Insiya K
-
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) వ్యూహాత్మకంగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వివాహాది శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు, మంచి గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నీలం, పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు అమలులో పెడతారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి, సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. తెలుపు, లేత ఎరుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. తెలుపు, కాఫీరంగులు, ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. విమర్శించిన వారేæ ప్రశంసిస్తారు. వాహనయోగం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు, పదోన్నతులు దక్కుతాయి. సాంకేతికవర్గాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. పసుపు, ముదురు ఎరుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు విజయాలు దక్కుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఎరుపు, పసుపుæరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని వ్యవహారాలు∙నెమ్మదించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులలో జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. సోదరులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అపరిష్కృత సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి చేయూతనందిస్తారు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో చికాకులు. గులాబీ, పసుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సహకారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. శ్రమ తప్పదు. నీలం, లేత పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చనలు చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. గోధుమ, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో కొద్దిపాటి ఆటంకాలు. నిర్ణయాలలో తొందరపాటు తగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో ( 5 మే నుంచి 11 మే, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొందరికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపించే సూచనలు ఉన్నాయి. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. విదేశీ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొందరికి ఎడబాటు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: గోధుమ రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. సవాళ్లను ఎదుర్కొంటారు. పనికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కొత్త భాగస్వాములతో కలసి వినూత్న వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపారాలను ఊహించని రీతిలో విస్తరిస్తారు. పొదుపు పథకాల్లో మదుపు పెట్టడానికి ఇది పూర్తిగా అనుకూలమైన కాలం. అయితే, స్పెక్యులేషన్ లావాదేవీలకు, లాటరీ జూదాలకు దూరంగా ఉండటం మంచిది. వారసత్వ ఆస్తి కలసి వస్తుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార పానీయాల పట్ల జాగ్రత్తలు తప్పని పరిస్థితులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) గతంలో చేసిన పనుల వల్ల తలెత్తిన ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయస్థానాల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అభివృద్ధికి దారితీసే అవకాశాలు అందివస్తాయి. ఏకకాలంలో విభిన్న నైపుణ్యాలతో కూడుకున్న పనులు చేయగల సామర్థ్యమే మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. పరిమితులు విధించుకోకుండా అందిన అవకాశాలను వినియోగించుకుంటేనే విజయ పథాన ముందుకు సాగగలుగుతారు. లక్కీ కలర్: పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో మీ నేతృత్వంలో పని చేస్తున్న బృందంలో ప్రతిభా పాటవాలను చాటుకున్న వారిని ప్రోత్సహిస్తారు. ఆర్థిక లాభాలను అందుకుంటారు. విలువైన విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితంలో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. స్వల్పకాలిక పెట్టుబడులు లాభాలనిస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పని ఒత్తిడి నుంచి విరామం కోసం విహారయాత్రలు చేస్తారు. లక్కీ కలర్: బంగారం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయికి మించి పుంజుకుంటుంది. మీ పురోగతికి ఇతరులు ఈర్ష్య పడతారు. వృత్తి ఉద్యోగాల్లో నిర్ణయాత్మక పదవులు వరించే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఫలితాలన్నీ ఒకేసారి దక్కకపోవచ్చు. కొంత ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారిలో కొందరితో వ్యాపార భాగస్వామ్యాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) పని మీద ఏకాగ్రత తగ్గుతుంది. అలసత్వం కారణంగా చేపట్టిన ముఖ్యమైన పనులపై కూడా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. స్వయంగా చొరవ తీసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకుంటే లక్ష్య సాధనలో వెనుకబడే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పొరపాట్లు దొర్లకుండా అప్రమత్తంగా ఉండటం మంచిది. ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు తెలెత్తే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పవచ్చు. పగటి కలలతో కాలక్షేపం చేయకుండా కార్యాచరణలోకి దిగడమే మంచిది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. లక్కీ కలర్: నాచు రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సృజనాత్మకతకు పదును పెడతారు. కళా సాంస్కృతిక రంగాల్లోని వారికి పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ఆర్థిక పరిపుష్టినిచ్చే కొత్త అవకాశాలు కలసి వస్తాయి. ఇతరులను తక్కువగా అంచనా వేయకుండా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: నేరేడు రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం మానసిక ఒత్తిడిని పెంచే సూచనలు ఉన్నాయి. పెట్టబడులు పెట్టే ముందు ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేనిపోని ఆకర్షణల వలలో చిక్కుకుని మోసపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరే సూచనలు ఉన్నాయి. సాహస క్రీడలపై ఆసక్తి చూపుతారు. విహార యాత్రలను ఆస్వాదిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పని ప్రదేశంలో అనూహ్యమైన అనుభవాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఆర్థిక సుస్థిరతను సాధిస్తారు. కుటుంబంలో కొంత అశాంతి నెలకొనే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం తలకు మించిన భారమవుతుంది. మొహమాటాన్ని విడిచిపెట్టండి. లేనిపోని మొహమాటాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకునే సూచనలు ఉన్నాయి. అవసరంలో ఉన్నప్పుడు మిత్రుల నుంచి సహాయం అందుతుంది. జటిలమైన సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమవుతుంది. లక్కీ కలర్: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కార్యాలయానికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారాన్ని పదిలపరచుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. స్థిరాస్తుల్లో మదుపు చేస్తారు. వరుస విజయాలతో ప్రత్యర్థుల విమర్శలకు బదులు చెబుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. అదృష్టం మీవైపే ఉందనే సంగతి అనుభవంలోకి వస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు. ఆలయాలను దర్శిస్తారు. లక్కీ కలర్: బూడిద రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) డబ్బు గురించి దిగులు పడాల్సిన పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక పురోగతి రెట్టింపు వేగాన్ని పుంజుకుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి బాగుంటుంది. సకాలంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలు లాభాల బాట వేస్తాయి. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. సృజనాత్మక రంగాల్లోని వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సత్తా నిరూపించుకోవడానికి తగిన కొత్త అవకాశాలు దక్కుతాయి. చిరకాల మిత్రుల్లో ఒకరిని కలుసుకుంటారు. గత స్మృతులు వెంటాడుతాయి. ఘన విజయాలు సాధించినా ఏదో తెలియని అసంతృప్తి బాధిస్తుంది. లక్కీ కలర్: నేరేడు రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకుంటారు. అనవసరమైన భ్రమల నుంచి, అపోహల నుంచి బయటపడతారు. జీవితాన్ని వాస్తవిక దృక్పథంతో చూడటాన్ని అలవరచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. పని ఒత్తిడి ఒకవైపు ఇబ్బందికరంగానే ఉన్నా, ప్రశాంతభరితమైన కుటుంబ వాతావరణం ఒకింత ఊరటనిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధులవుతారు. భారీ లక్ష్యాలను సాధించడానికి శక్తులన్నింటినీ సమకూర్చుకుంటారు. ఒత్తిళ్లకు వెరవకుండా లక్ష్యాలను సాధిస్తారు. లక్కీ కలర్: నీలం - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) వ్యవహారాలన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సంఘంలో గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వివాహాది వేడుకల నిర్వహణకు సమాయత్తమవుతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు మరింత లాభించి ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతోకలహాలు. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ప్రముఖులు పరిచయమవుతారు. ఆర్థిక విషయాలలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. అనుకున్న పనులను సమయానికి పూర్తి చేస్తారు. వాహనయోగం. నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగుపడతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఊహించని పదవులు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో వివాదాలు. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) క్రమేపీ పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు పంచుకుంటారు. ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత ప్రగతి కనిపిస్తుంది. వివాదాల నుంచి గట్టెక్కుతారు. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థులు శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు కొంత ఫలిస్తాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనుకున్నదే తడవుగా పనులు చక్కదిద్దుతారు. ఆర్థికంగా గతం కంటే మరింత మెరుగైన పరిస్థితి ఉంటుంది. కొద్దికాలంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించుకుంటారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వివాహాది వేడుకలపై దృష్టి సారిస్తారు. నూతన విద్యావకాశాలు పొందుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఉత్సాహంగా అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా సర్దుబాటు చేసుకుంటారు. ఇంట్లో వివాహాది వేడుకలు నిర్వహిస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కే అవకాశం. కళారంగం వారికి ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తర దిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ముఖ్యమైన వ్యవహారాలు కొంత జాప్యం జరిగినా అనుకున్న విధంగా పూర్తి కాగలవు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. కుటుంబసభ్యులతో వివాదాలు సద్దుమణుగుతాయి. ఒక సమాచారం ఊరటనిస్తుంది. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. వాహన, గృహయోగాలు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒక అంగీకారానికి వస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు. కొత్త రుణాలు కోసం యత్నాలు. ఆలోచనలు అంతగా కలిసిరావు. బంధువులు, మిత్రులు మీపై ఒత్తిడులు పెంచుతారు. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆస్తుల విషయంలో కొద్దిపాటి సమస్యలు. గృహం కొనుగోలు, నిర్మాణాలలో ఆటంకాలు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక డీలాపడతారు. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు శ్రమాధిక్యం. వారం మధ్యలో శు¿¶ వార్తలు. ఆకస్మిక ధనలాభం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. శుభకార్యాలకు హాజరవుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దికుని ముందుకు సాగుతారు. కళారంగం వారి సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు పొందుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు ఆమోదిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి, లాభాలబాటలో పయనిస్తారు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, నలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పట్టుదల, ధైర్యంతో సమస్యలను అధిగమించి, విజయం సాధిస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి లబ్ధి పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆరోగ్యసమస్యలు ఎదురైనా ఉపశమనం లభిస్తుంది. ఇంటి నిర్మాణాలపై మరింత దృష్టి సారిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అందరిలోఉద్యోగాలలోనూ గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. ఎరుపు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో(28 ఏప్రిల్ నుంచి 4 మే, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. ఇప్పటికే సాధించిన వరుస విజయాలతో మరింతగా బలం పుంజుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక పురోభివృద్ధిని సాధిస్తారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకునే లక్ష్యంతో ఆస్తులను సమకూర్చుకుంటారు. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. కళా సాంస్కృతిక రంగాల్లోని వారికి కొత్త అవకాశాలు దొరుకుతాయి. మనసు దోచుకునే మనిషి తారసపడతారు. ప్రేమ వ్యవహారాల్లో భావోద్వేగాలకు లోనవుతారు. తీరిక సమయాన్ని ఆత్మావలోకనానికి కేటాయించుకుంటారు. ఆధ్యాత్మికతను నమ్ముకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అసాధారణమైన, అద్భుతమైన కాలం మొదలైంది. అదృష్టం ఎర్రతివాచీ పరచి మరీ మిమ్మల్ని స్వాగతిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలే పెట్టుబడిగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. పనిభారం ఎంతగా ఉన్నా, తెలివిగా పనిని విభజించుకుని సకాలంలో లక్ష్యాలను సాధిస్తారు. ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. మార్గదర్శిగా నిలిచే వ్యక్తి ఒకరిని కలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. త్వరలోనే కొత్త ఇంటిని లేదా వాహనాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబంతో కలసి సుదూర విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) చక్కబడిన పరిస్థితులు సంతోషాన్నిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలను సంయమనాన్ని కోల్పోకుండా పరిష్కరించుకుంటారు. నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో సాధిస్తారు. పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకుంటారు. బాధ్యతలకు దూరంగా ప్రకృతి ఒడిలో సేదదీరడానికి విహార యాత్రలకు వెళతారు. కొత్త మిత్రులు పరిచయమవుతారు. కొత్తగా కళాసాధన లేదా రచనా వ్యాసంగం వంటి వ్యాపకాన్ని ప్రారంభిస్తారు. సన్నిహిత బంధువుల మధ్య నెలకొన్న విభేదాలను సామరస్యంగా పరిష్కరిస్తారు. గురువులను దర్శించుకుంటారు. లక్కీ కలర్: తెలుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. ఇప్పటి వరకు సంపాదించినది, సాధించినది చాలనే భావన మొదలవుతుంది. ఇక చాలు అనే భావన బద్ధకం వైపు, నిర్లక్ష్యం వైపు, వ్యసనాల వైపు దారితీయకుండా చూసుకోవడమే మీరు ప్రస్తుతం చేయాల్సిన పని. ప్రతికూలమైన కాలక్షేపాలకు బదులు నచ్చిన వ్యాపకాన్ని ఎంచుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిష్ఠాత్మక విజయాలను సాధిస్తారు. సామాజికంగా పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. పలుకుబడి గల వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. లక్కీ కలర్: నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) స్వయంకృతాపరాధాలకు మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి తూచి అడుగు ముందుకేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పవచ్చు. ఆరోగ్య సమస్యలను ఆదిలోనే కట్టడి చేయడం మంచిది. వ్యాపార విస్తరణ ప్రణాళికల అమలును వాయిదా వేసుకుంటారు. ప్రత్యర్థులు మీపై వదంతులను ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి. వాటిపై అతిగా స్పందించకుండా, సంయమనం పాటించడమే క్షేమం. లక్కీ కలర్: గోధుమ రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ప్రాధాన్యాలను నిర్ణయించుకోవడంలో డోలాయమానంలో పడతారు. సందిగ్ధతను విడనాడి, ముఖ్యమైన వాటిని ఎంపిక చేసుకుని, ప్రాముఖ్యత లేని విషయాలను విడనాడటం మంచిది. ఆదుర్దా విడనాడి కాస్త మనస్థిమితాన్ని సంతరించుకుంటే, మీ ప్రాధాన్యాలను మీరే నిర్ణయించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో వైవిధ్యం లేని పని చిరాకు కలిగిస్తుంది. సృజనాత్మకతకు అవకాశాలు దొరకని పరిస్థితుల పట్ల విసుగు చెందుతారు. కొత్త పనులు ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. వాటికి కావలసిన ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. లక్కీ కలర్: పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) వృథా కాలహరణం చేసినందుకు పశ్చాత్తాపం చెందుతారు. గత జల సేతుబంధనం కంటే భవిష్యత్తును తీర్చిదిద్దుకునే ప్రణాళికలను వెంటనే ఆచరణలో పెట్టడమే మంచిదనే నిర్ణయానికి వస్తారు. ఉన్నతమైన ఆశయాలు, లక్ష్యాలతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు, అధికారంతో కూడిన పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. స్థిరాస్తి విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. చట్టపరమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంటికి లేదా కార్యాలయానికి అలంకరణలు చేపడతారు. లక్కీ కలర్: ముదురు గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడతారు. స్థిరచిత్తంతో నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అనూహ్యంగా మీకు అనుకూలంగా మారుతాయి. కీలకమైన బాధ్యతల నిర్వహణకు అధికారులు మీపైనే ఆధారపడే పరిస్థితులు ఉంటాయి. సంతోషభరితమైన సంఘటనలు జరుగుతాయి. ఇంట్లో శుభకార్యాన్ని నిర్వహిస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు శ్రుతి మించే సూచనలు ఉన్నాయి. స్వయంగా చొరవ తీసుకుని పరిస్థితిని చక్కదిద్దుకోవడం మేలు. అధిక బరువు కారణంగా ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. లక్కీ కలర్: లేత గులాబి ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కొద్దిపాటి అవరోధాలు ఎదురైనా నిర్దేశించుకున్న లక్ష్యాలను విడనాడకండి. త్వరలోనే ఆశయ సిద్ధి జరిగే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు దక్కవచ్చు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను విజయవంతంగా అమలు చేయగలుగుతారు. బంధు మిత్రుల నుంచి కానుకలను అందుకుంటారు. స్వల్ప పరిచయం మాత్రమే ఉన్న వ్యక్తి ఒకరు మీకు కీలక సమయంలో అండగా నిలుస్తారు. చట్టపరమైన వివాదాల నుంచి బయటపడతారు. జనాకర్షణ పెరుగుతుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. లక్కీ కలర్: ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) సాధించిన విజయాలు శ్రమను మరిపిస్తాయి. అనూహ్యమైన ఆర్థిక లాభాలు ఆనందంలో ముంచెత్తుతాయి. వ్యాపార భాగస్వామి ఒకరు ఇచ్చే అద్భుతమైన సలహాల ఫలితంగా లాభాలు రెట్టింపవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం పెరుగుతుంది. స్థిరాస్తులలో భారీగా మదుపు చేస్తారు. కళారంగానికి చెందిన వ్యాపారాలను కొత్తగా ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు దొరుకుతాయి. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. లక్కీ కలర్: నేరేడు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అదనపు ఆదాయ మార్గాలను వెదుక్కోవలసిన పరిస్థితులు అనివార్యమవుతాయి. చాలా ప్రయాస తర్వాత మాత్రమే అవకాశాలను దక్కించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల వల్ల ఇబ్బందులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మొండి వైఖరి కారణంగా సమస్యలు మరింత జటిలమయ్యే పరిస్థితులు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుబంధానికి బీటలు పడే సూచనలు ఉన్నాయి. నిద్రలేని రాత్రులు తప్పకపోవచ్చు. వ్యసనాలతో సాంత్వన పొందే ప్రయత్నాలు వికటిస్తాయి. సంయమనం పాటించడం మంచిది. గురువుల సలహా తీసుకుంటారు. లక్కీ కలర్: ఇటుక రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితంలో ఎన్నడూ లేని తాజాదనాన్ని అనుభూతి చెందుతారు. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి స్థాన చలనం తప్పకపోవచ్చు. నిరంతర సంసిద్ధతే మీ విజయానికి బాటలు వేస్తుంది. సహచరుల నుంచి గొప్ప సహాయ సహకారాలు లభిస్తాయి. ఇంటికి అలంకరణలు చేపడతారు. సన్నిహితుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు అండగా నిలుస్తారు. జీవిత లక్ష్యాలలో కొన్ని ముఖ్యమైన వాటిని సాధిస్తారు. పిల్లలు సాధించిన విజయాలు సంతోషాన్నిస్తాయి. కుటుంబంలోని పెద్దల్లో ఒకరి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కలిగించవచ్చు. లక్కీ కలర్: నీలం - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొన్ని ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా అవసరాలకు లోటు రాదు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో కీలక విషయాలపై చర్చలు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్య సూచనలు. గృహం, వాహనాల కొనుగోలు యత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలు సాదాసీదాగా ఉండి లాభాలు కనిపించవు. ఉద్యోగులకు కొన్ని మార్పులు జరిగే అవకాశం. కళారంగం వారికి మిశ్రమంగా ఉంటుంది. వారం చివరిలో శుభవార్తలు. ఆకుపచ్చ, తెలుపు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక పరిస్థితి నిరాశ పర్చినా ముఖ్యావసరాలు తీరతాయి. ఆలోచనలు అంతగా కలిసిరావు. ప్రముఖులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. కాంట్రాక్టర్లకు కొన్ని చిక్కులు ఎదురైనా అధిగమిస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు కొంత ఊరటనిస్తుంది. భూముల క్రయవిక్రయాలకు సంబంధించి ఒప్పందాలు వాయిదా. వ్యాపారాలలో స్వల్ప లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యం. వారం ప్రారంభంలో ధనప్రాప్తి. సన్మానాలు. గులాబీ, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక లావాదేవీలు కొంత ఆశాజకనంగా ఉంటాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. దీర్ఘకాలిక వివాదం నుంచి బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాల శ్రమ వృథాగా మారుతుంది. వారం చివరిలో వృథా ఖర్చులు. మానసిక ఆందోళన. పసుపు, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక లావాదేవీలలో మరింత పురోగతి ఉంటుంది. ముఖ్య వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు శుభవార్తలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలలో అనుకూలత. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి, పెట్టుబడులకు లోటు రాదు. ఉద్యోగాలలో ఉన్నతస్థితి. రాజకీయవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు రాగలవు. వారం ప్రారంభంలో అనారోగ్యం, శ్రమాధిక్యం. నేరేడు, ఎరుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. బంధువర్గంతో అకారణంగా విభేదాలు ఏర్పడతాయి. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. విద్యార్థులకు మరిన్ని ఒత్తిడులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. శ్రమపడినా ఫలితం అంతగా దక్కదు. విలువైన డాక్యుమెంట్లు భద్రంగా ఉంచుకోండి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆకస్మిక బదిలీలు ఉండవచ్చు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. గత స్మృతులు వెంటాడవచ్చు. నీలం, ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. సోదరులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు అంతగా పట్టించుకోరు. విద్యార్థులు, నిరుద్యోగులు కొంత నిరాశ చెందుతారు. ముఖ్యమైన పనులు నెమ్మదిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉంటాయి. రాజకీయవర్గాలకు మనశ్శాంతి లోపిస్తుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. స్పెక్యులేషన్ లావాదేవీలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించవచ్చు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబసభ్యులతో తగాదాలు. నిరుద్యోగుల యత్నాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. విద్యార్థుల కృషి కొంతమేరకు ఫలిస్తుంది. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. కళారంగం వారి ప్రయత్నాలు ముందుకు సాగవు. వారం మధ్యలో విందువినోదాలు. ధన,వస్తులాభాలు. ఆహ్వానాలు అందుతాయి. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బం«ధువుల నుంచి ఆహ్వానాలు. సంఘంలో ఊహించని గౌరవం లభిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవర్తమానాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల నుంచి కొంతవరకూ బయటపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి యత్నకార్యసిద్ధి. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో మాటపట్టింపులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఎరుపు, పసుపు రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ముఖ్య వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. చిన్ననాటి మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. ఆ«ధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా కొనసాగుతాయి. లాభాలు అంతగా కనిపించవు. ఉద్యోగాలలో బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలించదు. వారం మధ్యలో విందువినోదాలు. వస్తులాభాలు. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) చేపట్టిన ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వివాదాల నుంచి ఎట్టకేలకు బయటపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు రాబడతారు. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి కొత్త హోదాలు పొందుతారు. కళాకారులకు నూతనోత్సాహం, సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. కుటుంబసభ్యులతో మీ అభిప్రాయాలు పంచుకుంటారు. స్థిరాస్తి వివాదాలు, కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. సంఘంలో గౌరవానికి లోటు రాదు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకోని ప్రమోషన్లు దక్కవచ్చు. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. సృజనాత్మక కళారంగాలలోని వారికి సన్మాన సత్కారాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో కలసి విహారయాత్రలకు వెళతారు. నీలం, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షా స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. మిత్రులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలం. వ్యాపారాలు మరింత పుంజుకుని విస్తరిస్తారు. ఉద్యోగాలలో అద్భుతంగా రాణిస్తారు. అనుకోని హోదాలు దక్కే సూచనలు ఉన్నాయి. రాజకీయవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు.. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, లేత ఎరుపు రంగులు, దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో(21 ఏప్రిల్ నుంచి 27 ఏప్రిల్, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహంతో లక్ష్యసాధన దిశగా ముందుకు సాగుతారు. మార్పు లేని జీవితం పట్ల విసుగుతో శరవేగంగా మార్పులకు నాందీప్రస్తావన చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. దుస్సాధ్యమనుకున్న లక్ష్యాలను అవలీలగా సాధించి ప్రత్యర్థులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. ప్రేమికులతో ఏర్పడిన పొరపొచ్చాలను తొలగించుకునేందుకు స్వయంగా చొరవ తీసుకుంటారు. ఆర్థిక సుస్థిరత సాధించడానికి ప్రణాళికలు రచిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. తీర్థయాత్రలు చేస్తారు. లక్కీ కలర్: పసుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) జీవితాన్ని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి మితిమీరుతుంది. వేళకు భోజనం చేయడానికి కూడా తీరిక దొరకడం కష్టమయ్యే పరిస్థితులు తలెత్తవచ్చు. ఆర్థిక పురోగతి దారిలో పడుతుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు అవసరమవుతాయి. వ్యాయామంపై దృష్టి సారించాలనుకున్నా, వ్యాయామం ప్రారంభించడానికి అవరోధాలు ఎదురవుతాయి. ప్రియతముల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. పిల్లల పురోగతి కొంత సంతోషాన్ని ఇస్తుంది. లక్కీ కలర్: ఊదా మిథునం (మే 21 – జూన్ 20) సామాజిక, రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. అధికారం, పరపతి గల ఒక వ్యక్తిని కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. లాటరీలు, పందేలలో బహుమతులు గెలుచుకునే సూచనలు ఉన్నాయి. అదృష్టం కలసి వస్తుంది. స్థిరాస్తుల అమ్మకాల ద్వారా అంచనాలకు మించి లాభాలు వస్తాయి. ఇంటికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేయిస్తారు. విలాస వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. ఆకస్మికంగా దూర ప్రయాణాలకు వెళతారు. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) సృజనాత్మక రంగాల్లోని వారికి అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. కళాకారులకు సన్మాన సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారి ప్రతిభా పాటవాలకు గుర్తింపు దొరుకుతుంది. కొందరికి పదోన్నతులు దక్కవచ్చు. కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ప్రేమికుల సమక్షంలో సర్వస్వాన్నీ మరచిపోతారు. కలల్లో తేలియాడుతారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. లక్కీ కలర్: గులాబి సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) సంకల్పబలంతో అనూహ్య విజయాలను సాధిస్తారు. లక్ష్య సాధన కోసం కృతనిశ్చయంతో కడవరకు పోరాడి అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. పెట్టుబడులకు అనువైన కాలం. వృత్తి ఉద్యోగాల్లో గొప్ప పురోగతి ఉంటుంది. జనాకర్షణ పెరుగుతుంది. కార్యాలయంలోని ఆంతరంగిక సమావేశాల్లో పాల్గొంటారు. ఇతరులు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. ఆర్థిక పరిస్థితి ఎన్నడూ లేనంత సానుకూలంగా ఉంటుంది. విందు విలాసాల కోసం ఖర్చు చేస్తారు. విహారయాత్రలకు వెళతారు. సన్నిహితులకు కానుకలు ఇస్తారు. లక్కీ కలర్: ఇటుక రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. విలక్షణమైన వ్యక్తులు తారసపడతారు. ఇల్లు మారే సూచనలు ఉన్నాయి. కార్యాలయంలో మార్పులు సంభవం. వృత్తి ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉంటాయి. మెరుగైన పనితీరుతో నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ సన్నిహితుల్లో ఒకరు మీరు పనిచేస్తున్న సంస్థను వదిలి వెళ్లిపోతారు. వారసత్వ ఆస్తి కలసివచ్చే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తుల్లోని పెట్టుబడుల ద్వారా లాభాలు గడిస్తారు. వారాంతంలో పనిభారం పెరుగుతుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. లక్కీ కలర్: జేగురు రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) జీవితంపై నియంత్రణ సాధించడానికి ప్రయత్నిస్తారు. ఇబ్బందికరమైన సమస్యలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని అవరోధాలు ఎదురైనా, విజయవంతంగా వాటన్నింటినీ అధిగమిస్తారు. నిర్దేశిత లక్ష్యాలను సకాలంలోనే సాధిస్తారు. మిమ్మల్ని దెబ్బతీసే ఉద్దేశంతో కొందరు తెరవెనుక రాజకీయాలు సాగిస్తారు. ప్రత్యర్థుల కుతంత్రాలను తిప్పికొట్టాలంటే మీరు కొంత లౌక్యాన్ని అలవరచుకోక తప్పదు. ఒక విశ్వసనీయమైన వ్యక్తి మీకు అండగా నిలుస్తారు. రుణభారం నుంచి బయటపడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలను కొద్దికాలం వాయిదా వేసుకుంటారు. లక్కీ కలర్: నారింజ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న సమస్యల పరిష్కారం దిశగా కృషి చేస్తారు. అకుంఠిత దీక్షతో పరిస్థితులను అదుపులోకి తెచ్చుకుంటారు. ఉద్యోగుల్లో కొందరికి స్థానచలనం తప్పకపోవచ్చు. త్వరలోనే శుభవార్త వింటారు. సన్నిహితుల నుంచి కానుకలు అందుకుంటారు. ఘన విజయాలను సాధించి, సహచరుల ప్రశంసలు పొందుతారు. ఇదివరకు తీసుకున్న ఆర్థిక నిర్ణయాలు సత్ఫలితాలనిస్తాయి. మీరు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ అంచనాలకు మించి పెరుగుతుంది. కొత్త వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇంటికి అలంకరణలు చేపడతారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆర్థిక అనిశ్చితి తొలగిపోతుంది. పరిస్థితులు క్రమంగా దారిలోకి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు సత్ఫలితాలను సాధిస్తారు. కొందరికి విదేశాల్లో చదువుకునే అవకాశం లభించే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. సానుకూలమైన వ్యక్తుల సాంగత్యంలో గడుపుతారు. సానుకూల దృక్పథాన్ని పెంపొందించుకుంటారు. కీలకమైన నిర్ణయాలు తీసుకునే ముందు సన్నిహితులతో సమాలోచనలు జరుపుతారు. విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: లేత నీలం మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కలల్లో తేలియాడుతారు. సన్నిహితులతో సల్లాపాల్లో కాలక్షేపం చేస్తారు. భవిష్యత్తు కోసం ప్రణాళికల పేరిట పగటి కలలు కంటారు. వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న స్తబ్దత కారణంగా ఉద్యోగ బాధ్యతలపై కొంత ఉదాసీన వైఖరిని ప్రదర్శిస్తారు. ఆలోచనలకే పరిమితం కాకుండా, కొంతైనా కార్యాచరణలోకి దిగితే సత్ఫలితాలు ఉంటాయి. గ్రహానుకూలత బాగుంది. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రయాణాలు కొత్త అవకాశాలకు దారి చూపుతాయి. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. లక్కీ కలర్: వెండి రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మహిళల తోడ్పాటుతో ఘన విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన హోదాను దక్కించుకుంటారు. విలువైన నగలను, విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. సొంత ఇంటి కల నెరవేరే సూచనలు ఉన్నాయి. రుణాలను తీర్చేస్తారు. తాకట్టులో ఉన్న వస్తువులను విడిపించుకుంటారు. ఇదివరకు కొనుగోలు చేసిన స్థిరాస్తుల విలువ బాగా పెరుగుతుంది. గురువుల ఆశీస్సులు పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారు ప్రేమలో పడతారు. విదేశీయాన సూచనలున్నాయి. లక్కీ కలర్: ఎరుపు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వ్యక్తిగత జీవితంలోను, వృత్తి ఉద్యోగాల్లోను కొన్ని అవరోధాలు తప్పకపోవచ్చు. మనోస్థైర్యం కోల్పోకుండా ఏటికి ఎదురీదుతారు. రెచ్చగొట్టే ప్రత్యర్థులు తారసపడతారు. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. దుష్ప్రచారాలతో మీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తారు. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. దీర్ఘకాలిక పెట్టుబడులు సహా ఆర్థిక నిర్ణయాలను ఈవారం వాయిదా వేసుకోవడం మంచిది. ఇల్లు మారే అవకాశాలు ఉన్నాయి. మనశ్శాంతి కోసం పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింత పెరిగే అవకాశం. విద్యార్థులు కొత్త విద్యావకాశాలు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు సన్మానాలు, పదవీయోగాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుకుంటారు. కృషి ఫలించే సమయం. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం. ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తీరతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. ఎరుపు, లేత గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆదాయం కొంత సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు భవిష్యత్తుపై కొంత గందరగోళం. మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. కుటుంబంలో మీ నిర్ణయాలు వ్యతిరేకిస్తారు. గృహ, వాహన కొనుగోలు యత్నాలలో ఆటంకాలు. సోదరులతో ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధనలబ్ధి. నూతన వ్యక్తుల పరిచయం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. మీ అంచనలు, ఊహలు నిజమవుతాయి. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులు పరి^è యమవుతారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి.ఆకస్మిక ధనప్రాప్తి. మీ యత్నాలకు కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. నేర్పుగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులు చేపడతారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఓర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగయత్నాలు సఫలం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహన, కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కాస్త ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) చేపట్టిన పనులలో కొంత జాప్యం. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. అయినా అవసరాలకు లోటు రాదు. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. విద్యార్థులు అవకాశాలు ఎట్టకేలకు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారి నుంచి కీలక సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల కృషి కొంతమేర ఫలిస్తుంది. వారం చివరిలో విందులువినోదాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. తెలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తివృద్ధి. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. గృహ, వాహనయోగాలు. మీ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో(14 ఏప్రిల్ నుంచి 20 ఏప్రిల్ 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ప్రస్తుత పరిస్థితులపైనే పూర్తిగా దృష్టి సారించడం మంచిది. గతాన్ని తలచుకుని బాధపడటంలో అర్థం లేదు. భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దగల అవకాశాలు త్వరలోనే అందివచ్చే సూచనలు ఉన్నాయి. అనూహ్యమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగుల్లో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారరంగంలో వారికి పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి వనరులు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకునే వాళ్లకు బుద్ధి చెబుతారు. ఇదివరకటి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు కార్యాచరణలో ఉపయోగపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణం ఉంటుంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయిక సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వాహనాన్ని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఇంట్లో శుభకార్యం నిర్వహించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత నీలం మిథునం (మే 21 – జూన్ 20) మీ దార్శనికత ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపును దక్కించుకుంటారు. దీర్ఘకాలిక అన్యాయాలపై జరిపిన పోరాటంలో విజయం సాధిస్తారు. ప్రశంసలు వెల్లువెత్తుతాయి. కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ అవకాశాలు కలసి వస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో సత్ఫలితాలను సాధిస్తారు. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కష్టాలలో ఉన్న మిత్రులకు బాసటగా నిలుస్తారు. వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మందకొడిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా నామమాత్రంగా ఉంటుంది. భావి ప్రణాళికలను ఎంత పకడ్బందీగా రచించుకున్నా, కార్యాచరణకు ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు అవసరమవుతాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. అంతర్ముఖులై ధ్యానంలో గడపడానికి ఇష్టపడతారు. ఆలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: ఊదా సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) పరిస్థితులన్నీ గజిబిజి ప్రహేళికలా ఉన్నా, మీదైన స్పష్టతతో ముందుకు సాగుతారు. జీవితంలో కొత్త దశ త్వరలోనే మొదలవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. గడ్డు సమస్యలను అవలీలగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్వావలంబనను, సుస్థిరతను సాధిస్తారు. ఊహించని వ్యక్తితో ప్రేమలో పడతారు. సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళతారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో గడుపుతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. లక్కీ కలర్: లేత గులాబి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) భవితవ్యానికి సంబంధించిన సంశయాలు సందిగ్ధానికి లోను చేస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. అయితే, ఉన్నత విద్యకు సంబంధించి ముందున్న అవకాశాలలో మేలైనదేదో తేల్చుకోవడంలో ఒక నిర్ణయానికి రాలేకపోతారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి తీసుకోవలసిన నిర్ణయాల్లో తాత్సార వైఖరిని అవలంబిస్తారు. ప్రేమ, పెళ్లిళ్లకు సంబంధించిన చర్చలు చిరాకు తెప్పిస్తాయి. వ్యాపారాలను విజయవంతంగా విస్తరిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. విరాళాలు చెల్లిస్తారు. లక్కీ కలర్: ముదురు గులాబి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: నేరేడు రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. నిర్దేశిత లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. కలలను సాకారం చేసుకుంటారు. ఒక అద్భుతమైన వ్యక్తితో ఏర్పడే పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాలపై శ్రద్ధ అవసరమవుతుంది. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: ఇటుక రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు సమసిపోతాయి. ఆత్మావలోకనం చేసుకుంటారు. తీర్థ యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కార్యరంగంలోకి దిగుతారు. భావసారూప్యత గల వ్యక్తుల నుంచి సాయం తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు కొంత ఒత్తిడికి దారి తీసే సూచనలు ఉన్నాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు క్రమంగా సానుకూలమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలు వాయిదా పడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: లేత గులాబి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటి సాధన కోసం నిర్విరామంగా కృషి సాగిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణం ఉంటుంది. వదంతుల వల్ల ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనవసరమైన వివాదాల్లో తలదూర్చకుండా ఉంటేనే మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. విదేశీ వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. లక్కీ కలర్: ముదురు గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువ కావచ్చు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. సాంస్కృతిక కళా రంగాల వారు అవకాశాల కోసం మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. విశ్రాంతి కోసం ఎంతగా అలమటించినా, తీరిక దొరకడమే గగనమవుతుంది. వేళకు భోజనం కూడా చేయలేని పరిస్థితులు ఉండవచ్చు. అకాల భోజనం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికత, ధ్యానం ద్వారా ఊరట పొందుతారు. లక్కీ కలర్: నీలం ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఈవారం కొంతవరకూ రుణవిముక్తి లభిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానించినా సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యావకాశాలు దక్కి విద్యార్థులు ఉత్సాహంగా సాగుతారు. కొందరికి విదేశీ విద్యావకాశాలు సైతం దక్కవచ్చు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వాహనయోగం. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి విషయంలో సోదరులతో వివాదాలు పరిష్కారం. ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. మీ ఆశయాలు నెరవేరతాయి. విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సా«ధిస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆలోచనలు అమలు చేస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో కొంత మెరుగుదల కనిపిస్తుంది. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. బంధువులు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో సహచరులతో ఉత్సాహంగా గడుపుతారు. పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి ఆశించిన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. ఆత్మీయులతో తగాదాలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మొదట్లో కొంత వరకూ ఇబ్బందులు ఎదురవుతాయి. పనులపై శ్రద్ధ చూపరు. బంధువులతో విభేదిస్తారు. అయితే క్రమేపీ ఊరట లభిస్తుంది. ఆర్థిక విషయాలు మెరుగ్గా ఉంటాయి. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. సోదరులతో ఆస్తి ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో మరింత అనుకూలత. భాగస్వాములు పెరుగుతారు. ఉద్యోగాలలో చిక్కులు అ«ధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి సహకారం అందుతుంది. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చేపట్టిన వ్యవహారాలు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు లక్ష్యాలు నెరవేరతాయి. కుటుంబంలో సమస్యలు సర్దుబాటు కాగలవు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త పోస్టులు రావచ్చు. కళారంగం వారు అవార్డులు కైవసం చేసుకుంటారు. విశేష గుర్తింపు పొందుతారు. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. బంధువులు, మిత్రులతో కలహాలు. శ్రమ మీది ఫలితం వేరొకరిది అన్నట్లుంటుంది. నిరుద్యోగులకు కొంత నిరాశ తప్పదు. ఆరోగ్యం కొద్దిగా మందగిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులలో ప్రతిబంధకాలు. మీ అభిప్రాయాలతో కుటుంబసభ్యులు విభేదిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు. వ్యాపారాలలో ఒత్తిడులు ఎదురవుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరిగి, అధిక శ్రమను ఎదుర్కోవలసి ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఉత్సాహంతో పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. దూరపు బంధువుల నుంచి ముఖ్య సమాచారం. విద్యార్థులకు ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటి నిర్మాణాలపై ఒక నిర్ణయం తీసుకుంటారు. వ్యాపారాలలో కోరుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం చివరిలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం ఎదురైన ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి వచ్చిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల వివాదాల పరిష్కారంలో క్రియాశీల పాత్ర పోషిస్తారు. ఇంటి నిర్మాణాలపై తుది నిర్ణయం తీసుకుంటారు. కుటుంబంలో వివాహాలు జరిపిస్తారు. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో నెలకొన్న ఇబ్పందులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి తెచ్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది, ఉద్యోగయోగం కలుగుతుంది. వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు తథ్యం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఊహించని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని సమస్యలను కుటుంబసభ్యుల సలహాల మేరకు పరిష్కరించుకుంటారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. మీ ప్రతిపాదనలకు బంధువులు ఆమోదం తెలియజేస్తారు. వాహనయోగం. విద్యార్థులు విదేశీ విద్యావకాశాలు పొందుతారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపార లావాదేవీలు గతం కంటే పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఉపశమనం పొందుతారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మ«ధ్యలో ఆస్తి తగాదాలు. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థిక విషయాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. అనుకున్న పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆస్తుల వ్యవహారాలలో కొద్దిపాటి చిక్కులు ఎదురైనా పరిష్కరించుకుంటారు. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మీపై అభియోగాలు మోపేందుకు కొందరు ఎదురుచూస్తుంటారు, అప్రమత్తంగా మెలగండి. వ్యాపారాలు మొత్తంమీద లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. కళారంగం వారు ఆశనిరాశల మధ్య గడుపుతారు. వారం ప్రారంభంలో ధనలాభం. వాహనయోగం. కీలక నిర్ణయాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) మొదట్లో కొంత కష్టపడాల్సిన సమయం. క్రమేపీ అనుకున్న విధంగా అభివృద్ధి కనిపిస్తుంది. మీ ఆశయాల సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఊరటనిస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. పనులు విజయవంతంగా సాగుతాయి. నూతన వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులకు అవకాశం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (24 మార్చి నుంచి 30 మార్చి, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కలలను సాకారం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. వ్యాపార పారిశ్రామిక వర్గాల్లోని వారు భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల పెద్దస్థాయి ఒడంబడికలను కుదుర్చుకుంటారు. లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ప్రేమానుబంధాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. పెద్దల నుంచి విలువైన సలహాలు అందుకుంటారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. అలంకరణలపై దృష్టి సారిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పనులను చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని, మార్పు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. త్వరలోనే ఆ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. పనితీరు ద్వారా పొందిన గుర్తింపు వల్ల తేలికగానే మంచి అవకాశాలను అందుకుంటారు. అసంతృప్తికర వాతావరణం నుంచి త్వరలోనే బయటపడతారు. ఇంటిని కొత్తగా అలంకరిస్తారు. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సన్నిహితుల నుంచి కీలక సాయం పొందుతారు. మీపై వదంతుల వ్యాప్తికి కారణమైన వ్యక్తులను గుర్తిస్తారు. దైవాన్ని నమ్ముకుంటారు. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) అనుభవాల ద్వారా పాఠాలు నేర్చకుంటారు. జీవితం పట్ల ఇప్పటి వరకు ఉన్న దృక్పథాన్ని మార్చుకుంటారు. తెలివిగా వ్యవహరించి హానికరమైన పరిస్థితులు ఎదురవకుండా చూసుకుంటారు. సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు మీరు రూపొందించుకున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. లక్కీ కలర్: నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అకుంఠిత దీక్షతో చేసిన కృషి వల్ల అసాధారణ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సంపదను పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు సాధించే సూచనలు ఉన్నాయి. కోరుకున్న పదవులను దక్కించుకోగలుగుతారు. కొత్తగా తలపెట్టిన పనులను ప్రారంభించడానికి ఇది పూర్తిగా అనువైన కాలం. ప్రేమ ప్రతిపాదన ఫలప్రదమవుతుంది. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. బరువును అదుపు చేసుకోవడంపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తారు. శుభవార్తలు సంతోషాన్నిస్తాయి. లక్కీ కలర్: నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) క్షణికావేశాన్ని నియంత్రించుకుంటారు. ఆత్మపరిశీలన చేసుకుంటారు. సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. పని ప్రదేశంలో చిన్న చిన్న మార్పులు చేపడతారు. అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేసి చూపిస్తారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలను దర్శిస్తారు. లక్కీ కలర్: లేత గోధుమరంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) గతం చేసిన గాయాల నుంచి తేరుకుంటారు. సానుకూల ఫలితాలను ఇచ్చే సరికొత్త దిశలో ముందుకు సాగుతారు. అయితే, భావోద్వేగాలను అదుపు చేసుకోవడం మంచిది. పనిలో సత్తా చాటుకుంటారు. గడ్డు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ధ్యానం ద్వారా సాంత్వన పొందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. స్థిరాస్తి లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం సమకూరే సూచనలు ఉన్నాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. లక్కీ కలర్: ఇటుక రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) తిరుగులేని పట్టుదలతో అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. కృతనిశ్చయంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అనుకున్న స్థాయిని మించి ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. కలలను నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. సుదూర యాత్రలకు వెళతారు. అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తారు. సత్యాన్వేషణలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడానికి సంకల్పిస్తారు. లక్కీ కలర్: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. విజయోత్సాహంతో ముందుకు సాగుతారు. ఊపిరిసలపని పనితో ఉక్కిరిబిక్కిరవుతారు. వరుస విజయాలతో అలసటను మరచిపోతారు. మీ పురోగతిలో పెనువేగానికి సన్నిహితులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఇతరుల అభిప్రాయాలకు మనసు పాడుచేసుకోకుండా ఉండటమే మంచిది. ఘర్షణ తలెత్తినప్పుడు మొండితనానికి పోకుండా, పట్టు విడుపు ధోరణితో పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ఆరోగ్యం మందగించవచ్చు.. లక్కీ కలర్: ఊదా ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఇంటా బయటా మార్పులు చేపడతారు. ముఖ్యంగా వాస్తుకు సంబంధించి మార్పులు, పరిహారాలు చేపడతారు. పనుల పురోగతిలో వేగం పుంజుకుంటుంది. మీ జీవితంలో అద్భుతమైన కాలం మొదలైనట్లే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సలహాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వచ్చిన కీలకమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఫర్నిచర్‌ను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. లక్కీ కలర్: లేత బూడిదరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. ఎంతోకాలంగా కోరుకుంటున్న స్వేచ్ఛా స్వతంత్రాలను మనసారా ఆస్వాదిస్తారు. మనస్సాక్షిని నమ్ముకుంటారు. మీ తీరు కొందరికి నచ్చకున్నా, మీదైన మార్గంలోనే ముందుకు సాగుతారు. సంగీతం, చిత్రలేఖనం వంటి లలిత కళల సాధనలో కొత్త ఉత్తేజాన్ని పొందుతారు. చిరకాల స్వప్నం నెరవేరే సూచనలు ఉన్నాయి. విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. బంధు మిత్రులకు బాసటగా నిలుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయవంతంగా నాయకత్వ పాత్ర పోషిస్తారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు. లక్కీ కలర్: నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వారాంతంలో బంధు మిత్రులతో విందు వినోదాలను ఆస్వాదిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. మనసైన వ్యక్తి ముందు మీ మనసులోని మాటను వెల్లడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త అవకాశాలు తలుపుతడతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్కీ కలర్: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ప్రతి అంశంలోనూ సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. ఇంటా బయటా శాంతి సామరస్యాల కోసం పరితపిస్తారు. ఆర్థిక లాభాలు అద్భుతంగా ఉంటాయి. అదనపు ఆదాయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అసూయాపరులు మిమ్మల్ని తప్పుడు సలహాలతో తప్పుదారి పట్టించే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉన్నట్లయితే అలాంటి వారి ఉచ్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: బూడిదరంగు - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో అవాంతరాలు అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. మీ వ్యూహాలు, ప్రణాళికలపై కుటుంబసభ్యుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలకు తగిన సమయం. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమ. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొన్ని పనులలో ఆటంకాలు ఎదురుకావచ్చు. అయితే పట్టుదలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఆత్మబలం, ధైర్యమే ఈవారం మీకు ఆయుధాలు. మిమ్మల్ని బలహీనపర్చడానికి ప్రత్యర్థులు చేసే యత్నాలు ఫలించవు. ఆర్థిక విషయాలు కొంత మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఎంతగా కష్టించినా ఫలితం ఉండదు. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించక రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. ప్రముఖులను కలిసేందుకు యత్నిస్తారు. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. విద్యార్థులకు కొంత నిరుత్సాహం. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉండవచ్చు. ఉద్యోగాలలో ఎదురుచూడని మార్పులు సంభవం. కళారంగం వారికి ప్రోత్సాహం అంతగా కనిపించదు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త పనులు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారంతో నిరుద్యోగులు ఊరట చెందుతారు. మీ నిర్ణయాలు అందరూ శిరసావహిస్తారు. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేసే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు కొన్ని తీరతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ఆరోగ్యభంగం. కుటుంబంలో ఒత్తిడులు. శ్రమాధిక్యం. ఎరుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. గతంలో పొరపాట్లు సరిదిద్దుకుని సరైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబసభ్యులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు చేసే యత్నాలు సఫలమవుతాయి. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట చెందుతారు. సంఘంలో గౌరవానికి లోటు ఉండదు. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న పదోన్నతులు రాగలవు. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొన్ని సంఘటనలు బాగా ఆకట్టుకుంటాయి. సోదరులు, మిత్రుల సలహాల మేరకు నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో మనస్సులోని భావాలను పంచుకుంటారు. నేర్పు, ఓర్పుతో జఠిలమైన సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోభివృద్ధి కనిపిస్తుంది. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. తెలుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. సమస్యలు కొన్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఆర్థిక పరిస్థితిలో గందరగోళం తొలగుతుంది. బంధువుల నుంచి ధనప్రాప్తి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. వ్యాపార లావాదేవీలు మరింత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతం కాగలవు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిళ్లు. ఆకుపచ్చ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) అనుకున్న పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో నెలకొన్న సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. నమ్మిన సిద్ధాంతాలను అనుసరిస్తూ ముందుకు సాగుతారు. ఎవరు అడ్డగించినా లెక్కచేయరు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు క్రమేపీ తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయ దండకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో మరింత చొరవ చూపుతారు. విద్యార్థులకు శుభవార్తలు. నూతన వ్యక్తుల పరిచయం. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలలో కొంత పురోగతి కనిపిస్తుంది. వ్యాపార లావాదేవీలు మిశ్రమంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం మధ్యలో మిత్రులతో విభేదాలు. శ్రమాధిక్యం. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఇంటిలో వివాహాది శుభకార్యాలు నిర్వహిస్తారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంటి నిర్మాణాలు, కొనుగోలు యత్నాలు సానుకూలమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులు చేపట్టి విజయవంతంగా ముగిస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. బంధువులతో వివాదాలను పరిష్కరించుకుంటారు. స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయం. గతాన్ని విస్మరించి భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. వాహనయోగం కలుగుతుంది. పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. బంధువిరోధాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనులు కొంత ఆలస్యమైనా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల నుంచి శుభవార్తలు అందుతాయి. మీ నిర్ణయాలను అందరూ మెచ్చుకుంటారు. విద్యార్థుల నిరీక్షణ ఫలిస్తుంది, విదేశీ విద్యావకాశాలు దక్కవచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారమవుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (17 మార్చి నుంచి 23 మార్చి, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అవరోధాలను అధిగమించి మరీ లక్ష్యాలను సాధిస్తారు. గొప్ప గొప్ప విజయాల దిశగా విధి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. సానుకూల దృక్పథం రెట్టింపవుతుంది. ఉత్సాహంగా కొత్త కొత్త పనులు చేపట్టడానికి ఉవ్విళ్లూరుతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జీవిత భాగస్వామితో సంప్రదిస్తారు. అనూహ్యంగా వచ్చే ప్రేమ ప్రతిపాదనల పట్ల ఆచి తూచి వ్యవహరించడం మంచిది. మభ్యపెట్టే మాటల మాయాజాలంలో పడకుండా అప్రమత్తంగా మెలగండి. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) నాటకీయమైన మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి. వ్యాపార భాగస్వామ్య సంబంధాలు గొప్ప అవకాశాలకు దోహదపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. చాలాకాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక ప్రయోజనాలు చేతికందుతాయి. పగటి కలలు మానేసి ఆలోచనల్లో స్పష్టతను పెంచుకుంటే మరిన్ని విజయాలను సాధించగలుగుతారు. ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. శుభ కార్యాలను నిర్వహిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. ఆలయాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) అనుకోని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆ మార్పుల పట్ల తొలుత అనుమానాలు రేకెత్తినా, చివరకు అవి మీకు మేలు చేసేవిగానే పరిణమిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. స్వల్పకాలిక పెట్టుబడుల ద్వారా ఊహించని లాభాలను అందుకుంటారు. ఇంటికి కొత్త అలంకరణలు చేపడతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. లక్కీ కలర్: గోధుమ రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. అకాల భోజనం తప్పకపోవచ్చు. కుటుంబ బాధ్యతల భారం మోయాల్సి వస్తుంది. మానసిక స్థైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారంలో ఉన్నవారితో పేచీలు తప్పకపోవచ్చు. నైతిక స్థైర్యంతో ముందుకు సాగుతారు. అనూహ్యమైన, అసాధారణమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ప్రేమ వ్యవహారాల్లో పెద్దల నుంచి అవరోధాలు ఎదురవుతాయి. లక్కీ కలర్: లేత నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉత్సాహంతో ఉరకలేస్తారు. జనాకర్షణ పెరుగుతుంది. మిమ్మల్ని మీరు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడంపై శ్రద్ధ చూపుతారు. కొత్త దుస్తులు, అలంకరణ సామగ్రి కొనుగోలు కోసం ఖర్చు చేస్తారు. వ్యాయామంపై శ్రద్ధ పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన స్థాయిలో రాణిస్తారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారావకాశాలను మెరుగుపరచుకుంటారు. స్వల్పకాలిక పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. నిర్వహణ తలకు మించిన భారంగా మారిన స్థిరాస్తులను విక్రయిస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. లక్కీ కలర్: ఊదా కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు కొంత ఇబ్బందికరంగానే ఉంటాయి. అనవసరంగా ఇబ్బంది పెట్టేవారు ఎదురవుతారు. స్థైర్యాన్ని కోల్పోకుండా, మీదైన స్థిర వైఖరితో ముందుకు సాగండి. లేనిపోని వదంతులు మనస్తాపం కలిగిస్తాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. ఒత్తిడిని జయించడానికి యోగ, ధ్యానం వంటి వాటిపై దృష్టి పెడతారు. ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. బాకీలు వసూలవడంలో జాప్యం తలెత్తవచ్చు. ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శించుకుంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. స్నేహితుల నుంచి సకాలంలో సాయం అందుతుంది. లక్కీ కలర్: వెండి రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ప్రస్తుత పరిస్థితులను సానుకూల దృక్పథంతో అర్థం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సమస్యలను లౌక్యంతో అధిగమిస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల చిక్కుల్లో పడే సూచనలు ఉన్నాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. త్వరిత గతిన పనులు పూర్తి కావాలనుకుంటారు. దురుసుతనంతో ఇతరులను నొప్పిస్తారు. మిత్రులను ఆదుకుంటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: నేరేడు రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) అవరోధాలు తొలగిపోతాయి. చిరకాలంగా ఇబ్బంది పెడుతున్న గడ్డు సమస్య నుంచి బయట పడతారు. భావోద్వేగాలను వెల్లడిస్తారు. కలలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పిల్లల విజయాలు సంతోషాన్ని ఇస్తాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సేవా సంస్థలకు విరాళాలు ఇస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. బాగా పరిచయం ఉన్న వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదన మిమ్మల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. లక్కీ కలర్: ముదురు పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ఉక్కిరిబిక్కిరిగా ఉంటాయి. అకాల భోజనం తప్పకోవచ్చు. అలసట చెందుతారు. శక్తులన్నీ కోల్పోయినట్లుగా భావిస్తారు. మానసికంగా అలజడికి లోనవుతారు. ఏకాంతాన్నీ ప్రశాంతతనూ కోరుకుంటారు. ధ్యానమార్గంలో సాంత్వన పొందుతారు. కొత్త ఉద్యోగావకాశాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా, ఆశించిన అభివృద్ధి ఇంకా సాధించలేదనే అసంతృప్తి వెంటాడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంటుంది. విహార యాత్రలతో కొంత ఉత్తేజం పొందుతారు. లక్కీ కలర్: లేత నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అతిగా తాపత్రయపడతారు. భావి ప్రణాళికలతో నిరంతరం సతమతమవుతూ వర్తమానంలో తారసపడే ఆనందాలను కోల్పోతారు. వృత్తి ఉద్యోగాల్లో అవసరానికి మించి శ్రమిస్తారు. అనుకోని అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పనిని ఇతరులతో పంచుకుంటేనే మీకు తీరిక చిక్కుతుంది. అన్ని పనులూ స్వయంగా చేయాలనే చాదస్తాన్ని వదులుకుంటేనే జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒంటరిగా ఉంటున్నవారు తగిన జంట కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. లక్కీ కలర్: బంగారు రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. ఇదివరకటి పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. ప్రేమానుబంధాన్ని ఆస్వాదిస్తారు. ప్రియతములతో విహారయాత్రలకు వెళతారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటడం ద్వారా ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. జనాకర్షణ పెరుగుతుంది. సన్నిహితులు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. ప్రముఖు సహాయంతో గడ్డు సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. లక్కీ కలర్: ముదురు నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరి వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత వహించాల్సి వస్తుంది. చేటు చేసే పాత అలవాట్లను మానుకుని కొత్తగా మంచి అలవాట్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కళాకారులకు ఉన్నత సత్కారాలు లభిస్తాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు కూడా ఉంటాయి. గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: బూడిద రంగు - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో అనారోగ్యం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆరోగ్యసమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇంటాబయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) స్వీయానుభవాలతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల హడావుడి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకునే సమయం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వీరికి అన్నింటా విజయాలే వరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తి, నేర్పుతో క్లిష్టమైన వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం మధ్యలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. అనుకోని ధనవ్యయం. బంగారు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కొన్ని ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులు మాటసహాయం అందిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు సైతం వసూలై ఆర్థికంగా బలపడతారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవర్గాలకు మరింత సానుకూలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ప్రారంభంలో కొన్ని సమస్యలు, వివాదాలు తప్పకపోవచ్చు. అయితే పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రుల సహాయం కోరతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహ వేడుకలకు హాజరవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు ఉండదు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని ఆరాధించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఎంతటి పనినైనా వారం ప్రారంభంలో అవలీలగా పూర్తి చేస్తారు. ఆ తరువాత కొన్ని మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయం కాగలరు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనుకోని పిలుపు రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు అన్నింటా అనుకూలమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. సోదరులు కొంత సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మ«ధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తుంది. విద్యార్థులు మరింత కృషి చేస్తే ఫలితం కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు. అనుకున్న పనుల్లో ప్రతిబం«ధకాలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వివాహ, ఉద్యోగయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నెమ్మదిగా సాగి స్వల్పలాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు లేనిపోని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో( 10 మార్చి నుంచి 16 మార్చి, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) పనులు శరవేగంగా పూర్తి చేయడానికి తీరిక లేకుండా శ్రమిస్తారు. వేగమే వేదంగా ముందుకు సాగుతారు. అనుకోని రీతిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుంచి మీకు తగిన సహాయం లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటించడం మంచిది. చిన్న చిన్న ప్రలోభాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆత్మనిగ్రహంతో ముందుకు సాగి గమ్యం చేరుకుంటారు. వారాంతంలో కొంత మందకొడిగా ఉంటుంది. పరిస్థితులన్నీ క్రమంగా దారిలోకి వస్తాయి. ఆశించిన ఫలితాలు దక్కాలంటే మరికొంత నిరీక్షణ తప్పదు. లక్కీ కలర్: లేతనీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ ఆలోచనలు కాలం కంటే ముందుగా ఉంటాయి. భవిష్యత్ పరిణామాలపై మీ అంచనాలను, ఆలోచనలను మీ సహచరులు అర్థం చేసుకోలేకపోతారు. బంధు మిత్రులతో అనుబంధాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి. ఒంటరిగా ఉంటున్న వారికి కొత్త అనుబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అమోఘంగా రాణిస్తారు. చిక్కు సమస్యలు ఎదురైనా, చాకచక్యంగా వ్యవహరించి, వాటిని ఇట్టే పరిష్కరిస్తారు. అద్భుతమైన పనితీరు కనపరచి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. పదోన్నతుల వల్ల అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) జీవితంలో భద్రతను కోరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో విజయాలను ఆశిస్తారు. ఎటూ తేల్చుకోలేని డోలాయమాన పరిస్థితుల్లో ఊగిసలాడతారు. అనుకున్నట్లుగా పనులు జరగకపోవడంతో కొంత అస్థిమితంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం బాట పడతారు. వారాంతంలోగా పరిస్థితులు చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సొంత వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి మార్గాల్లో ఉన్నవారికి ఆర్థిక లాభాలు బాగుంటాయి. లక్కీ కలర్: లేత ఊదా కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇంటా బయటా ఒత్తిడుల కారణంగా మానసికంగా కొంత అలజడికి లోనవుతారు. అతి ప్రయాసపై పరిస్థితులను నెమ్మదిగా చక్కదిద్దుకుంటారు. అంతులేని ఆలోచనలతో సతమతమవుతారు. పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. సహచరులతో వాదనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం స్వల్పంగా మందగించే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ద్వారా సాంత్వన పొందాలనుకుంటారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం వైపు, క్రీడల వైపు దృష్టి సారిస్తారు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా మెలగడం మంచిది. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఈవారమంతా ఉత్సాహంగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీ జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఎప్పట్నుంచో ఆగిపోయినట్టు కనిపించిన పనులన్నీ ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్తగా మొదలవుతాయి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. అతితక్కువ కాలంలోనే ఆ వ్యక్తికి బాగా దగ్గరైపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని అనవసర విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. కలిసివచ్చే రంగు : కాషాయ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఈవారం మీకు గొప్ప అదృష్టం కలిసొస్తుంది. ఎప్పట్నుంచో కన్న ఓ కల ఈవారమే నెరవేరుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ మీరేంటో, మీ ఆలోచనలేంటో అర్థం చేసుకొని ముందుకెళ్లండి. మీ చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఇవేవీ కూడా మీలో నిరుత్సాహాన్ని నింపేవిగా ఉండకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నింటికీ ఎదురెళ్లి నిలబడతారు. కలిసివచ్చే రంగు : ముదురు నీలం తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆకాశాన్ని అందుకోవాలన్నంత అందంగా ఉండేవే ఆలోచనలు. అందుకోలేకున్నా అందంగా ఆ ఆలోచనను దాచుకోవడమే జీవితం. మీకు ఈ రెండూ తెలుసు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఈవారం తలెత్తుతుంది. అన్నీ ఆలోచించుకొని ముందడుగు వేయండి. గొప్ప ఆలోచనలే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. వారం చివర్లో ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమించే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. కలిసివచ్చే రంగు : ఎరుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) జీవితంలో చాలా దూరం ప్రయాణించి అలిసిపోయాక, మనం వెళ్లాల్సిన దారి అది కాదనో, అప్పటికే ఆ దారి మనకు ఇవ్వాల్సిన ఆనందాన్ని ఇవ్వడం లేదనో అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ధైర్యంగా నిలబడే వ్యక్తే జీవితాన్ని అర్థవంతంగా జీవించగలడు. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఓ అవకాశం ఈ వారమే మీ తలుపు తడుతుంది. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదిక దొరుకుతుంది. వరుసగా అవకాశాలు వచ్చి పడే సమయం దగ్గర్లోనే ఉంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జీవితంలో ఒక్కోసారి అన్నీ బాగున్నట్టు ఉంటాయి కానీ, కావాల్సింది ఏదో ఎప్పటికీ దొరకదన్న నిరాశ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుందని తెలుసుకోండి. వారం చివర్లో ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశం మీ వృత్తి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం చెయ్యడాన్ని పక్కనబెట్టకండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. కలిసివచ్చే రంగు : గులాబి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఈవారమంతా ఉత్సాహంగా ఉంటారు. మీరెప్పట్నుంచో కోరుకున్న ప్రపంచం వైపుకు తొలి అడుగులు వేస్తారు. మీకిష్టమైన వ్యక్తి అన్ని సమయాల్లో మీకు తోడుగా ఉంటారు. వారం చివర్లో మీకెంతో ఇష్టమైన ఒక ప్రాంతానికి విహారయాత్రపై వెళతారు. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుతాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్లండి. కొన్ని అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందుల పాలవుతారు. మీ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తులను కలుసుకుంటారు. కలిసివచ్చే రంగు : నీలం కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి జీవితంలో మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఒక అవకాశం త్వరలోనే దక్కుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు అన్నివిధాలా సిద్ధంగా ఉంచుకోండి. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి ఆలోచనలు మీపై బాగా ప్రభావితం చూపిస్తాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తామన్న ధీమాతోనే చేయండి. కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురైనా మీదైన ఆత్మస్థైర్యంతో వాటిని ఎదుర్కొని నిలబడతారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. యోగా, వ్యాయామంతో మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఒక్కోసారి జీవితంలో ఒకచోట ఆగి, గతాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరిప్పుడు ఆ దశలో ఉన్నారు. గతంలోకి కూరుకుపోకుండా, గతంలో చేసిన కొన్ని గొప్ప పనుల గురించి ఆలోచించండి. ఉత్సాహంగా కొత్త జీవితం వైపుకు అడుగులు వేస్తారు. ఏ పనిలోనైనా విజయం దక్కాలంటే ముందు చేసే పనిమీద ఇష్టం, మీమీద మీకు నమ్మకం ఉండాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. కలిసివచ్చే రంగు : గులాబి - ఇన్సియా టారో అనలిస్ట్ -
వార ఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. మీరు ఊహించినట్లే పనులు పూర్తి కాగలవు. ఇంటర్వ్యూలలో నిరుద్యోగులకు విజయం. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి, విస్తరణ పనుల్లో అనుకూలత. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. లేత గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు కలసివస్తాయి. ఉమాదేవి స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొన్ని సమస్యల నుంచి కొంత వరకూ గట్టెక్కుతారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. అయితే రుణదాతల నుంచి ఒత్తిడులు ఉండవచ్చు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. భూవివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. వ్యాపారాలలో అనూహ్యంగా లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. మహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో వైరం. ఆస్తుల వ్యవహారాలలో కొత్త చిక్కులు ఎదురుకావచ్చు. శ్రమపడినా ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. వివాహయత్నాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని విధంగా మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. వారం చివరిలో ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. నేరేడు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయ ంపఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పట్టుదలతో కృషి చేసినా ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. ఆస్తి తగాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు భద్రంగా చూసుకోండి. ఉద్యోగయత్నాలలో ఆవరోధాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. కళారంగం వారి అంచనాలు తప్పుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలబ్ధి. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సంఘంలో మీకు ఎదురులేని పరిస్థితి. భూవివాదాల నుంచి బయటపడి కొంత లాభం పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. కుటుంబసమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, లేత గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. సోదరులు, మిత్రులతో మనస్పర్ధలు తొలగుతాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు పొందుతారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో మరింత ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.కనకధారా స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థికంగా ఇబ్బందులు, రుణదాతల ఒత్తిడులు ఎదురవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. విలువైన సామగ్రి భద్రంగా చూసుకోండి. ఒక సమాచారం విద్యార్థులను నిరాశ పరుస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. వ్యాపార విస్తరణలో కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో బాధ్యతలతో సతమతవుతారు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం చివరిలో శుభవార్తలు. ధనలాభం. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అనుకున్న పనులలో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు నెలకొని ఇబ్బంది పెట్టవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు కొంత వరకూ అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలలో ప్రతిబంధకాలు ఎదురైనా అధిమిస్తారు. వ్యాపారాలు మిశ్రమంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం ప్రారంభంలో విందువినోదాలు. వాహనయోగం. లేత పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) సకాలంలో పూర్తి చేయాలనుకున్న పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొని ఒప్పందాలు వాయిదా వేస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు ప్రయత్నాలు విరమిస్తారు. విలువైన డాక్యుమెంట్లు భద్రంగా చూసుకోండి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు పదేపదే మార్చుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మరిన్ని సమస్యలు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో అవాంతరాలు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విందువినోదాలు. ఎరుపు, సిమెంట్ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. బంధువులతో మనస్పర్ధలు తొలగి ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. నీలం, నలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంజనేయ దండకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదుకుంటామన్న వ్యక్తులు నిస్సహాయత వ్యక్తం చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు పెరుగుతాయి. రుణయత్నాలు కూడా మందగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఒక వివాదం పరిష్కారమైతే మరో వివాదంలో పడతారు. నిర్ణయాలలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. విలువైన సామగ్రి చేజారే అవకాశాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో ధనలబ్ధి. నూతన పరిచయాలు. నలుపు, లేత ఆకుపచ్చరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) సన్నిహితులు, మిత్రులు మీకు అన్నింటా సహాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహణతో సందడిగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితుల్డు టారో (3 మార్చి నుంచి 9 మార్చి, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు పనుల్లో వేగం పెంచుతారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదుర్దా చెందుతారు. కొత్తగా చేపట్టబోయే బాధ్యతలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉన్నతికి దారితీసే కొత్త అవకాశాలు దొరుకుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తొందరపాటు కారణంగా కొన్ని సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించడం క్షేమం. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. సామాజిక కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేత నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కాలాని కంటే ముందుండే మిమ్మల్ని తోటివారు అర్థం చేసుకోలేకపోతారు. వ్యాపార రంగంలోని వారు ఘన విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను అధిగమిస్తారు. కష్టసాధ్యమైన లక్ష్యాలను సాధించడం ద్వారా గుర్తింపు పొందుతారు. జనాకర్షణ పెరుగుతుంది. సృజనాత్మక రంగాల్లోని వారికి ఇదివరకటి కృషికి తగిన గుర్తింపు, సన్మాన సత్కారాలు దక్కుతాయి. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. సమస్యల్లో చిక్కుకున్న సన్నిహితులకు పరిష్కార మార్గాలను చూపుతారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఆత్రుత పడటం వల్ల ప్రయోజనం లేదు. ఆశించిన ఫలితాల కోసం మరికొంత కాలం నిరీక్షణ తప్పదు. అలాగని ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి లేదు. ఓరిమి వహించండి. తరుణం ఆసన్నమైనప్పుడు ఫలితాలు వాటంతట అవే వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడికి లోనవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగకపోవడం వల్ల అసహనానికి లోనవుతారు. భావోద్వేగాల్లో నిలకడ లోపిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి మంచి ఆర్థిక లాభాలు దక్కే సూచనలు ఉన్నాయి. పలుకుబడి గల కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. లక్కీ కలర్: లేత ఊదా కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మీది కాని లోకంలో ఎక్కడో తప్పిపోయినట్లు అనుభూతి చెందుతారు. మీవైన పరిసరాల్లోకి, మీవైన పరిస్థితుల్లోకి తిరిగి చేరుకోవడానికి తపిస్తారు. మీ ఊహలకు, మీ పరిజ్ఞానానికి పొంతన లోపించే సూచనలు ఉన్నాయి. మానసికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. మానసిక ప్రశాంతత కోసం దూర ప్రయాణాలకు సిద్ధపడతారు. సహచరులతో వాదులాటలకు దిగుతారు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాక్చాతుర్యంతో జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరిస్తారు. రెట్టించిన ఉత్సాహంతో లక్ష్యాలను సాధిస్తారు. నిబద్ధతకు, నైపుణ్యానికి తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇదివరకటి పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. అనుబంధం తెగిపోతుందేమోనని కలత చెందుతారు. లక్కీ కలర్: నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వృత్తి ఉద్యోగాల్లో సుస్థిరత, ఆర్థిక భద్రత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పురోగతి మొదలవుతుంది. పని వాతావరణం మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలోని వారు సాహసోపేత నిర్ణయాల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థికంగా వరుస విజయాలను సాధిస్తారు. స్థిరాస్తులను, సంపదను పెంచుకుంటారు. సౌందర్య పోషణపై శ్రద్ధ పెడతారు. చర్మసంరక్షణ కోసం నిపుణుల సలహాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహితీ, కళా రంగాల్లోని వారు సత్కారాలు పొందుతారు. లక్కీ కలర్: లేత గోధుమ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. వాక్చాతుర్యంతో సమస్యలను పరిష్కరించి ప్రత్యేకతను చాటుకుంటారు. జనాకర్షణను పెంచుకుంటారు. వ్యాపార పారిశ్రామిక రంగాల్లోని వారు విస్తరణ కార్యక్రమాలను చేపడతారు. సృజనాత్మక రంగంలోని వారు బృహత్తర కార్యక్రమాలను తలపెడతారు. తలనొప్పి, వెన్నునొప్పి వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. గురువులను దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలను ఇస్తారు. పిల్లల విజయాలకు గర్విస్తారు. లక్కీ కలర్: మట్టి రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) సమస్యలు సమసిపోతాయి. అనుబంధాల మ«ధ్య ఏర్పడ్డ అంతరాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణంలో తిరిగి ప్రశాంతత నెలకొంటుంది. కార్యాచరణలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఇష్టమైన వ్యాపకాలకు తగిన తీరిక చిక్కుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ప్రతికూల ఆలోచనలను దరి చేరనివ్వకండి. చిన్న చిన్న అవరోధాలు వాటంతట అవే తొలగిపోతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తి ఒకరితో ప్రేమలో పడే సూచనలున్నాయి. లక్కీ కలర్: బూడిద రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) అతిశయోక్తులతోను, అబద్ధాలతోను మిమ్మల్ని బురిడీ కొట్టే ప్రయత్నాలు చేసేవారు ఎదురవుతారు. ఇదివరకటి ఎదురుదెబ్బలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా మెలగండి. అప్రమత్తత లోపిస్తే ఆర్థిక నష్టాలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతికి సంబంధించి కొంత ప్రతిష్టంభన ఏర్పడే సూచనలు ఉన్నాయి. మెరుగైన కొత్త అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటారు. మిత్రుల సహకారంతో సమస్యల నుంచి బయటపడతారు. లక్కీ కలర్: ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) అర్థం చేసుకోగల ఆత్మబంధువు కోసం మీరు సాగిస్తున్న అన్వేషణ ఫలిస్తుంది. సాంస్కృతిక, సృజనాత్మక రంగాల్లో పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యేకతను చాటుకుంటారు. పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. మీ పురోగతికి అసూయ చెందే కొందరు ప్రచారం చేసే వదంతులను పట్టించుకోకుండా ముందుకు సాగండి. వరుస విజయాలు త్వరలోనే సొంతమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు. శరీర సౌష్టవాన్ని తీర్చిదిద్దుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు. లక్కీ కలర్: ఇటుక రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అప్రయత్నంగానే మీరు చుట్టూ ఉన్న జనాలను ఆకర్షిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు పని ప్రదేశంలో తోటివారి నుంచి అవ్యాజమైన అభిమానాన్ని పొందుతారు. పనిలో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. లక్ష్య సాధన కోసం మరింతగా కృషి చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం క్షేమం. అప్రమత్తత లోపిస్తే ఎముకలకు గాయాలయ్యే సూచనలు ఉన్నాయి. తీరిక సమయాన్ని పూర్తిగా కళా సాధన కోసం కేటాయిస్తారు. లక్కీ కలర్: గోధుమ రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. హాస్య చతురతతో చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటారు. తీరిక సమయాన్ని వినోదమే ప్రధానం అన్నట్లు గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముక్కుసూటి వైఖరి కారణంగా చిక్కులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాస్త లౌక్యాన్ని అలవరచుకోవడం మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో డబ్బు మదుపు చేస్తారు. అనుకోని వ్యక్తి ప్రేమలో పడతారు. లక్కీ కలర్: లేతాకుపచ్చ - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వ్యాపారాలు కొద్దిగా మెరుగుపడతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరుగుతాయి. కళారంగం వారికి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా అధిగమిస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అందర్నీ మాటలతో ఆకట్టుకుని మీవైపునకు ఆకర్షిస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు రాగలవు. రాజకీయవర్గాలకు పదవులు రావచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ముఖ్యమైన పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక విషయాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. పసుపు, నేరేడు రంగులు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఇబ్బందులు, సమస్యలు చాకచక్యంగా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. పరపతి కలిగిన వారితో పరిచయాలు. కుటుంబసభ్యులు మీ ప్రతిపాదనలు అంగీకరిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. విదేశీ విద్యావకాశాలు దక్కి విద్యార్థులు సంతోషంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు తీరతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. సన్నిహితులతో మాటపట్టింపులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రారంభంలో కొన్ని ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే పట్టుదల, ధైర్యంతో అధిగమించి ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత వరకూ పరిష్కారం. విద్యార్థుల యత్నాలు సఫలం. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనుకోని సంఘటనలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల పరిష్కారం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించండి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉంటాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో వివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త రుణాల అన్వేషణ. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక సతమతమవుతారు. విద్యార్థుల కృషి వృథాగా మారుతుంది. ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలాభం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాలలో ఎదుర్కొనే ఇబ్బందులు అధిగమిస్తారు. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. అనారోగ్యం కొద్దిగా మందగిస్తుంది. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో(10 ఫిబ్రవరి నుంచి 16 ఫిబ్రవరి 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) దేనినీ తిరస్కరించవద్దు. తిరస్కారాల వల్ల లేనిపోని మానసిక సంఘర్షణలకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ స్వీకరించండి. జరిగే పరిణామాలను ఆమోదించండి. ఆమోదమే మీ ప్రమోదానికి హేతువవుతుంది. త్వరలోనే శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తొలగి, సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లక్ష్యసాధనలో ముందంజలో నిలుస్తారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అనూహ్య పరిణామాలతో కొనసాగే జీవితాన్ని యథాతథంగా ఆమోదించండి. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగా పరిస్థితుల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కీలకమైన అంశాల్లో సాహసోపేత నిర్ణయాలను తీసుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉండండి. ధైర్య సాహసాలతో ముందుకు దూసుకుపోతేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఒంటిచేత్తో ఘన విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు. ప్రియతముల కోసం ప్రత్యేకించి సమయం కేటాయించాల్సి ఉంటుంది. లక్కీ కలర్: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. జీవితం ఇలా సాగిపోతే చాలు, ఇంతకు మించి ఇంకే చాలు అనేంతగా సంతృప్తిని ఆస్వాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. భవిష్యత్తుపై భరోసా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. దైవానుగ్రహం మెండుగా ఉంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జోడు దొరికే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా ఎరిగి ఉన్న వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇప్పటికే మీరు చాలా విజయాలను సాధించారు. వరుస విజయాలను సాధిస్తున్న కొద్దీ మరిన్ని విజయాలను సాధించాలనే తపన మీలో పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు దక్కనప్పుడు మీలో అసహనం పెరుగుతుంది. అసహనం రేకెత్తే సమయంలో సంయమనం పాటించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడి కారణంగా వేళకు భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్యం మందగింవచ్చు. సామాజికంగా పరపతి పెరుగుతుంది. అనవసరంగా పొగిడే వారి పట్ల అప్రమత్తంగా ఉండటం క్షేమం. లక్కీ కలర్: నలుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఏ పనినీ వాయిదా వేయకండి. ఎప్పటి పనిని అప్పుడు ముగించేస్తేనే మీ భవిష్యత్తుకు పనికొచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. ప్రకృతిలో మమేకం కావాలనుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది. తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పిల్లల పురోగతి సంతోషాన్ని ఇస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజల్లో గుర్తింపు పెరుగుతుంది. ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. లక్కీ కలర్: నేరేడు రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తారు. చిన్న చిన్న సంతోషాలను అమితంగా ఆస్వాదిస్తారు. పచ్చని పరిసరాల మధ్య గడుపుతారు. అనుకోని అద్భుతాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీరు సాధించిన విజయాలు సహచరులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. రాజకీయ రంగంలోని వారికి ప్రజాదరణ బాగుంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకుంటారు. ప్రేమికుల మధ్య అలకలు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ముదురాకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మిమ్మల్ని ప్రభావితం చేయాలనుకునే వారి నుంచి వీలైనంత దూరంగా ఉండటం క్షేమం. మీదైన మార్గంలోనే ముందుకు సాగితేనే ఇతరులకు మార్గదర్శకులుగా నిలవగలుగుతారు. కొత్త మార్గాన్ని ఏర్పరచుకోవడంలో చాలా అవరోధాలను అధిగమించాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గట్టి పోటీ ఎదురైనా, ప్రత్యర్థుల నుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా చివరకు ఘన విజయాలు సాధిస్తారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. లక్కీ కలర్: మీగడ రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) భయం వీడితేనే జయం పొందగలుగుతారు. మరణానికి తప్ప మరిదేనికీ భయపడాల్సిన పని లేదని తెలుసుకోండి. పోరాడితే పోయేదేమీ లేదని గ్రహించి, పోరాటం సాగించండి. దక్కాల్సిన హక్కులు అవే దక్కుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూలతలు తలెత్తవచ్చు. మీ ముక్కుసూటి వైఖరి కొందరికి నచ్చకపోవచ్చు. సవాళ్లను స్వీకరిస్తారు. మనసుకు నచ్చిన పని చేయడంలోని మజాను ఆస్వాదిస్తారు. ప్రియతముల కోసం మరింతగా సమయాన్ని కేటాయిస్తారు. సన్నిహితులతో సమాలోచనలు సాగిస్తారు. భావి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. లక్కీ కలర్: లేతాకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. జరిగే పరిణామాలను గమనిస్తూ ఉండటమే మీ పని. మీరేమీ చేయనవసరం లేదు. ఆందోళన చెందాల్సిన పనే లేదు. నిశ్చింతంగా నిబ్బరంగా ఉండండి. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పుంజుకుంటాయి. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రియతములతో విహారయాత్రలకు వెళతారు. ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. లక్కీ కలర్: ముదురు గోధుమ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీరు చేసిన మేలు పట్ల ఇతరులు ప్రదర్శించే కృతజ్ఞత మిమ్మల్ని ఆనంద పరవశుల్ని చేస్తుంది. ప్రపంచమంతా ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలమవుతాయి. ఆర్థిక పురోగతి ఆశాజనకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. కీలకమైన భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి నిపుణులకు లాభసాటి అవకాశాలు కలసి వస్తాయి. ప్రియతముల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: లేతాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా స్వీకరించండి. భయాలను వదులుకుని, ధైర్యంగా ముందుకు సాగండి. త్వరలోనే వరుస విజయాలు మీ సొంతమవుతాయి. లక్ష్య సాధన దిశగా బృందానికి నాయకత్వం వహించడంలో మీ సత్తా చాటుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులను పెంచుకుంటారు. గడ్డు పరిస్థితుల్లో సైతం సన్నిహితులను సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. అందం, ఆరోగ్యాలపై శ్రద్ధ పెంచుతారు. అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. పనికి దూరంగా విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: లేతనీలం మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) సవాళ్లను ఎదుర్కొంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిష్ఠను పెంచుకుంటారు. వాదనా పటిమతో ఇతరులను మీ దారిలోకి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. పెళ్లికాని వారికి మంచి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. మీ ప్రేమకు పెద్దల నుంచి ఆమోదం లభిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం కాస్త మందగించవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. లక్కీ కలర్: బంగారు రంగు ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) పనులు సకాలంలో చకచకా పూర్తి కాగలవు. సంఘంలో విశేష ఆదరణ లభిస్తుంది. విచిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. మీకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. గృహæ నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు సత్తా చాటుకుని గుర్తింపు పొందుతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. కళారంగం వారికి సన్మానయోగం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఇంతకాలం పడిన శ్రమ ఫలించే సమయం. యుక్తితో కొన్ని ఇబ్బందులు, సమస్యల నుంచి బయటపడతారు. ఊహించని∙ఆహ్వానాలు రాగలవు. స్థిరాస్తి వృద్ధి. వాహన, గృహయోగాలు. ఉద్యోగ యత్నాలు మరింత సానుకూలమవుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగులకు అనుకున్న ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఉత్సాహంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి మరింత ఆదరణ లభిస్తుంది. విద్యార్థుల ఊహలు నిజం చేసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి నేర్పుగా బయటపడతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యలు తీరతాయి. వ్యాపారాలు నూతన పెట్టుబడులతో పుంజుకుంటాయి. ఉద్యోగులు తమ నైపుణ్యాన్ని చాటుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్యం. ధనవ్యయం. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. రుణబాధల నుంచి బయటపడతారు. పనులు విజయవంతంగా సాగుతాయి. ఆస్తుల విషయంలో అగ్రిమెంట్లు కుదుర్చుకుంటారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూ, గృహయోగాలు. నిరుద్యోగులు ఆశించిన ఉద్యోగాలను సాధిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఒత్తిడుల నుంచి విముక్తి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మ«ధ్యలో కుటుంబసమస్యలు. అనారోగ్యం. పసుపు, నేరేడురంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) చేపట్టిన వ్యవహారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు ఉంటాయి. వాహనాల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఇంటాబయటా ఒత్తిడులు, సమస్యలు. సోదరులు, సోదరీలతో విభేదాలు నెలకొంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది. వ్యాపారాలు అనుకూలించినా లాభాలు స్వల్పంగానే ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఎరుపు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఈ వారం విజయాల బాటలో నడుస్తారు. వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ఆసక్తికర సమాచారం తెలుసుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. సంఘంలో గౌరవమర్యాదలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) చేపట్టిన పనులు సమయానుసారం పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టులు ఎట్టకేలకు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి, లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రావచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. మానసిక అశాంతి. తెలుపు, పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మీ ఆశయాలు, లక్ష్యాలు నెరవేరతాయి. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వివాదాల నుంచి బయటపడతారు. సహనం, నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు. ఉద్యోగులకు గుర్తింపుతో పాటు, పదోన్నతులు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ఖర్చులు. ఆరోగ్యసమస్యలు. వివాదాలు. ఆకుపచ్చ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. బంధువులు, మిత్రుల సలహాలతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. సంఘంలో గౌరవం మరింత పెరుగుతుంది. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. మీమాటకు ఎదురుండదు. శత్రువులు కూడా మిత్రులుగా మారడం విశేషం. వాహన, కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు రాగలవు. పారిశ్రామికవేత్తలకు అరుదైన అవకాశాలు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణం చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో నెలకొన్న ఇబ్బందులు, సమస్యలు క్రమేపీ తొలగుతాయి. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురుకావచ్చు. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. చిరకాల కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. వ్యాపారాల విస్తరణలోనూ, పెట్టుబడుల సమీకరణలోనూ ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి అవార్డులు లభిస్తాయి. తెలుపు, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాత స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పనుల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. కుటుంబసమస్యలు తీరి ఉపశమనం పొందుతారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు రాగలవు. తీర్థయాత్రలు చేస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రత్యర్థులు కూడా మీకు వెన్నంటి నిలుస్తారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు, ఇంక్రిమెంట్లు రావచ్చు. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేతనీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కార్యోన్ముఖులై పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం లభిస్తుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. నూతన ఉద్యోగప్రాప్తి. ఒక సమాచారం కొంత ఊరటనిస్తుంది. గృహ, వాహనయోగాలు. వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో ఎదురుండదు. ఊహించని ప్రమోషన్లు రాగలవు. రాజకీయవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. కుటుంబంలో కొన్ని సమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (27 జనవరి నుంచి 2 ఫిబ్రవరి 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) జీవితంలోని కొత్త దశ మొదలవుతుంది. అద్భుతమైన అవకాశాలు అనూహ్యంగా కలసి వస్తాయి. సంపద పెరుగుతుంది. విలాసాలను ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. సాయం అవసరమైనప్పుడు మొహమాటం వీడి ఇతరుల సాయాన్ని కోరండి. కోరుకున్న సాయం తప్పక దొరుకుతుంది. ప్రేమానుబంధాలలో నిరాశాపూరితమైన పరిస్థితులు తలెత్తే సూచనలు ఉన్నాయి. భావోద్వేగపరంగా సంయమనం పాటించడం మంచిది. ధైర్యంగా, స్వతంత్రంగా ముందుకు సాగితేనే లక్ష్యాలను చేరుకోగలుగుతారు. లక్కీ కలర్: ఎరుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఇంటా బయటా సంయమనం పాటించడమే మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూలతలు తలెత్తే సూచనలు ఉన్నాయి. పని ప్రదేశంలో ఆగ్రహావేశాలను అదుపు చేసుకుంటేనే క్షేమం. ప్రత్యర్థుల నుంచి కవ్వింపు చర్యలు ఎదురు కావచ్చు. వాగ్వాదాలకు దిగితే అనవసరంగా నిందలు పడాల్సి వస్తుంది. పని ఒత్తిడి బాగా పెరుగుతుంది. మనసు పరిపరి విధాల పరుగు తీస్తుంది. ప్రియతముల నుంచి ప్రేమ కోసం పరితపిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్య సహాయం పొందాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. అనుకోని దూర ప్రయాణాలు చేస్తారు. లక్కీ కలర్: గోధుమ రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఆశావహమైన పరిస్థితులు ఉంటాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. దూకుడు పెంచడం ద్వారా మరిన్ని విజయాలను చేజిక్కించుకుంటారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి బయట పడతారు. అప్పులు తీర్చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. బరువును అదుపు చేసుకోవడానికి వ్యాయామం వైపు దృష్టి సారిస్తారు. ఊగిసలాటలో పడిన ప్రేమానుబంధాలను తిరిగి బలోపేతం చేసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇప్పటి వరకు సాధించిన విజయాలను బేరీజు వేసుకుంటారు. మిమ్మల్ని మీరే విజేతగా భావిస్తారు. ఎలాంటి వారైనా మిమ్మల్ని వారి నియంత్రణలోకి తీసుకోలేరు. ఆర్థికంగా అద్భుతమైన కాలం ఇది. పెట్టుబడులపై ఆశించిన దానికి మించిన లాభాలు వస్తాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇదివరకే కొన్న ఆస్తుల విలువ గణనీయంగా పెరుగుతుంది. విలాసాల కోసం బాగా ఖర్చు చేస్తారు. స్నేహితులకు, ప్రియతములకు కానుకలు ఇస్తారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. కొత్త వ్యాపారాలను ప్రారంభించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: తుప్పు రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు. శరీరాకృతిని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. వ్యాయామం ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కఠినమైన లక్ష్యాలను సాధిస్తారు. అధికారుల మన్ననలు పొందుతారు. ఆర్థిక పరిస్థితిలో పురోగతి ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కొత్తగా మొదలైన ప్రేమానుబంధం మిమ్మల్ని ఆనందంలో ఓలలాడిస్తుంది. పెద్దలను, గురువులను కలుసుకుంటారు. లక్కీ కలర్: తెలుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటికి మరమ్మతులు, అలంకరణలు చేపడతారు. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన ఘనవిజయాలు మీ శ్రమను మరిపిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. చిరకాలంగా వాయిదా వేస్తున్న పనిని పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రియతములను అర్థం చేసుకోవడం ప్రహేళికలా తయారవుతుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ పెరుగుతుంది. అరుదైన ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: నేరేడు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: ఇటుక రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) పనులను పూర్తి చేయడంలో అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. చిరకాలంగా కొనసాగుతున్న స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రేమానుబంధాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: తెలుపు - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) మీ వైఖరి స్పష్టం చేయడంతో శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆర్ధిక విషయాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. కుటుంబసభ్యుల సలహాల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంతో సాగుతారు. వ్యాపారాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ తప్పకపోవచ్చు. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్యపరంగా కొన్ని చికాకులు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆస్తుల వ్యవహారాలు జటిలం కావచ్చు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కాస్త ఊరటనిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. రాజకీయవర్గాలకు పర్యటనలు రద్దు కాగలవు. వారం మధ్యలోశుభవార్తలు. వాహనయోగం. పసుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పట్టుదలతో అనుకున్న పనులు చక్కదిద్దుతారు. జీవిత భాగస్వామి ద్వారా కొంత ఆస్తిలాభం ఉండవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమై ప్రయోజనం పొందుతారు. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనక«ధారా స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొన్ని సమస్యలు, ఇబ్బందులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి మాట సహాయం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి పిలుపు అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఎంతటి పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల యత్నాలలో పురోగతి కనిపిస్తుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. శ్రమ. గులాబీ, లేత పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల ఆదరణ, ప్రేమ పొందుతారు. నిరుద్యోగులకు స్థిర ఉద్యోగయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యతిరేకులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. కళారంగం వారి సేవలకు గుర్తింపు రాగలదు. వారం మధ్యలో సోదరులతో కలహాలు. అనారోగ్యం సూచనలు. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొన్ని పనులు సకాలంలో పూర్తి చేసి మీ సమర్థత చాటుకుంటారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తి వ్యవహారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఆర్థిక లావాదేవీలు మరింత అనుకూలిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విద్య, వివాహయత్నాలు కలసివస్తాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు చోటుచేసుకుంటాయి. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్య సూచనలు. గులాబీ, లేత నీలం రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ను పూజించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక విషయాలలో గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుకుంటాయి. ఆస్తుల విషయంలో సోదరులతో అవగాహనకు వస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో బాధ్యతలు కాస్త తగ్గుతాయి. రాజకీయవర్గాలకు అవకాశాలు పెరుగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆకుపచ్చ, ఎరుçపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) మీపై నిందలు మోపాలనుకున్న వారే పశ్చాత్తాపం చెందుతారు. ఆర్థిక లావాదేవీలు క్రమేపీ అనుకూలిస్తాయి. సంఘంలో మంచి పేరు గడిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వస్తులాభాలు. కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత అనుకూలం. కళారంగం వారికి సేవలకు గుర్తింపు రాగలదు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ను పూజించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ముఖ్య పనులు కొంత నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో మొదట్లో చికాకులు ఎదురైనా క్రమేపీ అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. భూముల వివాదాల తీరతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు రావచ్చు. రాజకీయవర్గాల యత్నాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు, సోదరులతో కలహాలు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో ముందుకు సాగుతారు. వేడుకలు నిర్వహిస్తారు. జీవిత భాగస్వామితో తగాదాలు పరిష్కారం. వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ ఆత్మీయతను కుటుంబçసభ్యులకు పంచుతారు. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. ఆస్తి వివాదాల నుంచి కొంక వరకూ బయటపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకున్న విధంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పారిశ్రామికవర్గాలకు కీలక సమాచారం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వైరం. ఆకుపచ్చు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) తలపెట్టిన పనులు విజయవంతంగా ముగిస్తారు. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. కొన్ని వివాదాలు పరిష్కారవుతాయి. సోదరులు, సోదరీల నుంచి ఆహ్వానాలు రాగలవు. కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. ఒక సమాచారం ఆశ్చర్యపరుస్తుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాలలో పదోన్నతి సూచనలు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహారాధన మంచిది. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనుకున్న పనుల్లో ఆటంకాలు క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. పండితులు, ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులు ఊహించని అవకాశాలు అందుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం, బంధువులతో తగాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (20 జనవరి నుంచి 26 జనవరి 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అదృష్టం తలుపు తడుతుంది. జీవితంలో పురోగతి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి ఆర్థిక నష్టాలను, అవరోధాలను మరచిపోయి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. దైవబలం మీవైపే ఉంది. ఆశ్చర్యకరమైన రీతిలో ఆర్థిక లాభాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు. శరీరాన్ని చక్కగా తీర్చిదిద్దుకోవడానికి వ్యాయామంపై దృష్టిపెడతారు. భావ సారూప్యత గల వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆమోదిస్తారు. విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: ముదురు గులాబీ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఏకకాలంలో చాలా రకాల పనులు చేయాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లోని వారికి పని ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. పని బాధ్యతలు పెరిగినా ఏమాత్రం వెనుకంజ వేయకుండా సవాళ్లను స్వీకరిస్తారు. ఆశించిన స్థాయికి మించి అద్భుత ఫలితాలను సాధిస్తారు. కార్యాలయంలో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక లాభాలు మెరుగుపడతాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కీలక నిర్ణయాలకు సంబంధించి పెద్దలను సలహాలు కోరుతారు. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. లక్కీ కలర్: బూడిద రంగు మిథునం (మే 21 – జూన్ 20) ఆలోచనల్లో నిలకడ లోపిస్తుంది. డబ్బును మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తున్నా ఆనందం పొందడంలో విఫలమవుతారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. సవాళ్లు ఎదురవుతాయి. ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తప్పకపోవచ్చు. కాస్త లౌక్యం ప్రదర్శిస్తే సమస్యల నుంచి తేలికగా బయటపడే అవకాశాలు ఉంటాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పరిస్థితుల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ఆర్థిక లాభాలనిచ్చే అవకాశాలు తలుపు తడతాయి. ప్రేమికుల మధ్య అలకలు, కలతలు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ముదురాకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) జీవితంలో ఒక అంకం ముగిసిందనుకుంటే, మరో కొత్త అంకానికి తెరతీయాల్సిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి దిశగా మార్పులు ఉంటాయి. అధికార పదవులు దక్కే సూచనలు ఉన్నాయి. కఠోర శ్రమను నమ్ముకున్నందుకు తగిన ఫలితాలు దక్కుతాయి. వ్యాపారాలు అద్భుతంగా సాగుతాయి. సృజనాత్మక కళా రంగాల్లోని వారికి సత్కారాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మకు దగ్గరైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కుటుంబ సభ్యులకు, సన్నిహిత మిత్రులకు సమయాన్ని కేటాయిస్తారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉరకలేసే ఉత్సాహంతో పనులు కొనసాగిస్తారు. లక్ష్య సాధన దిశగా చకచకా ముందుకు సాగుతారు. పనులు పూర్తి చేయడంలో మీ వేగం, సడలని మీ ఉత్సాహం వల్ల సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే సమస్యలను చాకచక్యంగా అధిగమిస్తారు. అనుకున్న రీతిలో ఆర్థిక లక్ష్యాలను సాధిస్తారు. పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో పరీక్షలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. మిత్రులతో ఉల్లాసంగా కాలక్షేపం చేస్తారు. లక్కీ కలర్: నీలం కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వృత్తి ఉద్యోగాల్లో అత్యుత్తమమైన పనితీరు కనపరుస్తారు. అలాగే, అంతకు మించిన ప్రతిఫలాన్నీ అందుకుంటారు. కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఒక కొత్త వ్యక్తి పట్ల ఆకర్షణ పెంచుకుంటారు. ప్రేమ వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. జీవనశైలిని మెరుగుపరుచుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. స్పెక్యులేషన్ లావాదేవీలు అనుకూలిస్తాయి. అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది. సడలని ఉత్సాహంతో విజయాల బాటలో ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) వాక్చాతుర్యం, ఇతరులను ఒప్పించే నేర్పు మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. మీ సహజ నైపుణ్యాలతోనే ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. కీలకమైన కార్యక్రమాలకు సారథ్యం వహిస్తారు. కొత్తగా చేపట్టే భారీ ప్రాజెక్టును ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటారు. ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. వెన్నునొప్పి, తలనొప్పి వంటి బాధలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. ఆర్థికపరంగా పూర్తిగా కలిసొచ్చే కాలం ఇది. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. లక్కీ కలర్: నేరేడు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ప్రేమానుబంధాలలో తలెత్తిన పొరపొచ్చాలు సమసిపోతాయి. మనసులు కుదుటపడతాయి. ప్రేమానురాగాలు మరింతగా బలపడతాయి. చాలాకాలంగా ఇబ్బందిపెడుతూ వచ్చిన సమస్యల నుంచి తేలికగా గట్టెక్కుతారు. పని ఒత్తిడి నుంచి కొంత విరామం తీసుకుంటారు. మీ కోసం మీరు సమయం కేటాయించుకుంటారు. తీరిక సమయాన్ని అర్థవంతంగా వినియోగించుకుంటారు. విహార యాత్రల కోసం దూర ప్రయాణాలకు వెళ్లే సూచనలు ఉన్నాయి. ప్రతికూలమైన ఆలోచనలను విరమించుకుంటే వృత్తి ఉద్యోగాల్లో మరిన్ని మంచి ఫలితాలను సాధించగలుగుతారు. లక్కీ కలర్: మట్టి రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) అతిశయాలకు పోయేవారి పట్ల అప్రమత్తంగా ఉండటం మంచిది. ఇదివరకటి పొరపాట్లను పునరావృతం కానివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. గందరగోళ పరిస్థితుల నుంచి బయటపడటానికి ప్రయత్నిస్తారు. రొటీన్‌గా మారిపోయిన పని పట్ల విసుగు పెంచుకుంటారు. ఏకాగ్రత లోపిస్తుంది. కొత్త కొత్త అవకాశాల వైపు దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితిని కొంతవరకు మెరుగుపరచుకుంటారు. కుటుంబంలో పొరపొచ్చాలు తలెత్తవచ్చు. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఇల్లు లేదా స్థలం కొనాలన్న చిరకాల వాంఛ తీరుతుంది. లక్కీ కలర్: తెలుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) అనుకున్న పనులన్నీ సంతృప్తికరంగా జరుగుతాయి. ఇంతకాలం పడిన శ్రమకు ఇప్పుడు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మబంధువు కోసం సాగిస్తున్న అన్వేషణ ఫలిస్తుంది. ఇతరుల ప్రభావం నుంచి బయటపడటానికి ప్రయాస పడాల్సి వస్తుంది. మీపై మానసిక ఆధిపత్యం సాధించడానికి కొందరు పావులు కదుపుతుంటారు. అలాంటి వారిని పసిగట్టి, వారిని దూరం పెట్టడం క్షేమం. శరీరాకృతిపై శ్రద్ధ చూపిస్తారు. వ్యాయామం వైపు మొగ్గుతారు. ఆహార విహారాల్లో ఆరోగ్యకరమైన మార్పులు చేపడతారు. ఆర్థిక లాభాలను ఇచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మీ సహజ స్వభావంతో ఇతరులను ఇట్టే ఆకట్టుకుంటారు. కొత్తగా పరిచయమైన వారు సైతం మీ ఆకర్షణలో పడిపోతారు. జీవితం పట్ల, ప్రేమానుబంధాలలోని సంక్లిష్టతల పట్ల ఆత్మావలోకనం చేసుకుంటారు. సామర్థ్యానికి మించిన బాధ్యతలను స్వీకరించాల్సి వస్తుంది. మనో నిబ్బరం కోల్పోకుండా సవాళ్లను ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అవరోధాలను అధిగమిస్తారు. మెరుగైన పనితీరుతో పురోగతి సాధిస్తారు. ఎలాంటి ప్రయత్నం లేకుండానే కొత్త అవకాశాలు తలుపుతడతాయి. వాటిని అందిపుచ్చుకుని, ఆర్థిక పురోగతికి కొత్త బాటలు వేసుకుంటారు. లక్కీ కలర్: నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఉత్సాహంతో ఉరకలేస్తారు. ఆర్థికంగా అంచనాలకు మించిన ఫలితాలను సాధిస్తారు. ఆనందంలో ఓలలాడతారు. జనాకర్షణ పెంచుకుంటారు. ఇతరులను తేలికగా ప్రభావితం చేయగలుగుతారు. ఇంట్లో మార్పులకు శ్రీకారం చుడతారు. గడ్డు సమస్యలను పరిష్కరించడంలో కొంత లౌక్యం అవసరమని అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్థలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాల్లో పరీక్షలు ఎదురుకావచ్చు. విద్యార్థులు వినోదాన్ని పక్కనపెట్టి మరింతగా ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: గులాబీ - ఇన్సియా టారో అనలిస్ట్ -
13 జనవరి నుంచి 19 జనవరి 2019 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక ప్రయోజనాలు చేకూరతాయి. అనుకున్న పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యావకాశాలు పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ధన, ఆస్తిలాభాలు కలుగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) ముఖ్యమైన పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో సఖ్యత నెలకొంటుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. ఇంటి నిర్మాణాలను చేపట్టే వీలుంది. సంతానం నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న సమయానికి డబ్బు అందుతుంది. వ్యాపారాలలో మరింత అనుకూలత. ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో ఆరోగ్య సమస్యలు. బంధువిరోధాలు. గులాబీ, నేరేడురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించకుంటారు. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు సంభవం. కళారంగం వారికి పురస్కారాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. మిత్రులతో మాటపట్టింపులు. తెలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక ఇబ్బందులు చాలావరకూ తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మీ అంతరంగాన్ని బం«ధువులు గుర్తించి సహాయపడతారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వాహనయోగం. విద్యార్థుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ప్రారంభంలో ఒక విషయంలో కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు క్రమేపీ తొలగుతాయి. విద్యార్థులు సత్తా చాటుకుని ముందుకు సాగుతారు. అనుకున్న పనులు కొంతనెమ్మదిగా పూర్తిచేస్తారు. ప్రముఖుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. నేర్పుగా కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభిస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఆరోగ్య సమస్యలు. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) రుణభారాలు కొంత తగ్గుతాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువుల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. పాతమిత్రులను కలుసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన విద్యావకాశాలు అందుతాయి. ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై ప్రణాళిక సిద్ధం చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, లేత నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సంతానపరంగా ఇబ్బందులు తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. చిరకాల కోరిక నెరవేరి విద్యార్థులు ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) వీరికి అన్నింటా విజయమే. అందరిలోనూ ప్రత్యేకత నిలుపుకుంటారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ముఖ్య సమాచారం అందుతుంది. పరపతి పెరుగుతుంది. కొన్ని వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పర్యటనలు ఫలప్రదమవుతాయి. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) మొదట్లో కుటుంబసమస్యలు ఎదురై కాస్త చికాకు పరుస్తాయి. అలాగే, ఆరోగ్యం కూడా కొంత ఇబ్బంది కలిగిస్తుంది. క్రమేపీ వీటి నుంచి బయటపడతారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో అనారోగ్యం, వైద్యసేవలు. వృథా ధనవ్యయం. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠనం మంచిది. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) వ్యతిరేకులు సైతం అనుకూలురుగా మారతారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వివాదాలు నెలకొన్నా పరిష్కరించుకుంటారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త పనులు చేపట్టి విజయం సాధిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తుల వివాదాలు కాస్త ఉపశమనం కలిగిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. కళారంగం వారికి అవకాశాలు మరింతగా దక్కుతాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. అనారోగ్యం. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబబాధ్యతలు మరింత పెరుగుతాయి. పనులలో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ మరింత పెరుగుతుంది. విద్యార్థులు కొంత నిరాశ చెందుతారు. బంధువులను కలుసుకుని మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో ఆటంకాలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలోశుభవార్తలు. ధనలాభం. తీర్థయాత్రలు. లేత ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్య వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకుంటారు. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. కళారంగం వారికి సేవలకు తగిన ప్రోత్సాహం అందుతుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో మాటపట్టింపులు. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు 13 జనవరి నుంచి 19 జనవరి 2019 వరకు టారో మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అదృష్టం మీ తలుపు తట్టబోతోంది. ఆదాయం పెరుగుతుంది. ఆస్తులు వృద్ధి చెందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. అధికార పదవులు వరించే సూచనలు ఉన్నాయి. కీలక అంశాల్లో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. కోరుకున్న రంగంలో వరుస విజయాలతో దూసుకు పోతారు. సంప్రదాయాలకు దూరం కాకుండానే, కొత్త పద్ధతులనూ అనుసరిస్తారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. అనూహ్యంగా సుదూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) ఇంట్లో ఆనందభరిత వాతావరణం ఉంటుంది. అదృష్టం కలసి వస్తుంది. ఘన విజయాలను సాధిస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవలసిన సందర్భంలో ఊగిసలాటలో ఉన్న సమయంలో పరిచయమైన ఒక వ్యక్తి మీకు సరైన దిశా నిర్దేశం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల మన్ననలు అందుకుంటారు. దాన ధర్మాల కోసం డబ్బు వెచ్చిస్తారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. వాక్చాతుర్యంతో సమస్యలను పరిష్కరిస్తారు. యోగ్యత కలిగిన వ్యక్తి ఒకరు మీతో ప్రేమలో పడతారు. స్థిరాస్తి లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. లక్కీ కలర్: ఊదా మిథునం (మే 21 – జూన్ 20) ఇదివరకటి కంటే ప్రత్యేకంగా ఉండే కాలం ఇది. వరుస విజయాలు మిమ్మల్ని సంతోషంలో ముంచెత్తుతాయి. జీవితంలో కోరుకున్న లక్ష్యాల్లో కొన్ని ముఖ్యమైన వాటిని సాధిస్తారు. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో వృత్తి ఉద్యోగాల్లో అమోఘంగా రాణిస్తారు. భోజనం వేళ తప్పడం వల్ల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. గురువుల ఆశీస్సులు పొందుతారు. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: ముదురు పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) జీవితంలో గొప్ప ముందడుగు వేస్తారు. ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. సాహితీ కళారంగాల వారు సత్కారాలను అందుకునే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగా ఉన్నాయి. పదోన్నతులు దొరికే సూచనలు ఉన్నాయి. ఆదాయం మెరుగుపడుతుంది. అద్భుతమైన అవకాశాలు కలసి వస్తాయి. కీలక నిర్ణయాలను కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది. వివాదాలు కలవరపరుస్తాయి. చికాకుపరచే వ్యక్తులు తారసపడే సూచనలు ఉన్నాయి. లౌక్యంగా వ్యవహరించడమే మేలు. లక్కీ కలర్: మీగడ రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) రెట్టించిన ఉత్సాహంతో పనులు చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో లక్ష్యాలను అందుకోవడంలో శరవేగంగా ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు ఎన్ని సమస్యలు సృష్టించాలనుకున్నా, మీవైన ప్రత్యేక నైపుణ్యాలే మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. అన్ని విధాలా అదృష్టం వరిస్తుంది. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. ఆశించిన స్థాయిలో జీవితం సంతృప్తికరంగా ఉంటుంది. సృజనాత్మక కళా రంగాల వారికి గుర్తింపు, ప్రభుత్వ సత్కారాలు లభించే సూచనలు ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. పెద్దలు, గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) కొంత గందరగోళ పరిస్థితులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచి తూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి ఎక్కువవుతుంది. పోటీ వాతావరణంలో ఎదురయ్యే సవాళ్లకు దీటుగా పనిచేయాల్సిన పరిస్థితులు ఉండటంతో అలసటకు, విసుగుకు లోనవుతారు. పని పట్ల ఏకాగ్రత లోపిస్తుంది. ఆరోగ్యం మందగించవచ్చు. ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. లక్కీ కలర్: లేత గోధుమరంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) పనులు సానుకూలమవుతాయి. త్వరలోనే లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. ఇదివరకటి కృషికి తగిన ఫలితాలను అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు తమ ప్రత్యేకతను చాటుకుంటారు. పదోన్నతులు పొందే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల కోసం మరింత సమయం కేటాయించాల్సి వస్తుంది. అవసరాల్లో ఉన్న మిత్రులను ఆదుకుంటారు. మౌనంతోనే చాలా సమస్యలను అధిగమిస్తారు. విదేశీయాన సూచనలు ఉన్నాయి. సృజనాత్మక కళారంగాల్లోని వారికి లాభసాటి అవకాశాలు వస్తాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. లక్కీ కలర్: లేతనీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) పోరాట పటిమను చాటుకుంటారు. ఘన విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీదైన శైలిలో రాణిస్తారు. ఘర్షణలకు దూరంగా ఉంటేనే మంచిది. వివాదాల్లో విజయం సాధించినా మనశ్శాంతి దూరమవుతుందని గ్రహిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు ఒత్తిడికి లొంగకుండా ఆచి తూచి ఆలోచించాల్సి ఉంటుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆశించిన లక్ష్యాలను సాధించడానికి కొత్త మార్గంలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆరోగ్యం మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. విహారయాత్రలకు వెళతారు. కొత్త అనుభవాలు ఎదురవుతాయి. నిజాయతీతో ప్రేమను గెలుచుకుంటారు. ప్రేమానుబంధంలోని ఆనందాన్ని ఆస్వాదిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. ఇంటికి కొత్తగా అలంకరణలు చేపడతారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. పిల్లలు సాధించిన విజయాలకు గర్వంతో పొంగిపోతారు. లక్కీ కలర్: తెలుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) క్రమశిక్షణతో, ఉన్నత ఆశయాలతో ముందుకు సాగుతారు. నిర్మాణాత్మకమైన ఆలోచనలతో లక్ష్య సాధన దిశగా దూకుడు సాగిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలను సాధిస్తారు. ప్రణాళికాబద్ధంగా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. చిరకాలంగా సాగుతున్న స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. ప్రేమికులతో కలసి విహారయాత్రలకు వెళతారు. విలాసాల కోసం ఖర్చు చేస్తారు. అలంకరణ సామగ్రి, మహిళల వస్తువులకు సంబంధించిన వ్యాపార సంస్థను కొత్తగా ప్రారంభిస్తారు. లక్కీ కలర్: లేత గులాబి కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అనిశ్చితిలో ఊగిసలాడుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం మంచిది. ముఖ్యంగా వ్యాయామంపై దృష్టి సారించి శారీరక దారుఢ్యాన్ని కాపాడుకున్నట్లయితే, చాలా సమస్యలను అధిగమించగలుగుతారు. ప్రేమ ప్రతిపాదనకు ప్రియతముల నుంచి ఆమోదం లభిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో లౌక్యం ప్రదర్శించడం మంచిది. ముక్కుసూటితనం వల్ల సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేస్తారు. పిల్లల ఆరోగ్య సమస్యల కారణంగా కలత చెందుతారు. విశ్రాంతి కోరుకుంటారు. లక్కీ కలర్: గోధుమరంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) భయాలను, సంకోచాలను పక్కనపెట్టి ముందుకు సాగితేనే లక్ష్యాలను చేరుకోగలుగుతారు. విద్యా సంస్థల్లో పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. పెంపుడు జంతువులపై శ్రద్ధ చూపుతారు. పొగడ్తలతో ముంచెత్తే భజనపరుల ప్రభావంలో పడకుండా అప్రమత్తంగా ఉండటం మేలు. కొందరు మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తారు. కొత్తగా చేపట్టే ఒక పని ద్వారా ఆర్థిక పురోగతిలో వేగం పుంజుకుంటుంది. దూర ప్రయాణాలు చేస్తారు. ఇతరుల ప్రవర్తన మనస్తాపం కలిగించే సూచనలు ఉన్నాయి. ధ్యానంతో సాంత్వన పొందుతారు. కలిసివచ్చే రంగు : నాచురంగు ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) బంధువుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. అవసరాలకు డబ్బు అందుతుంది. కాంట్రాక్టర్లకు అనుకూలం. కొత్త పనులు చేపడతారు. ఉన్నత విద్యావకాశాలు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ప్రముఖుల నుంచి ముఖ్య సందేశం. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) బంధువులతో సంతోషంగా గడుపుతారు. మీపై అపవాదులు తొలగుతాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. కానుకలు, గ్రీటింగ్‌లు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార లావాదేవీలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ, సాంకేతిక రంగాల వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు. ఆర్థిక లాభాలు. పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. నూతన పరిచయాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులు, విద్యార్థులకు కొత్త అవకాశాలు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. అందరిలోనూ గౌరవం పొందుతారు. కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారవర్గాలకు ఊహించని లాభాలు అందుతాయి. ఉద్యోగవర్గాలకు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు నూతన పదవులు, సన్మానాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త మిత్రులు పరిచయమవుతారు. రావలసిన సొమ్ము అంది అవసరాలు తీరతాయి. ఆలోచనలు కలసివస్తాయి. కాంట్రాక్టర్లకు అనుకోని అవకాశాలు. పరపతి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. సోదరులతో ఆస్తి వ్యవహారాలపై చర్చలు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యవహారాలలో విజయం సా«ధిస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహం, పదోన్నతులు దక్కవచ్చు. కళాకారులకు సన్మానయోగం, విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో కలహాలు. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) బం«ధువులు, స్నేహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. వస్త్ర, వస్తులాభాలు. ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులు, పారిశ్రామికవేత్తలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. శ్రమాధిక్యం. ఆరోగ్యభంగం. ఎరుపు, లేత గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) నూతన విద్య, ఉద్యోగవకాశాలు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. స్థలాలు, వాహనాలు కొంటారు. దూరపు బంధువుల కలయిక. కొత్త పనులు చేపడతారు. ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్యసమస్యల నుంచి ఉపశమం లభిస్తుంది. కొన్ని పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. కోర్టు కేసులు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. , ఉద్యోగులకు సంతోషకరమైన వార్తలు. రాజకీయవేత్తలకు పదవులు దక్కే అవకాశం. వారం చివరిలో వివాదాలు. మిత్రులతో విభేదాలు. పసుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పరిస్థితులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణాల నుంచి విముక్తి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. కొన్ని సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మార్పులు ఉత్సాహాన్నిస్తాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. బంధువిరోధాలు. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వీరికి అన్నింటా విజయమే. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. అనుకున్న పనులు దిగ్విజయంగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. విద్యార్థుల యత్నాలు సఫలం. కొత్త విషయాలు తెలుస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త పనులు చేపడతారు. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఆప్తుల ద్వారా ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వివాదాల తీరి లబ్ధి పొందుతారు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయాలు తీసుకుంటారు. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపిస్తుంది. వ్యాపారాలలో పెట్టుబడులకు ఢోకా ఉండదు. ఉద్యోగవర్గాలకు విధుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. నేరేడు, బంగారు రంగులు. పశ్చిమదిశప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠిచండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొన్ని ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు జరుగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్య సూచనలు. ఇంటాబయటా ఒత్తిడులు. నలుపు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి కాస్త ఇబ్బంది కలిగించినా అవసరాలకు లోటు ఉండదు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. అనుకున్న వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. కాంట్రాక్టర్లకు శుభదాయకంగా ఉంటుంది. వివాహాది వేడుకలలో పాల్గొంటారు. భూవివాదాలు తీరతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు తథ్యం. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి శ్రమ ఫలిస్తుంది. సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరో«ధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని పూజించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (2019 నూతన సంవత్సర ఫలాలు ) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త సంవత్సరం మీకు అనేక సవాళ్లు విసురుతుంది. అయితే, కష్టపడి పని చేసే మీ స్వభావం, అంకిత భావం, నిబద్ధత అన్నింటినీ పటాపంచలు చేస్తూ ముందుకు దూసుకు వెళ్లేలా చేస్తాయి. ఈ సంవత్సర వ్యాపారంలో మీ యుక్తిని, పద్ధతిని కొంత మార్చుకోవలసిన అవసరం ఉంది. కొత్త ప్రాజెక్టు మిమ్మల్ని వరించి వస్తుంది. అయితే దీనిపై ఎక్కువగా ఆశలు పెట్టుకోవద్దు. మీకున్న శక్తియుక్తులకు పదును పెట్టండి. విజయం సాధిస్తారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ కుటుంబంలోకి కొత్త సభ్యుల చేరికకు ఆస్కారముంది. మార్చి, జూన్, జులై అనుకూలమైన నెలలు. ఏప్రిల్, నవంబర్లలో బాగా కష్టపడ వలసి ఉంటుంది. లక్కీ కలర్: బంగారు పసిమి వన్నె, లక్కీ నంబర్: 8 వృషభం (ఏప్రిల్ 20 – మే 20) మీ పని ఒక్కోసారి మీకు హుషారు తెచ్చిపెట్టచ్చు. ఉత్సుకతను నింపవచ్చు లేదా మిమ్మల్ని స్థబ్దుగా చేయవచ్చు. అయితే, ఇవన్నీ కూడా మీ పనిలోని భాగాలే కాబట్టి పొంగిపోవద్దు, కుంగిపోవద్దు. పనికీ, కుటుంబానికీ కొద్దిపాటి విభజన పాటించండి లేకుంటే మీ పని మూసపోసినట్లుగా తయారు కావచ్చు. సరైన తిండి, విశ్రాంతి తీసుకోక పోవడం, మానసిక ఒత్తిడి కారణంగా ఆరోగ్య సమస్యలు ఎదురు కావచ్చు. దూరప్రయాణాలు మీకు పునరుత్తేజం కలిగిస్తాయి. సంవత్సరంలో తొలి ఐదు నెలలూ తీవ్రమైన ఒత్తిడితో, అవిశ్రాంతంగా పని చేయాల్సి రావచ్చు. ఆందోళన పడకండి. తక్కిన నెలలలో ప్రమోషన్లు, జీతం పెంపులు ఉంటాయి. లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నంబర్లు: 5, 32 మిథునం (మే 21 – జూన్ 20) ఈ ఏడాది మంచి మంచి పరిణామాలన్నీ సంభవిస్తుంటాయి. మీ అభిరుచులన్నింటినీ జాగ్రత్తగా ఎంపిక చేసుకోండి. భావోద్వేగపరమైన నిర్ణయాలకు, ఎంపికలకు ఇది సమయం కాదు. పెద్దల సలహాలతోనే నిర్ణయాలు తీసుకోండి. గతంలో జరిగిన చేదు సంఘటనలను తలచుకుంటూ కూర్చోవడం వల్ల నేటి తీపి అంతా చచ్చిపోతుంది! మీ ప్రతిభకు మరింత పదును పెట్టుకుంటే మరిన్ని విజయావకాశాలు మీ ఖాతాలో ఉన్నట్లేని గుర్తుంచుకోండి. మే, సెప్టెంబర్ మాసాలు చాలా బాగుంటాయి. ఏప్రిల్, జులై, ఆగస్ట్ నెలల్లో కాసింత జాగ్రత్త తప్పదు. లక్కీ కలర్: జాతిపచ్చ రంగు, లక్కీ నంబర్: 21 కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కొత్త ఏడాది మీకు ఆశావహ సంవత్సరం. చదువులో, ఉద్యోగంలో విజయావకాశాలను అందిపుచ్చుకుంటారు. మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, నిస్సహాయంగా మిగిలే కొన్ని సంఘటనలు ఎదురు కావచ్చు. అయితేనేం, మీరేమీ బెంబేలు పడనక్కరలేదు. చంద్రగమనం మిమ్మల్ని వ్కాలానికి గురి చేస్తే, సూర్యగమనం మీలోని శక్తులను తట్టిలేపుతుంది. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు చాలా బాగుంటుంది. మే, ఆగస్ట్ నెలలు కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం. లక్కీ కలర్: పసుప్పచ్చ; లక్కీ నంబర్: 1 సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మీరు ఉంటున్న ప్రదేశాన్ని మార్చుకోవలసిన సంవత్సరమిది. నూతన స్థలాన్ని లేదా ఇంటిని కొనుక్కునేందుకు అనుకూల తరుణమిది. బంధాలు గట్టిపడతాయి. అహాన్ని అణిచిపెట్టండి. అనవసరమైన ఆందోళనలని పక్కన పెట్టండి. అవకాశాలను చక్కగా సొమ్ము చేసుకుంటారు. వ్యాపారంలో కొత్త భాగస్వామ్యానికి, ఒప్పందాలకు ఇది తగిన సమయం. విద్యార్థులకు చాలా బాగుంటుంది. జనవరి మీకు ఈ ఏడాదిలోనే మేలిమలుపులాంటిది. అదేవిధంగా జూన్, జులై, సెప్టెంబర్ మాసాలు కూడా మీకు అనుకూలంగా ఉండి, హుషారును, విజయాలని ఇస్తాయి. లక్కీ కలర్: వంకాయరంగు; లక్కీ నంబర్: 2 కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) పనిపరంగా, ఆరోగ్యపరంగా మీరు బాగా దృష్టి పెట్టాల్సిన తరుణమిది. ఈ ఏడాది చాలా బాగుంటుంది. ముందడుగు వేసేముందు కాస్త వెనకాముందు చూడడం అవసరం. అలాగని వెనకాడవద్దు. మీరు ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న సంఘటనలు ఈ ఏడాది జరుగుతాయి. సంపద పరంగా సమృద్ధిగా ఉంటుంది. మీరు దృష్టి పెట్టిన కొద్దీ ఉద్యోగ వ్యాపారాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. జనవరి నెల అన్ని విధాలుగా చాలా బాగుంటుంది. లక్కీ కలర్: ఇటికరాయి రంగు; లక్కీ నంబర్: 7 తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మీరు చేస్తున్న వాటినే కొనసాగించడం అవసరం. ఇప్పటివరకు మీరు అనుభవిస్తున్న ఆనందం, పొందుతున్న ఆదాయం వంటివాటికి కొత్త సంవత్సరంలో కూడా లోటేమీ ఉండదు. ముందు ముందు మరిన్ని ఆనందాలు, ఆశ్చర్యాలు పొందుతారు. అయినప్పటికీ, మీరు నూతన మార్గాన్ని, నూతన పంథాను ఎన్నుకోక తప్పదు. ఆధ్యాత్మికంగానూ, ఆచితూచి తీసుకున్న నిర్ణయాలు బాగా కలిసొచ్చేలా చేస్తాయి. మీరు గొప్ప ఎత్తులు ఎదిగేందుకు ఈ సంవత్సరం చాలా దోహదం చేస్తుంది. ఏప్రిల్, మే, సెప్టెంబర్ నెలలు మీరు రూపాంతరం చెందేందుకు అనుకూలం. అక్టోబర్ తర్వాత మరింత ఆనందంగా ఉంటారు. లక్కీ కలర్: లేతనీలం; లక్కీ నంబర్: 3 వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) స్థబ్దుగా సాగిపోతున్న మీ జీవితంలో కొత్త పరిచయాలు చోటు చేసుకుని, ఆనందమయం చేస్తాయి. మీరు కలల నుంచి బయటపడి వాస్తవంలోకి రావాలి. ప్రాక్టికల్‌గా ఉండాలి. కొత్త అవకాశాలు వచ్చే సంవత్సరమిది. కొత్తగా ఆలోచన చేయడం కొత్తదనానికి ఊతమిస్తుంది. ఉదాహరణకు ఒక గొప్ప కళాఖండాన్ని సృష్టించాలనుకుంటే, దానికి ఏ రంగులు వాడితే బాగుంటుందో ఆలోచించాలి. స్వార్థంతో ఆలోచించడం మీకు మంచిది కాదు. ఫిబ్రవరి, మే, జూన్, జులై నెలల్లో బాగా కష్టపడి పని చేస్తారు. సెప్టెంబర్‌లో అన్ని రకాల ఒత్తిడుల నుంచి బయటపడి మీకు నచ్చిన హాలిడే స్పాట్‌కు వెళ్లి హాయిగా సేద తీరుతారు. లక్కీ కలర్: ఎరుపు, లక్కీ నంబర్:3 ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) మీ లక్ష్యాలను చేరుకునేందుకు ఈ నూతన సంవత్సరం తగిన వేదిక. కొత్త సంవత్సరం మీరు సంతోషంగా ఉంటారు. మిమ్మల్ని మీరు పట్టించుకోవలసిన తరుణమిది. ప్రేమజీవితం సాఫీగా, ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా హాయిగా సాగుతుంది. మీ కుటుంబంలో ఒకరికి వివాహం జరుగుతుంది. జూన్ నుంచి ఆర్థికంగా బలం పుంజుకుంటారు. విస్తృతంగా ప్రయాణాలు చేస్తారు. ప్రస్తుతం మీరు చేస్తున్న వ్యాపారానికి అదనంగా మరోటి జత చేస్తారు. ఏడాదిలో తొలి సగం చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగుతుంది. లక్కీ కలర్: పర్పుల్, లక్కీ నంబర్: 9 మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీ కలలను, లక్ష్యాలను సాకారం చేసుకునే తరుణం ఇది. ఈ ఏడాది మీరు స్పష్టతతో ఉంటారు. సత్యమే పలుకుతారు. ప్రేమ విషయానికి వచ్చేసరికి మీరు మీ ప్రియుడు లేదా ప్రియురాలిని మార్చడానికి ప్రయత్నించే బదులు వారి బాటలో మీరే నడిస్తే మంచిదేమో ఆలోచించండి. మార్చి తర్వాత చాలా బిజీగా ఉంటారు. జులైలో షిఫ్ట్‌లు మారడం, అనూహ్యమైన మార్పులు రావడం జరగవచ్చు. అందుకు మీరేమీ కంగారు పడవద్దు. అది ఒక దశ అనుకుని మీ పని మీరు చేసుకుపొండి చాలు. లక్కీ కలర్: మావిచిగురు; లక్కీ నంబర్: 12 కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మిమ్మల్ని మీరు నిశితంగా పరిశీలించుకోవలసిన తరుణం ఇది. మీ శరీరంతోబాటు మనసును కూడా లోతుగా పరిశీలించండి. మీ బంధం ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నదనుకుంటే, వారికి మీ పరిస్థితులు, సమస్యల గురించి ఓపిగ్గా చెప్పి, ఒప్పించి అప్పుడు బయట పడండి. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, కొత్త ఆలోచనలు చేయండి. ఆత్మవిశ్వాసాన్ని ఎట్టి పరిస్థితులలోనూ కోల్పోవద్దు. సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోండి. లక్కీకలర్: లేత ఎరుపు; లక్కీ నంబర్: 9 మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఈ సంవత్సరం ఆరంభం నుంచీ మీరు ప్రశాంతంగా ఉంటారు. గతంలో వచ్చిన భయాల నుంచి, సమస్యల నుంచి బయట పడతారు. మీరు రకరకాల దృక్పథాల నుంచి బయటకు రండి. అన్ని దృక్కోణాలను కలుపుకుని, ఒక కొత్త ఆలోచనతో ఉండండి. పాజిటివ్‌గా ఆలోచించండి. పాజిటివ్‌గా వ్యవహరించండి. సమస్యలను, సవాళ్లను తిట్టుకోవద్దు. మీరు మంచి పాఠం నేర్పినట్లుగా భావించి, కృతజ్ఞతతో ఉండండి. ఏప్రిల్ నుండి మీకు బ్రహ్మాండంగా ఉంటుంది. అన్ని ఆందోళనల నుంచి బయటపడి హాయిగా, ప్రశాంతంగా గడుపుతూ, ఆనందాన్ని అనుభవిస్తారు. లక్కీ కలర్: తెలుపు; లక్కీ నంబర్: 2 - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్త పనులకు శ్రీకారం చుట్టి నిర్దేశిత సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో చిక్కులు తొలగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీరు ఊహించిన మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) మొదట్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో తుది ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. సోదరులతో కలహాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న పనులు కొంత నెమ్మదించినా పూర్తి కాగలవు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వివాహాది శుభకార్యాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు కాస్త ఊరటనిస్తాయి. గృహ నిర్మాణాలు, కొనుగోలుపై దృష్టి సారిస్తారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. లేత నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఊహించని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వ్యవహారాలు సాఫీగా పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గత స్మృతులు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహన, గృహయోగాలు. కొన్ని నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబంలో సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. తెలుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. మిత్రులతో అకారణంగా విరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో బాధ్యతలు పెరిగి సవాలుగా నిలుస్తాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. అనుకున్న పనులలో అవాంతరాలు ఎదురుకావచ్చు. ఆరోగ్యపరంగా చికాకులు. బంధువులతో ఆస్తి తగాదాలు నెలకొనే సూచనలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం కావచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. ఉద్యోగయోగం. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఈవారం విజయాల బాటలో పయనిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల సలహాలు స్వీకరించి తగు నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక కోర్టు వ్యవహారం తుది దశకు చేరుకుంటుంది. వ్యాపారాలలో అనూహ్యంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అప్రయత్న కార్యసిద్ధి. వారం ప్రారంభంలో కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు. సోదరులతో వివాదాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఏ పనిచేపట్టినా విజయవంతమే. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబసమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు రావచ్చు. బంధువుల మెప్పు పొందుతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకూ అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. వ్యాపారాల విస్తరణలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొన్ని పనులు సమయానుసారం పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖుల నుంచి కొంత సహాయం అందుతుంది. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. వ్యతిరేకులు సైతం మిత్రులుగా మారడం విశేషం. వాహనాలు, భూములు కొనుగోలులో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) మొదట్లో నెలకొన్న చికాకులు క్రమేపీ తొలగి ఊరట లభిస్తుంది. నేర్పుగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లబ్ధి పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు అందుతాయి. వాహనయోగం. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు అనుకోని పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలులో పెడతారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. శాస్త్ర, పరిశోధనా విషయాలపై ఆసక్తి చూపుతారు. కళాకారుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో( 2 డిసెంబర్ నుంచి 8 డిసెంబర్, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ నిరాడంబరతే మీకు శ్రీరామరక్ష. అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. సవాళ్లను స్వీకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. మానసిక స్థైర్యాన్ని కూడదీసుకుంటారు. ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం కాస్త మందగించే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి ఫలితాలను పొందుతారు. ఆలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: బంగారు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) సమస్యలు సద్దుమణుగుతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. మీ వద్ద పనిచేసే ప్రతిభావంతులను ప్రోత్సహిస్తారు. ఇంటికి కొత్తగా అలంకరణలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. నైపుణ్యాలను మెరుగుపరచుకునే దిశగా కృషి ప్రారంభిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అనూహ్యమైన పరిస్థితుల్లో ప్రేమలో పడతారు. అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: లేతాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) ఆశించిన లక్ష్యానికి చేరువవుతారు. సామాజికంగా గుర్తింపు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. సత్కారాలను అందుకుంటారు. క్రియాశీలంగా ముందుకు సాగుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రేమికులతో విహారయాత్రలకు వెళతారు. ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుని, లక్ష్య సాధన దిశగా నిర్విరామంగా కృషి కొనసాగిస్తారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పలుకుబడి గల పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో ప్రశాంతత పొందుతారు. లక్కీ కలర్: గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) దశ మారబోతోంది. కలిసొచ్చే కాలం త్వరలోనే రానుంది. నిర్వర్తించవలసిన విధులపై పూర్తి ఏకాగ్రత సారించండి. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన విజయాలు మీ సొంతం కానున్నాయి. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మబంధువులాంటి వ్యక్తిని కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనను పెంచుకుంటారు. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. మిత్రుల్లో ఒకరిని ఆపద నుంచి ఆదుకుంటారు. పిల్లలు సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబంతో కలసి తీర్థయాత్రలకు వెళతారు. ఏకాంతాన్ని కోరుకుంటారు. లక్కీ కలర్: ఊదా సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) అధ్యయనంపై అమితంగా దృష్టి సారిస్తారు. ఎంపిక చేసుకున్న అంశాలపై కూలంకషంగా పరిశోధనలు సాగిస్తారు. జ్ఞానమే సర్వస్వమని నమ్ముతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. పందేలకు, జూదానికి దూరంగా ఉండటం క్షేమం. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మీయుల మధ్య నెలకొన్న అపార్థాలు తొలగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శుభకార్యాలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ప్రేమికులు ఊహల్లో విహరిస్తారు. లక్కీ కలర్: లేతాకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ హోదాను బలంగా కోరుకుంటారు. ఇంతవరకు ఒకరి అనుయాయిగా కొనసాగుతున్నందుకు మనస్తాపం చెందుతారు. అన్యాయానికి గురయ్యామనే భావన మిమ్మల్ని కొంత కుంగదీస్తుంది. పట్టుదలను పెంచుకుంటారు. వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. పట్టు విడుపులు ప్రదర్శించి లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవడమే మేలు. తెగే వరకు లాగాలనుకుంటే పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశాలు లేకపోలేదు. మానసిక ప్రశాంతతను కోరుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: తెలుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆర్థిక లావాదేవీల్లో కొంత ఉదారంగా వ్యవహరిస్తారు. వస్తు వ్యామోహం నుంచి బయటపడాలని భావిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. రహస్య శత్రువుల నుంచి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. పాత బాకీలను తీర్చేస్తారు. ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కీలక సమాచారం తెలుసుకుంటారు. భావి పరిణామాలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమవుతారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. ప్రేమికులకు ఎడబాటు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వ్యాపారరంగంలోని వారికి అద్భుతమైన అవకాశాలు కలసి వస్తాయి. కొత్త కొత్త రంగాల్లోకి వ్యాపారాలను విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయపథంలో దూసుకుపోతారు. జీవితంలోని తొలినాళ్లలో అనుభవించన కష్టాలను గుర్తు చేసుకుంటారు. కష్టాల్లో ఉన్న ఇతరులకు చేయూతనిస్తారు. ఆత్మావలోకనం చేసుకుంటారు. ఏకాంతాన్ని కోరుకుంటారు. ఉన్నతమైన లక్ష్యాలను సాధిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. కోరుకున్న రీతిలో ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) కలలను సాకారం చేసుకోవడానికి కఠిన శ్రమకు సిద్ధపడతారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు దక్కించుకునే సూచనలు ఉన్నాయి. దొరికిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకోండి. అద్భుతమైన ఫలితాలు త్వరలోనే లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుని జ్ఞాపకాలను కలబోసుకుంటారు. పని ఒత్తిడికి దూరంగా విహార యాత్రలకు వెళతారు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వ్యాపార విస్తరణ కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఆసరా లేని వృద్ధులను ఆదుకుంటారు. లక్కీ కలర్: ఇటుక రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఇంటా బయటా విపరీతమైన ఒత్తిడి తప్పకపోవచ్చు. పనిభారం కారణంగా తీరిక దొరకడమే గగనమవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పోటీ ఎదురవుతుంది. ప్రణాళికల రూపకల్పన కోసం మరింత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి అహరహం శ్రమిస్తారు. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సైతం అనూహ్యంగా పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంట్లోని ఒకరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల కలవరానికి గురవుతారు. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆరోగ్యం మెరుగుపడుతుంది. జవసత్వాలను పుంజుకుని ఉత్సాహంతో ఉరకలేస్తారు. కొత్త విశేషాలను తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. మిత్రుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. సృజనాత్మక రంగాల్లోని వారు అద్భుతంగా రాణిస్తారు. సామాజికంగా గుర్తింపు పెరుగుతుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. కుటుంబంతో కలసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. అదృష్టం కలసి రావడం వల్ల గడ్డు పరిస్థితుల నుంచి బయటపడతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అనవసరపు ఆందోళనలన్నీ తొలగిపోతాయి. ఆత్మబలంతో అవరోధాలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే అన్వేషణ ఫలిస్తుంది. ఒక లాభసాటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. మిత్రుల్లో ఒకరి సలహాల కారణంగా భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. శత్రువర్గం మీకు వ్యతిరేకంగా వదంతులను ప్రచారం చేసే సూచనలు ఉన్నాయి. ప్రియతములతో అనుబంధం మరింతగా బలపడుతుంది. లక్కీ కలర్: నీలం - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) వ్యవహారాలు కొంత మందగిస్తాయి కుటుంబ బాధ్యతలతో సతమతమవుతారు. ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. నిర్ణయాలు కొన్ని మార్చుకుంటారు. ఆస్తి వివాదాల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. వాహనాలు నడిపే వారు కొంత అప్రమత్తత పాటించాలి. వ్యాపార లావాదేవీలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగి మీ సమర్థతకు సవాలుగా మారతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. తెలుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) వ్యూహాత్మకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులకు మరిన్ని అవకాశాలు దక్కవచ్చు. ఆర్థిక పరిస్థితి అనూహ్యంగా మెరుగుపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మీస్థాయి పెరుగుతుంది. క్లిష్టసమస్యల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి ధనలాభాలు కలుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు దక్కవచ్చు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల నుంచి అందిన సమాచారం సంతోషం కలిగిస్తుంది. జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. వాహనాలు, గృహం కొనుగోలు ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు రాగలవు. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఊహించని విధంగా ముఖ్యమైన పనులు పూర్తి కాగలవు. ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితులు నెలకొంటాయి. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. భూ, వాహనయోగాలు. కుటుంబసభ్యులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. తెలుపు, లేత గులాబీ రంగులు. ఉత్తరదిశæ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక పరిస్థితి గందరగోళంగా మారి రుణాలు చేస్తారు. అనుకున్న పనుల్లో జాప్యం. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నాలు మందగిస్తాయి. ఆస్తి వ్యవహారాలలో అగ్రిమెంట్లు వాయిదా వేసుకుంటారు. శ్రమపడ్డా తగినంత ఫలితం లేక నిరాశ చెందుతారు. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. భాగస్వాములతో వివాదాలు. వారం చివరిలో విందువినోదాలు. నూతన పరిచయాలు. గులాబీ, లేత పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశాజనకంగా ఉంటాయి. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. నిరుద్యోగులు అవకాశాలు చేజార్చుకుంటారు. కొన్ని పనులు మధ్యలోనే నిలిపివేస్తారు. ఆరోగ్యసమస్యలు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం కొంత ఊరటనిస్తుంది. భూములు, గృహం కొనుగోలులో అవాంతరాలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిభారం మరింత పెరుగుతుంది. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) అన్నివిధాలా అనుకూలమైన కాలం. ఆర్థికంగా గతం కంటే పురోభివృద్ధి సాధిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్లు చేసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పనులు సమయానికి పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉంటుంది. భూలాభాలు కలుగుతాయి. ఎంతోకాలంగా వేధిస్తున్న కొన్ని కేసులు, వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. అందరితోనూ సంతోషంగా గడుపుతారు. విద్యార్థుల చిరకాల స్వప్నం నెరవేరుతుంది. వాహనయోగం. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. రుణదాతల ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య సంరక్షణపై శ్రద్ధ అవసరం. ముఖ్యమైన పనులు మధ్యలోనే విరమిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. సోదరులతో ఆస్తుల వ్యవహారంలో కొద్దిపాటి వివాదాలు. నిరుద్యోగుల యత్నాలు కొంత మందగిస్తాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. వ్యాపారాలు నిరాశపరుస్తాయి, అనుకున్న లాభాలు కష్టమే. ఉద్యోగాలలో పనిభారంతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. కొత్త వ్యక్తుల పరిచయం. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఏర్పడతాయి. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. అనారోగ్య సూచనలు. స్థిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. మీ అభిప్రాయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకిస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఒడిదుడుకులు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కక నిరాశ చెందుతారు. ఉద్యోగాలలో అదనపు పనిభారం తప్పదు. పారిశ్రామికవర్గాలకు శ్రమ మరింత పెరుగుతుంది. వారం ప్రారంభంలో ఉద్యోగలాభం. చిన్ననాటి మిత్రుల కలయిక. నీలం, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. సన్నిహితులతో విభేదాలు. కుటుంబ, ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. బంధువులను కలుసుకుని కుటుంబ వ్యవహారాలపై చర్చిస్తారు. విద్యావకాశాలు చేజారి విద్యార్థులు నిరాశ చెందుతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో అగ్రిమెంట్లు వాయిదా పడతాయి. శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ప్రత్యర్థులు మీపై ఒత్తిడులు పెంచుతారు. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు పైస్థాయి నుంచి పిలుపు అందవచ్చు. వారం మధ్యలో ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. పసుపు, ఆకుపచ్చరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు సానుకూలం. లక్ష్మీధ్యానం చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులుకోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు ప్రస్తావిస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. కుటుంబసభ్యులతోవిభేదాలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలు, వివాహాది వేడుకల్లో పాల్గొంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు పుంజుకుని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి విశేష గుర్తింపు, సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. మిత్రులతో విభేదాలు. గులాబీ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (18 నవంబర్ నుంచి 24 నవంబర్, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ వద్దకొస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇతరులకు హామీ ఉండే పరిస్థితుల్లో ఆచి తూచి అడుగేయడం మంచిది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ధ్యానంతో ఊరట పొందుతారు. సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ: లేత పసుపు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. దైవంపై భారం వేసి ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీకు సంబంధించని పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల కొత్త పనిని ప్రారంభిస్తారు. మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనూహ్యమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. నిపుణులను సంప్రదించి ఆస్తుల కొనుగోలు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఎంతటి గడ్డు పరిస్థితులు ఎదురైనా అంతిమంగా మీరే విజేతగా నిలుస్తారు. గడచిన సంఘటనలపై ఆత్మావలోకనం చేసుకుంటారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సంయమనం పాటించడం మంచిది. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. త్వరలోనే కొత్త వ్యాపారాన్ని ప్రారంభించే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో శక్తివంచన లేకుండా కృషి చేసి, అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. విజయాలకు కారకులు మీరే అయినా, ఆ పేరును ఇతరులు సొంతం చేసుకోవాలనుకుంటారు. ప్రత్యర్థులతో ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఒడిదుడుకుల నుంచి తేరుకుంటారు. ఇబ్బంది కలిగిస్తూ వచ్చిన పరిస్థితులు వాటంతట అవే సద్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పని ఒత్తిడికి, కుటుంబ బాధ్యతలకు మధ్య సమతుల్యతను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వేడుకల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో అభద్రతాభావానికి లోనవుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. వ్యాయామం కొనసాగిస్తారు. వైద్యుల సలహాతో ఆహార అలవాట్లలో మార్పులు చేపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: లేత గులాబి కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేయిస్తారు. చాలాకాలంగా కొనసాగిస్తున్న భారీ పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇదివరకటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. వృత్తి ఉద్యోగాల్లోని పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. పిల్లల పురోగతికి ఆనందిస్తారు. ఇదివరకు ఎన్నడూ చూడని కొత్త ప్రదేశాలకు వెళతారు. ప్రకృతి ఒడిలో సేదదీరుతారు. కొంత విరామం తర్వాత రెట్టించిన ఉత్సాహంతో పనులు చేపడతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. ఆలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: కెంపురంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఇంటా బయటా వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. ఒక కఠోర వాస్తవం మీ కలల సౌధాన్ని కుప్పకూల్చేసే సూచనలు ఉన్నాయి. ఎన్నాళ్లుగానో నిలుపుకున్న ఆశలు చెల్లాచెదురు కావడంతో బాగా కలత చెందుతారు. వాస్తవాన్ని జీర్ణించుకునేందుకు సమయం తీసుకుంటారు. శక్తులు కూడదీసుకుని పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలంగానే ఉంటాయి. వారాంతంలో కొన్ని కొత్త అవకాశాలు కలసివస్తాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పటిమను నిరూపించుకుంటారు. వరుస విజయాలతో ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. ఇతరులకు స్ఫూర్తి కలిగిస్తారు. దీర్ఘకాలిక లక్ష్యాలతో కొత్త పనులు తలపెడతారు. సృజనాత్మకతతో ఇతరులను ఆకట్టుకుంటారు. వస్త్రాలంకరణలో మార్పులు చేపడతారు. ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలున్నాయి. ఇదివరకటి పెట్టుబడుల నుంచి ఊహించని లాభాలు అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. లక్కీ కలర్: ముదురు పసుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కొత్త ఆశలు చిగురిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆస్తులు కలసివచ్చే సూచననలు ఉన్నాయి. వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితులు ఇదివరకటి కంటే సంతృప్తికరంగా ఉంటాయి. కుటుంబంలో సంతోషభరిత వాతావరణం నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. ప్రేమ ప్రతిపాదనలపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. గురువుల ఆశీస్సులు అందుకుంటారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభ చాటుకుంటారు. నాయకత్వ పాత్రలో మీ దార్శనికత ఇతరుల్లో స్ఫూర్తి నింపుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో సైతం నిర్ణీత సమయానికి నిర్దేశిత లక్ష్యాలను సాధిస్తారు. కొత్త పథకాలను ప్రారంభిస్తారు. వ్యాపార విస్తరణలో దూకుడు మరింతగా పెంచుతారు. పెద్దల నుంచి కానుకలు అందుకుంటారు. పాత బాకీలను తీర్చేస్తారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ప్రియతములతో విహార యాత్రలకు వెళతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా చేయూతనిస్తారు. లక్కీ కలర్: తెలుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) సమస్యల నుంచి గట్టెక్కడానికి మరికొంత కాలం వేచి చూడక తప్పదు. వ్యక్తిగత అంశాలు, వృత్తిపరమైన అంశాలకు సంబంధించి ఇంతకాలం ఉన్న భ్రమలు తొలగిపోతాయి. మరింత క్రియాశీలంగా ఆలోచిస్తారు. ఆచరణాత్మకమైన ప్రణాళికతో ముందుకు సాగుతారు. భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. పని ప్రదేశంలో అనవసరమైన వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. పెట్టుబడులు, ఆస్తుల కొనుగోలు నిర్ణయాలను ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సన్నద్ధంగా ఉంటారు. భయాన్ని పూర్తిగా జయిస్తారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. క్రీడాకారులు ఉత్సాహంతో ఉరకలేస్తారు. విజయాలు సాధిస్తారు. పనితనం వల్ల సాధించిన గుర్తింపు కారణంగా విదేశీ అవకాశాలు కలిసొచ్చే సూచనలు ఉన్నాయి. జనాకర్షణ పెరుగుతుంది. ఇతరులు మీ సలహాల కోసం, అభిప్రాయాల కోసం ఎదురు చూస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పని నుంచి కొంత విరామం తీసుకుని విహార యాత్రలకు వెళతారు. దేవాలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: లేత గులాబి - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) మీ అంచనాలు, ఊహలు నిజం చేసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీల్లో ప్రతిష్ఠంభన తొలగుతుంది. రావలసిన బాకీలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. గృహ నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. నూతన ఉద్యోగయత్నాలలో సానుకూలం. వ్యాపారాలు అనుకూలించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో హోదాలు. పారిశ్రామికవర్గాలకు పర్యటనలు విజయవంతంగా ముగుస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. గులాబీ, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తుతి మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) అనుకున్న పనులు, వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆర్థిక పరిస్థితి మందగించి అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కుటుంబంలోనూ ఒత్తిడులు, బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు. కొన్ని నిర్ణయాలను మార్చుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలు నిదానిస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం కావచ్చు. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి. వారం చివరిలో స్వల్ప ధనలబ్ధి. వాహనయోగం. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యస్తుతి మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా విభేదాలు ఏర్పడవచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. భూవివాదాల పరిష్కారంపై దృష్టి పెడతారు. గృహ నిర్మాణయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి కృషి ఫలించకపోవచ్చు. వారం ప్రారంభంలో శుభవార్తలు. చర్చల్లో పురోగతి. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఉత్సాహంగా పనులు కొనసాగిస్తారు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతారు. విద్యార్థుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించి విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. గృహ, వాహనయోగాలు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. మీ నిర్ణయాలను అందరూ హర్షిస్తారు. వ్యాపారాలలో కొద్దిపాటి ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. ఉద్యోగాలలో అనుకున్న ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. కుటుంబంలో చికాకులు, ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయుని స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) అనుకున్న విధంగా పనులు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. చాకచక్యంగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వాహనయోగం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ఇంటాబయటా ప్రశంసలు అధికమవుతాయి. సేవాభావంతో కొన్ని కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఆశ్చర్యకరమైన రీతిలో పదవీయోగం. వారం ప్రారంభంలో బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. కొత్త రుణాల కోసం యత్నాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు ఏర్పడతాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు సామాన్యస్థితి. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు కొంత చికాకు పరుస్తాయి. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ముందుకు సాగక డీలా పడతారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి అవకాశాలు అంతగా కనిపించవు. వారం చివరిలో విందువినోదాలు. వస్తులాభాలు. గులాబీ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక విషయాలు కాస్త నిరుత్సాహపరుస్తుంది. నిర్ణయాలలో కొంత నిదానం పాటించండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం మందగిస్తుంది. కొన్ని విషయాలలో రాజీపడక తప్పదు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. ఆస్తుల వ్యవహారాలు గందరగోళంగా మారవచ్చు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి నిరాశ పరుస్తుంది. అనుకున్నంతగా డబ్బు అందక ఇబ్బందిపడతారు. పనులలో ప్రతిబంధకాలు. అనారోగ్య సూచనలు. శ్రమ తప్పితే ఫలితం కనిపించదు. నిరుద్యోగుల యత్నాలు మందగిస్తాయి. కొన్ని వివాదాలపై కోర్టులకు హాజరుకావల్సి ఉంటుంది. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. గృహ నిర్మాణాల్లో కొంత జాప్యం జరిగే అవకాశం. వ్యాపారాలు నిదానంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు ఎదురవుతాయి. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. నూతన వ్యక్తులు పరిచయం కాగలరు. రావలసిన డబ్బు చేతికంది అవసరాలు తీరతాయి. ఆహ్వానాలు, గ్రీటింగ్‌లు అందుతాయి. సన్నిహితులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నూతన విద్యావకాశాలు సైతం దక్కుతాయి. స్థిరాస్తి వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఆశించిన లాభాలతో ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు. కళారంగం వారికి విశేష గుర్తింపు లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో కలహాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమకు ఫలితం కనిపించదు. బం«ధువులతో ఆస్తి వివాదాలు. విద్యార్థులు, నిరుద్యోగులకు ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి. మిత్రులతో విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్యపరంగా చికాకులు తప్పకపోవచ్చు. గృహం, వాహనాలు కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి. వ్యాపారాలు మధ్యస్థంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు కొన్ని సమస్యలు ఎదురుకావచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. విందువినోదాలు. లేత నీలం, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ ప్రతిపాదనలు, అభిప్రాయాలను కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. అందరిలోనూ గౌరవంపెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలలో ఒక అంగీకారానికి వస్తారు. క్రీడాకారులకు శుభవార్తలు అందుతాయి. గృహ నిర్మాణాలు చేపడతారు. ఎంతోకాలంగా వేధిస్తున్న ఆరోగ్యసమస్య తీరుతుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఆశించిన లాభాలు రాగలవు. ఉద్యోగాలలో ఉన్నతహోదాలకు చేరుకుంటారు. రాజకీయవర్గాల నిరీక్షణ ఫలిస్తుంది. వారం మధ్యలో ఖర్చులు అధికం. సోదరులతో విభేదాలు. ఆకుపచ్చ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) అనూహ్యమైన రీతిలో వ్యవహారాలు చక్కదిద్దుతారు.ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందడుగు వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. విద్యావకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వాహనయోగం. ప్రముఖులతో చర్చలు సఫలం. వ్యాపారాలు సజావుగా కొనసాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు చేపడతారు. కళారంగం వారికి పురస్కారాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో (11 నవంబర్ నుంచి 17 నవంబర్ 2018 వరకు ) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అనూహ్యమైన అద్భుత సంఘటనలు జరుగుతాయి. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెదుక్కుంటూ వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో సంస్థాగత మార్గాల ద్వారా పురోగతి సాధిస్తారు. మీ విజయాలకు, పురోగతిలో వేగానికి ఇతరులు ఆశ్చర్యం చెందుతారు. ఆస్తుల వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కోరుకున్న కొత్త ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. పనికి కొంత విరామం ఇచ్చి విహారయాత్రలకు వెళతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. శుభకార్యాలు నిర్వహిస్తారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) శరవేగంగా మార్పులు సంభవిస్తాయి. వివాదాస్పద పరిస్థితుల నుంచి విజయవంతంగా బయటపడతారు. సమస్యలన్నీ వాటంతట అవే సద్దుమణుగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు స్థిరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అతిథుల రాకతో ఇంటి వాతావరణం సందడిగా మారుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, సామాజిక సేవా కార్యక్రమాలకు విరాళాలను ఇస్తారు. ప్రేమికుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం మందగించవచ్చు. లక్కీ కలర్: మీగడ రంగు మిథునం (మే 21 – జూన్ 20) స్వేచ్ఛను అనుభవిస్తారు. ఆత్మావలోకనం చేసుకుంటారు. ఆధ్యాత్మిక సాధన ద్వారా ప్రశాంతత పొందడానికి ప్రయత్నిస్తారు. మీ ధోరణి కొందరికి నచ్చకపోవచ్చు. అయినా మీరు మీ వ్యక్తిత్వాన్ని మార్చుకోకుండా ఉండటమే మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరగవచ్చు. ఏకాంతాన్ని కోరుకుంటారు. సృజనాత్మక వ్యాసంగంపై దృష్టి సారిస్తారు. పెద్దలను కలుసుకుంటారు. అనుకోని మార్పులు సంభవించే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల కోసం సమయం కేటాయించలేకపోతారు. దేవాలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: లేతాకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో పనులు వేగం పుంజుకుంటాయి. నిలిచిపోయిన ప్రణాళికలను ఆచరణలో పెడతారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వారాంతంలో సన్నిహితులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల్లో డబ్బు మదుపు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రేమికులు ఉల్లాసంగా ఉత్సాహంగా కలల్లో తేలిపోతారు. గురువులను సందర్శించుకుంటారు. కీలక విషయాలలో పెద్దల సలహాలు పొందుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుతారు. లక్కీ కలర్: ముదురు గోధుమ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) సంమయనం పాటించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో వివాదాలకు దూరంగా ఉండటం క్షేమం. అసూయాపరుల కారణంగా సమస్యలు తలెత్తవచ్చు. ధ్యానం ద్వారా ప్రశాంతత పొందగలరు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగానే ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. వేళకు భోజనం చేసే తీరిక దొరకడం కూడా కష్టమయ్యే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. పిల్లల పురోగతి కొంత సంతృప్తినిస్తుంది. పచ్చని పరిసరాల్లో విహరించాలనుకుంటారు. విహారయాత్రల కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: లేతాకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) విందు వినోదాలతో ఉల్లాసభరితంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో బృందానికి నాయకత్వం వహిస్తారు. లక్ష్యాలను సాధించి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలను అందుకుంటారు. సాధించిన విజయాలకు ప్రచారం లభిస్తుంది. అందాన్ని కాపాడుకోవడానికి సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. ఇంటిని కళాత్మకంగా తీర్చిదిద్దుకుంటారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: లేతనీలం తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. సన్నిహిత మిత్రులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. విహారయాత్రలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: లేత పసుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: నారింజ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: బూడిద రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: గులాబి మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: లేత ఊదా - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు ఎదురవుతాయి. రుణదాతలు ఒత్తిడులు పెంచుతారు. బంధువులతో తగాదాలు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటారు. విద్యార్థులు, నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పనులు నిదానంగా కొనసాగుతాయి. గృహ నిర్మాణాల్లో ప్రతిబంధకాలు. ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనలబ్ధి. వాహనయోగం. పసుపు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. ఉద్యోగయత్నాలలో ఆటంకాలు. సోదరులు, సోదరీలతో అకారణంగా విభేదాలు నెలకొనవచ్చు. ఏ పని చేపట్టినా ముందుకు సాగక డీలా పడతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాల్లో ఒడిదుడుకులు, ఉద్యోగాల్లో అనుకోని మార్పులు. పారిశ్రామికవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో స్వల్ప ధనలబ్ధి. తెలుపు, ఆకుపచ్చరంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం కొంత గందరగోళపరుస్తుంది. మిత్రులతో అకారణంగా వివాదాలు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి. ఆరోగ్యం మందగిస్తుంది. ఆస్తుల వ్యవహారంలో అగ్రిమెంట్లు వాయిదా వేసుకుంటారు. పుణ్యక్షేత్రాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. మిత్రులు సైతం శత్రువులుగా మారవచ్చు. నిర్ణయాలలో ఆచితూచి ముందుకు సాగండి. వ్యాపార లావాదేవీలు అంతగా అనుకూలించకపోవచ్చు. ఉద్యోగాలలో మార్పులు ఉంటాయి. వారం మధ్యలో శుభవార్తలు. స్వల్ప ధనలబ్ధి. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు, రుణయత్నాలు సాగిస్తారు. వ్యవహారాలు సామాన్యంగా కొనసాగుతాయి. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు ఏర్పడవచ్చు. కష్టం మీది ఫలితం వేరొకరిదిగా ఉంటుంది. ఆరోగ్యం కొంత చికాకు పరుస్తుంది. విద్యార్థుల కృషి అంతగా ఫలించదు. కాంట్రాక్టర్లు అవకాశాలు చేజార్చుకుంటారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో విందువినోదాలు. శుభకార్యాల నిర్వహణ. ధనలబ్ధి. పసుపు, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులు అన్నివిధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్తుతి మంచిది. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు, రుణయత్నాలు. పనులలో ప్రతిబంధకాలు ఏర్పడతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆరోగ్యం మందగిస్తుంది. సోదరుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతారాలు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. మీ నిర్ణయాలను కుటుంబసభ్యులు వ్యతిరేకించడం నిరాశ పరుస్తుంది. ఒక సమాచారం నిరుద్యోగులకు కాస్త ఊరటనిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగాలలో చికాకులు తప్పకపోవచ్చు. కళారంగం వారికి అవకాశాలు చేజారవచ్చు. వారం చివరిలో విందువినోదాలు. భూ, వస్తులాభాలు. నలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలకు సొమ్ము అందుతుంది. వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు ఎదురుకావచ్చు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురుకావచ్చు. విద్యార్థులు శ్రమపడ్డా ఆశించిన ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధువుల సలహాలు స్వీకరిస్తారు. కాంట్రాక్టర్లకు నిరాశాజనకంగా ఉంటుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు జరిగే అవకాశం. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో(4 నవంబర్ నుంచి 10 నవంబర్, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కలలను సాకారం చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. వ్యాపార పారిశ్రామిక వర్గాల్లోని వారు భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల పెద్దస్థాయి ఒడంబడికలను కుదుర్చుకుంటారు. లక్ష్మీ కటాక్షాన్ని పొందుతారు. ప్రేమానుబంధాలు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. విందు వినోదాల్లో ఉల్లాసంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. పెద్దల నుంచి విలువైన సలహాలు అందుకుంటారు. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. అలంకరణలపై దృష్టి సారిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్త ఆలోచనలు చేస్తారు. కొత్త పనులను చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులను బేరీజు వేసుకుని, మార్పు దిశగా ప్రయత్నాలు ప్రారంభిస్తారు. త్వరలోనే ఆ ప్రయత్నాలు సత్ఫలితాన్నిస్తాయి. పనితీరు ద్వారా పొందిన గుర్తింపు వల్ల తేలికగానే మంచి అవకాశాలను అందుకుంటారు. అసంతృప్తికర వాతావరణం నుంచి త్వరలోనే బయటపడతారు. ఇంటిని కొత్తగా అలంకరిస్తారు. వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. సన్నిహితుల నుంచి కీలక సాయం పొందుతారు. మీపై వదంతుల వ్యాప్తికి కారణమైన వ్యక్తులను గుర్తిస్తారు. దైవాన్ని నమ్ముకుంటారు. లక్కీ కలర్: పసుపు మిథునం (మే 21 – జూన్ 20) అనుభవాల ద్వారా పాఠాలు నేర్చకుంటారు. జీవితం పట్ల ఇప్పటి వరకు ఉన్న దృక్పథాన్ని మార్చుకుంటారు. తెలివిగా వ్యవహరించి హానికరమైన పరిస్థితులు ఎదురవకుండా చూసుకుంటారు. సృజనాత్మకమైన ఆలోచనలతో ముందుకు సాగుతారు. భవిష్యత్తును తీర్చిదిద్దుకునేందుకు మీరు రూపొందించుకున్న ప్రణాళికలు సత్ఫలితాలనిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. లక్కీ కలర్: నారింజ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అకుంఠిత దీక్షతో చేసిన కృషి వల్ల అసాధారణ ఫలితాలను సాధిస్తారు. ఆర్థికంగా బలపడతారు. సంపదను పెంచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు సాధించే సూచనలు ఉన్నాయి. కోరుకున్న పదవులను దక్కించుకోగలుగుతారు. కొత్తగా తలపెట్టిన పనులను ప్రారంభించడానికి ఇది పూర్తిగా అనువైన కాలం. ప్రేమ ప్రతిపాదన ఫలప్రదమవుతుంది. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. బరువును అదుపు చేసుకోవడంపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు సహాయం చేస్తారు. శుభవార్తలు సంతోషాన్నిస్తాయి. లక్కీ కలర్: నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) క్షణికావేశాన్ని నియంత్రించుకుంటారు. ఆత్మపరిశీలన చేసుకుంటారు. సాధించాల్సిన లక్ష్యాల వైపు మరింత దృఢ సంకల్పంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. పని ప్రదేశంలో చిన్న చిన్న మార్పులు చేపడతారు. అసాధ్యమనుకున్నవి సుసాధ్యం చేసి చూపిస్తారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. ఆర్థిక లాభాలు పొందుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలను దర్శిస్తారు. లక్కీ కలర్: లేత గోధుమరంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) గతం చేసిన గాయాల నుంచి తేరుకుంటారు. సానుకూల ఫలితాలను ఇచ్చే సరికొత్త దిశలో ముందుకు సాగుతారు. అయితే, భావోద్వేగాలను అదుపు చేసుకోవడం మంచిది. పనిలో సత్తా చాటుకుంటారు. గడ్డు సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆధ్యాత్మికత వైపు మొగ్గు చూపుతారు. ధ్యానం ద్వారా సాంత్వన పొందుతారు. దేవాలయాలను సందర్శిస్తారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. స్థిరాస్తి లావాదేవీలు కొలిక్కి వస్తాయి. కొత్త ఇల్లు లేదా కొత్త వాహనం సమకూరే సూచనలు ఉన్నాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. లక్కీ కలర్: ఇటుక రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) తిరుగులేని పట్టుదలతో అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. కృతనిశ్చయంతో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. అనుకున్న స్థాయిని మించి ఫలితాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. కలలను నెరవేర్చుకుంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. సుదూర యాత్రలకు వెళతారు. అద్భుతమైన ప్రదేశాలను సందర్శిస్తారు. సత్యాన్వేషణలో ముందుకు సాగుతారు. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధించడానికి సంకల్పిస్తారు. లక్కీ కలర్: తెలుపు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) అద్భుతమైన అవకాశాలు అందివస్తాయి. విజయోత్సాహంతో ముందుకు సాగుతారు. ఊపిరిసలపని పనితో ఉక్కిరిబిక్కిరవుతారు. వరుస విజయాలతో అలసటను మరచిపోతారు. మీ పురోగతిలో పెనువేగానికి సన్నిహితులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. ఇతరుల అభిప్రాయాలకు మనసు పాడుచేసుకోకుండా ఉండటమే మంచిది. ఘర్షణ తలెత్తినప్పుడు మొండితనానికి పోకుండా, పట్టు విడుపు ధోరణితో పరిస్థితులను చక్కదిద్దుకుంటారు. ఆరోగ్యం మందగించవచ్చు.. లక్కీ కలర్: ఊదా ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఇంటా బయటా మార్పులు చేపడతారు. ముఖ్యంగా వాస్తుకు సంబంధించి మార్పులు, పరిహారాలు చేపడతారు. పనుల పురోగతిలో వేగం పుంజుకుంటుంది. మీ జీవితంలో అద్భుతమైన కాలం మొదలైనట్లే. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో నిపుణుల సలహాలు తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో పరిస్థితులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. దీర్ఘకాలంగా కొనసాగిస్తూ వచ్చిన కీలకమైన పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొత్త ఫర్నిచర్‌ను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండటం మంచిది. లక్కీ కలర్: లేత బూడిదరంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. ఎంతోకాలంగా కోరుకుంటున్న స్వేచ్ఛా స్వతంత్రాలను మనసారా ఆస్వాదిస్తారు. మనస్సాక్షిని నమ్ముకుంటారు. మీ తీరు కొందరికి నచ్చకున్నా, మీదైన మార్గంలోనే ముందుకు సాగుతారు. సంగీతం, చిత్రలేఖనం వంటి లలిత కళల సాధనలో కొత్త ఉత్తేజాన్ని పొందుతారు. చిరకాల స్వప్నం నెరవేరే సూచనలు ఉన్నాయి. విహార యాత్రల్లో ఉల్లాసంగా గడుపుతారు. బంధు మిత్రులకు బాసటగా నిలుస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయవంతంగా నాయకత్వ పాత్ర పోషిస్తారు. ఇతరులకు స్ఫూర్తినిస్తారు. లక్కీ కలర్: నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు ఇనుమడిస్తాయి. ఎంతోకాలంగా నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తారు. కొత్త ఉత్సాహాన్ని పుంజుకుంటారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. వారాంతంలో బంధు మిత్రులతో విందు వినోదాలను ఆస్వాదిస్తారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. మనసైన వ్యక్తి ముందు మీ మనసులోని మాటను వెల్లడిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త అవకాశాలు తలుపుతడతాయి. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. లక్కీ కలర్: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ప్రతి అంశంలోనూ సంయమనం పాటించాల్సి ఉంటుంది. ఆచి తూచి అడుగేయాల్సి ఉంటుంది. ఇంటా బయటా శాంతి సామరస్యాల కోసం పరితపిస్తారు. ఆర్థిక లాభాలు అద్భుతంగా ఉంటాయి. అదనపు ఆదాయ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అసూయాపరులు మిమ్మల్ని తప్పుడు సలహాలతో తప్పుదారి పట్టించే సూచనలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉన్నట్లయితే అలాంటి వారి ఉచ్చుల నుంచి తప్పించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. ఆధ్యాత్మిక కేంద్రాలను దర్శించుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: బూడిదరంగు -ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ముఖ్య వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులు పరిచయమై సహకారం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. సోదరులు, సోదరీలతో వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనయోగం. తప్పనిసరిగా కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులకు ఉత్సాహం. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు ఉంటాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీనృసింహధ్యానం చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) వీరికి పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. ప్రతి వ్యవహారం విజయవంతంగా సాగుతుంది. సోదరులు,సోదరీలతో వివాదాలు తీరతాయి. ఆర్థిక ఇబ్బందులు నుంచి బయటపడతారు. చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణలో విజయం మీదే. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. కళారంగం వారి సేవలు గుర్తింపు పొందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. లేత ఆకుపచ్చ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీశివాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) వ్యతిరేకులను కూడా తమకు అనుకూలంగా మార్చుకుంటారు. సోదరులతో సఖ్యత నెలకొంటుంది. వివాహాది శుభకార్యాలలో పాల్గొని, ఆనందంగా గడుపుతారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలను చర్చించు కుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో మీకు ఎదురుండదు. పారిశ్రామికవర్గాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మీపై ఉంచిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు చిరకాల స్వప్నం నెరవేరుతుంది. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు కాస్త పుంజుకుంటాయి. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు రాగలవు. వారం చివరిలో బంధువిరోధాలు. శ్రమాధిక్యం. ఎరుపు, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ ప్రార్ధన మంచిది. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొత్త విషయాలు గ్రహిస్తారు. సంఘంలో ఎనలేని గౌరవం పొందుతారు. మీ ఆశయాలు నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. పదోన్నతులు రావచ్చు. కళారంగం వారికి విశేష ఆదరణ. వారం మధ్యలో వివాదాలు. కుటుంబంలో సమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివస్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక ప్రగతి కనిపిస్తుంది. అప్రయత్నంగా విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు కేసులు పరిష్కారవుతాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని నిర్ణయాలను కుటుంబసభ్యులు ప్రశంసిస్తారు. వ్యాపారాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగి ఊరట చెందుతారు. కళారంగం వారికి సత్కారాలు, అవార్డులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ప్రారంభంలో సమస్యలు ఎదురై కొంత చికాకు పరుస్తాయి. కష్టానికి తగిన ఫలితం పొందుతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే అనుకూలిస్తుంది. వాహనయోగం. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. తీర్థయాత్రలు చేస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారాలలో ఆటుపోట్లు అధిగమిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. ఆరోగ్యసమస్యలు. నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీమహావిష్ణుధ్యానం చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు సహాయం అందిస్తారు. ఒక లేఖ ద్వారా ముఖ్య విషయాలు తెలుస్తాయి. బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబసమస్యలు. ఎరుపు, లేత పసుపు రంగులు. తూర్పుదిశప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కుటుంబపరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సంతోషకరంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. భూములకు సంబంధించి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. నిరుద్యోగులు ఉద్యోగలాభం పొందుతారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన రీతిలో పదోన్నతులు సాధిస్తారు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీవేంకటేశ్వరస్తుతి మంచిది. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో ఉత్తరప్రత్యుత్తరాలు. ఆర్థికంగా కొంతకాలంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగుతాయి. కొన్ని సమస్యలు సైతం తీరి ఊరట చెందుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మీపై వచ్చిన అపవాదులు, ఆరోపణల నుంచి బయటపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వైరం. నలుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదుర్గాస్తుతి మంచిది. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) అప్రయత్నంగా పనులు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ప్రముఖులు పరిచయమైన సహకరిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. భూములకు సంబంధించిన వివాదాలు కొలిక్కి వస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. అనుకోని ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిÔ¶ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొన్ని పనులు కొంత నిదానించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల సాయం అందుతుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగులు ఉద్యోగలాభం పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగానే సాగుతాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు ,జ్యోతిష్య పండితులు టారో (28 అక్టోబర్ నుంచి 3 నవంబర్, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అనుమానాస్పద వ్యక్తులను గుర్తించడంలో మీ అంతరాత్మే మీకు దోహదపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే అనవసరపు మార్పులను విమర్శించడానికి ఏమాత్రం వెనుకాడరు. నిక్కచ్చి ధోరణి కారణంగా ప్రత్యర్థులు తయారవుతారు. ఈ వారంలో భావోద్వేగాలను ఎంతగా అదుపు చేసుకుంటే అంత క్షేమం. మీరు తీసుకునే నిర్ణయాల కారణంగా భాగస్వామితో పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య కొంత ఎడబాటు తప్పకపోవచ్చు. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. ఆరోగ్యంపైన, బాహ్య అలంకరణలపైన శ్రద్ధ పెంచుతారు. లక్కీ కలర్: నారింజ వృషభం (ఏప్రిల్ 20 – మే 20) విందు వినోదాలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకుంటారు. ఆర్థిక ఎదుగుదల కోసం అవసరమైన ప్రణాళికలను ఆచరణలో పెడతారు. తీరైన శరీరాకృతి కోసం వ్యాయామంపై శ్రద్ధ పెంచుతారు. ఆరోగ్యం నిలకడగానే ఉన్నా, ముందుజాగ్రత్తగా ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. ప్రేమ వ్యవహారాల్లో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. పిల్లలు సాధించిన విజయాలు సంతోషాన్నిస్తాయి. సవాళ్లను స్వీకరిస్తారు. సృజనాత్మక కళా రంగాల్లోని వారికి సన్మానాలు దక్కుతాయి. లక్కీ కలర్: లేతనీలం మిథునం (మే 21 – జూన్ 20) జీవితంలో కోరుకున్న కొత్తదనాన్ని సాధిస్తారు. మార్పులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు. తలపెట్టిన పనులన్నీ సజావుగా సాగుతాయి. ప్రతికూలతలను తొణకని స్థైర్యంతో ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగాల్లో మరింతగా రాణిస్తారు. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపును దక్కించుకుంటారు. విచక్షణతో వ్యవహరిస్తారు. జీవిత భాగస్వామితో బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకుంటారు. ఒంటరిగా ఉంటున్నవారు ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడే సూచనలు ఉన్నాయి. పెద్దల నుంచి ఆశీస్సులు పొందుతారు. విలాసాలకు ఖర్చు చేస్తారు. లక్కీ కలర్: పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) అనుకోకుండా వచ్చిపడ్డ సమస్యల కారణంగా ఆందోళన చెందుతారు. వృత్తి ఉద్యోగాల్లో పని పట్ల మరింతగా దృష్టి కేంద్రీకరిస్తారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, భావసారూప్యత గలవారి సహాయంతో తగిన కార్యాచరణను రూపొందించుకుంటారు. తలపెట్టిన పనులను అనుకున్న గడువులోగా పూర్తి చేస్తారు. కొత్తగా ప్రారంభించదలచిన వ్యాపారాల కోసం ఆర్థిక వనరులను సమకూర్చుకుంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లి కుదిరే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. లక్కీ కలర్: లేత ఊదా సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇంటా బయటా అనివార్యమైన మార్పులు ఆందోళన కలిగిస్తాయి. ప్రవాహంతో పాటు ముందుకు సాగడమే మీ వంతవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలను అంది పుచ్చుకుంటారు. పని ప్రదేశంలో జనాకర్షణ పెంచుకుంటారు. పెట్టుబడులకు సానుకూలమైన కాలం ఇది. భాగస్వామ్య లావాదేవీలకు దూరంగా ఉండటం క్షేమం. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తి సఖ్యత లోపించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: మీగడ రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అనూహ్యమైన మార్పులు ఉంటాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రత్యేక ప్రతిభా పాటవాలతో ఘన విజయాలు సాధిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహభరితంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కొంత మందకొడిగానే ఉంటుంది. తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో మీ వద్దకు వచ్చే కొందరి ప్రభావంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సాయం చేస్తారు. పాత మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: నీలం తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: ఆకుపచ్చ వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: బంగారు రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: ముదురు ఊదా మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) తలపెట్టిన పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: లేత గులాబి - ఇన్సియా ,టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) కొత్తగా చేపట్టిన పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు. బంధువులు, మిత్రుల నుంచి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. వాహన, గృహయోగాలు. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు తథ్యం. కళారంగం వారికి అవార్డులు రావచ్చు. వారం మధ్యలో భూ వివాదాలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. పట్టుదల, నేర్పుతో సమస్యల నుంచి గట్టెక్కుతారు. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గానే ఉంటుంది. ఆస్తి విషయాలలో చికాకులు తొలగుతాయి. మిత్రులు, బంధువుల నుంచి ఆహ్వానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహం. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) అనుకున్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కోర్టు కేసులు పరిష్కారదశకు చేరతాయి. రావలసిన పైకం సకాలంలో అందుతుంది. ఆరోగ్యసమస్యలు తీరతాయి. ఆస్తులు కొనుగోలు యత్నాలు కలిసివస్తాయి. విద్యార్థులు, నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. మాటల నైపుణ్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. రాజకీయవర్గాలకు అరుదైన అవకాశాలు దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు ఎదురవుతాయి. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. సోదరులతో విభేదాలు తొలగుతాయి. విద్యార్థుల ప్రజ్ఞాపాటవాలకు తగిన గుర్తింపు రాగలదు. ఇంటి నిర్మాణయత్నాలు కలిసివస్తాయి. సంఘంలో పరపతి పెరుగుతుంది. నూతన పరిచయాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతి అవకాశాలు. కళారంగం వారికి అరుదైన సన్మానాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో మాటపట్టింపులు. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో పేరుప్రతిష్ఠలకు లోటురాదు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంటుంది. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. తీర్థయాత్రలు జరుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఊరటనిచ్చే ప్రకటన రావచ్చు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు. అనుకోని ధనవ్యయం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామస్తోత్రాలు పఠించండి.. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. రుణభారాలు తొలగి, సంతోషంగా ఉంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో పనిభారం చాలావరకు తగ్గే అవకాశం ఉంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం చివరిలో ధననష్టం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. తీర్థయాత్రలు చేస్తారు. కోర్టు వివాదాల పరిష్కారం. నూతన వ్యక్తుల పరిచయం. విద్యార్థులు కొత్త లక్ష్యాలతో ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో పురోగతి కనిపిస్తుంది, అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆకుపచ్చ, లేతపసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారా స్తోత్రాలు పఠించండి.. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆశయాల సాధనలో కుటుంబసభ్యుల చేయూత అందుతుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు కొన్ని వసూలవుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చేజారిన కాంట్రాక్టులు తిరిగి దక్కుతాయి. కుటుంబసమస్యలు ఎవరినీ నొప్పించకుండా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో ప్రగతి ఉంటుంది, పెట్టుబడులకు తగిన సమయం. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు, సమస్యలు తీరతాయి. కుటుంబసభ్యులతో కీలక విషయాలపై చర్చిస్తారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు సైతం తీసుకుంటారు. ప్రముఖుల నుంచి శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు ప్రయత్నాలు సఫలమవుతాయి. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల వారు కొత్త సంస్థల ఏర్పాటు దిశగా సాగుతారు. వారం మధ్యలో ధనవ్యయం. బంధువిరోధాలు. పసుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్వామి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) పనుల్లో ఆటంకాలు. భూసంబంధిత వివాదాలు. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. మిత్రులు కూడా శత్రువులుగా మారతారు. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముందుకు సాగవు. విద్యార్థులు మరింత కష్టపడాలి. ఆలయాలు సందర్శిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అగమ్యగోచరంగా ఉంటుంది. రుణదాతల నుంచి ఒత్తిళ్లు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు కనిపించవు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అంచనాలు తప్పుతాయి.వారం మధ్యలో శుభవార్తలు, వాహనయోగం. నేరేడు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. శక్తియుక్తులతో శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. విద్యార్థులు అనూహ్యమైన అవకాశాలు దక్కించుకుంటారు.పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొత్త కాంట్రాక్టులు సైతం దక్కించుకుంటారు. వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యం మందగిస్తుంది. సోదరులతో కలహాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థికంగా కొంత బలపడతారు. ఆలోచనలు అమలులో కుటుంబసభ్యులు సలహాలు పొందుతారు. ముఖ్యమైన పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆస్తి వ్యవహారాలలో సోదరులతో అవగాహనకు వస్తారు. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు. వ్యాపారాలు విస్తృతమవుతాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు.వారం ప్రారంభంలో ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో( 21 అక్టోబర్ నుంచి 27 అక్టోబర్ 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఆర్థిక వ్యవహారాల్లో అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. ఇదివరకటి నష్టాలను పూడ్చుకుంటారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. పలుకుబడి గల వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇంటికి కొత్త అలంకరణలు చేపడతారు. సన్నిహితులతో విందు వినోదాలతో సందడిగా గడుపుతారు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. విద్యార్థులు విజయాలను సాధిస్తారు. విదేశయాన ప్రయత్నాలు సఫలమవుతాయి. కలలు నెరవేరుతాయి. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అవకాశాలు అందుబాటులోనే ఉన్నా, వాటిని అందుకోవడానికి తటపటాయిస్తారు. ఊగిసలాట నుంచి బయటపడితేనే ముందుకు సాగగలుగుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాలు మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని అమితంగా ఆనందాశ్చర్యాల్లో ముంచెత్తుతాయి. మిత్రులతో కలసి విహారయాత్రలను ఆస్వాదిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు. లక్కీ కలర్: బూడిద రంగు మిథునం (మే 21 – జూన్ 20) సమస్యలు పరిష్కారమవుతాయి. వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. మీ నిజాయితీకి గుర్తింపు లభిస్తుంది. పట్టుదలతో లక్ష్యాలను సాధిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. దీర్ఘకాలిక ప్రణాళికలు వేసుకుని, అందుకు తగిన రీతిలో పెట్టుబడులు పెడతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. మితిమీరిన పని ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆత్మవిశ్వాసంతో సవాళ్లను స్వీకరిస్తారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) కొత్త దశ మొదలవుతోంది. అద్భుతమైన భవితవ్యానికి నాంది పలికే మార్పులు మొదలయ్యే సూచనలు ఉన్నాయి. ఇదివరకటి కృషికి తగిన ఫలితాలు ఇప్పుడిప్పుడే చేతికందడం మొదలవుతుంది. అంతరాత్మ ప్రబోధం మేరకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో మీదైన ముద్ర వేస్తారు. వ్యాపారాల్లో లాభాలు బాగా పుంజుకుంటాయి. మనసుకు చేరువైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కుటుంబ సభ్యులతోను, మిత్రులతోను సరదాగా గడుపుతారు. లాభసాటి వ్యాపారాల్లో భాగస్వాములుగా చేరుతారు. రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) కొత్త ఇంటిని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అభిరుచికి తగినట్లుగా ఇంట్లో అలంకరణలు చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. ఆర్థిక పురోగతి ఆశాజనకంగా ఉంటుంది. త్వరగా పనులు పూర్తి కావాలని కోరుకుంటారు. జాప్యాన్ని సహించలేక సహనాన్ని కోల్పోయే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించడం మంచిది. పరిస్థితులు వాటంతట అవే చక్కబడతాయి. నిదానంగా నిలకడగా పనులు కొనసాగిస్తూ లక్ష్యాలను చేరుకుంటారు. ఇతరుల నుంచి సహకారం పొందుతారు. సకాలంలో అవసరాలకు తగిన ఆర్థిక సహాయం పొందుతారు. లక్కీ కలర్: నీలం కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) ఇంటా బయటా ఊహించని మార్పులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. జీవితాన్ని మీ అభీష్టానికి అనుగుణంగా తీర్చిదిద్దుకోవాలనుకుంటారు. కొత్తగా తెలుసుకున్న సమాచారాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆర్థిక పురోభివృద్ధికి తగిన అవకాశాలను స్వయంగా సృష్టించుకుంటారు. భావసారూప్యత గల మిత్రుల సహకారంతో వినూత్న కార్యక్రమాలకు రూపకల్పన చేస్తారు. సృజనాత్మక రంగంలోని వారు అద్భుతంగా రాణిస్తారు. కళాకారులు సత్కారాలను పొందుతారు. విదేశీయాన సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఇతరుల్లో స్ఫూర్తి కలిగిస్తారు. వివేకవంతమైన ఆలోచనలతో మీ బృందానికి నాయకత్వం వహిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ప్రేమానుబంధాలకు సంబంధించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. న్యాయ పోరాటంలో గెలుపు సాధిస్తారు. చిరకాలంగా నలుగుతున్న ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. పాత బకాయిలను తీర్చేస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునే ఉద్దేశంతో కొత్త వ్యాపారాలను ప్రారంభిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. లక్కీ కలర్: ఊదా వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) సవాళ్లతో కూడుకున్న అవకాశాలను అందిపుచ్చుకుంటారు. పరిస్థితులకు ఎదురొడ్డి అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుకు తగిన గుర్తింపు లభిస్తుంది. అత్యుత్సాహాన్ని, తొందరపాటుతనాన్ని అదుపు చేసుకోవడం మంచిది. మీకు వ్యతిరేకంగా వదంతులు వ్యాపించే సూచనలు ఉన్నాయి. వాటిపై అతిగా స్పందించకుండా సంయమనం పాటించడమే క్షేమం. వివాదాస్పద వ్యక్తుల వల్ల చిక్కులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించవచ్చు. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: గోధుమరంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) పని ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ఉక్కిరిబిక్కిరిగా ఉంటాయి. అకాల భోజనం తప్పకోవచ్చు. అలసట చెందుతారు. శక్తులన్నీ కోల్పోయినట్లుగా భావిస్తారు. మానసికంగా అలజడికి లోనవుతారు. ఏకాంతాన్నీ ప్రశాంతతనూ కోరుకుంటారు. ధ్యానమార్గంలో సాంత్వన పొందుతారు. కొత్త ఉద్యోగావకాశాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా, ఆశించిన అభివృద్ధి ఇంకా సాధించలేదనే అసంతృప్తి వెంటాడుతుంది. ప్రేమ వ్యవహారాల్లో స్తబ్దత నెలకొంటుంది. విహార యాత్రలతో కొంత ఉత్తేజం పొందుతారు. లక్కీ కలర్: వెండి రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి అతిగా తాపత్రయపడతారు. భావి ప్రణాళికలతో నిరంతరం సతమతమవుతూ వర్తమానంలో తారసపడే ఆనందాలను కోల్పోతారు. వృత్తి ఉద్యోగాల్లో అవసరానికి మించి శ్రమిస్తారు. అనుకోని అతిథుల రాకతో ఇంట్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పనిని ఇతరులతో పంచుకుంటేనే మీకు తీరిక చిక్కుతుంది. అన్ని పనులూ స్వయంగా చేయాలనే చాదస్తాన్ని వదులుకుంటేనే జీవితాన్ని ఆస్వాదించగలుగుతారు. ఒంటరిగా ఉంటున్నవారు తగిన జంట కోసం మరికొంత కాలం వేచి చూడాల్సి ఉంటుంది. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆర్థికంగా అద్భుతంగా ఉంటుంది. స్థిరాస్తుల్లో పెట్టుబడులు పెడతారు. ఇదివరకటి పెట్టుబడులపై లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. ప్రేమానుబంధాన్ని ఆస్వాదిస్తారు. ప్రియతములతో విహారయాత్రలకు వెళతారు. ఇంట్లోను, కార్యాలయంలోను మొక్కలు నాటడం ద్వారా ఉత్సాహభరితమైన వాతావరణం ఏర్పాటు చేసుకుంటారు. జనాకర్షణ పెరుగుతుంది. సన్నిహితులు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. ప్రముఖు సహాయంతో గడ్డు సమస్యల నుంచి తేలికగా బయటపడతారు. లక్కీ కలర్: నారింజ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒంటరి వారికి పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత వహించాల్సి వస్తుంది. చేటు చేసే పాత అలవాట్లను మానుకుని కొత్తగా మంచి అలవాట్లను ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. వ్యసనాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. కళాకారులకు ఉన్నత సత్కారాలు లభిస్తాయి. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: ముదురు గులాబి ఇన్సియా ,టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఉత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆర్థికపరమైన లావాదేవీలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు రాగలవు. వ్యాపారాలు వేగం పుంజుకుంటాయి. లాభాల బాటపడతారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. కళాకారులకు సన్మానయోగం. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. రుణఒత్తిడులు. అనారోగ్యం. తెలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీకృష్ణస్తోత్రం పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) లక్ష్య సాధనలో కుటుంబసభ్యులు సహకరిస్తారు. అందరిలోనూ గౌరవం పొందుతారు. ఆస్తి వివాదాల నుంచి విముక్తి. సోదరుల నుంచి సహాయం అందుతుంది. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహన, గృహయోగాలు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ లభిస్తుంది. వారం మధ్యలో వృథా వ్యయం. అనారోగ్యం. బం«ధువిరోధాలు. పసుపు, లేత నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నాగదేవతస్తుతి మంచిది. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఎంతో నేర్పుగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు తీరి ఒడ్డునపడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. గృహ నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార భాగస్వాములతో వివాదాలు తీరతాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు దక్కుతాయి. కళాకారులకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో సమస్యలు. పసుపు, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీలక్ష్మీనృసింహస్తుతి మంచిది. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. మిత్రుల సాయంతో ముందుకు సాగుతారు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. భూములు, వాహనాలు కొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. పారిశ్రామికవర్గాలకు అరుదైన సన్మానాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పరిస్థితులు అనుకూలిస్తాయి. అందరిలోనూ ప్రత్యేక గౌరవం లభిస్తుంది. భూవివాదాల పరిష్కారంపై చర్చలు సఫలం. ఇంటిలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం. సభలు,సమావేశాల్లో పాల్గొంటారు. వస్తులాభాలు. నిరుద్యోగుల చిరకాల కోరిక నెరవేరుతుంది. వ్యాపారాలలో పెట్టుబడులు, లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో సోదరులతో వివాదాలు. శ్రమ పెరుగుతుంది. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) మిత్రులతో వివాదాలు తీరి ఊరట చెందుతారు. గతం గుర్తుకు వచ్చి ముఖ్య విషయాలు మననం చేసుకుంటారు. కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థుల శ్రమకు ఫలితం దక్కుతుంది. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటర్వ్యూలు సైతం అందుతాయి. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. ఉద్యోగవర్గాలకు అనూహ్యమైన అవకాశాలు. కళారంగం వారి సేవలకు గుర్తింపు రాగలదు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. బంధువిరోధాలు. తెలుపు, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం.ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఎంతగా శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆలోచనలు కలసిరావు. కుటుంబంలో బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. సోదరులతో కలహాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. ఇంటాబయటా ఒత్తిడులు. వ్యాపారాలలో నిరాశ తప్పదు. పెట్టుబడుల్లో జాప్యం. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాల వారు నిర్ణయాలలో తొందరపడరాదు. వారం మధ్యలో శుభవర్తమానాలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నూతన పరిచయాలు. గులాబీ, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ముఖ్యమైన వ్యవహారాలు సమయానికి పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయులు, బంధువుల సలహాలు, సూచనలు స్వీకరిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూ, గృహయోగాలు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో చిక్కులు తొలగి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కళారంగం వారికి సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బంధువుల నుంచి శుభవర్తమానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక రుణబాధలు తీరతాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఇంటిలో శుభకార్యాల నిర్వహణ. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కోర్టు కేసులు కొలిక్కివస్తాయి. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఆశించిన రీతిలో ప్రమోషన్లు. పారిశ్రామికవర్గాలకు అంచనాలు నిజమవుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్తగా చేపట్టిన పనులు సమయానికి పూర్తి కాగలవు. కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది కలిగినా ఉపశమనం లభిస్తుంది. ఆర్థికంగా పుంజుకుంటారు. పోటీపరీక్షల్లో విద్యార్థులకు విజయం చేకూరుతుంది. నూతన ఉద్యోగప్రాప్తి. పాతమిత్రుల నుంచి కీలక సమాచారం అందుతుంది. వ్యాపారాలలో అనుకున్న మేరకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి, ఉన్నతశ్రేణి ప్రశంసలు. రాజకీయవర్గాలకు పదవీయోగం.వారం చివరిలో బంధువిరోధాలు. ధనవ్యయం. నీలం, ఆకుపచ్చరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులు తీరతాయి. వ్యవహారాలు సాïఫీగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం నూతనోత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. ఆస్తి వివాదాలు తీరతాయి. విద్యార్థుల యత్నాలు సానుకూలంగా ఉంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాల వారు కొత్త అవకాశాలు దక్కించుకుంటారు. వారం మధ్యలో కుటుంబంలో చికాకులు ఎదురవుతాయి. శ్రమాధిక్యం. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనులు విజయవంతంగా పూర్తి కాగలవు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొత్త కాంట్రాక్టర్లు దక్కుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు సానుకూలం. వ్యాపారాలలో అనుకోని లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా వ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. గులాబీ,లేత పసుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్తుతి మంచిది. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో(14 అక్టోబర్ నుంచి 20 అక్టోబర్, 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) ఆత్మనియంత్రణ పాటించడం ద్వారా సమస్యలను అధిగమించడానికి ప్రయత్నిస్తారు. ప్రతికూల భావనలు మనసును చికాకుపరచే సూచనలు ఉన్నాయి. మిత్రుల సహకారంతో సానుకూల భావనలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యసనాలను అదుపులో ఉంచుకోవడం మంచిది. ఆరోగ్యం మందగించే అవకాశాలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతికి అవరోధాలు ఎదురు కావచ్చు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. స్థిరాస్తి వివాదాల పరిష్కారంలో జాప్యం తప్పకపోవచ్చు. ఆధ్యాత్మిక గురువుల ఆశీస్సులు అందుకుంటారు. లక్కీ కలర్: బూడిద రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) కొత్త పనులు ప్రారంభించడానికి పూర్తి సానుకూలమైన సమయం. ఇప్పటి వరకు ప్రణాళికలకే పరిమితమైన పనులను ఆలస్యం చేయకుండా ఆచరణలో పెట్టండి. సత్ఫలితాలను పొందగలరు. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రయోజనాలు, పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. పని మీద మరింతగా దృష్టి సారిస్తారు. పురోగతిలో వేగం పెంచుకోవడానికి కృతనిశ్చయంతో దూసుకుపోతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఇబ్బందుల్లో ఉన్న బంధువులను ఆదుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఏర్పడిన అపార్థాలు తేలికగా సమసిపోతాయి. లక్కీ కలర్: నీలం మిథునం (మే 21 – జూన్ 20) అనవసరంగా అభద్రతాభావానికి లోనవుతారు. మీ అతిజాగ్రత్త ఇతరులకు చాదస్తంగా అనిపించే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని భయాల వల్ల చిన్న చిన్న విషయాల్లో కూడా నిర్ణయాలను జాప్యం చేస్తారు. స్వల్ప ఆరోగ్య సమస్యలకు కూడా అతిగా చింతిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని మీద పూర్తిగా మనసు లగ్నం చేయలేకపోతారు. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారం కావడం కొంత ఊరటనిస్తుంది. ఆత్మస్థైర్యం కోసం ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయిస్తారు. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. లక్కీ కలర్: ఆకుపచ్చ కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఇంతకాలం ఎలాంటి విజయాల కోసం అర్రులు చాస్తూ వచ్చారో, అలాంటి విజయాలను అందుకుంటారు. చాలా విషయాల్లో చెక్కుచెదరని పట్టుదలతో ఉంటారు. కోరుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటాయి. పనిలో భాగంగా దూరప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులపై మంచి లాభాలను అందుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. పెద్దలను సంతోషపెడతారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. లక్కీ కలర్: ఎరుపు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) జీవితంలో అనూహ్యమైన మార్పులు ఎదురవుతాయి. ఈ మార్పులతో ఉద్విగ్నత చెందుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట తారసపడే సూచనలు ఉన్నాయి. ప్రేమానుబంధాలు మీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. పెరిగిన బాధ్యతలకు తగినట్లుగానే ఆదాయం కూడా పెరుగుతుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. తీరిక దొరక్కపోవడం వల్ల భోజనాన్ని నిర్లక్ష్యం చేసే సూచనలు, ఫలితంగా ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. మార్పులను స్వీకరించడం ద్వారా అభివృద్ధిలో వేగాన్ని పెంచుకుంటారు. లక్కీ కలర్: నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) త్వరలోనే దశ తిరగబోతోంది. ఒక అద్భుతమైన కొత్త అవకాశం అనుకోకుండా అందివస్తుంది. ఆర్థికాభివృద్ధి వేగం పుంజుకుంటుంది. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన ఘనవిజయాలు మీ శ్రమను మరిపిస్తాయి. ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. నాయకత్వ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమలో పడతారు. ప్రియతముల సమక్షం ఉత్సాహాన్నిస్తుంది. బంధు మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. జనాకర్షణ గణనీయంగా పెరుగుతుంది. లక్కీ కలర్: పసుపు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: మీగడ రంగు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: ముదురాకుపచ్చ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: ఇటుక రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: పసుపు ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న పనుల్లో అవాంతరాలు. బంధువులతో కొద్దిపాటి తగాదాలు. మీకష్టం ఎదుటవారికి లాభిస్తుంది. కొన్ని విమర్శలు భరించాల్సిన సమయం. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. మరోవైపు రుణదాతల ఒత్తిడులు తప్పవు. ఒక సమాచారం నిరుద్యోగులను నిరాశ పరుస్తుంది. వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు, పైస్థాయి నుంచి ఒత్తిడులు. రాజకీయవర్గాలకు పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధనలబ్ధి. వస్తులాభాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) పరపతి కలిగిన వారితో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో విభేదాలు తొలగుతాయి. ధార్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మీ సామర్థ్యం వెలుగులోకి వస్తుంది. కళారంగం వారికి అనుకోని అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. ఆస్తి వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఆరోగ్యం కాస్త ఊరట కలిగిస్తుంది. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. విచిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో హోదాలు ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయవర్గాల వారి యత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం.దేవీస్తుతి మంచిది. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) వ్యవహారాలలో విజయంతో ఉత్సాహంగా గడుపుతారు. కుటుంబసభ్యులు పూర్తిస్థాయిలో సహకరిస్తారు. బంధువుల నుంచి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మరింత ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. తీర్థయాత్రలు చేస్తారు. అందరిలోనూ విశేష ఆదరణ పొందుతారు. ఉద్యోగయోగం. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో సోదరులతో కలహాలు. అనారోగ్య సూచనలు. పసుపు, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) రుణ విముక్తులవుతారు. ఆకస్మిక ధనప్రాప్తి. అనుకోని సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. సోదరులు, సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. విద్యార్థులు మరింత ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని ఇంక్రిమెంట్లు రాగలవు. రాజకీయవర్గాల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. గులాబీ, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితులు, మిత్రులతో కష్టసుఖాలు పంచుకుంటారు. మీపై వచ్చిన విమర్శల నుంచి బయటపడతారు. స్థిరాస్తి వృద్ధి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు అధిగమిస్తారు. నిరుద్యోగులకు అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి సత్కారాలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. నేరేడు, లేత నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్ స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) మొదట్లో నెలకొన్న సమస్యల నుంచి క్రమేపీ బయటపడతారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విద్యార్థులకు అనుకూల పరిస్థితులు. చిరకాల మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు అభివృద్ధి దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు. పారిశ్రామికరంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. నీలం, నలుపు రంగులు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఆదిత్య హృదయం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులు సమయానికి పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఊరట కలిగిస్తుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. పోటీపరీక్షల్లో నిరుద్యోగులకు విజయాలు. వ్యాపారాలు విస్తరిస్తారు, లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తగ్గుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కుతాయి. వారం మధ్యలో మానసిక అశాంతి. ఆరోగ్యభంగం. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ మంచిది. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త వ్యూహాలతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. రుణాలు తీరతాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆత్మీయులు, శ్రేయోభిలాషుల సూచనలు పాటిస్తారు. దూరపు బం«ధువులను కలుసుకుంటారు. ముఖ్య నిర్ణయాలు అందరూ హర్షిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విదేశీ విద్యావకాశాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. పసుపు, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. వాహనయోగం. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురుకావచ్చు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. వ్యాపారాలు వ్యూహాత్మకంగా విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. నేరేడు, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామిని పూజించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) వ్యయప్రయాసలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఎంతటి కార్యాన్నైనా నేర్పుగా పూర్తి చేస్తారు. నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి సహాయం అందుతుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ఇంటి నిర్మాణాలు సైతం ప్రారంభించే వీలుంది. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఉన్నతశ్రేణి నుంచి ప్రోత్సాహం అందుతుంది. రాజకీయవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో వైరం. ఆరోగ్యం మందగిస్తుంది. ఆకుపచ్చ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. వేంకటేశ్వరస్వామి స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన వ్యవహారాలు నెమ్మదించినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొన్ని రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. భూముల రిజిస్ట్రేషన్లు జరిపించుకుంటారు. సంఘంలో ఎనలేని గౌరవం. సోదరుల నుంచి కీలక సమాచారం రాగలదు. ధార్మిక కార్యక్రమాలు, వేడుకలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు బాధ్యతల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు 30 సెప్టెంబర్ నుంచి 6 అక్టోబర్, 2018 వరకు టారో మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కలలను సాకారం చేసుకుంటారు. ఆశించిన లక్ష్యాలను సాధిస్తారు. కోరుకున్న సుదూర ప్రదేశాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలను ఆస్వాదిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి, బాధ్యతలు మరింతగా పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అదనపు ఆదాయ అవకాశాలను అంది పుచ్చుకుంటారు. స్థిరాస్తులపై పెట్టుబడుల విషయంలో ఆచితూచి అడుగు ముందుకేయాల్సి ఉంటుంది. ప్రేమ సఫలం కావాలంటే మరికొంత నిరీక్షణ తప్పదు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. సేవా కార్యక్రమాలకు శక్తిమేరకు చేయూతనిస్తారు. లక్కీ కలర్: నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అతిగా ఏమీ ఆశించవద్దు. ఏ అంశంలోనైనా ఇతరుల నుంచి ఏదైనా ఆశించడానికి అనువైన కాలం కాదు. ఓరిమితో ఎదురు చూడటం మినహా ప్రస్తుతానికి మరో మార్గం లేదు. జీవిత భాగస్వామితో తలెత్తే వాదులాటలను తెగేవరకు లాగకుండా ఉండటమే క్షేమం. వృత్తి ఉద్యోగాల్లో అజ్ఞాత శత్రువుల నుంచి సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటమే మంచిది. నిరాశకు లోను చేసే వార్తలను వింటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగానే ఉన్నా, మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సానుకూలమైన కాలం. కొత్త భాగస్వామ్యాలు మీ వ్యాపార అభివృద్ధికి దోహదపడతాయి. కొత్త అవకాశాలు కలసి వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభకు తగిన గుర్తింపు దక్కుతుంది. కొందరికి పదోన్నతులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. పొదుపు చేయడానికి, దీర్ఘకాలిక పథకాల్లో మదుపు పెట్టడానికి ఇది అనువైన కాలమే అయినా, స్పెక్యులేషన్ లావాదేవీలకు పరిస్థితి అనుకూలం కాదు. ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు మదింపు వేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆహార జాగ్రత్తలు అనివార్యమవుతాయి. లక్కీ కలర్: పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో ఎదురయ్యే గడ్డు సమస్యల నుంచి చాకచక్యంగా బయటపడతారు. లేనిపోని దుస్సాహసాలకు దూరంగా ఉంటేనే మంచిది. అనాలోచితంగా చేసిన పనులకు ఫలితంగా ఎదురయ్యే పర్యవసానాలకు సిద్ధంగా ఉండక తప్పదు. వాహనాలను నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంట్లోని పెద్దల ఆరోగ్య పరిస్థితి కలవరపెట్టే సూచనలు ఉన్నాయి. విదేశాల నుంచి అవకాశాలు కలసి వస్తాయి. విద్యార్థులు దీక్షతో సత్ఫలితాలను సాధిస్తారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. ఇంతకాలం ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: ఊదా సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) భావోద్వేగాలను అదుపు చేసుకోవాల్సి ఉంటుంది. కీలక నిర్ణయాలకు సంబంధించి ఊగిసలాటకు లోనవుతారు. అనవసరమైన సందిగ్ధతలను విడిచిపెట్టి పని మీద దృష్టి కేంద్రీకరించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. ప్రేమకు సంబంధించిన ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. అవసరాలు తీర్చుకోవడం కోసం మీ చుట్టూ తిరిగే వారిని దూరం పెడతారు. అసలైన మిత్రులెవరో తేల్చుకుంటారు. అనాథలను ఆర్థికంగా ఆదుకుంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటారు. లక్కీ కలర్: వెండి రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీదైన శైలిలో ముందుకు సాగుతారు. ఆత్మవిశ్వాసం తొణికిసలాడే మీ వ్యవహార శైలితో జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటారు. మిత్రులతో కలసి ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకలు జరుపుకొంటారు. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. భావసారూప్యత గల వ్యక్తులతో కలసి సామాజిక కార్యక్రమాలను చేపడతారు. సాహితీ కళా రంగాల్లోని వారికి తగిన గుర్తింపు దొరుకుతుంది. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జీవిత భాగస్వామి తారసపడే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలకు పెద్దల ఆమోదం లభిస్తుంది. లక్కీ కలర్: నాచు రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) మొహమాటాలకు పోయి సమస్యలను కొని తెచ్చుకునే సూచనలు ఉన్నాయి. ఎంత కావలసిన వారైనా, పరిస్థితులను బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. శక్తికి మించిన పనులు చేయాలనే ఒత్తిడి ఎదురైన సందర్భాల్లో నిర్మొహమాటంగా ‘కుదరదు’ అని చెప్పడం నేర్చుకుంటేనే మంచిది. వృత్తి ఉద్యోగాల్లో లౌక్యంగా వ్యవహరిస్తేనే సమస్యల నుంచి గట్టెక్కగలుగుతారు. ముక్కుసూటితనం వల్ల చిక్కులు తప్పకపోవచ్చు. సృజనాత్మక రంగాల్లోని వారు అద్భుతంగా రాణిస్తారు. ప్రేమికుల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. లక్కీ కలర్: ముదురు నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఇతరులకు సంబంధించిన తప్పొప్పుల మీమాంసలను పక్కనపెట్టి, మీ జీవితాన్ని పూర్తిగా మీరే అదుపులోకి తీసుకోండి. మీ జీవితంలో ఇతరుల ప్రమేయాన్ని కనీస స్థాయికి కుదించడం మేలు. ప్రతి పనిలోనూ విమర్శలకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించండి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిబంధకాలు తప్పకపోవచ్చు. అడుగడుగునా శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. మిమ్మల్ని అర్థం చేసుకునే మిత్రుల సమక్షంలో సాంత్వన పొందుతారు. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తలెత్తే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: బంగారు రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) అభివృద్ధి మార్గంలో శరవేగంగా దూసుకుపోతారు. జటిలమైన సమస్యలను చిటికెలో పరిష్కరించి ఇతరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. వృత్తి ఉద్యోగాల్లో మీరు పనిచేసే చోట మీదైన ముద్ర వేస్తారు. ఆర్థిక పరిస్థితిని మరింతగా మెరుగుపరచుకునేందుకు తగిన ప్రణాళికలతో ముందుకు సాగుతారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. ఇంటికి మరమ్మతులు చేపడతారు. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. ఆర్థిక సమస్యల్లో చిక్కకున్న మిత్రుల్లో ఒకరికి చేయూతనిస్తారు. విహార యాత్రలకు వెళారు. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు. లక్కీ కలర్: లేత ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కొత్త అవకాశాలు వెతుక్కుంటూ మీ వద్దకొస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. పదోన్నతులు లభించే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇతరులకు హామీ ఉండే పరిస్థితుల్లో ఆచి తూచి అడుగేయడం మంచిది. సామాజికంగా పలుకుబడి పెరుగుతుంది. భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఒంటరితనాన్ని కోరుకుంటారు. ధ్యానంతో ఊరట పొందుతారు. సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. లక్కీ కలర్: పసుపు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వరుస పనులతో తలమునకలుగా ఉంటారు. విపరీతమైన ఒత్తిడితో సతమతమవుతారు. చివరి నిమిషం వరకు వేచి చూడకుండా తలపెట్టిన పనులను నిర్దేశిత సమయానికి ముందే ముగించడానికి తాపత్రయపడతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన భారాన్ని తలకెత్తుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనుబంధాలు చక్కబడాలంటే స్వయంగా చొరవ తీసుకోవాల్సి ఉంటుంది. ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. వైద్యుల సలహాపై ఆహార విహారాల్లో మార్పులు చేపట్టాల్సిన పరిస్థితులు ఉంటాయి. లక్కీ కలర్: గోధుమ రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) కీలకమైన నిర్ణయం తీసుకోవలసిన సందర్భంలో సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటారు. దైవంపై భారం వేసి ముందడుగు వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీకు సంబంధించని పనుల్లో తలదూర్చకుండా ఉంటేనే క్షేమం. భవిష్యత్తులో లాభాలు తెచ్చిపెట్టగల కొత్త పనిని ప్రారంభిస్తారు. మిత్రుల సహకారం ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనూహ్యమైన వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు. అప్పుల నుంచి బయటపడతారు. నిపుణులను సంప్రదించి ఆస్తుల కొనుగోలు కోసం ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. లక్కీ కలర్: ముదురు గులాబి - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. పట్టుదల, కృషితో నిరుద్యోగులు విజయాలు సాధిస్తారు. సోదరుల నుంచి ఆస్తిలాభ సూచనలు. భూములు, గృహం కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ముందడుగు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఛండీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) పనుల్లో విజయం సాధిస్తారు. శుభవార్తా శ్రవణం. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యలు తీరతాయి. ఆస్తుల కొనుగోలులో ఆటంకాలు అధిగమిస్తారు. వాహన యోగం. విద్యార్థులకు ఊహించని విజయాలు. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కోర్టు వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో అధిక లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోతాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఎంతటి పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక సమస్య నుంచి బయటపడతారు. భూములు, వాహనాలు కొంటారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. పసుపు, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) చాతుర్యంతో ఎదుటవారిని సైతం ఆకట్టుకుని పనులు చక్కదిద్దుతారు. ఆస్తి వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థుల్లో పట్టుదల పెరుగుతుంది. ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. కొత్త ఉద్యోగయత్నాలు సానుకూలం. అందరిలోనూ ప్రత్యేక గౌరవం పొందుతారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కే అవకాశం. రాజకీయ, పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. మిత్రులతో కలహాలు. గులాబీ, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఊహించని విధంగా మెరుగుపడుతుంది. బాకీలు సైతం అందుతాయి. సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు. భూములు, వాహనాలు సమకూర్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. ముఖ్య నిర్ణయాలు కుటుంబసభ్యులను మెప్పిస్తాయి. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు పనిభారం మరింత తగ్గుతుంది. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు. వారం మధ్యలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త కార్యక్రమాలు ప్రారంభిస్తారు. సంఘంలో ప్రత్యేక గౌరవం పొందుతారు. పోటీపరీక్షల్లో విద్యార్థులు విజయం సాధిస్తారు. విలువైన వస్తువులు సేకరిస్తారు. కీలక నిర్ణయాలకు తగిన సమయం. సోదరులు, మిత్రుల నుంచి పిలుపు అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. పాతజ్ఞాపకాలు గుర్తుకు రాగలవు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. కుటుంబంలో చికాకులు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ఉద్యోగయత్నాలలో పురోగతి కనిపిస్తుంది. కొత్త కాంట్రాక్టులు పొందుతారు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా కొనసాగుతాయి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) పరిస్థితులు అనుకూలిస్తాయి. మీకంటూ గౌరవం పొందుతారు. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు. మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కుటుంబంలో చికాకులు తొలగుతాయి. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగులకు విశేష గుర్తింపు తథ్యం. రాజకీయవర్గాలకు కొత్త పదవులు రావచ్చు. వారం మధ్యలో ఆరోగ్యసమస్యలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనుల్లో జాప్యం తప్పదు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశాజనకంగా ఉంటుంది. వ్యయప్రయాసలు తప్పవు. బంధువులు, మిత్రుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలులో అవాంతరాలు ఎదురవుతాయి. ఆరోగ్యం కొంచెం మందగిస్తుంది. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు కాస్త నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తలు వింటారు. సోదరుల నుంచి ధనలాభం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఇంటాబయటా ఒత్తిడులు. ఆర్థిక ఇబ్బందులు, రుణాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో జాప్యం. బంధువులతో మాటపట్టింపులు. ఆరోగ్యభంగం. విద్యార్థులు, నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార లావాదేవీలలో ఆటుపోట్లు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పాత మిత్రుల కలయిక. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. ఆలోచనలు కలసివస్తాయి. సభలు,సమావేశాలకు హాజరవుతారు. బంధువులు, మిత్రులతో ఉత్సాహవంతంగా గడుపుతారు. ఒక లేఖ ద్వారా ముఖ్య సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు శుభవార్తలు. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగులకు మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. నలుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. కొన్ని ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. కుటుంబసభ్యుల సలహాలు పాటిస్తారు. చిన్ననాటì æసంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. ఇతరులకు సైతం సహాయపడతారు. వాహనయోగం. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. పనులు సమయానికి పూర్తి. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో ప్రత్యేక హోదాలు దక్కే అవకాశం. కళారంగం వారికి సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో 23 సెప్టెంబర్ నుంచి 29 సెప్టెంబర్, 2018 వరకు మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) కాలంతో పోటీపడతారు. ఆశించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోగా సాధించడానికి, తలపెట్టిన పనులను త్వరగా పూర్తి చేయడానికి విరామం తీసుకోకుండా శ్రమిస్తారు. వృత్తి నిపుణులు రాణిస్తారు. ఉద్యోగాల్లో కొనసాగుతున్న వారు ఉద్యోగ మార్పు ఆలోచనలను వాయిదా వేసుకోవడమే మంచిది. మీ ఆకాంక్షలకు తగిన మార్పుల కోసం మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉంటుంది. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు కొంత మందకొడిగా ఉన్నట్లు అనిపించినా, సమీప భవిష్యత్తులోనే మెరుగుపడే సూచనలు ఉన్నాయి. మిత్రుల సహకారం ఉంటుంది. లక్కీ కలర్: ఆకాశ నీలం వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వర్తమాన కాలం కంటే అధునాతనంగా ఉండే మీ ఆలోచనలను మీ చుట్టూ ఉండే సహచరులు అర్థం చేసుకోలేకపోతారు. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మీయులతో అనుబంధాలు మరింత బలపడతాయి. కొత్త అనుబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో జటిలమైన సమస్యలకు పరిష్కారాలను కనుగొని అధికారుల ప్రశంసలు పొందుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. బంధు మిత్రులతో కలసి ఉల్లాసంగా ఉత్సాహంగా వేడుకల్లో సందడి చేస్తారు. సన్నిహితులతో కలసి విహార యాత్రలకు వెళతారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) జీవితంలో భద్రతను కోరుకుంటారు. అలాగే విజయాలనూ ఆకాంక్షిస్తారు. భావోద్వేగాలను నిలకడగా ఉంచుకోవడానికి విఫలయత్నాలు చేస్తారు. ముందుగా వేసుకున్న ప్రణాళికల ప్రకారం పనులు పూర్తి కాకపోవడంతో సహనం కోల్పోతారు. వృత్తి ఉద్యోగాల్లోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్వయం ఉపాధిలో కొనసాగుతున్న వారికి వారాంతంలో ఆర్థిక లబ్ధి కలిగించే చక్కని అవకాశం కలసి వస్తుంది. ఏకపక్ష నిర్ణయాలకు స్వస్తి చెప్పి జీవిత భాగస్వామి సలహాలను పట్టించుకోవడం మంచిది. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. బద్ధకం పెరుగుతుంది. లక్కీ కలర్: లేత ఊదా కర్కాటకం (జూన్ 21 – జూలై 22) మిమ్మల్ని మీరు అంతుచిక్కని వేరే ప్రపంచంలో తప్పిపోయినట్లుగా భావిస్తారు. ఆలోచనలను ఒక దారికి తెచ్చుకోవడానికి ప్రయాసపడతారు. జ్ఞానానికీ, ఊహలకూ మధ్య కొనసాగే ఊగిసలాటతో సతమతమవుతారు. ఇంతవరకు ఇంటి వరకు మాత్రమే పరిమితమైన మీ దృష్టిని బా«హ్య ప్రపంచంలోకి సారిస్తారు. పని మీద దృష్టిని కేంద్రీకరించలేకపోతారు. వృత్తి ఉద్యోగాల్లో నెలకొన్న పోటీలో స్వయంకృతాపరాధాల కారణంగా వెనుకబడిపోతారు. సన్నిహితులతో వాగ్వాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. క్రీడలపై, వ్యాయామంపై శ్రద్ధ చూపుతారు. లక్కీ కలర్: వెండి రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఉత్సాహంతో ఉరకలేస్తారు. ఊహా ప్రపంచంలో విహరిస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ ఘనతను నిరూపించే సందర్భాలు ఎదురవుతాయి. ఆలోచనల్లో స్పష్టత ఏర్పడుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు క్రమంగా సానుకూలంగా మారుతాయి. ప్రేమ వ్యవహారంలో ఎదురయ్యే సవాళ్లు కొంత అలజడి కలిగిస్తాయి. చేతికందిన పెన్నిధి చేజారిపోతుందేమోనని ఆందోళన చెందుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక గురువుల నుంచి ఆశీస్సులు అందుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: నారింజ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) మీకూ మీ జీవిత భాగస్వామికీ గల అనుబంధంలో ఎలాంటి సమస్యలూ లేకపోయినా, మీరు ఒక కొత్త వ్యక్తి ఆకర్షణలో చిక్కుకుంటారు. దాని ఫలితంగా మానసికంగా నిలకడగా ఉండలేకపోతారు. అందాన్ని కాపాడుకోవడానికి సన్నిహితుల నుంచి సలహాలు కోరుకుంటారు. ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి. పెట్టుబడుల మీద ఆదాయం అంచనాలకు మించి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇదివరకు మీరు సాధించిన విజయాలకు ప్రతిఫలంగా పదోన్నతులు పొందుతారు. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. విదేశీ వ్యవహారాలు ఆర్థికంగా కలసి వస్తాయి. లక్కీ కలర్: లేత గోధుమ రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సంభాషణా చాతుర్యంతో ఇతరులను ఆకర్షించడమే కాకుండా, వృత్తిపరమైన విజయాలను అవలీలగా సాధిస్తారు. ఒక గొప్ప పనిని మీ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయ పరంపరను కొనసాగిస్తారు. సవాళ్లకు ఎదురు నిలుస్తారు. విద్యార్థులు చదువుల్లో పోటీ పడతారు. ప్రేమికుల మధ్య అనుబంధానికి పెద్దల ఆమోదం లభిస్తుంది. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరుకుతుంది. సుదూర ప్రాంతాల్లో ఉంటున్న బంధువులను కలుసుకుంటారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: గులాబి వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఇప్పటివరకు పీడిస్తున్న భయాందోళనలు తొలగిపోతాయి. అనుబంధాల్లో నెలకొన్న పొరపొచ్చాలు తేలికగా సమసిపోతాయి. పరిస్థితులు చక్కబడతాయి. కుటుంబంలో తిరిగి ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రణాళికలను ఆచరణ పెట్టడంలో ఎదురయ్యే ఇబ్బందులను చాకచక్యంగా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకుంటారు. మానసిక ఉల్లాసం కోసం కళలను అభ్యసించడం ప్రారంభిస్తారు. కళా సాధన మీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతుంది. ప్రేమికుల మధ్య కొత్త ఆశలు చిగురిస్తాయి. రాజకీయంగా పరపతి పెంచుకుంటారు. ప్రత్యర్థులను కట్టడి చేస్తారు. లక్కీ కలర్: బూడిద రంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) పొరపాట్లను పునరావృతం చేయకుండా జాగ్రత్తపడటం మేలు. పొగడ్తలతో ముంచెత్తి మిమ్మల్ని తప్పుదోవ పట్టించడానికి కొందరు ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు కలసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. అసూయాపరులు మిమ్మల్ని దెబ్బతీయడానికి చాటుగా ప్రయత్నాలు సాగిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ప్రత్యర్థుల నుంచి ఊహించని సవాళ్లు తప్పకపోవచ్చు. అడుగడుగునా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. ధార్మిక కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తారు. లక్కీ కలర్: ఎరుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) మీరు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి జీవిత భాగస్వామి నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జంట దొరికే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో విపరీతమైన పోటీని ఎదుర్కొంటారు. కొందరు మీకు వ్యతిరేకంగా వదంతులను ప్రచారం చేస్తారు. ఇతరుల భావోద్వేగాలు మీపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. వేళాపాళా లేని పని ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాల్లో మార్పులు అవసరమవుతాయి. బరువును అదుపులో ఉంచుకోవడానికి తగిన జాగ్రత్తలు ప్రారంభిస్తారు. లక్కీ కలర్: ఇటుక రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) మంచి చెడులలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోక తప్పని పరిస్థితి ఎదురవతుంది. పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో సాధించిన విజయాలు మంచి గుర్తింపు తెచ్చిపెడతాయి. కుటుంబ అవసరాల కోసం ప్రయాణాలు చేస్తారు. ఇంతవరకు గడిపిన ఉక్కిరిబిక్కిరి జీవితం నుంచి కొంత స్వేచ్ఛ దొరుకుతుంది. వాయిదా వేస్తూ వస్తున్న వ్యాపకాలలో నిమగ్నమయ్యేందుకు ప్రయత్నిస్తారు. ఇంతవరకు కొనసాగిన జీవితంపై ఆత్మావలోకనం చేసుకుంటారు. శక్తికి మించిన బాధ్యతల భారాన్ని అనివార్యంగా తలకెత్తుకోవాల్సి రావచ్చు. దైవబలాన్ని నమ్ముకుంటారు. లక్కీ కలర్: గోధుమ రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) ఇంటా బయటా మీ ప్రాముఖ్యత పెరుగుతుంది. విందు వినోదాల్లో సన్నిహితులతో సరదాగా గడుపుతారు. హాస్య చతురతతో జనాన్ని ఇట్టే ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తారు. క్రమశిక్షణతో ఘన విజయాలు సాధిస్తారు. సామాజిక హోదా పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. అనుకున్న పనులన్నీ సజావుగా పూర్తవుతాయి. లౌక్యం లేని ముక్కుసూటిదనం కారణంగా సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి కోసం తగినంత సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. లక్కీ కలర్: లేతాకుపచ్చ ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) చేపట్టిన వ్యవహారాలు కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీపై మరింత ఆదరణ చూపుతారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) మీ అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పవచ్చు. ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబ సమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం, ఆదిత్య హృదయం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనసౌఖ్యం. ఇంటాబయటా మీకు ఎదురుండదు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విశేష గౌరవం లభిస్తుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులతో విరోధాలు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. విద్యార్థులకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు అర్చన చేయండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సేవలు గుర్తింపు పొందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలుకు చర్యలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి చాలావరకూ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడి, సంతోషంగా ఉంటారు. మీ ప్రతిపాదనలు అందరూ ప్రశంసిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు నెమ్మదిగా తీరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. ఆపదలోని వారికి సైతం చేయూతనందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువిరో«ధాలు. ఖర్చులు పెరుగుతాయి. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు , జ్యోతిష్య పండితులు టారో (16 సెప్టెంబర్ నుంచి 22 సెప్టెంబర్, 2018 వరకు ) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) గ్రహానుకూలత బాగుంటుంది. ఆర్థికంగా అభివృద్ధి దిశలో ముందుకు సాగుతారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక లక్ష్యాల సాదన పట్ల వేచి చూసే ధోరణి కొనసాగిస్తారు. కొత్త మిత్రులు పరిచయమవుతారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి. పిల్లల పురోగతికి ఆనందిస్తారు. పని ఒత్తిడి పెరిగి వేళకు భోజనం చేసే తీరికైనా దొరకని పరిస్థితులు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రేమానుబంధాల్లో చిక్కులు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: బంగారు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితులను మదింపు వేసుకుని భవిష్యత్ కార్యాచరణకు దిగుతారు. ఈ వారంలో పెట్టుబడుల నిర్ణయాలను వాయిదా వేసుకోవడమే మంచిది. భావి ఆకాంక్షలకు అనుగుణంగా స్థిరాస్తుల కొనుగోలుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి. లక్కీ కలర్: ముదురాకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) చాలా సానుకూలమైన కాలం. విదేశాల్లో ఉంటున్నవారితో భాగస్వామ్య ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. అతి నిక్కచ్చిగా వ్యవహరించే మీ తీరును ఇతరులు మొండితనంగా పరిగణిస్తారు. పట్టువిడుపులు ప్రదర్శించకపోతే ప్రత్యర్థుల నుంచి చిక్కులు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్తగా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. లక్కీ కలర్: నీలం కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సమస్యల్లో చిక్కుకున్న కొందరికి శక్తివంచన లేకుండా సహాయం చేస్తారు.బంధుత్వాలు బలపడతాయి. మేలు కోరే సన్నిహితుల సలహాలను విమర్శలుగా పొరపడకుండా, వాటిని పాటించడమే మంచిది. కుటుంబ సభ్యుల కోసం మరింత సమయాన్ని కేటాయిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలకు దోహదపడే అవకాశాలు అందివస్తాయి. కళారంగంలోని వారికి సత్కారాలు లభిస్తాయి. లక్కీ కలర్: బూడిద రంగు సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సృజనాత్మకతకు పదును పెట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భవిష్యత్తుపై ఒక నిశ్చింత ఏర్పడుతుంది. ప్రశాంతతను ఆస్వాదిస్తారు. ధ్యానం, యోగసాధనపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కోరుకున్న చోటుకు బదిలీలు, పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. సన్నిహితుల వేడుకల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. ఒంటరిగా ఉంటున్నవారికి తగిన జోడీ దొరికే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: ఎరుపు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అసాధ్యమనుకున్న పనులను సాధించి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తారు. చిన్న చిన్న విషయాలను కూడా అత్యంత నిశితంగా గమనిస్తూ తగిన ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఎంచుకున్న రంగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. సురక్షితమైన, సుసంపన్నమైన భావి జీవితం కోసం పకడ్బందీగా ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. పని ఒత్తిడి వల్ల ప్రేమికుల కోసం సమయం కేటాయించలేకపోతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు అందుకుంటారు. ఇంటికి మరమ్మతులు చేపడతారు. మార్పులకు సిద్ధంగా ఉంటారు. లక్కీ కలర్: ఊదా తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) అధికారంలో ఉన్న ఒక వ్యక్తి నుంచి గొప్ప అండదండలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన పనిఒత్తిడిని ఎదుర్కొంటారు. విశ్రాంతిని కోరుకున్నా, ఈ వారంలో తగిన విశ్రాంతి దొరకడం కష్టమే. గొప్ప విజయాలు సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. పలుకుబడి గల వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. జంటను కోరుకునే ఒంటరివారికి మరికొంతకాలం నిరీక్షణ తప్పకపోవచ్చు. లక్కీ కలర్: బూడిద రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఇంటాబయటా ఒతిళ్లు ఎదురవుతాయి. భోజనానికి సైతం తగిన తీరిక దొరకనంతగా పనుల్లో సతమతమవుతారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు కలసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు పురోగతిలో ముందుకు సాగుతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తి ఒకరి ద్వారా ఆర్థికంగా లాభసాటి అవకాశం లభిస్తుంది. కొంత ప్రయాసపడిన తర్వాత గందరగోళ పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. లక్కీ కలర్: నలుపు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) అందరికీ తెలిసిన దారులు కాకుండా కొత్త దారిని ఎన్నుకుంటారు. ఆత్మవిశ్వాసంతో మీదైన మార్గంలో ముందుకు సాగి ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు ఉంటాయి. అధికారంతో కూడిన పదోన్నతులు దక్కవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆలోచనల్లోనూ ఆచరణలోనూ విలక్షణంగా వ్యవహరిస్తారు. ప్రేమానుబంధాల్లో పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: తెలుపు మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) క్రీడా రంగంలోను, సృజనాత్మక రంగంలోను ఉన్నవారికి అనుకూలమైన కాలం. సన్మాన సత్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూల ప్రభావం చూపే ఘర్షణలకు దూరంగా ఉండటం క్షేమం. అనుకోని మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. ఇల్లు లేదా ఊరు మారే పరిస్థితులు కూడా ఉంటాయి. మధ్యవర్తి వ్యాపారాల్లో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగంలోని వారు ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. వదంతులను పట్టించుకోకుండా, ఆశించిన లక్ష్యాలపైనే దృష్టి కేంద్రీకరిస్తారు. లక్కీ కలర్: ముదురు నారింజ కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలను పొందుతారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలసి వస్తాయి. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. నాయకత్వ పాత్రలో రాణిస్తారు. పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. పని ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండటమే క్షేమం. లక్కీ కలర్: ఆకుపచ్చ మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. చిరకాల స్వప్నాలను సాకారం చేసుకుంటారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా సుస్థిరతను సాధిస్తారు. సామాజికంగా గౌరవాదరాలను, పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జీవితభాగస్వామి దొరకే అవకాశాలు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి దేవాలయాలను సందర్శిస్తారు. లక్కీ కలర్: నారింజ - ఇన్సియా ,టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) అనుకున్న పనులు పూర్తి చేస్తారు. అందరిలోనూ విశేష గౌరవం పొందుతారు. ఆర్థికంగా బలపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులకు ఆశించిన విద్యావకాశాలు దక్కుతాయి. గృహం, వాహనాలు కొనుగోలులో ఆటంకాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త హోదాలు లభించవచ్చు. రాజకీయవర్గాలకు ప్రయత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో కలహాలు. పసుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారతారు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి కనిపిస్తుంది. భూవివాదాలు పరిష్కారమవుతాయి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలలో నూతన పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగస్తులకు పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు రావచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. ఎరుపు, లేతనీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. కుటుంబసభ్యుల ఆప్యాయత పొందుతారు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పరపతి కలిగిన వారితో పరిచయాలు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఆశలు ఫలిస్తాయి. వారం మధ్యలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారకస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కొత్త రుణయత్నాలు సాగిస్తారు. పనులు నిదానంగా సాగుతాయి. ఆప్తులు, మిత్రులతో విభేదాలు ఏర్పడవచ్చు. ఆలోచనలు కలసిరావు. నిర్ణయాలు పునఃసమీక్షిస్తారు. పెద్దల సలహాలు పాటిస్తారు. వేడుకలలో పాల్గొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు. భాగస్వామ్య వ్యాపారాలలో సామాన్యలాభాలు. ఉద్యోగాలలో కొన్ని మార్పులు జరిగే వీలుంది. రాజకీయవర్గాలకు పదవులు అసంతృప్తి కలిగిస్తాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు. స్వల్ప «దనలాభం. తెలుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనులలో ఆటంకాలు తొలగుతాయి. పాతమిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం రాగలదు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు పొందుతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) రుణాలు తీరి ఊరట చెందుతారు. రావలసిన డబ్బు అందుతుంది. సోదరులు, మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. నిరుద్యోగులు, విద్యార్థులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. మీపై వచ్చిన ఆరోపణలు తొలగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు సత్కారాలు. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. తెలుపు, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. పనులు చకచకా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. తీర్థయాత్రలు చేస్తారు. ఒక సమాచారం విద్యార్థులకు ఉపశమనం కలిగిస్తుంది. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. కళారంగం వారికి అనూహ్యమైన అవకాశాలు. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. నీలం, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివారాధన మంచిది. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఎంతోకాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. వ్యవహారాలు సజావుగా పూర్తి చేస్తారు. కోర్టు వివాదాల నుంచి బయటపడతారు. సోదరులతో ఆనందంగా గడుపుతారు. మీ నిర్ణయాలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారాలు కొత్త పెట్టుబడులతో విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో మంచీచెడ్డా విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సూచనల మేరకు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ప్రముఖులతో చర్చలు సఫలమవుతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో కుటుంబంలో ఒత్తిడులు. ధనవ్యయం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ప్రారంభంలో చికాకులు, సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యం, ఓర్పుతో అధిగమిస్తారు. మీపై ఉంచిన బాధ్యతలు సక్రమంగా నిర్వహిస్తారు. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యార్థులు మరింత చురుగ్గా ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో కొత్త అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆస్తి వివాదాలు. నేరేడు, చాక్లెట్ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. దూరపు బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు రాగలవు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. తెలుపు, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆస్తి విషయంలో కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. కుటుంబసభ్యులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. గృహ నిర్మాణం, కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. నీలం, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో ( సెప్టెంబర్ నుంచి 15 సెప్టెంబర్ 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) జీవితం ఉత్తేజభరితంగా ఉంటుంది. నిశ్శబ్దంగా మీ జీవితంలోకి ప్రవేశించే ఒక కొత్త వ్యక్తి మీలో ఉద్విగ్నితను రేకెత్తించే సూచనలు ఉన్నాయి. కొత్తగా పరిచయమైన ఆ వ్యక్తి కొంత ప్రమాదకరంగా అనిపించవచ్చు. అలాంటి వ్యక్తితో అనుబంధాన్ని పెంచుకునే ముందు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి విపరీతంగా ఉంటుంది. గడువులోగా నిర్దేశిత లక్ష్యాలను అందుకోవడం కష్టంగా పరిణమిస్తుంది. కుటుంబంలో చోటు చేసుకునే కొన్ని అవాంఛిత సంఘటనలు మిమ్మల్ని కలవరపాటుకు గురిచేస్తాయి. లక్కీ కలర్: తుప్పు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అద్భుతమైన వారం. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కనీసం మీ ఊహకైనా అందని సరికొత్త రంగాల్లోకి అడుగుపెట్టే అవకాశాలు వాటంతట అవే వచ్చి మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. స్ఫూర్తిమంతమైన ఈ పరిస్థితిని మీరు అడుగడుగునా ఆస్వాదిస్తారు. భద్రత పట్ల అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. సురక్షితంగా భద్రతావలయంలో ఉన్న అనుభూతి మాత్రమే మీకు సంతోషాన్నిస్తుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నూతనోత్తేజాన్నిస్తాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. లక్కీ కలర్: ముదురు నారింజ మిథునం (మే 21 – జూన్ 20) మీ అంతరంగంలో చోటు చేసుకుంటున్న మార్పును మీ అంతట మీరే గుర్తించగలుగుతారు. భవిష్యత్తుపై ఎన్నడూ లేనంతగా ఆత్రుత చెందుతారు. జరిగిన సంఘటనలను పైపేనే కాకుండా వాటి లోలోతులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. భావసారూప్యత గల మిత్రులతో మీ భావోద్వేగాలను పంచుకుంటారు. కొత్త వ్యక్తులతో స్నేహం చేయాలనుకుంటారు. వృత్తి ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో యవ్వనోత్సాహంతో ఉరకలేస్తారు. తెలివితేటలతో గుర్తింపు పొందుతారు. సుదూర ప్రాంతాల్లోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: బంగారు రంగు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) భావోద్వేగాలను అదుపు చేసుకోలేకపోతారు. విమర్శలు చేసే వారి మీద విరుచుకుపడతారు. పరిస్థితుల మధ్య బందీగా చిక్కుకుపోయినట్లు భావిస్తారు. ఇప్పటికే ప్రేమానుబంధాల్లో ఉన్నట్లయితే అవరోధాలుగా మారిన అనుబంధాల నుంచి బయటపడతారు. ఒంటరిగా ఉంటున్నట్లయితే సరైన జోడీ కోసం ఆచి తూచి వెదుకులాట సాగించాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలకు అవకాశాలు పరిమితంగానే ఉంటాయి. స్వయంకృషితో కొత్త అవకాశాలను సృష్టించుకుంటారు. విద్యార్థులు ఉన్నత పరీక్షల్లో ఘనమైన విజయాలు సాధిస్తారు. లక్కీ కలర్: నీలం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) మారాల్సిన సమయం ఇది. ఇదివరకటి మీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా వదులుకుని మీ ప్రస్తుత వ్యక్తిత్వానికి నిబద్ధులవుతారు. ఆత్మావలోకనానికి తగిన సమయం కేటాయించుకోవడం మంచిది. ఇప్పటి పరిస్థితులు ఇలాగే కొనసాగాలనే అనవసర తాపత్రయాన్ని వదులుకుని, అనివార్యమైన మార్పులకు మనస్పూర్తిగా ఆహ్వానం పలుకుతారు. పిల్లల యోగక్షేమాల కోసం సమయాన్ని కేటాయిస్తారు. వారి ఆసక్తులను నెరవేర్చడానికి ప్రయత్నిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) పీడకలలు వెంటాడతాయి. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి తగిన అవకాశాలు దక్కుతాయో లేదోననే ఆందోళన వెంటాడుతుంది. మిమ్మల్ని ప్రోత్సహించి ముందుకు నడిపే వ్యక్తుల సమక్షంలో కొంత ఊరట పొందుతారు. వారి ఆసరాతో మీ ప్రతిభా పాటవాలను నిరూపించుకుంటారు. మీకు మీరే అత్యంత ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అత్యున్నత ప్రమాణాలకు కట్టుబడతారు. కష్టనష్టాలన్నింటినీ తట్టుకుని విజయవంతంగా లక్ష్యాలను సాధిస్తారు. పని ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. లక్కీ కలర్: లేతనీలం తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశ్చర్యకరమైన కొత్త అనుభవాలు ఎదురవుతాయి. కలలను సాకారం చేసుకుంటారు. కొత్త దిశలో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలు బలోపేతమవుతాయి. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. సౌందర్య పోషణపై, అలంకరణపై శ్రద్ధ చూపుతారు. శరీరాకృతిని మెరుగుపరచుకునేందుకు వ్యాయామం ప్రారంభిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆశించిన లక్ష్యాలను అందుకోవడంతో ఆత్మవిశ్వాసం ఇనుమడిస్తుంది. కీలకమైన అంశాల్లో సన్నిహితుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. లక్కీ కలర్: గోధుమరంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ పాత్రలో రాణిస్తారు. పితూరీలు చెప్పేవారిని దూరం పెడతారు. వ్యతిరేక ప్రచారాలను తిప్పికొడతారు. గతానుభవాలను దృష్టిలో ఉంచుకుని సమస్యల నుంచి బయటపడటానికి ఆచి తూచి అడుగులు వేస్తారు. ఆదాయం బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తి అనుబంధాల్లో ప్రతిష్టంభన ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మొండితనం వీడి పట్టు విడుపులు ప్రదర్శించడం మంచిది. సామాజిక కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటారు. లక్కీ కలర్: కెంపురంగు ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) స్తబ్దత తొలగిపోతుంది. తలపెట్టిన పనుల్లో వేగం పుంజుకుంటుంది. ఏకకాలంలో అనేక పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాల్లో దూకుడు కొనసాగిస్తారు. వ్యాపారాల్లో లాభాలు రెట్టింపవుతాయి. సన్నిహిత వర్గాల చర్చల్లో మీరే కేంద్ర బిందువుగా ఉంటారు. ప్రగాఢంగా మార్పును కోరుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాయామంపై శ్రద్ధ పెంచుకుంటారు. ధ్యానంతో సేదదీరుతారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) వారమంతా సంతోషభరితంగా సాగుతుంది. నవ్వుతూ తుళ్లుతూ మిత్రులతో కాలక్షేపం చేస్తారు. పరిమితులను పట్టించుకోకుండా ఇతరులను ఆదుకుంటారు. ఔదార్యాన్ని చాటుకుంటారు. ప్రియతముల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. ఆస్తుల అమ్మకాల్లో ఊహించని స్థాయిలో లాభాలను అందుకుంటారు. పిల్లలు సాధించిన విజయాలు మీ పేరు ప్రతిష్ఠలను మరింతగా పెంచుతాయి. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరిస్తారు. నాయకత్వ పాత్రలో సత్తా నిరూపించుకుంటారు. ఆర్యోగంపై శ్రద్ధ తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: బూడిద రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) ఆలోచనల్లో స్పష్టత పెరుగుతుంది. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. సమస్యల చిక్కులన్నీ ఒక్కొక్కటే విడిపోతాయి. పరిస్థితులు నెమ్మదిగా చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారరంగంలోని వారికి భవిష్యత్తులో లాభసాటి కాగల కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇల్లు లేదా స్థలం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులు పంతాలు వదులుకొని, అహాన్ని పక్కనపెడితే సమస్యలు వాటంతట అవే చక్కబడతాయి. లక్కీ కలర్: ముదురు ఊదా మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) మీ నిర్ణయాలను, విశ్వాసాలను సమర్థించుకుంటారు. మీదైన వైఖరికి కట్టుబడి ఉంటారు. శక్తికి మించిన భారం మోస్తున్నట్లుగా భావిస్తారు. పరిస్థితులకు అనుగుణంగా మారాల్సిన అవసరాన్ని గుర్తిస్తారు. పని ఒత్తిడి ఉన్నా, పనికీ కుటుంబానికి మధ్య సమతుల్యత సాధించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. జీవిత భాగస్వామితో తలెత్తిన అపార్థాలను తొలగించుకుంటారు. మార్పులను స్వీకరిస్తారు. ప్రశాంతత కోరుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణం చేసే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక మార్గంలో పురోగతి సాధిస్తారు. సద్గురువుల అనుగ్రహం పొందుతారు. లక్కీ కలర్: గులాబి ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు చికాకు పరుస్తాయి. ఆర్థిక విషయాలు నిరాశాజనకంగా ఉంటాయి. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విరోధాలు. ఆరోగ్యసమస్యలు ఎదురవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. మిత్రులు శత్రువులుగా మారతారు. విద్యార్థులకు గందరగోళ పరిస్థితి. వ్యాపారాలలో చికాకులు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో ధన, వస్తులాభాలు. స్థిరాస్తి వృద్ధి. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) కొత్త పనులకు శ్రీకార ం చుడతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి సాధిస్తారు. బంధువులతో వివాదాలు తీరతాయి. గతం గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. ఒక సమాచారం విద్యార్థులను ఆకట్టుకుంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుంచి పిలుపు రావచ్చు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి. కళారంగం వారికి అవార్డులు రావచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. ఎరుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి కాగలవు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వస్తు, వస్త్రలాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు రాగలవు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఇంటాబయటా ఒత్తిడులు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) సమయానికి సొమ్ము అంది అవసరాలు తీరతాయి. విద్యార్థుల సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఉద్యోగయత్నాలు కలిసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. పరిచయాలు పెరుగుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు. పారిశ్రామికవర్గాలకు మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నూతన విద్య, ఉద్యోగావకాశాలు పొందుతారు. ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రాగలవు. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం. గులాబీ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్యహృదయం పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. గృహ నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. నిర్ణయాలలో పొరపాట్లు సరిదిద్దుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో ఊహించని ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు విశేష ఆదరణ. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యసమస్యలు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) కొన్ని పనులు నెమ్మదించినా సమయానికి పూర్తి కాగలవు. ఆర్థికంగా బలపడతారు. సమస్యల బారి నుంచిబయటపడతారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆస్తి వ్యవహారాలలో కొత్త ఒప్పందాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. వాహనయోగం. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగాలలో అనుకోని పోస్టులు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. తెలుపు, నీలంరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) బంధువుల సహాయంతో ముందడుగు వేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. మీ సేవలకు తగిన గుర్తింపు రాగలదు. ముఖ్యమైనపనులు విజయవంతంగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఒక ప్రకటనకు ఆకర్షితులవుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలించేసమయం. స్థిరాస్తి వివాదాలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. వ్యాపారాలు సజావుగా సొగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి విముక్తి. కళారంగం వారికి కొత్త అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో అనుకోని ఖర్చులు. కుటుంబ,ఆరోగ్య సమస్యలు. ఎరుపు, లేత ఆకుపచ్చరంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొత్త పనులు ప్రారంభిస్తారు. అనుకున్నదే తడవుగా నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల ప్రశంసలు, ఆదరణ లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే ఆశాజనకంగా ఉంటాయి. నూతన గృహయోగం. వివాహ వేడుకలు నిర్వహిస్తారు. సంఘంలో మరింత గౌరవం లభిస్తుంది. సంతానరీత్యా శుభవార్తలు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనూహ్యమైన అవకాశాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు ప్రభుత్వం నుంచి పిలుపు. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. సోదరులు, సోదరీలతో వివాదాలు కాస్త తీరతాయి. శుభకార్యాల నిర్వహణపై చర్చలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తినిస్తుంది. రుణబాధలు తొలగుతాయి. విద్యార్థులు ముందడుగు వేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. శ్రమ పెరుగుతుంది. నీలం, పసుపురంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. క్రమేపీ అనుకూల వాతావరణం నెలకొంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభ సూచనలు. విద్యార్థులు, నిరుద్యోగులకు కీలక సమాచారం అందుతుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి కాగలవు. వ్యాపారాలు విస్తరించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో ఎదురుండదు. రాజకీయవర్గాలకు అనుకోని పదవులు. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. కుటుంబసభ్యులతో వైరం. ఆకుపచ్చ, తెలుపురంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొన్ని వ్యవహారాలు అప్రయత్నంగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి కాస్త కుదుటపడుతుంది. సన్నిహితులు సహాయ సహకారాలు అందిస్తారు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. భూమి సంబంధిత లాభాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల కృషి ఫలిస్తుంది. వారం మధ్యలో వివాదాలు. కొంత అనారోగ్యం. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో(2 సెప్టెంబర్ నుంచి 8 సెప్టెంబర్ 2018 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) అదృష్టం మీ వెంటే ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అధికారంతో కూడిన పదోన్నతులు లభిస్తాయి. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. ఇతరుల నుంచి సలహాలు స్వీకరిస్తారు. ఆకస్మిక ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. వ్యాపార విస్తరణ ప్రణాళికలను ఆచరణలో పెడతారు. స్థిరాస్తులను కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త పాటించడం అవసరం. ప్రేమ వ్యవహారాల్లో తలెత్తే పొరపొచ్చాలను స్వయంగా చొరవ తీసుకుని పరిష్కరించుకోవడం మంచిది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: బంగారు రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) వరుస విజయాలతో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ఇంటా బయటా సంతృప్తికరమైన పరిస్థితులు నెలకొంటాయి. ప్రేమికుల మధ్య ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి. ఒంటరిగా ఉంటున్న వారికి పెళ్లిళ్లు కుదిరే సూచనలు ఉన్నాయి. ఇతరులతో మీ ఆనందాన్ని పంచుకుంటారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుంటారు. దూర ప్రాంతాలకు విహార యాత్రల కోసం వెళతారు. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. లక్కీ కలర్: బూడిద రంగు మిథునం (మే 21 – జూన్ 20) తలపెట్టిన పనులన్నింటినీ ఆశించిన రీతిలోనే పూర్తి చేస్తారు. అదృష్టం కలిసొస్తుంది. జాగ్రత్తతో కూడిన ప్రణాళికలు మీ విజయాలకు బాటలు వేస్తాయి. కొత్త అనుబంధాలు ఏర్పడతాయి. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. కృతనిశ్చయంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటారు. ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. వ్యాయామం ప్రారంభిస్తారు. దూరప్రాంతాల నుంచి కీలక సమాచారాన్ని అందుకుంటారు. పలుకుబడి గల వ్యక్తుల నుంచి సాయం అందుకుంటారు. ఆధ్యాత్మిక చింతనలో పడతారు. లక్కీ కలర్: ఊదా కర్కాటకం (జూన్ 21 – జూలై 22) ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటి సాధన కోసం అహరహం శ్రమిస్తారు. పనికి మొదటి ప్రాధాన్యమిస్తారు. కఠినమైన పోటీల్లో విజయాలు సాధిస్తారు. ధార్మిక కార్యక్రమాలకు చేయూత ఇస్తారు. ఆర్థిక పరిస్థితిని మదింపు వేసుకుంటారు. అనవసరపు ఖర్చులకు కళ్లెం వేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల నుంచి ఇబ్బందులు తలెత్తవచ్చు. శక్తికి మించిన పని ఒత్తిడి ఆరోగ్యంపై ప్రభావం చూపే సూచనలు ఉన్నాయి. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకోవడమే మంచిది. ఇతరులు మీ సలహాల కోసం ఎదురు చూస్తారు. లక్కీ కలర్: ముదురు నారింజ సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఇంటా బయటా అనివార్యమైన మార్పులు ఆందోళన కలిగిస్తాయి. ప్రవాహంతో పాటు ముందుకు సాగడమే మీ వంతవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి. కొత్త అవకాశాలను అంది పుచ్చుకుంటారు. పని ప్రదేశంలో జనాకర్షణ పెంచుకుంటారు. పెట్టుబడులకు సానుకూలమైన కాలం ఇది. భాగస్వామ్య లావాదేవీలకు దూరంగా ఉండటం క్షేమం. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహారపు అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది. ప్రేమికుల మధ్య విభేదాలు తలెత్తి సఖ్యత లోపించే సూచనలు ఉన్నాయి. లక్కీ కలర్: గోధుమ రంగు కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) అనూహ్యమైన మార్పులు ఉంటాయి. స్థానచలన సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీ ప్రత్యేక ప్రతిభా పాటవాలతో ఘన విజయాలు సాధిస్తారు. ఒంటరిగా ఉన్నవారికి తగిన తోడు దొరికే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలు ఉత్సాహభరితంగా సాగుతాయి. ఆర్థిక పురోగతి కొంత మందకొడిగానే ఉంటుంది. తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో మీ వద్దకు వచ్చే కొందరి ప్రభావంలో చిక్కుకోకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇతరులకు సాయం చేస్తారు. పాత మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. లక్కీ కలర్: గులాబి తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు. లక్కీ కలర్: నీలం వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) ఆర్థిక పరిస్థితి అద్భుతంగా ఉంటుంది. సంపాదించిన సంపదకు సంబరపడతారు. మిత్రులతో కలసి కొత్త పెట్టుబడులు పెడతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. సంకల్ప బలంతో ఆశించిన లక్ష్యాలను చేరుకుంటారు. కలలను సాకారం చేసుకుంటారు. విశ్వసనీయమైన వ్యక్తి ఒకరు పరిచయమవుతారు. ఆ వ్యక్తితో అనుబంధం భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. వైద్యుల సలహాతో ఆహార విహారాల్లో మార్పులు చేపడతారు. లక్కీ కలర్: నారింజ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) జనాకర్షణ పెరుగుతుంది. అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుని, చక్కగా రాణిస్తారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. శ్రమకు తగిన ఫలితాన్ని దక్కించుకుంటారు. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమించిన వ్యక్తి దూరమయ్యే సూచనలు ఉన్నాయి. ఈ పరిస్థితి మనస్తాపం కలిగిస్తుంది. ధ్యానంతో సాంత్వన పొందుతారు. లక్కీ కలర్: ముదురు గులాబి మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) ఉజ్వల భవితవ్యం కోసం కలలు గంటారు. భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి ఏం చేయాలనే దానిపై నిర్విరామంగా ఆలోచనలు సాగిస్తారు. ప్రణాళికలు వేసుకుంటారు. కేవలం ఆలోచనల వల్లనే ప్రయోజనం ఉండదు. వాటిని ఆచరణలో పెట్టే మార్గాలపై ఎంత త్వరగా దృష్టి సారిస్తే అంత మంచిదని తెలుసుకుంటారు. మీ కలలను సాకారం చేసుకోవడానికి ఆచరణాత్మక దృక్పథం కలిగిన వ్యక్తుల సాయం తీసుకుంటారు. అదనపు కుటుంబ బాధ్యతలు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే సత్ఫలితాలు దక్కుతాయి. లక్కీ కలర్: ఊదా కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన మార్పులు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక ఆర్థిక లాభాలను తెచ్చి పెడతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు పొందడం ద్వారా ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సంతృప్తికరమైన ఆదాయం పొందుతారు. వ్యాపారరంగంలోని వారు ఊహించని విజయాలు సాధించి, ప్రత్యర్థుల ఎత్తుగడలను చిత్తు చేస్తారు. కళాకారులకు గౌరవ సత్కారాలు దక్కే సూచనలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సంయమనం పాటించాల్సి ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం మంచిది. లక్కీ కలర్: వెండి రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) తలపెట్టని పనులను సజావుగా పూర్తి చేయాలనుకున్న మీ అంచనాలు తలకిందులవుతాయి. అనుకోని అవాంతరాలు, అవరోధాలు ఎదురవుతాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో వృథా కాలహరణం చేయకుండా, ప్రవాహంతో పాటే ముందుకు సాగడం మంచిది. పరిస్థితులు క్రమంగా వాటంతట అవే చక్కబడతాయి. పెట్టుబడుల నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు అసంతృప్తి కలిగిస్తాయి. ప్రియతములతో కలసి విహార యాత్రలకు వెళతారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరమవుతుంది. బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తారు. లక్కీ కలర్: ముదురాకుపచ్చ - ఇన్సియా టారో అనలిస్ట్