వారఫలాలు | Varafalalu( 14-04-2019) | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Apr 14 2019 4:43 AM | Last Updated on Sun, Apr 14 2019 4:43 AM

Varafalalu( 14-04-2019) - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింత పెరిగే అవకాశం.  విద్యార్థులు కొత్త విద్యావకాశాలు పొందుతారు. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ప్రయాణాల్లో నూతన పరిచయాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు సన్మానాలు, పదవీయోగాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసమస్యలు. అనారోగ్యం. పసుపు, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుకుంటారు. కృషి ఫలించే సమయం. జీవిత భాగస్వామితో విభేదాలు పరిష్కారం. ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తీరతాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వాహనయోగం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు ఉత్సాహాన్నిస్తాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. ఎరుపు, లేత గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆదాయం కొంత సంతృప్తికరంగా ఉంటుంది. విద్యార్థులకు భవిష్యత్తుపై కొంత గందరగోళం. మిత్రులతో అకారణంగా తగాదాలు. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. కుటుంబంలో మీ నిర్ణయాలు వ్యతిరేకిస్తారు.  గృహ, వాహన కొనుగోలు యత్నాలలో ఆటంకాలు. సోదరులతో ఆస్తి వివాదాలు. వ్యాపారాలలో ఒత్తిడులు తప్పవు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో  శుభవార్తలు. ధనలబ్ధి. నూతన వ్యక్తుల పరిచయం. తెలుపు, ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. రుణబాధలు తొలగుతాయి. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. మీ అంచనలు, ఊహలు నిజమవుతాయి. ఒక సంఘటన విశేషంగా  ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణాల్లో పురోగతి కనిపిస్తుంది. విద్యార్థులు అనుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొత్త పదవులు దక్కే సూచనలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వారం చివరిలో  ఆరోగ్య, కుటుంబసమస్యలు. ఆస్తి వివాదాలు. గులాబీ, లేత ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
కొన్ని వ్యవహారాలు సకాలంలో పూర్తి కాగలవు. కుటుంబంలో  శుభకార్యాల నిర్వహణ. విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. విద్యార్థులు అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. ప్రముఖులు పరి^è యమవుతారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగి ఊరట చెందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు ఉండవచ్చు. వారం ప్రారంభంలో ఇంటాబయటా ఒత్తిడులు. ఆరోగ్యసమస్యలు. ధనవ్యయం. బంధువిరోధాలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థికంగా ఇబ్బందులు తొలగుతాయి.ఆకస్మిక ధనప్రాప్తి. మీ యత్నాలకు కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. విద్యార్థుల అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. నేర్పుగా సమస్యల నుంచి గట్టెక్కుతారు. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొన్ని మార్పులు ఉంటాయి. కళారంగం వారికి  నూతన అవకాశాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మిత్రులతో కలహాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
కొత్త పనులు చేపడతారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. ఓర్పుతో కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఆస్తి విషయంలో ఒప్పందాలు చేసుకుంటారు. వాహనాలు, భూములు కొంటారు. ఉద్యోగయత్నాలు సఫలం. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. దూరప్రాంతాల నుంచి అందిన సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలలో నూతనోత్సాహం. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రాలు పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. వాహన, కుటుంబసౌఖ్యం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఇంటి నిర్మాణాలు చేపడతారు. మీ ఆలోచనలు కుటుంబసభ్యులతో పంచుకుంటారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగి ఊపిరిపీల్చుకుంటారు. పారిశ్రామికవర్గాలకు కాస్త ఉపశమనం లభిస్తుంది. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. శ్రమాధిక్యం. గులాబీ, ఎరుపు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శ్రీరామరక్షాస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
చేపట్టిన పనులలో కొంత జాప్యం. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. అయినా అవసరాలకు లోటు రాదు. కుటుంబసభ్యులతో కొన్ని విషయాలలో విభేదిస్తారు. విద్యార్థులు అవకాశాలు ఎట్టకేలకు సాధిస్తారు. పలుకుబడి కలిగిన వారి నుంచి కీలక సమాచారం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాల కృషి కొంతమేర ఫలిస్తుంది. వారం చివరిలో విందులువినోదాలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు. తెలుపు, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశాష్టకం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వివాదాలను అత్యంత నేర్పుగా పరిష్కరించుకుంటారు. స్థిరాస్తివృద్ధి. నూతన వ్యక్తుల పరిచయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యత నెలకొంటుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆహ్వానాలు అందుకుంటారు. తీర్థయాత్రలు చేస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల నిరీక్షణ ఫలిస్తుంది. గృహ, వాహనయోగాలు. మీ నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగాలలో కొత్త హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం చివరిలో బంధువిరోధాలు. అనారోగ్యం. ఆకుపచ్చ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ప్రముఖులు పరిచయం కాగలరు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. అనుకున్న లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అంగారక స్తోత్రాలు పఠించండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో(14 ఏప్రిల్‌ నుంచి  20 ఏప్రిల్‌ 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
ప్రస్తుత పరిస్థితులపైనే పూర్తిగా దృష్టి సారించడం మంచిది. గతాన్ని తలచుకుని బాధపడటంలో అర్థం లేదు. భవిష్యత్తును అద్భుతంగా తీర్చిదిద్దగల అవకాశాలు త్వరలోనే అందివచ్చే సూచనలు ఉన్నాయి. అనూహ్యమైన ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వృత్తి ఉద్యోగుల్లో సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యాపారరంగంలో వారికి పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. కొత్త వ్యాపారాల ప్రారంభానికి వనరులు సమకూర్చుకుంటారు. విద్యార్థులకు కొంత ఒత్తిడి తప్పకపోవచ్చు.
లక్కీ కలర్‌: నీలం

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
బెదిరింపులతో లొంగదీసుకోవాలనుకునే వాళ్లకు బుద్ధి చెబుతారు. ఇదివరకటి అనుభవాల నుంచి నేర్చుకున్న పాఠాలు కార్యాచరణలో ఉపయోగపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణం ఉంటుంది. సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయిక సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తుతుంది. జీవితంలో సానుకూల మార్పులు మొదలవుతాయి. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. వాహనాన్ని కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఇంట్లో శుభకార్యం నిర్వహించే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: లేత నీలం

మిథునం (మే 21 – జూన్‌ 20)
మీ దార్శనికత ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. జనాకర్షణ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు తగిన గుర్తింపును దక్కించుకుంటారు. దీర్ఘకాలిక అన్యాయాలపై జరిపిన పోరాటంలో విజయం సాధిస్తారు. ప్రశంసలు వెల్లువెత్తుతాయి. కుటుంబ సభ్యులతో కలసి సంతోషంగా గడుపుతారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ అవకాశాలు కలసి వస్తాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. నిరుద్యోగులు పోటీ పరీక్షల్లో సత్ఫలితాలను సాధిస్తారు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
కష్టాలలో ఉన్న మిత్రులకు బాసటగా నిలుస్తారు. వారి సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు మందకొడిగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కూడా నామమాత్రంగా ఉంటుంది. భావి ప్రణాళికలను ఎంత పకడ్బందీగా రచించుకున్నా, కార్యాచరణకు ఆటంకాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార విహారాల పట్ల జాగ్రత్తలు అవసరమవుతాయి. ఆధ్యాత్మికత వైపు దృష్టి సారిస్తారు. అంతర్ముఖులై ధ్యానంలో గడపడానికి ఇష్టపడతారు. ఆలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ఊదా

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
పరిస్థితులన్నీ గజిబిజి ప్రహేళికలా ఉన్నా, మీదైన స్పష్టతతో ముందుకు సాగుతారు. జీవితంలో కొత్త దశ త్వరలోనే మొదలవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. గడ్డు సమస్యలను అవలీలగా పరిష్కరించి అందరి దృష్టిని ఆకట్టుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్వావలంబనను, సుస్థిరతను సాధిస్తారు. ఊహించని వ్యక్తితో ప్రేమలో పడతారు. సుదూర ప్రాంతాలకు విహారయాత్రలకు వెళతారు. బంధు మిత్రులతో కలసి విందు వినోదాల్లో గడుపుతారు. సామాజిక సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు.
లక్కీ కలర్‌: లేత గులాబి

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
భవితవ్యానికి సంబంధించిన సంశయాలు సందిగ్ధానికి లోను చేస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో మెరుగైన ఫలితాలను సాధిస్తారు. అయితే, ఉన్నత విద్యకు సంబంధించి ముందున్న అవకాశాలలో మేలైనదేదో తేల్చుకోవడంలో ఒక నిర్ణయానికి రాలేకపోతారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి తీసుకోవలసిన నిర్ణయాల్లో తాత్సార వైఖరిని అవలంబిస్తారు. ప్రేమ, పెళ్లిళ్లకు సంబంధించిన చర్చలు చిరాకు తెప్పిస్తాయి. వ్యాపారాలను విజయవంతంగా విస్తరిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. ఆర్థిక పురోగతి వేగం పుంజుకుంటుంది. విరాళాలు చెల్లిస్తారు.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆశావహ దృక్పథంతో ముందుకు సాగుతారు. భావసారూప్యత గల వ్యక్తులతో మీ ఆలోచనలను పంచుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. ఆర్థిక లాభాలు అందుకుంటారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలకు వెళతారు. మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్తగా కలుసుకున్న ఒక అద్భుతమైన వ్యక్తితో ప్రేమలో పడతారు. ఊహాలోకంలో విహరిస్తారు. ఇబ్బందుల్లో ఉన్న పెద్దలను ఆదుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటారు.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
సానుకూల పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడుల ద్వారా లాభాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. నిర్దేశిత లక్ష్యాలను అవలీలగా సాధిస్తారు. కలలను సాకారం చేసుకుంటారు. ఒక అద్భుతమైన వ్యక్తితో ఏర్పడే పరిచయం మీ జీవితాన్ని మలుపు తిప్పుతుంది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ఆరోగ్యం మందగించవచ్చు. ఆహార విహారాలపై శ్రద్ధ అవసరమవుతుంది. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక కేంద్రాలను, ఆలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
అదృష్టం కలిసొస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభాపాటవాలను చాటుకుంటారు. చిరకాలంగా ఎదురు చూస్తున్న పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. ఇదివరకటి కృషికి తగిన గుర్తింపును, ఆర్థిక లాభాలను సాధిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. సామాజికంగా పలుకుబడి పెంచుకుంటారు. సేవా కార్యక్రమాల్లో, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. పరిస్థితులన్నీ అద్భుతంగానే ఉన్నా, ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు సమసిపోతాయి. ఆత్మావలోకనం చేసుకుంటారు. తీర్థ యాత్రలు చేస్తారు. గురువులను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: వెండి రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేసుకుంటారు. ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కార్యరంగంలోకి దిగుతారు. భావసారూప్యత గల వ్యక్తుల నుంచి సాయం తీసుకుంటారు. కుటుంబ బాధ్యతలు కొంత ఒత్తిడికి దారి తీసే సూచనలు ఉన్నాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు క్రమంగా సానుకూలమవుతాయి. స్థిరాస్తి కొనుగోలు నిర్ణయాలు వాయిదా పడతాయి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది. విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: లేత గులాబి

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతారు. దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. వాటి సాధన కోసం నిర్విరామంగా కృషి సాగిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణం ఉంటుంది. వదంతుల వల్ల ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. అనవసరమైన వివాదాల్లో తలదూర్చకుండా ఉంటేనే మంచిది. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. విదేశీ వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.
లక్కీ కలర్‌: ముదురు గులాబి

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. సహనానికి పరీక్షలు ఎదురవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిడి ఎక్కువ కావచ్చు. వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోని వారికి ఒడిదుడుకులు తప్పకపోవచ్చు. సాంస్కృతిక కళా రంగాల వారు అవకాశాల కోసం మరికొంతకాలం ఎదురు చూడక తప్పదు. విశ్రాంతి కోసం ఎంతగా అలమటించినా, తీరిక దొరకడమే గగనమవుతుంది. వేళకు భోజనం కూడా చేయలేని పరిస్థితులు ఉండవచ్చు. అకాల భోజనం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తే సూచనలు ఉన్నాయి. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికత, ధ్యానం ద్వారా ఊరట పొందుతారు.
లక్కీ కలర్‌: నీలం
ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement