వారఫలాలు (29 మార్చి నుంచి 4ఏప్రిల్, 2015 వరకు) | Astrology of the week March 29 to 4 April | Sakshi
Sakshi News home page

వారఫలాలు (29 మార్చి నుంచి 4ఏప్రిల్, 2015 వరకు)

Published Sun, Mar 29 2015 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 11:31 PM

Astrology of the week March 29 to 4 April

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు కాస్త నిరాశ కలిగిస్తాయి. బంధువులు, మిత్రులతో  మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు, పనిభారం. కళారంగం వారికి కొంత నిరుత్సాహం. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
 ముఖ్యమైన నిర్ణయాలలో తొందరపాటు వద్దు.ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్య సూచనలు. మిత్రులతో వివాదాలు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యా పార విస్తరణ యత్నాలు మందగిస్తాయి. ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో ఆస్తిలాభం.కార్యసిద్ధి.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)

 ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. బంధువులు, మిత్రులతో అనుకోని వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆరోగ్య సమస్యలు. ఉద్యోగులకు ఒత్తిడులు ఉంటాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పలుకుబడి పెరుగుతుంది. భూములు, వాహనాలు కొనుగోలు. నిరుద్యోగుల కల ఫలిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతం. అనుకోని ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు, అనుకోని ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో వివాదాలు. ఆరోగ్యపరంగా చికాకులు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సామాన్యం. ఉద్యోగులకు పనిభారం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం చివరిలో శుభవార్తలు. వాహనయోగం.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భూవివాదాలు తీరి లబ్ధి పొందుతారు. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు దక్కుతాయి. రాజకీయవర్గాలకు పదవులు దక్కుతాయి.
 
 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 ఆర్థిక విషయాలు సంతృప్తి కలిగిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. సోదరులు, సోదరీలతో వివాదాల పరిష్కారం. వాహనాలు, భూములు కొంటారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు లభిస్తాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వాహనయోగం. కోర్టు కేసులు పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. ఆలయ దర్శనాలు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు. కుటుంబంలో చికాకులు. ఆస్తి వివాదాలు.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు కొద్దిపాటి చికాకులు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 ఆర్థిక ఇబ్బందులు. ముఖ్యమైన కార్యక్రమాలలో ఆటంకాలు. ఆస్తి వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు చికాకులు. వారం  ప్రారంభంలో ఆహ్వానాలు. ఆస్తి లాభం.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆస్తి వివాదాల పరిష్కారం.  ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి.  భూములు, వాహనాలు కొనుగోలు చే స్తారు. విద్యార్థులు కొత్త ఆశలతో ముందుకు సాగుతారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి  సన్మానాలు. వారం చివరిలో వ్యయప్రయాసలు.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు నెలకొన్నా క్రమేపీ అనుకూలత ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సన్నిహితులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు పొందుతారు. వివాదాల నుంచి బయటపడతారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు. ప్రయాణాలలో ఆటంకాలు. అనారోగ్యం.
 - సింహంభట్ల సుబ్బారావు
 జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement