Insiya K.
-
వారఫలాలు
16 జూన్ నుంచి 22 జూన్ 2019 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న పనుల్లో కొంత జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. విద్యా, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితిలో చెప్పుకోతగినంతగా మార్పు ఉండదు. అయితే అవసరాలకు లోటు రాదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరణలో విజయం. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో వివాదాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొన్ని సంఘటనలకు ఆశ్చర్యచకితులవుతారు. ఆలయాలు,ఆశ్రమాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. పరిస్థితులు కొంత అనుకూలించకపోయినా నేర్పుగా పనులు చక్కదిద్దుతారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఈతిబాధలు, సమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొత్త పనులు చేపట్టి దిగ్విజయంగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. కుటుంబంలో మీ నిర్ణయాలకు ఎదురుండదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో మీరు కోరుకున్న మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి విశేష గుర్తింపు రాగలదు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యతిరేకులు కూడా మీ మాటకు ఎదురుచెప్పలేని పరిస్థితి. ఆర్థిక విషయాలలో గతం కంటే పుంజుకుంటారు ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు జరుపుతారు. బంధువులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు విజయవంతమవుతాయి. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబి, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వారారంభంలో నెలకొన్న ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. ఆర్థికంగా కొంత ఇబ్బంది కలిగినా అధిగమించి ముందడుగు వేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. కొన్ని దీర్ఘకాలిక వివాదాలు నైపుణ్యం, తెలివిగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో నెలకొన్న ప్రతిష్ఠంభన తొలగుతుంది. ఉద్యోగాలలో మరింత అనుకూలమైన పరిస్థితి. వారం ప్రారంభంలో బంధువులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. నేరేడు, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఈ వారం మిశ్రమంగా ఉంటుంది. అనుకున్న పనులు కొంత నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగులు, విద్యార్థులు భవిష్యత్తుపై పెట్టుకున్న ఆశలు ఫలిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్య, కుటుంబసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. అయినా లెక్కచేయరు. మీ లక్ష్యాలు సాధించడంలో జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. పరిశోధకులకు శుభవార్తలు. వాహనయోగం. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. రాజకీయవర్గాలకు పదవీయోగం, సన్మానాలు. వారం చివరిలో తీర్థయాత్రలు. వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) అనుకున్న పనులు ముందుకు సాగక కొంత నిరాశ చెందుతారు. సోదరులతో ఆస్తి వ్యవహారాలలో వివాదాలు నెలకొనే అవకాశం. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. ఒక వ్యక్తి ద్వారా కొంత సహాయం పొందుతారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. మీ నిర్ణయాలు తరచు మార్చుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వీరికి అన్ని విధాలా అనుకూల సమయం. ఆర్థికంగా గతం కంటే మరింత బలం చేకూరుతుంది. విద్యార్థులు సత్తా చాటుకుని మంచి ఫలితాలు సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చాకచక్యంగా కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉండి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో సమర్థత నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు. గులాబి, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. నేర్పుగా కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలు పొందుతారు. కొత్త మిత్రుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకుంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. వివాహాది వేడుకలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు గతంతో పోలిస్తే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విశేష ప్రగతి తథ్యం. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఎంతటి వారినైనా మాటల చాతుర్యంతో ఆకట్టుకుంటారు. విద్యార్థులు నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. ఆస్తుల విషయంలో సోదరులతో సర్దుబాటు వైఖరి అనుసరిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకుని అందర్నీ ఆశ్చర్యపరుస్తారు. వ్యాపారాలు వృద్ధిబాటలో సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆసక్తికర విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులు పరిచయం కాగలరు. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు సైతం మీపట్ల ఆకర్షితులవుతారు. గతంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకుంటూ ముందుకు సాగుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి.సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో 16 జూన్ నుంచి 22 జూన్, 2019 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త అవకాశాలు అనుకోకుండా కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పరిస్థితులు అనుకూలం. కొందరికి పదోన్నతలు దక్కే సూచనలు ఉన్నాయి. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సామాజిక సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. కుటుంబం నుంచి ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అలకలు పెరిగి తీవ్ర మనస్పర్థలకు దారితీసే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. అకాల భోజనం కారణంగా ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: ముదురు గులాబి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఇంటా బయటా పనులలో తలమునకలుగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో కూడా పని భారం పెరుగుతుంది. చివరి నిమిషం వరకు తాత్సారం చేయకుండా సకాలంలో పనులు ముగించడమే క్షేమం. ఉద్యోగులకు స్వల్ప ఆర్థిక ప్రయోజనాలు దక్కవచ్చు. ప్రేమికుల నడుమ బీటలు పడిన అనుబంధాన్ని తిరిగి పటిష్టం చేసుకోవడానికి స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. కుటుంబానికి తగినంత సమయం కేటాయించలేకపోతారు. ఇంట్లోని వృద్ధుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. వివాదాల్లో చిక్కుకునే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించడం మంచిది. లక్కీ కలర్: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఇటో అటో తేల్చుకోవలసిన పరిస్థితులు తలెత్తుతాయి. ఒక నిర్ణయానికి రావడం విషమ పరీక్షలా మారుతుంది. ఆచి తూచి తీసుకున్న నిర్ణయాలతో పరిస్థితులను అతి కష్టం మీద చక్కదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల నుంచి చిక్కులు తలెత్తినా, మీ ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు, ఉన్నతాధికారుల ఆదరణ దక్కుతాయి. ఆకస్మికంగా వచ్చిన ప్రేమ ప్రతిపాదనపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. స్వల్ప కాలిక పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. సమస్యల్లో ఉన్న చిరకాల మిత్రుని ఆదుకుంటారు. సుదూర పర్యటనలకు ప్రణాళికలు వేసుకుంటారు. లక్కీ కలర్: గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) సాధించిన విజయాలేవీ సంతృప్తినివ్వవు. ఆత్మావలోకనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక చింతన ఎక్కువవుతుంది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో కీలక బాధ్యతలను చేపడతారు. త్వరలోనే ఒక కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సర్వం సిద్ధం చేసుకుంటారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. బృహత్ లక్ష్యాన్ని సాధించడానికి అకుంఠిత దీక్షతో కృషి కొనసాగిస్తారు. సామాజిక సేవా సంస్థలకు చేయూతనిస్తారు. వాటి కార్యక్రమాల్లో స్వయంగా పాలు పంచుకుంటారు. కుటుంబ సభ్యులతో కలసి సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) పని ఒత్తిడి ఎలా ఉన్నా, వృత్తి ఉద్యోగాల్లోని విధి నిర్వహణకూ కుటుంబ బాధ్యతలకూ నడుమ సమతుల్యతను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో గణనీయమైన అభివృద్ధి సాధిస్తారు. సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. పరిస్థితులన్నీ సానుకూలంగానే ఉన్నా, భవిష్యత్తుపై అర్థంలేని అభద్రతాభావానికి లోనవుతారు. సన్నిహితుల ఆప్యాయతను ఆస్వాదిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆరోగ్యం కొంత మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార నియమాలను పాటించడం, వ్యాయామం కొనసాగించడం ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోగలుగుతారు. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటికి కొత్త అలంకరణలు చేయిస్తారు. చాలాకాలంగా కొనసాగిస్తున్న దీర్ఘకాలిక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. సుదూర ప్రయాణాలు చేస్తారు. ప్రత్యర్థులు ప్రచారం చేసే వదంతులు మనస్తాపం కలిగిస్తాయి. ప్రేమ వ్యవహారాలకు పెద్దల నుంచి వ్యతిరేకత ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అధ్యయనం, పరిశోధనలపై దృష్టి సారిస్తారు. నైపుణ్యాలను మరింత మెరుగుపరచుకునేందుకు ప్రయత్నిస్తారు. ఆధ్యాత్మిక పురోగతి కోసం గురువులను ఆశ్రయిస్తారు. లక్కీ కలర్: నేరేడు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఉద్విగ్నభరితమైన కాలాన్ని ఆస్వాదిస్తారు. ఇంటా బయటా సందడి సందడిగా పనుల్లో తలమునకలవుతారు. వేడుకల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు చక్కబడతాయి. కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. భారీ స్థాయి కార్యక్రమాల నిర్వహణలో దక్షతను చాటుకుంటారు. ఒడిదుడుకుల నుంచి తేరుకుంటారు. వరుస అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషభరితంగా గడుపుతారు. పిల్లలు సాధించిన విజయాలకు గర్విస్తారు. కాలంతో పోటీ పడి మరీ లక్ష్యాలను సాధిస్తారు. ప్రియతములను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వరుస విజయాలతో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పటిమను రుజువు చేసుకుంటారు. తగిన దిశా నిర్దేశం చేసి మీ బృందాన్ని లక్ష్యాల వైపు నడిపిస్తారు. స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త కార్యక్రమాలను చేపడతారు. సంస్థలోని ప్రతిభావంతులను ప్రోత్సహిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. శరీర ఆకృతిని తీర్చిదిద్దుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు. వస్త్రాలంకరణలో మార్పులు చేసుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రియతములను కానుకలతో ఆకట్టుకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఇప్పటి వరకు కమ్ముకున్న చీకట్లు తొలగిపోతాయి. బతుకుబాటలో కొత్త వెలుగులు ప్రసరిస్తాయి. త్వరలోనే శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. జరుగుతున్న పరిణామాల పట్ల సంతృప్తితో ఉంటారు. ఆత్మవిశ్వాసంతో అవకాశాలను అందిపుచ్చుకుంటారు. అదృష్టం కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లోని వారికి పదవులు దక్కే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు విదేశీ అవకాశాలు కలసి వస్తాయి. ప్రేమికుల మధ్య తలెత్తిన పొరపొచ్చాలు తేలికగానే సమసిపోతాయి. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) దీక్షా దక్షతలను నిరూపించుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత భవితవ్యం కోసం కొత్త దార్శనికతతో ముందుకు సాగుతారు. స్వయంకృషితో పరిస్థితులను సానుకూలంగా మలచుకుంటారు. వినూత్న కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటారు. పాత బకాయిలను తీర్చేస్తారు. ఆత్మీయుల నుంచి కానుకలు అందుకుంటారు. చాలాకాలంగా న్యాయస్థానాల్లో నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పురోగతం వేగం పుంజుకుంటుంది. ముందుచూపుతో పెట్టిన స్వల్పకాలిక పెట్టుబడులు మంచి లాభాలనిస్తాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అనుకున్న ఫలితాల కోసం మరికొంత కాలం వేచి చూడక తప్పదు. స్వల్ప నిరీక్షణ తర్వాత అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులకు సంబంధించిన భ్రమలు తొలగిపోతాయి. కీలకమైన సమయంలో దొరికిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఆత్మీయుల ప్రవర్తనలోని ఆకస్మిక మార్పు మనస్తాపం కలిగిస్తుంది. సన్నిహితులతో వాగ్వాదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: నీలం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఎలాంటి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కోవడానికి సర్వ సన్నద్ధంగా ఉంటారు. భయాలను జయిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తూ విజయపథంలో దూసుకుపోతారు. సామాజిక కార్యక్రమాల్లో తలమునకలుగా ఉంటారు. సేవా కార్యక్రమాలకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పని ఒత్తిడి నుంచి కాస్త ఆటవిడుపుగా సుదూర ప్రయాణాలకు బయలుదేరుతారు. క్రీడలపై ఆసక్తి పెంచుకుంటారు. కొత్త భాషలు నేర్చుకునేందుకు ఆసక్తి చూపుతారు. లక్కీ కలర్: పసుపు ఇన్సియాటారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ ఆలోచనలు బంధువులతో పంచుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. వాహనయోగం. ఒక దీర్ఘకాలిక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు సన్మానాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. గులాబి, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. బంధువులతో తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు కష్టసాధ్యమే. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు నిర్వíß స్తారు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో మార్పులు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నీలం, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న పనులు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో మరింత గౌరవం లభిస్తుంది. మీ నిర్ణయాలు కుటుంబంలో అందరికీ శిరోధార్యంగా ఉంటాయి. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ఆస్తుల వ్యవహారంలో చికాకులు తొలగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వాహనాలు, గృహయోగాలు కలుగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీహోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబి, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పఠనం మంచిది. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఇంటాబయటా సమస్యలు తీరతాయి. ఊహలు నిజం చేసుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం రాగలదు. వివాహాది వేడుకలకు హాజరవుతారు. భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో కలహాలు. గులాబి, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ముఖ్యమైన పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు పాటిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆర్థిక విషయాలలో చికాకులు తొలగుతాయి. నిరుద్యోగులు ఉపా«ధి అవకాశాలు అందుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. లేత పసుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పట్టుదలతో విజయాలు సాధిస్తారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలను పరిష్కరించుకుని ముందడుగు వేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. గృహయోగం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. తెలుపు, లేత గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) విశేష గౌరవంతో పేరుప్రతిష్ఠలు పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. విద్యార్థులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వాగ్ధాటితో అందర్నీ ఆకట్టుకుంటారు. గృహయోగ సూచనలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. రాజకీయవర్గాలకు అప్రయత్న కార్యసిద్ధి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) రుణఒత్తిడులు తొలగి ఊరట చెందుతారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహయోగాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. కళారంగం వారికి ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబి, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. నీలం, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులు, బంధువులు మరింత ఆదరిస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. గతం గుర్తుకు వస్తుంది. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు సర్దుబాటు కాగలవు. విద్యార్థుల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో కలహాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. సంఘంలో గౌరవానికి లోటు రాదు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలను దక్కించుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. శక్తియుక్తులతో సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీయానం. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువులతో తగాదాలు ఏర్పడవచ్చు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు ∙టారో 23 డిసెంబర్ నుంచి 29 డిసెంబర్ 2018 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అంతా శుభదాయకంగా ఉంటుంది. పట్టిందల్లా బంగారం అన్న రీతిలో అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి గణనీయమైన ఆర్థిక లబ్ధితో పాటు పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. అధికార లాభం, వాహనయోగం కలిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. సన్నిహితులతో ఆలోచనలు పంచుకుంటారు. భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకునే లక్ష్యంతో ఆర్థిక ప్రణాళికలు రూపొందించుకుంటారు. ప్రేమికుల అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. శుభకార్యాలు తలపెడతారు. లక్కీ కలర్: బంగారు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) చేపట్టిన పనులన్నింటినీ విజయవంతంగా పూర్తి చేస్తారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అధికారుల అండ లభిస్తుంది. రెట్టించిన ఉత్సాహంతో ఒక్కొక్కటిగా లక్ష్యాలను సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త ఇంటి కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం వైపు దృష్టి సారిస్తారు. ఒంటరిగా ఉంటున్నవారు ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: బూడిద రంగు మిథునం (మే 21 – జూన్ 20) పనులను సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు ఆశించిన ఫలితాలను సాధిస్తారు. పనిచేసే చోట మీరు కోరుకున్న రీతిలోనే భావి పరిణామాలు ఉంటాయి. ప్రత్యర్థులను కట్టడి చేస్తారు. వివాదాస్పద పరిస్థితుల నుంచి బయటపడతారు. జాగ్రత్తగా రూపొందించుకున్న ప్రణాళికలు అద్భుతమైన ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సంకల్పబలంతో ఘన విజయాలను సాధిస్తారు. పెద్దల ఆరోగ్యం ఆందోళన కలిగించే సూచనలు ఉన్నాయి. వారాంతంలో పని ఒత్తడి పెరగవచ్చు. ఆధ్యాత్మిక సాధనతో ప్రశాంతత పొందుతారు. లక్కీ కలర్: నేరేడు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఉన్నత లక్ష్యాలను పెట్టుకుంటారు. లక్ష్య సాధన కోసం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రణాళికలను రూపొందించుకుని, వాటిని కార్యాచరణలో పెడతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు సన్నిహితుల సహకారంతో మంచి అవకాశాలను చేజిక్కించుకుంటారు. శ్రమకు, ఫలితానికి వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుని, మార్పు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. కోరుకున్న మార్పు కోసం నిరీక్షణ తప్పకపోవచ్చు. ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. లక్కీ కలర్: లేత గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) అనూహ్యమైన మార్పులు అనివార్యమవుతాయి. స్థిరత్వాన్ని కోరుకుంటున్న సమయంలో ఎదురయ్యే ఈ మార్పులు కొంత ఆందోళనకు గురి చేస్తాయి. ఆందోళన పడాల్సిందేమీ లేదు. మార్పు మంచిదేనని అనుభవంపై తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు శక్తి సామర్థ్యాలను చాటుకుంటారు. అద్భుతమైన ఫలితాలు సాధించి సహచరులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తారు. వ్యాపారరంగంలోని వారు భాగస్వామ్య ఒప్పందాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇంట్లో శుభకార్యాలను తలపెడతారు. ప్రేమికుల పెళ్లికి మార్గం సుగమమవుతుంది. లక్కీ కలర్: గోధుమ రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. సహజమైన మీ ప్రతిభా పాటవాలతో అపురూపమైన విజయాలను సొంతం చేసుకుంటారు. ఆచి తూచి అడుగులు ముందుకేస్తారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. పని ఒత్తిడి నుంచి కొంత విరామం కోరుకుంటారు. ఇదివరకు చూడని ప్రదేశాలకు విహార యాత్రలకు వెళతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇబ్బందుల్లో ఉన్న మిత్రులను ఆదుకుంటారు. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు మరింతగా పెనవేసుకుంటాయి. లక్కీ కలర్: గులాబి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశ నిరాశల ఊగిసలాట నుంచి బయటపడతారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. దైవబలాన్ని నమ్ముకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని సమస్యలు నెమ్మదిగా ఒక కొలిక్కి వస్తాయి. ప్రత్యర్థులు పుట్టించే వదంతులు మనస్తాపం కలిగించే సూచనలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. గొప్ప అవకాశం తలుపు తడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచవలసి వస్తుంది. ఆహార విహారాల్లో మార్పులు అనివార్యం అవుతాయి. ప్రేమికులు ప్రణయ రసాస్వాదనలో తన్మయులవుతారు. విదేశయాత్రల కోసం చేసే ప్రయత్నాలు ఫలప్రదమవుతాయి. లక్కీ కలర్: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) సంపదను పెంచుకుంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి అధికార పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. సామాజికంగా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. సాహితీ కళా రంగాల్లోని వారికి సభా మర్యాద, సన్మానాలు దక్కే సూచనలు ఉన్నాయి. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ఒక అద్భుతమైన వ్యక్తి మీతో ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. చిరకాల స్వప్నాలు నెరవేరుతాయి. ఆరోగ్యం కాస్త మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో మార్పులు చేయాల్సి రావచ్చు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. వాక్చాతుర్యంతో ప్రత్యర్థులను దారికి తెచ్చుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు సద్దుమణుగుతాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. సకుటుంబంగా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. సకాలానికి రుణాలు అందుతాయి. అందంపై, ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు. ప్రేమికుల మధ్య అనుకోని ఎడబాటు మానసికంగా కుంగదీసే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ముదురు గులాబి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వలమైన భవిష్యత్తు కోరుకుంటారు గాని, ఊహాలోకంలో విహరిస్తారు. ఊహాలోకం నుంచి బయటపడితేనే భవిష్యత్తును తీర్చిదిద్దుకునే అవకాశాలు ఉంటాయి. ఆలస్యం చేయకుండా ఆలోచనలను ఆచరణలో పెట్టండి. సత్ఫలితాలను పొందగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలను మోయాల్సిన పరిస్థితులు ఉంటాయి. సంయమనం పాటించి, సవాళ్లను స్వీకరిస్తేనే మీ సత్తా లోకానికి రుజువవుతుంది. సంతృప్తికరమైన రీతిలో ఆదాయం పెరిగే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఊదా కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి అనువైన సమయం ఇది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. ఆర్థిక లాభాలు సంతృప్తికరమైన స్థాయిలో ఉంటాయి. అనూహ్యమైన రీతిలో విజయాలు సాధిస్తారు. ప్రత్యర్థుల దూకుడుకు కళ్లెం వేస్తారు. కళాకారులకు కొత్త అవకాశాలు అంది వస్తాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో మదుపు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వివాదాస్పద వ్యక్తుల నుంచి సమస్యలు తలెత్తవచ్చు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ ఫలిస్తుంది. లక్కీ కలర్: వెండి రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అవరోధాలను అధిగమిస్తారు. ప్రణాళికల రూపకల్పన కోసం కాలాన్ని వృథా చేసుకోకండి. జరిగే పరిణామాలను గమనిస్తూ ఉండండి. సమస్యలు వాటంతట అవే సద్దుమణుగుతాయి. ఇదివరకటి కఠోర పరిశ్రమ తాలూకు ఫలితాలు ఇప్పుడిప్పుడే అందడం మొదలవుతుంది. భవిష్యత్తులో మరిన్ని మంచి ఫలితాలను దక్కించుకోగలుగుతారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వాహనాన్ని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. విందు వినోదాల కోసం ఖర్చు చేస్తారు. సన్నిహితులకు కానుకలు ఇస్తారు. ప్రియమైనవారితో విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఈవారం మౌనం మంచిది. మిత్రులేææ శత్రువులుగా మారతారు. నిరుద్యోగుల యత్నాలలో అవరోధాలు. చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేతికందవలసిన డబ్బు కొంత ఆలస్యమై అప్పులు చేస్తారు. కుటుంబసభ్యులు, బంధువులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలలో లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాల్లో మార్పులు అనివార్యం. రాజకీయవర్గాలకు చికాకులు పెరుగుతాయి. వారం ప్రారంభంలో శుభవర్తమానాలు. ధనలబ్ధి. నూతన పరిచయాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి కాగలవు. మీ నిర్ణయాలను కుటంబసభ్యులు వ్యతిరేకిస్తారు. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు ఎదురవుతాయి. ఇతరుల విషయాల్లో జోక్యం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతాయి, అప్రమత్తత అవసరం. ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో విందువినోదాలు. ధన,వస్తులాభాలు. నూతన విద్యావకాశాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తత్రేయ స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఆహ్వానాలు అందుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక అవసరాలు తీరతాయి. ఆకస్మిక ధనలాభాలు కలుగుతాయి. కుటుంబసభ్యుల ఆదరణ చూరగొని సంతోషంగా గడుపుతారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. స్వల్ప అనారోగ్యం, ఔషధసేవనం. వ్యాపారాలు పుంజుకుని ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాల్లో హోదాలు అప్రయత్నంగా దక్కుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు.అనుకోని ధనవ్యయం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ, ఆరోగ్యసమస్యలతో ఇబ్బందిపడతారు. మిత్రులతో అకారణంగా విభేదాలు. తరచూ నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. తీర్థయాత్రలు చేస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. నిరుద్యోగులు, విద్యార్థుల ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి,లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కార్యజయంతో ఉత్సాహంగా సాగుతారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగి లబ్ధి పొందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. రావలసిన డబ్బు సకాలంలో అంది సమస్యల నుంచి బయటపడతారు. కుటుంబసభ్యుల అభిమానాన్ని పొందుతారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో అనుకూల స్థితి. రాజకీయవర్గాలకు సన్మానాలు, విదేశీయానం. వారం మధ్యలో కుటుంబంలో చిక్కులు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) అందరిలోనూ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా పూర్తి కాగలవు. వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. గృహ నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభ సూచనలు. ఒక దీర్ఘకాలిక వివాదం నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో కొత్త హోదాలు. కళాకారులు అప్రయత్నంగా అవకాశాలు దక్కించుకుంటారు. వారం చివరిలో మిత్రులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ప్రముఖుల నుంచి కీలక విషయాలు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. శత్రువులు సైతం అనుకూలంగా మారి సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. మీ కృషికి కుటుంబసభ్యులు సహకరిస్తారు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. ఆప్తులతో కలహాలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. విద్యార్థులు శ్రమపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యంపై ్రÔ¶ ద్ధ చూపండి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు సంభవం. రాజకీయవర్గాల యత్నాలు ముందుకు సాగవు. వారం చివరిలో విందువినోదాలు. స్వల్ప ధనలాభం. వాహనయోగం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) శ్రమకు తగిన ఫలితం అందుకోలేరు. ముఖ్యమైన వ్యవహారాలలో ప్రతిబంధకాలు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్య, కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. మిత్రుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం, వాహనాల కొనుగోలులో అవాంతరాలు. వేడుకల నిర్వహణలో జాప్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఆశించిన లాభాలు కష్టమే. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు తప్పవు. కళారంగం వారికి నిరుత్సాహం, విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అనుకున్న పనుల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు కార్యసాధకులై సత్తా చాటుకుంటారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు. కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అందరినీ ఆకట్టుకుంటారు. కుటుంబసభ్యులతో సఖ్యత నెలకొంటుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు తగిన లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనూహ్యమైన మార్పులు ఉంటాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్యభంగం. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతికి అర్చన చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన పనుల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. మీ ఆకాంక్షలు నెరవేరే సమయం. చిరకాల ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనయోగం. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. రుణదాతల ఒత్తిడుల నుంచి బయటపడతారు. శుభకార్యాలతో హడావుడిగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కి కొంత ఊరట లభిస్తుంది. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ప్రారంభంలో అనారోగ్యం, కుటుంబంలో సమస్యలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. సోదరులు, మిత్రులతో అకారణంగా విరో«ధాలు. ఇంటాబయటా వ్యతిరేక పరిస్థితులు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది, తద్వారా వైద్యసేవలు. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. మీ నిర్ణయాలను అందరూ వ్యతిరేకిస్తారు. కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. వ్యాపారాలలో లాభాల కోసం మరింత కృషి చేయాలి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో ధనలాభం. ప్రముఖుల పరిచయం. శుభవార్తలు. గులాబీ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీలో నూతనోత్సాహం వెల్లివిరుస్తుంది. కొత్తగా పుంజుకున్న జవసత్త్వాలతో సవాళ్లను స్వీకరిస్తారు. ధైర్య సాహసాలతో ప్రతికూలతలను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. ఊహించని రీతిలో కఠినమైన లక్ష్యాలను అలవోకగా సాధించి అధికారుల ప్రశంసలు పొందుతారు. సామాజికంగా పరపతిని పెంచుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామికి కానుకలు ఇస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. దైవానుగ్రహం అనుకూలంగా ఉంది. లక్కీ కలర్: ముదురాకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అంచనాలకు మించిన శుభఫలితాలు ఉంటాయి. జీవితం ఒక అద్భుతంలా అనిపిస్తుంది. మీలోని సద్గుణ సంపద, ఔదార్యం ఇతరులకు స్ఫూర్తినిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉంటాయి. అవసరంలో ఉన్న ఒక మిత్రుని ఆదుకుంటారు. ఇతరుల ఆనందం కోసం తపిస్తారు. కుటుంబ జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపారరంగంలోని వారికి కొత్త అవకాశాలు అందివస్తాయి. ఆస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఇంటికి, కార్యాలయానికి కొత్తగా అలంకరణలు చేపడతారు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: నీలం మిథునం (మే 21 – జూన్ 20) వాక్చాతుర్యంతో జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. సామాజిక బృందాల్లో మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. వృత్తి ఉద్యోగాల్లో సహచరులు మీ సలహాలను కోరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి ఎదగడానికి దోహదపడే ఒక గొప్ప అవకాశం కలసి వచ్చే సూచనలు ఉన్నాయి. సామాజిక అంశాలపై మీకు గల నిశ్చితాభిప్రాయాలు మీ గౌరవాన్ని పెంచేవిగా ఉంటాయి. ఆశించిన ఫలితాల కోసం అహరహం కృషి చేస్తారు. క్రమశిక్షణతో ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. సుదూర ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. లక్కీ కలర్: నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలిగే కొత్త అవకాశం వస్తుంది. వ్యాపార రంగంలో అనూహ్యమైన లాభాలు వస్తాయి. ప్రేమికుల నడుమ అనుబంధం మరింతగా పెనవేసుకుంటుంది. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరచిపోయారా అన్నంతగా ప్రేమానురాగాలను ఆస్వాదిస్తారు. పని ఒత్తిడికి దూరంగా కొంత విరామం తీసుకుంటారు. విహారయాత్రలకు వెళతారు. సృజనాత్మక రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు కలసి వస్తాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు మరింతగా ఇనుమడిస్తాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) చిరకాల లక్ష్యాన్ని సాధిస్తారు. కలలను సాకారం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మరో మెట్టు పైకెదుగుతారు. సవాళ్లను స్వీకరిస్తారు. విజయపథంలో ముందుకు దూసుకుపోతారు. నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేస్తారు. కుటుంబ విషయాలకు సంబంధించి జీవిత భాగస్వామితో చర్చించి, నిర్ణయాలు తీసుకుంటారు. పొదుపుపై దృష్టి సారిస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విమర్శకుల వ్యాఖ్యలకు మాటలతో కాక చేతలతోనే బదులు చెబుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆధ్యాత్మికమార్గంలో పురోగతి సాధిస్తారు. లక్కీ కలర్: పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మానసికంగా మరింత దృఢనిశ్చయంతో ముందుకు సాగుతారు.. ఒక అద్భుతమైన కొత్త అవకాశం అనుకోకుండా అందివస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఘనవిజయాలు సాధిస్తారు. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నాయకత్వ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమలో పడతారు. ప్రియతముల సమక్షం ఉత్సాహాన్నిస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ గణనీయంగా పెరుగుతుంది. లక్కీ కలర్: లేత పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: ముదురు గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: మీగడ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: ఊదా మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: లేతనీలం ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో కొంత పురోగతి సాధిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల నుంచి విముక్తి లభిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు నూతన పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొన్ని వ్యవహారాలలో ఇబ్బందులు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. రాబడి తగినంతగా ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆస్తి వివాదాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారాలు కొంతవరకూ పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనూహ్యమైన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో కుటుంబంలో కలహాలు. ఒత్తిడులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థులకు మరింత ఉత్సాహం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. చాకచక్యంగా వివాదాల నుంచి బయటపడతారు. రియల్‌ఎస్టేట్‌ల వారికి ఊహించని అభివృద్ధి కనిపిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. కళారంగం వారికి సన్మాన, సత్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆలోచనలు కలసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు. రియల్‌ఎస్టేట్‌ల వారికి ప్రోత్సాహకరం. నిరుద్యోగులు లక్ష్యాలు సాధిస్తారు. బంధువుల సహాయం అందుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వ్యాపారాలు విస్తరిస్తారు, కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పసుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కుటుంబానికి సంబంధించి ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. కాంట్రాక్టర్లకు విశేషంగా కలసి వస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. వస్తులాభాలు. నిరుద్యోగుల యత్నాలలో పురోగతి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో వివాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనులు కొంత నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉన్నా అవసరాలు తీరతాయి. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల సమాచారం. కళారంగం వారు అనుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుకుని విస్తరిస్తారు. ఉద్యోగుల సమర్థత వెలుగులోకి వస్తుంది. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. అనుకున్న పనులలో జాప్యం. ఎంతగా శ్రమపడ్డా ఫలితం కనిపించదు. నిర్ణయాలలో తొందరపాటు వద్దు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. కుటుంబంలో ఒత్తిడులు. విద్యార్థులకు నిరుత్సాహవంతంగా ఉంటుంది. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వ్యూహాత్మక వైఖరితో శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త మిత్రులు పరిచయం కాగలరు. ఆస్తి వివాదాలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణాల్లో కొంత ప్రగతి కనిపిస్తుంది. ఆలయాలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు సమస్యలు తొలగుతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు అనుకూల వాతావరణం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. తెలుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ప్రత్యర్థుల నుంచి కూడా మాటసహకారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. కుటుంబసమస్యల నుంచి కొంత గట్టెక్కుతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఊహించని హోదాలు రాగలవు. కళాకారులు అవకాశాలు దక్కించుకుంటారు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నలుపు, లేత నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) వ్యూహాత్మకంగా వ్యవహరించి సమస్యల నుంచి బయటపడతారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణతో బిజీగా గడుపుతారు. సంతోషకరమైన సమాచారం అందుతుంది. సోదరులు, మిత్రులతో తగాదాలు పరిష్కారం. విద్యావకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయం కాగలరు. భూయోగం. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో ప్రగతి కనిపిస్తుంది. కొందరికి పదోన్నతులు దక్కే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభిస్తాయి. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. నేరేడు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఊహించని విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. నూతన పరిచయాలు. సమస్యలు సృష్టించిన వారిని కూడా ఆదరిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. ఇంటాబయటా ఎదురులేని పరిస్థితి. చిరకాల మిత్రులు తారసపడతారు. వ్యాపారాలలో అనూహ్యంగా పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. కళారంగం వారి కళానైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. అనారోగ్యం. గులాబి, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (8 ఏప్రిల్ నుంచి 14 ఏప్రిల్, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఒక కొత్త జీవితం వైపుకు అడుగులు వేస్తారు. గతాన్ని గురించి ఎంత తక్కువ ఆలోచిస్తే అంత మంచిదని నమ్మండి. మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక గొప్ప అవకాశానికి పునాది కూడా ఇక్కడే పడుతుంది. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. ఆత్మవిశ్వాసంతో, ఏ పని చేసినా మీదైన ముద్ర కనిపించేలా కష్టపడతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : లేత నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఒక చిన్న ఆలోచన మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఆ ఆలోచన చుట్టూనే ఒక గొప్ప అవకాశానికి దారులు కనిపిస్తాయి. జీవితాశయం వైపు అడుగులు వేస్తారు. అందుకు ఇదే సరైన సమయమని నమ్ముతారు. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే ఒక వేదిక మీకు దొరుకుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తి మీకిచ్చే ఓ బహుమతి మిమ్మల్ని ఉల్లాసంగా ఉంచుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. కలిసివచ్చే రంగు : గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) కొన్ని సమస్యలకు మూలాలు మన లోపలే ఉంటాయి. మన ఆలోచనలే ఆ సమస్యలను పుట్టిస్తాయి. మనల్ని మనం అన్వేషించుకుంటూ వెళితే తప్ప అర్థం చేస్కోలేని తత్వం ఇది. మీరు ఆ దిశగా కొన్ని అడుగులు వేయడానికి ప్రయత్నిస్తారు. దీంతో ఇప్పటివరకూ కోల్పోయిన ప్రశాంతత అంతా ఒక్కసారే మీకు ఎదురైనట్టు అనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తితో పరిచయం కొద్దిరోజుల్లోనే ప్రేమగా మారుతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ ఆలోచనలు రెక్కలు కట్టుకొని ఎగరాలి. అందుకు సరికొత్త మార్గాలను ఎప్పటికప్పుడు మీరే అన్వేషించుకుంటూ వెళ్లాలి. మీకేది కావాలో తెలుసుకొని, ఎందుకు ఏ పని చేస్తున్నారో నిర్ణయించుకొని ముందుకెళ్లండి. ఒక కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే అద్భుతంగా ఉంటుంది. మిమ్మల్ని ప్రేమించే వారికి అన్నివిధాలా అండగా నిలబడండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. కలిసివచ్చే రంగు : వంకాయ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీరనుకున్నట్టే అన్నీ జరిగితే అది జీవితం కాదని తెలుసుకోండి. కొన్ని గొప్ప మార్పులకు సంకేతాలను ప్రకృతి మనకు ముందే పంపిస్తుంది. వాటిని అర్థం చేస్కొని ఆ దిశగా మన అడుగులు వెయ్యాలని తెలుసుకోండి. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఒక అవకాశం మీ తలుపు తడుతుంది. కొన్ని ఒడిదుడుకులు ఉన్నా ప్రేమ జీవితంలో ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకుంటారు. ఆర్థిక çగతంలో కంటే మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొత్త విషయాలు తెలుసుకున్నప్పుడల్లా మీ ముఖంలో ఒక రకమైన వెలుగు కనిపిస్తుందని తెలుసుకోండి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటూ వెళ్లడాన్ని అలవాటు చేసుకోండి. ప్రేమ జీవితం మీకొక గొప్ప వరం. ప్రేమించిన వ్యక్తికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ మిమ్మల్ని మీరు ఉత్సాహంగా ఉంచుకుంటారు. ఆత్మవిశ్వాసమే మీ ఆయుధమని నమ్మండి. కొన్ని విషయాల్లో కొందరిని తక్కువ చేసి చూడడం మీకు సరదా. దీన్ని ఇప్పుడే వదిలించుకోండి. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఈవారమంతా చాలా సంతోషంగా ఉంటారు. కొత్త ఆలోచనలు మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతాయి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ఇది మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేయాలని ఆలోచిస్తారు. అందుకు ఇదే సరైన సమయమని కూడా గ్రహించండి. కొద్దికాలంగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్యలన్నీ ఇప్పుడిప్పుడే కొలిక్కి వస్తాయి. అనవసర ఖర్చులకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు : గోధుమ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఎప్పట్నుంచో మిమ్మల్ని ఎదురుచూపులకే పరిమితం చేసిన ఒక గొప్ప విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. ఆ విజయాన్ని త్వరలోనే అందుకుంటారు. జీవితమంతా మనం గీసుకున్న ఓ వృత్తం చుట్టూ తిరుగుతుందని తెలుసుకోండి. ఆ వృత్తాన్ని మనకు తగ్గట్టుగా మార్చలేమని, అయినా అందులోనే సంతోషాన్ని వెతుక్కోవడమే వాస్తవమని తెలుసుకోండి. వాస్తవంలో బతికితేనే మీకు కొన్ని విషయాలు స్పష్టంగా కనిపిస్తాయి. అవన్నీ మిమ్మల్ని ఉన్నతంగా నిలబెట్టేవే. శక్తినంతా కూడదీసుకొని పనిచేయండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈవారం ఒక గొప్ప శుభవార్త వింటారు. అన్నీ మీరనుకున్నట్టుగానే జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ వృత్తి జీవితంలో ఏదో వెలతి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. మీ ఆలోచనా విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే మీకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదృష్టం ఎప్పుడూ మీ వెన్నంటే ఉంటుంది. ప్రేమ జీవి తం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరిష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ ఆలోచనా విధానం మారాల్సిన సమయం ఇదే. అందరినీ తక్కువ అంచనా వేసే మీ స్వభావం వల్ల చాలామందికి మీరు దూరమవుతున్నారు. ఈ రెండు విషయాల్లో మీలో వచ్చే మార్పే మిమ్మల్ని విజయం వైపుకు అడుగులు వేయిస్తుంది. ఒక గొప్ప అవకాశం ఈ వారాంతం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ప్రేమ జీవితంలో కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా వాటన్నింటికీ ఎదురెళ్లి నిలబడతారు. కలిసివచ్చే రంగు : వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈవారమంతా మీరు ఊహించనంత సంతోషంగా ఉంటారు. కొత్త కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఈ అవకాశాల కోసమే ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న మీకు, రాబోయే రోజులు గొప్ప ఆనందాన్నిస్తాయి. అయితే అవకాశాలను అందిపుచ్చుకోవడంతోనే అయిపోయిందనుకుంటే మీ పని అయిపోయినట్టే. కష్టపడి, ఆత్మస్థైర్యంతో విజయం వరకూ సడలని ధైర్యంతో పనిచేయండి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాధారణంగా ఉంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : పీచ్ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) గొప్పవాళ్లందరూ ఎన్నో అడ్డంకులను దాటొచ్చాకే గొప్పవాళ్లు అయ్యారు. ఈ విషయం తెలుసుకుంటే మిమ్మల్ని వెంటాడే భయాలు అసలు భయాలా కాదా అర్థమవుతుంది. ధైర్యంగా నిలబడి, పరిస్థితులకు ఎదురెళ్లి పోరాడండి. అవకాశాలు రావట్లేదని కూర్చోకుండా అందుకు మీరేం చెయ్యాలో ఆలోచించండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రేమ జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నివిధాలా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : గులాబి - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు(18 ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి 2018 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు ఎదురవుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పసుపు, లేత ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు మిత్రులుగా మారతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. శుభకార్యాలు నిర్వహిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఖర్చులు. అనారోగ్యం. గులాబి, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన కార్యక్రమాలలో ముందడుగు వేస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారం. పాతమిత్రులను కలుసుకుంటారు. కాంట్రాక్టులు పొందుతారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. వ్యాపారాలలో కొత్త పెటుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఒత్తిడులు. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) రుణబాధల నుంచి విముక్తి పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీ శక్తిసామర్థ్యాలు అందరూ గుర్తిస్తారు. ఆస్తి విషయాలు కొలిక్కి వస్తాయి. శత్రువులు మిత్రులుగా మారి సహాయం అందిస్తారు. విద్యార్థులకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు, ఆరోగ్యభంగం. తెలుపు, గులాబి రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ æచేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. సోదరులు, సోదరీలతో విభేదాలు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలపై చర్చిస్తారు. స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు కాస్త నిరాశాజనకంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తల అంచనాలు తప్పుతాయి. వారం చివరిలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. ఎరుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవిని పూజించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) శ్రమ మరింత పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆదాయం అంతగా కనిపించక అప్పులు చేయాల్సివస్తుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటి నిర్మాణ యత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు, నిరుద్యోగులకు ఒత్తిడులు. కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. కళాకారులకు చికాకులు. వారం ప్రారంభంలో వాహనయోగం. ఆలయాలు సందర్శిస్తారు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఇంటాబయటా అనుకూల పరిస్థితులు. శు¿¶ కార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం పొందుతారు. విద్యార్థుల యత్నాలు సఫలం. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు. పారిశ్రామికవేత్తలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వీరికి అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. శత్రువుల్లా భావించే వారు కూడా మిత్రులుగా మారతారు. వాహనాలు, భూములు కొంటారు. కొన్ని వ్యవహారాలలో చర్చలు సఫలం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. కళాకారులకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆప్తులతో కలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. బంధువులతో వివాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. స్థిరాస్తి విషయంలో కొద్దిపాటి చికాకులు. విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఒక కీలక సమాచారం రావచ్చు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ఉద్యోగులకు బదిలీ అవకాశాలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఇంటాబయటా ఒత్తిడులు. అనుకోని ఖర్చులు. రుణదాతల నుంచి ఒత్తిడులు. ఎంతగా కష్టించినా ఫలితం కనిపించదు. ప్రాణస్నేహితులు కొంత వ్యతిరేకత చూపుతారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) రాబడికి మించిన ఖర్చులు. కుటుంబ సమస్యలు వేధిస్తాయి. మీపై ఉంచిన బాధ్యతల నిర్వహణలో జాప్యం. సోదరులు, మిత్రులతో అకారణంగా వైరం నెలకొంటుంది. స్వల్ప అనారోగ్య సూచనలు. శ్రమాధిక్యంతో కొన్ని పనులు పూర్తి కాగలవు. మీరు తీసుకునే నిర్ణయాలు మనస్పర్థలకు కారణం కాగలవు. వ్యాపారాలలో పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగవర్గాలకు మరిన్ని బాధ్యతలు తప్పవు. రాజకీయవర్గాలకు నిరుత్సాహమే. వారం మ«ధ్యలో విందువినోదాలు. కార్యజయం. నలుపు, లేత పసుపు రంగులు. తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబంలో ఉత్సాహవంతంగా ఉంటుంది. అనుకున్న పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దూరపు బంధువుల రాకతో సంతోషంగా గడుపుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఆకుపచ్చ, గోధుమరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (18 ఫిబ్రవరి నుంచి 24 ఫిబ్రవరి, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) గతంలో జరిగిన పొరపాట్లను గురించే నిరంతరం ఆలోచిస్తూ కూర్చోకండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వాటిని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. జరిగిపోయిన దాన్ని ఎవ్వరూ మార్చలేరన్న విషయాన్ని గ్రహించండి. వృత్తిరీత్యా కొత్త జీవితం మిమ్మల్ని ఆహ్వనిస్తోంది. ధైర్యంగా ఆ వైపుకు అడుగులు వేయండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. కలిసివచ్చే రంగు : లేత ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఈ వారమంతా కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మీకు బాగా దగ్గరైన వారొకరు మిమ్మల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తోంది. జీవితాశయానికి చాలా దూరంలో ఉన్నట్లైతే, ఇప్పటికైనా ఆ విషయాన్ని గ్రహించి ఆ వైపు అడుగులు వేయండి. వ్యక్తిగత జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. వృత్తిరీత్యా కొత్త పదవులను అలంకరిస్తారు. ప్రేమ విషయంలో మాత్రం మొండిగా ఉన్న మీ ఆలోచనా తీరును మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలిసివచ్చే రంగు : ఊదా మిథునం (మే 21 – జూన్ 20) గతాన్ని గురించి ఆలోచిస్తూ అద్భుతమైన భవిష్యత్‌ను నాశనం చేసుకోకండి. ప్రస్తుతాన్ని బాగా ఆస్వాదించాల్సిన సమయం ఇది. మీ శక్తినంతా కూడగట్టుకొని భవిష్యత్‌ను నిర్మించుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆత్మ విశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. మీదైన శైలిని నమ్ముకొని ముందుకు వెళ్లండి. కొత్త శిఖరాలను అధిరోహిస్తారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపడం వల్ల కొత్త ఉత్సాహం పొందుతారు. మీకోసం కాస్త ఎక్కువ సమయాన్ని కేటాయించుకోండి. విహారయాత్ర సూచనలు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పరిస్థితులు కొన్ని మీకు ప్రతికూలంగా మారిపోయే అవకాశం ఉంది. జీవితమంతా చీకట్లో గడిచిపోతున్నట్లు ఉంటుంది. అయితే ఇదేమీ శాశ్వతం కాదన్న విషయం తెలుసుకోవాలి. మీ జీవితంలో వెలుగులు నింపడానికి ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. మీదైన ఆలోచనా విధానమే మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళుతుంది. అందరినీ ఒకేలా చూడాలన్న ఆలోచన కూడా మీకు ఒక ప్రత్యేక గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. కొత్త పనులు మొదలుపెట్టడానికి ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇప్పటివరకూ ఏ చెడు జరిగినా అదంతా మంచికే అని గ్రహించాల్సిన సమయం ఇది. కొత్త ఉత్సాహంతో పనిచేయడానికి మిమ్మల్ని సిద్ధం చేసే ఆలోచన ఇదే. మీకు ఏది అవసరమో, మీ ఆలోచనలు మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళుతున్నాయో అటువైపే మీ అడుగులు వేయండి. మీకు పెద్దగా ఉత్సాహం లేని పనులు మాత్రం అస్సలు మొదలుపెట్టకండి. ఫలితం గురించి ఆలోచించకుండా పనిచేయండి. త్వరలోనే మీ సమస్యలన్నీ సద్దుమణిగి జీవితం కొత్తగా మళ్లీ మొదలవుతుంది. కలిసివచ్చే రంగు : పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీదైన ఆలోచనా విధానాన్ని ఎప్పటికీ మార్చుకోవద్దు. విజయం మీవైపే ఉంది. కష్టపడి దాన్ని సొంతం చేసుకోవాలన్న ఆలోచనను బలంగా నమ్మండి. పోటీ ప్రపంచంలో మీకొక గుర్తింపు దక్కాలని కోరుకుంటున్నారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు త్వరలోనే లభిస్తుంది. ఎక్కువ పనులు మీద వేసుకొని ఒత్తిడికి లోనుకావద్దు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ప్రేమ జీవితం మిమ్మల్ని కొన్నాళ్లుగా బాగా ఇబ్బంది పెడుతోన్న అంశం. ఈ వారంలో అన్నీ చక్కబడతాయి. ఈ విషయంలో మీరు కోరుకుంటున్న రీతిలోనే ఒక పూర్తి అవగాహన వస్తుంది. కొత్త జీవితం మొదలుపెడతారు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేస్తారు. ఇది మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. వృత్తిరీత్యా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రేమ జీవితానికి, వృత్తి జీవితానికి మధ్య సమన్వయం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) పరిస్థితులకు ఎదురెళ్లి ధైర్యంగా ముందడుగు వేయాల్సిన సమయం ఇది. ఊహలకు, వాస్తవ ప్రపంచానికి ఉన్న దూరాలను తగ్గించాలంటే, మీరు ఊహా ప్రపంచాలను వీడి వాస్తవాన్ని అర్థం చేసుకోవాలి. మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారికి సమాధానంగా ఓ గొప్ప విజయం చేకూరుతుంది. వృత్తి జీవితంలో మంచి రోజులు కనిపిస్తున్నాయి. ఉన్నత పదవులు అలంకరిస్తారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామిని సంతోషపెట్టడానికి కొత్త ఆలోచనలు చేస్తారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : లేత గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఫలితం గురించి ఆలోచిస్తూ కూర్చోవడం మానండి. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. ఫలితం దానంతట అదే వస్తుందని నమ్మండి. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని మరింత ఉత్సాహంతో పనిచేస్తారు. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీ జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని, వారితో ప్రేమగా మెలగండి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ప్రేమ జీవితంలో ఒడిదుడుకులు అలాగే ఉంటాయి. అయితే నమ్మకంతో, కాస్త విరామం తీసుకొని మీ జీవిత భాగస్వామికి మరింత దగ్గరయ్యే ప్రయత్నాలు చేయండి. వృత్తి జీవితం కూడా ఊహించినంత ఆశాజనకంగా ఉండటం లేదు. కొద్దిరోజులు అన్నింటికీ దూరంగా ఒక విహారయాత్రకు వెళ్లే ఆలోచన చేయండి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకునే ఆలోచనా∙విధానంలోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) జీవితాన్ని నిరంతరం ఆస్వాదించడమే మన ఉన్నతికి పాటుపడే అంశమని గ్రహించి పనిచేయడం అలవర్చుకోండి. అనవసరమైన విషయాలను గురించి, మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విషయాలను గురించి ఎక్కువ ఆలోచించకండి. జీవితం మీద మీకున్న అభిప్రాయాలను చిన్న చిన్న అంశాలేవీ ప్రభావితం చేయకుండా చూసుకోండి. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. అందులో మీ స్థాయికి తగ్గవాటినే ఎంచుకోండి. మీ చుట్టూనే కొందరు మీ అభివృద్ధికి అడ్డు పడుతున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితమంతా నిరాశాజనకంగా సాగుతుందని భావిస్తారు. ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన సమయం ఇదే. అపజయాలు సర్వ సాధారణమనీ, వాటికి ఎదురెళ్లి నిలబడే ధైర్యం ఎప్పుడూ కోల్పోవద్దని తెలుసుకోండి. ఏది జరిగినా దానికి మూల కారణం మీరేనన్న విషయాన్ని నమ్మండి. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు ప్రశాంతంగా ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : తెలుపు - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు (21 జనవరి నుంచి 27 జనవరి 2018 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కుదురుతాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పూర్వవైభవం. ఉద్యోగస్తుల ఆశలు ఫలిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. పనులు వాయిదా. పసుపు, గులాబి రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. అరుదైన సత్కారాలు పొందుతారు. ఆస్తి విషయాల్లో చికాకులు తొలగుతాయి. సోదరులు, స్నేహితులతో వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగస్తులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. లేత నీలం, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. బంధువుల ప్రోద్బలంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలు ఆరంభిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థాయికి చేరతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనయోగం. ముఖ్యమైన చర్చలు సఫలం. కళాకారులకు ఊహించని సత్కారాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఊహించని అవకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు జరగవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఎరుపు, లేతగులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులు నైపుణ్యానికి గుర్తింపు పొందుతారు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ప్రత్యర్థులతో రాజీకి యత్నిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభారం తొలగుతుంది. పారిశ్రామికవేత్తలకు ముఖ్యసమాచారం ఊరటనిస్తుంది. వారం మధ్యలో మానసిక అశాంతి. వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వీడండి. ఒక సమాచారం విద్యార్థులకు ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో నూతనపెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తుల సేవలు గుర్తింపు పొందుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. ఒత్తిడులు. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్తగా చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిరకాల స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కళాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. వారం ప్రారంభంలో శుభవార్తలు. విచిత్ర సంఘటనలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగాల్లో చేరతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. యత్నకార్యసిద్ధి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత ్తపనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. లేత ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనుల్లో విజయం సాధిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చే స్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. విద్యార్థులు, నిరుద్యోగులయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబి, నేరేడు రంగులు.పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (21 జనవరి నుంచి 27 జనవరి, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారం మీకంతా మంచే జరుగుతుంది. గత కొద్దిరోజుల క్రితమే మొదలుపెట్టిన ఓ పని ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. చెడు ఆలోచనలను దూరం పెట్టండి. ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కష్టపడి పనిచేసే మీ తత్వమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపించే శక్తి అని నమ్మండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతుంటాయి. అయినప్పటికీ మీ ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా చూసుకోండి. అనుకున్న విజయం కోసం ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు. ఈ ప్రయాణాన్ని ఇష్టపడండి. విహారయాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఇది మీకు ఓ కొత్త శక్తినిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈవారమంతా మీరు ఊహించినట్టుగానే సాఫీగా సాగిపోతుంది. మీకు సన్నిహితులైన ఓ వ్యక్తికి అండగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. చాలాకాలంగా ముందుకు కదలని ఒక పని గురించి బాగా ఆలోచిస్తారు. ఆ పని ఇప్పుడే మొదలుపెట్టడం వల్ల జరగబోయే మంచిని గ్రహిస్తారు. జీవితాన్ని మలుపు తిప్పే ఓ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారం ఓ గొప్ప విజయం సాధిస్తారు. చాలాకాలంగా ఈ విజయం కోసమే ఎదురుచూస్తున్నందున, రాబోయే రోజులను ఉత్సాహంగా గడుపుతారు. కష్టపడి పనిచేసే మీ తత్వమే మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళుతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తికి తక్కువ సమయంలోనే బాగా దగ్గరవుతారు. వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. చిన్న చిన్న విషయాలను కూడా సునిశితంగా పరిశీలించడం అలవాటు చేసుకుంటారు. ఇది మీలో ఊహించని మార్పు తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వారం చివర్లో అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : వయొలెట్ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈవారం మీకంతా కొత్తగా ఉంటుంది. మీరు ఏమాత్రం ఊహించని పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మీపై మీకు ధీమా ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరని నమ్మండి. ఏం మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు బాగా ఇష్టపడే వ్యక్తితో ఒక గొడవ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. కలిసివచ్చే రంగు : పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తారు. ఇప్పటికైనా అలాంటి ఒక ఆలోచన రావడం మంచిదే. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవితమంతా ఒకేదగ్గర ఆగిపోయినట్టు భావిస్తారు. ఈ ఆలోచనను వీలైనంత త్వరగా దూరం చేసుకుంటే మంచిది. ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. కలిసివచ్చే రంగు : తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీరు ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన ఓ పనికి కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఆ అవాంతరాలకు కారణాలు ఏమై ఉంటాయన్న విషయం బాగా ఆలోచించండి. ప్రేమ జీవితం కాస్త గందరగోళంగా ఉంటుంది. సమస్య ఎక్కడ ఉందో ఆలోచించి, అందుకు మీరేం చేయాలో అర్థం చేసుకోండి. మీ ఆలోచనల్లో, ప్రపంచాన్ని ఆస్వాదించే విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడడానికి వెనుకాడకండి. కలిసివచ్చే రంగు : గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈవారం మీకంతా సాఫీగా సాగిపోతుంది. ఒక కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. మీ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పుకునే అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాల్సి ఉంది. అందరితో సరదాగా కలిసిపోయే మీ స్వభావాన్ని అలాగే ఉంచుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ సమయం మిమ్మల్ని మానసికంగా ఉల్లాసంగా ఉంచుతుంది. కలిసివచ్చే రంగు : కాషాయ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. కష్టపడి పనిచేస్తేనే మీ కలల ప్రపంచాన్ని చేరుకుంటారని నమ్మండి. వరుసగా అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరేం చేయాలో ఆలోచించుకోండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) అనవసర ఖర్చులకు, ఆర్భాటాలకు దూరంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఈవారం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని ఆ దిశగా మొదటి అడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి రానున్న రోజుల్లో మెరుగుపడుతుంది. ఖాళీ అన్నదే లేకుండా కష్టపడితేనే విజయం మిమ్మల్ని వరిస్తుందని నమ్మండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈవారం మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్య సమస్యలు కూడా చక్కబడతాయి. రానున్న రోజులంతా సంతోషంగా గడుపుతారు. మీకిష్టమైన వ్యక్తి మీకు పక్కనే ఉండడం ఉత్సాహాన్నిస్తుంది. మీ ప్రతిభతో చుట్టూ ఉండేవారి అభిమానాన్ని చూరగొంటారు. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే బాగుంటుంది. అయితే ఖరీదైన వస్తువులను కొంటూనే మళ్లీ బాధపడే మీ స్వభావం మారాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ భయాలన్నింటినీ వీడి, ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ముఖ్యమని నమ్మండి. ఆ దిశగా వెళ్లేందుకు మీరు ఏమేం చేయాలో కూడా ఆలోచించండి. అన్నింటికీ ఇతరులపై ఆధారపడే మీ స్వభావం కూడా మారాల్సి ఉంది. ఒక కీలక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం స్వయంగా మీరే తీసుకోవడం వల్ల ఏ ఫలితం వస్తుందన్న విషయం ఆలోచించకుండా ముందుకెళ్లండి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఇచ్చే కొన్ని సలహాలు మాత్రం ఎప్పట్లాగే మీకు పనికొస్తాయి. కొన్ని చెడు అలవాట్లను ఇప్పటికైనా దూరం చేసుకుంటే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : నీలం - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) మీ ఆశయాలు నెరవేర తాయి. ఆర్థికంగా మరింత బలపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు రావచ్చు. బంధువులతో తగాదాలు. గులాబి, ఆరెంజ్ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆవుపాలు, కొబ్బరినీళ్లతో వినాయకునికి అభిషేకం చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) అనుకున్న పనులు మొదట్లో కొంత మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో మానసిక ఆందోళన. ఆరోగ్య¿¶ ంగం. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సగ్గుబియ్యం, బెల్లంతో చేసిన పరమాన్నం లక్ష్మీదేవికి నివేదించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థులు అనుకున్నది సా«ధిస్తారు. సభలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులకు సత్కార, పురస్కారాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. నలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరునికి మంగళవారం అభిషేకం చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉండి అప్పులు చేయాల్సివస్తుంది. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. హామీలు, నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, లేత గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. 111 ఎర్రగులాబీలతో దుర్గామాతకు అర్చన చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. గత సంఘటనలు నెమరువేసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులు అవార్డులు దక్కించుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. బియ్యం పరమాన్నం అమ్మవారికి నివేదించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో అవరోధాలు తొలగుతాయి. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి పిలుపు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఖర్చులు. అనారోగ్యం. గులాబి, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. 11 కొబ్బరికాయలతో శివాలయంలో అభిషేకం మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) మీ శ్రమ ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉంటాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు కొన్ని తొలగుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. 21 కుడుములు వినాయకునికి సమర్పించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆశ్చర్యకరమైన విషయాలు, సంఘటనలు తెలుసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, ఆరెంజ్ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయస్వామికి అర్చన చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు సానుకూలం. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు సత్కారాలు అందుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబి, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పార్వతీదేవికి కుంకుమార్చన మంచిది. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. క్రమేపీ పరిస్థితులు ^è క్కబడతాయి. మీ ఆలోచనలు కలసివస్తాయి. పనులు చకచకా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యమైనా మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. చోరభయం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహాలను స్తుతిస్తూ 9సార్లు ప్రదక్షణలు చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. మీ ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్య సూచనలు. కుటుంబసమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. మూడుసార్లు విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇంతకాలం మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో అవరోధాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. గులాబి, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో( 7 జనవరి నుంచి 13 జనవరి, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగంలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొలిక్కిరాకుండా ఇబ్బంది పెడుతోన్న ప్రాజెక్టు ఈ వారం విజయవంతంగా పూర్తవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీవైపే ఉంటుందని మరవకండి. న్యాయ సంబంధిత విషయంలో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ ఆలోచనా తీరు, పద్ధతులను చక్కబెట్టుకునేందుకు మంచి సమయమిది. వృత్తిపరంగా ఉన్న ఇబ్బందులు సర్దుకుంటాయి. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయం మీవైపే నిలుస్తుంది. కొత్త పదవిని అలంకరిస్తారు. మీదైన శైలిలో నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని కొత్త పదవిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీ నాయకత్వంలో పనిచేస్తున్న వారు మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) మీ ప్రణాళికలను సమీక్షించుకోవాల్సిన సమయమిది. కొత్త కోణంలో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితమంతా ఓ దగ్గర ఆగిపోయినట్టు, ఇక ముందుకు కదలడం లేదేమో అనిపిస్తూ ఉన్నట్లైతే, ఇదంతా తాత్కాలికమేనని నమ్మండి. ముందంతా మంచే జరుగుతుంది. దేవుడిని ఇష్టంగా పూజించండి. కొత్త ఉత్సాహంతో జీవితం అందంగా తయారవుతుంది. రానున్న రోజుల్లో మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాధారణంగా ఉంటుంది. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు : లేత గోధుమ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ జీవితాన్ని మలుపుతిప్పే మార్పు చోటు చేసుకుంటుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. అడ్డంకులేవైనా ఎదురైనట్లు కనిపించినా, అదంతా తాత్కాలికమే. విజయంపై ధీమాతో కష్టపడండి. జిమ్‌లో చేరాల్సిన సమయమిది. బరువు తగ్గే ఆలోచన చేయండి. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో తీసుకునే ఈ నిర్ణయమే మిమ్మల్ని మరింత ఉత్సాహంగా పనిచేయిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : వెండి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ జీవితానికి ఎంతో ప్రత్యేకమైన ఓ విషయంలో అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ ఆలోచనలను చెడు వైపుకు మళ్లించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అలాంటి వారికి దూరంగా ఉంటూ జాగ్రత్త పడండి. మీ విశ్వాసాలను బలంగా చెప్పడం అలవర్చుకోండి. కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. నమ్మకంతో ఆ బాధ్యతలను చేపట్టండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతారు. కలిసివచ్చే రంగు : నలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీకు రానున్నదంతా మంచి కాలమే. మీరు కలలో కూడా సాధ్యపడదు అనుకున్న పనులు కూడా చక్కగా జరుగుతాయి. మంచి గుర్తింపు సంపాదిస్తారు. కొత్తగా మొదలుపెట్టే పనులన్నింటిపై నమ్మకం ఉంచి ముందడుగు వేయండి. విజయం మీవైపే ఉంటుంది. మీపై మీరు నమ్మకం ఉంచడం మరవొద్దు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు వ్యాయామం చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త కలవరపెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. కలిసివచ్చే రంగు : తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవడమే జీవితంలో ఒడిదుడుకులకు కారణం అన్నది తెలుసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం అలవర్చుకోండి. జీవితంలో గొప్ప నిర్ణయాలు తీసుకొని ౖపైకి ఎదిగే సమయమిదే. మీకు ఇష్టమైన వ్యక్తి ఇచ్చే సూచనలు పాటించండి. కొత్త పనులు మొదలుపెడతారు. సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. కొంత కాలంగా పూర్తి చేయాలనుకుంటున్న ఇంటి పనులు కొన్ని పూర్తవుతాయి. మానసిక ఉల్లాసానికి విహారయాత్రకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. కలిసివచ్చే రంగు : నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. కొత్తగా, ఉత్సాహంగా, మీదైన శైలిలో సవాళ్లను ఎదుర్కొండి. మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. కొన్ని రోజుల పాటు ఏదైనా విహార యాత్రలకు వెళ్లండి. ఈ యాత్రతో మీకు ప్రశాంతత చేకూరడంతో పాటు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సాహించే వ్యక్తులతో బాగా మాట్లాడండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : ఊదా ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త విషయాలు తెలుసుకోవాలన్న మీ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం మీకు మరింత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీకు ఇష్టమైన తత్వశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) జీవితాన్ని మీరు కోరుకునే విధంగా మలుచుకునే సమయం ఇదే. మీపై మీకున్న నమ్మకంతో నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన ప్రమాణాలు, మీకు మీరే ఏర్పరచుకున్న నియమాలను గుర్తు తెచ్చుకొని పనిచేయండి. పెద్దలను గౌరవించడం మరవకండి. వారి ఆశీస్సులు మీకు మరింత శక్తినిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటారు. ఇది మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సోమవారాలు మీకు బాగా కలిసివస్తాయి. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు : నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) రానున్న రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ధైర్యంగా ముందడుగు వేసే మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. జీవితాన్ని ఎప్పట్లానే బాగా ఆస్వాదించండి. వృత్తిపరంగా మీకు గొప్ప గుర్తింపు దక్కుతుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ మంచి పని కూడా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అనవసర ఖర్చులు పెరిగిపోవడాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనవసర ఖర్చులు చేస్తారు. ఇదే విషయంపై విపరీతంగా ఆలోచిస్తారు కూడా. మీ గమ్యం వైపుకు సరైన అడుగులు వేయాల్సిన సమయమిది. మీకు ఉపకరించే కొన్ని పనుల నుంచి మీకై మీరే దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని మీకేం కావాలో నిర్ణయించుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. లాఫింగ్ బుద్ధను ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఆదివారాలు మీకు బాగా కలిసివస్తాయి. ఇష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. వారితో మాట్లాడి ఎక్కువ ఉత్సాహంగా ఈవారాన్ని గడుపుతారు. కలిసివచ్చే రంగు : బూడిద ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. రాబడి కొంత పెరిగే సూచనలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు ఆహ్వానాలు అందిస్తారు. విద్యార్థులు కొత్త అవకాశాలు అందుకుంటారు. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. పారిశ్రామికవర్గాల వారి శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆశ్చర్యకరమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. బంధువులు, మిత్రుల సహాయసహాకారాలు అందుతాయి. మీ అనుభవాలు పదిమందికీ పంచుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం మధ్యలో ఖర్చులు. మానసిక అశాంతి. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని వివాదాలు నెలకొన్నా చాకచక్యంతో పరిష్కరించుకుంటారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. కార్యజయంతో ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు దక్కే అవకాశం. కళాకారులు అనుకున్నది సాధిస్తారు. వారం ప్రారంభంలో వివాదాలు. అనారోగ్యం. తెలుపు, గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మొదట్లో చికాకులు, సమస్యలు ఎదురై పరీక్షగా నిలుస్తాయి. పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారులకు లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు ఒక సమాచారం మరింత సంతోషం కలిగిస్తుంది. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారం¿¶ ంలో వివాదాలు. ఆరోగ్యసమస్యలు. గులాబి, లేత ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు మరింత దగ్గరవుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త విషయాలు తెలుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. ఆస్తి వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. గతానుభవాల రీత్యా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు అవార్డులు దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. వివాదాలు. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) విలువైన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణఒత్తిడులు తొలగుతాయి. మీలోని నైపుణ్యం వెలుగుచూస్తుంది. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవులు, సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. శ్రమాధిక్యం. నీలం, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆప్తులు అన్నివిధాలా సహకరిస్తారు. ఎంత కష్టమైన పనైనా అవలీలగా పూర్తి చేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకుని ప్రతిభావంతులుగా గుర్తింపు పొందుతారు. వాహనాలు, భూములు కొంటారు. వివాహయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులు సమర్థతను నిరూపించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు,నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు అర్చనలు చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. మీకు నచ్చిన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులు అనుకున్న పదోన్నతులు పొందుతారు. కళాకారులకు ప్రయత్నాలు సఫలం. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబి, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనుల్లో కొంత జాప్యం తప్పదు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఎంత కష్టించినా ఫలితం కనిపించక డీలా పడతారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో అకారణంగా తగాదాలు. ఆస్తి వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగులకు కాస్తనిరుత్సాహం. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలు నిరాశ చెందే అవకాశం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు చకచకా పూర్తి కాగలవు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషులు మీవెన్నంటి నిలుస్తారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. చిరకాల స్వప్నం నెరవేరే సమయం. కొన్ని సమస్యలు వాటంతట అవే పరిష్కారమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి ఖాయం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో స్వల్ప అనారోగ్యం. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేసే వీలుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పాతమిత్రులను కలుసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని హోదాలు. కళాకారులకు పురస్కారాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో తగాదాలు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (24 డిసెంబర్ నుంచి 30 డిసెంబర్, 2017 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారం మీకు బాగా కలిసివస్తుంది. కొద్దికాలం క్రితమే మొదలుపెట్టిన ఒక పనిలో విజయం సాధిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండాల్సిన అవసరం ఎంతో ఉంది. జీవితాశయం వైపుకు అడుగులు వెయ్యాలన్న ఆలోచన ఎప్పట్నుంచో ఉన్నట్లైతే, అందుకు సరైన సమయం ఇదే. మీ వ్యవహార శైలిలో కొన్ని ఊహించని మార్పులు వస్తాయి. అయితే అవి మిమ్మల్ని ప్రేమించే వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండేలా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) చాలాకాలంగా మీ స్థాయికి తగ్గ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఆ విజయం కోసం ఓపిగ్గా ఇంకొంత కాలం ఎదురుచూడాల్సి రావొచ్చు. పరిస్థితులకు భయపడిపోకుండా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ వెళ్లండి. మీదైన ప్రతిభ త్వరలోనే ప్రపంచానికి తెలుస్తుంది. దక్కాల్సిన గుర్తింపు తప్పకుండా దక్కుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాక మీకు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈవారం చాలా సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితంలో కొత్త కొత్త రంగులను చూస్తారు. ఇష్టపడ్డ వ్యక్తి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. కొద్దికాలం క్రితమే మొదలుపెట్టిన ఓ పనిలో మంచి విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత కలవరపెడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆత్మవిశ్వాసంతో, విజయంపై ధీమాతో పనిచేసే మీ స్వభావమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుందని నమ్మండి. కలిసివచ్చే రంగు : గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ శ్రమకు తగ్గ గుర్తింపు దక్కే సమయం ఇదే. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. మీదైన శైలిలో, ఫలితాన్ని గురించే ఆలోచిస్తూ కూర్చోకుండా కష్టపడితే ఆ విజయం మీదే! మీ జీవితానికి సంబంధించి ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయంపైనే మీ భవిష్యత్ ఆధారపడి ఉందని గ్రహించండి. ఆ ఆలోచనలతో జీవితంలో మీకుగా మీరు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకుంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈవారం మీకు కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. మీకు సన్నిహితులైన వ్యక్తులతో చిన్న చిన్న వివాదాలు తలెత్తుతాయి. మాట్లాడేముందు ఆ మాట ఎదుటివ్యక్తికి ఎలా చేరుతుందన్న విషయాన్ని కూడా ఆలోచించి మాట్లాడండి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ వస్తోన్న విహారయాత్రను ఇప్పుడే చేపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆహరపు అలవాట్లలో మార్పు రావాల్సిన పరిస్థితి వస్తుంది. కలిసివచ్చే రంగు : పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆర్థిక పరిస్థితి ఈవారం మిమ్మల్ని కాస్తంత కలవరపెడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండటాన్ని ఇప్పటికైనా అలవాటు చేసుకుంటే మంచిది. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. తోటి ఉద్యోగులతో కలిసిమెలిసి ఉండడం అలవర్చుకోవాల్సిన సమయం ఇదే. ఖాళీ అన్నదే లేకుండా వారమంతా కష్టపడుతూనే ఉంటారు. ప్రేమ జీవితం బాగుంటుంది. మీకిష్టమైన వ్యక్తి ఇచ్చే ఓ బహుమతి మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆర్థిక పరిస్థితి మిమ్మల్ని నిరాశలోకి నెట్టేసే ప్రమాదం కనిపిస్తోంది. దీనంతటికీ కారణం అనవసర ఖర్చులను దూరం చేసుకోలేకపోవడమే. గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చుంటారు. దీంతో ఆరోగ్యపరంగా కూడా కొన్ని సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు మిమ్మల్ని మీరు ఎలా సిద్ధం చేసుకోవాలో ఆలోచించండి. ఒక కొత్త అవకాశం మీకోసం ఎదురుచూస్తోంది. మీదైన శైలిలో కష్టపడి పనిచేస్తూ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. కలిసివచ్చే రంగు : గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఒక కొత్త ఆలోచన మీ వ్యాపారాన్ని మరింత బాగా వృద్ధిలోకి తీసుకొస్తుంది. అయితే ఆ ఆలోచనను బలంగా నమ్మి, కష్టపడితేనే ఫలితం సాధ్యమని గ్రహించండి. వరుసగా అవకాశాలు వచ్చిపడతాయి. తొందరపడకుండా మిమ్మల్ని పై స్థాయికి తీసుకెళ్లే అవకాశాన్ని మాత్రమే అందుకొని ముందుకెళ్లండి. మనుషులతో కలిసిపోవడాన్ని ఇకనైనా అలవాటు చేసుకుంటే మంచిది. ఆర్థిక పరిస్థితి మీరు ఊహించిన దానికంటే బాగుంటుంది. మీకు ఇష్టమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రేమ జీవితం బాగుంటుంది. కలిసివచ్చే రంగు : గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేసే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి రాకతో ఊహించనంత సంతోషంగా రాబోయే రోజులను గడుపుతారు. ప్రేమ జీవితం మీకు ఒక కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఒక గొప్ప అవకాశం మీకు దగ్గరలో ఉంది. దాన్ని అందుకునేందుకు నిరంతరం కష్టపడుతూ ఉండండి. పాత మిత్రులను కలుసుకుంటారు. విహారయాత్రకు వెళ్లే ఆలోచన కూడా చేస్తారు. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా సాఫీగా సాగిపోతుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేయాలని తపిస్తారు. అందుకు తగ్గట్టుగా మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చుకుంటూ ముందుకు వెళతారు. మారే మీ ఆలోచనా విధానం మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. ఎటువంటి పరిస్థితులకైనా ఎదురెళ్లే శక్తిని కూడగట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడుతుంది. మీరు బాగా ఇష్టపడే వ్యక్తికి సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈవారం మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. ఇష్టమైన వ్యక్తితో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మీదైన ప్రతిభను ప్రపంచానికి చాటుకునే అవకాశం కూడా త్వరలోనే వస్తుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే మెరుగుపడుతుంది. అయితే అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం ఇప్పటికైనా అలవాటు చేసుకుంటే మంచిది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. వృత్తి జీవితంలో ఓ కీలక మలుపు సూచనలు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : తెలుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ భయాలే మిమ్మల్ని విజయం వైపుకు వెళ్లనీయకుండా ఆపేస్తున్న శక్తులని నమ్మండి. ఆ భయాలను దూరం చేసుకొని ధైర్యంగా ముందుకెళ్లాల్సిన సమయం ఇదే. ఇతరుల అభిప్రాయాలకే పూర్తిగా విలువ ఇచ్చేయకుండా, మీదైన బలమైన అభిప్రాయం ఒకటి ఏర్పరచుకోండి. ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి పరిచయం మిమ్మల్ని జీవితాశయం వైపుకు అడుగులు వేయిస్తుంది. కొన్ని దురలవాట్లని తెలిసినా, వాటిని వదల్లేకపోతూంటే, ఇప్పటికైనా వాటిని దూరం చేసుకోండి. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : నీలం ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు(10 డిసెంబర్ నుంచి 16 డిసెంబర్ 2017 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభను చాటుకుంటారు. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు గౌరవిస్తారు. ఆదాయం గతంతో పోలిస్తే మెరుగుపడుతుంది. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహకరిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో ఖర్చులు. మానసిక ఆందోళన. స్వల్ప అనారోగ్యం. గులాబి, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆవుపాల పొంగలి ఇష్టౖ§ð వానికి నివేదించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు, పనుల్లో జాప్యం ఉంటాయి. ఆర్థికపరమైన సమస్యలు తీరతాయి. మీలో దాగి ఉన్న నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వాహనయోగం. వ్యాపారాలలో చికాకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఊరట కలిగించే సమాచారం. పారిశ్రామికవేత్తలకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. లేత నీలం, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆవునేతితో గణేశ్ వద్ద దీపం వెలిగించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. సేవాభావంతో అందర్నీ మెప్పిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు కొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. గతంలోని కొన్ని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. వ్యాపారాలు లాభాలదిశగా సాగుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరిగే అవకాశాలు. కళాకారులు పోగొట్టుకున్న అవకాశాలు తిరిగి పొందుతారు. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. నేరేడు, గులాబి రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న ఆదాయం సమకూరక కొంత ఇబ్బంది తప్పదు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు కలసిరావు. కుటుంబసభ్యులతో అకారణంగా వివాదాలు నెలకొంటాయి. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థులు, నిరుద్యోగులపై ఒత్తిడులు పెరుగుతాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపార లావాదేవీలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవేత్తలకు సమస్యలు ఎదురవుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబి, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనుల్లో విజయం సా«ధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన డబ్బు అంది అవసరాలు తీరతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇళ్లు, వాహనాలు కొంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వృథా ఖర్చులు అవుతాయి. కుటుంబంలో అనుకోని ఒత్తిడులు. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఎటువంటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. చిరకాల మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నేరేడు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) రుణబాధలు తొలగి ఊరట లభిస్తుంది. పనులు అనుకున్న విధంగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఉపశమనం లభిస్తుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు సన్మానాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వీరికి పట్టింది బంగారంగా ఉంటుంది. కార్యశూరులై అనుకున్న పనులు పూర్తి చేస్తారు. స్వచ్ఛంద కార్యక్రమాలలో పాలుపంచుకుంటారు. అభిమానులు పెరుగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. వాహనాలు, భూములు కొంటారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతస్థితి దక్కుతుంది. రాజకీయవేత్తల కృషి ఫలిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. ధనవ్యయం. ఎరుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అదనపు రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సత్కారాలు. వారం చివరిలో ఖర్చులు. కుటుంబసమస్యలు. లేత పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో కొన్ని సమస్యలు వేధిస్తాయి. అయినా ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అధిగమించి ముందుకు సాగుతారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థుల సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వివాహాది శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు అనుకూల పరిస్థితులు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. ఆరోగ్య సమస్యలు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు కొంత నెమ్మదించినా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. వాహనయోగం. చర్చలు సఫలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు సత్కారాలు అందుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. మిత్రులతో వివాదాలు. వారం చివరిలో కొంచెం అనారోగ్యం. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ సమర్థత, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మిత్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూల వాతావరణం. రాజకీయవేత్తలకు పదవీయోగం. వారం ప్రారంభంలో శ్రమ తప్పదు. అనారోగ్యం. గులాబి, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు సానుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (10 డిసెంబర్ నుంచి 16 డిసెంబర్, 2017 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వృత్తి జీవితంలో మీదైన గుర్తింపు కోసం కష్టపడతారు. చాలాకాలంగా మీ జీవితాన్ని మలుపుతిప్పే విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఆ విజయం త్వరలోనే మీకు దక్కుతుంది. మీరు చేస్తున్న పని ఏదయినా అది మీకు ఆత్మసంతృప్తిని ఇచ్చేదై ఉండాలన్న విషయాన్ని మరవకండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు ఇష్టమైన వ్యక్తుల దగ్గర్నుంచి ఓ శుభవార్త వింటారు. ఇది మీకు ఎంతో సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : తెలుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే! వృత్తి జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. యజమానితో మాటపట్టింపు సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. మీకు కావాల్సింది ఏంటో స్వతహాగా, అన్నీ ఆలోచించి నిర్ణయించుకోండి. ఆ నిర్ణయంతో మీరు సంతోషంగా ఉంటారన్న నమ్మకం వస్తేనే ముందుకు వెళ్లండి. ప్రేమ జీవితం బాగుంటుంది. కలిసివచ్చే రంగు : గోధుమ మిథునం (మే 21 – జూన్ 20) మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టేసిన సమస్యలను చూసి భయపడిపోతున్నారు. అయితే ఆ భయాలన్నింటినీ వదిలి, ముందుకు వెళ్లడంలోనే విజయం ఉందని గ్రహించండి. మీకు ఇష్టమైన వాళ్లు మీతో మాట్లాడే విధానంలో తేడా గమనిస్తారు. అందుకు మీ ఇద్దరి మధ్యా వచ్చే మనస్పర్థలు కారణం కావొచ్చు. బంధాన్ని బలంగా నిలుపుకోవడానికి ఇలాంటి సందర్భాల్లో వాళ్లు ఏ పరిస్థితుల్లో ఉండి అలా మాట్లాడుతున్నారో ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కొత్త వ్యక్తుల పరిచయం మీకు మరింత ఉత్సాహాన్నిస్తుంది. ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. మీ ప్రతిభను ప్రదర్శించుకునేందుకు ఒక వేదిక దొరుకుతుంది. ఈ అవకాశాన్ని అన్నివిధాలా అందిపుచ్చుకొని మీరేంటో నిరూపించుకోవాల్సిన సమయం కూడా ఇదేనని నమ్మండి. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ఇద్దరూ ఇష్టంగా కన్న ఒక విహారయాత్ర కలను సాకారం చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) జీవితం ఓ దగ్గర ఆగిపోయి, ఎటూ ముందుకు పోని పరిస్థితుల్లో చిక్కుకున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇలాంటి ఒక రోజును దాటి ముందుకు వెళితేనే జీవితమన్న విషయాన్ని గ్రహించండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ వ్యక్తికి తక్కువ సమయంలోనే చాలా దగ్గరవుతారు. మీకు ఆత్మసంతృప్తినిచ్చే విషయాలేంటో తెలుసుకుంటారు. చాలాకాలంగా ఎదురుచూస్తోన్న ఓ అవకాశం మీ తలుపు తడుతుంది. కలిసివచ్చే రంగు : గోధుమ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీ స్వభావానికి తగ్గట్టే పరిస్థితులూ అనుకూలించడంతో ఈవారమంతా చాలా సంతోషంగా గడుపుతారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ధైర్యంగా నిలబడాలన్న మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయం దిశగా తీసుకెళుతుంది. ఒక కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. శ్రమకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితంలో ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆ నిర్ణయం తీసుకునేందుకు అన్నివిధాలా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఈ నిర్ణయం మీకు ఎంత ముఖ్యమో తెలుసుకొని, మీరు కోరుకున్న విధంగా ఆ వైపుకు ధైర్యంగా అడుగు వేయండి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి వల్లే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆర్థిక, ఆరోగ్య పరిస్థితి బాగుంటుంది. ప్రేమ జీవితం ఉల్లాసంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) చాలాకాలంగా చీకట్లో కూరుకుపోయి ఉన్న మీ జీవితమంతా ఒక్కసారిగా కొత్త కాంతిని చూసినట్టుగా మారిపోతుంది. జీవితంలో వచ్చే ఈ మార్పును సంతోషంగా అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. వృత్తి జీవితం బాగుంటుంది. ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. మీదైన శ్రమ పెడితేనే ఆ అవకాశాన్ని విజయం దిశగా తీసుకెళ్లగలరన్న విషయాన్ని మనసులో పెట్టుకోండి. మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు కొత్త ప్రదేశాలకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన పరిస్థితి వచ్చి పడుతుంది. అందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. ఎప్పట్లానే మారకుండా ఉంటే మీరే చిక్కుల్లో పడతారు. మారే మీ ఆలోచనా విధానమే మీకు ఒక గొప్ప అవకాశాన్ని తెచ్చిపెడుతుంది. ఆ అవకాశాన్ని అందుకోవడంతోనే విజయం వైపుకు మీరు ఒక అడుగు వేసేసినట్లని నమ్మండి. ప్రశాంతంగా ఉండేందుకు ఏదైనా విహారయాత్రకు వెళ్లాలన్న ఆలోచన ఉంటే వెంటనే ఆ దిశగా అడుగులు వేయండి. కలిసివచ్చే రంగు : నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా కాస్తంత గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ వాయిదా పడుతూ మీ సహనానికి పరీక్ష పెడతాయి. మీ చుట్టూ ఉండేవారంతా మంచి వారే అనుకోవడం మీ స్వభావమే అయినా గుడ్డిగా నమ్మితే కొన్ని సమస్యలు తలెత్తుతాయన్న విషయం తెలుసుకోండి. ఎప్పుడో మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన ఓ పని గురించి బాగా ఆలోచిస్తారు. ఆ పనిని మళ్లీ కొత్తగా మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈ నెలంతా మీకు కొన్ని అనుకోని పరిస్థితులు ఎదురవుతాయి. ఆ పరిస్థితులు మీపై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తాయి. ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. వీటన్నింటినీ ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండండి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. వారి మాటలే మీకు ఈ కష్టసమయంలోనూ కొండంత అండగా కనిపిస్తాయి. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే! గమ్యాన్ని చేరేందుకు ఏయే మార్గాలు ఎంచుకోవాలో ఇప్పట్నుంచే ఆలోచించండి. పగటికలలు మానేసి గమ్యం వైపుకు వెళ్లేందుకు శక్తినంతా వెచ్చించి పనిచేయండి. సన్నిహితుల నుంచి వచ్చే సలహాలు, సూచనలు తీసుకుంటూనే ముందుకెళ్లండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇష్టంగా ప్రేమించే వ్యక్తి నుంచి వచ్చే ప్రోత్సాహం కూడా మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తుంది. కలిసివచ్చే రంగు : బూడిద ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు(3 డిసెంబర్ నుంచి 9 డిసెంబర్ 2017 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. బం«ధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు ఉండవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఎటువంటి కార్యక్రమమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌కు కుడుములు నివేదించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి.సభలు, సమావేశాలకు హాజరవుతారు. ఊహించని విధంగా ఉద్యోగావకాశాలు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలకు పట్టింది బంగారమే. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) రుణ విముక్తులవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వీరికి అన్నీ విజయాలే దక్కుతాయి. ఆర్థికంగా గతవారం కంటే మెరుగైన పరిస్థితి. లక్ష్యసాధనలో కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు సన్మానాలు,అవార్డులు రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్కు అర్చనలు చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఖర్చులు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, లేతనీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం చేయించుకోండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము కొంతవరకూ అందుతుంది. ఇతరులకు సైతం సహాయం అందిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. నేరేడు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనుల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతజ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త మిత్రుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. విందువినోదాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. కళాకారులకు శుభవార్తలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. గులాబి, లేత ఎరుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి పులిహోర నివేదించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు కాస్త తీరతాయి. ఆప్తులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూలం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రావచ్చు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. నీలం, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోతాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి కొంత పెరిగే అవకాశం. గత స్మృతులు నెమరువేసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనుకోని ఖర్చులు. గులాబి, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (3 డిసెంబర్ నుంచి 9 డిసెంబర్, 2017 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారం ఓ శుభవార్త వింటారు. మీరు ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన ఓ పని విజయవంతంగా పూర్తవుతుంది. కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ ఉత్సాహమే మిమ్మల్ని మరిన్ని గొప్ప విజయాల వైపుకు తీసుకెళుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేస్తారు. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : పసుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం ఇదే. వృత్తి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల వల్ల కాస్తంత ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. మీదైన పంథాలో ప్రశాంతంగా పనిచేసుకుంటూ వెళ్లండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ఒత్తిడిని జయించడానికి విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. ఈ పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. కలిసివచ్చే రంగు : ఊదా మిథునం (మే 21 – జూన్ 20) వృత్తి జీవితంలో ఓ కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. అందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉండండి. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. మీదైన ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం. మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న గొప్ప విజయం దగ్గరలోనే ఉంది. ఆ విజయానికి చేరువయ్యేందుకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీతోనే ఉంటూ మీ గురించి తప్పుడుగా మాట్లాడేవారు చుట్టూ ఉన్నారు. జాగ్రత్త పడండి. కలిసివచ్చే రంగు : బంగారం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కొత్త ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అవన్నీ మీ జీవితాశయం వైపుకు అడుగులు వేయించేవే అన్న విషయాన్ని బలంగా నమ్మండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఉత్సాహం చూపుతారు. మీ అనుభవాన్నంతా రంగరించి పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ జీవితం ఊహించనంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈవారమంతా ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. గతంలో మొదలుపెట్టిన కొన్ని పనులు విజయవంతంగా కొనసాగుతూ లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇదే సరైన సమయం. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొద్దిరోజులుగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ఉత్సాహంగా మీ జీవితాశం వైపు అడుగులు వేస్తారు. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు ఒక వేదిక దొరుకుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకు వెళ్లండి. నమ్మకమే మీ ఆయుధమన్న విషయాన్ని ఏ వేళలోనూ మరవకండి. ప్రేమ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. అయితే ఆ పరిస్థితులూ త్వరలోనే సర్దుకుంటాయి. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులను ఎప్పటికీ దూరం చేసుకోకండి. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మిమ్మల్ని ఎంతగానో కలవరపెడుతోన్న సమస్యలు ఈవారమూ అలాగే ఉంటాయి. అయితే ఆ సమస్యలను చూసి చింతించకుండా ముందుకు వెళ్లడమే జీవితం అన్న విషయాన్ని బలంగా నమ్మండి. మరికొద్దిరోజుల్లోనే ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి. నమ్మకమే మీ ఆయుధం. ఆత్మవిశ్వాసంతో పనిచేయలేకపోతే, మీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఒక వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తి ఈ కష్టకాలంలో మీకు తోడుగా ఉంటారు. కలిసివచ్చే రంగు : నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈవారం ఓ శుభవార్త వింటారు. ఎప్పట్నుంచో మీరు ఈ శుభవార్త వినడం కోసమే ఎదురుచూస్తున్నారు. ఒక గొప్ప విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. ఆ విజయాన్ని పూర్తిగా మీ సొంతం చేసుకునేందుకు, మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదేనన్న విషయాన్ని నమ్మండి. మీ చుట్టూ ఉండే, మీ మంచి కోరే వ్యక్తుల మాటలు మంచి ఉత్సాహాన్నిస్తాయి. ఆ ఉత్సాహంతోనే మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా పనిచేయండి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అయితే అదంతా మీ మంచికే జరిగే విషయమన్నది నమ్మండి. ఇందుకోసం మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. వీటన్నింటినీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. మీ చుట్టూ ఉండేవాళ్లు మీ ప్రయాణానికి, మీ పద్ధతులకు గౌరవం ఇచ్చే వారే ఉండేలా జాగ్రత్తపడండి. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కలిసివచ్చే రంగు : నీలం మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా మీరు ఊహా లోకంలో విహరిస్తారు. మీ ఆలోచనలను అలా కొనసాగిస్తూనే కలల ప్రపంచాన్ని నిజం చేసుకునేందుకు కష్టపడండి. అందుకు ఇదే సరైన సమయం అన్న విషయం కూడా నమ్మండి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఇచ్చే సలహాలను పాటించడం మరవకండి. వారి సలహాలు, సూచనలతోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ విజయంలో మీ జీవితభాగస్వామి పాత్ర ప్రధానంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లి మరింత ఉత్సాహంగా ఆలోచిస్తారు. కలిసివచ్చే రంగు : వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈవారం మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకుంటున్న ఓ కీలక మార్పు దగ్గరలోనే ఉంది. ఆ మార్పుతో మీ ఆలోచనా విధానాన్ని కొత్తగా ఆవిష్కరించుకుంటారు. మీ ప్రతిభ ప్రపంచానికి పరిచయమవుతుంది. గొప్ప విజయాన్ని త్వరలోనే అందుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కలిసివచ్చే రంగు : ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఈవారం కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జీవితమంతా ఓ దగ్గర ఆగిపోయినట్టు, కష్టంగా కాలం గడుస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇదే పరిస్థితి ఎల్లకాలం ఉండిపోతుందని కాదు. ప్రశాంతంగా భవిష్యత్‌పై నమ్మకంతో మీ శ్రమనంతా వెచ్చించి పనిచేస్తూ వెళ్లండి. ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. కొత్తగా మొదలయ్యే జీవితానికి ముందు పరిస్థితులు ఇలాగే ఉంటాయని నమ్మండి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు 19/11/2017 - 25/11/2017
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. బంధువులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ వహించండి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు కాస్త అసంతృప్తి. వారం చివరిలో విందువినోదాలు. కార్యజయం. గులాబి, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) శ్రమానంతరం కొన్ని పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. దూరపు బంధువులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఉడికించిన ఉలవలు ఆవుకు పెట్టండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఇంటాబయటా అనుకూలస్థితి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు కొత్త ఆశలు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. నూతన పరిచయాలు. వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం చివరిలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు. రాబడి సంతృప్తికరంగా ఉంటుంది. అంచనాలు నిజమవుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశునికి అభిషేకం చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కానీ, అవి నెమ్మదిగా సర్దుకుంటాయి. కొన్ని పనులు వాయిదా వేస్తారు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. విద్యార్థుల యత్నాలు నిదానంగా కొనసాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అనుకోని మార్పులు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. ఉద్యోగలాభం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కష్టపడ్డా ఫలితం కనిపించనిస్థితి. ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. దూరపు బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులు కొంత అసంతృప్తి చెందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ముఖ్యమైన పనులు నత్తనడకన సాగుతాయి. వ్యాపార లావాదేవీలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం ప్రారంభంలో విందువినోదాలు. స్వల్ప ధనలాభం. పసుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం చే యించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు. ఆదాయానికి మించిన ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిళ్లు పెరుగవచ్చు. అయినా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి కొంత వరకూ గట్టెక్కుతారు. ఆర్థికపరమైన హామీలు వద్దు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు ఉంటాయి. కళాకారులు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. వారం మధ్యలో విందువినోదాలు. ధన, వస్తులాభాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు పులిహోర నివేదించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. నైపుణ్యాన్ని చాటుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రావచ్చు. కళాకారులకు అవార్డులు. వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబసభ్యులతో తగాదాలు. గులాబి, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వ్యవహారాలలో స్వల్ప ఆటంకాలు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం అంతగా కనిపించదు. ఆస్తి వ్యవహారాలలో చికాకులు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. తీర్థయాత్రలు చేస్తారు. పనులు నత్తనడకన సాగుతాయి. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో నిరుత్సాహం, పెట్టుబడులు ఆలస్యమవుతాయి. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు పర్యటనలలో మార్పులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. సుబ్రహ్మణ్యస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రావలసిన బాకీలు కూడా అందుతాయి. వాహనాలు,భూములు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు. ఉద్యోగులకు పైస్థాయి అధికారుల నుంచి అభినందనలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్కు పూజలు చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) మీ శక్తియుక్తులు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు చకచకా సాగుతాయి. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థుల ప్రజ్ఞాపాటవాలు వెలుగుచూస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు అనుకూలత. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ వద్ద మూడు కొబ్బరికాయలు కొట్టండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. మీపై ప్రేమాభిమానాలు చూపే వారు పెరుగుతారు. ఆత్మీయులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చిరకాల స్వప్నం నెరవేరుతుంది. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. ఖర్చులు పెరుగుతాయి. ఎరుపు, లేత గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో 19 నవంబర్ నుంచి 25 నవంబర్, 2017 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త పనులు మొదలుపెడతారు. దీర్ఘకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నీ ఓ కొలిక్కి వస్తాయి. ఆత్మవిశ్వాసంతో విజయంపై ధీమాగా ఉంటూ పనిచేయండి. ప్రకృతిని ఆస్వాదిస్తూ కొద్దిరోజులు గడపండి. ఇందుకోసం ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ప్రతిభను కనబర్చుకోవడానికి ఇదే మంచి సమయం. కలిసివచ్చే రంగు : గోధుమ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ ఆలోచనలు కొత్త రూపు సంతరించుకుంటాయి. కొద్దికాలంగా మీకు దూరంగా ఉంటూ వచ్చిన వారంతా మళ్లీ దగ్గరవుతారు. కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఊహించని మార్పు చోటుచేసుకోబోతోంది. ఒక వ్యక్తి మీ జీవితంలోకి రావడంతో ఈ మార్పు సంభవిస్తుంది. మీ జీవిత భాగస్వామితో ఎప్పట్నుంచో పంచుకోవాలనుకుంటున్న విషయాలన్నీ పంచుకోండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ప్రపంచంలోని కష్టాలన్నీ మీకే ఉన్నాయని బాధపడే మీ ఆలోచనా విధానం మారాల్సి ఉంది. ఒత్తిడికి దూరంగా ఉండేందుకు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోండి. ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. ఈ సమయంలో ప్రశాంతంగా మీ గమ్యం ఏంటో ఆలోచించండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగవుతుంది. అయితే డబ్బు సంపాదించాలన్న ఆలోచనను పూర్తిగా పక్కనబెట్టే మీ స్వభావం కూడా మంచిది కాదు. మీ జీవితాన్ని మలుపుతిప్పే వ్యక్తిని కలుసుకుంటారు. ప్రేమ జీవితం కొత్తగా మొదలవుతుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీకు రానున్నదంతా మంచి కాలమే. అదృష్టం మీ వెంటే ఉంటుంది. కొత్త పనులు మొదలుపెడతారు. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. ఉన్నత పదవులు అలంకరిస్తారు. ఎప్పట్నుంచో కోరుకుంటోన్న విజయం కూడా దగ్గరలో ఉంది. అందుకు మీ శక్తినంతా వెచ్చించి పనిచేయాల్సి ఉంటుందని నమ్మండి. మీ ఒంటరి జీవితం కూడా ఒక ఊహించని మలుపు తీసుకుంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. మీ జీవితానికి సంబంధించి ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయం వస్తుంది. ధైర్యంగా ముందడుగు వేయండి. విజయం మీ వైపే ఉంటుందన్న విషయాన్ని బలంగా నమ్మండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎప్పట్నుంచో వాయిదా వేస్తూ వస్తోన్న పనులన్నీ పూర్తి చేయడానికి ఇదే సరైన సమయం. ఆధ్యాత్మిక ఆలోచనలు చుట్టుముడతాయి. మీదైన ఆలోచనను ప్రపంచానికి చెప్పాలనుకుంటారు. కలిసివచ్చే రంగు : నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ప్రేమ జీవితంలో ఓ కీలక మార్పు చోటుచేసుకుంటుంది. ఒత్తిడిలోనే ఓ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీ భవిష్యత్తుకు ఏది మంచిదో ఆ వైపే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వృత్తి జీవితం బాగుంటుంది. మీ ప్రతిభ ప్రపంచానికి పరిచయం అయ్యే రోజు దగ్గరలోనే ఉంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగానే ఉంటుంది. డబ్బు ఖర్చు పెట్టడంలో జాగ్రత్త చూపాల్సిన సమయం ఇదే. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సమయపాలన లేకపోవడం మిమ్మల్ని కొన్ని విషయాల్లో ముందుకు వెళ్లనీయకుండా అడ్డుకుంటుందని గ్రహించండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. ప్రస్తుతం మీ జీవితం ఒక దగ్గర ఎటూ కదలకుండా ఆగిపోయింది. అందుకు కారణాలేంటన్న దానిపై ఆలోచన పెట్టండి. మీ ఆలోచనా విధానం మారాల్సిన సమయం కూడా ఇదే. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తుల్ని దూరం చేసుకోవద్దు. కలిసివచ్చే రంగు : తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) అన్నింటికీ ఎదురెళ్లే మీ ఆలోచనా విధానమే మీ ఆయుధం. ఈ ఆలోచనా విధానం వల్లే మీరు ఊహించని ఓ అద్భుతమైన అవకాశం తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని ధైర్యంగా స్వీకరించి ముందుకు వెళ్లండి. మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఒక కోరిక నెరవేరుతుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. మిమ్మల్ని తక్కువ చేస్తూ వచ్చిన వారికి సరైన సమాధానం ఇచ్చేలా ఓ విజయం మీకు చేరువవుతోంది. కలిసివచ్చే రంగు : గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనలు ఉన్నవారితో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ వృత్తిరీత్యా మీ పనులన్నీ సాఫీగా సాగిపోతాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కాస్త గందరగోళంగా ఉంటుంది. ఒక కీలకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. అది మీ వృత్తి జీవితంలో చోటు చోసుకునే మార్పే అయినా ప్రభావం అన్నింటిపై ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కొన్ని అనుకోని సమస్యలు ఎదురైనా అంతా మంచికే అనుకోండి. కలిసివచ్చే రంగు : గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కొద్దిరోజులు ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఈ ఆలోచనే మీకు కొందరిని దూరం చేస్తుంది. జీవితాశయం వైపుకు అడుగులు ఎలా వేయాలా అని ఆలోచిస్తారు. అన్నింటికీ సిద్ధమయ్యాకే ఆ వైపు అడుగులు వేస్తే మంచిది. కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రశాంతత కోసం మీ జీవిత భాగస్వామితో ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. కలిసివచ్చే రంగు : నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఏ పని చేసినా నిరుత్సాహంగా ఉండే మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఒక దారిని ఎంచుకొని ఆ మార్గంలో వెళ్లండి. పరిస్థితులు కొన్ని మీకు ప్రతికూలంగా మారతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. వృత్తి జీవితంలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకు బాగా ఇష్టమైన వ్యక్తితో మీ జీవితానికి సరిపడే ఆనందాన్నిచ్చే సాయంత్రాలను గడుపుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ఊదా మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వృత్తి జీవితంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అంతా గందరగోళంగా ఉంటుంది. మీ పై స్థాయి వ్యక్తులతో గొడవ సూచనలు కనిపిస్తున్నాయి. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రేమ జీవితంలో కూడా ఒడిదుడుకులు తప్పవు. తొందరగా నిర్ణయం తీసుకునే మీ స్వభావం మీకు ఈ కష ్టసమయంలోనూ బాగా పనికొస్తుంది. జరగవని తెలిసిన విషయాల మీద ఎక్కువ శ్రద్ధ పెట్టకండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ చుట్టూ మిమ్మల్ని తక్కువ చేసే మనుషులు ఉన్నారు. జాగ్రత్తగా వ్యవహరించండి. కలిసివచ్చే రంగు : నీలం ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు 5/11/2017 - 11/11/2017
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న పనుల్లో అవాంతరాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యుల నిర్ణయాలతో విభేదిస్తారు. ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. కొన్ని నిర్ణయాలను మార్చుకోక తప్పని పరిస్థితి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. వ్యాపారాలు స్వల్పంగానే లాభిస్తాయి. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, పసుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. చీమలకు ఆహారం పెట్టండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొత్త వ్యూహాలతో అందర్నీ ఆకట్టుకుంటారు. చేపట్టిన కార్యాలు పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల పరిస్థితి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఉడికించిన సెనగలు ఆవుకు పెట్టండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) రాబడికి మించిన ఖర్చులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు. పనుల్లో అవాంతరాలు ఏర్పడవచ్చు. ఆరోగ్య పరంగా చికాకులు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. మీ ప్రతిపాదనలు స్నేహితులు తిరస్కరిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. కళాకారులు, ఐటీ నిపుణులు మరింత శ్రమపడాలి. వారం ప్రారంభంలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కార్యజయంతో ఉత్సాహం పెరుగుతుంది. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఒక సమాచారం కొత్త ఆలోచనలు రేకెత్తిస్తుంది. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరవుతారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు మరింతగా పెరుగుతాయి. కళాకారులకు సన్మానాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. అనారోగ్యం. లేత పసుపు, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీదేవికి పొంగలి నివేదించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనూహ్యమైన రీతిలో పనులు పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని వ్యవహారాలలో చర్చలు ఫలిస్తాయి. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవేత్తలకు పదవులు రావచ్చు. వారం చివరిలో వివాదాలు. ఆరోగ్యభంగం. గులాబి, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సెనగలు ఉడికించి ఆలయంలో ఇవ్వండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రుల సహాయంతో ముందుకు సాగుతారు. ఆపదలో ఉన్న వారికి స్నేహహస్తం అందిస్తారు. కాంట్రాక్టర్లకు అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలు, ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాగి నాణాన్ని పాలతో కడిగి నీటిలో విడిచిపెట్టండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యవహారాలలో ప్రతిబంధకాలు. ఆలోచనలు కలసిరావు. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం తప్పకపోవచ్చు. కళాకారులు, ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పసుపు, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామికి తులసీదళాల దండ సమర్పించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. అనుకున్నది ఒకటి జరిగేది వేరొకటిగా ఉండవచ్చు. ఆరోగ్య, కుటుంబసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండండి. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు. ఐటీ నిపుణులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో శుభవార్తలు. వాహనయోగం. ఎరుపు, గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నిరుద్యోగుల యత్నాలు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు హోదాలు దక్కవచ్చు. కళాకారులకు నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. వృథా ఖర్చులు. గులాబి, లేత పసుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచామృతాలతో వినాయకునికి అభిషేకం చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. చేపట్టిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. అందరిలోనూ మీ ప్రతిభ నిరూపితమవుతుంది. వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళాకారులు, ఐటీ నిపుణులు అనుకున్నది సాధిస్తారు. వారం ప్రారంభంలో ధనవ్యయం. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి కుంకుమార్చన చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. పనుల్లో ప్రతిబంధకాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు. వారం చివరిలో శుభవార్తా శ్రవణం. ధనలాభం. నలుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆదాయానికి మించిన ఖర్చులు తప్పవు. ఆలోచనలు కలిసిరావు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు కాస్త చికాకు పరుస్తాయి. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. అంచనాలు తప్పి నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇతరుల విషయాలలో జోక్యం వల్ల కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు అవకాశాలు చేజారవచ్చు. వారం ప్రారంభంలో విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. గులాబి, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో 5 నవంబర్ నుంచి 11 నవంబర్, 2017 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీకు శత్రువులు ఎవరైనా ఉన్నారంటే అది మీ ఆలోచనా విధానమే! ఏది చేసినా అంతా చెడే జరుగుతుందన్న ఆలోచనను దూరం చేసుకోండి. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపించే ఆయుధమని నమ్మండి. కొద్దిరోజుల్లోనే ఓ శుభవార్త వింటారు. మీ కోసం కొత్త అవకాశాలు తలుపుతడతాయి. ధైర్యంగా ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. సిగరెట్లు, మద్యపానం లాంటి చెడు అలవాట్లు మానేయండి. అందుకు ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : బూడిద వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ వారమంతా ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ప్రేమ జీవితం చాలా బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కొత్త అవకాశాలు వస్తాయి. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. ఆత్మవిశ్వాసంతో మీ పని మీరు చేస్తూ పొండి. మీదైన గుర్తింపు దక్కేందుకు ఇంకాస్త కష్టపడాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : నీలం మిథునం (మే 21 – జూన్ 20) అన్ని విషయాల్లోనూ అతి జాగ్రత్త ప్రదర్శిస్తూ మీదైన ప్రతిభను ప్రపంచానికి చూపలేకపోతున్నారు. ఎక్కువ భయపడిపోయి అనవసరంగా అందివచ్చిన అవకాశాలను దూరం చేసుకోకండి. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇది. అయితే మీకంటూ ఒక అవగాహన వచ్చేవరకూ వేచిచూడండి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఇప్పటికి మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నీ ఇంకొన్ని రోజులూ అలాగే ఉంటాయి. అయితే ఆ తర్వాత అంతా బాగుంటుందని నమ్మండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న విజయం త్వరలోనే దక్కుతుంది. అయితే అందుకు మీ శ్రమనంతా ఎప్పట్లానే వెచ్చించాల్సి ఉంటుంది. కష్టపడకుండా, విజయంపై ధీమా కోల్పోయి పనిచేస్తే అది అంతకంతకూ దూరమవుతుందన్న విషయాన్ని తెలుసుకోండి. మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొత్త అవకాశాలు ఏవైనా తలుపు తడితే వెంటనే అందిపుచ్చుకోండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. విహారయాత్రకు వెళ్లే ఆలోచన ఉంటే వెంటనే సన్నాహాలు చేసుకోండి. కలిసివచ్చే రంగు : ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈ వారమంతా మీకు చాలా కొత్తగా ఉంటుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తిని కలుసుకుంటారు. ఈ కొత్త జీవితాన్ని ఆహ్వానించేందుకు సిద్ధంగా ఉండండి. వృత్తి జీవితం సాఫీగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. వచ్చిన అవకాశాల్ని వదులుకోకండి. మీదైన ఆలోచనా విధానాన్ని ఎవ్వరి కోసమూ మార్చుకోకండి. మీరు ఎలా ఉండాలనుకుంటే ఎలానే ఉండండి. అంతా మంచే జరుగుతుందన్న నమ్మకంతో ముందడుగు వేయండి. కలిసివచ్చే రంగు : నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఎప్పట్నుంచో మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం దొరుకుతుంది. కొత్త అవకాశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. మీ స్థాయికి తగ్గ అవకాశాన్ని ఎంచుకోవడంలో జాగ్రత్తపడండి. విజయం వైపుకు మొదటి అడుగు ఈ వారమే వేస్తారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు విజయం మీ వెంటే ఉంటుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఈ వారం మీకు కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. ఊహించని చిక్కుల్లో చిక్కుకుంటారు. ధైర్యంగా ఈ పరిస్థితులను ఎదుర్కొండి. జీవితంలో ఇలాంటి పరిస్థితులు అందరికీ ఎదురవుతాయన్న విషయం తెలుసుకోండి. ఏం చేయాలో తోచని పరిస్థితే ఉంటే కొన్నాళ్లు అన్నింటికీ దూరంగా ఉండండి. ఏదైనా విహారయాత్రకు వెళ్లి రండి. మీ మనసుకు ప్రశాంతత చేకూరాకే నిర్ణయం తీసుకోండి. ఈ సమయం ఇంకొన్ని రోజులే, తర్వాత అంతా మంచే జరుగుతుంది. కలిసివచ్చే రంగు : గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ప్రేమ జీవితం కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ లేనంత సంతోషంగా రాబోయే రోజులను గడుపుతారు. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. మీ ప్రతిభను చాటుకునేందుకు ఇదే సరైన సమయం. వృత్తి జీవితంలో మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు మీ జీవితాశయానికి దగ్గరగా ఉంటుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా, వర్తమానాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాధించడం అలవాటు చేసుకోండి. కలిసివచ్చే రంగు : గోధుమ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) గతం గురించి ఆలోచిస్తూ కూర్చొని ఇప్పటికే చాలా అవకాశాలు పోగొట్టుకున్నారు. గతాన్ని వదిలిపెట్టి కొత్తగా జీవితాన్ని మళ్లీ మొదలుపెట్టండి. మీకోసం ఓ కొత్త జీవితం ఎదురుచూస్తోంది. దాన్ని ఆహ్వానించండి. ఒంటరితనంతో మిమ్మల్ని మీరు దూరం చేసుకోకండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇది. కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. ఎక్కువ ఒత్తిడికి లోనుకాకండి. అవసరమైతే ఏదైనా విహారయాత్రకు వెళ్లండి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఏదీ ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే స్వభావమే మీరు అన్నింట్లో వెనుకబడడానికి కారణం అన్న విషయం గ్రహించండి. కాస్త జాగ్రత్తగా ఆలోచించి, ఆచితూచి మీ ఆశయం వైపుకు అడుగులు వేయించే నిర్ణయాలనే తీసుకోండి. అలాంటి అవకాశాలనే అందిపుచ్చుకోండి. విజయం మీ వెంట ఉంటుంది. మీ ప్రతిభ వృధాగా ఉండిపోకూడదు. మీ అనుభవం, స్థాయికి తగ్గ పనులనే చేయండి. ప్రేమ జీవితం కొంత కలవరపెడుతుంది. పిచ్చి నమ్మకాలను పక్కనబెట్టి మీ శక్తినంతా కేంద్రీకరించి పనిచేయండి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఎప్పట్నుంచో మిమ్మల్ని వెంటాడుతోన్న భయాలు ఇంకొన్నాళ్లు అలాగే కొనసాగుతాయి. అయితే ఇదంతా శాశ్వతం కాదని నమ్మండి. ఇప్పటికైనా ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీ భయాలను పక్కనబెట్టి ఈ నిర్ణయం తీసుకోండి. ప్రేమ జీవితం కొత్తగా ఉంటుంది. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : ముదురు గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అతిగా ఆలోచిస్తూ కూర్చునే మీ స్వభావం మారాల్సిన సమయం ఇది. ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. అలాగే వ్యాయామం చేయడాన్ని కూడా అలవాటుగా మార్చుకోండి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటారు. అందులో కొన్ని ఒడిదుడుకులు ఉన్నా మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. విజయం మీ వైపే ఉంటుంది. ప్రేమ జీవితం బాగుండటం లేదు. జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడండి. కలిసివచ్చే రంగు : పసుపు - ఇన్సియా టారో అనలిస్ట్ -
అంతరాత్మ మాట వినండి
అక్టోబర్ 24 నుంచి 30 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఈ వారంలో చాలా సాహసోపేతమైన పనులు చేస్తారు. దృఢనిశ్చయంతో, ఆత్మవిశ్వాసంతో వ్యవహరించండి. మీలోని భయాలను జయించండి. పాజిటివ్ థింకింగ్ వల్ల అనేకమైన అడ్డంకులను, చిక్కుసమస్యలను అధిగమిస్తారు. ఎవరు, ఎంతగా బలహీనపరచాలని చూసినా చెదరకండి. విజయం తథ్యం. కలిసొచ్చే రంగు: సముద్రపు పాచి రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఉత్సాహాన్ని, జయాలను చేకూర్చే వారమిది. మీ సామర్థ్యానికి తగిన గుర్తింపు వస్తుంది. పెద్దహోదాలో ఉన్న ఉద్యోగులు, అధికారులు మంచి గుర్తింపును పొందుతారు. కిందిస్థాయి వారితో ఉదారంగా వ్యవహరించడం, దానధర్మాలు చేయడం మంచిది. అలసిన శరీరాన్ని విహార యాత్రలతో సేదతీర్చండి. కలిసొచ్చే రంగు: పచ్చరాయి రంగు జెమిని (మే 21-జూన్ 21) అందమైన మీ శరీరం, మృదువైన మీ మాట మీకు ఇబ్బందులు తేవచ్చు. అయితే స్వచ్ఛమైన మీ మనసు, ప్రేమించే మీ తత్వం మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ ప్రేమబంధాన్ని వివాహ బంధంగా మార్చుకోండి. అవివాహితులకు తగిన సంబంధం కుదురుతుంది. నాన్పుడు ధోరణిని మాని, చకచకా నిర్ణయాలు తీసుకోండి. కలిసొచ్చే రంగు: కెంపు రంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీ కలలను ఫలప్రదం చేసుకోవడానికి ఇది తగిన సమయం. మీది తీరని కోరిక అనుకుని నిరుత్సాహపడకండి. మీ లక్ష్యం నెరవేరదు అని నీరుకారిపోకండి. ఆ రెంటినీ ఎంతో అవలీలగా సాధిస్తారు. ముల్లును ముల్లుతోనే తీయాలి అన్నట్లు కుట్రలు, కుతంత్రాలను వాటితోనే ఎదుర్కోవాలని గ్రహించండి. కలిసొచ్చే రంగు: తెలుపు లియో (జూలై 24-ఆగస్టు 23) మార్పు అనివార్యం. అందుకు సిద్ధంగా ఉండండి. మీ అంతరాత్మ మాట వినండి. వివిధ విషయాలపట్ల మీకున్న అపారమైన పరిజ్ఞానానికి మీ చుట్టుపక్కల వారందరూ అమితంగా ఆశ్చర్యపోతారు. మీ అంతరంగిక శక్తులను మరింతగా వెలికి తీసేందుకు ప్రయత్నించండి. మేధస్సుకు మరింత పదును పెట్టండి. కలిసొచ్చే రంగు:వంకాయరంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మిమ్మల్ని మభ్యపెట్టి, మీ ద్వారా పనులు చేసుకునేందుకు యత్నాలు జరగవచ్చు. ఏమాత్రం ప్రలోభపడినా, చిక్కుల్లో పడక తప్పదు. మీ నీతి, నిజాయితీలని విడిచిపెట్టకండి. చీకటి శక్తులు, అరాచకవాదులతో తీవ్రపోరాటం తప్పదు. రేఖీని ఫాలో అవడం మంచిది. నచ్చిన వారితో ఆనందంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: తుప్పు రంగు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) పకి మెచ్చుకుంటూనే వెనకాల గోతులు తవ్వేవారు, రకరకాల వదంతులు ప్రచారం చేసేవాళ్లు కాచుకుని ఉన్నారు. అందమైన స్త్రీలని మీ మీద ఎరగా ప్రయోగించి, మిమ్మల్ని అపఖ్యాతి పాలు చేసేవారు కూడా ఉన్నారు. అలాంటివారితో అప్రమత్తంగా వ్యవహరించండి. సవాళ్లను ఎదుర్కొనేటప్పుడు కష్టంగా ఉన్నా, ధైర్యంగా ముందుకెళ్లండి. కలిసొచ్చే రంగు:ముదురు ఎరుపు స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు ఎదురు చూసే ముఖ్యమైన మార్పు రానుంది. అందుకు తగ్గట్టు మీ జీవనశైలిలో మార్పులు చేసుకోండి. కట్లను చూసి భయపడితే ఎలా? పగలు ఉంటుంది, వెలుగూ ఉంటుంది కదా! మీకున్న జ్ఞానాన్ని, మీ సహజమైన ధైర్యాన్ని, సానుకూల దృక్పథాలనే ఆయుధాలుగా చేసుకుని సమస్యలను తరిమి కొట్టండి. కలిసొచ్చే రంగు: బూడిద రంగు, వెండిరంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ నిరాడంబర జీవనవిధానం వల్లే మీకు మేలూ, కీడూ కూడా! ఇది ఇలాగే ఇంకొంతకాలం కొనసాగించడం మంచిది. సమాజం దృష్టిలో మీరు ఎంతో మంచివారిగా, నిరాడంబరులుగా నిలిచిపోతారు. అయితే కొన్ని అనూహ్యమైన, అవాంఛనీయమైన సంఘటనలు జరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ప్రేమలో పడవచ్చు. కలిసొచ్చే రంగు: నీలిమందు రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఎంతో ఆనందంగా, ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా ఉంటారు. మీ మూలంగా మీ చుట్టుపక్కల వారు కూడా సంతోషంగా ఉంటారు. మీ సాన్నిధ్యంలో అందరూ ఎంతో ఊరట పొందుతారు. ఎన్ని పనులున్నా ఆడుతూ పాడుతూ అవలీలగా చేసేస్తారు. మొన్నటి దసరా పండుగ మీకు మిగిల్చిన ఆనందాన్ని, కలిగించిన అదృష్టాన్ని వదులుకోకండి. కలిసొచ్చే రంగు: బంగారు రంగు అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీరు ఎంతో శక్తిమంతులు. అయితే చంద్రుని ప్రభావం వల్ల ఒక్కోసారి మీలోని ధైర్యం, ఆత్మవిశ్వాసం సడలుతుంటుంది. ఆ సమయంలో ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహించి, మీ శక్తిసామర్థ్యాలను మీకు గుర్తు చేస్తే తిరిగి ఉత్సాహం తెచ్చుకుంటారు. ఆధ్యాత్మికంగా మీలో మార్పు కలుగుతుంది. దీనివల్ల ఎంతో మేలు కలుగుతుంది.. కలిసొచ్చే రంగు: మీగడలాంటి తెల్లటి రంగు పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) మీ ప్రేయసి లేదా జీవిత భాగస్వామి మిమ్మల్ని నిందించవచ్చు. వారితో విభేదాలు రావచ్చు. ఆర్థికంగా శుభవార్తలు వింటారు. అయితే దీనిమూలంగా కొన్ని కొత్త సమస్యలు, ససవాళ్లు ఎదురు కావచ్చు. మిమ్మల్ని చేతకానివాళ్లు అనుకునే అవకాశం ఎవరికీ ఇవ్వద్దు. మీ శక్తిసామర్థ్యాలను వెలికి తీసుకు వచ్చి, వాటిని నిరూపించుకోండి. కలిసొచ్చే రంగు: మెరిసే నీలిరంగు ఇన్సియా కె. టారో అండ్ ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) తొందరపాటు ఆలోచనలు చేసి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, వాటిని అమలు చేయవద్దు. అలాగే అనవసరమైన చర్చలు, వాదోపవాదాలూ లేవదీయడం కూడా మంచిది కాదు. నిదానంగా నిర్ణయాలు తీసుకోండి. వాటిని సజావుగా అమలు చేయండి. మీ అభిప్రాయాన్ని ముఖం మీద కొట్టినట్లుగా కాకుండా మృదువుగా చెప్పడం మంచిది. టారస్ (ఏప్రిల్ 21-మే 20) కుటుంబాన్ని, కుటుంబంలో ఉన్న ఐకమత్య పరిస్థితినీ ఓ కంట కనిపెట్టండి. అనవసర ఘర్షణలతో వ్యక్తుల మధ్య కొన్ని తేడాలు వస్తూ ఉండవచ్చు. దీనివల్ల సంసారం బయటపడవచ్చు. ముఖ్యంగా మాట పట్టింపు ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి. అన్నింటినీ మించి బంధువులు మనింటి విషయాలను ఆరాతీస్తున్నారేమో కనిపెట్టి ఉండండి. జెమిని (మే 21-జూన్ 21) అతి ముఖ్యమూ, జీవితాన్ని ఓ చక్కటి మలుపు తిప్పే ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారేమో గమనించుకోండి. వీలయినంత తొందరగా పూర్తి చేసుకోండి. సంతానం గురించిన శ్రద్ధని పాటించి తీరాలి. బంధువులతో సత్సంబంధాలు నెరపండి కానీ, బంధువులే లోకంగా ఉంటే పనులన్నీ వెనకబడతాయి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఏ సమయానికి ఏది వీలో, ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో ఎప్పటికప్పుడు ఆలోచించుకుని లౌక్యంగా ఇవతలకి వచ్చేయడం అన్నివేళలా సాధ్యం కాకపోవచ్చు. నిజాయితీగా ఇది నాకు నచ్చదు అనే విషయాన్ని సమయానుకూలంగా స్పష్టంగా చెప్పేయండి. మొగమాటాన్ని వీడండి. అంతర్భయం వద్దు. లియో(జూలై 24-ఆగస్టు 23) లోగడ చేసిన రుణాలు ఒకటో రెండో కొద్దిగా బాధించవచ్చు. అయితే వాటివల్ల అంత ఇబ్బంది లేదని గమనించండి. కొత్తవ్యాపారం ప్రారంభించడం ఇప్పట్లో అంత మంచిది కాదు. మీ కులవృత్తిని లేదా లోగడ మీకు అనుభవం ఉన్న వృత్తినీ ఎంచుకున్న పక్షంలో మీకు తిరుగుండదు. మీకున్న పలుకుబడి కారణంగా ఎందరెందరో మీకు సాయపడవచ్చు. దిగులు పడకండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) పరాకు పడుతూ చేస్తున్న ఉద్యోగంలో కొన్ని పొరపాట్లని చేసే అవకాశం ఉంది. ఆడంబరం కోసం కొంత వ్యయం చేస్తారనిపిస్తోంది. ప్రయాణ సందర్భాల్లో వస్తువుల జాగ్రత్త అవసరం. ప్రభుత్వానికి చెల్లించవలసిన వాటిని సకాలంలో చెల్లించడం, ఆరోగ్యవిషయంలో జాగ్రత్తలు పాటించడం, కిందిస్థాయి ఉద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కుటుంబ సభ్యుల్లో ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళనకి గురి చేయవచ్చు. ఇంటాబయటా చిన్న చిన్న సమస్యల కారణంగా మానసికంగా కొంత నలిగిపోయే అవకాశముంది. ఆర్థికంగా కొంత లోటు ఉండవచ్చు. దానిని పూడ్చుకునేందుకు తగిన మార్గాలను అన్వేషించుకోండి. సమస్యలకు రాజీ మార్గమే సరైనదేమో ఆలోచించుకోండి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు ఎంతో విశ్వసించిన వ్యక్తి మిమ్మల్ని మోసగించడం లేదా మీకే ద్రోహం చేయడం వంటివి జరగవచ్చు. అతిగా నమ్మడమనేది మీ దోషమే తప్ప వారిది కాదనుకుని, భవిష్యకాలాన్ని గురించి ఆలోచించండి. జరిగిన దాని మీద దృష్టి పెడుతూ, వర్తమానాన్ని పాడు చేసుకోకండి. మీకు ద్రోహం చేసిన వారి విషయంలో పగ, ద్వేషం, అరాచకం వంటి దిశగా ఆలోచించకండి. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీరు రైతులయిన పక్షంలో చెప్పలేని ఆనందాన్ని పొందుతారు. బంధువుల్లో జరిగే శుభకార్య నిర్వహణా భారాన్ని మీరే మోస్తారు. ఒకవిధంగా ఆలోచిస్తే మీకు పెద్దరికాన్ని ఇస్తే కాదనకుండా చేయడం మీకెంతో ఇష్టం. అయితే శరీర శ్రమని గుర్తించి సహాయపడండి. స్వతంత్రంగా ఏదైనా వ్యాపారం తలపెట్టే ఆలోచన ఉంటే దానిని జనవరి 15 వరకూ వాయిదా వేయడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం, ఆధ్యాత్మిక గురువులను కలవడం, పుణ్యక్షేత్రాలని సందర్శించడం జరగవచ్చు. మీ సంతానం ఇంకా విద్యార్థి దశలో ఉన్నట్లయితే మంచి విజయాన్ని సాధించగలుగుతారు. వీలయినంత వరకూ దూరప్రయాణాలని మానుకుని ఉన్నచోటులోనే ఎదగడానికి యత్నించడం ఉత్తమం. తొందరపడి ఎవ్వరికీ మాట ఇవ్వవద్దు. ఇచ్చాక వెనుకాడద్దు. అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీ పై అధికారులు ఏమాత్రపు దోషం మీలో దొరుకుతుందనే దృష్టితో పరిశీలిస్తున్నారనే భావంతో ఉద్యోగం, వ్యాపారం, వృత్తి వంటివానిని అప్రమత్తంగా నిర్వహించండి. పాత వాహనాలని అమ్మి కొత్తవి కొనాలనుకోవడం, ఇంటిని మార్చడం లేదా పాత ఇంటిని అమ్మి కొత్తదాన్ని అప్పు చేసి మరీ కొనాలనుకోవడం వంటివాటిని కొద్దికాలంపాటు వాయిదా వేయండి. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఆర్థికమైన పేచీలు కుటుంబంలో అన్నదమ్ములు, తండ్రీకొడుకులు, భార్యాభర్తల మధ్య కూడా వచ్చే అవకాశం ఉందని గ్రహించి, ముందే మేల్కొని ఆర్థిక క్రమశిక్షణని పాటించండి. మీరు తీసుకోవలసిన పత్రాలని జాగ్రత్తగా పరిశీలించడం, ప్రయాణాలలో మీ వస్తువులను ఇతరులకు అప్పగించకుండా మీరే జాగ్రత్తగా పెట్టుకోవడం మంచిది. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
వృత్తిపరంగా కలిసొచ్చే కాలమిది
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఇది మీకు బాగా కలిసొచ్చే కాలం. మీ జీవిత భాగస్వామితో సామరస్యంగా, స్నేహంగా మెలగడం మంచిది. అనవసరమైన చిక్కులు, చికాకులు, టెన్షన్లు ఉండవచ్చు. వాదనలు మానడం మంచిది. శుభవార్తలు వింటారు. తద్ద్వారా సంతోషాన్ని పొందుతారు. ఉన్నత సోపానాలు అధిరోహిస్తారు. కలిసొచ్చే రంగు: బ్లూ టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఇది మీకు సాహసోపేతమైన నెల. భాగస్వామ్య వ్యవహారాలు, కొత్త వ్యాపారాలు కలిసి వస్తాయి. పెళ్లి ఘడియలు సమీపిస్తాయి. వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది. పొదుపు చేయడానికి ఇది మంచి తరుణం... అయితే పెట్టుబడులకు మాత్రం కాదు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వ్యాయామం చేయడం మంచిది. కలిసొచ్చే రంగు: గ్రీన్ జెమిని (మే 21-జూన్ 21) గతంలో చేసిన వాటి ఫలితం ప్రస్తుతం అనుభవంలోకి వస్తుంది. కోర్టు కేసులలో తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. అతి ముఖ్యమైన నిర్ణయం ఒకటి తీసుకోవ లసి వస్తుంది. మనం అనుకున్నది పొందాలన్నా, చేపట్టిన పనులలో విజయం సాధించాలన్నా రిస్క్ తీసుకోక తప్పదని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: ఎల్లో క్యాన్సర్(జూన్22-జూలై 23) మీరు ఇంతకాలంగా చేసిన కృషికి ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తారు. అందుకు ఆనందిస్తారు. ఖరీదైన వస్తువును కొంటారు లేదా షాపింగ్ చేస్తారు. మీ లవర్ లేదా జీవిత భాగస్వామి ఒక విషయంలో అలకబూనవచ్చు. అవతలి వారిపట్ల మీకున్న ప్రేమ మీరు వారిని అడగాలనుకున్న ప్రశ్నలను అడగనివ్వకుండా మీ నోరు కట్టేస్తుంది. కలిసొచ్చే రంగు: పర్పుల్ లియో(జూలై 24-ఆగస్టు 23) గత ఏడాది కాలంగా పోల్చుకుని చూస్తే ఈ నెలలో ఆర్థికంగా మీరు ఎంతో ఉన్నతిని సాధిస్తారు. వెన్నుపోటుదారుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ ఉన్నతిని చూసి ఎంతోమంది అసూయ చెందుతారు. మీ పై అధికారులకు మీ మీద చాడీలు చెప్పవచ్చు. అయితే ఓపిక వహించ డం మంచిది. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. కలిసొచ్చే రంగు: సిల్వర్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీదైన శైలిలో పనిచేసి అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు. ఇతరులు ఎవరైనా మీమీద అసూయ లేదా కోపంతో చేసే పనులకు కోపం తెచ్చుకోకండి. వాళ్లమీద జాలిపడండి. మనసారా నవ్వుకోండి. ఈ వార మంతా మీరు హాయిగా నవ్వుతూ తుళ్లుతూ ఉల్లాసంగా గడుపుతారు. ప్రేమ గురించి కలలు కంటూ ఉంటారు. కలిసొచ్చే రంగు: ముదురాకుపచ్చ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కొత్తగా ఆలోచించి, సృజనాత్మకతతో చాకచక్యంగా పనులు చేస్తారు. ఇతరుల పట్ల మీ ఆలోచనాధోరణిని మార్చుకోండి. మీ ఆలోచనలలో మార్పు చేసుకోవడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. మీ జీవితంలో ఏదైనా అనుకోని సంఘటనలు జరిగితే అది సహజమని, జీవితంలో అది కూడా ఒక భాగమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: ఇండిగో స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) భయం, అభద్రతా భావాలకు గురికావడం వల్ల చాలా దిగులుగా, ఆందోళనగా కనిపిస్తారు. అంతగా భయపడేటట్లయితే ఎందులోనూ పెట్టుబడులు పెట్టకండి... పనిలో కాని, ఇంటిలో కాని, ఉద్యోగంలో కాని మార్పు ఉండవచ్చు. వ్యాపారస్థులయితే వారి వ్యాపారంలో మార్పు చేస్తారు. విద్యార్థులు తమ సబ్జెక్టులు మార్చుకునే ఆలోచన చేస్తారు. కలిసొచ్చే రంగు: గోల్డ్ శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) ఈ వారం మీకు ధనం పుష్కలంగా చేతికందుతుంది. పనిప్రదేశంలో అంటే ఆఫీసులో మార్పులు చోటు చేసుకుంటాయి. మీ కుటుంబంలో ఒక స్త్ర్రీ వల్ల మీకు బాగా కలిసి వస్తుంది. గతాన్ని మరచిపోండి. విజయం మీకు చేరువలోనే ఉందని గ్రహించండి. వృత్తిపరంగా లేదా ఆఫీస్ పరంగా చిన్నపాటి ప్రయాణ ం ఉండొచ్చు. కలిసొచ్చే రంగు: ఎల్లో అక్వేరియస(జనవరి 21-ఫిబ్రవరి 19) మీ కలలు నెరవేరే తరుణమిది. డబ్బు గురించి ఏమాత్రం ఆందోళ న అవసరం లేదు. ఈ వారం మీరు బోల్డంత డబ్బు బ్యాంకులో దాచుకుంటారు కూడా! జీవితాన్నితేలికగా తీసుకోండి. విందు వినోదాల్లో గడుపుతారు. ఒక స్నేహితునితో మీ బంధం తిరిగి గట్టిపడుతుంది. అది మీకు ఎంతో ఉపకరిస్తుంది. కలిసొచ్చే రంగు: పర్పుల్ పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) కొద్దిపాటి ఒడిదొడుకులు, సమస్యలు, ఎదురు కావొచ్చు. రెండు విధాలైన వృత్తి ఉద్యోగావకాశాలలోదేనిని ఎంచుకోవాలో తెలియక తికమక పడతారు. ప్రేమ విషయంలో కూడా ఇదే పరిస్థితి ఎదురు కావచ్చు. గతంలో మీరు ఏమిటి, ఏం చేశారన్నది కాదు, ఇప్పుడు ఎలా నడుచుకుంటారన్నదే మీ లక్ష్యసిద్ధికి తోడ్పడుతుందని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: రోజ్ పింక్ కలర్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) మీ సంతానానికి చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. భార్యకి భర్తపట్ల, భర్తకి భార్యపట్ల అన్యోన్యత పెరిగే కారణంగా ఈవారంలో కుటుంబంలో సుఖశాంతులు చోటుచేసుకుంటాయి. సంతానం తమ బాధ్యతను తామే నిర్వర్తించుకుంటే కలిగే మనశ్శాంతి ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకుంటారు. అనవసరమైన వ్యయాన్ని అదుపుచేసుకుని మిగులులో ఉంటారు. టారస్(ఏప్రిల్ 21-మే 20) అకస్మాత్తుగా మీలో ఆధ్యాత్మిక భావన, దానధర్మాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. అది మంచి ఆలోచనే కానీ, శక్తికి మించి దానధర్మాలు చేయడం కుటుంబానికి అన్యాయం చేయడమే అవుతుందని గ్రహించుకోగలగాలి. ఆచార వ్యవహారాల పట్ల ఆదరణ పెరుగుతుంది కానీ, అది మీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది కలిగించేలా మారకుండా చూసుకోవాలి. జెమిని (మే 21-జూన్ 21) ఎప్పటికప్పుడు ఓ సమస్య రావడం, మనశ్శాంతిని కోల్పోవడం, మళ్లీ అంతలోనే ఆ సమస్యకి పరిష్కారం అప్రయత్నంగా లభించడం, మనోధైర్యాన్ని పొందడం.. ఈవారమంతా ఇలా గడుస్తుంది. దీన్నే ‘క్రియాశూన్య కర్మ’ అంటారు. ఆలోచనలను చేస్తారు కానీ, ఆచరణలోకి తెచ్చేందుకు కావలసిన మనోధైర్యం, సాహసం ఉండకపోవచ్చు. లియో(జూలై 24-ఆగస్టు 23) అప్పటికప్పుడు అవసరానికి సొమ్ము వస్తూ, అవసరాలూ, రుణాలూ అలా తీరిపోతూ ఉంటాయి. గత జీవితపు అనుభవంతో పొదుపరితనం, సకాలంలో పనిని ముగించాలనే ఊహ, నష్టపోకుండా బాధ్యతతో వ్యవహరించాలనే దృక్పథం బలంగా వస్తాయి. న్యాయస్థానంలో ఉన్న అభియోగాలన్నీ వీగిపోయి, మీకు అనుకూలంగా తీర్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఇప్పట్లో ప్రతికూల పరిస్థితులుండవు కాబట్టి, మీ పనిని ప్రణాళిక ప్రకారం సాగించుకుంటూ వెళ్లిపొండి. ఒత్తిడి లేకుండా ఉద్యోగాన్ని చేసుకోండి. ఇతరులకు హామీలూ, వాగ్దానాలూ వంటివి చేసే ధైర్యం మీకు లేదు కాబట్టి, అలాంటి పరిస్థితి వస్తే మెత్తగానైనా గట్టిగా చెప్పగలిగే లౌక్యం మీకుంది కాబట్టి ఆనందంగా గడపండి. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ కుటుంబంలో వచ్చే ఓ సమస్యను నేరుగా ఎవరివల్ల ఆ ఇబ్బంది వచ్చిందో వారితో సూటిగా మాట్లాడుకోవడం వల్ల సత్ఫలితముంటుంది తప్ప, ఇతరుల మధ్య ఈ సమస్యను వివరిస్తే జటిలమైపోతుంది. కళ్లు తెరిచి చూసుకునే సరికి అందమైన జీవితం కాస్తా ఈ మధ్య వ్యక్తుల కారణంగా ఛిద్రమౌతుందని గ్రహించాలి. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ప్రతి చిన్న సమస్యనీ భూతద్దంలో చూడడం, మరీ ఎక్కువగా ఆలోచించడం కారణంగా చేస్తున్న ఉద్యోగ, వ్యాపారాల మీద దృష్టి సన్నగిల్లవచ్చు. సమస్య మూలాలను తెలుసుకోగలుగుతారు. శని ఎప్పుడూ చెడు చేయడు, జీవితంలో గొప్ప అనుభవాన్ని ఒక పాఠంలా మనకు అందిస్తాడు. జీవితాల్లో శని ప్రవేశించి కొన్నాళ్లున్నాక మాత్రమే ప్రతి వ్యక్తికి జ్ఞానోదయమవుతుంది. శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) ‘అలా చేసి ఉంటే ఇంత లాభించి ఉండేది’ అనుకుంటూ వర్తమానంలో నిలబడి, గతంవైపు దృష్టి సారించడం వల్ల కాలహరణం తప్ప ప్రయోజనం సిద్ధించదు. వాయిదా వేసే మనస్తత్వాన్ని విడిచి, కర్తవ్యం మీద దృష్టి సారించండి. జీవితంలో ఓటములనే చవిచూసిన వారితో స్నేహాన్ని కనుక చేస్తే ఇంకా అగాధంలోకి వెళ్లిపోయే ప్రమాదముంది. జాగ్రత్తగా ఉండండి. క్యాప్రికార్న్(డిసెంబర్ 22-జనవరి 20) పూర్తి అనుభవం లేకుండానే మరో వ్యాపారానికి నడుం కడతారు. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునేందుకు సమయం, శ్రద్ధ కుదరని కారణంగా ఆ వ్యాపారం అంతంతమాత్రంగా ఉండవచ్చు. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలను పాటించడం అవసరం. ఇతరుల మీద భరోసా ఉంచి మీ పనిని మరొకరితో చేయించడం ఏమాత్రమూ సరికాదు. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) తాత్కాలిక నిరాశతో పాడి కుండ లాంటి ఉద్యోగాన్ని విడవద్దు. బంధుమిత్రుల సలహాలను, సూచనలను, జాగ్రత్తలను విన్నట్లు నటించండి. ఉద్యోగం కారణంగా మీ సంసారం సుఖంగా సాగుతోందని, ఆ ఉద్యోగం ద్వారానే మీకు ఒక గుర్తింపు లభించిందని భావించాలి తప్ప, దీన్ని విడిచేస్తే మరోటి గొప్పదేదో దొరుకుతుందనుకోవడం కల్ల. తొందరపడవద్దు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) మీ మాటని మీ కిందివాడు వినకపోతే మీకెలా ఉంటుందో, అదే పరిస్థితి మీ విషయంలో మీ పైవానికీ ఉంటుంది. కాబట్టి పైవారికి అనుకూలంగానే ఉండండి. ఆస్తుల కొనుగోళ్లపై దృష్టి పెట్టకుండా పిత్రార్జితాన్ని గురించిన వివాదాలను కొంత నష్టపోయి అయినా తెగతెంపులు చేసుకోండి. కాలంగడిచేకొద్దీ విషయం ముదురుపాకానికి వెళ్లవచ్చు. మైలవరపు శ్రీనివాసరావు -
మీ మాటకి విలువ ఉండే కాలమిది
