మేషం (అశ్వని, భరణి, కృత్తిక 1పా.)
ఆర్థిక లావాదేవీలు కొంత నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. పనులు నెమ్మదిగా సాగుతాయి. బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆలోచనలు అమలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. గృహ నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. నిరుద్యోగులకు ఊరట. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు లభించవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వివాదాలు. ధనవ్యయం.
వృషభం (కృత్తిక 2,3,4పా, రోిహ ణి, మృగశిర 1,2పా.)
కొత్త పనులకు శ్రీకార ం చుడతారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. చిరకాల మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల సూచనలు. రాజకీయ వర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వివాదాలు. ధనవ్యయం. అనారోగ్యం.
మిథునం (మృగశిర 3,4పా, ఆరుద్ర, పునర్వసు 1,2,3పా.)
పనుల్లో జాప్యం. కుటుంబంలో కొద్దిపాటి చికాకులు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. బంధువుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. నిరుద్యోగుల యత్నాలు మందకొడిగా సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. కళారంగం వారికి నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం.
కర్కాటకం (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
అనుకున్న విధంగా పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాల రీత్యా ఖర్చులు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కుతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు కొత్త హోదాలు. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో వివాదాలు.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1పా.)
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఆస్తి వివాదాల నుంచి విముక్తి లభిస్తుంది. వాహన, గృహయోగాలు. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు పదవీయోగం, సన్మానాలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు.
కన్య (ఉత్తర 2,3,4పా, హస్త, చిత్త1,2పా.,)
ఆర్థిక విషయాలలో పురోగతి ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు అనుకూలిస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు. కళారంగం వారికి సన్మానయోగం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు.
తుల (చిత్త 3,4పా, స్వాతి, విశాఖ1,2,3పా.)
పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యపరంగా చికాకులు. బంధువులు, మిత్రులతో వివాదాలు నెలకొంటాయి. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఇంటి నిర్మాణయత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో కొద్దిపాటి చికాకులు. ఉద్యోగులకు నిరుత్సాహం. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధన, వస్తులాభాలు.
వృశ్చికం (విశాఖ 4పా., అనూరాధ, జ్యేష్ఠ)
నూతనోత్సాహంతో పనులు పూర్తి చేస్తారు. సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు గుర్తింపు పొందుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి అవార్డులు దక్కే అవకాశం. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం.
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1పా.)
ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని కష్టసుఖాలు విచారిస్తారు. నూతన విద్య, ఉద్యోగావకాశాలు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం.ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు పదవీయోగం. వారం మధ్యలో వివాదాలు. అనారోగ్యం. దైవదర్శనాలు.
మకరం (ఉత్తరాషాఢ 2,3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1,2పా.)
ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. భూలాభాలు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం. కళారంగం వారికి మంచి గుర్తింపు రాగలదు. వారం చివరిలో ఆరోగ్యసమస్యలు. వివాదాలు. ఆలయాలు సందర్శిస్తారు.
కుంభం (ధనిష్ట 3,4పా, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పా.)
దీర్ఘకాలిక సమస్యలు తీరతాయి. పనుల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. విద్యార్థులు, నిరుద్యోగులకు కొత్త ఆశలు. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. ఉద్యోగులకు కొత్త హోదాలు దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. కుటుంబంలో చికాకులు. దూరప్రయాణాలు.
మీనం (పూర్వాభాద్ర 4పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. జీవిత భాగస్వామి ద్వారా ఆస్తిలాభం. గృహ నిర్మాణయత్నాలు సానుకూలం. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో దూరప్రయాణాలు. అనారోగ్యం.
- సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష పండితులు
వారఫలం: డిసెంబర్ 21 నుండి 27 వరకు
Published Sun, Dec 21 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 6:29 PM
Advertisement
Advertisement