ఆస్ట్రాలజీ
ఆగస్టు 10 నుండి16 వరకు
మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. మీసేవలకు తగిన ప్రోత్సాహం లభిస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారులకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు ద క్కే అవకాశం. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం చివరిలో వ్యయప్రయాసలు.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఒక ముఖ్యమైన కేసు అనుకూలంగా పరిష్కారమయ్యే అవకాశం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. దూరప్రయాణాలు. వ్యాపారులు అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగవర్గాలకు ఉత్సాహవంతం. కళారంగంవారికి కలిసివచ్చే కాలం. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబ వివాదాలు.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
ప్రారంభంలో కొన్ని చికాకులు ఎదుర్కొన్నా క్రమేపీ సర్దుబాటు కాగలవు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సన్నిహితుల సాయంతో ముందడుగు వేస్తారు. నిరుద్యోగులకు కొత్త ఆశలు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కొన్ని సమస్యలు ఎదురైనా పట్టుదలతో పరిష్కరించుకుంటారు. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు దగ్గరకు వస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగ వర్గాలు ఉత్సాహంగా ముందడుగు వేస్తారు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులను విశేషంగా ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ప్రకటన రావచ్చు. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. భూ, గృహయోగాలు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయవర్గాలకు పదవులు దక్కే అవకాశం. వారం ప్రారంభంలో వివాదాలు. అనుకోని ధనవ్యయం.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
ఆర్థిక విషయాలు కాస్త మందగించినా అవసరాలకు డబ్బు అందుతుంది. వాహనాలు, భూముల కొనుగోలు యత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక ప్రకటనకు నిరుద్యోగులు ఆకర్షితులవుతారు. వ్యాపారులు అనుకున్న లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికరంగం వారికి నూతనోత్సాహం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
వ్యూహాత్మకంగా కొన్ని సమస్యలు అధిగమిస్తారు. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ఆలయ దర్శనాలు. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారులకు ఊహించని లాభాలు. ఉద్యోగులు విధుల్లో ఉత్సాహంగా గడుపుతారు. కళారంగం వారికి అవార్డులు దక్కవచ్చు. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు, పనుల్లో ఆటంకాలు.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమ తప్పదు. ఆరోగ్యపరంగా చికాకులు ఎదురవుతాయి. వ్యాపారులు కొంత నిదానంగా ముందుకు సాగడం మంచిది. ఉద్యోగులకు లేనిపోని చికాకులు. కళారంగం వారికి నిరాశాజనకం. వారం మధ్యలో శుభవార్తలు. ధన, వస్తులాభాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
నూతనోత్సాహంతో పనులు పూర్తిచేస్తారు. ఉద్యోగయత్నాలు సానుకూలం. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు లాభాల బాటలో సాగుతారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో దూరప్రయాణాలు. బంధువులతో వివాదాలు. ఆరోగ్యభంగం.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. బంధువుల సహాయం అందుతుంది. రుణబాధలు తొలగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆస్తి వివాదాలు తీరతాయి. గృహం, వాహనాలు కొంటారు. వ్యాపారులకు లాభాలు. ఉద్యోగులు పదోన్నతులు పొందుతారు. రాజకీయవర్గాలకు పురస్కారాలు. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారులు లాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. పనులలో జాప్యం.