ఆగస్టు 22 నుంచి 28 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) వృత్తిపరమైన విషయాల్లో స్థిరత్వాన్ని. నిలకడతనాన్నీ పాటించి, అధికారాన్ని, అజమాయిషీనీ పొందుతారు. వ్యాపారం బాగా వృద్ధి అవుతుంది. ఇంతకాలంగా మీ అభివృద్ధికి చేయూతనిచ్చిన వారికి మీ కృతజ్ఞత చూపాల్సిన సమయమిది. జీవితమన్నాక ఒడిదొడుకులు సహజం. చిన్న చిన్న ఇబ్బందులకే భయపడితే ఆనందాన్ని ఆస్వాదించగలమా? కలిసొచ్చే రంగు: పింక్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) వృత్తిపరమైన పనులతోటీ, ప్రాపంచిక విషయాలతోటీ వారమంతా తీరికలేకుండా గడుపుతారు. ఇల్లు కట్టుకోవాలని లేదా ఉన్న ఇంటిని ఆధునీకరించుకోవాలని ఆలోచన వస్తుంది. పనిలో ఒక కొత్త అవకాశం వస్తుంది. పనులు వెంటనే పూర్తి చేయాలని ఆతృతపడతారు. శారీరకంగా ఫిట్నెస్ పెంచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: బ్లూ జెమిని (మే 21-జూన్ 21) ఇంటా బయటా చోటు చేసుకున్న మార్పులు మిమ్మల్ని అతలాకుతలం చేయవచ్చు. భయడపకుండా మీ బాధ్యతగా చేయగలిగిన దానిని చేయండి. అప్పుడు జీవితంలో ఏదీ ఇబ్బందిగా అనిపించదు. మీ విలువలు, ప్రాధాన్యతలు, ధోరణులలో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఒక ప్రకటన లేదా వార్త మిమ్మల్ని ఆకర్షించవచ్చు. కలిసొచ్చే రంగు: గ్రీన్ క్యాన్సర్(జూన్22-జూలై 23) గతం ఎప్పుడో జరిగిపోయింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు కనక గడిచిపోయిన దాన్ని గురించి, జరగబోయే దాని గురించి తలచుకుంటూ ఉండేకన్నా వర్తమానాన్ని హాయిగా గడపడం అలవాటు చేసుకోవడం వల్ల భవిష్యత్తు అందంగానే ఉంటుంది. మీ నిర్ణయాలలో జాప్యం వల్ల ఒక మంచి పనిని వదులకోవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: ఇటుక రాయి రంగు లియో(జూలై 24-ఆగస్టు 23) కొత్తగా ఏదైనా అవకాశం వచ్చిందంటే దానివెనకే కొత్త సవాళ్లు కూడా ఉండచ్చు. దానికి వెరవక ధైర్యంగా ఎదుర్కొని పోరాడటం వల్ల సులువుగా అధిగమించగలుగుతారు. అప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు నిర్భయంగా ముందుకెళితేకదా, మీ వెనక ఉన్న వాళ్లకు దారి చూపగలిగేది, వారు మిమ్మల్ని అనుసరించేదీ! కలిసొచ్చే రంగు: మట్టిరంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) సమష్టి బలము, సహకారానికి మీ సమర్థత తోడయితేనే కదా కొత్త వ్యాపార వ్యవహారాలైనా, వృత్తిపరమైన పనులైనా నెరవేరేది! టెన్షన్లు లేని జీవితం చప్పిడి తిండి వంటిది. ఏ కష్టాలూ, ఒడుదొడుకులూ, ఇబ్బందులూ లేకుండా ఉంటే జీవితం సాఫీగా నడిచిపోవచ్చేమో కానీ, అందులో మజా ఏముంటుంది? మీ పనుల్లో విజయం సాధిస్తారు. కలిసొచ్చే రంగు: సిల్వర్ వైట్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) జీవితంలో మార్పు కోరుకుంటున్న ఈ తరుణంలో ఒక అద్భుతమైన అవకాశం మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తుంది. రేపటి కోసం ఆలోచిస్తూ నేటి గురించి విస్మరిస్తున్నారన్న విషయాన్ని మరవద్దు. ఇంటి మరమ్మతులకు ఇది సమయం. ఆరోగ్యం గురించి జాగ్రత్త అవసరం. వ్యాయామం లేదా క్రీడలతో ఫిట్నెస్ పెంచుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: ఎల్లో స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు ఎంత తెలివిగలవారైనా, ఎంత ప్లానింగ్ తెలిసినా కూడా మీలోని భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోతే అన్నీ వ్యర్థమేనని మరచిపోవద్దు. ఇల్లు, సంపాదన, పేరుప్రఖ్యాతుల కోసం ఆలోచిస్తూ జీవితం గురించి పట్టించుకోకపోతే ఎలా? అన్నీ కలగలసినదే జీవితం అని గుర్తుంచుకోండి. ఈ వారమంతా చాలా శుభకరంగా ఉంటుంది. కలిసొచ్చే రంగు: ఆరంజ్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనుకున్న పనులన్నీ అయిపోవడం వల్ల వారమంతా సంతోషంగా గడుపుతారు. పనిధ్యాసలో పడి తిండి, నీళ్లు, నిద్ర మరచిపోకండి. వ్యాపారపరంగా, ఆర్థికంగా ఈ వారం చాలా బాగుంటుంది. ఫలితం కోసం ఎదురు చూడకుండా మీ వంతు కర్తవ్యాన్ని నిర్వహించండి. దేన్నైనా అతిగా ఆశిస్తున్నంతకాలం అది మనకు అందదన్నది గుర్తు తెచ్చుకోండి. కలిసొచ్చే రంగు: పీచ్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) జీవితంలో ప్రతిదీ ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటుందని మరచిపోకండి. ఈ కష్టాలూ, బాధలూ , బాధ్యతలూ మీ ఒక్కరికే కాదు, అందరికీ ఉంటాయని గుర్తుతెచ్చుకోండి. అహంకారాన్ని విడిచిపెట్టండి. బాధ్యతలు నెరవేర్చండి. ఒకరి స్వార్థం, అసూయ మూలంగా మీకు ఇబ్బందులు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) జీవితం ప్రశ్న కాదు. సమస్యా కాదు. జీవితమంటే జీవితమే! అది ఎటు తీసుకెళితే అటు, ఎలా తీసుకెళ్తే అలా ప్రయాణించడమే మంచిది. మన చేతిలో ఏమీ ఉండదు. అలాగని మీ అలవాట్లు వదులుకొని, అభిరుచులని చంపుకోవలసిన పనిలేదు. సమర్థతను పెంచుకుంటూ, సవాళ్లను ఎదుర్కొంటూ ప్రయాణాన్ని కొనసాగించండి. కలిసొచ్చే రంగు: వయొలెట్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) వృత్తిపరమైన విషయాలలో ప్రాక్టికల్, ప్రొఫెషనల్‌గా వ్యవహరించడం నేర్చుకోండి. గతం గురించి ఆలోచిస్తూ బంగారం లాంటి భవిష్యత్తును మరచిపోకండి. ప్రతికూల భావనలూ, దిగుళ్లూ పెట్టుకోకుండా ఉండటం అలవాటు చేసుకోండి. నిర్ణయాలలో పట్టువిడుపు ధోరణితో మానవ సంబంధాల విషయంలో దృఢంగా ఉండండి. కలిసొచ్చే రంగు: లేత పసుపు రంగు. ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చేసిన రుణాలని తీర్చవలసిందిగా వత్తిళ్లు వచ్చే అవకాశం ఉంది. మీరు ఎప్పుడు తీర్చగలరో ప్రణాళికని వేసుకుని దానినే నిజాయితీగా మీరు ఎవరికి బాకీ ఉన్నారో వారికి తెలియజేయండి. ఈ విషయంలో లౌక్యంగాని, మధ్యవర్తి ద్వారా చెప్పించడం గాని, అసత్యమాడటంగాని చేయనే వద్దు. ఏదైనా ఓ సందర్భంలో పరాజయాన్ని మీరు చవి చూసినా మధన పడకండి. టారస్ (ఏప్రిల్ 21-మే 20) గుర్తింపు కోసమో కీర్తిప్రతిష్ఠల కోసమో లేక వేతనాభివృద్ధి కోసమో తొందరపడి స్థానచలనానికో లేక వృత్తివ్యాపారాల మార్పుకో ప్రయత్నించకండి. తాత్కాలికమైన చికాకులున్నంత మాత్రాన మార్పు అనేది శాశ్వత పరిష్కారం కాదు. మారబోతున్న ప్రదేశంలో మాత్రం సమస్యలు ఉండబోవని ఎవరూహించగలరు? తొందరపడి అదనపు భారాన్ని నెత్తిన వేసుకోకండి. జెమిని (మే 21-జూన్ 21) ప్రభుత్వం నుండి రావలసిన ద్రవ్యం అందే సూచనలు ఉంది. మీ సంతానం తోవ తప్పకుండా ఉండేలా జాగ్రత్తని పాటించండి. కీర్తి ప్రతిష్ఠలు, సన్మానాల కోసం పాకులాడే స్వభావం కాకున్నా, మిమ్మల్ని ఆశపెట్టి రంగంలోకి దించి అపకీర్తిపాలు చేసే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ప్రలోభపడకండి. మీ ఆదాయ వ్యయాలని ఎప్పటికప్పుడు అంచనా వేసుకోండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఊహాలోకంలో విహరిస్తూ కాలాన్ని గడిపేస్తారు. ఏ పనీ ప్రారంభించేపరిస్థితి కనిపించడం లేదు. అలాగని అది మీ అసమర్థత కాదు. మీకు తగినంత సహాయం లేకపోవడం లేదా మీకు అండగా ఉన్న వ్యక్తులకి అంత సమర్థత లేకపోవడం ఇందుకు కారణం కావచ్చు. విదేశాలకి ఆహ్వానం రావచ్చు. ఇక్కడుండే పని ఒత్తిడి, ఆదాయం చూసుకుని అంగీకారాన్ని తెల్పండి. లియో (జూలై 24-ఆగస్టు 23) తలిదండ్రుల్లో ఎవరో ఒకరి ఆరోగ్యం కొన్ని రోజులపాటు మిమ్మల్ని మీ పని చేసుకోనీయక పోవచ్చు కాబట్టి స్వల్ప వైద్యపరీక్ష లు చేయించండి లేదా వ్యాధికి లోనుకాకుండా ఉండేలా ముందు జాగ్రత్తలని పాటించేలా చేయండి. చేపట్టిన కార్యక్రమాలకి ఆటంకాలొచ్చాయని దిగులుపడకండి. మీ మానసిక స్థైర్యమే మిమ్మల్ని మరిన్ని ఎత్తులకి తీసుకెళ్తుంది నిస్సందేహంగా. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) అనవసరమైన వస్తు ఆభరణ అలంకరణ సామగ్రి కొనే అవకాశం కనిపిస్తోంది. వ్యాపార రంగంలో ఉన్నవారు కొత్త వ్యాపారం కోసం తగు ప్రయత్నాలు చేస్తారు. ఇల్లు, పొలం వంటి వాటి గురించి కొత్త నిర్ణయమేమీ తీసుకోకపోవడం శ్రేయస్కర ం. కొత్తగా పరిచితులైన వారితో అతిచనువు వద్దు. అనారోగ్యం కలిగితే అది తాత్కాలికమేనని భావించండి, ఆందోళన వద్దు. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) కుటుంబంలో ఐకమత్యం పెంపొందవచ్చు. ఆదాయం సంతృప్తికరంగానే ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అవివాహితులైన పక్షంలో వివాహాది శుభకార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. కుటుంబసభ్యుల సహకారంతో కొత్త ఆలోచనలని చేసుకోగలుగుతారు. ఈ వారంలో పూర్వికుల ఆస్తులని అమ్మడం, అమ్మివేయాలనే ఆలోచనకి రావడం సరి కాదు. స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) ఆగిపోయిన పనుల్లో కదలిక ప్రారంభం అవుతుంది. దాంతో మీకు పని భారం పెరగచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించవచ్చు. సాహసకార్యాలైన కొండలెక్కడం, ఈదడం, వేటాడదలచడం... వంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది. అన్నిపనుల్నీ ఒక్కసారే కాకుండా ఒకదాని తర్వాత మరొకటి చొప్పున ఎక్కువ పనులే చేసుకున్న పక్షంలో సిద్ధించవచ్చు. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ మాటకి విలువ ఉండే కాలమిది. కాబట్టి ఆ విలువని వ్యర్థపరచుకోకుండా పరిచితులైన వారికి మాత్రమే సాయపడండి. రాజకీయంగానైతే పదవులు లభించే అవకాశం ఉంది కాబట్టి పరిచయాలని చెడగొట్టుకోకండి. విద్యార్థులకి తగినంత బుద్ధివికాసం కలిగే కాలం ఇది కాబట్టి వ్యర్థ సంభాషణలతో పొద్దుపుచ్చకుండా మేధోవికాసానికి కృషి చేయడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) వాహనాలూ యంత్రాల విషయంలో కొద్ది శ్రద్ధతో ఉండడం మంచిది. రుణదాతలనుండి ఒత్తిడి ఉండే అవకాశముంది కాబట్టి కొంత కొంత చొప్పున తీరుస్తూ ఒత్తిడిని తగ్గించుకోండి. అన్నింటికంటే మించి నమ్మకమనే పెట్టుబడిని తొలగించుకోకండి. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పత్రాలని, వ్యాపార స్థలంలోని వస్తుసామగ్రిని పర్యవేక్షించుకుంటూ ఉండడం అవసరం. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) అధికారులతో మాట్లాడేటప్పుడు పరిస్థితిని సామరస్యంగా ఉండేలా చూసుకుని పని ముగించుకోండి తప్ప వాగ్వివాదాలకి వెళ్లకండి. కోర్టు తీర్పు ఎలా ఉన్నా మీకు రాబోయే నష్టం ఏమీ లేదని గ్రహించండి. దిగులు పడకండి. పిల్లల విషయంలో విద్యాసక్తి వాళ్లకి ఎంత ఉందనే విషయాన్ని ఉపాధ్యాయులనడిగి తెలుసుకుని తలిదండ్రుల్లో ఒకరు పూర్తి శ్రద్ధని తీసుకోక తప్పదు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పదోన్నతిపై లేదా ప్రభుత్వ వెసులుబాటు కారణంగా మంచి చోటుకి బదిలీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మరీ అనుకూలం గాని చోటుకే వెళ్లవలసి వస్తే కాదనకండి. కొన్నాళ్లపిమ్మట తిరిగి వచ్చే అవకాశముంది మీకు. మానసికంగా అధైర్యపడవద్దు. శారీరక ఆరోగ్యం చక్కగా ఉంటుంది. దైవధ్యానం చేసుకుంటూ ప్రశాంతంగా గడపండి. మైలవరపు శ్రీనివాసరావు -
ఇది మీలో మంచి మార్పును తెచ్చే వారం
ఆగస్టు 15 నుంచి 21 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఈ వారం కొంచెం స్తబ్ధుగా, మందకొడిగా ఉండవచ్చు. అయితే పనులు జరగనంత మాత్రాన అదేమీ చెడుకాలమని కాదు. మీ విజయంలో అది కూడా ఒక భాగమే అని గ్రహించండి. మీ శరీరం ఒకచోట, మనసు మరోచోట అన్నట్లుగా ఉంటుంది. మీరు వెళ్లాలనుకున్న చోటికి వెళ్లండి, కలవాలనుకున్న వారిని కలవండి. లేదంటే ఒంటరితనంతో బాధపడతారు. కలిసొచ్చే రంగు: గ్రే టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఎంతో కాలంగా మీరు కలవాలనుకుంటున్న వారిని కలుస్తారు. మీకున్న రకరకాల సందేహాలను నివృత్తి చేసుకుంటూ ఒక నిర్ణయానికి వస్తారు. అనవసర మొహమాటాలను విడిచిపెట్టడం మంచిది. కాలం కొద్దిగా గడ్డుగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అది మీ జీవితంలో మీకు పాఠాన్ని నేర్పించడానికి చేస్తున్న ప్రయత్నంగానే గుర్తించండి. కలిసొచ్చే రంగు: నీలం జెమిని (మే 21-జూన్ 21) జీవితం క్షణం తీరుబడి లేనట్టుగా గడిచిపోతుంటుంది. మీ జీవన గమనంలో కొద్దిపాటి మార్పు చేర్పులు చేసుకుంటూ, కొత్త పద్ధతులని అనుసరించకపోతే రొటీన్ లైఫ్‌తో బోర్ అనిపించక మానదు. పిరికితనాన్ని, నెగటివ్ ఆలోచనలను విడిచిపెట్టండి. మీకు లేనివాటిని గురించి తలచుకుని బాధపడవద్దు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) మీ లక్ష్యానికి ఒక స్పష్టత వస్తుంది. అనవసర విషయాలకు అతిగా స్పందించడం మంచి లక్షణం కాదని గ్రహించండి. గడ్డు పరిస్థితులను, క్లిష్ట సమయాలను మీరు ఎదుర్కొనే తీరే రేపు మీ భవితను నిర్ణయిస్తుంది, అవే మీకు జీవిత పాఠాలను నేర్పిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ప్రేమ వ్యవహారాలలో తొందర వద్దు. కలిసొచ్చే రంగు: పీచ్ లియో (జూలై 24-ఆగస్టు 23) మీ శక్తి సామర్థ్యాలను జాగ్రత్తగా బేరీజు వేసుకుని, అందుకు తగ్గ లక్ష్యాలనే ఎంచుకోవడం మంచిది. మీరు ఎప్పుడూ చూడని ప్రదేశాలకు వెళ్లి, పరిచయంలేని వ్యక్తులతో పని చేయవలసి వస్తుంది. కంగారు పడవద్దు. జీవితంలో రహస్యాలను జాగ్ర త్తగా కాపాడుకోకపోతే కలిగే పర్యవసానాలు ఏమిటో తెలుసుకుంటారు ఈవారం. కలిసొచ్చే రంగు: ఎల్లో వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీదైన శైలిలో పని చేసి, అందరి దృష్టినీ ఆకట్టుకుంటారు; ప్రేమ విషయంలో మీకు కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు. శ్రేయోభిలాషుల సలహా తీసుకోవడం మంచిది. కొన్ని ముఖ్యమైన బంధాలను నిలుపుకునే విషయంలో సరైన నిర్ణయాన్ని తీసుకోకపోతే ఆ తర్వాత భారీ మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. లక్కీ కలర్: వయొలెట్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ కలలను సాకారం చేసుకోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. పాజిటివ్ ఎనర్జీని నింపుకోవడం వల్ల కలిగే మంచి ఏమిటో మీకు అనుభవంలోకి వస్తుంది. మీ లక్ష్యానికి, విజయానికి చేరువ చేసి, మీకు గుర్తింపు తెచ్చే వారమిది. మరింత బాగా శ్రమించడానికి ప్రయత్నించండి. మీ సృజనాత్మకతను వెలుగులోకి తీసుకు రండి. కలిసొచ్చే రంగు: గ్రీన్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోండి. అయితే ఇతరులెవరికీ సాధ్యం కాని వాటినే లక్ష్యంగా తీసుకోవాలనుకోకండి. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లనుంచి గుణపాఠాన్ని తీసుకుని, వాటిని మళ్లీ చేయకుండా జాగ్రత్త పడండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యాన్ని పాటించడం వల్ల భవిష్యత్తులో మీకు మంచి జరుగుతుంది. కలిసొచ్చే రంగు: మెరుస్తున్న నలుపు రంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఇల్లు లేదా ఉద్యోగం మారతారు. చురుగ్గా ఉండండి. సానుకూల దృక్పథంతో వ్యవహరించండి. అనేక రకాల అననుకూలతలను ఈవారం అధిగమిస్తారు. విజయానికి చేరువ అవుతారు. ఎంత సన్నిహితులైనా, డబ్బు వ్యవహారాలలో నిక్కచ్చిగా లేకపోతే పేచీ తప్పదని గ్రహించండి. మొహమాటానికి తగిన ఫలితం అనుభవించవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆరంజ్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) అనూహ్యమైన ఓ అవకాశం మీ తలుపు తట్టవచ్చు. పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించండి. మీరు ఎంత ఆలోచనాపరులైనప్పటికీ భావోద్వేగాల విషయంలో మిమ్మల్ని మీరు అదుపు చేసుకోలేకపోతే ఇబ్బందులు తప్పవు కాబట్టి వాటిని అదుపు చేసుకునేందుకు ప్రయత్నించండి. నిజాయితీగా పని చే స్తే మంచి ఫలితం కనిపిస్తుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీ కలలు ఫలిస్తాయి. విదేశీ యానం చేయాలన్న మీ కోరిక తీరుతుంది. ఇది మీలో మంచి మార్పును తెచ్చే వారం. పెట్టుబడులు పెట్టే ముందు తగిన ప్రణాళిక వేసుకోండి. గతాన్నే తలచుకుంటూ బాధపడక, భవిష్యత్ కార్యాచరణని ఆలోచించుకుని, తగ్గట్టుగా వ్యవహరించండి. జీవితంలో ఏమి జరిగినా, దానిని అందుకునేందుకు సంసిద్ధంగా ఉండండి. కలిసొచ్చే రంగు: వైట్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ఇనుము బాగా వేడిగా ఉన్నప్పుడే దాన్ని కావలసిన ఆకారంలోకి మలచుకోగలం. అలాగే మీరు బాగా పని చేసి, మంచి పేరు తెచ్చుకోండి. ప్రమోషన్ కొట్టండి. ఒక విషయంలో గట్టి నిర్ణయాన్ని తీసుకోవలసి వస్తుంది. సిద్ధంగా ఉండండి. మీ లక్ష్యాలను, కలలను సాకారం చేసుకునేందుకు ఇది తగిన సమయం. ఆలసించకండి. ఆశాభంగం పొందకండి. కలిసొచ్చే రంగు: ఎరుపు ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) బంధుమిత్రులు మీ నుండి సహాయాన్ని అర్థించే వీలుంది. వారు చేస్తున్న పని ఎంతవరకూ సరియైనదో గమనించుకుని వ్యవహరించండి. మీపై అధికారులు మీ శ్రమనీ మీ నేర్పరితనాన్నీ గుర్తించడం లేదని దిగులు పడకండి. ఎప్పటిలానే మీ వృత్తిధర్మాన్ని నిజాయితీతో నిర్వహిస్తూ ఉండండి. తగిన కాలం రాబోతోంది. అప్పటివరకూ ఓపిక పట్టక తప్పదు. టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఇంటి మరమ్మతులు, అద్దె ఇల్లు మారడం లేదా ఏవో కొన్ని సౌకర్యాలని దృష్టిలో పెట్టుకుని సమీప ప్రదేశంలో ఉన్న ఊరికి మకాంని మార్చడం వంటి ఆలోచనలని తాత్కాలికంగా వాయిదా వేయండి. ఈ విషయమై మీ దంపతుల ఆలోచనలని మించి, మరెవరూ గొప్ప ఆలోచనని చేయనే చేయరని గ్రహించండి. సంతానం విషయంలో తగు జాగ్రత్తతో ఉండండి. జెమిని (మే 21-జూన్ 21) తెలిసి తెలిసీ ఇబ్బందుల్లో పడతారు. వీలయినంత తొందరలో కళ్లు తెరిచి బయట పడడానికి ప్రయత్నించి ఇబ్బంది తొలగించుకుంటారు. మీ ప్రేమ వ్యవహారం లేదా రుణ వ్యవహారం పెద్దలకి తెలియజేయాల్సిన అవసరం ఉందని గుర్తుంచుకోండి. ఎంత గుంభనగా మీరు వ్యవహారం చేయదలిస్తే అంత తప్పు చేయబోతున్నారన్నమాట. సంయమనంతో వ్యవహరించండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) నిజమైన సహాయాన్ని మీకు ఎవరెవ రు చేస్తారో, చేయడానికి సిద్ధంగా ఉన్నారో గమనించుకోగలిగిన కాలం ఇది. కష్టం- సుఖం, లాభం- నష్టం, ఆనందం- దుఃఖం అన్నీ సమపరిమాణంలో ఉంటాయి ఈ వారమంతా. మీ మంచితనం కారణంగా ఏ ఇబ్బందికీ లోను కాకుండా గడిపేస్తారు, వచ్చే ఇబ్బందిని వాయిదా వేసుకుని- ఆపద తప్పినట్లే అని ఆనందించకండి. లియో (జూలై 24-ఆగస్టు 23) శత్రువుల సంఖ్యని తగ్గించుకోదలిచిన కొద్దీ పెరుగుతూ కన్పిస్తారు. తాత్కాలిక అనారోగ్యం కలగవచ్చు. పిల్లల చదువులు సంతృప్తికరంగా సాగడం వల్ల సంతోషంగా ఉంటారు. విదేశీయానాహ్వానం అందవచ్చు. ఈ అవకాశాన్ని తప్పక వినియోగించుకోండి. అవసరమయితే ఇక్కడి పనుల్ని విడిచైనా వెళ్లండి. ముందునాటికి లాభపడతారు. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఆదాయం కంటె ఖర్చులు పెరిగే సూచనలున్నాయి కాబట్టి ప్రణాళిక ప్రకారం వ్యయం చేసుకోవడం మంచిది. ఆడంబరాలకి పోకుండా ఉంటే ఆదాయ వ్యయాలు అదుపులో ఉంటాయని గమనించండి. దేనికోసం రుణం చేయడమైందో ఆ రుణాన్ని దానికే వినియోగించండి. ఆర్థిక క్రమశిక్షణని పాటించండి . ఉద్యోగంలో ఒత్తిడి తప్ప ఒడిదుడుకులు ఏమీ రావు. లిబ్రా(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మనఃస్పర్ధతో వాదవివాదాలతో న్యాయస్థానాల వెంట వెళ్లడం కంటె మరో మార్గం ఉందేమో ఆలోచించుకోండి. మానసిక ఆందోళన, భయం, ఒత్తిడి శారీరక వ్యాధిని తెచ్చిపెడతాయనేది నాటికాలపు వైద్యం చెప్పిన మాట. పుణ్యక్షేత్ర దర్శనం, తీర్థయాత్రలూ విహార యాత్రలూ చేసే అవకాశముంది. నిరుత్సాహపరులైన మిత్రులకి దూరంగా ఉండటం మంచిది. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ప్రయత్నాలని పట్టుబట్టి విడవకుండా చే స్తూండడం బట్టి కొంత అనుకూలత కన్పించే అవకాశం ఉంది. మీ బుద్ధికున్న గట్టితనం, హృదయానికున్న దిటవు కారణంగా కష్టాలని అనుభవిస్తూ కూడా విధులు సమర్థవంతంగా నిర్వహించుకోగలుగుతారు. వర్తమాన పరిస్థితుల అనుకూలత కోసం దైవధ్యానం చేసుకోవడం మంచిది. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అనారోగ్యం వస్తుందేమోనని నిరంతరం అనుకోవడానికి మించిన అనారోగ్యం మరోటి లేదని గ్రహించండి. మీకు ఓ గ్రహపు దృష్టి సరిలేదనే మాట నిజమే అయినా మీ ఊహా దుఃఖాలన్నీ నిజమై పోవని గమనించండి. అనుభవజ్ఞులూ పెద్దలూ మంచీ చెడూ తెలిసిన వారిని సేవిస్తుంటే ధైర్యం వస్తుంది. ధైర్యం కలిగినప్పుడు శారీరక అనారోగ్యం మిమ్మల్ని ఏమీ చేయనే లేదు. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీకున్న పరిచయాలతో ఇతరులు మీ ద్వారా పనులని సాధించుకోవాలని చూస్తారు. మంచిదే కాని అందరినీ విశ్వసించడం అంత మంచిది కాదని తెలుసుకోండి. ఏదైనా విషయముంటే దాన్ని సాగదీయక, సాధ్యమైనంత త్వరలో నిర్ణయాన్ని ప్రకటించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ప్రస్తుతం చేస్తున్న చేయబోతున్న రుణం మంచిపని కోసమే ఔతుంది. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉంటారు. ఏదో జరిగిపోతోందనే భ్రమలో ఉంటారు. ఏదయినా ఓ మంచి పనిని దైవసంబంధంగా చేయాలనే భావన కలుగుతుంది. సమస్య ఏదైనా ఎదురయినప్పుడు సంయమనంతో ఉండండి తప్ప దానికోసమే ప్రయత్నిస్తూ మానసికంగా అలసిపోకండి. తప్పక సమస్య మీకు అనుకూలంగానే పరిష్కరింపబడుతుంది. భయం లేదు. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) ఈ వారం అనుకూలంగానే ఉంటుంది. ఓ శుభకార్యం చోటు చేసుకోవచ్చు. వ్యవహారాలు సజావుగా సాగిపోతాయి. పెట్టుబడులు పెట్టేందుకు మాత్రం అనుకూలం కాదు. చేస్తున్న వ్యాపారంతో కొంతకాలంపాటు సంతృప్తి పడండి తప్ప, కొత్త వ్యాపారం, ఉద్యోగం, వృత్తికోసం తపన పడకండి. దంపతుల అన్యోన్యత కారణంగా ఈవారం బాగుంటుంది. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
నూతన వస్తు వాహనాలు సమకూరతాయి
జూలై 25 నుంచి జూలై 31 వరకు టారో బాణి మీకూ, మీ భాగస్వామికీ మధ్య కొత్తబంధం ఏర్పడవచ్చు. ఈ వారమంతా భావోద్వేగాలతో గడుపుతారు. కెరీర్ పరంగా చాలా బాగుంటుంది. మీ సృజనాత్మకమైన ఆలోచనలతో కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులన్నీ ఫలించి, ఆర్థికపరంగా ఏదో గారడీ చేసినట్లుగా ధనసమృద్ధి కలుగుతుంది. కలిసొచ్చేరంగు: పసుప్పచ్చ ఈ వారం మీకు కొత్త అవకాశాలతో అభివృద్ధికరంగా ఉంటుంది. విదేశీవ్యక్తి నుంచి మీకు ఒక ఉపయోగకరమైన సమాచారం అందుతుంది. జీవితంలో సమత్యులత కోసం సామరస్యత కోసం రకరకాల త్యాగాలు చేయవలసి వస్తుంది. అంతమాత్రాన నిరాశ చెందవలసిన అవసరం లేదు, ఆ మేరకు మనశ్శాంతి లభిస్తుంది కనక. కలిసొచ్చే రంగు: సిల్వర్ గ్రే అదృష్టం, ఆదాయ వృద్ధి కలిసికట్టుగా వస్తాయి. మీకు సంతోషాన్నిచ్చేలా విలువైన, అపురూపమైన బహుమతులు అనూహ్యంగా లభిస్తాయి. జాయింటుగా చేసే ఫైనాన్స్ వ్యాపారావకాశాలు మీ తలుపు తట్టవచ్చు. ప్రేమికులకు మీ మనసులో దాగి ఉన్న ప్రేమను వ్యక్తం చేసేందుకు తగిన ధైర్యం వస్తుంది. కలిసొచ్చేరంగు: పర్పుల్ వ్యక్తిగతంగా ఇది మీకు బాగా కలిసొచ్చే వారం. మీ సౌంద ర్యానికి మెరుగులు దిద్దుకుంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆదాయానికి తగ్గట్టే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆడుతూ పాడుతూ పని చేస్తారు. మీ మేధస్సుకు పదును పెట్టుకుంటారు. కలిసొచ్చే రంగు: నిమ్మపచ్చ మీ సామర్థ్యాల మీద దృష్టి పెట్టండి. కెరీర్ పరంగానూ, వ్యక్తిగతంగానూ కూడా ఇది మీకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే వారం. ప్రపంచాన్నే జయించగలననేంత శక్తి వస్తుంది మీకు. ప్రేమికురాలిని ప్రసన్నం చేసుకోవడానికి ఇది తగిన సమయం. ఏదైనా సరే, చేతులు దాటిపోయిన తర్వాత ఏమీ చేయలేమని గ్రహించండి. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ ఈ వారమంతా ప్రయాణాలతో గడుపుతారు. అయితే యాంత్రికమైన, వృత్తిపరమైన ప్రయాణాలు కాదు... ఆహ్లాదకరంగా, మీ మనసుకు, శరీరానికి కూడా కొత్త శక్తినిచ్చే టూర్లతో... మీ జీవన శైలి మారుతుంది. మీ జీవిత భాగస్వామితో చిన్న వివాదం ఏర్పడవచ్చు. కెరీర్‌పరంగా మీ దిశ ఏమిటనేది నిర్ధారించుకోవలసి వస్తుంది. కలిసొచ్చే వారం: రాగిరంగు ముగ్గురు వ్యక్తుల భాగస్వామ్యం కెరీర్పరంగానూ, వ్యాపార పరంగానూ మీకు లబ్ధి చేకూర్చవచ్చు. మీ బంధాన్ని కొనసాగించాలనుకుంటే మీ ఆలోచనా సరళిలో, వ్యవహార శైలిలో మార్పు చేసుకోక తప్పదని గ్రహించండి. మీరు మారడానికి ఇదే చివరి అవకాశం. సంగీతం వింటూ, పాడుతూ ఉంటే మీ అంతర్గత శక్తి సామర్థ్యాలు వెలికి వస్తాయి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ జీవితంలో సమతుల్యత సాధించడానికి ఇది తగిన సమయం. మీరు ఎంతో కాల ం నుంచి అన్వేషిస్తున్న గురువు లేదా మార్గదర్శి తనంతట తనే ఎదురుపడవచ్చు. మీరు సాధించిన విజయంలో మీకు సహకరించిన వారికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం మంచిది. కొత్త భాగస్వామ్యం, విదేశీ ప్రయాణం, కొత్త ఉద్యోగం మీ తలుపు తట్టవచ్చు. కలిసొచ్చే రంగు: లేత నీలం ఈ వారం మీకు అనుకోకుండా అదృష్టం కలసి వస్తుంది. మీరు సాధించిన ప్రాపంచిక లేదా వ్యాపార లాభాలతో ఖరీదైన వస్తువును కొనుగోలు చేస్తారు. మీకంటూ బలమైన నమ్మకాలు, విలువలతో కూడిన విశ్వాసాలను, అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. ఇతరులతో మీ మనసులోని మాటను చెప్పుకుని ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: పచ్చ అరటి పండు రంగు మీ ప్రేమను సఫలం చేసుకోవడానికి ఇది తగిన సమయం. అయితే అది అంత సులువు కాదు. పెద్ద యుధం చేయవలసి రావచ్చు. అనేకరకాల సమస్యలు, సవాళ్లతో సహవాసం చేయవలసి ఉంటుంది. శాంతి కావాలనుకుంటే ప్రేమను త్యజించక తప్పదు. యుద్ధం చేస్తే విజయం తథ్యం. కలిసొచ్చే రంగు: పీచ్ రకరకాల తాయిలాలతో కూడిన స్కీములు మిమ్మల్ని అయోమయంలో పడేయవచ్చు. ఆధ్యాత్మిక మార్గంలో అనేకరకాల ఒడుదొడుకులు ఎదురు కావచ్చు. వైవాహిక బంధంలో పడతారు. రకరకాల ప్రలోభాలు మిమ్మల్ని కట్టి పడేస్తాయి. ప్రేమ కోసం పరితపిస్తున్న మీకు మీ మనసును దోచుకునే వ్యక్తి ఎదురు అవుతారు. కలిసొచ్చే రంగు: తుప్పు రంగు మీ కోరికలు నెరవేరతాయి. వేడుకలు జరుపుకోవలసి రావచ్చు. మీ మార్గంలో అడ్డుగా నిలిచిన రకరకాల సవాళ్లు, సమస్యలను, అవరోధాలను తేలికగా అధిగమించగలుగుతారు. ఎంతోకాలంగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న కొన్ని మానసిక సమస్యలను ఒక పెద్ద మనిషి సహకారంతో పరిష్కరించుకుని, ఊరట పొందుతారు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఈ వారంలో నేత్రాలకి లేదా శిరస్సుకి సంబంధించిన బాధలుండే అవకాశముంది కాబట్టి, తగిన ముందుజాగ్రత్తలు తీసుకోవడం మంచిది. బంధువులు వచ్చిన సందర్భంలో మన ఇంటి విషయాలని చెప్పి సలహాలనీ సూచనలనీ అడగటం, వాళ్లు చెప్పబోతే వినడం కానీ మంచిది కాదు. అనవసర విషయాలు తలకెక్కించుకోకుండా గుంభనం పాటించడం మంచిది. మీ పై అధికారికి మీకు తోచిన మంచినీ వెసులుబాటునీ సూచించక, చెప్పింది చేసుకుంటూ వెళ్లిపొండి. ఇంట్లో సొంత నిర్ణయాన్ని చేసేస్తూ వెళ్లిపోవడం ఈ వారంలో మంచిది కాదు. తప్పించుకునే ధోరణిలో కాకుండా ఉన్నది ఉన్నట్లుగా స్పష్టంగా మెత్తని గొంతుతో చెబుతూ అవతలివారు నొచ్చుకోకుండా ఉండేలా మొహమాటం లేకుండా మాట్లాడండి బంధువుల విషయంలో. ఏ పనినీ చేసుకోలేకపోతున్నామని నిరాశ పడకండి. మీ సంతానం గాని సహాయ పడడానికి రమ్మని పిలిస్తే దూరాభారమని వెళ్లడం మానక, తప్పక వెళ్లండి. మీ వ్యాపారంలో భాగస్వాముల మాటకి విలువనిస్తూ అనుభవజ్ఞుల్ని సంప్రదించి వారి మాటలో ఎంత అనునసరించ వీలుందో ఆ విషయాన్ని వారికి వివరించి చెప్పండి. వ్యతిరేక పరిస్థితులేమీ లేవు - రావు. ధనాదాయమైతే బాగుంటుంది కాని తప్పనిసరి ప్రయాణాలు కొంత శారీరక శ్రమని కలిగిస్తాయి. శత్రువులతో విరోధాన్ని పెంచుకునేలా మాటలతో యుద్ధం చేయడం కంటె వాళ్లతో తగినంత దూరంలో ఉండడం ఎంతైనా మంచిది. నూతన వస్తు వాహనాలు సమకూరే అవకాశముంది. మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు. మీ ప్రణాళికలు సరైనవే అయినా శనిదృష్టి సరిగా లేనందువల్ల విఘ్నాలపాలు కావడమో లేక అసలు అమలు జరగకపోవడమో అవుతుంది. నిరుత్సాహ పడద్దు. శని గ్రహం ప్రతి వ్యక్తికీ చక్కని పాఠాన్ని నేర్పి, దాంతోపాటు నేర్పరితనాన్ని కలిగిస్తుంది. విఘ్నాల పాలౌతున్నా మీరు మీ ప్రయత్నాలని ఆపకుండా చేస్తూనే ఉండడానికి శని ప్రోత్సాహమే కారణమని గమనించండి. మీరూ మీ పనీ మీ ఇల్లూ జీవితమూ అంటూ గిరి గీసుకుని గడపాల్సిన వారం ఇది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవడం, ఇతరులకు సలహాలనీ సూచనలనీ ఇవ్వడం ఈ వారంలో మీకు సరిపడని అంశాలు. వైద్య, న్యాయరంగాలకి సంబంధించిన వృత్తుల వారు తగు జాగ్రత్తతో ఉండాలి. లేని పక్షంలో తాత్కాలికంగా పరాజయాన్ని పొందే అవకాశముంది. చేసిన పనినే మరోమారు చేయవలసి రావచ్చు. పొరపాటే గనక జరిగి ఉంటే మీ తప్పుని అంగీకరించండి. సమస్య తేలిగ్గా పరిష్కరింప బడుతుంది. వివాహ విషయాలు కానీ ఆస్తి తగాదాలు గాని దాదాపు పరిష్కారమయ్యే స్థితికి రాబోతున్నాయి. ఇలాంటి స్థితిలో పట్టుదలకి పోయి సమస్యను జటిలం చేసుకునేకంటే రాజీకి సిద్ధపడటం మంచిదని గ్రహించండి. ఎప్పుడో జరిగిపోయిన వాటిని గురించే ఆలోచిస్తూ ఉంటే శిరోభారమే తప్ప ఒరిగేదంటూ ఏమీ ఉండదనే మీ ఆలోచన ప్రస్తుత సమస్యా పరిష్కారానికి అనుకూలించదని గ్రహించండి. కాలం అనుకూలంగా లేని సందర్భంలో మన ఆలోచన ఎందుకు అమలు జరుగుతుంది? క్రమం తప్పకండా మీరు వాడాల్సిన ఔషధాల్ని వాడుతూ ఉండండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం తాత్కాలికంగా సరిలేకపోవచ్చు. ఉద్యోగంలో అవిశ్రాంతంగా శ్రమించవలసి రావచ్చు. శారీరకంగా అలసిపోయే పరిస్థితే ఉద్యోగంలో కనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పండి శరీరారోగ్యం సహకరించదని. బంధుమిత్రుల విషయంలో బహుమతులూ ఉత్సవాలూ మొదలైనవి తారసపడితే కాస్త చూసుకుని ఖర్చు చేయడం మంచిది. ఇతరుల మెప్పుకోసం ఎక్కువగా ఖర్చు చేసుకునే పరిస్థితి గోచరిస్తోంది. అనవసర ప్రయాణాల వల్ల మీ వ్యాపార వృత్తి ఉద్యోగాల్లో అజమాయిషీ ఉండక, అది మరో కొత్త సమస్యని తెచ్చిపెట్టవ చ్చు. మీ కోపాన్ని అదుపు చేసుకోని పక్షంలో మీరంటే అభిమానించే ముఖ్యవ్యక్తులు కూడా దూరంగా జరిగిపోవచ్చు. ఆంతరంగికులైనవారిని ఏ మాత్రమూ నిర్లక్ష్యం చేసుకోకండి. ఆర్థికంగా బలపడటం కోసం కుటుంబాన్ని మరింత బలోపేతం చేయడం కోసం మీ వంతు ప్రయత్నాన్ని మానకండి. కేవలం మీ జీవిత భాగస్వామి మాత్రమే కుటుంబ విషయంలో బాధ్యులనే ఆలోచనని వీడండి. సంతానం విషయంలో తగిన శ్రద్ధని కలిగి ఉండండి. మీరు మాట్లాడే తీరు ప్రయోజనాత్మకమా? హానికరమా? అని ఓ క్షణం గమనించి వ్యవహరించండి. కష్టాలు దాదాపు తీరినట్లే. మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాలని యథావిధిగా నిర్వహించుకుంటూ సాగిపోండి. కొత్తగా రుణాలని చేయవద్దు. సంతానానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలూ సక్రమంగా జరిగిపోతాయి. హామీ ఉండడం, వాగ్దానాలని చేయడం సాక్షి సంతకాలు పెట్టడం రాజీ కుదర్చడం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
ఓ అవకాశం మీ తలుపు తడుతుంది
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) చాలా కాలంగా మీరు చూడాలనుకుంటున్న వారిని కలుస్తారు. మీ మనసు చెబుతున్న దానిని వింటారు. మీకున్న రకరకాల సందేహాలను నివృతి చేసుకుంటూ ఒక నిర్ణయానికి వస్తారు. భయం, భావోద్వేగాలు మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు. అనవసర మొహమాటాలను విడిచిపెట్టడం మంచిది. కలిసొచ్చే రంగు: నీలం టారస్ (ఏప్రిల్ 21-మే 20) పెద్ద పెద్ద ప్రాజెక్టులను చేపడతారు. కుటుంబ అవసరాలను తీరుస్తారు. జీవితభాగస్వామితో, పిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఆధ్యాత్మికతలో, ధ్యానంలో ముందుకెళతారు. సృజనాత్మకంగా గడుపుతారు. మీ అభిరుచులకు తగ్గట్టు పని చేయండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ జెమిని (మే 21-జూన్ 21) మీ ధోరణిని మార్చుకోవలసిన తరుణమిది. మిమ్మల్ని పట్టి పీడిస్తున్న విచారం, కోపం, నిరాశలను పారద్రోలాలని గట్టిగా నిర్ణయించుకుంటారు. అన్నింటిలోనూ సమతూకాన్ని పాటించడం మంచిది. పెండింగ్‌లో ఉన్న కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. కలిసొచ్చే రంగు: బూడిద రంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఆత్మవిశ్వాసంతోనూ, సంతోషంతోనూ జీవితాన్ని ఎదుర్కోండి. క్లిష్టసమయాలు ఉండవచ్చు. కానీ అవే మిమ్మల్ని బలోపేతం చేస్తాయని గుర్తుంచుకోండి. అవివాహితులకు కొందరితో ఏర్పడ్డ పరిచయాలు కొత్త ఆశలు రేకెత్తిస్తాయి. స్థిరాస్తి అమ్మకం విషయంలో తొందరపాటు తగదు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ లియో (జూలై 24-ఆగస్టు 23) భ్రమలను విడిచిపెట్టి, అదను కోసం ఆశగా ఎదురు చూడడంలో తప్పేముంది? ఉదాశీనతను విడిచిపెట్టి, చురుగ్గా ఉండండి. మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తూ హుషారుగా ఉంటేనే కదా, మీ పిల్లలు మిమ్మల్ని చూసి నేర్చుకునేది! పిల్లలతో సమయం వెచ్చిస్తే మీకూ కొత్త విషయాలు తెలుస్తాయి. కలిసొచ్చే రంగు: పింక్ షేడ్స్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికిది మంచి సమయం. ఉద్యోగరీత్యా దూరప్రయాణం ఉండొచ్చు. ఆత్మవిశ్వాసాన్ని సడలనివ్వద్దు. జీవితమనే నౌక ఎటు తిప్పితే అటు తిరుగుతూ, ఎక్కడికి తీసుకెళితే అక్కడికి చేరడమే జీవితమంటే! మీ భాగస్వామికి మీ సహాయ సహకారాలను అందించాల్సి వస్తుంది. కలిసొచ్చే రంగు: పర్పుల్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) జీవితమనే ప్రయాణానికి అంతంటూ ఉండదు. లక్ష్యాలు, ధ్యేయాలు లేకుండా జీవించాల్సి వస్తుంది ఎందుకంటే నువ్వు ఒక లక్ష్యాన్ని చేరుకుంటే ఇంకా తొమ్మిదివందల తొంభైతొమ్మిది లక్ష్యాలు నీ ముందుంటాయి. మనస్సును, శరీరాన్నీ చురుగ్గా ఉంచుకోండి. శారీరకారోగ్యాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే జిమ్‌లో చేరండి. కలిసొచ్చే రంగు: బేబీ పింక్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మీరు క నే కలలను బట్టి, వాటిని నెరవేర్చుకునేందుకు మీరు వేసుకునే ప్రణాళికలపైనే మీ భవిష్యత్తు. భవిష్యత్ ప్రణాళిక లేనివాడే సిసలైన సెలబ్రిటీ. ఈ క్షణంలో సంతోషంగా, పరిపూర్ణంగా జీవిస్తాడు. సమృద్ధిగా డబ్బు సంపాదిస్తారు. కుటుంబంతో కలిసి టూర్‌కి వెళ్లవచ్చు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఇతరుల విషయంలో తీర్పులు చెప్పడాన్ని తాత్కాలికంగా పక్కన పెట్టడం మంచిది. ప్రేమ, శృంగారం, సంతోషం ఈ వారంలో మీకు బాగా యోగిస్తాయి. అదృష్టం, అభివృద్ధి ఈ వారం మీ వెంటే ఉంటాయి. ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న ఒక అవకాశం ఈ మీ తలుపు తడుతుంది. కలిసొచ్చే రంగు: గోల్డెన్ బ్రౌన్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈ వారమంతా కుటుంబంతో కలసి హాయిగా పిక్నిక్కులతో సేదదీరతారు. పనిలో మీరు త్వరిత నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. మీ ఆత్మవిశ్వాసం, అవగాహన శక్తి ఇనుమడిస్తాయి. దీర్ఘకాలంగా కోర్టులో ఉన్న కేసు ఒకటి మీకు ఊరటనిస్తుంది. అనారోగ్యకరమైన పరిస్థితుల నుంచి బయట పడతారు. కలిసొచ్చే రంగు: ఆలివ్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) మీకు అదృష్టకరమైన వారంగా చెప్పవచ్చు. మీతో సహా ముగ్గురు కలిసి చేసే భాగస్వామ్య వ్యాపారంలో మీకు మంచి ఆదాయం లభిస్తుంది.ప్రణాళికాబద్ధంగా పని చేసి, లక్ష్యాన్ని చేరుకోండి. విజయాన్ని అందుకోండి. కుటుంబపరంగా చాలా సౌఖ్యదాయకంగా గడిచిపోతుంది ఈ వారం. కలిసొచ్చే రంగు: రోజ్ పింక్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) పనిలో అందరి మన్ననలూ అందుకుంటారు. ఈ వారమంతా బోలెడన్ని అవకాశాలు, కొత్త కొత్త ప్రతిపాదనలు మీ తలుపు తడతాయి. అవన్నీ అద్భుతమైన భవిష్యత్తుకు నాందిపలుకుతాయి. మీ దిశ మార్చుకుని, కొత్త పంథా తీసుకుంటే విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. కలిసొచ్చే రంగు: ఎరుపు ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఓ మంచిపని కోసం లేదా శుభకార్యం నిమిత్తం ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న రుణం లభిస్తుంది. కుటుంబం మొత్తం సంతృప్తిగా గడుపుతారు. మీ కింది ఉద్యోగులతో, భాగస్వాములతో, సేవకులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మీ పరోక్షంలో కూడ మీ సంస్థ కార్యక్రమాలు సవ్యంగా సాగడం మీకు ఆనందాన్ని, ధైర్యాన్ని ఇస్తాయి. మీరు చేబదులుగా తీసుకున్న రుణంగాని, పత్రం మీద రాసి తీసుకున్న అప్పుగాని మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురి చేయచ్చు. ఫలాని సమయానికి తప్ప తీర్చడం సాధ్యపడదని నిదానంగా పెద్దమనుషుల సమక్షంలో చెప్పండి. సమస్య జటిలం కానే కాదు. తొందరపాటుతో వేటినో కొనబోవడం అమ్మబోవడం వంటి ఆలోచనలు చేయవద్దు. మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని చేతకాని వారనుకుంటున్నారని దిగులు పడకండి. కాలం కలిసిరాని సమయంలో ఇలాంటి అడ్డంకులెన్ని వచ్చినా విజయం మీదేనని గుర్తించండి. మీరు ఇతరులకి ఖర్చు చేసినదీ- ఇతరులకు మీరు ఖర్చు చేసినదీ స్పష్టంగా ఒక చోట లెక్క వేసుకుని ఉంచడం చాలా అవసరం. మీ గురించి ఎంతగానో ఎదురుగా గొప్పగా ప్రశంసిస్తూ మీకు మాత్రం అవకాశం రానివ్వకుండా చేస్తుంటారు కొందరు. మీకొచ్చిన నష్టమేమీ లేదు. మీ ప్రతిభ తప్పక గుర్తింపుకొస్తుంది. కుటుంబంలోని అనైకమత్యం గురించిన మానసిక వ్యధ వుండచ్చు మీకు. మీరు మాత్రం ధర్మబద్ధంగానే వ్యవహరించండి. వక్రమార్గాన ప్రయాణించవద్దు. మీకు ఇటీవల జరిగిన సంఘటనల కారణంగా ధైర్యం కొంత సడలి ఉండచ్చు. పట్టుదలకీ అహంకారానికీ పోకుండా కార్యరంగంలో సరైన తీరులో ప్రవర్తిస్తూ ఉండండి. పైనా కిందా ఉండే ఉద్యోగులతో మిత్రభావంతో మెలగండి. మీకు సంబంధించని వ్యవహారాల మీద అజమాయిషీని మానుకోండి. ఖర్చులు పెరిగిపోయిన దృష్ట్యా రుణం చేయవలసి రావచ్చు. నిరుద్యోగులయిన వారికి ఉద్యోగం లభిస్తుంది కాని సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. మీ పిత్రార్జితమైన స్థలాన్నో ఇంటినో కాజేయాలనే దుర్బుద్ధితో ఎవరైనా ఉండచ్చు కాబట్టి ముందుకు ముందే ఆ ఆలోచన లేని తీరుగా మాటల్లో చెప్పండి. ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం వద్దే వద్దు. ఈ వారంలో మీకు ఏ తీరు ప్రతికూలతా లేకపోయినప్పటికీ అనుకూలత మాత్రం ఉండదు. శుభాశుభ మిశ్రమంగా గడిచిపోతుంది. అనవసరమైన దీర్ఘాలోచనలతో అనారోగ్యకరమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మాటలో మెత్తగా... వ్యవహారంలో కఠినంగా ఉండండి. వద్దు వద్దంటున్న వారితో సంబంధాన్ని కొనసాగించుకోవాలని అనుకోకండి. విరోధాన్ని శీఘ్రంగా వదిలించుకునే ఉపాయాన్ని అన్వేషించుకోండి. అందరూ సహాయకులుగా ఉండి కూడా ఏ విధమైన ప్రయోజనమూ చేకూరని స్థితి ఈ వారం మీది. కాబట్టి దైవాన్నే ధ్యానిస్తూ ఉండండి. మీ పై అధికారుల వల్ల మీకు లాభం కలుగుతుంది. సంతోషకరంగా అనిపిస్తుంది. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. చేపట్టిన పనులన్నీ విజయవంతమవుతాయి. కుటుంబంలో మీ మాటకి విలువ పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు శీఘ్రంగా ఫలించకపోవచ్చు, ఉద్యోగంలో దూరపు ప్రదేశాలకి వెళ్లవలసి రావచ్చు. ఈ దూరపు ఉద్యోగాన్ని కాదన్నా ఏ నష్టమూ మీకు జరగదు. అనుకున్న పనులన్నీ వాయిదా పడుతూ, ఆగుతూ అసంతృప్తిని కలిగించవచ్చు. పరిస్థితుల్లో మార్పు గోచరిస్తుంది తప్ప సంపూర్ణ విజయం సిద్ధించకపోవచ్చు. ధైర్యాన్ని కూడగట్టుకుని ఉండక తప్పదు. జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని శ్రద్ధగా పట్టించుకోండి. సంతానానికి కలిగిన ఓ విజయం మీకు సంతృప్తినియ్యచ్చు. ఉద్యోగంలో బదిలీకి ప్రయత్నం వద్దు. వాగ్వివాదం వద్దు. అధికారులతో చనువూ దగ్గరితనం కూడా వద్దు. చేస్తున్న వ్యాపారంలో కొత్త మెళకువలని తెలుసుకునే ప్రయత్నం చెయ్యండి. సంస్థ ఎందుకు నష్టంలో నడుస్తోందో దాని మీద దృష్టి పెట్టండి. సకాలంలో పత్రాలని పంపని కారణంగా ప్రభుత్వం నుండి మీకు కొన్ని చిక్కులు కలగవచ్చు. చర్మవ్యాధిగాని ఉండినట్లయితే వైద్యం చేయించుకోవాలని మరవకండి. సంతానంలో పట్టుదలా పెంకితనం మానసికాందోళనని కల్గించవచ్చు కాబట్టి చనువుగా మెలుగుతూ ఉండండి. ఆర్థికలోటు రాకుండా ఉండేందుకు మీరు చేస్తున్న వ్యాపారంలో మరింత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. మడమలు, పాదాల నొప్పులు వస్తే అశ్రద్ధ చేయకండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
మొహమాటాలకి పోతే ముప్పు తప్పదు!
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఒక కొత్త ప్రేమ బంధం మీ కోసం ఎదురు చూస్తుంటుంది. పనిపరంగా ఈ నెలంతా మీకు చాలా బాగుంటుంది. మీ స్వతంత్ర వైఖరి మీకు మొండివాళ్లని, అసమ్మతివాదులనీ పేరు తేవచ్చు. పని ప్రదేశంలో అందరి కళ్లూ మీ మీదే ఉంటాయి కాబట్టి జాగ్రత్త అవసరం. అంద రితోనూ కలుపుగోలుగా, నిజాయితీగా ఉండండి. కలిసొచ్చే రంగు: పింక్ టారస్(ఏప్రిల్ 21-మే 20) ఈ వారం మీరు చాలా ఆనందంగా ఉంటారు. మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఒక స్త్రీ సహాయం లభిస్తుంది. చేతినిండా డబ్బు వస్తుంది. ఒక విషయంలో మీరు గట్టి నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. ప్రయాణ సూచనలున్నాయి. రొటీన్ నుంచి బయట పడి, విశ్రాంతిగా గడపవలసిన తరుణమిది. హాయిగా పర్యటనలకు వెళ్లి, ప్రశాంతతను పొందండి. కలిసొచ్చే రంగు: గ్రీన్ జెమిని(మే 21-జూన్ 21) మీ ధోరణిని మార్చుకోవలసి వస్తుంది. మొదట్లో కొంచెం కష్టమైనా, అదే నెమ్మదిగా గాడిలో పడుతుంది. ఒక వ్యక్తిపట్ల మీరు ఆకర్షితులవుతారు. క్రమంగా అది ప్రేమకు దారి తీయవచ్చు. దాని వల్ల మీ కుటుంబంలో కల్లోలం చెలరేగవచ్చు. మీ అహం శాంతిస్తుంది. తగిన సౌకర్యాలు లభిస్తాయి. డబ్బు వస్తుంది. కలిసొచ్చే రంగు: వైట్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) విజయం మీ తలుపు తడుతుంది. కొన్ని మార్పులు జరగవచ్చు. కష్టపడి పని చేసే మీ తత్వమే మీ లక్ష్యాలను చేరుకునేలా చేస్తుంది. ఏది ముఖ్యమో, ఏది కాదో తెలుసుకోవలసిన తరుణమిది. ఆధ్యాత్మిక భావాలను అలవరచుకోవడం మంచిది. మనశ్శాంతి ఉంటే మీరు ఎన్ని విజయాలనైనా సొంతం చేసుకోవచ్చని తెలుసుకోండి. కలిసొచ్చే రంగు: బ్రౌన్ లియో (జూలై 24-ఆగస్టు 23) కలలలోకం నుంచి బయట పడి వాస్తవంలోకి వచ్చి, ప్రాక్టికల్‌గా ఆలోచిస్తారు. ఈ వారం మీకు అదృష్టకరంగా గడుస్తుంది. మీ ప్రతిభకు, సామర్థ్యానికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా లోటు ఉండదు. ప్రేమలో ఓటమి ఎదురు కావచ్చు. అనవసరంగా అహానికి పోయి లేనిపోని చిక్కులు తెచ్చుకోవద్దు. కలిసొచ్చే రంగు: గోల్డెన్ ఎల్లో వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు ఒక దాని మీద గట్టిగా నిలబడాలని తెలుసుకోండి. ఇది మీకు వింతగా అనిపించవచ్చు కానీ, నిజం. అలా చేస్తే గానీ ప్రయోజనం ఉండదు. మీ కలలు నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఎదుటివారు చెప్పే సలహాలు మీ మంచికోసమేనని తెలుసుకుని, ఓపిగ్గా వినడం అలవాటు చేసుకోండి. కలిసొచ్చే రంగు: వైట్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ ప్రేమ, వ్యక్తిగత జీవనం మిమ్మల్ని అయోమయంలో పడేస్తాయి. ముందు పెళ్లి చేసుకోవాలా లేక ఇల్లు కొనుక్కోవాలా? ఏది ముందు? ఏది వెనకో తెలియక కొంచెం తికమక పడతారు. ఆహారం విషయంలో కఠోరంగా వ్యవహరించక తప్పదు. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. ఆరోగ్యం కోసం అనివార్యంగా ఎక్సర్సైజులు చేయండి. కలిసొచ్చే రంగు: లైట్ బ్లూ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) జీవితంలో సంభవించనున్న కొత్త మార్పులు మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తవచ్చు. పెద్దమొత్తంలో డబ్బు చేతికందుతుంది. మీ కలల్ని నమ్ముకోండి. అవి సాకారం కానున్నాయి. మీ సామర్థ్యాన్ని నిరుపించుకునేందుకు గట్టిగా కృషి చేయవలసి వస్తుంది. ప్రేమ విషయంలో కొన్ని చిక్కుముళ్లు, మెలికలు ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: నలుపు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీరు చదవనున్న ఒక ఆధ్యాత్మిక గ్రంథం మిమ్మల్ని కొత్త మార్గంలోకి తీసుకు వెళ్తుంది. మీరు సరైన మార్గంలోనే వెళ్తున్నారు. మీరు కోరుకుంటున్నట్లుగా శాంతియుతంగానే వ్యక్తిగత అభివృద్ధి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య అవగాహన అవసరం. ఇంట్లో, ఆఫీసులో మరమ్మతులు చేయించవలసి రావచ్చు. కలిసొచ్చే రంగు: వయొలెట్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ పని సామర్థ్య పెరుగుతుంది. దానిమూలంగా మీ ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. బంధాలు, బంధుత్వాల విషయంలో చోటు చేసుకోనున్న కొత్తమార్పులు మిమ్మల్ని మరింత బలోపేతం చేస్తాయి. జ్వరం, ఒళ్లునొప్పుల వంటి వాటిని నిర్లక్ష్యం చేయవద్దు. అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను కలవండి. కలిసొచ్చే రంగు: పీచ్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈ వారం ఒత్తిడి, టెన్షన్లు తప్పవు. గుండె ఆరోగ్యం విషయంలో మరింత ఆందోళన పడతారు. మనసులో ఉన్న బాధను అణుచుకోవద్దు. ఆర్థికంగా మెరుగ్గానే ఉంటుంది. దూసుకుపోయే మీ స్వభావం మీకు మంచే చేస్తుంది. విందు వినోదాల్లో పడి ఆహారం విషయంలో తగిన జాగ్రత్త తీసుకోకపోతే డాక్టర్‌ను కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: కాఫీ బ్రౌన్ పైసిన్ (ఫిబ్రవరి20-మార్చి20) అన్ని కష్టాలనూ, అననుకూలతలనూ అధిగమించి, కాస్త స్థిమితపడతారు. మీ వ్యక్తిగత జీవితం బాగుంటుంది. పనిలో మరింత చొరవ చూపి అధికారుల మన్ననలందుకుంటారు. మీ పరిశోధనలను, అధ్యయనాన్ని కొనసాగించండి. చిన్న చిన్న రుగ్మతలని, నొప్పులను నిర్లక్ష్యం చేస్తే పెద్ధ ఫలితాన్ని చవి చూడవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి మీకు మీరుగా తీసుకున్న నిర్ణయం మంచిదే. మళ్లీ దాన్ని అనవసర చర్చల్లో పెట్టి మనసుని ఆందోళన పరచుకోకండి. నిర్ణయాన్ని మార్చుకోవాలని భావించకండి. కుటుంబ సభ్యులకి- తగినంత గుంభన ఉండాలనే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పండి. విదేశీ ప్రయాణానికి సంసిద్ధంగా ఉండటం మంచిది. అప్పు తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి. నమ్మి మోసపోయే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి, ఎంతవరకూ నమ్మాలో అంతకు మించి పోవద్దు. ముఖ్యంగా వైద్యసూచనలూ సలహాలూ చికిత్స విషయాల్లో ఇద్దరు ముగ్గురి అభిప్రాయాలను తీసుకుని ముందుకెళ్లండి. కీర్తికండూతి కోసం పాకులాడవద్దు. ఇతరులతో పోలిక వద్దేవద్దు. మీరూ మీ కుటుంబ సభ్యులూ ఒకే మాట మీద ఉండండి. ఎప్పటికప్పుడు ఏదో ఒక పని అత్యవసరంగా నెత్తిన పడుతూ అనుకున్న పని లేదా పనులు వాయిదా పడుతూ ఉండవచ్చు. దీన్ని అసమర్థతగా భావించక, ఈ మాత్రమైనా పనులు జరుగుతున్నాయని సంతోషించండి. శారీరకమైన అలసట కారణంగా ఈ వారం ఔషధ సేవ అవసరపడచ్చు. తేలికపాటి ఆరోగ్యపరీక్ష చేసుకుని ముందు జాగ్రత్తతో ఉండండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంతానానికి సంబంధించిన ఓ విషయం ఆందోళన కలిగించవచ్చు. దాని గురించి మరింతగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మిమ్మల్ని విరోధించే వ్యక్తులతో ముభావంగానే ఉండండి. వారి సహాయం కోసం చూడద్దు. మీకు మీరుగా చాడీలని వ్యాప్తి చేస్తే ఇబ్బందులు తప్పవు. మీరు ప్రయత్నించిన తీరుగా కార్యక్రమాలు ముందుకు సాగవు. ఎవరితోనైనా ఒప్పందాలు చేసుకోవలసి వచ్చినప్పుడు మొహమాటాలకు, భరోసాలకు పోవద్దు. ఆడంబరం కోసం అనవసరమైన వస్తువులు కొని విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. వారాంతంలో శుభవార్తని వింటారు. రుణాలని తీర్చే ప్రయత్నంలో ఉండండి. బంధుమిత్రులతో విందువినోదాల్లో ఆనందంగా గడుపుతారు. గృహాన్ని గానీ, భూమిని గానీ తాకట్టుపెట్టుకోవడం మాని కొనుక్కోవడానికే ప్రయత్నిస్తే కలిసొచ్చే అవకాశం ఉంది. దైవకార్యక్రమాలపట్ల ఆసక్తి చూపిస్తారు. ఆధ్యాత్మికంగా గురువుని అతిగా విశ్వసించవద్దు. నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఖర్చు చేసుకుంటూ వెళ్లకపోతే ఆర్థిక పరిస్థితి తలకిందులు కావచ్చు. ఎవరిని సంతృప్తి పరచడం కోసమో అనవసర ప్రయాణాలు చేయవలసి వస్తే మొహమాటం లేకుండా రానని చెప్పండి. కుటుంబ సభ్యుల కంటే బంధుమిత్రులు ఎక్కువ కారని గ్రహించండి. పిల్లల విద్యాసంస్కారాలని తప్పక పట్టించుకోవాలి. ప్రవర్తన విషయంలో మెలకువతో ఉండండి. బంధుమిత్రుల రాకపోకలతో ఇల్లు సందడిగా ఉండవచ్చు. ప్రతిపనిలోనూ జాప్యం అవుతూ ఉండవచ్చు. కోర్టు వివాదాలు మరింత జాప్యమౌతూ అనిశ్చిత స్థితిలో పడేయవచ్చు. ఎవరిని సలహా సూచనలడిగినా మరింత అయోమయంలోకి నెట్టవచ్చు. దేనికైనా ఓ ప్రణాళిక అవసరమనే ఆలోచనతో ఉండండి. రావలసిన బకాయిలకోసం ప్రయత్నించండి. మానసికంగా ఆందోళనకరంగా ఉన్నప్పుడు దైవధ్యానానికి ప్రాముఖ్యమీయండి. ప్రారంభించిన పనులన్నీ ఆటంకాలకి గురై మధ్యలో ఆగిపోవడంగాని పూర్తిగా విరమించుకోవడం గాని జరగవచ్చు. ఇదే ఫలితం ప్రయాణాల విషయంలోనూ వర్తించవచ్చు. బంధుమిత్ర శ్రేయోభిలాషులు మాట ఇచ్చారు కదా అని అతి విశ్వాసంతో ఉండవద్దు. ప్రయత్నలోపం వద్దు. రుణాలని తెచ్చుకోవద్దు, ఇవ్వవద్దు. ఇతరులు మీ కుటుంబాన్ని గురించి వాదోపవాదాలు చేసే అవకాశాన్ని ఈయకండి. గుంభన పాటించండి. పెద్దల సూచనలను స్వీకరించండి. అనుకున్న పనులు సఫలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆలసించకుండా ప్రయత్నాలు చేయండి. ఆదాయం అంతంత మాత్రం కాబట్టి వ్యయ నియంత్రణని పాటించండి. తలిదండ్రులకి ఆరోగ్యపరీక్షలవసరం. ఎప్పుడో చేసిన వాగ్దానం ఇరుకున పడేయవచ్చు. ఎవరికో ఇచ్చిన హామీ మీకు సమస్యగా పరిణమించవచ్చు. ఎవరి విషయంలోనో మధ్యవర్తిగా వ్యవహరించిన ఆ పని మీకు కంఠం పట్టుకోవచ్చు. మొగమాటం లేకుండా మాట్లాడండి తప్ప విషయాన్ని సాగదీయకండి. నేరాన్ని తలమీదికి తెచ్చుకునే విధంగా తప్పించుకోవడం, మెత్తగా ఉండడం సరి కాదని గ్రహించండి. సంతానం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. విదేశీ వ్యవహారాలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. సంతానపు చదువు విషయంలో తగినంత శ్రద్ధని చూపండి. నిజమైన ఆస్తి సంతానమే అనే విషయాన్ని గమనించి స్థిరచరాస్తుల మీద కాకుండా వీరి విద్య ఎదుగుదల మీద దృష్టి పెట్టండి. అత్తమామలతో సత్సంబంధాలుండటం అవసరం. మరిది వదినెలతో తగుదూరాన్ని పాటించండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
జూన్ 13 నుంచి జూన్ 19 వరకు....
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొత్త అవకాశాలు వస్తాయి. పుష్కలంగా ధనం చేతికందుతుంది. విలాసంగా గడుపుతారు. మీరు ఉద్యోగి అయితే ప్రమోషన్ ఖాయం. ఆర్థికంగా చాలా బాగుంటుంది. మీకెదురవుతున్న తిరస్కృతులు, నిరాశలు, వంచనలు జీవితంలో మామూలేనని, అలాంటివాటికి త్వరలో ముగింపు ఉందని గ్రహించి, నిబ్బరంగా ముందుకెళ్లండి; కలిసొచ్చే రంగు: గ్రీన్ షేడ్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) సంయమనంతో, సమతుల్యంతో ఉండి మీ విజయం సాధించండి. వారమంతా క్షణం తీరికలేకుండా గడిపేస్తారు. మీరు ఏదైనా బంధంలో ఉండి ఉంటే, దాని నుంచి బయట పడటం మంచిది. పనికి, ప్రేమకూ పొత్తు కుదరక పోయినా, ప్రేమతో చేస్తే పనులు జరుగుతాయి. చేసిన తప్పుల నుంచి బయటపడి, వివేకంతో మెలగండి; కలిసొచ్చే రంగు: బ్రౌన్ జెమిని (మే 21-జూన్ 21) మీరు వెళుతున్న మార్గంలో ప్రధానమైన మలుపులు ఉండవచ్చు. ఏ దారిలో ముందుకెళ్లాలో నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం అవుతుంది. పనిలో కాస్త దూకుడును తగ్గించుకోవడం మంచిది. వృత్తిపరంగా మీరు ప్రతిభావంతులు కావచ్చు కాని, కొంచెం విశ్రాంతి కూడా అవసరం కదా! ప్రేమబంధంలో మీరే కాస్త చొరవ చూపించవలసి రావచ్చు; కలిసొచ్చే రంగు: పీచ్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఈ వార మంతా కొంచెం బద్ధకంగా గడుపుతారు. మీకు అడ్డు చెప్పువారు ఎవరూ లేరు కదా అని కీలకమైన నిర్ణయాలు మీ అంతట మీరు తీసుకోవద్దు. ఆర్థికపరంగా చాలా బాగుంటుంది. మీ కోరిక ఈ వారంలో తప్పక నెరవేరుతుంది. కొత్త వ్యాపారాన్ని లేదా ఉద్యోగాన్ని ప్రారంభిస్తారు. మీదైన శైలిలో ముందుకెళ్లి విజయం సాధించండి; కలిసొచ్చే రంగు: ఆరంజ్ షేడ్స్ లియో (జూలై 24-ఆగస్టు 23) మీ బలాబలాలను, నిజానిజాలను పరిశీలించి నిర్థారణ చేసుకోదగ్గ వారం ఇది. ప్రేమ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. ఆనందం ఉన్నా, అందుకు తగ్గ స్థాయిలో అభద్రతాభావం వెంటాడవచ్చు. అయితే అది కేవలం మీ అనుమానం మాత్రమే అని గ్రహించండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి; కలిసొచ్చే రంగు: వైట్ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ ఇంటిని ఆధునీకరించుకోవలసిన, జీవితంలో కొత్తదనం నింపుకోవలసిన సమయం ఇది. ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న మీ ప్రాజెక్ట్ ఒకటి ఈ వారం విజయవంతంగా పూర్తవుతుంది. మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఎటు నడిపిస్తే అటు నడవడమే జీవితం అని గ్రహించండి; కలిసొచ్చే రంగు: పర్పుల్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) జీవితమన్నాక ఆటుపోట్లు తప్పవు. ఎదురు దెబ్బలు తగిలినంత మాత్రాన కుంగిపోనక్కరలేదు. పరిస్థితులు మిమ్మల్ని మానసికంగా కొంచెం బలహీన పరిచినా, అది తాత్కాలికమేనని తెలుసుకోండి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. డబ్బు కూడా మీ వెనకాల పడుతుంది. వారమంతా సంతోషంగా గడుపుతారు; కలిసొచ్చే రంగు: గ్రీన్ స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) చీకటి తర్వాత వెలుగు, దుఃఖం తర్వాత సుఖం మామూలేనని గ్రహించండి. ఎటువంటి సంఘటనలు ఎదురైనా, నిబ్బరంగా ఉండండి. కొత్త ప్రాజెక్టులు, కొత్త అసైన్మెంట్లు, అదనపు బరువు బాధ్యతలు మీ మీద పడవచ్చు. సిద్ధం కండి. మరింత సంతోషకరమైన, సౌఖ్యదాయకమైన జీవితం మీ కోసం ఎదురు చూస్తోంది; కలిసొచ్చే రంగు:పసుప్పచ్చ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీకున్న జ్ఞానాన్ని, విద్యను డబ్బు సంపాదన కోసం ఎందుకు ఉపయోగించకూడదు? ఆలోచించి చూడండి. అలాగని నిబంధనలు అతిక్రమించవద్దు. ఇంతకాలం మీకు సహాయంగా ఉన్న వారికి ఇప్పుడు మీరు సాయం చేయవలసి రావచ్చు. కొత్త బంధం ఏర్పరచుకోవాలంటే మీకు కొంత సమయం, సందర్భం అవసరం అని గ్రహించండి; కలిసొచ్చే రంగు: వెండి రంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) పనిలోనూ, మీ ప్రేమ బంధంలోనూ కొత్తదనం చూపించవలసిన తరుణం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మీ ధైర్యం ముందు, దృఢనిశ్చయం ముందు తలవంచి తీరతాయి. కొత్త ప్రాజెక్టులు, లావాదేవీలు ప్రారంభించడానికి ఇది తగిన సమయం. ఎప్పటినుంచో బకాయి పడి ఉన్న అప్పులు తీర్చేయడం వల్ల నిశ్చింతగా ఉంటారు; కలిసొచ్చే రంగు: యాపిల్ గ్రీన్ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) కొద్దిపాటి ఒడుదొడుకులు ఎదురు కావచ్చు. వెలుగుకు ముందు చీకటి తప్పదని తెలుసుకోండి. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలోని భ్రమలు తొలగిపోవడానికి ఇది తగిన సమయం. మీరు వివాదాల జోలికి వెళ్లే వ్యక్తి కాకపోయినా, వెతుక్కుంటూ వస్తే మీరు మాత్రం ఏం చేయగలరు? వాదోపవాదాలకు తావివ్వవద్దు. మీ మూడ్ చెదిరిపోకుండా చూసుకోండి; కలిసొచ్చేరంగు: గ్రీన్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) సవాళ్లను ఎదుర్కొనడానికి రెడీగా ఉండండి. అదే మీ జీవితాన్ని మలుపు తిప్పవచ్చు. పార్టీలతో, సామాజిక కార్యకలాపాలతో వారమంతా చాలా బిజీగా గడిపేస్తారు. గతంలో మంచి క్రీడాకారులు కావడం వల్లనే ఇప్పుడు మీరు ఆరోగ్యంగా ఉన్నారని తెలుసుకోండి. పనిమీద విదేశాలకు వెళ్లవలసి రావచ్చు. తగిన పత్రాలతో సిద్ధంగా ఉండండి; కలిసొచ్చే రంగు: లేత పసుపు. ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొన్ని రంగాల వారికి ముఖ్యంగా విద్యావైద్యరంగాలవారికి మంచి గుర్తింపు, పురస్కారాలు లభించవచ్చు. వ్యాపార, వినోదరంగాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. స్త్రీలకి అనారోగ్య సూచన. శారీరక శ్రమ, మానసికమైన బడలిక. సకాల భోజనం, సకాల నిద్ర, తగినంత విశ్రాంతి అవసరం. వీలయినంత తక్కువ మాట్లాడటం మంచిది ఈ వారంలో. టారస్ (ఏప్రిల్ 21-మే 20) అనూహ్యమైన ఖర్చులు, దానికి తగ్గట్టు అనూహ్యమైన ఆదాయం ఉంటాయి. కళారంగంలో ఉన్న వారికి ప్రోత్సాహం లభిస్తుంది. వినోదరంగంలో ఉన్న వారికి ఆరోగ్య భంగ సూచ న ఉంది. ప్రభుత్వేతర సంస్థల్లోని అత్యున్నత స్థాయి ఉద్యోగులకి తగిన మన్నన, గౌరవం లభిస్తాయి. పదోన్నతి, స్థానచలనం కలగవచ్చు. మనసులో మాటని గుంభనంగా ఉంచుకోవడం మంచిది. జెమిని (మే 21-జూన్ 21) ఎక్కువ కాలం నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు సంస్థకోసమే మనం పుట్టలేదని గ్రహించి, ఇంతకంటే గొప్ప ఆదాయం ఉందనిపించే చోటుకి మారడం తప్పు కాదు. ఈ వారంలో ఉద్యోగంలో మీకు అనుకూలమైన మార్పు కలిగితే కొనసాగండి లేని పక్షంలో సరైన చోటుకోసం వేట ప్రారంభించండి. కుటుంబం తర్వాతే సంస్థ అని గుర్తించండి. క్యాన్సర్ (జూన్22-జూలై 23) బంధుమిత్రుల రాకపోకలతో, విందువినోదాలతో సంతోషంగా గడుస్తుంది. భూమి, గృహం, ఇండ్లస్థలం వంటివి కొనాలనే ఆలోచనగానీ కొనడం గానీ సంభవించవచ్చు. అయిన వారి దగ్గర అప్పు మాత్రం తీసుకోద్దు. సంతానావకాశ సూచన గాని, సంతాన ప్రాప్తిగానీ కావచ్చు. అనుకూలంగా గడిచే వారం ఇది. అసూయాపరులతో జాగ్రత్త. లియో (జూలై 24-ఆగస్టు 23) మీ పిల్లల చదువు విషయంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. సత్ఫలితాల కారణంగా చక్కని చదువులో మంచి కళాశాలలో చేరతారు. శుభకార్యాల కోసం కొద్దిగా శ్రమిస్తే విజయం మీ వెంటే ఉండగలదు. ఉద్యోగం చేస్తున్న వారు పోటీపరీక్షలకి శ్రమించి సిద్ధపడితే పదోన్నతి ఖాయం. వీలయినంత ఎక్కువగా దైవారాధన చేయండి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) అదృష్టవశాత్తూ మీరు పడుతున్న శ్రమనీ మీ కృషినీ ఉద్యోగంలో మీరు చూపుతున్న ప్రతిభనీ పైవాళ్లు గుర్తిస్తారు. ప్రశంసిస్తారు. ఇంతకుముందున్న ఆర్థికమాంద్యం తొలగి, ఆర్థికపరంగా కొంత ధైర్యం లభిస్తుంది. కుటుంబంలోనూ, బంధువర్గంలోనూ మీ మాటకి విలువ పెరుగుతుంది. ఆడంబరానికీ, అట్టహాసానికీ పోకుండా మీదైన శైలిలోనే సాగడం మంచిది. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీరు కిందిస్థాయి ఉద్యోగి అయితే పై అధికారులతో ఏ మాత్రం విభేదించద్దు. మీరు ఉన్నతాధికారి అయి ఉంటే మీ కింది వారిని కలుపుకుపోవడం మంచిది. లేదంటే అందరూ కలిసి విరోధించి పరిస్థితిని దూరంగా తీసుకుపోవచ్చు. సామరస్యభావంతో ఉండండి. ఇదే పద్ధతిని మీరు భార్య అయితే భర్తతోనూ, భర్త అయితే భార్యతోనూ ఈ వారమంతా అనుసరించడం అవసరం. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) నిరుత్సాహమనేది వద్దేవద్దు. జీవితంలో చూడదగిన, వినదగిన, వినగలిగిన ఎన్నో మధుర ఘట్టాలు మున్ముందున్నాయి. తాత్కాలిక దుఃఖమనేది మహానుభావులకూ వచ్చిందే. ముఖ్యమైన సదస్సులకి ఆహ్వానం అందితే లేదా పెద్దలతో పరిచయ అవకాశాలు కలిగితే సద్వినియోగం చేసుకోండి. ఆ పరిచయం లేదా ఆ అవకాశం మిమ్మల్ని పై స్థాయికి తీసుకువెళుతుంది. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) పెద్దజీతంతో దూరపు చోట ఉద్యోగం లభించిందని పొంగిపోకండి, కుటుంబానికి దూరం అయితే జీవితమే దెబ్బతింటుందని గ్రహించండి. కొత్త వ్యాపారావకాశాన్ని గుడ్డిగా అనుసరించకుండా మీకు అనుకూలురూ, మార్గదర్శకులూ అయిన వారితో సంప్రదించి మాత్రమే ముందడుగు వేయడం మంచిది. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) వస్తువుల కొనుగోళ్లలో పడిపోయి ప్రణాళికని మించి వ్యయం చేసే అవకాశముంది- జాగ్రత్త. ఉద్యోగ ప్రయత్నానికో లేదా ఉద్యోగపు రాకపోకలకో అంచనాలకి మించి వ్యయం చేస్తారు. విద్యార్థుల్లో అలాగే వృత్తి వ్యాపారాలలో అదనపు ఆదాయపు తక్కువ కావడాన అసంతృప్తి కలగవచ్చు. మిమ్మల్ని మీరు ఓదార్చుకుంటూ ధైర్యాన్ని చెప్పుకుంటూ గడపాల్సిన వారం ఇది. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) బాగా తెలిసి తెలిసి/ అలాగే ఎంతో తెలిసిన వ్యక్తిని నమ్మి ఇబ్బందిలో పడే ప్రమాదం ఉంది. మరో నెలరోజుల్లో బయటపడి పోతారని గమనించుకుని ధైర్యంతో ఉంటూ ఆ ప్రమాదం నుండి బయటికి వచ్చే ప్రయత్నాలని మాన కండి. అనాలోచితంగా అప్పు ఇవ్వడం, ఉమ్మడి ఆస్తి విషయంలో తెలివి తక్కువగా ఓ నిర్ణయాన్ని ప్రకటించడం వంటివి ఈ వారంలో జరగవచ్చు. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) వాహనాన్ని కొనాలనే ఆలోచన కార్యరూపం ధరిస్తుంది. ఎన్నాళ్లనుంచో పరిష్కరించుకోని సమస్యకి పరిష్కారం ఓ ఆలోచన రూపంలో వస్తుంది. మరో కొంత కాలంలో అనుకూలంగా పరిష్కరింపబడుతుంది. గృహాన్నో, భూమినో మరమ్మతు చేయడం కోసం రుణాన్ని తీసుకోవడం గాని లేదా దాచుకున్న ధనాన్ని వ్యయపరచుకోవడం గాని చేస్తారు. అది మంచికేనని గ్రహించండి. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
టారో బాణి (జూన్ 6 నుంచి జూన్ 12 వరకు)
టారో బాణి అనూహ్యమైన అవకాశాలు కలిసి వస్తాయి. మీ కలలను సాకారం చేసుకోగలిగే వారం ఇది. సన్నిహితులతో మీకున్న సంబంధాలు కొత్తశిఖరాలను చేరుకుంటాయి. మిమ్మల్ని మీరు మరింతగా పట్టించుకోవాలి. చేసే పనులను మరింత నమ్మకంతో చేయాలి. మీ ఆత్మవిశ్వాసాన్ని మరికాస్త దృఢపరచుకోవాలి. కలిసొచ్చే రంగు: పర్పుల్ పాతస్మృతుల తలపులతో మీకు కొత్త శక్తి వస్తుంది. విలాసంగా ఖర్చు చేసుకోగలిగేంత డబ్బు సంపాదిస్తారు. బంగారు కలలు కనడానికి, వాటిని సాకారం చేసుకోవడానికి ఇది తగిన తరుణం. ఇంతరకూ ఉన్న అన్ని అననుకూలతలనూ చాలా సులభంగా అధిగమిస్తారు. కలిసొచ్చే రంగు: నారింజ ఆలస్యాలు, అడ్డంకులూ తొలగిపోయి, పనులు చకచకా జరుగుతాయి. మీ బంధు, మిత్రవర్గంలో మీరే చర్చనీయాంశం అవుతారు. అందరూ మీపై ప్రశంసలు కురిపిస్తారు. మీరు ఎవరి కంట పడకుండా అయితే ఉండాలనుకుంటున్నారో, వారే మీకెదురవుతారు. హాయిగా నవ్వుకోవడమే మీ రుగ్మతలకు సరైన మందు. కలిసొచ్చే రంగు: మావిచిగురు రంగు ఇది మీకు చాలా రొమాంటిగ్గా, సంతోషంగా గడిపే వారం. ప్రేమ, ఆనందం పొంగి పొర్లుతాయి. సాయం చేయదలచుకున్న వారికి మీరు అనుకున్న రీతిలో సాయం చేయడం మంచిది. చక్కటి కౌన్సెలింగ్ ఇవ్వడం ద్వారా ఈ వారం మీరు కొందరు మిత్రులు, సన్నిహితుల సమస్యలను పరిష్కరిస్తారు. శత్రువులకి తగిన సమాధానం చెబుతారు. కలిసొచ్చే రంగు:వంకాయ రంగు ఈ వారం మీకు కొత్త సవాళ్లు ఎదుర యినప్పటికీ సరైన రీతిలో పరిష్కరించుకుంటారు. మరింత ఆత్మవిశ్వాసంతో, మరింత చురుగ్గా మీ పనులను పూర్తి చేయవలసిన వారం ఇది. ఇంతకాలంగా మీ శక్తినంతటినీ హరించి వేస్తూ, మిమ్మల్ని పీడిస్తున్న సమస్యలను ఎలా ఎదుర్కొనాలో ఒక అవగాహనకు వస్తారు. ఒక ప్రేమబంధంలో పడతారు. కలిసొచ్చే రంగు: పింక్ మీ విశ్వాసాలమీద, నిర్ణయాల మీద మీరు స్థిరంగా నిలబడ వలసిన వారం ఇది. ఎవరికైనా ఏమైనా మాట ఇచ్చేముందు దానిని మీరు నిలబెట్టుకోగలరా లేదా అని ఒకటికి రెండుమార్లు ఆలోచించడం మంచిది. మొత్తం మీద ఇది మీరు ఉన్న రంగంలో విస్తరణని, చేపట్టిన పనులలో విజయాన్ని ఇచ్చే వారం. కలిసొచ్చే రంగు: పీచ్ ఎంతోకాలం నుంచి చేయాలని తపన పడుతున్న పనిని ఈ వారం ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా మీలో కలిగే భావోద్వేగాలను అణచుకోవడం కష్టమే అవుతుంది. మీ సమస్యల పరిష్కారానికి రేఖీ మంచి మార్గం. ఖర్చులు అడ్డూ అదుపు లేకుండా పెరిగే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. కలిసొచ్చే రంగు: పర్పుల్ ఏ మార్గంలో వెళ్తే గమ్యస్థానాన్ని చేరుకుంటారో మీకు తెలుసు కాబట్టి ఇక ఆలసించకండి. వ్యాపార నిర్ణయం కోసం మీరు వేసుకున్న అంచనాలు ఫలిస్తాయి. మీ అంతరాత్మ చెబుతున్న దానిని మనసు పెట్టి వింటే మీరు ఎవరి మాట వినాలో మీకే తెలుస్తుంది. మీ ప్రేమబంధాన్ని కొనసాగిస్తారు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ మీ అడుగులు ఎటువైపు పడుతున్నాయో ఓసారి చూసుకోండి. నడక నిదానమైనా, నడిచే మార్గం సరైనదైతేనే మీరు విజయం వైపు పయనిస్తారని, ఉన్నత శిఖరాలను చేరుకుంటారని గ్రహించండి. మీ మనసులోని కోరికలను నెరవేర్చుకునేందుకు ఈ గురువారమే తగిన సమయం. కలిసొచ్చే రంగు: సిల్వర్ ఇది మీకు మంచి విజయాన్ని, పుష్కలంగా డబ్బును ఇచ్చే వారం. జీవితమన్నాక ఎత్తు పల్లాలు రెండూ ఉంటాయని మరచిపోవద్దు. కొత్త ఆలోచనలు చేయడానికి కానీ, తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి కానీ ఇది తగిన సమయం కాదు. మీ ఇంటిలో తూర్పువైపున వెదురు మొక్కను నాటండి. కలిసొచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్ మీ ప్రేమ వ్యవహారాలకు, కెరీర్‌కు ఇది కలిసొచ్చే వారం. పరీక్షలలో విజయం సాధిస్తారు. సినిమా థియేటర్లో ఉన్నా, ఇరుగు, పొరుగు ఇళ్లల్లో హస్కు వేస్తున్నా, మీ ఉద్యోగంలో మీరు లీనమై ఉన్నా సరే, అందరి దృష్టినీ ఆకర్షిస్తారు. ఈ శనివారం మీ ప్రేమకు ఆహ్వానం చెబుతారు. కలిసొచ్చే రంగు:ఎల్లో షేడ్స్ పుష్కలంగా డబ్బు చేతికందుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తారు లేదా కొత్త ఉద్యోగంలో చేరతారు. ముఖ్యమైన కాంట్రాక్టుల మీద, డాక్యుమెంట్ల మీద సంతకం చేస్తారు. మీ జీవిత భాగస్వామిని సంతృప్తి పరుస్తారు. గ్రీన్ క్రిస్టల్‌ను ధరించడం ద్వారా మరింత ధనాన్ని, అనుకూలతలని ఆకర్షించవచ్చు. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి శక్తికి మించిన వాగ్దానాలనీ, మొక్కులనీ, దానధర్మాలనీ, పూజాపురస్కారాలనీ చేయదలచి ఇబ్బందిలో పడబోతున్న వారం ఇది. అప్పు చేసి మరీ మీరు చేయబోయే దానం కుటుంబంలో వ్యతిరేకతకి అవకాశాన్నీయవచ్చు. విందులూ వినోద పర్యటనలూ మానసిక ఆనందాన్ని కలిగించవచ్చునేమో కానీ అప్పు చేసి చేయవలసిన పరిస్థితి తెచ్చుకోవద్దు. ఇంట్లో కలహాలూ ఉద్యోగంలో అనైక్యత మానసిక ఒత్తిడి కలిగిస్తాయి. దైవధ్యానం, తక్కువ మాట్లాడటం అనేవి ఈ సమస్యకి పరిష్కార మార్గాలు. దూరపు చుట్టాలకోసం మరింతగా శ్రమించనవసరం లేద నే నిర్ణయానికి రాగలిగితే శారీరకంగానూ మానసికంగానూ కొంత ఊరట కలుగుతుంది. అనవసర పనుల్ని మానాలనే నిర్ణయానికి రాండి ఈ వారంలో. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన కొంత అసంతృప్తి కలిగించవచ్చు. ఉద్యోగంలో పై అధికారి సరిగా లేనివాడైనా ఎలా చిరునవ్వుతో పలకరిస్తున్నామో ఈ తాత్కాలిక అనైకమత్య పరిస్థితిలో ఆ నటనని మీ జీవిత భాగస్వామి పట్ల ప్రదర్శించడం అవసరం. తలిదండ్రులతో విరోధాన్ని లేకుండా మాట మెత్తనిదనాన్ని చూపండి ఈ వారంలో. మీదైన శైలిలో మీరు సాగితే విజయం మీదే. గతాన్ని తవ్వుకుంటూ కూర్చోక, పనివైపు అడుగులు వేయండి. కలిసొచ్చే వారం ఇది. కాలాన్ని వృథా చేయకుండా మీ అభివృద్ధి కోసమే వినియోగించుకోండి. పండితులైతే పుస్తక ముద్రణ/రచనలు మొదలైనవీ, గాయకులైతే సీడీల విడుదలా కచ్చేరీలూ వంటివీ.. ప్రయత్నించండి. అలాగే ఇతర రంగాలవారూ ప్రయత్నించండి. మిమ్మల్ని గురించి మీరు అంచనా వేసుకోండి. సరైన మార్గదర్శి లభించినా గుడ్డిగా నమ్మకుండా ప్రయాణాన్ని సాగిస్తే చక్కగా ఉంటుంది మీ జీవితం. ఆ నిర్ణయాన్ని తీసుకోవలసిన వారం ఇదని గమనించండి. కుటుంబ వ్యవహారాలని గుంభనగా ఉంచుకోండి. ఇతర ఉద్యోగ వ్యాపార విషయాల అభివృద్ధిని గురించే చర్చించండి మార్గదర్శి అనిపించిన వారితో. ఓ శుభవార్త మీ ఇంటి తలుపును తట్టవచ్చు. చెప్పలేనంత ఆనందం వెల్లివిరియవచ్చు. పొదుపు తప్పక చేయాల్సి రావచ్చు ఆ శుభకార్య నిర్వహణ కోసం. ఉద్యోగంలో కోరుకున్న ప్రదేశానికి బదలీ కావడమో లేదా విదేశాలకి వెళ్లవలసి రావడమో జరగవచ్చు. సిద్ధంగా ఉండండి తగిన పత్రాలతో. తీర్థయాత్రలలో కానీ, దైవకార్యక్రమాలలో గానీ భాగస్వాములు కావలసి రావచ్చు. అసూయ, అనవసర ద్వేషాల వల్ల మానసిక అశాంతి కలగవచ్చు. లౌక్యంగా ప్రవర్తించండి. మీ మధ్యవర్తిత్వం ఓ మొండి సమస్యకు పరిష్కారం కావచ్చు. మీ వ్యవహార శైలి, నేర్పరితనంతో మీ సమర్థతని నిరూపించుకుని, మిమ్మల్ని మీరు కాపాడుకోవలసిన వారం ఇది. హామీలూ, వాగ్దానాలూ సంతకాలూ వద్దేవద్దు. జాగ్రత్తగా ఉండండి. ధైర్యంగా వ్యవహరించండి. ముఖ్య వ్యవహారమొకటి చర్చల దశకి వస్తుంది. మీ ధర్మమే మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి అధర్మం, అసత్యాల వైపుకి వెళ్లకండి. మొదటి నుండీ ఏ మార్గంలో ప్రయాణిస్తూ వచ్చారో అదే మార్గంలో వెళ్లండి తప్ప- వారూ వీరూ చెప్పిన సూచనలు, సలహాల ప్రకారం తోవ తప్పి నడిచే వారం కాదిది. వంచన వైపుకి ఆలోచనని పోనీయకండి. తాత్కాలికంగా అనుకూల కాలం కాని కారణంగా మీరు ప్రారంభించిన నిర్మాణ కార్యక్రమానికి అవరోధాలు రావడం గాని, తీవ్ర అభ్యంతరం కారణంగా మధ్యలో ఆపుదల గాని సంభవించవచ్చు. ఈ దశలో అనారోగ్యమూ జతకావచ్చు. ఒక కష్టానికి మరొకటి జత అయినప్పటికీ, చేయగలిగినంత జపాన్ని చేస్తూనే ఉంటే, ఒడ్డెక్కగలుగుతారు ఈ వారంలోనే. ఈ వారం మీకు అనుకోని నింద లేదా అనుమానం లేదా ఓ తొందర పాటు చర్య ఎదురు కావచ్చు. కుంగిపోవద్దు. చాలా తొందరలోనే ఆ పొరపాటు ఎవరిదో అందరికీ అర్థమై, ఆ నింద, అనుమానం దానంతట అదే తొలగిపోతుంది అనుభవంతో పాటు నిర్ణయాత్మక శక్తీ ధైర్యమూ మీకు లభిస్తాయి కాబట్టి. అయినవాళ్ల మీద అనుమానాలనీ రేకెత్తించి, మీ నుంచి దూరం చేసేందుకు తగిన ప్రయత్నాలు కొందరు ఈ వారంలో చేయవచ్చు. వారు చెప్పబోయే చాడీలకి చెవిని అప్పగించనే వద్దు. మీ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ స్వయం నిర్ణయాన్ని తీసుకోండి. మీ దంపతులు ఆలోచించుకుని ఏ పనినైనా చేసుకోండి తప్ప మూడోవ్యక్తికి అవకాశాన్నీయకూడదని గమనించండి. రాజకీయ రంగం వారికి కీర్తి ప్రతిష్ఠలని ఇనుమడింప చేసే వారం ఇది. వారి ప్రతిభకి గుర్తింపు లభించే రోజులివి. వ్యాపార రంగం వారికి వారాంతానికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆగిపోయిన పనులకి కదలిక ఏర్పడుతుంది. ఆర్థికంగా లోటు కనిపించవచ్చునేమోగాని మానసికంగా, శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. డా॥మైలవరపు శ్రీనివాసరావు,సంస్కృత పండితులు -
టారో బాణి
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కొత్త సంబంధ బాంధవ్యాలు ఏర్పడతాయి. కొత్తగా ప్రారంభించిన పనులలో విజయం సాధిస్తారు. సాధించిన విజయాలకు, చేసిన పనులకు ప్రశంసలు అందుకుంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిజమైన ప్రేమ అంటే ఏమిటో అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. కలిసొచ్చే రంగు: పీచ్ టారస్ (ఏప్రిల్ 21-మే 20) కొత్త ఇల్లు కడతారు లేదా ఇల్లు మార తారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీదైన శైలిలో అలవోకగా విజయాలు సాధించి, అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. పదిమందీ మిమ్మల్ని ప్రశంసిస్తారు. డబ్బుకు ఇబ్బంది ఉండదు. మనసులో ఏమైనా బాధ కలిగినప్పుడు గట్టిగా నవ్వుకోండి, ఆ బాధ దానంతట అదే తొలగిపోతుంది. కలిసొచ్చే రంగు: కెంపు వంటి ఎరుపు రంగు జెమిని (మే 21-జూన్ 21) కొన్నిరకాల సంశయాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేయవచ్చు. మీ అంతరాత్మ చెప్పినట్లుగా నడుచుకోవడానికి ఇది తగిన సమయం. కొత్త ప్రేమబంధం ఏర్పడవచ్చు. ఏదైనా పనిని అనుకున్నప్పుడుతికమక పడకండా మీరు అనుకున్న విధంగా చేయండి. విజయం, ఆనందం మిమ్మల్ని వరిస్తాయి. కలిసొచ్చే రంగు: లేత పసుపు క్యాన్సర్ (జూన్22-జూలై 23) పని ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ, ఏమాత్రం తొట్రుపాటుకు గురికాకుండా మరింత ఉత్సాహంగా చేస్తారు. తికమకకు గురి చేసే పరిస్థితులు ఎదురైనప్పుడు మీ మనసు మాట విని, దాని ప్రకారం నడుచుకోండి. అప్పుడు ఏ ఇబ్బంది ఉండదు. పెద్దమొత్తంలో డబ్బు చేతికి అందుతుంది. కొత్తకోణంలో పని చేసి, అధికారుల మన్ననలు అందుకుంటారు. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ లియో (జూలై 24-ఆగస్టు 23) కొన్ని అనుకోని సమస్యలు చికాకు పెట్టవచ్చు. అధికారులు, పెద్దలతో వినయంగా మాట్లాడండి. వివాదాలు ఎదురైనప్పుడు రాజీధోరణిలో, సామరస్యపూర్వకంగా వ్యవహరించడం అవసరం. ఎవరు, ఎన్ని అవరోధాలు కలిగించినప్పటికీ, మీరు అనుకున్న పనులను విజయవంత ంగా పూర్తి చేస్తారు. కలిసొచ్చే రంగు: వెండి వర్గో(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) అనుకోని మలుపులు మీ జీవితంలో అనుకూలమైన మార్పు తీసుకు వస్తాయి. ఒకోసారి మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడం కష్టం అవచ్చు. గతం మిమ్మల్ని వెంటాడుతుంది. లోగడ చేసిన ఓ మంచిపని వల్ల ప్రస్తుతం మేలు కలుగుతుంది. శారీరక ఇబ్బందులు ఎదురైనప్పుడు రేఖి, ఫెంగ్‌షుయ్ పద్ధతులను అనుసరించడం శ్రేయస్కరం. కలిసొచ్చే రంగు: నలుపు (లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఎప్పటినుంచో కలవాలనుకుంటున్న వ్యక్తిని కలుస్తారు. ఓ ప్రేమబంధంలో పడతారు. అవరోధాలను అధిగమించడానికి గట్టి ప్రయత్నం చేయండి. అందమైన కలలు కంటారు. ఊహాలోకంలో తేలిపోతారు. ప్రయాణంలో మీకు కొన్ని అవకాశాలు కలిసి వస్తాయి. పని ప్రదేశంలో ఒక్కసారిగా పాపులర్ అయిపోతారు. కలిసొచ్చే రంగు: పసుపు స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. వారమంతా క్షణం తీరుబడి లేనట్టు గడుపుతారు. మీరు సాధించిన విజయాలను, పనిలో మీ ఒడుపును చూసి తోటివాళ్లు ఆశ్చర్యపోతారు. ఎవరు, ఏ విధంగా మాట్లాడినా అంతగా పట్టించుకోకపోవడమే మంచిది. ఒక బంధం మిమ్మల్ని ఎంతో హాయిగా ఉంచుతుంది. జూన్ మూడున మీకు చాలా బాగుంటుంది. కలిసొచ్చే రంగు: పిస్తా గ్రీన్ శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ జీవితంలో అనూహ్యమైన మార్పులు వస్తాయి. ఉన్న ప్రదేశం నుంచి మారవచ్చు. ఈ మార్పులన్నీ మీకు మంచిని, స్థిరత్వాన్ని కలిగించేవే కావడం ఊరట కలిగిస్తుంది. గత స్మృతులు మిమ్మల్ని బాధిస్తాయి. అయితే వాటినుంచి నేర్పుగా బయట పడటం అవసరం. ఈ గురువారం లోగా మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. కలిసొచ్చే రంగు: క్రీమ్ కలర్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ జీవితంలో అల్లకల్లోలం సృష్టించే సంఘటనలన్నీ ముగిసినట్లే. ఇతరులకు మీ వైఖరి నచ్చక పోవచ్చు. ఎవరి కోసమూ మారనక్కరలేదని గ్రహించండి.సంగీతం, చిత్రలేఖనం మీకు సాంత్వన నిస్తాయి. మీ కోసం మీరు అధిక సమయం వెచ్చించండి. ముదురు ఎరుపు, నారింజ రంగులకు ఈ వారం దూరంగా ఉండండి. కలిసొచ్చే రంగు: తెలుపు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) మీ వారం మీరు చాలా రొమాంటిగ్గా గడుపుతారు. కెరీర్ పరంగా ఇది మంచి సమయం. అ భావోద్వేగాలను కలిగించే బంధాలనుంచి బయట పడటం ఎలాగో నేర్చుకోండి. మీ సహజ స్వభావం మీకు ఇక్కడ సాయపడుతుంది. ఆర్థిక వ్యవహారాలు మీకు ఉత్సాహాన్నిస్తాయి. వారాంతాన్ని విందు వినోదాలతో సంతోషంగా గడుపుతారు. కలిసొచ్చే రంగు: లేత గోధుమ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) వ్యవహారాలలో సమతౌల్యత పాటించండి. మనసును, శరీరాన్ని అదుపులో పెట్టుకోవడం మీకెంతో మేలు చేస్తుంది. పరిసరాలను కూడా అనుకూలంగా మారుస్తుంది. మీ జీవన గమ్యం ఎక్కడికన్నది మీ మనసును అడగండి. అప్పుడు మీకు మార్గాన్ని చూపిస్తుంది. మీరుండే ప్రదేశంలో ఆకుపచ్చటి మొక్కలను ఉంచండి... ముళ్లచెట్లు వద్దు. కలిసొచ్చే రంగు: లేత ఆకుపచ్చ ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. అనూహ్యమైన శుభవార్త ఒకటి మిమ్మల్ని ఆనందపరచవచ్చు. ఉద్యోగానికి చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. తొందరలోనే శుభవార్తని వినగలరు. కలిసి రానప్పుడు నిరుత్సాహం, కలిసొచ్చిన పక్షంలో అత్యుత్సాహం చూపద్దు. సకుటుంబంగా పరమేశ్వర దర్శనం చేసుకోండి. కలిసొచ్చే సంఖ్య 7. టారస్ (ఏప్రిల్ 21-మే 20) సంతానానికీ తలిదండ్రులకీ మధ్య విద్యావిషయంలోనూ, పై చదువుల్ని చదవడానికి వెళ్లాల్సిన స్థల విషయంలోనూ ఆర్థిక విషయంలోనూ మనస్పర్ధలేర్పడవచ్చు. వ్యాపార రంగంలోని వారికి నష్టాలు ఎదురు కావచ్చు. రుణదాతలనుండి ఒత్తిడులు పెరుగుతాయి. జాగరూకతగా లేకుంటే పరిస్థితులు మరింత వక్రిస్తాయి. కలిసొచ్చే సంఖ్య 5. జెమిని (మే 21-జూన్ 21) చిన్న పెట్టుబడులతో చేస్తున్న వ్యాపారం ఎండకాలంలో చెరువులా క్రమక్రమంగా క్షీణిస్తూ ఉండవచ్చు. రవాణా వ్యాపారస్థులకు ఆశించినంత ఆదాయం రాకపోవచ్చు. కింది స్థాయివారికీ పై అధికారులకీ సమన్వయ లోపం వల్ల ఈ ఇద్దరి మధ్యా ఇరుకున పడే ప్రమాదం ఉండవచ్చు. లౌక్యంగా నడవాల్సిన వారం ఇది. వాగ్దానాలు వద్దు. రుణాలనీయవద్దు. కలిసొచ్చే సంఖ్య 3. క్యాన్సర్ (జూన్22-జూలై 23) తాత్కాలికంగా వచ్చిన అనారోగ్యం మానసికంగా కుంగుదలకి గురి చేయవచ్చు. అనుకున్న ప్రతిపనీ వాయిదా పడుతూ లేదా సగమే పూర్తవుతూ ఉండచ్చు. గ్రహపరిస్థితుల దృష్ట్యా- మీకు సమర్థత ఉన్నప్పటికీ మీ మాట చెల్లుబడి కాకపోవచ్చు. దాన్ని అవమానకరంగా భావించకండి. ఇతరులకు సహాయపడగల వారం ఇది కాదని గ్రహించండి. కలిసొచ్చే సంఖ్య 9. లియో (జూలై 24-ఆగస్టు 23) తప్పక పూర్తి చేద్దామని నిర్ణయం తీసుకున్న పని కాస్తా మధ్యలో అడ్డు తిరిగి పనిని విరమించే స్థాయి వరకూ వచ్చి ఎట్టకేలకు పూర్తవుతుంది. సంతానానికి ఔషధ సేవ తప్పక పోవచ్చు. భార్యాభర్తల మధ్య మూడోవ్యక్తి ద్వారా భేదాభిప్రాయాలు తలెత్తవచ్చు. వీలయినంతవరకూ తక్కువ మాట్లాడుతూ ఓర్పుతో నడవ వలసిన వారం ఇది. కలిసొచ్చే సంఖ్య 5. వర్గో(సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) వివాహం స్థలం పొలం గృహం.. ఇలాంటివేవో ఒకటి కలిసి రావచ్చు. సంతానానికి మంచి కళాశాలలో ప్రవేశం లభించవచ్చు. బంధుమిత్రుల రాకతో ఇల్లు కళకళ లాడుతుంది. విదేశాలనుండి పై చదువుల నిమిత్తం లేదా సన్మానం చేసే నిమిత్తం ఆహ్వానం లభించవచ్చు. నిర్మాణరంగంలో ఉన్న వారికి తృప్తికరమైన ఆదాయం లభించవచ్చు. కలిసొచ్చే సంఖ్య 7. (లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) తీవ్రమైన ఆనందోళనతో ఒడిదుడుకులతో నడిచిన గత నెలకి పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ వారం. పెద్దలతో పరిచయాలూ వాటివల్ల కొన్ని సమస్యా పరిష్కారాలూ కావచ్చు. వాహనాన్ని కొనుక్కునే అవకాశం ఉంది. వివాహం లేదా గృహప్రవేశం వాయిదా పడవచ్చు. ఇంట్లో పెద్దలకి అనారోగ్య సూచనలున్నాయి కాబట్టి జాగరూకత వహించక తప్పదు. కలిసొచ్చే సంఖ్య 4. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఇంటిలో మీకంత గుర్తింపు ఈ వారంలో మీకు లభించకున్నా, మీకు మీ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో విశేష గౌరవం లభిస్తుంది. ప్రయోజనాత్మకమైన ప్రయాణాలనే చేస్తారు. పెద్దల పరిచయంతో ఎదగ దలుస్తారు. చేస్తున్న ఉద్యోగంలో కలిగే కీర్తిప్రతిష్ఠల ద్వారా స్థలాన్ని మార్పు చేసుకోవలసిన అవసరమేర్పడుతుంది. కలిసొచ్చే సంఖ్య 6. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీ మాట తీరువల్ల కొందరు మిత్రులూ అయినవాళ్లూ దూరం కావచ్చు. ఈ వారం స్వయం నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలం కాదు కాబట్టి, వీలయినంతవరకూ నిర్ణయాన్ని వాయిదా వెయ్యండి. కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయడానికి అనుకూలం కాదు. రుణాల వసూలులో మృదువుగా వ్యవహరించండి. ఘర్షణ సరికాదు. కలిసొచ్చే సంఖ్య 6. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీకెంతో పలుకుబడి ఉన్నా అనుకూలం కాని ప్రదేశానికి బదిలీ జరగొచ్చు. వ్యాపారం బాగానే జరుగుతున్నా,పెద్దగా లాభార్జన ఉండకపోవచ్చు. వ్యాపారం లేదా వృత్తిద్వారా పెట్టుబడికి తగ్గ ఆర్జన లేక వృత్తి వ్యాపారాలకి స్వస్తి పలకాలనే ఆలోచన రావచ్చు. అయితే ఒక నెలపాటు వాయిదా వెయ్యండి ఆలోచనని. కలిసొచ్చే సంఖ్య 7. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) వినోద పర్యటనలూ, తీర్థయాత్రలూ దైవదర్శనాలూ చేస్తారు. అనాథాలకీ రోగులకీ ఆర్తులకీ యథాశక్తి సహాయపడతారు. కొత్తకొత్త వ్యాపార ప్రణాళికలు మీ తలుపు తట్టి అంతలోనే అదృశ్యమైపోతూ ఉండవచ్చు. ఒక కుటుంబంలోకానీ సంస్థలో గాని వచ్చిన పొరపచ్చాన్ని మీ మాట నేర్పరితనంతో తొలగేలా చేసి గొప్ప గుర్తింపుని పొందుతారు. కలిసొచ్చే సంఖ్య 2. పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) కష్టం వచ్చినా ధైర్యంగా నిలబడతారు. రావలసిన రుణాలని వసూలు చేసుకోగలుగుతారు. పరిస్థితికి తగినంత నేర్పరితనం మీ సొత్తయిన కారణంగా మీకు ఈ వారం మొత్తం అనుకూలమే. వైదికమైన సంస్కారాలేమున్నాయో ఆ అన్నిటినీ ఆచరింప లేకున్నా కొన్నిటిని పాటించి అందరికీ మార్గదర్శకులౌతారు. కలిసొచ్చే సంఖ్య 4. మైలవరపు శ్రీనువాసరావు -
మే 16 నుంచి మే 22 వరకు
టారో బాణి ఏర్పరచుకున్న లక్ష్యాలను అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఒత్తిడితో కూడిన పరిస్థితులను ఎదుర్కొంటారు. బాధ్యతాయుతంగా పనిచేయడం అనేది పనిలో మీ విజయసూత్రంగా పనిచేస్తుంది. ప్రేమవ్యవహారాలు సాఫీగా సాగుతాయి. అయితే ప్రేమలో నిజాయితీగా ఉండటం ముఖ్యమని గుర్తుంచుకోండి. కలిసి వచ్చే రంగు: రూబీ రెడ్ కొత్త సవాళ్లు ఎదురవుతాయి. మొదట కాస్త ఇబ్బంది పడినా... చివరకు వాటిని చేధించడంలో విజయం సాధిస్తారు. కాస్త ఒత్తిడికి గురవుతారు. అభివృద్ధి నెమ్మదిగా సాగుతుంది. ప్రేమిస్తోన్న వ్యక్తికీ మీకూ మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కొన్ని సమస్యల్ని పరిష్కరించుకోవడానికి సమయం పట్టవచ్చు. కలిసి వచ్చే రంగు: నీలం గత విషయాలను తలచుకోవడం వల్ల వేదనకు గురవుతారు. అయితే మీలోని అంతర్గత శక్తి, నిపుణుల సలహాల వల్ల ఉత్తేజం పొందుతారు. కొత్త శక్తిని పుంజుకుంటారు. మీకు ఉన్న పరిమితులను గుర్తించండి. ఏది ముఖ్యమో చూసుకోండి. ప్రవర్తనను మార్చుకోవడం ద్వారా ఇతరులతో మీ సంబంధాలను మెరుగు పరుచుకోవచ్చు. కలిసొచ్చే రంగు: ముదురు ఆకుపచ్చ ఆత్మీయ అనుబంధాలు మీ జీవితంలో ముఖ్యమైన భాగం అవుతాయి. ప్రేమానందాల ఇంద్రధనుస్సు వెల్లివిరుస్తుంది. చేస్తున్న పనిలో విజయం సిద్దిస్తుంది. మీ ప్రణాళికల్ని కొన్ని సందర్భాల్లో మార్చుకోవాల్సి రావచ్చు. కొన్ని పనుల్లో కొన్ని మార్పులు అవసరమవుతాయి. ఆ మార్పులను వేగవంతం చేస్తారు. కలిసి వచ్చే రంగు: బ్రౌన్ వ్యాపారానికి సంబంధించి తీసుకోవాల్సిన నిర్ణయాల విషయంలో ధైర్యంగా ముందడుగు వేస్తారు. కొన్ని ఇబ్బందులు ఎదురైనా ముందుకు దూసుకు పోతారు. బిజీగా గడుపుతారు. బిజినెస్ ట్రిప్‌లు చేస్తారు. కాస్త రిస్క్ తీసుకోవడానికి ధైర్యం చేస్తే మీరనుకున్న పనులు సాధించగలరు. కలిసివచ్చే రంగు: నీలం ఎన్నాళ్లుగానో మీలో ఉన్న ఓ కోరిక నెరవేరుతుంది. ఈ వారమంతా ఆహ్లాదంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు. పనికి సంబంధించిన కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక లబ్ధి చేకూరుతుంది. చేస్తున్న పనిలో ఎప్పటికప్పుడు సరికొత్త సవాళ్లు ఎదురవుతుంటాయి. మరింత కష్టపడాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సిన డబ్బులు చేతికందుతాయి. కలిసివచ్చే రంగు: ఆరెంజ్ మీలోని సహజసిద్ధమైన ప్రతిభను మెరుగుపర్చుకుంటారు. ఆర్థికభారం పెరుగుతుంది. అయితే ఖర్చులు తగ్గించుకోవడం వల్ల కాస్త ఉపశమనం పొందుతారు. కొన్ని పరిస్థితుల వల్ల మీ పనికి ఆటంకాలు ఏర్పడతాయి. సంయమనం పాటించడం ద్వారా సరియైన దారిని ఎంచుకునే అవకాశం లభిస్తుంది. లక్ష్యసిద్ధి చేకూరుతుంది. కలిసివచ్చే రంగు: పీచ్ ఈ వారమంతా సంతోషంగా గడుపుతారు. మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తాయి. ఆచి తూచి నిర్ణయం తీసుకోండి. పాత బకాయిలను క్లియర్ చేసుకుంటారు. ఖరీదైన వస్తువులు కొనే ప్రయత్నం చేస్తారు. మీ మీద మీకు ఉండే నమ్మకమే మీ విజయసూత్రంగా పనిచేస్తుంది. ఇతరులకు సహాయ పడటం ద్వారా మీకు మేలుకలుగుతుంది. కలిసివచ్చే రంగు: గులాబి వ్యాపారంలో కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిలో నుంచి అత్యత్తమమైన ఆలోచనను ఎంచుకుంటే లాభం చేకూరుతుంది. కొత్తగా శక్తి పుంజుకోవడానికి, ఉత్తేజితం కావడానికి ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఎదురుకావచ్చు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కలిసివచ్చే రంగు: ఇటుకరాయి రంగు. ప్రతి పనినీ ఉత్సాహంగా చేసుకుంటూ పోతారు. మిమ్మల్ని మీరు నిరూపించుకోవడానికి ఇతరులతో పోటీ పడతారు. అన్నింటా మెరుగైన ప్రతిభను కనబరుస్తారు. ఏవైనా కొత్త నిర్ణయాలు తీసుకుంటే వాటిని అమలుచేయడానికి ఇది కలిసొచ్చే వారం. కాబట్టి ఏమాత్రం సంకోచించకుండా నిర్ణయాలు తీసుకోండి. కలిసివచ్చే రంగు: పీచ్ ఇది మీకు కలిసొచ్చే సమయం. అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. చేయాలనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు ఈవారం బాగా కలిసొస్తుంది. పనికి సంబంధించిన అవకాశాలు వెల్లువెత్తుతాయి. కలిసివచ్చే రంగు: కాఫీ బ్రౌన్ ప్రయాణాలు చేస్తారు. కొత్త కోర్సు చేయడమో, కొత్త పని ప్రారంభించడమో చేస్తారు. అన్ని విషయాల్లోనూ కొత్తదనానికి ప్రయత్నిస్తారు. జ్ఞానాన్ని పెంచుకోవడానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. పనికి సంబంధించి మీ పరిధిని విస్తృతం చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ ప్రతిభ మిమ్మల్ని మరింత పాపులర్ చేస్తుంది. కలిసొచ్చే రంగు: లేత గోధుమరంగు విద్యార్థులకి అనుకూల కాలం ఇది. ఉద్యోగస్థులు పై పదవులకి ఆశించదగిన కాలం కూడా ఇది. కలిసొచ్చే ప్రయాణ సూచనలున్నాయి. అయితే, శనిదోషం ఉన్న కారణంగా ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఆర్థిక వ్యవహారాల్లో స్పష్టమైన అవగాహన లేకుండా దిగడం అంచనాలని తలకిందులు చేస్తుంది. నీలి రంగు దుస్తుల్ని వారంలో ఒకరోజైనా ధరించండి. కలిసి వచ్చే రోజు 16వ తేదీ అంటే నేడే. ఎవరికో సానుభూతి మీద సహాయాన్ని చేయదలిచి ‘అతి’కి పోయే పరిస్థితి కన్పిస్తోంది. అది సరికాదు. ముఖ్యంగా స్త్రీ విషయంలో మరింత ప్రమాదమని గ్రహించాలి. నిరుద్యోగులు ఉద్యోగం కోసం గట్టిగా ప్రయత్నించాలి. ఆవేశంలో మాట్లాడే మీ మాటలు వక్రీకరింపబడి మరీ వెళ్లే అవకాశముంది కాబట్టి మాటని అదుపు చేసుకోండి. తెల్లని దుస్తుల్ని వారంలో ఒకరోజైనా ధరించండి. బుధవారం అనుకూలంగా ఉంది. మీకు మీరు చక్కని జీవిత పాఠాన్ని నేర్చుకునే వారం ఇది. ఒకప్పుడు చేసిన వాగ్దానం మిమ్మల్ని ఇబ్బందిలో పడేయవచ్చు. ఏ మాత్రమూ వెనుకాడకుండా ‘అది సాధ్యపడ’దనే విషయాన్ని నిజాయితీగా అంగీకరించండి. ఉద్యోగంలో సరదాతనం, అశ్రద్ధ వద్దే వద్దు. తగినంతగా ఉండండి - ఇతరుల్ని ఉంచండి. బుధవారం మంచిది. తెలుపు దుస్తులు వారానికి రెండు రోజులు (2/7) ధరించాలి. ఎంత ధైర్యంగా ముందుకు వెళ్తారో అంత పిరికితనంతోనూ వెనక్కి రావచ్చు. వివాదాలకి దూరంగా ఉండండి. మనశ్శాంతి లభిస్తుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోనని తెగేసి చెప్పండి. సంతోషకరమైన వార్తలు వింటారు. స్థిరాస్తుల వివాదాలలో, స్థిరాస్తిని సాధించే ప్రయత్నంలో విజయం సాధిస్తారు. వారంలో మూడురోజులపాటు నలుపు, నీలం కలిసిన దుస్తులు ధరించటం శ్రేష్ఠం. శనివారం అనుకూలం. వ్యవసాయ, వ్యాపార రంగాల వారికి ఎలా పెట్టుబడులు పెట్టాలో స్వయంగా కాలం చెప్పిన పాఠాలని ఒంటబట్టించుకునే వారం ఇది. ధైర్యంగా ముందుకి సాగండి. నిశ్చితార్థాలు, వివాహాలు వంటివి జరిగే అవకాశముంది. మీరు చేసిన ఒకప్పటి తప్పుల్ని తిరిగి చేయకండి. చేతిలో ఉన్న ధనాన్ని ఖర్చు చేయకండి. తెల్లని వస్త్రాలు ఈ వారంలో ఒకసారయినా ధరించడం మంచిది. గురువారం అనుకూలం. ఎప్పటికి సరిపోయిన ఆలోచనని అప్పుడు చేసేసి ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. శాశ్వత ప్రణాళికని మీ భార్య/ భర్తతో సంప్రదించి వేసుకోండి. సంసారంలోనికి మూడో వ్యక్తి చేరకుంటే ముక్తి - చేరితే విరక్తి అని గ్రహించి మీ ఉభయులే ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. మీ కంటే రెండు లేదా మూడు రెట్ల వయసువారి అనుభవాల్ని తీసుకుంటూ ఉండండి. ఎరుపు రంగు దుస్తులు (2/7) వాడండి. సోమవారం అనుకూలం. మీ పట్టుదల తాత్కాలికంగా మంచిని కలిగించవచ్చు. కాని అది శ్రుతి మించిన పక్షంలో వ్యతిరేక ఫలితాన్నిస్తుందని గమనించి, అడుగుని కొద్దిగా సడలించండి. తెలివిగా వ్యవహరించండి. కుటుంబ విషయాల్లో న్యాయస్థానపు తలుపుని తట్టవద్దు. ఇప్పటికే వెళ్లి ఉన్నట్లయితే, రాజీ మార్గాన్ని అన్వేషించండి. సంతానపు చదువు విషయంలో శ్రద్ధ పెట్టండి. ఎరుపు రంగు దుస్తులు (1/7) ధరించండి. శుక్రవారం అనుకూలం. చక్కని తెగింపు మీకు లభించినందుకు సంతోషించండి. మీ సమత్వ స్థితి మీకు సత్ఫలితాన్నే ఇస్తుంది. ద్రోహం చేయాలనే ఆలోచన లేని మీకు అంతా మంచే జరుగుతుంది. పై అధికారులు చెప్పింది చెయ్యండి తప్ప సూచనలనీ సలహాలనీ ఇయ్యాలని ప్రయత్నించ వద్దు. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. ఇది మీకు మంచి వారం. కలగలుపు రంగు దుస్తులు వాడండి. మంగళవారం తప్ప అన్ని రోజులూ అనుకూలమే. తేలికగా అయిపోయే పని చిక్కుముడులు పడి పడి శ్రమ మీద విజయవంతమౌతుంది. కొత్త ఉద్యోగం లభించవచ్చు కాని, ఆలోచించి మాత్రమే అంగీకారాన్ని తెలపండి. భార్యాభర్తల మధ్య పొరపొచ్చాలు ఈ వారంలో తొలగిపోకపోవచ్చు. నా భార్య/ నా భర్త అనుకుంటూ అభిమానాన్ని విడిచి మీరే పలకరించడానికి ప్రయత్నించండి. దుస్తుల్లో ప్రత్యేక నియమం లేదు. శుక్రవారం మంచిది. చేస్తున్న వ్యాపారం/ ఉద్యోగం/ వృత్తి ఏమంత ప్రోత్సాహకరంగా ఉండకపోవచ్చు. స్థలం, వృత్తి, ఉద్యోగం, వ్యాపారం మార్చవద్దు ఈ వారంలో. దానంతటదే కాలానుగుణంగా ఓ నిర్ణయం దైవం ద్వారా వస్తుంది. దాన్నే ‘అ-దృష్ట’మంటారు. ఇంట్లో ఒకరికి ఉద్యోగం/ వివాహం/ సంతానం కలిగే అవకాశముంది. పక్కవారి మాటల ద్వారా రెచ్చిపోకండి. నీలిరంగు దుస్తులు (1/7) వాడండి. గురువారం అనుకూలం. ఉద్యోగమనేది కుటుంబ పోషణ కోసమనుకోండి తప్ప, ఉద్యోగమే కుటుంబమనుకోకండి. అకాలనిద్ర, అకాలభోజనం, దూర ప్రయాణాలు ఉంటాయి. ఉద్యోగపు మార్పు, ఇంటి మార్పు, వద్దే వద్దు.‘ప్రతికూలత తీవ్రంగా ఉన్నా పైచేయి నాదే కదా’ అని అనుకోకండి. అంత ప్రతికూలత ఎందుకుండాలి? అని ఆత్మపరీక్ష చేసుకోవలసిన వారం ఇదని గమనించండి. అన్ని రంగుల దుస్తులూ మంచివే. అన్ని రోజులూ అనుకూలమే. తగిన సమయానికి రుణం లభిస్తుంది. సరైన సమయంలో మీ కోరిక నెరవేరుతుంది. ఆందోళన వద్దు. దాంపత్యం అనుకూలంగా ఉంటుంది. ప్రభుత్వం నుండి రావలసిన బకాయిలు రావచ్చు. శుభకార్యాలకు ఖర్చు చేస్తారు. దానాలు, ధర్మాలు, దైవ పూజలు, తీర్థయాత్రలకి ఒక హద్దుండాలని గమనించండి. పసుపు రంగు దుస్తులు (2/7) శ్రేష్ఠం. ఆదివారం అనుకూలం. ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
మే 23 నుంచి మే 29 వరకు
టారో బాణి మెరుగైన విజయాలు సాధించడానికి ఇది సరైన సమయం. పనులు పూర్తి చేయడంలో గతంలో కంటే ఉత్సాహంగా ఉంటారు. ఒక వ్యక్తి నుంచి సహాయం లభిస్తుంది. సంబంధ బాంధవ్యాల విషయంలో, వాటిని కాపాడుకునే విషయంలో ఒకింత ఒత్తిడికి గురవుతారు. చిన్నపనుల కోసం అధిక శ్రమ అక్కర్లేదు. కలిసి వచ్చే రంగు: ఎమరాల్డ్ గ్రీన్ అనుకోకుండా ఎదురయ్యే ఒక సంఘటన మిమ్మల్ని జీవితంలో ముందుకు తీసుకెళుతుంది. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడులకు మించిన లాభాలు అందుకుంటారు. ప్రతి సమస్యను పరిష్కరించుకుంటారు. అందరికీ మీ పనితనం తెలిసేలా చేస్తారు. ప్రేమ వ్యవహారాలు మంచి మలుపు తిరుగుతాయి. కలిసి వచ్చే రంగు: ఊదా రంగు విజయానందాలు మీ సొంతమయ్యే కాలం. ఆశావహదృక్పథంతో వ్యవహరిస్తారు. ఆర్థిక అంశాలకు సంబంధించి మీకు బాగా ఆనందం కలిగించే వార్త ఒకటి తెలుస్తుంది. ప్రతి విషయానికీ పలు ఆప్షన్లు మీ ముందు కనిపిస్తాయి. ఎంపిక విషయంలో కన్ఫ్యూజ్ అవకుండా ఆచితూచి అడుగేయండి. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కలిసి వచ్చే రంగు: లేత నీలం కొత్త అవకాశాలు తలుపు తడతాయి. ‘విభిన్నమైన ప్రపంచంలో ఉన్నాను’ అనే భావనకు గురవుతారు. మీ జ్ఞానం, వైవిధ్యభరిత ఆలోచనల వల్ల మంచి అవకాశాలు అందుకుంటారు. సహచరులతో వాదనకు దిగే పరిస్థితి రావచ్చు. అయితే ఆ వాదనను వ్యక్తిగతంగా తీసుకోవద్దు. ఒత్తిడికి దూరంగా ఉండండి. ఔట్‌డోర్ స్పోర్ట్స్‌కు ప్రాధాన్యత ఇవ్వండి. కలిసి వచ్చే రంగు: సిల్వర్ కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ముఖ్యమైన డాక్యుమెంట్లపై సంతకాలు జరుగుతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ప్రేమ విషయాలు కొంత ఇబ్బంది పెడతాయి. బంధుమిత్రులతో అపార్థాలను తొలగించుకోవడం మంచిది. గొంతుకు సంబంధించిన సమస్యలు రావచ్చు. కలిసివచ్చే రంగు: ఆరెంజ్ అనుకోని అవకాశాలు మీ దరికి వస్తాయి. మీ కలలు నిజమవుతాయి. ఒక వ్యక్తి మిమ్మల్ని ఆకట్టుకుంటారు. ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి. ‘రిస్క్’ అనుకొని వెనకడుగు వేయడానికి ప్రయత్నించిన పనులు సైతం అనుకూల ఫలితాన్ని ఇస్తాయి. మీరు బాగా ప్రేమించే ఒక వ్యక్తిని కలుసుకుంటారు. కలిసి వచ్చే రంగు: లేత గోధుమ మీ కమ్యునికేషన్ స్కిల్స్ మిమ్మల్ని విజయపథం వైపు నడిపిస్తాయి. ముఖ్యమైన పనులు ప్రారంభించడానికి ఇది అనుకూల సమయం. పనిలో ప్రతిభ చూపి ప్రశంసలు అందుకుంటారు. సమావేశాల్లో మీ ప్రతిభ గురించి అందరూ మాట్లాడుకుంటారు. వెన్నునొప్పి, మైగ్రెయిన్స్ లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. కలిసివచ్చే రంగు: గులాబి అనుకోకుండా కొన్ని సమస్యలు ఎదురవుతాయి. అయితే మీకున్న ఆత్మవిశ్వాసంతో ఆ సమస్యలను పరిష్కరించుకుంటారు. పెట్టుబడులకు ఇది అనుకూలమైన సమయం కాదు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఏవైనా కళల మీద మనసు పెట్టండి. తద్వారా సంతోషంగా ఉంటారు. వీలైనంత వరకూ ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు: గ్రే ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తాడు. కొత్త బంధాలు సంతోషాన్ని ఇస్తాయి. అంతరాత్మ చెప్పినదాని ప్రకారం నడుచుకోండి. పనికి సంబంధించి కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. ఆర్థికపరిస్థితిని మెరుగుపరుచుకుంటారు. బయటి వాతావరణం శరీరానికి సరిపడకపోవచ్చు. కలిసి వచ్చే రంగు: బ్రైట్ గ్రీన్ మీ మనసుకు దగ్గరయ్యే వ్యక్తిని ఇప్పటి వరకు మీరు కనుక్కోలేకపోతే, ఆ వ్యక్తిని ఎంచుకోవడానికి తగిన సమయం. మీలోని సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభించే సమయం కూడా. గాసిప్లను పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఒకవేళ వాటికి ప్రాధాన్యత ఇస్తే, మీ పనికి ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. కలిసివచ్చే రంగు: ఆరెంజ్ మీ చుట్టూ ప్రేమ పూరితమైన వాతావరణం కనిపిస్తుంది. జీవితం, ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఆత్మశోధన చేసుకుంటారు. మీ నిర్వహణా సామర్థ్యానికి మించి పనిలో మీకు కొత్త బాధత్యలు వచ్చి పడతాయి. కొన్నిరోజులుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. కలిసి వచ్చే రంగు: బ్రౌన్ ఈ వారమంతా సరదా మూడ్‌లో ఉంటారు. ఉల్లాసంగా గడుపుతారు. ఒక తోడు కోసం అన్వేషించేవారికి ఇది తగిన సమయం. పరిస్థితుల మార్పు గురించి ఆలోచిస్తారు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. అయితే బ్యాక్‌పెయిన్ బాధించవచ్చు. అన్ని విషయాల్లోనూ మీ అంతరంగం చెప్పేదాన్ని వినడం ఉత్తమం. కలిసి వచ్చే రంగు: లేత నీలం ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఆర్థికంగా బాగా ఉన్నామని ఖర్చుల్ని పెంచుకోకండి. శారీరకంగా బాగున్నామనే ఆలోచనతో ఆహార విహారాదుల్లో పరిమితిని దాటకండి. ఉద్యోగపరంగా ప్రోత్సాహకరంగానే ఉంది కదా అని కింది ఉద్యోగులతోనూ పై అధికారులతోనూ అలాగే సహోద్యోగులతోనూ వివాదం తెచ్చుకోవద్దు. వారంలో ఒక్కరోజైనా గోవులకి పచ్చగడ్డిని పెట్టించండి. ఇంటికొచ్చిన మూడోవ్యక్తి కారణంగా కుటుంబంలో అనైకమత్యం తలెత్తవచ్చు. వ్యాపారంలో భాగస్వాములతో కొద్దిగా వాదవివాదాలు వృత్తి ఉద్యోగాల్లో మనఃస్పర్థలు తలెత్తవచ్చు. ఇలాంటి సంఘటనలు రాబోతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలనే ముందు జాగ్రత్తతో ఉండటం మంచిది. వారంలో రెండు రోజుల పాటైనా గోవులకి చక్కని పండ్లని ఇప్పించండి. ప్రతి పనీ వాయిదా పడుతూ, భార్యాభర్తలు ఐకమత్యంతో లేకుండా, కుటుంబ రహస్యాలు పక్కవారికీ బంధువులకీ చేరుతూ ఈ వారమంతా నిర్వేదంతో నిరాసక్తతతో ఉండవచ్చు. ఇది తాత్కాలిక ఘర్షణం మాత్రమే. ఉద్యోగపు మార్పు స్థానచలనం, అద్దెఇంటి మార్పు వస్తే తప్పక మారండి. గోవులకి ఇష్టమైన కుడితిని గోశాలకి వెళ్లి పెట్టించండి. కాలం నేర్పిన అనుభవం దృష్ట్యా వేటికి దూరంగా ఉండాలో, ఎవరిని దూరంగా ఉంచాలో మీకు బాగా అర్థమైన కారణంగా అలాగే ప్రయాణించండి. ఎంతటి దగ్గరవారొచ్చి అడిగినా హామీలనీ వాగ్దానాలనీ రుణాలనీ పూర్తిగా మానండి. మీకు కలిగిన సంతోషాన్ని కూడ లోపలే దాచుకోవలసిన వారం ఇది. గోవులకి ఆకుకూరల్ని పెట్టించండి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి కావలసిన అన్నింటినీ సమకూర్చుకోండి. దూర ప్రయాణాలు చేయవలసివచ్చినా నష్టమపోతామేమోననే భయం వద్దు. దాన ధర్మాలతో పాటు, పిల్లలు చదువుల్ని అశ్రద్ధ చేయకుండా చేసుకుంటూ ఉండండి. ఒక్క ఆవుకైనా ఈగ/దోమ బాధ లేకుండా దోమతెరని అందించండి. భార్యాభర్తల ఐకమత్యానికున్న గట్టిదనం ముందు ఉక్కుసౌధాలు కూడ పెళుసే అనే విశేషాన్ని స్వయంగా గమనిస్తారు. సరైన సమయానికి భోజనం, నిద్ర అనేవాటిని చూసుకుంటూ అనారోగ్యం ప్రవేశించకుండా జాగ్రత్త పడండి. మద్యం, జూదం వంటివాటిని మానే ప్రయత్నం ప్రారంభించండి. సంతాన అభివృద్ధి కోసం గోవులకి పచ్చికూరముక్కల్ని పెట్టించండి. మిమ్మల్నీ మీ జీవితాన్నీ గురించి వ్యక్తిగతంగా మీకు మీరు ఒక్కసారి ఆలోచించుకోండి. యంత్రాలూ వాహనాల విషయంలో తగినంత జాగ్రత్తతో వ్యవహరించండి. మీవైపు నుండే కాకుండా మీరు ఎవర్ని శత్రువులుగా చూస్తున్నారో వారివైపు నుండి ఆలోచించండి ఏకాంతంలో. అంతా సవ్యమౌతుంది. గోవులకి ఆరోగ్యకరమైన నీటిని వారం రోజులపాటు అందించండి. అందరూ మీ మాట కాఠిన్యానికి భయపడి గౌరవిస్తున్నారేమో గమనించుకోండి. నిదానమైన మాట పదిమందిని దగ్గరికి రానిస్తుందని గ్రహించండి. చిన్నపాటి వైద్యపరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. తీసుకున్న రుణం ఒకపక్క నిదానంగా ఖర్చు అయిపోతోందేమో (రుణం తీసుకున్న పనికి కాక) పరిశీలించుకోండి. గోవులకి తెలకపిండిని అందించండి. ఆశించిన ఉద్యోగం ఇదుగో! అంటూ దూరదూరం జరిగిపోతూండవచ్చు. మీ ఏకపక్ష నిర్ణయం కారణంగా బంధుమిత్రులు వ్యతిరేకులయ్యే ప్రమాదమూ ఉండవచ్చు. వివాహమయ్యాక కూడ తల్లిదండ్రులకీ అలాగే అన్నదమ్ముల మాటలకే ప్రాధాన్యాన్నిస్తున్నారేమో ఆత్మపరీక్ష చేసుకుని మిమ్మల్ని మీరు సరిదిద్దుకోండి. గోవులకి వైద్యపరీక్షలు యథాశక్తి చేయించండి. రోజులు దొర్లిపోతున్నాయనే సంతృప్తితో వ్యాపారాన్ని విస్తరింపజేయడం లేదేమో గమనించుకోండి. మాట పట్టుదల కారణంగా పెద్దల్ని దూరం చేసుకున్నామేమో ఆలోచించి సాన్నిహిత్యం కోసం ప్రయత్నించండి. గోవులకి ఎండ బాధ లేకుండా ఉండే నూనెకి సొమ్ముని అందించండి. మీకు మీరుగా నిర్ణయాన్ని తీసుకోకుండా పై అధికారి సూచనలు ఆజ్ఞలనే పాటించండి. మీరు ఏ పొదుపు లేదా వ్యయం చేయదలచినా భార్య/భర్తకి ముందుగా తెలియజేయండి. వివాహం కొత్త ఇంటి కొనుగోలు స్థలం మొదలైనవాటి కొనుగోలు విషయంలో ఒకరికిద్దర్ని సంప్రదించి మరీ తీసుకోండి. గోవులకి మీకు తోచిన సేవ చేయండి. పిల్లల చదువుల కారణంగా తాత్కాలికమైన ఆర్థిక భారం కలుగుతుంది. రుణాన్ని చేయడం తప్పుకాదని గ్రహించండి. ఉద్యోగంలో వచ్చిన పదవీ ఉన్నతి కారణంగా బాధ్యతలు పెరిగి కొంత పని ఒత్తిడి, అసహనం పెరుగుతాయి. రోజూ ప్రాణాయామాన్ని క్రమం తప్పక చేయండి. గోవులకి ఎండుగడ్డిని యథాశక్తి అందించండి. - డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
మే 9 నుంచి మే 15 వరకు
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) విదేశాల నుంచి మీరెంతో కాలంగా ఎదురు చూస్తోన్న ఓ శుభవార్త అందుతుంది. అసంపూర్తిగా ఉండిపోయిన ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి మార్గం సుగమం అవుతుంది. మీ విజయాలను చూసి కొందరు అసూయ పడవచ్చు. అది మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీస్‌ని నింపుతుంది. ఆ ప్రభావాన్ని తప్పించుకోవడానికి క్రిస్టల్స్‌ని ధరించండి. కలసివచ్చే రంగు: నలుపు టారస్ (ఏప్రిల్ 21-మే 20) అవకాశాలు విరివిగా లభిస్తాయి. దేన్ని ఎంచుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. ఎంపికలో జాగ్రత్త వహించండి. లక్ష్యాలను అందుకోవడానికి మీకు ఇది తగిన సమయం. ఆవేశంలో తీసుకునే నిర్ణయాలు ఇబ్బందుల్లోకి నెట్టే ప్రమాదం ఉంది. కాబట్టి కాస్త అప్రమత్తంగా ఉండండి. అవివాహితులకు వివాహ సూచన. కలసివచ్చే రంగు: క్రీమ్ వైట్ జెమిని (మే 21-జూన్ 21) అన్ని విషయాల్లోనూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ప్రతి పనిలోనూ సత్ఫలితాలు పొందుతారు. పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. బాధపెట్టే బంధాలను బలవంతంగా భరించకుండా ఓ మంచి నిర్ణయం తీసుకోవడం మంచిది. తద్వారా మీ జీవితంలో మంచి మార్పు వస్తుంది. కలసివచ్చే రంగు: బంగారువర్ణం క్యాన్సర్ (జూన్22-జూలై 23) ఈ వారంలో మీ జీవితంలోను, ఇంటిలోను, ఆరోగ్యంలోనూ కూడా ఊహించని మార్పులు వస్తాయి. కాస్త ఇబ్బందిపెట్టే ఈ మార్పులకు మీరు సిద్ధంగా ఉండండి. ఆర్థికపరంగా ఏర్పడిన వెలితిని పూడ్చటానికి కాస్త కష్టపడాల్సి వస్తుంది. అప్పులు మాత్రం చేయకండి. దిగులుగా అనిపించినా కుంగిపోకండి. త్వరలో మంచి రోజులొస్తాయి. కలసివచ్చే రంగు: వెండి రంగు లియో (జూలై 24-ఆగస్టు 23) మీ జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి ప్రవేశిస్తారు. ప్రేమలోని మాధుర్యాన్ని మీకు రుచి చూపిస్తారు. వృత్తిపరంగా కూడా ఊహించని మార్పులు కలుగుతాయి. ఇబ్బందులొచ్చినా మీ నిజాయతీ మిమ్మల్ని కాపాడుతుంది. అనుకోని సహాయం అందుతుంది. వ్యాపారానికి పెట్టుబడి సమకూరుతుంది. ఆ తర్వాత మీ జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. కలసివచ్చే రంగు: పీచ్ విర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) ఒక గొప్ప అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాంటి అవకాశం మళ్లీ దొరకదు కాబట్టి జారవిడుచుకోవద్దు. సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఎంతోకాలంగా మీకు ఉన్న కొన్ని అలవాట్లు మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేస్తాయి. అధిగమించడానికి ధ్యానం చేయండి. ఆర్యోగంపై శ్రద్ధ అవసరం. ఒక వ్యక్తి మనసును మీరు గెల్చుకుంటారు. కలసివచ్చే రంగు: బ్రౌన్ లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ జీవితంలో ఓ పెనుమార్పు సంభవించబోతోంది. ఆ మార్పు మిమ్మల్ని విజయ శిఖరాలకు చేరుస్తుంది. బంధాలు కొద్దిగా బలహీనపడతాయి. జరిగేవాటిని మీరు ఆపలేరు కాబట్టి వచ్చినదాన్ని వచ్చినట్టు స్వీకరించడం మంచిది. అన్నీ పాజిటివ్‌గా తీసుకోవడం నేర్చుకోండి. అప్పుడే మనశ్శాంతిగా ఉండగలరు. కలసివచ్చే రంగు: వంకాయ రంగు స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఆలోచనల్ని ఆచరణలో పెట్టడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు. ఎందుకంటే మీరు త్వరలోనే ఓ కొత్త వ్యాపారం మొదలు పెట్టడమో, ప్రాజెక్టును చేపట్టడమో జరుగుతుందని టారో కార్డ్స్ సూచిస్తున్నాయి. అది సాధించాలంటే మీ పనిలో ఎవరైనా ఒక మహిళకు భాగస్వామ్యం కల్పించండి. తప్పక విజయం సాధిస్తారు. ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కలసివచ్చే రంగు: లేత ఊదారంగు సగిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) ఇంతవరకూ మెల్లగా సాగిన మీ జీవితం ఒక్కసారిగా పరుగందు కుంటుంది. ఆ వేగంలో ఎత్తులూ ఎక్కుతారు. పల్లాలకూ పడతారు. కానీ అన్నిటినీ దాటుకుంటూ అద్భుతంగా ముందుకు పోతారు. ఇది మీకు ఎంతో శుభసమయం కాబట్టి సవాళ్లు ఎదురైనా ధైర్యంగా స్వీకరించండి. విందులు చేస్తారు. వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రకు వెళ్లే అవకాశమూ ఉంది. కలసివచ్చే రంగు: ఇండిగో క్యాప్రికాన్ (డిసెంబర్ 22-జనవరి 20) ఈవారం మీరు వెలిగిపోతారు. ప్రమోషన్ రావడం కానీ, జీతం పెరగడం కానీ జరగవచ్చు. వ్యాపారాలు చేసేవాళ్లకు అవకాశాలు అంతగా రాకపోయినా టెన్షన్ పడక్కర్లేదు. త్వరలోనే మీరు ఆర్థికంగా బాగా పుంజుకునే సూచనలు కనిపిస్తున్నాయి. వారం చివర్లో అనుకోకుండా సంభవించే సంఘటనలు కాస్త కన్ఫ్యూజన్కు గురి చేయవచ్చు. కలసివచ్చే రంగు: ముదురు ఎరుపు అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) ఈవారం ఎన్ని సవాళ్లు ఎదురైనా కానీ వాటిని విజయవంతంగా అధిగమిస్తారు. మీకు నచ్చిన రంగంలో దూసుకుపోతారు. ఆర్థిక పురోగతి వైపుగా ప్రయాణిస్తారు. వారం చివర్లో కాస్త ఖర్చులు అధికమవుతాయి. ప్రేమ వ్యవహారాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రపోజల్స్ వస్తే ఆచితూచి నిర్ణయం తీసుకోండి. మీకు తగిన వ్యక్తి ఎవరో తెలుసుకుని ఓకే చెప్పండి. కలసివచ్చే రంగు: పీచ్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ప్రేమలో పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈవారం మీ ఆలోచనలు, నోటిమాటల మీదే మీ జీవితం ఆధారపడి ఉంటుంది. పాజిటివ్‌గా ఆలోచించినంత మాత్రాన సరిపోదు. మాట కూడా పాజిటివ్‌గా ఉండాలని గుర్తు పెట్టుకోండి. నోటి నుంచి నో అన్న మాట రాకుండా చూసుకోండి. అదే మిమ్మల్ని సమస్యల నుంచి గట్టెక్కిస్తుంది. విజయాలకు చేరువ చేస్తుంది. కలసివచ్చే రంగు: నీలం ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) అన్ని రంగాల వారికి వ్యతిరేక ఫలితాలుండవు. అయితే అభివృద్ధి కూడా ఉండదు. విద్యార్థులకి చదువు మీద శ్రద్ధ ఉన్నా తగిన సమయం లేక, వ్యవసాయదారులకి పెట్టుబడులున్నా తగిన సౌకర్యాలు లేక... ఇతర రంగాల వారికి కూడా పెద్దగా కలిసొచ్చే తీరు కనిపించకపోవచ్చు. దిగులు చెందకుండా లోపాన్ని గమనించుకొని మరింత ప్రయత్నాన్ని చేసుకోండి. కలసివచ్చేరోజు: ఆదివారం టారస్ (ఏప్రిల్ 21-మే 20) మొహమాటం కారణంగా నష్టపోవచ్చు. అనవసర ప్రయాణాలు, వ్యర్థమైన వాగ్వివాదాలు, ప్రయోజనం లేని చదువులకై ప్రయత్నాలు చేసే అవకాశం బాగా ఉంది. నిర్మాణరంగం వారికి నిరుత్సాహకరంగా, వినోదరంగం వారికి కొంత ప్రతికూలంగానూ ఉండొచ్చు. ఆరోగ్యం సహకరించకపోయినా ప్రయాణాలు చేయడం వల్ల శారీరక, మానసిక స్థైర్యం దెబ్బతినవచ్చు. కలసివచ్చేరోజు: సోమవారం జెమిని (మే 21-జూన్ 21) అపరిచితుల వల్ల నష్టపోయే అవకాశం ఉంది, అత్యాశ కారణంగా దెబ్బ తినే అవకాశం ఉంది. ముఖ్యంగా వాగ్దానం తప్పక విఫలమవుతుంది. కాబట్టి వీలైనంత వరకూ జాగ్రత్తగా ఉండండి. ఎవరికీ ఏ హామీని ఇవ్వవద్దు. సామాన్య ధోరణిలో అన్నమాట వజ్రాయుధంలా ముందునాటికి మారచ్చునని గ్రహించుకోవాలి. కలసివచ్చేరోజు: బుధవారం క్యాన్సర్ (జూన్22-జూలై 23) స్థిరమైన ఆస్తుల కోసం ప్రయత్నాలు చేస్తారు. అయితే ఆ పనులు వాయిదా పడుతూ పడుతూ మొత్తానికి వారాంతానికి ఓ కొలిక్కి రావచ్చు. పొరపాటున కూడా ఎవరికీ రుణం ఇచ్చి మోసపోవద్దు. సొమ్ము తిరిగిరాదు సరికదా శత్రుత్వం ఏర్పడవచ్చు. కాబట్టి ఆర్థికంగా వీలైనంత మెలకువతో ఉండాలి. కలసివచ్చేరోజు: శనివారం లియో (జూలై 24-ఆగస్టు 23) ఎక్కువ సమయం శ్రమ చేస్తూ ఆదాయం మాత్రం తక్కువ పొందుతారు. అయితే ఈ శ్రమ మరికొద్ది కాలం పిమ్మట సత్ఫలితాలను ఇస్తుంది. గతంలో జరిగిన తప్పుల్ని ఆత్మపరీక్ష చేసుకొని గమనించుకోగలుగుతారు. మీకు మీరే దిశానిర్దేశం చేసుకోగల సమర్థతను సంపాదించుకుంటారు. పదిమందిలో మంచి పేరును పొందుతారు. కలసివచ్చేరోజు: గురువారం విర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) పరిస్థితుల మీద స్పష్టమైన అవగాహన కలిగి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. కొత్త ప్రణాళికాలను ఏర్పర్చుకొని నమ్మకమైన వ్యక్తులతో ముందుకు సాగుతారు. స్థిరమైన ఆస్తుల్ని అమ్మదలచినా కూడా వెనకడుగు వేయడం సరైన నిర్ణయమే. ఆరోగ్య విషయంలో పూర్తి జాగ్రత్తలను పాటించండి. వ్యాధిభయం, ప్రాణభయం లేదు కానీ, అప్రమత్తతతో వ్యవహరించాలి. కలసివచ్చేరోజు: బుధవారం లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఏ పని ప్రారంభించినా ఒకటికి రెండు మార్లు ఆలోచించడం అవసరం. పెద్దలను, అనుభవజ్ఞులను సంప్రదించాల్సిన సమయం ఇది. వ్యతిరేక ధోరణుల్ని విడనాడి సానుకూలంగా ఆలోచిస్తే మానసిక ఆందోళన ఉండదు. తాత్కాలిక ప్రయోజనాల మీద దృష్టిని పూర్తిగా మానుకోండి. ఉద్యోగస్థులు శ్రద్ధతో లేని పక్షంలో వ్యతిరేక ఫలితాలనీయవచ్చు. కలసివచ్చేరోజు: మంగళవారం స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) అనవసర కోపం, పట్టుదల, తొందరతనపు మాట, జరిగిన విషయాలనే తవ్వుకోవడం, మాటకి మాట చెప్పడం వల్ల మీ వ్యాపారం, ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. పరిశ్రమల రంగంలో ఉన్న వారు అపరిచితుల్ని ఎంత దూరంలో ఉంచాలో, ఎంతగా మాట్లాడాలో అలా వ్యవహరించడం చాలా అవసరం. కలసివచ్చేరోజు: శుక్రవారం సగిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) అన్నీ అనుకూలంగానే కనిపిస్తాయిగాని అవి అన్నీ కూడా కనిపించినంత సులభమైన అంశాలు కావని గ్రహించుకోవాలి. భార్యాభర్తల మధ్య అవగాహన అతి ముఖ్యమని గమనించుకొని తగు మాత్రపు గుంభనతో ఉండాలి. వాహనాల విషయంలో, యంత్రపరికరాల విషయంలో పూర్తి భద్రత పాటించండి. ధనాన్ని ఒక పద్ధతి ప్రకారం ఖర్చు చేసుకోవాలి. కలసివచ్చేరోజు: గురువారం క్యాప్రికాన్ (డిసెంబర్ 22-జనవరి 20) గడచిన నెల మొత్తం ఎలా స్తబ్దతతో ఉందో అదే తీరుగా ఈ వారం కూడా ఉంటుంది. పెద్దగా ఆదాయం ఉండదు. శుభవార్తకోసం చూసే ఎదురు చూపుతో ఈ వారం గడిచిపోతుంది. స్థలం మార్పు చేయకుండా, భాగస్వాములతో విరోధించకుండా మరింత సంపాదించాలనే దృష్టికి పోకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఈ వారం సంతానానికి అవకాశం ఉంది. కలసివచ్చేరోజు: గురువారం అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) మానసికంగా అధైర్యంతో ఉన్న పనుల్ని విజయవంతంగా సాధించి బయటి కొస్తారు. మోసపోయే పరిస్థితుల్ని గమనించుకొని తప్పించుకోగలుగుతారు. పరుల విషయాలకి ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. శత్రువుల గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా మీ పనిని మీరు చేసుకుంటూ వెళ్లండి. సమయ నియమాన్ని పాటిస్తూ పనుల్ని పూర్తి చేసుకుంటే ఈవారం మీకు బాగా కలిసివస్తుంది. కలసివచ్చేరోజు: సోమవారం పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) ‘ఏ పనులూ పూర్తి కావడం లేదు-అలాగని ప్రారంభం కాకుండానే లేవు’ అనే నిరుత్సాహంతో ఉండొచ్చు. అయితే శాస్త్రం ఇక్కడ చెప్పేదొక్కటే ‘వ్యతిరేక ఫలితం కనిపించక పోవడమే అను కూల ఫలితం’ అని. కుటుంబంలో శుభకార్యం జరగవచ్చు. కుటుంబానికి వస్తు వాహనాలు కొనుగోలు చేయ వచ్చు. పనులు నిరాటంకంగా సాగడం కోసం మరో వ్యక్తిని సహాయం కోరండి. కలసివచ్చేరోజు: శనివారం డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు