గ్రహం అనుగ్రహం (డిసెంబర్ 20)
శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం,
తిథి బ.సప్తమి రా.10.24 వరకు,
నక్షత్రం పుబ్బ సా.6.24 వరకు తదుపరి ఉత్తర,
వర్జ్యం రా.1.54 నుంచి 3.34 వరకు,
దుర్ముహూర్తం ఉ.8.38 నుంచి 9.24 వరకు, తదుపరి రా.10.37 నుంచి 11.30 వరకు
అమృతఘడియలు... ప.11.48 నుంచి 1.26వరకు
భవిష్యం
మేషం: ఆకస్మిక ప్రయాణాలు. రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. అనారోగ్యం. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగులకు ఒత్తిడులు.
వృషభం: కొత్త రుణాలు చేస్తారు. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం.
మిథునం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో ఆదరణ. ఉద్యోగయత్నాలలో విజయం. స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు.
కర్కాటకం: వ్యవహారాలలో అవాంతరాలు. రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఉద్యోగులకు పనిభారం.
సింహం: శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు. దూరపు బంధువుల కలయిక. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
కన్య: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. విద్యార్థుల యత్నాలు ముందుకు సాగవు. వ్యాపార, ఉద్యోగాలలో ఊహించని మార్పులు.
తుల: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. భూవివాదాల పరిష్కారం. వాహన యోగం. వ్యాపారాల విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.
వృశ్చికం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
ధనుస్సు: ఆదాయం అంతగా కనిపించదు.ఆస్తి వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. దైవదర్శ నాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
మకరం: వ్యయప్రయాసలు. బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి,వ్యాపారాలలో నిరాశ.
కుంభం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
మీనం: వ్యవహారాలలో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఆశాజనకంగా ఉంటుంది.
– సింహంభట్ల సుబ్బారావు