- సింహంభట్ల సుబ్బారావు, జ్యోతిష్య పండితులు
మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. రుణ ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా బాధ్యతలు పెరుగుతాయి. వేడుకల్లో పాల్గొంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. బంధువులతో ఉత్తరప్రత్యుత్తరాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పని. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహం. వారం ప్రారంభంలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.)
ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం. కొన్ని రహస్య విషయాలు గ్రహిస్తారు. రాబడి ఉత్సాహాన్నిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు, ఆస్తి వివాదాల నుంచి ఊరట. సోదరులు, సోదరీలతో సఖ్యత. వ్యాపారలాభం. ఉద్యోగులకుహోదాలు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం మధ్యలో చికాకులు. అనారోగ్యం.
మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక పరిస్థితి అనుకూలించదు. ఆస్తి వివాదాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దూరప్రయాణాలు. బంధువర్గంతో అకారణ విభేదాలు. ఆరోగ్యభంగం. వ్యాపారాల్లో స్వల్ప లాభం. ఉద్యోగులకు ఒత్తిడులు. వారం చివర శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
పనులు వాయిదా. శ్రమ తప్ప ఫలితం కనిపించదు. సోదరులతో వివాదాలు. ప్రయాణాలలో మార్పులు. కుటుంబంలో చికాకులు. పుణ్యక్షేత్ర సందర్శనం. వ్యాపారులకు నిరుత్సాహం. ఉద్యోగవర్గాలకు ఒత్తిడులు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం ప్రారంభంలో భూ, గృహయోగాలు. పనుల్లో విజయం.
సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి. సంఘంలో విశేష గౌరవం. ఆస్తి వివాదాలు కొలిక్కివస్తాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులు సైతం మిత్రులుగా మారతారు. ఇంటి నిర్మాణయత్నాలు సానుకూలం. విద్యార్థులు, నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు. ధనవ్యయం.
కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ప్రారంభంలో నెలకొన్న సమస్యలు క్రమేపీ పరిష్కారం. ఆస్తి ఒప్పందాలు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. జీవితాశయం నెరవేరుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. ఖర్చులు. అనుకోని ప్రయాణాలు.
తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహం. వ్యయప్రయాసలు. బంధువులు, మిత్రులతో స్వల్ప వివాదాలు. ఇంటి నిర్మాణం, కొనుగోలు యత్నాలు మందగిస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. దూరప్రయాణాలు. వ్యాపారాలు అంతగా లాభించవు. ఉద్యోగులకు పనిభారం. కళారంగం వారికి చికాకులు. వారం చివరిలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం.
వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఆర్థిక ఇబ్బందులు. కొత్తగా రుణాలు చేస్తారు. ప్రయాణాలు వాయిదా. ఇంటాబయటా బాధ్యతలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులు, మిత్రులతో వివాదాలు. ఆస్తి వ్యవహారాలు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పని ఒత్తిడి. వారం ప్రారంభంలో విందువినోదాలు. వాహనయోగం.
ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు. శ్రమ పెరుగుతుంది. కొన్ని పనులు వాయిదా. బంధువులతో వివాదాలు. అనుకోని ప్రయాణాలు. నిరుద్యోగుల యత్నాలు జాప్యం. వ్యాపార విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగులకు పని ఒత్తిడులు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.
మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
విజయాలు సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు. ఆలోచనలు కార్యరూపం. ఆస్తి వివాదాలు తీరతాయి. పనుల్లో పురోగతి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలం. విద్యార్థులకు శుభవార్తలు. ఉద్యోగులకు పదోన్నతులు. సన్మానాలు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా పూర్తి. రుణయత్నాలు. దూరప్రయాణాలు. బంధువులతో అకారణంగా వివాదాలు. ఆలోచనలు కలసిరావు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాల సందర్శనం. ఆరోగ్యపరంగా చికాకులు. ఉద్యోగులకు మార్పులు. పారిశ్రామికవర్గాలకు ఒత్తిడులు. వారం మధ్యలో శుభవార్తలు. ఆస్తి వివాదాల పరిష్కారం.
మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకం. సన్నిహితులు, శ్రేయోభిలాషుల సలహాలు స్వీకరిస్తారు. ముఖ్యమైన పనుల్లో విజయం. విద్యార్థులకు నూతనోత్సాహం. గృహ, వాహనయోగాలు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ. మీ సత్తా చాటుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో ముందడుగు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు. కళారంగం వారికి సన్మానాలు. వారం మధ్యలో ప్రయాణాలు, చికాకులు.