అదృష్టం మీ వెన్నంటే ఉంది | Luck is on your HTC Sense | Sakshi
Sakshi News home page

అదృష్టం మీ వెన్నంటే ఉంది

Published Fri, Jul 17 2015 11:03 PM | Last Updated on Fri, Jun 1 2018 7:37 PM

అదృష్టం మీ వెన్నంటే ఉంది - Sakshi

అదృష్టం మీ వెన్నంటే ఉంది

టారో బాణి
 
ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
మీరేమిటో, మీ సత్తా ఏమిటో నిరూపించుకోవలసిన వారమిది. మీరు ఏమీ తెలియని వారు, అమాయకులు అనుకున్న వారు మిమ్మల్ని చూసి షాకయ్యేవిధంగా ప్రవర్తిస్తారు. మనసులో ఒకటి, బయటికి ఒకటి అన్నట్లుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే మీలో ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అన్నింటినీ అధిగమిస్తారు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ

 
టారస్ (ఏప్రిల్ 21-మే 20)
మీ వ్యాపారం గాడిన పడుతుంది. పొదుపు చేయడానికి ఇది తగిన సమయం. కొత్త అవకాశాలు వస్తాయి.  అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ మనసుకీ, శరీరానికీ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోండి. గట్టి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. కలిసొచ్చే రంగు: నీలం

 
జెమిని (మే 21-జూన్ 21)
మీ పనిలో విజయం సాధిస్తారు. అధికారంలోకి రావడానికి, మీ ఉనికిని చాటుకోవడానికీ తగిన పనులు చేపడతారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో కలతలు రేగకుండా జాగ్రత్త పడండి. అనవసరంగా వాదోపవాదాలకు దిగకండి. వాదనలు పెట్టుకున్నారంటే వివాదాలు తెచ్చిపెట్టుకున్నట్లే. కలిసొచ్చే రంగు: పీచ్

 
క్యాన్సర్ (జూన్22-జూలై 23)
కెరీర్‌పరంగా ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. పోటీని, అధికారుల ఒత్తిళ్లను అధిగమించడానికి నిరంతరం శ్రమించ వలసి వస్తుంది. లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు, నిర్ణయాలను, ఆలోచనలను వెంటనే అమలులో పెట్టడానికి ప్రయత్నించండి. లేకుంటే ఇతరులు వాటిని తమవని చెప్పుకుని పబ్బం గడుపుకుంటారు. కలిసొచ్చే రంగు: నారింజ రంగు

లియో (జూలై 24-ఆగస్టు 23)
లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకెదురవుతున్న సవాళ్లేమిటో విశ్లేషించుకుని, వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక వేసుకోండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. అదృష్టం ఈ వారం మీ వెన్నంటే ఉంటుంది. పగటి కలలలో తేలిపోకుండా ప్రేమ విషయంలో నిజాయితీగా వ్యవహరించండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ
 
వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
మీ ప్రేమ విషయంలో మీకు ఎదురవుతున్న సవాళ్లు, చిక్కుముడులు వీడిపోయి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. జీవితమన్నాకఒడుదొడుకులు, సమస్యలు, సవాళ్లు సహజం. చంద్రుడికే వృద్ధిక్షయలు తప్పట్లేదు మరి! అలాంటిది మనమెంత? మీకెదురవుతున్న సమస్యలపై సమర శంఖం పూరించండి. కాలాన్ని వృథా చేయకండి. కలిసొచ్చే రంగు: తెలుపు

లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
మీ లక్ష్యం నెరవేరుతుంది. విజయం చేకూరుతుంది. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అయినా కూడా అహంకరించ వద్దు. మరింతగా శ్రమించండి. మీ బుర్రకు మరింతగా పదును పెట్టండి. ప్రేమలో పడే అవకాశం ఉంది. అయితే అన్నింటికన్నా కెరీరే ప్రధానమని తెలుసుకోండి. లక్కీ కలర్: నిమ్మపండు రంగు

స్కార్పియో  (అక్టోబర్ 24-నవంబర్ 22)
ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోండి. అయితే ఇతరులెవరికీ సాధ్యం కాని వాటినే లక్ష్యంగా తీసుకోకండి. పరాయి వాళ్లతో సంబంధాల ద్వారా ఫ్రశాంతతని వెదుక్కోకండి. ప్రశాంతత మీలోనే ఉందని గ్రహించండి. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లను మళ్లీ చేయకండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యాన్ని పాటించండి. కలిసొచ్చే రంగు: మెజెంటా
 
శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
రకరకాల ధోరణుల నుంచి, చికాకుల నుంచి స్పష్టత కోరుకుంటారు. పని విషయంలో ఒక విధమైన అనిశ్చితి, అస్థిమితత మిమ్మల్ని వెంటాడతాయి. తన పట్ల మీరు చూపుతున్న ఆసక్తికి, శ్రద్ధకు మీ జీవిత భాగస్వామి చాలా సంతృప్తి చెందుతారు. ఆరోగ్యం కుదుటపడు తుంది. సానుకూల భావనలు మిమ్మల్ని ఉత్తేజంగా మారుస్తాయి. కలిసొచ్చే రంగు: క్రీమ్
 
క్యాప్రికార్న్  (డిసెంబర్ 22-జనవరి 20)
విశ్రాంతి కావాలని మీ మనసు బలంగా కోరుకుంటోంది. మీ మనసుకు నచ్చిన వారితో ఏకాంతంగా గడపండి. పని విషయంలో మాత్రం తెలివిగా వ్యవహరించండి. తమ బాధ్యతలను సహోద్యోగులు మీ నెత్తిమీదకు తోయవచ్చు. నిర్మొహమాటంగా ఉండండి. వారమంతా ఆహ్లాదంగా, ఆనందంగా గడపండి. కలిసొచ్చే రంగు: నారింజ

అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
పెట్టుబడుల విషయంలో మీ ముందుచూపు మీకెంతో సాయం చేస్తుంది. మీరు ఎంత ఆలోచనాపరులైనప్పటికీ భావోద్వేగాల విషయంలో మిమ్మల్ని మీరు అదుపు చేసుకోలేరు. వేగంగా ముందుకు వెళ్లండి. మీకు బాగా కలిసి వస్తుంది. సాయంకాలం పూట హాయిగా సేదతీరడం మిమ్మల్ని చురుగ్గా తయారు చేస్తుంది.  కలిసొచ్చే రంగు: వంకాయరంగు
 
పైసిస్  (ఫిబ్రవరి 20-మార్చి 20).
మీరు ఎంతో సమయస్ఫూర్తి గల వారని నిరూపించుకునే వారమిది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. పనిలో మీకెన్నో ప్రతిబంధకాలున్నప్పటికీ వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమిస్తారు. అంతేగాదు, మీ నిజాయతీని, నిక్కచ్చితనాన్ని కూడా చాటుకుంటారు. బంధువుల విషయంలో తీవ్రమైన నిరాశ ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: లేత నీలం
 ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్
 
 
సౌర వాణి


ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20)
మీ సంతానం దగ్గర ఉంటూ కూడా మీ పెత్తనాన్నే కొనసాగించాలని అనుకోకండి. ప్రతికూలత పెరిగే సూచనలున్నాయి. ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. తాత్కాలికంగా కలగబోయే అనారోగ్యం కారణంగా ‘దూరపు చూపు’ అనుకుంటూ ఆస్తులని గురించిన నిర్ణయాలని చేసేయకండి. తీవ్రమైన పరిణామాలు ఎదురుకావచ్చు.

టారస్ (ఏప్రిల్ 21-మే 20)
పిల్లలకి చదువులో కొంత అనాసక్తి నిరుత్సాహం చోటుచేసుకునే ప్రమాదమున్నందున వాళ్లని శ్రద్ధగా గమనిస్తూ ఉండండి. చెప్పుకోదగ్గ పరిణామాలేవీ ఈ వారంలో ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఉండండి. తీర్థయాత్రలకీ పుణ్యక్షేత్రాలకీ వెళ్లాలనుకుంటారు గానీ అది సాధ్యపడక పోవచ్చు. అంతమాత్రాన నిరుత్సాహపడకండి.

జెమిని (మే 21-జూన్ 21)
మీ పై అధికారులు మిమ్మల్ని కావాలని మరోచోటుకి ఇష్టంతో బదిలీ చేస్తూ జీతంలో పెంపుదల కూడా చేస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు అంతంతమాత్రంగా ఉండచ్చు ఈ వారంలో. శత్రు బాధ తగ్గుతుంది. అత్తమామలతో సంబంధం చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారస్థులకి బేరాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పెట్టుబడులు ఈ వారంలో సరికాదు.

క్యాన్సర్ (జూన్22-జూలై 23)
అపరిష్కృత సమస్య మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏదైనా కొందామనుకునే ఆలోచన అమలులోకి రాకపోవచ్చు. జీవిత భాగస్వామి వ్యతిరేకత కారణంగా నిరుత్సాహపరులుగా మీరుండచ్చు. తీర్థయాత్రకి వెళ్లే అవకాశముంది. ప్రయాణాల్లో వస్తువులు, ధనం, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.  

లియో (జూలై 24-ఆగస్టు 23)
ఈ వారం అనుకూలంగా గడుస్తుంది. ఇలాంటి సమస్యలని వీలైనంత శీఘ్రకాలంలో పరిష్కరిం చుకోవడం మంచిది. దుర్వ్యసనాల జోలికి వెళ్లద్దు. జరిగిన అనుభవాల్ని నెమరేసుకుని రాబోయే నెల అయినా అనుకూలంగా ఉండాలని భావిస్తూ మరింత ఎక్కువసేపు వ్యాపారాలు చేసుకోవ డం మంచిది. అపనిందల పాలయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి.

వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23)
మీ సంస్థలో ఉద్యోగులుగా బంధువుల నుండి వీలైనంతవరకూ ఎంపిక చేసుకోకుండా ఉండటం మంచిది. కొత్త వ్యాపారమే కాదు, వ్యాపార విస్తరణ పేరిట మరో ప్రదేశంలోనూ ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఆదాయ వ్యయాలకి సంబంధించిన లావాదేవీలు పన్నుల శాఖకి సరిపోయే తీరులో ఉన్నదీ లేనిదీ గ్రహించుకోండి.

 లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23)
ఎదుటివారి మీద దాడిచేసి న్యాయస్థానాల వెంబడి తిప్పి సాధించుకోవాలనే ప్రయత్నం మంచిది కాదు. మీకు కలిగిన బాధని సూటిగా ఆ బాధపెట్టిన వ్యక్తులకే చెప్పిన పక్షంలో పరిష్కారం లభిస్తుంది. వినోద రంగంలో చేరాలనే ఆలోచన నెరవేరకపోవచ్చు. మొత్తానికి మీరున్న చోటునే మీరుంటారు. ప్రస్తుతానికి మార్పు, ఎదుగుదల ఉండవు.

స్కార్పియో  (అక్టోబర్ 24-నవంబర్ 22)
మనోవ్యధ ఉన్నా మీ పనిని మీరు చేసుకుపోతుంటారు. మీ రంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ధర్మబద్ధ ప్రవర్తన మీకు సత్ఫలితాలనే ఇస్తుంది. విద్యార్థులైనట్లయితే చదువు మీద ఆసక్తి తగ్గిపోవచ్చు. ఉద్యోగస్థులైతే మానసిక ఆందోళన ఉండవచ్చు. అదే అవివాహితులైతే వివాహానికి ఏ సంబంధమూ సరైనది రాకపోవచ్చు.

శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21)
మీరు పనిచేస్తున్న సంస్థతోనే విరోధించే అవకాశం కన్పిస్తోంది. పట్టుదల, కోపం, ప్రతీకార బుద్ధి అనేవి వ్యక్తిని నిరంతరం ఆలోచింపజేస్తూ చేయవలసిన కర్తవ్యం పట్ల శ్రద్ధని, ఆసక్తిని పూర్తిగా మర్చిపోయేలా చేస్తాయి. గమనించండి. జీవితం మీది తప్ప మీకు సలహాలనిచ్చే ఇతరుల ఆధిపత్యానికి లోబడి ఉండాల్సింది కాదు.

క్యాప్రికార్న్  (డిసెంబర్ 22-జనవరి 20)
మీ కృషి మీకు అండగా నిలుస్తుంది. నిరుత్సాహాన్ని వీడి కార్యరంగంలోకి దూకుతారు. ఉత్సాహంగా పనుల్ని పూర్తిచేస్తారు. మాటలో కాఠిన్యం తగ్గించుకోవడం మంచిది. రుణాలు తీరిపోయాయనే ధైర్యంతో కొత్త రుణాన్ని చేసి వస్తు వాహనాలని సమకూర్చుకోవాలనే ఆలోచనని విరమించండి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు.

అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19)
శుభకార్యాల కోసం తగిన ప్రయత్నాలని చేసుకుంటారు. సంతానం చదువు బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా కొంత వెనుకబాటుతనంతో ఉన్నా ఎప్పటికప్పుడు పనులు పూర్తిచేసుకుంటూ ఉంటారు. అంతగా అవసరమనిపిస్తే బంధువుల నుండి మాత్రమే రుణం

పైసిస్  (ఫిబ్రవరి 20-మార్చి 20).
వినోద రంగం వారైనట్లయితే కీర్తి పురస్కారాలకి అవకాశముంది. భూ గృహ సంబంధమైన ఆలోచనల్ని చేయవచ్చు గాని ఈ వారంలో ఫలించకపోవచ్చు. సంతానపు వివాహ చర్చలు కొంతవరకూ ఫలవంతమౌతాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. క్రయ విక్రయాలు ఈవారంలో మంచిది కాదు. దానధర్మాలు చేస్తారు. పుణ్యకార్యాలని నిర్వహిస్తారు.
 
డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement