శ్రీశార్వరినామ సంవత్సరంఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసంతిథి బ.షష్ఠి రా.10.30 వరకుతదుపరి సప్తమి నక్షత్రం ధనిష్ఠ సా.6.20 వరకుతదుపరి శతభిషంవర్జ్యం. రా.2.03 నుంచి 3.45 వరకు దుర్ముహూర్తం ఉ.9.47 నుంచి 10.41 వరకు తదుపరి ప.3.00 నుంచి 3.54 వరకు అమృతఘడియలు....ఉ.7.19 నుంచి 9.01 వరకు
సూర్యోదయం 5.28
సూర్యాస్తమయం 6.30
రాహుకాలం ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం ఉ.6.00 నుంచి 7.30 వరకు
గ్రహఫలం...గురువారం, 11.06.20
మేషం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆర్థిక ప్రగతి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.
వృషభం: పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఆహ్వానాలు అందుతాయి. పనులలో పురోగతి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల మార్పులు. దైవచింతన.
మిథునం: ధనవ్యయం. వ్యయప్రయాసలు. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. అనారోగ్యం.
కర్కాటకం: పనులు వాయిదా పడతాయి. ఆలోచనలు కలిసిరావు. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. వ్యాపార, ఉద్యోగాలలో నిరాశ తప్పదు. విద్యార్థులకు శ్రమాధిక్యం.
సింహం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక ప్రగతి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనయోగం.
కన్య: పరిశోధనలు ఫలిస్తాయి. అనుకున్న పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. కీలక నిర్ణయాలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి.
తుల: పనుల్లో స్వల్ప ఆటంకాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వ్యయప్రయాసలు. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బందిగా ఉంటాయి. దైవచింతన.
వృశ్చికం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. అనారోగ్యం. బంధువులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.
ధనుస్సు: కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
మకరం: పనులు వాయిదా వేస్తారు. బంధువర్గంతో విభేదాలు. శ్రమ పెరుగుతుంది. అదనపు బాధ్యతలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశాజనకంగా ఉంటాయి.
కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ప్రగతి. ఉద్యోగయత్నాలు సానుకూలం. సంఘంలో ఆదరణ. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. విందువినోదాలు. వాహనయోగం.
మీనం: ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. పనులలో జాప్యం. మిత్రులతో స్వల్ప విభేదాలు. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆలయ దర్శనాలు.
Comments
Please login to add a commentAdd a comment