గ్రహం అనుగ్రహం (19-05-2020) | Daily Horoscope in Telugu (19-05-2020) | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం (19-05-2020)

Published Tue, May 19 2020 6:08 AM | Last Updated on Tue, May 19 2020 6:24 AM

Daily Horoscope in Telugu (17-05-2020) - Sakshi

శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు వైశాఖ మాసం, తిథి  బ.ద్వాదశి సా.5.27 వరకు, తదుపరి త్రయోదశి, నక్షత్రం రేవతి రా.8.06 వరకు, తదుపరి అశ్వని వర్జ్యం ఉ.6.46 నుంచి 8.33 వరకు, దుర్ముహూర్తం  ఉ.8.04 నుంచి 8.56 వరకు, తిరిగి రా. 10.48 నుంచి 11.32 వరకు అమృతఘడియలు... సా.5.34 నుంచి 7.12 వరకు.

సూర్యోదయం :    5.31
సూర్యాస్తమయం    :  6.21
రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

గ్రహఫలం
మేషం: పనుల్లో అవాంతరాలు. రాబడికి మించిన ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు కొద్దిపాటి చికాకులు.

వృషభం: కొత్త విషయాలు తెలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు కాస్త ఊరట.

మిథునం: ప్రముఖుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహకరం.

కర్కాటకం: ఆస్తి వివాదాలు. ఆర్థిక లావాదేవీలలో ఒడిదుడుకులు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

సింహం: రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు  మందగిస్తాయి.

కన్య: నూతన విద్యావకాశాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

తుల: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆస్తిలాభ సూచనలు. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితి.

వృశ్చికం: దూరప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. కార్యక్రమాలలో ఆటంకాలు. అనారోగ్యం. కుటుంబసమస్యలు. వృత్తి, వ్యాపారాలలో సమస్యలు.

ధనుస్సు: ఆదాయానికి మించి ఖర్చులు. బ«ంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు.

మకరం: ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యవహారాలలో విజయం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు

కుంభం: దూరప్రయాణాలు. «బంధువులతో విభేదాలు. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో చిక్కులు.

మీనం: కార్యజయం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. సన్మానాలు. ప్రముఖులతో పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement