వారఫలాలు | Varafalalu( 21-04-2019) | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Apr 21 2019 12:59 AM | Last Updated on Sun, Apr 21 2019 12:59 AM

Varafalalu( 21-04-2019) - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొన్ని ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా అవసరాలకు లోటు రాదు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో కీలక విషయాలపై చర్చలు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సూచనలు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా ఉండి లాభాలు కనిపించవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగే అవకాశం.  కళారంగం వారికి మిశ్రమంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి నిరాశ పర్చినా ముఖ్యావసరాలు తీరతాయి. ఆలోచనలు అంతగా కలిసిరావు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కాంట్రాక్టర్లకు కొన్ని చిక్కులు ఎదురైనా అధిగమిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు కొంత ఊరటనిస్తుంది. భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో ధనప్రాప్తి. సన్మానాలు. గులాబీ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజకనంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. దీర్ఘకాలిక వివాదం నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాల శ్రమ వృథాగా మారుతుంది. వారం చివరిలో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలలో మరింత పురోగతి ఉంటుంది. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో అనుకూలత. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి, పెట్టుబడులకు లోటు రాదు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు రాగలవు. వారం ప్రారంభంలో అనారోగ్యం, శ్రమాధిక్యం. నేరేడు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. విద్యార్థులకు మరిన్ని ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రమపడినా ఫలితం అంతగా దక్కదు. విలువైన డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుకోండి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం.  గత స్మృతులు వెంటాడవచ్చు. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. సోదరులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు అంతగా పట్టించుకోరు. విద్యార్థులు, నిరుద్యోగులు కొంత నిరాశ చెందుతారు. ముఖ్యమైన పనులు నెమ్మదిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉంటాయి. రాజకీయవర్గాలకు మనశ్శాంతి లోపిస్తుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. స్పెక్యులేషన్‌ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించవచ్చు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
చేపట్టిన ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు.  కుటుంబసభ్యులతో తగాదాలు. నిరుద్యోగుల యత్నాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారి ప్రయత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో విందువినోదాలు. ధన,వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. 

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి ఆహ్వానాలు. సంఘంలో ఊహించని  గౌరవం లభిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి కొంతవరకూ బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఎరుపు, పసుపు రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలించదు. వారం మధ్యలో విందువినోదాలు. వస్తులాభాలు. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాబడతారు.  వ్యాపారాలు నూతన పెట్టుబడులతో  విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి కొత్త హోదాలు పొందుతారు. కళాకారులకు నూతనోత్సాహం, సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో మీ అభిప్రాయాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవానికి లోటు రాదు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. సృజనాత్మక కళారంగాలలోని వారికి సన్మాన సత్కారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్రలకు వెళతారు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు.  భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు మరింత పుంజుకుని విస్తరిస్తారు. ఉద్యోగాలలో అద్భుతంగా రాణిస్తారు. అనుకోని హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, లేత ఎరుపు రంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(21 ఏప్రిల్‌ నుంచి  27 ఏప్రిల్, 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహంతో లక్ష్యసాధన దిశగా ముందుకు సాగుతారు. మార్పు లేని జీవితం పట్ల విసుగుతో శరవేగంగా మార్పులకు నాందీప్రస్తావన చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. దుస్సాధ్యమనుకున్న లక్ష్యాలను అవలీలగా సాధించి ప్రత్యర్థులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ప్రేమికులతో ఏర్పడిన పొరపొచ్చాలను తొలగించుకునేందుకు స్వయంగా చొరవ తీసుకుంటారు. ఆర్థిక సుస్థిరత సాధించడానికి ప్రణాళికలు రచిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు.
లక్కీ కలర్‌: పసుపు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి మితిమీరుతుంది. వేళకు భోజనం చేయడానికి కూడా తీరిక దొరకడం కష్టమయ్యే పరిస్థితులు తలెత్తవచ్చు. ఆర్థిక పురోగతి దారిలో పడుతుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు అవసరమవుతాయి. వ్యాయామంపై దృష్టి సారించాలనుకున్నా, వ్యాయామం ప్రారంభించడానికి అవరోధాలు ఎదురవుతాయి. ప్రియతముల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. పిల్లల పురోగతి కొంత సంతోషాన్ని ఇస్తుంది.
లక్కీ కలర్‌: ఊదా

మిథునం (మే 21 – జూన్‌ 20)
సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అధికారం, పరపతి గల ఒక వ్యక్తిని కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. లాటరీలు, పందేలలో బహుమతులు గెలుచుకునే సూచనలు ఉన్నాయి. అదృష్టం కలసి వస్తుంది. స్థిరాస్తుల అమ్మకాల ద్వారా అంచనాలకు మించి లాభాలు వస్తాయి. ఇంటికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేయిస్తారు. విలాస వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలకు వెళతారు. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
సృజనాత్మక రంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. కళాకారులకు సన్మాన సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారి ప్రతిభా పాటవాలకు గుర్తింపు దొరుకుతుంది. కొందరికి పదోన్నతులు దక్కవచ్చు. కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రేమికుల సమక్షంలో సర్వస్వాన్నీ మరచిపోతారు. కలల్లో తేలియాడుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.
లక్కీ కలర్‌: గులాబి

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
సంకల్పబలంతో అనూహ్య విజయాలను సాధిస్తారు. లక్ష్య సాధన కోసం కృతనిశ్చయంతో కడవరకు పోరాడి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. పెట్టుబడులకు అనువైన కాలం. వృత్తి ఉద్యోగాల్లో గొప్ప పురోగతి ఉంటుంది. జనాకర్షణ పెరుగుతుంది. కార్యాలయంలోని ఆంతరంగిక సమావేశాల్లో పాల్గొంటారు. ఇతరులు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేనంత సానుకూలంగా ఉంటుంది. విందు విలాసాల కోసం ఖర్చు చేస్తారు. విహారయాత్రలకు వెళతారు. సన్నిహితులకు కానుకలు ఇస్తారు.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. విలక్షణమైన వ్యక్తులు తారసపడతారు. ఇల్లు మారే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో మార్పులు సంభవం. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. మెరుగైన పనితీరుతో నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ సన్నిహితుల్లో ఒకరు మీరు పనిచేస్తున్న సంస్థను వదిలి వెళ్లిపోతారు. వారసత్వ ఆస్తి కలసివచ్చే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తుల్లోని పెట్టుబడుల ద్వారా లాభాలు గడిస్తారు. వారాంతంలో పనిభారం పెరుగుతుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
లక్కీ కలర్‌: జేగురు రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
జీవితంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇబ్బందికరమైన సమస్యలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని అవరోధాలు ఎదురైనా, విజయవంతంగా వాటన్నింటినీ అధిగమిస్తారు. నిర్దేశిత లక్ష్యాలను సకాలంలోనే సాధిస్తారు. మిమ్మల్ని దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు తెరవెనుక రాజకీయాలు సాగిస్తారు. ప్రత్యర్థుల కుతంత్రాలను తిప్పికొట్టాలంటే మీరు కొంత లౌక్యాన్ని అలవరచుకోక తప్పదు. ఒక విశ్వసనీయమైన వ్యక్తి మీకు అండగా నిలుస్తారు. రుణభారం నుంచి బయటపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను కొద్దికాలం వాయిదా వేసుకుంటారు.
లక్కీ కలర్‌: నారింజ

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తారు. అకుంఠిత దీక్షతో పరిస్థితులను అదుపులోకి తెచ్చుకుంటారు. ఉద్యోగుల్లో కొందరికి స్థానచలనం తప్పకపోవచ్చు. త్వరలోనే శుభవార్త వింటారు. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. ఘన విజయాలను సాధించి, సహచరుల ప్రశంసలు పొందుతారు. ఇదివరకు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ అంచనాలకు మించి పెరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇంటికి అలంకరణలు చేపడతారు. 
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. పరిస్థితులు క్రమంగా దారిలోకి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు. కొందరికి విదేశాల్లో చదువుకునే అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సానుకూలమైన వ్యక్తుల సాంగత్యంలో గడుపుతారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు సన్నిహితులతో సమాలోచనలు జరుపుతారు. విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: లేత నీలం

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కలల్లో తేలియాడుతారు. సన్నిహితులతో సల్లాపాల్లో కాలక్షేపం చేస్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళికల పేరిట పగటి కలలు కంటారు. వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న స్తబ్దత కారణంగా ఉద్యోగ బాధ్యతలపై కొంత ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తారు. ఆలోచనలకే పరిమితం కాకుండా, కొంతైనా కార్యాచరణలోకి దిగితే సత్ఫలితాలు ఉంటాయి. గ్రహానుకూలత బాగుంది. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు కొత్త అవకాశాలకు దారి చూపుతాయి. ఆధ్యాత్మిక చింతనలో పడతారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
మహిళల తోడ్పాటుతో ఘన విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన హోదాను దక్కించుకుంటారు. విలువైన నగలను, విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. సొంత ఇంటి కల నెరవేరే సూచనలు ఉన్నాయి. రుణాలను తీర్చేస్తారు. తాకట్టులో ఉన్న వస్తువులను విడిపించుకుంటారు. ఇదివరకు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ బాగా పెరుగుతుంది. గురువుల ఆశీస్సులు పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారు ప్రేమలో పడతారు. విదేశీయాన సూచనలున్నాయి.
లక్కీ కలర్‌: ఎరుపు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
వ్యక్తిగత జీవితంలోను, వృత్తి ఉద్యోగాల్లోను కొన్ని అవరోధాలు తప్పకపోవచ్చు. మనోస్థైర్యం కోల్పోకుండా ఏటికి ఎదురీదుతారు. రెచ్చగొట్టే ప్రత్యర్థులు తారసపడతారు. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. దుష్ప్రచారాలతో మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు సహా ఆర్థిక నిర్ణయాలను ఈవారం వాయిదా వేసుకోవడం మంచిది. ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement