శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి శు.విదియ రా.11.55 వరకు, తదుపరి తదియ, నక్షత్రం మృగశిర తె.5.24 వరకు (తెల్లవారితే సోమవారం) తదుపరి ఆరుద్ర, వర్జ్యం ఉ.10.21 నుంచి 12.01 వరకు, దుర్ముహూర్తం సా.4.38 నుంచి 5.29 వరకు, అమృతఘడియలు... రా.8.13 నుంచి 9.13 వరకు.
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.23
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు
గ్రహఫలం
మేషం: వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులు ఒత్తిడులు పెంచుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.
వృషభం: సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. కొత్త వ్యాపార యత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.
మిథునం: మిత్రులతో విభేదాలు. పనుల్లో తొందరపాటు. ప్రయాణాలలో ఆటంకాలు. రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.
కర్కాటకం: విద్యార్థులకు శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొత్త పనులు చేపడతారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.
సింహం: ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వస్తులాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి.
కన్య: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.
తుల: కొత్త రుణాలు చేస్తారు. బంధువర్గంతో తగాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో చికాకులు. దైవదర్శనాలు.
వృశ్చికం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవర్తమానాలు. అదనపు ఆదాయం. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
ధనుస్సు: ఆశ్చర్యకర సంఘటనలు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు. కొన్ని వివాదాల పరిష్కారం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పైచేయి సాధిస్తారు.
మకరం: మిత్రులతో వివాదాలు. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపార విస్తరణ వాయిదా. ఉద్యోగాలలో సమస్యలు.
కుంభం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. పనులు ముందుకు సాగవు. దైవచింతన. దూరపు బంధువుల కలయిక. అనారోగ్యం. వ్యాపారాలు కొంత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త చిక్కులు.
మీనం: మిత్రుల నుంచి ఆహ్వానాలు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక ప్రగతి. కుటుంబంలో సమస్యలు తీరతాయి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు.
Comments
Please login to add a commentAdd a comment