనే అభిప్రాయాన్ని మార్చు కోండి. నిజాయతీగా బతకాలి, నీతిగా సంపాదించాలి అన్నదే మీ అభిలాష అయితే కాదన్నది ఎవరు? మీ చుట్టూ అవినీతి కనిపిస్తూ ఉండొచ్చు. కానీ మీరు నిజాయతీగా బతకవచ్చు కదా! ఇక మీ అభిరుచుల గురించి. సేంద్రియ వ్యవసాయం, ఆధ్యాత్మిక విష యాలంటే మీకు అభిరుచి అని రాశారు. మీరు మీ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉన్నంతకాలం వారు తమ అభిప్రాయా లకు అనుగుణంగా బతకమనే మిమ్మల్ని ఒత్తిడి చేస్తుంటారు. ‘చెరువులో నీళ్లు నచ్చకపోతే బయటకు వచ్చి చచ్చిపో. కానీ జీవితాంతం ఆ నీళ్లలోనే ఈదొద్దు’ అని చేప పిల్లకి సలహా ఇచ్చినట్టు నేను మీకు సలహా ఇవ్వలేను కానీ... వీలైనంత వరకూ వ్యక్తిత్వాన్ని పెంచుకోడానికి ప్రయత్నించండి. ఎవరి ట్యూన్కో నాట్యం చేస్తున్నంతకాలం జీవితం మన చేతుల్లో ఉండదు. జీవి తంలో అన్నిటికన్నా దౌర్భాగ్య కరమైన విషయం తనకు నచ్చినట్టు బతకలేకపోవడం. ముందు ఆర్థిక స్వాతంత్య్రం సంపాదించండి. పరస్పర విరుద్ధమైన అభిరుచులు, కోరికలు పెట్టుకోకుండా ఒకే గమ్యం వైపు సాగండి. నేనొక అమ్మాయిని ప్రేమించాను. నా ప్రేమను తనకు చెప్పినప్పుడు తన గతం చెప్పింది. ఓ అబ్బాయిని ప్రేమించానని, అతనికి అన్ని రకాలుగానూ దగ్గరయ్యానని, ఇద్దరూ విడిపోయారని చెప్పింది. తన నిజాయతీ కారణంగా నేను తనని యాక్సెప్ట్ చేశాను. కానీ తను ఈ మధ్య సడెన్‌గా మారిపోయింది. నాకు ప్రేమ మీద నమ్మకం పోయింది, నువ్వు నాకు మంచి స్నేహితుడిగానే ఉండు అంటోంది. కారణం అర్థం కాక ఆరా తీస్తే... తన పాత లవర్‌కి మళ్లీ దగ్గరయ్యిందని తెలిసింది. నేనేం చేయాలి? తను కోరుకున్నట్టు స్నేహితుడిగా ఉండాలా లేక తనతో అన్ని సంబంధాలూ తెంచేసుకుని నా పని నేను చేసుకోవాలా? - కె.కె.రెడ్డి, మెయిల్ మీరు చెప్పినట్టు మీకు రెండే ఆప్షన్లు. తనతో స్నేహంగా ఉండటం... తనతో సంబంధాలన్నీ తెంచేసుకోవడం. స్నేహితుడిగా ఉండటం వల్ల మీకొచ్చే లాభనష్టాలు బేరీజు వేసుకోండి. ఆమెను వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? లేక కేవలం స్నేహితుడిగానే ఉందామను కుంటున్నారా? సంబంధాలన్నీ తెంచేసు కుంటే మీరు మరింత మనఃస్థిమితంగా ఉంటారేమో ఆలోచించండి. స్నేహితు రాలు ఎవరితో ఉంటోంది, ఎక్కడికి వెళ్తోంది లాంటి ఆరాలు తీయడం, డిటెక్టివ్‌లను పెట్టడం వంటి పత్తేదారు పనులు ఎప్పుడూ మనసులను కలచి వేస్తూ ఉంటాయి. ఆమెను మీరు వివాహం చేసుకునే ఉద్దేశం లేనప్పుడు ఆమె జీవితం ఆమెది, మీ జీవితం మీది. లేదూ కేవలం ఆమెను స్నేహితురాలిగానే చూసే పక్షంలో... ఆమె జీవితంలో మీరు ఒక చిన్న భాగం మాత్రమే. మిగతా భాగంలో ఎవరుంటే మీకు ఎందుకు? ఈ విధంగా ఆలోచిస్తే మనశ్శాంతి దొరుకుతుంది. - యండమూరి వీరేంద్రనాథ్ -
వృత్తిపరంగా కలిసొచ్చే కాలమిది
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఇది మీకు బాగా కలిసొచ్చే కాలం. మీ జీవిత భాగస్వామితో సామరస్యంగా, స్నేహంగా మెలగడం మంచిది. అనవసరమైన చిక్కులు, చికాకులు, టెన్షన్లు ఉండవచ్చు. వాదనలు మానడం మంచిది. శుభవార్తలు వింటారు. తద్ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఉన్నత సోపానాలు అధిరోహిస్తారు. కలిసొచ్చే రంగు: బ్లూ టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఇది మీకు సాహసోపేతమైన నెల. భాగస్వామ్య వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్లి ఘడియలు సమీపిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది. పొదుపు చేయడానికి ఇది మంచి తరుణం... అయితే పెట్టుబడులకు మాత్రం కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యాయామం చేయడం మంచిది. కలిసొచ్చే రంగు: గ్రీన్ జెమిని (మే 21-జూన్ 21) గతంలో చేసిన వాటి ఫలితం ప్రస్తుతం అనుభవంలోకి వస్తుంది. కోర్టు కేసులలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అతి ముఖ్యమైన నిర్ణయం ఒకటి తీసుకోవ లసి వస్తుంది. మనం అనుకున్నది పొందాలన్నా, చేపట్టిన పనులలో విజయం సాధించాలన్నా రిస్క్ తీసుకోక తప్పదని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: ఎల్లో క్యాన్సర్(జూన్22-జూలై 23) మీరు ఇంతకాలంగా చేసిన కృషికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తారు. అందుకు ఆనందిస్తారు. ఖరీదైన వస్తువును కొంటారు లేదా షాపింగ్ చేస్తారు. మీ లవర్ లేదా జీవిత భాగస్వామి ఒక విషయంలో అలకబూనవచ్చు. అవతలి వారిపట్ల మీకున్న ప్రేమ మీరు వారిని అడగాలనుకున్న ప్రశ్నలను అడగనివ్వకుండా మీ నోరు కట్టేస్తుంది. కలిసొచ్చే రంగు: పర్పుల్ లియో(జూలై 24-ఆగస్టు 23) గత ఏడాది కాలంగా పోల్చుకుని చూస్తే ఈ నెలలో ఆర్థికంగా మీరు ఎంతో ఉన్నతిని సాధిస్తారు. వెన్నుపోటుదారుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ ఉన్నతిని చూసి ఎంతోమంది అసూయ చెందుతారు. మీ పై అధికారులకు మీ మీద చాడీలు చెప్పవచ్చు. అయితే ఓపిక వహించ డం మంచిది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. కలిసొచ్చే రంగు: సిల్వర్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీదైన శైలిలో పనిచేసి అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు. ఇతరులు ఎవరైనా మీమీద అసూయ లేదా కోపంతో చేసే పనులకు కోపం తెచ్చుకోకండి. వాళ్లమీద జాలిపడండి. మనసారా నవ్వుకోండి. ఈ వార మంతా మీరు హాయిగా నవ్వుతూ తుళ్లుతూ ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ గురించి కలలు కంటూ ఉంటారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కొత్తగా ఆలోచించి, సృజనాత్మకతతో చాకచక్యంగా పనులు చేస్తారు. ఇతరుల పట్ల మీ ఆలోచనాధోరణిని మార్చుకోండి. మీ ఆలోచనలలో మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. మీ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే అది సహజమని, జీవితంలో అది కూడా ఒక భాగమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: ఇండిగో స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) భయం, అభద్రతా భావాలకు గురికావడం వల్ల చాలా దిగులుగా, ఆందోళనగా కనిపిస్తారు. అంతగా భయపడేటట్లయితే ఎందులోనూ పెట్టుబడులు పెట్టకండి... పనిలో కాని, ఇంటిలో కాని, ఉద్యోగంలో కాని మార్పు ఉండవచ్చు. వ్యాపారస్థులయితే వారి వ్యాపారంలో మార్పు చేస్తారు. విద్యార్థులు తమ సబ్జెక్టులు మార్చుకునే ఆలోచన చేస్తారు. కలిసొచ్చే రంగు: గోల్డ్ శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) ఈ వారం మీకు ధనం పుష్కలంగా చేతికందుతుంది. పనిప్రదేశంలో అంటే ఆఫీసులో మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కుటుంబంలో ఒక స్త్ర్రీ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. గతాన్ని మరచిపోండి. విజయం మీకు చేరువలోనే ఉందని గ్రహించండి. వృత్తిపరంగా లేదా ఆఫీస్ పరంగా చిన్నపాటి ప్రయాణ ం ఉండొచ్చు. కలిసొచ్చే రంగు: ఎల్లో అక్వేరియస(జనవరి 21-ఫిబ్రవరి 19) మీ కలలు నెరవేరే తరుణమిది. డబ్బు గురించి ఏమాత్రం ఆందోళ న అవసరం లేదు. ఈ వారం మీరు బోల్డంత డబ్బు బ్యాంకులో దాచుకుంటారు కూడా! జీవితాన్నితేలికగా తీసుకోండి. విందు వినోదాల్లో గడుపుతారు. ఒక స్నేహితునితో మీ బంధం తిరిగి గట్టిపడుతుంది. అది మీకు ఎంతో ఉపకరిస్తుంది. కలిసొచ్చే రంగు: పర్పుల్ పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) కొద్దిపాటి ఒడిదొడుకులు, సమస్యలు, ఎదురు కావొచ్చు. రెండు విధాలైన వృత్తి ఉద్యోగావకాశాలలోదేనిని ఎంచుకోవాలో తెలియక తికమక పడతారు. ప్రేమ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. గతంలో మీరు ఏమిటి, ఏం చేశారన్నది కాదు, ఇప్పుడు ఎలా నడుచుకుంటారన్నదే మీ లక్ష్యసిద్ధికి తోడ్పడుతుందని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: రోజ్ పింక్ కలర్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) మీ సంతానానికి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. భార్యకి భర్తపట్ల, భర్తకి భార్యపట్ల అన్యోన్యత పెరిగే కారణంగా ఈవారంలో కుటుంబంలో సుఖశాంతులు చోటుచేసుకుంటాయి. సంతానం తమ బాధ్యతను తామే నిర్వర్తించుకుంటే కలిగే మనశ్శాంతి ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. అనవసరమైన వ్యయాన్ని అదుపుచేసుకుని మిగులులో ఉంటారు. టారస్(ఏప్రిల్ 21-మే 20) అకస్మాత్తుగా మీలో ఆధ్యాత్మిక భావన, దానధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అది మంచి ఆలోచనే కానీ, శక్తికి మించి దానధర్మాలు చేయడం కుటుంబానికి అన్యాయం చేయడమే అవుతుందని గ్రహించుకోగలగాలి. ఆచార వ్యవహారాల పట్ల ఆదరణ పెరుగుతుంది కానీ, అది మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించేలా మారకుండా చూసుకోవాలి. జెమిని (మే 21-జూన్ 21) ఎప్పటికప్పుడు ఓ సమస్య రావడం, మనశ్శాంతిని కోల్పోవడం, మళ్లీ అంతలోనే ఆ సమస్యకి పరిష్కారం అప్రయత్నంగా లభించడం, మనోధైర్యాన్ని పొందడం.. ఈవారమంతా ఇలా గడుస్తుంది. దీన్నే ‘క్రియాశూన్య కర్మ’ అంటారు. ఆలోచనలను చేస్తారు కానీ, ఆచరణలోకి తెచ్చేందుకు కావలసిన మనోధైర్యం, సాహసం ఉండకపోవచ్చు. లియో(జూలై 24-ఆగస్టు 23) అప్పటికప్పుడు అవసరానికి సొమ్ము వస్తూ, అవసరాలూ, రుణాలూ అలా తీరిపోతూ ఉంటాయి. గత జీవితపు అనుభవంతో పొదుపరితనం, సకాలంలో పనిని ముగించాలనే ఊహ, నష్టపోకుండా బాధ్యతతో వ్యవహరించాలనే దృక్పథం బలంగా వస్తాయి. న్యాయస్థానంలో ఉన్న అభియోగాలన్నీ వీగిపోయి, మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఇప్పట్లో ప్రతికూల పరిస్థితులుండవు కాబట్టి, మీ పనిని ప్రణాళిక ప్రకారం సాగించుకుంటూ వెళ్లిపొండి. ఒత్తిడి లేకుండా ఉద్యోగాన్ని చేసుకోండి. ఇతరులకు హామీలూ, వాగ్దానాలూ వంటివి చేసే ధైర్యం మీకు లేదు కాబట్టి, అలాంటి పరిస్థితి వస్తే మెత్తగానైనా గట్టిగా చెప్పగలిగే లౌక్యం మీకుంది కాబట్టి ఆనందంగా గడపండి. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ కుటుంబంలో వచ్చే ఓ సమస్యను నేరుగా ఎవరివల్ల ఆ ఇబ్బంది వచ్చిందో వారితో సూటిగా మాట్లాడుకోవడం వల్ల సత్ఫలితముంటుంది తప్ప, ఇతరుల మధ్య ఈ సమస్యను వివరిస్తే జటిలమైపోతుంది. కళ్లు తెరిచి చూసుకునే సరికి అందమైన జీవితం కాస్తా ఈ మధ్య వ్యక్తుల కారణంగా ఛిద్రమౌతుందని గ్రహించాలి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ప్రతి చిన్న సమస్యనీ భూతద్దంలో చూడడం, మరీ ఎక్కువగా ఆలోచించడం కారణంగా చేస్తున్న ఉద్యోగ, వ్యాపారాల మీద దృష్టి సన్నగిల్లవచ్చు. సమస్య మూలాలను తెలుసుకోగలుగుతారు. శని ఎప్పుడూ చెడు చేయడు, జీవితంలో గొప్ప అనుభవాన్ని ఒక పాఠంలా మనకు అందిస్తాడు. జీవితాల్లో శని ప్రవేశించి కొన్నాళ్లున్నాక మాత్రమే ప్రతి వ్యక్తికి జ్ఞానోదయమవుతుంది. శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) ‘అలా చేసి ఉంటే ఇంత లాభించి ఉండేది’ అనుకుంటూ వర్తమానంలో నిలబడి, గతంవైపు దృష్టి సారించడం వల్ల కాలహరణం తప్ప ప్రయోజనం సిద్ధించదు. వాయిదా వేసే మనస్తత్వాన్ని విడిచి, కర్తవ్యం మీద దృష్టి సారించండి. జీవితంలో ఓటములనే చవిచూసిన వారితో స్నేహాన్ని కనుక చేస్తే ఇంకా అగాధంలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. జాగ్రత్తగా ఉండండి. క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20) పూర్తి అనుభవం లేకుండానే మరో వ్యాపారానికి నడుం కడతారు. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సమయం, శ్రద్ధ కుదరని కారణంగా ఆ వ్యాపారం అంతంతమాత్రంగా ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలను పాటించడం అవసరం. ఇతరుల మీద భరోసా ఉంచి మీ పనిని మరొకరితో చేయించడం ఏమాత్రమూ సరికాదు. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) తాత్కాలిక నిరాశతో పాడి కుండ లాంటి ఉద్యోగాన్ని విడవద్దు. బంధుమిత్రుల సలహాలను, సూచనలను, జాగ్రత్తలను విన్నట్లు నటించండి. ఉద్యోగం కారణంగా మీ సంసారం సుఖంగా సాగుతోందని, ఆ ఉద్యోగం ద్వారానే మీకు ఒక గుర్తింపు లభించిందని భావించాలి తప్ప, దీన్ని విడిచేస్తే మరోటి గొప్పదేదో దొరుకుతుందనుకోవడం కల్ల. తొందరపడవద్దు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) మీ మాటని మీ కిందివాడు వినకపోతే మీకెలా ఉంటుందో, అదే పరిస్థితి మీ విషయంలో మీ పైవానికీ ఉంటుంది. కాబట్టి పైవారికి అనుకూలంగానే ఉండండి. ఆస్తుల కొనుగోళ్లపై దృష్టి పెట్టకుండా పిత్రార్జితాన్ని గురించిన వివాదాలను కొంత నష్టపోయి అయినా తెగతెంపులు చేసుకోండి. కాలంగడిచేకొద్దీ విషయం ముదురుపాకానికి వెళ్లవచ్చు. మైలవరపు శ్రీనివాసరావు -
ప్రొఫెషనల్‌గా విజేందర్
లండన్: భారత బాక్సింగ్‌లో ఎన్నో ‘తొలి ఘనత’లను సొంతం చేసుకున్న స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్ ప్రొఫెషనల్‌గా మారాడు. అమెచ్యూర్ కెరీర్‌కు స్వస్తి చెప్పిన ఈ హర్యానా బాక్సర్... లండన్‌లోని క్వీన్స్‌బెర్రీ ప్రమోషన్స్ సంస్థతో ఒప్పందం చేసుకున్నాడు. ‘ప్రొఫెషనల్‌గా మారిన నేను కెరీర్లో కొత్త అధ్యాయాన్ని మొదలుపెడుతున్నాను. తీవ్రంగా శ్రమించి ప్రపంచస్థాయిలో భారత్‌కు మరింత పేరు తేవాలని అనుకుంటున్నాను’అని విజేందర్ వ్యాఖ్యానించాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2009 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం, 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో స్వర్ణం, కామన్వెల్త్ గేమ్స్‌లలో రజతం, రెండు కాంస్యాలు నెగ్గిన విజేందర్ భారత బాక్సింగ్‌లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాడు. ప్రొఫెషనల్‌గా మారడంతో 29 ఏళ్ల విజేందర్ ఇకపై భారత జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించే అవకాశాలకు తెరపడింది. -
సౌర వాణి
మీకిది శుభ సమయం! మేషం (మార్చి 21-ఏప్రిల్ 20) (రాశ్యాధిపతి-కుజుడు)... వృత్తి, ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలసి వస్తాయి. దూరప్రాంత ప్రయాణాలు, విదేశీయానం. మీ ద్వారా సహాయం పొంది ఉన్నతస్థానాల్లో ఉన్నవారు కీలక సమయంలో నిరాశకు గురిచేస్తారు. కోర్టు వ్యవహారాలు, వివాదంలో ఉన్న భూమి సంబంధమైన వ్యవహారాలు మీకు సత్ఫలితాలు ఇస్తాయి. అనుకూల తేది: 4; ప్రతికూల తేది: 8; ప్రతిరోజూ హనుమాన్ చాలీసా పఠించడం శుభం. వృషభం ( ఏప్రిల్ 21-మే 20) (రాశ్యాధిపతి-శుక్రుడు)... దీర్ఘకాలిక వివాదాస్పద వ్యవహారాలను అతి కష్టం మీద పరిష్కరించుకోగలుగుతారు. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన విషయాల్లో మధ్యవర్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త వహించండి. అనుకూల తేది: 5; ప్రతికూల తేది: 7; దుర్గాదేవి ఆరాధన శుభం. మిథునం (మే 21-జూన్ 21) (రాశ్యాధిపతి-బుధుడు)... మీకు మీరుగా కొన్ని కఠినమైన బాధ్యతల నుంచి తప్పుకుంటారు. అందువల్ల భవిష్యత్తులో మంచి జరుగుతుంది. నష్టాల దిశగా పయనిస్తున్న వ్యవహారాలు మీ కృషి, పలుకుబడి వల్ల లాభాల బాటలో పయనిస్తాయి. అనుకూలం: 5; ప్రతికూలం: 8; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం. కర్కాటకం (జూన్ 22 - జూలై 23) (రాశ్యాధిపతి - చంద్రుడు)... ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారస్తులకు రొటేషన్ లాభాలు బాగుంటాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. అనుకూలం 4, ప్రతికూలం 6; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం. సింహం (జూలై 24 - ఆగస్టు 23) (రాశ్యాధిపతి - రవి)... వృత్తి ఉద్యోగాల పరంగా శ్రమ అధికం అవుతుంది. రావలసిన బిల్లులు సకాలంలో అందుతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగపరంగా ప్రమోషన్ లభిస్తుంది. అనుకూలం 6, ప్రతికూలం 8; ప్రతి రోజు గణపతి ఆరాధన శుభం కన్య (ఆగస్టు 24 - సెప్టెంబరు 23) (రాశ్యాధిపతి - బుధుడు)... దూర ప్రాంతాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు అనుకూలిస్తాయి. విద్యను అభ్యసించడానికి తగిన మంచి అవకాశాలు కలిసివస్తాయి. మీ కృషికి తగిన కీర్తి లభిస్తుంది. అనుకూలం, 5, ప్రతి కూలం 9; ప్రతిరోజు హనుమాన్ చాలీసా పారాయణం శుభం. తుల (సెప్టెంబరు 24 - అక్టోబరు 23) (రాశ్యాధిపతి - శుక్రుడు)... విదేశాలకు వెళ్లడానికి వీసా లభిస్తుంది. సమాజంలోని కీలక వ్యక్తులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. క్రమంగా అవి వ్యాపార సంబంధాలుగా మారతాయి. నిరుద్యోగులకు శుభ సమయం; అనుకూలం 3, 6, ప్రతికూలం 8; ప్రతి రోజు గణపతి ఆరాధన శుభం. వృశ్చికం (అక్టోబరు 24 - నవంబరు 22) (రాశ్యాధిపతి - కుజుడు)... కుటుంబ వ్యవహారాలలో బంధువుల సలహాలు, జోక్యం అధికమవుతాయి. అభిమానించే వారికోసం ఏదయినా చేయాలని ఎంతగానో శ్రమిస్తారు. అనుకూలం 6, ప్రతికూలం 8; ప్రతి రోజు గణపతి ఆరాధన శుభం. ధనుస్సు (నవంబరు 23 - డిసెంబరు 21) (రాశ్యాధిపతి - గురువు)... వ్యాపారంలో లాభాలు గతంలో కంటే మెరుగ్గా ఉంటాయి. వ్యక్తిగత స్థాయి ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ కొద్దిగా పెరుగుతుంది. అనుకూలం 6, ప్రతికూలం 8; ప్రతిరోజూ గణపతి ఆరాధన శుభం. మకరం (డిసెంబరు 22 - జనవరి 20) (రాశ్యాధిపతి - శని)... వ్యాపారంలో లభించే ఆర్డర్లు సంతోషం కలిగిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లభిస్తుంది. అనుకూలం 6 ప్రతికూలం 8; ప్రతిరోజూ గణపతి ఆరాధన, హనుమాన్‌చాలీసా పారాయణ శుభం. కుంభం (జనవరి 21 - ఫిబ్రవరి 19) (రాశ్యాధిపతి - శని)... వివాహాది శుభకార్యాల విషయాలు సానుకూలమవుతాయి. నూతన గృహయోగ్యత ఏర్పడుతుంది. విద్యారంగంలో మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనుకూలం 4, ప్రతి కూలం 8; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం. మీనం (ఫిబ్రవరి 20 - మార్చి 20) (రాశ్యాధిపతి - గురువు) శుభకార్యాల విషయంలో మనోభీష్టం నెరవేరుతుంది. ఉన్నత విద్యా యోగం కలుగుతుంది. వ్యాపార అంశాలు అనుకూలంగా ఉంటాయి. అనుకూలం 6, ప్రతి కూలం 8; ప్రతిరోజు గణపతి ఆరాధన శుభం. డా॥జి.వి., పంచాంగకర్త, శ్రీ జ్ఞానసరస్వతి జ్యోతిషాలయం, సికింద్రాబాద్ -
తోలుచిత్రాలు
కాలం ముందుకు కదులుతూనే ఉంటుంది. ఆ ప్రస్థానానికి తగినట్లు మనిషి మారుతుండాలి. ఆ మార్పు అభ్యుదయం దిశగా సాగాలి. వ్యక్తి అయినా, వృత్తి అయినా అభివృద్ధికి ఇదే కొలమానం. ఆ సూత్రాన్ని పట్టుకున్నారు తోలుబొమ్మల కళాకారుడు దళవాయి వెంకటరమణ. దేనికదే ప్రత్యేకం! తోలుబొమ్మ కళాకారుల్లో ఉన్న గొప్పదనం ఏమిటంటే... డిజైన్ని ట్రేస్ పేపర్ మీద వేయడం అనే ఆలోచనే ఉండదు. ఘట్టాన్ని ఊహించుకుని స్వయంగా బొమ్మ గీసుకుంటాం. దాంతో ఈ కళలో ఉన్న డిజైన్లు మరి దేనికీ నకలుగా ఉండవు. దేనికదే కొత్త రూపం. తోలు బొమ్మలను పారేయాల్సిందే తప్ప ఎన్నేళ్లయినా అవి పాడవవు. - వెంకట రమణ వాకా మంజులారెడ్డి అనంతపురం నిమ్మలకుంట గ్రామంలో ‘చిత్రకార’ కుటుంబంలో పుట్టిన రమణ... తాత ముత్తాతల నుంచి వారసత్వంగా అందివచ్చిన తోలుబొమ్మలాటను ఇష్టంగా నేర్చుకున్నారు. అందుకే... తాత ఖడేరావు దగ్గర నేర్చుకున్న పాటలు, తండ్రి గోవిందు నేర్పిన ములుకు పట్టడం (తోలు బొమ్మల తయారీలో నైపుణ్యం), నాయనమ్మ, అమ్మ దగ్గర నేర్చుకున్న రంగనాథ రామాయణం ఘట్టాల ప్రదర్శన క్రమంగా ఆదరణ కోల్పోతున్నప్పటికీ ఆ వృత్తిని వదలడానికి ఆయన మనసు ఒప్పుకోలేదు. అలాగని తోలుబొమ్మలాట దగ్గరే ఆగిపోతే కుటుంబం గడవదు. ఈ సంఘర్షణ నుంచి తనకు తాను ఓ కొత్త దారిని వేసుకున్నారు. తోలుబొమ్మలలో అందమైన ల్యాంప్షేడ్లు, వాల్ హ్యాంగింగ్, డోర్ ప్యానెల్ పార్టిషన్... ఇంకా ఇతర గృహాలంకరణ వస్తువులు రూపొందించారు! ఆ ప్రయోగం అతణ్ణి రాష్ట్రస్థాయి హస్తకళల పోటీలో విజేతను చేసింది. లేపాక్షి హస్తకళా ప్రదర్శనలో 2008లో ప్రదర్శించిన ల్యాంప్‌షేడ్‌కి బహుమతి అందుకున్న వెంకటరమణ తాజాగా తన కళాప్రావీణ్యానికి గవర్నర్ నరసింహన్ నుంచి ప్రశంసలతోపాటు రాజ్‌భవన్‌కు ఆహ్వానమూ అందుకున్నారు. ఆట చూడకపోయినా... ‘‘తోలుబొమ్మలాట చూసే వాళ్లు లేరు కానీ తోలుబొమ్మను చూసేవాళ్లుంటారు’’ అంటారు వెంకటరమణ. ‘‘ఇది చిత్రకార ప్రధానమైన కళ. దీనిని చిత్రాలకే పరిమితం చేస్తూ కొనసాగిద్దామని ఇలాంటి ప్రయోగాలు చేశాను. నా ప్రయోగాలు విజయవంతమైన తర్వాత మధువని, కలంకారీ వంటి ఇతర చిత్రరీతులను కూడా తోలు మీద చిత్రిస్తున్నాను’’ అని చెప్పారాయన. ధర్మవరం రంగులు తోలుబొమ్మలకు పట్టుచీరలకు వేసే రంగులనే వెంకటరమణ వాడతారు. ‘‘మాకు ధర్మవరం పదికిలోమీటర్ల దూరం. రంగులన్నీ అక్కడి నుంచే తెచ్చుకుంటాం. ఆ రంగులు వేస్తే బొమ్మ అందంగా ఉంటుంది, ఎక్కువ కాలం ఆకర్షణీయంగా ఉంటుంది’’ అంటారు వెంకటరమణ. ఢిల్లీ ప్రగతి మైదాన్, హైదరాబాద్ శిల్పారామంలతో సహా ఇప్పటి వరకు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన పట్టణాలలో ఆయన తన కళా కృతులను ప్రదర్శించారు. ‘‘ఆటను ప్రదర్శించడానికైతే కనీసంగా ఆరుగురు మనుషులుండాలి. చిత్రకార కుటుంబాల్లో అందరికీ ఈ కళలో ప్రవేశం ఉంటుంది. తోలుబొమ్మలాట చూడాలనే ఆసక్తి లేకపోయినా, అది ఎలా ఉంటుందో ఈ తరం పిల్లలకు చూపించాలని ఎవరైనా సరదా పడినా సరే ఆట ఆడడానికి తాము సిద్ధమే’’ అంటున్నారు వెంకటరమణ. ఫొటోలు: నోముల రాజేశ్‌రెడ్డి