వృత్తిపరంగా కలిసొచ్చే కాలమిది | In order to survive professionally, lucky | Sakshi
Sakshi News home page

వృత్తిపరంగా కలిసొచ్చే కాలమిది

Published Fri, Sep 4 2015 11:32 PM | Last Updated on Sun, Sep 3 2017 8:44 AM

వృత్తిపరంగా కలిసొచ్చే కాలమిది

వృత్తిపరంగా కలిసొచ్చే కాలమిది

టారో బాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
ఇది మీకు బాగా కలిసొచ్చే కాలం. మీ జీవిత భాగస్వామితో సామరస్యంగా, స్నేహంగా మెలగడం మంచిది. అనవసరమైన చిక్కులు, చికాకులు, టెన్షన్లు ఉండవచ్చు. వాదనలు మానడం మంచిది. శుభవార్తలు వింటారు. తద్ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఉన్నత సోపానాలు అధిరోహిస్తారు. కలిసొచ్చే రంగు: బ్లూ
 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
 ఇది మీకు సాహసోపేతమైన నెల. భాగస్వామ్య వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్లి ఘడియలు సమీపిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది. పొదుపు చేయడానికి ఇది మంచి తరుణం... అయితే పెట్టుబడులకు మాత్రం కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యాయామం చేయడం మంచిది. కలిసొచ్చే రంగు: గ్రీన్
 
జెమిని (మే 21-జూన్ 21)
గతంలో చేసిన వాటి ఫలితం ప్రస్తుతం అనుభవంలోకి వస్తుంది. కోర్టు కేసులలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అతి ముఖ్యమైన నిర్ణయం ఒకటి తీసుకోవ లసి వస్తుంది. మనం అనుకున్నది పొందాలన్నా, చేపట్టిన పనులలో విజయం సాధించాలన్నా రిస్క్ తీసుకోక తప్పదని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: ఎల్లో
 
క్యాన్సర్(జూన్22-జూలై 23)
మీరు ఇంతకాలంగా చేసిన కృషికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తారు. అందుకు ఆనందిస్తారు.  ఖరీదైన వస్తువును కొంటారు లేదా షాపింగ్ చేస్తారు. మీ లవర్ లేదా జీవిత భాగస్వామి ఒక విషయంలో అలకబూనవచ్చు. అవతలి వారిపట్ల మీకున్న ప్రేమ మీరు వారిని అడగాలనుకున్న ప్రశ్నలను అడగనివ్వకుండా మీ నోరు కట్టేస్తుంది. కలిసొచ్చే రంగు: పర్పుల్
 
లియో(జూలై 24-ఆగస్టు 23)
గత ఏడాది కాలంగా పోల్చుకుని చూస్తే ఈ నెలలో ఆర్థికంగా మీరు ఎంతో ఉన్నతిని సాధిస్తారు. వెన్నుపోటుదారుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ ఉన్నతిని చూసి ఎంతోమంది అసూయ చెందుతారు. మీ పై అధికారులకు మీ మీద చాడీలు చెప్పవచ్చు. అయితే ఓపిక వహించ డం మంచిది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. కలిసొచ్చే రంగు: సిల్వర్
 
 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 మీదైన శైలిలో పనిచేసి అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు. ఇతరులు ఎవరైనా మీమీద అసూయ లేదా కోపంతో చేసే పనులకు కోపం తెచ్చుకోకండి. వాళ్లమీద జాలిపడండి. మనసారా నవ్వుకోండి. ఈ వార మంతా మీరు హాయిగా నవ్వుతూ తుళ్లుతూ ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ గురించి కలలు కంటూ ఉంటారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ
 
 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
కొత్తగా ఆలోచించి, సృజనాత్మకతతో చాకచక్యంగా పనులు చేస్తారు. ఇతరుల పట్ల మీ ఆలోచనాధోరణిని మార్చుకోండి. మీ ఆలోచనలలో మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. మీ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే అది సహజమని, జీవితంలో అది కూడా ఒక భాగమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: ఇండిగో
 
స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22)
భయం, అభద్రతా భావాలకు గురికావడం వల్ల చాలా దిగులుగా, ఆందోళనగా కనిపిస్తారు. అంతగా భయపడేటట్లయితే ఎందులోనూ పెట్టుబడులు పెట్టకండి... పనిలో కాని, ఇంటిలో కాని, ఉద్యోగంలో కాని మార్పు ఉండవచ్చు. వ్యాపారస్థులయితే వారి వ్యాపారంలో మార్పు చేస్తారు. విద్యార్థులు తమ సబ్జెక్టులు మార్చుకునే ఆలోచన చేస్తారు. కలిసొచ్చే రంగు: గోల్డ్
 
శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21)

ఈ వారం మీకు ధనం పుష్కలంగా చేతికందుతుంది. పనిప్రదేశంలో అంటే ఆఫీసులో మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కుటుంబంలో ఒక స్త్ర్రీ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. గతాన్ని మరచిపోండి. విజయం మీకు చేరువలోనే ఉందని గ్రహించండి. వృత్తిపరంగా లేదా ఆఫీస్ పరంగా చిన్నపాటి ప్రయాణ ం ఉండొచ్చు. కలిసొచ్చే రంగు: ఎల్లో
 
 అక్వేరియస(జనవరి 21-ఫిబ్రవరి 19)
మీ కలలు నెరవేరే తరుణమిది. డబ్బు గురించి ఏమాత్రం ఆందోళ న అవసరం లేదు. ఈ వారం మీరు బోల్డంత డబ్బు బ్యాంకులో దాచుకుంటారు కూడా! జీవితాన్నితేలికగా తీసుకోండి. విందు వినోదాల్లో గడుపుతారు. ఒక స్నేహితునితో మీ బంధం తిరిగి గట్టిపడుతుంది. అది మీకు ఎంతో ఉపకరిస్తుంది. కలిసొచ్చే రంగు: పర్పుల్
 
 పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20)
కొద్దిపాటి ఒడిదొడుకులు, సమస్యలు, ఎదురు కావొచ్చు. రెండు విధాలైన వృత్తి ఉద్యోగావకాశాలలోదేనిని ఎంచుకోవాలో తెలియక తికమక పడతారు. ప్రేమ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. గతంలో మీరు ఏమిటి, ఏం చేశారన్నది కాదు, ఇప్పుడు ఎలా నడుచుకుంటారన్నదే మీ లక్ష్యసిద్ధికి తోడ్పడుతుందని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: రోజ్ పింక్ కలర్
 
 ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 
 సౌర వాణి
 
 ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20)
మీ సంతానానికి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. భార్యకి భర్తపట్ల, భర్తకి భార్యపట్ల అన్యోన్యత పెరిగే కారణంగా ఈవారంలో కుటుంబంలో సుఖశాంతులు చోటుచేసుకుంటాయి. సంతానం తమ బాధ్యతను తామే నిర్వర్తించుకుంటే కలిగే మనశ్శాంతి ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. అనవసరమైన వ్యయాన్ని అదుపుచేసుకుని మిగులులో ఉంటారు.
 
 టారస్(ఏప్రిల్ 21-మే 20)
అకస్మాత్తుగా మీలో ఆధ్యాత్మిక భావన, దానధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అది మంచి ఆలోచనే కానీ, శక్తికి మించి దానధర్మాలు చేయడం కుటుంబానికి అన్యాయం చేయడమే అవుతుందని గ్రహించుకోగలగాలి. ఆచార వ్యవహారాల పట్ల ఆదరణ పెరుగుతుంది కానీ, అది మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించేలా మారకుండా చూసుకోవాలి.
 
 జెమిని (మే 21-జూన్ 21)
ఎప్పటికప్పుడు ఓ సమస్య రావడం, మనశ్శాంతిని కోల్పోవడం, మళ్లీ అంతలోనే ఆ సమస్యకి పరిష్కారం అప్రయత్నంగా లభించడం, మనోధైర్యాన్ని పొందడం.. ఈవారమంతా ఇలా గడుస్తుంది. దీన్నే ‘క్రియాశూన్య కర్మ’ అంటారు. ఆలోచనలను చేస్తారు కానీ, ఆచరణలోకి తెచ్చేందుకు కావలసిన మనోధైర్యం, సాహసం ఉండకపోవచ్చు.
 
లియో(జూలై 24-ఆగస్టు 23)

 అప్పటికప్పుడు అవసరానికి సొమ్ము వస్తూ, అవసరాలూ, రుణాలూ అలా తీరిపోతూ ఉంటాయి. గత జీవితపు అనుభవంతో పొదుపరితనం, సకాలంలో పనిని ముగించాలనే ఊహ, నష్టపోకుండా బాధ్యతతో వ్యవహరించాలనే దృక్పథం బలంగా వస్తాయి. న్యాయస్థానంలో ఉన్న అభియోగాలన్నీ వీగిపోయి, మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
 
 వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
 ఇప్పట్లో ప్రతికూల పరిస్థితులుండవు కాబట్టి, మీ పనిని ప్రణాళిక ప్రకారం సాగించుకుంటూ వెళ్లిపొండి. ఒత్తిడి లేకుండా ఉద్యోగాన్ని చేసుకోండి. ఇతరులకు హామీలూ, వాగ్దానాలూ వంటివి చేసే ధైర్యం మీకు లేదు కాబట్టి, అలాంటి పరిస్థితి వస్తే మెత్తగానైనా గట్టిగా చెప్పగలిగే లౌక్యం మీకుంది కాబట్టి ఆనందంగా గడపండి.
 
 లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
మీ కుటుంబంలో వచ్చే ఓ సమస్యను నేరుగా ఎవరివల్ల ఆ ఇబ్బంది వచ్చిందో వారితో సూటిగా మాట్లాడుకోవడం వల్ల సత్ఫలితముంటుంది తప్ప, ఇతరుల మధ్య ఈ సమస్యను వివరిస్తే  జటిలమైపోతుంది. కళ్లు తెరిచి చూసుకునే సరికి అందమైన జీవితం కాస్తా ఈ మధ్య వ్యక్తుల కారణంగా ఛిద్రమౌతుందని గ్రహించాలి.
 
స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22)

ప్రతి చిన్న సమస్యనీ భూతద్దంలో చూడడం, మరీ ఎక్కువగా ఆలోచించడం కారణంగా చేస్తున్న ఉద్యోగ, వ్యాపారాల మీద దృష్టి సన్నగిల్లవచ్చు. సమస్య మూలాలను తెలుసుకోగలుగుతారు. శని ఎప్పుడూ చెడు చేయడు, జీవితంలో గొప్ప అనుభవాన్ని ఒక పాఠంలా మనకు అందిస్తాడు. జీవితాల్లో శని ప్రవేశించి కొన్నాళ్లున్నాక మాత్రమే ప్రతి వ్యక్తికి జ్ఞానోదయమవుతుంది.
 
శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21)

‘అలా చేసి ఉంటే ఇంత లాభించి ఉండేది’ అనుకుంటూ వర్తమానంలో నిలబడి, గతంవైపు దృష్టి సారించడం వల్ల కాలహరణం తప్ప ప్రయోజనం సిద్ధించదు. వాయిదా వేసే మనస్తత్వాన్ని విడిచి, కర్తవ్యం మీద దృష్టి సారించండి. జీవితంలో ఓటములనే చవిచూసిన వారితో స్నేహాన్ని కనుక చేస్తే ఇంకా అగాధంలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. జాగ్రత్తగా ఉండండి.
 
క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20)
పూర్తి అనుభవం లేకుండానే మరో వ్యాపారానికి నడుం కడతారు. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సమయం, శ్రద్ధ కుదరని కారణంగా ఆ వ్యాపారం అంతంతమాత్రంగా ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలను పాటించడం అవసరం. ఇతరుల మీద భరోసా ఉంచి మీ పనిని మరొకరితో చేయించడం ఏమాత్రమూ సరికాదు.
 
అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
తాత్కాలిక నిరాశతో పాడి కుండ లాంటి ఉద్యోగాన్ని విడవద్దు. బంధుమిత్రుల సలహాలను, సూచనలను, జాగ్రత్తలను విన్నట్లు నటించండి. ఉద్యోగం కారణంగా మీ సంసారం సుఖంగా సాగుతోందని, ఆ ఉద్యోగం ద్వారానే మీకు ఒక గుర్తింపు లభించిందని భావించాలి తప్ప, దీన్ని విడిచేస్తే మరోటి గొప్పదేదో దొరుకుతుందనుకోవడం కల్ల. తొందరపడవద్దు.
 
పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20)
మీ మాటని మీ కిందివాడు వినకపోతే మీకెలా ఉంటుందో, అదే పరిస్థితి మీ విషయంలో మీ పైవానికీ ఉంటుంది. కాబట్టి పైవారికి అనుకూలంగానే ఉండండి. ఆస్తుల కొనుగోళ్లపై దృష్టి పెట్టకుండా పిత్రార్జితాన్ని గురించిన వివాదాలను కొంత నష్టపోయి అయినా తెగతెంపులు చేసుకోండి. కాలంగడిచేకొద్దీ విషయం ముదురుపాకానికి వెళ్లవచ్చు.

మైలవరపు శ్రీనివాసరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement