వార ఫలాలు | Varafalalu 03-03-2019 | Sakshi
Sakshi News home page

3 మార్చి నుంచి 9 మార్చి 2019 వరకు

Published Sun, Mar 3 2019 1:04 AM | Last Updated on Mon, Mar 4 2019 8:23 AM

Varafalalu 03-03-2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. మీరు ఊహించినట్లే పనులు పూర్తి కాగలవు. ఇంటర్వ్యూలలో నిరుద్యోగులకు విజయం. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి, విస్తరణ పనుల్లో అనుకూలత. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. లేత గులాబీ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు కలసివస్తాయి.  ఉమాదేవి స్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
కొన్ని సమస్యల నుంచి కొంత వరకూ గట్టెక్కుతారు. అనుకున్న విధంగా డబ్బు సమకూరి అవసరాలు తీరతాయి. అయితే రుణదాతల నుంచి ఒత్తిడులు ఉండవచ్చు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. భూవివాదాలు తీరి ఒప్పందాలు చేసుకుంటారు. అత్యవసరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. వ్యాపారాలలో అనూహ్యంగా లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు మరింత ప్రోత్సాహం. కుటుంబసభ్యులతో తగాదాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు  అనుకూలం. మహాలక్ష్మీ పంచరత్నావళి పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆలోచనలు కలసిరావు. బంధువులు, మిత్రులతో వైరం. ఆస్తుల వ్యవహారాలలో కొత్త చిక్కులు ఎదురుకావచ్చు. శ్రమపడినా ఫలితం కనిపించదు. విద్యార్థులు, నిరుద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. వివాహయత్నాలు ముందుకు సాగక నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకోని విధంగా మార్పులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనల్లో ఆటంకాలు. వారం చివరిలో ధన, వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. నేరేడు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయ ంపఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. పట్టుదలతో కృషి చేసినా ముఖ్యమైన పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో అకారణంగా తగాదాలు. ఆస్తి తగాదాలు నెలకొంటాయి. కుటుంబబాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. విలువైన వస్తువులు, డాక్యుమెంట్లు భద్రంగా చూసుకోండి. ఉద్యోగయత్నాలలో ఆవరోధాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో కొన్ని చిక్కులు ఎదురుకావచ్చు. కళారంగం వారి అంచనాలు తప్పుతాయి. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధనలబ్ధి. వాహనయోగం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో ముఖ్య విషయాలపై సంప్రదిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సంఘంలో మీకు ఎదురులేని పరిస్థితి. భూవివాదాల నుంచి బయటపడి కొంత లాభం పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. కుటుంబసమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. ఎరుపు, లేత గులాబీ రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేస్తారు. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు, రుణాలు తీరతాయి. సోదరులు, మిత్రులతో మనస్పర్ధలు తొలగుతాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు పొందుతారు. వివాదాల పరిష్కారంలో చొరవ చూపుతారు. కొత్త వాహనాలు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలలో మరింత ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.కనకధారా స్తోత్రాలు పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ఆర్థికంగా ఇబ్బందులు, రుణదాతల ఒత్తిడులు ఎదురవుతాయి. చేపట్టిన వ్యవహారాలలో అవాంతరాలు. ప్రతి నిర్ణయంలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. విలువైన సామగ్రి భద్రంగా చూసుకోండి. ఒక సమాచారం విద్యార్థులను నిరాశ పరుస్తుంది. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు. వ్యాపార విస్తరణలో కొత్త సమస్యలు ఎదుర్కొంటారు. ఉద్యోగాలలో బాధ్యతలతో సతమతవుతారు. కళారంగం వారికి విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం చివరిలో శుభవార్తలు. ధనలాభం. నీలం, ఆకుపచ్చ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా ఉంటుంది. అనుకున్న పనులలో జాప్యం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు మార్చుకుంటారు. మిత్రుల నుంచి ఒత్తిళ్లు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు నెలకొని ఇబ్బంది పెట్టవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు కొంత వరకూ అనుకూలిస్తాయి. గృహ నిర్మాణాలలో ప్రతిబంధకాలు ఎదురైనా అధిమిస్తారు. వ్యాపారాలు మిశ్రమంగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు చికాకులు తప్పకపోవచ్చు. వారం ప్రారంభంలో విందువినోదాలు. వాహనయోగం. లేత పసుపు, ఎరుపు రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీదత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
సకాలంలో పూర్తి చేయాలనుకున్న పనులలో జాప్యం. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొని ఒప్పందాలు వాయిదా వేస్తారు. తరచూ తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు ప్రయత్నాలు విరమిస్తారు. విలువైన డాక్యుమెంట్లు భద్రంగా చూసుకోండి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. నిర్ణయాలు పదేపదే మార్చుకుంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో మరిన్ని సమస్యలు. రాజకీయవర్గాలకు పర్యటనల్లో అవాంతరాలు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విందువినోదాలు.  ఎరుపు, సిమెంట్‌ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. బంధువులతో మనస్పర్ధలు తొలగి ఊరట చెందుతారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాలు దక్కించుకుంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులు పరిచయమవుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు నెలకొంటాయి. కళారంగం వారికి సత్కారాలు జరుగుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. నీలం, నలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అంజనేయ దండకం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. ఆదుకుంటామన్న వ్యక్తులు నిస్సహాయత వ్యక్తం చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు పెరుగుతాయి. రుణయత్నాలు కూడా మందగిస్తాయి. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఒక వివాదం పరిష్కారమైతే మరో వివాదంలో పడతారు. నిర్ణయాలలోనూ ఆచితూచి వ్యవహరించడం మంచిది. విలువైన సామగ్రి చేజారే అవకాశాలు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు గందరగోళంగా ఉంటుంది. వారం మధ్యలో ధనలబ్ధి. నూతన పరిచయాలు.  నలుపు, లేత ఆకుపచ్చరంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠిస్తే మంచిది.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
సన్నిహితులు, మిత్రులు మీకు అన్నింటా సహాయపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. బంధువులతో వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తులు కొనుగోలులో అవాంతరాలు తొలగుతాయి. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. ఇంటిలో శుభకార్యాలు నిర్వహణతో సందడిగా గడుపుతారు. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగాలలో అనుకున్న హోదాలు దక్కుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం మధ్యలో అనుకోని ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితుల్డు

టారో (3 మార్చి నుంచి 9 మార్చి, 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు పనుల్లో వేగం పెంచుతారు. త్వరగా పనులు పూర్తి చేయాలని ఆదుర్దా చెందుతారు. కొత్తగా చేపట్టబోయే బాధ్యతలు భవిష్యత్తులో సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఉన్నతికి దారితీసే కొత్త అవకాశాలు దొరుకుతాయి. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. తొందరపాటు కారణంగా కొన్ని సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. సంయమనం పాటించడం క్షేమం. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. సామాజిక కార్యక్రమాలకు చేయూతనిస్తారు. ప్రేమికుల మధ్య అపార్థాలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: లేత నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
కాలాని కంటే ముందుండే మిమ్మల్ని తోటివారు అర్థం చేసుకోలేకపోతారు. వ్యాపార రంగంలోని వారు ఘన విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను అధిగమిస్తారు. కష్టసాధ్యమైన లక్ష్యాలను సాధించడం ద్వారా గుర్తింపు పొందుతారు. జనాకర్షణ పెరుగుతుంది. సృజనాత్మక రంగాల్లోని వారికి ఇదివరకటి కృషికి తగిన గుర్తింపు, సన్మాన సత్కారాలు దక్కుతాయి. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలను వాయిదా వేసుకుంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. సమస్యల్లో చిక్కుకున్న సన్నిహితులకు పరిష్కార మార్గాలను చూపుతారు.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆత్రుత పడటం వల్ల ప్రయోజనం లేదు. ఆశించిన ఫలితాల కోసం మరికొంత కాలం నిరీక్షణ తప్పదు. అలాగని ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి లేదు. ఓరిమి వహించండి. తరుణం ఆసన్నమైనప్పుడు ఫలితాలు వాటంతట అవే వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడికి లోనవుతారు. తలపెట్టిన పనులు అనుకున్న రీతిలో ముందుకు సాగకపోవడం వల్ల అసహనానికి లోనవుతారు. భావోద్వేగాల్లో నిలకడ లోపిస్తుంది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి మంచి ఆర్థిక లాభాలు దక్కే సూచనలు ఉన్నాయి. పలుకుబడి గల కొత్త వ్యక్తులు పరిచయమవుతారు.
లక్కీ కలర్‌: లేత ఊదా

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
మీది కాని లోకంలో ఎక్కడో తప్పిపోయినట్లు అనుభూతి చెందుతారు. మీవైన పరిసరాల్లోకి, మీవైన పరిస్థితుల్లోకి తిరిగి చేరుకోవడానికి తపిస్తారు. మీ ఊహలకు, మీ పరిజ్ఞానానికి పొంతన లోపించే సూచనలు ఉన్నాయి. మానసికంగా గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో పని మీద దృష్టి కేంద్రీకరించలేకపోతారు. మానసిక ప్రశాంతత కోసం దూర ప్రయాణాలకు సిద్ధపడతారు. సహచరులతో వాదులాటలకు దిగుతారు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. విందు వినోదాల్లో పాల్గొంటారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వాక్చాతుర్యంతో జనాలను ఇట్టే ఆకట్టుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో సవాళ్లను స్వీకరిస్తారు. రెట్టించిన ఉత్సాహంతో లక్ష్యాలను సాధిస్తారు. నిబద్ధతకు, నైపుణ్యానికి తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇదివరకటి పెట్టుబడుల నుంచి లాభాలను అందుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. గొంతుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తవచ్చు. అనుబంధం తెగిపోతుందేమోనని కలత చెందుతారు.
లక్కీ కలర్‌: నారింజ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో సుస్థిరత, ఆర్థిక భద్రత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. పురోగతి మొదలవుతుంది. పని వాతావరణం మెరుగుపడుతుంది. వ్యాపార రంగంలోని వారు సాహసోపేత నిర్ణయాల ద్వారా లబ్ధి పొందుతారు. ఆర్థికంగా వరుస విజయాలను సాధిస్తారు. స్థిరాస్తులను, సంపదను పెంచుకుంటారు. సౌందర్య పోషణపై శ్రద్ధ పెడతారు. చర్మసంరక్షణ కోసం నిపుణుల సలహాలు తీసుకుంటారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాహితీ, కళా రంగాల్లోని వారు సత్కారాలు పొందుతారు.
లక్కీ కలర్‌: లేత గోధుమ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. వాక్చాతుర్యంతో సమస్యలను పరిష్కరించి ప్రత్యేకతను చాటుకుంటారు. జనాకర్షణను పెంచుకుంటారు. వ్యాపార పారిశ్రామిక రంగాల్లోని వారు విస్తరణ కార్యక్రమాలను చేపడతారు. సృజనాత్మక రంగంలోని వారు బృహత్తర కార్యక్రమాలను తలపెడతారు. తలనొప్పి, వెన్నునొప్పి వంటి స్వల్ప ఆరోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. గురువులను దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకు విరాళాలను ఇస్తారు. పిల్లల విజయాలకు గర్విస్తారు.
లక్కీ కలర్‌: మట్టి రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
 సమస్యలు సమసిపోతాయి. అనుబంధాల మ«ధ్య ఏర్పడ్డ అంతరాలు తొలగిపోతాయి. కుటుంబ వాతావరణంలో తిరిగి ప్రశాంతత నెలకొంటుంది. కార్యాచరణలో ఎదురయ్యే అవరోధాలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి తగ్గుతుంది. ఇష్టమైన వ్యాపకాలకు తగిన తీరిక చిక్కుతుంది. ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. స్థిరాస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. ప్రతికూల ఆలోచనలను దరి చేరనివ్వకండి. చిన్న చిన్న అవరోధాలు వాటంతట అవే తొలగిపోతాయి. కొత్తగా పరిచయమైన వ్యక్తి ఒకరితో ప్రేమలో పడే సూచనలున్నాయి.
లక్కీ కలర్‌: బూడిద రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
అతిశయోక్తులతోను, అబద్ధాలతోను మిమ్మల్ని బురిడీ కొట్టే ప్రయత్నాలు చేసేవారు ఎదురవుతారు. ఇదివరకటి ఎదురుదెబ్బలు పునరావృతం కాకుండా అప్రమత్తంగా మెలగండి. అప్రమత్తత లోపిస్తే ఆర్థిక నష్టాలు ఎదురయ్యే పరిస్థితులు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతికి సంబంధించి కొంత ప్రతిష్టంభన ఏర్పడే సూచనలు ఉన్నాయి. మెరుగైన కొత్త అవకాశాలు కలసి వస్తాయి. ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మెరుగుపడుతుంది. కుటుంబ బాధ్యతలను నెరవేర్చుకుంటారు. మిత్రుల సహకారంతో సమస్యల నుంచి బయటపడతారు.
లక్కీ కలర్‌: ఎరుపు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
అర్థం చేసుకోగల ఆత్మబంధువు కోసం మీరు సాగిస్తున్న అన్వేషణ ఫలిస్తుంది. సాంస్కృతిక, సృజనాత్మక రంగాల్లో పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యేకతను చాటుకుంటారు. పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. ఆస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. మీ పురోగతికి అసూయ చెందే కొందరు ప్రచారం చేసే వదంతులను పట్టించుకోకుండా ముందుకు సాగండి. వరుస విజయాలు త్వరలోనే సొంతమవుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ పెంచుకుంటారు. శరీర సౌష్టవాన్ని తీర్చిదిద్దుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
అప్రయత్నంగానే మీరు చుట్టూ ఉన్న జనాలను ఆకర్షిస్తారు. వృత్తి ఉద్యోగాల్లోని వారు పని ప్రదేశంలో తోటివారి నుంచి అవ్యాజమైన అభిమానాన్ని పొందుతారు. పనిలో బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. లక్ష్య సాధన కోసం మరింతగా కృషి చేయాల్సి ఉంటుంది. ఆధ్యాత్మిక పురోగతి కోసం ప్రయత్నిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వాహనాలు నడిపేటప్పుడు అప్రమత్తంగా ఉండటం క్షేమం. అప్రమత్తత లోపిస్తే ఎముకలకు గాయాలయ్యే సూచనలు ఉన్నాయి. తీరిక సమయాన్ని పూర్తిగా కళా సాధన కోసం కేటాయిస్తారు.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాల్లో పని ఒత్తిడి నుంచి విముక్తి పొందుతారు. హాస్య చతురతతో చుట్టూ ఉన్నవారిని ఆకట్టుకుంటారు. తీరిక సమయాన్ని వినోదమే ప్రధానం అన్నట్లు గడుపుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ముక్కుసూటి వైఖరి కారణంగా చిక్కులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. కాస్త లౌక్యాన్ని అలవరచుకోవడం మంచిది. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో డబ్బు మదుపు చేస్తారు. అనుకోని వ్యక్తి ప్రేమలో పడతారు.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ 
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement