వారఫలాలు | Vara fhalalu 10-02-2019 | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Feb 10 2019 1:28 AM | Last Updated on Sun, Feb 10 2019 1:28 AM

Vara fhalalu 10-02-2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చేపట్టిన పనులు సవ్యంగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. ఇంటి నిర్మాణాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలు సర్దుబాటు చేసుకుంటారు. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. వ్యాపారాలు కొద్దిగా మెరుగుపడతాయి. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరుగుతాయి. కళారంగం వారికి యత్నాలు సఫలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, తెలుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అన్నపూర్ణాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి కాగలవు. ఆర్థికంగా కొంత ఇబ్బంది ఎదురైనా అధిగమిస్తారు. ఎంతటి వారినైనా మాటలతో ఆకట్టుకుంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూవివాదాలు తీరతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు కొంత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అందర్నీ మాటలతో ఆకట్టుకుని మీవైపునకు ఆకర్షిస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు రాగలవు. రాజకీయవర్గాలకు పదవులు రావచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో తగాదాలు. నేరేడు, నీలం రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆస్తి విషయంలో ఒప్పందాలు. ముఖ్యమైన పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులు అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కోర్టు వ్యవహారంలో విజయం సాధిస్తారు. ఇంటి నిర్మాణాలలో ఆటంకాలు తొలగుతాయి. ప్రముఖులు పరిచయమవుతారు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వివాహయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు గతం కంటే కొంత మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో మీ హోదాలు నిలుపుకుంటారు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం ప్రారంభంలో ధనవ్యయం. బంధువిరోధాలు. శ్రమ పెరుగుతుంది. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. కనకదుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ప్రారంభంలో కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. అయినా పట్టుదలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక విషయాలు కొంత ఆశాజనకంగా ఉంటాయి. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు పొందుతారు. వాహనాలు, ఇళ్ల కొనుగోలు యత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. పసుపు, నేరేడు రంగులు.  వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. అనారోగ్యం.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఇబ్బందులు, సమస్యలు చాకచక్యంగా అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. విద్యార్థుల యత్నాలు సానుకూలం. పరపతి కలిగిన వారితో పరిచయాలు. కుటుంబసభ్యులు మీ ప్రతిపాదనలు అంగీకరిస్తారు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆర్థికంగా కొంత బలం చేకూరుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు. విదేశీ విద్యావకాశాలు దక్కి విద్యార్థులు సంతోషంగా గడుపుతారు. ఆసక్తికర సమాచారం అందుతుంది. మీ నిర్ణయాలు అందరూ గౌరవిస్తారు. ఆర్థిక విషయాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు.  స్థిరాస్తి ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి విముక్తి లభిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి.  ఆరోగ్యభంగం. ఆకుపచ్చ, పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నృసింహస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు అందుతాయి. వివాహ, ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యసమస్యలు తీరతాయి.  విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. సోదరులతో వివాదాలు తీరతాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి. కళారంగం వారి కృషి ఫలిస్తుంది. వారం చివరిలో ధనవ్యయం. సన్నిహితులతో మాటపట్టింపులు. గులాబీ, లేత ఎరుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌ స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ప్రారంభంలో కొన్ని ఆటుపోట్లు, ఇబ్బందులు ఎదురవుతాయి. అయితే పట్టుదల, ధైర్యంతో అధిగమించి ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. నూతన వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొంత వరకూ పరిష్కారం. విద్యార్థుల యత్నాలు సఫలం. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు సంభవం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనుకోని సంఘటనలు. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని పనులు నెమ్మదిగా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చాకచక్యంగా కొన్ని వివాదాల పరిష్కారం. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు వరంగా మారుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. శుభకార్యాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టి సారించండి. వ్యాపారాలలో కొద్దిపాటి లాభాలు ఉంటాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడులు ఉంటాయి. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో వివాదాలు. మనశ్శాంతి లోపిస్తుంది. ఆకుపచ్చ, నీలం రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త రుణాల అన్వేషణ. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక సతమతమవుతారు. విద్యార్థుల కృషి వృథాగా మారుతుంది. ఉద్యోగయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. ముఖ్యమైన పనుల్లో ప్రతిబంధకాలు. ఒప్పందాలు వాయిదా వేస్తారు. ఆరోగ్య, కుటుంబసమస్యలు వేధిస్తాయి. ఎంత కష్టించినా ఆశించిన ఫలితం కనిపించదు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు మీదపడవచ్చు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు రద్దు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలాభం. నేరేడు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రముఖుల సలహాలు స్వీకరిస్తారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దక్కించుకుంటారు. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. వ్యాపారాలు మరింత రాణిస్తాయి. ఉద్యోగాలలో ఎదుర్కొనే ఇబ్బందులు అధిగమిస్తారు. కళారంగం వారికి అప్రయత్నంగా అవకాశాలు దక్కుతాయి. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. అనారోగ్యం కొద్దిగా మందగిస్తుంది. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(10 ఫిబ్రవరి నుంచి 16 ఫిబ్రవరి 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
దేనినీ తిరస్కరించవద్దు. తిరస్కారాల వల్ల లేనిపోని మానసిక సంఘర్షణలకు లోనయ్యే సూచనలు ఉన్నాయి. అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ స్వీకరించండి. జరిగే పరిణామాలను ఆమోదించండి. ఆమోదమే మీ ప్రమోదానికి హేతువవుతుంది. త్వరలోనే శుభవార్తలు వింటారు. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి  తొలగి, సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. లక్ష్యసాధనలో ముందంజలో నిలుస్తారు. అధికారుల ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వ్యాపార విస్తరణ యత్నాలు ఫలిస్తాయి. విదేశీ ప్రయాణాలు చేసే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అనూహ్య పరిణామాలతో కొనసాగే జీవితాన్ని యథాతథంగా ఆమోదించండి. ఏ నిమిషానికి ఏమి జరుగునో అన్నట్లుగా పరిస్థితుల్లో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కీలకమైన అంశాల్లో సాహసోపేత నిర్ణయాలను తీసుకునేందుకు సర్వసన్నద్ధంగా ఉండండి. ధైర్య సాహసాలతో ముందుకు దూసుకుపోతేనే అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఒంటిచేత్తో ఘన విజయాలను సాధిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేస్తారు. ప్రియతముల కోసం ప్రత్యేకించి సమయం కేటాయించాల్సి ఉంటుంది.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

మిథునం (మే 21 – జూన్‌ 20)
పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. జీవితం ఇలా సాగిపోతే చాలు, ఇంతకు మించి ఇంకే చాలు అనేంతగా సంతృప్తిని ఆస్వాదిస్తారు. ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది. భవిష్యత్తుపై భరోసా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. దైవానుగ్రహం మెండుగా ఉంది. విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు. విదేశీ ప్రయాణాలు చేయవచ్చు. ఒంటరిగా ఉంటున్న వారికి తగిన జోడు దొరికే సూచనలు ఉన్నాయి. చాలాకాలంగా ఎరిగి ఉన్న వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదనను ఆనందంగా ఆమోదిస్తారు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
ఇప్పటికే మీరు చాలా విజయాలను సాధించారు. వరుస విజయాలను సాధిస్తున్న కొద్దీ మరిన్ని విజయాలను సాధించాలనే తపన మీలో పెరుగుతుంది. ఆశించిన ఫలితాలు దక్కనప్పుడు మీలో అసహనం పెరుగుతుంది. అసహనం రేకెత్తే సమయంలో సంయమనం పాటించడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని ప్రతికూల పరిస్థితులు తలెత్తే సూచనలు ఉన్నాయి. పని ఒత్తిడి కారణంగా వేళకు భోజనం చేయకపోవడం వల్ల ఆరోగ్యం మందగింవచ్చు. సామాజికంగా పరపతి పెరుగుతుంది. అనవసరంగా పొగిడే వారి పట్ల అప్రమత్తంగా ఉండటం క్షేమం.
లక్కీ కలర్‌: నలుపు

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఏ పనినీ వాయిదా వేయకండి. ఎప్పటి పనిని అప్పుడు ముగించేస్తేనే మీ భవిష్యత్తుకు పనికొచ్చే కొత్త అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తారు. ప్రకృతిలో మమేకం కావాలనుకుంటారు. సన్నిహితులతో విహారయాత్రలకు వెళతారు. వృత్తి ఉద్యోగాల్లో పనిభారం తగ్గి కొంత ఉపశమనం లభిస్తుంది. తీరిక సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. పిల్లల పురోగతి సంతోషాన్ని ఇస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రజల్లో గుర్తింపు పెరుగుతుంది. ప్రేమానుబంధాలు మరింతగా బలపడతాయి.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
ఆడుతూ పాడుతూ ఆనందంగా కాలక్షేపం చేస్తారు. చిన్న చిన్న సంతోషాలను అమితంగా ఆస్వాదిస్తారు. పచ్చని పరిసరాల మధ్య గడుపుతారు. అనుకోని అద్భుతాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మీరు సాధించిన విజయాలు సహచరులకు సంభ్రమాశ్చర్యాలను కలిగిస్తాయి. వ్యాపారాలను విస్తరిస్తారు. రాజకీయ రంగంలోని వారికి ప్రజాదరణ బాగుంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ప్రముఖులతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించుకుంటారు. ప్రేమికుల మధ్య అలకలు తలెత్తే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: ముదురాకుపచ్చ

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
మిమ్మల్ని ప్రభావితం చేయాలనుకునే వారి నుంచి వీలైనంత దూరంగా ఉండటం క్షేమం. మీదైన మార్గంలోనే ముందుకు సాగితేనే ఇతరులకు మార్గదర్శకులుగా నిలవగలుగుతారు. కొత్త మార్గాన్ని ఏర్పరచుకోవడంలో చాలా అవరోధాలను అధిగమించాల్సి వస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో గట్టి పోటీ ఎదురైనా, ప్రత్యర్థుల నుంచి ఎన్ని అవరోధాలు ఎదురైనా చివరకు ఘన విజయాలు సాధిస్తారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. ఇంట్లో శుభకార్యాలు తలపెడతారు.
లక్కీ కలర్‌: మీగడ రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
భయం వీడితేనే జయం పొందగలుగుతారు. మరణానికి తప్ప మరిదేనికీ భయపడాల్సిన పని లేదని తెలుసుకోండి. పోరాడితే పోయేదేమీ లేదని గ్రహించి, పోరాటం సాగించండి. దక్కాల్సిన హక్కులు అవే దక్కుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రతికూలతలు తలెత్తవచ్చు. మీ ముక్కుసూటి వైఖరి కొందరికి నచ్చకపోవచ్చు. సవాళ్లను స్వీకరిస్తారు. మనసుకు నచ్చిన పని చేయడంలోని మజాను ఆస్వాదిస్తారు. ప్రియతముల కోసం మరింతగా సమయాన్ని కేటాయిస్తారు. సన్నిహితులతో సమాలోచనలు సాగిస్తారు. భావి ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
అనుకున్నవన్నీ అనుకున్నట్లే జరుగుతాయి. జరిగే పరిణామాలను గమనిస్తూ ఉండటమే మీ పని. మీరేమీ చేయనవసరం లేదు. ఆందోళన చెందాల్సిన పనే లేదు. నిశ్చింతంగా నిబ్బరంగా ఉండండి. నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో పురోగతి మొదలవుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారాల్లో లాభాలు పుంజుకుంటాయి. మిత్రులతో కలసి విందు వినోదాల్లో పాల్గొంటారు. ప్రియతములతో విహారయాత్రలకు వెళతారు. ఊహించని వ్యక్తి నుంచి వచ్చే ప్రేమ ప్రతిపాదన ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.
లక్కీ కలర్‌: ముదురు గోధుమ రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
మీరు చేసిన మేలు పట్ల ఇతరులు ప్రదర్శించే కృతజ్ఞత మిమ్మల్ని ఆనంద పరవశుల్ని చేస్తుంది. ప్రపంచమంతా ఆహ్లాదభరితంగా కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు సానుకూలమవుతాయి. ఆర్థిక పురోగతి ఆశాజనకంగా ఉంటుంది. పాత బాకీలు వసూలవుతాయి. కీలకమైన భాగస్వామ్య ఒప్పందాలను కుదుర్చుకుంటారు. వ్యాపారాలను విస్తరిస్తారు. విద్యార్థులు పరీక్షల్లో అద్భుతమైన ఫలితాలను సాధిస్తారు. వృత్తి నిపుణులకు లాభసాటి అవకాశాలు కలసి వస్తాయి. ప్రియతముల మధ్య అనుబంధం మరింతగా బలపడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఎలాంటి సవాళ్లనైనా ధైర్యంగా స్వీకరించండి. భయాలను వదులుకుని, ధైర్యంగా ముందుకు సాగండి. త్వరలోనే వరుస విజయాలు మీ సొంతమవుతాయి. లక్ష్య సాధన దిశగా బృందానికి నాయకత్వం వహించడంలో మీ సత్తా చాటుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పేరు ప్రఖ్యాతులను పెంచుకుంటారు. గడ్డు పరిస్థితుల్లో సైతం సన్నిహితులను సమస్యల నుంచి గట్టెక్కిస్తారు. అందం, ఆరోగ్యాలపై శ్రద్ధ పెంచుతారు. అలంకరణ వస్తువులను కొనుగోలు చేస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. పనికి దూరంగా విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: లేతనీలం

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
సవాళ్లను ఎదుర్కొంటారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిష్ఠను పెంచుకుంటారు. వాదనా పటిమతో ఇతరులను మీ దారిలోకి తెచ్చుకుంటారు. ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. విదేశాల నుంచి ఆహ్వానాలను అందుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. పెళ్లికాని వారికి మంచి సంబంధం కుదిరే సూచనలు ఉన్నాయి. మీ ప్రేమకు పెద్దల నుంచి ఆమోదం లభిస్తుంది. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్యం కాస్త మందగించవచ్చు. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
లక్కీ కలర్‌: బంగారు రంగు
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement