వారఫలాలు(3 డిసెంబర్‌ నుంచి 9 డిసెంబర్‌ 2017 వరకు) | varaphalalu | Sakshi
Sakshi News home page

వారఫలాలు(3 డిసెంబర్‌ నుంచి 9 డిసెంబర్‌ 2017 వరకు)

Published Sun, Dec 3 2017 12:46 AM | Last Updated on Sun, Dec 3 2017 1:37 AM

varaphalalu - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. బం«ధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు ఉండవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఎటువంటి కార్యక్రమమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌కు కుడుములు నివేదించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి.సభలు, సమావేశాలకు హాజరవుతారు. ఊహించని విధంగా ఉద్యోగావకాశాలు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలకు పట్టింది బంగారమే. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
రుణ విముక్తులవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
వీరికి అన్నీ విజయాలే దక్కుతాయి. ఆర్థికంగా గతవారం కంటే మెరుగైన పరిస్థితి. లక్ష్యసాధనలో కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు సన్మానాలు,అవార్డులు రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌కు అర్చనలు చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్‌ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఖర్చులు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, లేతనీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం చేయించుకోండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము కొంతవరకూ అందుతుంది. ఇతరులకు సైతం సహాయం అందిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. నేరేడు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనుల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతజ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త మిత్రుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. విందువినోదాలలో పాల్గొంటారు.  సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. కళాకారులకు శుభవార్తలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. గులాబి, లేత ఎరుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి పులిహోర నివేదించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులు కాస్త తీరతాయి. ఆప్తులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూలం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రావచ్చు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. నీలం, లేత పసుపు రంగులు.  పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోతాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి కొంత పెరిగే అవకాశం. గత స్మృతులు నెమరువేసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనుకోని ఖర్చులు. గులాబి, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో (3 డిసెంబర్‌ నుంచి 9 డిసెంబర్, 2017 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ఈవారం ఓ శుభవార్త వింటారు. మీరు ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన ఓ పని విజయవంతంగా పూర్తవుతుంది. కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ ఉత్సాహమే మిమ్మల్ని మరిన్ని గొప్ప విజయాల వైపుకు తీసుకెళుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేస్తారు. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి.

కలిసివచ్చే రంగు : పసుపు వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం ఇదే. వృత్తి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల వల్ల కాస్తంత ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. మీదైన పంథాలో ప్రశాంతంగా పనిచేసుకుంటూ వెళ్లండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ఒత్తిడిని జయించడానికి విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. ఈ పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది.
కలిసివచ్చే రంగు : ఊదా

మిథునం (మే 21 – జూన్‌ 20)
వృత్తి జీవితంలో ఓ కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. అందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉండండి. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. మీదైన ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం. మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న గొప్ప విజయం దగ్గరలోనే ఉంది. ఆ విజయానికి చేరువయ్యేందుకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి.  ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీతోనే ఉంటూ మీ గురించి తప్పుడుగా మాట్లాడేవారు చుట్టూ ఉన్నారు. జాగ్రత్త పడండి.
కలిసివచ్చే రంగు : బంగారం

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
కొత్త ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అవన్నీ మీ జీవితాశయం వైపుకు అడుగులు వేయించేవే అన్న విషయాన్ని బలంగా నమ్మండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఉత్సాహం చూపుతారు. మీ అనుభవాన్నంతా రంగరించి పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ జీవితం ఊహించనంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం.
కలిసివచ్చే రంగు : గులాబి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈవారమంతా ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. గతంలో మొదలుపెట్టిన కొన్ని పనులు విజయవంతంగా కొనసాగుతూ లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇదే సరైన సమయం. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి.
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
కొద్దిరోజులుగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ఉత్సాహంగా మీ జీవితాశం వైపు అడుగులు వేస్తారు. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు ఒక వేదిక దొరుకుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకు వెళ్లండి. నమ్మకమే మీ ఆయుధమన్న విషయాన్ని ఏ వేళలోనూ మరవకండి. ప్రేమ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. అయితే ఆ పరిస్థితులూ త్వరలోనే సర్దుకుంటాయి. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులను ఎప్పటికీ దూరం చేసుకోకండి.
కలిసివచ్చే రంగు : పసుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మిమ్మల్ని ఎంతగానో కలవరపెడుతోన్న సమస్యలు ఈవారమూ అలాగే ఉంటాయి. అయితే ఆ సమస్యలను చూసి చింతించకుండా ముందుకు వెళ్లడమే జీవితం అన్న విషయాన్ని బలంగా నమ్మండి. మరికొద్దిరోజుల్లోనే ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి. నమ్మకమే మీ ఆయుధం. ఆత్మవిశ్వాసంతో పనిచేయలేకపోతే, మీ కలలు కలలుగానే మిగిలిపోతాయి.  ఒక వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తి ఈ కష్టకాలంలో మీకు తోడుగా ఉంటారు.
కలిసివచ్చే రంగు : నారింజ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఈవారం ఓ శుభవార్త వింటారు. ఎప్పట్నుంచో మీరు ఈ శుభవార్త వినడం కోసమే ఎదురుచూస్తున్నారు. ఒక గొప్ప విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. ఆ విజయాన్ని పూర్తిగా మీ సొంతం చేసుకునేందుకు, మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదేనన్న విషయాన్ని నమ్మండి. మీ చుట్టూ ఉండే, మీ మంచి కోరే వ్యక్తుల మాటలు మంచి ఉత్సాహాన్నిస్తాయి. ఆ ఉత్సాహంతోనే మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా పనిచేయండి.
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అయితే అదంతా మీ మంచికే జరిగే విషయమన్నది నమ్మండి. ఇందుకోసం మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. వీటన్నింటినీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. మీ చుట్టూ ఉండేవాళ్లు మీ ప్రయాణానికి, మీ పద్ధతులకు గౌరవం ఇచ్చే వారే ఉండేలా జాగ్రత్తపడండి. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి
కలిసివచ్చే రంగు : నీలం

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారమంతా మీరు ఊహా లోకంలో విహరిస్తారు. మీ ఆలోచనలను అలా కొనసాగిస్తూనే కలల ప్రపంచాన్ని నిజం చేసుకునేందుకు కష్టపడండి. అందుకు ఇదే సరైన సమయం అన్న విషయం కూడా నమ్మండి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఇచ్చే సలహాలను పాటించడం మరవకండి. వారి సలహాలు, సూచనలతోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ విజయంలో మీ జీవితభాగస్వామి పాత్ర ప్రధానంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లి మరింత ఉత్సాహంగా ఆలోచిస్తారు.
కలిసివచ్చే రంగు : వెండి

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఈవారం మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకుంటున్న ఓ కీలక మార్పు దగ్గరలోనే ఉంది. ఆ మార్పుతో మీ ఆలోచనా విధానాన్ని కొత్తగా ఆవిష్కరించుకుంటారు. మీ ప్రతిభ ప్రపంచానికి పరిచయమవుతుంది. గొప్ప విజయాన్ని త్వరలోనే అందుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి.
కలిసివచ్చే రంగు : ఎరుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఈవారం కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జీవితమంతా ఓ దగ్గర ఆగిపోయినట్టు, కష్టంగా కాలం గడుస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇదే పరిస్థితి ఎల్లకాలం ఉండిపోతుందని కాదు. ప్రశాంతంగా భవిష్యత్‌పై నమ్మకంతో మీ శ్రమనంతా వెచ్చించి పనిచేస్తూ వెళ్లండి. ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. కొత్తగా మొదలయ్యే జీవితానికి ముందు పరిస్థితులు ఇలాగే ఉంటాయని నమ్మండి.
కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ
ఇన్సియా టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement