గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 22) | graham anugraham (december 22) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 22)

Published Thu, Dec 22 2016 1:18 AM | Last Updated on Tue, Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 22) - Sakshi

గ్రహం అనుగ్రహం (డిసెంబర్‌ 22)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం,
తిథి బ.నవమి రా.12.11 వరకు, తదుపరి దశమి
నక్షత్రం హస్త రా.9.05 వరకు,
వర్జ్యం ...లేదు,
దుర్ముహూర్తం ఉ.10.09 నుంచి 11.01 వరకు,
తదుపరి ప.2.34 నుంచి 3.24 వరకు
అమృతఘడియలు ప.2.40 నుంచి 4.22 వరకు

భవిష్యం

మేషం: వ్యవహారాలలో విజయం. శుభకార్యాల నిర్వహణ. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కోరుకున్న హోదాలు.

వృషభం: పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

మిథునం: బంధు వర్గంతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పనుల్లో ఆటంకాలు.  వ్యయప్రయాసలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. పనులు అనుకున్న విధంగా పూర్తి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకమైన పరిస్థితి.

సింహం: కుటుంబంలో చికాకులు. రాబడికి మించి ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు విధుల్లో ఒత్తిడులు.

కన్య: కొత్త పనులు ప్రారంభిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆస్తి వివాదాలు కాస్త తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు. ఉద్యోగులకు పదోన్నతులు.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో ఇబ్బందులు ఎదురవుతాయి.

వృశ్చికం: రాబడి కొంత పెరుగుతుంది. కొత్త విద్యావకాశాలు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

ధనుస్సు: ఆకస్మిక ధనలాభం. కార్యక్రమాలు సజావుగా పూర్తి చేస్తారు. సంఘంలో ప్రత్యేక గౌరవం. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వృత్తి,వ్యాపారాలలో పురోభివృద్ధి.

మకరం: పనులు కొంత మందగిస్తాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. సోదరులతో అకారణ వైరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప మార్పులు.

కుంభం: మిత్రుల నుంచి ఒత్తిడులు. కొన్ని కార్యక్రమాలలో అవరోధాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

మీనం: పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు పదోన్నతులు తథ్యం.

– సింహంభట్ల సుబ్బారావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement