గ్రహం అనుగ్రహం, సోమవారం 24, 2015 | graham, anugraham to day | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, సోమవారం 24, 2015

Published Mon, Aug 24 2015 12:33 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, సోమవారం 24, 2015 - Sakshi

గ్రహం అనుగ్రహం, సోమవారం 24, 2015

శ్రీ మన్మథనామ సంవత్సరం, దక్షిణాయనం,  వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి శు.నవమి ఉ.8.24 వరకు, తదుపరి దశమి, నక్షత్రం జ్యేష్ఠ రా.7.39 వరకు, వర్జ్యం తె.3.44-5.21 వరకు (తెల్లవారితే మంగళవారం), దుర్ముహూర్తం ప.12.27- 1.17 వరకు, తదుపరి ప.3.01 నుంచి 3.51 వరకు, అమృతఘడియలు ఉ.10.33 నుంచి 12.10 వరకు.
సూర్యోదయం    :    5.48
సూర్యాస్తమయం    :    6.18
రాహుకాలం: ఉ.7.30 నుంచి 9.00 వరకు
యమగండం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

భవిష్యం
 
మేషం: ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

 వృషభం: పనులలో పురోగతి. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక లాభాలు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

 మిథునం: చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువుల నుంచి శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 కర్కాటకం: ఉద్యోగ యత్నాలు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బాధ్యతలు పెరుగుతాయి. ధనవ్యయం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

 సింహం: ఆర్థిక ఇబ్బందులు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

 కన్య: శుభకార్యాలకు హాజరవుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

 తుల: బంధువులతో విభేదాలు. అనారోగ్యం. ప్రయాణాలలో మార్పులు. వ్యయప్రయాసలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహమే.
 వృశ్చికం: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.

 ధనుస్సు: వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. విద్యార్థుల యత్నాలలో ఆటంకాలు.

 మకరం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

 కుంభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. వస్తులాభాలు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

 మీనం: వ్యవహారాలలో ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ తప్పదు.

 - సింహంభట్ల సుబ్బారావు
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement