వారఫలాలు | Varafalalu(10-03-2019) | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Mar 10 2019 1:38 AM | Last Updated on Sun, Mar 10 2019 1:38 AM

Varafalalu(10-03-2019) - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వాహనయోగం. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాలు సందర్శిస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు సఫలమవుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు ఊహించని అవకాశాలు. వారం చివరిలో అనారోగ్యం. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీఖడ్గమాల పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. అనుకున్న విధంగా డబ్బు సమకూరుతుంది. సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. వాహన, గృహయోగాలు కలుగవచ్చు. విద్యార్థులకు ఫలితాలు ఊరటనిస్తాయి. ఆరోగ్యసమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఇంటాబయటా గౌరవమర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమకు ఫలితం కనిపిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. గులాబీ, నీలం రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీనృసింహస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
స్వీయానుభవాలతో కొన్ని వివాదాలను పరిష్కరించుకుంటారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. కుటుంబంలో శుభకార్యాల హడావుడి. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆసక్తికర సమాచారం అందుతుంది. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి విషయంలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. జీవిత భాగస్వామి ద్వారా ధనలాభం. వ్యాపార లావాదేవీలు మరింత ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమర్థతను నిరూపించుకునే సమయం. కళారంగం వారికి అవకాశాలు పెరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
వీరికి అన్నింటా విజయాలే వరిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఉత్సాహాన్నిస్తుంది. అనుకున్న వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు.  తీర్థయాత్రలు చేస్తారు. భూములు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలం. విద్యార్థులు, నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. యుక్తి, నేర్పుతో క్లిష్టమైన వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగిస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో మీ లక్ష్యాలు సాధిస్తారు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల సమయం. వారం మధ్యలో ఆరోగ్య, కుటుంబసమస్యలు. అనుకోని ధనవ్యయం. బంగారు, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని ఇబ్బందులు అధిగమించి ముందుకు సాగుతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. ప్రముఖులు మాటసహాయం అందిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. బాకీలు సైతం వసూలై ఆర్థికంగా బలపడతారు. దూరమైన ఆప్తులు తిరిగి దగ్గరకు చేరతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో పరిస్థితులు చక్కబడతాయి. రాజకీయవర్గాలకు మరింత సానుకూలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. వినాయక స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రారంభంలో కొన్ని సమస్యలు, వివాదాలు తప్పకపోవచ్చు. అయితే పట్టుదలతో వాటిని అధిగమించి ముందుకు సాగుతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. సోదరులు, మిత్రుల సహాయం కోరతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుంటారు. వివాహ వేడుకలకు హాజరవుతారు. సంఘంలో పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపడతారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు కలసివస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. కళారంగం వారి సేవలకు గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
పనులు కొన్ని శ్రమానంతరం పూర్తి కాగలవు. ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉన్నా అవసరాలకు లోటు ఉండదు. సన్నిహితులతో వివాదాలు కొంత పరిష్కరించుకుంటారు. భూములు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు విజయాల బాటలో పయనిస్తారు. ముఖ్య వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభనష్టాలు సమానంగా ఉంటాయి.  పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. గులాబీ, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవిని ఆరాధించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఎంతటి పనినైనా వారం ప్రారంభంలో అవలీలగా పూర్తి చేస్తారు. ఆ తరువాత కొన్ని మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కుటుంబసమస్యల నుంచి బయటపడతారు. సోదరులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. శ్రమకు తగిన ఫలితం కనిపిస్తుంది. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. ప్రముఖులు పరిచయం కాగలరు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు అనుకోని పిలుపు రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. పసుపు, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. విద్యార్థుల యత్నాలు సఫలమవుతాయి. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనయోగం. నిర్దేశించుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. బంధువులతో  సత్సంబంధాలు నెలకొంటాయి. వ్యాపారాలు సజావుగా సాగి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు అన్నింటా అనుకూలమే. వారం ప్రారంభంలో అనారోగ్యం. కుటుంబసభ్యులతో వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
క్రమేపీ అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. బంధువులు, మిత్రుల సహకారంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు. నూతన వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. అనారోగ్యం. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు. మీ ఆలోచనలు అందరితోనూ పంచుకుంటారు. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. ఆసక్తికర సమాచారం నిరుద్యోగులను ఉత్సాహపరుస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనయోగం. సోదరులు కొంత సహాయం అందిస్తారు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వచ్చి ఊపిరిపీల్చుకుంటారు. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం మందగించినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలు అనుకూలించి లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం మ«ధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. నలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. శ్రమ మరింత పెరిగి సహనాన్ని పరీక్షిస్తుంది. విద్యార్థులు మరింత కృషి చేస్తే ఫలితం కనిపిస్తుంది. సోదరులు, మిత్రులతో అకారణంగా విరోధాలు. అనుకున్న పనుల్లో ప్రతిబం«ధకాలు తప్పవు. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టండి. వివాహ, ఉద్యోగయత్నాలు నిదానంగా కొనసాగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. గృహ నిర్మాణాలపై నిర్ణయాలు మార్చుకుంటారు. వ్యాపారాలు నెమ్మదిగా సాగి స్వల్పలాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. పారిశ్రామికవర్గాలకు లేనిపోని చిక్కులు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. విందువినోదాలు. గులాబీ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. కాలభైరవాష్టకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

 టారో( 10 మార్చి నుంచి 16 మార్చి, 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
పనులు శరవేగంగా పూర్తి చేయడానికి తీరిక లేకుండా శ్రమిస్తారు. వేగమే వేదంగా ముందుకు సాగుతారు. అనుకోని రీతిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి నుంచి మీకు తగిన సహాయం లభిస్తుంది. ఉద్యోగ జీవితంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా సంయమనం పాటించడం మంచిది. చిన్న చిన్న ప్రలోభాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆత్మనిగ్రహంతో ముందుకు సాగి గమ్యం చేరుకుంటారు. వారాంతంలో కొంత మందకొడిగా ఉంటుంది. పరిస్థితులన్నీ క్రమంగా దారిలోకి వస్తాయి. ఆశించిన ఫలితాలు దక్కాలంటే మరికొంత నిరీక్షణ తప్పదు.
లక్కీ కలర్‌: లేతనీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
మీ ఆలోచనలు కాలం కంటే ముందుగా ఉంటాయి. భవిష్యత్‌ పరిణామాలపై మీ అంచనాలను, ఆలోచనలను మీ సహచరులు అర్థం చేసుకోలేకపోతారు. బంధు మిత్రులతో అనుబంధాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనసాగుతాయి. ఒంటరిగా ఉంటున్న వారికి కొత్త అనుబంధాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో అమోఘంగా రాణిస్తారు. చిక్కు సమస్యలు ఎదురైనా, చాకచక్యంగా వ్యవహరించి, వాటిని ఇట్టే పరిష్కరిస్తారు. అద్భుతమైన పనితీరు కనపరచి ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. పదోన్నతుల వల్ల అదనపు బాధ్యతలు తప్పకపోవచ్చు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
జీవితంలో భద్రతను కోరుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో విజయాలను ఆశిస్తారు. ఎటూ తేల్చుకోలేని డోలాయమాన పరిస్థితుల్లో ఊగిసలాడతారు. అనుకున్నట్లుగా పనులు జరగకపోవడంతో కొంత అస్థిమితంగా ఉంటారు. ఆరోగ్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన పరిస్థితులు ఉంటాయి. ముఖ్యంగా బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం బాట పడతారు. వారాంతంలోగా పరిస్థితులు చక్కబడతాయి. వృత్తి ఉద్యోగాల్లోని వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సొంత వ్యాపారాలు, ఇతర స్వయం ఉపాధి మార్గాల్లో ఉన్నవారికి ఆర్థిక లాభాలు బాగుంటాయి.
లక్కీ కలర్‌: లేత ఊదా

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఇంటా బయటా ఒత్తిడుల కారణంగా మానసికంగా కొంత అలజడికి లోనవుతారు. అతి ప్రయాసపై పరిస్థితులను నెమ్మదిగా చక్కదిద్దుకుంటారు. అంతులేని ఆలోచనలతో సతమతమవుతారు. పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. సహచరులతో వాదనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటాయి. ఆరోగ్యం స్వల్పంగా మందగించే సూచనలు ఉన్నాయి. ఆధ్యాత్మిక చింతన ద్వారా సాంత్వన పొందాలనుకుంటారు. మానసిక ఒత్తిడిని అధిగమించడానికి వ్యాయామం వైపు, క్రీడల వైపు దృష్టి సారిస్తారు. ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా మెలగడం మంచిది.
లక్కీ కలర్‌: వెండి రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఈవారమంతా ఉత్సాహంగా ఉంటారు. రాబోయే రోజుల్లో మీ జీవితం ఊహించని మలుపులు తీసుకుంటుంది. జీవితాశయం వైపుకు అడుగులు వేస్తారు. ఎప్పట్నుంచో ఆగిపోయినట్టు కనిపించిన పనులన్నీ ఇప్పుడిప్పుడే మళ్లీ కొత్తగా మొదలవుతాయి. ఒక కొత్త వ్యక్తి పరిచయం మీ ఆలోచనలను బాగా ప్రభావితం చేస్తుంది. అతితక్కువ కాలంలోనే ఆ వ్యక్తికి  బాగా దగ్గరైపోతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొన్ని అనవసర విషయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. కుటుంబ సభ్యులకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విహారయాత్రకు సన్నాహాలు చేసుకుంటారు. 
కలిసివచ్చే రంగు : కాషాయ 

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఈవారం మీకు గొప్ప అదృష్టం కలిసొస్తుంది. ఎప్పట్నుంచో కన్న ఓ కల ఈవారమే నెరవేరుతుంది. ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటూ మీరేంటో, మీ ఆలోచనలేంటో అర్థం చేసుకొని ముందుకెళ్లండి. మీ చుట్టూ ఉండే పరిస్థితులు కూడా మిమ్మల్ని బాగా ప్రభావితం చేస్తాయి. ఇవేవీ కూడా మీలో నిరుత్సాహాన్ని నింపేవిగా ఉండకుండా చూసుకోండి. ఆరోగ్యం విషయంలో కాస్తంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురైనా వాటన్నింటికీ ఎదురెళ్లి నిలబడతారు. 
కలిసివచ్చే రంగు : ముదురు నీలం 

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆకాశాన్ని అందుకోవాలన్నంత అందంగా ఉండేవే ఆలోచనలు. అందుకోలేకున్నా అందంగా ఆ ఆలోచనను దాచుకోవడమే జీవితం. మీకు ఈ రెండూ తెలుసు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఈవారం తలెత్తుతుంది. అన్నీ ఆలోచించుకొని ముందడుగు వేయండి. గొప్ప ఆలోచనలే మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి. వారం చివర్లో ఓ గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆత్మవిశ్వాసంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని ముందుకు వెళ్లండి. ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బాగా మెరుగుపడుతుంది. ప్రేమ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నాయి. మీరు ప్రేమించే వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయించండి. 
కలిసివచ్చే రంగు : ఎరుపు 

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
జీవితంలో చాలా దూరం ప్రయాణించి అలిసిపోయాక, మనం వెళ్లాల్సిన దారి అది కాదనో, అప్పటికే ఆ దారి మనకు ఇవ్వాల్సిన ఆనందాన్ని ఇవ్వడం లేదనో అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ధైర్యంగా నిలబడే వ్యక్తే జీవితాన్ని అర్థవంతంగా జీవించగలడు. మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఓ అవకాశం ఈ వారమే మీ తలుపు తడుతుంది. మీ ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసుకునే వేదిక దొరుకుతుంది. వరుసగా అవకాశాలు వచ్చి పడే సమయం దగ్గర్లోనే ఉంది. మీకిష్టమైన వ్యక్తికి ఎక్కువ సమయం కేటాయిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది.
కలిసివచ్చే రంగు : ముదురు గోధుమ 

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
జీవితంలో ఒక్కోసారి అన్నీ బాగున్నట్టు ఉంటాయి కానీ, కావాల్సింది ఏదో ఎప్పటికీ దొరకదన్న నిరాశ కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితి దాదాపు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే ఉంటుందని తెలుసుకోండి. వారం చివర్లో ఒక గొప్ప అవకాశం మీ తలుపు తడుతుంది. ఆ అవకాశం మీ వృత్తి జీవితాన్ని ఒక కొత్త మలుపు తిప్పుతుంది. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాయామం చెయ్యడాన్ని పక్కనబెట్టకండి. ప్రేమ జీవితం ఎప్పట్లానే ఆహ్లాదకరంగా ఉంటుంది. 
కలిసివచ్చే రంగు : గులాబి 

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఈవారమంతా ఉత్సాహంగా ఉంటారు. మీరెప్పట్నుంచో కోరుకున్న ప్రపంచం వైపుకు తొలి అడుగులు వేస్తారు. మీకిష్టమైన వ్యక్తి అన్ని సమయాల్లో మీకు తోడుగా ఉంటారు. వారం చివర్లో మీకెంతో ఇష్టమైన ఒక ప్రాంతానికి విహారయాత్రపై వెళతారు. గతాన్ని గురించి ఎక్కువ ఆలోచించకుండా ప్రస్తుతాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్లండి. కొన్ని అనవసర విషయాల్లో జోక్యం చేసుకుని ఇబ్బందుల పాలవుతారు. మీ ఆలోచనలను ప్రభావితం చేసే వ్యక్తులను కలుసుకుంటారు.
కలిసివచ్చే రంగు : నీలం 

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
వృత్తి జీవితంలో మీరు ఎప్పట్నుంచో కోరుకుంటున్న ఒక అవకాశం త్వరలోనే దక్కుతుంది. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునేందుకు మిమ్మల్ని మీరు అన్నివిధాలా సిద్ధంగా ఉంచుకోండి. మీ జీవితాన్ని మలుపుతిప్పే ఓ వ్యక్తిని కలుసుకుంటారు. ఆ వ్యక్తి ఆలోచనలు మీపై బాగా ప్రభావితం చూపిస్తాయి. ఏ పని చేసినా విజయం సాధిస్తామన్న ధీమాతోనే చేయండి. కొన్ని అనుకోని అవాంతరాలు ఎదురైనా మీదైన ఆత్మస్థైర్యంతో వాటిని ఎదుర్కొని నిలబడతారు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. యోగా, వ్యాయామంతో మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోండి. 
కలిసివచ్చే రంగు : ఆకుపచ్చ 

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఒక్కోసారి జీవితంలో ఒకచోట ఆగి, గతాన్ని గుర్తుచేసుకోవాల్సిన అవసరం వస్తుంది. మీరిప్పుడు ఆ దశలో ఉన్నారు. గతంలోకి కూరుకుపోకుండా, గతంలో చేసిన కొన్ని గొప్ప పనుల గురించి ఆలోచించండి. ఉత్సాహంగా కొత్త జీవితం వైపుకు అడుగులు వేస్తారు. ఏ పనిలోనైనా విజయం దక్కాలంటే ముందు చేసే పనిమీద ఇష్టం, మీమీద మీకు నమ్మకం ఉండాలి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ప్రేమ జీవితం మిమ్మల్ని మీకు కొత్తగా ఆవిష్కరించి చూపుతుంది. కుటుంబ సభ్యులకు సమయం కేటాయించండి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
కలిసివచ్చే రంగు : గులాబి 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement