వారఫలాలు | Varafalalu 05-05-2019 | Sakshi
Sakshi News home page

 వారఫలాలు

Published Sun, May 5 2019 12:54 AM | Last Updated on Sun, May 5 2019 12:54 AM

Varafalalu 05-05-2019 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది  దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు.  సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
వ్యూహాత్మకంగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వివాహాది శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత  పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  అనుకోని హోదాలు, మంచి గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నీలం, పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
కొత్త్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. పెండింగ్‌లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు అమలులో పెడతారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో  పదోన్నతులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి, సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. తెలుపు, లేత ఎరుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. హనుమాన్‌ ఛాలీసా పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వేడుకలకు హాజరవుతారు.  విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల  ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం.  తెలుపు, కాఫీరంగులు, ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు తక్షణం  అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. విమర్శించిన వారేæ ప్రశంసిస్తారు. వాహనయోగం.  సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు,  పదోన్నతులు దక్కుతాయి. సాంకేతికవర్గాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. పసుపు, ముదురు ఎరుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు.  ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన  ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు విజయాలు దక్కుతాయి.  వారం మధ్యలో వృథా ఖర్చులు. ఎరుపు, పసుపుæరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొన్ని వ్యవహారాలు∙నెమ్మదించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
పనులలో  జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. సోదరులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అపరిష్కృత సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి చేయూతనందిస్తారు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.  వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో చికాకులు. గులాబీ, పసుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సహకారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. శ్రమ తప్పదు. నీలం, లేత పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చనలు చేయండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి.  కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. గోధుమ, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి.  ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి.  నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో కొద్దిపాటి ఆటంకాలు. నిర్ణయాలలో తొందరపాటు తగదు.  పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి.  నలుపు, చాక్లెట్‌ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి.
సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో ( 5 మే నుంచి 11 మే, 2019 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొందరికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపించే సూచనలు ఉన్నాయి. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. విదేశీ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొందరికి ఎడబాటు తప్పకపోవచ్చు.
లక్కీ కలర్‌: గోధుమ రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. సవాళ్లను ఎదుర్కొంటారు. పనికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కొత్త భాగస్వాములతో కలసి వినూత్న వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపారాలను ఊహించని రీతిలో విస్తరిస్తారు. పొదుపు పథకాల్లో మదుపు పెట్టడానికి ఇది పూర్తిగా అనుకూలమైన కాలం. అయితే, స్పెక్యులేషన్‌ లావాదేవీలకు, లాటరీ జూదాలకు దూరంగా ఉండటం మంచిది. వారసత్వ ఆస్తి కలసి వస్తుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార పానీయాల పట్ల జాగ్రత్తలు తప్పని పరిస్థితులు తలెత్తవచ్చు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
గతంలో చేసిన పనుల వల్ల తలెత్తిన ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయస్థానాల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అభివృద్ధికి దారితీసే అవకాశాలు అందివస్తాయి. ఏకకాలంలో విభిన్న నైపుణ్యాలతో కూడుకున్న పనులు చేయగల సామర్థ్యమే మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. పరిమితులు విధించుకోకుండా అందిన అవకాశాలను వినియోగించుకుంటేనే విజయ పథాన ముందుకు సాగగలుగుతారు.
లక్కీ కలర్‌: పసుపు

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
వృత్తి ఉద్యోగాల్లో మీ నేతృత్వంలో పని చేస్తున్న బృందంలో ప్రతిభా పాటవాలను చాటుకున్న వారిని ప్రోత్సహిస్తారు. ఆర్థిక లాభాలను అందుకుంటారు. విలువైన విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితంలో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. స్వల్పకాలిక పెట్టుబడులు లాభాలనిస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పని ఒత్తిడి నుంచి విరామం కోసం విహారయాత్రలు చేస్తారు.
లక్కీ కలర్‌: బంగారం

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయికి మించి పుంజుకుంటుంది. మీ పురోగతికి ఇతరులు ఈర్ష్య పడతారు. వృత్తి ఉద్యోగాల్లో నిర్ణయాత్మక పదవులు వరించే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఫలితాలన్నీ ఒకేసారి దక్కకపోవచ్చు. కొంత ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారిలో కొందరితో వ్యాపార భాగస్వామ్యాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రలకు వెళతారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
పని మీద ఏకాగ్రత తగ్గుతుంది. అలసత్వం కారణంగా చేపట్టిన ముఖ్యమైన పనులపై కూడా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. స్వయంగా చొరవ తీసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకుంటే లక్ష్య సాధనలో వెనుకబడే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పొరపాట్లు దొర్లకుండా అప్రమత్తంగా ఉండటం మంచిది. ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు తెలెత్తే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పవచ్చు. పగటి కలలతో కాలక్షేపం చేయకుండా కార్యాచరణలోకి దిగడమే మంచిది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది.
లక్కీ కలర్‌: నాచు రంగు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
సృజనాత్మకతకు పదును పెడతారు. కళా సాంస్కృతిక రంగాల్లోని వారికి పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ఆర్థిక పరిపుష్టినిచ్చే కొత్త అవకాశాలు కలసి వస్తాయి. ఇతరులను తక్కువగా అంచనా వేయకుండా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం మానసిక ఒత్తిడిని పెంచే సూచనలు ఉన్నాయి. పెట్టబడులు పెట్టే ముందు ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేనిపోని ఆకర్షణల వలలో చిక్కుకుని మోసపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరే సూచనలు ఉన్నాయి. సాహస క్రీడలపై ఆసక్తి చూపుతారు. విహార యాత్రలను ఆస్వాదిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పని ప్రదేశంలో అనూహ్యమైన అనుభవాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఆర్థిక సుస్థిరతను సాధిస్తారు. కుటుంబంలో కొంత అశాంతి నెలకొనే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం తలకు మించిన భారమవుతుంది. మొహమాటాన్ని విడిచిపెట్టండి. లేనిపోని మొహమాటాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకునే సూచనలు ఉన్నాయి. అవసరంలో ఉన్నప్పుడు మిత్రుల నుంచి సహాయం అందుతుంది. జటిలమైన సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమవుతుంది.
లక్కీ కలర్‌: ఊదా

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
కార్యాలయానికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారాన్ని పదిలపరచుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. స్థిరాస్తుల్లో మదుపు చేస్తారు. వరుస విజయాలతో ప్రత్యర్థుల విమర్శలకు బదులు చెబుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. అదృష్టం మీవైపే ఉందనే సంగతి అనుభవంలోకి వస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు. ఆలయాలను దర్శిస్తారు.
లక్కీ కలర్‌: బూడిద రంగు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
డబ్బు గురించి దిగులు పడాల్సిన పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక పురోగతి రెట్టింపు వేగాన్ని పుంజుకుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి బాగుంటుంది. సకాలంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలు లాభాల బాట వేస్తాయి. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. సృజనాత్మక రంగాల్లోని వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సత్తా నిరూపించుకోవడానికి తగిన కొత్త అవకాశాలు దక్కుతాయి. చిరకాల మిత్రుల్లో ఒకరిని కలుసుకుంటారు. గత స్మృతులు వెంటాడుతాయి. ఘన విజయాలు సాధించినా ఏదో తెలియని అసంతృప్తి బాధిస్తుంది.
లక్కీ కలర్‌: నేరేడు రంగు

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
 అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకుంటారు. అనవసరమైన భ్రమల నుంచి, అపోహల నుంచి బయటపడతారు. జీవితాన్ని వాస్తవిక దృక్పథంతో చూడటాన్ని అలవరచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. పని ఒత్తిడి ఒకవైపు ఇబ్బందికరంగానే ఉన్నా, ప్రశాంతభరితమైన కుటుంబ వాతావరణం ఒకింత ఊరటనిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధులవుతారు. భారీ లక్ష్యాలను సాధించడానికి శక్తులన్నింటినీ సమకూర్చుకుంటారు. ఒత్తిళ్లకు వెరవకుండా లక్ష్యాలను సాధిస్తారు.
లక్కీ కలర్‌: నీలం
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement