ఇది మీకు చాలా మంచి సమయం | This is good time for you | Sakshi
Sakshi News home page

ఇది మీకు చాలా మంచి సమయం

Published Fri, Jun 19 2015 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 4:01 AM

ఇది మీకు చాలా మంచి సమయం

ఇది మీకు చాలా మంచి సమయం

జూన్ 20 నుంచి జూన్ 26 వరకు
టారో బాణి
ఇది మీకు చాలా అదృష్టకరమైన వారం. లాటరీ గెలుచుకుంటారు. బాగా డబ్బు వస్త్తుంది. అధికారం ప్రాప్తిస్తుంది. విద్యార్థులు మంచి మార్కులు సాధిస్తారు. మీరెంత తెలివైన వారైనప్పటికీ, మీ బంధువులను, మిత్రులను, శ్రేయోభిలాషుల సహాయ సహకారాలు, సలహా, సూచనలు పాటించడంలో తప్పేమీ లేదు కదా! కలిసొచ్చే రంగు: గోల్డ్
ఇది మీరు విజయాలందుకునే వారం. వారాంతంలో మీకు కొత్త బంధం ఏర్పడి, రొమాన్స్‌లో మునిగి తేలవచ్చు. వివాహ ఘడియలు సమీపిస్తున్నాయి. ప్రయాణ సూచన కనిపిస్తోంది. మీ హృదయంలో ఏదో తెలియని ఆనందం, ఉల్లాసం ఉప్పొంగుతాయి. మీ ఆనందాన్ని పేదలతో కలిసి పంచుకోండి. వాళ్లూ సంతోషిస్తారు. కలిసొచ్చే రంగు: గ్రే
ఉద్యోగంలో మీరు కోరుకున్న మార్పు వస్తుంది. ఇది మీకు కొత్త అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. జాగ్రత్తగా, ప్రణాళికాబద్ధంగా వేసే ప్రతి అడుగూ మిమ్మల్ని విజయానికి చేరువ చేస్తుందని గ్రహించండి. పాత బంధాలు బలపడతాయి. అదే సమయంలో కొత్త బంధాలు ఏర్పడతాయి. ఒకసారి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది. కలిసొచ్చే రంగు: వయొలెట్
మీ లక్ష్యాన్ని చేరుకునేవిధంగా ఆశావహ దృక్పథంతో పని చేస్తారు. పోటీలలో విజయాన్ని సాధిస్తారు. దానధర్మాలు చేయడం వల్ల మేలు కలుగుతుంది. రకరకాల అవసరాలు ఒక్కసారిగా  మీద పడటం వల్ల డబ్బు సంపాదనే ధ్యేయంగా పని చేయవలసి వస్తుంది. ప్రేమ వ్యవహారాలలో మునిగి తేలతారు. కలిసొచ్చే రంగు: పీచ్
కొత్తగా వచ్చిన మార్పు మిమ్మల్ని ఒకింత బలహీన పరచవచ్చు. పెట్టుబడులకు ఈ వారం తగినదని గ్రహించండి. మీ సహోద్యోగులను, తోటివారిని వృత్తిపరంగా అధిగమిస్తారు. కొత్తగా కెరీర్ ప్రారంభించిన స్త్రీలకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు అంత అనుకూలం కాదు. కలిసొచ్చే రంగు: బ్రౌన్
జీవితంలో కొత్తమార్పులు చోటు చేసుకుంటాయి. ఇల్లు లేదా ఉద్యోగం మారతారు. మీ సామర్థ్యాన్ని రుజువు చేసుకునేందుకు దక్కిన అవకాశాన్ని నిర్లక్ష్యంగా జారవిడిచి, ఆ తర్వాత బాధపడి నా లాభం ఉండదు. దీనిని గ్రహించి, లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉత్సాహంతో పని చేయండి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. కలిసొచ్చే రంగు: పింక్
ప్రేమ వ్యవహారాలలో మునిగి తేలతారు. ఎంతోకాలంగా కలవాలనుకుంటున్న వారిని కలుస్తారు. పాజిటివ్‌గా, ఆశావహంగా పని చేసే వారితో మీరూ కలసి పనిచేయండి. దాని వల్ల మీకూ అవే ఆలోచనలొస్తాయని తెలుసుకోండి. స్వయంసమృద్ధిని సాధిస్తారు. మిమ్మల్ని ప్రేమించే వారి పట్ల జాగ్రత్త తీసుకోవలసిన వారమిది. కలిసొచ్చే రంగు:బ్లూ
ప్రాణస్నేహితులతో కలసి ఒక వ్యాపారంలో పెట్టుబడి పెడతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తారు. మీ కలలను సాకారం చేసుకునేందుకు దృఢనిశ్చయంతో పని చేయకపోతే ఆ కలలు కల్లలుగానే మిగిలిపోతాయని గ్రహించండి. మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి ఒకరు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. వారితో మీకు మంచి బంధం ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: ఆరంజ్
పనిపరంగా, ఇది మీకు మంచి సమయమే కాని, ప్రేమించిన వారి మూలంగానే మీ మనసు గాయపడే అవకాశం ఉంది. విందు వినోదాల్లో మునిగి తేలతారు. ఇంటికి దక్షిణ దిశలో ఫెంగ్‌షుయ్ రెడ్ క్యాండిల్స్‌ను వెలిగించండి. మిమ్మల్ని అవమానించి, మీ మనసు గాయపడేలా చేసిన వారే తప్పు తెలుసుకుని తిరిగి మిమ్మల్ని చేరవచ్చు. కలిసొచ్చే రంగు: ఆరంజ్ షేడ్స్
మీ బంగారు భవిష్యత్తు కోసం ప్రణాళికాబద్ధంగా ఆలోచించి, రంగు రంగుల కలల్లో తేలిపోతారు. మీ కలలు ప్రేమకు సంబంధించి కూడా అయి ఉండవచ్చు. అయితే కలలు కన్నంత మాత్రాన సరిపోదు, వాటిని నెరవేర్చుకునేందుకు తగిన కృషి కూడా అవసరమని గ్రహించండి. సమతుల్యత పాటించడం వల్ల సుఖంగా ఉండగలరు. కలిసొచ్చే రంగు: వయోలెట్
స్త్రీలకు ఇది చాలా మంచి వారం. కెరీర్ పరంగా మీరు కంటున్న బంగారు కలలను సాకారం చేసుకునేందుకు తగిన సమయం ఇదేనని తెలుసుకుని, తగిన విధంగా కృషి చేయడం అవసరం. ఈ వారం మీకు అదృష్టాన్ని, విజయాన్ని ఇస్తుంది. ఇంతకాలం మీరు ఎదురు చూసిన విధంగా సంతృప్తికరమైన ఆదాయం లభిస్తుంది. కలిసొచ్చే రంగు: సిల్వర్
విజయం ఎవరినీ అంత తేలిగ్గా వరించదని, అకుంఠితమైన దీక్ష, కార్యదక్షతలే ఎవరినైనా విజయానికి చేరువ చేస్తాయని తెలుసుకోండి. మనసు బాగుండనప్పుడు ప్రణాళికలేమీ వేయకండి. కొత్త పెట్టుబడులకు దూరంగా ఉండండి. ముందు మీరు కాస్త కుదుటపడ్డ తర్వాతే ఏమైనా! ప్రేమపరంగా ఈ వారం చాలా బాగుంటుంది. కలిసొచ్చే రంగు: ముదురు ఆకుపచ్చ
 
ఇన్సియా కె.
టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్

 
సౌర వాణి
కుటుంబ సభ్యుల్లో, భార్యాభర్తల్లో సంపూర్ణమైన ఐకమత్యం వచ్చిన కారణంగా ఏనుగంత బలం వస్తుంది మీకు. స్నేహితులు మీ అవసరాన్ని గుర్తించి వారంతట వారే సహాయానికి వస్తూంటే కొండంత ధైర్యం వస్తుంది మీకు. పదవిలో ఉన్నతి గానీ, జీతం పెంపుగానీ మీ కృషికి ఫలితంగా మీ అదృష్టానికి సూచనగా కలుగుతుంది ఈ వారంలో. నిత్యపూజని మానవద్దు.
మీరు దేన్ని చేస్తే బాగుంటుందని మీ సంస్థలో భావిస్తారో అదే ఆలోచన మీ సంస్థ అధిపతికి కలిగి మిమ్మల్ని అభినందిస్తారు. మీ పనికి అనుకూలత కలిగి ఇతరుల సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. వ్యాపార రంగంలో ఉన్న వారికి ఎక్కువ కొనుగోళ్లు లేకుండి, అమ్మకాలు బాగా సాగే కారణంగా మంచి లాభాలే వచ్చే అవకాశం ఉంది.
వినోదరంగం క్రీడారంగం, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉండకపో వచ్చు. సాంకేతిక రంగంలో ఉన్న వారి ప్రతిభకి తాత్కాలికంగా గుర్తింపు లభించక పోవచ్చు. విద్యారంగంలో వారికి ప్రతిభా పురస్కారాలు ఆశించినా లభించకపోవచ్చు. నిరాశ చెందకుండా గడపాల్సిన వారం.  నేడు కురవనంత మాత్రాన మేఘానికి వర్షించే గుణమే లేదనుకోకండి
వ్యవసాయ రంగంలో వారికి వ్యవసాయం చేయాలా? పొలం అమ్మి వ్యాపారానికి దిగాలా? అనే కొత్త ఆలోచనలొస్తాయి. ఉద్యోగులైనవారికి ఈ ఉద్యోగంలోనే కొనసాగాలా? వేరే సంస్థకి మారాలా? అనే ఊహలు వస్తాయి. ముందే అయిపోయిన  ఆస్తి పంపకాల్లో మళ్లీ కొత్త మార్పులకి ఆలోచనలు రావచ్చు. మొత్తానికి ఈ వారమంతా ఆలోచనల వేడిమితోనే గడుస్తుంది.
నిరుద్యోగులకి ఉపాధి లభించే అవకాశం ఉంది లేదా సొంత సంస్థని ప్రారంభించుకునేంత శక్తి లభిస్తుంది. వ్యాపార రంగంలో ఉన్న వారికి కొత్త వ్యాపారం ప్రారంభించుకునేందుకు కావలసిన ధనం శ్రమ లేకుండా లభిస్తుంది. కళాకారులకీ ఇంద్రజాలాది విద్యలు ప్రదర్శించేవారికి పుష్కలంగా ధనాదాయం లభిస్తుంది. పెద్దల పరిచయాలతో కొత్త అవకాశాలు లభించవచ్చు.
చేస్తున్న పని కంటే విద్యమీద ఆసక్తి పెరగడం కానీ, విద్యారంగంలో ఉంటే అది కాకుండా మరో రంగానికి వెళ్లాలనే ఊహ గాని- మొత్తానికి నడుస్తున్న తోవని మార్చుకునే ఆలోచన వస్తుంది. ఇప్పటి శ్రమ సరిపోదనీ మరింత శ్రమించాలనీ అనుకోవడమే కాదు, ఈ వారం నుంచే ఆరంభిస్తారు. రుణాలను తీర్చాలనే నిర్ణయానికి రావడమే కాదు, ప్రారంభిస్తారు కూడా!
అయినవారితోనే కలిసి చిన్నగా వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. అది లాభసాటిగానే ఉంటుంది. అత్యాశకు పోయి అంతకు మించి, దాన్ని పెంచవద్దు. ముఖ్యలయిన వారితో స్నేహం కుదురుతుంది. ఆ పరిచయాన్నీ, స్నేహాన్నీ దుర్వినియోగం చేసుకోకండి. మిత్రుల సహకారం ఉంటుంది. వారికి చిన్నపాటి అపకారం కూడా తలపెట్టవద్దు.
న్యాయస్థానంలో ఏవైనా అపరిష్కృత సమస్యలుండి మనోవేదనతో మీరుంటే దానికి స్పష్టమైన ఊరట ఈ వారంలో లభిస్తుంది. ఆందోళన తొలగిపోతుంది. పాత బకాయిల కోసం మీరే విధంగానూ ప్రయత్నించకుండానే వసూళ్లయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే తిరిగి రుణాన్ని ఇవ్వవద్దు. మీరున్న పదవిలో మీకు గట్టిపట్టూ గుర్తింపూ లభిస్తుంది.
మీరు మీ వృత్తి ఉద్యోగాల్లో తల మునకలవుతూ మీ పిల్లల చదువుల్నీ బాగోగుల్నీ  విస్మరించ కండి. ఆర్థికంగా మీ ప్రణాళిక ఏమిటో ఓ మారు నిదానంగా పరిశీలించుకుని ఏ స్థాయిలో మీరున్నారో ఓ అంచనాకి రావలసిన అసరం ఉందని గ్రహించండి. ఉద్యోగులయినంత మాత్రాన అందరికీ అంతంత చనువుని ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ వారంలో గ్రహించండి.
ఆధ్యాత్మిక మార్గానికి మీ దృష్టి మరలి దానధర్మాలూ పూజాపురస్కారాలూ దైవదర్శనాల వైపు వెళ్లవచ్చు. క్యాటరింగ్ వారికి కలిసొచ్చే వారం ఇది. మరొక సంస్థను కొనుగోలు చేయడమో, పెద్ద ఒప్పందమో చేసుకోగల వారం ఇది. ఎప్పుడో ఎక్కడో పెట్టిన పెట్టుబడి అదనపు ఆదా యాన్ని సమకూర్చవచ్చు. ధనాన్ని ఖర్చు చేయడంలో నియంత్రణ అవసరమని గుర్తించండి.
ఇంటికి లేదా వాహనాలకి మరమ్మతులని చేపట్టి పెద్ద మొత్తంలో వ్యయం చేస్తారు. సంతానానికి సంబంధించిన వివాహ ప్రయత్నాల కోసం అంచనాలకి మించి వ్యయం చేయవలసి రావచ్చు. పిల్లల చదువులకీ ఉద్యోగ ప్రయత్నాలకీ పరీక్షలకీ కూడా అధికంగా వ్యయం చేయవలసి రావచ్చు. రుణమైతే చేయరుగానీ ఎక్కువ మొత్తంలోనే వ్యయపరచుకుంటారు.
పెద్ద ఆలోచనలతో ఎంతో దూరాలకి వెళ్లి అనారోగ్యాన్నీ తెచ్చుకునే ప్రమాదం ఉంది. మొహమా టానికి పోయి కాదనలేక తగిన హామీ లేకుండా రుణాన్ని ఇచ్చి మనోవేదనకి గురయ్యే పరిస్థితి ఉండొచ్చు. అనవసరమని తెలిసినా ఒకరి బలవంతం మీద వస్తువునో వాహనాన్నో కొని, ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే పరిస్థితి గోచరిస్తోంది.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు
సంస్కృత పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement