వారఫలాలు | Varaphalalu in this week | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Sep 16 2018 1:11 AM | Last Updated on Sun, Sep 16 2018 1:12 AM

Varaphalalu in this week - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చేపట్టిన వ్యవహారాలు కొన్ని ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. ఆత్మీయులు మీపై మరింత ఆదరణ చూపుతారు. నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఆర్థికంగా ఇబ్బందులు పడినా అవసరాలకు సొమ్ము అందుతుంది. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఆస్తి వివాదాల నుంచి కొంత బయటపడతారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల యత్నాలు కలసివస్తాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
మీ అంచనాలు కొన్ని వ్యవహారాలలో తప్పవచ్చు. ఆర్థిక విషయాలు కొంత నిరాశ పరుస్తాయి. శ్రమానంతరం పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. విద్యార్థులకు అనుకూల సమాచారం.  శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు చేపడతారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రయత్నాలు సానుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి పిలుపు రావచ్చు. స్థిరాస్తి విషయంలో చికాకులు తొలగుతాయి. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు సత్కారాలు. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబ సమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం, ఆదిత్య హృదయం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అవసరాలకు డబ్బు అందుకుంటారు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై చర్చిస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం. వాహన, గృహయోగాలు కలుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో మీ సమర్థతను చాటుకుంటారు. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. ఎరుపు, ఆకుపచ్చరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. రాఘవేంద్రస్వామి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు కొంత జాప్యం జరిగినా పూర్తి కాగలవు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. సోదరుల ఇంట శుభకార్యాలలో పాల్గొంటారు. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి. పారిశ్రామికవర్గాలకు విదేశీ ఆహ్వానాలు అందుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. నేరేడు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త వ్యక్తులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణబాధలు తొలగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూవివాదాలు పరిష్కారమవుతాయి. సేవాకార్యక్రమాలపై దృష్టి పెడతారు. వాహనసౌఖ్యం. ఇంటాబయటా మీకు ఎదురుండదు. కొన్ని సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విశేష గౌరవం లభిస్తుంది. వారం మధ్యలో బంధువిరోధాలు. ఆరోగ్యభంగం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థిక వ్యవహారాలు నిరాశ పరుస్తాయి. కొత్త రుణాల కోసం యత్నిస్తారు. బంధువులతో విరోధాలు. మిత్రులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. విచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. విద్యార్థులకు చికాకులు తప్పకపోవచ్చు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు అర్చన చేయండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆలోచనలు అమలు చేస్తారు. నూతన విద్యావకాశాలు దక్కుతాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. బంధువుల ప్రోద్బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. పనులు చకచకా పూర్తి కాగలవు. ఆరోగ్యం కుదుటపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు. కళారంగం వారికి సేవలు గుర్తింపు పొందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో విభేదాలు. ఎరుపు, పసుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
మీరు తీసుకునే నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. శ్రమకు ఫలితం దక్కించుకుంటారు. పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. రుణదాతల ఒత్తిడులు తొలగుతాయి. తీర్థయాత్రలు సాగిస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. సోదరీలతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. స్థిరాస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు అనుకున్న రీతిలో సాగుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కించుకుంటారు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం, ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తుతి మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
నూతనంగా చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. పనులు విజయవంతంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు అందుకుంటారు. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో  అనారోగ్యం. కుటుంబంలో కలహాలు. నేరేడు, ఆకుపచ్చ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆలోచనలు అమలుకు చర్యలు చేపడతారు. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారతారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం అందుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. మానసిక అశాంతి. గులాబీ, నీలం రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి చాలావరకూ మెరుగుపడుతుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడి, సంతోషంగా ఉంటారు. మీ ప్రతిపాదనలు అందరూ ప్రశంసిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు నెమ్మదిగా తీరతాయి. విద్యార్థులకు పోటీపరీక్షల్లో విజయం. ఆపదలోని వారికి సైతం చేయూతనందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో బంధువిరో«ధాలు. ఖర్చులు పెరుగుతాయి. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

- సింహంభట్ల సుబ్బారావు , జ్యోతిష్య పండితులు


టారో (16 సెప్టెంబర్‌ నుంచి 22 సెప్టెంబర్, 2018 వరకు )
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
గ్రహానుకూలత బాగుంటుంది. ఆర్థికంగా అభివృద్ధి దిశలో ముందుకు సాగుతారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక లక్ష్యాల సాదన పట్ల వేచి చూసే ధోరణి కొనసాగిస్తారు. కొత్త మిత్రులు పరిచయమవుతారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు సంతోషాన్ని కలిగిస్తాయి. పిల్లల పురోగతికి ఆనందిస్తారు. పని ఒత్తిడి పెరిగి వేళకు భోజనం చేసే తీరికైనా దొరకని పరిస్థితులు తలెత్తవచ్చు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ప్రేమానుబంధాల్లో చిక్కులు తప్పకపోవచ్చు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితులను మదింపు వేసుకుని భవిష్యత్‌ కార్యాచరణకు దిగుతారు. ఈ వారంలో పెట్టుబడుల నిర్ణయాలను వాయిదా వేసుకోవడమే మంచిది. భావి ఆకాంక్షలకు అనుగుణంగా స్థిరాస్తుల కొనుగోలుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు. సేవా కార్యక్రమాలకు విరాళాలు ఇస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. కొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రేమానుబంధాలు బలపడతాయి.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
చాలా సానుకూలమైన కాలం. విదేశాల్లో ఉంటున్నవారితో భాగస్వామ్య ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పనులు అనుకున్నట్లుగా సాగుతాయి. పదోన్నతులు లభించే అవకాశాలు ఉన్నాయి. అతి నిక్కచ్చిగా వ్యవహరించే మీ తీరును ఇతరులు మొండితనంగా పరిగణిస్తారు. పట్టువిడుపులు ప్రదర్శించకపోతే ప్రత్యర్థుల నుంచి చిక్కులు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కొత్తగా పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడతారు.
లక్కీ కలర్‌: నీలం

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపు లభిస్తుంది.  సమస్యల్లో చిక్కుకున్న కొందరికి శక్తివంచన లేకుండా సహాయం చేస్తారు.బంధుత్వాలు బలపడతాయి. మేలు కోరే సన్నిహితుల సలహాలను విమర్శలుగా పొరపడకుండా, వాటిని పాటించడమే మంచిది. కుటుంబ సభ్యుల కోసం మరింత సమయాన్ని కేటాయిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలకు దోహదపడే అవకాశాలు అందివస్తాయి. కళారంగంలోని వారికి సత్కారాలు లభిస్తాయి.
లక్కీ కలర్‌: బూడిద రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. సృజనాత్మకతకు పదును పెట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. భవిష్యత్తుపై ఒక నిశ్చింత ఏర్పడుతుంది. ప్రశాంతతను ఆస్వాదిస్తారు. ధ్యానం, యోగసాధనపై దృష్టి సారిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కోరుకున్న చోటుకు బదిలీలు, పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. సన్నిహితుల వేడుకల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శిస్తారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. ఒంటరిగా ఉంటున్నవారికి తగిన జోడీ దొరికే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ఎరుపు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
అసాధ్యమనుకున్న పనులను సాధించి అందరినీ ఆశ్చర్యచకితులను చేస్తారు. చిన్న చిన్న విషయాలను కూడా అత్యంత నిశితంగా గమనిస్తూ తగిన ప్రణాళికలు రూపొందించుకుంటారు. ఎంచుకున్న రంగాల్లో ఘన విజయాలు సాధిస్తారు. సురక్షితమైన, సుసంపన్నమైన భావి జీవితం కోసం పకడ్బందీగా ఆర్థిక ప్రణాళికలు వేసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. పని ఒత్తిడి వల్ల ప్రేమికుల కోసం సమయం కేటాయించలేకపోతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో లాభాలు అందుకుంటారు. ఇంటికి మరమ్మతులు చేపడతారు. మార్పులకు సిద్ధంగా ఉంటారు.
లక్కీ కలర్‌: ఊదా

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
అధికారంలో ఉన్న ఒక వ్యక్తి నుంచి గొప్ప అండదండలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో శక్తికి మించిన పనిఒత్తిడిని ఎదుర్కొంటారు. విశ్రాంతిని కోరుకున్నా, ఈ వారంలో తగిన విశ్రాంతి దొరకడం కష్టమే. గొప్ప విజయాలు సాధిస్తారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా నడుస్తాయి. పలుకుబడి గల వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. పిల్లల ఆరోగ్యంపై దృష్టి పెట్టాల్సి వస్తుంది. పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు. జంటను కోరుకునే ఒంటరివారికి మరికొంతకాలం నిరీక్షణ తప్పకపోవచ్చు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
ఇంటాబయటా ఒతిళ్లు ఎదురవుతాయి. భోజనానికి సైతం తగిన తీరిక దొరకనంతగా పనుల్లో సతమతమవుతారు. వృత్తి ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు కలసి వస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు పురోగతిలో ముందుకు సాగుతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తి ఒకరి ద్వారా ఆర్థికంగా లాభసాటి అవకాశం లభిస్తుంది. కొంత ప్రయాసపడిన తర్వాత గందరగోళ పరిస్థితుల నుంచి గట్టెక్కుతారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
లక్కీ కలర్‌: నలుపు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
అందరికీ తెలిసిన దారులు కాకుండా కొత్త దారిని ఎన్నుకుంటారు. ఆత్మవిశ్వాసంతో మీదైన మార్గంలో ముందుకు సాగి ఘన విజయాలు సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల మార్పులు ఉంటాయి. అధికారంతో కూడిన పదోన్నతులు దక్కవచ్చు. కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ఆలోచనల్లోనూ ఆచరణలోనూ విలక్షణంగా వ్యవహరిస్తారు. ప్రేమానుబంధాల్లో పొరపొచ్చాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. కొన్ని త్యాగాలకు సిద్ధపడాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: తెలుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
క్రీడా రంగంలోను, సృజనాత్మక రంగంలోను ఉన్నవారికి అనుకూలమైన కాలం. సన్మాన సత్కారాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ప్రతికూల ప్రభావం చూపే ఘర్షణలకు దూరంగా ఉండటం క్షేమం. అనుకోని మార్పులు సంభవిస్తాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు. ఇల్లు లేదా ఊరు మారే పరిస్థితులు కూడా ఉంటాయి. మధ్యవర్తి వ్యాపారాల్లో ఉన్నవారు మంచి లాభాలు పొందుతారు. పారిశ్రామిక రంగంలోని వారు ఆకాశమే హద్దుగా దూసుకుపోతారు. వదంతులను పట్టించుకోకుండా, ఆశించిన లక్ష్యాలపైనే దృష్టి కేంద్రీకరిస్తారు.
లక్కీ కలర్‌: ముదురు నారింజ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అన్ని రంగాల్లోనూ సానుకూల ఫలితాలను పొందుతారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కలసి వస్తాయి. విద్యార్థులు అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అదనపు బాధ్యతలను స్వీకరిస్తారు. నాయకత్వ పాత్రలో రాణిస్తారు. పిల్లల చదువుపై శ్రద్ధ చూపించాల్సి వస్తుంది. సామాజిక కార్యకలాపాల్లో మీ పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. పని ఒత్తిడి పెరగడం వల్ల ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఇతరుల వ్యవహారాల్లో కలగజేసుకోకుండా ఉండటమే క్షేమం.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కీలక అంశాల్లో కుటుంబ సభ్యుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. చిరకాల స్వప్నాలను సాకారం చేసుకుంటారు. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా సుస్థిరతను సాధిస్తారు. సామాజికంగా గౌరవాదరాలను, పేరు ప్రఖ్యాతులను పొందుతారు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జీవితభాగస్వామి దొరకే అవకాశాలు. విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. కుటుంబ సభ్యులతో కలసి దేవాలయాలను సందర్శిస్తారు.
లక్కీ కలర్‌: నారింజ


- ఇన్సియా ,టారో అనలిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement