simham bhatla
-
వారఫలాలు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత ఉపశమనం లభిస్తుంది దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. నేర్పుగా వ్యవహారాలు చక్కదిద్దుతారు. సోదరులు, సోదరీలతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు. రాజకీయవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, ఆకుపచ్చరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.) వ్యూహాత్మకంగా కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తుల కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వివాహాది శుభకార్యాలలో పాలుపంచుకుంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో క్లిష్ట సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ధనవ్యయం. కుటుంబంలో సమస్యలు. ఎరుపు, నేరేడురంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాస్తోత్రాలు పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సత్తా చాటుకుని ముందడుగు వేస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో అనుకోని హోదాలు, మంచి గుర్తింపు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమ తప్పదు. నీలం, పసుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త్త వ్యక్తులు పరిచయం సంతోషం కలిగిస్తుంది. పెండింగ్లో ఉన్న పనులు సైతం పూర్తి చేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనయోగం. కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. ఆలోచనలు అమలులో పెడతారు. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు సాగిస్తారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు. కళాకారులకు అవకాశాలు పెరుగుతాయి, సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్య సూచనలు. తెలుపు, లేత ఎరుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు సానుకూలం. హనుమాన్ ఛాలీసా పఠించండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక వ్యవహారాలలో మరింత పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన పనులు కొంత నిదానంగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. వేడుకలకు హాజరవుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. తెలుపు, కాఫీరంగులు, ఉత్తరదిశప్రయాణాలు అనుకూలం. గణేశ్స్తోత్రాలు పఠించండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది. విమర్శించిన వారేæ ప్రశంసిస్తారు. వాహనయోగం. సంఘంలో గౌరవం పెరుగుతుంది. భూవివాదాలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో విశేష గుర్తింపు, పదోన్నతులు దక్కుతాయి. సాంకేతికవర్గాల వారికి నూతనోత్సాహం. వారం ప్రారంభంలో మానసిక అశాంతి. కుటుంబంలో సమస్యలు. పసుపు, ముదురు ఎరుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా నేర్పుగా పరిష్కరించుకుంటారు. ముఖ్య వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. మీ నిర్ణయాలు అందరూ ఆమోదిస్తారు. ప్రయాణాలలో కొత్త వ్యక్తుల పరిచయం. వివాహ, ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు ఆశించిన ఫలితాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇంక్రిమెంట్లు లభిస్తాయి. రాజకీయవర్గాలకు విజయాలు దక్కుతాయి. వారం మధ్యలో వృథా ఖర్చులు. ఎరుపు, పసుపుæరంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కొన్ని వ్యవహారాలు∙నెమ్మదించినా పట్టుదలతో పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వాహనయోగం. నిరుద్యోగులకు శుభవార్తలు. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. వారం చివరిలో బంధువిరోధాలు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. కనకధారాస్తోత్రం పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) పనులలో జాప్యం జరిగినా పట్టుదలతో పూర్తి చేస్తారు. సోదరులు, బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అపరిష్కృత సమస్యలు కొలిక్కి వస్తాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ఆర్థిక లాభాలు ఉంటాయి. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారి చేయూతనందిస్తారు. నూతన ఉద్యోగయోగం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో హోదాలు రాగలవు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో చికాకులు. గులాబీ, పసుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుంది. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి సహకారం అందుతుంది. కళాకారులకు సన్మానాలు. వారం ప్రారంభంలో మానసిక ఆందోళన. శ్రమ తప్పదు. నీలం, లేత పసుపురంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణపతి అర్చనలు చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనుల్లో విజయం సాధిస్తారు. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యపరంగా కొద్దిపాటి చికాకులు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు హోదాలు దక్కుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. గోధుమ, ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. బంధువులు, మిత్రులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలలో కొద్దిపాటి ఆటంకాలు. నిర్ణయాలలో తొందరపాటు తగదు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. చర్చల్లో పురోగతి. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గాదేవికి కుంకుమార్చన చేయండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు టారో ( 5 మే నుంచి 11 మే, 2019 వరకు) మేషం (మార్చి 21 – ఏప్రిల్ 19) వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారు శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది. కొందరికి పదోన్నతులు దక్కే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణంలో ప్రశాంతత లోపించే సూచనలు ఉన్నాయి. అనవసర వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. ముఖ్యంగా జీవిత భాగస్వామితో సామరస్యంగా ఉండటం మంచిది. వ్యాపార విస్తరణ ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. విదేశీ లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. కొందరికి ఎడబాటు తప్పకపోవచ్చు. లక్కీ కలర్: గోధుమ రంగు వృషభం (ఏప్రిల్ 20 – మే 20) అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. సవాళ్లను ఎదుర్కొంటారు. పనికి తగిన ప్రతిఫలాన్ని అందుకుంటారు. కొత్త భాగస్వాములతో కలసి వినూత్న వ్యాపారాలను ప్రారంభిస్తారు. వ్యాపారాలను ఊహించని రీతిలో విస్తరిస్తారు. పొదుపు పథకాల్లో మదుపు పెట్టడానికి ఇది పూర్తిగా అనుకూలమైన కాలం. అయితే, స్పెక్యులేషన్ లావాదేవీలకు, లాటరీ జూదాలకు దూరంగా ఉండటం మంచిది. వారసత్వ ఆస్తి కలసి వస్తుంది. ఆరోగ్యం మందగించే సూచనలు ఉన్నాయి. ఆహార పానీయాల పట్ల జాగ్రత్తలు తప్పని పరిస్థితులు తలెత్తవచ్చు. లక్కీ కలర్: ఆకుపచ్చ మిథునం (మే 21 – జూన్ 20) గతంలో చేసిన పనుల వల్ల తలెత్తిన ఇబ్బందులు తొలగిపోతాయి. చట్టపరమైన వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. న్యాయస్థానాల్లో అనుకూలమైన తీర్పులు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో మార్పులకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకోవలసి వస్తుంది. అభివృద్ధికి దారితీసే అవకాశాలు అందివస్తాయి. ఏకకాలంలో విభిన్న నైపుణ్యాలతో కూడుకున్న పనులు చేయగల సామర్థ్యమే మీకు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుంది. పరిమితులు విధించుకోకుండా అందిన అవకాశాలను వినియోగించుకుంటేనే విజయ పథాన ముందుకు సాగగలుగుతారు. లక్కీ కలర్: పసుపు కర్కాటకం (జూన్ 21 – జూలై 22) వృత్తి ఉద్యోగాల్లో మీ నేతృత్వంలో పని చేస్తున్న బృందంలో ప్రతిభా పాటవాలను చాటుకున్న వారిని ప్రోత్సహిస్తారు. ఆర్థిక లాభాలను అందుకుంటారు. విలువైన విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. జీవితంలో అంతుచిక్కని ప్రశ్నలకు సమాధానాలను అన్వేషిస్తారు. ధైర్యంగా ముందుకు సాగుతారు. స్వల్పకాలిక పెట్టుబడులు లాభాలనిస్తాయి. కొత్త ఇల్లు లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పని ఒత్తిడి నుంచి విరామం కోసం విహారయాత్రలు చేస్తారు. లక్కీ కలర్: బంగారం సింహం (జూలై 23 – ఆగస్ట్ 22) ఆర్థిక పరిస్థితి ఆశించిన స్థాయికి మించి పుంజుకుంటుంది. మీ పురోగతికి ఇతరులు ఈర్ష్య పడతారు. వృత్తి ఉద్యోగాల్లో నిర్ణయాత్మక పదవులు వరించే సూచనలు ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఫలితాలన్నీ ఒకేసారి దక్కకపోవచ్చు. కొంత ఓపికతో ఎదురు చూడవలసి ఉంటుంది. ఇంట్లోని పెద్దల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. వారిలో కొందరితో వ్యాపార భాగస్వామ్యాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. విహారయాత్రలకు వెళతారు. లక్కీ కలర్: ఆకుపచ్చ కన్య (ఆగస్ట్ 23 – సెప్టెంబర్ 22) పని మీద ఏకాగ్రత తగ్గుతుంది. అలసత్వం కారణంగా చేపట్టిన ముఖ్యమైన పనులపై కూడా దృష్టి కేంద్రీకరించలేకపోతారు. స్వయంగా చొరవ తీసుకుని పరిస్థితులను అదుపులోకి తీసుకుంటే లక్ష్య సాధనలో వెనుకబడే సూచనలు ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల్లో పొరపాట్లు దొర్లకుండా అప్రమత్తంగా ఉండటం మంచిది. ఉన్నతాధికారుల నుంచి ఇబ్బందులు తెలెత్తే సూచనలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా, ఖర్చులు అదుపు తప్పవచ్చు. పగటి కలలతో కాలక్షేపం చేయకుండా కార్యాచరణలోకి దిగడమే మంచిది. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. లక్కీ కలర్: నాచు రంగు తుల (సెప్టెంబర్ 23 – అక్టోబర్ 22) సృజనాత్మకతకు పదును పెడతారు. కళా సాంస్కృతిక రంగాల్లోని వారికి పేరు ప్రఖ్యాతులు ఇనుమడిస్తాయి. ఆర్థిక పరిపుష్టినిచ్చే కొత్త అవకాశాలు కలసి వస్తాయి. ఇతరులను తక్కువగా అంచనా వేయకుండా ఉండటం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు ప్రోత్సాహకరంగా ఉంటాయి. వాగ్వాదాలకు దూరంగా ఉండటం క్షేమం. స్థిరాస్తుల కొనుగోలు నిర్ణయాలు వాయిదా పడే సూచనలు ఉన్నాయి. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. సామాజిక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తారు. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆలయాలను దర్శించుకుంటారు. లక్కీ కలర్: నేరేడు రంగు వృశ్చికం (అక్టోబర్ 23 – నవంబర్ 21) వృత్తి ఉద్యోగాల్లో అభద్రతాభావం మానసిక ఒత్తిడిని పెంచే సూచనలు ఉన్నాయి. పెట్టబడులు పెట్టే ముందు ఆచి తూచి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. లేనిపోని ఆకర్షణల వలలో చిక్కుకుని మోసపోయే సూచనలు ఉన్నాయి. విద్యార్థులు కొత్త కోర్సుల్లో చేరే సూచనలు ఉన్నాయి. సాహస క్రీడలపై ఆసక్తి చూపుతారు. విహార యాత్రలను ఆస్వాదిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. పని ప్రదేశంలో అనూహ్యమైన అనుభవాలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపార అవకాశాల కోసం విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. లక్కీ కలర్: లేతాకుపచ్చ ధనుస్సు (నవంబర్ 22 – డిసెంబర్ 21) ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతారు. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతంగా రాణిస్తారు. ఆర్థిక సుస్థిరతను సాధిస్తారు. కుటుంబంలో కొంత అశాంతి నెలకొనే సూచనలు ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడం తలకు మించిన భారమవుతుంది. మొహమాటాన్ని విడిచిపెట్టండి. లేనిపోని మొహమాటాల వల్ల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చిక్కుకునే సూచనలు ఉన్నాయి. అవసరంలో ఉన్నప్పుడు మిత్రుల నుంచి సహాయం అందుతుంది. జటిలమైన సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరమవుతుంది. లక్కీ కలర్: ఊదా మకరం (డిసెంబర్ 22 – జనవరి 19) కార్యాలయానికి మరమ్మతులు, కొత్త అలంకరణలు చేపడతారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారాన్ని పదిలపరచుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై లాభాలను అందుకుంటారు. స్థిరాస్తుల్లో మదుపు చేస్తారు. వరుస విజయాలతో ప్రత్యర్థుల విమర్శలకు బదులు చెబుతారు. ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ఆరోగ్య సమస్యల నుంచి కోలుకుంటారు. గురువుల ఆశీస్సులు పొందుతారు. అదృష్టం మీవైపే ఉందనే సంగతి అనుభవంలోకి వస్తుంది. బరువును అదుపులో ఉంచుకోవడానికి వ్యాయామం ప్రారంభిస్తారు. ఆలయాలను దర్శిస్తారు. లక్కీ కలర్: బూడిద రంగు కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18) డబ్బు గురించి దిగులు పడాల్సిన పరిస్థితులు దూరమవుతాయి. ఆర్థిక పురోగతి రెట్టింపు వేగాన్ని పుంజుకుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధి బాగుంటుంది. సకాలంలో తీసుకున్న రాజకీయ నిర్ణయాలు లాభాల బాట వేస్తాయి. విందు వినోదాల్లో, వేడుకల్లో పాల్గొంటారు. సృజనాత్మక రంగాల్లోని వారికి పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. సత్తా నిరూపించుకోవడానికి తగిన కొత్త అవకాశాలు దక్కుతాయి. చిరకాల మిత్రుల్లో ఒకరిని కలుసుకుంటారు. గత స్మృతులు వెంటాడుతాయి. ఘన విజయాలు సాధించినా ఏదో తెలియని అసంతృప్తి బాధిస్తుంది. లక్కీ కలర్: నేరేడు రంగు మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20) అపరిష్కృత సమస్యలను పరిష్కరించుకుంటారు. అనవసరమైన భ్రమల నుంచి, అపోహల నుంచి బయటపడతారు. జీవితాన్ని వాస్తవిక దృక్పథంతో చూడటాన్ని అలవరచుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. పని ఒత్తిడి ఒకవైపు ఇబ్బందికరంగానే ఉన్నా, ప్రశాంతభరితమైన కుటుంబ వాతావరణం ఒకింత ఊరటనిస్తుంది. సవాళ్లను ఎదుర్కోవడానికి మానసికంగా సంసిద్ధులవుతారు. భారీ లక్ష్యాలను సాధించడానికి శక్తులన్నింటినీ సమకూర్చుకుంటారు. ఒత్తిళ్లకు వెరవకుండా లక్ష్యాలను సాధిస్తారు. లక్కీ కలర్: నీలం - ఇన్సియా టారో అనలిస్ట్ -
వారఫలాలు: 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. రుణ ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పని. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. కొన్ని రహస్య విషయాలు గ్రహిస్తారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, ఆస్తి వివాదాల నుంచి ఊరట. సోదరులు, సోదరీలతో సఖ్యత. వ్యాపారలాభం. ఉద్యోగులకుహోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో చికాకులు. అనారోగ్యం. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. బంధువర్గంతో అకారణ విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాల్లో స్వల్ప లాభం. ఉద్యోగులకు ఒత్తిడులు. వారం చివర శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) పనులు వాయిదా. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. కుటుంబంలో చికాకులు. పుణ్యక్షేత్ర సందర్శనం. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగవర్గాలకు ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో భూ, గృహయోగాలు. పనుల్లో విజయం. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. ధనవ్యయం. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ప్రారంభంలో నెలకొన్న సమస్యలు క్రమేపీ పరిష్కారం. ఆస్తి ఒప్పందాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం. కళారంగం వారికి చికాకులు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఇంటాబయటా బాధ్యతలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆస్తి వ్యవహారాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పని ఒత్తిడి. వారం ప్రారంభంలో విందువినోదాలు. వాహనయోగం. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆర్థిక ఇబ్బందులు. శ్రమ పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా. బంధువులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. నిరుద్యోగుల యత్నాలు జాప్యం. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం. ఆస్తి వివాదాలు తీరతాయి. పనుల్లో పురోగతి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలం. విద్యార్థులకు శుభవార్తలు. ఉద్యోగులకు పదోన్నతులు. సన్మానాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి. రుణయత్నాలు. దూరప్రయాణాలు. బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. ఆరోగ్యపరంగా చికాకులు. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం. విద్యార్థులకు నూతనోత్సాహం. గృహ, వాహనయోగాలు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ప్రయాణాలు, చికాకులు. -
వారఫలాలు: 5 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్, 2015 వరకు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. గృహం, వాహనాలు కొంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. ముఖ్య నిర్ణయాలు. శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగే సమయం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) మొదట్లో చికాకులు నెలకొన్నా క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు. సేవలకు గుర్తింపు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో చికాకులు. అనారోగ్యం. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) కొత్త వ్యక్తుల పరిచయం. అరుదైన ఆహ్వానాలు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూముల కొనుగోలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబసమస్యలు. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం, చికాకులు. బంధువులు, మిత్రులతో విభేదాలు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్ర సందర్శనం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఊహలు నిజం చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులు, దూరపు బంధువుల కలయిక. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. కొత్త పనులకు శ్రీకారం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనం. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారంలో కొత్త ఆశలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) నూతన ఉద్యోగప్రాప్తి. పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకం. సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార లాభం. ఉద్యోగులకు పదోన్నతి. కళారంగం వారికి అవార్డులు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఖర్చులు అధికం. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగు. సన్నిహితుల సాయం. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహవంతం. పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో చికాకులు. అశాంతి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) చికాకులు, అనుకోని ప్రయాణాలు. పనుల్లో జాప్యం జరిగినా విజయవంతం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో బంధువులతో వివాదాలు. అనారోగ్యం. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో దూరప్రయాణాలు. సోదరులతో వివాదాలు. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
వారఫలాలు (29 మార్చి నుంచి 4ఏప్రిల్, 2015 వరకు)
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, పనిభారం. కళారంగం వారికి కొంత నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు వద్దు.ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో వివాదాలు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యా పార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ఆస్తిలాభం.కార్యసిద్ధి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులు, మిత్రులతో అనుకోని వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు. ఉద్యోగులకు ఒత్తిడులు ఉంటాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతం. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు, అనుకోని ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) ఆర్థిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరులు, సోదరీలతో వివాదాల పరిష్కారం. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు లభిస్తాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. కోర్టు కేసులు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కుటుంబంలో చికాకులు. ఆస్తి వివాదాలు. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు చికాకులు. వారం ప్రారంభంలో ఆహ్వానాలు. ఆస్తి లాభం. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చే స్తారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ అనుకూలత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు. వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
వారఫలం: డిసెంబర్ 21 నుండి 27 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు ఊరట. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వివాదాలు. ధనవ్యయం. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) కొత్త పనులకు శ్రీకార ం చుడతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల సూచనలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) పనుల్లో జాప్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. కళారంగం వారికి నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవీయోగం, సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి అవార్డులు దక్కే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం.ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళారంగం వారికి మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం. - సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష పండితులు -
ఆస్ట్రాలజీ
ఆగస్టు 10 నుండి16 వరకు మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.) ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. మీసేవలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ద క్కే అవకాశం. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు. వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.) ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక ముఖ్యమైన కేసు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దూరప్రయాణాలు. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతం. కళారంగంవారికి కలిసివచ్చే కాలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబ వివాదాలు. మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.) ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదుర్కొన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాలు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం. సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.) ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం. కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,) కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. భూ, గృహయోగాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో వివాదాలు. అనుకోని ధనవ్యయం. తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.) ఆర్థిక విషయాలు కాస్త మందగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక ప్రకటనకు నిరుద్యోగులు ఆకర్షితులవుతారు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ) వ్యూహాత్మకంగా కొన్ని సమస్యలు అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ఆలయ దర్శనాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా గడుపుతారు. కళారంగం వారికి అవార్డులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు, పనుల్లో ఆటంకాలు. ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.) బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. వ్యాపారులు కొంత నిదానంగా ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు లేనిపోని చికాకులు. కళారంగం వారికి నిరాశాజనకం. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు. మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.) నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు లాభాల బాటలో సాగుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం. కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.) పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువుల సహాయం అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. రాజకీయవర్గాలకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి) దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పనులలో జాప్యం.