వారఫలాలు | Varafalalu( 24-03-2019) | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Mar 24 2019 1:04 AM | Last Updated on Sun, Mar 24 2019 1:04 AM

Varafalalu( 24-03-2019) - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఈవారం కొంతవరకూ రుణవిముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానించినా సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యావకాశాలు దక్కి విద్యార్థులు ఉత్సాహంగా సాగుతారు. కొందరికి విదేశీ విద్యావకాశాలు సైతం దక్కవచ్చు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు పరిష్కారం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సా«ధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆలోచనలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. బంధువులు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సహచరులతో ఉత్సాహంగా గడుపుతారు. పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి ఆశించిన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. ఆత్మీయులతో తగాదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
మొదట్లో కొంత వరకూ ఇబ్బందులు ఎదురవుతాయి. పనులపై శ్రద్ధ చూపరు. బంధువులతో విభేదిస్తారు. అయితే క్రమేపీ ఊరట లభిస్తుంది. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత అనుకూలత. భాగస్వాములు పెరుగుతారు. ఉద్యోగాలలో చిక్కులు అ«ధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
చేపట్టిన వ్యవహారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు లక్ష్యాలు నెరవేరతాయి. కుటుంబంలో సమస్యలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులు రావచ్చు. కళారంగం వారు అవార్డులు కైవసం చేసుకుంటారు. విశేష గుర్తింపు పొందుతారు. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. బంధువులు, మిత్రులతో కలహాలు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అన్నట్లుంటుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. ఆరోగ్యం కొద్దిగా మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. మీ అభిప్రాయాలతో కుటుంబసభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలలో ఒత్తిడులు ఎదురవుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరిగి, అధిక శ్రమను ఎదుర్కోవలసి ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఉత్సాహంతో పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. పరిస్థితులు  అనుకూలిస్తాయి. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి వచ్చిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల వివాదాల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో వివాహాలు జరిపిస్తారు.  విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో నెలకొన్న ఇబ్పందులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది, ఉద్యోగయోగం కలుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు తథ్యం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఊహించని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలను కుటుంబసభ్యుల సలహాల మేరకు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. మీ ప్రతిపాదనలకు బంధువులు ఆమోదం తెలియజేస్తారు. వాహనయోగం. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు పొందుతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపార లావాదేవీలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఉపశమనం పొందుతారు. పారిశ్రామికవర్గాలకు  ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మ«ధ్యలో ఆస్తి తగాదాలు. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చిక్కులు ఎదురైనా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మీపై అభియోగాలు మోపేందుకు కొందరు ఎదురుచూస్తుంటారు, అప్రమత్తంగా మెలగండి. వ్యాపారాలు మొత్తంమీద లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారు  ఆశనిరాశల మధ్య గడుపుతారు. వారం ప్రారంభంలో ధనలాభం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
మొదట్లో కొంత కష్టపడాల్సిన సమయం. క్రమేపీ అనుకున్న విధంగా అభివృద్ధి కనిపిస్తుంది. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులకు అవకాశం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో (24 మార్చి నుంచి 30 మార్చి, 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కలలను సాకారం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. వ్యాపార పారిశ్రామిక వర్గాల్లోని వారు భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల పెద్దస్థాయి ఒడంబడికలను కుదుర్చుకుంటారు. లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ప్రేమానుబంధాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. పెద్దల నుంచి విలువైన సలహాలు అందుకుంటారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. అలంకరణలపై దృష్టి సారిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పనులను చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని, మార్పు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. త్వరలోనే ఆ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. పనితీరు ద్వారా పొందిన గుర్తింపు వల్ల తేలికగానే మంచి అవకాశాలను అందుకుంటారు. అసంతృప్తికర వాతావరణం నుంచి త్వరలోనే బయటపడతారు. ఇంటిని కొత్తగా అలంకరిస్తారు. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సన్నిహితుల నుంచి కీలక సాయం పొందుతారు. మీపై వదంతుల వ్యాప్తికి కారణమైన వ్యక్తులను గుర్తిస్తారు. దైవాన్ని నమ్ముకుంటారు.
లక్కీ కలర్‌: పసుపు

మిథునం (మే 21 – జూన్‌ 20)
అనుభవాల ద్వారా పాఠాలు నేర్చకుంటారు. జీవితం పట్ల ఇప్పటి వరకు ఉన్న దృక్పథాన్ని మార్చుకుంటారు. తెలివిగా వ్యవహరించి హానికరమైన పరిస్థితులు ఎదురవకుండా చూసుకుంటారు. సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు మీరు రూపొందించుకున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది.
లక్కీ కలర్‌: నారింజ

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
అకుంఠిత దీక్షతో చేసిన కృషి వల్ల అసాధారణ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సంపదను పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు సాధించే సూచనలు ఉన్నాయి. కోరుకున్న పదవులను దక్కించుకోగలుగుతారు. కొత్తగా తలపెట్టిన పనులను ప్రారంభించడానికి ఇది పూర్తిగా అనువైన కాలం. ప్రేమ ప్రతిపాదన ఫలప్రదమవుతుంది. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. బరువును అదుపు చేసుకోవడంపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తారు. శుభవార్తలు సంతోషాన్నిస్తాయి.
లక్కీ కలర్‌: నీలం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
 క్షణికావేశాన్ని నియంత్రించుకుంటారు. ఆత్మపరిశీలన చేసుకుంటారు. సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. పని ప్రదేశంలో చిన్న చిన్న మార్పులు చేపడతారు. అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేసి చూపిస్తారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలను దర్శిస్తారు.
లక్కీ కలర్‌: లేత గోధుమరంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
గతం చేసిన గాయాల నుంచి తేరుకుంటారు. సానుకూల ఫలితాలను ఇచ్చే సరికొత్త దిశలో ముందుకు సాగుతారు. అయితే, భావోద్వేగాలను అదుపు చేసుకోవడం మంచిది. పనిలో సత్తా చాటుకుంటారు. గడ్డు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ధ్యానం ద్వారా సాంత్వన పొందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. స్థిరాస్తి లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం సమకూరే సూచనలు ఉన్నాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. 
లక్కీ కలర్‌: ఇటుక రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
తిరుగులేని పట్టుదలతో అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. కృతనిశ్చయంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అనుకున్న స్థాయిని మించి ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. కలలను నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. సుదూర యాత్రలకు వెళతారు. అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తారు. సత్యాన్వేషణలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడానికి సంకల్పిస్తారు.
లక్కీ కలర్‌:  తెలుపు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. విజయోత్సాహంతో ముందుకు సాగుతారు. ఊపిరిసలపని పనితో ఉక్కిరిబిక్కిరవుతారు. వరుస విజయాలతో అలసటను మరచిపోతారు. మీ పురోగతిలో పెనువేగానికి సన్నిహితులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఇతరుల అభిప్రాయాలకు మనసు పాడుచేసుకోకుండా ఉండటమే మంచిది. ఘర్షణ తలెత్తినప్పుడు మొండితనానికి పోకుండా, పట్టు విడుపు ధోరణితో పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ఆరోగ్యం మందగించవచ్చు..
లక్కీ కలర్‌: ఊదా

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఇంటా బయటా మార్పులు చేపడతారు. ముఖ్యంగా వాస్తుకు సంబంధించి మార్పులు, పరిహారాలు చేపడతారు.  పనుల పురోగతిలో వేగం పుంజుకుంటుంది. మీ జీవితంలో అద్భుతమైన కాలం మొదలైనట్లే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సలహాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వచ్చిన కీలకమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఫర్నిచర్‌ను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది.
లక్కీ కలర్‌: లేత బూడిదరంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. ఎంతోకాలంగా కోరుకుంటున్న స్వేచ్ఛా స్వతంత్రాలను మనసారా ఆస్వాదిస్తారు. మనస్సాక్షిని నమ్ముకుంటారు. మీ తీరు కొందరికి నచ్చకున్నా, మీదైన మార్గంలోనే ముందుకు సాగుతారు. సంగీతం, చిత్రలేఖనం వంటి లలిత కళల సాధనలో కొత్త ఉత్తేజాన్ని పొందుతారు. చిరకాల స్వప్నం నెరవేరే సూచనలు ఉన్నాయి. విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. బంధు మిత్రులకు బాసటగా నిలుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయవంతంగా నాయకత్వ పాత్ర పోషిస్తారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు.
లక్కీ కలర్‌: నారింజ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వారాంతంలో బంధు మిత్రులతో విందు వినోదాలను ఆస్వాదిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. మనసైన వ్యక్తి ముందు మీ మనసులోని మాటను వెల్లడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త అవకాశాలు తలుపుతడతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ప్రతి అంశంలోనూ సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. ఇంటా బయటా శాంతి సామరస్యాల కోసం పరితపిస్తారు. ఆర్థిక లాభాలు అద్భుతంగా ఉంటాయి. అదనపు ఆదాయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అసూయాపరులు మిమ్మల్ని తప్పుడు సలహాలతో తప్పుదారి పట్టించే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉన్నట్లయితే అలాంటి వారి ఉచ్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: బూడిదరంగు 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement