వారఫలాలు: 5 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్, 2015 వరకు | astrology of the week april 5 to april 11, 2015 | Sakshi
Sakshi News home page

వారఫలాలు: 5 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్, 2015 వరకు

Published Sun, Apr 5 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:51 PM

వారఫలాలు: 5 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్, 2015 వరకు

వారఫలాలు: 5 ఏప్రిల్ నుంచి 11 ఏప్రిల్, 2015 వరకు

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. సోదరులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. గృహం, వాహనాలు కొంటారు. శుభకార్యాల రీత్యా ఖర్చులు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
 
 వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
 ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరం. ముఖ్య నిర్ణయాలు. శుభకార్యాలు నిర్వహిస్తారు. భూవివాదాలు తీరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో చిక్కులు తొలగే సమయం. రాజకీయవర్గాలకు పదవులు దక్కవచ్చు. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
 
 మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
 మొదట్లో చికాకులు నెలకొన్నా  క్రమేపీ తొలగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగు. సేవలకు గుర్తింపు. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో చికాకులు. అనారోగ్యం.
 
 కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
 కొత్త వ్యక్తుల పరిచయం. అరుదైన ఆహ్వానాలు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. వాహనాలు, భూముల కొనుగోలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. కుటుంబసమస్యలు.
 
 సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
 ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం, చికాకులు. బంధువులు, మిత్రులతో విభేదాలు. కొన్ని కార్యక్రమాలు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు నిరాశాజనకం. ఉద్యోగాలలో మార్పులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు.
 
 కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
 పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు. ప్రముఖులతో పరిచయాలు. పుణ్యక్షేత్ర సందర్శనం. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి సన్మానాలు. వారం చివరిలో దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం.
 తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
 శ్రమ ఫలిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఊహలు నిజం చేసుకుంటారు. చిన్ననాటి మిత్రులు, దూరపు బంధువుల కలయిక. వాహనాలు, ఆభరణాలు కొంటారు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో కుటుంబంలో చికాకులు. ధనవ్యయం.
 
 వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
 ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకం. కొత్త పనులకు శ్రీకారం. మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనం. ఒక ప్రకటన నిరుద్యోగులను ఆకట్టుకుంటుంది. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారంలో కొత్త ఆశలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో అనారోగ్యం. మిత్రులతో విభేదాలు.
 
 ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
 నూతన ఉద్యోగప్రాప్తి. పనులు సజావుగా సాగుతాయి. ఆర్థిక విషయాలు ఆశాజనకం. సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపార లాభం. ఉద్యోగులకు పదోన్నతి. కళారంగం వారికి అవార్డులు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఖర్చులు అధికం.
 
 మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
 ఆర్థిక పరిస్థితి మెరుగు. సన్నిహితుల సాయం. ఇంటర్వ్యూలు అందుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థుల కృషి ఫలిస్తుంది. వ్యాపారాలు ఉత్సాహవంతం. పదోన్నతి అవకాశాలు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో చికాకులు. అశాంతి.
 
 కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
 చికాకులు, అనుకోని ప్రయాణాలు. పనుల్లో జాప్యం జరిగినా విజయవంతం. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. పరిచయాలు పెరుగుతాయి. వాహనయోగం. వ్యాపారాలలో పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు విధుల్లో ప్రోత్సాహం. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో  బంధువులతో వివాదాలు. అనారోగ్యం.
 
 మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
 శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది. కొత్త పనులకు శ్రీకారం. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో లాభాలు అందుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో దూరప్రయాణాలు. సోదరులతో వివాదాలు.
 - సింహంభట్ల సుబ్బారావు
 జ్యోతిష్య పండితులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement