simhabhatla subba rao
-
గ్రహం అనుగ్రహం (18-05-2020)
శ్రీశార్వరినామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం తిథి బ.ఏకాదశి ప.3.24 వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర సా.5.26 వరకు తదుపరి రేవతి వర్జ్యం. దుర్ముహూర్తం ప.12.22 నుంచి 1.14 వరకు తిరిగి ప.2.55 నుంచి 3.48 వరకు సూర్యోదయం ఉదయం: 5.31 గంటలు సూర్యాస్తమయం: సాయంత్రం 6.21 గంటలు అమృతఘడియలు....ప.12.09 నుంచి 1.43 వరకు రాహుకాలం ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం ఉ.10.30 నుంచి 12.00 వరకు గ్రహఫలం మేషం: ఆసక్తికర సమాచారం. దూరప్రయాణాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యస్థితిలో ఉంటాయి. వృషభం: పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు. మిథునం: సన్నిహితుల సలహాలు స్వీకరిస్తారు. కొత్త పనులు చేపడతారు.ఒక సమాచారం ఊరటనిస్తుంది. ధనలాభం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కర్కాటకం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలలో అవాంతరాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. సింహం: ఒక సమాచారం నిరాశ పరుస్తుంది. వ్యవహారాలు ముందుకు సాగవు. ప్రయాణాలు వాయిదా. శ్రమ తప్పదు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత అసంతృప్తి. కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. కుటుంబంలో సఖ్యత. వస్తు, వస్త్రలాభాలు. భూవిక్రయాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. తుల: పరిచయాలు విస్తరిస్తాయి. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బం«ధువులతో సఖ్యత. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడులు అ«ధిగమిస్తారు. వృశ్చికం: పనులలో ప్రతిష్ఠంభన. దూరప్రయాణాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బందికరంగా ఉండవచ్చు. ధనుస్సు: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కొత్త రుణయత్నాలు. పనుల్లో అవాంతరాలు. సోదరులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి. మకరం: పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కుంభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు. మీనం: కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత. -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఈవారం కొంతవరకూ రుణవిముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానించినా సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యావకాశాలు దక్కి విద్యార్థులు ఉత్సాహంగా సాగుతారు. కొందరికి విదేశీ విద్యావకాశాలు సైతం దక్కవచ్చు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు పరిష్కారం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సా«ధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆలోచనలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. బంధువులు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సహచరులతో ఉత్సాహంగా గడుపుతారు. పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి ఆశించిన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. ఆత్మీయులతో తగాదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మొదట్లో కొంత వరకూ ఇబ్బందులు ఎదురవుతాయి. పనులపై శ్రద్ధ చూపరు. బంధువులతో విభేదిస్తారు. అయితే క్రమేపీ ఊరట లభిస్తుంది. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత అనుకూలత. భాగస్వాములు పెరుగుతారు. ఉద్యోగాలలో చిక్కులు అ«ధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చేపట్టిన వ్యవహారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు లక్ష్యాలు నెరవేరతాయి. కుటుంబంలో సమస్యలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులు రావచ్చు. కళారంగం వారు అవార్డులు కైవసం చేసుకుంటారు. విశేష గుర్తింపు పొందుతారు. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. బంధువులు, మిత్రులతో కలహాలు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అన్నట్లుంటుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. ఆరోగ్యం కొద్దిగా మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. మీ అభిప్రాయాలతో కుటుంబసభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలలో ఒత్తిడులు ఎదురవుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరిగి, అధిక శ్రమను ఎదుర్కోవలసి ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఉత్సాహంతో పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి వచ్చిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల వివాదాల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో వివాహాలు జరిపిస్తారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో నెలకొన్న ఇబ్పందులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది, ఉద్యోగయోగం కలుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు తథ్యం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఊహించని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలను కుటుంబసభ్యుల సలహాల మేరకు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. మీ ప్రతిపాదనలకు బంధువులు ఆమోదం తెలియజేస్తారు. వాహనయోగం. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు పొందుతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపార లావాదేవీలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఉపశమనం పొందుతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మ«ధ్యలో ఆస్తి తగాదాలు. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చిక్కులు ఎదురైనా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మీపై అభియోగాలు మోపేందుకు కొందరు ఎదురుచూస్తుంటారు, అప్రమత్తంగా మెలగండి. వ్యాపారాలు మొత్తంమీద లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారు ఆశనిరాశల మధ్య గడుపుతారు. వారం ప్రారంభంలో ధనలాభం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) మొదట్లో కొంత కష్టపడాల్సిన సమయం. క్రమేపీ అనుకున్న విధంగా అభివృద్ధి కనిపిస్తుంది. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులకు అవకాశం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (24 మార్చి నుంచి 30 మార్చి, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కలలను సాకారం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. వ్యాపార పారిశ్రామిక వర్గాల్లోని వారు భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల పెద్దస్థాయి ఒడంబడికలను కుదుర్చుకుంటారు. లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ప్రేమానుబంధాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. పెద్దల నుంచి విలువైన సలహాలు అందుకుంటారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. అలంకరణలపై దృష్టి సారిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పనులను చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని, మార్పు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. త్వరలోనే ఆ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. పనితీరు ద్వారా పొందిన గుర్తింపు వల్ల తేలికగానే మంచి అవకాశాలను అందుకుంటారు. అసంతృప్తికర వాతావరణం నుంచి త్వరలోనే బయటపడతారు. ఇంటిని కొత్తగా అలంకరిస్తారు. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సన్నిహితుల నుంచి కీలక సాయం పొందుతారు. మీపై వదంతుల వ్యాప్తికి కారణమైన వ్యక్తులను గుర్తిస్తారు. దైవాన్ని నమ్ముకుంటారు. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) అనుభవాల ద్వారా పాఠాలు నేర్చకుంటారు. జీవితం పట్ల ఇప్పటి వరకు ఉన్న దృక్పథాన్ని మార్చుకుంటారు. తెలివిగా వ్యవహరించి హానికరమైన పరిస్థితులు ఎదురవకుండా చూసుకుంటారు. సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు మీరు రూపొందించుకున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. లక్కీ కలర్: నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అకుంఠిత దీక్షతో చేసిన కృషి వల్ల అసాధారణ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సంపదను పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు సాధించే సూచనలు ఉన్నాయి. కోరుకున్న పదవులను దక్కించుకోగలుగుతారు. కొత్తగా తలపెట్టిన పనులను ప్రారంభించడానికి ఇది పూర్తిగా అనువైన కాలం. ప్రేమ ప్రతిపాదన ఫలప్రదమవుతుంది. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. బరువును అదుపు చేసుకోవడంపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తారు. శుభవార్తలు సంతోషాన్నిస్తాయి. లక్కీ కలర్: నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) క్షణికావేశాన్ని నియంత్రించుకుంటారు. ఆత్మపరిశీలన చేసుకుంటారు. సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. పని ప్రదేశంలో చిన్న చిన్న మార్పులు చేపడతారు. అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేసి చూపిస్తారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలను దర్శిస్తారు. లక్కీ కలర్: లేత గోధుమరంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) గతం చేసిన గాయాల నుంచి తేరుకుంటారు. సానుకూల ఫలితాలను ఇచ్చే సరికొత్త దిశలో ముందుకు సాగుతారు. అయితే, భావోద్వేగాలను అదుపు చేసుకోవడం మంచిది. పనిలో సత్తా చాటుకుంటారు. గడ్డు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ధ్యానం ద్వారా సాంత్వన పొందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. స్థిరాస్తి లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం సమకూరే సూచనలు ఉన్నాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. లక్కీ కలర్: ఇటుక రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) తిరుగులేని పట్టుదలతో అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. కృతనిశ్చయంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అనుకున్న స్థాయిని మించి ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. కలలను నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. సుదూర యాత్రలకు వెళతారు. అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తారు. సత్యాన్వేషణలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడానికి సంకల్పిస్తారు. లక్కీ కలర్: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. విజయోత్సాహంతో ముందుకు సాగుతారు. ఊపిరిసలపని పనితో ఉక్కిరిబిక్కిరవుతారు. వరుస విజయాలతో అలసటను మరచిపోతారు. మీ పురోగతిలో పెనువేగానికి సన్నిహితులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఇతరుల అభిప్రాయాలకు మనసు పాడుచేసుకోకుండా ఉండటమే మంచిది. ఘర్షణ తలెత్తినప్పుడు మొండితనానికి పోకుండా, పట్టు విడుపు ధోరణితో పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ఆరోగ్యం మందగించవచ్చు.. లక్కీ కలర్: ఊదా ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఇంటా బయటా మార్పులు చేపడతారు. ముఖ్యంగా వాస్తుకు సంబంధించి మార్పులు, పరిహారాలు చేపడతారు. పనుల పురోగతిలో వేగం పుంజుకుంటుంది. మీ జీవితంలో అద్భుతమైన కాలం మొదలైనట్లే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సలహాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వచ్చిన కీలకమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఫర్నిచర్‌ను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. లక్కీ కలర్: లేత బూడిదరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. ఎంతోకాలంగా కోరుకుంటున్న స్వేచ్ఛా స్వతంత్రాలను మనసారా ఆస్వాదిస్తారు. మనస్సాక్షిని నమ్ముకుంటారు. మీ తీరు కొందరికి నచ్చకున్నా, మీదైన మార్గంలోనే ముందుకు సాగుతారు. సంగీతం, చిత్రలేఖనం వంటి లలిత కళల సాధనలో కొత్త ఉత్తేజాన్ని పొందుతారు. చిరకాల స్వప్నం నెరవేరే సూచనలు ఉన్నాయి. విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. బంధు మిత్రులకు బాసటగా నిలుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయవంతంగా నాయకత్వ పాత్ర పోషిస్తారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు. లక్కీ కలర్: నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వారాంతంలో బంధు మిత్రులతో విందు వినోదాలను ఆస్వాదిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. మనసైన వ్యక్తి ముందు మీ మనసులోని మాటను వెల్లడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త అవకాశాలు తలుపుతడతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్కీ కలర్: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ప్రతి అంశంలోనూ సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. ఇంటా బయటా శాంతి సామరస్యాల కోసం పరితపిస్తారు. ఆర్థిక లాభాలు అద్భుతంగా ఉంటాయి. అదనపు ఆదాయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అసూయాపరులు మిమ్మల్ని తప్పుడు సలహాలతో తప్పుదారి పట్టించే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉన్నట్లయితే అలాంటి వారి ఉచ్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: బూడిదరంగు - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. మీ వ్యూహాలు, ప్రణాళికలపై కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమ. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొన్ని పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. అయితే పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆత్మబలం, ధైర్యమే ఈవారం మీకు ఆయుధాలు. మిమ్మల్ని బలహీనపర్చడానికి ప్రత్యర్థులు చేసే యత్నాలు ఫలించవు. ఆర్థిక విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ప్రముఖులను కలిసేందుకు యత్నిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో ఎదురుచూడని మార్పులు సంభవం. కళారంగం వారికి ప్రోత్సాహం అంతగా కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారంతో నిరుద్యోగులు ఊరట చెందుతారు. మీ నిర్ణయాలు అందరూ శిరసావహిస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు కొన్ని తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. గతంలో పొరపాట్లు సరిదిద్దుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొన్ని సంఘటనలు బాగా ఆకట్టుకుంటాయి. సోదరులు, మిత్రుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. నేర్పు, ఓర్పుతో జఠిలమైన సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సమస్యలు కొన్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. బంధువుల నుంచి ధనప్రాప్తి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపార లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతం కాగలవు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో నెలకొన్న సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. నమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగుతారు. ఎవరు అడ్డగించినా లెక్కచేయరు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. విద్యార్థులకు శుభవార్తలు. నూతన వ్యక్తుల పరిచయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. బంధువులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. గతాన్ని విస్మరించి భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. వాహనయోగం కలుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. బంధువిరోధాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది, విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (17 మార్చి నుంచి 23 మార్చి, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అవరోధాలను అధిగమించి మరీ లక్ష్యాలను సాధిస్తారు. గొప్ప గొప్ప విజయాల దిశగా విధి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సానుకూల దృక్పథం రెట్టింపవుతుంది. ఉత్సాహంగా కొత్త కొత్త పనులు చేపట్టడానికి ఉవ్విళ్లూరుతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో సంప్రదిస్తారు. అనూహ్యంగా వచ్చే ప్రేమ ప్రతిపాదనల పట్ల ఆచి తూచి వ్యవహరించడం మంచిది. మభ్యపెట్టే మాటల మాయాజాలంలో పడకుండా అప్రమత్తంగా మెలగండి. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) నాటకీయమైన మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వామ్య సంబంధాలు గొప్ప అవకాశాలకు దోహదపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు చేతికందుతాయి. పగటి కలలు మానేసి ఆలోచనల్లో స్పష్టతను పెంచుకుంటే మరిన్ని విజయాలను సాధించగలుగుతారు. ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. శుభ కార్యాలను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. ఆలయాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పుల పట్ల తొలుత అనుమానాలు రేకెత్తినా, చివరకు అవి మీకు మేలు చేసేవిగానే పరిణమిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. స్వల్పకాలిక పెట్టుబడుల ద్వారా ఊహించని లాభాలను అందుకుంటారు. ఇంటికి కొత్త అలంకరణలు చేపడతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. లక్కీ కలర్: గోధుమ రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అకాల భోజనం తప్పకపోవచ్చు. కుటుంబ బాధ్యతల భారం మోయాల్సి వస్తుంది. మానసిక స్థైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారంలో ఉన్నవారితో పేచీలు తప్పకపోవచ్చు. నైతిక స్థైర్యంతో ముందుకు సాగుతారు. అనూహ్యమైన, అసాధారణమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో పెద్దల నుంచి అవరోధాలు ఎదురవుతాయి. లక్కీ కలర్: లేత నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉత్సాహంతో ఉరకలేస్తారు. జనాకర్షణ పెరుగుతుంది. మిమ్మల్ని మీరు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడంపై శ్రద్ధ చూపుతారు. కొత్త దుస్తులు, అలంకరణ సామగ్రి కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. వ్యాయామంపై శ్రద్ధ పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారావకాశాలను మెరుగుపరచుకుంటారు. స్వల్పకాలిక పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. నిర్వహణ తలకు మించిన భారంగా మారిన స్థిరాస్తులను విక్రయిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. లక్కీ కలర్: ఊదా కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. అనవసరంగా ఇబ్బంది పెట్టేవారు ఎదురవుతారు. స్థైర్యాన్ని కోల్పోకుండా, మీదైన స్థిర వైఖరితో ముందుకు సాగండి. లేనిపోని వదంతులు మనస్తాపం కలిగిస్తాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. ఒత్తిడిని జయించడానికి యోగ, ధ్యానం వంటి వాటిపై దృష్టి పెడతారు. ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. బాకీలు వసూలవడంలో జాప్యం తలెత్తవచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. స్నేహితుల నుంచి సకాలంలో సాయం అందుతుంది. లక్కీ కలర్: వెండి రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ప్రస్తుత పరిస్థితులను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను లౌక్యంతో అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. త్వరిత గతిన పనులు పూర్తి కావాలనుకుంటారు. దురుసుతనంతో ఇతరులను నొప్పిస్తారు. మిత్రులను ఆదుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: నేరేడు రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) అవరోధాలు తొలగిపోతాయి. చిరకాలంగా ఇబ్బంది పెడుతున్న గడ్డు సమస్య నుంచి బయట పడతారు. భావోద్వేగాలను వెల్లడిస్తారు. కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పిల్లల విజయాలు సంతోషాన్ని ఇస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా సంస్థలకు విరాళాలు ఇస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. బాగా పరిచయం ఉన్న వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. లక్కీ కలర్: ముదురు పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ఉక్కిరిబిక్కిరిగా ఉంటాయి. అకాల భోజనం తప్పకోవచ్చు. అలసట చెందుతారు. శక్తులన్నీ కోల్పోయినట్లుగా భావిస్తారు. మానసికంగా అలజడికి లోనవుతారు. ఏకాంతాన్నీ ప్రశాంతతనూ కోరుకుంటారు. ధ్యానమార్గంలో సాంత్వన పొందుతారు. కొత్త ఉద్యోగావకాశాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా, ఆశించిన అభివృద్ధి ఇంకా సాధించలేదనే అసంతృప్తి వెంటాడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంటుంది. విహార యాత్రలతో కొంత ఉత్తేజం పొందుతారు. లక్కీ కలర్: లేత నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అతిగా తాపత్రయపడతారు. భావి ప్రణాళికలతో నిరంతరం సతమతమవుతూ వర్తమానంలో తారసపడే ఆనందాలను కోల్పోతారు. వృత్తి ఉద్యోగాల్లో అవసరానికి మించి శ్రమిస్తారు. అనుకోని అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పనిని ఇతరులతో పంచుకుంటేనే మీకు తీరిక చిక్కుతుంది. అన్ని పనులూ స్వయంగా చేయాలనే చాదస్తాన్ని వదులుకుంటేనే జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒంటరిగా ఉంటున్నవారు తగిన జంట కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. లక్కీ కలర్: బంగారు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. ఇదివరకటి పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. ప్రేమానుబంధాన్ని ఆస్వాదిస్తారు. ప్రియతములతో విహారయాత్రలకు వెళతారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటడం ద్వారా ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. జనాకర్షణ పెరుగుతుంది. సన్నిహితులు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. ప్రముఖు సహాయంతో గడ్డు సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. లక్కీ కలర్: ముదురు నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరి వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత వహించాల్సి వస్తుంది. చేటు చేసే పాత అలవాట్లను మానుకుని కొత్తగా మంచి అలవాట్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కళాకారులకు ఉన్నత సత్కారాలు లభిస్తాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు కూడా ఉంటాయి. గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: బూడిద రంగు - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులు సకాలంలో చకచకా పూర్తి కాగలవు. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. గృహæ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. యుక్తితో కొన్ని ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. ఊహించని∙ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు. ఉద్యోగ యత్నాలు మరింత సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు అనుకున్న ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి మరింత ఆదరణ లభిస్తుంది. విద్యార్థుల ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో పుంజుకుంటాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రుణబాధల నుంచి బయటపడతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూ, గృహయోగాలు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలను సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మ«ధ్యలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. పసుపు, నేరేడురంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు ఉంటాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు. సోదరులు, సోదరీలతో విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు అనుకూలించినా లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఈ వారం విజయాల బాటలో నడుస్తారు. వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఆసక్తికర సమాచారం తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. మానసిక అశాంతి. తెలుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. సహనం, నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు గుర్తింపుతో పాటు, పదోన్నతులు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వివాదాలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. బంధువులు, మిత్రుల సలహాలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మీమాటకు ఎదురుండదు. శత్రువులు కూడా మిత్రులుగా మారడం విశేషం. వాహన, కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాల విస్తరణలోనూ, పెట్టుబడుల సమీకరణలోనూ ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి అవార్డులు లభిస్తాయి. తెలుపు, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాత స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రాగలవు. తీర్థయాత్రలు చేస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రత్యర్థులు కూడా మీకు వెన్నంటి నిలుస్తారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు, ఇంక్రిమెంట్లు రావచ్చు. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేతనీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కార్యోన్ముఖులై పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు. ఊహించని ప్రమోషన్లు రాగలవు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (27 జనవరి నుంచి 2 ఫిబ్రవరి 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) జీవితంలోని కొత్త దశ మొదలవుతుంది. అద్భుతమైన అవకాశాలు అనూహ్యంగా కలసి వస్తాయి. సంపద పెరుగుతుంది. విలాసాలను ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. సాయం అవసరమైనప్పుడు మొహమాటం వీడి ఇతరుల సాయాన్ని కోరండి. కోరుకున్న సాయం తప్పక దొరుకుతుంది. ప్రేమానుబంధాలలో నిరాశాపూరితమైన పరిస్థితులు తలెత్తే సూచనలు ఉన్నాయి. భావోద్వేగపరంగా సంయమనం పాటించడం మంచిది. ధైర్యంగా, స్వతంత్రంగా ముందుకు సాగితేనే లక్ష్యాలను చేరుకోగలుగుతారు. లక్కీ కలర్: ఎరుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఇంటా బయటా సంయమనం పాటించడమే మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూలతలు తలెత్తే సూచనలు ఉన్నాయి. పని ప్రదేశంలో ఆగ్రహావేశాలను అదుపు చేసుకుంటేనే క్షేమం. ప్రత్యర్థుల నుంచి కవ్వింపు చర్యలు ఎదురు కావచ్చు. వాగ్వాదాలకు దిగితే అనవసరంగా నిందలు పడాల్సి వస్తుంది. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మనసు పరిపరి విధాల పరుగు తీస్తుంది. ప్రియతముల నుంచి ప్రేమ కోసం పరితపిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సహాయం పొందాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. అనుకోని దూర ప్రయాణాలు చేస్తారు. లక్కీ కలర్: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఆశావహమైన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. దూకుడు పెంచడం ద్వారా మరిన్ని విజయాలను చేజిక్కించుకుంటారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. అప్పులు తీర్చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. బరువును అదుపు చేసుకోవడానికి వ్యాయామం వైపు దృష్టి సారిస్తారు. ఊగిసలాటలో పడిన ప్రేమానుబంధాలను తిరిగి బలోపేతం చేసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇప్పటి వరకు సాధించిన విజయాలను బేరీజు వేసుకుంటారు. మిమ్మల్ని మీరే విజేతగా భావిస్తారు. ఎలాంటి వారైనా మిమ్మల్ని వారి నియంత్రణలోకి తీసుకోలేరు. ఆర్థికంగా అద్భుతమైన కాలం ఇది. పెట్టుబడులపై ఆశించిన దానికి మించిన లాభాలు వస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇదివరకే కొన్న ఆస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది. విలాసాల కోసం బాగా ఖర్చు చేస్తారు. స్నేహితులకు, ప్రియతములకు కానుకలు ఇస్తారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: తుప్పు రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు. శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. వ్యాయామం ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కఠినమైన లక్ష్యాలను సాధిస్తారు. అధికారుల మన్ననలు పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కొత్తగా మొదలైన ప్రేమానుబంధం మిమ్మల్ని ఆనందంలో ఓలలాడిస్తుంది. పెద్దలను, గురువులను కలుసుకుంటారు. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటికి మరమ్మతులు, అలంకరణలు చేపడతారు. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన ఘనవిజయాలు మీ శ్రమను మరిపిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. చిరకాలంగా వాయిదా వేస్తున్న పనిని పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రియతములను అర్థం చేసుకోవడం ప్రహేళికలా తయారవుతుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ పెరుగుతుంది. అరుదైన ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: నేరేడు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: ఇటుక రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) పనులను పూర్తి చేయడంలో అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. చిరకాలంగా కొనసాగుతున్న స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రేమానుబంధాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: తెలుపు - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు : 4 మార్చి నుంచి 10 మార్చి 2018 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్యసమస్యల నుంచి విముక్తి. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. వాహనసౌఖ్యం. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారం. మీ నీతినిజాయితీలకు తగిన గుర్తింపు రాగలదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు. పరిశోధకులు కొత్త ఆవిష్కరణలతో ముందడుగు వేస్తారు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) అనుకున్న రాబడి దక్కి ఉత్సాహంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా మెలిగి అందరికీ ఆత్మీయులుగా మారతారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారులకు ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతమైన కాలం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) వ్యయప్రయాసలను సైతం లెక్కచేయకుండా ముందడుగు వేస్తారు. అనుకున్న కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారవర్గాలకు కొత్త పెట్టుబడులు సమకూరి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కార్యోన్ముఖులై విజయాల బాటలో నడుస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు సానుకూలం. మీలో దాగిన నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. జీవిత భాగస్వామి ద్వారా ధన, ఆస్తిలాభాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. అనుకున్న లాభాలు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. కళాకారులు, పరిశోధకులు సన్మానాలు అందుకుంటారు. వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆర్థిక విషయాలు ఇబ్బంది కలిగిస్తాయి. రుణదాతల నుంచి ఒత్తిడులు. అనుకున్న పనులు నెమ్మదిస్తారు. శక్తికి మించి బాధ్యతలు చేపట్టి సతమతమవుతారు. హామీల విషయంలో తొందరపాటు వద్దు. సోదరులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. అకాల ఆహారవిహారాదులకు స్వస్తి చెప్పండి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం. పారిశ్రామికవేత్తలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలాభం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) వీరికి అన్ని శుభశకునాలే. ఆర్థికంగా బలం పుంజుకుంటారు. అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. విద్యార్థులు, నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయి. బంధువులు మీపై వేసిన నిందలు ఉపసంహరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలలో మీ శ్రమ వృథా కాదు. ఉద్యోగస్తులు పైస్థాయి అధికారుల గుర్తింపు పొందుతారు. కళాకారులకు అవార్డులు. వారం చివరిలో అనారోగ్యం. చోరభయం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమ దిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. మీ ప్రతిభకు తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభిస్తుంది. కొత్త వ్యక్తుల పరిచయం. రాబడి సంతృప్తినిస్తుంది. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతపోస్టులు రావచ్చు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకుల కృషి ఫలిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. కొన్ని వ్యవహారాలలో మధ్యవర్తిత్వం వహిస్తారు. మీపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా సమర్థతను చాటుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు కాగలవు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు కొత్త పదవులు దక్కే సూచనలు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) మీరు చెప్పిందే వేదంగా ఉంటుంది. అందరిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందుతారు. విద్యార్థులు, నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. వాహనయోగం. కోర్టు వ్యవహారాలలో అనుకూలత. వ్యాపార విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు కొత్త హోదాలు. కళాకారులకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిళ్లు. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. ఆర్థిక వ్యవహారాలలో గందరగోళం తొలగుతుంది. కొన్ని రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు. పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. పసుపు, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ప్రారంభంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. కార్యక్రమాలు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. జీవితభాగస్వామి ద్వారా ధనలాభం. వాహన, గృహయోగాలు. నిరుద్యోగులకు అనుకోని అవకాశాలు. మరపురాని సంఘటన ఎదురుకానుంది. వ్యాపారాలలో కొత్త ఆశలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. వివాదాలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొన్ని వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆదాయం సమకూరినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆత్మీయులు మీ పట్ల మరింత అభిమానం చూపుతారు. మీలో దాగిన ప్రతిభ వెలుగుచూసే వీలుంది. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి కలుగుతుంది. ఆలోచనలు అమలు చేస్తారు. వాహనయోగం. సోదరులు, సోదరీలతో సఖ్యత నెలకొంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు దక్కే ఛాన్స్. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. గతాన్ని తలచుకుని ఆశ్చర్యానికి లోనవుతారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. అనారోగ్యం. పసుపు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక విషయాలు కాస్త నిరుత్సాహపరుస్తాయి. శ్రమాధిక్యంతో పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. శుభకార్యాల రీత్యా ఖర్చులు తప్పవు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. స్వల్ప అనారోగ్యం. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు. ఉద్యోగులకు మార్పులు తప్పకపోవచ్చు. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఉత్సాహంగా ముందుకు సాగి విజయాలు సా«ధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. కొత్త పరిచయాలు. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగయత్నాలలో ముందడుగు పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో ఖర్చులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు లాభిస్తాయి. కార్యజయంతో ఉత్సాహం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. దూరపు బం«ధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వ్యాపారాలలో లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. తెలుపు, గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తుతి పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అదనంగా వచ్చే ఆదాయం సంతృప్తినిస్తుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభ సూచనలు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో కొంతమేరకు పురోగతి కనిపిస్తుంది. మీ అంచనాలు, ఊహలు నిజమవుతాయి. కుటుంబబాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటారు. స్థిరాస్తివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. ఎరుపు, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త కార్యక్రమాలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కివస్తాయి. వాహనాలు, స్థలాలు కొంటారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు కాస్త నెమ్మదిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నూతన ఉద్యోగాలు దక్కే అవకాశం. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఉద్యోగయత్నాలలో విజయం. కొన్ని సమస్యల నుంచి బయటపడి ఊపిరిపీల్చుకుంటారు. వస్తువులు, వాహనాలు కొంటారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు గుర్తింపు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. గులాబీ, లేత ఆకుపచ్చరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సందేశం అందుతుంది. బంధువుల తోడ్పాటుతో ముందడుగు వేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు దక్కవచ్చు. కళాకారులకు మరింత అనుకూల సమయం. వారం చివరిలో వృథా ఖర్చులు. ఆరోగ్యభంగం. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. పనులు సకాలంలో పూర్తి కాగలవు. నిరుద్యోగులకు అనుకూల సమాచారం. బంధువులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు మరింత గుర్తింపు రాగలదు. కళాకారులకు సత్కారాలు, పురస్కారాలు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో చికాకులు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) మొదట్లో కొద్దిపాటి చికాకులు ఎదురైనా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. పనులు అనుకున్న ప్రకారం పూర్తి చేస్తారు. ఆత్మీయులు సలహాలు అందిస్తారు. రావలసిన సొమ్ము కొంతమేర అందుతుంది. విద్యార్థులకు కొత్త అశలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆహ్వానాలు అందుకుంటారు. దైవదర్శనాలు. వ్యాపారులకు లాభాలు దక్కే చాన్స్. ఉద్యోగులు పనిభారం తగ్గి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు పదవులు దగ్గరకు వస్తాయి. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ,లేత పసుపురంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో(25 ఫిబ్రవరి నుంచి 3 మార్చి, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారమంతా చాలా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి జీవితం ఊహించనంత వేగంగా దూసుకుపోతుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. కొత్త వ్యాపార ఆలోచన ఒకటి చేస్తారు. చాలాకాలంగా మిమ్మల్ని ఊరిస్తోన్న ఓ విజయం దగ్గరలోనే ఉంది. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీకిష్టమైన వ్యక్తి కోసం ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఇది మిమ్మల్ని మరింత ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడిపేస్తారు. ఎప్పుడో మొదలుపెట్టి మధ్యలో ఆపేసిన చాలా పనులను ఇప్పుడు మళ్లీ మొదలుపెట్టి విజయం వైపుకు అడుగులు వెయ్యాలని భావిస్తారు. మీ ఆలోచనలు కూడా మిమ్మల్ని ఖాళీగా ఉంచకుండా పరుగులు పెట్టిస్తాయి. ఒక గొప్ప విజయం మీకు దగ్గరలోనే ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా పనిచేయండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : నీలం మిథునం (మే 21 – జూన్ 20) ఈవారం వృత్తి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు సంభవిస్తాయి. ఈ మార్పులకు తగ్గట్టు పనిచేసేందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. జీవితంలో ఏదీ కష్టపడకుండా రాదన్న విషయాన్ని గుర్తుంచుకొని, మీ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించండి. కొన్ని విషయాలు ఇప్పుడు బాధపెట్టినంత మాత్రాన అవి ఎప్పుడూ అలాగే ఉండిపోతాయని కాదని నమ్మండి. ఆత్మ విశ్వాసం, అందరినీ ప్రేమగా చూసే మీ ఆలోచనా విధానమే మీ ఆయుధాలు. వాటిని ఎప్పుడూ వదులుకోకుండా విజయానికి చేరువకండి. ప్రేమ జీవితం బాగుంటుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) గతాన్ని గురించి ఎంత ఆలోచించినా, మీరేమీ మార్చలేరన్న విషయం తెలుసుకోండి. ఈ క్షణాన్ని ఆస్వాదిస్తూ జీవితాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు సిద్ధంగా ఉంచుకోండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. అతితక్కువ రోజుల్లోనే ఆ వ్యక్తికి బాగా దగ్గరవుతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త. కలిసివచ్చే రంగు : ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ చుట్టూ ఉండేవారిని ప్రభావితం చేయగల స్థాయి మీది. ఆ మీ స్థాయి ఏళ్లుగా మిమ్మల్ని మీరు నిర్మించుకున్న విధానం వల్లనే వచ్చిందని బలంగా నమ్మండి. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే ఓ గొప్ప అవకాశం ఈవారమే మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని, మీ చుట్టూ ఉండేవారికి ఆదర్శంగా నిలిచే విజయాన్ని పొందుతారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కొన్ని అనుకోని సవాళ్లు ఎదురైనా అవి కేవలం మీ చిత్తశుద్ధిని పరీక్షించడానికే అని తెలుసుకోండి. కలిసివచ్చే రంగు : బూడిద కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఎన్ని సవాళ్లు ఎదురైనా వాటన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొనే మీ స్వభావమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుందని బలంగా నమ్మండి. అసలు కష్టాలే లేని జీవితమన్నది ఒక మిథ్య. అలాంటి జీవితం గురించి ఆలోచిస్తూ, కష్టాలను చూసి భయపడిపోతే మీరనుకున్నది ఏదీ సాధించలేరని తెలుసుకోండి. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. వృత్తి జీవితానికి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) వృత్తి జీవితానికి సంబంధించి ఓ కీలక మార్పు కనిపిస్తోంది. ఈ మార్పు మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా, ఈరోజు మీరెక్కడున్నారో, రేపు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో ఆలోచించి పనిచేయండి. జీవితాన్ని ఎప్పటికప్పుడు కొత్తగా ఆస్వాదించడంలోనే ఆనందం దాగుందన్న విషయాన్ని ఎప్పుడూ మరచిపోకండి. కొత్త ఇల్లు కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నట్లైతే అందుకు ఇదే సరైన సమయం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా, జీవితంలో ఎదురయ్యే సంఘటనలను ఉన్నవి ఉన్నట్లుగా తీసుకొని, వాటిని అలాగే ఆస్వాదించే గుణం మీకు అవసరం. వృత్తి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. అతి సాధారణంగా కనిపించే కొన్ని విషయాలు గొప్పవిగా మీకు ఈ రోజు కనిపించకపోయినా కొన్ని రోజులు పోయాక వాటి గొప్పదనం మీరే తెలుసుకుంటారు. కలిసివచ్చే రంగు : కాషాయ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈవారమంతా చాలా సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. అయితే అనవసర ఖర్చులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ఫలితం గురించి ఆలోచించకుండా మీదైన శ్రమనంతా వెచ్చించి పనిచేయండి. ఒక గొప్ప విజయం మీకు దగ్గర్లోనే ఉంది. దాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. అయితే ఆ విజయాన్ని గురించే ఆలోచించకుండా మీ పని మీరు చేస్తూ వెళ్లండి. ప్రేమ జీవితం బాగుంటుంది. కలిసివచ్చే రంగు : పీచ్ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఏదో శక్తి మిమ్మల్ని బలంగా వెనక్కి లాగుతున్న భావన నుంచి ఎప్పుడైతే బయటపడతారో ఆ రోజే మీరు కొత్తగా జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఆరోజు ఎంత త్వరగా వస్తుందన్నది మీ ఆలోచన మీదే ఆధారపడి ఉంది. అనవసర విషయాల గురించి ఎక్కువ ఆలోచించకుండా మీకు నచ్చిన తీరులో పనిచేసుకుంటూ వెళ్లండి. ఒక గొప్ప అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. మీరు బాగా ఇష్టపడే వ్యక్తి వల్లే మీకు ఆ అవకాశం దక్కుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ప్రతిసారీ మీకొచ్చే ప్రశ్నలన్నింటికీ మీరు కోరుకునే సమాధానాలే దొరికితే అది జీవితం అయిపోదు. కొన్ని సమాధానాలు ఎలా ఉన్నా, వాటిని అలాగే తీసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ మంచి అవకాశం త్వరలోనే మీ తలుపు తడుతుంది. ఆ అవకాశాన్ని దక్కించుకోవడం కోసం మీరు ఇన్నాళ్లు పడిన కష్టం కూడా మిమ్మల్ని జీవితంలో ఇప్పటికే విజయం సాధించిన వ్యక్తిగా నిలుపుతుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. ప్రేమ జీవితం మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. కలిసివచ్చే రంగు : వయొలెట్ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వృత్తి జీవితంలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. మిమ్మల్ని బాగా ఇష్టపడే వ్యక్తితోనే చిన్న వివాదం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో చేసిన తప్పులను మళ్లీ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలన్నది ఆలోచించండి. భవిష్యత్‌పై మీకున్న ఆశలను ఎప్పుడూ సజీవంగా ఉంచుకోండి. అదే మిమ్మల్ని ఎప్పటికప్పుడు జీవితాశయం వైపునకు ధైర్యంగా అడుగులు వేయిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. కలిసివచ్చే రంగు : పసుపు - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు (21 జనవరి నుంచి 27 జనవరి 2018 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆదాయం కొంత తగ్గినా అవసరాలకు డబ్బు సమకూరుతుంది. సన్నిహితులతో కొన్ని వివాదాలు తీరతాయి. ఆస్తి వ్యవహారాల్లో ఒప్పందాలు కుదురుతాయి. ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో పూర్వవైభవం. ఉద్యోగస్తుల ఆశలు ఫలిస్తాయి. పారిశ్రామికవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. పనులు వాయిదా. పసుపు, గులాబి రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఉత్సాహంగా ముందుకు సాగుతారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. అరుదైన సత్కారాలు పొందుతారు. ఆస్తి విషయాల్లో చికాకులు తొలగుతాయి. సోదరులు, స్నేహితులతో వివాదాలు తీరతాయి. గృహ నిర్మాణ యత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగస్తులకు పదోన్నతులు రావచ్చు. కళాకారులకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యం మందగిస్తుంది. లేత నీలం, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. బంధువుల ప్రోద్బలంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు నూతనోత్సాహం. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, లేత గులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సేవాభావంతో ముందుకు సాగుతారు. దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. కొత్త వ్యాపారాలు ఆరంభిస్తారు. ఉద్యోగాలలో ఉన్నతస్థాయికి చేరతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వాహనయోగం. ముఖ్యమైన చర్చలు సఫలం. కళాకారులకు ఊహించని సత్కారాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. విద్యార్థులు, ఉద్యోగార్థులకు ఊహించని అవకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వాహన, గృహయోగాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు కోరుకున్న మార్పులు జరగవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు లభించే అవకాశం. వారం ప్రారంభంలో అనుకోని ఖర్చులు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఎరుపు, లేతగులాబి రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే ఆశాజనకంగా ఉంటుంది. విలువైన వస్తువులు కొంటారు. విద్యార్థులు నైపుణ్యానికి గుర్తింపు పొందుతారు. బంధువులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. ప్రత్యర్థులతో రాజీకి యత్నిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగులకు పనిభారం తొలగుతుంది. పారిశ్రామికవేత్తలకు ముఖ్యసమాచారం ఊరటనిస్తుంది. వారం మధ్యలో మానసిక అశాంతి. వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కాస్త తీరతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వీడండి. ఒక సమాచారం విద్యార్థులకు ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపారాలలో నూతనపెట్టుబడులు అందుతాయి. ఉద్యోగస్తుల సేవలు గుర్తింపు పొందుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం చివరిలో ధనవ్యయం. ఒత్తిడులు. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్తగా చేపట్టిన కార్యక్రమాలను నిదానంగా పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు. చిరకాల స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం కాస్త మందగిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. వ్యాపారాలు కొంత నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. కళాకారులు విదేశీ పర్యటనలు చేస్తారు. వారం ప్రారంభంలో శుభవార్తలు. విచిత్ర సంఘటనలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) సన్నిహితులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. నూతన ఉద్యోగాల్లో చేరతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనూహ్య మార్పులు. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. గులాబి, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. అదనపు ఆదాయం సమకూరుతుంది. స్నేహితులతో విభేదాలు తొలగుతాయి. యత్నకార్యసిద్ధి. విద్యార్థులు ఆశించిన అవకాశాలు అందుకుంటారు. ఆస్తి విషయంలో నూతన ఒప్పందాలు. సంఘంలో గౌరవమర్యాదలు. ప్రముఖుల నుంచి కీలక సందేశాలు. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత ్తపనులకు శ్రీకారం చుడతారు. ఆత్మీయుల నుంచి ముఖ్య సందేశం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపార లావాదేవీలు ఊపందుకుంటాయి. ఉద్యోగస్తులకు సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో వృథా ఖర్చులు. మానసిక అశాంతి. లేత ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనుల్లో విజయం సాధిస్తారు. పరపతి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చే స్తారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. విద్యార్థులు, నిరుద్యోగులయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. కళాకారులకు పురస్కారాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబి, నేరేడు రంగులు.పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రామరక్షాస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (21 జనవరి నుంచి 27 జనవరి, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారం మీకంతా మంచే జరుగుతుంది. గత కొద్దిరోజుల క్రితమే మొదలుపెట్టిన ఓ పని ఇప్పుడిప్పుడే ఫలితాలు ఇస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. చెడు ఆలోచనలను దూరం పెట్టండి. ఒక కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కష్టపడి పనిచేసే మీ తత్వమే మిమ్మల్ని విజయం వైపుకు నడిపించే శక్తి అని నమ్మండి. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతుంటాయి. అయినప్పటికీ మీ ఉత్సాహం ఏమాత్రం తగ్గకుండా చూసుకోండి. అనుకున్న విజయం కోసం ఇంకొంత కాలం ఎదురుచూడక తప్పదు. ఈ ప్రయాణాన్ని ఇష్టపడండి. విహారయాత్రలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. ఇది మీకు ఓ కొత్త శక్తినిస్తుంది. ప్రేమ జీవితం బాగుంటుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఈవారమంతా మీరు ఊహించినట్టుగానే సాఫీగా సాగిపోతుంది. మీకు సన్నిహితులైన ఓ వ్యక్తికి అండగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి. చాలాకాలంగా ముందుకు కదలని ఒక పని గురించి బాగా ఆలోచిస్తారు. ఆ పని ఇప్పుడే మొదలుపెట్టడం వల్ల జరగబోయే మంచిని గ్రహిస్తారు. జీవితాన్ని మలుపు తిప్పే ఓ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారం ఓ గొప్ప విజయం సాధిస్తారు. చాలాకాలంగా ఈ విజయం కోసమే ఎదురుచూస్తున్నందున, రాబోయే రోజులను ఉత్సాహంగా గడుపుతారు. కష్టపడి పనిచేసే మీ తత్వమే మిమ్మల్ని గొప్ప స్థాయికి తీసుకెళుతుంది. మీ జీవితాన్ని మలుపు తిప్పే వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తికి తక్కువ సమయంలోనే బాగా దగ్గరవుతారు. వివాహ సూచనలు కనిపిస్తున్నాయి. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. చిన్న చిన్న విషయాలను కూడా సునిశితంగా పరిశీలించడం అలవాటు చేసుకుంటారు. ఇది మీలో ఊహించని మార్పు తెచ్చిపెడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వారం చివర్లో అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి. కలిసివచ్చే రంగు : వయొలెట్ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈవారం మీకంతా కొత్తగా ఉంటుంది. మీరు ఏమాత్రం ఊహించని పరిస్థితులు మిమ్మల్ని చుట్టుముడతాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. మీపై మీకు ధీమా ఉంటే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలరని నమ్మండి. ఏం మాట్లాడినా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మాట్లాడండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు బాగా ఇష్టపడే వ్యక్తితో ఒక గొడవ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. కలిసివచ్చే రంగు : పసుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు. ఆర్థిక పరిస్థితిని చక్కబెట్టుకునేందుకు ఏం చేయాలా అని ఆలోచిస్తారు. ఇప్పటికైనా అలాంటి ఒక ఆలోచన రావడం మంచిదే. వృత్తి జీవితం సాఫీగా సాగిపోతుంది. జీవితమంతా ఒకేదగ్గర ఆగిపోయినట్టు భావిస్తారు. ఈ ఆలోచనను వీలైనంత త్వరగా దూరం చేసుకుంటే మంచిది. ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. కలిసివచ్చే రంగు : తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీరు ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన ఓ పనికి కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఆ అవాంతరాలకు కారణాలు ఏమై ఉంటాయన్న విషయం బాగా ఆలోచించండి. ప్రేమ జీవితం కాస్త గందరగోళంగా ఉంటుంది. సమస్య ఎక్కడ ఉందో ఆలోచించి, అందుకు మీరేం చేయాలో అర్థం చేసుకోండి. మీ ఆలోచనల్లో, ప్రపంచాన్ని ఆస్వాదించే విషయంలో మార్పు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇష్టమైన వ్యక్తులతో మాట్లాడడానికి వెనుకాడకండి. కలిసివచ్చే రంగు : గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈవారం మీకంతా సాఫీగా సాగిపోతుంది. ఒక కొత్త వ్యాపార ఆలోచన చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఆ ఆలోచనను ఆచరణలో పెట్టి ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. స్థిరాస్తిని కొనుగోలు చేస్తారు. మీ ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పుకునే అవకాశాలు వెల్లువలా వచ్చిపడతాయి. ఆరోగ్యం విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడాల్సి ఉంది. అందరితో సరదాగా కలిసిపోయే మీ స్వభావాన్ని అలాగే ఉంచుకోండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఈ సమయం మిమ్మల్ని మానసికంగా ఉల్లాసంగా ఉంచుతుంది. కలిసివచ్చే రంగు : కాషాయ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఈవారమంతా ఖాళీ అన్నదే లేకుండా గడుపుతారు. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. కష్టపడి పనిచేస్తేనే మీ కలల ప్రపంచాన్ని చేరుకుంటారని నమ్మండి. వరుసగా అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆ అవకాశాలను సరిగ్గా ఉపయోగించుకోవడానికి మీరేం చేయాలో ఆలోచించుకోండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) అనవసర ఖర్చులకు, ఆర్భాటాలకు దూరంగా ఉండాల్సిన అవసరం వస్తుంది. ఈవారం ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని ఆ దిశగా మొదటి అడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి రానున్న రోజుల్లో మెరుగుపడుతుంది. ఖాళీ అన్నదే లేకుండా కష్టపడితేనే విజయం మిమ్మల్ని వరిస్తుందని నమ్మండి. మీ జీవితాన్ని మలుపు తిప్పే ఓ కీలక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈవారం మీకు అదృష్టం బాగా కలిసివస్తుంది. కొద్దికాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న ఆరోగ్య సమస్యలు కూడా చక్కబడతాయి. రానున్న రోజులంతా సంతోషంగా గడుపుతారు. మీకిష్టమైన వ్యక్తి మీకు పక్కనే ఉండడం ఉత్సాహాన్నిస్తుంది. మీ ప్రతిభతో చుట్టూ ఉండేవారి అభిమానాన్ని చూరగొంటారు. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే బాగుంటుంది. అయితే ఖరీదైన వస్తువులను కొంటూనే మళ్లీ బాధపడే మీ స్వభావం మారాల్సిన అవసరం ఉంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ భయాలన్నింటినీ వీడి, ఆత్మవిశ్వాసంతో పనిచేయడం ముఖ్యమని నమ్మండి. ఆ దిశగా వెళ్లేందుకు మీరు ఏమేం చేయాలో కూడా ఆలోచించండి. అన్నింటికీ ఇతరులపై ఆధారపడే మీ స్వభావం కూడా మారాల్సి ఉంది. ఒక కీలక విషయంలో నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం స్వయంగా మీరే తీసుకోవడం వల్ల ఏ ఫలితం వస్తుందన్న విషయం ఆలోచించకుండా ముందుకెళ్లండి. మీకు బాగా ఇష్టమైన వ్యక్తి ఇచ్చే కొన్ని సలహాలు మాత్రం ఎప్పట్లాగే మీకు పనికొస్తాయి. కొన్ని చెడు అలవాట్లను ఇప్పటికైనా దూరం చేసుకుంటే మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : నీలం - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) మీ ఆశయాలు నెరవేర తాయి. ఆర్థికంగా మరింత బలపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. పనుల్లో విజయం సాధిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. మీ నిర్ణయాలలో మార్పులు చేసుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరి ముందుకు సాగుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. రాజకీయవర్గాలకు అనూహ్యమైన పిలుపు రావచ్చు. బంధువులతో తగాదాలు. గులాబి, ఆరెంజ్ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆవుపాలు, కొబ్బరినీళ్లతో వినాయకునికి అభిషేకం చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) అనుకున్న పనులు మొదట్లో కొంత మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా గుర్తింపు లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో మానసిక ఆందోళన. ఆరోగ్య¿¶ ంగం. ఆకుపచ్చ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సగ్గుబియ్యం, బెల్లంతో చేసిన పరమాన్నం లక్ష్మీదేవికి నివేదించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. మీ అంచనాలు నిజమవుతాయి. దూరప్రాంతాల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. విద్యార్థులు అనుకున్నది సా«ధిస్తారు. సభలు, వేడుకల్లో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవరోధాలు అధిగమిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులకు సత్కార, పురస్కారాలు. వారం మధ్యలో వృథా ఖర్చులు. కుటుంబసమస్యలు. నలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యేశ్వరునికి మంగళవారం అభిషేకం చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొన్ని కార్యక్రమాలు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉండి అప్పులు చేయాల్సివస్తుంది. ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. హామీలు, నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించండి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించవు. ఉద్యోగులకు విధి నిర్వహణలో అవరోధాలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. పసుపు, లేత గులాబి రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. 111 ఎర్రగులాబీలతో దుర్గామాతకు అర్చన చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనూహ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. గత సంఘటనలు నెమరువేసుకుంటారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులకు సంతోషకరంగా ఉంటుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. కళాకారులు అవార్డులు దక్కించుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. బియ్యం పరమాన్నం అమ్మవారికి నివేదించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో కష్టసుఖాలు పంచుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలులో అవరోధాలు తొలగుతాయి. విద్యార్థులకు కృషి ఫలిస్తుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి పిలుపు రావచ్చు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం ప్రారంభంలో ఖర్చులు. అనారోగ్యం. గులాబి, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. 11 కొబ్బరికాయలతో శివాలయంలో అభిషేకం మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) మీ శ్రమ ఫలిస్తుంది. ముఖ్యమైన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తి లేదా ధనలాభాలు ఉంటాయి. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు కొన్ని తొలగుతాయి. కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. 21 కుడుములు వినాయకునికి సమర్పించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆశ్చర్యకరమైన విషయాలు, సంఘటనలు తెలుసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. కుటుంబసభ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఎరుపు, ఆరెంజ్ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆంజనేయస్వామికి అర్చన చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు సానుకూలం. విద్యార్థులు కొత్త ఆశలతో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులు సత్కారాలు అందుకుంటారు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. గులాబి, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పార్వతీదేవికి కుంకుమార్చన మంచిది. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో ఇబ్బందులు, సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో అధిగమిస్తారు. క్రమేపీ పరిస్థితులు ^è క్కబడతాయి. మీ ఆలోచనలు కలసివస్తాయి. పనులు చకచకా సాగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు దక్కుతాయి. వాహనయోగం. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యమైనా మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. చోరభయం. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహాలను స్తుతిస్తూ 9సార్లు ప్రదక్షణలు చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. పనులు కొంత నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. మీ ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. వివాహయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. కళాకారులకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్య సూచనలు. కుటుంబసమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలిస్తాయి. మూడుసార్లు విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇంతకాలం మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. పనుల్లో అవరోధాలు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లు అనుకున్నది సాధిస్తారు. విద్యార్థులకు సంతోషకరమైన సమాచారం. బంధువుల తోడ్పాటు లభిస్తుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు సన్మానాలు, విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. గులాబి, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో( 7 జనవరి నుంచి 13 జనవరి, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) మీ జీవితాన్ని పూర్తిగా మలుపు తిప్పే నిర్ణయం తీసుకోబోతున్నారు. ఉద్యోగంలో మార్పు సూచనలు కనిపిస్తున్నాయి. కొలిక్కిరాకుండా ఇబ్బంది పెడుతోన్న ప్రాజెక్టు ఈ వారం విజయవంతంగా పూర్తవుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే విజయం మీవైపే ఉంటుందని మరవకండి. న్యాయ సంబంధిత విషయంలో నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి సాదాసీదాగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : ఊదా వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ ఆలోచనా తీరు, పద్ధతులను చక్కబెట్టుకునేందుకు మంచి సమయమిది. వృత్తిపరంగా ఉన్న ఇబ్బందులు సర్దుకుంటాయి. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకుంటే విజయం మీవైపే నిలుస్తుంది. కొత్త పదవిని అలంకరిస్తారు. మీదైన శైలిలో నాయకత్వ లక్షణాలను అలవర్చుకొని కొత్త పదవిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు. మీ నాయకత్వంలో పనిచేస్తున్న వారు మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తారు. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) మీ ప్రణాళికలను సమీక్షించుకోవాల్సిన సమయమిది. కొత్త కోణంలో పరిస్థితులను అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. జీవితమంతా ఓ దగ్గర ఆగిపోయినట్టు, ఇక ముందుకు కదలడం లేదేమో అనిపిస్తూ ఉన్నట్లైతే, ఇదంతా తాత్కాలికమేనని నమ్మండి. ముందంతా మంచే జరుగుతుంది. దేవుడిని ఇష్టంగా పూజించండి. కొత్త ఉత్సాహంతో జీవితం అందంగా తయారవుతుంది. రానున్న రోజుల్లో మంచి అవకాశాలు తలుపు తడతాయి. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే సాధారణంగా ఉంటుంది. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు : లేత గోధుమ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీ జీవితాన్ని మలుపుతిప్పే మార్పు చోటు చేసుకుంటుంది. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మ విశ్వాసంతో ముందడుగు వేయండి. మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. అడ్డంకులేవైనా ఎదురైనట్లు కనిపించినా, అదంతా తాత్కాలికమే. విజయంపై ధీమాతో కష్టపడండి. జిమ్‌లో చేరాల్సిన సమయమిది. బరువు తగ్గే ఆలోచన చేయండి. ఇప్పుడు ఆరోగ్యం విషయంలో తీసుకునే ఈ నిర్ణయమే మిమ్మల్ని మరింత ఉత్సాహంగా పనిచేయిస్తుంది. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : వెండి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీ జీవితానికి ఎంతో ప్రత్యేకమైన ఓ విషయంలో అటో ఇటో తేల్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మీరు తీసుకునే నిర్ణయం మీకు అనుకూలంగానే ఉంటుంది. మీ ఆలోచనలను చెడు వైపుకు మళ్లించే వ్యక్తులు మీ చుట్టూ ఉన్నారు. అలాంటి వారికి దూరంగా ఉంటూ జాగ్రత్త పడండి. మీ విశ్వాసాలను బలంగా చెప్పడం అలవర్చుకోండి. కొత్త బాధ్యతలు వచ్చి పడతాయి. నమ్మకంతో ఆ బాధ్యతలను చేపట్టండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఒక కొత్త వ్యక్తి పరిచయమవుతారు. కలిసివచ్చే రంగు : నలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీకు రానున్నదంతా మంచి కాలమే. మీరు కలలో కూడా సాధ్యపడదు అనుకున్న పనులు కూడా చక్కగా జరుగుతాయి. మంచి గుర్తింపు సంపాదిస్తారు. కొత్తగా మొదలుపెట్టే పనులన్నింటిపై నమ్మకం ఉంచి ముందడుగు వేయండి. విజయం మీవైపే ఉంటుంది. మీపై మీరు నమ్మకం ఉంచడం మరవొద్దు. శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉండేందుకు వ్యాయామం చేయండి. తల్లిదండ్రుల ఆరోగ్యం కాస్త కలవరపెడుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. ఖర్చులు తగ్గించుకోండి. కలిసివచ్చే రంగు : తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మిమ్మల్ని మీరు తక్కువ చేసి చూసుకోవడమే జీవితంలో ఒడిదుడుకులకు కారణం అన్నది తెలుసుకోండి. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం అలవర్చుకోండి. జీవితంలో గొప్ప నిర్ణయాలు తీసుకొని ౖపైకి ఎదిగే సమయమిదే. మీకు ఇష్టమైన వ్యక్తి ఇచ్చే సూచనలు పాటించండి. కొత్త పనులు మొదలుపెడతారు. సరికొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. కొంత కాలంగా పూర్తి చేయాలనుకుంటున్న ఇంటి పనులు కొన్ని పూర్తవుతాయి. మానసిక ఉల్లాసానికి విహారయాత్రకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త వ్యక్తిని కలుసుకుంటారు. కలిసివచ్చే రంగు : నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) చాలాకాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ పరిష్కారం దొరుకుతుంది. కొత్తగా, ఉత్సాహంగా, మీదైన శైలిలో సవాళ్లను ఎదుర్కొండి. మీ శరీరానికి, మనసుకు విశ్రాంతి అవసరం. కొన్ని రోజుల పాటు ఏదైనా విహార యాత్రలకు వెళ్లండి. ఈ యాత్రతో మీకు ప్రశాంతత చేకూరడంతో పాటు ఆరోగ్యం కూడా చక్కబడుతుంది. మిమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సాహించే వ్యక్తులతో బాగా మాట్లాడండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. కలిసివచ్చే రంగు : ఊదా ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొత్త విషయాలు తెలుసుకోవాలన్న మీ ఉత్సాహాన్ని అలాగే కొనసాగించండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. విదేశీ ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ప్రయాణం మీకు మరింత ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. గతంలో తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు కొత్త అవకాశాలు తలుపు తడతాయి. మీకు ఇష్టమైన తత్వశాస్త్రాన్ని ఎప్పటికప్పుడు చదువుతూనే ఉండండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : లేత గోధుమ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) జీవితాన్ని మీరు కోరుకునే విధంగా మలుచుకునే సమయం ఇదే. మీపై మీకున్న నమ్మకంతో నిర్ణయాలు తీసుకోండి. మీరు చేసిన ప్రమాణాలు, మీకు మీరే ఏర్పరచుకున్న నియమాలను గుర్తు తెచ్చుకొని పనిచేయండి. పెద్దలను గౌరవించడం మరవకండి. వారి ఆశీస్సులు మీకు మరింత శక్తినిస్తాయి. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో చేసిన తప్పులను సమీక్షించుకుంటారు. ఇది మీ ఉన్నతికి ఎంతగానో ఉపయోగపడుతుంది. సోమవారాలు మీకు బాగా కలిసివస్తాయి. అనవసరం ఖర్చులకు దూరంగా ఉండండి. కలిసివచ్చే రంగు : నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) రానున్న రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఊహించని స్థాయిలో మెరుగుపడుతుంది. కొత్త కొత్త ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు. ధైర్యంగా ముందడుగు వేసే మీ ఆలోచనా విధానాలే మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తాయి. జీవితాన్ని ఎప్పట్లానే బాగా ఆస్వాదించండి. వృత్తిపరంగా మీకు గొప్ప గుర్తింపు దక్కుతుంది. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న ఓ మంచి పని కూడా జరుగుతుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. అనవసర ఖర్చులు పెరిగిపోవడాన్ని గురించి ఎక్కువ ఆలోచిస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనవసర ఖర్చులు చేస్తారు. ఇదే విషయంపై విపరీతంగా ఆలోచిస్తారు కూడా. మీ గమ్యం వైపుకు సరైన అడుగులు వేయాల్సిన సమయమిది. మీకు ఉపకరించే కొన్ని పనుల నుంచి మీకై మీరే దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకొని మీకేం కావాలో నిర్ణయించుకోండి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. లాఫింగ్ బుద్ధను ఇంట్లో తెచ్చిపెట్టుకోండి. ఆదివారాలు మీకు బాగా కలిసివస్తాయి. ఇష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. వారితో మాట్లాడి ఎక్కువ ఉత్సాహంగా ఈవారాన్ని గడుపుతారు. కలిసివచ్చే రంగు : బూడిద ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు(17 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్ 2017 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. పాతబాకీలు వసూలవుతాయి. మీ ఊహలు నిజం చేసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. జీవితాశయం నెరవేరుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. గులాబి, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఎంతటి కార్యాన్నైనా చాకచక్యంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వాహనాలు, స్థలాలు కొంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకర్షిస్తుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. కళాకారులకు సన్మానాలు. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ పూజలు చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులలో అవాంతరాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం కాగలవు. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఇతరులకు సైతం సహాయపడతారు. ఆస్తుల వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. వ్యాపారాలలో అనుకూలస్థితి, పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు అందుతాయి. విద్యార్థులకు శుభవర్తమానాలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అదనపు రాబడి ఉంటుంది. అనుకున్న పనులు సాఫీగా పూర్తి కాగలవు. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుబాటు అవుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు సమస్యలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. షేర్ల విక్రయాలలో అధిక లాభాలు. పసుపు, లేతనీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, స్నేహితుల నుంచి శుభవర్తమానాలు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. విలువైన వస్తువులు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగి ముందుకు సాగుతారు. కళాకారులకు సన్మానాలు. విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు. షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం. ఎరుపు, లేత గులాబి రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) వ్యయప్రయాసలు ఎదురైనా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకున్న లక్ష్యాలు సాధించే వరకూ విశ్రమించరు. ఆర్థిక వ్యవహారాలో చిక్కులు తొలగుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ సత్తా చాటుకునేందుకు తగిన సమయం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొన్ని ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కళాకారులు, పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగిస్తాయి. పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆలోచనల అమలులో ప్రతిబంధకాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కొంత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉండవచ్చు. కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. షేర్ల విక్రయాలు సామాన్యంగా లాభిస్తాయి. నలుపు, నీలం రంగులు. దక్షిణదిÔ¶ ప్రయాణాలు. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాలలో ఆటుపోట్లు తొలగుతాయి. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు కోరుకున్న బదిలీలు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. షేర్ల విక్రయాలలో లాభాలు. గులాబి, తెలుపు రంగులు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) మీలోని ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న ఆదాయం సమకూరుతుంది. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వాహనాలు, భూములు సమకూర్చుకుంటారు. వ్యాపారాలు విస్తరించడంలో ఆటంకాలు అధిగమిస్తారు. ఉద్యోగుల శ్రమ ఫలిస్తుంది. కళాకారులకు సన్మానాలు జరుగుతాయి. షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. గులాబి, పసుపు రంగులు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్య సూచనలు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. కొన్ని కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కార దశకు చేరతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. షేర్ల విక్రయాలు లాభిస్తాయి. ఆకుపచ్చ, లేత పసుపు రంగులు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) వీరిని విజయాలు వరిస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. ధార్మిక కార్యక్రమాలు చేపడతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు హోదాలు రాగలవు. కళాకారులకు విశేష ఆదరణ. షేర్ల విక్రయాలలో లాభాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబసభ్యుల వైఖరిలో అనుకూల మార్పు కనిపిస్తుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుతుంది. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాల వైపు సాగుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. వారం ప్రారంభంలో ధననష్టం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (17 డిసెంబర్ నుంచి 23 డిసెంబర్, 2017 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) గత కొద్దికాలంగా మిమ్మల్ని కష్టాల్లోకి నెట్టేసిన పరిస్థితులన్నీ నెమ్మదిగా సర్దుకుంటాయి. జీవితంలో మంచి రోజులన్నవి ఈవారం నుంచే మొదలవుతాయి. కొత్తగా ఆలోచిస్తారు. ఎప్పట్నుంచో అనుకుంటున్న మీకిష్టమైన పని ఒకటి మొదలుపెడతారు. సొంతంగా ఒక్కరే అన్ని భారాలనూ మీద వేసుకొని పని చేసే మీ స్వభావం కాస్తంత మారాల్సి ఉంది. కొత్త వ్యక్తి పరిచయమవుతారు. ఆ వ్యక్తితో కలిసి నూతన వ్యాపారం మొదలుపెట్టే ఆలోచన చేస్తారు. ప్రేమ జీవితం అహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : గులాబి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అదృష్టం బాగా కలిసివస్తుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులు చేస్తున్నారన్న ఆలోచన మిమ్మల్ని బాధపెడుతుంది. వృత్తి జీవితంలో కొన్ని అనుకోని ఇబ్బందులు తలెత్తుతాయి. అయితే ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకెళ్లండి. మీరు ఊహించని ఓ అవకాశం తలుపుతడుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు సిద్ధంగా ఉండండి. మీరు బాగా ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. కలిసివచ్చే రంగు : పసుపు మిథునం (మే 21 – జూన్ 20) మీకు బాగా దగ్గరైన వ్యక్తితో కలిసి ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టే ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన మంచిదే అన్న విషయాన్ని నమ్మి, ధైర్యంగా ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే చాలా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. అవతలి వ్యక్తిని అర్థం చేసుకోవడంలో ఇంకా వెనకబడి ఉన్నారేమో ఆలోచించుకోండి. ఆ ఆలోచన చేస్తే ఇక మీ ప్రేమ జీవితం మళ్లీ అద్భుతంగా ఉంటుందన్న విషయం మరవకండి. కలిసివచ్చే రంగు : వయలెట్ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఈవారం మీకు కొన్ని అనుకోని సమస్యలు ఎదురవుతాయి. మీరు ఇష్టంగా ప్రేమించే వ్యక్తితో మనస్ఫర్థాలు తలెత్తుతాయి. సామరస్యంగా ఈ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి. ఆ వ్యక్తి మీ జీవితానికి ఎంత అవసరమో గ్రహించి, వారికి దూరం కాకుండా ఉండేందుకు ఏమేం చేయాలో అన్నీ చేయండి. ఈ నెలాఖర్లో ఎప్పట్నుంచో ఊరిస్తోన్న విజయం వరిస్తుంది. రుద్రాక్ష మాల ధరించి కొత్త ఉత్తేజం పొందండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈవారం మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అయితే ఇప్పటికీ ఇంకా కుదురుకోనట్లైతే ఆ నిర్ణయాలను వాయిదా వెయ్యడమే మంచిది. కొద్దిరోజుల పాటు ప్రశాంతంగా ఉంటూ, మీ జీవితానికి ఏది సరైనదో గ్రహించి, ఆ నిర్ణయమే తీసుకోండి. తొందరపడొద్దు. కొన్నాళ్లపాటు మీరు అనుకున్నవేవీ జరగకపోవచ్చు కూడా. అయితే ఇదంతా తాత్కాలికమేనని, ఈ సమయం దాటిపోతే ఇక అంతా మంచే జరుగుతుందన్న విషయాన్ని బలంగా నమ్మండి. కలిసివచ్చే రంగు : నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఈవారం ఒక శుభవార్త వింటారు. ఈ వార్త మీకు నూతనోత్సాహాన్నిస్తుంది. మీ భయాలను తుంచుకొని అందరితో కలిసిపోయే స్వభావాన్ని అలవర్చుకోవాల్సిన సమయం ఇదే. మీలో రావాల్సిన ఈ మార్పే మిమ్మల్ని కొత్త విజయాలవైపుకు తీసుకెళుతుంది. కొంతకాలం మీకు పరిస్థితులన్నీ అనుకూలించినట్టే ఉంటూ కొన్ని సమస్యలను తీసుకొస్తాయి. వీటన్నింటికీ ఏవిధంగానూ జంకకుండా ధైర్యంగా నిలబడండి. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : నారింజ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీకు ముందున్నంతా మంచి కాలమే. ఎప్పట్నుంచో కోరుకున్న కోరికలూ ఇప్పుడే నెరవేరి జీవితానికే కొత్త వెలుగు వచ్చినట్లు అనిపిస్తుంది. ఈ విజయాలకు తోడు కొత్త అవకాశాలూ మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అయితే ఆ అవకాశాల్లో మీకు బాగా సంతృప్తినిచ్చే వాటినే ఎంపిక చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇష్టంగా ప్రేమించే వ్యక్తితో విహారయాత్రకు వెళ్లే ఆలోచన ఉంటే అందుకు ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఏడాది చివర్లో ఓ శుభవార్త వింటారు. మీరు ఎప్పుడో మొదలుపెట్టిన ఓ పని ఇప్పుడే ఫలితాలనివ్వడం మొదలుపెడుతుంది. కొత్త అవకాశాలు కూడా వరుసగా వచ్చి పడతాయి. జీవితాశయం వైపుకు మిమ్మల్ని నడిపించే అవకాశాలను మాత్రం అందిపుచ్చుకోండి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఫలితం గురించి ఆలోచించకుండా ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్న ఓ పనిని మొదలుపెట్టేందుకు ఇదే సరైన సమయం. కలిసివచ్చే రంగు : బూడిద ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆర్థిక పరిస్థితి కొంత కలవరపెడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండడం అలవాటు చేసుకోండి. వృత్తిజీవితం ఎప్పట్లానే బాగుంటుంది. ఉన్నత పదవిని అలంకరిస్తారు. కొత్త బాధ్యతలు చేపడతారు. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. మీ సొంత ఇంటి కలను నిజం చేసుకునేందుకు, ఆ వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదే. తాత్విక ఆలోచనలు మిమ్మల్ని కొద్దిరోజులు బాగా వెంటాడతాయి. జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు కూడా త్వరలోనే దక్కుతుంది. కలిసివచ్చే రంగు : ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారం మీకు అంతా మంచే జరుగుతుంది. అలాగే ఈ నెల్లోనే జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఎప్పట్నుంచో దీనికి సన్నాహాలు చేసుకున్నా, ధైర్యంగా మీకు ఏమేం అవసరమో వాటిని నిర్ణయించుకొని ముందుకెళ్లండి. ప్రేమ జీవితం ఊహించనంత ఆహ్లాదకరంగా ఉంటుంది. విహారయాత్రలకు కూడా సన్నాహాలు చేస్తారు. అసలు ఖాళీ సమయం అన్నదే లేకుండా పనుల్లో మునిగిపోతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి జీవితం చాలా బాగుంటుంది. కొత్త బాధ్యతలతో ఖాళీ సమయం అన్నదే లేకుండా కష్టపడతారు. అయితే మీకు రావాల్సిన గుర్తింపు ఇప్పటికీ దక్కడం లేదన్న బాధ మాత్రం మిమ్మల్ని బాధపెడుతుంది. ఆత్మవిశ్వాసంతో, విజయంపై ధీమాతో కష్టపడి పనిచేయండి. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు ఇష్టపడే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆ వ్యక్తి మీకో ప్రత్యేక బహుమతి కూడా అందిస్తారు. కలిసివచ్చే రంగు : పసుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఒక ప్రత్యేక వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి పరిచయం మీ ఆలోచనా విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. మిమ్మల్ని మీరే కొత్తగా ఆవిష్కరించుకుంటారు. ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న విజయం కూడా త్వరలోనే మీకు దగ్గరగా వస్తుంది. ఆలోచనా విధానం మారడం వల్ల కూడా కొత్త అవకాశాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి గతంలోకంటే చాలా మెరుగవుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తిజీవితం అంతా సాఫీగా సాగిపోతుంది. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు(3 డిసెంబర్ నుంచి 9 డిసెంబర్ 2017 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరుగుతుంది. అనుకున్న పనుల్లో స్వల్ప ఆటంకాలు. కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పుతాయి. బం«ధువర్గంతో విభేదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు ఒత్తిడులు ఉండవచ్చు. వ్యాపారాలు సామాన్యంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు విధుల్లో మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఎటువంటి కార్యక్రమమైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తుల విషయంలో చిక్కులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. గులాబి, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌కు కుడుములు నివేదించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి గట్టెక్కుతారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. ఆలోచనలు కలసివస్తాయి.సభలు, సమావేశాలకు హాజరవుతారు. ఊహించని విధంగా ఉద్యోగావకాశాలు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలకు పట్టింది బంగారమే. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) రుణ విముక్తులవుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లు ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వీరికి అన్నీ విజయాలే దక్కుతాయి. ఆర్థికంగా గతవారం కంటే మెరుగైన పరిస్థితి. లక్ష్యసాధనలో కుటుంబసభ్యుల సహకారం అందుతుంది. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు సన్మానాలు,అవార్డులు రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్కు అర్చనలు చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ప్రముఖులు పరిచయమవుతారు. కార్యక్రమాలలో పురోగతి కనిపిస్తుంది. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఖర్చులు. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, లేతనీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాలయంలో అభిషేకం చేయించుకోండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి చేస్తారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము కొంతవరకూ అందుతుంది. ఇతరులకు సైతం సహాయం అందిస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చర్చలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. ఉద్యోగుల పనితీరుపై ప్రశంసలు. రాజకీయవర్గాలకు పదవులు లభిస్తాయి. నేరేడు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనుల్లో జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యల నుంచి గట్టెక్కే అవకాశం. నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. వాహనాలు, భూములు కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతజ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకుంటారు. వ్యాపారాలలో పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఎరుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త మిత్రుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. రుణబాధల నుంచి విముక్తి. విందువినోదాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. కళాకారులకు శుభవార్తలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. గులాబి, లేత ఎరుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అమ్మవారికి పులిహోర నివేదించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు కాస్త తీరతాయి. ఆప్తులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. మీపై వచ్చిన విమర్శలు తొలగుతాయి. ఇంటాబయటా అనుకూలం. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు రావచ్చు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. నీలం, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోతాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్య కార్యక్రమాలు కొంత నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. రాబడి కొంత పెరిగే అవకాశం. గత స్మృతులు నెమరువేసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. వాహనయోగం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు కాగలవు. ఆరోగ్యం మాత్రం కొంత ఇబ్బంది పెట్టవచ్చు. కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వివాదాలు. అనుకోని ఖర్చులు. గులాబి, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (3 డిసెంబర్ నుంచి 9 డిసెంబర్, 2017 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఈవారం ఓ శుభవార్త వింటారు. మీరు ఎంతో ఇష్టంగా మొదలుపెట్టిన ఓ పని విజయవంతంగా పూర్తవుతుంది. కొత్త ఉత్సాహంతో పనిచేస్తారు. ఈ ఉత్సాహమే మిమ్మల్ని మరిన్ని గొప్ప విజయాల వైపుకు తీసుకెళుతుంది. విహారయాత్రకు సన్నాహాలు చేస్తారు. కొత్త అవకాశాలు మీ తలుపు తడతాయి. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాలను అందిపుచ్చుకోండి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : పసుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేయాల్సిన సమయం ఇదే. వృత్తి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ మార్పుల వల్ల కాస్తంత ఒత్తిడి కూడా ఎక్కువవుతుంది. మీదైన పంథాలో ప్రశాంతంగా పనిచేసుకుంటూ వెళ్లండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే మెరుగుపడుతుంది. ఒత్తిడిని జయించడానికి విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి మీకు పరిచయమవుతారు. ఈ పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. కలిసివచ్చే రంగు : ఊదా మిథునం (మే 21 – జూన్ 20) వృత్తి జీవితంలో ఓ కీలక మార్పు చోటుచేసుకోబోతోంది. అందుకు అన్నివిధాలా సిద్ధంగా ఉండండి. మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. మీదైన ప్రతిభను ప్రదర్శించడానికి ఇదే సరైన సమయం. మీరు ఎప్పట్నుంచో కోరుకుంటోన్న గొప్ప విజయం దగ్గరలోనే ఉంది. ఆ విజయానికి చేరువయ్యేందుకు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయండి. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు తప్పవు. మీతోనే ఉంటూ మీ గురించి తప్పుడుగా మాట్లాడేవారు చుట్టూ ఉన్నారు. జాగ్రత్త పడండి. కలిసివచ్చే రంగు : బంగారం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కొత్త ఆలోచనలు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అవన్నీ మీ జీవితాశయం వైపుకు అడుగులు వేయించేవే అన్న విషయాన్ని బలంగా నమ్మండి. కొత్త పెట్టుబడుల విషయంలో ఉత్సాహం చూపుతారు. మీ అనుభవాన్నంతా రంగరించి పెట్టుబడుల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ప్రేమ జీవితం ఊహించనంత ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎప్పట్లానే స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈవారమంతా ఊహించనంత సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. గతంలో మొదలుపెట్టిన కొన్ని పనులు విజయవంతంగా కొనసాగుతూ లాభాలను తెచ్చిపెడతాయి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇదే సరైన సమయం. వృత్తి జీవితం చాలా బాగుంటుంది. కొత్త బాధ్యతలు చేపడతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయండి. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొద్దిరోజులుగా మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతోన్న సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం దొరుకుతుంది. రాబోయే రోజుల్లో ఉత్సాహంగా మీ జీవితాశం వైపు అడుగులు వేస్తారు. మీదైన ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునేందుకు ఒక వేదిక దొరుకుతుంది. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తూ ముందుకు వెళ్లండి. నమ్మకమే మీ ఆయుధమన్న విషయాన్ని ఏ వేళలోనూ మరవకండి. ప్రేమ జీవితం ఆందోళనకరంగా ఉంటుంది. అయితే ఆ పరిస్థితులూ త్వరలోనే సర్దుకుంటాయి. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తులను ఎప్పటికీ దూరం చేసుకోకండి. కలిసివచ్చే రంగు : పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మిమ్మల్ని ఎంతగానో కలవరపెడుతోన్న సమస్యలు ఈవారమూ అలాగే ఉంటాయి. అయితే ఆ సమస్యలను చూసి చింతించకుండా ముందుకు వెళ్లడమే జీవితం అన్న విషయాన్ని బలంగా నమ్మండి. మరికొద్దిరోజుల్లోనే ఈ సమస్యలన్నీ సర్దుకుంటాయి. నమ్మకమే మీ ఆయుధం. ఆత్మవిశ్వాసంతో పనిచేయలేకపోతే, మీ కలలు కలలుగానే మిగిలిపోతాయి. ఒక వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తుంది. మీకు ఇష్టమైన వ్యక్తి ఈ కష్టకాలంలో మీకు తోడుగా ఉంటారు. కలిసివచ్చే రంగు : నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఈవారం ఓ శుభవార్త వింటారు. ఎప్పట్నుంచో మీరు ఈ శుభవార్త వినడం కోసమే ఎదురుచూస్తున్నారు. ఒక గొప్ప విజయం మీకు దగ్గరగా వచ్చి ఉంది. ఆ విజయాన్ని పూర్తిగా మీ సొంతం చేసుకునేందుకు, మీ శక్తినంతా వెచ్చించి పనిచేయండి. జీవితాశయం వైపుకు అడుగులు వేయాల్సిన సమయం ఇదేనన్న విషయాన్ని నమ్మండి. మీ చుట్టూ ఉండే, మీ మంచి కోరే వ్యక్తుల మాటలు మంచి ఉత్సాహాన్నిస్తాయి. ఆ ఉత్సాహంతోనే మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా పనిచేయండి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ ఆలోచనా విధానం పూర్తిగా మారాల్సిన పరిస్థితులు తలెత్తుతాయి. అయితే అదంతా మీ మంచికే జరిగే విషయమన్నది నమ్మండి. ఇందుకోసం మిమ్మల్ని మీరు కొత్తగా ఆవిష్కరించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. వీటన్నింటినీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉండండి. మీ చుట్టూ ఉండేవాళ్లు మీ ప్రయాణానికి, మీ పద్ధతులకు గౌరవం ఇచ్చే వారే ఉండేలా జాగ్రత్తపడండి. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి కలిసివచ్చే రంగు : నీలం మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా మీరు ఊహా లోకంలో విహరిస్తారు. మీ ఆలోచనలను అలా కొనసాగిస్తూనే కలల ప్రపంచాన్ని నిజం చేసుకునేందుకు కష్టపడండి. అందుకు ఇదే సరైన సమయం అన్న విషయం కూడా నమ్మండి. మీకు ఇష్టమైన వ్యక్తులు ఇచ్చే సలహాలను పాటించడం మరవకండి. వారి సలహాలు, సూచనలతోనే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ విజయంలో మీ జీవితభాగస్వామి పాత్ర ప్రధానంగా ఉంటుంది. విహారయాత్రకు వెళ్లి మరింత ఉత్సాహంగా ఆలోచిస్తారు. కలిసివచ్చే రంగు : వెండి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఈవారం మీకు అద్భుతంగా ఉంటుంది. మీరు కోరుకుంటున్న ఓ కీలక మార్పు దగ్గరలోనే ఉంది. ఆ మార్పుతో మీ ఆలోచనా విధానాన్ని కొత్తగా ఆవిష్కరించుకుంటారు. మీ ప్రతిభ ప్రపంచానికి పరిచయమవుతుంది. గొప్ప విజయాన్ని త్వరలోనే అందుకుంటారు. ప్రేమ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. పెళ్లి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండండి. కలిసివచ్చే రంగు : ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఈవారం కొన్ని అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. జీవితమంతా ఓ దగ్గర ఆగిపోయినట్టు, కష్టంగా కాలం గడుస్తున్నట్టు అనిపిస్తుంది. అయితే ఇదే పరిస్థితి ఎల్లకాలం ఉండిపోతుందని కాదు. ప్రశాంతంగా భవిష్యత్‌పై నమ్మకంతో మీ శ్రమనంతా వెచ్చించి పనిచేస్తూ వెళ్లండి. ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా విహారయాత్రకు సన్నాహాలు చేసుకోండి. కొత్తగా మొదలయ్యే జీవితానికి ముందు పరిస్థితులు ఇలాగే ఉంటాయని నమ్మండి. కలిసివచ్చే రంగు : ముదురు ఆకుపచ్చ ఇన్సియా టారో అనలిస్ట్ -
గ్రహం అనుగ్రహం, సోమవారం 24, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.నవమి ఉ.8.24 వరకు, తదుపరి దశమి, నక్షత్రం జ్యేష్ఠ రా.7.39 వరకు, వర్జ్యం తె.3.44-5.21 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం ప.12.27- 1.17 వరకు, తదుపరి ప.3.01 నుంచి 3.51 వరకు, అమృతఘడియలు ఉ.10.33 నుంచి 12.10 వరకు. సూర్యోదయం : 5.48 సూర్యాస్తమయం : 6.18 రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు భవిష్యం మేషం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి. వృషభం: పనులలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక లాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం. మిథునం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. కర్కాటకం: ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. సింహం: ఆర్థిక ఇబ్బందులు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం. కన్య: శుభకార్యాలకు హాజరవుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం. తుల: బంధువులతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే. వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. ధనుస్సు: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు. మకరం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. - సింహంభట్ల సుబ్బారావు -
గ్రహం అనుగ్రహం, ఆగస్టు 12, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు నిజ ఆషాఢ మాసం తిథి బ.త్రయోదశి సా.6.01 వరకు తదుపరి చతుర్దశి నక్షత్రం పునర్వసు రా.10.49 వరకు వర్జ్యం ప.10.16 నుంచి 11.57 వరకు దుర్ముహూర్తం ప.11.40 నుంచి 12.30 వరకు అమృతఘడియలు రా.8.11 నుంచి 9.54 వరకు భవిష్యం మేషం: ధన, వస్తు లాభాలు. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవం. ఉద్యోగయోగం. వ్యాపార, ఉద్యోగాలలో ప్రోత్సాహం. దైవదర్శనాలు. వృషభం: పనులలో జాప్యం జరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు. రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇంటా బయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశపరుస్తాయి. మిథునం: పనులు చకచకా సాగుతాయి. ఆశ్చర్య కరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. విందు వినోదాలు చేస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది. కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో చికాకులు పెరిగే అవకాశం ఉంది. అనారోగ్యం పాలవుతారు. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. సింహం: పనుల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. వాహన సౌఖ్యం. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి. కన్య: ఆదాయం పెరుగుతుంది. వస్తులాభాలు. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరం. తుల: బంధువర్గంతో విభేదాలు రావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆరోగ్య భంగం కలగవచ్చు. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళం నెలకొనే పరిస్థితి రావచ్చు. వృశ్చికం: మిత్రులతో వివాదాలు వచ్చే అవకాశం ఉంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగించవచ్చు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. ధనుస్సు: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో ఆనందంగా గడుపుతారు. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. మకరం: వాహన యోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. పనులు సజావుగా సాగుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలస్థితి నెలకొంటుంది. కుంభం: పనులు మధ్యలో వాయిదా వేస్తారు. శ్రమపడ్డా ఫలితం ఉండదు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి. మీనం: బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. రుణ యత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకోని మార్పులు సంభవిస్తాయి. - సింహంభట్ల సుబ్బారావు -
చంద్రబింబం: అక్టోబర్ 19 నుండి 25 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ఆస్తులు సమకూర్చుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఇంటాబయటా ఎదురుండదు. పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సోదరులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో దూరప్రయాణాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు కొంత వరకూ తొలగుతాయి. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో అనుకోని ప్రయాణాలు. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనుల్లో కొంత జాప్యం తప్పదు. ప్రయాణాలలో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. సోదరులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆరోగ్యపరంగా చికాకులు. వ్యాపార విస్తరణ యత్నాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు తప్పవు. పారిశ్రామికవర్గాలకు విదేశీపర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) పట్టింది బంగారమే అన్నట్టుంటుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలలో ప్రోత్సాహకరం. ఉద్యోగులకు ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు. వారం చివరిలో అనారోగ్యం. ప్రయాణాలలో అవాంతరాలు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వ్యవ హారాలలో విజయం సాధిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. మీ శ్రమ వృథా కాదు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు సన్మానయోగం. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు ఊహించని అవకాశాలు. వ్యాపారులు అనుకున్న లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగులకు కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) మీ ఊహలు నిజం కాగలవు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. వాహనయోగం. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు అభివృద్ధి పథంలో సాగుతారు. వారం మధ్యలో ఆరోగ్యభంగం. బంధువులతో వివాదాలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఇంటాబయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. పోటీపరీక్షల్లో విజయం. వాహనాలు, ఇళ్లు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. రాజకీయవర్గాలకు సన్మానయోగం. వారం చివరిలో ధనవ్యయం. అనుకోని ప్రయాణాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) పనులు నెమ్మదించినా క్రమేపీ పుంజుకుంటాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు రాగలవు. ఆకస్మిక ప్రయాణ సూచనలు. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. వాహనసౌఖ్యం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. కళారంగం వారికి ఒత్తిడులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు తొలగే అవకాశం. రాజకీయవర్గాలకు కొత్త హోదాలు. వారం మధ్యలో కుటుంబసభ్యులతో విభేదాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. శ్రమాధిక్యం. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష పండితులు