వారఫలాలు | Varafalalu of the week dec 1 2018 | Sakshi
Sakshi News home page

వారఫలాలు

Published Sun, Dec 2 2018 2:37 AM | Last Updated on Sun, Dec 2 2018 2:37 AM

Varafalalu of the week dec 1 2018 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుట్టి నిర్దేశిత సమయానికి పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో చిక్కులు తొలగుతాయి. వివాహయత్నాలు సానుకూలం. స్థిరాస్తి వివాదాలు పరిష్కారం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో మీరు ఊహించిన మార్పులు ఉంటాయి. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, గులాబీ రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోíß ణి, మృగశిర 1,2 పా.)
మొదట్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురైనా క్రమేపీ తొలగుతాయి. ఆస్తి వ్యవహారాలలో తుది ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కారమవుతాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ చూపండి. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊపిరిపీల్చుకుంటారు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో వ్యయప్రయాసలు. సోదరులతో కలహాలు. నీలం, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
అనుకున్న పనులు కొంత నెమ్మదించినా పూర్తి కాగలవు. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వివాహాది శుభకార్యాలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ప్రముఖ వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. ఆరోగ్యం కొంత మందగించినా ఉపశమనం పొందుతారు. స్థిరాస్తి వివాదాలు కాస్త ఊరటనిస్తాయి. గృహ నిర్మాణాలు, కొనుగోలుపై దృష్టి సారిస్తారు. విద్యార్థులకు ఊహించని ఫలితాలు రావచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు ఉంటాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో మిత్రులతో విభేదాలు. లేత నీలం, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌స్తోత్రాలు పఠించండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
ఊహించని విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీరతాయి. ఆప్తుల నుంచి ఆహ్వానాలు రాగలవు. ఆస్తి వ్యవహారాలు సాఫీగా పరిష్కారమవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని గత స్మృతులు గుర్తుకు తెచ్చుకుంటారు. వాహన, గృహయోగాలు. కొన్ని నిర్ణయాలు అందర్నీ ఆశ్చర్యపరుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. కుటుంబంలో సమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం మధ్యలో ధనవ్యయం. ఆరోగ్యం మందగిస్తుంది. తెలుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీస్తోత్రాలు పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు ఎదురై చికాకు పరుస్తాయి. మిత్రులతో అకారణంగా విరోధాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో బాధ్యతలు పెరిగి సవాలుగా నిలుస్తాయి. విద్యార్థులు మరింత శ్రద్ధ వహించాలి. అనుకున్న పనులలో అవాంతరాలు ఎదురుకావచ్చు. ఆరోగ్యపరంగా చికాకులు. బంధువులతో ఆస్తి తగాదాలు నెలకొనే సూచనలు.  ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు. ఉద్యోగాలలో మార్పులు అనివార్యం కావచ్చు.  పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా పడవచ్చు.  వారం మధ్యలో శుభవార్తలు. ధనలాభం. ఉద్యోగయోగం. గులాబీ, లేత పసుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. శివాష్టకం పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ఈవారం విజయాల బాటలో పయనిస్తారు. నిరుద్యోగులు, విద్యార్థులకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పెద్దల సలహాలు స్వీకరించి తగు నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, గృహం కొనుగోలు యత్నాలు సానుకూలం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక కోర్టు వ్యవహారం తుది దశకు చేరుకుంటుంది. వ్యాపారాలలో అనూహ్యంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు దక్కవచ్చు. రాజకీయవర్గాల ఆశలు నెరవేరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. ధనవ్యయం. ఆకుపచ్చ, నేరేడు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తుతి మంచిది.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
ముఖ్యమైన వ్యవహారాలలో విజయం. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి. దీర్ఘకాలిక సమస్యలు, వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. మీలోని నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. ఆస్తుల వ్యవహారంలో ఒప్పందాలు చేసుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. పారిశ్రామికవర్గాలకు అప్రయత్న కార్యసిద్ధి. వారం ప్రారంభంలో కొద్దిపాటి ఆరోగ్యసమస్యలు. సోదరులతో వివాదాలు. నీలం, లేత ఆకుపచ్చ రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
ఏ పనిచేపట్టినా విజయవంతమే. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబసమస్యలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణాలపై నిర్ణయం తీసుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు రావచ్చు. బంధువుల మెప్పు పొందుతారు. ఎంతటి వారినైనా ఆకట్టుకుని ముందుకు సాగుతారు. వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు దక్కుతాయి. కళారంగం వారికి చిక్కులు తొలగుతాయి. వారం చివరిలో ధనవ్యయం. బంధువిరోధాలు. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. మిత్రులు, బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. గృహం కొనుగోలు ప్రయత్నాలు కొంతవరకూ అనుకూలిస్తాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. వ్యాపారాల విస్తరణలో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగాలలో ఒత్తిడులు తగ్గుతాయి. రాజకీయవర్గాలకు కొంత ఉపశమనం లభిస్తుంది. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొన్ని పనులు సమయానుసారం పూర్తి కాగలవు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖుల నుంచి కొంత సహాయం అందుతుంది. విద్యార్థులు మరింత ఉత్సాహంగా సాగుతారు. వ్యతిరేకులు సైతం మిత్రులుగా మారడం విశేషం. వాహనాలు, భూములు కొనుగోలులో ముందడుగు వేస్తారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు దక్కించుకుంటారు. కళారంగం వారికి సన్మానాలు జరుగుతాయి. నీలం, ఆకుపచ్చ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
మొదట్లో నెలకొన్న చికాకులు క్రమేపీ తొలగి ఊరట లభిస్తుంది. నేర్పుగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆస్తుల క్రయవిక్రయాల ద్వారా లబ్ధి పొందుతారు. జీవిత భాగస్వామితో వివాదాలు సర్దుబాటు కాగలవు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు అందుతాయి. వాహనయోగం. ఊహించని ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు తథ్యం. రాజకీయవర్గాలకు అనుకోని పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణదిశప్రయాణాలు అనుకూలం.  దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థికంగా గతం కంటే మెరుగైన పరిస్థితి ఉంటుంది. చేపట్టిన పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయులు, బంధువులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆలోచనలు అమలులో పెడతారు. వాహనయోగం. మీ నిర్ణయాలు అందర్నీ మెప్పిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. శాస్త్ర, పరిశోధనా విషయాలపై ఆసక్తి చూపుతారు. కళాకారుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కుతుంది. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలమవుతాయి. వారం మధ్యలో బంధువిరోధాలు. శ్రమ మరింత పెరుగుతుంది. ఎరుపు, ఆకుపచ్చ రంగులు.  తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.
- సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు

టారో( 2 డిసెంబర్‌ నుంచి  8 డిసెంబర్, 2018 వరకు)
మేషం (మార్చి 21 – ఏప్రిల్‌ 19)
కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటారు. మీ నిరాడంబరతే మీకు శ్రీరామరక్ష. అవరోధాలను అవలీలగా అధిగమిస్తారు. సవాళ్లను స్వీకరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో పోటీ వాతావరణాన్ని ఆస్వాదిస్తారు. మానసిక స్థైర్యాన్ని కూడదీసుకుంటారు. ఆత్మగౌరవాన్ని నిలుపుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పని ఒత్తిడి కారణంగా ఆరోగ్యం కాస్త మందగించే సూచనలు ఉన్నాయి. ప్రేమికుల మధ్య పొరపొచ్చాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల నుంచి ఫలితాలను పొందుతారు. ఆలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: బంగారు రంగు

వృషభం (ఏప్రిల్‌ 20 – మే 20)
సమస్యలు సద్దుమణుగుతాయి. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతలు పెరుగుతాయి. మీ వద్ద పనిచేసే ప్రతిభావంతులను ప్రోత్సహిస్తారు. ఇంటికి కొత్తగా అలంకరణలు చేస్తారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. నైపుణ్యాలను మెరుగుపరచుకునే దిశగా కృషి ప్రారంభిస్తారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. అనూహ్యమైన పరిస్థితుల్లో ప్రేమలో పడతారు. అదృష్టం కలిసొస్తుంది. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి. గురువుల ఆశీస్సులు పొందుతారు.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

మిథునం (మే 21 – జూన్‌ 20)
ఆశించిన లక్ష్యానికి చేరువవుతారు. సామాజికంగా గుర్తింపు పొందుతారు. వృత్తి ఉద్యోగాల్లో ప్రతిభను నిరూపించుకుంటారు. సత్కారాలను అందుకుంటారు. క్రియాశీలంగా ముందుకు సాగుతారు. ప్రేమికుల మధ్య అనుబంధం బలపడుతుంది. ప్రేమికులతో విహారయాత్రలకు వెళతారు. ఉన్నతమైన లక్ష్యాలను పెట్టుకుని, లక్ష్య సాధన దిశగా నిర్విరామంగా కృషి కొనసాగిస్తారు. సామాజికంగా పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. పలుకుబడి గల పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో ప్రశాంతత పొందుతారు.
లక్కీ కలర్‌: గులాబి

కర్కాటకం (జూన్‌ 21 – జూలై 22)
దశ మారబోతోంది. కలిసొచ్చే కాలం త్వరలోనే రానుంది. నిర్వర్తించవలసిన విధులపై పూర్తి ఏకాగ్రత సారించండి. వృత్తి ఉద్యోగాల్లో అద్భుతమైన విజయాలు మీ సొంతం కానున్నాయి. ఇదివరకటి శ్రమకు తగిన ఫలితాలను అందుకుంటారు. ఆత్మబంధువులాంటి వ్యక్తిని కలుసుకుంటారు. ఆధ్యాత్మిక చింతనను పెంచుకుంటారు. సేవా కార్యక్రమాలకు చేయూతనిస్తారు. మిత్రుల్లో ఒకరిని ఆపద నుంచి ఆదుకుంటారు. పిల్లలు సాధించిన విజయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబంతో కలసి తీర్థయాత్రలకు వెళతారు. ఏకాంతాన్ని కోరుకుంటారు.
లక్కీ కలర్‌: ఊదా

సింహం (జూలై 23 – ఆగస్ట్‌ 22)
అధ్యయనంపై అమితంగా దృష్టి సారిస్తారు. ఎంపిక చేసుకున్న అంశాలపై కూలంకషంగా పరిశోధనలు సాగిస్తారు. జ్ఞానమే సర్వస్వమని నమ్ముతారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో గుర్తింపు పొందుతారు. పందేలకు, జూదానికి దూరంగా ఉండటం క్షేమం. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ఆత్మీయుల మధ్య నెలకొన్న అపార్థాలు తొలగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శుభకార్యాలను నిర్వహిస్తారు. విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ప్రేమికులు ఊహల్లో విహరిస్తారు.
లక్కీ కలర్‌: లేతాకుపచ్చ

కన్య (ఆగస్ట్‌ 23 – సెప్టెంబర్‌ 22)
వృత్తి ఉద్యోగాల్లో నాయకత్వ హోదాను బలంగా కోరుకుంటారు. ఇంతవరకు ఒకరి అనుయాయిగా కొనసాగుతున్నందుకు మనస్తాపం చెందుతారు. అన్యాయానికి గురయ్యామనే భావన మిమ్మల్ని కొంత కుంగదీస్తుంది. పట్టుదలను పెంచుకుంటారు. వాగ్వాదాలకు దూరంగా ఉండటం మంచిది. పట్టు విడుపులు ప్రదర్శించి లౌక్యంగా పనులు చక్కబెట్టుకోవడమే మేలు. తెగే వరకు లాగాలనుకుంటే పరిస్థితులు చేయి దాటిపోయే అవకాశాలు లేకపోలేదు. మానసిక ప్రశాంతతను కోరుకుంటారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆలయాలను దర్శించుకుంటారు.
లక్కీ కలర్‌: తెలుపు

తుల (సెప్టెంబర్‌ 23 – అక్టోబర్‌ 22)
ఆర్థిక లావాదేవీల్లో కొంత ఉదారంగా వ్యవహరిస్తారు. వస్తు వ్యామోహం నుంచి బయటపడాలని భావిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో సత్తా చాటుకుంటారు. రహస్య శత్రువుల నుంచి ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉన్నాయి. పాత బాకీలను తీర్చేస్తారు. ఇంటి కొనుగోలు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. పాత మిత్రులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాలకు సంబంధించి కీలక సమాచారం తెలుసుకుంటారు. భావి పరిణామాలను ఎదుర్కోవడానికి మానసికంగా సిద్ధమవుతారు. విద్యార్థులకు ఏకాగ్రత లోపిస్తుంది. ప్రేమికులకు ఎడబాటు తప్పకపోవచ్చు.
లక్కీ కలర్‌: గులాబి

వృశ్చికం (అక్టోబర్‌ 23 – నవంబర్‌ 21)
వ్యాపారరంగంలోని వారికి అద్భుతమైన అవకాశాలు కలసి వస్తాయి. కొత్త కొత్త రంగాల్లోకి వ్యాపారాలను విస్తరిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విజయపథంలో దూసుకుపోతారు. జీవితంలోని తొలినాళ్లలో అనుభవించన కష్టాలను గుర్తు చేసుకుంటారు. కష్టాల్లో ఉన్న ఇతరులకు చేయూతనిస్తారు. ఆత్మావలోకనం చేసుకుంటారు. ఏకాంతాన్ని కోరుకుంటారు. ఉన్నతమైన లక్ష్యాలను సాధిస్తారు. విలాస వస్తువులను కొనుగోలు చేస్తారు. కోరుకున్న రీతిలో ఇంటిని మరింత అందంగా తీర్చిదిద్దుకుంటారు. కొత్త వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి.
లక్కీ కలర్‌: నారింజ

ధనుస్సు (నవంబర్‌ 22 – డిసెంబర్‌ 21)
కలలను సాకారం చేసుకోవడానికి కఠిన శ్రమకు సిద్ధపడతారు. వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో పదోన్నతులు దక్కించుకునే సూచనలు ఉన్నాయి. దొరికిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకోండి. అద్భుతమైన ఫలితాలు త్వరలోనే లభిస్తాయి. పాత మిత్రులను కలుసుకుని జ్ఞాపకాలను కలబోసుకుంటారు. పని ఒత్తిడికి దూరంగా విహార యాత్రలకు వెళతారు. వ్యాయామంపై దృష్టి సారిస్తారు. భాగస్వామ్య వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. వ్యాపార విస్తరణ కోసం కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. ఆసరా లేని వృద్ధులను ఆదుకుంటారు.
లక్కీ కలర్‌: ఇటుక రంగు

మకరం (డిసెంబర్‌ 22 – జనవరి 19)
ఇంటా బయటా విపరీతమైన ఒత్తిడి తప్పకపోవచ్చు. పనిభారం కారణంగా తీరిక దొరకడమే గగనమవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో పోటీ ఎదురవుతుంది. ప్రణాళికల రూపకల్పన కోసం మరింత సమయాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. పరిస్థితులను మెరుగుపరచుకోవడానికి అహరహం శ్రమిస్తారు. విద్యార్థుల్లో ఏకాగ్రత లోపిస్తుంది. ప్రేమ వ్యవహారాల్లో సైతం అనూహ్యంగా పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. దూర ప్రయాణాల కోసం ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంట్లోని ఒకరి ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల కలవరానికి గురవుతారు.
లక్కీ కలర్‌: పసుపు

కుంభం (జనవరి 20 – ఫిబ్రవరి 18)
ఆరోగ్యం మెరుగుపడుతుంది. జవసత్వాలను పుంజుకుని ఉత్సాహంతో ఉరకలేస్తారు. కొత్త విశేషాలను తెలుసుకుంటారు. వృత్తి ఉద్యోగాల్లో పరిస్థితులు నిలకడగా ఉంటాయి. మిత్రుల నుంచి ఆర్థిక సాయం అందుతుంది. సృజనాత్మక రంగాల్లోని వారు అద్భుతంగా రాణిస్తారు. సామాజికంగా గుర్తింపు పెరుగుతుంది. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రియతములను కానుకలతో ముంచెత్తుతారు. కుటుంబంతో కలసి పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటారు. అదృష్టం కలసి రావడం వల్ల గడ్డు పరిస్థితుల నుంచి బయటపడతారు.
లక్కీ కలర్‌: ఆకుపచ్చ

మీనం (ఫిబ్రవరి 19 – మార్చి 20)
అనవసరపు ఆందోళనలన్నీ తొలగిపోతాయి. ఆత్మబలంతో అవరోధాలను అధిగమిస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు చోటు చేసుకునే సూచనలు ఉన్నాయి. అదనపు ఆదాయ మార్గాల కోసం చేసే అన్వేషణ ఫలిస్తుంది. ఒక లాభసాటి అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు. మిత్రుల్లో ఒకరి సలహాల కారణంగా భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దుకుంటారు. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. శత్రువర్గం మీకు వ్యతిరేకంగా వదంతులను ప్రచారం చేసే సూచనలు ఉన్నాయి. ప్రియతములతో అనుబంధం మరింతగా బలపడుతుంది.
లక్కీ కలర్‌: నీలం
- ఇన్సియా టారో అనలిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement