శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి బ.దశమి ప.1.29 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం పూర్వాభాద్ర ప.2.56 వరకు, తదుపరి ఉత్తరాభాద్ర, వర్జ్యం రా.1.33 నుంచి 3.19 వరకు, దుర్ముహూర్తం సా.4.38 నుంచి 5.29 వరకు, అమృతఘడియలు... ఉ.6.10 నుంచి 7.56 వరకు, హనుమజ్జయంతి.
సూర్యోదయం : 5.31
సూర్యాస్తమయం : 6.21
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
గ్రహఫలం
మేషం: పనుల్లో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. కుటుంబంలో సఖ్యత. నూతన ఉద్యోగాన్వేషణ. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
వృషభం: ప్రముఖులతో పరిచయాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన ఒప్పందాలు. వస్తులాభాలు. వ్యాపారాలు , ఉద్యోగాలలో అనుకూలత.
మిథునం: శ్రమాధిక్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. ఆలోచనలు కలసిరావు. ఆరోగ్యభంగం. ధనవ్యయం. బంధువర్గంతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిదానిస్తాయి.
కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా కొద్దిపాటి సమస్యలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరాశ పరుస్తాయి.
సింహం: సన్నిహితుల నుంచి పిలుపు. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.
కన్య: కొన్ని వివాదాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయ దర్శనాలు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
తుల: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. పనులు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
వృశ్చికం: పనులు మందగిస్తాయి. బంధువర్గంతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు.
ధనుస్సు: శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత. భూవ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మకరం: కుటుంబసభ్యులతో వైరం. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా మారతాయి.
కుంభం: ప్రముఖుల నుంచి కీలక సందేశం. పనులు అనుకున్న రీతిలో సాగుతాయి. ఆలయ దర్శనాలు. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.
మీనం: వ్యవహారాలలో జాప్యం. బంధువులు, మిత్రులతో వివాదాలు. కష్టమే మిగులుతుంది. అనారోగ్యం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ముందుకు సాగవు.
Comments
Please login to add a commentAdd a comment