analysis
-
ఆన్లైన్ ఫుడ్ క్రేజ్..! ఎంతలా ఆర్డర్లు ఇస్తున్నారంటే..
భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం..వ్యాపార నిమిత్తం ఉదయం నుంచి ఉరుకుల పరుగులమయం.. రాత్రి ఎప్పటికో ఇంటికి చేరే వైనం.. దీనికితోడు పిల్లల అభ్యున్నతికి ఆరాటం.. నిత్యం బతుకు పోరాటం.. ఇదీ నేటి నగర జీవనం.. ఈ స్థితిలో వంట తయారీకి దొరకని సమయం.. కొత్తజంటలకు వంట చేయడం తెలియనితనం.. వెరసి..హోటళ్లలో భోజనమే ఆధారం..అక్కడి వరకూ వెళ్లడానికి ఓపిక లేనితనం.. ఆన్లైన్ భోజనం ఆరగించడానికే మొగ్గు చూపుతున్న జనం. ఫలితం రోజురోజుకూ పెరుగుతున్న ఇంటి వద్దకే భోజనం సంప్రదాయం. నగర జీవనం బిజీబిజీగా గడుస్తోంది. మెరుగైన జీవనం కోసం భార్యాభర్తలిద్దరూ కష్ట పడాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగులుగానో.. వ్యాపారం వైపో పరుగులు పెడితేగాని కుటుంబాలు ముందుకు సాగడంలేదు. ఈ క్రమంలో పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు, బిజీలైఫ్‌తో మహిళలు వంటగది వైపునకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. పిల్లలు, కుటుంబం, ఉద్యోగం ఇతర పనుల్లోనూ మహిళలు భాగస్వాములు కావడంతో వంట అదనపు భారం అవుతోంది. ఈ క్రమంలోని ఎక్కువ కుటుంబాలు ఆన్లైన్ ఫుడ్‌పై ఆధారపడుతున్నాయి. ఇక సెలవు రోజుల్లో సరదాగా గడిపేందుకు కుటుంబ సమేతంగా హోటల్లోకి వెళ్లి పూట గడిపేస్తున్నాయి. మరికొందరు అన్నం వండుకుని కర్రీలు తెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో తిరుపతి నగరంతోపాటు జిల్లాలోని కొన్ని పట్టణాల్లో ఆన్లైన్ డెలివరీ ఇచ్చే జొమోటో, స్విగ్గీ వంటి సంస్థలు విస్తరించాయి. ఇంట్లో కూర్చొని కావాల్సిన ఆహారం నచ్చిన హోటల్ నుంచి తెప్పించుకోవడం చాలా మందికి ఫ్యాషన్‌గా మారింది. ఈ క్రమంలోనే ఫుడ్ డెలివరీ క్రమేణా పెరుగుతోంది. నగరంలో ఆన్లైన్ ఆహారంపై ఆధారపడిన వారి వివరాలను ఓ సర్వే సంస్థ అంచనా వేసింది. విలాస జీవనానికి కొత్త జంటల ఆరాటం కొత్త జంటలు విలాసవంత జీవనానికి అలవాటు పడ్డాయి. దీనికితోడు పలువురు యువతులు పుట్టింట్లో వంటల ఓనమాలు నేర్చుకోకుండా అల్లారు ముద్దుగా పెరుగుతున్నారు. ఈ క్రమంలో అత్తారింట సైతం అలానే కొనసాగాలనే ఉద్దేశంతో పెళైన కొత్తలోనే వేరు కాపురాలు పెడుతున్నారు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఆన్లైన్ ఆర్డర్లు, హోటళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. మరికొందరు కొత్తగా కాపురం పెట్టి వంట చేసుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కొందరు యూట్యూబ్ చానళ్లు చూసి వంట పాఠాలు నేర్చుకోవడానికి ప్రయతి్నస్తున్నారు. వండిన వంట రుచికరంగా లేకవపోవడంతో అబ్బాయిలు ఆమాడదూరం వెళ్లిపోతున్నారు. దీంతో వంట తంట నుంచి తప్పించుకునేందుకు ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్ ఆర్డర్ల వైపు మొగ్గు కుటుంబ వ్యవహారాలతోపాటు ఉద్యోగ బాధ్యతల్ని నిర్వర్తిస్తూ పురుషులతోపాటు మహిళలు సైతం అలసిపోతున్నారు. ఒత్తిడి కారణంగా ఇంటికి వచ్చి వంట చేసే ఓపిక లేక చాలా మంది మహిళలు వంట తయారీపై ఆసక్తి చూపడం లేదు. అన్నం, కూరలు లేదా టిఫిన్ కర్రీలను వండుకునేందుకు గంటకుపైగా సమయం పడుతుంది. ఆ సమయంలో పిల్లలతో గడపడం, విశ్రాంతి తీసుకోవడం, ఇంట్లో ఇతర పనులను చక్కబెట్టుకునేందుకు మహిళలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్లపై కు టుంబ సమేతంగా మొగ్గు చూపుతున్నారు. నగరంలోని ప్రముఖ హోటళ్లు జొమోటా, స్విగ్గీ సేవలను అందుబాటులో ఉంచడంతో ఆన్లైన్ రేటింగ్ ఆధారంగా హోటల్‌ను ఎంపిక చేసుకుని నచ్చిన ఆహారం తెప్పించుకుంటున్నారు. అలానే మరి కొన్ని హోటళ్ల లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుంటే నేరుగా ఇంటికి తెచ్చించే వెసులుబాటును యజమానులు కల్పించారు. ఆర్డర్ పెట్టుకున్న అర్థగంటలోపే ఇంటికే నచ్చిన ఆహారం తెప్పించుకుని ఆరగిస్తున్నారు. 40 శాతం కుటుంబాలు ఆన్లైన్ ఆహారంతో గడిపేస్తున్నారు. హోటల్‌కు వెళ్లడం ఫ్యాషన్ సెలవు రోజులు, ఇతర ప్రత్యేక దినాలు, కుటుంబంలో ఎవరికైనా పుట్టిన రోజు వంటివి ఉన్నప్పు డు కుటుంబ సమేతంగా, మరికొందరు బంధుమిత్రులతో కలిసి హోటళ్లకు వెళ్లి తినడం ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. సాయంత్రం పూట అలా బైక్‌లో నో కారులోనో వెళ్లి హోటల్లో కొంతసేపు సరదాగా గడిపి, ఎవరికి నచ్చిన ఆహారం వారు తినేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. బ్యాచిల ర్లు రూమ్‌ల్లో అన్నం వండుకుని కర్రీలు తెచ్చుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. డబ్బు పొదుపులో భాగంగా బ్యాచిలర్లు కర్రీ పాయింట్లపైన ఆధారపడుతున్నారు. అలానే రుచికరమైన ఆహారాన్ని ఇష్టపడే ఆహారప్రియులు రోజూ హోటల్ నుంచి తప్పించుకుని లాగియిస్తున్నారు. పిల్లలు, యువత ముఖ్యంగా రుచికరమైన ఆహారం వైపు ఆకర్షితులవుతున్నారు. తిరుపతి నగరంలో 11 గంటలకు అన్ని హోటళ్లు బంద్ చేస్తున్నారు. అయితే ఆన్లైన్ ఫుడ్ మాత్రం అర్ధరాత్రి ఒంటిగంట వరకు దొరుకుతుంది. ఆన్లైన్ ఆహారం వివరాలివీ.. మహిళా ఉద్యోగులు 12,875 నూతన జంటలు 2,140 భార్యాభర్తలిద్దరూ ఉద్యోగులైన కుటుంబాల సంఖ్య 7,396 బ్యాచులర్లు 10,250 విశ్రాంత ఉద్యోగులు 3,256 ఒంటరి మహిళలు, పురుషులు 895 వ్యాపారవేత్తలు 1,276 సందర్భం ఆధారంగా ఆన్‌లైన్‌ను ఆశ్రయిస్తున్నవారు 2,564 ఇంటి వంటతోనే ఆరోగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే.. ఇంటి వంటలతో పరిపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది. అయితే కాలానుగుణంగా ఇళ్లలో ఒత్తిడి పెరగడం, తీరికలేని జీవనంతో వంటగదికి వెళ్లేందుకు కొంతమంది ఆసక్తి చూపడం లేదు. ఈ విషయాన్ని తప్పు పట్టాల్సిన పరిస్థితి లేదు. ఉన్న సమయంలో ఇంట్లోనే వంట వండుకుని తినేందుకు ఆసక్తి చూపాలి. బయటి రుచులకు అలవాటు పడితే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్లే. రుచికరమైన ఆహారంతో అనారోగ్యం తప్పదు. పిల్లలకు ఇంట్లో ఆహారంపై ఆసక్తి పెంచేందుకు తల్లిదండ్రులు చొరవ చూపాలి. –డాక్టర్ మంజువాణి, పోషకాహార నిపుణురాలు, తిరుపతి కొత్తగా పెళ్లి అయ్యింది..వంట సరిగ్గా రాదు మాకు కొత్తగా పెళ్లి అయ్యింది. ఏడాది కావస్తోంది. వంట చేయడం రాదు. ఎంటెక్ వరకు చదివాను. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నా ను. నా భర్త నగరంలోని ఓ కార్పొరేట్ కళాశాలలో అధ్యాపకుడు. ఇద్దరికీ వంట చేయడం తెలియకపోవడంతో ప్రతిరోజు ఆన్లైన్ ఆర్డర్లతోనే జీవితాన్ని కొనసాగిస్తున్నాం. సెలవు రోజుల్లో మాత్రం వంట ప్రయోగాలు చేస్తుంటాం. తప్పని పరిస్థితి. –సరళ, ప్రైవేటు ఉద్యోగిని, తిరుపతి ఇద్దరం ఉద్యోగులం తప్పని పరిస్థితి మాది కర్నూలు. నా కు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. నా భర్త ఓ ప్రైవేటు కంపెనీ లో ఉద్యోగం చేస్తా రు. ఇద్దరం ఉద్యోగులం కావడంతో ఉదయమే విధులకు హాజరు కావాలి. దీంతో ఆదివారం సెలవు దినాలలో తప్ప ఇంట్లో వంట వండుకునేందుకు అవకాశం దొరకదు. దీంతో మాకు ఆన్లైన్ ఆర్డర్లే గతి. ఏమీ చేయలేని పరిస్థితి. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు.–పార్వతి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని, తిరుపతి (చదవండి: పుట్టుకతో తోడై..జీవితం సూదిపోటై!) -
చాట్‌జీపీటీకి ‘గ్రోక్’ స్ట్రోక్!
కృత్రిమ మేధ (AI) రంగం కొత్తపుంతలు తొక్కుతూ శరవేగంగా పురోగతి సాధిస్తున్న సమయంలో.. రెండు ప్రముఖ టెక్ కంపెనీల మధ్య పోటీకి దారితీసింది. కృత్రిమ మేధ ఫలాలను సామాన్యులకు సైతం పరిచయం చేసి, టెక్ రంగంలో సంచలనం సృష్టించిన ‘చాట్‌జీపీటీ(ChatGPT)’కి పోటీగా సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్(X)’అధినేత ఎలన్ మస్క్‌కు చెందిన ‘గ్రోక్(Grok)’తెరపైకి దూసుకొస్తోంది. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్ఏఐ’సంస్థ ద్వారా గత ఏడాది నవంబర్ 3న ‘గ్రోక్’ను మార్కెట్లోకి తెచ్చారు. చాట్‌జీపీటీ, గ్రోక్ రెండూ ఏఐ టూల్స్ అయినా రెండింటి మధ్య ఎన్నో వైవిధ్యాలు ఉన్నాయి. తమకు ‘గ్రోక్’బాగా నచ్చిందని, ‘చాట్‌జీపీటీ’సబ్‌స్క్రిప్షన్‌ను వదిలేసుకుని ఇకపై గ్రోక్నే వినియోగిస్తామని ‘ఎక్స్’లో కొందరు పోస్టులు పెడుతుండగా.. ఎలన్ మస్క్ వాటిని షేర్ చేస్తూ ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజానికి కృత్రిమ మేధ రంగంలో అగ్రగామిగా ఉన్న ‘చాట్‌జీపీటీ’కి గ్రోక్ పోటీ ఇవ్వగలదా అన్నది భవిష్యత్తులో తేలిపోనుంది.ప్రస్తుతానికి చాట్జీపీటీదే ఆధిపత్యం..‘గ్రోక్’తాజా వెర్షన్‌కు ఆధారం ఎక్స్ఏఐకి చెందిన గ్రోక్–2 మోడల్. ఉచితంగా ఏఐ ఆధారిత సేవలు అందిస్తున్న ఇతర టూల్స్‌తో పోల్చితే పనితీరు, సామర్థ్యంలో ఇది ముందంజలో ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కొన్ని అంశాల్లో ‘చాట్‌జీపీటీ’ఉచిత వెర్షన్ (GPT 3.5)ను సైతం గ్రోక్ అధిగమించినట్టు పలు పరీక్షల్లో తేలిందని అంటున్నారు. అయితే ‘చాట్‌జీపీటీ ప్లస్’వెర్షన్లో ఉపయోగించే ‘జీపీటీ–4’మోడల్ సామర్థ్యంతో పోల్చితే ‘గ్రోక్’వెనకబడే ఉందని స్పష్టం చేస్తున్నారు. మార్కెట్లో ఎక్కువ కాలం నుంచి కొనసాగుతుండటంతో పాటు గణనీయ స్థాయిలో డేటాతో శిక్షణ ఇచ్చిన నేపథ్యంలో చాట్‌జీపీటీ ప్రత్యేకంగా నిలుస్తోందని.. వినియోగదారులకు అవసరమైన సేవల నుంచి సృజనాత్మక రచనల వరకు విస్తృత శ్రేణిలో సృజన చూపగలుగుతోందని పేర్కొంటున్నారు.హాస్యాన్ని మేళవించి.. సమాచారం అందించే గ్రోక్..గ్రోక్ హాస్యాన్ని మేళవించి సరదా సంభాషణలతో, కొంతవరకు తిరుగుబాటు వైఖరిని కూడా మేళవించి సమాధానాలు ఇస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు. ఇతర ఏఐ టూల్స్ చెప్పలేకపోయే ఘాటైన ప్రశ్నలకు సైతం సమాధానమిచ్చేలా దీనిని రూపొందించామని అంటున్నారు. రాజకీయ అంశాల విషయంలో గ్రోక్ ధోరణి అందరికి నచ్చకపోవచ్చని.. అందుకే రాజకీయంగా పూర్తిగా సరైనది కాదని పేర్కొంటున్నారు. మరోవైపు చాట్‌జీపీటీ తటస్థంగా, మర్యాదపూర్వకంగా, సమగ్రమైన ధోరణిలో స్పందిస్తుంది.రియల్ టైమ్‌లో గ్రోక్ పైచేయిగ్రోక్ సామాజిక మాధ్యమం ఎక్స్ నుంచి రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరించి వర్తమాన అంశాలు, సరళులపై తాజా సమాచారాన్ని అందించగలుగుతుంది. అవసరమైతే ఇంటర్నెట్లోనూ రియల్ టైమ్ సమాచారాన్ని సేకరించి విశ్లేషిస్తుంది. ఈ అంశంలో గ్రోక్ ముందంజలో ఉంది. చాట్‌జీపీటీ అత్యంత శక్తివంతమైనదే అయినా ‘గ్రోక్’తరహాలో రియల్ టైమ్ అప్డేషన్ లేదు. కటాఫ్ తేదీ (2021)కి ముందు నాటి సమాచార పరిజ్ఞానాన్ని మాత్రమే చాట్‌జీపీటీ వినియోగించి సేవలు అందిస్తుంది. అయితే డబ్బులు చెల్లించి సబ్ర్‌స్కయిబ్ చేసుకునే ప్రీమియం వెర్షన్ (చాట్‌జీపీటీ ప్లస్) దీనికి మినహాయింపు.గ్రోక్ ‘ఎక్స్’లోనే.. జీపీటీ అన్నిచోట్లా..గ్రోక్ ప్రస్తుతం ‘ఎక్స్’యాప్‌లోనే సమ్మిళితమై సేవలందిస్తోంది. అంటే ‘ఎక్స్’వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి ఉంది. దీనిని తొలుత ‘ఎక్స్ (ట్విట్టర్)’ప్రీమియం ప్లస్, ప్రీమియం వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి తెచ్చారు. అనంతరం కొన్ని పరిమితుల మేరకు ఉచిత వినియోగదారులకు సైతం అందుబాటులోకి తెచ్చారు. భవిష్యత్తులో ‘ఎక్స్’ప్రీమియం, ప్రీమియం ప్లస్ చందాలు కట్టాల్సిన అవసరం లేకుండా.. ‘గ్రోక్’కే చందా కట్టి సబ్‌స్క్రైబ్ చేసుకోవచ్చని రూపకర్తలు చెబుతున్నారు.మరోవైపు ‘చాట్‌జీపీటీ–3.5’పాత వెర్షన్ అందరికీ ఉచితంగా అందుబాటులో ఉంది. వినియోగదారులకు మరింత విస్తృతమైన సేవలందించే అత్యాధునిక ‘జీపీటీ–4’వెర్షన్‌కు మాత్రం డబ్బులు చెల్లించి సబ్‌్రస్కయిబ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని వెబ్, మొబైల్ యాప్స్, ఎంఎస్ ఆఫీస్ ద్వారా విస్తృత రీతిలో పొందవచ్చు.దేనికది ప్రత్యేకంకంటెంట్ సృష్టి, అనువాదం, కస్టమర్ సపోర్ట్, విద్య, వ్యక్తిగత సహాయం, కోడింగ్, మేధోమథనం వంటి వైవిధ్యభరిత సేవలను విస్తృతరీతిలో చాట్‌జీపీటీ అందిస్తోంది. వినియోగదారులు టెక్ట్స్‌తోపాటు చిత్రాలను ఇన్‌పుట్‌గా వాడే సదుపాయాన్ని చాట్‌జీపీటీ ప్లస్ కలి్పస్తోంది. నిర్దిష్టమైన పరిశ్రమలు, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కస్టమైజ్డ్ సేవలను సైతం చాట్‌జీపీటీ అందిస్తోంది.ఇక ‘గ్రోక్’విషయానికి వస్తే సామాజిక మాధ్యమాలతో అనుసంధానం, రియల్ టైమ్ సమాచారం, వినోదం, సాధారణ ప్రశ్నలకు సమాధానాలు వంటి సేవలను వినూత్న రీతిలో అందిస్తోంది. ‘గ్రోక్’ను అగ్రగామిగా నిలపాలనే వ్యూహంతో ఎలన్ మస్క్ భవిష్యత్తులో మరెన్నో వైవిధ్యభరిత సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెబుతున్నారు కూడా.ఇదీ చదవండి: తాళి కట్టు శుభవేళ..బహుమతులపై పన్ను భారం ఉండదా?‘గ్రోక్’పేరు ఎందుకు‘గ్రోక్’అనే ఆంగ్ల పదానికి అర్థం ‘ఎవరినైనా/ఏదైన అంశాన్ని లోతుగా అవగతం చేసుకోవడం’. రాబర్ట్ ఎ.హెన్లీన్ తన సైన్స్‌ఫిక్షన్ నవల ‘స్ట్రేంజర్ ఇన్ ఏ స్ట్రేంజ్ ల్యాండ్’లో వాడిన ‘గ్రోక్’పదం నుంచి స్ఫూర్తి పొందిన ఎలన్‌మస్క్ తన ఏఐ టూల్‌కు ఈ పేరును పెట్టారు. -
Stock Market: ఎన్నాళ్లు ఆగితే.. అన్ని లాభాలు!
స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి విభిన్న మార్గాలున్నాయి. అందులో ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టడం ఒకటి. పరోక్షంగా పెట్టుబడి పెట్టడం రెండోది. అంటే ఈక్విటీ మార్కెట్లో రిస్క్ చేయలేని వ్యక్తులు మ్యూచువల్ ఫండ్స్ మార్గాన్ని ఎంచుకోవడమన్న మాట.అదే ట్రేడింగ్ విషయానికొస్తే... మూడు రకాల మార్గాలు అందుబాటులో ఉన్నాయి. 1. ఈక్విటీలు 2. ఫ్యూచర్స్ ట్రేడింగ్3. ఆప్షన్స్ ట్రేడింగ్ ఇందులో మొదటిదాని గురించి వివరంగా మాట్లాడుకుందాం.సాధారణంగా మన దగ్గర డబ్బులున్నపుడు వాటిని బ్యాంకుల్లోనో, పోస్ట్ ఆఫీసుల్లోనో దాచుకుంటాం. ఈమధ్య స్టాక్ మార్కెట్ కల్చర్ బాగా పెరిగింది. అయితే చాలామంది ఇన్స్టంట్ లాభాల కోసం ఎగబడుతున్నారు. దీంతో వాళ్ళు ట్రేడింగ్ వైపు చూస్తున్నారే తప్ప భవిష్యత్ భరోసా గురించి ఆలోచించడం లేదు. ట్రేడింగ్ వైపు వెళ్లే వ్యక్తుల్లో నూటికి 95 మంది నష్టాల్లో కూరుకుపోయి లబోదిబో మంటున్నారు. అలాకాకుండా దీర్ఘకాలిక దృక్పథం మార్కెట్లోకి అడుగుపెడితే కచ్చితంగా మంచి ప్రయోజనాలే దక్కుతాయి.ఇందులో కూడా మూడు రకాల మార్గాలు అనుసరించవచ్చు. 1. స్వల్ప కాలిక పెట్టుబడి2. మధ్య కాలిక పెట్టుబడి 3. దీర్ఘకాలిక పెట్టుబడిపెట్టుబడులు పెట్టడానికి బాండ్లు, డిబెంచర్లు, రుణ పత్రాలు వంటి వివిధ మార్గాలు ఉన్నప్పటికీ మనం కేవలం స్టాక్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకునే పై మూడింటి గురించి వివరంగా చర్చించుకుందాం.స్వల్ప కాలిక పెట్టుబడిసాధారణంగా మూడు నెలల వ్యవధి నుంచి 12 నెలల వ్యవధితో చేసే పెట్టుబడుల్ని స్వల్ప కాలిక పెట్టుబడులుగా పరిగణించవచ్చు. అంటే మన దగ్గర డబ్బులు ఉంటాయి. కానీ వెంటనే వాటి అవసరం ఉండకపోవచ్చు. వాటిని మార్కెట్లోకి తరలిస్తే... మన అవసరానికి అనుగుణంగా మంచి ఫండమెంటల్స్ ఉన్న షేర్లను ఎంచుకుని స్వల్ప కాలానికి పెట్టుబడి పెట్టవచ్చు.ఇలాంటి సందర్భాల్లో మూడు పరిణామాలు చోటు చేసుకోవచ్చు. 1. మన పెట్టుబడి అమాంతం పెరిగిపోయి (మనం ఎంచుకునే షేర్లను బట్టి) మంచి లాభాలు కళ్ళచూడొచ్చు. మనం పెట్టుబడి పెట్టిన కంపెనీలకు సంబంధించి వచ్చే సానుకూల వార్తలు ఇందుకు కారణమవుతాయి. ఉదా: సదరు కంపెనీ రేటింగ్ ను అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు పెంచడం, ప్రభుత్వపరంగా సంబంధిత రంగానికి అనుకూలంగా ప్రకటనలు రావడం, ఆర్ధిక ఫలితాలు అద్భుతంగా ఉండటం.... వంటివి ఇందుకు దోహదం చేస్తాయి.2. మన పెట్టుబడి నష్టాల్లోకి జారిపోవడం. ఒక ఆరు నెలల పాటు మనకు డబ్బులతో పని లేదని వాటిని తీసుకెళ్లి ఇన్వెస్ట్ చేస్తాం. ఆలోపు వివిధ ప్రతికూల అంశాలు మన పెట్టుబడిని హరించి వేస్తాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ప్రభుత్వాలు పడిపోవడం, ఆర్ధిక అనిశ్చిత పరిణామాలు, సంస్కరణలు పక్కదారి పట్టడం... వంటి అంశాలు మార్కెట్లను పడదోస్తాయి. ఇలాంటి సందర్భాల్లో సదరు షేర్లు కూడా ఎప్పటికప్పుడు పడిపోతూ ఉంటాయి.మీరు పెట్టుకున్న కాల వ్యవధి దగ్గర పడుతూ ఉంటుంది. షేర్లు మాత్రం కోలుకోవు.అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో బతుకు జీవుడా... అనుకుంటూ ఆ కాస్త సొమ్ముతో సరిపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు మన అవసరాలు తీరడానికి అప్పు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. ఆర్జించడం మాట పక్కన పెట్టి అదనపు భారాన్ని మోయాల్సి ఉంటుందన్న మాట.3. పెట్టిన పెట్టుబడి లో పెద్దగా మార్పులు లేకపోవడం. ఆరు నెలలు గడిచినా మనం కొన్న షేర్లు అనుకున్నట్లుగా పెరగకపోవడమో, లేదంటే స్వల్ప నష్టాల్లో ఉండటమే జరుగుతుంది. దీనివల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు.మధ్య కాలిక పెట్టుబడి ఇది సాధారణంగా ఏడాది వ్యవధి మొదలుకొని 5 ఏళ్ల వరకు కాలవ్యవధి తో చేసే పెట్టుబడులు ఈ విభాగంలోకి వస్తాయి. స్వల్ప కాలిక పెట్టుబడులతో పోలిస్తే ఇవి ఒకింత మెరుగైన ప్రతిఫలాన్నే ఇస్తాయి. వ్యవధి ఎక్కువ ఉంటుంది కాబట్టి... ఒక ఏడాది రెండేళ్లపాటు మార్కెట్లో ఒడుదొడుకులు ఎదురైనా.. ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఆ తర్వాత షేర్లు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది.అదే సమయంలో మన దగ్గర సొమ్ములున్నప్పుడల్లా మనం కొన్న షేర్లనో, వేరే షేర్లనో కొనుగోలు చేయడానికి అవకాశం ఉన్నందువల్ల రాబడి పెరగడానికి కూడా కచ్చితంగా వీలుంటుంది. మనమంతా మిడిల్ క్లాస్ మనుషులం అవడం వల్ల మన అవసరాలు ఎక్కువగానే ఉంటాయి. అందువాళ్ళ మధ్య కాలిక పెట్టుబడి మార్గాన్ని ఎంచుకుంటే తక్కువ రిస్క్ తోనే గణనీయ ప్రయోజనాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది.దీర్ఘ కాలిక పెట్టుబడి ఇది అన్ని విధాలా శ్రేయోదాయకం. అదెలాగంటే...1. మార్కెట్లు ఏళ్ల తరబడి పడిపోతూ ఉండవు. పడ్డ మార్కెట్ పెరగాల్సిందే. 2. మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడల్లా పెట్టుబడి పెట్టుకుంటూ పోతాం. 3. వివిధ కంపెనీల షేర్లు కొనుగోలు చేయడం వల్ల ఒకట్రెండు నష్టాల్లో ఉన్నా... మిగతావి లాభాల్లో ఉండటం వల్ల మన పెట్టుబడి దెబ్బతినదు.4 . ఒకేసారి లక్షలు లక్షలు పెట్టుబడి పెట్టేయాల్సిన అవసరం ఉండదు. 5. మన షేర్లపై సదరు కంపెనీలు డివిడెండ్లు ఇస్తాయి. ఇదో అదనపు ప్రయోజనం. 6. ఆయా కంపెనీలు షేర్లను విభజించడం, బోనస్ షేర్లు ఇవ్వడం వల్ల మన పోర్ట్ ఫోలియో లో షేర్ల సంఖ్యా పెరుగుతుంది. 7. మన అవసరాలు దీర్ఘకాలానికి ఉంటాయి కాబట్టి... భవిష్యత్‌లో అవసరమైనప్పుడో, లేదంటే ఆ షేరు బాగా పెరిగిందని భావించినప్పుడో మనం కొన్ని ప్రాఫిట్స్ ను వెనక్కి తీసుకోవచ్చు లేదా వేరే పెట్టుబడుల్లోకి మళ్లించవచ్చు. 8. పిల్లల చదువులు, పెళ్లిళ్లు... ఇత్యాది సందర్భాల్లో అప్పులు చేయాల్సిన దుస్థితి రాకుండా ఉపయోగపడతాయి.సంప్రదాయ డిపాజిట్లు పొదుపులతో పోలిస్తే... స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేవి అధిక రాబడి ఇవ్వడానికి ఆస్కారం ఉందన్న విషయం అర్ధమయింది కదూ...అయితే మీరు తీసుకునే నిర్ణయమే... మీ భవిష్యత్ కు దిక్సూచిగా నిలుస్తుంది. మీ అవసరాలు స్వల్ప కాలికమా... మధ్య కాలికమా... దీర్ఘ కాలికమా... అన్నది మీరే నిర్ణయించుకోండి. తదనుగుణమా నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగు వేయండి. ఒక్క మాట మాత్రం స్పష్టంగా చెప్పగలను.ఎప్పటికప్పుడు మీ పోర్టు ఫోలియో మీద కన్నేసి.. తగిన లాభాలు రాగానే బయటపడటం అనేదే స్వల్ప, మధ్య కాలాలకు ఉపయుక్తంగా ఉంటుంది. దీర్ఘ కాలిక దృక్పథం తో కొంటారు కాబట్టి... లాంగ్ టర్మ్ పెట్టుబడులు ఎప్పటికీ మంచి ఫలితాలే ఇస్తాయి. అయితే దీర్ఘ కాలానికి కొంటున్నాం కదా అని ఎవరో చెప్పారనో... తక్కువకు దొరుకుతున్నాయనో.. వ్యవధి ఎక్కువ ఉంటుంది కదా.. కచ్చితంగా పెరక్కపోవులే అనో... పనికిమాలిన పెన్నీ స్టాక్స్ జోలికి మాత్రం పోకండి.-బెహరా శ్రీనివాస రావుస్టాక్ మార్కెట్ విశ్లేషకులు -
మెరుగైన సమాచార లభ్యతపై దృష్టి
సెక్యూరిటీస్ మార్కెట్లో ఇన్వెస్టర్లకు మెరుగైన, సరైన సమాచారం లభించేలా చూడటంపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మరింతగా దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా పర్ఫార్మెన్స్ వేలిడేషన్ ఏజెన్సీ (పీవీఏ), డేటా బెంచ్‌మార్కింగ్ ఇన్స్టిట్యూషన్ (డీబీఐ) అనే రెండు కొత్త సంస్థలను ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు (ఐఏ), రీసెర్చ్ అనలిస్టులు (ఆర్ఏ), ఆల్గోరిథం ప్రొవైడర్లు తాము అందించే సర్వీసుల పనితీరుకు సంబంధించి తెలియజేసే వివరాలను పీవీఏ నిర్ధారిస్తుంది. ఇక, వివిధ అసెట్ క్లాస్‌లకు సంబంధించి ప్రామాణికంగా ఉన్న, పోల్చి చూసుకోతగిన డేటాను అందించే సెంట్రల్ రిపాజిటరీగా డీబీఏ పని చేస్తుంది. 2023–24 వార్షిక నివేదికలో సెబీ ఈ విషయాలు వెల్లడించింది. మరోవైపు, ఇన్వెస్టర్లు చెల్లించే ఫీజులు కచ్చితంగా రిజిస్టర్డ్ ఐఏలు, ఆర్‌ఏలకే అందే విధంగా ఒక ప్రత్యేకమైన వ్యవస్థను కూడా ఏర్పాటు చేయనున్నట్లు సెబీ పేర్కొంది.ఇదీ చదవండి: అంతర్జాతీయ పరిణామాలు కీలకంఅన్రిజిస్టర్డ్ సంస్థలను ఇన్వెస్టర్లు గుర్తించేందుకు, వాటికి దూరంగా ఉండేందుకు ఈ విధానం ఉపయోగపడగలదని సెబీ తెలిపింది. 2024–25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగానికి పెట్టుబడుల లభ్యతకు తోడ్పడే విధానాలపై దృష్టి పెట్టనున్నట్లు వివరించింది. ఈ విషయంలో మార్కెట్ వర్గాల అవసరాలను తెలుసుకోవడానికి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (రీట్స్), ఇన్ఫ్రా ఇన్వెస్ట్మెంట్ ట్రస్టుల (ఇన్వీట్స్) కోసం అడ్వైజరీ కమిటీ వేస్తున్నట్లు పేర్కొంది. వీటితో పాటు స్వచ్ఛంద డీలిస్టింగ్ నిబంధనలను సమీక్షించడం తదితర చర్యలు కూడా తీసుకోనున్నట్లు సెబీ తెలిపింది. -
‘కమల’ వికాసం సాధ్యమే: లిచ్‌మాన్
వాషింగ్టన్: గత నాలుగు దశాబ్దాలుగా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను దాదాపు ఖచి్చతంగా ఊహించి చెప్పిన అలాన్ లిచ్‌మాన్ మరోమారు తన విశ్లేషణను వెల్లడించారు. తాజా ఎన్నికల ప్రచార సరళి, అమెరికా ఓటర్ల మనోభావాలను లెక్కలోకి తీసుకుంటే డెమొక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ నెగ్గే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని ఆయన చెప్పారు. అయితే వచ్చే నెలలో డెమొక్రటిక్ కన్వెన్షన్ తర్వాతే తన తుది అంచనాలను వెల్లడిస్తానని ఆయన స్పష్టంచేశారు. 1984 ఏడాది నుంచి అమెరికాలో 10 సార్లు అధ్యక్ష ఎన్నికలు జరిగితే తొమ్మిది సార్లు ఈయన చెప్పింది నిజమైంది. దీంతో ఆయన్ను అమెరికా అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌గా అందరూ పిలుస్తారు. అమెరికన్ విశ్వవిద్యాలయంలో గత యాభై సంవత్సరాలుగా అధ్యాపకుడిగా పనిచేస్తున్న లిచ్‌మాన్ 1981 ఏడాదిలో ‘గెలుపునకు 13 సూత్రాలు’ అనే విధానాన్ని ప్రతిపాదించారు. ఈ 13 అంశాల ప్రాతిపదికన ఏ పార్టీ, అభ్యర్థి గెలుస్తారని అంచనా వేస్తానని ఆయన చెప్పారు. 2016లో ట్రంప్, 2020లో బైడెన్ గెలుస్తారన్న జోస్యాలు నిజమవడంతో 2024లో గెలుపుపై ఏం చెప్పబోతున్నారోనని ఆసక్తి నెలకొంది. -
నో డౌట్ పక్కా సీఎం జగన్
-
జూన్ 4న కూటమికి ఏం జరుగుతుంది ?..విజయ్ బాబు సూటి ప్రశ్న
-
ఏపీ అసెంబ్లీ, ఎంపీ ఎన్నికల షెడ్యూల్‌పై విశ్లేషణ
-
YSRCP బిగ్ టార్గెట్ ఇదే
-
నాథుడు లేని పార్టీకి అందలమెలా..
అది ఎంత మహా వృక్షమైనా కావొచ్చు. ఎన్నిఆటుపోట్లనైనా తట్టుకుని ఉండొచ్చు. చివరికి ఓ చిన్నపాటి గాలివాన చాలు.. కూకటి వేళ్ళతో కూలిపోవడానికి.. దశాబ్దాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఈ దృష్టాంతం అతికినట్లు సరిపోతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చకచకా పావులు కదుపుతూ ప్రత్యర్థి పార్టీలకు సవాలు విసరాల్సింది పోయి అంతర్గత సమస్యలహో అల్లాడుతూ పఠనం దిశగా సాగుతోంది. మరోపక్క ప్రస్తుత ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి మాత్రం అందనంత ఎత్తులో మూడోమారు అందాలన్నీ దక్కించుకునే రేసులో దూసుకుపోతోంది. ఒక జాతీయ పార్టీగా రాజకీయాలను శాసించి.. దిగ్గజాలకు ఆలవాలమై దుర్బేధ్యమైన కోటను నిర్మించుకున్న కాంగ్రెస్ ఇప్పుడు దిక్కులేని స్థాయికి ఎందుకు దిగజారింది?? ఎందుకీ దుర్గతి పట్టింది..?? ఎన్నికల వేళ పార్టీ ని సరైన పంథాలో నడిపించే నాథుడు లేక ఎందుకు విలాలలాడుతోంది..?? రాబోయే రోజుల్లో ఇది ఒక ప్రాంతీయ పార్టీగానైనా నిలబడుతుందా..?? నాలుగు దశాబ్దాల కిందట 400 పై చిలుకు స్థానాలతో ప్రత్యర్థులను గడగడ లాడించిన పార్టీ నేడు కనీస సీట్లు అయినా సాధించుకోలేని పరిస్థితికి ఎందుకు వచ్చింది?? ఇవన్నీ సమాధానం వెతకాల్సిన ప్రశ్నలే.. పతనం దిశగా.. వాస్తవాలు ఎప్పుడూ కఠినంగానే ఉంటాయి. కాంగ్రెస్ పఠనం వెనుక కఠోర సత్యాలు కూడా దాచిపెట్టేవి ఏమీ కాదు. పార్టీ ప్రస్తుత దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం స్వయంకృతమేనని చెప్పుకోవాలి. నెహ్రు, ఇందిర, రాజీవ్‌ల హయాం తర్వాత పార్టీ మసకబారడం మొదలైంది. రాజీవ్ మరణానంతరం సోనియా అధికార విముఖతతో ప్రధాని పదవిని చేపట్టిన పీవీ.. మన్మోహన్ సాయంతో దేశాన్ని సంస్కరణల బాట అయితే పట్టించగలిగారు కానీ పార్టీకి అవసరమైన శక్తియుక్తులు నింపడంలో మాత్రం తన చాణక్య నీతిని ప్రదర్శించలేక పొయారనే చెప్పొచ్చు. కారణం పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు. అదీగాక పీవీ హయాంలోనే వెలుగు చూసిన హర్షద్ మెహతా కుంభకోణం పార్టీకి తీరని నష్టాన్ని మిగిల్చింది. ఫలితంగా తొలిసారి వాజపేయి దేశ ప్రధాని అయ్యారు. ఇక 2004 ఎన్నికల్లో ‘ఇండియా షైనింగ్‘ నినాదంతో ఎన్డీయే కూటమి బలమైన ప్రభావాన్నే చూపినప్పటికీ గుజరాత్ మత కల్లోలాలు ఆ కూటమిని కాదని యూపీఏ (ఇప్పటి ఇండియా కూటమి) కూటమికి అధికార పగ్గాలు అప్పగించాయి. మన్మోహన్ ప్రధాని అయ్యారు. దశాబ్ద కాలం పాటు రెండు విడతల్లోనూ ప్రధాని అయితే కాగలిగారు కానీ.. మౌన మునిగా ముద్రపడటం.. కర్త, కర్మ, క్రియ అంతా సోనియారాహుల్ లే అయ్యి ముందుకు నడిపించడం ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తికి ఆస్కారం కలిగించింది. దీంతో రానురానూ పార్టీ ప్రాభవం అడుగంటుతూ వచ్చింది. మన్మోహన్ రెండో విడతలో రకరకాల స్కాములు వెలుగు చూడటం, ధరల నియంత్రణ లేకపోవడం, నిరుద్యోగిత రేటు పెచ్చుమీరడం, పార్టీ నాయకుల్లో పొరపొచ్చాలు ప్రతిస్థను అథఃపాతాళానికి దిగజార్చేశాయి. ఎన్డీయే కూటమి ఈ అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకుంది. మోదీని తెరపైకి తెచ్చింది.. పగ్గాలు దక్కించుకుంది. అప్పటినుంచి ఇప్పటిదాకా ఎదురేలేకుండా దూసుకుపోతోంది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ సొంతంగా 51 సీట్లు గెలుచుకోగా.. యూపీఏ కూటమి కేవలం 91 సీట్లతో, అది కూడా కేవలం 20 శాతం ఓటు బ్యాంకు తో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే పార్టీ ఏ స్థాయికి పడిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అక్కరకు రాని అన్నా చెల్లెల్లు మోదీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి అధికారంలోకి రావడంతోనే యూపీఏకు నూకలు చెల్లడం మొదలైనట్లేనని భావించొచ్చు. ఇంటి పెద్దగా సోనియా పైపైన పెద్దరికం వహిస్తున్నా.. మోదీ, అమిత్ షాల ద్వయాన్ని ఎదుర్కొనే దీటైన నాయకుడ్ని తీర్చిదిద్ద లేకపోవడం కాంగ్రెస్ పార్టీని వేధిస్తున్న ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు. ఇందుకు రాహుల్, ప్రియాంకల ఉదంతాలే ఓ పెద్ద ఉదాహరణ. పదేళ్ల కిందట ప్రజల్లోని అసంతృప్తి సెగలతో అధికార పీఠాన్ని వదులుకున్న కాంగ్రెస్ కూటమి తర్వాతి తరుణంలోనూ కోలుకునే ప్రయత్నం చేయలేక పోయింది. పార్టీకి రాహుల్, ప్రియాంకల రూపంలో యువ నాయకత్వం అందుబాటులో ఉన్నప్పటికీ సద్వినియోగం చేసుకోవడంలో పార్టీ విఫలమైంది. యువ నాయకునిగా చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీకి మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిపించలేకపోయాడు రాహుల్.. అంచెలంచెలుగా నాయకునిగా ఎదగాల్సిన చోట తనవల్ల కాదంటూ పార్టీ అధికార బాధ్యతలకు ఆమడ దూరం వెళ్లిపోయాడు ఆయన.. ఒక నెహ్రు, ఇందిరా, రాజీవ్‌ల వంశీకుడైనా ఆ లక్షణాలు పుణికిపుచ్చుకోలేక పోవడం రాహుల్ ప్రధాన వైఫల్యంగా భావించొచ్చు. ఇక అప్పట్లో ఇందిరమ్మ డైనమిజంతో పోలుస్తూ ప్రియాంకను రంగంలోకి దింపేందుకు శతవిధాలా ప్రయత్నించింది కాంగ్రెస్ కోటరీ. వ్యక్తిగత సమస్యలో, అనుకోని అవాంతారాలో కానీ ఆ యత్నాలేవీ ఫలించలేదు. ఆమె తన ప్రాబల్యాన్ని చూపించి ఉంటే ప్రస్తుత రాజకీయ సమీకరణాలు మరింత రసవత్తరంగా మారేవి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అడపాదడపా ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలప్పుడు అక్కడకు వెళ్లి ప్రచార సభల్లో మొహం చూపించి పోవడం తప్ప ప్రజల్లో బలమైన ముద్ర వేయలేకపోయింది ప్రియాంక. కాంగ్రెస్ అంటేనే నెహ్రు వారసులుగా భావించే ప్రజానీకంలో అన్నా చెల్లెళ్ళ వెనకడుగు ఆ పార్టీని మరింత బలహీనంగా మార్చేస్తోంది. పార్టీ బాధ్యతలు ఖర్గే చేతుల్లో పెట్టినా.. ఈయన పాత్ర మరో మన్మోహన్ మాదిరిగానే ఉండొచ్చన్న అభిప్రాయం ప్రజల్లో గూడు కట్టుకుపోవడం పెద్ద మైనస్‌గా భావించొచ్చు. ఈ నేపథ్యంలో ప్రజలు యే ధీమాతో ఇండియా కూటమికి ఓటు వేస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న మిత్రులే కానీ.... తలో దారి.. ఎన్నికలు కూతవేటు దూరంలో ఉన్న ప్రస్తుత తరుణంలో విబేధాలను పరిష్కరించుకుని కలిసికట్టుగా సాగాల్సింది పోయి కాంగ్రెస్ మిత్ర గణం చెరో దారీ వెతుక్కుంటూంటే ఇదే అదనుగా ఎన్డీయే పక్షం బలం పెంచుకుంటూ పోతోంది. ఇందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇటీవలి బీహార్ పరిణామాల గురించే. కాంగ్రెస్ సాయంతో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్న జనతాదళ్ (యూ) అధినేత నితీష్ కుమార్ తాజాగా ఇచ్చిన ఝలక్ బీహార్ రాజకీయాల్లో పెను సంచలనమే అయింది. ఈ విషయాన్ని ముందస్తు పసిగట్టడంలో కాంగ్రెస్ అధిష్ఠానం విఫలమైంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోపక్క పంజాబ్‌లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ఆధ్వర్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌లు రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించేశాయి. ఇక మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో మొన్నీ మధ్యే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిష్ఠ వేసుకుని కూర్చుంది. హిమాచల్ ప్రదేశ్, అస్సాం, హర్యానా, గుజరాత్‌లలో పెత్తనం ఎటూ బీజేపీదే, కర్ణాటకలో తమ పార్టీయే అధికారంలో ఉన్నప్పటికీ, హామీల విషయంలో అక్కడి ప్రభుత్వ వైఖరి అయోమయంలో పడేస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీయే ముందు నోరు మెదిపి పరిస్థితి ఎటూ లేదు. కళ్లు తెరవకపోతే.. 2019 ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటిదాకా పార్టీ పునరుజ్జీవం దిశగా అడుగులు పడిన దాఖలాలు కనిపించడం లేదు. ఖర్గే పేరుతో తెచ్చిన దళిత కార్డు ప్రభావం నామమాత్రమేనని చెప్పొచ్చు. ఇక పార్టీకి ఏకైక ఆశాకిరణం రాహుల్ గాంధీయే. ఆయన నేతృత్వం తక్షణ అవసరం.. పరిస్థితి తీవ్రత గమనించి దిద్దుబాటు చర్యలు చేపట్టడం ద్వారా ఓటర్లలో ఓ కొత్త నమ్మకాన్ని, ప్రశ్నిచే గళం ఒకటి ఉండనే ధీమాను కలిగించాలి. సరైన రీతిలో పావులు కదిపి మోదీ సర్కారుకు సవాలు విసిరేలా పార్టీ రూపురేఖలు మార్చే ప్రయత్నం చేయగలగాలి. సహజంగా అధికార పార్టీలపై ఉండే అసంతృప్తి సెగల్ని సొమ్ము చేసుకుని తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోఎలాగైతే అధికారాన్ని అందిపుచ్చుకోగలిగారో.. అదే మాదిరి ప్రయత్నాలు అన్నిచోట్లా చేయాలి. 70 ఏళ్లు పైబడిన వృద్ధ నాయకులను గౌరవ పదవులకు పరిమితం చేస్తూ.. వాళ్ళ సలహాలు, సూచనలతో యువ రక్తాన్ని రంగంలోకి దింపి ఫలితాన్ని రాబట్టాలి. మొహమాటాలకు పోకుండా గెలుపు గుర్రాలను వెతికి పట్టుకుని ఎన్నికల పోరుకు సిద్ధమవ్వాలి. అప్పుడే సార్వత్రిక రణం హోరాహోరీగా సాగే అవకాశం ఉంటుంది. బహుశా ప్రస్తుతానికి సమయం మించిపోయిందనే చెప్పొచ్చు. రాబోయే రోజుల్లోనైనా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకునే చర్యల ద్వారా ఆయా రాష్ట్రాల్లో బలం పుంజుకుంటూ ఒక్కో అడుగు ముందుకు వేస్తే 2029లోనైనా మళ్లీ కేంద్రంలో కొలువుదీరే అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ప్రజలకు భరోసా కల్పించనంత వరకు ఎన్ని జోడో యాత్రలు చేపట్టినా అవన్నీ కంటితుడుపు చర్యలుగా మిగిలిపోతాయే తప్ప అధికారాన్ని మాత్రం అందించవు. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే సరే... లేదంటే ముందే చెప్పినట్లు ఒక చిన్న గాలివాన చాలు.. కాంగ్రెస్ అనే మహావృక్షం కూకటివేళ్లతో సహా కూలిపోవడానికి. తెలంగాణను చూసి మురిసిపోతే.. రెండు నెలల కిందటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటికీ అది సంబరపడేటంత మురిపెమేమీ కాదు. అదే సమయంలో జరిగిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓడిపోయింది అన్న విషయాన్ని విస్మరించలేం. జోడో యాత్రలో, కాంగ్రెస్‌పై పెరిగిన మమకారమే తెలంగాణాలో ఆధికారాన్ని తెచ్చిపెట్టలేదు. స్థానిక పరిస్థితులు, కేసీఆర్ సర్కారుపై పెల్లుబికిన అసంతృప్తి అధికార మార్పు జరిగేలా చేశాయి. సాధారణంగా రెండు దఫాలు అధికారంలో కూర్చున్న ఏ పార్టీకైనా ప్రజల్లో కొంతమేర అసంతృప్తి ఉండటం సహజం. దీనికి నిదర్శనం ఉభయ పక్షాల మధ్య ఉన్న గెలుపు ఓటముల అంతరాలే. భారాసా స్వయంకృత చేష్టలు ఆ పార్టీని 39 సీట్లకే పరిమితం చేస్తే కాంగ్రెస్ పార్టీకి కేవలం 64 సీట్ల బొటాబొటీ మెజార్టీతో అధికార పీఠాన్ని అప్పగించాయి. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి లాంటి వాళ్ళ ప్రయత్నాలు, 6 గ్యారంటీల పథకాలు తమవంతు సాయం అందించాయి. మరోపక్క కాంగ్రెస్ గ్యారంటీలు అమలులో ఎంత ఇబ్బందికరమో అనుభవైక వేద్యమవుతోంది. ఇలాంటి హామీలు, యాత్రలను నమ్ముకుని కేంద్రంలో అధికారాన్ని సొంతం చేసుకుందాం అనుకోవడం కల్లే అవుతుంది. అదే సమయంలో పక్కనే ఉన్న మరో తెలుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్‌లో అన్నపై చెల్లెలి అస్త్రాన్ని ప్రయోగించినా ప్రయోజనం శూన్యమే. ఇటీవల ఇండియాటుడే సమ్మిట్‌లో ఆంధ్ర ముఖ్యమంతి జగన్మోహన్రెడ్డి రాబోయే ఎన్నికల్లో పోటీ వైస్సార్సీపీ, టీడీపీ, జనసేనల మధ్యే ఉంటుందని, తన చెల్లెలి చేరిక తమ పార్టీపై ఏమాత్రం ప్రభావం చూపబోదని తేల్చిపడేశారు కూడా.. వాస్తవానికి ఆయన చెప్పింది అసెంబ్లీ ఎన్నికల గురించే అయినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకూ ఇది వర్తిస్తుందని చెప్పొచ్చు. -బెహరా శ్రీనివాస రావు సీనియర్ పాత్రికేయులు ఇదీ చదవండి: కొంప ముంచే డైరీలు..! -
భీమిలి సభ సూపర్ సక్సెస్ తో కదం తొక్కుతున్న శ్రేణులు
-
ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతుంది ?
-
బీజేపీ తొలి జాబితా విడుదల.. అత్యధికులు వారే..
భోపాల్: త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని బీజేపీ ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. వీరిలో ఎక్కువగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందినవారు కావడం విశేషం. గురువారం బీజేపీ ప్రకటించిన తొలి జాబితాలో అత్యధికులు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన వారే. చాలా కాలంగా బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో వెనుకబడిన వర్గాల్లో పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తోంది. ఇక్కడ ఎప్పటినుంచో కాంగ్రెస్ అభ్యర్థులు పట్టుకుపోయారు. ఈ కారణంతోనే ఈ ఎత్తుగడ వేసింది బీజేపీ అధిష్టానం. అభ్యర్థులకు క్షేత్రస్థాయిలో పనిచేసేందుకు తగిన సమయం దొరుకుతుందన్న ఉద్దేశ్యంతోనే చాలా ముందస్తుగా జాబితాను ప్రకటించింది బీజీపీ. మొదటి విడత జాబితాలో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ కోసం 21 మంది అభ్యర్థులను మధ్యప్రదేశ్ అసెంబ్లీ కోసం 39 మంది అభ్యర్థులను ప్రకటించింది బీజేపీ పార్టీ. గ్వాలియర్ చంబల్ ప్రాంతంలో 34 సీట్లకు గాను ఆరుగురు వెనుకబడిన కులాల అభ్యర్థులను ప్రకటించింది. ఇదిలా ఉండగా 2018 ఎన్నికల్లో ఓటమిపాలైన 14 మంది అభ్యర్థులకు మళ్ళీ టికెట్లు ఇచ్చింది పార్టీ అధిష్టానం. వీరిలో మాజీ మంత్రులు అచల్ సోంకర్, నానాజీ మొహద్, ఓంప్రకాష్ ధుర్వే, ఐదల్ సింగ్ కంసనా, నిర్మల భూరియా, లలితా యాదవ్, లాల్ సింగ్ ఆర్య కూడా ఉన్నారు. మొదటి జాబితాను విడుదల చేసిన తర్వాత మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చోహాన్ మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుని వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం సాధించాలని అన్నారు. గోహాడ్ అసెంబ్లీ సీటును జ్యోతితాదిత్య సింధియా సన్నిహితుడు రణ్ వీర్ జటావ్ ను కాదని షెడ్యూల్డ్ కులాల మోర్చా అధ్యక్షుడు లాల్ సింగ్ ఆర్యకు టికెట్ ఇచ్చారు. జాతీయ షెడ్యూల్డ్ కులాల ఇంఛార్జిగా ఉన్న మాజీ మంత్రి లాల్ సింగ్ ఆ వర్గం వారిని ప్రభావం చేయగలరని పార్టీ అధిష్టానం ఆలోచన. 2018లో కాంగ్రెస్ తరపున గెలిచిన రణ్ వీర్ జటావ్ కొద్దీ కాలానికి జోతిరాధిత్య సింధియా ఆశీస్సులతో బీజేపీ పార్టీలో చేరారు. 2020 లో జరిగిన ఉప ఎన్నికల్లో రణ్ వీర్ జటావ్ ఓటమిపాలవ్వగా బీజేపీ ఆయనను హ్యాండ్స్ క్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించి క్యాబినెట్ హోదాను కల్పించింది కానీ ఈసారి మాత్రం ఆయనకు టికెట్ ఇవ్వలేదు. బీజేపీ ప్రకటించిన జాబితాలో కొంతమంది నేరచరిత్ర ఉన్న నేతలు కూడా ఉండడం విశేషం. వారిలో భోపాల్ సెంట్రల్ అసెంబ్లీ అభ్యర్థి ధృవ్ నారాయణ్ సింగ్ RTI కార్యకర్త షెహ్లా మాసూద్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు. రెండ్రోజుల క్రితమే షెహ్లా మసూద్ కుటుంబసభ్యులు కేసు పునర్విచారణ జరిపించాలని సీబీఐని డిమాండ్ చేశారు. ఇక శివపురి జిల్లాలోని కాంగ్రెస్ కంచుకోట పిచోర్ అసెంబ్లీ సీటును ప్రీతమ్ సింగ్ లోధీకి కేటాయించింది పార్టీ అధిష్టానం. అక్కడ కాంగ్రెస్ నేత కేపీ సింగ్ కక్కజుపై ప్రీతమ్ సింగ్ లోధీ పోటీ చేయడం ఇది మూడోసారి కావడం వవిశేషం. కొద్ది రోజులక్రితం బ్రాహ్మణులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు లోధీని పార్టీ సస్పెండ్ కూడా చేసింది. అయినా ఇప్పుడు ఆయనకే మళ్ళీ టికెట్ ఇచ్చి ఆశీర్వదించింది. వీరితోపాటు కొంతమంది రాజకీయ వారసులు కూడా మొదటి జాబితాలో టిక్కెట్లు దక్కించుకున్నారు. సబల్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే మెహర్బన్ సింగ్ రావత్ కోడలు సరళ రావత్, దామోహ్ మాజీ ఎంపీ శివరాజ్ సింగ్ లోధీ కుమారుడు వీరేంద్ర సింగ్ లోధి, మాజీ ఎమ్మెల్యే ప్రతిభా సింగ్ కుమారుడు నీరజ్ సింగ్ లు ఈ జాబితాలో ఉన్నారు. సాగర్ లోని బందా అసెంబ్లీ స్థానాన్ని వీరేంద్ర సింగ్ లోధీకి కేటాయించారు బీజేపీ పెద్దలు. ఇక్కడి నుండి కాంగ్రెస్ పార్టీ తరపున తర్వార్ సింగ్ లోధీ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఛతర్పూర్ జిల్లాలోని మహారాజ్‌పూర్ నుంచి మాజీ ఎమ్మెల్యే మన్వేంద్ర సింగ్ కుమారుడు కామాఖ్య ప్రతాప్ సింగ్ టికెట్ దక్కించుకున్నారు. ఇది కూడా చదవండి: కశ్మీరీ పండిట్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆజాద్ -
ఉండవల్లి ప్రశ్నలకు సమాధానాలు లేవా రామోజీ?
రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్ ఒక ఆసక్తికర విషయం చెప్పారు. గతంలో మార్గదర్శి ఫైనాన్స్ కేసులో సుప్రీంకోర్టు జడ్జి ఒక వ్యాఖ్య చేశారట. ఈనాడు మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇస్తోందని, అందుకే తమపై కక్ష వహిస్తున్నారని అంటున్నారు.. మీరేమో ప్రభుత్వంపై వ్యతిరేకతతో రాస్తారు. వారు మీ తప్పులు కనుగొని ఎత్తి చూపుతారు. ఇందులో తప్పేముందని అన్నారట. మార్గదర్శి ఫైనాన్స్ కేసులో ఉండవల్లి సుప్రీంకోర్టులో రామోజీరావుపై పోరాడుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రామోజీ మార్గదర్శి చిట్‌ఫండ్ కేసుల్లో ఇరుకునపడ్డారు. ఏపీ సీఐడీ వారు లేవనెత్తుతున్న అనేక ప్రశ్నలకు వారు సూటీగా సమాధానం చెబుతున్నట్లు అనిపించదు. తాము చట్టాన్ని ఉల్లంఘించలేదని బుకాయించడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వం తమపై దాడి చేస్తోందని వాపోతున్నారు. ఈ రాష్ట్రంలో ఎవరిపైన అయినా కారణం ఉన్నా, లేకపోయినా, దాడి చేసే హక్కు ఒక్క ఈనాడు మీడియాకు, దాని అధినేత రామోజీరావుకే ఉందని అనుకోవాలి. ఉండవల్లి అంటున్నట్లు ఈ దేశంలో రామోజీ ఎన్ని చట్టాలను అతిక్రమించినా ఆయనను నిలదీసే పరిస్థితి లేదని, ఆయా రాజకీయ పార్టీలు, వ్యవస్థలను అలా మేనేజ్ చేయగలుగుతున్నారని చెప్పుకోవాలి. ఉదాహరణకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసులో రాష్ట్ర విభజన నేపథ్యంలో హైకోర్టు ఏపీకి తరలివెళ్లే చివరి రోజున గౌరవ హైకోర్టు వారితో ఎలా తన కేసును కొట్టివేయించుకోగలుగుతారని ఆయన ప్రశ్నిస్తుంటారు. కనీసం పిటిషనర్ అయిన తనకు కూడా తెలియకుండా చేయగలిగారని ఆయన వివరిస్తుంంటారు. ఆ తర్వాత ఎప్పటికో సమాచారం తెలిసి ఉండవల్లి సుప్రీంకోర్టుకు వెళ్లవలసి వచ్చింది. మార్గదర్ళి చిట్ కేసులలో కూడా రామోజీ కోర్టులలో ఎన్ని పిటిషన్లు వేస్తున్నారు. ఇందుకోసం ఎన్ని కోట్లు వెచ్చించగలుగుతున్నారు. నిజంగా తానేమీ తప్పు చేయకపోతే చిట్ రిజిస్ట్రార్ అధికారులు కాని సీఐడీ అధికారులు కాని అడిగిన రికార్డులను ఎందుకు చూపించలేదు. చదవండి: తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా.. రామోజీ ఎందుకిలా? సుమారు 800 మంది కోటి రూపాయలకు పైగా డిపాజిట్ చేయడంలోని మతలబు ఏమిటి? ఇవన్ని నగదు డిపాజిట్లా? కాదా? చట్టబద్దమైన డిపాజిట్లే అయితే వారి పేర్లు బయటపెట్టవద్దని ఎందుకు కోరుతున్నారు? దీనికి ఆయన ఎందుకు జవాబు ఇవ్వలేకపోతున్నారు. మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ ఒక్కదానిలోనే సోదాలు చేయలేదు కదా. అన్ని చిట్ ఫండ్ సంస్థలపై సోదాలు చేసి కొన్నిటిపై కేసులు పెట్టిన విషయం మరిచిపోకూడదు. రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు చెందిన చిట్ సంస్థలపై కేసు పెట్టడమే కాకుండా అరెస్టులు కూడా చేశారే. మార్గదర్శి సంస్థలో చిట్ గ్రూప్‌లు నిలిపివేస్తూ అధికారులు ఇచ్చిన ఆదేశాలపై సంస్థ వారు కోర్టుకు వెళితే చిట్ గ్రూపులను నిలిపివేయడానికి ముందు వారికి నోటీసు ఇవ్వాలని ఆదేశం మేరకే ప్రభుత్వం బహిరంగ నోటీసు జారీ చేసినట్లుంది. దానిని ప్రచార ప్రకటన రూపంలో ఇవ్వడం ఈనాడుకు అభ్యంతరం కావచ్చు. అదే వేరే కంపెనీలపై ఇలాంటి వాటిని ప్రభుత్వం ఇస్తే ఈనాడు తీసుకోకుండా ఉంటుందా? చట్ట ఉల్లంఘనలు వివరిస్తూ ప్రభుత్వ అధికారులు ఈ ప్రకటన విడుదల చేశారు. దానిని ప్రజాధనంతో దాడి చేస్తారా అని ఈనాడు ప్రశ్నించింది. మరి నిత్యం ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వం పై అసత్యాలు వండి వార్చుతూ దాడి చేస్తున్న ఈనాడును ఏమనాలి. పాఠకులకు విలువైన వార్తలు ఇవ్వవలసిన పత్రిక స్థలాన్ని తన వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా ఈనాడు మీడియా ఎలా వాడుతోంది. పేజీలకు పేజీలు రాసి ప్రజలపై దాడి చేస్తోంది ఈనాడు కాదా? అదంతా లెక్క వేస్తే ఎన్ని వందల కోట్ల వ్యయం అవుతుంది? ఇలా జర్నలిజాన్ని, వ్యాపారాన్ని కలగలిపి చేయడం విలువలతో కూడిన విషయమే అవుతుందా? ఉండవల్లి మరో ప్రశ్న వేశారు. టివి 9 రవిప్రకాష్‌పై కేసులు వచ్చినప్పుడు, ఆయనను జైలులో పెట్టినప్పుడు రామోజీపై కేసులు పెట్టకూడదని ఎలా అంటారని ఆయన అడిగారు. రవి ప్రకాష్ కేసులలో రాజకీయ పార్టీలు ఏవీ ఆయనకు మద్దతు ఇవ్వలేదని అన్నారు. రవిప్రకాష్‌కు ఒక న్యాయం, రామోజీకి ఒక న్యాయం ఉంటుందా? అని ఆయన అంటున్నారు. ఏపీ ప్రభుత్వం మార్గదర్శి చందాదారులకు నిర్దిష్ట సమాచారాన్ని ఇస్తూ ఆ ప్రకటన చేసింది. దానికి ఖండనగా ఈనాడు మీడియా పెద్ద ఎత్తున ఒక పేజీ నిండా వార్తల రూపంలో ప్రచురించింది. అందులో తాము చట్టాన్ని ఉల్లంఘించలేదన్న బుకాయింపు తప్ప స్పష్టత ఎంత మేర ఉందన్నది సందేహం. చిట్ దారుల డబ్బును ప్రత్యేక ఖాతాలలో ఉంచుతున్నారా? లేదా? అన్నదానికి జవాబు దొరికినట్లు లేదు. తమకు చట్టాలు వర్తించవని రామోజీ భావిస్తే ఏమి చేయాలి. తమపై దాడి అంటూ ఈనాడు రాసిన కథనంలో ప్రభుత్వంపై ఎలా అబద్దపు దాడి చేశారో చూడండి. గోదావరి వరదలతో రాష్ట్రం అల్లకల్లోలమైందట. గోదావరికి వరద వచ్చిన మాట నిజం. పలు గ్రామాలు నీటి ముంపునకు గురైన సంగతి వాస్తవం. కాని అంతవరకు రాయకుండా రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయిందని, అయినా మార్గదర్శిపై దాడి చేశారని రాస్తోంది. అంటే రాష్ట్రంలో వారు అనుకున్నవి తప్ప ఇంకేమీ పనులు ప్రభుత్వాలు చేయరాదన్నమాట. నిజంగానే గోదావరి వరదలతో రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయితే ఆ వార్తను బానర్గా ఇవ్వకుండా డేటా చౌర్యం అంటూ మరో తప్పుడు వార్తను ఈనాడు ఎలా ఇచ్చింది. ఆ పక్కనే మార్గదర్శి రిజాయిండర్ వార్తను ఎందుకు ఇచ్చారు? ఆ తర్వాత ప్రభుత్వాన్ని దూషించడానికి కొన్ని కథనాలు ఇచ్చారు. వాటిలో వరద బాధితులకు సహయం అందడం లేదంటూ మరో కథనం అల్లారు. నిజానికి ప్రభుత్వం డెబ్బైవేల మందికి పైగా పునరావాస శిబిరాలకు తరలించింది. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే వార్త ఇవ్వవచ్చు. కాని దానిని చిలవలు, పలవలు చేసి ప్రభుత్వంపై విషం చిమ్మిన విషయాన్ని ప్రజలు గమనించరా? పడవలలో కూడా వెళ్లి వలంటీర్లు ఇతర సిబ్బంది సేవలు అందిస్తున్న విషయాన్ని వీరు గుర్తించరా? ఇలా ఒకటి కాదు.. ఎక్కడెక్కడి చెత్త, చెదారాన్ని అంతటిని పోగు చేసుకు వచ్చి ఏపీ ప్రజలపైన రద్దుతున్న ఈనాడును ఏమనాలి. మరి తెలంగాణలో ఎందుకు నోరు మెదపడం లేదు. ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి కేసీఆర్ పేరెత్తడానికే గజగజలాడుతున్నారే. గత నాలుగేళ్లుగా వైఎస్ జగన్ ప్రభుత్వంపై ఎంత బరితెగించి దాడి చేస్తూ వస్తున్నారు. కేవలం తెలుగుదేశం అధికారం కోల్పోయిందని, తమ ఎదుట కూర్చునే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి కోల్పోయారన్న దుగ్దతో పాటు తమ వ్యాపార ప్రయోజనాలు దెబ్బతింటాయన్న భయంతోనే కదా ఇలా చేస్తున్నారు. ఎక్కడ అక్రమాలు జరిగినా దానిపై చర్య తీసుకోవడమే కదా ప్రభుత్వ బాధ్యత. ప్రభుత్వం ఇతరుల అక్రమాలపై చర్య తీసుకోకపోతే ఇంకేముంది .. ప్రభుత్వం కుమ్మక్కైపోయిందని రాసే ఈనాడు మీడియా తమ గ్రూప్ సంస్థలోని మార్గదర్శి అక్రమాలపై వార్తలు ఇస్తే మాత్రం దాడి అని ప్రచారం చేస్తున్నారు. ఇదంతా రామోజీ స్వయంకృతాపరాధం మాత్రమే కాదు. అహంకార పూరితంగా, తాను అన్నిటికి అతీతుడను అన్న భ్రమలో ఉండి చట్టాలను ఉల్లంఘించారు. ఒకప్పుడు రామోజీకి మద్దతుగా ప్రజలలో ఒకరకమైన భావం ఉండేది. కాని ఇప్పుడు అదే రామోజీ పై ప్రజలలో సానుభూతి లేకపోగా ఆయన ఏమి చేసినా చర్య తీసుకునే మగాడే లేడా అన్న ప్రశ్న ప్రజలలో తరచుగా వినిపిస్తోంది. వారందరికి జగన్ రూపంలో ఒక మగాడు కనిపిస్తున్నాడు. ఉండవల్లి కే కాదు.. చాలా మందికి ఇప్పుడు ఒక జవాబు దొరికింది కదా. వైఎస్సార్‌పై పగబట్టి వార్తలు రాసినా 2009లో ఆయనను రామోజీ ఓడించలేకపోయారు. ఇప్పుడు కూడా రామోజీ ఎంత విషం చిమ్మినా 2024లో కూడా అదే తరహాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి రెడ్డి తిరిగి గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపడతారు. పలు సర్వేలు కూడా ఇదే విషయం స్పష్టం చేస్తున్నాయి. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
సాక్షి మనీ మంత్రా: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (జులై 19) లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.25 గంటల సమయానికి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 67,021 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 60 పాయింట్ల లాభంతో 19,810 పాయింట్ల వద్ద ట్రేడింగ్ అవుతున్నాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎన్టీసీ, ఇన్ఫోసిస్, విప్రో, అపోలో హాస్పిటల్స్ టాప్ గెయినర్స్‌గా, మారుతీ సుజికీ, ఐచర్ మోటర్స్, సిప్లా, హీరో మోటర్‌కార్ప్, నెస్లే సంస్థలు టాప్ లూజర్స్‌గా ఉన్నాయి. బ్యాంకింగ్, ఐటీ కంపెనీలు లాభాల బాట పట్టగా, ఆటో మొబైల్ సంస్థలు నష్టాల్లో నడుస్తున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తున్న విశ్లేషణ పూర్తి వీడియో చూడండి -
సాక్షి మనీ మంత్రా: రికార్డ్ ర్యాలీ కొనసాగుతుందా?
దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు వరుస లాభాలతో దూసుకుపోతున్నాయి. దలాల్ స్ట్రీట్‌లో రికార్డుల మోత మోగుతోంది. గత కొన్ని వారాలుగా లాభాల దౌడుతీస్తున్న సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం గరిష్టాలకు చేరాయి. ఈ స్థాయిల్లో నిలదొక్కుకోవడంతోపాటు, రికార్డు ముగింపులను నమోదు చేశాయి. స్టాక్ మార్కెట్ల జోరు దోహదం చేసిన అంశాలు.. ఏయే రంగాలు లాభాల్లో ఉన్నాయి.. రానున్న వారంలో సూచీల గమనం ఎలా ఉండబోతోంది. ఏయే అంశాల స్టాక్లను కదలికలను ప్రభావితం చేయనున్నాయి. ఈ అంశాలపై సాక్షి బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్యరావు ఐడీబీఐ క్యాపిటల్‌కు చెందిన స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ఏకే ప్రభాకర్‌తో వీకెండ్ విశ్లేషణ అందించారు. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు) స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన మరిన్ని విశేషాలు, విశ్లేషణల కోసం చూడండి ➤ సాక్షి బిజినెస్ -
సాక్షి మనీ మంత్రా: కొత్త ఇన్వెస్టర్లకు సానుకూలమేనా?
కొన్ని రోజులుగా వరుస లాభాల్లో దూసుకెళుతూ సరికొత్త గరిష్ఠాలను నమోదు చేసిన దేశీయ సూచీలు వారంతంలో నష్టాలు చవిచూశాయి. అయితే కొన్ని రోజులుగా అంతర్జాతీ మార్కెట్లు ఒడుదుడుకులు ఎదుర్కొంటున్నప్పటీకి దేశీయ స్టాక్ మార్కెట్లు మాత్రం లాభాల బాటలోనే నడిచాయి. ముఖ్యంగా దేశంలో తయారీ రంగం ఊపందుకుంటున్న నేపథ్యంలో ఆ రంగంపై మదుపర్లు దృష్టి సారిస్తున్నారు. ఈ వారంలో దేశీయ స్టాక్మార్కెట్లో పరిణామాలు, లాభాలు అందుకున్న స్టాక్‌లు, వివిధ రంగాల్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది.. తదితర అంశాలను అషికా బ్రోకింగ్ సంస్థకు చెందిన కౌశిక్ మోహన్‌తో కలిసి సాక్షి బిజినెస్ కరెస్పాండెంట్ కారుణ్య రావు విశ్లేషించారు. ఇప్పటికే ఉన్న మదుపర్లతోపాటు కొత్త ఇన్వెస్టర్లకు తమ సూచనలు అందించారు. (Disclaimer:మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు ) మార్కెట్ తీరుతెన్నులపై మా బిజినెస్ కన్సల్టెంట్ కారుణ్య రావు అందిస్తోన్న పూర్తి వీడియో చూడండి -
దలాల్ స్ట్రీట్ జోరు, రికార్డు స్థాయికి సెన్సెక్స్,
-
ఫ్లాట్‌గా స్టాక్ మార్కెట్
-
ఇండియాలో శరవేగంగా విస్తరిస్తున్న పట్టణ ప్రాంతాల జనాభా
భారతదేశంలో పట్టణ ప్రాంతాల జనాభా వేగంగా పెరుగుతోంది. మూడు దశాబ్దాల క్రితం ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశంలో పట్టణీకరణకు మంచి ఊపునిచ్చాయి. పట్టణ ప్రాంతాల జనసంఖ్య వృద్ధితోపాటు దేశ ఆర్థికవ్యవస్థలో నగరాలు, పట్టణాల వాటా కూడా మరింత వేగంగా పెరుగుతోంది. ఇండియాలో పట్టణ ప్రాంతాల జనాభా 1961లో 8.23 కోట్ల నుంచి 1981 నాటికి 16.60 కోట్లకు పెరిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం 37.7 కోట్ల పట్టణ ప్రాంతాల జనాభా 2021 నాటికి 48 కోట్లకు చేరుకుందని అంచనా వేశారు. అంటే దేశ జనాభాలో ఐదో వంతుకు పైగా పట్టణాలోనే జీవిస్తోందన్న మాట. ఇక్కడ ఆసక్తికర విషయం ఏమంటే 2001–2011 దశాబ్దంలో దేశంలో పట్టణ జనాభా ఎన్నడూ లేనంత గ్రామీణ ప్రాంతాల్లో కంటే ఎక్కువగా వృద్ధిచెందింది. పెరిగిన 18 కోట్ల 14 లక్షల జనాభాలో పట్టణ ప్రాంతాల జనం 9 కోట్ల 10 లక్షలు కాగా, గ్రామీణ ప్రాంతాలది 9 కోట్ల 40 లక్షలు. 2011 నుంచీ పట్టణ ప్రాంతాల్లో జనసంఖ్య శరవేగంతో పెరుగుతోంది. మొత్తం దేశ జనాభాలో ఇదివరకు 18 శాతం ఉన్న పట్టణ ప్రాంతాల జనాభా 2021 నాటికి 37 శాతానికి పెరిగిందని అంచనా. ఐక్యరాజ్యసమితి-హేబిటెట్ ప్రపంచ నగరాల జనాభా (2022) నివేదిక ప్రకారం భారత పట్టణ ప్రాంతాల జనాభా 2025 నాటికి 54.74 కోట్లు, 2030కి 60.73 కోట్లు, 2035 నాటికి 67.45 కోట్లకు పెరుగుతుందని అంచనా. భారత స్వాతంత్య్రానికి 100 ఏళ్లు నిండిన మూడు సంవత్సరాలకు అంటే 2050 కల్లా పట్టణ ప్రాంతాల జనసంఖ్య 81.4 కోట్లకు పెరిగిపోతుందని ఐరాస అంచనాలు సూచిస్తున్నాయి. అంటే, దేశంలో పట్టణాల జనాభా గ్రామీణ జనాభా కంటే చాలా ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పట్ణణ ప్రాంతాలపైనా పెరిగిన శ్రద్ధ దక్షిణాదిన మూడో పెద్ద రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో కూడా పట్ణణ ప్రాంతాలు వేగంగా విస్తరిస్తున్నాయి. అదీగాక, నగరాలు, పట్టణాలుగా అంటే మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీ హోదా రాని పెద్ద గ్రామాలు పట్టణ ప్రాంతాల సౌకర్యాలతో నవ్యాంధ్రలో వృద్ధిచెందుతున్నాయి. పట్టణ హోదా ఇంకా దక్కని ఇలాంటి పెద్ద గ్రామాలను ‘సెన్సస్ టౌన్లు’ అని పిలుస్తారు. కాస్త వెనుకబడిన ప్రాంతాలుగా గతంలో భావించిన చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పట్టణ జనాభా బాగా అభివృద్ధి చెందిన జిల్లాలతో సమానంగా పెరుగుతోందని 2011 జనాభా లెక్కలు తేల్చిచెప్పాయి. నాలుగేళ్ల క్రితం రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టినప్పటి నుంచీ గ్రామీణ ప్రాంతాలతో సమానంగా పట్టణ ప్రాంతాల ప్రగతిపై దృష్టి సారించింది. వార్డు వాలంటీర్ల వ్యవస్థను ప్రవేశపెట్టి పట్టణ ప్రాంతాల పేద, మధ్య తరగతి సహా అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి బాదరబందీ లేకుండా జీవనం సాఫీగా సాగడానికి పకడ్బందీగా ఏర్పాట్లు చేసింది. ఇంకా, నగరాలు, పట్టణాల్లో నెలవారీ జీతాలు వచ్చే ఉపాధి లేని ఆటో డ్రైవర్లు వంటి ఆధునిక వృత్తుల్లో ఉన్న దిగువ మధ్యతరగతి వారికి అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ఏపీలో అమలుచేస్తున్నారు. అశాంతి, అలజడికి త్వరగా గురయ్యే అవకాశాలున్న పట్టణ ప్రాంతాల ప్రజల అభివృద్ధికి, సంక్షేమానికి వైఎస్సార్సీపీ సర్కారు చేపట్టిన అనేక చర్యల వల్ల ఆంధ్రా పట్టణాలు, నగరాలు శాంతి, సౌభాగ్యాలతో నేడు వర్ధిల్లుతున్నాయి. విజయసాయిరెడ్డి, వైఎస్సార్సీపీ, రాజ్యసభ సభ్యులు -
US: అంచనాకు మించి అక్రమ వలసదారులు..ఇరకాటంలో బైడెన్ పాలన
అమెరికాలో అక్రమ వలసదారుల బెడద ఎక్కువగా ఉంది. ఇప్పటికే దాదాపు 17 మిలియన్ల మంది అక్రమ వలసదారులు నివసిస్తున్నట్లు హకీష్ ఇమ్మిగ్రేషన్ గ్రూప్ అంచనా వేసింది. 2021 ప్రారంభంలో అధ్యక్షుడు జో బైడెన్ బాధ్యతలు చేపట్టే నాటికే వారి సంఖ్య 16 శాతం పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. దాదాపు 16.8 మిలియన్ల మంది ఉన్నారని, జనవరి 2022లో 15.5 మిలియన్లకు పెరిగిందని వెల్లడించింది. అదికాస్త ఇటీవల సంవత్సరంలో దాదాపు 11 మిలియన్లకు చేరినట్లు అంచనా వేసింది. బైడెన్ పరిపాలనలో మూడో ఏడాది నుంచి వలసల సంక్షోభాన్ని తీవ్రంగా ఎదుర్కొంటోంది. దీంతో ట్రంప్ హయాంలోని విధానాలను రద్దు చేసింది. సరిహద్దు వద్ద కఠినమైన చర్యలను అమలు చేసింది. అందుకోసం ఫెడరేషన్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ (ఎఫ్‌ఏఐఆర్) ఆ అక్రమ వలసలకు అడ్డుకట్ట వేయాలని పిలుపునిచ్చింది కూడా. దీనికి తోడు ఈ అక్రమ వలసలు కారణంగా దక్షిణ సరిహద్దులో సుమారు 2 లక్షలు పైగా ఎన్కౌంటర్లు జరిగాయి. ఈ ఆర్థిక ఏడాదితో కలిసి ఇప్పటి వరకు సుమారు 1.6 మిలియన్లకు పైగా ఎన్కౌంటర్లు జరిగినట్లు అమెరికా ఓ నివేదిక తెలిపింది. అలాగే రెండు లక్షల మందిలో సగానికిపైగా వీసా గడువు ముగింపు ఎదుర్కొంటున్నారని పేర్కొంది. అలాగే కరోనా కారణంగా వలస వచ్చిన వారిని కూడా వేగంగా బహిష్కరించే పనులు ముమ్మరంగా జరగుతున్నట్లు వెల్లడించింది. చట్ట విరుద్ధంగా అమెరికాలో శాశ్వత నివాసం ఉండేందుకు యత్నించిన ఏ వ్యక్తిపైన అయినా కఠిన చర్యలు తప్పవని అమెరికా ప్రకటించింది కూడా. అదీగాక సుమారు 3 లక్షల మంది ఇటీవల తాత్కాలిక అనుమతి లేదా నిష్క్రమణ నుంచి మినహాయింపు పొందిన వారు ఉన్నట్లు ఇమ్రిగ్రేషన్ గ్రూప్ పేర్కొంది. వారి టీపీఎస్ (వీసా)ని కూడా పొడిగించినట్లు తెలిపింది. అక్రమ వలసదారుల జనాభాను కచ్చితంగా అంచనా వేయడం అసాధ్యం అని, అధికారులను తప్పించుకుని తిరుగుతున్న వారి వివరాలు తెలియాల్సి ఉందని సైన్సస్ బ్యూరో డేటా పేర్కొంది. ఆ డేటా ఆధారంగానే అంచనా.. వార్షిక జనాభా గణన డేటాలో మార్పుల అధారంగా వారి సంఖ్యను అంచనా వేయడమే గానీ కచ్చితమైన గణాంకాలు లేవని తేల్చి చెప్పింది. ఆఖరికి ఫెడరేషన్ అమెరికన్ ఇమ్మిగ్రేషన్ రిఫామ్ (ఎఫ్‌ఏఐఆర్) సైతం ఆ సైన్స్ బ్యూరో డేటా ఆధారంగానే ఈ అక్రమ వలసలను అంచనా వేస్తునట్లు వెల్లడించడం గమనార్హం. బైడెన్ ప్రభుత్వం ఈ అక్రమ వలసలను నివారించేందుకు తీసుకున్న నిర్ణయాలు కారణంగానే ఆ డేటా వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. కొనసాగుతున్న అక్రమ వలసల సంక్షోభానికి కారణం కాంగ్రెస్‌లోని రిపబ్లికన్లే అంటూ వారు తీసుకున్న చర్యలను తప్పుబడుతోంది బైడెన్ ప్రభుత్వం. (చదవండి: అభిమానంతో వచ్చే చిక్కులు..వారితో వ్యవహారం మాములుగా ఉండదు!) -
రాజకీయాలతో ప్రజల మమైకం.. బిస్మార్క్ మాటలు అక్షర సత్యం
భారతదేశంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దాదాపు 55 ఏళ్ల వరకూ, అంటే 21వ శతాబ్దం మొదలయ్యే వరకూ ప్రజల్లో కొంత మందికి రాజకీయాలంటే వ్యతిరేకత ఉండేది. కొన్ని సమస్యలకు పరిష్కారాలు కనిపించనప్పుడు తప్పంతా రాజకీయ నాయకులదే అనే అభిప్రాయం వ్యక్తమయ్యేది. 1960, 70ల్లో అయితే అసలు ప్రజాస్వామ్యం ఇండియాకు ప్రయోజనకరమా? అనే ప్రశ్న కూడా బహిరంగ ప్రదేశాల్లో మధ్య తరగతి నోట వినిపించేది. కొందరైతే ప్రజాజీవితంలో అరాచకం తరచు కనిపించే భారతదేశంలో సైనిక పాలనే మెరుగైన ఫలితాలు ఇస్తోందేమోననే రీతిలో ఆగ్రహంతో మాట్లాడేవారు. అయితే, 1977 నుంచీ దేశ రాజకీయాల్లో శరవేగంతో వచ్చిన మార్పులు, వికసించిన జన చైతన్యం, పాలనా వ్యవస్థల్లో కొద్దిపాటి కదలికలు కానరావడంతో–రాజకీయాలను, రాజకీయ నేతలను, ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని పలచనచేసి మాట్లాడే ధోరణి తగ్గిపోయింది. అన్ని సమస్యలకూ ప్రభుత్వాలది, రాజకీయపక్షాలదే బాధ్యత కాదని, జనంలో రాజకీయ స్పృహ, చలనశీలత ఉంటేనే పనులు వీలైనంత సక్రమంగా జరుగుతాయనే భావన వారిలో ఏర్పడడం మొదలైంది. దేశంలో 1977 పార్లమెంటు ఎన్నికలు ప్రజల పరిశీలనా దృష్టిలో గణనీయ మార్పు తీసుకొచ్చాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా 1978 రాష్ట్ర శాసనసభ ఎన్నికలు తెలుగు జనం ఆలోచనా ధోరణిలో చెప్పుకోదగ్గ పరిణతికి కారణమయ్యాయి. అప్పటి నుంచీ తెలుగునాట ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పరిపాలన సాగాలనే విషయంపై శ్రద్ధ పెరిగింది. 2004 పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగునాట రాజకీయాల్లో, పాలనా వ్యవహరాల్లో ఊహించని మార్పులు విస్తృత ప్రజాచైతన్యానికి దారితీశాయి. రాజకీయపక్షాల ధోరణిపై అవగాహన పెరుగుతోంది! అనేక సమస్యలపై, సందర్భాల్లో వివిధ ప్రధాన రాజకీయపక్షాల వైఖరిపై ప్రజలకు పాతికేళ్ల క్రితం సంపూర్ణ అవగాహన ఉండేది కాదని రాజకీయ పండితులు చెబుతుంటారు. కేంద్రంలో, రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు అధికారంలో ఉండడంతో ఆయా పార్టీల రాజకీయ ధోరణుల్లో మార్పులు అవసరమయ్యాయి. ప్రజా సంక్షేమం కోసం, పాలన సాఫీగా నడవడానికి రాష్ట్రాలను పరిపాలించే పార్టీలపై బాధ్యత, ఒత్తిడి ఎక్కువవుతున్నాయి. కేంద్రంలోని పాలకపక్షంతో పరిపాలన విషయంలో సఖ్యతతో వ్యవహరించాల్సిన పరిస్థితులు పదేళ్లుగా ఎక్కువయ్యాయి. వేర్వేరు సిద్ధాంతాలు, కార్యక్రమాలు ఉన్న భిన్న రాజకీయపక్షాలు ప్రజా సంక్షేమం కోసం కలిసి పనిచేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలకు కూడా రాష్ట్రాల్లోని పాలకపక్షాలతో (అవి ప్రాంతీయపార్టీలైనా లేదా జాతీయపక్షాలైనా) కలిసిమెలిసి సుహృద్భావ వాతావరణంలో వ్యవహరించాల్సివస్తోంది. 19వ శతాబ్దం చివరిలో జర్మనీ ఏకీకరణకు కారకుడైన ఆటో వాన్ బిస్మార్క్ (దేశాధినేత ఛాన్సలర్ గా ఆయన 1871–1890 మధ్య ఉన్నారు) దాదాపు 150 ఏళ్ల క్రితం అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం. అధికారంలో ఉన్న నాయకులు ఆచరణాత్మత రాజకీయాలు నడపడానికి ఏం చేయాలో ఆయన సూటిగా ఒక్క వాక్యంలో చెప్పారు. ‘రాజకీయాలంటే–అలివికానివిగా కనిపించేవాటిని సాధ్యమయ్యేలా కృషిచేయడమే. ఇదొక కళ. ఎంత వరకు వీలైతై అంత వరకు సాధించడమే ఈ కళ లక్ష్యం,’ అనే అర్ధంలో బిస్మార్క్ చెప్పిన మాటలను ఇప్పటికీ ఆధునిక ప్రజాతంత్ర దేశాల్లో గుర్తుచేసుకుంటుంటారు. 1989-90 మధ్య దేశ ప్రధానిగా ఉన్న విశ్వనాథ ప్రతాప్ సింగ్ జీకి మైనారిటీ ప్రభుత్వం ఏడాదిపాటు నడపటం చాలా కష్టమైంది. సైద్ధాంతికంగా భిన్నదృవాలై బీజేపీ, వామపక్షాల నుంచి బయటి నుంచి మద్దతు తీసుకుంటూ వీపీ సింగ్ కేంద్రంలో సుస్థిర ప్రభుత్వానికి నాయకత్వం వహించడం అత్యంత క్లిష్టంగా ఉండేది. ఫలితంగా, మిత్రపక్షాలతో ఆయన అనేకసార్లు ఇష్టంలేకున్నా రాజీపడేవారు. అప్పుడు ఆయన రాజ్యపాలనకు సంబంధించి బిస్మార్క్ మాటలను తరచు ఉటంకించేవారు. ఇప్పుడు కూడా కేంద్రంలో, రాష్ట్రాల్లో పాలకపక్షాలు పలు సందర్భాల్లో జనం కోసం రాజకీయంగా ఎంతో యుక్తితో వ్యవహరించాల్సి వస్తోంది. ‘పాలిటిక్స్ ఈజ్ ది ఆర్ట్ ఆఫ్ ద పాసిబుల్’ అనే బిస్మార్క్ వాక్యం 21వ శతాబ్దంలో కూడా ప్రాసంగికత కలిగి ఉంది. ఇది అన్ని కాలాలకూ వర్తిస్తుంది. -విజయసాయిరెడ్డి, రాజ్యసభ సభ్యులు, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు -
WTC ఫైనల్ ఎవరి బలం ఎంత ?
-
రామోజీ ‘‘డ్రామాల’’ ఆర్థిక నిపుణుడు: దువ్వూరి కృష్ణ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షంతో పాటు, ఆ పార్టీకి వత్తాసు పలికే మీడియాలో అదేపనిగా దుష్ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి (ఫైనాన్స్, ఎకనామిక్ అఫైర్స్) దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఎవరికీ తెలియని, పరిచయం లేని వ్యక్తిని ఆర్థిక నిపుణుడిగా పరిచయం చేస్తూ, ఆయనతో ఒక ప్రకటన చేయించిన ఈనాడు పత్రిక, దాన్ని ప్రముఖంగా ప్రచురించిందని, దీని వల్ల ప్రజల్లో లేనిపోని అపోహలు తలెత్తే అవకాశం ఏర్పడిందని కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు కీలకమైన ఆర్థిక అంశాలన్నింటినీ గణాంకాలను మీడియా ముందు ఉంచుతున్నట్లు వెల్లడించారాయన. ప్రభుత్వానికి సంబంధించిన డాక్యుమెంట్లన్నీ పబ్లిక్ డొమెయిన్‌లో ఉన్నాయి. వాటిని విశ్లేషించి, మాట్లాడితే స్వాగతిస్తాం. కానీ ఎక్కడా ఏ విశ్లేషణ చేయకుండా, ఎక్కడా లెక్కలు చెప్పకుండా.. రాష్ట్రం ఆర్థికంగా పూర్తిగా దిగజారిపోయిందని అర్ధంలేని ప్రకటన చేయించారు. ఒక అవగాహనతో మాట్లాడితే ఎవరైనా స్వాగతిస్తారు. కానీ అవేవీ లేకుండా ఒక అనామకుడితో మాట్లాడించి, ఒక పత్రిక రాయడం దారుణం. రుణాలు.. నాడు–నేడు: రాష్ట్రానికి సంబంధించిన రుణాలు (పబ్లిక్ డెట్)తో.. పబ్లిక్ ఎక్కౌంట్ వివరాలు చూస్తే.. ఆర్బీఐ నివేదిక ప్రకారం విభజన నాటికి.. అంటే 2014, మార్చి 31 నాటికి ఉమ్మడి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ.1,96,202 కోట్లు. ఇంకా అప్పుడు తొలి రెండు నెలల్లో ఉన్న ద్రవ్య లోటు రూ.7,333 కోట్లు. టీడీపీ ప్రభుత్వ హయాంలో: విభజన తర్వాత 58 శాతం వాటా ప్రకారం లెక్కిస్తే విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మిగిలిన అప్పు రూ.1,18,050 కోట్లు. అదే 5 ఏళ్లలో, 2019 మార్చి 31 నాటికి రూ.2.64 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తర్వాత రెండు నెలల్లో ద్యవ్యలోటు రూ.7346 కోట్లు. దాన్ని కూడా కలుపుకుంటే 2019, మే లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర రుణం మొత్తం రూ.2,71,797.56 కోట్లు. మా ప్రభుత్వ హయాంలో: ఆ తర్వాత మా ప్రభుత్వ హయాంలో, అంటే ఈ నాలుగేళ్లలో రాష్ట్ర రుణం మొత్తం రూ.4,42,442 కోట్లకు చేరింది. ఇది కూడా ఆర్బీఐ నివేదికలో స్పష్టంగా ఉంది. ప్రభుత్వ గ్యారెంటీ రుణాలు: ఇదే కాకుండా, ప్రభుత్వ పూచీకత్తుతో, ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న ఆ రుణాలు రూ.14,028.23 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2019, మే నాటికి ఆ రుణాలు రూ.59,257.31 కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో.. ఈ ఏడాది మార్చి నాటికి ఆ రుణాల మొత్తం రూ.1,44,875 కోట్లు. ఇందులో దాదాపు రూ.45 వేల కోట్లు విద్యుత్ రంగానికి చెందినవే. ఆ సంస్థలే ఆ రుణాలు తిరిగి చెల్లిస్తాయి. అందుకే ఆ రుణాలన్నీ ప్రభుత్వానివి అని చెప్పడానికి లేదు. 2014 నాటికి ప్రభుత్వానికి ఉన్న అప్పులు, ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు.. రెండూ కలిపి రుణభారం రూ.1.32 లక్షల కోట్లు కాగా.. 2019లో గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆ రుణాలు రూ.3.31 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ తర్వాత నాలుగేళ్లలో రాష్ట్ర రుణభారం రూ.5.87 లక్షల కోట్లకు చేరింది. గ్యారెంటీ లేని రుణాలు: ఇంకా ప్రభుత్వ గ్యారెంటీలు లేకుండా, ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు చూస్తే.. 2014 నాటికి విద్యుత్ రంగంలో జెన్కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ల అప్పులు రూ.18,374 కోట్లు కాగా, ఆ ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ అప్పుల మొత్తం రూ.59,692 కోట్లకు చేరింది. ఆ తర్వాత ఇక ఈ ప్రభుత్వ హయాంలో, ఈ ఏడాది మార్చి నాటికి ఉన్న ఆ రుణభారం రూ.56,017 కోట్లు. డిస్కమ్‌లు–బకాయిలు: విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇవ్వాల్సిన బకాయిలు చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి రూ.2893 కోట్ల బకాయిలు ఉండగా, 2019 నాటికి అవి రూ.21,540 కోట్లకు చేరాయి. అదే ఇప్పుడు ఆ బకాయిలు కేవలం రూ.8,455 కోట్లు మాత్రమే. టీడీపీ కంటే మేం చేసిన అప్పులు తక్కువే: మొత్తం మీద పబ్లిక్ డెట్ టు పబ్లిక్ ఎక్కౌంట్ (ప్రభుత్వ రుణాలు), ప్రభుత్వ పూచీకత్తుతో ప్రభుత్వ రంగ సంస్థలు తీసుకున్న రుణాలు, ఆ పూచీకత్తు లేకుండా చేసిన అప్పులు.. అన్నీ కలిపి చూస్తే.. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం రుణాలు రూ.1,53,346.80 కోట్లు కాగా, గత ప్రభుత్వం దిగిపోయే నాటికి, ఆ రుణాలు ఏకంగా రూ.4,12,288 కోట్లకు పెరిగాయి. ఇక ఈ నాలుగేళ్లలో, అంటే ఈ ఏడాది మార్చి నాటికి రాష్ట్ర రుణ మొత్తం రూ.6,51,789 కోట్లకు చేరింది. టీడీపీ హయాంలో 5 ఏళ్లలో దాదాపు రూ.2.58 లక్షల కోట్ల అప్పులు పెరగ్గా.. ఈ ప్రభుత్వ హయాంలో 4 ఏళ్లలో రూ.2.38 లక్షల కోట్లు పెరిగాయి. అంటే ఎలా చూసినా గత ప్రభుత్వంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో ఎక్కువ రుణాలు తీసుకోలేదన్నది స్పష్టమవుతోంది. టీడీపీ హయాంలో 21.87 శాతం సీఏజీఆర్ పెరగ్గా, ఈ ప్రభుత్వ హయాంలో 12.69 శాతం సీఏజీఆర్ మాత్రమే పెరిగింది. రూ.10 లక్షల కోట్లు అని దుష్ర్పచారం: నిజానికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ రుణభారం రూ.6.51 లక్షల కోట్లు మాత్రమే కాగా, ఏ విధంగా రూ.10 లక్షల కోట్లు అని దుష్ప్రచారం చేస్తున్నారు? ఆ మిగతా అప్పు ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? ఎవరైనా అలా లెక్క లేకుండా అప్పులు ఇస్తారా?. అంత బాధ్యతారహితంగా ఆ పత్రిక ఎలా రాసింది? ఎవరికీ పరిచయం లేని వ్యక్తితో మాట్లాడించి, అలా ప్రచురించడం ఎంత వరకు సబబు? ఇది అభ్యంతరకరం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, అలా బాధ్యతారహితంగా ప్రచురించడం దారుణం. సీఏజీఆర్ ప్రకారం చూసినా, టీడీపీ హయాం కంటే, ఈ ప్రభుత్వ హయాంలో అప్పులు తక్కువగా పెరిగాయి. అయినా అదే పనిగా బురద చల్లడం దారుణం. టీడీపీ హయాంలో కంటే రుణాల సేకరణ తగ్గింది: 2022–23లో కేంద్ర ప్రభుత్వ రుణాలు చూస్తే.. (డెట్ టు జీడీపీ) 55.89 శాతం కాగా, 2023–24 నాటికి 56.16 శాతం ఉంటుందని అంచనా. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, ఈ ప్రభుత్వ హయాంలో రుణాల సేకరణ తగ్గింది. అంటే ఏ రకంగా చూసినా, రాష్ట్ర ప్రభుత్వం రుణాలు ఏ మాత్రం ఎక్కువ కాదు. ఇంకా ప్రభుత్వం వృథా ఖర్చు చేస్తోందని, ఆ గుర్తు తెలియని అపరిచిత వ్యక్తి స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి రెవెన్యూ వ్యయం వృథా ఖర్చు కానేకాదు. ఉదాహరణకు: మనం ఒక ఇల్లు కట్టుకుంటే అది క్యాపిటల్ వ్యయం కాగా, పిల్లలను స్కూల్‌కు పంపిస్తే అది రెవెన్యూ వ్యయం అవుతుంది. దేని ప్రాధాన్యం అదే. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ఒకేరోజు రూ.5 వేల కోట్ల అప్పు చేసి, పథకంలో భాగంగా పంపిణీ చేశారు. దాన్ని ఏ రకంగా సమర్థిస్తారో చెప్పలేదు. పథకాలు–ప్రయోజనాలు: విద్యా రంగంలో చేసిన వ్యయం వల్ల కలిగిన ప్రయోజనాలు చూస్తే.. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో (జీఈఆర్) గణనీయంగా పెరిగింది. గతంలో దేశంలో జీఈఆర్ 99 శాతం ఉంటే, అప్పుడు రాష్ట్రంలో అది 84.48 శాతం మాత్రమే. అన్ని రాష్ట్రాల కంటే తక్కువ. అదే ఈరోజు మన రాష్ట్ర జీఈఆర్ 100.1 శాతం. అంటే దేశ సగటు కంటే ఎంతో ఎక్కువ. దీనిపై స్పష్టంగా గణాంకాలు ఉన్నాయి. ఇదంతా విద్యా రంగంలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాల వల్లనే సాధ్యమైంది. గత ప్రభుత్వ హయాంలో కంటే దాదాపు రెట్టింపు విద్యా రంగంపై వ్యయం చేస్తున్నాం. అమ్మ ఒడి, గోరుముద్ద, మనబడి (నాడు-నేడు) విద్యాదీవెన, వసతి దీవెన, విద్యా కానుక.. ఇలా అనేక పథకాలు అమలు చేస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం కోసం గత ప్రభుత్వం 5 ఏళ్లలో, ఏటా చేసిన సగటు వ్యయం రూ.553 కోట్లు కాగా, అందుకోసం ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.1209 కోట్లు ఖర్చు చేస్తోంది. 👉 పెన్షన్ల కోసం గత ప్రభుత్వం ఏటా సగటున రూ.5600 కోట్లు వ్యయం చేయగా, ఈ ప్రభుత్వం ఏటా సగటున రూ.17,694 కోట్లు వ్యయం చేస్తోంది. మరి దీన్ని కూడా వృథా వ్యయం అంటారా? 👉 కోవిడ్ సమయంలో ప్రజలను ఆదుకోవడం కోసం, ఎక్కడా ఏ పథకాలు ఆపలేదు. రూ.2 లక్షల కోట్లకు పైగా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా జమ చేయడం జరిగింది. కుక్ కమ్ హెల్పర్ల వేతనాలు కూడా పెంచడం జరిగింది. ఆదాయం కోల్పోయాం: కోవిడ్ వల్ల ఒకవైపు ప్రభుత్వ ఆదాయం తగ్గడం, మరోవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో వాటా తగ్గడం వల్ల, ప్రభుత్వం దాదాపు రూ.66,116 కోట్ల ఆదాయం కోల్పోయింది. అప్పటి కంటే తక్కువ ఫైన్లు: వాహనమిత్ర పథకాన్ని ప్రస్తావిస్తున్న విపక్షం.. వాహనాల నుంచి ఫైన్లపైనా అసత్యాలు ప్రచారం చేస్తోంది. కానీ గత ప్రభుత్వ హయాంలో వాహనాల నుంచి ఫైన్ల రూపంలో ఏటా సగటున రూ.270.39 కోట్లు వసూలు చేయగా, ఈ ప్రభుత్వ హయాంలో ఆ మొత్తం రూ.183.94 కోట్లు మాత్రమే. అంటే ఎలా చూసినా, ప్రజలపై భారం వేయడం లేదు. మూలధన వ్యయమూ ఎక్కువే: కాగ్ (సీఏజీ) నివేదిక ప్రకారం మూలధన వ్యయం (క్యాపిటల్ ఎక్స్పెండీచర్) వివరాలు చూస్తే.. గత ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో అందుకోసం చేసిన వ్యయం రూ.76,139 కోట్లు. అంటే ఏటా సగటు వ్యయం రూ.15,227.80 కోట్లు. అదే మా ప్రభుత్వ హయాంలో, ఈ నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు మూలధన వ్యయం కింద ఖర్చు చేయడం జరిగింది. అంటే ఏటా సగటు వ్యయం రూ.18,852 కోట్లు. ఏ విధంగా చూసినా, గత ప్రభుత్వం కంటే ఇప్పుడు తక్కువ రుణాలు చేస్తూ.. ఎక్కువ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, అయినా విపక్షంతో పాటు, ఎల్లో మీడియాలో అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని శ్రీ దువ్వూరి కృష్ణ ఆక్షేపించారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై జీవీ రావు అనే వ్యక్తి తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు దువ్వూరి కృష్ణ. ఐసీఏఐ నుంచి ఆయన్ని తొలగించిన విషయాన్ని ఈ సందర్భంగా కృష్ణ గుర్తు చేశారు. అలాగే.. ఏపీ ఆర్థిక పరిస్థితిపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారాయన. చదవండి: ఏపీ అప్పులపై ఈనాడు అర్థం, పర్థం లేని వార్తలు.. -
దెబ్బకు దిమ్మతిరిగింది.. చంద్రబాబుకు ‘సర్వే’ షాక్
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే 25 సీట్లకు 25 అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్‌కు వస్తాయని టైమ్స్ నౌ, ఈటీజీ సర్వే వెల్లడించడం అత్యంత ఆసక్తికరంగా ఉంది. కొన్నాళ్ల క్రితం జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు చోట్ల ప్రతిపక్ష తెలుగుదేశం గెలవగానే ఇంకేముంది.. మొత్తం పరిస్థితి మారిపోయింది.. ఇక మనం అధికారంలోకి రావడమే అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కాని, ఆయన పార్టీవారు కాని చాలా హడావుడి చేశారు. కౌన్సిల్ ఎన్నికలకు, అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు చాలా తేడా ఉంటుందని ఎందరు విశ్లేషించినా, టీడీపీ మద్దతుదారులు మాత్రం దానిని పట్టించుకోకుండా ప్రజలను మభ్య పెట్టడానికి విశేష యత్నం చేస్తున్నారు. చంద్రబాబు వంటి సీనియర్ నేతకు ఆ సంగతి తెలియకపోదు. కాని ఆయన కావాలని ప్రజలను తప్పుదారి పట్టించి, టీడీపీ ఏదో గెలిచిపోతోందన్న భావన కలిగించడానికి తంటాలు పడుతుంటారు. కాని ఇప్పుడు ఆంగ్ల మాధ్యమానికి చెందిన టైమ్స్ నౌ న్యూస్ చానల్ చేసిన ఈ సర్వే టీడీపీ వారికి చాలా నిరాశ మిగుల్చుతుంది. ముఖ్యమంత్రి , వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్రెడ్డి చెబుతున్నట్లుగా వై నాట్ 175 అన్న చందంగానే దాదాపు మొత్తం లోక్ సభ సీట్లు గెలుచుకునే పరిస్థితి ఏర్పడితే ప్రతిపక్షానికి స్థానం లేనట్లే కదా! గతంలో వచ్చిన కొన్ని సర్వేలలో ఆరేడు సీట్ల వరకు టీడీపీకి రావచ్చని జాతీయ సర్వేలు అంచనా వేసేవి. కాని ఈసారి మాత్రం టీడీపీకి సున్నా లేదా ఒక సీటు అంటే గతంలో ఉన్నవాటికంటే తక్కువ అన్నమాట. ఇంతకుముందు 2019లో మూడు లోక్ సభ స్థానాలను మాత్రమే టిడిపి గెలుచుకుంది. ఈ సర్వే పూర్తిగా నిజమైతే పార్లమెంటులో మొదటిసారిగా టీడీపీకి అసలు ప్రాతినిధ్యం లేకుండా పోతుంది. లోక్ సభలో ఒక్క సీటు గెలవకపోతే దిగువ సభలో టీడీపీ ఉనికి ఉండదు. అలాగే రాజ్యసభలో ప్రస్తుతం టీడీపీకి ఒకరే ఎంపిగా ఉన్నారు. ఆయన కాలపరిమితి వచ్చే ఏడాది ముగుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలలో గతసారి మాదిరే ఇరవై, ముప్పై సీట్లే వస్తే, అప్పుడు కూడా రాజ్యసభలో స్థానం దక్కే అవకాశం ఉండదు. ఇది సహజంగానే టీడీపీకి ఆందోళన కలిగించే అంశమే. టీడీపీతో పాటు ఆ పార్టీని భుజాన వేసుకుని కంటికి రెప్పలా కాపాడుతున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి, టివి 5 వంటి మీడియా సంస్థలకు కలవరం కలిగిస్తుంది. ఎలాగొలా టీడీపీని అధికారంలోకి తీసుకు రావాలని విశ్వయత్నం చేస్తూ, నిత్యం అబద్దాలు వండి వార్చుతున్న వారికి ఈ పరిణామం తీవ్ర ఆశాభంగమే అవుతుంది. ఈ సర్వే మరో సంకేతాన్ని కూడా ఇస్తోంది. మీడియా సంస్థల వల్లే రాజకీయ పార్టీల గెలుపు ఓటములు ఉండబోవని సర్వే స్పష్టం చేస్తోంది. రాజకీయ వర్గాలలో ఒక ప్రచారం ఉంది. తెలుగుదేశం పార్టీ కూడా సొంతంగా కొన్ని సర్వేలు చేయించుకుంటే వైసీపీనే అధికారంలోకి వస్తుందని అంచనాలు వస్తున్నాయట. దాంతోనే ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ వ్యూహం అవలంబించాలో అర్ధంకాక సతమతమవుతున్నారట. అందుకే ఆయనకు ఉండే అలవాటు ప్రకారం ఎదుటి పార్టీ నేతలను ముఖ్యంగా అధినేతను వ్యక్తిగతంగా బదనాం చేయడానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నారట. ముఖ్యమంత్రి జగన్‌పై నిత్యం దూషణలకు దిగుతున్నారు. అదంతా ప్రస్టేషన్ వల్లేనని చాలామంది భావిస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అందరిని కోటీశ్వరులను చేస్తా.. ఇంటికో ఉద్యోగం ఇస్తా.. అంటూ ఊకదంపుడు వాగ్దానాలను ప్రజలు నమ్మడం లేదు. అది ఆయనకు పెద్ద మైనస్ అవుతోంది. తత్పలితంగానే వైసీపీలోని వ్యక్తులను టార్గెట్ చేసుకుని, ఆయా వ్యవస్థలను ప్రభావితం చేయడం ద్వారా ఏమైనా గిట్టుబాటు అవుతుందా అన్న ఆలోచన సాగిస్తున్నారు. కాని దానివల్ల టీడీపీకి ఏమీ పాజిటివ్ అవడం లేదని ఈ తాజా సర్వే చెబుతోంది. ఈ నేపథ్యంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను లోబరచుకుని పొత్తు పెట్టుకోవాలని గట్టి యత్నం చేస్తున్నారు. పవన్ కూడా చంద్రబాబు చెప్పినట్లు చేయడానికి సిద్దపడుతూనే ఉన్నారు. అయితే ఒకవైపు బీజేపీతో పొత్తు వదలుకోవడం ఎలా అన్నదానిపై పవన్ మల్లగుల్లాలు పడుతున్నారు.ఇంకో వైపు జనసేన హార్డ్ కోర్ అభిమానులు టీడీపీతో పొత్తు అంటే కొన్ని నిర్దిష్ట షరతులు ఉండాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఉదాహరణకు కాపు సంక్షేమ సమితి నేత అయిన మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య ఒక ప్రకటన చేస్తూ శాసనసభ సీట్లను టీడీపీ, జనసేన చెరిసగం పంచుకుని పోటీ చేయాల్సిందేనని స్పష్టం చేస్తున్నారు. చదవండి: ఎస్.. వైనాట్ 175.. ఏపీలో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ ఒక వేళ గెలిస్తే ముఖ్యమంత్రి పదవిని పవన్, చంద్రబాబు ఇద్దరు చెరో రెండున్నరేళ్లు నిర్వహించేలా ఒప్పందం ఉండాలని ఆయన చెబుతున్నారు. అలా చేయకుండా చంద్రబాబుకే మొత్తం టరమ్ అంతా సీఎం పదవి అని ఒప్పుకుంటే, పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ప్యాకేజీ ఇచ్చారని వైసీపీ ప్రచారం చేస్తుందని, దాని వల్ల చాలా నష్టం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. జోగయ్య వంటి పవన్ అభిమానులు చాలా ఎక్కువ మంది ఇలాగే ఫీల్ అవుతున్నారు. అందులోను పవన్ అంటే ఒక అపనమ్మకం ఉండడం, చంద్రబాబు సన్నిహితుడైన ఒక మీడియా అధిపతి పవన్‌కు కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆఫర్ ఇచ్చారని ప్రచారం చేయడంతో బాగా డామేజీ అయ్యారు. చంద్రబాబును పూర్తిగా నమ్మితే ప్రమాదమేనన్న భావన జనసేనలో లేకపోలేదు. పవన్ కూడా బీజేపీని వీడలేక, టీడీపీని కలవలేక టెన్షన్ లో ఉన్నారని చెబుతున్నారు. దానికి తగ్గట్లు ఇప్పుడు ఈ తాజా సర్వే టీడీపీ, జనసేనలకు పుండుమీద కారం చల్లినట్లయింది. ఈ సర్వే మొత్తం మీద ముఖ్యమంత్రి జగన్‌లో ఆత్మ విశ్వాసం మరింత పెంచుతుంది. అదే సమయంలో చంద్రబాబు, పవన్‌ల ఆత్మ స్థైర్యం బాగా దెబ్బతింటుంది. -కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ ప్రెస్ అకాడెమీ ఛైర్మన్ -
ప్రముఖ స్టాక్‌మార్కెట్ విశ్లేషకుడు ఇకలేరు!
సాక్షి,ముంబై: ప్రముఖ స్టాక్ మార్కెట్ విశ్లేషకుడు అశ్వనీ గుజ్రాల్ (52) ఇకలేరు. సోమవారం (ఫిబ్రవరి 27న) ఆయన కన్నుమూశారు. భారతీయ స్టాక్ మార్కెట్లో సాంకేతిక విశ్లేషణలో విశేష నైపుణ్యంతో పాపులర్ ఎనలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ముఖ్యంగా సీఎన్‌బీసీ టీవీ 18లో,ఈటీ నౌ లాంటి బిజినెస్ చానెళ్లలో రోజువారీ మార్కెట్ ఔట్లుక్, ఇంట్రాడే ట్రేడింగ్ సూచనలు, సలహాలతో ట్రేడర్లను ఆకట్టుకునేవారు. మణిపాల్ విశ్వవిద్యాలయం నుండి ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీతో పాటు జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయం నుండి ఎంబీఏ(ఫైనాన్స్) పట్టా పొందిన గుజ్రాల్ 1995 నుండి తన స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ వృత్తిని ప్రారంభించారు. ఈ క్రమంలో మార్కెట్లో మనీ సంపాదించాలి, ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఎలా చేయాలి అనే అంశాపై మూడు పుస్తకాలను కూడా రాశారు గుజ్రాల్. అలాగే యూఎస్ ఆధారిత మ్యాగజైన్లు , జర్నల్స్‌లో ట్రేడింగ్ , టెక్నికల్ అనాలిసిస్‌పై రాశారు. -
సైన్సును తొక్కిపెట్టడం ప్రజాహితమా?
జోషీమఠ్ కొంతకాలంగా కుంగిపోతూ ఉందని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇచ్చిన కీలకమైన నివేదికను గుర్తించడానికి బదులుగా... దేశీయ శాస్త్ర పరిశోధనా సంస్థల నోరు మూయిస్తూ జాతీయ విపత్తు నిర్వహణా ప్రాధికార సంస్థ నిషేధాజ్ఞను జారీ చేసింది. శాస్త్రీయ సమాచారాన్ని తొక్కిపెట్టడమనేది ప్రజా హితం కోసం శాస్త్రవిజ్ఞానాన్ని అన్వయించడంలో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఒక శాస్త్రజ్ఞుడు తన అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి సంబంధించిన విషయం కాదు. ప్రభుత్వ విధాన నిర్ణయంలో సైన్స్ పాత్రకు సంబంధించింది. జీఎం ఆహార పదార్థాలు, నాసిరకం మందులు, డేటా గోప్యత, సూక్ష్మజీవుల నిరోధకత వంటి పలు స్పర్థాత్మక అంశాల్లో నిపుణుల అభిప్రాయాలు ఆరోగ్యకరమైన చర్చకు వీలుకల్పిస్తాయి. జోషీమఠ్ సంక్షోభం మరొక తత్సమానమైన తీవ్ర సవాలును దేశం ముందు ఉంచింది. అదేమిటంటే భారతీయ శాస్త్ర పరిశోధనా మండలులను, విద్యావిషయిక సంస్థలను నెమ్మదిగా క్షీణింపజేస్తూ రావడమే. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘ఇస్రో’ అనుబంధ విభాగమైన హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్ఆర్ఎస్సి) అందించిన రిమోట్ సెన్సింగ్ డేటాపై ఆధారపడి, జోషీమఠ్ కుంగుబాటుపై కీలకమైన ప్రాథమిక అంచనా జనవరి 11న వెలువడింది. 2022 ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య జోషీమఠ్ 9 సెంటీమీటర్లు కుంగిందనీ, డిసెంబర్ 27 నుంచి 2023 జనవరి 8 మధ్యలో మరింత వేగంగా కుంగిందనీ ఈ నివేదిక తెలిపింది. జోషీమఠ్‌లో పరిస్థితి తీవ్రతను ఎత్తిచూపిన మొట్టమొదటి శాస్త్రీయ నివేదిక ఇదే. ఈ నివేదిక తీవ్రతను గుర్తించి, సకాలంలో వ్యవహరించడంలో తాను విఫలమయ్యాయని ఒప్పుకోవడానికి బదులుగా శాస్త్ర పరిశోధనా సంస్థల నోరు మూయిస్తూ జాతీయ విపత్తు నిర్వహణా ప్రాధికార సంస్థ (ఎన్డిఎమ్ఏ) నిషేధాజ్ఞను జారీ చేసింది. సాంప్రదాయిక లేదా సామాజిక మాధ్యమాల ద్వారా జోషీమఠ్‌పై ఎలాంటి సమాచారాన్ని లేక అభిప్రాయాన్ని ప్రజలతో పంచుకోవద్దని ఆదేశించింది. ఎన్ఆర్ఎస్సి, ఇస్రోలను మాత్రమే కాదు; శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి; శాస్త్ర, సాంకేతిక విభాగం; జలవనరుల మంత్రిత్వ శాఖ; ఐఐటీ–రూర్కీతోపాటు సర్వే ఆఫ్ ఇండియా, జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వంటి పలు శాస్త్రీయ సంస్థలకు చెందిన పరిశోధనా ల్యాబ్‌ల నోరు మూయించారు. ఈ సందర్భంగా ఎన్డీఎమ్ఏ ఆదేశం కనీవినీ ఎరుగనిదీ. ఎన్డీఎమ్ఏ కానీ, హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కానీ శాస్త్రీయ పరిశోధనా సంస్థల మాతృసంస్థలు కావు. కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన ఒక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారని ఎన్డీఎమ్ఏ ఆదేశం సూచించినందున, ఇది రాజకీయ నిర్ణయం మాత్రమే. ఇస్రో, íసీఎస్ఐఆర్ వంటి సంస్థలు కాగితం మీద అయినా సరే స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు. ఇవి హోంశాఖ పర్యవేక్షణలో లేనేలేవు. కొద్దినెలల క్రితమే, అన్ని శాస్త్ర విభాగాల కార్యదర్శులతో సమావేశానికి పిలుపునిచ్చిన హోంశాఖ కార్యదర్శి తన అధికారాల పరిధిని అతిక్రమించడమే కాకుండా ఇంతవరకు శాస్త్రవేత్తలకు, పరిశోధకులకు ఇచ్చిన అవార్డులన్నింటినీ ఒక్క కలంపోటుతో రద్దు చేసిపడేశారు. జన్యుపరంగా పరివర్తింపజేసిన ఆహార ధాన్యాలపై ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రకటనలూ చేయవద్దంటూ... పనిచేస్తున్న, రిటైరైన శాస్త్రవేత్తలను ఐసీఏఆర్ ఇటీవలే తీవ్రంగా హెచ్చరించింది. శాస్త్ర పరిశీలనలపై ఆధారపడిన చర్చలు, వాటి సమాచారాన్ని ప్రజలకు పంచిపెట్టడాన్ని ప్రోత్సహించాలి. అనేక రంగాలలో శాస్త్రవేత్తలు నిత్యం డేటాను పంచుకుంటారు. అమెరికా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిష్ట్రేషన్ (నాసా)కు రిమోట్ సెన్సింగ్ డేటాను నిత్యం షేర్ చేసే పోర్టల్స్ ఉన్నాయి. ప్రపంచంలో ఎక్కడ భూకంపాలు చోటుచేసుకున్నా దానికి సంబంధించిన డేటాను యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే వెబ్సైట్లో రియల్ టైమ్‌లో అందుబాటులో ఉంచుతుంటారు. ఇక జెనెటిక్ సీక్వెన్స్ డేటాబేస్లు ప్రపంచమంతటా శాస్త్రపరిశోధకులకు అందుబాటులో ఉంటున్నాయి. ఎన్ఆర్ఎస్సి రూపొందించిన అంచనాల్లో ఒక భాగం, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ఉపగ్రహం సెంటినెల్–1 నుంచి తీసిన ఛాయాచిత్రాలపై ఆధారపడి ఉంటోంది. ఈ ఉపగ్రహం సింథెటిక్ అపెర్చుర్ రాడార్‌ని కలిగివుంది. ఆకాశం మేఘావృతమై ఉన్నప్పుడూ, అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ రాత్రింబవళ్లు డేటాను సేకరించడంలో ఇది తోడ్పడుతుంది. ఎన్ఆర్ఎస్సి మదింపులో రెండో భాగం భారతీయ ఉపగ్రహమైన కార్టోసాట్–2ఎస్ నుంచి పంపిన ఛాయాచిత్రాలపై ఆధారపడి ఉంటోంది. ఇది 0.65 మీటర్ల రిజల్యూషన్ తో అన్ని రంగులను గుర్తించగలిగే ఛాయచిత్రాలను అందిస్తుంది. ఈ నేప థ్యంలో ఇఎస్ఏ, ఇస్రో నుండి పొందిన రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించుకునే విశ్లేషణతో ముందుకొచ్చే ఎన్ఆర్ఎస్సి డేటాను ఎవరైనా అభినందించాలి తప్ప ఆంక్షలు విధించరాదు. ఈ విశ్లేషణ... ప్రభావిత ప్రాంతాల్లో నివసించే వారిలోనే కాకుండా, దేశ పౌరుల్లో కూడా గందరగోళాన్ని రేకెత్తిస్తున్నట్లు ఎన్డీఎమ్ఏ కనిపెట్టింది మరి. రిమోట్ సెన్సింగ్ డేటాను ఉపయోగించడంపై చర్చ ఉత్తరాఖండ్ ఉదంతం నేపథ్యంలో చోటు చేసుకుంటోంది. ఎందుకంటే భారత్‌లో రిమోట్ సెన్సింగ్ అధ్యయనాలకు ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ జన్మస్థలం. ఇక్కడే భారతీయ ఫొటో ఇంటర్‌ప్రెటేషన్ ఇనిస్టిట్యూట్ (ఐపీఐ)ని 1966లో స్థాపించారు. ఇది 1957లో జవహర్లాల్ నెహ్రూ నెదర్లాండ్స్ సందర్శన సందర్భంగా కుదిరిన ఒప్పంద ఫలితం. ఐపీఐ... భారతీయ సర్వే సంస్థ ఆధ్వర్యంలో పనిచేస్తుంటుంది. దీన్ని 1969లో ఏర్పడిన ఇస్రోకు బదలాయించారు. ఇప్పుడు ఇది ఇస్రో నేతృత్వంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్ పేరిట వ్యవహరిస్తోంది. మొట్టమొదటి భారతీయ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ 1988లో ఐఆర్ఎస్–1ఏ పేరిట ఆపరేషన్లను ప్రారంభించింది. ఈరోజు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థకు నాలుగు అత్యధునాతనమైన రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలున్నాయి. అవి రిసోర్స్‌శాట్, కార్టోశాట్, ఓషనోశాట్, రైశాట్. భారతీయ ఫారెస్ట్ మ్యాప్ రూపకల్పన కోసం రిమోట్ సెన్సింగ్ డేటాను 1980లలో ఉపయోగించి, ఇస్రో చారిత్రాత్మకమైన తోడ్పాటును అందించింది. ఇది దేశంలో భారీ ఎత్తున అడవుల నరికివేత జరిగిందని చూపించింది. అంతవరకు భారతీయ ఫారెస్ట్ సర్వే సంస్థ (ఎఫ్ఎస్ఐ) రూపొందించిన ఫారెస్టు మ్యాప్‌లతో ఇస్రో మ్యాప్‌లు విభేదించాయి. ఈ కొత్త డేటా వెల్లడించినందుకు నోరు మూసుకోమని ఎవరూ ఆదేశించలేదు. దానికి బదులుగా, భారతీయ ఫారెస్ట్ సర్వే సంస్థ తన మ్యాపింగ్ ప్రక్రియలో రిమోట్ సెన్సింగ్ ఆధారిత టెక్నిక్‌ను పొందుపర్చుకోవడానికి అనుమతించారు. దీనివల్ల అడవుల విస్తీర్ణంపై కచ్చితమైన అంచనాకు రావడం సాధ్యమైంది. నిపుణుల జ్ఞానాన్ని తొక్కిపెట్టడమనేది ప్రజా హితం కోసం శాస్త్రవిజ్ఞానాన్ని అన్వయించే విషయంలో తీవ్ర పర్యవసానాలకు దారితీస్తుంది. ఇది వ్యక్తిగతంగా ఒక శాస్త్రజ్ఞుడు తమ అభిప్రాయాలను వ్యక్తపర్చడానికి, డేటాను షేర్ చేసే హక్కుకు సంబంధించిన విషయం కాదు. అది ప్రభుత్వ విధాన నిర్ణయంలో, ప్రజాభిప్రాయాన్ని మలచడంలో సైన్స్ పాత్రకు సంబంధించిన విషయం. డేటాను పంచుకోవడం, నిపుణుల అభిప్రాయాలు లేక పరిశోధనా పత్రాలు అనేవి... జీఎం– ఆహార పదార్థాలు, హిమాలయ పర్యావరణం, నాసిరకం మందులు, డేటా గోప్యత లేదా సూక్ష్మజీవుల నిరోధకత వంటి పలు స్పర్థాత్మక అంశాల్లో ఆరోగ్యకరమైన చర్చలకు వీలుకల్పిస్తాయి. పరిశోధనా సంస్థలు, విశ్వవిద్యాలయాలు, వివిధ అంశాలపై నిపుణులతో కూడిన విద్యా కేంద్రాలకు సంబంధించి విస్తారమైన నెట్వర్క్ కలిగి ఉన్న భారత్ వంటి దేశంలో, భిన్నాభిప్రాయాలు నిత్యం రంగంమీదికి వస్తుంటాయి. ఇలాంటి విభేదాలను సైంటిస్టులు, విద్యావేత్తలు, పౌర సమాజం తోడ్పాటుతో ఆరోగ్యకరమైన ప్రజా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. 1980లలో, కైగా అణు విద్యుత్ సంస్థపై తీవ్రవివాదం నెలకొన్న నేపథ్యంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్... దేశంలోని అణు శాస్త్రవేత్తలు, పర్యావరణ కార్యకర్తల మధ్య ఒక చర్చను నిర్వహించింది. ఈరోజుల్లో అలాంటి చర్చలనుంచి పరిశోధనా మండలులు, విద్యా సంస్థలు దూరం జరుగుతున్నారు. వీటి మౌనంతో శాస్త్ర పరిశోధనా సంస్థల స్వయం ప్రతిపత్తిని మరింతగా క్షీణింప జేసేందుకు ప్రభుత్వానికి ప్రోత్సాహం లభిస్తోంది. దినేశ్ సి. శర్మ , వ్యాసకర్త శాస్త్ర వ్యవహారాల వ్యాఖ్యాత, (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
India Foreign Policy: 2023లో మన విదేశాంగం ఎటు?
మరొక కల్లోలభరితమైన సంవత్సరం ముగిసింది. 2022 ప్రారంభంలో యుద్ధం యూరోపియన్ తీరాలకు చేరుకుంది. కోవిడ్–19 అనంతర సాధారణ స్థితికి ప్రపంచం వస్తున్న తరుణంలోనే ఉక్రెయిన్ను రష్యా ఆక్రమించడంతో ప్రపంచ క్రమవ్యవస్థకు కొత్త సవాళ్లను విసిరినట్టయింది. అమెరికా–చైనా మధ్య ఘర్షణ పదునెక్కుతున్న స్థితిలో రష్యా–చైనా మధ్య బంధం మరింతగా బలపడుతోంది. ప్రతి విషయంలోనూ ఆయుధీకరణ కొత్త వ్యవస్థగా ఆవిర్భవిస్తున్నందున ప్రపంచీకరణ వ్యతిరేక క్రమం చుట్టూ చర్చ బలం పుంజుకుంటోంది. ఈ ఉపద్రవం మధ్య అంతర్జాతీయ సంస్థలు నూతన సవాళ్లను ఎదుర్కోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేవు. కాబట్టి, నూతన సంస్థాగత నిర్మాణాల కోసం శోధన ముందుకు వచ్చింది. జాతీయ వ్యూహాత్మక చింతనకు చెందిన కొన్ని మౌలిక భావనలకు బహిరంగంగా వ్యతిరేకత ఎదురవుతున్నప్పుడు భారతీయ విదేశీ విధానం ఒక సంవత్సర కాలంలో ఈ అన్ని మలుపులకూ స్పందించాల్సి వచ్చింది. 2020లో గల్వాన్ సంక్షోభం భారత ప్రభు త్వాన్ని తన చైనా విధానాన్ని తిరిగి మదింపు చేసుకునేలా ఒత్తిడికి గురిచేసింది. ఆ విధంగానే ఉక్రెయిన్ యుద్ధం భారత్‌ను తన రష్యా విధాన చోదక శక్తుల పట్ల వైఖరిని తిరిగి పరిశీలించుకునేలా చేసింది. అలాగే పాశ్చాత్య ప్రపంచంతో తన వ్యవహార శైలిని కొత్తగా రూపొం దించుకునేందుకు కూడా వెసులుబాటు కల్పించింది. 2022 ఫిబ్ర వరిలో రష్యన్ దురాక్రమణ ప్రారంభమైనప్పుడు, డిమాండ్ చేస్తున్న పాశ్చాత్య దేశాలు ఒకవైపు, విఘాతం కలిగించే రష్యా మరొకవైపు ఉంటున్న స్థితిలో రెండు శక్తులతోనూ సంబంధాలను భారత్ ఎంత కష్టంగా నిర్వహిస్తుందనే అంశంపై చాలా చర్చ జరిగింది. అయితే అత్యంత సంక్లిష్టమైన ప్రపంచ సమస్యపై భారత్ సమతుల్యత ప్రదర్శించడం నుంచి నూతన సంవత్సరం నాడు ప్రారంభమైంది. ఇంధన భద్రత కోసం రష్యాతో తన సంబంధ బాంధవ్యాలను భారత్ కొనసాగించడమే కాదు, మాస్కోతో ఇంధన పొత్తులను మరింతగా పెంచుకోగలిగింది. రష్యాను బహిరంగంగా ఖండించక పోవడం ద్వారా పాశ్చాత్య ప్రపంచం పక్షాన భారత్ నిలబడలేదని పాశ్చాత్య దేశాల్లో కొంతమంది విమర్శిస్తున్న సమయంలోనే, సంవత్సరం పొడవునా పాశ్చాత్య దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడ్డాయి. భారత్ తన వంతుగా ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం, ప్రాదేశిక సార్వభౌమాధికారం నేపథ్యంలో రష్యన్ దురాక్రమణపై ఆరోపించడం నుంచి తన వైఖరిని మార్చు కుంది. ఈ క్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇది యుద్ధ సమయం కాదని రష్యన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్‌కు బహిరంగం గానే బోధ చేసేంతవరకు పోయారు. బాలి సదస్సులో జీ20 దేశాల చర్చల సమయంలో సెంటిమెంటును రంగరించి మరీ మోదీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సంవత్సరం ముగిసే సమయానికి ఉక్రెయన్ సంక్షోభాన్ని ముగించే విషయంలో భారత్ మరింత క్రియాశీలక పాత్ర చేపట్టనుందని అంచనాలు పెరిగిపోయాయి. చివరకు ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమీర్ జెలెన్స్కీ ఫోన్ చేసి మరీ మాట్లాడారు. రష్యా పట్ల భారత్ వైఖరిని పాశ్చాత్య ప్రపంచం ప్రారంభంలో విమర్శనాత్మకంగా అంచనా వేసింది. కానీ ఉక్రెయిన్ సమస్యపై దౌత్యపరమైన ప్రయత్నాల విషయంలో భారత్ చొరవను చివరకు పాశ్చాత్య దేశాలు హేతుపూర్వకంగా గుర్తించాల్సి వచ్చింది. యూరప్ సమస్యలు ప్రపంచ సమస్యలు అవుతాయి కానీ ప్రపంచ సమస్యలు యూరప్ సమస్యలు కావు అనే ఆలోచనలోని కపటత్వాన్ని భారత్ నొక్కి చెప్పింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇండో–పసిఫిక్ వ్యవహారాలకు సంబంధించి భారత్ కేంద్ర స్థానం విషయంలో యూరప్ దేశాలు నిశ్చితాభిప్రాయానికి వచ్చేశాయి. దీంతో ఈ సంవత్సరం భారత్–యూరోప్ సంబంధాలు కొత్త పుంతలు తొక్కాయి. యూరోపియన్ స్థలపరిధుల్లో రష్యాకు ప్రధాన స్థానం ఉన్నప్పటికీ, చైనా నుండీ, దాని దూకుడు ఎత్తుగడలనుంచే తమకు దీర్ఘకాలిక వ్యూహాత్మక సవాళ్లు ఎదురు కానున్నాయని యూరప్ దేశాలకు స్పష్టంగా బోధపడింది. వారి వ్యూహాత్మక తర్కం కారణంగా అమెరికాతో భారత్ సంబంధాలు కూడా ముందంజ వేశాయి. ఇండో–పసిఫిక్ నేడు అత్యంత కీలకంగా మారింది. పసిఫిక్ ప్రాంతంలో ‘క్వాడ్’, మధ్య ప్రాచ్యంలో ‘ఐ2యు2’ (ఇజ్రాయెల్, ఇండియా, యూఎస్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్) రెండు కీలక భూభాగాల్లో సంస్థాగత వ్యాఖ్యాత లుగా ఆవిర్భవిస్తున్నాయి. న్యూఢిల్లీ, వాషింగ్టన్ ద్వైపాక్షిక సంబంధా లకు మించి, తమ వ్యవహారాలకు చెందిన ఎజెండానే పునర్నిర్వ చించుకుంటున్నాయి. దాంతోపాటు తమ ఆకాంక్షల ఆకృతులను మరింతగా పరిగణనలోకి తీసుకుంటున్నాయి. భారతదేశం నిర్వహంచే అంతర్జాతీయ పాత్రను ప్రపంచం ఇప్పుడు మరింత సీరియస్‌గా తీసుకుంటోంది. ఎందుకంటే సంక్లిష్టమైన గ్లోబల్ సమస్యలను భారత్ ఇప్పుడు మరింతగా పట్టించుకుంటూ, నాయకత్వం వహించగలుగుతోంది. ప్రపంచ సమస్యలకు అది పరిష్కారాలు అందించడానికి సిద్ధపడుతోంది. భావసారూప్యత కలిగిన దేశాలతో భాగస్వామ్యాలను ఏర్పర్చుకుంటోంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్ తన అధ్యక్ష స్థానాన్ని.. సంస్కరించిన బహుపాక్షికతను, శాంతిపరిరక్షణను, ఉగ్రవాద నిరోధకతను, సముద్ర భద్రతను నొక్కి చెప్పడానికి ఉపయోగించుకుంది. ఈ సమస్యలు భారత్ ప్రయోజనాలకే కాదు, ప్రపంచంలోని విశాల భాగం ప్రయోజనాలకు కూడా చాలా ముఖ్యమైనవి. భద్రతాసమితిలో భారత్ వ్యవహరిస్తున్న తీరులో ఆచరణా త్మకతకు చెందిన కొత్త అర్థం ప్రస్ఫుటమవుతోంది. ఇంతవరకు వినపడకుండా కనిపించకుండా పోయిన విశాల మెజారిటీ దేశాల గురించి మాట్లాడేలా భారత వాణి ఉంటోంది. ఈ ప్రాధాన్యత ప్రాతిపదికపైనే అది జీ20 కూటమి అధ్యక్షత బాధ్యతను చేపడుతోంది. బహుపాక్షికత అనేది తన విశ్వసనీయతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సమయంలో ప్రపంచం ఎదుర్కొంటున్న కీలకమైన సవాళ్లు కొన్నింటికి పరిష్కారాలను అందించే విషయంలో అందరి కళ్లూ న్యూఢిల్లీ చేపట్టిన జీ20 నాయకత్వంపైనే ఉన్నాయి. ఇది అంతర్జాతీయ పర్యవసానాలను రూపుదిద్దగలిగే ‘నాయకత్వ శక్తి’గా భారత్ తన విశ్వసనీయతను పెంపొందించుకోవలసిన సమయం. ప్రత్యే కించి భారత గాథ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్న సమయంలో ఇది ఎంతో అవసరం. భారత్ అంతర్జాతీయ పాత్రను మెచ్చుకునే పరిణామాలు ఏర్పడు తున్న సమయంలో ప్రముఖ ఆర్థిక శక్తిగా ఆవిర్భవించడం కీలక పాత్ర పోషించనుంది. ప్రపంచం మొత్తంగా బీజింగ్ వ్యవహారాలపై తీవ్ర అసమ్మతి వ్యక్తపరుస్తున్న తరుణంలో చైనా దూకుడును నిలువ రించడంలో దృఢ వైఖరిని ప్రదర్శిస్తున్న భారత్ కొత్త అవకాశాలను సృష్టించుకుంది. 2022లో ఇలాంటి కొన్ని అవకాశాలను అంది పుచ్చుకోవడంలో భారతీయ విదేశీ విధానం విజయవంతమైంది. మరోవైపున చైనా సవాలు సమీప భవిష్యత్తులో భారత ప్రభుత్వ సమర్థతను పరీక్షించడం కొనసాగించనుంది. శీతాకాలం తర్వాత కూడా ఉక్రెయిన్ సంక్షోభం కొనసాగినట్లయితే భారత్, రష్యా పొత్తు కూడా నిశిత పరిశీలనకు గురవుతుంది. న్యూఢిల్లీ పదేపదే చెబుతున్న ‘బహుళ–అమరిక వాదం’ కూడా 2023లో తీవ్రమైన ఒత్తిడి పరీక్షకు గురికాక తప్పదు. అయితే 2022 గురించి ఏమైనా చెప్పుకోవాలీ అంటే, భారత వాణి విశిష్టతను ప్రపంచం గుర్తించింది. మున్ముందు అది అంతర్జాతీయ వేదికలపై మరింతగా విస్తరిస్తుంది. ఇప్పుడప్పుడే దాని ప్రతిధ్వనులు తగ్గిపోవు. (క్లిక్ చేయండి: అమృతోత్సవ దీక్షకు ఫలితం?!) - హర్ష్ వి. పంత్ ఉపాధ్యక్షుడు, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్, న్యూఢిల్లీ (‘ద హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
రష్యా చమురు ధరపై పరిమితితో సంక్షోభం!
ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాను నయానో, భయానో తమ దారిలోకి తెచ్చుకునేందుకు అమెరికా, దాని మిత్రదేశాలూ శతవిధాలా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. అందులో భాగంగానే కొత్తగా జీ7, ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ దేశాలు... రష్యా ఎగుమతి చేసే ముడి చమురు ధరపై బ్యారెల్‌కు 60 డాలర్ల కనీస పరిమితి విధిస్తూ క్రితం వారం నిర్ణయం తీసుకున్నాయి. అయితే ఒపెక్ ప్లస్ (రష్యా) దేశాలు మాత్రం రానున్న నెలల్లో ముడిచమురు ఉత్పత్తిని రోజుకు 20 లక్షల బ్యారెల్స్ తగ్గిస్తామని వెల్లడించాయి. ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితులు మందకొండిగా ఉండటమే ఇందుకు కారణమంటున్నాయి. కాగా చమురు ఉత్పత్తిని పెంచమని అమెరికా అధ్యక్షుడు సౌదీ అరేబియాపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రపంచ చమురు ఎగుమతి చేసే దేశాల్లో 2వ స్థానంలో రష్యా ఉంది. చమురు ధరపై కనీస పరిమితి విధించి చమురు ఎగుమతి ద్వారా వచ్చే ఆదాయాలను నీరుగార్చి రష్యా ఆర్థిక వ్యవస్థను సంక్షోభంలోకి తీసుకెళ్లాలనేది ఈయూ దేశాల తపన. ఇది సఫలీకృతమైతే అమెరికా తన ఆధిపత్యం కొనసాగనీయ వచ్చనేది వ్యూహం. రష్యా ముడిచమురు ధరపై పరిమితి విధించడాన్ని క్రెమ్లిన్ తీవ్రస్థాయిలో ఖండించింది. రష్యాపై ఆంక్షలు విధించినప్పుడల్లా ప్రపంచ దేశాలపై ముఖ్యంగా ఐరోపా దేశాలపై అవి తీవ్ర ప్రతికూల ప్రభావాల్ని కలుగ జేస్తున్నాయని రష్యా గుర్తుచేసింది. రష్యాపై ఆంక్షల నేపథ్యంలో ముడిచమురు ధరలు 2022 ఫిబ్రవరి నుండి పెరుగుతూ వస్తున్నాయి. దీనితో ఈ సంవత్సరం రష్యా అదనంగా 41 శాతం లాభాలను పెంచుకొని ఆంక్షలు విధించిన దేశాలకు, అమెరికాకు షాక్ ఇచ్చింది. రష్యాతో స్నేహంగా లేని దేశాలకు మొత్తం ముడిచమురు ఎగుమతులను ఆపేసి, ప్రత్యామ్నాయ మార్కెట్లుగా వేరే దేశాలను (భారత్, చైనాలు) ప్రోత్సహిస్తామని రష్యా అంటోంది. మన విదేశాంగమంత్రి జైశంకర్ కూడా రష్యాపై ఆంక్షలకూ భారత్‌కూ సంబంధంలేదని స్పష్టం చేశారు. ఈ వారంలో జర్మనీ విదేశాంగమంత్రి అన్నాలేనా బేర్బాక్ న్యూఢిల్లీలో జైశంకర్‌ను కలిసి ఈయూ విధించిన పరిమితి ధరకు మద్దతునివ్వాలని అభ్యర్థించగా జైశంకర్ తోసి పుచ్చారు. యూరప్ ఇంధన అవసరాలకు అనుగుణంగా భారత్ ప్రాధాన్యతలను ఎంపిక చేసుకోజాలదని అన్నారు. రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధం ప్రారంభం కాక ముందునుందే భారత్, రష్యాల మధ్య ముడిచమురు వాణిజ్యం ఉందని జైశంకర్ అన్నారు. బ్యారెల్ ముడి చమురు ధర 60 డాలర్లకూ, అంత కన్నా తక్కువ బిల్లు చేస్తే... ప్రపంచ ఇన్సూరెన్స్ కంపె నీలు బీమా చేయడానికి ముందుకురావు. దీనితో రష్యా ముడిచమురు రవాణా స్తంభించి పోతుందని ఈయూ ఆలోచన. ముడి చమురుపై పరిమితి విధించిన రెండురోజుల్లో బ్యారెల్ చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో 2 శాతం పెరిగింది. పరిశ్రమలకు అత్యంత అవసరమైన ఇంధన రవాణాను నిలిపివేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు చిన్నా భిన్నమైపోతాయి. ఇదివరలో యూరప్ దేశాలకు రష్యా ముడి చమురు చాలా ఎగుమతి జరిగేది. తాత్కాలికంగా కొంతమేర దిగుమతులు ఆపినప్పటికీ రష్యా ఇంధనాన్ని ఈయూ దేశాలు వేరే మూడవ దేశం ద్వారా దిగుమతి చేసుకొంటున్నాయి. లిథువేనియా 83 శాతం, ఫిన్లాండ్ 80 శాతం, స్లొవేకియా 74 శాతం, పోలాండ్ 58 శాతం, హంగేరి 43 శాతం, ఎస్తోనియా 34 శాతం, జర్మనీ 30 శాతం, గ్రీస్ 29 శాతం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాయి. మిగతా దేశాల దిగుమతి కూడా ఇంచు మించు 15 శాతం తగ్గకుండా ఉంది. ఇప్పుడు అకస్మాత్తుగా ధరల పరిమితి విధింపుతో రష్యాతోపాటుగా ఈయూ దేశాల ఆర్థిక వ్యవస్థలూ చాలా నష్టపోనున్నాయి. రానున్న వారాల్లో ముడి చమురు ధర అంతర్జాతీయంగా 100 డాలర్లు దాటుతుందని నిపుణుల అభిప్రాయం. ఇదివరకటి ‘విన్–విన్’ వాణిజ్య పరిస్థితులు ఇప్పుడు ‘లాస్–లాస్’ పరిస్థితులుగా పరిణమించాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ధరలు తగ్గినప్పుడల్లా లాభాలను కార్పొరేట్లు అనుభవిస్తున్నారు. ధరలు పెరుగు తునప్పుడు నష్టాల భారాన్ని ప్రజలపై మోపటంతో ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతూ వస్తోంది. ఫలితంగా ప్రతి దేశంలోనూ ద్రవ్యోల్బణం పెరుగుదలతోపాటు నిరుద్యోగం, నిత్యా వసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. ఇందువల్ల జీవన ప్రమాణాలు తగ్గిపోతూ ఆర్థిక మాంద్యం వైపు దేశాలు కుంటుతున్నాయి. ఉక్రెయిన్–రష్యాల మధ్య జరుగుతున్న యుద్ధంలో మరణించిన సైనికుల కంటే... ఈ చలికాలం యూరప్‌లో ప్రజలు ఇంధన కొరతతో ఎన్నో రెట్లు చలిబారిన పడి చనిపోతారని అంచనా వేస్తున్నారు. యుద్ధాన్ని నివారించక, శాంతి చర్చలు జరగనీయకుండా ఆయుధాలతో, ఆంక్షలతో యుద్ధం పరిసమాప్తమవుతుందని అనుకోవటం అవివేకం. ఇప్పటికే రష్యాపై ఆంక్షలతో యూరప్ ప్రజలు, పరోక్షంగా అభివృద్ధి చెందుతున్న దేశాలూ తీవ్రంగా నష్టపోతున్నాయి. అమెరికా మాత్రం లబ్ధిపొందుతోంది. 3 సంవత్సరాల క్రితం ఒపెక్ దేశాలు, రష్యా ఆర్థిక వ్యవస్థలను నష్ట పరచే విధంగా అమెరికా షేల్ చమురును ప్రవేశపెట్టడంతో బ్యారెల్ చమురు 28 డాలర్లకు పడిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా విధించిన ఈ కనీస 60 డాలర్ల పరిమితి వల్ల నష్టపోయేదీ ఈయూ దేశాలే. ప్రపంచ సాకర్ వేళ ఇది ఈయూ ‘సెల్ఫ్ గోల్’ కానుందా! (క్లిక్ చేయండి: డేటా రక్షణకు ఢోకా లేనట్లేనా?!) - బుడ్డిగ జమిందార్ అసోసియేట్ ప్రొఫెసర్, కె. ఎల్. వర్సిటీ -
గుజరాత్ లో బీజేపీ గెలుపుపై " సాక్షి విశ్లేషణ "
-
బలహీన రూపాయితో భారత్ కంపెనీలు బేఫికర్
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో పెరుగుతున్న వడ్డీ రేట్లు, అధిక ఇంధన ధరలు వంటి అంతర్జాతీయ సవాళ్లు కరెన్సీ అస్థిరతను పెంచుతాయని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మంగళవారం తెలిపింది. అయితే దేశంలోని పలు రేటింగ్ కంపెనీలు బలహీనమైన రూపాయిని తట్టుకోగలిగిన పరిస్థితిని కలిగిఉన్నాయని విశ్లేషించింది. ఏడాది ప్రారంభం నుంచి డాలర్ మారకంలో రూపాయి విలువ దాదాపు 10 శాతం క్షీణించింది. అక్టోబర్ 19న అమెరికా కరెన్సీలో రూపాయి విలువ 60 పైసలు పతనమై, చరిత్రాత్మక కనిష్టం 83 వద్ద ముగిసింది. అదే రోజు ఇంట్రాడేలో 83.01నీ చూసింది. అప్పట్లో గడచిన కేవలం 14 రోజుల్లో 100 పైసలు నష్టపోయి, 83 స్థాయిని చూసింది. కాగా, మరుసటి రోజు అక్టోబర్ 20న బలహీనంగా 83.05 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అయితే చివరకు చరిత్రాత్మక పతనం నుంచి 21 పైసలు కోలుకుని 82.79 వద్ద ముగిసింది. అటు తర్వాత కొంత బలపడినా, రూపాయి ఇంకా బలహీన ధోరణిలోనే ఉందన్నది విశ్లేషణ. ఈ నేపథ్యంలో మూడీస్ తాజా నివేదికలో మరికొన్ని ముఖ్యాంశాలు.. ► అధిక ఇంధన ధరలు, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థల్లో వడ్డీ రేట్ల స్థిరమైన పెరుగుదల వంటి అంశాలు భారత్ కరెంట్ అకౌంట్ (దేశంలోకి నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) ప్రభావం చూపుతాయి. ఇది రూపాయిపైనా ఒత్తిడిని పెంచుతుంది. ► అయితే ఈ తరహా అంతర్జాతీయ సవాళ్లను దేశ కరెన్సీ ఎదుర్కొంటున్నప్పటికీ, భారతదేశంలోని చాలా రేటెడ్ కంపెనీలు రూపాయి క్షీణతను తట్టుకునే బఫర్లను కలిగి ఉన్నాయి. ► రూపాయి క్షీణించడం దేశీయ కరెన్సీలో ఆదాయాన్ని ఆర్జించే భారతీయ కంపెనీలకు క్రెడిట్ ప్రతికూలమే. అయితే ఆయా కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన నిధుల విషయంలో డాలర్ రుణ నిష్పత్తి ఎంతుందన్న విషయంపై ఇది ఆధారపడి ఉంటుంది. ► పలు అంశాల విశ్లేషణల అనంతరం, రేటింగ్ పొందిన కంపెనీలకు ప్రతికూల క్రెడిట్ చిక్కులు పరిమితంగా లేదా తాత్కాలికంగా ఉంటాయని మేము భావిస్తున్నాం. ► చాలా రేటెడ్ కంపెనీలు కరెన్సీ హెచ్చుతగ్గుల ప్రభావాన్ని పరిమితం చేయడానికి తగిన రక్షణలను (హెడ్జింగ్ సౌలభ్యాలు) కలిగి ఉన్నాయి. రూపాయి తీవ్ర పతన సమయాల్లోనూ ఈ ప్రతికూల ప్రభావాలను పరిమితం చేయడంలో ఇవి దోహదపడతాయి. ► భారతదేశం రుణంలో ఎక్కువ భాగం స్థానిక కరెన్సీలో ఉంది. విదేశీ కరెన్సీ రుణం బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక అభివృద్ధి భాగస్వాముల నుండి దాదాపు రాయితీల ప్రాతిపదికన ఉంటుంది. ఈ నేపథ్యంలో రూపాయి బలహీనత వల్ల ఎకానమీకి ఇబ్బంది ఏదీ ఉండబోదు. ► రూపాయి విలువ క్షీణించడం వల్ల విదేశీ కరెన్సీ రుణాలను తీర్చగల ప్రభుత్వ సామర్థ్యంలో ప్రతికూలతలు ఏర్పడతాయని మేము భావించడం లేదు. ► భారత్ ఎకానమీలో ద్రవ్య స్థిరత్వానికి ఢోకా లేదు. ఆదాయాలు పటిష్టంగా ఉన్నాయి. రుణ పరిస్థితులు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆయా అంశాలు దేశంపై రేటింగ్‌కు సంబంధించి ఒత్తిడులను తగ్గిస్తాయి. ► మంచి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవ త్సరంలో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) అంచనాలకు అనుగుణంగా 6.4 శాతానికి (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందని భావిస్తున్నాం. భారత్‌కు మూడీస్ రేటింగ్ ఇలా... మూడీస్ గత ఏడాది అక్టోబర్‌లో భారత్ సావరిన్ రేటింగ్ అవుట్‌లుక్‌ను ‘నెగటివ్’ నుంచి ‘స్థిరత్వానికి’ అప్‌గ్రేడ్ చేసింది. ‘బీఏఏ3’ రేటింగ్‌ను పునరుద్ఘాటించింది. అయితే ఇది చెత్త గ్రేడ్‌కు ఒక అంచె అధికం కావడం గమనార్హం. భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ ఇటీవలే తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి కుదించింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణం. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంది. 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందన్నది మూడీస్ అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. -
" ఐటీకి ఏమైంది ".. సీనియర్ HR ప్రొఫెషనల్ చైతన్య రెడ్డి తో స్పెషల్ ఇంటర్వ్యూ
-
మునుగోడు ఉపఎన్నిక ఫలితంపై ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రావు విశ్లేషణ ...
-
ఎఫ్ఐఐల అమ్మకాలు కొనసాగుతాయి..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఇతర వర్ధమాన మార్కెట్లతో పోలిస్తే భారత మార్కెట్లు మెరుగైన పనితీరే కనబరుస్తున్నా యని పీజీఐఎం ఇండియా మ్యూచువల్ ఫండ్ హెడ్ (ఈక్విటీస్) అనిరుద్ధ నాహా తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) విక్రయాలను కొనసాగిస్తారని, నిధులను ఇతర మార్కెట్లలోకి తిప్పుతుంటారని ఆయన పేర్కొన్నారు. గత తొమ్మిది నెలలుగా ఎఫ్ఐఐలు విక్రయించడం, దేశీ సంస్థలు కొనుగోళ్లు జరుపుతుండటం కొనసాగుతోందని నాహా చెప్పారు. భారీ అమ్మకాలు వెల్లువెత్తుతున్నా, మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతు న్నప్పటికీ దేశీ ఇన్వెస్టర్లు పరిణితితో వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశీ మదుపుదారుల పెట్టుబడులు కొనసాగుతుండటంతో ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడిని తట్టుకుని మార్కెట్లు నిలబడు తున్నాయన్నారు. మార్కెట్లు మరికొంత కరెక్షన్‌కి లోనుకావచ్చని, అయితే ఈక్విటీలకు కేటాయింపులు జరిపేందుకు.. దీర్ఘకాలంలో సంపద సృష్టించుకునేందుకు ఇది సరైన సమయమని నాహా చెప్పారు. భారతీయులు సాధారణంగా ఈక్విటీలు, ఈక్విటీ ఫండ్లకు ఎక్కువగా కేటాయించరని, ప్రస్తుతం ఆ ధోరణి మారుతోందని తెలిపారు. మరోవైపు, రిస్కులను సమర్ధంగా ఎదుర్కొంటూ మెరుగైన రాబడులు పొందేందుకు, ట్యాక్సేషన్‌పరంగా ప్రయోజనకరంగా ఉండేందుకు బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్ (బీఏఎఫ్) ఆకర్షణీయంగా ఉంటున్నాయని నాహా పేర్కొన్నారు. దీనికి అనుగుణంగానే పీజీఐఎం ఇండియా బీఏఎఫ్‌ను నిర్వహిస్తున్నామని వివరించారు. మార్కెట్ వేల్యుయేషన్స్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు కొంత ఈక్విటీ భాగాన్ని హెడ్జ్ చేసి, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తామని.. తద్వారా మార్కెట్ పతనమైన పెద్దగా ప్రభావం పడకుండా ఉంటుందని నాహా చెప్పారు. అలాగే తక్కువ స్థాయిలో కొనుగోలు చేసి అధిక స్థాయిలో విక్రయించే సూత్రాన్ని పాటిస్తాం కాబట్టి మెరుగైన రాబడులు అందించేందుకు వీలవుతుందని పేర్కొన్నారు. -
మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా!
మొదటి సారి చదివి గొప్పగా ఉందిగా! అని అనుకున్న పుస్తకాన్ని, తొలిసారి చూసినపుడు అతి గొప్పది అనుకున్న సినిమాని , కలిసిన తొలిసారి ఒక అద్భుత వ్యక్తిని తెలుసుకున్నామనుకుని భ్రమించి. మళ్ళీ కలిసిన మరోసారి వీడేనా అవ్వాడు అనుకోవడం, ఇదేనా ఆ పుస్తకం! ఆ చిత్రరాజం ! అని నిరుత్సాహ పడిపోవడం అత్యంత సహజం. అంతే అది . ఆప్పుడెపుడో చదివిన గొప్ప పుస్తకం, ఎప్పుడో చూసిన ఒక సినిమా, రోజూ కలిసే అదే మనిషి- ఎప్పుడు , ఎన్నిసార్లు చూసినా, చదివినా, కలిసినా గొప్పగా అనిపించేలా చేసేవి చాలా తక్కువ మాత్రమే అంతే గొప్పగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే తమలోని గొప్పని ఇంకా గొప్పగా ప్రతిసారి మనముందు ఆవిష్కృతమవుతాయి. కాదు అవి అలాగే ఉంటవి, మనం ఆ గొప్పని ప్రతిసారీ గొప్పగా చూస్తాము అని అనుకుంటాను. ఇప్పుడు చెప్పబొయే ఈ ‘డెపార్చర్స్’ అనే సినిమాని నేను పదికి పైగా సంవత్సరాల మునుపు చూసా. అప్పుడు కదిలి పోయా, ఎంతలా కదిలి పోయానో ఇప్పుడు గుర్తు లేదు కానీ ఇప్పుడు మళ్ళీ ఈ సినిమా చూస్తుంటే నిలువెల్లా దుఃఖంలో నిండి స్వచ్చమైన దుఃఖపు నీరులా మనిషిని మొత్తం కరిగిపోయేలా చేసిన సినిమా ఇది. ఇంకో పదేళ్ల తరువాతయినా మళ్ళీ ఈ సినిమా చూసినపుడు అప్పుడు నాలో చెమ్మ మొత్తం ఇంకిపోయినా ఈ సినిమా ఆ నీటిని తిరిగి ఊరేలా చేస్తుందనే నమ్మకమే ఉంది. ఎలా చెప్పను ఈ సినిమా కథను మీకు? ప్రాణాలు కోల్పోయిన మనుషులని సైతం ప్రాణమున్న సీతాకోకచిలుక రెక్కలు తాకబోయినంత మృదువుగా తాకి అంతిమ వీడ్కోలు చెప్పే మనుషుల కథ ఇది. మన జీవితాలలో మనం ఎప్పటికీ ఎరుగని కొంతమంది అజ్ఞాత వ్యక్తుల కథ ఇది. ఎండుగట్టి కర్రలాగానూ, చల్లని మంచు రాయిలాగూను మారిన మన తండ్రినో, తల్లినో మిత్రుడినో, ఆత్మ బంధువు మృతదేహాన్ని మనం నిలువెల్లా శుభ్రం చేయగలమా? పంటి చిగుళ్ళు రుద్దడానికి ఈ వ్రేళ్ళకొసలు ఆ దంతాల అన్ని చివరలకు చేరగలవా? మాలద్వారం వద్ద అట్టగట్టిన ఆ కశ్మలాన్ని ఈ చేతుల వేళ్ళు తొలగించగలవా? ఆ దేహం మూలమూలలా మిగిలి ఉన్న మురికిని పారద్రోలేంత మెత్తగా ప్రేమగా ఒక అంతిమ స్నానం చేయించగలమా మనం? ఇంత ఎందుకు? అసలు చివరి ఊపిరి పోగానే సమస్తం రద్దు చేయబడిన ఆ మనిషిని ‘శవం’ అని కాకుండా ఇంకా మన మధ్య ఉన్న వారిలాగే అదే పేరుతో, బంధుత్వంతో, అనురాగంతో పిలవగలమా? సహించగలమా? వహించగలమా? ఈ సినిమాలో ప్రధాన పాత్ర కోబయాషి మరియూ అతని భార్య మికా కొబయాషి ఇరువుతూ తమకు వచ్చిన గడ్డు రోజుల కాలంనుండి సినిమా మొదలవుతుంది. కోబయాషి ఒక యువ సంగీత వాయిద్యకారుడు. తను పనిచేస్తున్న సంగీత వాద్యబృందం ఆర్థిక సంక్షోభం వల్ల మూతపడుతుంది. ఉద్యోగం లేకుండా టోక్యో వంటి మహనగరంలో ఉండి భవిష్యత్తుని మళ్ళీ సంగీతంలోనే వెదుకోవడం కష్టమనిపించి భార్యతో కలిసి తన స్వంత ఊరికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకుంటాడు కథానాయకుడు. ఊర్లో కనీసం స్వంత ఇల్లు ఉంది. తల్లి రెండు సంవత్సరాలక్రితమే మరణించింది. అంతకు మునుపు తల్లి తన ఇంట్లోనే చిన్న హోటల్ నడిపేది. కోబయాషి తండ్రి ఈ పిల్లాడి చిన్నతనంలోనే ఇల్లువదిలి వెళ్ళిపోయాడు. అదంతా వేరే కథ. కానీ సినిమాలో గొప్పగా మనకు చెప్పిన కథే ఇదంతా , అదంతా సినిమా చూసి తెలుసుకుందురు . కానీ గమనిస్తే ఒకటనిపిస్తుంది మనకై మనం ’జీవితం’ ఇది అని, ఇలా ఉండాలని ఒకలా నిర్ణయించుకుంటాం. మన నిర్ణయాలతో జీవితానికి పని ఏం ఉంది. దాని దావన అది వెడుతూనే ఉంటుంది. చచ్చేవరకు -చచ్చినట్లు మనం దాని వెనుక నడవలసిందే. కొబయాషి చిన్నపిల్లాడుగా ఉన్నప్పటినుండి సంగీతమే తన జీవితం అనుకున్నాడు, సంగీతం లోనే తన భవిష్యత్తు ఉందని కూడా అనుకున్నాడు. సంగీతం అతనికి తండ్రి రక్తంనుండి అందుకున్న జన్యు సంపద. కానీ ఏవయ్యింది? తను ఏనాడు అనుకోనిది ఒకతి, తన చదువుకున్న చదువు ఇవ్వనిది ఒకటి , తన సంగీత ప్రపంచం ఊహించని ఒక ఉద్యోగం ఒకదానిలో అతను అనుకోకుండా కుదిరిపోవాల్సి వచ్చింది. ఎటువంటి ఉద్యోగం అనుకున్నారు అది? మరణించిన మృతదేహాలను ఖననం చేయడానికి లేదా దహనం చేయడానికి ముందు పరలోక ప్రవేశానికి సిద్ధం చేసే అంత్యక్రియల నిపుణుడు సకాషి అనే ఒక పెద్దమనిషికి సహయకుడి ఉండె ఉద్యోగం అది. (బహుశా మన చుట్టూ ఉన్న రకరకాల జనజాతుల్లో మరణానంతర అంతిమ సంస్కారాల్లో ఈ ఈ సినిమాలో చూపించి నటువంటి ఉన్నత అంతిమ వీడుకోలు సంస్కారపూరిత సాంప్రాదాయం ఉందో లేదో నాకు తెలీదు . మరీ ఇంతగా కాదు కాని చిన్న చిన్న మార్పులతో కొంత వరకు ముస్లీం జీవన విధానంలో వారు మరణించిన అనంతరం జరిపే క్రియాకాండలు చాలా పద్దతిగా, పరిశుభ్రంగా ఉండటం వరకు నేను ఎరుగుదును) ఈ సినిమాలో సకాషి పాత్రను ‘సుటోము యమజక ’ అనే ఒక అద్భుత నటుడు నటించారు. చెప్పుకోవాలంటే ఈయన మన హింది సినిమాల్లో ‘అశోక్ కుమార్’ వంటి వారు . చక్కని రూపు రేఖలు, హుందాతనపు నటన. ఈయన సినిమాలు నేను మునుపు రెండు చూసాను. ఏ టాక్సింగ్ ఉమన్, ఇంకా ‘టాంపొపొ’. రెండూ అద్భుతమైన సినిమాలు. ఈ రెండు సినిమాల దర్శకులు ‘జుజో ఇటామి’ ఈయన గురించి మరెప్పుడయినా ఖచ్చితంగా మాట్లాడుకుందాం. అంత గొప్పగా ముచ్చటించుకోవాల్సిన మనిషి ఈతను. తిరిగి ఈ సినిమా దాకా వస్తే, మన ఈ మనుషుల ప్రపంచం ఎట్లా ఏడిచిందో చూశారా? నువ్వు ఎంత పనికిరానివాడివి, పనికి మాలినవాడివి అయినా క్షమిస్తారు. నేరగాడివి, మోసగాడివి, పచ్చి స్వార్థపరుడివయినా, పరాయి సొత్తుకోసం ప్రతి క్షణం కాచుకు కూచునే గుంట నక్కవయినా మన్నిస్తారు కానీ శవాన్ని తాకిని మనిషిగా, శవాన్ని కడిగిన మనిషిగా, శవానికి తలదువ్వి బట్టలు తొడిగి నిర్జీవమైన ఆ పెదాలపై చివరి జీవం లత్తుక అద్దిన వాడివిగా నిన్ను నీ స్నేహితులు, బంధుమిత్రులు అంతా ఒక అంటరానివాడిగా చూస్తారు. అంతదాకా ఎందుకు కేవలం శవదహనానికి వెళ్ళి వచ్చిన నిన్నే అంటక, నీ బట్టలు వదిలించి, నిన్ను తలారా స్నానం చేయించి కానీ నీ స్వంత ఇంటి గడప లోకి రానివ్వరే నీ వారు! అటువంటి నిర్జీవ ప్రపంచంలో ప్రాణం లేని వారితో సాగించే నిత్యౌద్యోగంలో మునిగే తేలే మనుషుల చావు వాసన భరించే వారెవరు? తన ఉద్యోగం ఏవిటో భార్యకు చెప్పకుండా చాలా కాలం కొబయాషి కాలం నడుపుతాడు. నిజం బయట పడిన రోజుని భార్య ‘మికా’ అతడ్ని వదిలి వెల్లి పోతుంది. ఏం కేవలం డబ్బు కోసమేనా అతడు ఆ ఉద్యోగం చేస్తున్నది? అయిష్టంగా, అనుకోకుండా ఆ వృత్తిలోకి అడుగుపెట్టిన ఆ యువకుడు, అయినవాళ్లందరు ఛీ, యాక్’ అని ముక్కు మూసుకుని దూరం వెళ్ళిపొయినా. ఆ పనిలోని ఒక లోతుని , ఒక మానవీయతని, ఒక గొప్ప కళని, కరుణని కనుగుంటాడు. అత్యంత ఇష్టంగా అందులో ఉండిపోతాడు. ఈ సినిమా అంతా బాధాపూరిత , వేదనా భరిత ఒకటిన్నర గంటల కాలపు ప్రయాణం అని భావించవద్దు. వేదన ఎక్కడ ఉంటుందో అక్కడ జీవితం సున్నిత తాలూకు హాస్యం ఉంటుంది. ప్రపంచంలో ఎంతటి వేదనాభరిత జీవనంలోనయినా వీలు చిక్కినప్పుడల్లా హాస్యం తొంగి చూస్తూనే ఉంటుంది. అది సాహిత్యంలో కానీయండి. జీవితాలవంటి సినిమాల్లో కానీయండి. ఈ సినిమా లోనూ అదే ఉంది. ఇంతకన్నా ఎక్కువగా సినిమా గురించి నాకు చెప్పడం ఇష్టం లేదు. నాకు తెలుసు మీ టేస్ట్ గొప్పది మీరు తప్పక ఈ సినిమా చూస్తారని. కొసరు: ఈ సినిమా దర్శకుడి పనితనం, చిన్న చిన్న వివరనైపుణ్యం గురించి బొలెడు చెబుతా మచ్చుకు ఒకటి: సినిమా ప్రారంభంలో, తను పని చేస్తున్న ఆర్గెస్ట్రా రద్దు అయిపోయి ఉద్యోగం పోయిన సంగతి గురించి కోబయాషి తన భార్యకు తెలియజేసిన తరువాత, ఆమె ఆ రాత్రి భోజనం సిద్ధం చేయడానికి వంటగదికి వెళుతుంది అంతకు మునుపే వారి పొరుగింటి వారు ఆ రాత్రి వంటకోసమని ఈ దంపతులకు ఒక ఆక్టోపస్ ఇస్తారు, అది ప్రాణమున్న ఆక్టోపస్. దాన్ని చంపి తినడానికి చేతులు భార్యాభర్తలు ఇరువురు దానిని ఒక కాలువ దాకా తీసుకెళ్ళి దానిని నీటిలోకి విడిచి ఒక కొత్త జీవితాన్ని దానికి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు, కాని ఆక్టోపస్ అప్పటికే చనిపోయినవుంటుంది, ఇంతా చేసీ కోబయాషి నీళ్ళల్లోకి వదిలింది ఒక చనిపోయిన జీవిని. సినిమా మనకు ఈ సన్నివేశం చూపిస్తూ చెప్పి చెప్పకుండానే కోబయాషి భవిష్యత్తులో తను చేయబోయే కొత్త ఉద్యోగమేమిటో ఒక సూచనగా మనకు అందిస్తారు దర్శకులు. - అన్వర్ -
Kohli poor form: విరాట్ కోహ్లికి ఏమైంది..?
24 వన్డే ఇన్నింగ్స్‌లలో 45.26 సగటు, 91.39 సగటుతో 1041 పరుగులు...ఇందులో 2 సెంచరీలు, 10 అర్ధ సెంచరీలు... 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాతినుంచి ఇప్పటి వరకు విరాట్ కోహ్లి ప్రదర్శన ఇది. ఎలాంటి, ఏ స్థాయి ప్రమాణాల ప్రకారం చూసినా వన్డేల్లో ఇవి ఎంతో మెరుగైన బ్యాటింగ్ గణాంకాలు...మరి కోహ్లి విఫలమైనట్లా! 21 అంతర్జాతీయ టి20ల్లో 42.18 సగటు, 136.08 స్ట్రైక్‌రేట్‌తో 675 పరుగులు... 6 అర్ధ సెంచరీలు ఉన్నాయి... 2020 జనవరి నుంచి గణాంకాలు ఇవి. ఇదీ టి20లో ఒక రెగ్యులర్, పూర్తి స్థాయి బ్యాటర్ కోణంలో చూస్తే చక్కటి ప్రదర్శన. కానీ ఇక్కడా విమర్శలే. గత రెండున్నరేళ్లుగా 18 టెస్టుల్లో 27.25 సగటుతో 872 పరుగులు మాత్రమే. ఒక్క సెంచరీ కూడా లేదు. ఇది మాత్రం విమర్శకు అవకాశమిచ్చే అది సాధారణ ప్రదర్శన. కానీ ఇదే సమయంలో ఇతర భారత టెస్టు బ్యాటర్ల స్కోర్లు కూడా అంత గొప్పగా ఏమీ లేవు. మరి మొత్తంగా కోహ్లిని విఫలమవుతున్నాడని చెబుతూ, అతడిని పక్కన పెట్టాలంటూ వస్తున్న విమర్శల్లో వాస్తవం ఎంత? కోహ్లిలాంటి దిగ్గజం ఆటను కొన్ని ఇన్నింగ్స్‌లతో కొలవగలమా! సాక్షి క్రీడా విభాగం దాదాపు 24 వేల అంతర్జాతీయ పరుగులు...మూడు ఫార్మాట్లలో 50కి పైగా సగటు...సుమారు దశాబ్దకాలం పాటు ప్రపంచ క్రికెట్‌ను శాసించిన తర్వాత విరాట్ కోహ్లి ఆటపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత అతనిపై ఇలాంటి వ్యాఖ్యలు మరీ ఎక్కువగా పెరిగిపోయాయి. ఇన్నేళ్లుగా దేశం తరఫున అతను చూపిన గొప్ప ప్రదర్శనలు, అందించిన ఘనమైన విజయాలు, చిరస్మరణీయ క్షణాలను కనీసం లెక్కలోకి తీసుకోకుండా కొందరు మాట్లాడుతున్న తీరు నిజంగా ఆశ్చర్యకరం. ఒక్క మాటలో చెప్పాలంటే కోహ్లి సాధించిన ఘనతలే ఇప్పుడు అతనికి ప్రతికూలంగా మారినట్లున్నాయి. అద్భుత ప్రదర్శనతో అత్యుత్తమ స్థాయి ప్రమాణాలు నెలకొల్పిన కోహ్లి...ఇప్పుడు వాటితో పోలిక రావడంతోనే విఫలమైనట్లుగా కనిపిస్తోంది. నిజాయితీగా చెప్పాలంటే కోహ్లి కాకుండా మరే బ్యాట్స్‌మన్ అయినా ఈ గణాంకాలతో కొనసాగితే అతను చాలా విజయవంతమైనట్లుగా లెక్క! సెంచరీలే ముఖ్యమా! సగటు క్రికెట్ అభిమాని కోణంలో చూస్తే విరాట్ కోహ్లి సెంచరీ సాధించి చాలా కాలమైంది కాబట్టి అతను విఫలమవుతున్నట్లే అనుకోవాలి. నిజమే...కోహ్లి 2019 నవంబర్‌లో తన ఆఖరి శతకం బాదాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో అతని 70 సెంచరీలు పూర్తయ్యాయి. మరొక్క సెంచరీ చేస్తే రికీ పాంటింగ్ (71)ను సమం చేస్తాడు. గతంలో ఉన్న ఫామ్‌ను కొనసాగిస్తూ ఆల్‌టైమ్ గ్రేట్ సచిన్ సెంచరీల రికార్డు (100) కూడా అలవోకగా సమం చేయగల సత్తా ఉందని అంతా కోహ్లిపై అంచనాలు పెంచేసుకున్నారు. కోహ్లి 71వ సెంచరీ ఫ్యాన్స్‌ను ఊరిస్తోంది. అయితే అది ఇప్పటి వరకు రాలేదు! దాంతో అదే అసహనం సోషల్ మీడియా వేదికగా విశ్లేషకులు, మాజీ ఆటగాళ్ల ద్వారా విమర్శగా మారింది. నిజానికి సెంచరీలు లేకపోయినా కోహ్లి ఆట ఘోరంగా ఏమీ లేదు. ఇంకా చెప్పాలంటే చక్కటి షాట్లు, కళాత్మక ఆటతీరులో ఎక్కడా తేడా రాలేదు. క్రీజ్‌లో తడబడటం, షాట్లు ఆడేందుకు ఇబ్బంది పడటం కూడా కనిపించలేదు. నాటింగ్‌హామ్‌లో జరిగిన చివరి టి20లో మిడ్‌వికెట్ మీదుగా కొట్టిన ఫోర్, ఆ తర్వాత నేరుగా కొట్టిన సూపర్ సిక్సర్ కోహ్లి సత్తా ఏమిటో చూపించాయి. పోటీ పెరగడంతోనే... ఇటీవల అవకాశాలు దక్కించుకున్న యువ ఆటగాళ్ల ప్రదర్శన ఇప్పుడు కోహ్లిని సాధారణ బ్యాటర్‌గా చూపిస్తోంది. దీపక్హుడా ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత ఇంగ్లండ్‌తో తొలి టి20లో 17 బంతుల్లోనే 33 పరుగులు చేశాడు. కానీ కోహ్లి రాకతో తర్వాతి రెండు మ్యాచ్‌లలో అతనికి అవకాశం దక్కలేదు. మరో వైపు సూర్యకుమార్ విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. పంత్, ఇషాన్ కిషన్, సంజు సామ్సన్లాంటి వాళ్లు బంతులను అలవోకగా గ్రౌండ్ బయటకు కొడుతున్నారు. ఇలాంటి సమయంలోనే కోహ్లిపై విమర్శల జడి ఎక్కువవుతోంది. వీరి దూకుడైన బ్యాటింగ్ ముందు కోహ్లి నమోదు చేస్తున్న 130–135 పరుగుల స్ట్రైక్‌రేట్ తక్కువగా కనిపిస్తోంది. మూడో స్థానంలో వచ్చే కోహ్లి ఆ అంచనాలను అందుకోలేకపోతున్నాడు. పదే పదే ‘విశ్రాంతి’ తీసుకోవడం కూడా అతనికి చేటు తెస్తోంది. టి20 ప్రపంచ కప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా సిరీస్‌లతో దశలవారీగా విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు వరల్డ్‌కప్‌కు జట్టు కూర్పు గురించి చర్చ జరుగుతున్న సమయంలో విండీస్‌తో టి20 సిరీస్‌నుంచి కూడా విశ్రాంతి! ఈ నేపథ్యంలో మళ్లీ విమర్శలకు అతను అవకామిచ్చాడు. అసలు ఎందుకు ఇలాంటి చర్చ జరుగుతోంది. నాకు అస్సలు అర్థం కావడం లేదు. కోహ్లి ఎన్నో ఏళ్లుగా పెద్ద సంఖ్యలో మ్యాచ్‌లు ఆడి వేల పరుగులు చేశాడు. ఎన్నో గొప్ప విజయాలు అందించాడు. అతనిలాంటి టాప్ బ్యాట్స్‌మన్‌కు ఎలాంటి సలహాలు అవసరం లేదు. ఆటగాళ్లు ఫామ్ కోల్పోవడం, కెరీర్లో ఎత్తుపల్లాలు సహజం. ఒకటి, రెండు మ్యాచ్‌లు బాగా ఆడితే చాలు అంతా చక్కబడుతుంది. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ -
బట్టలైనా ఊడదీసుకుని తిరుగుతామంటారు: కొమ్మినేని విశ్లేషణ
-
ధరలు పెరిగితే ధనవంతులకే నష్టం - కేంద్ర ఆర్థిక శాఖ
వంట నూనె మొదలు పెట్రోలు, గోలీ మందులు మొదటు ఏసీల వరకు గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యవసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. గత ఎనిమిదేళ్లలో ఎన్నడూ లేని స్థాయికి ద్రవ్యోల్బణం పెరిగిపోయింది. పెరుగుతున్న ధరలతో పేదలు, సామాన్యులు విలవిలలాడుతున్నారు. బడ్జెట్ లెక్కలు తారుమారై అవస్థలు పడుతున్నారు. కానీ ఆర్థిక శాఖ సూత్రీకరణ మరో రకంగా ఉంది.. పెరిగిపోతున్న ధరలతో సామాన్యులు, పేదల కంటే ధనవంతులే ఎక్కువగా నష్టపోతున్నారంటూ చిత్రమైన లెక్కలను ప్రజల ముందుకు తెచ్చింది. ఏప్రిల్ నెలకు సంబంధించి ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, రిటైల్ కన్సుమర్ ఇండెక్స్ తదితర అంశాలకు కేంద్ర ఆర్థిక శాఖ 2022 మే 12న రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ఆర్థిక శాఖ పనితీరు పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితర అంశాలను వివరిస్తూ.. పరిస్థితి అంతా అదుపులోనే ఉందని, పెరిగిన ధరల ప్రభావం పేదలు, సామాన్యుల కంటే ధనవంతులపైనే అధికంగా ఉందంటూ విశ్లేషణ చేసింది. ఇందు కోసం 2011-12 నేషనల్ శాంపిల్ సర్వే ఆధారంగా వివిధ కేటగిరీల వారీగా కుటుంబాలు చేస్తున ఖర్చుల వివరాలను ప్రమాణికంగా తీసుకుని వివరణ ఇచ్చింది. దీనిపై మనీ కంట్రోల్ ప్రచురించిన కథనం ఆధారంగా.. మూడు కేటగిరీలు మూడు రకాల ఖర్చులు కేంద్ర ఆర్థిక శాఖ విశ్లేషణ ప్రకారం... దేశంలో వినియోగదారులను మూడు కేటగిరీలుగా పేర్కొంది. అందులో పై స్థాయిలో ఉండే ధనవంతులు 20 శాతం, మధ్య తరగతి 60 శాతం, పేదలు 20 శాతంగా తీసుకున్నట్టు తెలిపింది. ఈ కేటగిరీల వారు చేస్తున్న ఖర్చులను కూడా మూడు విభాగాలుగా పరిగణలోకి తీసుకుంది. అవి ఫుడ్ అండ్ బేవరేజెస్, ఫ్యూయల్ అండ్ లైట్ (రవాణా ఖర్చులతో కలిపి), ఫుడ్, ఫ్యూయల్ మినహాయించి ఇతర వస్తువులుగా పేర్కొంది. వారిపైనే అధికం పైన పేర్కొన్న మూడు కేటగిరీలకు చెందిన కుటుంబాలు జీవించేందుకు మూడు కేటగిరీలకు పెడుతున్న ఖర్చులను పరిగణలోకి తీసుకుంటూ వీరిపై గడిచిన రెండేళ్లుగా ద్రవ్యోల్బణ ప్రభావాన్ని అంచనా వేస్తూ ఆర్థిక శాఖ విశ్లేషణాత్మ వివరణ తయారు చేసింది. ఇందులో ఎవ్వరూ ఊహించని విధంగా పేదలు, మధ్య తరగతి కంటే ధనవంతులపైనే ద్రవ్యోల్బణం అధికంగా ఉండటం అందరినీ ఆశ్చర్య పరిచింది! పేదలపై భారం పడలేదు! ఆర్థిక శాఖ లెక్కల ప్రకారం 20 శాతం ఉన్న పేదవారిపై ద్రవ్యోల్బణ ప్రభావం పరిశీలించగా 2021 ఆర్థిక సంవత్సరంలో 6 శాతం ఉండగా 2022 ఆర్థిక సంవత్సరంలో అది 5.2 శాతానికి పడిపోయింది. ఇదే కేటగిరిలో పట్టణ ప్రాంత పేదలను పరిశీలిస్తే ద్రవ్యోల్బణం 6.8 శాతం నుంచి 5.7 శాతానికి తగ్గి వారికి ఉపశనం కలిగించింది. మధ్య తరగతి సేఫ్! ఇక సమాజంలో 60 శాతంగా ఉన్న మధ్య తరగతి విషయానికి వస్తే 2021 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతంలో ద్రవ్యోల్బణం 5.9 శాతం ఉండగా 2022 ఆర్థిక సంవత్సరంలో 5.3 శాతానికి పడిపోయింది. పట్టణ ప్రాంతాల్లో అయితే 6.8 శాతం నుంచి 5.7 శాతానికి దిగి వచ్చింది. పట్టణ ధనికులపైనే! ద్రవ్యోల్బణం కారణంగా 20 శాతంగా ఉన్న సంపన్న వర్గాలకు జరుగుతున్న నష్టాన్ని ఆర్థిక శాఖ ఇలా వివరించింది... 2021 ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతంగా ఉన్న ద్రవ్యోల్బణం 2022 ఆర్థిక సంవత్సరంలో 5.6 శాతానికి చేరుకుంది. అంటే గ్రామీణ ప్రాంత సంపన్నులపై 0.1 శాతం అధికంగా ద్రవ్యోల్బణం ప్రభావం చూపించింది. ఇక పట్టణ ప్రాంతాల విషయానికి వస్తే 5.7 శాతం నుంచి 6.8 శాతానికి పెరిగింది. మొత్తంగా సమాజంలో ద్రవ్యోల్బణం పెరగడం వల్ల పట్టణ ప్రాంతాలకు చెందిన సంపన్నులపై అత్యధికంగా 1.1 శాతం ద్రవ్యోల్బణం ప్రభావం చూపింది. సమాజంలోని వివిధ ఆదాయ వర్గాల వారిపై ధరల పెరుగుదల ప్రభావాలను సునిశితంగా గమనిస్తే పేదలు, మధ్య తరగతి కంటే సంపన్నులపైనే ఎక్కువ ప్రభావం చూపిందంటూ ఆర్థిక శాఖ సూత్రీకరించింది. ఆర్బీఐ ఇలా అంతకు ముందు ఆర్థిక శాఖ విశ్లేషణలకు విరుద్ధంగా 2022 మే 4న రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణ ఫలితాలను విశ్లేషించింది. రెపోరేటు పెంపు నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. ద్రవ్యోల్బణం పేదలపై అధిక ప్రభావం చూపిందని, వారి కొనుగోలు శక్తిని దారుణంగా దెబ్బతీస్తోందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. ఆర్బీఐ కొనుగోలు శక్తిని ప్రధానంగా పరిశీలనలోకి తీసుకోగా ఆర్థిక శాఖ కొనుగోలు వల్ల జరుగుతున్న వ్యయాలను ప్రధానంగా చేసుకుని విశ్లేషణ చేపట్టడం విశేషం. ఆర్థిక శాఖ అంచనాలు సూత్రీకరణలు ఎలా ఉన్నా పెరుగుతున్న ధరలు మాత్రం సామాన్యుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి.... చదవండి: ధరదడ.. పరిశ్రమకు కరోనా సెగ -
రూపానీ అర్ధాంతర రాజీనామాకు కారణం ఏంటి ?
-
Telangana: ఆర్టీసీలో అనాలసిస్ వింగ్
సాక్షి, హైదరాబాద్: ఏకకాలంలో సంస్కరణల వేగానికి, నష్టాల బ్రేక్‌కు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. అసలే నష్టాలు, ఆపై కోవిడ్ దెబ్బ.. ఫలితంగా కుదేలైన ప్రగతిచక్రాన్ని గాడిలో పెట్టేందుకు సంస్థ దిద్దుబాటు మొదలుపెట్టింది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీ అధికారులతో నిర్వహించిన భేటీలో సంస్థ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సంస్థ నష్టాలకు కారణాలు, సంస్కరణల ఆవశ్యకతపై అధ్యయనం చేసేందుకు ఆర్టీసీలో కొత్తగా ట్రాఫిక్ అనాలిసిస్ వింగ్‌ను ఏర్పాటు చేశారు. కొందరు సీనియర్ అధికారుల నేతృత్వంలో ఆ విభాగం పని ప్రారంభించనుంది. రద్దీ ఉన్న వైపే దృష్టి.. ఆర్టీసీకి కొన్నేళ్లుగా రికార్డుస్థాయిలో నష్టాలొస్తుండగా, ప్రైవేటు ట్రావెల్స్ మాత్రం మంచి ఆదాయాన్ని నమోదు చేసుకుంటున్నాయి. ఆర్టీసీ తరహాలోనే చాలా ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు వివిధ ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నాయి. మరి ప్రైవేటు ట్రావెల్స్‌కు ఆదాయం వస్తుండగా, ఆర్టీసీ ఎందుకు నష్టాలను మూటగట్టుకుంటోందనే కోణంలో ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. ప్రైవేటు ట్రావెల్స్ ఏయే రూట్లలో ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నాయి, ఏయే ప్రాంతాలవైపు వాటికి రద్దీ అధికంగా ఉంటోంది, ఆర్టీసీని కాదని ప్రయాణికులు ఎందుకు ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్నారు.. అనే కోణాల్లో ఈ విభాగం వివరాలు సేకరిస్తుంది. వివిధ కేటగిరీ బస్సుల్లో వేటికి ఎక్కువ ఆదాయం వస్తోంది.. వేటివైపు ప్రయాణికులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు, ఏయే మార్గాల్లో ఎక్కువ రద్దీ ఉంటోంది.. ఏయే సమయాల్లో ప్రయాణాలు ఎక్కువగా ఉంటున్నాయి.. తదితర వివరాలను కూడా సేకరించనుంది. తర్వాత ఆర్టీసీకి–ప్రైవేటు ట్రావెల్స్‌కు మధ్య ఉన్న తేడాలను అధికారులు గుర్తించి తదనుగుణంగా చర్యలు చేపట్టనున్నారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వస్తున్న ఆయా రాష్ట్రాల ఆర్టీసీ బస్సులు, తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్తున్న టీఎస్ ఆర్టీసీ బస్సుల ఆదాయాలు, ఆక్యుపెన్సీ రేషియో, బస్సుల నిర్వహణ, రద్దీ ఉన్న రూట్లు.. తదితర వివరాలను రాబట్టి విశ్లేషించనుంది. తెలంగాణ ఆర్టీసీ– వేరే రాష్ట్రాల ఆర్టీసీల మధ్య పోలికలు, వ్యత్యాసాలను కూడా బేరీజు వేయనుంది. వెరసి డిమాండ్ ఉన్న కేటగిరీ బస్సులు, రద్దీ ఉన్న మార్గాలకు ప్రాధాన్యం ఇచ్చేలా ఆర్టీసీ నిర్ణయాలు తీసుకునుంది. విస్తరించటంతో నష్టమా.. ప్రాంతాలు విస్తరించేకొద్దీ, జనాభా పెరిగే కొద్దీ ఆర్టీసీ సేవలను కూడా విస్తరించాల్సి ఉంటుంది. అప్పుడే ప్రజారవాణా అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఈ విస్తరణ శాస్త్రీయంగా ఉండాలి. కానీ, ఇప్పటి వరకు ఆర్టీసీ అధికారులు క్షేత్రస్థాయిలో సరైన కసరత్తు చేయకుండా అశాస్త్రీయంగా విస్తరిస్తూ వస్తున్నారు. ఇది ఆర్టీసీకి నష్టాలు తెచ్చిపెడుతోంది. కొందరు డిపో మేనేజర్లు రూట్ స్టడీలు పక్కాగా నిర్వహిస్తుండటంతో ఆయా డిపోల్లో ఆదాయం మెరుగ్గా ఉంటోంది. ఇప్పుడు విస్తరణ కంటే, ఉన్నఫళంగా నష్టాలను తగ్గించేందుకే ఆర్టీసీ ఆసక్తి చూపుతోంది. తాజా కసరత్తు కూడా అందులో భాగంగానే కనిపిస్తోంది. -
Youtube Studio: డిజిటల్ వరల్డ్ మీకు నచ్చేలా మీరు మెచ్చేలా..
యూట్యూబ్ తెలిసినంతగా చాలామందికి యూట్యూబ్ స్టూడియో తెలిసి ఉండకపోవచ్చు. ఆ స్టూడియోలో ఏం ఉంటాయి? క్రియేటర్లకు దారి చూపించే విశ్లేషణ పరికరాలు ఉంటాయి. మన బండికి వేగం పెంచే ఇంధనాలు ఉంటాయి... ‘యూట్యూబ్ స్టూడియో’ క్రియేటర్స్‌కు ఇల్లులాంటిది. ఆ ఇంటిలో చిన్నవాళ్లకు విలువైన సలహాలు ఇచ్చే పెద్దమనిషిలాంటిది. భరోసా ఇచ్చే బాస్లాంటిది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా వీజి. దాన్ని నిలబడేలా చేయడం, పరుగెత్తేలా చేయడం శానా కష్టం. ఇది ఎందరికో అనుభవంలో ఉన్న విషయం. యూట్యూబ్ ఛానల్ హిట్టు,ఫట్టు వెనుక ‘అదృష్టం’ పాత్ర ఏమీ ఉండదు. మన పాత్రే ఉంటుంది. ఆ పాత్ర రక్తి కట్టాలంటే, మీరు విజయపథంలో దూసుకెళ్లాలంటే.. మీకు అవసరమైనది యూట్యూబ్ స్టూడియో. ఆడియన్స్ ఇంటరాక్షన్ నుంచి ఛానల్ డెవలప్మెంట్ వరకు రకరకాలుగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ స్టూడియోలో.. ఛానల్ డ్యాష్‌బోర్డ్, వీడియోస్, ప్లేలిస్ట్, ఎనాలిటిక్స్, కామెంట్స్, సబ్‌టైటిల్స్, మోనిటైజేషన్, కస్టమైజేషన్, ఆడియోలైబ్రరీ.. మొదలైన ఫీచర్లు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి ప్లేలిస్ట్, ఎనలిటిక్స్. ఛానల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉండాలంటే ప్లేలీస్ట్లు తప్పనిసరి. యూట్యూబ్ స్టూడియోలో ప్లేలీస్ట్లు క్రియేట్ చేయడానికి... 1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో 2. లెఫ్ట్ మెను, సెలెక్ట్ ప్లేలీస్ట్ 3. క్లిక్–న్యూ ప్లే లీస్ట్ 4.ఎంటర్–ప్లే లీస్ట్ టైటిల్ 5. సెలెక్ట్–ప్లేలీస్ట్ విజిబిలిటీ సెట్టింగ్స్ 6. క్లిక్ ఆన్ క్రియేట్ ఎడిట్ చేయడానికి...1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో 2. సెలెక్ట్ ప్లేలీస్ట్ 3.ఎడిట్–క్లిక్ 4. డిస్క్రిప్షన్–క్లిక్ 5.సేవ్ ఛానల్ స్పీడ్ అందుకోవడానికి, కంటెంట్ స్ట్రాటజీని రీడిజైన్ చేసుకోవడానికి ‘ఎనాలిటిక్స్’ కావాలి. ఇందులోకి వెళ్లాలంటే...1.మీ ఎకౌంట్లోకి లాగ్ అవ్వాలి 2. క్లిక్–ప్రొఫైల్ ఐకాన్ 3.సెలెక్ట్–యూట్యూబ్ స్టూడియో 4. క్లిక్–గో టూ ఛానల్ ఎనాలిటిక్స్ 5. సెలెక్ట్–ఎనాలిటిక్స్ (లెఫ్ట్ హ్యాండ్ మెనూ) బిగ్గెస్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూట్ కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే వినూత్నమైన అప్డెట్స్తో ముందుంటుంది. ‘యూట్యూబ్ స్టూడియో’కి సంబంధించి తాజా అప్డ్ట్ల విషయానికి వస్తే.. హైలీ రిక్వెస్టెడ్ ఫీచర్‌గా చెప్పుకునే ‘డార్క్‌మోడ్’ ఫీచర్ యూట్యూబ్‌కు మాత్రమే కాకుండా ‘యూట్యూబ్ స్టూడియో’కు వచ్చేసింది. ఫ్రెష్‌లుక్ ఇవ్వడమే కాదు కళ్లకు భారం పడకుండా తేలిగ్గా ఉంటుంది. బ్యాటరీ సేవ్ అవుతుంది. రియల్‌టైమ్ కార్డ్స్‌ను మెరుగుపరిచారు. గతంలో ఈ కార్డ్స్ ‘బేసిక్ వోవర్ వ్యూ డాటా’ డిస్‌ప్లేకే పరిమితం. తాజా అప్డేట్తో సబ్‌స్క్రైబర్ కౌంట్స్, వీడియో వ్యూస్.. ఇలా అప్–టు–ది–మినిట్ డాటా డిస్ప్లే అవుతుంది. యూట్యూబ్ స్టూడియోలోని ‘మెన్షెన్ ఇన్‌బాక్స్’తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. దీని ద్వారా మీ ఛానల్ ఎక్కడెక్కడ మెన్షెన్ అయిందనే విషయం తెలుసుకోవచ్చు. ఉదా: మరో ఛానల్ వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఛానల్ ట్యాగ్ అయితే దాని గురించి తెలుసుకోవచ్చు. ‘మీ సినిమా ఆడాలంటే మీకు నచ్చగానే సరిపోదు. ప్రేక్షకులకు మీకంటే బాగా నచ్చాలి’ అనేది అత్యంత పాత విషయం అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా మరిచిపోతూనే ఉంటాం. ఛానల్ వ్యవహారం కూడా అంతే. ‘చేసిందంతా చేసేశాను. ఇంకేటి సేత్తాం’ అనుకోవద్దు. ‘యూట్యూబ్ స్టూడియో’పై లుక్కేయండి. ఆడియెన్స్ నాడి కనిపెట్టండి. సరదిద్దుకోండి. దూసుకుపోండి. -
Jeffrey Toobin: నా చేష్టల్ని సమర్థించుకోలేను!
న్యూయార్క్: అమెరికా న్యూస్ పర్సనాలిటీ జెఫెర్రె టూబిన్ ఎనిమిది నెలల గ్యాప్ తర్వాత హఠాత్తుగా టీవీ ముందు ప్రత్యక్షమయ్యాడు. ఇప్పటి నుంచి ప్రముఖ న్యూస్ ఛానెల్ సీఎన్ఎన్లో లీగల్ అనలిస్ట్‌గా ఆయన పని చేయనున్నారు. పోయినేడాది అక్టోబర్‌లో జూమ్ కాల్లో ఆయన అసభ్య చేష్టలకు పాల్పడడంతో ప్రపంచం నివ్వెరపోయింది. ఈ చర్యతో ది న్యూయార్కర్ ఆయన్ని అనధికారికంగా విధుల నుంచి తప్పించింది. కాగా, తన చేష్టలకు ఆయన అందరికీ క్షమాపణలు చెబుతూ కొత్త విధుల్ని ప్రారంభించడం విశేషం. ‘‘ఆరోజు నేను చాలా మూర్ఖంగా నేను ప్రవర్తించా. ఇతరులు చూస్తారనే ధ్యాస నాకు లేదు. నా కుటుంబానికి, సహచర జర్నలిస్టులకు, అందరికీ క్షమాపణలు చెప్పుకుంటున్నా. నా చేష్టలను ఎట్టిపరిస్థితుల్లో సమర్థించుకోలేను. ఆ ఘటన తర్వాత మామూలు మనిషిగా మారేందుకు టైం పట్టింది. మానసిక ప్రశాంతత కోసం థెరపీ తీసుకున్నా. ఒక ఫుడ్ బ్యాంక్‌లో పని చేశా. ఓక్లాహోమా సిటీ పేలుళ్ల గురించి ఒక బుక్ రాయడంలో లీనమయ్యా’’ అని 61 ఏళ్ల టూబిన్ చెప్పుకొచ్చాడు. కాగా, అక్టోబర్ 19, 2020న న్యూయార్కర్, డబ్ల్యూఎన్వైసీ రేడియో స్టాఫర్స్ మధ్య జూమ్ మీటింగ్ జరుగుతుండగా.. టూబిన్ తన వ్యక్తిగత వీడియో కాల్లో ఎవరితోనో మాట్లాడుతూ, హస్తప్రయోగం చేసుకున్నాడనే విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై దిగ్భ్రాంతి చెందిన న్యూయార్కర్.. ఆయన్ని విధుల నుంచి దూరంగా ఉంచింది. కాగా, దాదాపు మూడు దశాబ్దాలుగా న్యూయార్కర్‌తో అనుబంధం ఉన్న టూబిన్.. జూమ్ చేష్టల ద్వారా జర్నలిజానికి మాయని మచ్చ వేశాడంటూ జిమ్మీ ఫాలోన్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్ లాంటి ప్రముఖులు.. శాటర్ డే నైట్ లైవ్ ప్రోగ్రాం దుమ్మెత్తిపోశారు. లా స్టూడెంట్‌గా ఉన్నప్పటి నుంచే మానవీయ కోణంలో ఎన్నో పుస్తకాలు రాసి ప్రపంచవ్యాప్తంగా గొప్ప రచయితగా పేరు దక్కించుకున్నాడు టూబిన్. -
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాల విశ్లేషణ
-
‘రెమ్‌డెసివిర్ ద్వారా మరణాల సంఖ్య తగ్గే అవకాశం’
ఢిల్లీ : హెటిరో ఫార్మా తయారుచేసిన యాంటి వైరల్ రెమ్‌డెసివిర్ మందు కరోనా మరణాలను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు పరిశోదనలో తేలిందని గిలియడ్ సైన్సెస్ సంస్థ శుక్రవారం తెలిపింది. అయితే రెమ్‌డెసివిర్ మందుపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే ఈ విషయంపై మరింత స్పష్టత రానుందని సంస్థ పేర్కొంది. తాజాగా జరిపిన విశ్లేషణలో కరోనా నుంచి కోలుకున్న 312 మంది నుంచి సమాచారం సేకరించాము. దీంతో పాటు వ్యాధి తీవ్రత ఎక్కువ ఉన్న 818 మంది రోగులపై రెమ్‌డెసివిర్ ప్రభావం ఏ మేరకు పనిచేస్తుందన్నది అధ్యయనం చేసినట్లు గిలియడ్ సైన్సెస్ వెల్లడించింది. కరోనాతో బాధపడుతున్న రోగులకు 5 నుంచి 10 రోజులు పాటు రెమ్‌డెసివిర్ మందు డోజేజ్ విధానంలో అందించారని దాని వల్ల వారికి ఎలాంటి నష్టం కలగలేదని అధ్యయనంలో తేలింది..కానీ ప్లేసిబో తో రెమ్‌డెసివిర్‌ను పోల్చిచూడలేదని స్పష్టం చేసింది. (వికృత చర్య : మాకు కరోనా ఉంటే మీకు వస్తుంది) రెమ్‌డెసివిర్ ద్వారా చికిత్స పొందుతున్న రోగుల్లో 74.4 శాతం మంది 14 రోజుల్లో కోలుకుంటున్నారని తేలింది. కాగా రెమ్‌డెసివిర్ మందుతో చికిత్స పొందిన రోగుల మరణాల రేటు 14 రోజుల్లో 7.6 శాతంగా ఉంటే.. అదే ఆ మందు తీసుకోనివారు మరణాల రేటు 12.5 శాతంగా ఉంది. గత ఏప్రిల్‌లో అమెరికాలో నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్‌లో ప్లేసిబో ఇచ్చిన రోగుల కంటే రెమ్‌డెసివిర్ ఇచ్చిన రోగులు 31 శాతం వేగంగా కోలుకున్నారని తమ అధ్యయనంలో తేలినట్లు తెలిపింది. అయితే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన తర్వాతే రెమ్‌డెసివిర్ మందుపై ఒక స్పష్టత వస్తుందని గిలియడ్ సంస్థ పేర్కొంది.(వ్యాక్సిన్: ముందు వరుసలో ఆ 3 కంపెనీలు!) -
రంగంలోకి ‘ప్రాణదాతలు’
సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తూ సమర్థవంతమైన పాలన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అపర సంజీవనులుగా కీర్తి ప్రతిష్టలు పొందిన 108, 104 అంబులెన్సులను మరింత మెరుగ్గా తీర్చిదిద్ది బుధవారం ప్రారంభించారు. మొత్తం 1,088 వాహనాలు ఒకే రోజు తమ తమ గమ్యస్థానాలకు ‘కుయ్...కుయ్’మంటూ వెళ్లాయి. ఈ రెండు అంబులెన్సులూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రికలు. వీటికి విశిష్ట చరిత్ర వుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జన సంక్షేమానికి వైఎస్ రూపొందించిన పథకాల పరంపరలో ఇవి కూడా భాగం. వైద్యుడిగా పేద రోగులకు నామమాత్రపు ఫీజుతో చికిత్సనందించిన అను భవంతో ఈ అత్యవసర సేవలను ఆయన అందుబాటులోకి తెచ్చారు. అప్పట్లో 70 అంబు లెన్సులతో, 50 పట్టణాల్లో ప్రారంభించిన ఈ సేవలు అచిరకాలంలోనే రాష్ట్రమంతటా విస్తరించి ఆపత్సమయాల్లో లక్షలాదిమందికి ప్రాణదానం చేశాయి. ఈ సేవలు సక్రమంగా అందుతున్నాయో లేదో పర్యవేక్షించడం కోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా వైఎస్ ఏర్పాటు చేశారు. అప్పట్లో జాతీయ ఆరోగ్య మిషన్ 108 సిబ్బంది అందించిన సేవలను అధ్యయనం చేసి ప్రశంసల వర్షం కురిపించింది. ఆ తర్వాత అనేక రాష్ట్రాలనుంచి ప్రతినిధి బృందాలు తరలివచ్చాయి. ఈ నమూనానే స్వీకరించి తమ తమ రాష్ట్రాల్లో అంబులెన్సు సర్వీసులు ప్రారంభించాయి. దురదృష్టమేమంటే ఆయన కనుమరు గయ్యాక అధికారంలోకొచ్చినవారు ఈ సేవలను నిర్వీర్యం చేశారు. నామమాత్రంగా మిగిల్చారు. సిబ్బందికి జీతాలు సక్రమంగా చెల్లించక, ఆ వాహనలకు అవసరమైన మరమ్మతులు చేయించక, కనీసం డీజిల్ కూడా ఇవ్వక భ్రష్టుపట్టించారు. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో కొచ్చిన చంద్రబాబు అన్నిటితోపాటు ఈ సర్వీసులను కూడా విస్మరించారు. ఇందుకు భిన్నంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక కీలకమైన ఈ అంబులెన్సు సర్వీసులపై దృష్టి కేంద్రీకరించారు. వాటి రూపురేఖల్ని సమూలంగా మార్చి అవి మరింత మెరుగైన సేవలం దించేందుకు అవసరమైన సౌకర్యాలన్నీ వాటిల్లో పొందుపరిచేలా చేశారు. అన్నివిధాలా ఆరోగ్యవంతంగా వుండే పౌరులే ఏ దేశానికైనా నిజమైన సంపద అని బ్రిటన్ ప్రధానిగా పనిచేసిన విన్స్టన్ చర్చిల్ ఒక సందర్భంలో అన్నారు. కీలకమైన ఈ అంశాన్ని ప్రభు త్వాలన్నీ విస్మరిస్తున్నాయి. సంపూర్ణ ఆరోగ్యంతో వుండే పౌరులు ఉత్పాదకతలో పాలుపంచు కుంటారు. అక్కడ సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. అవి రెండూ అంతిమంగా దేశ ఆర్థికాభివృద్ధికి దోహదపడతాయి. అలాంటి పౌరులుండే సమాజం సుఖసంతోషాలతో వుంటుంది. కానీ ఎవరికీ ఇది పట్టలేదు. చంద్రబాబు తొలిసారి తన తొమ్మిదేళ్ల పాలనలో ప్రభుత్వాసుపత్రులు అందించే నాసిరకం సేవలకు సైతం యూజర్ చార్జీలు పెట్టి జనాన్ని వేధించుకుతిన్నారు. రెండోసారి అధికారంలోకొచ్చిన తర్వాత కూడా ప్రజారోగ్యాన్ని అటకెక్కించారు. ప్రభుత్వాసుపత్రులను చికిత్సాలయాలుగా కాక... రోగిష్టి కేంద్రాలుగా దిగజార్చారు. అంబులెన్సు సర్వీసుల గురించి చెప్పనవసరం లేదు. చంద్రబాబు వాటిని నామమాత్రం చేశారు. ఆ వాహనాల్లో పనిచేస్తున్న సిబ్బందికి సరైన జీతాలుండేవి కాదు. అవి కూడా సకాలంలో వచ్చేవి కాదు. అంబులెన్సుల్లో అధిక భాగం ఎప్పుడూ షెడ్లలో పడివుండేవి. కను కనే నిరుపేద వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాలు ఆయన పాలనలో విలవిలలాడాయి. ఆంధ్ర ప్రదేశ్ పౌరులకు ఇక ఆ చింత లేదు. ఇప్పుడు రూపొందించిన సర్వీసుల్లో అమరివున్న అత్యాధునిక సదుపాయాలు ఆపదలో చిక్కుకున్నవారికి అన్నివిధాలా తోడ్పాటునందిస్తాయి. ఇంతక్రితం జనా భాలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్సు వుంటే, తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలకు దగ్గరగా ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్సు అందుబాటులో వుండబోతోంది. అలాగే లోగడ ఏటా 6,33,600 మందికి సేవలందించే అంబులెన్సులు ఇకపై ఆ సేవల్ని ఏటా 12 లక్షలమందికి అందిస్తాయి. అనారోగ్యానికో, అనుకోని ప్రమాదానికో లోనయినవారిని ఆసుపత్రు లకు చేర్చేలోగానే మెరుగైన సేవలందించి ప్రాణాపాయస్థితినుంచి కాపాడటానికి కావలసిన అత్యా ధునిక ఉపకరణాలు అంబులెన్సుల్లో ఏర్పాటు చేశారు. పట్టణ ప్రాంతాల్లో ఫోన్ చేసిన 15 నిమి షాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అయితే 20 నిమిషాల్లో, ఏజెన్సీ ప్రాంతాల్లో 25 నిమిషాల్లో అంబు లెన్సులు చేరతాయి. కనుక మారుమూల ప్రాంతాల్లో వున్నవారికి సైతం సకాలంలో వైద్య సేవలు అందుతాయి. ఇప్పుడున్న 108 అంబులెన్సులు 336తోపాటు కొత్తగా మరో 412 రంగంలోకి దిగబోతున్నాయి. 108, 104 సర్వీసులు ప్రతి మండలానికీ ఒక్కొక్కటి చొప్పున వుండేలా చూడటం, చిన్నారుల కోసం ప్రత్యేకించి 26 నియోనేటల్ అంబులెన్సులు అందుబాటులో వుంచడం జగన్ మోహన్‌రెడ్డికి పేద ప్రజల ఆరోగ్యంపై వున్న శ్రద్ధాసక్తులను తెలియజేస్తుంది. మృత్యుముఖంలో వున్న మార్కండేయుడు స్మరించిన మరుక్షణమే అతడిని కాపాడిన ముక్కంటి వైనం పురాణాల్లో చదివాం. ఇప్పుడు జగన్ చేతుల్లో పునరుజ్జీవం పొందిన ఈ అంబులెన్సులు కూడా అటువంటి పాత్రే నిర్వహించబోతున్నాయి. సాధారణ సమయాల్లో అందరూ నాయకుల్లానే చలా మణి అవుతారు. సంక్షోభాలే అలాంటివారిలో సమర్థులెవరో, కానివారెవరో నిగ్గుదేలుస్తాయి. కరోనా వైరస్ సంక్షోభం చుట్టుముట్టాక దేశంలో ఏ రాష్ట్రమూ చేయనివిధంగా లక్షల్లో వైద్య పరీక్షలు నిర్వ హించడం, అవసరమైన వారిని చికిత్సకు తరలించడం, వారు త్వరగా కోలుకొనేలా పౌష్టికాహారాన్ని అందించడంవంటి చర్యలు అమల్లోపెట్టి జగన్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రభాగాన నిలిపారు. ప్రజారోగ్య రంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేయడానికి ప్రణాళికలు రూపొందించారు. బుధవారం సరికొత్తగా మొదలైన ఈ అంబులెన్సు సర్వీసులు వాటికి కొనసాగింపే. ఇవి మళ్లీ ప్రాణదాతలుగా, ఆపద్బాంధవుల్లా అందరి ప్రశంసలూ పొందుతాయని ఆశించాలి. -
రామ్‌దేవ్ బాబా (యోగా గురువు) రాయని డైరీ
వరానిదేముందీ, నేను కాకపోతే దేవుడు అనుగ్రహిస్తాడు. వరాన్ని అందుకునే చేతులకే.. శక్తి ఉండాలి. శక్తి లేకపోతే వరమిచ్చిన దేవుడు గానీ, ఈ రామ్‌దేవ్ బాబా గానీ వరాన్ని వెనక్కు తీసుకోవడం తప్ప చేయగలిగిందేమీ లేదు. వరం అందుకోడానికి చేతులకు మాత్రమే శక్తి ఉంటే సరిపోదు. అది వరం అని గుర్తించే మనోశక్తి కూడా ఉండాలి. ఎందరికి ఉంది ఈ దేశంలో వరాన్ని గుర్తించే మనోశక్తి. వరం.. ‘మేడ్ బై దేవుడు’ అని ప్యాక్ మీద ఉన్నా, దేవుడి వరానికి అమెరికా వాళ్ల ఎఫ్.డి.ఎ. ఆమోదం ఉందా అని చూస్తారు. దేవుడిచ్చిన వరం జనంలోకి వెళ్లడానికి తిప్పలు పడటంలో అసహజం ఏమీ లేదు. ఆయన ఎక్కడో పైన ఉంటాడు. కింద ఉండే ఈ రామ్‌దేవ్‌కి కూడా ఇన్ని తిప్పలేమిటి చిన్న మెడిసిన్‌ని వరంలా విక్రయించుకోడానికి! మూడు నెలలుగా ఎవరూ ఖాళీగా లేరు. ఎవరికి తోచిన వరాన్ని వారు ప్రసాదించే పనిలో ఉన్నారు. మాస్కుల వరం, పాలూ పండ్లూ కూరగాయల వరం, ఉడకేసిన బియ్యం వరం, ఉప్మా ప్యాకెట్ల వరం, టికెట్లు తీసి బస్సులు, రైళ్లు ఎక్కించే వరం.. ఇలా వరాలిచ్చే వారితో ఈ భూమి నిండి పోయింది. ఇక వరాలు తీసుకునేవారికి చోటెక్కడ ఉంటుంది?! ఆచార్య బాలకృష్ణ వచ్చి కూర్చున్నాడు. ‘‘వరాలు ఎక్కువై ఈ మూర్ఖపు జనులకు వరం విలువ తెలియకుండా పోయింది బాబాజీ. మన కరోనిల్ కిట్లను ఐదు వందల నలభై ఐదు రూపాయలకే వరంగా ఇస్తున్నా ఎవరూ చెయ్యి పట్టడం లేదు. ఎవరైనా వరానికి ధరేంటని అనుమానంగా చూస్తారు. వీళ్లు వరాన్నే అనుమానంగా చూస్తున్నారు’’ అన్నాడు. అతడి చేతిలో కరోనిల్ కిట్ ఉంది. దానిని నా చేతుల్లోకి తీసుకున్నాను. ‘‘కోరుకోని వరం లభిస్తే ఎవరైనా ఆనందించకుండా ఎలా ఉండగలరో అర్థం కావడం లేదు ఆచార్యా’’ అన్నాను. అర్థం కావడం లేదని ఆచార్యతో అన్నాను కానీ, బొత్తిగా అర్థం కాకుండా ఏమీ లేదు. కోరుకోని వరం కోరుకున్న చోటు నుంచి రావాలని వీళ్లంతా కోరుకుంటున్నారు. వీళ్లకు రెమ్‌డెసివిర్ కావాలి. రామ్‌దేవ్‌బాబా వద్దు. ‘‘ఆచార్యా.. మన కిట్ల మీద ‘టెస్టెడ్ అండ్ వెరిఫైడ్ ఫ్రం పతంజలి’ అని కాకుండా.. ‘అప్రూవ్డ్ బై.. ఎఫ్.డి.ఎ.’ అని వేయించడానికి వీలవుతుందా?’’ అని అడిగాను. ‘‘రెండు విధాలుగా వీలుకాకపోవచ్చు’’ అన్నాడు! వీలుకాకపోవడం అన్నది ఒక విధంగా వీలు కాకపోయినా, రెండు విధాలుగా వీలుకాక పోయినా.. చివరికి వీలు కాకపోవడం ఒక్కటే మిగులుతుంది. ‘‘వీలయ్యే విధానాలు ఏమైనా ఉంటే చెప్పండి ఆచార్యా..’’ అని అడిగాను. ‘‘వీలు కాని విధాలను కొట్టేసుకుంటూ పోతే, వీలయ్యే విధానం ఎక్కడైనా పట్టుబడొచ్చు బాబాజీ’’ అన్నాడు. నా సహచరుడు అతడు. ఆయుర్వేద ఆచార్యుడు. నేను హర్యానా నుంచి వస్తే, అతడు హరిద్వార్ నుంచి వచ్చాడు. నాది యోగా, అతడిది ఫార్మసీ. అతడు శుభ్రమైన తెల్లటి వస్త్రాన్ని శాలువాగా కప్పుకుని కుర్చీలో ఆసీనుడై ఒక చేత్తో పుస్తకాన్ని, ఒక చేత్తో బాల్ పెన్ను పెట్టుకుని ఉంటే çపరిశోధనావస్థలో ఉండే యోగీశ్వరుడిలా ఉంటాడు. ‘‘వీలవని ఆ రెండు విధానాలేమిటి ఆచార్యా..’’ అని అడిగాను. ఆచార్య బాలకృష్ణ మాట్లాడలేదు. ‘‘చెప్పండి.. ఆచార్యా..’’ అన్నాను. ‘‘వీలవనివి తెలుస్తూ ఉండి, వీలయ్యేవి ఏవో తెలియనప్పుడు.. వీలయ్యేవి ఏమిటో ముందు తెలుసుకుని అప్పుడు వీలవని వాటిని కొట్టేసుకుంటూ పోతే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను బాబాజీ’’ అన్నాడు!! తెలియని ఆసనమేదో తెలియకుండా పడిపోయినట్లనిపించింది. -
అచ్చమైన భారత రత్నం
ఆర్థిక రంగంలో సంస్కరణలకు ఆద్యుడు, దేశ ఆర్థిక వ్యవస్థను మలుపు తిప్పిన యోధుడు మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహా రావు జయంతి సందర్భంగా నేటి నుంచి ఒక ఏడాది పాటు పీవీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ముదావహం. అత్యంత అదృష్టవంతుడు, బహు దురదృష్టవంతుడు అయిన రాజకీయ నాయకుడు ఎవరయ్యా అంటే చప్పున తట్టే పేరు పీవీ నరసింహా రావు. ఆయన ప్రధానిగా ఉన్నంతకాలం అందరూ ‘ఆహా! ఓహో!!’ అన్నారు. పీకలలోతు సమస్యల్లో కూరుకుపోయివున్న దేశ ఆర్థిక వ్యవస్థను నూతన సంస్కరణలతో ఒడ్డున పడేసిన మేధావిగా కీర్తిం చారు. సంఖ్యాబలం బొటాబొటిగా వున్న పాలకపక్షాన్ని అయిదేళ్ళ పాటు ‘పూర్తి కాలం’ అధికార పీఠంపై వుంచిన ‘అపర చాణక్యుడ’ని వేనోళ్ళ పొగిడారు. అధికారం దూరం అయి, పదవి నుంచి దిగిపోయిన తరువాత పొగిడిన ఆ నోళ్లతోనే ఆయనను తెగడటం ప్రారంభించారు. పదవికి ప్రాణం ఇచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పదవికి దూరం కాగానే వాళ్ళూ దూరం జరిగారు. అయిదేళ్ళు ‘తెలుగువాడి’లోని ‘వాడినీ, వేడినీ’ లోకానికి చాటిచెప్పిన ‘వృద్ధ రాజకీయవేత్త’, నిస్సహాయంగా న్యాయస్థానాలలో ‘బోనులో’ నిలబడినప్పుడు, ఆయన పార్టీ వాళ్ళెవ్వరూ ఆయనను పట్టించుకోకపోగా ఏమీ తెలియనట్టు ‘కళ్ళు’, ‘నోళ్ళు’ మూసుకున్నారు. గాంధీ, నెహ్రూల కుటుం బానికి చెందని ఒక కాంగ్రెస్ నాయకుడు భారత ప్రధానిగా ఒక మైనారిటీ ప్రభుత్వాన్ని తన తెలివితేటలతో, మేధస్సుతో పూర్తికాలం అయిదేళ్ళు నడపడమే కాదు, అప్పటికే ఆర్థికంగా కునారిల్లుతున్న దేశాన్ని ఒడ్డున పడేసిన కృతజ్ఞత కూడా ఆయనకు తన సొంత పార్టీ నుంచి లభించలేదు. ఇదీ కాంగ్రెస్ పార్టీలో కృతజ్ఞతకు ఉన్న స్థానం. ఒక సాధారణ నాయకుడు చనిపోయినా అతడి పార్థివదేహాన్ని పార్టీ కార్యకర్తలు, సాధారణ ప్రజలు దర్శించి కడపటి వీడ్కోలు ఇచ్చేందుకు వీలుగా పార్టీ ఆఫీసులో కొంతసేపు ఉంచడం అనేది అన్ని పార్టీలు అనుసరిస్తూ వస్తున్న సాంప్రదాయం. కానీ కాంగ్రెస్ అధిష్టానానికి ఆయన పట్ల ఆ మాత్రం కనీస మర్యాద చూపాలన్న సోయికూడా లేకుండాపోయింది. పీవీ మరణించడానికి కొన్ని నెలలముందు హైదరాబాద్ వచ్చారు. మాజీ ప్రధాని హోదాలో రాజ్‌భవన్ గెస్టు హౌస్‌లో బస చేశారు. గతంలో ప్రధానిగా ఆయన అక్కడ దిగినప్పుడు కనబడే హడావుడి ఎలా వుండేదో ఒక విలేకరిగా నాకు తెలుసు. ఆయన చుట్టూనే కాదు చుట్టుపక్కల ఎక్కడ చూసినా అధికారులు, అనధికారులు, మందీమార్బలాలు, వందిమాగధులు, ఆయన కళ్ళల్లో పడితే చాలనుకునే రాజకీయ నాయకులు. ఆ వైభోగం వర్ణించతరమా? అన్నట్టు ఉండేది. మాజీ ప్రధానిగా పీవీ రాజభవన్లో ఉన్నప్పుడు, నేనూ, ఆకాశవాణిలో నా సీనియర్ కొలీగ్ ఆర్వీవీ కృష్ణారావుగారు గవర్నర్ రికార్డింగ్ నిమిత్తం వెళ్లి, ఆ పని పూర్తిచేసుకున్న తరవాత, రాజ్‌భవన్ గెస్ట్‌హౌస్ మీదుగా తిరిగివెడుతూ అటువైపు తొంగి చూశాం. ఒకరిద్దరు సెక్యూరిటీ వాళ్ళు మినహా రాజకీయుల హడావుడి కనిపించకపోవడంతో మేము లోపలకు వెళ్ళాము. ‘పీవీ గారిని చూడడం వీలుపడుతుందా’ అని అక్కడవున్న భద్రతాధికారిని అడిగాము. అతడు తాపీగా ‘లోపలకు వెళ్ళండి’ అన్నట్టు సైగ చేశాడు. ఆశ్చర్యపోతూనే లోపలకు అడుగుపెట్టాం. అడుగుపెట్టిన తరువాత, మా ఆశ్చర్యం రెట్టింప యింది. పీవీ ఒక్కరే కూర్చుని టీవీలో ఫుట్‌బాల్ మ్యాచ్ చూస్తూ కనిపించారు. డిస్టర్బ్ చేశామేమో అన్న ఫీలింగ్‌తోనే, మమ్మల్ని పరిచయం చేసుకున్నాము. లుంగీ మీద ఒక ముతక బనీను మాత్రమే వేసుకునివున్న పీవీగారు నావైపు చూస్తూ, ‘మీ అన్నయ్య పర్వతాలరావు ఎలావున్నాడయ్యా!’ అని అడిగేసరికి నాకు మతిపోయినంత పనయింది. ఎప్పుడో దశాబ్దాల క్రితం, పీవీగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు, రాష్ట్ర సమాచార శాఖలో పనిచేస్తున్న మా పెద్దన్నయ్య భండారు పర్వతాలరావు ఆయనకు పీఆర్వోగా కొద్దికాలం పనిచేశారు. అసలు పీవీగారు ముఖ్యమంత్రిగా ఉన్నదే అతి కొద్దికాలం. అప్పటి విషయాలను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆయనకు లేదు. అయినా ఆప్యాయంగా గుర్తు పెట్టుకుని మరీ అడిగారు. అదీ పీవీ గారి గొప్పతనం. ఆ తరవాత కూడా ఆయన ఏదో మాట్లాడుతున్నారు కానీ మాకు ‘కలయో వైష్ణవ మాయయో’ అన్నట్టుగా ఉంది. మేము కలసి కూర్చుంది, కొన్నేళ్ళ క్రితం వరకు దేశాన్ని ఒంటిచేత్తో పాలించిన వ్యక్తితో అన్న స్పృహ ఉండటం వల్ల కొంత ఇబ్బంది పడుతూ కూర్చున్నాము. కాసేపటి తరువాత, కొణిజేటి రోశయ్య గారు వచ్చారు. ఆయన్ని చూడగానే పీవీ గారి మొహంలో ఒక రిలీఫ్ కనిపించింది. రోశయ్య గారు వచ్చిన తరువాత కాసేపు వుండి మేము వచ్చేశాము. ఇది జరిగి ఏళ్ళు గడిచినా ఈ చక్కని జ్ఞాపకం మా గుండెల్లో ఇంకా తాజాగానే వుంది. మరో సందర్భంలో పీవీ గారిని ఢిల్లీలో కలిశాను. రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెడుతూ అప్పుడు కేంద్ర మంత్రిగా అత్యంత ఉచ్ఛస్థానంలో ఉన్న పీవీ గారిని కలుద్దామని వెళ్లాను. బంగ్లా అంతటా నీరవ నిశ్శబ్ధం. కాసేపటి తరువాత ఎవరో అటుగా వస్తే ‘పీవీ గారిని కలవడానికి వీలుంటుందా’ అని వచ్చీరాని హిందీలో అడిగాను. అతగాడు బంగ్లాలో ఓ గది చూపించి వెళ్ళిపోయాడు. నెమ్మదిగా తలుపు తోసి చూస్తే ఎదురుగా పీవీ గారు. ఎవ్వరూ లేరు. పరిచయం చేసుకుని మాస్కో వెడుతున్నట్టు చెప్పాను. అప్పుడు ఆయన విదేశాంగ మంత్రి అనుకుంటాను. నా మొహంలో భావాలు పసికట్టినట్టున్నారు. ‘పనులు చేసి పెడుతూ వుంటే కదా పదిమంది వచ్చేది’ అన్నారు ఆయన తన మొహంలో భావాలు ఏమీ తెలియకుండా.‘మాస్కో ఎందుకయ్యా! వేరే దేశంలో మీ రేడియో ఉద్యోగాలు లేవా? బాగా చలిదేశం. పెళ్ళాం పిల్లలతో ఎలా ఉంటావు’ అని అడిగారు. చాలా ముక్తసరిగా మాట్లాడేవారని పేరున్న పీవీ గారు నేను ఊహించని విధంగా చనువుగా ఆ రెండు ముక్కలు మాట్లాడ్డం నా అదృష్టం అనే భావిస్తాను. కనీసం ఆయన శత జయంతి సంవత్సరంలో అయినా కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్న ప్రకటిస్తే, ఆ అత్యున్నత పురస్కారానికే శోభస్కరంగా ఉంటుందనడంలో సందేహం లేదు. ఆ విధంగా ఆ మహనీయుడికి జాతి యావత్తూ కృతజ్ఞత తెలిపినట్టవుతుంది కూడా. వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్టు: బండారు శ్రీనివాసరావు, మొబైల్ : 98491 30595 -
రేగుపండ్ల చెట్టు
కోడూరి విజయకుమార్ ఇంతవరకూ వాతావరణం, అక్వేరియంలో బంగారు చేప, అనంతరం, ఒక రాత్రి మరొక రాత్రి కవితా సంపుటాలు వెలువరించారు. ‘పొడిబారని నయన మొకటి తడియారని గుండె వొకటి వుండాలేగానీ’ ఉదయం లేచింది మొదలు రాత్రి వరకూ ఎన్నో ఆశ్చర్యాలు కవికి. కానీ కాలం గడిచేకొద్దీ ఈ మహానగరం ‘కళ్లకు గంతలు కట్టి, గుండెకు తాళం వేస్తుంది’ అని బాధ! ‘కొత్త ఇంట్లోకి అడుగు పెట్టిన రోజున ఇంటి గడపపై వెలిగిన రెండు దీపాలు– మా నాన్న కళ్లు’ అని మురిసిపోయిన చిన్నవాడే, పెద్దవాడై, సొంతింటి కల కన్నవాడై, శేష జీవితాన్ని ఇంటి వాయిదాలకు తాకట్టు పెట్టినవాడవుతాడు. ఇట్లాంటి ఎన్నో బాధల పలవరింపు తాజా సంపుటి ‘రేగుపండ్ల చెట్టు’. అందులోంచి ఒక కవిత: దేహమొక రహస్య బిలం ఏ అపూర్వ రహస్యాన్ని ఛేదించడానికి లోకం కడలిపైన ఈ దేహనావతో యాత్రిస్తున్నావు అంతు చిక్కని ఒక రహస్యమేదో నీ నావ లోలోపలే తిరుగుతున్నదని తెలుసా నీకు ఇదంతా పరిచిత దేహమనే అనుకుంటావుగానీ నీ ఎముకల రక్త మాంసాల లోలోపల్లోపల రహస్య రహస్యంగా సంచరించే మృత్యుగీతం చివరాఖరికెప్పుడో తప్ప వినిపించదు ఇవాళ జీవకళతో మెరిసిపోయే ఈ నావని పూల తీగల్లా అల్లుకున్న నీ రక్తసంబంధాలు నీ స్నేహ సంబంధాలు ఎవరికి తెలుసు– కొద్ది ప్రయాణంలోనే ఈ నావ కళ తప్పి ఏ తుపాను తాకిడికో ఛిద్రమయ్యాక అగంతకుడిలా చొరబడిన అకాల మృత్యువు రహస్యం తెలుసుకుంటావని ప్రతిరోజూ నీ యాత్రను దేహానికి నమస్కరించి ప్రారంభించు లోపలి రహస్యగీతాన్ని ఆలపిస్తూ ప్రారంభించు కోడూరి విజయకుమార్ -
భ్రమాన్విత చేతన
‘వాస్తవాన్ని వివరించడానికి, ఎన్నిమాటలూ సరిపోవు,’ అంటాడు డానియల్ ఖిల్మాన్ రాసిన ‘యు షుడ్ హావ్ లెఫ్ట్’ నవలలోని కథకుడు. కానీ, రచయిత సమర్థుడైతే ఒక ప్రత్యేకమైన కథకుడ్ని ఉపయోగించుకుని ఆ సంక్లిష్ట వాస్తవాన్ని మన ఊహకి అందేలా చేయగలడు. నవల శిల్పం, ఆ శిల్ప ప్రభావం సంపూర్ణంగా ఆ ప్రత్యేక కథకుడి మీదా, అతని కథనం మీదా ఆధారపడి వుంటుంది. సినిమా రచయిత అయిన కథకుడు, విజయవంతమైన తన సినిమాకి సీక్వెల్ రాయడానికి– భార్య (ఒకప్పుడు సినీ నటి, ఇప్పుడు నలభై ఏళ్లు), నాలుగేళ్ల కూతురుతో కలిసి కొండమీద ఒక భవంతిని అద్దెకి తీసుకుంటాడు. రైటర్స్ బ్లాక్‌తో అవస్థ పడుతున్న అతనికి, నటిగా అవకాశాలు రాని అసహనంతో ఉన్న భార్య విసిరే సూటిపోటి మాటలు తోడవుతుంటాయి. స్క్రీన్‌ప్లే రాసే పుస్తకంలోనే జరుగుతున్న విషయాలని కూడా అతను రాస్తుండటంతో కథ మనలని చేరుతుంటుంది. మొత్తం ఆరురోజుల కథ, ఆరే ఆరు అధ్యాయాలు. రెండో అధ్యాయంలో ‘ఒక వింత విషయం జరిగింది,’ అనే వాక్యంతో అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంట్లో ఉన్న ఒక ఫొటోలోని మనిషే పీడకలలో కనిపించింది కానీ, తీరా చూస్తే ఇప్పుడక్కడ ఆ ఫొటోనే లేదు! ఇంట్లో ఇంతకుముందు చూసిన కారిడారే ఇంకా పొడుగ్గా ఉన్నట్టుంది. ఇంతకుముందు లేని పడక గదులు ఇప్పుడు మరికొన్ని కనిపిస్తున్నాయి. కొండకింది ఊరికి సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్లినప్పుడు అక్కడో కొత్త వ్యక్తి, అక్కడెందుకు ఉంటున్నారసలు అని స్థానిక యాసలో అడిగింది అతనికి సగమే అర్థం అవుతుంది. మిగతా సగం మనకి అర్థం అవుతుంది! నాలుగో రోజుకి మరో ఎదురుదెబ్బ– భార్యకి మరెవరితోనో సంబంధం ఉందని తెలియడం, నిలదీస్తే ‘కూతుర్ని జాగ్రత్తగా చూసుకో,’ అని ఆమె కారేసుకుని వెళ్లిపోవడం. ఒక లంబకోణం గీసి, ఆ కోణాన్ని ఖండిస్తూ అడ్డంగా మరో సరళరేఖని గీసి, ఏర్పడ్డ రెండు కోణాల మొత్తం చూస్తే అది తొంభైకి కొంచెం తక్కువగా ఉంటోంది. లెక్కలన్నీ తప్పుతున్నాయి.ఇదంతా బొత్తిగా ‘భూత’ కల్పనేమో అని మనం అనుకునే లోపలే ఒక విషయం గమనిస్తాం. ఇప్పటివరకూ జరిగిన కథలోని చివరి రెండు అధ్యాయాలలోనూ కథకుడు రాస్తున్న దాంట్లో తేడా కనిపిస్తుంది. విరిగిపోతున్న వాక్యాలూ, చెరిగిపోతున్న విరామ చిహ్నాలూ మనకి కొత్త అనుమానాలు సృష్టిస్తాయి. దెబ్బతిన్న కథకుడి మానసిక సమతుల్యత అర్థమై– జరిగిన కథని పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం, జరగబోతున్న కథని, చెప్పబోతున్న కథకుడిని జాగ్రత్తగా అంచనా వేయాల్సిన అవసరం ఏకకాలంలో కలుగుతాయి. ప్రత్యేకత కలిగిన ఇలాంటి అన్రిలయబుల్ నేరేటర్ విషయంలో కథకుడు నమ్మదగినవాడు కాదని ప్రారంభంలోనే తెలియడం వేరు. మధ్యలో తెలియడం అసలైన హారర్! ముప్పై ఏళ్ల వయసులోనే ‘మెజరింగ్ ది వరల్డ్’ నవలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ జర్మన్ రచయిత మూడేళ్ల క్రితం విడుదలయిన నవల ‘టిల్’తో జర్మన్ సాహిత్యంలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ‘యు షుడ్ హావ్ లెఫ్ట్’ కథనం ఆకట్టుకోవడానికి మూల రచయిత కృషి ఎంత ఉండివుండవచ్చో, అనువాదకుడు రాస్ బెంజమిన్ కృషి దాదాపుగా అంతే ఉందనిపిస్తుంది. 2017లో పాంథియాన్ ప్రచురించిన ఈ ఇంగ్లిష్ అనువాదం చదివాక బెంజమిన్ ఇతర అనువాదాలని వెతికిపట్టుకుని చదవాలనిపిస్తుంది. దిశ మారుతున్న కథని మనం గమనిస్తూ కూడా దాన్ని మామూలు హారర్ కథగా భ్రమించకుండా, రచయిత కథని నడుపుతున్న తీరుని గమనించేట్టు చేయడం డానియల్ ఖిల్మాన్ ఈ నవలలో సాధించిన విశేషం. -యు ఎ.వి.రమణమూర్తి -
బడ్జెట్ అంచనాల్లో వాస్తవమెంత?
ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో తాను అమలు చేయనున్న పథకాలు, ప్రాజెక్టులకు ఎంత కేటాయించనుంది, ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం రానున్నట్లు అది అంచనా వేస్తుంది అనే వివరాలను తెలిపే రాబడి, ఖర్చుల చిట్టానే బడ్జెట్. ప్రభుత్వం నిర్దిష్ట సంవత్సరంలో తనకు వచ్చే ఆదాయం, తాను పెట్టే ఖర్చు గురించి ప్రారంభ బడ్డెట్లో అంచనా వేసినప్పటికీ తర్వాత వాస్తవంగా ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే రాబడి నుంచే ప్రభుత్వ పథకాలకు నిర్దిష్టంగా నిధులు విడుదల అవుతుంటాయి. అందుకే బడ్జెట్ అంచనాలను వీలైనంత నిర్దిష్టంగా, ఖచ్చితంగా అంచనా వేయడం ప్రభుత్వ విధి. ఇంతవరకు కేంద్ర బడ్జెట్లో ఆయా ప్రభుత్వాలు పొందుపరుస్తూ వచ్చిన రాబడి అంచనాలు ఏమేరకు నిర్దిష్టమైనవి, ఖచ్చితమైనవి అనే ప్రశ్నకు సమాధానం వెతకడమే ఒక గణిత శాస్త్ర పజిల్ని తలపిస్తుంది. ప్రభుత్వం ఒక సంవత్సర కాలంలో అమలు చేయనున్న పథకాలు, ప్రాజెక్టులకు ఎంత కేటాయించనుంది, ఆర్థిక సంవత్సరంలో ఎంత ఆదాయం రానున్నట్లు అంచనా వేస్తుంది అనే రాబడి, ఖర్చుల చిట్టానే కేంద్ర బడ్జెట్. ఈ సందర్భంగా, బడ్జెట్లో ప్రతి సంవత్సరం ఆదాయంపై వేస్తున్న అంచనాలకు, వాస్తవంగా నిర్దిష్ట సంవత్సరంలో పెడుతున్న ఖర్చుకు మధ్య పొంతన ఉండేలా ఇకనైనా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పన్నులు.. పన్నుల వసూళ్ల ద్వారానే ప్రభుత్వానికి అధిక రాబడి వస్తూంటుంది కాబట్టి ఆదాయ వృద్ధి, ఆర్థిక కార్యాచరణలో ఎగుడుదిగుడులు, అంతర్జాతీయ వ్యాపారం తీరుతెన్నులు వంటి ప్రభావిత అంశాల కారణంగా ఏ బడ్జెట్ అంచనాలో అయినా సరే రాబడి విషయంలో పరిపూర్ణమైన నిర్దిష్టత, ఖచ్చితత్వం నమోదవడం అనిశ్చితంగానే ఉంటుందని చెప్పాలి. ప్రభుత్వం ఎంత ఖర్చుపెట్టనుంది అనేది ఆ సంవత్సరంలో అది ఎంత రాబడిని పెంచదల్చుకుంది అనే అంశంపై ఆధారపడి ఉంటుంది. చాలా సందర్భాల్లో బడ్జెట్లో వేసుకున్న అంచనాలకు, పెరిగిన వాస్తవ రాబడికి మధ్య పొంతన ఉండదు. ఈ అనిశ్చితి ఏ బడ్జెట్ కయినా తప్పదు. కానీ ఈ సంక్లిష్టత వెలుగులోనే వీలైనంత ఉత్తమంగా బడ్జెట్ అంచనాలను నిర్దిష్టంగా, ఖచ్చితంగా రూపొందించడం ప్రభుత్వాల విధి. ప్రధానంగా ఈ వ్యాసం 2004–05 నుంచి 2016–17 కాలంలో పన్నుల వసూలుపై బడ్జెట్ వేసిన అంచనాల నిర్దిష్టతను పరిశీలిస్తుంది. ఈ అంచనాలు ఎంతమేరకు నిర్దిష్టతను సంతరించుకున్నాయో సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది. వాస్తవ ఆదాయ అంచనా మరీ భిన్నంగా ఉన్నప్పుడు దానివెనుక ఉన్న బలమైన కారణాలను విశ్లేషించడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఈ ప్రయోజనం కోసం బడ్జెట్ అంచనాలను (బీఈ) సవరించిన అంచనాలు (ఆర్ఈ), వాస్తవ అంచనాల (ఏఈ) తో పోల్చి చూడాల్సి ఉంటుంది. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో బడ్డెట్ డాక్యుమెంట్ ఈ మూడు సంఖ్యలనే క్రోడీకరిస్తుంటుంది. ఈ మూడు సంఖ్యల మధ్య వ్యత్యాసాన్ని వీటి పేర్లే సూచిస్తాయి. బీఈ అంటే బడ్జెట్ అంచనాలు. అంటే ఇది ఒరిజినల్ అంచనా. ఆర్ఈ అంటే తొలి ఆరునెలల కాలానికి ప్రభుత్వానికి వచ్చిన రాబడి లేదా ఖర్చు. పైగా చివరి ఆరు నెలలకు వస్తుందని, అవుతుందని ఊహించిన రాబడి, ఖర్చు కూడా దీంట్లో భాగమే. ఇక ఏఈ అంటే రాబడి, ఖర్చుకు సంబంధించిన నిజమైన సంఖ్యలను తెలుపుతుంది. ఒక సంవత్సరంలో ఎంత ఆదాయం సేకరించారు, ఎంత ఖర్చుపెట్టారు అనే వాస్తవ సంఖ్యలను ఇది తెలుపుతుంది. ఈ మూడింటిని (ఏఈ, ఆర్ఈ, బీఈ) సరిపోల్చడం ద్వారా, బడ్జెట్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన అంచనాల నిర్దిష్టతను లేక అనిర్దిష్టతను క్రోడీకరించవచ్చు. మొత్తం పన్ను రాబడి 2004–05 నుంచి 2016–17 కాలాన్ని పరిశీలిస్తే ఈ మొత్తం 13 ఏళ్ల కాలంలో తొమ్మిదేళ్లపాటు బడ్జెట్ అంచనా కంటే వాస్తవంగా తేలిన అంచనా తగ్గిపోవడం చూస్తాం. అదేసమయంలో అది బడ్జెట్ అంచనాను నాలుగేళ్లలో మాత్రమే అధిగమించింది. 2008–09లో రెండు అంచనాలకు మధ్య భారీ వ్యత్యాసం నమోదైంది. అంటే బడ్జెట్ అంచనా కంటే వాస్తవ అంచనా 12 శాతం తగ్గిపోయింది. ఆ సంవత్సరం పన్నుల రాబడి పెద్దగా పెరగనందున అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా ఇంత పెద్ద వ్యత్యాసం ఏర్పడిందని బడ్జెట్ నిపుణులు వాదించారు. భారతదేశంలో మొత్తం పన్ను రాబడి వివిధ విభాగాల నుంచి వస్తుంటుంది. వీటిలో కార్పొరేట్ ఇన్కమ్ టాక్స్ (సీఐటీ), పర్సనల్ ఇన్ కమ్ టాక్స్ (పీఐటీ), ఎక్సైజ్ డ్యూటీ (ఈడీ), కస్టమ్స్ డ్యూటీ (సీడీ) సర్వీస్ టాక్స్ (ఎస్టి) కొన్ని. ప్రతి విభాగంలోనూ పన్ను రాబడిని విడివిడిగా అంచనా వేస్తుంటారు. వీటిలో ప్రతి ఒక్క విభాగంలో వసూలైన పన్ను రాబడి వివిధ కారణాల వల్ల వ్యత్యాసంతో ఉంటుంది. అందుకు ప్రతి విభాగాన్ని విడివిడిగానే పరిశీలించడం చాలా ముఖ్యం. సాంప్రదాయకంగా బడ్జెట్లను వివిధ పథకాలకు కేటాయింపులు, కొత్త ప్రోగ్రాంలు, పన్ను క్రమబద్ధీకరణలు వంటివాటిపై ఆధారపడి విశ్లేషిస్తుంటారు. ఈ క్రమంలో బడ్జెట్ అంచనాలను సవరించిన, వాస్తవ అంచనాలతో సరిపోల్చడంతో జరిగే లోపాల పట్ల ఎవరూ పెద్దగా ఆసక్తి, శ్రద్ధ ప్రదర్శించడం లేదు. ఉదాహరణకు కార్పొరేట్ ఇన్కమ్ టాక్స్ కేసి చూద్దాం. దీని వాస్తవ సంఖ్యలు బడ్జెట్ అంచనా కంటే 11 పర్యాయాలు తక్కువగా నమోదయ్యాయి. అందులోనూ 13 సంవత్సరాల్లో 11 సార్లు ఇలా తక్కువ రాబడి నమోదైంది. 2006–07, 2007– 08 సంవత్సరాలు మాత్రమే దీనికి మినహాయింపుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో అత్యధిక ఆర్థిక వృద్ధి రేటు కారణంగా బడ్జెట్ అంచనాల కంటే వాస్తవ అంచనా చాలా ఎక్కువగా పోగుపడింది. అయితే, కార్పొరేట్ ఇన్‌కం ట్యాక్స్ వసూలు విషయంలో బడ్జెట్లో మితిమీరిన అంచనాను పొందుపర్చారు. చివరి నాలుగేళ్లలో మాత్రమే బడ్జెట్ అంచనా మరింత నిర్దిష్టతను, కచ్చితత్వాన్ని సంతరించుకున్నట్లు స్పష్టమవుతోంది. వ్యక్తిగత ఆదాయ పన్ను: వ్యక్తిగత ఆదాయ పన్ను విషయంలో చూస్తే, వాస్తవ అంచనాలు బడ్జెట్ అంచనాను అయిదు సందర్భాల్లో అధిగమించాయి. కాగా ఎనిమిదేళ్లలో తగ్గుదలను నమోదు చేశాయి. దీనికి సంబంధించినంతవరకు మొత్తం ట్రెండ్ గజిబిజిగా, అత్యంత క్రమరహితంగా సాగింది. కొన్ని అంశాలను ప్రధానంగా సూచించినప్పటికీ వ్యక్తిగత ఆదాయ పన్ను రాబడిని నిర్దిష్టంగా నిర్ధారించడం కష్టసాధ్యమైంది. 2008–09లో వ్యక్తిగత ఆదాయ పన్ను రాబడి (–23 శాతం) తగ్గుముఖం పట్టింది. ఆ సంవత్సరం అంతర్జాతీయంగా ద్రవ్యసంక్షోభం చెలరేగడమే దీనికి కారణం. పైగా, బడ్జెట్ అంచనాలో సూచించిన వృద్ధిరేటు కూడా చాలా ఎక్కువగా అంటే 40 శాతం దాకా ఊహించడమైనది. దీంతో బడ్జెట్ అంచనా కంటే వాస్తవ అంచనా తగ్గిపోయింది. 2008–09 అనుభవం నేపథ్యంలో, 2019–10 బడ్జెట్ అంచనా వాస్తవానికి ప్రతికూల స్థితికి చేరుకుంది. అందుకే బడ్జెట్ అంచనా కంటే వాస్తవ అంచనా 17 శాతం ఎక్కువగా నమోదైంది. ఇక 2016–17 ఆర్థిక సంవత్సరాన్ని పరిశీలిస్తే బడ్జెట్ అంచనా కంటే వాస్తవ అంచనా 3.2 శాతం ఎక్కువగా నమోదైంది. గతంలో తాము ప్రకటించని ఆదాయాన్ని ఆలస్యంగానైనా సరే ప్రకటించిన వారికి కేంద్రప్రభుత్వం ఆ సంవత్సరంలో క్షమాభిక్షను ప్రకటించిన కారణంగా ఒకే దఫాలో ప్రభుత్వానికి 10వేల కోట్ల ఆదాయం సమకూరింది. ఎక్సైజ్ డ్యూటీ: ఈ అధ్యయన కాలానికిగానూ, మూడు సందర్భాల్లో ప్రత్యేకించి 2015–16, 2016–17 కాలంలో ఎక్సైజ్ డ్యూటీకి సంబంధించి బడ్జెట్ అంచనా కంటే వాస్తవ అంచనా ఎక్కువగా కనిపించింది. వరుసగా ఈ రెండు సంవత్సరాల్లో బడ్జెట్ అంచనా కంటే వాస్తవ అంచనా 20 శాతం పెరుగుదలను సూచించింది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు రికార్డు స్థాయిలో పతనం కావడంతో కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజిల్‌పై ఎక్సైజ్ పన్నును పెంచడమే ఈ పెరుగుదలకు కారణం. ఈ పెంచిన పన్ను కారణంగా ప్రభుత్వానికి ఆపారలబ్ధి కలిగింది. అందుకే ఆ సంవత్సరాల్లో వాస్తవ అంచనా అనేది బడ్జెట్ అంచనా కంటే పెరిగిపోయింది. కస్టమ్ డ్యూటీ: కస్టమ్ డ్యూటీ విషయానికి వస్తే 13 సంవత్సరాల కాలంలో అయిదు సంవత్సరాలపాటు బడ్జెట్ అంచనా కంటే వాస్తవ అంచనా అధికంగా నమోదైంది. దీనికి కారణం ఊహించదగినదే. 2004–05 నుంచి 2007–08 సంవత్సరాల వరకు బడ్జెట్ అంచనా కంటే వాస్తవ అంచనా అధిక వృద్ధిని నమోదు చేసింది. తర్వాత అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభం కారణంగా వాస్తవ అంచనా తగ్గుముఖం పట్టింది. గత నాలుగు సంవత్సరాలుగా కస్టమ్ డ్యూటీ ద్వారా రాబడి వసూలులో గుర్తించదగిన అంశాన్ని తిలకించవచ్చు. బడ్జెట్లో వేసిన అంచనా సాపేక్షికంగా తగ్గుముఖం పట్టింది. ఇప్పటికీ ఈ రంగంలో వాస్తవ అంచనా అనేది బడ్జెట్ అంచనా కంటే తక్కువస్థాయిలో కొనసాగుతోంది. సర్వీస్ టాక్స్: ఇతర విభాగాలతో పోలిస్తే సర్వీస్ టాక్స్ కొన్ని ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంది. అత్యధిక వృద్ధి సాధించిన సంవత్సరాల్లో బడ్జెట్ అంచనాను వాస్తవ అంచనా అధిగమించింది. అంతర్జాతీయ ద్రవ్య సంక్షోభ కాలంలో ఇది తగ్గుముఖం పట్టింది. మిగిలిన సంవత్సరాల్లో ఈ రంగంలో ధోరణులు అటూ ఇటూ అస్థిరంగా సాగాయి. అంటే 2011–12లో బడ్జెట్ అంచనాను వాస్తవ అంచనా 10 శాతం మేరకు అధిగమించింది. తర్వాత 2014–15లో అది 20 శాతం వరకు వెనుకబడింది. ముందే చెప్పినట్లు బడ్జెట్ అంచనాలను సవరించిన, వాస్తవ అంచనాలతో సరిపోల్చడంతో జరిగే లోపాల పట్ల ఎవరూ పెద్దగా ఆసక్తి, శ్రద్ధ ప్రదర్శించడం లేదు. అయినప్పటికీ, వాస్తవ రాబడి వసూలు అనేది –చాలావరకు పన్నుల నుంచే వస్తుంటుంది–ప్రభుత్వ పథకాలకు వాస్తవ నిధుల విడుదలను ప్రభావితం చేస్తుంటుంది. అందుకే బడ్జెట్ అంచనాలను వీలైనంత నిర్దిష్టంగా ఖచ్చితంగా అంచనా వేయడం ఏ ప్రభుత్వానికైనా తప్పనిసరి విధిగా, ఆవశ్యకతగా ఉంటోంది. సూరజ్ జైస్వాల్(వ్యాసకర్త సెంటర్ ఫర్ బడ్జెట్, గవర్నెన్స్ అకౌంటబిలిటీ పరిశోధకుడు) -(‘ద వైర్’ సౌజన్యంతో) -
బాబు జోక్యంతోనే ప్రతికూల ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచారం ప్రజా కూటమిపై ప్రతికూల ప్రభావం చూపిందని సీపీఎం విశ్లేషించింది. తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు మళ్లీ జోక్యం చేసుకోవడం ఇక్కడి ప్రజలకు రుచించలేదని, టీఆర్ఎస్ అనుకూల సెంటిమెంట్ ఏర్పడేందుకు కేసీఆర్ నిర్వహించిన ప్రచారం ఉపయోగపడిందని అభిప్రాయపడింది. గురువారం ఎంబీ భవన్లో జరిగిన సమావేశంలో ఎన్నికల ఫలితాలు, ప్రభావం, సీపీఎం–బీఎల్ఎఫ్ పోటీ చేసిన స్థానాల్లో ఫలితాలు, తదితర అంశాలను సీపీఎం రాష్ట్ర సెక్రటేరియట్ సమీక్షించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేసిన ప్రసంగాలు, కూటమికి తానే సంధానకర్తగా వ్యవహరించిన తీరు ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడడానికి కారణమైందని విశ్లేషించింది. టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమల్లో లోపాలున్నా అవి అధికార పార్టీకి సానుకూల ఓటింగ్‌కు పనికొచ్చాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇక ముందూ కొనసాగాలంటే మళ్లీ టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది. ఓట్ల సాధనలో బీఎల్ఎఫ్ విఫలం... ప్రత్యామ్నాయ విధానాలు, సామాజిక న్యాయం నినాదంతో ఎన్నికల్లో పోటీ చేసిన సీపీఎం–బీఎల్ఎఫ్ ఆశించిన మేర ఓట్ల సాధనలో విఫలం కావడాన్ని సీపీఎం అంగీకరించింది. బీఎల్ఎఫ్ ప్రయోగం, ఎజెండా తెలంగాణకు అవసరమని, రాబోయే రోజుల్లోనూ ఇదే వైఖరితో ముందుకు సాగాలనే అభిప్రాయం వ్యక్తమైంది. బీఎల్ఎఫ్ ప్రత్యామ్నాయ విధానాలకు మద్దతు తెలిపిన సీపీఐ, టీజేఎస్, ప్రజాగాయకుడు గద్దర్, బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆ తర్వాత కాంగ్రెస్‌తో కలవడంతో నష్టం జరిగిందని అభిప్రాయపడింది. -
ప్రముఖ డేటా సంస్థలో భారీ ఉద్యోగాలు
సాక్షి, న్యూఢిల్లీ: యూకే ఆధారిత డేటా డెవలపర్ డన్ హంబీ కంపెనీ భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న నెలల్లో భారతదేశంలో మరింత మంది ఉద్యోగులను నియమించుకోనున్నట్లు మంగళవారం ప్రకటించింది. ప్రపంచ రిటైల్ వ్యాపారం రంగంలో భారత్ ప్రకాశవంతమైన ప్రదేశంగా ఉన్నందున ఈ సంస్థ తన గ్లోబల్ వినియోగదారులను పెంచుకుందని డన్హంబీ చీఫ్ టెక్నాలజీ అండ్ ప్రొడక్షన్ ఆఫీసర్ డేవిడ్ జాక్ తెలిపారు. 25 శాతం కన్నా ఎక్కువ వృద్ధిని సాధించిందన్నారు. రానున్న నెలల్లో భారతదేశంలో తమ టాలెంట్ పూల్‌ను మరింత పెంచుతామని ఆయన అన్నారు. జనాభా పరిమాణం, రిటైల్ రంగంలో వేగంగా వృద్ధి చెందుతున్న భారత్ భారీ అవకాశాలను కలిగి ఉందని డేవిడ్ జాక్ చెప్పారు. -
జుకర్ బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ : కేంబ్రిడ్జి అనలిటికా (సీఏ) సేవలను ఉపయోగించుకున్నట్లు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు బుధవారం పరస్పరం పార్లమెంట్లో ఆరోపణలు చేసుకున్నాయి. ఫేస్బుక్ నుంచి సేకరించిన అమెరికా ఓటర్ల డేటాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఉపయోగించినట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఈ రెండు పార్టీల మధ్య వాదోపవాదనలు జరిగాయి. ఈ సందర్భంలోనే మన కేంద్ర సమాచార శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ జోక్యం చేసుకొని ఫేస్బుక్ ప్రొఫైల్‌ను భారత్‌లో అనుమతిస్తామని, అయితే ఇలా ఖాతాదారుల డేటాను ఇతరులకు అందజేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అవసరమైతే ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌ను భారత్‌కు రప్పిస్తామని మంత్రి హెచ్చరించారు. ఇలాంటి ఉత్తుత్తి బెదిరింపులను మనం తాటాకు చప్పుళ్లు చేయడం అని చెప్పవచ్చు. దేశంలో తగినన్ని క్రిమినల్ చట్టాలు ఉన్నప్పటికీ విదేశాలకు పారిపోయిన నేరస్థులు నీరవ్ మోదీ, లలిత్ మోదీలను భారత్‌కు రప్పించలేక పోతున్నాం. ఇక భారతీయుల డేటా పరిరక్షిణకు దేశంలో తగిన చట్టాలే లేనప్పుడు మార్క్ జుకర్‌బర్గ్ లాంటి వారిని భారత్‌కు రప్పిస్తామంటూ హెచ్చరించడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి! పైగా ఇదే మంత్రిగారి ప్రభుత్వం సుప్రీం కోర్టు ముందు ఇటీవల ‘ప్రైవసీ’ ప్రాథమిక హక్కు కాదని వాదించింది. కేవలం ఐదు వందల రూపాయలకు ఆధార్ కార్డు వివరాలు ఎవరికైనా అందుబాటులో ఉండే ఈ దేశంలో పౌరుల వ్యక్తిగత వివరాలకు భద్రత ఎంతో ఊహించవచ్చు! కేంద్ర ప్రభుత్వం 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన ఒకే ఒక ఐటీ సమాచార చట్టం కింద పౌరుల వ్యక్తిగత డేటాకు భద్రతను కల్పిస్తోంది. ఇది కూడా కొన్ని అంశాలకు మాత్రమే పరిమితమై ఉంటుంది. ఫేస్బుక్ వ్యక్తం చేసే అభిప్రాయలలాంటివాటికి భద్రత ఉండదు. ఈ చట్టం కింద భద్రంగా ఉంచాల్సిన అంశాలు 1. పాస్వర్డ్ 2. ఆర్థిక సమాచారం అంటే, బ్యాంక్ ఖాతాల వివరాలు, ఆర్థిక చెల్లింపు సాధనాలు 3. ఆరోగ్య పరిస్థితి 4. వైద్య రికార్డులు, హిస్టరీ 5.లైంగిక దక్పథం. 6. బయోమెట్రిక్ సమాచారం. ఈ ఆరు అంశాలకు తగిన భద్రత కల్పించాలని, అందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని చట్టంలో ఉందిగానీ ఈ అంశాలను తస్కరించిన వారికి, అందుకు సహకరించిన వారికి ఎలాంటి శిక్షలు విధించాలో లేదు. బిహార్ ఎన్నికల్లో ఓటర్ల నాడిని పట్టుకునేందుకు ఇదే కేంబ్రిడ్జి సంస్థ, ఫేస్బుక్లో భారతీయుల వివరాల డేటాను ఉపయోగించుకుంది. అలాంటప్పుడు ఈ 2000–ఐటీ చట్టం కింద భారత ప్రభుత్వం జూకర్ బర్గ్‌ను భారత్‌కు రప్పించగలదా? అన్నది కోటి రూకల ప్రశ్న. -
పవన్ జేఎఫ్సీ కొత్తగా ఏం కనిపెట్టింది?
సాక్షి, అమరావతి : జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ (జేఎఫ్సీ) తొలి సమావేశం శనివారం హైదరాబాద్‌లో ముగిసింది. ఈ రెండు రోజుల సమావేశం కొత్తగా ఏమి కనిపెట్టిందో అర్థం కావడం లేదని రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. ఈనెల 15 లోపు పూర్తి సమాచారం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేసినా అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ కనీసం స్పందించకపోగా... కొందరు వ్యక్తుల కోసం తాము సమాచారాన్ని బజార్లో పెట్టబోమని, అసెంబ్లీలో చెబుతామని సాక్షాత్తు ముఖ్యమంత్రే చెప్పారు. దీంతో వైబ్సైట్లలో, సామాజిక మాధ్యమాల్లో దొరికిన సమాచారం ఆధారంగానే నిజనిర్ధారణ జరిగింది. ఏదో ఒక నెపం మీద తిరస్కరిస్తున్న తీరును ప్రశ్నించారే తప్ప దానికి సరైన సాక్ష్యాధారాలను కనిపెట్టలేకపోయారు. ప్రత్యేక హోదానా, ప్రత్యేక ప్యాకేజీనా? అనే దానిపైనా స్పష్టత ఇవ్వలేకపోయారు. దేనివల్ల రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందనే దానిపై స్వల్ప చర్చతో సరిపెట్టారు. హోదాతోనే విద్య, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని జనం నెత్తినోరు కొట్టుకుని చెబుతుండగా... దేనివల్ల ఎన్ని నిధులు వస్తాయని చర్చించడం సమంజసంగా లేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 2016 సెప్టెంబర్‌లో, 2017 మార్చిలో సాక్షాత్తు ముఖ్యమంత్రే రెండుసార్లు ప్యాకేజీకి అంగీకరించినందున దాన్నుంచి వెనక్కుపోవడం సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. రాజధాని నిర్మాణానికి కేటాయించిన నిధులెన్నీ, వచ్చినవి ఎన్ని? అనే దానిపైనా సమావేశంలో స్పష్టత కొరవడింది. టీవీ చర్చల్లో, విలేకరుల సమావేశాల్లో చెప్పిన వివరాలే ఈ భేటీకి ప్రాతిపదిక అయితే అర్థం ఏముందని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. నేతలందరూ ఏకమై ప్రత్యేకహోదా కోసంపోరాడాల్సిన తరుణంలో నిధుల లెక్కలంటూ సమావేశం నిర్వహించడం సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నంలా ఉందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, టీడీపీల తరఫున ప్రచారం చేసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నేరుగా ప్రశ్నించకుండా జేఎఫ్సీ పేరిట సమావేశాలు నిర్వహించడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శిస్తున్నారు. కమిటీకి కొరవడిన స్పష్టత కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి పద్మనాభయ్య నాయకత్వంలో కమిటీ మొత్తం 11 అంశాలపై చర్చించినా దేనిపైనా నిర్దిష్టమైన నిర్ణయానికి రాలేకపోయింది. కొన్ని అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదని, మరికొన్నింటిలో కేంద్రానిది తప్పు ఉందని జేఎఫ్సీ కనిపెట్టింది. రూ.16,078 కోట్ల రెవెన్యూ లోటుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటే కేంద్రం రూ.4,113 కోట్లు ఇచ్చి మిగతా వాటినన్నింటినీ తిరస్కరించిందని పద్మనాభయ్య తెలిపారు. పెన్షన్ పెంపు, రుణ విమోచన, డిస్కంల నష్టాల సర్దుబాటు, పదో వేతన సంఘం బకాయిలు వంటి వాటికి తాము డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని కేంద్రం చెప్పినట్టు వివరించారు. చాలా పథకాలు, కార్యక్రమాలు ఆచరణ సాధ్యం కానివిగా కేంద్రం కొట్టిపారేసిందని, రాష్ట్ర విభజనే వయబులిటీ లేనిదైతే... మెట్రో, పెట్రోకెమికల్ ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్ వంటి వాటికి ఎలా వయబులిటీ ఉంటుందని కొందరు ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వానికే స్పష్టత లేదని సమావేశం అభిప్రాయపడింది. జాతీయ విద్యా సంస్థల వ్యవహారంలోనూ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన తీరులో స్పందించలేదని, వీటి బడ్జెట్ గురించి ఎక్కడా ప్రస్తావనే లేదని సమావేశంలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు. ఈ సంస్థలకు రూ.11 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా... ఇప్పటికి కేవలం రూ.500 కోట్లే ఇచ్చినట్టు తమ వద్ద ఉన్న పేపర్లలో ఉన్నట్టు పద్మనాభయ్య తెలిపారు. దుగరాజుపట్నం పోర్టుకు కేంద్ర కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినా నీతి ఆయోగ్ మోకాలడ్డిందని, కడప స్టీల్ ప్లాంట్ విషయంలోనూ అదే జరిగిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం లేదని తోట చంద్రశేఖర్ తదితరులు చెప్పారు. తొలిరోజు భేటీకి హాజరైన సీపీఎం, సీపీఐ, లోక్‌సత్తా నాయకులు, త్రిసభ్య కమిటీ సభ్యుడయిన ఐవైఆర్ కృష్ణారావు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి గోపాలగౌడ రెండో రోజు సమావేశానికి హాజరుకాలేదు. సమాచారం రాష్ట్ర ప్రభుత్వమే ఇచ్చిందా?: ఉండవల్లి జేఎఫ్సీ చర్చించిన సమాచారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిందేనా? అని ఉండవల్లి జనసేన నేతను అడిగారు. జయప్రకాష్ నారాయణ తన సోర్స్ ద్వారా కొంత సంపాదించారని, మరికొంత వేరే మార్గం ద్వారా వచ్చిందని పవన్ బదులిచ్చారు. ‘అయితే మనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏవీ స్పందించలేదన్న మాట’ అని ఉండవల్లి వ్యాఖ్యానించారు. ’పవన్ ఇంకా ఎన్డీఏ భాగస్వామే. దాన్నుంచి బయటకు వచ్చినట్టు చెప్పలేదు. సమాచారం కావాలని మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు. అయినా ప్రభుత్వాలు స్పందించలేదు’ అని తెలిపారు. ఇద్దరు అధికారుల్ని నియమించారంటూ లీకులు ఈ దశలో పవన్ వద్దకు వచ్చిన జనసేన కార్యకర్త ఒకరు జేఎఫ్సీ కమిటీతో మాట్లాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు ఐఎఎస్‌లు ప్రేంచంద్రారెడ్డి, ఎస్.బాలసుబ్రమణ్యంలను నియమించదని చెప్పారు. ఇదో శుభ పరిణామమని, ఆ ఇద్దరూ తనతో కాకుండా పద్మనాభయ్య, జయప్రకాశ్ నారాయణ, టి.చంద్రశేఖర్, ఐవైఆర్ కృష్ణారావుతో మాట్లాడమని చెబుతానని పవన్ చెప్పారు. అయితే ఆ ఇద్దరు అధికారులను నియమించినట్టు రాత్రి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించలేదు. అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేని పార్టీలనే పిలిచామని శుక్రవారం జనసేన వర్గాలు ప్రకటించగా.. వైఎస్సార్ సీపీ, టీడీపీలకు కూడా సమాచారం పంపామని పవన్ శనివారం చెప్పారు. -
గౌరి లంకేష్ హత్యకేసులో సీసీ పుటేజి విశ్లేషణ
-
ఫిర్యాదులు వినేదెవరు?
విశ్లేషణ న్యాయవ్యవస్థలోనూ పాలకుల బంట్లు ఉంటే పౌరుడికి న్యాయం జరగదు. రూల్ ఆఫ్ లా అంటే తప్పు చేసిన పాలకులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చే సత్తాతోపాటు అలాంటి వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించకుండా ఉంచే వ్యవస్థ అని అర్థం. జస్టిస్ చిన్నస్వామి స్వామినాథన్ కర్నన్ ఉదంతం న్యాయమూర్తుల నియామక విధానాలను సంస్కరించి జాగ్రత్తగా అమలు చేయాలని విశదం చేస్తున్నది. చరిత్రలో మొదటిసారి ఒక హైకోర్టు న్యాయమూర్తికి సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం జైలుశిక్ష వేయవలసి రావడం, పోలీసులు బయలుదేరడం, ఆయన దొరకకపోవడం దురదృష్టకరం. నియామకాల సందర్భంలో పారదర్శకత, పకడ్బందీ విచారణ అవసరమనిపిస్తుంది. జాతీయ న్యాయమూర్తుల నియామక సంస్థను నెలకొల్పేందుకు కేంద్రం చేసిన చట్టాన్ని సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధం కాదని కొట్టివేసింది. న్యాయమూర్తులుగా నియమితులు కావడానికి ఏం చేయాలి? ఎవరు సిఫార్సు చేయాలి అనే విషయంలో సమ గ్రమైన విధాన ప్రక్రియను నిర్ధారించవలసి ఉంది. న్యాయమంత్రిత్వ శాఖ జవాబుదారీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని సుభాష్ చంద్ర అగ్రవాల్ ఆర్టీఐ దరఖాస్తు పెట్టుకున్నారు. రాజ్యాంగ న్యాయమూర్తులు, మాజీ న్యాయమూర్తుల నియామకాలు, క్రమశిక్షణ, జవాబుదారీతనం పారదర్శకత అంశాలకు సంబంధించి మౌలికమైన అంశాలను ఆ ఆర్టీఐ దరఖాస్తులు లేవనెత్తాయి. మాజీ ప్రధాన న్యాయమూర్తి అల్తమస్ కబీర్ పైన వచ్చిన కొన్ని ఆరోపణలు, విచారణ, కొందరు న్యాయవేత్తలు రాసిన లేఖలపైన ఏ చర్యలు తీసుకున్నారని అడిగారు. అసలు జడ్జీలపైన ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి? ఎన్నింటిపై విచారణ జరిపారు? వాటి పర్యవసానాలేమిటి అని కూడా ఆయన అడిగారు. ఫిర్యాదుల ప్రతులు ఇవ్వాలని కూడా కోరారు. తమకు అందిన లేఖలు, ఫిర్యాదులను సుప్రీంకోర్టుకు పంపామని, ఆ ప్రతులు తమవద్ద లేవని, కేవలం ఆ లేఖలను పంపుతున్నామని రాసిన ఉత్తరాలు మాత్రమే ఉన్నాయని న్యాయశాఖ ప్రతినిధులు వివరించారు. జడ్జీలను నియమించే అధికారం కానీ వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం కానీ తమకు లేవన్నారు. ఇదే విషయాన్ని హోం మంత్రిత్వ శాఖ కూడా చెప్పింది. సుప్రీంకోర్టు కార్యాలయం కూడా తమకు జడ్జీలను నియమించే లేదా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అధికారం లేదంటూ తన ఆర్టీఐ దరఖాస్తుకు సమాధానంగా ఒక లేఖ ఇచ్చారని సుభాష్ చూపారు. కేంద్ర ప్రభుత్వ న్యాయమంత్రిత్వ శాఖ కాకుండా, సుప్రీంకోర్టు కూడా కాకుండా మరి న్యాయమూర్తులను నియమించే అధికారం, వారిపై ఫిర్యాదులు వినే అధికారం ఎవరికి ఉందని సుభాష్ కమిషన్ ముందు అడిగారు. ఒక జడ్జి ఎవరైనా తప్పుచేశారని తెలిస్తే ఫిర్యాదు ఎవరికి చేయాలి? అనే మౌలిక ప్రశ్న ఇది. రాజ్యాంగ విధానం ప్రకారం పదవిలో ఉన్న జడ్జిని హఠాత్తుగా తీసేయడానికి వీల్లేదు. సులువుగా తొలగించడానికి వీల్లేకుండా ఉండటంలోనే న్యాయవ్యవస్థ స్వతంత్రత ఉంది. పాలకులు తమకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారన్న కోపంతో జడ్జీలను తొలగించడం మొదలు పెడితే ఇక న్యాయం జరిగే అవకాశమే ఉండదు. ప్రజల హక్కులకు ఎప్పటికీ ప్రభుత్వ శక్తులనుంచే ప్రమాదం ఉంటుంది. అధికారంలోకి రావాలని, ఆ అధికారాన్ని కాపాడుకోవాలని నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎదురు తిరిగిన వారిని, తమను విమర్శించిన వారిని, తమ తప్పులను బయటపెట్టే వారిని వేధించడానికి తమ అధికారాన్ని నిర్లజ్జగా వాడుకుంటూనే ఉంటారు. అప్పుడు మామూలు పౌరుడికి ఒకే దిక్కు న్యాయవ్యవస్థ. అక్కడ కూడా పాలకుల బంట్లు ఉంటే పౌరుడికి న్యాయం జరగదు. న్యాయం కోసం రూల్ ఆఫ్ లా అంటే సమపాలన కోసం తప్పు చేసిన పాలకులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వగల సత్తా, ధైర్యం ఉండటంతోపాటు అటువంటి వ్యక్తులను ఉద్యోగం నుంచి తొలగించకుండా ఉండగలిగే వ్యవస్థ చాలా ముఖ్యం. అందుకే పార్లమెంటులో మూడింట రెండు వంతుల మెజారిటీతో తొలగింపు తీర్మానం ఆమోదించి రాష్ట్రపతి కూడా అభిశంసనను అంగీకరిస్తే గాని జడ్జి తొలగింపు సాధ్యం కాదు. కాని ఆ ప్రక్రియ ఎక్కడ ఏ విధంగా మొదలవుతుంది? ఎవరికి ఫిర్యాదు చేయాలి? ఎన్ని రోజులలో చర్యలు ముగుస్తాయో చెప్పకపోయినా ఎప్పుడు మొదలవుతాయో చెప్పగలరా? సుప్రీంకోర్టు అధికారికంగా ప్రకటించకముందే నీట్ పరీక్షకు సంబంధించిన ఒక తీర్పు మీడియాకు లీక్ అయిన విషయంపై విచారణ జరిపించాలని ప్రధాన న్యాయమూర్తి సదాశివం పేర్కొన్నారు. ఆ విషయమై ఏ చర్యలు తీసుకున్నారని కూడా సుభాష్ అడిగారు. న్యాయమూర్తులపైన వచ్చిన ఫిర్యాదుల ప్రతులన్నీ అఢగడం భావ్యం కాదు. కేసు ఓడిపోయిన ప్రతి కక్షిదారుడు, అతని వకీళ్లు న్యాయమూర్తిపైన నిరాధారమైన అభాండాలు వేసే అవకాశం ఉంది, ఆ ఫిర్యాదుల ప్రతులు ఆర్టీఐ కింద ఇస్తే అది మీడియాలో సంచలన కథనాలకు దారితీస్తుందని న్యాయ శాఖ అధికారి ఆందోళన సమంజసమే. అయితే ఫిర్యాదులెన్ని వచ్చాయి, వాటిలో ప్రాథమిక విచారణలో రాలిపోయినవి పోగా మిగిలినవెన్ని అని అడిగితే చెప్పవచ్చు. కొన్ని ఫిర్యాదుల ఆధారంగా మాజీ చీఫ్ జస్టిస్ వైకె సభర్వాల్‌కు ఎంతో ప్రాధాన్యం ఉన్న జాతీయ మానవహక్కుల కమిషన్ పదవి ఇవ్వడం భావ్యం కాదని హోంమంత్రిత్వ శాఖ 15.3.2010న పేర్కొన్నది. ఫిర్యాదులను స్వీకరించి విచారించే వ్యవస్థ ఉండాల్సిందే. జిల్లా స్థాయి వరకు పరిశోధనలు, విచారణలో విపరీత ఆలస్యాల ఫిర్యాదును స్వీకరించి పరిష్కరించడానికి న్యాయమిత్ర అని న్యాయ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన కొత్త పథకంలో హైకోర్టు, సుప్రీంకోర్టు జడ్జీలపై ఫిర్యాదుల గురించి లేదు. (సుభాష్ చంద్ర అగర్వాల్ వర్సెస్ న్యాయమంత్రిత్వ శాఖ, CIC/VS/A-/2014/000989–SA కేసులో 3.5.2017న ఇచ్చిన తీర్పు ఆధారంగా) వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
తప్పు ఒకరిది.. శిక్ష మరొకరికా..
ఎనలిటికల్ స్కిల్ పరీక్ష రద్దు చేసిన నన్నయఅధికారులు 29న తిరిగి నిర్వహిస్తామని ప్రకటన ఫీజు చెల్లించాలనడంపై మండిపడుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఈనెల ఒకటిన నిర్వహించిన ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్ష రద్దయ్యింది. మోడల్ పేపర్ మారడమే దీనికి కారణమంటూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ టి. మురళీధర్ ప్రకటించారు. అంతేకాదు ఆ పరీక్ష రాసే ప్రతి విద్యార్థి రూ.250 చెల్లించాలనడంపై సర్వత్రా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను ఆబ్జెక్టివ్ విధానంలో (మల్టీపుల్ ఛాయిస్) నిర్వహించాల్సి ఉండగా పొరపాటున ప్రశ్నకు జవాబు ఇచ్చే విధానంలో నిర్వహించారు. దీంతో ఎక్కువ శాతం మంది విద్యార్థులు, కళాశాలల యాజమాన్యాలు ఈ పరీక్షను రద్దు చేసి, మరలా నిర్వహించాలని విజ్ఞప్తి చేశాయి. చివరకు వారి విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న యూనివర్సిటీ అధికారులు ఆ పరీక్షను రద్దు చేస్తూ తిరిగి ఈనెల 29న నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ వరకు బాగానే ఉంది. తిరిగి నిర్వహించే పరీక్షకు సంబంధించి ప్రతి విద్యార్థి రూ. 250 ఫీజు చెల్లించాలనడం వివాదాస్పదమవుతోంది. ఒకటిన నిర్వహించిన పరీక్షను ఎందుకు రద్దు చేశారు? దానికి గల కారణాలేంటి? అనే విషయాన్ని పరిశీలిస్తే యూనివర్సిటీతోపాటు కళాశాలల యాజమాన్యాలూ అందుకు బాధ్యులే అవుతారు. అయితే విద్యార్థుల తప్పిదం ఏమిటని వారి తల్లిదండ్రులు, పలువురు అధ్యాపకులు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థిపై ఆర్థిక భారం(రూ.250 ఫీజు) మోపడం ఏ మేరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థులపై పరీక్ష రద్దు భారం తగదు ఎనలిటికల్ స్కిల్స్ కోర్సుకు సంబంధించిన పరీక్షను రద్దు చేసిన ఆదికవి నన్నయ యూనివర్సిటీయే తిరిగి పరీక్ష నిర్వహించాలి. కానీ ఆ భారాన్ని విద్యార్థులపై మోపుతూ ఒక్కొక్కరి నుంచి రూ.250 ఫీజు వసూలు చేయడం భావ్యంగా లేదు. –ఎస్. ఉదయ్ప్రకాష్రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ, వీఎస్ డిగ్రీ కాలేజ్, కాకినాడ విద్యార్థులకు చేసే మేలు ఇదేనా ? నన్నయ యూనివర్సిటీ విద్యార్థుల ప్రగతికి, వారి అభ్యున్నతికి తోడ్పాటునందిస్తుందని పదేపదే చెబుతుంటారు. ఎనలిటికల్ స్కిల్స్ పరీక్షను ముందు చెప్పిన మోడల్లో నిర్వహించకుండా తప్పుచేసి, ఇప్పుడు మరోసారి నిర్వహిస్తామంటూ, అందుకు ప్రత్యేక ఫీజు చెల్లించాలనడం సరికాదు. ఇదేనా విద్యార్థులకు చేసే మేలు. –అడపా కొండబాబు, బిఎస్సీ విద్యార్థి, కాకినాడ -
‘ఆప్’ చాప చుట్టేయాల్సిందేనా?
న్యూఢిల్లీ: కొన్ని సార్లు విజయం కంటే అపజయమే బలమైనది. మొన్న పంజాబ్, గోవా రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురైనది, నిన్న ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో చవిచూసిన పరాజయం అలాంటిదే. నెపాన్ని ముందుగా ఓటింగ్ యంత్రాలపైకి తోసేసిన ఆప్ వ్యవస్థాపక నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చివరకైనా ఓటమిని అంగీకరించడం ఆనందించాల్సిన అంశం. పార్టీ ఆవిర్భావం అవసరమైన చారిత్రక సందర్భాలను, పార్టీ ప్రాథమిక లక్ష్యాలను పక్కన పెట్టి, వేగంగా ఇతర రాష్ట్రాలకు విస్తరించాలన్న తాపత్రయంతో ఆప్ రాజకీయ మైదానంలో మెల్లగా, సుదీర్ఘంగా ఆడాల్సిన ఇన్నింగ్స్‌ను అతివేగంగా ఆడి అతి త్వరగా మైదానం నుంచి నిష్క్రమించడం నిజమే. ఆప్ బుడగలా వచ్చి బుడగలా పగిలిపోయిందని, ఇక ఆప్ కోలుకోవడం సాధ్యమయ్యే పని కాదంటూ నేడు ఇంటా, బయటా చర్చ జరుగుతోంది. ఆప్ చాప చుట్టేయాల్సిన అవసరం వచ్చిందని చెప్పడానికి ఆ పార్టీ కొంత మంది వ్యక్తులు, కొంత మంది నాయకుల కారణంగా ఆవిర్భవించిందీ కాదు. జయ ప్రకాష్ నారాయణ్ సృష్టించిన ఉద్యమం తర్వాత అలాంటి మరో ఉద్యమం కోసం ప్రజలు సుదీర్ఘంగా నిరీక్షిస్తున్న సమయంలో వచ్చిన ఓ కదలిక. లక్షలాది ప్రజల మనసుల్లో పురుడుపోసుకుంటున్న కొత్త ఆలోచనను ముందుకు తీసుకెళతావన్న నమ్మకం నుంచి పుట్టిందే ఆప్. ప్రత్యక్షంగా ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాస్వామ్యానికి నిజంగా పట్టం కడుతుందని, అవినీతి రహిత పారదర్శక ప్రభుత్వాన్ని అందిస్తుందన్న ప్రజల ఆశే ఆప్. భారత రాజకీయ చరిత్ర గమనాన్ని మారుస్తుందన్న ప్రగాఢ విశ్వాసంతోనే ఢిల్లీ పీఠంపై కూర్చోబెట్టారు ప్రజలు. అలాంటి ప్రజల నమ్మకాలను, ఆశలను నిలబెట్టేందుకు నిజాయితీగా కృషి చేయకపోవడం వల్ల కూడా నేడు ఆప్‌కు అపజయం ఎదురై ఉండవచ్చు. కొత్తగా పుట్టిన ఈ పార్టీ పూర్తిగా రాజకీయ నడత నేర్చుకోకముందే చుట్టుముట్టిన పరిస్థితులను కూడా ఇక్కడ పరిశీలించాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వం పెడుతున్న కేసుల్లో చిక్కుకుంటూ ఊపిరాడని పరిస్థితుల్లో చుట్టూ ఉన్న మీడియా కూడా విష ప్రచారం చేస్తున్న ప్రతికూల పరిస్థితుల్లో నెట్టుకు రావడం ఆషామాషీ కాదు. అయినప్పటికీ ప్రజలకు అత్యవసరమైన నీరు, విద్యుత్, విద్య, వైద్యం అందించడంలో ఆప్ సాధించిన విజయం తక్కువేమి కాదు. వాస్తవం చెప్పాలంటే ఇలాంటి ప్రజా సమస్యలను పరిష్కరించినందుకు ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఆప్కే ప్రజలు పట్టం గట్టాలి. పదేళ్లుగా ఢిల్లీ మున్సిపాలిటీని పాలిస్తూ ప్రజా సమస్యలను పట్టించుకోని బీజేపీకే ప్రజలు పట్టం గట్టారు. ప్రపంచంలో డోనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీ ఏలుతున్న నేటి కాలమాన పరిస్థితులు వేరు. ఈ పరిస్థితుల్లో వాస్తవాలకంటే భ్రమలనే ఎక్కువ నమ్ముతారు. నిజానికన్నా అబద్ధాలకే ఆదరణ ఎక్కువగా ఉంటుంది. ఆప్ చాప చుట్టేయాల్సిన సమయం ఆసన్నమైందనడం కూడా ఇలాంటి ఓ భ్రమే. ఇలాంటి పరిస్థితులను తట్టుకొని నిలబడినప్పుడే అపార శక్తి అంకురిస్తుంది. అందుకే విజయం కన్నా బలమైనది ఈ పరాజయం. పార్టీలో, ప్రభుత్వ పనితీరులో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకుంటూ మళ్లీ అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ముందుకు సాగితే ‘ఆప్ అప్నా’ అంటూ ప్రజలు పిలిచే రోజులు కచ్చితంగా వస్తాయి. –––ఓ సెక్యులరిస్ట్ కామెంట్ -
జాతీయగీతం గురించి తెలియదా?
విశ్లేషణ చివరకు రాజ్యాంగసభలో ఈ రెండు గీతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ జనగణమనను జాతీయగీతంగానూ, వందేమాతరంను జాతీయగేయంగానూ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. జనగణమన జాతీయ గీతం, వందేమాతరం జాతీయగేయం గానూ ప్రకటించిన అధికారిక ప్రతుల కోసం హరిందర్ ధింగ్రా ప్రధాని కార్యాలయాన్ని కోరారు. జాతీయ జంతువు (పులి), జాతీయ పక్షి (నెమలి), జాతీయ పుష్పం (పద్మం), జాతీయ క్రీడ (హాకీ)లకు సంబంధించిన అధి కారిక పత్రాలు కూడా అడిగారు. జాతీయగీతం, జాతీయ గేయం గురించి చెప్పకుండా తప్పించుకోవడమే కాకుండా, మిగతా ప్రశ్నలన్నీ పర్యావరణ శాఖకు సంబం ధించినవి అంటూ వన్య మృగ శాఖ సమాచార అధికారికి బదిలీ చేసింది ప్రభుత్వం. వారు జాతీయ పుష్పం, జాతీయ క్రీడ సంగతి వదిలేసి, జాతీయపులుల సంరక్షణ అథారిటీకి పంపారు. జాతీయగీతం, జాతీయగేయం గురించి తమకు సంబంధం లేదని జవాబిచ్చారు. మొదటి అప్పీలులో అధికారి సరైన సమాచారం ఇచ్చారని సంతృప్తి చెంది అప్పీలు కొట్టిపారేశారు. రెండో అప్పీలు కమిషన్ ముందుకు వచ్చింది. ప్రధాని కార్యా లయం, వన్యమృగ విభాగం, పులుల అథారిటీలకు జనగణమన, వందే మాతరాల గురించి పట్టకపోవడం విచిత్రం. పులుల అథారిటీ అధికారి వాదం మరీ వింతగా ఉంది. మేము పులులను సంరక్షిస్తామే గానీ, అది జాతీయ మృగం ఎప్పుడైంది, దాని పత్రాలెక్కడున్నాయి వంటివి మాకు తెలియదన్నాడాయన. దరఖాస్తును మళ్లీ పర్యా వరణ మంత్రిత్వ శాఖ వన్యమృగ విభాగానికి పంపేశాడు. ఇన్ని బదిలీల తర్వాత కూడా బదులు రాలేదు. పర్యావరణ మంత్రిత్వశాఖ దగ్గర జాతీయ మృగం, పక్షి, పుష్పం గురించిన పత్రాలు లేవు. అవి దొర కడం లేదట. పులుల సంరక్షణ అధికారి వైభవ్. సి. మాథుర్,‘ జాతీయ జంతువు పులే అయి ఉంటుంది కానీ, నాకు సరిగ్గా తెలియదు’ అన్నారు. అధికారికంగా చెప్పగలిగేది కూడా ఆయనకు తెలియదన్నమాట. సుదీర్ఘంగా ప్రశ్నిం చగా ఆయన ఒక లేఖ బయటపెట్టారు. దానిపైన తేదీ 30.5. 2011 అని ఉంది. అది అంతకు ముందురోజే చేరిందట. వన్యజీవ సంరక్షణ శాఖ డైరెక్టర్ జగదీశ్æ కిష్వన్ రాసిన ఆ లేఖ సారాంశం ఏమంటే, ‘పులిని జాతీయ జంతువుగా, నెమలిని జాతీయపక్షిగా ప్రకటించామనీ, కాని ఆ నోటిఫికేషన్లు కొంత కాలం నుంచి మాయమైపో యినాయి కనుక మళ్లీ నోటిఫై చేస్తున్నా’మని. ఈ డైరెక్టర్ గారికి కూడా జాతీయ పుష్పం గురించి తెలియదేమో, ఏమీ చెప్పలేదు. జనగణమన, వందేమాతరం గురించి ప్రధాన మంత్రి కార్యాలయం చెప్పకపోవడం నిర్లక్ష్యాన్ని సూచిస్తుంది. నవంబర్ 30, 2016న శ్యాం నారాయణ్ చౌస్కీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జాతీయగీతాన్ని గౌరవించడం పవిత్ర బాధ్యత, రాజ్యాంగబద్ధ దేశభక్తి, జాతీయ లక్షణం అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. డిసెంబర్ 27, 2011కు జాతీయగీతం ఉద్భవించి 100 ఏళ్లు గడిచాయి. డిసెంబర్ 27, 1911న విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ బెంగాలీ భాషలో, భారత జాతీయ కాంగ్రెస్ కలకత్తా సమావేశాల వేదిక మీద పాడారు. ఆ సభ పేరు భారతసభ. గీతాన్ని బ్రహ్మగీతం అని టాగోర్ పిలిచారు. డిసెంబర్ 28, 1917న మూడోరోజు కాంగ్రెస్ సభలో మరోసారి జాతీయగీతం ఆలపించారు. 1919లో రవీంద్రనాథ్ టాగోర్ మదనపల్లెలో ధియో సాఫికల్ కాలే జ్లో ఉన్నప్పుడు జనగణమన గీతాన్ని ఆలపించారు. తరువాత ఆయనే దీనిని ఆంగ్లంలోకి కూడా అనువాదం చేశారు. అయితే ఆ తరువాత జనగణమన గీతాన్ని రవీంద్రనాథ్ టాగోర్ బ్రిటిష్ రాజు ఐదో జార్జిని పొగు డుతూ రాశారనే విమర్శకు సంబంధించిన అనేక రచనలు సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందాయి. పూర్వం ఈ వివాదాన్ని లేవదీసినప్పుడే విశ్వకవితో పాటు, గాంధీ, నెహ్రూ ఆ వాదాన్ని ఖండిస్తూ ప్రకటనలు చేశారు. చివరకు నెహ్రూ ఆగస్టు 25, 1948నాడు రాజ్యాంగసభలో శాసన కమిటీ ముందు జాతీయగీతంగా జనగణమన ఉండాలా లేక వందేమాతరం ఉండాలా అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇచ్చారు. చివరకు రాజ్యాంగసభలో ఈ రెండు గీతాలకు సమాన ప్రాధాన్యం ఇస్తూ జనగణమ నను జాతీయగీతం గానూ, వందే మాతరంను జాతీయ గేయంగానూ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ ప్రకటించారు. అయిదు భాగా లున్న ఈ గీతంలో మొదటి భాగాన్ని రాజ్యాంగ సభ జాతీయ గీతంగా జనవరి 24, 1950 నాడు ఆమోదిం చిందని అనేక పత్రికలూ, పత్రాలూ సూచిస్తున్నాయి. కానీ ఏ ప్రభుత్వ శాఖ చేయవలసిన పనిని ఆ శాఖ చేయలేదు. జాతీయ గీతాన్ని గౌరవించాలని ఆర్టికల్ 51 (ఎ) కింద ప్రాథమిక విధిగా రాజ్యాంగం నిర్దేశిస్తున్నది. జాతీయ గౌరవాలకు అవమానాలు నిరోధించే చట్టం 1971 ప్రకారం జాతీయగీతాన్ని కావాలని అవమానిస్తే నేరం. బిజో ఎమ్మాన్యుయెల్æ కేసులో సగౌరవంగా మౌనం పాటించిన ఇతర మత విద్యార్థులను శిక్షించడం తప్ప న్నామేగానీ, జాతీయగీతం ఆలపించిన పుడు నిలబడి గౌరవించాలనే ఆదేశించడం జరిగిందని ఇటీవల సుప్రీం కోర్టు వివరించింది. జాతీయ గీతం ప్రాధాన్యతను, చరి త్రను అధికారి కంగా ప్రకటించి ప్రజల్లో దానిపైన గౌరవాన్ని పెంచే బాధ్యత ప్రభుత్వానిదే. (హరిందర్ ధింగ్రా వర్సెస్ పర్యా వరణ శాఖ CIC/SA/A/2016/001453 కేసులో సీఐసీ 23.12. 2016న ఇచ్చిన తీర్పు ఆధారంగా) మాడభూషి శ్రీధర్ కేంద్ర సమాచార కమిషనర్ professorsridhar@gmail.com -
జీఎస్టీ బిల్లు - అంచనాలు
న్యూడిల్లీ: ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జీఎస్ టీ బిల్లు కు గ్రీన్ సిగ్నల్ లభించడం దాదాపుగా ఖాయిమైనట్టే కనిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవల కేంద్ర కేబినెట్ బిల్లులో కీలకమైన మార్పులకు ఆమెదం తెలపడంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న వస్తు, సేవల పన్నుకు మోక్షం లభించనుంది. వివాదాస్పదమైన ఒక శాతం తయారీ పన్ను తొలగించడం, తొలి ఐదేళ్లలో రాష్ట్రాలకు ఆదాయ నష్టం వాటిల్లితే ఇందుకు పరిహారాన్ని చెల్లించే హామీ వంటి అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనిపై ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సంతోషం వ్యక్తం చేయడం కూడా దీనికి ఊతమిస్తోంది. ఆగస్ట్ 12లోగా ముగియనున్న వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు చట్ట రూపాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రయత్నిస్తోంది. ఈ బిల్లుకు పార్లమెంట్ ఉభయ సభల ఆమోదం అవసరమైన నేపథ్యంలో ప్రభుత్వం నిర్మాణాత్మకంగా ముందుకు సాగుతోంది. తొలుత రాజ్యసభలో, అనంతరం లోక్‌సభలో ఆమోదం కోసం యోచిస్తోంది. ఈ బిల్లు చట్టమైతే. దేశవ్యాప్తంగా ఒకే పన్ను రేటు అమల్లోకి రానుంది. ఏప్రిల్1, 2017నుంచి అమలు తేవాలని పట్టుదలగా ఉంది. అటు వచ్చే వారం రాజ్యసభలో బిల్లును ప్రవేశపెట్టేందుకు కసరత్తు పూర్తిచేసినట్లు కేంద్ర సహాయమంత్రి నక్వీ చెప్పారు. ఈ నేపథ్యంలో జీఎస్టీ బిల్లు ఆమోదం, ప్రభావంపై అనేక అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా,ఫైనాన్షియల్ సర్వీసులు, ఆటోమొబైల్స్, ఎఫ్ ఎంసీజీ, రియల్ ఎస్టేట్, టూరిజం, ఆన్ లైన్ మార్కెటింగ్ తదితర రంగాలు ప్రభావితం కానున్నాయి. దీనిమూలంగా ప్రస్తుత అమ్మకపు పన్ను భారీగా క్షీణించేందుకు వీలుంటుందనీ, దీంతో ఫ్యాన్లు, ఏసీలు, మైక్రోవేవ్ ఒవెన్లు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు తగ్గే అవకాశముందని మార్కెట్ వర్గాల అంచనా. ద్వంద్వ పన్నుల భారం ఉండదని చెబుతున్న ఈ బిల్లుకు అమల్లోకి వస్తే విలాసవంత వాహనాలు మినహా మిగిలిన వాహనాలు, విడిభాగాలు జీఎస్టీకిందకు రానుండడంతో వాహనాల ధరలు, సేవల వ్యయాలు తగ్గుతాయంటున్నారు. వ్యక్తిగత సంరక్షణ, వంట నూనెలు వంటివి జీఎస్టీ కిందకు వస్తే పన్నులు పెరుగుతాయి. ఫలితంగా ధరలు కూడా కూడా పెరుగుతాయి. ప్రస్తుతం ఇవి నిత్యావసరాల కేటగిరీ లో ఉండడంతో తక్కువ స్థాయి పన్ను అమలవుతోంది. ఎఫ్ఎంసీజీ కంపెనీలకు రవాణా, గిడ్డంగుల నిర్వహణ వ్యయాలు తగ్గుతాయి. తాజాగా రూపొందించిన జీఎస్టీ ముసాయిదాలో ఈకామర్స్ లావాదేవీలకు ప్రత్యేక పన్ను విధానాలను అమలవుతాయి. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లకు కేంద్ర, రాష్ట్రాల పరిధిలో ఒకే పన్ను రేటు వర్తిస్తుంది. పలు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసులపై విధించే సర్వీస్ ట్యాక్స్ మరింత పెరిగే అవకాశముంది. వివిధ రాష్ర్టాలు విధిస్తున్న పలురకాల పన్నుల స్థానే రెండు మూడు పన్నులే అమల్లోకి వస్తాయి. దీంతో పరోక్ష పన్నుల వ్యవస్థపట్ల అందరికీ స్పష్టత వస్తుంది. వస్తువులు, సేవలు, తయారీ, వినియోగం, రవాణా వంటి పలు విభాగాలపై పడుతున్న పలురకాల పన్నులు తొలగుతాయి. అమ్మకపు పన్ను, వ్యాట్, ఆక్ట్రాయ్, ఎక్సైజ్ సుంకం తదితర సుంకాలు ఒకే గొడుగుకిందకు వస్తాయి. ఇది ప్రత్యక్షంగా పలురంగాలకు లబ్ది చేకూర్చడంతోపాటు అంతిమంగా ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందని ఎనలిస్టులు అభిప్రాయ పడుతున్నారు. -
పోకిమన్ యాపిల్ ను గట్టెక్కిస్తుందా..?
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న పోకిమన్ గో గేమ్ క్రేజ్ టెక్ దిగ్గజం యాపిల్ ను గట్టెక్కిస్తుందా ..? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ గేమ్ యాపిల్ కు కాసుల పంట పండిస్తుందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇటు గేమింగ్ దిగ్గజం నింటెండోకి రెండింతల మార్కెట్ క్యాపిటలైజేషన్ అందించిన పోకిమన్, టెక్ దిగ్గజం యాపిల్ కు వచ్చే రెండేళ్లలో 3 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సమకూర్చనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వర్చ్యువల్ కు, రియాల్టీకి, అనుసంధానం చేస్తూ ఈ గేమ్ రూపొందించిన సంగతి తెలిసిందే. ఈ గేమ్ ను ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని నింటెండో కల్పించింది. అయితే యాపిల్ మాత్రం అదనపు ఫీచర్ల కొనుగోలుతో పోక్ కాయిన్లను ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. యాపిల్ స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే యాపిల్ యూజర్లు ఈ కాయిన్లకు కొంత మొత్తం నగదు చెల్లించాల్సి ఉంటుంది. 100 పోక్ కాయిన్స్ ను 99 సెంట్లకు యాపిల్ తన స్టోర్ లో విక్రయిస్తోంది. ఈ విక్రయంతో పాటు, పోకిమన్ కు పెరుగుతున్న క్రేజ్ యాపిల్ రెవెన్యూలను పెంచుతుందని మార్కెట్ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 210లక్షల ప్లేయర్లు అధికమొత్తంలో పోక్ కాయిన్లను యాపిల్ స్టోర్ నుంచి కొనుగోలు చేసినట్టు ఒక బ్రోకరేజ్ సంస్థ వెల్లడించింది. అమెరికాలో పోకిమన్ గేమ్ కు 210లక్షల యాక్టివ్ యూజర్లున్నారు. ఈ గేమ్ ను ప్రస్తుతం 35 కి పైగా దేశాల్లో ఆవిష్కరించారు. ఆండ్రాయిడ్ డివైజ్ లలో ఇది అందుబాటులో ఉంది. క్యాండీ క్రష్ గేమ్ తో పోలిస్తే, పోకిమన్ గేమ్ కే ఎక్కువమంది యూజర్లు కలిగి ఉన్నట్టు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఫేస్ బుక్, వాట్సాప్ లపై కంటే కూడా పోకిమన్ గేమ్ పై యూజర్లు ఎక్కువ సమయం వెచ్చించడానికి ఆసక్తి చూపుతున్నారని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అటు ఎలక్ట్రిక్ రిటైలర్లకు ఈ గేమ్ కాసుల పంట పడిస్తోంది. ఈ గేమ్ ఆవిష్కరించనప్పటినుంచి మొబైల్ చార్జర్ల అమ్మకాలు అమాంతం పెరిగాయి. -
తగ్గనున్న చిన్న కార్ల ధరలు?
న్యూఢిల్లీ: వచ్చే వర్షాకాల సమావేశాల్లో వస్తుసేవల పన్ను బిల్లు(జీఎస్టీ) ఆమోదానికి కేంద్రం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో కోలకతాలో వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు, సాధికారిక కమిటీ సమావేశాలు రెండురోజుల పాటు జరిగాయి. ఈక్రమంలో మళ్లీ జీఎస్ టీ బిల్లు చర్చకు వచ్చింది. పార్లమెంట్ లో ఈ బిల్లుకు ఆమోద ముద్ర పడితే చిన్న కార్లు, ద్విచక్రవాహనాలు ధరలు మరింత దిగిరానున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ అంచనాల నేపథ్యంలో ఆయా షేర్లు మార్కెట్లో లాభాల బాటపట్టాయి. గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ లేదా జీఎస్టీ బిల్లు ఆమోదించబడితే ఆటో రంగం ప్రముఖమైన లబ్దిదారుగా మారునుందని విశ్లేషకులు అంటున్నారు. 18 శాతం ప్రతిపాదిత రేటు ప్రకారం కార్ల ధరలు సామాన్యుడికి అందుబాటులోకి రానున్నాయని అంచనా వేస్తున్నారు. ఇతర కమర్షియల్ వాహనాల ధరలు కూడా కిందికి దిగిరానున్నాయని భావిస్తున్నారు. చిన్న కార్లు (వాహనాలు పొడవు మరియు ఇంజన్ పరిమాణం కంటే తక్కువ 1,200 సిసి / 1,500 పెట్రోల్ / డీజిల్ మోడళ్ల సిసి), ద్విచక్రవాహనాలపై ప్రస్తుతం 24 శాతంగా ఉన్న పన్ను రేటు 18 శాతానికి తగ్గనుంది. అంటే వాహనాల ధరల్లో ప్రస్తుత శాతం నుంచి 7శాతం తగ్గనున్నాయి. అయితే 40 శాతం జీఎస్ టీ రేటు ఒకే అయితే..మధ్య తరహా కార్లు,ఎస్యూవీ (వాహనాలు పొడవు మరియు ఇంజన్ పరిమాణం కంటే తక్కువ 1,500 సిసి) లో ప్రస్తుత మిశ్రమ పన్ను రేటు 6 శాతానికి పెరుగనుంది. పెద్ద కార్లు, ఎస్‌యూవీల (1500 సీసీ కంటే ఎక్కువ ఇంజన్ పరిమాణం తో వాహనాల ధరలు) మటుకు ఈ యథాయథంగా ఉండనున్నాయి. అలాగే ట్రాక్లర్ల ధరలపై పెద్దగా ప్రభావం చూపించే అవకాశంలేదు. 12 శాతం రేటుతో ట్రాక్టర్లపై ప్రస్తుత ఒవర్ ఆల్ టాక్స్ తో ఎక్కువగా పోలి ఉంది. ప్యాసింజర్ వాహన విభాగంలోని డిమాండ్, కాంపాక్ట్ సెడాన్ మరియు ఎస్యూవీ ల డిమాండ్ మధ్య తరహా , పెద్ద కార్లు, లేదా ఎస్ యూవీ ల వైపు మళ్లే అవకాశం ఉందని కోటక్ ప్రతినిధి హితేష్ గోయెల్ చెప్పారు.మొత్తంగా ఈ జీఎస్ టీ బిల్లు ఆమెదం భారతదేశంలోని అతి పెద్ద కార్ల తయారీసంస్థ మారుతి సుజుకి, అతిపెద్ద కార్ల తయారీ సంస్థ, యుటిలిటీ వాహనం తయారీదారు ఎం అండ్ ఎం చాలా సానుకూలంగా ఉండన్నాయని బ్రోకరేజ్ సంస్థ ప్రతినిధులు చెప్పారు. ఈ అంచనాల నేపథ్యంలో మారుతి సుజుకి షేర్లు 2.61 శాతం లాభాలతో రూ. 4,211 దగ్గర ముగిసింది. 30 శాతం లాభాలతో మొదలైన ఎం అండ్ ఎం శాతం నష్టంతో 1353రూ. దగ్గర ముగిసింది. ఇదిలా ఉంటే పెట్రోలియం ఉత్పత్తులు, ప్రవేశపన్ను జీఎస్టీ వ్యవస్థలో భాగంగా ఉండటాన్ని రాష్ట్రాలు ఆక్షేపిస్తున్నాయి. రాష్ట్రాలకు రాబోయే రెవెన్యూ నష్టం పట్ల ఆందోళన వ్యక్తచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సాధికారత కమిటీ అభిప్రాయాలను ఆర్థిక మంత్రి కొత్త ముసాయిదా బిల్లు పరిగణనలోకి తీసుకోవాలని తమిళనాడు వాదిస్తోంది. -
అవినీతిపై రాజకీయం పైచేయి!
విశ్లేషణ దావూద్ ఇబ్రహీంతో ఫోన్ కాల్స్ సంబంధాలపై ఆరోపణలు వచ్చిన మంత్రి ఖడ్సేని తప్పించాలని బీజేపీ నిర్ణయించడంలో ఆశ్చర్యమేమీ లేదు. కానీ ఈ వ్యవహారంపై మహారాష్ట్ర పోలీసులు ఇప్పటికే సత్వర క్లీన్ చిట్ ఇచ్చేశారు. భారత్‌లో స్వలాభం కోసం తమ కార్యాలయాలను దుర్వి నియోగపర్చని రాజకీయ నాయకులున్న ఒక్క ప్రభు త్వాన్ని పేర్కొనండి చాలు. రాష్ట్రాలకు కేంద్రంలోని ప్రభు త్వాలకు మధ్య సత్యవర్తనం వర్సెస్ అవినీతికి సంబంధిం చిన పోటీలో స్థాయీ భేదమే తప్ప పెద్దగా తేడా కనిపించబోదని నేను పందెం కాయ గలను. అత్యంత అవినీతికర ప్రభుత్వం కంటే తక్కువ అవినీతికర ప్రభుత్వం మంచిదని ప్రజలు ఆమోదిం చేశారు కూడా. ప్రజాస్వామ్యంలోని వైచిత్రి, విషాదం ఏమిటంటే తమను తాము పాలించుకునే హక్కును ప్రజలనుంచి లాగేసుకుని ‘భారత ప్రజలమైన మేము’ అనే పేరుతో వారిని ఒక రాజ్యాంగానికి దాఖలు పర్చ డమే. ఎన్నికలు ముగియగానే, రాజకీయనేతలు, రాజకీ యాలకు ప్రతి విషయంలోనూ ప్రాధాన్యత లభిస్తుం టుంది. ప్రజలేమో అలా నిలబడి గమనిస్తుంటారు. కొన్నిసార్లు నిస్సహాయంగానూ, కొన్నిసార్లు తమను తాము ఓదార్చుకుంటూనూ. అవినీతి రహిత పాలనను వాగ్దానం చేసి కేంద్రంలో ప్రభుత్వం పగ్గాలు చేపట్టినప్పుడు, అధికారంలోకి వచ్చిన పార్టీ బీజేపీకి ఏక్నాథ్ ఖడ్సే వంటి సీనియర్ మంత్రిని సులువుగా కటాక్షించడం, ప్రోత్సహించడం చాలా కష్టమవుతుంది. తనపై అవినీతి ముద్రపడింది, అయిదుగురు రాజకీయేతర వ్యక్తులు అతడిపై సమర శంఖం ఊదారు. వీరిలో ఒక జాలరి, ఒక విద్యావేత్త, ఒక కార్యకర్త, ఒక భవన నిర్మాణకర్త, ఒక నీతిమంతుడైన హ్యాకర్ ఉన్నారు. చివరి వ్యక్తి అయితే నేరుగా దావూద్ ఇబ్రహీం ఇంటి ఫోన్లకు, ఈ సీనియర్ మంత్రి మొబైల్ ఫోన్‌కు మధ్య నడిచిన కాల్స్ వివరాల గుట్టుమట్లను వెలికితీసింది. మహారాష్ట్ర మంత్రిమండలి నుంచి ఈ మంత్రిని తప్పించాలని బీజేపీ - అంటే నరేంద్రమోదీ, అమిత్ షా అని చదువుకోవాలి- నిర్ణయించడంలో ఆశ్చర్యపడవల సిందేమీ లేదు. అయితే కొన్ని వార్తా పత్రికలు ప్రత్యే కించి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ డాక్యుమెంట్లను సమీక్షించి మరీ నిర్దిష్ట వాస్తవాలను బయటపెట్టిన అంశాన్ని నిర్లక్ష్యపరుస్తూ సదరు మంత్రిని నైతిక కారణాలతో రాజీనామా చేయడానికి వీరు దారి కల్పించారు ఈ క్రమంలో తాను మీడియా విచారణకు బలయ్యానని కూడా ఈ మంత్రి చెప్పుకున్నారు. పైగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సదరు మంత్రికి మద్దతుగా ప్రకటన చేశారు. ఆ సమయంలో కొంతమంది మంత్రులు కూడా హాజరు కావటం గమనార్హం. మాఫియా నేతతో ఫోన్‌కాల్స్ వ్యవహారంలో జాగ్రత్తగా ఉండకపోవ డానికి ఖడ్సే మరీ కొత్త రాజకీయ నేత ఏమీ కాదు. దాదాపు 40 ఏళ్ల నుంచి ఆయన రాజ కీయాల్లో ఉన్నారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగానూ, రెండు సార్లు అంటే 1995-99లో, ఇప్పుడూ ముఖ్యమైన పోర్ట్‌ఫోలియోతో మంత్రిగా కూడా వ్యవహరించారు. తన కోడలు రక్షను 26 ఏళ్ల అతి పిన్న వయస్సులో 2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకున్న స్థాయి రాజకీయ పలుకుబడి ఉంది. రెవెన్యూ, వ్యవసాయంతోపాటు పది శక్తివంతమైన మంత్రిత్వ శాఖలు చేతిలో ఉండగా రాజకీయ ఫలాలను అందుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్యే మరి. మునుపటి కాంగ్రెస్-ఎన్సీపీ ప్రభుత్వాలకు ప్రత్యే కించి భూ కుంభకోణాల్లో ఊపిరాడనీయకుండా చేస్తూ వాస్తవాలను శోధించడంలో తీవ్రంగా శ్రమించిన ఖాడ్సే మరోవైపున దేవేంద్ర ఫడ్నవిస్‌ను అలంకరించిన ముఖ్య మంత్రి పదవిని కూడా లెక్కచేయనితనంతో గప్పాలు కొట్టుకునేవారు. సీఎం తనకంటే జూనియర్ అనే విష యాన్ని ఎత్తిచూపేందుకు ఏ అవకాశాన్ని ఆయన వదిలిపెట్టేవారు కాదు. గత ప్రభుత్వ ప్రకటనలను తుత్తునియలు చేస్తూ వాస్తవాలను బయటపెట్టడంలో ఫడ్నవిస్‌కు ఖడ్సే సహకరించారు కూడా. ఒక మంత్రి సహాయకుడిని అరెస్టు చేయడం, మరొకరిపై దర్యాప్తు జరుగుతుండటం, సాక్షాత్తూ మంత్రే కుంభకోణాల ఆరోపణలకు గురవటం (వీటిలో అతి పెద్దది ఏదంటే ఆయన భార్య, అల్లుడు మార్కెట్ ధర కంటే కనీసం పది రె ట్లు తక్కువ ధరకు కారుచౌకగా రూ. 31 కోట్లకే విలువైన భూమిని కొనుగోలు చేయడం) ఈ భూమిని ఇప్పటికే పారిశ్రామిక విభాగాలకు అప్ప గించారు, అవి దాన్ని ఉపయోగిస్తున్నాయి కూడా. కానీ గత 40 ఏళ్లుగా భూమి యజమాని మాత్రం నష్ట పరిహారాన్ని పొందలేదు. అలాంటి అవకాశాలను ఎవరయినా ఎలా దొరక బుచ్చుకోగలరు? ప్రభుత్వ సహాయం, రెవెన్యూ శాఖ అధిపతిగా ఉండటం వల్లే, అసలు యజమానికి కాకుండా కొత్త యజమానికి నష్టపరిహారం చెల్లించ వల సిందిగా కోరటం సాధ్యపడింది. ఈ అంశం అవినీతికి చెందినదైనప్పటికీ, ఆ ఇద్దరి మధ్య నడిచిన ఫోన్ కాల్స్ నిజమే అయిన ప్పటికీ, ఒక బ్రాహ్మణ ముఖ్యమంత్రి ఒక ఓబీసీ నేతను అవమానించ కోరుతున్నాడని, రాజకీయ ప్రయోజనాల కోసమే భూ కుంభకోణాన్ని బయట పెట్టారని పేర్కొంటూ స్థానిక మీడియా ఈ మొత్తం వ్యవహారాన్ని కేవలం రాజకీయ సమస్యగా మాత్రమే చూస్తుండటం దురదృష్టకరం. పైగా దివంగత గోపీనాథ్ ముండే తర్వాత బీజేపీలోని ఏకైక ఓబీసీ నేతగా ఉంటుం డటం వల్ల సదరు మంత్రి రాబోయే నెలల్లో పార్టీకి సమస్యగా మారవచ్చు. ముఖ్యమంత్రి ఫడ్నవిస్ ప్రకటించిన రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని న్యాయ కమిషన్ ఈ వ్యవహారం నిగ్గు తేల్చడానికి కాస్త సమయం పడుతుంది కానీ, అయి దుగురు విభిన్న వ్యక్తులు ఐదు విభిన్న ఆరోపణలు చేయడం, కొన్ని పత్రాలు, ఫైళ్లు ఇప్పటికే కనిపించలేదని తేలడం వంటి వాటి కారణంగా ఈ సమస్య రాజ కీయాల్లో చాలా కాలంపాటు కొనసాగే అవకాశముంది. చివరకు కరాచీ, ఖాడ్సే ఫోన్ మధ్య నడిచిన కాల్స్ విషయంలో కూడా పోలీసులు సత్వరం క్లీన్ చిట్ ఇవ్వ డమే కాకుండా దాన్ని ఏటీఎస్ (ఉగ్రవాద నిరోధక స్క్వాడ్)కి పంపేశారు. ఇక ఏటీఎస్ తన సొంత వనరులమీద కాకుండా సంబంధిత హ్యాకర్ సహా యంపై ఆధారపడాలని చూస్తున్నట్లుంది. అవినీతిపై రాజకీయం పైచేయి సాధించే తీరు ఇదే మరి. -మహేష్ విజాపుర్కార్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
ఈ అక్షయ తృతీయకు బంగారం కొనాలా? వద్దా?
ఢిల్లీ: 'అక్షయ తృతీయ' అంటే అపరిమితమైన అష్టైశ్వర్యాలను ప్రసాదించే 'తృతీయ' తిథి అని పెద్దలు చెపుతారు. అక్షయ తృతీయ రోజున బంగారం, వెండి లేదా ఇతర ఏదేని విలువైన వస్తువులు కొనడం సంప్రదాయం. ఈ రోజున కొన్నది అక్షయం అవుతుందని నమ్మకం. అందుకే అక్షయ తృతీయ రోజు అప్పు చేసైనా సరే బంగారం కొనడం భారతీయుల్లో ఆనవాయితీ. అయితే ఈ నెల (మే) 9 న వస్తున్న అక్షయ తృతీయరోజు బంగారం కొనాలా? వద్దా.... అనే దానిపై విశ్లేషకులు ఏమంటున్నారు. స్వదేశీ బంగారం ధరలు గత రెండు సంవత్సరాలుగా 10 గ్రాములు 30,000 ల మార్కు దగ్గరే అటూ ఇటూ కదలాడుతున్నాయి. ఈ ఏడాది ఆరంభం నుంచి అమెరికా ఫెడరల్ రిజర్వ్ విధానం కఠినతరం కావడం, పెళ్లిళ్ల సీజన్,డాలర్ బలహీనత నేపథ్యంలో బంగారం ధరలు పుంజుకున్నాయి. ప్రధాన కరెన్సీల్లో నమోదవుతున్న బలహీనత కూడా బంగారం ధరల్లో జోరు పెంచింది. దీంతో గత వారం రోజులు 30 వేల దగ్గర స్థిరంగా ట్రేడవుతోంది పసిడి. ఈ నేపథ్యంలో బంగారం కొనడం సరైన నిర్ణయమా కాదా అనే అనుమానం రాక తప్పదు. అయితే ధరలు తగ్గినపుడు బంగారాన్ని కొనడమే సబబు అని విశ్లేషకులు సూచిస్తున్నారు. కాగా పసిడి జోరు ఇకముందు కూడా కొనసాగుతుందని మార్కెట్ ఎనలిస్టులు భావిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతమున్న ర్యాలీ ముందు కూడా కొనసాగనుందని , ప్రపంచ ఆర్థిక వ్యవస్తలో నెలకొన్న అనిశ్చితి వాతావరణంలో ప్రజలు బంగారంపై పెట్టుబడులు సురక్షితంగా, స్వర్గంగా భావిస్తారని సీనియర్ ఫండ్ మేనేజర్ చిరాగ్ మెహతా తెలిపారు. అమెరికా ఫెడ్ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందని, ఇది బంగారం ధరలపై ప్రభావం చూపిస్తుందన్నారు. ఈ క్రమంలో ప్రస్తుత స్తాయినుంచి ధరల్లో ఎలాంటి క్షీణత కనిపించినా ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని వినియోగించుకొని కొనుగోళ్లు జరపాలని ఆయన చెప్పారు. పెట్టుబడిదారులు తమ క్రమబద్ధమైన పెట్టుబడుల్లో బంగారాన్ని తప్పకుండా జోడించడాలని రైట్ హారిజాన్స్ సీఈఓ అనిల్ రేగో సూచించారు. మౌలిక, నిర్మాణాత్మక పెట్టుబడులకు గోల్డ్ ఎపుడూ స్వీట్ స్పాట్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యామ్నాయ పెట్టుబడుల కోసం బంగారం ఒక మంచి అవకాశమని చెపుతున్నారు అటు భారత్ పసిడి దిగుమతులు ఏప్రిల్ నెలలో భారీగా తగ్గాయి. 66.33 శాతం క్షీణతతో 19.6 టన్నులుగా నమోదయ్యాయి. బంగారు, వజ్రాలు లాంటి ఇతర విలువైన ఆభరణాలపై ఎన్డీయే సర్కార్ ప్రతిపాదించిన ఒకశాతం ఎక్సైజ్ పన్ను విధింపు, ఆభరణాల వర్తకుల సమ్మె దిగుమతులపై ప్రభావం చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే ఏటా భారత్ దిగుమతి చేసుకునే వేల టన్నుల బంగారంలో దాదాపు 80 శాతం ఆభరణాల తయారీకే పోతుందని ఎక్స్ పర్ట్స్ అంచనా. మరోవైపు పసిడి కొనుగోళ్లు పెరిగినా, దిగుమతులు తగ్గుముఖం పట్టడం విశేషం. -
డేటింగ్ ఏ టైంలో చేయాలో తెలుసా?
డేటింగ్ కోసం ఆన్ లైన్ పాట్నర్ దొరకడం లేదా.. అందుకోసం విసిగివేసారి పోతున్నారా.. అయితే, మీకోసం నీల్సన్ సర్వే ఉపశమనం కలిగించే అంశాలు వివరించింది. ఎన్నో డేటింగ్ యాప్స్ ఉన్నా.. ప్రధానంగా గుర్తొచ్చేది టిండర్, ఆక్కుపిడ్. ఈ యాప్ లలోకి వెళ్లినవారు.. అమ్మాయి అయితే తమకు నచ్చిన అబ్బాయిని, అబ్బాయి అయితే తమకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకొని ఏం చక్కా డేటింగ్ చేస్తుంటారు. కానీ, సరైన టైంలో అందులోకి లాగిన్ అవ్వకుంటే మాత్రం ప్రయోజనం ఉండదు. అందుకే, వీటిని ఉపయోగించే వారి డేటాను పరిశీలించిన నీల్సన్ ఈ రెండు యాప్ లను ఏ సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారో పరిశీలించి రాత్రి 9గంటల ప్రాంతంలో ఎక్కువమంది డేటింగ్ లో ఉంటున్నారని, ఆ సమయంలోనే ఎక్కువమంది డేటింగ్ కోసం ఎదురుచూస్తుంటారని నీల్సన్ తెలిపింది. ఇప్పటి వరకు ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్నవారి జాబితాను పరిశీలించగా టిండర్‌ను ఉదయం 10గంటలకు ఓ మోస్తరుగా 45శాతంమంది డేటింగ్ చేస్తుండగా రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో 55శాతంమంది ఉపయోగిస్తున్నారు. ఇక ఆక్ కుపిడ్ యాప్ లో అదే ఉదయం పదిగంటలకు 50 నుంచి 55శాతం మంది డేటింగ్ చేస్తుండగా రాత్రి తొమ్మిదిగంటలకు 60 నుంచి 65శాతం మంది ఉపయోగిస్తున్నారు. ఇక తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో మాత్రం రెండు యాప్స్‌ను ఉపయోగించే వారి సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. ఈ డేటా ప్రకారం ఈ రెండు యాప్ లను కూడా రాత్రి తొమ్మిది గంటలకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారని ఆన్ లైన్లో డేటింగ్ చేసేందుకు రాత్రి 9గంటలే సరైన సమయం అన్నమాట. -
హాలీవుడ్ మొదటి సైకో ఎనలిటికల్ థ్రిల్లర్
ట్రెండ్ సెట్ చేసిన థ్రిల్లర్ సినిమా / సైకో యూఎస్‌లోని ఆరిజానా రాష్ట్రంలో ఫీనిక్స్‌లో ఓ చిన్న ఉద్యోగం చేస్తున్న మేరియోన్ క్రేన్‌కు మధ్యతరగతి కుటుంబానికి ఉండే కష్టాలన్నీ ఉన్నాయి. ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, మరో పక్క పెళ్లి చేసుకుందామని పోరుపెడుతున్న ప్రియుడు... ఇలా జీవితాన్ని మోస్తున్న మేరియన్కు బ్యాంక్‌లో డబ్బు జమ చేయమని పెద్ద మొత్తంలో ఇస్తాడు ఆమె పై అధికారి. అయితే అంత పెద్ద మొత్తంలో డబ్బు చూసేసరికి ఇక దీంతో తన కష్టాలు తీర్చేసుకోవాలని అక్కడి నుంచి పారిపోతుంది. అయినా ఎక్కడో మూల ఆమెను గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. పోలీసులు ఎక్కడ తనను పట్టుకుంటారోనన్న సందేహంతో పాత కారు మార్చేసి, కొత్త కారు కొంటుంది. అలా ప్రయాణిస్తున్న ఆమెకు వర్షం అడ్డంకిగా మారుతుంది. అర్ధరాత్రి... అసలే భోరున వర్షం... ఇక దారిలో ఉన్న మోటెల్లో బస చేస్తుంది. అప్పుడే ఆమె జీవితంలోకి మోటెల్ యజమాని నార్మన్ బేట్స్ ఎంటరవుతాడు. కానీ, నార్మన్ ఒక అమ్మాయికి తన మోటెల్లో రూమ్ ఇవ్వడం నార్మన్ తల్లి మిసెస్ బేట్స్‌కు అసలు నచ్చదు. ఈ క్రమంలోనే ఇద్దరికి గొడవ కూడా అవుతుంది. వీళ్లిద్దరి అరుపులు విని మేరియోన్ ఆశ్చర్యపోతుంది. నార్మన్ తనకు రూమ్ ఇచ్చాడనే కృతజ్ఞతాభావం మోరియోన్కు ఉంటుంది. అతనితో మాటలు కలుపుతుంది. నార్మన్ మాటలు ఆమెలో మార్పు తీసుకొస్తాయి. వెంటనే వెనక్కి వెళ్లిపోయి డబ్బు తిరిగిచ్చేయాలని నిర్ణయించుకుంటుంది. తర్వాత ఆమె స్నానానికి వెళ్లిన మరుక్షణం నార్మన్ తల్లి చేతిలో హత్యకు గురవుతుంది. నిశ్శబ్దంగా ఉన్న రాత్రిని చీల్చుకుంటూ వచ్చిన మారియోన్ అరుపులు విని నార్మన్ ఉలిక్కిపడతాడు. అతను పరిగెత్తుకుంటూ వచ్చేసరికి మారియోన్ రక్తపు మడుగుల్లో పడి ఉంటుంది. తల్లి చంపిందని నిర్ధారించుకుంటాడు. అసలు హత్యే జరగలేదు... ఆమె మోటెల్‌కు రాలేదు అన్నట్లుగా సీన్ క్రియేట్ చేస్తాడు. ఆమె వేసుకొచ్చిన కారును ఓ చెరువులోకి తోసేసి ఆధారాలను నాశనం చేస్తాడు.. ఇది జరిగి చాలా రోజులైపోతుంది. మోరియోన్ జాడ తెలియకపోవడంతో ఆమె చెల్లి లైలా ప్రైవేట్ డిటెక్టివ్ అర్భోగోస్ట్ను సంప్రదిస్తుంది. తన అక్క జాడ తెలుసుకోమని కోరుతుంది. ఈ మిస్టరీలోని ఒక్కొక్క తీగ లాగుతూ చివరికి ఆ డిటెక్టివ్ మోటల్‌కు చేరుకుంటాడు. నార్మన్ బేట్స్ ప్రవర్తన అర్భోగోస్ట్లో సందేహాలు కలిగిస్తుంది. అతను తల్లి గురించి అడిగితే పొంతలేని సమాధానాలు చెప్పడంతో ఆమెను కలవడానికి ఇంటికి వెళతాడు. అతను ఇంట్లోకి అడుగుపెట్టి మెట్లు ఎక్కగానే నార్మన్ తల్లి బేట్స్ డిటెక్టివ్‌ను కూడా చంపేస్తుంది. డిటెక్టివ్ నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో లైలా, ఆమె ఫ్రెండ్ శామ్ రంగంలోకి దిగుతారు. ఈ ఇద్దరూ నార్మన్‌ను కలుస్తారు. అతన్నుంచి ఎలాంటి సమాచారం లభించదు. తల్లి గురించి అడిగితే కలవడానికి వీల్లేదని చెప్పడంతో లైలా అతని ఇంట్లోకి రహస్యంగా వెళుతుంది. పైకి వెళ్లాలనుకునే లోపు నార్మన్ ఇంటికి రావడంతో దాక్కోవడానికి అండర్‌గ్రౌండ్‌లోకి వెళుతుంది. అక్కడ రూమ్‌లో ఎదురుగా గోడవైపు తిరిగి ఉన్న మిసెస్ బేట్స్‌ను పిలుస్తూ దగ్గరికి వెళ్లి, కుర్చీని తిప్పగానే భయంకరమైన దృశ్యం. కుళ్లిపోయి, పురుగులు స్వైరవిహారం చేస్తున్న శవం... చూడగానే గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపు విని తల్లి వేషంలో ఉన్న బేట్స్ చంపడానికి పరిగెత్తుకుంటూ వస్తూంటే వెనకాల నుంచి శామ్ అతన్ని నిలువరించి పోలీసులకు పట్టిస్తాడు. హాలీవుడ్ మొదటి సైకో ఎనలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ సినిమా షూటింగ్ 1959వ సంవత్సరం నవంబరు 11న మొదలై, 1960 ఫిబ్రవరిలో పూర్తయింది. - బి.శశాంక్ చరిత్రకెక్కిన షవర్ సీన్ ఈ సినిమా కథాంశం ఎంత పాపులర్ అయిందో, షవర్ సీన్ అంతకు మించి హిట్ అయింది. కేవలం ఈ సీన్‌ను మాత్రమే చాలా సినిమాల్లో వాడుకున్నారంటే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.ఈ షవర్ సీన్‌ను హిచ్‌కాక్ ఏడు రోజుల పాటు చిత్రీకరించారు. కథానాయిక జెన్నెట్ లీ మీద చిత్రీకరించిన ఈ భయానక సన్నివేశం అమెరికా సినిమాల్లో వయొలెంట్ కంటెంట్‌కు కొత్త ట్రెండ్ తీసుకొచ్చింది. కానీ, ఎక్కడా ఒళ్లు గగుర్పొడిచే వయొలెన్స్‌ను హిచ్‌కాక్ ఈ సినిమాలో చూపించలేదు. షవర్ సీన్‌తో సహా.ఇక ఈ సీన్‌ను తెర మీద చూసుకున్న కథానాయిక జెన్నిఫర్ స్నానానికి వెళ్లే ముందు తలుపులన్నీ లాక్ చేసుకుని వెళ్లేదాన్నని ఓ ఇంటర్వ్యూలో చెప్పారంటే, తెర మీద హిచ్‌కాక్ ఈ సన్నివేశాన్ని ఎంత బాగా పండించారో ఊహించుకోవచ్చు. ‘సైకో’ నవల ఆధారంగా ఈ సినిమా తీసిన హిచ్‌కాక్ తన చిత్రబృందంతో మార్కెట్లో ఉన్న అన్ని కాపీలను కొనుగోలు చేయించి, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ తెలియకుండా జాగ్రత్తపడ్డాడు.ఈ సినిమాకు విచిత్రమైన ప్రచారం చేశాడు హిచ్‌కాక్. ఒక్కసారి షో స్టార్ట్ అయ్యాక లేట్‌గా వచ్చేవాళ్లను థియేటర్ లోనికి రానివ్వకూడదని థియేటర్ యజమానులకు హుకుం జారీ చేశాడు. దానికి కారణం... సినిమా మొదట్లో చచ్చిపోయే మ్యారియోన్ క్యారెక్టర్ గురించి తెలియకపోతే సినిమాలో కిక్ ఏముంటుందని?ఒకసారి జనాలు థియేటర్ బయట నించుని ఉంటే వర్షం అకస్మాత్తుగా మొదలైంది. ఓ థియేటర్ యజమాని హిచ్‌కాక్‌ను ఈ విషయం గురించి అడిగితే- ‘‘అందరికీ గొడుగులు ఇచ్చి అందర్నీ ఫొటోలు తీసి పేపర్‌కు ఇవ్వండి. ఇంతకు మించిన పబ్లిసిటీ ఏముంటుంది’’ అని బదులిచ్చాడట. -
కలిసికట్టుగా సాగిన కాలం
అమెరికా-భారత్ సంబంధాలలో ఈ ఏడాది గొప్ప పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏడాది మన అనుబంధం... ప్రపంచ సౌభాగ్యానికి హామీనిచ్చే21వ శతాబ్ది కూటమి దిశగా సాగనుంది. మన భాగస్వామ్యం ఇరు దేశాలలోని, ప్రపంచంలోని సామాన్యులను పరిరక్షించి, యువతకు సాధికారతను కల్పిస్తుంది. ప్రపంచశాంతిని పరిరక్షించి, సౌభాగ్యాన్ని, అభివృద్ధిని పెంపొందిస్తుంది. ఎన్నడూ ఇంత వైవిధ్యపూరితమైన, సాంస్కృతిక ప్రత్యేకతలున్న శక్తులు ఉమ్మడి దృష్టితో ప్రపంచానికి మేలు చేసే దృష్టితో ఐక్యం కాలేదు. ఏడాది క్రితం సరిగ్గా ఈ వారమే, నేనూ నా కుటుంబమూ 12,000 కిలో మీటర్ల ప్రయాణానికి ఉద్వేగభరితంగా సామాన్లు సర్దుకునే పనిలో ఉన్నాం. నా తల్లిదండ్రులు తమ స్వగృహంగా స్వదేశంగా భావించే భారత దేశానికి అమెరికా రాయబారిగా బాధ్యతలను నిర్వహించడం కోసం బయల్దేరాను. అప్పటికే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరు కానున్న తొలి అమెరికా అధ్యక్షునిగా బరాక్ ఒబామా భారత్‌లో జరపనున్న పర్యటనకు ఇరు దేశాల ప్రభుత్వాలు సన్నాహాలను చేస్తున్నాయి. వచ్చే ఏడాది భారీ లక్ష్యాలను సాధించాలనే దృష్టితో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఒబామాలు మానవ సాధ్యమైన సకల విధాలా కృషిచేసి ద్వైపాక్షిక సహకారాన్ని అబ్బురమనిపించే రీతిలో విస్తరింపజేస్తామని వాగ్దానం చేశారు. 2015లో మనం ఆ దిశగా చేసిన ప్రయత్నాలు అసాధారణ ఫలితాల నిచ్చాయనీ, 2016కు మనం మరింత గొప్ప లక్ష్యాలను ముందుంచు కున్నామనీ సగర్వంగా చెబుతున్నాను. సాకారమవుతున్న వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ ఏడాది, అమెరికా, భారత్‌లు చరిత్రాత్మక వ్యూహాత్మక సహకారాన్ని ఆచరణలోకి తేవడానికి సంబంధించి ముఖ్య చర్యలను చేపట్టాయి. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనం... ఏడు దశాబ్దాలుగా శాంతి, సౌభాగ్యాలను పరిరక్షిస్తున్న అంతర్జాతీయ వ్యవస్థల ప్రాతిపదికపై ఇండో- పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి ఉమ్మడి అవగాహనను రూపొందిం చుకున్నాం. మన నేతలు క్రమం తప్పకుండా కలుస్తున్నారు. గత ఆరువారాల్లో మూడుసార్లు కలుసుకున్నారు. భారత ప్రధాని కార్యాల యానికి, అమెరికా అధ్యక్ష కార్యాలయానికి మధ్య టెలిఫోన్ సంభాషణలు తరచుగా జరుగుతున్నాయి. అమెరికా-భారత్- జపాన్ల మధ్య మంత్రివర్గ యంత్రాంగాన్ని శాశ్వత ప్రాతిపదికపై ఏర్పాటు చేయడం ద్వారా... ఇండో- పసిఫిక్ ప్రజాస్వామిక సమాజానికి మూడు మూల స్తంభాలుగా ఉన్న మూడు శక్తుల మధ్య సంభాషణను వ్యవస్థీకృతం చేశాం. ఈ నెలలో భారత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అమెరికా పసిఫిక్ కమాండ్‌ను సందర్శించారు. అలాగే జూన్‌లో, అమెరికా రక్షణ మంత్రి ఆష్టన్ కార్టర్ భారత సైనిక కమాండ్‌ను సందర్శించారు. ఇవి రెండూ ఇలాంటి మొట్టమొదటి ఘటనలు కావడం విశేషం. హిందూ మహాసముద్రంలో సాగించిన అత్యంత సంక్లిష్టమైన మలబార్ నౌకా విన్యాసాలలో లోతుగా విస్తరిస్తున్న మన భాగస్వామ్యం స్పష్టమైంది. ఇకపై ఈ విన్యాసాలలో క్రమం తప్పక పాల్గొనాలని జపాన్ను ఆహ్వానించాం. రక్షణ సాంకేతికత, వాణిజ్య ఒప్పందం (డీటీడీఐ) కింద విమాన వాహక నౌక, జెట్ ఇంజిన్ సాంకేతికతలపై మనం జాయింట్ వర్కింగ్ గ్రూప్‌ను ప్రారంభించాం. జనవ రిలో మన స్పెషల్ ఆపరేషన్స్ బలగాలు కలిసి శిక్షణను పొందనున్నాయి. 2016లో జరిగే రెడ్ ఫ్లాగ్ వైమానిక విన్యాసాలలో భారత్ పాల్గొనడం గురించి మేం ఎదురు చూస్తున్నాం. నేపాల్ భూకంపం తదుపరి మన సైనిక వ్యవస్థలు రెండూ చరిత్రాత్మకమైన విధంగా కలిసి పనిచేశాయి. ఇది, మానవతాపరమైన, విపత్తు ప్రతిస్పందనకు సంబంధించిన కార్యకలాపా లను కలిసి నిర్వహించగలిగే మన సంసిద్ధతను పెంపొందింప జేయడానికి దోహదం చేసింది. ద్వైపాక్షిక సంబంధాలలో సార్వత్రిక పురోగతి ఈ ఏడాది, అమెరికా, భారత పరిశోధకులు ప్రజారోగ్యం, వైద్య అభివృద్ధికి సంబంధించి ప్రపంచాన్ని బాగా వేధిస్తున్న పలు సవాళ్లను ఎదుర్కొన్నారు. మార్చిలో, మన ఉమ్మడి పరిశోధన ఫలితాలు లక్షలాదిగా ప్రాణాలను కాపాడగలిగే రొటావైరస్ వ్యాక్సిన్‌ను అత్యంత కారు చౌకకు అందించడానికి తోడ్పడింది. అమెరికాకు చెందిన ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’ సంస్థ, అంటురోగాల నుంచి ముప్పునకు సంబంధించి వివిధ భారత ఆరోగ్య సంస్థలతో 16 కొత్త ఒప్పందాలపై సంతకాలు చేసింది. క్షయ, తీవ్రమైన మెదడువాపు వ్యాధులపై కలిసి పోరాడటానికి నూతన ప్రయ త్నాలను కూడా మనం ప్రారంభించాం. మన అభివృద్ధి నిపుణులు ఆఫ్రికా వ్యాప్తంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంపొందింపజేసే, పోషకాహార లోపాన్ని తగ్గించే కృషిలో భాగస్వాములుగా పనిచేస్తున్నారు. మనం సాధించిన అద్భుత పురోగతిని కళ్లారా చూడాలంటే, ఒక్కసారి గడచిన కొన్నేళ్ల వేపు తిరిగి చూస్తే చాలు. 2005లో, ద్వైపాక్షిక వాణిజ్యం ఇంచుమించు 3,000 కోట్ల డాలర్లుగా ఉండేది. నేడది, 10,400 కోట్ల డాలర్లు. దీన్ని 50,000 కోట్ల డాలర్లకు పెంచాలనే దృష్టితో మనం ఉన్నాం. గత మూడు నెలల్లోనే, ద్వైపాక్షిక వాణిజ్యంలో 500 కోట్లకంటే ఎక్కువే పెరు గుదల ఉంది. ఇందులో జీఈ సంస్థ భారత రైల్వేల వ్యవస్థకు సమకూర్చ నున్న 2.6 బిలియన్ డాలర్ల విలువైన రాబోయే తరం రైలింజిన్లను సమకూర్చడానికి కుదుర్చుకున్న ఒప్పందం కూడా ఉంది. వీటిలో చాలా వరకు భారత్‌లో తయారుకానున్నాయి. 2005లో ఇంచుమించు 200 అమెరికా కంపెనీలు భారత్‌లో పనిచేస్తుంటే, నేడు అవి 500కు పైగానే ఉన్నాయి. ఈ ఏడాది మనం వ్యూహాత్మక, వాణిజ్య సంభాషణలను ప్రారంభించి నప్పుడు, ఆర్థిక సంబంధాలను లోతుగా విస్తరింపజే సి, విశాలంచేసే పద్ధతుల గురించి, తద్వారా మన ఇరుదేశాల ప్రజలకు అవకాశాలను సృష్టిం చడానికి దోహదపడటం గురించి చర్చించాం. 2015లో దాదాపు 30,000 మంది భారతీయ విద్యార్థులు అమెరికాలో చదువుకుంటుండేవారు. ఈ ఏడాది వారి సంఖ్య 1,32,000కు పైగా పెరిగింది. పదేళ్ల క్రితం సుమారు 4,00,000 మంది భారతీయులు అమెరికాను సందర్శించగా, ఈ ఏడాది 10 లక్షల వీసా దరఖాస్తులను మేం పరిశీలించాం. ఇది రికార్డు స్థాయి. క్లుప్తంగా చెప్పాలంటే, ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాలు బలపడుతు న్నాయి, వృద్ధి చెందుతున్నాయి. వాతావరణ ఒప్పందం కోసం కలిసి సాగాం ఈ ఏడాది జనవరిలో ఒబామా, మోదీలు వాతావరణ మార్పుల వల్ల మానవాళికి ఎదురవుతున్న తీవ్ర ప్రమాదాన్ని గుర్తించారు. బృహత్తరమైన వాతావరణ ఒప్పందం కుదిరేలా చేయడానికి కట్టుబడి, ఇతరులతో కలిసి పనిచేశారు. ‘ఫుల్బ్రైట్-ఇండియా’ వాతావరణ ఫెలోషిప్‌ను మనం ప్రారం భించాం. దాని ద్వారా పరిశుద్ధ విద్యుత్తు అభివృద్ధి భాగస్వామ్యాన్ని (పీఏసీఈ) విస్తరింపజేయడం కోసం, గ్రిడ్‌కు వెలుపల పరిశుద్ధ విద్యుదు త్పత్తి పరిష్కారాలను, వినూత్న ఆవిష్కరణలను వాణిజ్యీకరించే ప్రక్రియను త్వరితం చేయడం కోసం ఒక కొత్త నిధిని ఏర్పాటు చేశాం. బహుముఖ వేదికల్లో మనం, ఐరాస సుస్థిర అభివృద్ధి లక్ష్యాల క్రమంలో వాతావరణ మార్పు సమస్యను ఎదుర్కొనడం గురించి మనం ఫలదాయకమైన రీతిలో మాట్లాడాం. హైడ్రోఫ్లోరోకార్బన్లుగా పిలిచే సూపర్ గ్రీన్ హౌస్ వాయువుల ఉత్పత్తి, వినియోగాలను దశల వారీగా తగ్గించుకునేలా 2016 మాంట్రియల్ ఒప్పందాన్ని సవరించడానికి కలిసి కృషి చేయడానికి అంగీక రించాం. వాతావరణ మార్పులతో పోరాడాలనే నిశ్చయంతో ఈ నెల పారిస్ సదస్సు ముగియడానికి ఈ ప్రయత్నాలు దోహదం చేశాయి. బృహత్తర మైన, పారదర్శకమైన, జవాబుదారీతనం గలిగిన ప్రపంచస్థాయి వ్యవస్థ, వెనక్కు మరల్చలేని అల్పస్థాయి కార్బన్ భవితకు హామీని ఇవ్వగలిగే బలమైన మార్కెట్ సంకేతాన్ని అందించగలుగుతుంది. ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలను 2 డిగ్రీల సెల్సియస్ కంటే బాగా తక్కువకు పరిమితం చేయడం కోసం చేయాల్సిన ప్రయాణం సుదీర్ఘమైనదిగానే కాదు, సవాలుగా కూడా నిలుస్తుంది. ఈ తప్పనిసరి బాధ్యతను నిర్వహించడంలో ప్రపంచ కృషికి నాయకత్వం వహించగలగడానికి ఎన్నటికంటే నేడు భారత్, అమెరి కాలు మరింత మెరుగైన స్థితిలో ఉన్నాయి. అమెరికా-భారత్ సంబంధాలలో ఈ ఏడాది గొప్ప పరిణామాలు చోటుచేసుకున్నాయి. వచ్చే ఏడాది అమెరికా-భారత్ అనుబంధం... ప్రపంచ సౌభాగ్యానికి హామీనిచ్చే 21వ శతాబ్ది కూటమిగా మారే దిశగా సాగనుంది. మన భాగస్వామ్యం మన రెండు దేశాలలోని, ప్రపంచంలోని సామాన్యులను పరిరక్షించి, యువతకు సాధికారతను కల్పిస్తుంది. ప్రపంచ శాంతిని పరిరక్షించడానికి దోహదపడుతుంది. సౌభాగ్యం, అభివృద్ధి మరింత పెంపొందేలా చేస్తుంది. మన మధ్య ఇంకా పలు విభేదాలుంటే ఉండి ఉండవచ్చు. అవి సన్నిహిత భాగస్వాముల మధ్య తరచుగా ఉంటూనే ఉంటాయి. అయితే చరిత్రలో మునుపెన్నడూ ఇంతటి వైవిధ్యపూరితమైన, సాంస్కృతిక ప్రత్యేకతలున్న శక్తులు ఉమ్మడి దృష్టితో ప్రపంచానికి మేలు చేసే దృష్టితో ఐక్యం కాలేదు. రానున్న ఏడాదిలో, మన దేశాలు కలిసి గమ్యం వైపు సాగే క్రమంలో మరింత భారీ లక్ష్యాలతో కూడిన పరిణామాలు సంభవిస్తాయని నేను ఎదురు చూస్తున్నాను. (వ్యాసకర్త: రిచర్డ్ ఆర్ వర్మ, భారత్‌లో అమెరికా రాయబారి) -
మనసు మాట వినండి
సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 2 వరకు టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) జీవితంలో మనకు ఏది అవసరమో భగవంతుడు అది తప్పకుండా ఇస్తాడు. నిరాశపడకండి. మీ కోరికలు నెరవేరేందుకు, మీకు సరైన జీవిత భాగస్వామి లభించేందుకు మార్గం సుగమం అవుతుంది ఈ వారం. మీకు ఇష్టమైన ఉద్యోగాన్ని పొందడం కోసం శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చే యండి. విజయాన్ని సాధించండి. కలిసొచ్చే రంగు: ఇటుక రాయి రంగు టారస్ (ఏప్రిల్ 21-మే 20) ఆఫీసులో మీరు చేస్తున్న పని ఏదో దాన్ని నిజాయితీగా, శ్రద్ధగా చేయండి. మీ పనిలో మార్పుతోబాటు ప్రమోషన్ వచ్చేందుకు అవకాశం ఉంది. వ్యాపార విస్తరణకోసం మీకు అందుబాటులో ఉన్న మార్గాలను అన్వేషించండి. వ్యాపార వృద్ధితోబాటు, విస్తరణకు కూడా అవకాశం ఉంది. కలిసొచ్చేరంగు: పసుప్పచ్చ జెమిని (మే 21-జూన్ 21) కలలు కనండి. మీ కలలను సాకారం చేసుకునేందుకు కృషి చేయండి. మీకు అనేక రకాలైన అవసరాలు ఉండవచ్చు. ఇక్కడే ఎంపిక అవసరమవుతుంది. ముఖ్యమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చేసే పనికీ, వచ్చే ఆదాయానికీ పొంతన లేదు కదా అనుకోకుండా పని చేస్తూ పోతే ఆదాయం అదే వృద్ధి అవుతుంది. కలిసొచ్చే రంగు: నారింజ రంగు క్యాన్సర్ (జూన్22-జూలై 23) రోజులు మారుతుంటాయి. కాలం మారుతూ ఉంటుంది. ఎప్పుడూ మీకు అనుకూలంగానో, ప్రతికూలంగానో ఉండదు. ఒకవేళ జీవితమనే నౌక ప్రయాణ దిశ అదుపు తప్పిందనిపించినప్పుడు చుక్కానిని మీ చేతుల్లోకి తీసుకుని, దానిని మీకు అనుకూలమైన మార్గంలోకి మళ్లించుకోండి. మార్గం సుగమం చేసుకోండి. కలిసొచ్చే రంగు: నీలం లియో (జూలై 24-ఆగస్టు 23) మీ మనసుతో మీరు సంభాషించండి. మనసు చెప్పేది విని, చేస్తే అంతా మంచే జరుగుతుంది. మీ మీద నమ్మకంతో పైవాళ్లు మీకు అప్పగించిన పనిని నిజాయితీగా చేసి, వారికి మీపైన ఉన్న నమ్మకం నిజమేనని రుజువు చెయ్యండి. ముఖ్యమైన కొనుగోళ్లను తొందరపడి చెయ్యకుండా, అందులో అనుభవం ఉన్న వారి సలహా తీసుకోండి. కలిసొచ్చే రంగు: బూడిద రంగు వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) అవతలి వాళ్లు మీ మాటలను, చేతలను చాలా బాగుంది అని మెచ్చుకునేలా చేయండి. అలాగే ఇతరుల నుంచి కూడా మీరు అదే ఆశించండి. ఏమి జరిగినా సరే, అంతా మంచే అనుకోండి. అందరూ బాగుండాలని కోరుకోండి. అప్పుడు తప్పకుండా మీకు మంచే జరుగుతుంది. విజయం మీకు చేరువ అవుతుంది. కలిసొచ్చే రంగు: తెలుపు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) భవిష్యత్తు గురించి ఆలోచించి, దానిని బంగారంలా మలచుకోవడం ఎలాగో తెలుసుకోండి. వాటిని సాకారం చేసే దిశగా పని చెయ్యండి. వ్యాపారంలో లేదా ఉద్యోగంలో కొత్తవారిని తీసుకునే ముందు బాగా ఆలోచించుకుని నమ్మకస్థులనే గలవారినే తీసుకోండి. అందుకోసం పెద్దల సలహా తీసుకోండి. తర్వాత విచారించి లాభం ఉండదు. కలిసొచ్చే రంగు: బేబీ పింక్ స్కార్పియో(అక్టోబర్ 24-నవంబర్ 22) మీ మనసులో, మీ ఆలోచనల్లో ఉన్నట్టుండి మార్పు రావచ్చు. భవిష్యత్తు గురించి బెంగ కలగవచ్చు. భయపడకండి. అంతా మంచే జరుగుతుంది. చిన్న చిన్న విషయాలకు విచారించడం మానండి. మీ చుట్టూ ఉన్న వారితో మృదువుగా, మంచిగా మెలగండి. మీ ఆలోచనలను మీ శ్రేయోభిలాషులతో పంచుకోండి. మీ దిగులు తీరుతుంది. కలిసొచ్చే రంగు: వంకాయ రంగు శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) భావోద్వేగాలనేవి చాలా తమాషా పాత్ర పోషిస్తాయి. ఒక్కోసారి మన బాధలకు పూతమందులా పని చేస్తాయి. మనస్సును, శరీరాన్ని పాజిటివ్ ఎనర్జీతో నింపి మన శక్తి సామర్థ్యాలను వెలికి తీస్తాయి. ఈ వారం మీ విషయంలో అదే జరగవచ్చు. మీ హృదయం చెప్పినట్లు చెయ్యండి. అంతా మంచే జరుగుతుంది. కలిసొచ్చే రంగు: లేత బూడిదరంగు క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీరు అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుంది. అయితే మీరు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చకపోతే మాత్రం చిక్కుల్లో పడవచ్చు. పెద్దలను గౌరవించడం, నిబంధనలను పాటించండి. అవతలి వారికి మీరు ఏమిస్తారో, వారి నుంచి తిరిగి మీకు అదే వస్తుంది. మీరు కోరుకున్నదానిని సొంతం చేసుకోవాలంటే గట్టి ప్రయత్నం చేయక తప్పదు. కలిసొచ్చే రంగు: నారింజ రంగు అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) మీకు మంచి పేరు వస్తుంది. మీరు ఒక్కసారిగా ప్రముఖుల సరసన చేరిపోతారు. విందువినోదాల్లో పాల్గొంటారు. మీది కలివిడి స్వభావం అయితే ఇతరులతో మీరు మరింత చేరువ అవుతారు. అదే మీరు ఒంటరి వారయితే కొత్త వ్యక్తిని కలుస్తారు. వారితో మీకు సుదీర్ఘకాలం పాటు కొనసాగే కొత్త బంధం ఏర్పడుతుంది. కలిసొచ్చే రంగు: ఆలివ్ గ్రీన్ పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20) అనవసరమైన ఆవేశానికో, తాత్కాలికమైన సాంత్వన కోసమో మీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టకండి. మీ శక్తి సామర్థ్యాలకు మరింత పదును పెట్టుకోండి కానీ, ఇతరుల కోసం వాటిని మీకు మీరుగా అణగదొక్కుకోవద్దు. మీ సహోద్యోగి మాటలు వినండి కానీ, మరీ గుడ్డిగా నమ్మి భారీగా నష్టపోయే పరిస్థితిని తెచ్చుకోవద్దు. కలిసొచ్చేరంగు: బూడిద రంగు ఇన్సియా కె. టారో అండ్ ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్(మార్చి 21- ఏప్రిల్ 20) సంతోషకరంగా గడిచే ఈవారంలో వ్యవసాయదారులు రుణం పొందడంతోబాటు దిగుబడి చక్కగా లభించగలదనే నమ్మకాన్ని పొందగలుగుతారు. భార్యాభర్తల మధ్య ఎవరో దూరబోతే ఇద్దరూ ఒకటై వారిని పరాభవించే పరిస్థితి కన్పిస్తుంది. మీకు నచ్చిన వాహనాన్ని, గృహోపకరణాలనీ కొంటారు. టారస్ (ఏప్రిల్ 21-మే 20) ‘నా పట్టు నాదే’ అనే భావాన్ని వీడి ఒక మెట్టు దిగగలిగితే శుభకార్యం జరగవచ్చు. మాటల్లో కాఠిన్యం లేకుండా ఓర్పు వహిస్తే బంధువుల ద్వారా మనకు రావలసిన ప్రయోజనాలు నెరవేరతాయి. సంతానంలో ఎవరో ఒకరు మీ అభిప్రాయాన్ని వ్యతిరేకించ వచ్చు. కొన్ని రోజులపాటు వారి ఆలోచనకి ‘సరే’ అని అంటే మళ్లీ మీ తోవకి వచ్చే అవకాశముంది. జెమిని(మే 21-జూన్ 21) మీరు చేయబోయే పనుల్లో కొంత గుంభనం పాటించడం మంచిది. అసూయ పరుల కారణంగా ముఖ్యమైన మీ ప్రయాణం ఆగిపోవచ్చు. ఈవారంలో ధనార్జన బాగుంటుంది. అయితే మీ పనులకు అభ్యంతరం చెప్పేవారు ఉండవచ్చు. మెత్తగా ఉండాలని మీరు భావించినా పరిస్థితుల ప్రభావం వల్ల అది సాధ్యపడకపోవచ్చు. ఏమైనా కఠినంగా మాట్లాడడం మంచిదికాదు. క్యాన్సర్(జూన్22-జూలై 23) అనారోగ్యాన్ని జయిస్తారు. మీ ప్రయత్నం ఏమీ లేకుండానే తెగిపోయాయనుకున్న సంబం ధాలు పునరుద్ధరించబడతాయి. వద్దనుకున్నా ప్రయాణాల పరంపర తప్పదు. వివాదాస్పద విషయాల్లో ఒకప్పుడు కన్పించిన జంకు పూర్తిగా పోయి, ఏమైనా పర్వాలేదనే ధైర్యం వస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఇంటి మరమ్మతులకు ధనవ్యయం కావచ్చు. లియో(జూలై 24-ఆగస్టు 23) రుణాలు తగ్గుముఖం పట్టడంతోనూ, ధైర్యంగా, నిజాయితీతో మీరు నిలబడడంతోనూ, ఆప్తులైన వారు సహాయంగా నిలబడిన కారణంగా మీలో ఆత్మస్థైర్యం పెరుగుతుంది. తండ్రితో సత్సంబంధాలుంటాయి. న్యాయస్థానంలో చిక్కులన్నీ దాదాపు విడిపోయినట్లే. కొత్త వ్యాపారం ప్రారంభించడం అంత మంచిది కాకపోవచ్చు. వర్గో(ఆగస్టు24-సెప్టెంబర్ 23) పెద్దవారితో పరిచయాలు ఏర్పడతాయనుకుంటూ దూర ప్రయాణాలు చేసినందువల్ల ధన వ్యయం తప్ప ఒరిగేదేమీ లేదని గ్రహించండి. స్వశక్తీ, శ్రమ అనే వాటిని పెట్టుబడిగా పెట్టుకుని, మీమీది నమ్మకం అనే లాభాన్ని సంపాదించుకోండి. మీ సంతానం మీకంటే బాగా ఆలోచించ గలరనిపిస్తోంది. వారు చెప్పింది విని, వారివైపు నుండి ఆలోచించడానికి ప్రయత్నించండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ‘చేతిలో చిక్కిన పక్షి ఆకాశంలో ఎగిరే ఐదు పక్షుల కంటే గొప్పది’ అనే ఓ సామెత ఉంది. లభించిన సౌకర్యానికీ, జరిపిన మధ్యవర్తిత్వానికి సంబంధించిన రాజీ వ్యవహారానికి తృప్తిపడండి తప్ప మరింత ఆశకి వెళితే మూలానికే దెబ్బతగలవచ్చు. వీలైనంత వరకు కలిసిపోవడానికే ప్రయత్నించండి తప్ప ఏ విషయంలోనైనా తెగతెంపుల నిర్ణయానికి రావద్దు. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) అమ్ముల పొదిలో ఉన్న చివరి బాణం వరకూ శత్రువుల మీద, అసూయపరుల మీద ప్రయోగించి మానసికంగా మీరు అలసిపోవచ్చు. ఇప్పుడు వారు మిమ్మల్ని చేయగలిగేదేమీ లేదు. మంచి ఆధ్యాత్మిక ధోరణి, ధ్యానం, రుద్రాభిషేకం, ఖడ్గమాలా స్తోత్ర పఠనం, లలితా సహస్ర పారాయణం... వంటి వాటితో ఫలితాలు మీకు బాగా కన్పించే అవకాశముంది. శాజిటేరియస్(నవంబర్23-డిసెంబర్ 21) బంధువులతో సంబంధ బాంధవ్యాలు అవసరం. అయితే వాళ్లే లోకంగా జీవిస్తే వృత్తి, వ్యాపారాలకి, విశేషించి ఉద్యోగానికీ ఇబ్బంది తప్పదు. నిర్ణీత కాలవ్యవధిని నిశ్చయించుకుని వ్యవహరించడం తప్పనిసరి. మొహమాటానికి పోయి, మెత్తదనంతో ఉంటున్నందువల్ల మీరు ఇబ్బంది పడుతుండవచ్చు. ఈ ధోరణి ఉద్యోగానికి కష్టాన్ని కల్గించవచ్చు. మరింత జాగ్రత్త! క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. మీ దైనందిన వ్యవహారాల్లో మీకు మీరే ఒక చక్కని దిశానిర్దే శాన్ని సమయానుకూలంగా చేసుకుంటారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటారు. విందు వినోద విహారయాత్రలకయ్యే వ్యయాన్ని కొంత అదుపు చేసుకోవలసి ఉంటుంది. కుటుంబంలోని వ్యక్తుల్ని మెప్పించడానికి కానుకలకోసం ఖర్చు చేయడానికి ఓ హద్దు ఉండాలని గమనించండి. అక్వేరియస్(జనవరి 21-ఫిబ్రవరి 19) ఆధ్యాత్మికంగా సద్గురు దర్శనం, సేవాభాగ్యం కలగవచ్చుగాని, పూర్తిగా ఆ సేవలోనే తరించడం గృహస్థుగా మీకు ధర్మం కాదు. ఈ విషయంలో కుటుంబంలో ఘర్షణలు ఏర్పడవచ్చు. పనుల ఒత్తిడికి తట్టుకోలేక విశ్రాంతికోసం మానసికానందం కోసం ఒకరిని ఆశ్రయించవచ్చు కాని, దానివల్ల మరో ఒత్తిడి ప్రారంభమవుతుంది. గమనించండి. పైసిస్(ఫిబ్రవరి 20-మార్చి 20) కొంతలో కొంత మనశ్శాంతి కలుగుతుంటుంది. ఆస్తికి సంబంధించిన చర్చల్లో పురోగతి కన్పిస్తుంది. అత్తమామల జోక్యం వల్ల సమస్య సానుకూలంగా పరిష్కరించబడవచ్చు. ఇలాంటి చిరకాల సమస్యల పరిష్కార సందర్భంలో కొంత నష్టపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడే మనసుకి ఊరట కలుగుతుంది. పరిశీలించుకోండి. మైలవరపు శ్రీనివాసరావు -
ఫెడ్.. లబ్‌డబ్!
- అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం, ద్రవ్యోల్బణం గణాంకాలతో ట్రెండ్ ముంబై: అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుపై తీసుకునే నిర్ణయం, కీలకమైన ద్రవ్యోల్బణం గణాంకాల ఆధారంగా ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్ వుంటుందని విశ్లేషకులు చెప్పారు. అయితే మార్కెట్లో తుఫాను చెలరేగే ముందు, కాస్త ప్రశాంతత నెలకొంటుందని వారన్నారు. గత వారాంతంలో విడుదలైన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు అంచనాలకంటే మించినందున, ఈ సోమవారం మార్కెట్ పాజిటివ్‌గా మొద లుకావొచ్చని వారు అంచనావేశారు. జూలై పారిశ్రామికోత్పత్తి 4.2 శాతం వృద్ధి చెందినట్లు (అంచనా వృద్ధి 3.6 శాతం) గత శుక్రవారం నాటి డేటా వెల్లడించిందని, దీంతో మార్కెట్ సోమవారం సానుకూలంగా వుండవచ్చని ఏంజిల్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ వైభవ్ అగర్వాల్ అన్నారు. అదే రోజున వెలువడే రిటైల్, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు తదుపరి మార్కెట్ దిశను నిర్దేశించవచ్చన్నారు. సెప్టెంబర్ 29వ తేదీనాటి రిజర్వుబ్యాంక్ పరపతి విధాన సమీక్షలో వడ్డీ రేట్ల తగ్గింపు నిర్ణయానికి ఈ ద్రవ్యోల్బణం డేటాను పరిగణనలోకి తీసుకుంటారని జియోజిత్ బీఎన్పీ పారిబాస్ టెక్నికల్ కో-హెడ్ ఆనంద్ జేమ్స్ తెలిపారు. సెప్టెంబర్ 17 వైపు చూపు... దేశీయంగా వెలువడిన పారిశ్రామికోత్పత్తి డేటా, వెల్లడికాబోయే ద్రవ్యోల్బణం గణాంకాలు మార్కెట్‌ను ఉత్సాహపర్చినా, ఫెడరల్ రిజర్వ్ మార్కెట్ కమిటీ ఈ నెల 16-17 తేదీల్లో జరపబోయే సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీలను ఒడుదుడుకులకు లోనుచేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది మొత్తానికి ముఖ్యమైన తేదీ సెప్టెంబర్ 17 అని, అదే రోజున ఫెడ్ వడ్డీ రేట్లు పెంచేదీ, లేనిదీ తెలుస్తుందని కొటక్ సెక్యూరిటీస్ వైస్ ప్రెసిడెంట్ అనిద్య బెనర్జీ చెప్పారు. ప్రధానంగా ఆ రోజున ఫెడ్ చేసే ప్రకటన, ఆ ప్రకటనలో ఉపయోగించే పదజాలం కీలకమని, వడ్డీ రేట్లపై సుతిమెత్తని వ్యాఖ్యానాలుంటే మార్కెట్లు వేగంగా కోలుకుంటాయని, పదజాలం పరుషంగా వుంటే డిసెంబర్లో వడ్డీరేట్లు పెరగవచ్చని, తద్వారా మార్కెట్లలో అల్లకల్లోలం ఏర్పడుతుందని ఆయన వివరించారు. అధిక వడ్డీ రేట్ల కారణంగా భారత్‌తో సహా ఇతర వర్ధమాన మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు తాత్కాలికంగా వైదొలుగుతారని తాము అంచనావేస్తున్నామన్నారు. ఫెడ్ నిర్ణయం వెలువడే సెప్టెంబర్ 17న వినాయక చతుర్థి అయినందున, ఆ రోజున భారత్‌లో మార్కెట్లకు సెలవు. గతవారం మార్కెట్... ప్రపంచ మార్కెట్లలో ట్రెండ్‌కు అనుగుణంగా గతవారం బీఎస్ఈ సెన్సెక్స్ 408 పాయింట్లు లాభపడింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 134 పాయింట్లు ర్యాలీ జరిపింది. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు రూ. 7000 కోట్లు ఈ నెలలో ఇప్పటివరకూ దేశీయ క్యాపిటల్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు రూ.7,000 కోట్లు వెనక్కు తీసుకున్నారు. గత నెలలో భారీఎత్తున రూ. 17,428 కోట్ల నికర విక్రయాలు జరిపిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు), ఈ నెలలోనే అదేతరహాలో అమ్మకాల జోరును కొనసాగిస్తున్నారు. సెప్టెంబర్ 1-11 తేదీల మధ్య రూ. 6,109 కోట్లు ఈక్విటీ మార్కెట్లోనూ, రూ. 773 కోట్లు డెట్ మార్కెట్లోనూ వారు నికరంగా విక్రయించినట్లు సెంట్రల్ డిపాజిటరీల డేటా వెల్లడిస్తున్నది. -
ఖైదీకి బాకీ అడిగే దమ్ము ఇచ్చిన ఆర్టీఐ
సాధారణ కారాగార శిక్షకు గురైన ఖైదీలచేత చేయించిన పనికి తగిన ప్రతిఫలం ఇవ్వకుండా ఎగ్గొడితే జైలు అధికారులను నిగ్గదీసి తనకు న్యాయం చేయమని కోరే హక్కు, న్యాయం పొందే అవకాశం సమాచార హక్కు చట్టంలో ఉన్నాయి. ఖైదీలకు హక్కులు, సౌకర్యాల గురించి అడగడానికి ఆస్కారమే లేదు, ఆర్టీఐ లేకపోతే. జైలుకు వెళ్లడం అంటే శిక్ష అనుభవించ డానికే. అక్కడ సౌకర్యాలేమిటి, హక్కులేమిటి, ఎన్ని అవస్థలు న్నా శిక్షలో భాగమే అనడం అనా గరికత. కారాగారవాసం అంటే నరకంలో జీవనం కాదు. ఉరిశిక్ష కు గురైన వాడు కూడా ఉరికొయ్యకు వేలాడే క్షణం వరకు ఆరోగ్యంగా ఉండాలి. అప్పటిదాకా అతను జీవించే హక్కు ను రక్షించాలి. చంపకుండా, చావకుండా చూసుకోవాలి. నేరారోపణలు విచారణలో ఉండగా జైల్లో ఉండే వా రు (అండర్ ట్రయల్ విచారణ ఖైదీ) నేర విచారణ పూర్తి శిక్ష అనుభవించే (నేరస్తులు) వారు స్వయంగా అంగీకరిస్తే తప్ప వీరి నుంచి పని చేయించకూడదు. సాధారణ కారా గార శిక్షకు గురైన వారి నుంచి కూడా బలవంతంగా పని చేయించడానికి వీల్లేదు. కఠిన కారాగార శిక్షకు గురైన వారి ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా పని చేయించే అధి కారం ఉంటుంది. అయినా అలా చేయించిన పనికి నిర్ధా రిత వేతనాలు చెల్ల్లించాల్సిన బాధ్యత కూడా జైలు అధికా రులపైన ఉండి తీరుతుంది. చేసిన పనికి సంబంధించి లెక్కలు తప్పుగా నమోదు చేసినా పూర్తి జీతం ఇవ్వకపోయినా, అసలు ఏమీ ఇవ్వక పోయినా జైలు అధికారులను అడిగే ధైర్యం ఎవరికి ఉంది? ఎక్కడ అడగాలి? ఆర్టీఐ అడిగే అవకాశం కల్పించింది. జైల్లో ఉన్నవారంతా నేరస్తులా కాదా అనే తత్వవిచారం పక్కన బెట్టి, వారి బతుకులు ఏవిధంగా ఉన్నాయో తెలు సుకోవాలంటే ఇప్పుడు చట్టపరంగా లభించిన మార్గం సహ చట్టం కింద అడిగే అవకాశమే. ఓం ప్రకాశ్ గాంధీ చెల్లని చెక్కు ఇచ్చి జైల్లో చిక్కు కున్నాడు. అతనికి సాధారణ కారాగార శిక్ష విధించారు. తనకు కంప్యూటర్ జ్ఞానం ఉండడం వల్ల అధికారులకు పనిలో సాయం చేయడానికి ఒప్పుకున్నాడు. అతనికి కొం త డబ్బు ఇచ్చారు. కాని పూర్తి వేతనం ఇవ్వలేదని, పని చేసిన కాలానికి సరిపోయేట్టు లెక్క కట్టి పూర్తి వేతనం ఇవ్వ లేదని అతని అనుమానం. జైలు నుంచి విడుదలైన తరు వాత సహ చట్టం కింద తను పని చేసిన తాలూకు హాజరు పట్టికల నిజ ప్రతులు అధికారికంగా ఇవ్వాలని కోరాడు. ఇవ్వక తప్పలేదు. జైలు అధికారులు ఆ కాగితాలు ఇచ్చి సహ చట్టం కింద బాధ్యత నెరవేర్చారు. హాజరీ పట్టికలను బట్టి లెక్కిస్తే ఆయనకు రావలసిన వేతనం ఇంకా బాకీ ఉందని ఆయన వాదం. తనకు పూర్తి గా వేతనం ఇచ్చారా అన్న ప్రశ్నకు సరైన సమాచారం లేక పోవడం వల్ల కేసు రెండో అప్పీలు కమిషన్ ముందుకు వచ్చింది. మెడికల్ ఆఫీసర్ ఇన్చార్జ్ దగ్గర దవాఖానలో చేరని రోగుల విభాగంలో వివరాలను కంప్యూటర్లో చేర్చే పని చేసినట్టు ఆయన ఆర్టీఐ కింద దక్కిన ధ్రువపత్రాన్ని చూపించాడు. ఈ డబ్బు తనకు రాలేదని వాదించాడు. మొత్తం బాకీ చెల్ల్లించామని అధికారుల వాదం. ఆ పత్రం సంగతేమని అడిగితే వైద్యాధికారికి అటువంటి ధ్రువప త్రం ఇచ్చే అధికారం లేదని, కనుక వేతనం ఇచ్చే అవకాశం లేదని జైలు అధికారులు అన్నారు. తనకు 75 రోజుల పా టు పని చేసిన నాటి వేతనాలు చెల్లించలేదని మాజీ ఖైదీ వాదం. సంబంధిత అధికారులను, రిజిస్టర్లతో సహా రమ్మ ని కమిషనర్ హోదాలో పిలిపించవలసివచ్చింది. వారు వచ్చారు. ఇరుపక్షాల వారు కలసి రికార్డులు పరిశీలించి, ఎంత కాలం పని చేస్తే ఎంత వేతనం ఇచ్చారో బాకీ ఉందో లేదో తేల్చమని కోరడం జరిగింది. దాదాపు రెండు గం టల పాటు కష్టపడి కొంత బకాయి తేల్చారు. నిజానికి మొదటి అప్పీలు అధికారి అయిన సీనియర్ జైలు అధికారి ఖైదీకి బాకీ పడిన వేతనాలను లెక్కించి అత నికి చెల్ల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల అమ లు జరగలేదని అప్పీలును కమిషన్ ముందు దాఖలు చేయవలసివచ్చింది. అదే విభాగంలో పనిచేసే ఒక ఉన్న తాధికారి మొదటి అప్పీలు విన్నప్పుడు కేవలం అడిగిన సమాచారం గురించే కాకుండా, అతను సమాచారం అడ గవలసి రావడానికి వెనుక ఉన్న కారణం ఏమిటో కూడా విచారించే అవకాశం, అధికారం కూడా కలిగి ఉంటాడు. అతని సమస్య తీర్చడానికి ప్రయత్నం చేయడం కూడా సాధ్యమే. మొదటి అప్పీలులో సమాచారంతో పాటు సమ స్యకు సమాధానం కూడా దొరికే అవకాశం ఉంది. ఆ ఉన్న తాధికారి సమాధానం ఇవ్వాలని ఆదేశిస్తే పాటించకపోవ డం న్యాయం కాదు. మొదటి అప్పీలులో తనకు న్యాయం దొరికిన తరు వాత రెండో అప్పీలుకు రావలసిన అవసరం లేదు. ఆ ఆదే శం పాటించకపోతే అందుకు పౌర సమాచార అధికారికి శిక్ష వేయాలని ఫిర్యాదు చేయాల్సిందే. ఫిర్యాదు చేస్తే సమా చారం సమాధానం కోరే అవకాశం లేదు. ఇవన్నీ అక్షరక్ష రాన్ని విడగొట్టి పడగొట్టే అన్వయ అన్యాయవాదాలు. ఏ సమాచార అభ్యర్థన కూడా సరదాగా వేయరు. ఆర్టీఐ వెను క సమస్య ఉండి తీరుతుంది. ఆ సమస్యకు సమాధానం చెప్పడం పాలనా పరమైన బాధ్యత. అదేపాలన. ఖైదీ ఓం ప్రకాశ్‌కు ఇవ్వవలసిన బకాయి వేతనాలు (రూ.4,108) ఎప్పుడు చెల్లిస్తారో తెలపాలని ఆదేశించడమే తీర్పు. (ఓం ప్రకాశ్ గాంధీ వర్సెస్ పీఐఓ తీహార్ జైలు, ఇఐఇ/అ/అ/ 20 15/ 000964లో 13 ఆగస్టు 2015 నా తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్) -
ఏమిటీ పతనం?
పార్లమెంటు సమావేశాల కాలాన్ని కుదించడం క్రమంగా ఓ దుష్ట సంప్రదాయంగా మారిపోతోంది. 1950వ దశకంలో ఏటా పార్లమెంటు సమావేశాల వ్యవధి 130 రోజులు. ప్రస్తుతం 50 నుండి 55 రోజులకు తగ్గింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 68 సంవత్సరాలు గడిచింది. ఈ సందర్భంలో మన పార్ల మెంటరీ ప్రజాస్వామ్యంలో చోటు చేసుకుంటున్న అవ లక్ష ణాల గురించి మళ్లీ చర్చ మొ దలైంది. అసలు భారత్‌లో ప్రజాస్వామ్యం మనుగడ సా ద్యపడుతుందా? అని ఆదిలో శంకించిన మేధావుల అభిప్రాయాలను పూర్వపక్షం చేస్తూ ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశంగా అవతరించింది. స్వాతంత్య్రం ఇవ్వక తప్పని పరిస్థితులు ఎదురైన ప్పుడు బ్రిటిష్ వారు భారత్‌కు అమెరికా తరహా ప్రజా స్వామ్య పాలన కావాలా, బ్రిటిష తరహా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యం కావాలా? అనే చర్చ లేవనెత్తారు. గాం ధీజీ, నెహ్రూజీ, డా॥బాబూ రాజేంద్రప్ర సాద్ వంటి మహానుభావులు నిర్ద్వంద్వంగా ప్రాతినిధ్య ప్రజాస్వామ్యమే సరైనదనీ, ఆదర్శప్రాయమనీ తేల్చా రు. చట్టసభలు- పార్లమెంట్ అయినా రాష్ట్రాల్లోని శాసనసభలైనా ’టెంపుల్స్ ఆఫ్ డెమోక్రసీ‘గా స్థానం పొందాయి. అంతటి పవ్రితత వాటికి ఉంది. ప్రజల ప్రయోజనాలకు భిన్నంగా ప్రభుత్వాలు చట్టాల రూపక ల్పనకు ఉపక్రమించినప్పుడు ప్రతిపక్షాలు అడ్డుపడి, సవరణలు ప్రతిపాదించి ప్రజలకు మేలు చేసేవి. ప్రజ లు పన్నుల రూపంలో చెల్లించే డబ్బుతోనే చట్టసభలు నడుస్తున్నాయన్న స్పృహ, తమకు జీతభత్యాలు లభిస్తు న్నాయన్న స్పృహ ప్రతి సభ్యునిలో కనిపించేది. అధికా రం ఉన్నంత మాత్రాన పాలకపక్షం ఏకపక్షంగా చట్టసభ ల్ని నడుపుకున్న వైఖరి చాలా ఏళ్ల పాటు కనిపించలేదు. ‘అధికార పక్షం సహనంతో ఎదుటి పక్షాలు చెప్పే విషయాలను వినడానికి సిద్ధంగా ఉన్నప్పుడే ప్రజాస్వా మ్యం పరిఢవిల్లడం సాధ్యమవుతుంది’ అన్నారు మహా త్మాగాంధీ. పార్లమెంటును అధికార పార్టీ శాసించకుం డా ఉండేందుకు స్పీకర్ వ్యవస్థ రాజకీయాలకు అతీ తంగా ఉండాలని లోక్‌సభ తొలి స్పీకర్ జి.వి.మవలాం కర్ ప్రతిపాదించారు. స్పీకర్ పదవికి ఎన్నికయ్యే వ్యక్తి ఏ రాజకీయ పార్టీ తరఫున పోటీ చేయకుండా ఉం డాల న్నారు. అయితే... తొలి ప్రధాని నెహ్రూజీ మవలాంకర్ ప్రతిపాదనలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని... స్పీకర్ తటస్థంగా ఉండే సంప్రదాయాన్ని కొనసాగించడం మంచిదని పేర్కొన్నారు. చాలా ఏళ్లు అలాంటి ఉన్నత సంప్రదాయాలే కొనసాగాయి. ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య సఖ్యత, సౌహార్ద్రం వెల్లివిరిసిన కారణంగానే... భారత పార్లమెంటరీ ప్రజా స్వామిక వ్యవస్థను అనేక దేశాలు అబ్బురంతో చూశా యి. కానీ అన్ని వ్యవస్థలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ వ్యవస్థలో విలువల పతనం శీఘ్రంగా జరగ డంతో పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ వేగంగా దిగ జారుతోంది. ప్రముఖ రాజ్యాంగ నిపుణుడు నానీ పాల్కీవాలా అన్నట్లు మన రాజ్యాంగ వ్యవస్థను తూట్లు పొడిచారు. ఎప్పుడైతే రాజ్యాంగ స్ఫూర్తి రాజకీయ పార్టీల్లో లోపించిందో అప్పట్నుంచి చట్టసభల తీరు మారిపోయింది. పార్లమెంటు సమావేశాల వ్యవధిని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతిని శాసించడంపై మాధవ్ గాడ్బోలే ‘ఇండియా పార్లమెంటరీ డెమోక్రసీ ఆన్ ట్రయిల్’ అనే పుస్తకంలో ‘మన రాజ్యాంగకర్తలు అప్ప ట్లో కేంద్ర ప్రభుత్వాలు ఈ అధికారాన్ని ఇంతగా దుర్వి నియోగం చేస్తాయని ఊహించలేదు’ అని రాశారు. మన పార్లమెంటు సమావేశాల కాలాన్ని కుదించడం క్రమంగా ఓ దుష్ట సంప్రదాయంగా మారిపోతోంది. 1950వ దశకంలో ఏటా పార్లమెంటు సమావేశాల వ్యవధి 130 రోజులు. ప్రస్తుతం 50 నుండి 55 రోజు లకు తగ్గింది. కావాలని సమావేశాలను అడ్డుకోవడం ఎక్కువైంది. ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కొన్ని తీవ్రమైన వాదనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం విడివడింది కనుక శాసనసభ సమావేశ కాలపరిమితిని తగ్గిస్తున్నామని కొందరు మంత్రులు చెప్పుకొస్తున్నారు. రాష్ట్ర భౌగోళిక స్వరూపం మారితే... ప్రజల సమస్యలు తగ్గిపోతాయి? ఎంతో అనుభవజ్ఞులైన అమాత్యులది అమాయకత్వం అనుకోవాలా? అజ్ఞానం అని భావించాలా? ఎప్పుడైతే ఆదర్శంగా ఉండాల్సిన పార్లమెంటు, శాసన సభల్లో ప్రభుత్వాలు పలాయనవాదం చిత్తగిస్తున్నాయో, ఆ బాటలోనే కిందిస్థాయి ప్రజాసంస్థలు ప్రయాణించడం చూస్తున్నాం. ఇక చట్టాలను రూపకల్పన చేసే వారే స్వయంగా చట్టాల్ని ఉల్లంఘించే దృశ్యాలు పార్లమెంటు మొదలు మునిసిపల్ కౌన్సిల్ వరకు సర్వసాధారణం. చర్చలు లేకుండానే బడ్జెట్ పద్దులు గిలెటిన్ కావ డం చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది. ఇక ‘కాగ్’ లాంటి స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు వెల్ల డించే అంశాలపై చర్చించడం అరుదైన విషయంగా మారింది. జనాభా ప్రాతిపదికన మహిళలకు, మైనార్టీ లకు, బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో ప్రాతి నిధ్యం లేకపోవడం ఒక ప్రధాన లోపం. ఆశ్చర్యం ఏమిటంటే కొందరు మంత్రుల సమర్థ తను వారి పనితీరును అనుసరించే కాక ప్రతిపక్షం నోరు మూయించడంలో చూపే నైపుణ్యాన్ని అనుసరించి లెక్క వేస్తున్నారు. చట్టసభల పనితీరును మెరుగుపర్చడా నికి, సంస్కరణలు ప్రవేశపెట్టడానికి సూచనలు చేస్తూ వచ్చిన ఎన్నో నివేదికలు ప్రభుత్వాల వద్ద మూలుగుతు న్నాయి. ‘లా కమిషన్’ సూచనలు ఉన్నాయి. కానీ ఎవరు అమలు చేస్తారు? ఈ ఏడాది జూలై ఆఖరు నుంచి ఆగస్టు 13 వరకు 17 రోజుల పాటు జరిగిన పార్లమెంటు సమావేశాలలో రాజ్యసభ 48 గంటలు పని చేయవలసి ఉండగా కేవలం 9 శాతం సమయం మేరకే కార్యకలాపాలు జరిగాయి. ఒక్క బిల్లు మాత్రమే ఆమోదం పొందడం (91 శాతం సమయం వృథా) చూస్తే ఏ మేరకు మన పార్లమెంటు పని చేయగలిగిందో అర్ధమవుతోంది. ఇంతకంటే అథ మసూచిక... 2010లో జరిగిన శీతాకాల సమావేశాలలో రెండంటే రెండు (2) శాతం సమయం మాత్రమే సమా వేశాలు జరిగాయి. ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు హూగ్సె గాల్ పార్లమెంట్ వ్యవస్థను గురించి ’'Government come and Government go, but the institution of Parliament is one of those frame works that must endure and must never be taken for granted.' అన్నాడు. దీనికి అంతం ఎప్పుడు? పార్ల మెంటరీ ప్రజాస్వామ్యం ఎప్పుడు పరిఢవిల్లుతుంది? ఈ దేశంలో ఎన్నో విప్లవాత్మక మార్పులను తెచ్చిన వా రు సామాన్యప్రజలే! వారే సంఘటితమై భారత పార్ల మెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించుకోవాలి! (వ్యాసకర్త: ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు.. ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మొబైల్: 99890 24579) -
శ్మశానానికి తరలిపోతున్న చెట్లు
విశ్లేషణ ⇒అవినీతిని నిలదీసే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం ఇచ్చింది. పెద్ద ⇒అవినీతి కుంభకోణాలను మాత్రమే మీడియా పట్టించుకుంటుంది. కాని ⇒కొన్ని లక్షల సంఖ్యలో చిన్న స్థాయి అవినీతి రోజూ జరుగుతూ ఉంటుంది. రాజధాని ఢిల్లీలో గాంధీ పేరున ఒక పెద్ద ప్రదర్శన శాల, గ్రంథాలయం ఉంది. దాని చుట్టూ తోటలు, చెట్లు, పచ్చదనం పుష్కలం. ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ అవి నీతి నరకం, ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ అవినీతి నరకడం ఉంటుంది. భ్రష్టాచా రానికి ఎవరు ఏమిటీ అనే తేడా ఉండదు. నిర్వాహకులు సహకరిస్తే అవినీతి ఎవరి పేరునైనా పరిఢవిల్లుతుంది. జాతీయ గాంధీ ప్రదర్శనశాల ఆవరణలో చెట్లను నరక డం వెనుక అవినీతిని ఒక ఆర్టీఐ మిత్రుడు నిలదీశాడు. డబ్బేమైనా చెట్లకు కాస్త్తుందా అని మనవాళ్లు అంటూ ఉంటారు. చెట్లు నరికితే డబ్బే డబ్బు అని ఈ ఆర్టీఐ కథ నిరూపించింది. జీఎల్ వర్మ తరచూ గాంధీ గ్రంథాల యానికి వెళ్తూ ఉంటారు. ఓ రోజు 25 చెట్లు కుప్పకూలి పోవడం చూసి ఆశ్చర్యపోయాడు. తుపాను, గాలి వాన కాదు, డబ్బు గొడ్డలి దెబ్బకు కూలిపోయాయి. మ్యూజి యం వెనుక కూడా కొన్ని చెట్లు కూల్చారు. కూలే ప్రమా దం లేనపుడు చెట్లను కూకటివేళ్లతో సహా కూల్చవలసిన అవసరం ఏమిటి? ఈ మ్యూజియం నిర్వహణ బాధ్యత తీసుకున్న ఎన్జీఓకు అప్పగించారు వారే చెట్లు కూల్చా రని అందుకు కారణాలు, ఏ చర్యలు తీసుకున్నారో, చెట్లు కూల్చడానికి అనుమతుల వివరాలు ఇవ్వాలని అడిగారు. మామూలుగానే ఇటువంటి ప్రశ్నలకు జవా బు ఇవ్వరు. ఇవ్వలేదు. మొదటి అప్పీలులో అధికారి ఇచ్చి తీరాలని ఆదేశించారు. అయినా ఇవ్వకపోవడం పీఐఓలకు అలవాటైంది. పెరిగిపోయిన చెట్లను సమంగా కత్తిరించడానికి ఉన్న అనుమతిని చెట్లను పూర్తిగా నరికివేయడానికి వాడుతున్నారు. 2013లో గాంధీ మ్యూజియం నుంచి 67 చెట్లు శ్మశానాలకు తరలిపోయాయి. సమంగా కత్తి రించే అనుమతి ఇవ్వడానికి కొన్ని షరతులు ఉన్నాయి. కత్తిరించే ముందు, తరువాత చెట్లను ఫొటో తీయాలి. తీయలేదు. కత్తిరించిన కొమ్మలను పుల్లలను శ్మశానా లకు విక్రయించే అవకాశం ఉంది. సత్ నగర్ అనే శ్మశా నంలో ఆ పుల్లలను అమ్మినట్టుగా దొంగ రశీదులు తయారు చేశారని వర్మ అనుమానిస్త్తున్నారు. నిజంగా మామూలు పుల్లలే అయితే దగ్గరలో ఉన్న ఏ శ్మశాన వాటిక నిర్వాహకులైనా తీసుకునేవారు. దగ్గరలో రెండు చోట్ల అటువంటి రశీదులు ఇవ్వడానికి నిర్వాహకులు అంగీకరించకపోవడం వల్ల చాలా దూరం వెళ్లి రశీదులు సంపాదించారని. అంటే చెట్లు ఎక్కడో అమ్మేసి శ్మశా నాల్లో అమ్మినట్టు రికార్డు తయారు చేసి ఉంటారని దర ఖాస్తుదారు వర్మ ఆరోపించారు. కనుక ఆ పనులకు సం బంధించిన అన్ని కాగితాలు రశీదులు అనుమతులు ఫొటోల ప్రతులు ఇవ్వాలని, అందుకు కాపీ తయారు చేసే ఖర్చు భరిస్తానని వర్మ వాదించారు. అవినీతి బయ టపడుతుందనే భయంతో ఏవో సాకులతో జవాబులు ఇవ్వడం లేదని, కావలసిన కాగితాల ధృవపత్రాలు ఇవ్వ డం లేదని వర్మ కమిషన్‌కు వివరించారు. నాలుగు నెలల కాలహరణం తరువాత ఇచ్చిన సమాచారం అసం పూర్ణం అనీ, ఇంకా ఎంతో దాచారని, ఇచ్చిన సమాచా రం కూడా తప్పుల తడకలుగా ఉందని ఆయన వాదిం చారు. చెట్లు నరికి, తరలించి అమ్మివేయడంలో కొందరు అటవీ సంరక్షణాధికారుల హస్తం కూడా ఉందని ఆయ న అన్నారు. ఉప అటవీ సంరక్షణాధికారి ఈ చెట్లను నర కడానికి ముందు తరువాత కూడా ఇక్కడికి వచ్చి చూశా రు. అంటే ఖచ్చితంగా వారి హస్తం కూడా ఉన్నట్టే అని ఆయన వివరించారు. ఉద్యానవనం మధ్య ఉన్న మ్యూజియం నిర్వహణలో ఇటువంటి అక్రమ లాభాల ను పొందే అవకాశాలున్నాయి. ఒక్క చెట్టు విలువ కనీ సం 28 వేల రూపాయలు ఉంటుందని, మొత్తం 19 లక్షల రూపాయల దాకా అక్రమార్జన ఉండి ఉంటుందని ఆయన అనుమానం. ఇంతే కాదు 2012లో కూడా ఈ విధంగానే చెట్లు నరికారని కనీసం ఐదు లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపైన ఓపీ నారంగ్ అనే అధికారి విచారణ జరిపారు. ఎస్ఎస్ రహేజా అనే అధికారి చెట్లు నరికినా, వాటిని బయటకు తరలించినా మౌనంగా ఉన్నారంటే దానికి కారణం స్వప్రయోజనాలే అనే అనుమానం వస్తుందని నారంగ్ తమ నివేదికలో వివరించారు. వర్మ అడిగిన మొత్తం సమాచారం ఇవ్వాలని, కోరిన కాగితాల ధృవీకరించిన ప్రతులను కూడా ఇవ్వా లని రెండో అప్పీలులో సమాచార కమిషనర్‌గా ఆదేశిం చవలసివచ్చింది. మొదటి అప్పీలు అధికారి ఆదేశించినా సమాచారం ఇవ్వకపోవడం ద్వారా సమాచార హక్కును భంగపరిచారని, అసమగ్ర సమాచారం తప్పుడు సమా చారం ఇచ్చారని, అందుకు సెక్షన్ 20 కింద జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది. అవినీతిని నిలదీసే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం ఇచ్చింది. పెద్ద అవినీతి కుంభకోణాలను మాత్ర మే మీడియా పట్టించుకుంటుంది. కాని కొన్ని లక్షల సం ఖ్యలో చిన్న స్థాయి అవినీతి రోజూ జరుగుతూ ఉంటుం ది. దీన్ని ఏసీబీ కూడా పట్టించుకోదు. బ్లాక్ మెయిల్ చేసుకుని బతికే వారికి తప్ప పత్రికలకు ఈ విషయం పట్టదే. పెద్ద కుంభకోణాలు పెద్ద నేరాలు, వీఐపీ లంచా లకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇవ్వకపోవడం వల్ల ఆర్టీఐ ఒక్కటే దిక్కు. మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com. -
అదృష్టం మీ వెన్నంటే ఉంది
టారో బాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీరేమిటో, మీ సత్తా ఏమిటో నిరూపించుకోవలసిన వారమిది. మీరు ఏమీ తెలియని వారు, అమాయకులు అనుకున్న వారు మిమ్మల్ని చూసి షాకయ్యేవిధంగా ప్రవర్తిస్తారు. మనసులో ఒకటి, బయటికి ఒకటి అన్నట్లుగా ప్రవర్తించే అవకాశం ఉంది. అయితే మీలో ఆత్మవిశ్వాసం పెరగడం వల్ల అన్నింటినీ అధిగమిస్తారు. కలిసొచ్చే రంగు: పసుప్పచ్చ టారస్ (ఏప్రిల్ 21-మే 20) మీ వ్యాపారం గాడిన పడుతుంది. పొదుపు చేయడానికి ఇది తగిన సమయం. కొత్త అవకాశాలు వస్తాయి. అయితే పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. మీ మనసుకీ, శరీరానికీ మధ్య సమన్వయం ఉండేలా చూసుకోండి. గట్టి నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. కలిసొచ్చే రంగు: నీలం జెమిని (మే 21-జూన్ 21) మీ పనిలో విజయం సాధిస్తారు. అధికారంలోకి రావడానికి, మీ ఉనికిని చాటుకోవడానికీ తగిన పనులు చేపడతారు. పెట్టుబడులకు ఇది మంచి సమయం. జీవిత భాగస్వామితో కలతలు రేగకుండా జాగ్రత్త పడండి. అనవసరంగా వాదోపవాదాలకు దిగకండి. వాదనలు పెట్టుకున్నారంటే వివాదాలు తెచ్చిపెట్టుకున్నట్లే. కలిసొచ్చే రంగు: పీచ్ క్యాన్సర్ (జూన్22-జూలై 23) కెరీర్‌పరంగా ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. పోటీని, అధికారుల ఒత్తిళ్లను అధిగమించడానికి నిరంతరం శ్రమించ వలసి వస్తుంది. లక్ష్యానికి చేరువలోనే ఉన్నారు, నిర్ణయాలను, ఆలోచనలను వెంటనే అమలులో పెట్టడానికి ప్రయత్నించండి. లేకుంటే ఇతరులు వాటిని తమవని చెప్పుకుని పబ్బం గడుపుకుంటారు. కలిసొచ్చే రంగు: నారింజ రంగు లియో (జూలై 24-ఆగస్టు 23) లక్ష్యాన్ని చేరుకోవడానికి మీకెదురవుతున్న సవాళ్లేమిటో విశ్లేషించుకుని, వాటిని ఎలా ఎదుర్కోవాలో ప్రణాళిక వేసుకోండి. విజయం మిమ్మల్ని వరిస్తుంది. అదృష్టం ఈ వారం మీ వెన్నంటే ఉంటుంది. పగటి కలలలో తేలిపోకుండా ప్రేమ విషయంలో నిజాయితీగా వ్యవహరించండి. కలిసొచ్చే రంగు: ఆకుపచ్చ వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ ప్రేమ విషయంలో మీకు ఎదురవుతున్న సవాళ్లు, చిక్కుముడులు వీడిపోయి హాయిగా ఊపిరి పీల్చుకుంటారు. జీవితమన్నాకఒడుదొడుకులు, సమస్యలు, సవాళ్లు సహజం. చంద్రుడికే వృద్ధిక్షయలు తప్పట్లేదు మరి! అలాంటిది మనమెంత? మీకెదురవుతున్న సమస్యలపై సమర శంఖం పూరించండి. కాలాన్ని వృథా చేయకండి. కలిసొచ్చే రంగు: తెలుపు లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) మీ లక్ష్యం నెరవేరుతుంది. విజయం చేకూరుతుంది. మీకంటూ ఒక గుర్తింపు వస్తుంది. అయినా కూడా అహంకరించ వద్దు. మరింతగా శ్రమించండి. మీ బుర్రకు మరింతగా పదును పెట్టండి. ప్రేమలో పడే అవకాశం ఉంది. అయితే అన్నింటికన్నా కెరీరే ప్రధానమని తెలుసుకోండి. లక్కీ కలర్: నిమ్మపండు రంగు స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) ఉన్నత లక్ష్యాలను నిర్మించుకోండి. అయితే ఇతరులెవరికీ సాధ్యం కాని వాటినే లక్ష్యంగా తీసుకోకండి. పరాయి వాళ్లతో సంబంధాల ద్వారా ఫ్రశాంతతని వెదుక్కోకండి. ప్రశాంతత మీలోనే ఉందని గ్రహించండి. గతంలో చేసిన తప్పులు, పొరపాట్లను మళ్లీ చేయకండి. ఆర్థిక విషయాల్లో సమతుల్యాన్ని పాటించండి. కలిసొచ్చే రంగు: మెజెంటా శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) రకరకాల ధోరణుల నుంచి, చికాకుల నుంచి స్పష్టత కోరుకుంటారు. పని విషయంలో ఒక విధమైన అనిశ్చితి, అస్థిమితత మిమ్మల్ని వెంటాడతాయి. తన పట్ల మీరు చూపుతున్న ఆసక్తికి, శ్రద్ధకు మీ జీవిత భాగస్వామి చాలా సంతృప్తి చెందుతారు. ఆరోగ్యం కుదుటపడు తుంది. సానుకూల భావనలు మిమ్మల్ని ఉత్తేజంగా మారుస్తాయి. కలిసొచ్చే రంగు: క్రీమ్ క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) విశ్రాంతి కావాలని మీ మనసు బలంగా కోరుకుంటోంది. మీ మనసుకు నచ్చిన వారితో ఏకాంతంగా గడపండి. పని విషయంలో మాత్రం తెలివిగా వ్యవహరించండి. తమ బాధ్యతలను సహోద్యోగులు మీ నెత్తిమీదకు తోయవచ్చు. నిర్మొహమాటంగా ఉండండి. వారమంతా ఆహ్లాదంగా, ఆనందంగా గడపండి. కలిసొచ్చే రంగు: నారింజ అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) పెట్టుబడుల విషయంలో మీ ముందుచూపు మీకెంతో సాయం చేస్తుంది. మీరు ఎంత ఆలోచనాపరులైనప్పటికీ భావోద్వేగాల విషయంలో మిమ్మల్ని మీరు అదుపు చేసుకోలేరు. వేగంగా ముందుకు వెళ్లండి. మీకు బాగా కలిసి వస్తుంది. సాయంకాలం పూట హాయిగా సేదతీరడం మిమ్మల్ని చురుగ్గా తయారు చేస్తుంది. కలిసొచ్చే రంగు: వంకాయరంగు పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20). మీరు ఎంతో సమయస్ఫూర్తి గల వారని నిరూపించుకునే వారమిది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తిస్తారు. పనిలో మీకెన్నో ప్రతిబంధకాలున్నప్పటికీ వాటన్నింటినీ చాకచక్యంగా అధిగమిస్తారు. అంతేగాదు, మీ నిజాయతీని, నిక్కచ్చితనాన్ని కూడా చాటుకుంటారు. బంధువుల విషయంలో తీవ్రమైన నిరాశ ఎదురు కావచ్చు. కలిసొచ్చే రంగు: లేత నీలం ఇన్సియా కె. టారో అనలిస్ట్, ఫెంగ్‌షుయ్ అనలిస్ట్, న్యూమరాలజిస్ట్ సౌర వాణి ఏరిస్ (మార్చి 21- ఏప్రిల్ 20) మీ సంతానం దగ్గర ఉంటూ కూడా మీ పెత్తనాన్నే కొనసాగించాలని అనుకోకండి. ప్రతికూలత పెరిగే సూచనలున్నాయి. ఎన్నో ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. తాత్కాలికంగా కలగబోయే అనారోగ్యం కారణంగా ‘దూరపు చూపు’ అనుకుంటూ ఆస్తులని గురించిన నిర్ణయాలని చేసేయకండి. తీవ్రమైన పరిణామాలు ఎదురుకావచ్చు. టారస్ (ఏప్రిల్ 21-మే 20) పిల్లలకి చదువులో కొంత అనాసక్తి నిరుత్సాహం చోటుచేసుకునే ప్రమాదమున్నందున వాళ్లని శ్రద్ధగా గమనిస్తూ ఉండండి. చెప్పుకోదగ్గ పరిణామాలేవీ ఈ వారంలో ఉండవు కాబట్టి ప్రశాంతంగా ఉండండి. తీర్థయాత్రలకీ పుణ్యక్షేత్రాలకీ వెళ్లాలనుకుంటారు గానీ అది సాధ్యపడక పోవచ్చు. అంతమాత్రాన నిరుత్సాహపడకండి. జెమిని (మే 21-జూన్ 21) మీ పై అధికారులు మిమ్మల్ని కావాలని మరోచోటుకి ఇష్టంతో బదిలీ చేస్తూ జీతంలో పెంపుదల కూడా చేస్తారు. జీవిత భాగస్వామితో సంబంధాలు అంతంతమాత్రంగా ఉండచ్చు ఈ వారంలో. శత్రు బాధ తగ్గుతుంది. అత్తమామలతో సంబంధం చాలా చక్కగా ఉంటుంది. వ్యాపారస్థులకి బేరాలు అంతంతమాత్రంగానే ఉంటాయి. పెట్టుబడులు ఈ వారంలో సరికాదు. క్యాన్సర్ (జూన్22-జూలై 23) అపరిష్కృత సమస్య మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఏదైనా కొందామనుకునే ఆలోచన అమలులోకి రాకపోవచ్చు. జీవిత భాగస్వామి వ్యతిరేకత కారణంగా నిరుత్సాహపరులుగా మీరుండచ్చు. తీర్థయాత్రకి వెళ్లే అవకాశముంది. ప్రయాణాల్లో వస్తువులు, ధనం, సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. లియో (జూలై 24-ఆగస్టు 23) ఈ వారం అనుకూలంగా గడుస్తుంది. ఇలాంటి సమస్యలని వీలైనంత శీఘ్రకాలంలో పరిష్కరిం చుకోవడం మంచిది. దుర్వ్యసనాల జోలికి వెళ్లద్దు. జరిగిన అనుభవాల్ని నెమరేసుకుని రాబోయే నెల అయినా అనుకూలంగా ఉండాలని భావిస్తూ మరింత ఎక్కువసేపు వ్యాపారాలు చేసుకోవ డం మంచిది. అపనిందల పాలయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ వారంలో జాగ్రత్తగా ఉండాలి. వర్గో (ఆగస్టు24-సెప్టెంబర్ 23) మీ సంస్థలో ఉద్యోగులుగా బంధువుల నుండి వీలైనంతవరకూ ఎంపిక చేసుకోకుండా ఉండటం మంచిది. కొత్త వ్యాపారమే కాదు, వ్యాపార విస్తరణ పేరిట మరో ప్రదేశంలోనూ ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు. ఆదాయ వ్యయాలకి సంబంధించిన లావాదేవీలు పన్నుల శాఖకి సరిపోయే తీరులో ఉన్నదీ లేనిదీ గ్రహించుకోండి. లిబ్రా (సెప్టెంబర్ 24- అక్టోబర్ 23) ఎదుటివారి మీద దాడిచేసి న్యాయస్థానాల వెంబడి తిప్పి సాధించుకోవాలనే ప్రయత్నం మంచిది కాదు. మీకు కలిగిన బాధని సూటిగా ఆ బాధపెట్టిన వ్యక్తులకే చెప్పిన పక్షంలో పరిష్కారం లభిస్తుంది. వినోద రంగంలో చేరాలనే ఆలోచన నెరవేరకపోవచ్చు. మొత్తానికి మీరున్న చోటునే మీరుంటారు. ప్రస్తుతానికి మార్పు, ఎదుగుదల ఉండవు. స్కార్పియో (అక్టోబర్ 24-నవంబర్ 22) మనోవ్యధ ఉన్నా మీ పనిని మీరు చేసుకుపోతుంటారు. మీ రంగంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ధర్మబద్ధ ప్రవర్తన మీకు సత్ఫలితాలనే ఇస్తుంది. విద్యార్థులైనట్లయితే చదువు మీద ఆసక్తి తగ్గిపోవచ్చు. ఉద్యోగస్థులైతే మానసిక ఆందోళన ఉండవచ్చు. అదే అవివాహితులైతే వివాహానికి ఏ సంబంధమూ సరైనది రాకపోవచ్చు. శాజిటేరియస్ (నవంబర్23-డిసెంబర్ 21) మీరు పనిచేస్తున్న సంస్థతోనే విరోధించే అవకాశం కన్పిస్తోంది. పట్టుదల, కోపం, ప్రతీకార బుద్ధి అనేవి వ్యక్తిని నిరంతరం ఆలోచింపజేస్తూ చేయవలసిన కర్తవ్యం పట్ల శ్రద్ధని, ఆసక్తిని పూర్తిగా మర్చిపోయేలా చేస్తాయి. గమనించండి. జీవితం మీది తప్ప మీకు సలహాలనిచ్చే ఇతరుల ఆధిపత్యానికి లోబడి ఉండాల్సింది కాదు. క్యాప్రికార్న్ (డిసెంబర్ 22-జనవరి 20) మీ కృషి మీకు అండగా నిలుస్తుంది. నిరుత్సాహాన్ని వీడి కార్యరంగంలోకి దూకుతారు. ఉత్సాహంగా పనుల్ని పూర్తిచేస్తారు. మాటలో కాఠిన్యం తగ్గించుకోవడం మంచిది. రుణాలు తీరిపోయాయనే ధైర్యంతో కొత్త రుణాన్ని చేసి వస్తు వాహనాలని సమకూర్చుకోవాలనే ఆలోచనని విరమించండి. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా ఉంటారు. అక్వేరియస్ (జనవరి 21-ఫిబ్రవరి 19) శుభకార్యాల కోసం తగిన ప్రయత్నాలని చేసుకుంటారు. సంతానం చదువు బాగుంటుంది. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికంగా కొంత వెనుకబాటుతనంతో ఉన్నా ఎప్పటికప్పుడు పనులు పూర్తిచేసుకుంటూ ఉంటారు. అంతగా అవసరమనిపిస్తే బంధువుల నుండి మాత్రమే రుణం పైసిస్ (ఫిబ్రవరి 20-మార్చి 20). వినోద రంగం వారైనట్లయితే కీర్తి పురస్కారాలకి అవకాశముంది. భూ గృహ సంబంధమైన ఆలోచనల్ని చేయవచ్చు గాని ఈ వారంలో ఫలించకపోవచ్చు. సంతానపు వివాహ చర్చలు కొంతవరకూ ఫలవంతమౌతాయి. ఉద్యోగంలో అనుకూలత ఉంటుంది. క్రయ విక్రయాలు ఈవారంలో మంచిది కాదు. దానధర్మాలు చేస్తారు. పుణ్యకార్యాలని నిర్వహిస్తారు. డా॥మైలవరపు శ్రీనివాసరావు సంస్కృత పండితులు -
గ్రీస్, ద్రవ్యోల్బణం ఆధారంగా ట్రెండ్
ఈ వారం మార్కెట్‌పై నిపుణుల అంచనా న్యూఢిల్లీ: ఈ వారం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను గ్రీస్ పరిణామాలు, ద్రవ్యోల్బణం డేటా, కార్పొరేట్ ఫలితాలు నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు. అలాగే రుతుపవనాల గమనం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, డాలరుతో రూపాయి మారకపు విలువ కదలికలు కూడా ట్రెండ్‌కు కీలకమేనని వారన్నారు. బెయిలవుట్ ప్యాకేజీ కోసం గ్రీస్ సమర్పించిన కొత్త ప్రతిపాదనలపై యూరోదేశాలు తీసుకోబోయే నిర్ణయం ఈ వారం మార్కెట్‌కు తొలుత కీలకాంశమని విశ్లేషకులు చెప్పారు. గ్రీస్, యూరోజోన్ మధ్య ఒక ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావం మార్కెట్లో వుందని, ఈ ఒప్పందం కుదరకపోతే స్వల్పకాలికంగా మార్కెట్లు క్షీణించవచ్చని వారు అంచనాల్లో పేర్కొన్నారు. అటుతర్వాత ద్రవ్యోల్బణం డేటావైపు మార్కెట్ దృష్టిసారిస్తుందని వారన్నారు. రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు జూలై 13న, టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు జూలై 14న వెలువడతాయని, ఈ డేటా మార్కెట్ కదులుతుందని క్యాపిటల్‌వయా గ్లోబల్ రీసెర్చ్ డెరైక్టర్ వివేక్ గుప్తా చెప్పారు. ఈ వారం సిమెంటు కంపెనీ ఏసీసీ, టెక్ కంపెనీ మైండ్ట్రీలు ఫలితాల్ని వెల్లడించనున్నాయి. ఫలితాల సీజన్ అయినందున, ఆయా కంపెనీలు వెల్లడించే ఫలితాల ఆధారంగా ఆయా షేర్ల కదలికలు వుంటాయని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోది అన్నారు. నిఫ్టీ 8,200-8,500 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులకు లోనుకావొచ్చని హెమ్ సెక్యూరిటీస్ డెరైక్టర్ గౌరవ్ జైన్ అంచనా వే శారు. గతవారం మార్కెట్ వరుసగా మూడువారాలపాటు లాభాలు తెచ్చుకున్న స్టాక్ మార్కెట్ గతవారం క్షీణించింది. గ్రీస్, చైనా పరిణామాల నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 431 పాయింట్లు నష్టపోయి 27,661 పాయింట్ల వద్ద ముగిసింది. -
సాధికారతకు సరైన సాధనం
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భారత ప్రభుత్వం ఉమ్మడిగా అమలు చేస్తున్న ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) మొత్తం ప్రభుత్వ పథకాలలోనే తలమానికమైనది. దీన్ని సాధారణ వ్యవహారంలో అంగన్వాడీ పథకం అంటారు. దళితులు, గిరిజనులు, నగర మురికివాడల ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని 1975లో ఈ పథకాన్ని రూపొందించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రసూతి మహిళలు, తల్లులకు, 0-6 ఏళ్ల వయస్సులోనిపిల్లల సమగ్రాభివృద్ధికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్)కి సంబంధించిన సామాజిక గణన ప్రాతిపదికన నేను రాసిన ‘ఉడకని మెతుకులు’ పుస్తకం ఇటీవలే ప్రచురితమైంది. ఆ జిల్లాలో ఐసీడీఎస్ పథకం అమలులో జరిగిన లోపాల గురించి ఈ పుస్తకం చర్చిస్తుంది. నా అధ్వర్యంలో అక్కడ జరిగిన విస్తృతమైన సామాజిక గణన ప్రాతిపదికన ఈ పుస్తకం రూపొందింది. అయితే ఇది కేవలం ఒక్క అనంత పురం జిల్లాకు సంబంధించినదే కాదు భారతదేశమంతటా నెలకొన్న పరిస్థితులకు ఇది సూచిక. ఈ పుస్తకం ప్రతులను అధ్యయనం కోసం కలెక్టర్లందరికీ పంపించాను. తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ టి.కె. శ్రీదేవి ఐసీడీఎస్‌ని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారు. ఈ సంవత్సరం మే 28న మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన సెమినార్‌కు ఆమె నన్ను ఆహ్వానించారు. అంగన్వాడీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసే మార్గాలపై ఈ సెమినార్లో రోజు పొడవునా చర్చా కార్యక్రమం జరిగింది. మన మహిళలు, శిశువుల ఆరోగ్య.. తదితర ప్రయోజనాలు కాపాడటం కోసం సరైన సమయంలో నిర్వహించిన ఈ సెమినార్ హాజరైన అందరిలో ఎనలేని స్ఫూర్తిని కలిగించిందనడంలో సందేహం లేదు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంను అభినందించేంత స్థాయికలిగిన వ్యక్తిని కాను కానీ, ఒకేసారి అయిదుమంది మహిళా కలెక్టర్లను ఆయన నియమించడం మాత్రం సుపరిపాలనకు సంబంధించి విప్లవాత్మక చర్య అని భావిస్తున్నాను. దీనిని నిజంగానే ఆధునిక, రాజనీతిజ్ఞత కలిగిన నాయక త్వంగా గుర్తించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనాన్ని రూ. 7 వేలకు, సహాయకులకు రూ. 4,500లకు పెంచటం గుర్తించదగినది. ఈ చర్యను ఒక ప్రభుత్వాధినేత చేపట్టగలరని గతంలో ఎవరూ కలలో కూడా ఊహించలేదు. భారతదేశంలో అత్యంత కీలకమైన హక్కుల ఆధారిత కార్య క్రమమైన ఐసీడీఎస్ పథకానికి ఇది నిజంగా శుభసూచకం. ఈ రంగానికి సంబంధించి రాష్ట్రంలో మరిన్ని సంస్కరణలు జరుగగలవని ఆశిస్తున్నాను. నేను రచించిన ఉడకని మెతుకులు పుస్తకంలో సిఫార్సు చేసినట్లుగా అంగన్వాడీ కేంద్రాలన్నింటినీ శిశు పరిరక్షక కేంద్రాలు గా మార్చడంలో ప్రభుత్వం విధాన రూపకల్పన చేయగలదని కూడా ఆశిస్తున్నాను. నేను రాసిన పుస్తకం కానీ, మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన సెమినార్ కానీ ఐసీడీఎస్ పథకం అమలులో జరుగుతున్న లోపాలకు ఏ ఒక్కరినీ విమర్శించడం పనిగా పెట్టుకోలేదు. ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయటాన్ని మెరుగుపర్చడం, పథకం అమలులో ముఖ్యమైన వైఫ ల్యాలు ఏమిటి? వాటిని సరిదిద్దడం ఎలా అనే విషయాలే వీటికి ప్రాతిపదిక. దేశంలోని పేదల్లోకెల్లా నిరుపేదలుగా ఉన్న మహిళలు, శిశువుల హక్కులను, ప్రయోజనాలను కాపాడటాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రయత్నించవలసిన సందర్భమిది. ఐసీడీఎస్ సెమినార్లో నేను చేసిన కీలకోపన్యాసం వివరాలు... తలమానికమైన పథకం ఐసీడీఎస్ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి భారత ప్రభుత్వం ఉమ్మడిగా అమలు చేస్తున్న ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం (ఐసీడీఎస్) మొత్తం ప్రభుత్వ పథకాలలోనే తలమానికమైనది. దీన్ని సాధారణ వ్యవహారంలో అంగన్వాడీ పథకం అంటారు. దళితులు, గిరిజనులు, నగర మురికివాడల ప్రజల సంక్షే మాన్ని దృష్టిలో ఉంచుకుని 1975లో ఈ పథకాన్ని రూపొందించారు. అన్ని వర్గాలకు చెందిన ప్రసూతి మహిళలు, తల్లులకు, 0-6 ఏళ్ల వయస్సు లోనిపిల్లల సమగ్రాభివృద్ధికి ఈ పథకం ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా ప్రసూతి మహిళల, పిల్లల భవిష్యత్ మానవ, సామాజిక అభివృద్ధికి సంబం ధించిన పథకమిది. ఈ పథకం మొత్తం మీద ఆరు సేవలను అందిస్తోంది. అవి అనుబంధ పోషకాహార, రోగనిరోధక శక్తి పెంపు, ఆరోగ్య తనిఖీ, ఆరోగ్య సంబంధ సేవలు, పోషక, ఆరోగ్య విద్య, ప్రీ స్కూల్ విద్య. ఏకీకృత శిశు అభివృద్ధి సేవల పథకం (అంగన్వాడీ) రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 హామీ ఇచ్చిన విధంగా మహిళలు, పిల్లల జీవించే హక్కును నేరుగా ప్రతిబింబిస్తుంది. అందుకే అంగన్వాడీ కార్యక్రమం విఫలమైతే, దానిలో భాగమైన మహిళల, పిల్లల మానవ, సామాజిక అభివృద్ధి హక్కులకు ఉల్లంఘన జరిగినట్లే అవుతుంది. భారతీయ పేదలలో అత్యధిక శాతంగా నమోదైన మహిళల, పిల్లల జీవితాలకు సంబంధించిన అతి ముఖ్యమైన రంగాలపై ఈ పథకం వైఫల్యం ప్రభావం చూపుతుంది. భారతీయ శిశువుల అత్యధిక మరణాలకు ప్రధాన కారణం పుట్టిన పసిబిడ్డ బరువు తక్కువుండటమే. నవజాత శిశువుల బరువు మన దేశంలో 2.5 కేజీల కంటే తక్కువగా ఉంటోంది. గర్భిణులలో రక్తహీనత, పోషకాహార లోపం దీనికి ప్రధాన కారణాలు. బరువు తక్కువ పిల్లలు శారీరక, మానసిక అభివృద్ధి లోపానికి గురై వారి భవిష్యత్తు ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ గా ఉంటుంది. ఈ లోపం కారణంగా శిశుదశలో వీరిలో కలిగే ప్రభావాలను తదనంతర జీవితంలో తొలగించడం చాలా కష్టం. మాతా, శిశు జీవనచక్రంలో చోటుచేసుకున్న ఈ పెనులోపాలకు సమగ్ర పరిష్కారమే అంగన్వాడీ పథకం. పోషకాహారంపై, ఆరోగ్యంపై సమగ్ర విద్య, స్థానిక ఆహారాన్ని అందించడం, ప్రధానంగా ఐరన్ అనుబంధ ఆహా రాన్ని మహిళలకు అందుబాటులో ఉంచటం, పిల్లల వృద్ధి దశను పర్యవేక్షిం చడం వంటి నివారణ చర్యలను అంగన్వాడీ పథకం చేపట్టింది. అయితే అనేక రాష్ట్రాల్లో ఐసీడీసీ పథకం అమలులో వీటిని చిత్తశుద్ధితో చేపట్టలేదని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. ఈ లోపం కారణంగానే మహిళలు, పిల్లల్లో మానసిక, తదితర వైకల్యాలు నేటికీ కొనసాగుతున్నాయి. పైగా 69 శాతంపైగా గ్రామీణ భారత మహిళలకు 16 ఏళ్లకు లోపే పెళ్లి చేస్తున్నారని యునిసెఫ్ ఇచ్చిన సమాచారం దీనికి అదనంగా తోడవుతోంది. తక్కువ వయస్సులో జరుగుతున్న ఇలాంటి వివాహాలు కాన్పు దశలో తీవ్ర నష్టాలకు కారణమవుతున్నాయి. ఈ ఒక్క సందేశం మనకు ఆడశిశువుల ఆరోగ్య ప్రతిపత్తికి పరిరక్షణ విషయంలో అంగన్వాడీ సేవల ప్రాధాన్యతను నొక్కి చెబుతోంది. ప్రసూతి సమయంలో, ప్రసవించిన అనంతరం శిశువుల తొలి మూడేళ్ల జీవితంలో అంగన్ వాడీ పథకం సమర్థంగా చేపట్టే పర్యవేక్షణ ఆ శిశువుల జీవితకాల ఆరోగ్యానికి హామీనిస్తుంది. మన ప్రభుత్వాల ఆరోగ్య, మహిళా-శిశు అభివృద్ధి శాఖల మధ్య సమన్వయలోపం నేపథ్యంలో శిశువుల జీవితంలో తొలి మూడేళ్ల కాలం పర్యవేక్షణపై అంగన్వాడీ కేంద్రాలు ప్రత్యేక శ్రద్ధ చేపట్టాల్సి ఉంది. తొలి మూడేళ్లు అత్యంత ముఖ్యం అంగన్వాడీ పథకం ప్రవేశపెట్టి 40 ఏళ్లు కావస్తున్నప్పటికీ శిశువు తొలి దశలో చేపట్టవలసిన సముచిత చర్యలు ఇప్పటికీ లోపభూయిష్టంగానే ఉంటు న్నాయి. ఈ నేపథ్యంలో తొలి మూడేళ్ల పర్యవేక్షణ శాశ్వతంగా కొనసాగాల న్నదే ఐసీడీసీ ‘మంత్రం’గా ఉండాలి. ఈ తరహా శిశు సంరక్షక కేంద్రం మాతా శిశువులకు సంబంధించిన అనేక హక్కులను పరిరక్షించగలు గుతుంది. గ్రామీ ణ మహిళలకు నిరంతరాయ పని కల్పించడం, మూడేళ్లు దాటిన ఆడ శిశువుల కు విద్య నేర్పడం, తల్లిపాలు తాగడం శిశువుకు హక్కుగా కల్పించడం, విద్యా హక్కుకు పునాదిగా ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్‌ను తగినరీతిలో కల్పించడం, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, విద్య, మహిళా, శిశు అభివృద్ధి వంటి సంబంధిత శాఖలన్నింటినీ సమన్వయించడంలో రాజీలేని ప్రయత్నాలు చేయడం ద్వారానే అంగన్వాడీ పథకాన్ని మరింత పరిపుష్టం చేయగలం. అంగన్వాడీతోటే సాధికారత మన దేశంలో ప్రసూతి సమయంలో నష్టభయం లేకుండా మహిళలను కాపాడాలంటే అంగన్వాడీ వంటి మన సొంత పథకాలను సమర్థవంతంగా చేపట్టడమే సరైనది. అనేక కోణాల్లో అంగన్వాడీ పథకం మహిళల నిజమైన సాధికారతను నిర్వచిస్తోంది. దీన్ని అమలు చేస్తున్న సంస్థ మహిళా, శిశు అభివృద్ధి శాఖకు పూర్తి గౌరవం కల్పించాలి. ఎందుకంటే మన జనాభాలో 75 శాతం విషయంలో ఈ శాఖ బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహిస్తోంది. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఒకే సమయంలో అయిదుగురు మహి ళా కలెక్టర్లను నియమించడం, అంగన్వాడీ కార్యకర్తలకు ఇస్తున్న అత్యంత కనిష్ట వేతనాలను సవరించాలని నిర్ణయించడం నిజంగానే విప్లవాత్మకమైన చర్యలు. తెలంగాణ ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయాలు మహిళా సాధికా రత అమలుకు శుభసూచకంలా కనిపిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి ఒక రోజంతా నిర్వహించిన ఐసీడీఎస్‌పై సెమినార్ ఈ ఆశకు భవిష్యసూచకంగా నిలబడుతోంది. (వ్యాసకర్త : కేఆర్ వేణుగోపాల్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి) -
కళ్లు తెరుస్తారా?
మ్యాగీ నూడుల్స్ లో సీసం, మోనో సోడియం గ్లుటామే ట్ (ఎమ్ఎస్జీ) ఉన్నాయని బయట పడటంతో భారత అధికార వ్యవస్థ దాని వెంట పడింది. మ్యాగీ తయారీదా రైన ‘నెస్లే’ తమ ఉత్పత్తిని తాత్కాలికంగా ఉపసంహరించిందే గానీ పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదు. ఇంకా అది తమ ఉత్పత్తి మంచి దేనని అంటూనే ఉంది. వాస్తవాలతో బండకేసి బాదే వరకు కూడా పాశ్చాత్య దేశాల్లోని చాలా ఆహార ఉత్పత్తుల తయారీదారుల్లా అదీ కూడా అదేపాట పాడుతుంది. అయితే అదో సుదీర్ఘ క్రమం. ఒక బహుళ జాతి సంస్థ పరాక్రమం ముందు భారత ప్రభుత్వ ప్రతాపం నిలవగలు గుతుందా అనేది వేచి చూడాల్సిందే. మ్యాగీ వ్యవహారమైనా వినియోగదారుల సమస్యల పై ప్రభుత్వానికి మేలుకొలుపు కాగలదని అనుకుందాం. వినియోగదారులు ద్రవ్యోల్బ ణం వల్ల మాత్రమే కాదు, చెల్లించిన డబ్బు కు సరిపడా విలువను పొందలేక కూడా నష్టపో తున్నారు. తాగునీటి నాణ్యత నుండి మొదలై కూరగాయల దుకాణదారుల వరకు పట్టపగలు దోపిడీ సర్వత్రా సాగుతోంది. వినియోగ దారుడు రాజు కాదు, మోసపోవాల్సిన వెర్రి బాగులోడు. పెద్ద పెద్ద స్టోర్స్‌లోని దిగుమతి చేసుకున్న యాపిళ్లను తాజాగా, నవనవలాడుతూ ఉంచడానికి పళ్ల మీద మైనం పూత పూసి ఉంటుంది. అది ఆహారం కలుషితం కావడం తో సమానమే. అయినా ఆ విషయమై ఏ హెచ్చరికా ఉండదు. ఈసారి, ఓ చిన్న కత్తి తీసుకుని దానిపై మైనపు పొరను గీకి చూడం డి... నిర్ఘాంతపోతారు. అది డాక్టర్‌ను దూరం గా ఉంచే యాపిల్ కాదు. యూరప్, బ్రిటన్లు మన మామిడి పండ్లలో పురుగు (ఫైర్ ఫ్లై) ఉం టోందని వాటి దిగుమతులను నిషేధించాయి. కానీ వాటిని తినొద్దని మనల్ని హెచ్చరించిన సంస్థేదీ లేదు. బ్రిటిష్వాళ్లలాగా మనం చాదస్తులం కాకపోవడమే కారణం కావచ్చు. దేశంలోని 66 శాతం పాలల్లో నీళ్లు, గ్లూకోజ్, వెన్న తీసేసిన పాలు, చివరికి సబ్బు పొడి సైతం కల్తీ అయినవేనని కేంద్రం 2012 అక్టోబర్‌లో సుప్రీం కోర్టుకు నివేదించింది. మన ఆహార రక్ష ణ, ప్రమాణాల సంస్థ దీన్ని మహా సుతారంగా ‘‘ప్రమాణాల నుండి వైదొల గడం’’గా పేర్కొంది. మసాలా దినుసుల పొడుల్లో రంపపు పొట్టుకు, బియ్యంలో ప్లాస్టిక్ బియ్యానికి, బ్లీచింగ్ పౌడర్‌లో చాక్ పౌడర్‌కి, దీపావళి పండుగ సమయంలో కల్తీ కోవాకు మనం అలవాటు పడిపోయాం. తప్పుడు తూకం పుణ్యమాని కిలోకి డబ్బులిచ్చినా మనకు దక్కేది 800 గ్రాముల కూరగాయలే. ఇక ఆటోరిక్షాల మీటర్లను తారుమారు చేయడం సర్వసాధారణం. దుర్భిక్ష పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సర్వత్రా కనిపించే నీటి ట్యాంకర్లు మరో భీతావహక అంశం. సరఫరా చేసే ఆ నీరు ఎక్క డి నుంచి తెచ్చిందో, శుద్ధి చేసినదో కాదో, ఎలా శుద్ధి చేశారో వినియోగదారులకు చెప్పరు. డబ్బిచ్చి తెప్పించుకున్నవే అయినా ఆ ట్యాం కర్లను తనిఖీ చేశారో లేదో వినియోగదా రులకు తెలియదు. అది తాగునీరేనని తెలిసి గాక, విశ్వాసంతో తాగేస్తారంతే. విస్తరిస్తున్న నగరాలు సైతం ఇలాంటి నీటి ట్యాంకర్లపైనే ఆధారపడుతున్నాయి. బోరు నీరు కఠిన జలం కాబట్టి సీసాల్లోని నీరు కొనుక్కోక తప్పదు. స్థానిక సంస్థలు సరఫరా చేసేదీ అనుమా నాస్పదమైన నీరే. కాబట్టేనేమో ఇద్దరు ఎంపీలు సచిన్ టెండూల్కర్, హేమామాలిని అందరికీ పరిశుభ్రమైన తాగునీటి సరఫరాకు హామీ ఉండేలా చట్టాలను చేయడానికి బదులు... వాటర్ ప్యూరిఫయర్లు కొనుక్కో మని ప్రచారం చేస్తున్నారు. ఢిల్లీ వీధు ల్లోని తినుబండారాల్లో, రెస్టారెంట్ల ఆహారంలో ఇ.కోలీ అత్యధిక స్థాయిలో లేదా మానవ మల కాలుష్యం ఉండటానికి ఒక కారణం కలుషితమైన నీరే. వీధుల్లో వంటకాలను తయారు చేయడానికి వ్యతిరేకంగా బొంబాయి హైకోర్టు ఆదేశాలున్నా వాటిని విస్మరించారు. సీసం, మోనోసోడియం గ్లుటామేట్ (ఎమ్ఎస్జీ)లు ఉండటంతో నూడుల్స్ వల్ల కలిగే ఆరోగ్యపరమైన విపత్తులపై ఆందోళన వెల్లువెత్తడం ఆహ్వానింపదగిన పరిణామం. దేశ పౌరుల ఆరోగ్యం పట్ల, ప్రత్యేకించి మ్యాగీ ఓ అద్భుతమని నమ్మిస్తున్న పిల్లల ఆరోగ్యం గురించి పట్టింపున్నవారు మొత్తానికి ఎవరో ఒకరున్నారన్న మాట. కానీ సర్వత్రా వినియో గదారుల పట్ల నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తు న్న తీరును చూస్తుంటే...ఆ అంశంపై చూపాల్సి ఉన్న శ్రద్ధకు ఇది ప్రారంభమేనని ఆశించాలి. మనం వినియోగిస్తున్న ఆహారం నాణ్యత విషయంలో భారత అధికార యంత్రాంగం ఎంతగా చేతులు ముడుచుకు కూచున్నదంటే మ్యాగీలో అవి ఉన్నాయని కూడా మనకు తెలి యదు. ఫలానా వస్తువును వినియోగించడం వల్ల ఫలానా ప్రమాదాలున్నాయని అధికారు లు ఎన్నిసార్లు ప్రకటించి ఉంటారు? ఉదా హరణకు, ఆహార రక్షణ, ప్రమాణాల సంస్థ 2013లో ఐదు, 2014లో మూడు, ఈ ఏడాది ఒక్కటి మాత్రమే అలాంటి ప్రకటనలు చేసింది. ఆశ్చర్యకరంగా కేంద్ర ప్రభుత్వం మ్యాగీపై వినియోగదారుల న్యాయస్థానాన్ని ఆశ్రయించినా, అది మాత్రం నోరు మెదప లేదు. ప్రజలలో ఏమంత అవగాహనను పెం పొందింపజేయకుండానే భారత వినియోగ దారులను వారి మానానికి వారిని వదిలేశారు. ఎవరో కొందరు సాహసికులైన వినియోగ దార్లు మాత్రమే వినియోగదారుల కోర్టుల తలుపు తట్టి, సమస్యలను పరిష్కరించుకుం టారు. అయితే వాటిలో చాలావరకు అభిలష ణీయంగా పనిచేయడం లేదు. వ్యాజ్యదారులు కావాల్సినవారు అవి కూడా కోర్టుల కెక్కినట్టే చాలా కాలహరణం, ఖరీదైన లాయర్లు, వాయిదాలు, అంతులేని జాప్యాలమయమని భావిస్తుంటారు. అలాంటివారికి మద్దతునం దించే యంత్రాంగం ఉనికిలో లేకపోవడం విచారకరం. (వ్యాసకర్త: మహేష్ విజా పుష్కర్ సీనియర్ పాత్రికేయులు) -
ముందుంది అసలు పరీక్ష
విశ్లేషణ - ఎం. పద్మనాభరెడ్డి దేశ ప్రజలు 2014 ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారు. విపరీతమైన అవినీతి, పాలనలో అలసత్వం, సంకీర్ణ పేరుతో అవినీతి మంత్రులపై చర్యలు తీసుకోలేక చేష్టలుడిగిన ప్రధానమంత్రి, ధరల పెరుగుదల, నిరుద్యోగ సమ స్య వంటి రకరకాల కారణాలతో యూపీఏ ప్రభుత్వంపై ప్రజలు విసుగు చెంది బీజేపీకి పట్టం కట్టారు. కొత్త ప్రభుత్వం కొలువుదీరి సంవత్సరం కాలమైనందున ప్రభుత్వ పనితీరుపై విశ్లేషణ జరగడం సహజమే. నేడు కేంద్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వమైనా, అది బీజేపీ ప్రభుత్వమే, అందు లోను నరేంద్రమోదీ ప్రభుత్వమే అని చెప్పుకోవచ్చు. ఏడాదిలో కేంద్ర ప్రభుత్వ పనితీరును పరిశీలించినప్పుడు ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. అంతటా సానుకూల వాతావరణం ప్రధాన మంత్రి ప్రమాణ స్వీకారానికి సార్క్ దేశాధినేతలు హాజరు కావడంతో మొదలైన కొత్త విదేశాంగ విధానం ప్రపంచ దేశాలకు ఒక స్పష్టమైన సందే శాన్ని ఇచ్చింది. భారతదేశం అందరితో సత్సంబంధాలు కోరుకుంటుందని పొరుగు దేశాలతో శాంతియుతంగా సమస్యలు పరిష్కరించుకుంటుందని సందేశం. ఇందులో భాగంగానే ప్రధాని గత ఏడాది కాలంలో 18 దేశాలలో పర్యటించి ఆ దేశాధినేతలతో వ్యక్తిగత సంబంధాలు పెంచుకోవడ మే కాక దేశానికి ఉపయోగపడే ఎన్నో ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకున్నారు. అంతే కాక చాలా సందర్భాలలో ఆ దేశ పార్లమెంటులో మాట్లాడడం అక్కడి భారత సంతతి వారితో మమేకమై ఒక చక్కటి వాతావరణాన్ని కల్పించారు. నేడు ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఒక బలమైన ఆర్థికశక్తిగా పెరుగుతున్న దేశంగా గుర్తింపు కూడా వచ్చింది. అయితే విదేశాంగ విధానం బాగానే ఉన్నా, దేశీయరంగంలో మోదీ ఎన్నికల సందర్భంలో చెప్పినవాటికి, జరుగుతున్న వాటికి వ్యత్యాసం ఉంది. మంచి వాక్చాతుర్యంతో, పాలనలో అనుభవంతో ఎన్నికల సందర్భంలో ఆయన ప్రజలను ఆకట్టుకున్నారు. 60 ఏళ్లపాటు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. నాకు కేవలం 60 నెలలు అధికారం ఇవ్వండి. నేను దేశానికి, దేశ ప్రజలకు మంచి రోజులు (అచ్చేదిన్) తీసుకురాగలను అంటూ ఒక ఫీల్‌గుడ్ వాతావరణాన్ని నెలకొల్పడంలో సఫలీకృతుడయ్యారు. ఆర్థిక వనరుల బదిలీ ఇంతవరకు దేశ ఆర్థిక వనరుల్లో చాలా భాగం కేంద్రం చేతిలో ఉండేవి. రాష్ట్రా లను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి 50% కేంద్ర పన్నుల నిధులు రాష్ట్రాలకు బదిలీ చేయడం మంచి నిర్ణయం. దేశాన్ని చాలా కాలంగా పట్టి పీడిస్తున్న సమస్య ధరల పెరుగుదల. మోదీ ప్రభుత్వం ధరల నియంత్రణ చేయగలిగింది. అయినా పరిస్థితి పూర్తిగా అదుపులోనికి రాలేదు. స్థూల దేశీయ ఉత్పత్తి పెరు గుతున్నా, ఉద్యోగ అవకాశాలు అనుకున్నంతగా పెరగలేదు. మేక్ ఇన్ ఇండి యా పేరుతో కార్యక్రమాన్ని చేపట్టినా, అది ఇంకా పురుడు పోసుకోలేదు. ప్రజలను బ్యాంకింగ్ వ్యవస్థలో భాగస్వాములను చేసే దిశలో జన్‌ధన్ యోజన ద్వారా సుమారు 15 కోట్ల కొత్త ఖాతాలు తెరవడం ఒక చక్కని మొదటి మెట్టు. ఇక దేశంలో కోట్లలో ఉన్న చిన్న వ్యాపారస్థుల సహాయార్థం 20 వేల కోట్లతో ‘ముద్ర’ బ్యాంక్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇది ఉపాధి అవ కాశాలు పెంచుతుంది. ఇటీవలే తీసుకొచ్చిన రెండు బీమా పథకాలు పేదలకు ఎంతో లాభాన్ని చేకూరుస్తాయి. భూసేకరణ బిల్లుతో అపవాదు మోదీ నాయకత్వం వహిస్తున్న బీజేపీ పార్టీ ధనవంతుల పార్టీ అని, ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ముఖ్యంగా గత సంవత్సరం పెద్ద పెద్ద వ్యాపారస్థులకు కోట్లలో రాయితీలు ఇచ్చారు. అవి పరిశ్రమల అభివృద్ధికే అయినా, లాభపడింది మాత్రం కొందరు పారిశ్రామికవేత్తలు మాత్రమే. పరిశ్రమలు స్థాపించడానికి భూమి ఒక కీలకమైన అంశం. గత ప్రభుత్వం 2013లో తెచ్చిన భూసేకరణ చట్టంతో పరిశ్రమలు ఇతర అభివృద్ధి కార్యక్ర మాలకు భూసేకరణ ఒక అడ్డంకిగా మారింది. అయితే ఈ చట్టానికి కొన్ని సవరణలు తెస్తూ భూసేకరణ సులువుగా జరిగేటట్లు ప్రభుత్వం ప్రయత్ని స్తోంది. ఇది కాస్త రాజకీయ దుమారం లేపింది. సంఖ్యాబలం లేక రాజ్య సభలలో ఈ బిల్లు కాస్త గట్టెక్కక రెండవసారి ఆర్డినెన్స్ తీసుకువచ్చి బిల్లును బతికించే ప్రయత్నంలో మోదీ ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తుంది అనే అపవాదు మూటకట్టుకుంది. మోదీ ప్రభుత్వంలోని గిరిరాజ్‌సింగ్, నిరంజన్‌జ్యోతి వంటి కొందరు మంత్రులు అల్ప సంఖ్యాక ప్రజలపై చేసిన అభియోగాలు ఆమోదయోగ్య మైనవి కావు. అసలే గుజరాత్ అల్లర్లతో మచ్చపడ్డ మోదీకి మంత్రివర్గ సహచ రుల అసందర్భ ప్రేలాపనలు అల్ప సంఖ్యాకులలో అభద్రతాభావం పెంచే విధంగా ఉండి, మోదీ ఇంకా ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి పైకి రాలేదు అనే అపవాదు వచ్చింది. కీలకమైన విద్య, ఆరోగ్య రంగాల్లో మోదీ ప్రభుత్వం గత సంవత్సర కాలంలో గట్టి చర్యలు ఏమీ తీసుకోలేదు. ఈ రెండు రంగాలలో రాష్ట్ర ప్రభుత్వ పాత్ర ఎక్కువగా ఉండటమే కాకుండా, కేంద్ర నిధులు అంతంత మాత్రంగా ఉండటంతో ప్రాథమిక, ఉన్నత విద్యల ప్రమాణాలు దిగజా రాయి. 2014 -15లో విద్యా రంగానికి రూ.55 వేల కోట్ల కేటాయింపు ఉండగా, అది 2015-16లో రూ.42 వేల కోట్లకు తగ్గింది. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖకు గత ఏడాది రూ.21 వేల కోట్లు కేటాయించగా 2015-16లో రూ.10వేల కోట్లకు తగ్గించినారు. కేంద్ర ప్రభు త్వం కొత్తగా ఐఐటీ, ఐఐఎంలు స్థాపించడానికి పూనుకున్నా సరైన బోధనా సిబ్బంది లేక అవి ఎక్కడ వేసిన గొంగళి అచ్చటనే అన్న చందాన ఉన్నాయి. అయితే కేంద్రం ఉపాధ్యాయులకు శిక్షణ పేరుతో టీచర్ ఎడ్యుకేషన్ మిషన్ ప్రారం భించి అధ్యాపకులలో నైపుణ్యాన్ని పెంచే యత్నం చేసింది. కీలక విషయాలలో నాన్చకుండా సత్వర నిర్ణయం తీసుకోవడం మోదీ ప్రత్యేకత. ఫ్రాన్స్ పర్యటనలో వేల కోట్ల రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు ఒప్పందం, అలాగే చైనా పర్యటనలో చైనా వారికి ఈ- వీసా మంజూరు ప్రకటన ముఖ్యమైనవి. అయితే కొన్ని సందర్భాల్లో ఆయన నియంతగా వ్యవహరిస్తున్నాడు అనే అపవాదు కూడా వచ్చింది. విదేశాలలో ఉన్న నల్లధనాన్ని తెచ్చే విషయంలో మోదీ ప్రభుత్వం విఫల మైంది. ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని వేసి, నల్లధనంపై ఒక చట్టాన్ని తెచ్చి నా విదేశీ బ్యాంకుల నుంచి నల్లధనం మాత్రం రాలేదు. మోదీ ఎన్నికల్లో ప్రజ లకు ఇచ్చిన హామీ ఇంత వరకు నెరవేరలేదు. బంగ్లాదేశ్‌తో సరిహద్దు ఒప్పం దం ఒక చారిత్రక ఘట్టం. భారత పార్లమెంటులో ఏకగ్రీవంగా ఈ ఒప్పందం ఆమోదం పొందటం, ప్రధానమంత్రి స్వయంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల వద్దకు వెళ్లి ధన్యవాదాలు తెలుపడం ఒక మంచి సంప్రదాయానికి ప్రతీక. సభలో ఫలవంతమైన చర్చలు జరిగి ఎన్నో బిల్లులు ఆమోదం పొందడంతో ప్రజలకు పార్లమెంటుపై గౌరవం పెరిగింది. పారదర్శకతతో పెరిగిన ఆదాయం దేశంలో అపారమైన బొగ్గు నిల్వలున్నా, యూపీఏ ప్రభుత్వం అవినీతి మూ లంగా సుప్రీం కోర్టు జోక్యం చేసుకొని బొగ్గు తవ్వకాలు నిలిపివేయాలని ఆదేశించడంతో దేశ బొగ్గు అవసరాల కొరకు విదేశాల నుండి బొగ్గు దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. మోదీ ప్రభుత్వం పారదర్శకంగా బొగ్గు క్షేత్రా లను వేలం వేయడంతో ప్రభుత్వానికి లక్షల కోట్లలో ఆదాయం రావడమే కాక దేశంలో బొగ్గు లభ్యత పెరిగింది. అలాగే ధ్వని తరంగాల వేలం కూడా దేశానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చింది. 120 కోట్ల జనాభాతో ప్రపంచంలో అన్ని మతాల ప్రజలు, రకరకాల భాషలతో ఉన్న దేశాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి సమయం కావాలి. మోదీ ప్రభుత్వం ఒక సంవత్సర పాలనలో ఏమీ జరగలేదు అనుకోవడం కానీ, ఏదో బ్రహ్మాండంగా జరుగుతుంది అని అనుకోవడం కాని పొరపాటే అవుతుంది. అయితే సంవత్సరకాలం ప్రభుత్వం అభివృద్ధి పథంలో ప్రయా ణిస్తుందా లేదా అని బేరీజు వేయడానికి సరిపోతుంది. ఎక్కడ ఉన్నామని కాదు - ఏ దిశలలో పయనిస్తున్నామన్నది ముఖ్యం. గత సంవత్సర పాలన లో మోదీ ప్రభుత్వం విదేశీ సంబంధాలలో, భారతదేశ ఇమేజ్ను ప్రపంచ దేశాలలో పెంచడంలో, అలాగే ఎటువంటి స్కామ్‌లు లేకుండా దేశ సంపద ను పారదర్శకంగా ఉపయోగించడంలో, త్వరితగతిన నిర్ణయాలు తీసుకుం టూ కేంద్రంలో ఒక పని చేసే ప్రభుత్వం ఉందని చెప్పడం వంటి కార్యక్రమా లలో పూర్తిగా సఫలీకృతమైంది. ఇకపోతే ఎన్నికల్లో పెద్ద ఎత్తున గుప్పించిన హామీలలో ఇంకా నెరవేర్చవలసినవి చాలా ఉన్నాయి. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలు తగ్గించి, ధరల నియంత్రణ, ఉపాధి అవకాశాలు వంటి వాటిపై ఇంకా పని చేసే అచ్చేదిన్ తీసుకొని రావాల్సిన అవసరముంది. అలాగే ప్రభుత్వ ప్రతిష్టను మసకబరిచే ప్రసంగాలు చేస్తున్న మంత్రులు, పార్లమెంట్ సభ్యులపై నియంత్రణ అవసరం. మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ భారత్, నీతి ఆయోగ్, ముద్ర బ్యాంక్, జన్‌ధన్ యోజన వంటి కార్యక్రమాలు కార్యరూపం దాల్చిన ఫలితాలు కనిపిస్తాయి. మొత్తానికి ఒక సంవత్సరం మోదీ పాలన భేషుగ్గా ఉంది కానీ, అసలు పరీక్ష మాత్రం ముందుంది. వ్యాసకర్త కార్యదర్శి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ 98492 69105 -
గూగుల్ @ హైదరాబాద్
(విశ్లేషణ) తెలుగు రాష్ట్రాల్లో ప్రతిభావంతులు, నిపుణులు అయిన లక్షలాదిమంది ఇంజనీర్లు, యువతీ యువకుల నిధి ఉందని గూగుల్‌కు తెలుసు కాబట్టే అది హైదరాబాద్‌ను తన తదుపరి కేంద్రంగా ఎంచుకుంది. కానీ గూగుల్ నిర్ణయం పట్ల ఆంధ్రా సీఎం చంద్రబాబు స్పందించక పోగా, తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు కూడా తెలుపకపోవడం విచారకరం. హైదరాబాద్‌లో గూగుల్ కేంద్రం అనేది ఒక ప్రాంత విజయం కాదు. అది తెలుగు ప్రజలందరి విజయం. దీన్ని గుర్తించటమే రాజకీయ పరిపక్వత. ప్రపంచంలోనే తన మూడో అతిపెద్ద కార్యాలయాన్ని హైదరాబాద్‌లో నెల కొల్పనున్నట్లు గూగుల్ ఇటీవలే ప్రకటించింది. ఆ ఘటనతో ఆంధ్ర ప్రభుత్వం చేష్టలుడిగిపోగా, తెలంగాణ ప్రభుత్వం హర్షాతిరేకం ప్రకటిం చింది. ఇది చంద్రబాబు తనయుడిపై కేసీఆర్ కుమారుడి ఘనవిజయంగా కనిపిస్తోంది (వీళ్లిద్దరూ ఇటీవలే అమెరికాలో పర్యటించారు). ఈ అభిప్రా యం సమర్థనీయం కాదు. మన తెలుగు నేతలు చక్కటి సూట్లను ధరించి నందుకో, కొంతమంది ఎన్నారైలు సహాయం చేసినందుకో గూగుల్ హైదరా బాద్‌కు రాలేదు. పైగా గూగుల్ ఆంధ్రప్రదేశ్‌ను తిరస్కరించలేదు కూడా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఎన్నడూ వారి జాబితాలో లేదు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో 30 ఏళ్లుగా తెలుగు ప్రజల ఐటీ, సాఫ్ట్వేర్ కౌశలాల ఫలితంగా హైదరాబాద్ అనేక అనుకూలతలను సాధించుకుంది. గూగుల్ అత్యంత కుశాగ్రబుద్ధితో నిర్ణయాలు తీసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిభావం తులైన, నిపుణులైన లక్షలాదిమంది ఇంజనీర్లు, యువతీ యువకుల నిధి ఉందని గూగుల్‌కు తెలుసు కాబట్టే అది హైదరాబాద్‌ను ఎంచుకుంది. అలాంటి కేంద్రం పుణే, బెంగళూరు లేదా మరే ప్రాంతంలోనైనా నెలకొల్పితే అటువంటి ప్రతిభ ఆ సంస్థకు కడు దూరంలోనే ఉండిపోయేది. హైదరాబాద్ సహజ ఎంపిక సమాచార సాంకేతిక రంగంలో అత్యంత ప్రతిభ, అనుభవాల కలబోత హైదరాబాద్ నగరం. సిలికాన్ వ్యాలీ తెలుగు ప్రజలకు పెట్టింది పేరు కాబట్టే గూగుల్ నిర్ణయం ఒక సహజమైన ఎంపిక. భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి సాధిస్తోందని గూగుల్ పసిగట్టింది. నిజానికి గూగుల్ హైదరాబాద్‌కు తెచ్చిన ఘనత నరేంద్రమోదీకే దక్కాలి. ఆయన అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షిస్తూ వస్తున్నారు. మన నేతల కమ్మటి పలుకులు లేదా మన సీఎంల మేధోతనానికి ఇందులో ఏ పాత్రా లేదు. హైదరాబాద్‌కు ముఖ్యమంత్రే లేకున్నప్పటికీ, అది రాష్ట్రపతి పాలనలో ఉన్నప్పటికీ తెలుగు ప్రజల ప్రతిభా కౌశలాల కారణంతోటే గూగుల్ దాన్ని ఎంపిక చేసుకునేది. హైదరాబాద్‌లో గూగుల్ కొత్త కేంద్రం 10 వేలమందికి ఉద్యోగాలు, మరో లక్షమందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. కాని ఈ పది వేల మంది ఉద్యోగులలో కనీసం 5 వేలమంది ఔట్‌సైడర్లు లేదా సెటిలర్లే ఉంటారన్నది గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇది అందరికీ విజయమే. గూగుల్ సంస్థే ఒక పెద్ద ఔట్‌సైడర్ కాబటి,్ట గిల్లికజ్జాలను రేపి, ఔట్సైడర్లను నిందించడం కాకుండా శాంతి సామరస్యాలను ప్రోత్సహించడాన్ని తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. తెలంగాణ ఇప్పటికీ సమస్యలతో ఉంటోందని, దాని వైఖరి బాగాలేదని పసిగట్టారంటే గూగుల్ వంటి సంస్థలు బయటకి తరలిపోవడం ఖాయం. గూగుల్, భీతితో పారిపోవడానికి న్యూయార్క్ టైమ్స్‌లో తెలంగాణపై కొన్ని ప్రతికూల రివ్యూలు అచ్చయితే చాలు. గతంలో ఆ పత్రికలో థామస్ ఫ్రీడ్మన్ కథనాల వల్లే బెంగళూరుకు అంతటి ప్రాచుర్యం లభించింది. అందుకే హైదరాబాద్‌కు గూగుల్ రాక తెలుగువారందరి విజయంగానే గుర్తించాలి. ఇకనుంచి తాను భిన్నంగా ఉంటానని తెలంగాణ చాటుకోవలసిన అవసరముంది. తెలంగాణను బాబు అభినందించాలి గూగుల్ ప్రకటనతో ఏపీ సీఎం చంద్రబాబు నోట మాట రాకుండాపోయింది. కేసీఆర్‌ను, తెలంగాణను అభినందించడంతో పాటు, తాను గతంలో సీఎంగా వ్యవహరించిన హైదరాబాద్‌ను ఎంచుకున్నందుకు గూగుల్‌కి కూడా బాబు కృతజ్ఞతలు తెలిపి ఉంటే బాగుండేది. అలా జరిగి ఉంటే నిజంగా మంచి రాజకీయాలు, మంచి పాలనకు గుర్తుగా ఉండేది. కానీ ఆంధ్రలో ఇప్పుడు మంచి ప్రభుత్వం, స్మార్ట్ రాజకీయాలు ఉన్నాయని ఎవరంటున్నారు? బిల్‌గేట్స్‌ను, సత్య నాదెళ్లను (మైక్రోసాఫ్ట్ బాధ్యతలు స్వీకరించాక 20 వేల మంది ఉద్యోగాలు ఊడబెరికాడు) తదితరులను పొగడటం తప్పితే, గూగుల్ ప్రకటనపై ఆశ్చర్యకరమైన మౌనం పాటిస్తున్న చంద్రబాబు ఈ విషయంలో విఫలం అయినట్లే. పైగా బిల్ గేట్స్, తదితరులు తమ డబ్బును రెంటచింతల (భారత్‌లోనే అత్యంత ఉష్ణ ప్రాంతం)లో మదుపు చేసి దాన్ని 140 డిగ్రీల వేడిలో వేయిస్తారని బాబు ఆలోచిస్తున్నారు. శ్వేత జాతి విదేశీయులు ఆరోగ్యం రీత్యా ఎండలో నిలబడి నల్ల చర్మం సాధించాలంటే వారు ఎంచక్కా ఏ మియామీకో వెళతారు కానీ రెంటచింతలకు, విజయవాడకు రారు. చివరకు పర రాష్ట్రాల్లోని వారు సైతం ఈ రెండు ప్రాంతాలకు వెళ్లి వడదెబ్బను కొని తెచ్చుకోవాలని కోరుకోరు. కొత్త రాజధానిలో వినోదం అవసరమని చంద్రబాబు నొక్కి చెబుతు న్నారు. సాయంకాలానికి బార్లు తెరిస్తే అందరూ వేడి గురించి మర్చిపోతారని కూడా ఆయన భావిస్తున్నారు. ఇది మంచి ఆలోచనే కావచ్చు. తాగండి.. మీ ఆందోళనలన్నింటినీ మర్చిపోండి. కాని బాధలను మర్చిపోవడానికి ఆల్క హాల్ వైపు ప్రజలను మళ్లించడం కంటే చంద్రబాబు చేయవలసిన ఇతర పను లు చాలానే ఉన్నాయి. కృష్ణానది పొడవునా బార్లు, కేబరేలు ఏర్పడతాయి కానీ గూగుల్, ఇతర విదేశీ సంస్థలు ఇలాంటి విషయాలపై ఆసక్తి చూపడం లేదు. విదేశీ పెట్టుబడులకు దేశంలో ఏర్పడిన అనుకూల వాతావరణాన్ని ఉప యోగించుకునే దిశలో ఆంధ్రప్రదేశ్ సాగటం లేదు. అది ఇంకా పాతకా లపు ఆలోచనల మధ్యే ఇరుక్కుపోతోంది కనుకే విఫలమవుతోంది. కొత్త రాష్ట్రం కాబట్టి ఆంధ్ర ఏదైనా కొత్తదానికి ప్రయత్నించాలి. తాను బాధల్లో ఉన్నానని, నిధులు ఇవ్వమని పదే పదే కేంద్రాన్ని వేడుకోవడం ఆపి తన రాజకీయ పరి పక్వతను ఏపీ ఇప్పుడు భిన్నరీతిలో ఉపయోగించాలి. చంద్రబాబు ప్రభు త్వం ఎక్కడ తప్పు చేస్తున్నట్లు మరి? కొన్ని అంశాలను చూద్దాం. 1. ఏపీ ప్రభుత్వాన్ని ఇప్పుడు కొత్త రాజధాని పట్టి పీడిస్తోంది. దేశంలోనే అధిక ఉష్ణోగ్రత ఉన్న ప్రాంతం మధ్యలో మరో సింగపూర్‌ను తీసుకురావా లన్న ఆకాంక్షే నవ్వులపాలవుతోంది. ఏర్పడిన తొలి రోజునుంచి ప్రభుత్వం ఎలాంటి చర్చా లేకుండానే గుంటూరును ఎంచుకుంది. తర్వాతే అది నిపుణుల గురించి, సింగపూర్ గురించి మాట్లాడటం ప్రారంభించింది. కానీ సింగపూర్ అంటే కేవలం సిమెంటు, ఇటుకలే కాదు కదా. మనం సింగపూర్ కంటే భిన్నంగా ఉంటున్నాం కనుకే ఈ ఐడియా విఫలం కాక తప్పదు. 2. అలాగే పురాతన రోమ్ వంటి భారీ రాజధాని ఆంధ్రాకు ఉండాలన్న ఆలోచనే తప్పు. పెద్ద సంస్థలు సైజును పట్టించుకోవు. వాటికి కావలసింది చురుకుదనం, చాతుర్యం మాత్రమే. పెద్ద కంపెనీలు ఇలాంటి ఆలోచనలను చూసి నివ్వెరపోతున్నాయి. ఒక ప్రభుత్వం తన డబ్బుమొత్తాన్ని తీసుకుపోయి ఇటుకలు, సిమెంటుమీద పెట్టవచ్చా అన్నది వాటి ప్రశ్న. 3. ఇజ్రాయెల్ గొప్పగా అభివృద్ధి చెందిందని పదే పదే చెబుతుంటారు. కానీ అమెరికాతో సహా ప్రపంచమంతటి నుంచి, యూదులు పెద్ద ఎత్తున పంపిస్తు న్న నిధుల ద్వారానే అక్కడ అభివృద్ధి జరిగింది. కాని మన ఎన్నారైలు మాత్రం కొత్త రాజధానిలో రియల్ ఎస్టేట్‌పై నిధులు గుమ్మరించి సట్టా లాభాల కోసం కాచుక్కూచుని ఉన్నారు. 4. భూసేకరణ సమస్యల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం రాజధాని కోసం, విమానాశ్రయాలు, రేవులు, హైవేల కోసం లక్షలాది ఎకరాల భూమిని కోరుతోంది. ఎయిర్‌పోర్టులు, రేవులు నిర్మించినంత మాత్రానే విమానాలు, ఓడలు వెనువెంటనే ఊడిపడవు. జపాన్‌లాగా డజన్ల కొద్దీ రేవులు నిర్మిస్తే ఓడ లు దిగిపోతాయనుకోవడం హాస్యాస్పదం. పైగా మౌలిక వసతులపై భారీ పెట్టుబడులు పెట్టినందునే చైనా వృద్ధి రేటు మందగించిందని మరవరాదు. 5. పారిశ్రామిక కార్యాచరణను ఆంధ్రా కోరుతున్నట్లయితే, అది సిలికాన్ వ్యాలీని, బెంగళూరు, హైదరాబాద్‌లను అధ్యయనం చేయాలి. సిలికాన్ వ్యాలీ ఐటీ రంగంలో 20 లక్షల మంది ఉద్యోగులను నియమించింది. విశాఖ పట్నానికి సమీపంలో ఉన్న అరకు వంటి వాతావరణం బాగుండే ప్రాంతా లను ఏపీ ప్రభుత్వం ఎంచుకోవాలి. రాష్ట్రంలో ఒక్క విశాఖపట్నంలోనే ఆర్థిక కార్యాచరణ ఉంది. కానీ ప్రభుత్వం దాన్ని విస్మరిస్తోంది. గూగుల్ వంటి కంపెనీలు విజయవాడ, గుంటూరు వంటి చోట్ల ఆఫీసులను తెరుస్తాయని కల్లో కూడా భావించొద్దు. వాటి గమ్యస్థానం విశాఖే అవుతుంది. ఏపీకి కావలసింది భూటాన్ తరహా హ్యాపీనెస్ ఇండెక్స్లే కానీ బోగస్ రియల్ ఎస్టేట్ లేదా అలాంటి తరహా సూచికలు కావు. భారీ భూసేకరణలు, వృథా ప్రాజెక్టులు, రియల్ ఎస్టేట్లు పక్కనబెట్టి రాష్ట్రంలోనూ, రాష్ట్రం బయ టా ఉన్న అపారమైన మేధో ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే చాలు రాష్ట్రం ఒక టాలెంట్ క్రియేటర్ అవుతుంది. పురోగతి దానంతటదే వస్తుంది. భవం తులు, కాంక్రీట్ అనేవి పురోగతి చిహ్నాలు కావు. చివరిగా.. చంద్రబాబు 3 ఫోన్‌కాల్స్ చేయాలి. హైదరాబాద్‌కు వస్తున్నందుకు గూగుల్‌కు తొలి కాల్ చేయండి. గూగుల్‌ని హైదరాబాద్‌కు రప్పించగలుగుతున్నందుకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను అభినందిస్తూ రెండో కాల్ చేయండి. 2013 నూతన భూ సేకరణ చట్టం కింద పోలవరం డ్యామ్ ప్రాంతం మొత్తానికి ఉపశమనం కలిగించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి మూడో కాల్ చేయండి. వ్యాసకర్త : పెంటపాటి పుల్లారావు(రాజకీయ విశ్లేషకులు) -
పొరుగింట చిచ్చే సొంతింటికి రక్షా?
(విశ్లేషణ) అమెరికా ప్రజలు పాలు, మాంసం తదితర ఆహార పదార్థాల్లో జీఎమ్ సంబంధిత అంశాలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. ఆర్గానిక్ ఆహారం వైపు మొగ్గుతున్నారు. ఆర్గానిక్ ఆహారోత్పత్తికి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా నేతృత్వం వహిస్తున్నారు. శ్వేత సౌధంలో ఆమె ఆర్గానిక్ ఆహారాన్ని పండిస్తున్నారు. అతిథులకు ఆర్గానిక్ ఆహారమే వడ్డిస్తున్నారు. పరిశోధనా క్షేత్రాల్లో జీఎమ్ పంటల పరిశోధన సులభమే. అయినా క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతిని కోరడం విత్తనాల ఉత్పత్తి ప్రయోజనాల కోసమనేది బహిరంగ రహస్యం. ఇక్కడ మన దేశంలో కేంద్ర పర్యావరణ మంత్రి ప్రకాష్ జవదేకర్ మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి జన్యు మార్పిడి (జీఎమ్) పంటల క్షేత్రస్థాయి పరీక్షలకు అనుమతులను సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... అమె రికా వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్ ఒత్తిడిని తట్టుకోవడం కోసం మరింత ఎక్కువగా ఆర్గానిక్ ఆహారాన్ని దిగుమతి చేసుకుంటుండటం విశేషం. అమెరికా మెచ్చేది ఆర్గానిక్ ఆహారమే అమెరికా ఆర్గానిక్ ట్రేడ్ అసోసియేషన్, పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సి టీలు కలసి ప్రోది చేసిన గణాంక సమాచారం ప్రకారం అమెరికన్ల ఆర్గానిక్ (సేంద్రియ) ఆహార దిగుమతుల బిల్లు పెరిగిపోవడానికి ప్రధాన కారణం మొక్కజొన్న, సోయాబీన్లే. ఆ రెండు పంటలే అమెరికాలోని ప్రధాన జన్యు మార్పిడి పంటలు! మొక్కజొన్న, సోయాబీన్లను అక్కడ ఎక్కువగా ఉప యోగించేది పశువుల దాణాగానే. అయినా అక్కడి ప్రజలు రోజురోజుకీ ఎక్కు వగా పాలు, మాంసం తదితర ఆహారపదార్థాల్లో జీఎమ్ సంబంధిత అంశా లు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు. 2014లో భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకున్న సోయాబీన్ దిగుమతులు రెట్టింపునకు పెరిగి, 7.38 కోట్ల డాలర్లకు చేరాయి. కాగా, రుమే నియా నుంచి ఆర్గానిక్ మొక్కజొన్న దిగుమతులు 2013లో కేవలం 5,45,000 డాలర్లు కాగా, ఒక్క ఏడాది వ్యవధిలోనే, 2014 నాటికి 1.16 కోట్ల డాలర్లకు గంతు వేశాయి. రుమేనియా, టర్కీ, నెదర్లాండ్స్, కెనడా, అర్జెంటీనా, భార త్ల నుంచే అమెరికా ప్రధానంగా ఆర్గానిక్ మొక్కజొన్న, సోయాబీన్లను దిగుమతి చేసుకుంటోంది. ఇక్కడ జీఎమ్... అక్కడ ఆర్గానిక్ భారత్‌లో నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు- ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పంజాబ్- జన్యుమార్పిడి పంటల క్షేత్ర స్థాయి పరీక్షలను అనుమతించాయి. మరిన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదే బాట పట్టాలని ఓత్తిడి పెరుగుతోంది. జన్యు మార్పిడి పంటల క్షేత్రస్థాయి పరీక్షల అనుమతులకు ఆటంకాలు తొలగేలా వాటి నియంత్రణ క్రమాన్ని వేగంవంతం చేయాలని ‘అసోసియేషన్ ఆఫ్ బయోటెక్ లెడ్ ఎంటర్ప్రైజెస్’ నేతృత్వంలో బయోటెక్ పరిశ్రమ ప్రధాని నరేంద్రమోదీకి రాసినట్టుగా కూడా తెలుస్తోంది. అమెరికాలో కృత్రిమ రసాయనాలు, జన్యుమార్పిడి పదార్థాలు లే నే లేని ఆహార పదార్థాల అమ్మకాలు 2014లో 3,590 కోట్ల డాలర్లకు చేరినట్టు ‘బ్లూమ్‌బర్గ్’ సంస్థ అంచనా. అంటే ఏడాదికి 11 శాతం వృద్ధి. ఇది అమెరికా ప్రజలు ఆర్గానిక్ పద్ధతుల్లో ఉత్పత్తయిన ఆహారాన్ని రోజు రోజుకూ ఎక్కువగా ఎంచుకుంటున్నారని సూచిస్తోంది. ఆర్గానిక్ ఆహార ఉత్పత్తికి అమెరికా ప్రథమ మహిళ మిషెల్ ఒబామా నేతృత్వం వహిస్తుండటం విశేషం. ఆమె శ్వేతసౌధంలోని సువిశాలమైన కాయగూరల తోటలో ఆర్గానిక్ ఆహా రాన్ని మాత్రమే పండిస్తున్నారు. అధ్యక్ష భవనానికి వచ్చే అతిథులకు వడ్డిం చేది కూడా పూర్తిగా ఆర్గానిక్ ఆహారమే. అమెరికా వినియోగదార్లలో సురక్షిత మైన, ఆరోగక్యకరమైన ఆహారాన్ని ఎంచుకోవడం వేగంగా పెరుగుతోంది. క్యాన్సర్ కారక సూపర్ కలుపు చాలా వరకు జీఎమ్ పంటలకు ‘గ్లైసోఫైట్’ వంటి రసాయనిక కలుపు నాశన కారులను రెట్టింపు మోతాదులో వాడాల్సి వస్తోంది. కాబట్టి వాటి వినియోగం 2012 నాటికే 28.35 కోట్ల పౌండ్లకు పెరిగిపోయింది. అంతేకాదు అది ఏ కలుపు నాశనులకు లొంగని సూపర్ కలుపు మొక్కల ఆవిర్భావానికి, అవి 6 కోట్ల ఎకరాల పంట భూమిలో వ్యాపించిపోవడానికి దారితీసింది. ఇలా పర్యావరణపరమైన దుష్ఫలితాలను విపరీతంగా పెంచే ఈ జీఎమ్ పంట లను ప్రోత్సహించాల్సిన అవసరమేమిటని పలువురు ప్రశ్నలు సంధిస్తు న్నారు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గ్లైసోఫైట్ను ‘కార్నికోజెన్’ (క్యాన్సర్ వ్యాధికారిణి) కావడానికి అవకాశం ఉన్నదిగా వర్గీకరించింది కూడా. ఆ కార ణంగా సైతం అమెరికాలో కిరాణా అమ్మకాలు క్రమంగా రసాయనాలు, జన్యుమార్పిడి పదార్థాలు లేని సురక్షిత ఆహారం వైపునకు మొగ్గుతున్నాయి. ఇది మారుతున్న ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేస్తోంది. మన ‘సోయామీల్’కు తప్పిన గండం అమెరికాకు భారత్ నుంచి సోయామీల్ ఎగుమతులలో పెరుగుదల కనిపి స్తుండగా, ఇరాన్, జపాన్‌లకు పశువుల దాణాగా దాని ఎగుమతుల్లో తగ్గుదల కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా ఆ రెండు దేశాలే మన సోయామీల్కు ప్రధాన మార్కెట్లుగా ఉండేవి. నేడు చైనా, బ్రెజిల్, అర్జెంటీనాల నుంచి చౌకగా లభించే సోయామీల్‌ను అవి దాణాగా దిగుమతి చేసుకుంటున్నాయి. ప్రధానంగా ‘సోయాబీన్ ప్రాసెసర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ (ఎస్ఓ పీఏ) ప్రతిఘటన వల్లనే ఒకప్పటి వ్యవసాయ మంత్రి అజిత్ సింగ్ హయాంలో జీఎమ్ సోయాబీన్ క్షేత్రస్థాయి పరిశోధన, పరీక్షలను వ్యతిరేకిం చారు. జీఎమ్ పంటల ప్రవేశంతో భారత సోయామీల్ ఉత్పత్తుల పట్ల దిగుమతిదార్ల విముఖత పెరగుతుందని అప్పట్లో సోయా పరిశ్రమ వాదించి, ఒప్పంచగలిగింది. జీఎమ్ వరి.. బియ్యం ఎగుమతులకు ఉరి బాస్మతి బియ్యం లాంటి వస్తువుల విషయంలో కూడా అదే వాస్తవం. అయినా ఇప్పటికే బాస్మతి సహా పలు వరి రకాల జన్యుమార్పిడి పంటలకు రంగం సిద్ధమైంది. సుసంపన్నమైన జీవవైవిధ్యం ఉన్న ఒడిశా వంటి కీలక ప్రాంతాలను మినహాయించే అయినా... వరి జీఎమ్ రకాలను ఒక్కసారి అనుమతించారంటే, దాని వ్యాప్తిని అరికట్టజాలం. ఒక్క జన్యువు బయట పడిందీ అంటే ఇక అది బయటే. కొన్ని దేశాలు వరి, మొక్కజొన్న పదార్థాలు గల మన ఆహార ఎగుమతులను కొన్నింటిని వాటిలో జన్యుమార్పిడి పదార్థాలు ఉన్నాయనే కారణంతో తిప్పి పంపాయి. ఆ విషయాన్ని పరిగణన లోకి తీసుకుంటే జీఎమ్ రకాల ప్రవేశంతో మన బియ్యం ఎగుమతులు కూడా పెను సవాలు ఎదుర్కోవాల్సివస్తుంది. ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే అతి పెద్ద బియ్యం ఎగుమతిదారు. ఏ ఒక్క జీఎమ్ పంట వల్లా ఉత్పాదకత పెరిగిన దాఖలాలు కనబడని ప్రస్తుత సమయంలో జన్యుమార్పిడి పంటల క్షేత్ర పరీక్షలకు తలుపులు తెరవడం విషయంలో అత్యంత జాగరూకత వహించడం అవసరం. మన వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు దెబ్బతినిపోవడాన్ని మనం ఎంత మాత్రం అనుమతించలేం. పరిశోధనా క్షేత్రాలలో పూర్తి రక్షణ మధ్య పరి శోధన సులభ సాధ్యమే. అయినా క్షేత్ర స్థాయి పరీక్షలకు (విస్తార ప్రాంతాల్లో) అనుమతిని కోరడం విత్తనాల ఉత్పత్తి ప్రయోజనాల కోసమేననేది బహిరంగ రహస్యం. (వ్యాసకర్త రవీందర్ శర్మ... వ్యవసాయరంగ నిపుణులు) -
రాష్ట్రాలు రెండు.. కష్టాలు మెండు
విశ్లేషణ తెలంగాణ ప్రజలు ఎదుర్కొన్న వివక్షకు, అవహేళనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. కమ్యూనిస్టు ఉద్యమ పునర్వైభవానికి లభించిన ఆ అవకాశాన్ని వారు చేజార్చుకున్నారు. కాగా ఏపీలోని బాబు టీడీపీ ప్రభుత్వం రైతు, శ్రామిక వ్యతిరేకిగా తన గత ‘ప్రతిష్టను’ నిలబెట్టుకుంటోంది. భూసేకరణ పేరిట అది రైతుల భూములను గుత్త పెట్టుబడిదారులకు కట్టబెడుతోంది. కమ్యూనిస్టులే చొరవ చూపి విపక్షాల తో కలసి సమరశీల పోరాటాలు చేపట్టడానికి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో తెలుగు రాష్ట్రాలు రెండయ్యాయి. ఆ చరిత్రను చర్విత చరణంగా చెప్పుకోవడం అనవసరం. అయితే ఆ చరిత్రలో కమ్యూనిస్టు పార్టీలు చూపిన అవగాహన, ఆచరణలను విస్మరిస్తే రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ఉద్యమం నేడు ఎదుర్కొంటున్న సవాళ్లను ఎదుర్కో వడం, ఉద్యమాన్ని పురోగమింపజేయడం అసాధ్యం. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షల నుంచి పుట్టుకొచ్చిన ప్రత్యేక రాష్ట్ర డిమాండు పట్ల సానుకూలంగా స్పందించడంలో కమ్యూనిస్టులు, ప్రత్యేకించి సీపీఎం నేతలు పూర్తిగా విఫలమయ్యారు. కొంత తాత్సారం చేసైనా సీపీఐ ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి మద్దతునిచ్చింది. ఏదేమైనా ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ, మరి కొన్ని కమ్యూనిస్టు పార్టీలు ఆ ఉద్యమ నేత కేసీఆర్ నిరంకుశ స్వభావాన్నే చూసి తెలంగాణ సామాన్య ప్రజలు, రైతులు, విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, భిన్న సామాజిక వర్గాలు, కవులు, కళాకారులు, మహిళలు ముక్త కంఠంతో వ్యక్తపరుస్తున్న మనోభావాలను గుర్తించి, గౌరవించి అండదండ లందించడంలో విఫలమయ్యాయి. పుట్టుకతో సంక్రమించిన వ్యాధి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ పరిస్థితిని ‘అంతర్గత వలసవాదం’గా అభివర్ణిం చడం అతిశయోక్తిగా అనిపించవచ్చు. కానీ నీరు, ఉద్యోగాలు, విద్యా ఉపాధి అవకాశాలు తదితర మౌలిక జీవనాధార రంగాల్లోని వివక్షనే గాక, సంస్కృతి కంగా కూడా దశాబ్దాల తరబడి హేళనను ఎదుర్కొన్న ప్రజలు పడ్డ ఆవేదన తక్కువేమీ కాదు. ఈ వివక్షకు, అవహేళనలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాడి ఉండివుంటే పరిస్థితి పూర్తి భిన్నంగా ఉండేది. తెలంగాణలో కమ్యూ నిస్టు ఉద్యమ పునరుజ్జీవనానికి లభించిన గొప్ప అవకాశాన్ని కమ్యూనిస్టులు చేజార్చుకున్నారు. సీపీఎం క్యాడర్లు, దిగువ స్థాయి నేతలు పలువురు ఈ అంశాన్ని గుర్తించినా కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట కేంద్రీకృత నిరంకుశ త్వం వారి చేతులను కట్టేసింది. భాషాప్రయుక్త రాష్ట్రాలనే యాంత్రిక అన్వ యంతో సీపీఎం ఉలిపికట్టెగా మిగలడం విషాదం. మన దేశంలోని జాతుల సమస్య లోతుపాతులకు వెళ్లడాన్ని ఈ వ్యాస పరిధి అనుమతించదు. అయినా ఒక విషయం మాత్రం చెప్పక తప్పదు. అయితే అటూ, లేకపోతే ఇటూ అంటూ ఏదో ఒక కొసకు కొట్టుకుపోకుండా సమతుల్యంతో వ్యవహరించలేకపోవడం అనే వ్యాధి మన కమ్యూనిస్టు పార్టీలకు పుట్టుకతోనే సంక్రమించింది. లెనిన్ రష్యా పరిస్థితులకు చెప్పిన విడిపోయే హక్కుతో సహా జాతుల స్వయం నిర్ణయాధికారాన్ని మన కమ్యూ నిస్టులు ఒక దశలో మక్కీకి మక్కీగా మన దేశంలోనూ అన్వయిం చారు. ఇక ఇటీవలి కాలంలో ప్రభువుని మించిన ప్రభుభక్తిని ప్రదర్శి స్తూ...‘‘మా దేహం ముక్కలైనా సరే, దేశాన్ని ముక్కలు కానివ్వం’’ అనే వైఖరి చేపట్టారు. ఫలితంగా సామ్రాజ్యవాద అనుకూల గుత్తాధిపతుల పాలనలోని వివిధ ప్రాం తాల, భాషల, ఉపజాతుల, జాతుల న్యాయమైన కోర్కెలను సైతం గుర్తించ లేని అంధత్వం ఆవహించింది. నేటికీ రగులుతున్న ఈశాన్య భారతం, కశ్మీర్ మొదలు తమిళనాట హిందీ వ్యతిరేక ఉద్యమం వరకూ వివిధ రాష్ట్రాల్లో వివిధ రూపాల్లో ముందుకొస్తున్న జాతుల సంఘర్షణలన్నిటి మధ్య సమకాలిక సమన్వయాన్ని సాధించగల సృజనాత్మకత చింతన కమ్యూనిస్టు నాయకత్వాలకు కొరవడింది. ఇది సమకాలీన భారత భౌతిక వాస్తవిక పరిస్థితులను, వాటి ప్రాధాన్యాన్ని చిన్నచూపు చూస్తూ... ఎప్పుడు దప్పికైతే అప్పుడు బావి తవ్వడానికి పూనుకునే ప్రాప్తకాలజ్ఞతకు చిరునామాగా మన కమ్యూనిస్టు పార్టీలు మారాయి. సీపీఎం 21వ జాతీయ మహాసభల ముసా యిదా తీర్మానం ఇంత స్పష్టంగా కాకున్నా ఈ విషయాన్ని గుర్తించింది. తెలుగు ఐక్యతలోని భిన్నత్వం రాష్ట్ర విభజన తర్వాతే రెండు ప్రాంతాల మధ్య భౌతిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితుల్లోని భిన్నత్వం వెలుగులోకి వస్తోంది. ‘జాతి’ నిర్వచనంలో భాష ప్రధానాంశం గనుక సీమాంధ్ర, తెలంగాణ ప్రజలను రెండు జాతులనలేం. ఆంధ్రప్రాంతమంతా ప్రత్యక్షంగా ఆంగ్లేయుల పాలన కిందున్నప్పుడు తెలంగాణ నిజాం సంస్థానంలో భాగంగా ఉంది. సీమాంధ్ర లోని ఆంధ్ర తీరప్రాంతంగా కాగా, తెలంగాణ దక్కన్ పీఠభూమి ప్రాంతం. వ్యవసాయాభివృద్ధిలోని భిన్నత్వానికి అది ఒక ముఖ్య కారణం. ప్రపంచ ప్రసిద్ధి చెందిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నేటి తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్య చారిత్రక భూమిక. నాటి పోరాటానికి ఆంధ్ర ప్రాంతం అండదండై నిలిచింది, త్యాగాలు చేసింది. సీమాంధ్రలో ‘సంక్రాంతి’ పెద్ద పండుగైతే, తెలంగాణలో ‘బతుకమ్మ’ గొప్ప పండుగ . ఇరు ప్రాంతాల ప్రజలు మాడ్లాడేది భిన్న మాండలీకాలతో కూడిన తెలుగు భాషే. అయినా ఇటీవలి వరకు తెలంగాణ తెలుగు సినిమాల్లో అవహేళనకు గురైంది. నాకు తెలిసినంతలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సహా ఏ తెలంగాణ నేత విగ్రహమూ సీమాంధ్రలో ఎక్కడా లేదు. కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి తదితర సీమాంధ్ర నేతల విగ్రహాలే కాదు, వారి పేర్లతో పార్కులు సైతం తెలంగాణలో కనిపిస్తాయి. తెలంగాణలోని ఉన్నతోద్యోగాలన్నిటి లోనూ సీమాంధ్రులు సాపేక్షికంగా అధికం. సీమాంధ్రలోని తెలంగాణ ఉద్యోగుల పరిస్థితి అందుకు భిన్నం. బీజేపీ, టీడీపీ ప్రభుత్వాల వ్యతిరేక ఐక్య పోరు అవశ్యం ఒకప్పుడు ఉమ్మడి రాష్ర్టంలో ప్రజా వ్యతిరేక పరిపాలనా ప్రభలను వెలిగించిన చంద్రబాబు తెలుగుదేశం నేటి ఏపీలో అధికారం నెరపుతోంది. రైతు, కార్మిక, ఉద్యోగ వ్యతిరేక ప్రభుత్వంగా అది తన గత ‘ప్రతిష్టను’ నిలబెట్టుకుంటోంది కూడా. ‘‘నేనిచ్చిన లేఖ వల్లనే తెలంగాణ ఏర్పడింది’’ అని అక్కడా, ‘‘అన్యాయంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిందని’’ ఇక్కడా... ఏ రోటికాడ ఆ పాట పాడగల నీతి చంద్రబాబు సొంతం. కాబట్టి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టు పార్టీలు ప్రతిపక్ష వైఎస్సార్సీపీ, కాంగ్రెస్‌లను కలుపుకొని ఐక్య పోరాటాలను సాగించాలి. అంతేగానీ ‘ప్రత్యేక హోదా’ను కోరుతూ అఖిల పక్షాన్ని తీసుకుని చంద్రబాబు ఢిల్లీ వెళ్లాలంటూ ఆయన వెనుక నిలవాల్సిన అగత్యం లేదు. రుణ మాఫీ, ఇంటింటికీ ఉద్యోగం, నిరుద్యోగ భృతి వంటి ఎన్నికల వాగ్దానాల అమలుకై కమ్యూనిస్టు పార్టీలే చొరవచేసి విపక్షాలతో కలసి సమైక్య పోరాటం చేపట్టడమే అత్యుత్తమం. పైగా భూసేకరణ పేరిట బాబు ప్రభుత్వం నిరంకుశంగా రైతుల భూములను హరించి విదేశీ, స్వదేశీ గుత్తపెట్టుబడిదారులకు కట్టబెట్టడానికి పూనుకున్న నేపథ్యంలో అలాంటి ఐక్య, సమరశీల పోరాటాలు సాగించే అవకాశాలు, ఆవశ్యకత స్పష్టంగా కనిపిస్తున్నాయి. సామాజిక, సాంస్కృతిక ఉద్యమాల సమన్వయం తెలంగాణ సామాన్య ప్రజానీకంలో టీఆర్ఎస్, కేసీఆర్‌లను తెలంగాణ రాష్ట్ర సాధకులుగా ఇంకా బలంగానే గుర్తింపుంది. కేసీఆర్‌పై రైతు వ్యతిరేక ముద్రా లేదు, ఆయన పాలనపట్ల అంత పెద్ద వ్యతిరేకతా లేదు. కాబట్టి కమ్యూని స్టులు కేసీఆర్‌ను తక్షణ లక్ష్యంగా చేసుకొని పోరాడగల పరిస్థితి లేదు. కాబట్టి టీఆర్ఎస్ సాధారణ అభిమానులుగా ఉన్నవారు సైతం ఆవశ్యకమైనవిగా భావించే వివిధ సమస్యలపై, రంగాల్లో ఐక్య ఉద్యమాల నిర్మాణానికి తగు రూపాలను ఎంచుకోవాలి. ‘సమైక్య’ వైఖరి వల్ల పార్టీకి, ప్రజలకు మధ్య ఏర్పడ్డ అగడ్తను పూడ్చుకోవడంపై ముందుగా సీపీఎం దృష్టిని కేంద్రీకరిం చాలి. సామాజిక రంగంలో ప్రత్యేకించి వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటా లకు కమ్యూనిస్టులు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. నాటి తెలంగాణ సాయుధ పోరాటం, ఆ తదుపరి విప్లవ కమ్యూనిస్టుల కృషి, ఇటీవలి ప్రత్యేక రాష్ట్ర ఉద్య మాలు తెలంగాణలో సాంస్కృతిక రంగానికి అత్యంత శక్తివంతమైన పోరాట ఆయుధంగా మలచాయి. ఆట, పాటా నేటికీ ప్రజలను కదిలించగలుగు తున్నాయి. కమ్యూనిస్టులు సామాజిక పోరాటాలను సాంస్కృతిక పోరాటాల తో సమన్వయించి, వర్గపోరాటాలకు జోడించాలి. ముందుగా ప్రజలను వారు తమ వైపు తిప్పుకోవాలి. తెలంగాణలో సుదీర్ఘకాలంగా కమ్యూని స్టులకున్న పలుకుబడి అందుకు తోడ్పడుతుంది. ఈ అంశాన్ని తెలంగాణ సీపీఎం రాష్ట్ర కమిటీ గుర్తించినట్టే కనిపిస్తోంది. ఇటీవల అది ‘‘ప్రైవేటు రం గంలో కూడా రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేయాలి’’ అనే నినాదం చేపట్టిం ది. అది బలమైన ఐక్య ఉద్యమ నిర్మాణం దిశగా వేస్తున్న ముందడుగనే భావించాలి. అయితే గతంలో మండల్ కమిషన్ సిఫారసుల నేపథ్యంలో పాలకవర్గాలు అగ్రవర్ణాల భావోద్వేగాలను రెచ్చగొట్టిన అనుభవం నుంచి గుణపాఠాలను తీసుకోవాలి. ప్రైవేటు రిజర్వేషన ్లలో అగ్రవర్ణాల, కులాల పేదలకు 5 శాతం రిజర్వేషన్ల కల్పన వంటి పద్ధతులను రూపొందిం చుకోవాలి. ఏది ఏమైనా కమ్యూనిస్టు ఉద్యమ ఐక్యతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వామపక్ష రాజకీయాల పునర్వైభవానికి ముందు షరతని విస్మరించలేం. రెండు రాష్ట్రాల భిన్న భౌతిక వాస్తవికతలకు అనుగుణంగానే కమ్యూనిస్టులు ఎత్తుగడలను రూపొందించుకుని ముందుకు సాగాల్సి ఉంది. రెండు రాష్ట్రాలకు ‘ఇద్దరు చంద్రులు’ ముఖ్యమంత్రులంటూ మీడియా అంటోంది. కానీ ఆ ఇద్దరు చంద్రులలో తిథులననుసరించి వచ్చే ‘కళా కాంతులు’, ‘కాంతి విహీనతల’ను విస్మరించ రాదు. ఈ అసిధారావ్రతంలో ప్రజలతో మమేకమై కమ్యూనిస్టులు విజయం సాధిస్తారని ఆశిద్దాం! (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు 98480 69720) -
పోలవరం రికార్డులు పోయాయంటే కుదరదు
విశ్లేషణ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సెక్షన్ 4(1) బి కింద సొంతంగా పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ ఈ పాటికే స్వయంగా అధికారిక వెబ్సైట్లో ఉంచాల్సింది. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వ రికార్డులు దొరకకపోవడం తీవ్రమైన వైఫల్యం. అధికారిక ఫైళ్లు పోవడానికి వీల్లేదు. ఫైళ్లు దొరకడం లేదు, పోయా యి, అనేకచోట్ల చెల్లాచెదు రుగా ఉన్నాయి. కార్యాలయ విభజన వల్ల ఇవ్వలేకపోతు న్నాం. మనకు తరచూ వినిపిం చే సాకులు ఇవి. ఇవేవీ ఆర్టీఐ చట్టం అంగీకరించిన మినహా యింపులు కాదు. ప్రభుత్వ రి కార్డులు దొరకకపోవడం తీవ్ర మైన వైఫల్యం. ఫైళ్లు పోవడానికి వీల్లేదు. పాలన, పాల సీ నిర్ణయాల దస్తావేజులు లేకుండా పోతే, దాచకపోతే అది తీవ్రమైన అసమర్థత. సుపాలన సంగతేమో గాని, పాలనే ఉండదు. ఇది నిష్పాలన కాదు, దుష్పాలన. పోలవరం జాతీయ ప్రాజెక్టు వివరాలు అడిగిన డి. సురేశ్ కుమార్ హైదరాబాద్ నుంచి వీడియో ద్వారా విచారణలో పాల్గొన్నారు, పర్యావరణ మంత్రిత్వశాఖ సమాచార అధికారి డాక్టర్ పీవీ సుబ్బారావు (పర్యా వరణ శాస్త్రవేత్త) తెలుగు వారు. నేనూ, నా పీఏ కూడా తెలుగువారం కావడంతో ఈ కేసు విచారణను జాతీయ సమాచార కమిషన్‌లో తొలిసారి తెలుగులో జరిపే అవ కాశం కలిగింది. కీలక పత్రాలు, ప్రశ్నలు, సమాధానాలు అన్నీ ఆంగ్లంలో ఉన్నా, అనేక వివరాలు, వాదాలు ప్రతి వాదాలు తెలుగులో సాగాయి. కనుక ఇంగ్లిష్ తీర్పుతో పాటు తెలుగులో కూడా తీర్పు ఇద్దామనుకున్నాం. (సీఐసీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ అధికారిక వెబ్ సైట్) ఆంగ్లంతో పాటు హిందీ, ప్రాంతీయ భాషల్లోనూ విచా రణ జరిగే వీలుంటే భాష రాని కారణంగా తెలుసు కోలేకపోయే పరిస్థితి ఎవరికీ రాదు. పరాయి భాషలోని చట్టాలు, హక్కులు అమలు కాని పరిస్థితిని ఏ విధంగా తొలగించాలి? డి. సురేశ్ కుమార్ 1994 నుంచి ఇప్పటివరకు పోల వరం వివరాలు అడుగుతున్నారనీ, కొన్ని పాత దస్తా వేజులు వెతకవలసి ఉందని, ఇవ్వలేమని, ప్రభావ అంచనా విభాగం వారు ఎన్నో ైఫైళ్లు ఇస్తే తప్ప పూర్తి సమాచారం లభించదని, తమ డివిజన్ జోర్‌బాగ్ నుం చి సీజీఓ కాంప్లెక్సుకు మారడం వల్ల చాలా దస్తావేజులు చెల్లాచెదురయ్యాయని సీఐఓ చెప్పారు. ఆ సాకులెన్ని ఉన్నా మొత్తం సమాచారం ఏడు రోజుల్లో ఇవ్వాల్సిందే నని మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పరిశోధన, సర్వే కోసం షరతులతో కూడిన అనుమతిని అదనపు సంచాలకులు డాక్టర్ భౌమిక్ సెప్టెంబర్ 19, 2005 నాటి లేఖను మాత్రమే ఇచ్చారు. పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పుగోదావరి విశాఖ పట్టణం జిల్లాలలోని ఎత్తు ప్రాంతాలలో 7.20 లక్షల ఎక రాల భూమికి సాగునీటిని అందించేందుకు 21 క్యూ మెక్స్ మంచినీటిని సరఫరా చేసేందుకు, 960 మెగా వాట్ల జలవిద్యుచ్ఛక్తి ఉత్పాదనకు, ఇతర పారిశ్రామిక అవసరాలకు ప్రతిరోజూ 1.80 గీ 10 క్యూమెక్స్ జలం పంపిణీ చేయడానికి పోలవరం గ్రామంలో ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 42 కి.మీ. ఎగువన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనివల్ల 276 గ్రామాలలో లక్షా 17 వేల 34 మంది ఆదిమవాసులు నిర్వాసితులవుతారు. ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చి మగోదావరి జిల్లాల్లోని ఏడు మండలాల్లో, ఛత్తీస్‌గఢ్ లోని 13 గ్రామాల్లో, ఒడిశాలోని 13 గ్రామాల్లో, 38 వేల 186 హెక్టార్ల భూమి మునిగిపోతుంది. రాష్ర్ట ప్రతిపాద నలు, ప్రాజెక్టు స్థల నివేదిక పరిశీలించిన తరువాత కొన్ని షరతులతో సర్వేకు అనుమతి ఇచ్చినట్టు భౌమిక్ పేర్కొ న్నారు. పంటల వ్యవస్థ, పర్యావరణ అధ్యయనం, కమాండ్ ఏరియా అభివృద్ధి, నీటి నిలువ సమస్య, పున రావాసం, భూకంప ప్రమాదం, ప్రమాద నిర్వహణ ప్రణాళిక, మౌలిక వనరుల నిర్మాణం, రోడ్లు, క్వారీల నిర్మాణం మొదలైన వివరాలతో కూడిన సమగ్రమైన పర్యావరణ ప్రభావ నివేదికను ఈ లేఖ అందిన 18 నెలల్లో ఇవ్వాలని తొలి షరతు. ప్రజా విచారణలో వచ్చి న సూచనలను జత చేయాలి. సమగ్రమైన పర్యావరణ ప్రభావ నివేదికను తయారు చేసేందుకు నిర్దిష్ట స్థలంలో సర్వే పరిశోధనల కోసం మాత్రమే ఈ అనుమతి అని గమనించాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ అనుమతిని పర్యా వరణ అనుమతిగా పరిగణించడానికి వీల్లేదని, అను మతి వస్త్తుందని అంచనా వేసి శాశ్వత నిర్మాణాలేవీ చేప ట్టరాదనీ స్పష్టంగా పేర్కొన్నారు. పర్యావరణ వివరా లన్నీ పొందుపరచి ప్రణాళికలు రూపొందిన తరువాత పర్యావరణ అనుమతిని కోరాలి. అటవీ భూములను సేకరించడానికి అటవీ మంత్రిత్వ శాఖ అనుమతిని ప్రత్యేకంగా తీసుకోవాలి. ప్రాజెక్టు ఆర్థిక స్తోమతను, ప్రయోజనాన్ని అంచనా వేయడానికి వీలుగా పర్యావ రణ సంబంధమైన నిధి అవసరాలను బడ్జెట్‌ను కూడా సమర్పించాలి. పరిశోధన దశలోనే మంత్రిత్వ శాఖ అవసరమైతే పర్యావరణ రక్షణకు సంబంధించి అదనపు చర్యలను సూచించే హక్కు కలిగి ఉంటుందని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సెక్షన్ 4(1) బి కింద సొంతంగా పర్యావ రణ అటవీ మంత్రిత్వ శాఖ ఈ పాటికే స్వయంగా అధి కారిక వెబ్సైట్లో ఉంచాల్సింది. తొలి సర్వే అనుమతి, పదేళ్ల తరువాత పునఃపరిశీలన కాగితాలను, మిని ట్స్‌ను, కేంద్ర ప్రభుత్వం ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాసిన ఉత్తరాలు, ఆ రాష్ట్రాలు ఇచ్చిన ప్రత్యు త్తరాల ప్రతులను నెలరోజుల్లో ఇవ్వాలని పర్యావరణ మంత్రిత్వ శాఖను సీఐసీగా ఈ రచయిత ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. (డి. సురేశ్ కుమార్ వర్సెస్ పర్యావరణ మంత్రిత్వశాఖ కేసులో సీఐసీ తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
అధోగతిలో ఉన్నత విద్య
విశ్లేషణ యూనివర్సిటీలు తమ అధ్యాపకులను డిగ్రీ కళాశాలల్లో బోధించకుండా నిరోధించి మేధోపరమైన పోషకాహార లోపాన్ని పెంపొందింపజేస్తున్నాయి. వృత్తి విద్యా సంస్థలకు లెసైన్సులను జారీ చేసే సంస్థలను నిషేధించి, వాటిని తిరిగి విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి. వృత్తి విద్యలో ప్రత్యేకీకరణకు ప్రాధాన్యం ఇస్తూనే సమగ్ర బోధనాంశాలను చేర్చడం ద్వారా వివిధ రంగాల మధ్య జ్ఞాన వారధులను నిర్మించగలం. ఐటీఐలు, పాలిటెక్నిక్‌లకు తగు గుర్తింపునిచ్చి, వర్సిటీల పరిధిలోకి తేవాలి. కలకత్తా, అలహాబాద్ విశ్వవిద్యాలయాలు ఒకప్పుడు నోబెల్ బహుమతి గ్రహీతలను, ప్రధాన మంత్రులను అందించాయి. ప్రపంచ విశ్వవిద్యాల యాల ర్యాంకింగ్స్‌లో నేడు వాటి స్థానం 400కు పైగానే! బ్రిక్స్ దేశాల్లోని 20 అగ్రశ్రేణి వర్సిటీల్లో ఒక్కటి కూడా మనది లేదు. మన విశ్వవిద్యాలయాలు అతి వేగంగా ‘‘మునిసిపల్ ఉన్నత విద్యాలయాలు’’గా దిగజారిపోతున్నా యి. ప్రవేశాలకు, డిగ్రీలకు భారీగా కేపిటేషన్ ఫీజులను వసూలు చేస్తున్న అధిక భాగం ప్రైవేటు విద్యా సంస్థల పరిస్థితీ అదే. ఆలోచన, సృజనాత్మకత, పరిశోధన, నవకల్పనల ప్రాధాన్యాన్ని తగ్గించడం ద్వారా ఈ వ్యవస్థ మేధో పరమైన పిరికితనాన్ని ప్రోత్సహిస్తోంది. భారత విశ్వవిద్యాలయ వ్యవస్థ విఫలమైంది. ఫలితంగా తరాలు గడిచేకొద్దీ ప్రమాణాలు దిగజారుతు న్నాయి. మన ఇంజనీరింగ్ పట్టభద్రుల్లో 19%, ఇతర పట్టభద్రుల్లో 5% మాత్రమే ఉద్యోగ నియామకాలకు అర్హులు. దేశవ్యాప్తంగా 5,000కు పైగా కళాశాలలు, 200కుపైగా యూనివర్సిటీలు ఉన్నాయి. వాటికి, వాటిని నియం త్రించే సంస్థలకు మధ్య ఆచరణలో పోషకులకు, సేవలందించే వారికి మధ్య ఉండే సంబంధం నెలకొంది. సంస్థాగతమైన క్షీణత మన విశ్వవిద్యాలయాలన్నీ అనిశ్చితిమయమైన మానవ వనరుల శాఖ నియంత్రణలో ఉన్నాయి. 2013లో ప్రవేశపెట్టిన ‘రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభి యాన్’ (ఆర్యూఎస్ఏ) పథకం వికేంద్రీకరణకు ఉద్దేశించినదే గానీ, అమ లులో అది వెనుకబడి ఉంది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేటికీ కొన్ని వందల వర్సిటీలను, వేల కళాశాలలను పర్యవేక్షిస్తోంది. ఇది నిజాయితీ, సృజనాత్మకతల గొంతు నులిమేస్తోంది. చైనాలోని ఉన్నత విద్యా విధానమే మనకంటే మరింత ఎక్కువ ప్రజాస్వామికమైనదనిపిస్తుంది. మొత్తంగా మన విశ్వవిద్యాలయ వ్యవస్థ్థను విప్లవాత్మకంగా, మౌలికంగా పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది. యూనివర్సిటీ పరిమాణంపై (అనుబంధ కళా శాలలు సహా) గరిష్ట పరిమితి ఉండాలి. ఆరోగ్యకరమైన వ్యవస్థల ద్వారా జవాబుదారీతనాన్ని అమలుచేయాలి. వర్సిటీ పరిపాలనను పూర్తి స్వయం ప్రతిపత్తితో, ఆర్థిక సహాయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అకడమిక్ పరిధిలోనే ఉంచాలి. మానవ వనరుల శాఖ, యూజీసీలు... ఐఐటీ ఐఐఐఎమ్ల డెరైక్టర్లు, వైస్‌ఛాన్స్‌లర్ల ఎంపికకు దూరంగా ఉండి, విధాన రూపకల్పనపై దృష్టిని కేంద్రీకరించడం మంచిది. కృత్రిమ విభజన స్వాతంత్య్రానంతరం భారత యూనివర్సిటీల వ్యవస్థను విభజించారు. విశ్వ విద్యాలయాలను బోధనకే పరిమితం చేసి, పరిశోధన కోసం వేరే సంస్థలను ఏర్పాటు చేశారు. డిగ్రీ చదువుల వరకు ‘దిగువస్థాయి’ విద్యగా మిగిలిపో యింది. ఇక వృత్తి విద్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. సాంకేతిక కోర్సులను సంకుచితమైన, ఒకే దిశ మార్గానికి పరిమితం చేశారు. ఇది భారీగా సామా జిక, సాంస్కృతిక నష్టాన్ని కలిగించింది. ఇంజనీరింగ్ విద్యార్థులకు సమగ్ర విద్య కొరవడగా, వైద్య కళాశాలలు ఏకాకులుగా వృద్ధి చెందాయి. ప్రత్యేకీకర ణను లోతుగా విస్తరింపచేయాలనే లక్ష్యంతో కొన్ని రంగాలకు విడిగా విశ్వ విద్యాలయాల ఏర్పాటుకు ఇచ్చిన అవకాశంతో అనావశ్యకమైన క్యాటరింగ్, యోగ వ ర్సిటీలు సైతం పుట్టుకొచ్చాయి. బోధనా కార్యక్రమాల్లో లేదా వృత్తి కోర్సుల శాఖల రూపకల్పనలో వర్సిటీల మాటకు విలువే ఇవ్వడం లేదు. మన గ్రేడింగ్‌ల వ్యవస్థ సైతం అయోమయమే. మూల్యాంకన ం కొల బద్ధల్లో చాలా తేడాలుండి ఒకే డిగ్రీకి రెండు నుంచి ఆరు డివిజన్ల పద్ధతులు అమల్లో ఉన్నాయి. మధురై కామరాజ్ యూనివర్సిటీ మాస్టర్ డిగ్రీ స్థాయిలో ప్రథమ, ద్వితీయ శ్రేణులను మాత్రమే ఇస్తుంటే, గుజరాత్, ఉస్మానియా వర్సి టీలు మూడు డివిజన్లను అమలు చేస్తున్నాయి. గురు గోబింద్ సింగ్ ఇంద్ర ప్రస్థ వర్సిటీ మూడు విడివిడి ప్రథమ శ్రేణులు సహా ఐదు డివిజన్ల పథకాన్ని అమలు చేస్తోంది. ఇక కాలం చెల్లిన పరీక్షల విధానం చూడటానికి విద్యార్థి శక్తి సామర్థ్యాలను సర్టిఫై చేస్తున్నట్టుంటుంది. కానీ విద్యార్థికి, ఉద్యోగ అవసరా లకనుగుణంగా మలచుకునే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కల్పించడం లేదు. సీనియర్ వర్సిటీ అధ్యాపకులను డిగ్రీ కళాశాలల్లో బోధించకుండా నిరోధిం చడం ద్వారా మన విశ్వవిద్యాలయాల వ్యవస్థ మేధోపరమైన పోషకాహార లోపాన్ని పెంపొందింపజేస్తోంది. వర్సిటీల అత్యుత్తమ బోధనా సిబ్బంది సేవలను అందించడం ద్వారా కళాశాలలతో వర్సిటీ అనుబంధాన్ని పెంపొం దింపజేయాలి. ప్రత్యేకీకరణకు ప్రాధాన్యం ఇస్తూనే సమగ్ర బోధనాంశాలను కూడా చేర్చడం ద్వారా వృత్తి విద్యలోని వివిధ రంగాల మధ్య జ్ఞాన వారధు లను నిర్మించగలం. వృత్తి విద్యా సంస్థలకు లెసైన్సులను జారీ చేసే మధ్యస్థ సంస్థలను నిషేధించి, ఆ సంస్థలన్నిటినీ విద్యాసంబంధ విషయాల్లోనూ, పరిపాలనాపరంగానూ కూడా తిరిగి విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి. పారిశ్రామిక శిక్షణా సంస్థలకు, పాలిటెక్నిక్‌లను కూడా వర్సిటీల పరిధిలోకి తేవాలి. అప్పుడే సుదీర్ఘంగా నిర్లక్ష్యం చేస్తున్న సామాజిక న్యాయం, అసమా నతల వంటి సమస్యలను పరిష్కరించగలుగుతాం. బోధనాపరమైన నాణ్యత టీచర్ల విద్యలో వర్సిటీల ప్రమేయం కేవలం బీఈడీ డిగ్రీ కార్యక్రమానికే అంటే సెకండరీ పాఠశాలలకు మాత్రమే పరిమితమైంది. పాఠశాల పూర్వ, ప్రాథమిక స్థాయి విద్యలను దాన్నుంచి మినహాయించారు. కీలక స్థానాల నియామకాలు అరుదుగా మాత్రమే ప్రతిభ ఆధారంగా జరుగుతుంటాయి. సర్వీసు కాలాన్నిబట్టి ప్రమోషన్లు వచ్చేస్తుంటాయి, ప్రభుత్వోద్యోగులతో ముడిపడ్డ సాధారణ వేతన పద్ధతి ఉంటుంది. ఇవన్నిటినీ నిరంకుశాధికారి లాంటి పే కమిషన్ నిర్ణయిస్తుంది. యూజీసీ విద్యార్హతలకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటంతో, వర్సిటీ అధ్యాపకులు ప్రమోషన్ల వేటలో ప్రమాణాలు తక్కువైనా ఎలాగోలా పీహెచ్‌డీలు సంపాదించుకోవాలని ఆరాటపడు తున్నారు. అందుకే మన విద్యావేత్తలు అత్యధిక విద్యార్హతలున్నా అత్యంత అనుత్పాతదకమైన ‘దొరబాబులు’గా ఉంటున్నారు. ఉన్నత విద్యావ్యవస్థలోని ఉపాధ్యాయ విద్య నాణ్యతను పెంపొందింప జేయాలి. బోధనా సిబ్బంది కళాశాలలను ప్రోత్సహించి, కొత్త ఉపాధ్యా యుల కోసం అవి పూర్తిస్థాయి శిక్షణ కోర్సులను రూపొందించేలా ప్రోత్స హించాలి. ప్రతిభకు పట్టంగట్టే మెరిటోక్రసీని ప్రోత్సహించడం కోసం విద్యా సంబంధమైన ఉత్పాదకతతో వేతనాలను, ఉద్యోగ కాలాన్ని విస్పష్టంగా వ్యవ స్థీకృతం చెయ్యాలి. పరిశోధనలకు నిధులు, గ్రాంట్లకు సంబంధించిన విధాన పరమైన చట్రాన్ని గణనీయంగా మార్చాలి. బోధనా సిబ్బంది నియామ కాలు, సమీక్షా వ్యవస్థ... పరిశోధనా ఫలితాలను వాటి నాణ్యతను తగు రీతిలో అంచనా వేయడంలో విఫలమౌతోంది. కాబట్టి బోధనా సిబ్బంది పరిశోధనకు, ప్రచురణలకు ప్రోత్సాహకాలను అందించడం అవసరం. ‘విద్యాసంబంధమైన పని’ కొలమానం ప్రాతిపదికపై పరిశోధన ను పాయింట్ల పద్ధతిలో లెక్కగట్టడాన్ని యూజీసీ ఇటీవల ప్రవేశపెట్టింది. పరిశోధనలకు అవి ప్రచురితమైన పత్రికల ర్యాంకింగ్‌లను బట్టి పాయింట్లు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయమేమంటే ఈ పత్రికల ర్యాంకింగ్‌ల ప్రాతిపదిక ‘‘శాన్ ఫ్రాన్సిస్కో డిక్లరేషన్ ఆన్ రీసెర్చ్ అసెస్మెంట్’’ పూర్తిగా తప్పని, దాన్ని వెం టనే ఎత్తేయాలని సూచించింది. పరిశోధనను దానికి దానిగానే అంచనా కట్టాలే తప్ప దాన్ని ప్రచురించిన పత్రికల ఆధారంగా లెక్కగట్టడ ం అందుకు ప్రత్యామ్నాయం కాజాలదని దుయ్యబట్టింది. కాబట్టి యూజీసీ భారతీయ ప్రచురణల కంటే ‘‘విదేశీ ప్రచురణ’’లకు, జాతీయ కాన్ఫరెన్స్లకంటే ‘‘అంతర్జాతీయ కాన్ఫరెన్స్’’లకు ప్రాధాన్యం ఇచ్చే పద్ధతికి స్వస్తి చెప్పాలి. పునరుజ్జీవం ప్రపంచ స్థాయి వర్సిటీలను రాత్రికి రాత్రే సృష్టించలేం. వాటికి విశ్వసనీయత గల బోధనా సిబ్బంది, అద్భుతమైన పరిపాలనావేత్తలు, మద్దతు సిబ్బంది అవసరం. అంతేకాదు, అవి పరిశోధనకు, విద్యకు మధ్య సున్నితమైన సంతులనాన్ని నెలకొల్పాల్సి ఉంటుంది. రష్యానే ఉదాహరణగా చూద్దాం (ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 వర్సిటీల్లో 7 అక్కడున్నాయి). అది దేశంలోని ఉత్తమ వర్సిటీలను ఎంపిక చేసి, అందులోంచి ప్రపంచంలోని అగ్రశ్రేణి 100 జాబితాలో చేరేలా వాటిని అభివృద్ధి చేయడానికి పథకాన్ని చేపట్టింది. అంతర్జాతీయ నమూనాలను, పద్ధతులను ఉపయోగించి ఆ వర్సిటీలను లోతుగా పునర్నిర్మించింది. మనం కూడా దేశంలోని 50 అగ్రశ్రేణి వర్సిటీలను ఎంపిక చేసి, ప్రపంచ స్థాయికి చేరేలా వాటికి స్పష్టమైన అధికారాలు, నిధులు, వనరులను సమకూర్చాలి. అయితే సర్వోత్కృష్టత రోజువారీ మస్తర్లో సంతకం చేయడంతో సమకూరేది కాదు. ఉపాధ్యాయులను, అధ్యా పకులను జాగ్రత్తగా అందుకోసం తర్ఫీదుచేసి, అభివృద్ధిపరచడం అవసరం. అలా చేస్తే వ్యవస్థగా ఆ సర్వోత్కృష్ట స్థానాన్ని చేరలేకపోయినా మన విద్యా ర్థులు అలాంటి శిఖరాలను అందుకోగలుగుతారు. (వ్యాసకర్త కేంద్ర మంత్రి మనేకా గాంధీ కుమారుడు, బీజేపీ నేత) email: fvg001@gmail.com -
జీవితాలను మార్చేది పుస్తకమే
వేయేళ్ల కిందటే అందరికీ తెలుసుకునే హక్కు ఉందని చెప్పిన సంస్కర్త ఈ సువిశాల భారతదేశమంతా నడిచి హిందూ మతాన్ని సంస్కరించి ఉద్ధరించిన జగద్గురువు రామానుజుడు. అవినీతి మీద పోరాటానికి నడుం కట్టిన పౌర సైనికుడే, కాని ఒక దశలో ప్రాణాలు తీసుకునేంత నిరాశకు లోనై నాడు. ఢిల్లీ రైల్వేస్టేషన్ దుకా ణంలో వేలాడుతున్న పుస్తకం అట్టమీది బొమ్మ ఆయనను అటు మళ్లించింది. చదివితే బతికి పోరాడాలనే ఉత్తేజం దొరికింది. నిరాశను జయించిన ఆ సైనికుడు అన్నా హజారే. అట్టమీది బొమ్మగా ప్రేరణనిచ్చింది స్వామీ వివేకానంద. స్వార్థం, ఆశ లేకుండా సలహా ఇచ్చి, చదివితే చాలు మార్గం చూపేది పుస్తకం. చట్టంతో సంబంధం లేకుండా విద్యావంతుడిని చేసేదీ, హక్కులతో నిమిత్తం లేకుండా సమాచారం ఇచ్చేదీ పుస్తకం. పుస్తకాలు కేవ లం గ్రంథాలయాలకూ, రీడింగ్ రూమ్లకూ పరిమితం కారాదు. ఎంతకూ రాని రైళ్ల కోసం బస్సుల కోసం ఎదురుచూసే స్టేషన్లలో పత్రికలు మ్యాగజైన్లే కాదు, మంచి పుస్తకాలు కూడా ఉండాలి. జనం కొని చదవాలి. గొప్ప రచనలను ప్రత్యేకంగా పెద్ద అక్షరాలలో, తక్కువ పేజీలలో సంక్షిప్త పరిచయాలతో ప్రయాణపు పుస్తకాల రూపంలో అందుబాటులోకి తేవాలి. పాతతరం కథా నాయకుడు చిత్తూరు వి.నాగయ్య నటించిన త్యాగయ్య, వేమన, పోతన సినిమాలు చూసి ఒక బాలుడు చలించి ముమ్మిడివరం బాలయోగిగా చరిత్రలో నిలిచి పోయాడు. చిన్నప్పుడు ఒక వక్తృత్వ పోటీలో మొదటి స్థానంలో నిలిచినందుకు ‘సిద్ధపురుషులు’ అనే చిన్న పుస్తకం బహుమతిగా ఇచ్చారు. అందులోని పది పన్నెం డు కథలతో ఒక జీవిత చిత్రం రామానుజుడిది. ముక్తిని సాధించే మూల మంత్రం నేర్చుకోవడం కోసం ఎంతో దూరాన ఉన్న ఒక గురువుగారి ఆశ్రమానికి ఓపికతో, పట్టువదలకుండా 18 సార్లు ప్రయాణం చేస్తాడాయన. ప్రతిసారీ ఏదో ఒక సాకుతో మంత్రం నేర్పడాన్ని వాయిదా వేస్తుంటాడా గురువుగారు. చివరకు ఈయన పట్టుదలకు మెచ్చి అష్ఠాక్షరీ మంత్రం ఉపదేశిస్తూ, ‘ఇది రహస్యం ఎవరికీ చెప్పకు, చెబితే నరకానికి పోతావు!’ అని హెచ్చరిస్తాడు. రహస్యంగా ఉంచుతానని ప్రమా ణం కూడా చేయిస్తాడు. కాని వెంటనే రామానుజుడు అక్కడే గుడి దగ్గర గుమికూడిన వందలాది మంది జనా న్ని పిలిచి గుడిగోపురం ఎక్కి గొంతెత్తి అరుస్తూ అష్ఠా క్షరీ మంత్రాన్ని ఉపదేశిస్తాడు. తరతమ కులమత బేధం లేకుండా అందరికీ చెప్పిన రామానుజుడు గురువు ముందు నిలబడ్డాడు. ‘వాగ్దానభంగ పాపానికి నరకా నికి పోతావా?’ అన్నాడు కోపంగా. ‘నేనొక్కడిని ఏమైతే నేం? ఇంతమందికి ముక్తి మార్గం దొరికి బాగుప డితే..!’ అన్నాడు. ఆత్మ ఉద్ధరణ గొప్పదే. కాని జనులం దరినీ ఉద్ధరించే మార్గం అందరికీ చెప్పడం అంతకన్న గొప్పదనే గొప్ప ఆలోచన గురించి తెలిసి గురువు ఆశ్చ ర్యపోతాడు. రామానుజుడు తన గురువుకే గురువై నాడు. జగద్గురువైనాడు. వేయేళ్ల కిందటే అందరికీ తెలుసుకునే హక్కు ఉందని చెప్పిన సంస్కర్త ఈ సువి శాల భారతదేశమంతా నడిచి హిందూ మతాన్ని సం స్కరించి ఉద్ధరించిన జగద్గురువు రామానుజుడు (ఏప్రిల్ 24న రామానుజుని 998వ జయంతి). ఇది నన్ను కదిలించిన కథ. ఇప్పుడు సమాచారం ఇప్పించే బాధ్యత వైపు నడిపిన కథ. నా యోచనలకు, రచన లకు స్ఫూర్తినిచ్చిన పుస్తకంలోనిది. నాకు పది పదకొండేళ్ల వయసులో మా నాన్న ఎం ఎస్ ఆచార్య (‘జనధర్మ’ సంపాదకుడు) ఇంటికి గ్యాలీ ప్రూఫులు తెచ్చేవారు. అరడజను తడి న్యూస్‌ప్రింట్ కాగితాల మీద అచ్చు వేసిన గ్యాలీ ప్రూఫ్‌లు తేవడం, అమ్మ ఇచ్చిన చాయ్ తాగే లోగా అవి ఆరడం, ఆ తర వాత వాటిని దిద్దడం నా చిన్న తనంలో నేను పదే పదే చూసిన సంఘటనలు. నాన్నకు తెలియకుండా ఆ ప్రూఫులు చూసిన నాకు తెలుగు అక్షరాలు అంత అం దంగా, వరసగా, పొందికగా కుదరడం ఆశ్చర్యం కలి గించేది. ఆ అక్షరాలు నన్ను లెటర్ ప్రెస్ లోకి, రచనలోకి నడిపించాయి. మనకు వాడుకలో ఉన్న తెలుగు అక్ష రాలు యాభైనాలుగే అయినా ‘జనధర్మ’ ప్రెస్‌లో 360 గళ్లలో అచ్చు అక్షరాలను నేర్చుకున్నాను. ఆ అక్షరాల కూర్పు నాకు కొత్త చదువు నేర్పింది. రచయితగా పెంచింది. హైదరాబాద్‌లోని లా స్కూల్లో నేర శిక్షా శాసనాల క్లాస్ తీసుకునే వాడిని. అందులో ఒక పాఠం ఆత్మ హత్యా ప్రయత్న నేరం గురించి. తాత్కాలిక సమస్యకు శాశ్వత పరిష్కారం అన్న బీవీ పట్టాభిరాంగారి నిర్వచనం ఉదాహరణలతో వివరించే వాడిని. తన ప్రేమను ఓ అమ్మాయి అంగీకరించలేదనే తాత్కాలిక సమస్యకు హుస్సేన్‌సాగర్‌లో పడి చావడం అనే శాశ్వత పరిష్కా రం సరైనదా? ఆమె మనసు మారి ఐ లవ్యూ చెప్పడా నికి వస్తే అందుకోవడానికి ఈ ప్రేమికుడు బతికి ఉం డడం సరైనదా అని కదా ఆలోచించాలి. కొన్ని నెలల తరువాత ఒక సంఘటన జరిగింది. నా విద్యార్థిని ఒకరు ఏవో సమస్యలవల్ల కొన్ని నిద్రమాత్రలు మిం గింది. మత్త్తు కమ్మే ముందు ఆమె నాకు ఫోన్ చేయ గలిగింది. చేతిలో ఉన్న ఇంకొన్ని మాత్రలు ముందు పారేయమని చెప్పాను. పారేసింది. అడ్రసు తెలుసు కుని వెళ్లాను. ప్రాణం దక్కింది. సంక్షోభ సమయంలో ఆమెకు నేనూ, నా పాఠం గుర్తుకు రావడం ఆశ్చర్యక రం. ఆ పాఠంలో అర్థమైన జ్ఞానం ఆమెను బతికిం చింది. అవిద్యే మరణం, విద్యే ప్రాణం. మనను ఏ అక్ష రం కదిలిస్తుందో, ఏ వాక్యం రగిలిస్తుందో, ఏ గ్రంథం ప్రేరేపిస్తుందో.. కనుక చదువు అందరికీ చెందాల్సిందే. (ఏప్రిల్ 23 ప్రపంచ పుస్తక దినోత్సవం నాడు కేంద్ర సాహిత్య అకాడమీలో ఇచ్చిన ప్రసంగం ఆధారంగా) మాడభూషి శ్రీధర్ (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
స్వపక్ష సీఎంలతోనే శిరోభారం
విశ్లేషణ బీజేపీ సీఎంల ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లడం ద్వారా ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే తప్పిదం చేస్తున్నారు. తన జనరంజక నాయకత్వాన్ని ప్రదర్శించుకోవడమే ఆయన ఉద్దేశం. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రతి తప్పిదం మోదీ మెడకే చుట్టుకుంటోంది. ‘మంచి ప్రధాని కసాయివాడిగా ఉండాల’ని బ్రిటిష్ పూర్వ ప్రధాని మెక్‌మిలన్ చెప్పేవారు. అసమర్థ మంత్రులను తొలగించాలని దీని అర్థం. ప్రధాని మోదీ ఇప్పుడు ఈ పని ప్రారంభించకపోతే స్వపక్ష సీఎంలు, మంత్రులే ఆయన్ని వచ్చే ఎన్నికల్లో కిందికి లాగటం తప్పదు. ప్రపంచంలో ఓటమి అన్నదే ఎరుగని బలశాలి అచిల్లెస్ గురించి ప్రాచీన గ్రీకు గాథలు మనకు తెలియబర్చాయి. కానీ ఇంత బలాఢ్యుడికీ ఒక బలహీ నత ఉండేది. అతడి పాదమే ఆ బలహీనత. చరిత్రలో ఇది అచిల్లెస్ పాదంగా పేరొందింది. ఆ పాదంలోకి బాణం సంధించడం ద్వారా శత్రువులు అతడిని ఎట్టకేలకు చంపేశారు. మన దేశం విషయానికి వస్తే, నరేంద్రమోదీ, బీజేపీ 2019 సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే పథక రచనలో మునిగి తేలుతుం డగా బీజేపీ పాలిత రాష్ట్రాలు వారి అచిల్లెస్ పాదంగా తయారవుతున్నాయి. ఇంతవరకు ఉనికిలేని రాష్ట్రాల్లో అధికారం గెల్చుకోవడం ప్రస్తుతం బీజేపీ వ్యూహం. ఇదొక అద్భుత వ్యూహమే. కేరళ నుంచి తమిళనాడు వరకు అటునుంచి అస్సాం వరకు కూడా బీజేపీ ఈ విషయమై బాగానే పని చేస్తున్నట్లు కనిపిస్తోంది. అదే సమయంలో, 2014 ఎన్నికల్లో అద్భుత విజ యాలు సాధించిన రాష్ట్రాల్లో బీజేపీ అధికారాన్ని, మద్దతును కూడా నిలుపు కోవాలి. అసాధారణ విజయాలను అందించిన ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే బీజేపీ ప్రజాదరణను కోల్పోతుండటం గమనార్హం. వీలైనన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పర్చాలన్నది బీజేపీ అభిమతం. కానీ రాష్ట్రాలను గెల్చుకోవడమనేది రెండంచుల కత్తిలాంటిది. ఒక రాష్ట్రాన్ని బీజేపీ గెల్చుకుందనుకోండి. తర్వాత ఆ రాష్ట్ర సీఎం పాలన అసమర్థంగా తయా రవుతుంది. సీఎం అప్రతిష్ట మోదీ ప్రజాదరణను దెబ్బతీస్తుంది. మోదీ ప్రజా దరణ మాత్రమే కాదు.. బీజేపీ సీఎంల ప్రాచుర్యం కూడా కీలకమే. బీజేపీ సీఎంలు అస్తవ్యస్త పాలన చేస్తే, మోదీ ఆ రాష్ట్రాలలో గెలుపు సాధించలేరు. గర్వాతిశయానికి మూల్యం తప్పదు ఒక రాజకీయ పార్టీ పార్లమెంట్ స్థానాలను గెల్చుకోవాలనుకుంటే, రాష్ట్రాల్లో తన బలంపైనే ఆధారపడుతుంది. పార్లమెంటుకు, అసెంబ్లీకి ప్రజలు వేర్వేరుగా ఓటేయరు. ఉదాహరణకు: సీపీఎం ప్రతి సార్వత్రిక ఎన్నికలోనూ పశ్చిమబెంగాల్లోని 42 ఎంపీ స్థానాల్లో కనీసం 28 సీట్లు గెల్చుకునేది. కాని అధికారం కోల్పోగానే సీపీఎంకి కేవలం 2 ఎంపీ స్థానాలే దక్కాయి. 2004లో, 2009లో కూడా ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్‌కు అత్యధిక ఎంపీ స్థానాలను గెలిపించగలిగారు. కర్ణాటకలో యడ్యూరప్ప విషయానికి వద్దాం. తను సీఎం కానంతవరకు బీజేపీకి ఆ రాష్ట్రంలో బలం పెరుగుతూ వచ్చింది. కానీ, యడ్యూరప్ప దుష్పరిపాలన పార్టీని ఘోరంగా దెబ్బతీసింది. 2014లో బీజేపీ కర్ణాటకలో అధికారంలో లేనప్పటికీ మొత్తం 28 ఎంపీ స్థానాల్లో 16 సీట్లను బీజేపీ గెల్చుకోగలిగింది. దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న ప్రభుత్వం ఉండకపోవడమే ఏ పార్టీకయినా మంచిది. వాస్తవానికి, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, అసోమ్, హరియాణా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 2009లో 208 ఎంపీ స్థానాలు గెల్చుకుంది. అప్పట్లో అది ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బిహార్, మధ్యప్రదేశ్, తదితర అనేక రాష్ట్రాల్లో అధికారంలో లేదు. ఒక రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కలిగి ఉండక పోవడం అనేది జాతీయ పార్టీకి అనేక సార్లు అనుకూల పరిణామాలను తీసుకొచ్చేది. మోదీకి, బీజేపీకి ప్రధాన సమస్య ఏమిటంటే, మోదీ ఢిల్లీలో ఏం చేస్తారనే విషయం కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు ఏం చేస్తాయన్నదే. బహుశా కేంద్రంలో మోదీ బాగానే పనిచేయవచ్చు. కాని ప్రజాదరణ కోల్పోతున్న బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాల దుష్ఫలితాల మూల్యాన్ని మోదీ ఎదుర్కోవలసి ఉంటుంది. ఏదేమైనా బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ జాగ్రత్తగా పరిశీలిం చవలసి ఉంటుంది. బీజేపీ సీఎంలు, మంత్రులు విఫలమైతే వారిని తొలగించాల్సిన సమస్య కూడా ప్రస్తుతం మోదీ మెడకు చుట్టుకుంటోంది. ఎవరిని తొలగించాలి, ఎవరిని నియమించాలి? అనే అంశాన్ని కూడా ఆయన తేల్చుకోవాలి. 2014లో మోదీ ప్రధాని అయినప్పుడు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలలోనే బీజేపీ ముఖ్యమంత్రులు ఉండేవారు. మిగతా దేశమంతటా ఇతర పార్టీలు అధికారంలో ఉండేవి. కాబట్టే మోదీ అప్పట్లో ప్రతి రాష్ట్ర ప్రభుత్వం పైనా దాడి చేసేవారు. కానీ ఇప్పుడు బీజేపీ పాలిత రాష్ట్రాలను మోదీ కాపాడుకోవాలి. 2014 తర్వాత బీజేపీ మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణాలను గెల్చుకుంది. పంజాబ్, ఆంధ్రప్రదేశ్, కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వామ్యం పుచ్చుకుంది. మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్‌లో వసుంధరా రాజే, ఛత్తీస్‌గఢ్‌లో రమణ్‌సింగ్, గుజరాత్లో ఆనందీబెన్ పటేల్ బీజేపీ సీఎంలుగా ఉన్నారు. 2005 నుంచి నేటివరకు ప్రతి ఎన్నికలోనూ బీజేపీని గెలిపిస్తూ వస్తున్న శివరాజ్ సింగ్ బీజేపీ సీఎంలలో ఉత్తమ సీఎంగా పేరొందారు. తరచుగా శివరాజ్ వివాదాల్లో చిక్కుకుం టున్నప్పటికీ వాటిని అధిగమిస్తు న్నారు. ఆయన నిస్సందేహంగా మోదీకి, బీజేపీకి విలువైన సంపదే మరి. అలాగే 2003 నుంచి ఛత్తీస్‌గఢ్‌లో ఓటమన్నదే ఎరుగని రమణ్‌సింగ్ కూడా బీజేపీకి వరం లాంటివారే. ఇక రాజస్థాన్ సీఎం వసుంధరారాజే మోదీ ఆధారపడదగ్గ నేతగా లేరు. పైగా వచ్చే ఎన్నికల్లో ఆమె పార్టీని ఓటమివైపు నెట్టనున్నారని అంచనా. అనుభవం నుంచి నేర్చుకోని వసుంధరవల్ల రాజస్థాన్‌లో బీజేపీ రక్తమోడ్చవలసిందే. ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కొత్తవాడే కానీ ఏమాత్రం పాలనానుభవం లేనివాడు. మహారాష్ట్ర రాజకీయంగా అత్యంత ప్రాముఖ్యం గల రాష్ట్రం. 1999 నుంచి గడచిన 15 ఏళ్లుగా కాంగ్రెస్-ఎన్సీపీ పాలనలో ఆరుగురు సీఎంలు మారారు. ఇక్కడ శరద్‌పవార్ వంటి రాజకీయ దిగ్గజంతో ఫడ్నవీస్ తలపడవలసి ఉంటుంది. బీజేపీ ఇక్కడ శివసేన మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పర్చింది. ఈ రెండు పార్టీల మధ్య దాంపత్యం గిల్లికజ్జాలతోనే నడుస్తోంది. గొడ్డుమాంసంపై నిషేధం విధించటం మినహా ఫడ్నవీస్ ఇక్కడ చేసిందేమీ లేదు. ఆ ఒక్కటి కూడా వివాదాన్ని రేపింది. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం కానీ, ఇలాగే కొనసాగితే బీజేపీ 2019లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో మొత్తం 48కి గాను 42 ఎంపీస్థానాలను గెల్చుకోవడం కల్లే. బీజేపీకి పాలనాపరంగా సరిపోని వ్యక్తిగా ఫడ్నవీస్ మిగిలి పోనున్నారు. ఇక జార్ఖండ్‌లో బీజేపీ సీఎం రఘుబర్ దాస్ గత అనుభవం లేని తొలి సీఎం. ఈ చిన్న రాష్ట్రంలోని 14 ఎంపీ స్థానాల్లో 13 సీట్లను బీజేపీ గెల్చుకుంది. కాని ఇలాంటి ఫలితాలు భవిష్యత్తులో రాకపోవచ్చు. ఎందుకంటే దాస్ అద్భుతాలు సృష్టించే కార్యకర్త కాదు. బహుశా, బీజేపీ పార్టీలో అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి హరియాణా సీఎం జగదీష్ ఖట్టర్. తను కూడా తొలిసారి ఎమ్మెల్యే, సీఎంగా అయ్యారు. ప్రతిరోజూ ఈ రాష్ట్రంలో ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. హరి యాణా భౌగోళికంగా ఢిల్లీకి దగ్గరగా ఉన్నందున ప్రతి వివాదమూ మీడి యాకు తెలిసిపోతోంది. ఖట్టర్ అత్యంత ప్రాచుర్యం గల ఐఏఎస్ అధికారి ఖెమ్కాను బదిలీ చేయడమే కాకుండా, కశ్మీర్లో కన్నుమూసిన సైనికుల కుటుంబ సభ్యులతో మొరటుగా వ్యవహరించి అప్రదిష్ట మూటగట్టుకు న్నారు. చివరకు మంత్రుల గౌరవం కూడా పొందని ఖట్టర్‌ను ఇప్పుడే తొలగించాలా లేక హరియాణాలో బీజేపీని అతడు నిండా ముంచిన తర్వాతే తొలగించాలా అనేది మోదీనే నిర్ణయించుకోవాలి. తెలుగు రాష్ట్రాలు : బీజేపీ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వంలో బీజేపీకి ఇద్దరు మంత్రులు ఉన్నా రు. ఇద్దరు మంత్రులతోనే సంతృప్తిపడాలా లేదా మరిన్ని పదవులు కోరాలా? అనే ప్రశ్న ఆ పార్టీ ముందుంది. ఇద్దరు మంత్రులతో బీజేపీ ఏపీలో టీడీపీకి బానిసగానే ఉంది. అధికారంలో ఉన్నవారు ప్రస్తుతానికయితే సౌకర్యంగా నూ, సంతోషంగానూ కనబడుతున్నారు. అయితే ప్రభుత్వం నుంచి వైదొలిగి బయటనుంచి మద్దతు ఇవ్వడం బీజేపీకి ఉత్తమంగా ఉంటుంది. ఆంధ్రాలో తాను సొంతంగా ఎదగాలా లేదా 1999లో టీడీపీతో జట్టుకట్టి ఆనక అదృశ్య మైనట్లు నిండా మునగాలా అన్నది బీజేపీయే తేల్చుకోవాలి. ఇక తెలంగాణ లో సొంతంగా ఎదగాలంటే బీజేపీ ఇప్పటికైతే పొత్తులకు దూరంగా ఉండాలి. ఎన్నికల నాటికి ఎవరితో జత కట్టాలో నిర్ణయించుకోవచ్చు. తెలంగాణలో బీజేపీ పంజరంలో మేతలేని పక్షిలాగా ఉండగా, ఆంధ్రాలో కొంత మేత ఉన్న చిలుకలాగా ఉంటోంది. పక్షులు అడవిలో పెరగాలి కాని పంజరాల్లో కాదు. పొంచి ఉన్న ప్రమాదం హరియాణా, కశ్మీర్, పంజాబ్, మహారాష్ట్ర, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, చత్తీస్గర్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి. ఇక్కడ బీజేపీ బలహీనపడితే కాంగ్రెస్‌కు అది బలం అవుతుంది. కాంగ్రెస్ మోదీని దెబ్బ తీసే స్థితిలో లేదు. కానీ, మోదీని అనేక రాష్ట్రాల్లో తన పార్టీ వ్యక్తులే దెబ్బతీయగలరు. మోదీ తప్పకుండా అచిల్లెస్ను గుర్తు చేసుకుని తన పాదాన్ని కాపాడుకోవాలి. కాంగ్రెస్ కంటే బీజేపీలోని తన అనుయాయులే మోదీకి అత్యంత ప్రమాదకారులుగా ఉంటున్నారు. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు ఈమెయిల్: Drpullarao1948@gmail.com) -
తీర్పు చెప్పకపోవడమూ తీవ్రమైన నేరమే!
విశ్లేషణ ఢిల్లీ నగరంలో 56 వేల సంస్థలకు 100 చదరపు గజాల నుంచి 50 ఎకరాలకు మించి ప్రభుత్వం భూమిని కేటాయించింది. లీజు పత్రాల్లో రేటును సవరించిన మేరకు చెల్లించాలనే షరతు ఉన్నా 1999 నుంచి ఇంతవరకు రేటును పెంచలేదు. నిర్ణయం తీసుకునే వారు తీసుకోకపోవడమే అసలు సమస్య. మనకెందుకు ఆ పెద్దాయనే ముందుబడుతుంటాడు కదా, అతన్నే నిర్ణయం తీసు కొమ్మందాం అని వదిలేయడం ఇంకో లక్షణం. సరైన పాలకుడు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలి, అందుకు సరైన కారణాలు చెప్పాలి కూడా. యుద్ధంలో కమాండర్ క్షణాల్లో నిర్ణయం తీసుకోవలసి ఉంటుంది. తప్పో ఒప్పో.. పాలకుడు, కోర్టులో న్యాయమూర్తి కూడా అంతే. చట్టం ప్రకారం, సాక్ష్యాల మేరకు నిర్ణయం తీసుకోవాలి. సాక్ష్యాలు వాదాలు ప్రతి వాదాలు విన్న తరువాత వెంటనే తీర్పు ఇవ్వకపోతే విష యాలు వివరాలు గుర్తుంటాయా? జస్టిస్ కృష్ణ అయ్యర్ ‘అన్నీ విని తీర్పు చెప్పకపోవడం తీవ్రమైన నేరం’ అన్నారు. అన్ని నేరాల వలెనే ఈ నేరాలూ పెరిగితే? ఢిల్లీ సుల్తాన్లు (మన నవాబులు కూడా) విలువైన భూములు మంచి కూడళ్లలో అస్మదీయులకు తక్కువ అద్దెకు ఇచ్చి జనం నుంచి కోట్ల రూపాయలు పిండుకునే సదవకాశాన్ని ఇస్తూ ఉంటారు. కిక్ బ్యాక్ ఉన్నా లేకు న్నా.. ప్రభుత్వం గణనీయంగా ఆర్థిక సాయం ఇస్త్తున్న దని, ఒకవేళ ఆ సాయం నిలిచిపోతే ఎన్జీఓ మనుగడ సాధ్యం కాదని తేలితే దాన్ని పబ్లిక్ అథారిటీగా తేల్చా లని సుప్రీంకోర్టు తల్లపాలెం కేసు తీర్పు పేరా 39, 40 లో ఒక కొలమానాన్ని అందించింది. దేశ రాజధానిలోని కీలకమైన ప్రాంతంలో ప్రభు త్వం డీడీసీఏకు 1987లో 14.281 ఎకరాల భూమిని లీజుకు ఇచ్చింది, దీనికి ఏటా కేవలం ఎకరానికి 5500 రూపాయల లైసున్సు ఫీజు తీసుకుంటున్నది, ఎకరానికి 88 లక్షల రూపాయల ఖరీదు కట్టి అందులో అయిదు శాతం మాత్రమే ఫీజు నిర్ణయించింది. అది ఏడాదికి కేవలం 24.64 లక్షల రూపాయలు మాత్రమే. 2002లో లీజును 33 సంవత్సరాలపాటు కొనసాగించారు. డీడీఏ సర్కిల్ ఏ రేటు ప్రకారం చదరపు మీటర్‌కు రూ. 3,99,889 చొప్పున లెక్కిస్తే డీడీసీఏ ఇచ్చిన 57789 చ.మీ.లకు 2,310 కోట్ల రూపాయలు అవుతుంది, అం దులో అయిదు శాతం అంటే రూ.115.54 కోట్లు ఏటా ఇవ్వాల్సి ఉంటుంది. రెండో సర్కిల్ బి కేటగిరీలో చద రపు మీటరుకు 6,72,927 రూపాయలు. దీని ప్రకారం డీడీసీఏకి ఇచ్చిన భూమి ఖరీదు రూ. 3,888.77 కోట్లు, అందులో 5 శాతం అంటే రూ.194.43 కోట్లు అవుతుం ది. మూడో సర్కిల్ రేటు చ.మీ.కి రూ.1,59,840. దీని ప్రకారం కనీస సర్కిల్ రేటు రూ.923 కోట్లు, అయిదు శాతం రూ.46.18 కోట్లు. కనీసం లెక్క వేసినా 2002 నుంచి 13 ఏళ్లలో 2,600 కోట్ల రూపాయల మేరకు డీడీసీఏకు మినహాయింపు లభించినట్టు. అంతకుముందు 13 ఏళ్ల నుంచి ఈ భూమి డీడీసీఏ అధీనంలో ఉంది. ఆ లెక్క కూడా తీస్తే వారికి సర్కారు వారిచ్చిన సాయం ఖరీదు 5,200 కోట్ల రూపాయల విలువ అవుతుంది. లాండ్ అండ్ డెవలప్మెంట్ ఆఫీసు వారి లెక్క ప్రకారం 88 వేల రూపాయలను డీడీసీఏ వారికి సంస్థ రేటుగా ఇచ్చారు. కాని క్రికెట్‌ను వాణిజ్య స్థాయిలో నడుపుతూ లాభాలు ఆర్జిస్తున్న డీడీసీఏకి వాణిజ్య రేటు మీద ఇస్తే రూ.329 కోట్లు. 5 శాతం ప్రకా రం రూ.16.4 కోట్లు అవుతుంది. కనీసం నివాస కాలనీ రేటు వేసినా రూ.108 కోట్లు విలువ, 5 శాతం ప్రకారం రూ.5.4 కోట్లు అవుతుంది. కాని ఏటా కేవలం 24 లక్షల రూపాయలు మాత్రమే తీసుకుంటున్నారు. ఢిల్లీ నగరంలో 56 వేల సంస్థలకు 100 చదరపు గజాల నుంచి 50 ఎకరాలకు మించి ప్రభుత్వం భూమి ని కేటాయించింది. లీజు పత్రాల్లో రేటును సవరించిన మేరకు చెల్లించాలనే షరతు ఉన్నా 1999 నుంచి ఇం తవరకు రేటును పెంచలేదు. దీని వల్ల ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టపోతున్నది. మూడు ప్రైవేటు సంస్థలకు విలువైన భూములను ఇవ్వడంవల్ల ఆ సం స్థలు పబ్లిక్ అథారిటీలే అనీ, ప్రజలకు సమాచార హక్కు కింద వారు జవాబులు ఇవ్వాలని సీఐసీ తీర్పు లిచ్చింది. వాటిపైన ఢిల్ల్లీ హైకోర్టు విడివిడిగా స్టే ఇచ్చింది. పంజాబ్ క్రికెట్ అకాడమీ కూడా పబ్లిక్ అథారిటీ అంటూ పంజాబ్ సమాచార కమిషనర్ ఆదేశించారు. దాన్ని హైకోర్టు మాత్రం పక్కన బెట్టి, సుప్రీంకోర్టు సూచించిన పరీక్ష ప్రకారం తేల్చాలని పంజాబ్ ఎస్ఐసి కి తిప్పి పంపింది. అంటే దీని అర్థం కమిషన్ మాత్రమే తీర్పు ఇవ్వాలని. ఈ తీర్పులను ఉటంకిస్తూ ఇరువురు కేంద్ర కమిషనర్లు డీడీసీఏ విషయమై నిర్ణయం నిరవ ధికంగా వాయిదా వేశారు. ఢిల్ల్లీ హైకోర్ట్టులో డీడీసీఏకి సంబంధించి ఏ నిలిపివేత ఉత్తర్వూ లేనపుడు, ఇతర కేసుల్లో స్టే తాత్కాలికంగా ఆ పార్టీలకు మాత్రమే పరిమి తమవుతుంది. తల్లపాలెం కేసులో ఇచ్చిన తీర్పు, పం జాబ్ క్రికెట్ అసోసియేషన్ కేసులో పంజాబ్ హరియా ణా హైకోర్టు ఇచ్చిన తీర్పు. సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచార కమిషన్‌కు ఏదైనా ప్రైవేటు ఎన్జీఓ పబ్లిక్ అథారిటీ అవుతుందో లేదో నిర్ణయించే అధికారం ఉంది. క్రికెట్ మీద కోట్లు గడించే డీడీసీఏ ప్రజలకు జవా బుదారీగా ఉండాలనడం తప్పా? (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
మారుతున్న సీపీఎం తీరు?
విశ్లేషణ సీపీఎం మహాసభల ముసాయిదా రాజకీయ తీర్మానం పార్టీ పంథాలో కీలక మార్పులను సూచిస్తోంది. ‘‘పార్టీ నానాటికీ ఎన్నికల ఊబిలో కూరుకుపోతోంది’’ అంటూ ఒకప్పుడు సుందరయ్య చేసిన విమర్శను అది స్వీకరించినట్టుంది. ‘‘పార్లమెంటరిజానికి’’ అలవాటుపడి బలహీనపడ్డామని అంగీకరించింది. ‘‘బూర్జువా పార్టీలతో పొత్తు కూడదు’’ అంటూ రాష్ట్రాలపై ఎన్నికల పొత్తులను పైనుంచి రుద్దరాదని, ఆ నిర్ణయాధికారం రాష్ట్ర కమిటీలకే ఉండాలని భావించింది. ముసాయిదాపై సుందరయ్య ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. కమ్యూనిస్టు పార్టీలలో ప్రత్యేకించి భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు)లో అంతర్గత ప్రజాస్వామ్యం తక్కువనే విమర్శలో నిజముంది. ఏదేమైనా ప్రతి మూడేళ్లకోసారి అఖిల భారత మహాసభలను నిర్వహించి, అంతవరకు పార్టీ అనుసరించిన రాజకీయ ఎత్తుగడలను, కార్యక్రమాలను సమీక్షించుకొని, భవిష్యత్ వ్యూహాన్ని రూపొందించుకోవడమనే సత్సాంప్రదాయం కూడా సీపీఎంలో ఉంది. ఈ నెల 14-19 తేదీలలో విశాఖపట్నంలో ఆ పార్టీ 21వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. ఆ సందర్భంగా సీపీఎం కేంద్రకమిటీ విడుదల చేసిన ముసాయిదా రాజకీయ తీర్మానం ఆ పార్టీ పంథాలో కీలకమైన మార్పులను సూచిస్తుండటం విశ్లేషకులందరికీ ఆసక్తికరంగా మారింది. ‘జలంధర్’లోనే మొదలైన క్షీణత ముసాయిదా 1978లో జలంధర్‌లో జరిగిన 10వ మహాసభను ఒక మైలురాయిగా పేర్కొంది. 1977లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ అత్యవసర పరిస్థితి ఎత్తివేశాక జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఆ సభలు జరిగాయి. ఆనాటి నుంచీ, మరీ ముఖ్యంగా గత 25 ఏళ్లుగా పార్టీ వ్యూహమూ, ఎత్తుగడలు తప్పుల తడకగా ఉండి పార్టీ ప్రతిష్ట, పలుకుబడి దిగజారిపోయాయని ఆ డాక్యుమెంటు వినమ్రంగా ఆత్మవిమర్శ చేసుకుంది. అందుకు ఆ పార్టీకి అభినందనలు! జలంధర్ మహాసభల ముసాయిదా తీర్మానానికి పుచ్చలపల్లి సుందరయ్య ప్రత్యామ్నాయ తీర్మానాన్ని, పార్టీ నిబంధనావళికి సవరణలను ప్రతిపాదించారు. నాడు ఆయన చేసిన ప్రతిపాదనలలోనూ, 1976లో పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి చేసిన రాజీనామా లేఖలోనూ ఉన్న సూత్రీకరణలు సరైనవేనని నేటి ముసాయిదా ఆయన పేరును ప్రస్తావించకుండానే అంగీకరించడం విశేషం. 1977లో అధికారంలోకి వచ్చిన జనతా పార్టీలో రామ్మనోహర్ లోహియా అనుచరులైన సోషలిస్టులు, మొరార్జీదేశాయ్ వంటి కరుడుకట్టిన కాంగ్రెస్ మితవాదులు ఉన్నా ప్రధానశక్తి మాత్రం జనసంఘ్ (నేటి బీజేపీ). ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలని కేంద్ర కమిటీ ప్రతిపాదించిన తీర్మానాన్ని సుందరయ్య వ్యతిరేకించారు. ‘‘బూర్జువా పార్టీ కాంగ్రెస్‌తో పొత్తుకు సిద్ధమైన సీపీఐని రివిజనిస్టు పార్టీగా విమర్శిస్తున్న మనం, అంతకంటే మరింత అభివృద్ధి నిరోధక పార్టీయైన జనతాతో పొత్తు పెట్టుకోవడం రివిజనిజం కాదా?’’ అని సుందరయ్య ప్రత్యామ్నాయ తీర్మానం ప్రశ్నించింది. దీంతో ప్రతినిధుల నుంచి కూడా అదే ప్రశ్న తలెత్తడం ప్రారంభమైంది, తీవ్ర గందరగోళం నెలకొంది. పరిస్థితిని గమనించిన కేంద్ర కమిటీ తెలివిగా తీర్మానాన్ని ఓటింగ్‌కు పెట్టకుండా... సుందరయ్య, ప్రతినిధుల అభిప్రాయాల సారాన్ని గ్రహించి తదనుగుణంగా కాంగ్రెస్ తదుపరి ఆ తీర్మానాన్ని తిరగరాసే అధికారాన్ని కోరింది. మౌనంగానే అనంగీకారాన్ని తెలిపిన సుందరయ్య తిరగరాతకు అనుకూలంగా మాత్రం ఓట్ చేయలేదు. అయితే ఐక్యత కోసం ప్రతినిధులు దాన్ని ఆమోదించారు. కేంద్ర కమిటీ అభీష్టమే కేంద్రీకృత ప్రజాస్వామ్యం! ఆ సభలకు ప్రతినిధిగా హాజరైన నేను విరామ సమయంలో ‘‘మొత్తానికి కేంద్ర కమిటీ తీర్మానాన్ని నిలవరించగలిగారు’’ అని సుందరయ్యతో అన్నాను. ఆయన నవ్వి ‘‘అమాయకుడా! ఏవో రెండు మూడు మాటలు మార్చి ఇదే తీర్మానాన్ని కొత్త కేంద్ర కమిటీ ఆమోదిస్తుంది. అంతకు మించి ఏమీ జరగదు. జనతా పార్టీతో పొత్తు కొనసాగుతుంది కూడా, చూడు’’ అన్నారు. ఆ తర్వాత జరిగింది సరిగ్గా అదే! ‘‘వివిధ రాష్ట్రాల్లో వేరు వేరు పరిస్థితులుంటాయి. కానీ పై కమిటీల నిర్ణయాలను కింది కమిటీలు అమలు చేయడమే కేంద్రీకృత ప్రజాస్వామ్యమంటూ ఆయా రాష్ట్ర కమిటీల అభిప్రాయాలకు భిన్నంగా కేంద్ర కమిటీ తన నిర్ణయాలనే అమలు చేయిస్తుంది. ఈ ధోరణి మారాలి. స్థానిక పరిస్థితులపై ఆధారపడి ఆయా రాష్ట్రాల్లోని స్థానిక పార్టీలతో ఎన్నికల పొత్తును పెట్టుకునే అంశంపై నిర్ణయాధికారం ఆయా రాష్ట్ర కమిటీలకే ఇవ్వాలి’’ అంటూ సుందరయ్య పార్టీ నిబంధనావళికి సవరణను ప్రతిపాదించారు గానీ అది వీగిపోయింది. నేటి ముసాయిదా తీర్మానం నాటి ఆయన తీర్మానం స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ ‘‘బూర్జువా పార్టీలతో పొత్తు కూడదు’’ అని ప్రతిపాదించింది. అంతేకాదు రాష్ట్రాలపై ఎన్నికల పొత్తులను పై నుంచి రుద్దకుండా అక్కడి పార్టీలే, ఉద్యమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకునే అధికారం ఆయా రాష్ట్ర కమిటీలకు ఉండాలని పేర్కొంది! ఇదంతా ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే... ఒకటి, నేటి 21వ మహా సభల ముసాయిదా జలంధర్ సభ ఆనాటి సుందరయ్య అభిప్రాయాల, సూత్రీకరణల స్ఫూర్తినే ప్రతిబింబిస్తోందనేది చెప్పడం కోసం. రెండు, కాంగ్రెస్ తీర్మానాలు ఎలా ఉన్నా ఆచరణ మాత్రం కేంద్ర కమిటీ అభీష్టం మేరకే సాగే పెడధోరణి పార్టీలో పాతుకుపోయిందని చెప్పడం కోసం. నిజానికి సుందరయ్య హాజరైన ఆ ‘‘పదవ మహాసభలలోనే పార్టీ స్వతంత్ర శక్తిని పెంచుకోవాలి, వామపక్ష ప్రజాతంత్ర శక్తుల ఆధ్వర్యంలో బూర్జువా పార్టీల విధానాలకు భిన్నమైన వర్గ, ప్రజా ఉద్యమాల నిర్వహణకు పెద్ద ఎత్తున నిర్వహించి, వాపపక్ష ప్రజాతంత్ర సంఘటన నిర్మాణానికి పూనుకో వాలని తీర్మానించింది. కానీ ఆ తర్వాత ఎప్పటికప్పుడు ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటూ తక్షణ అవసరం తోసుకువచ్చింది. వామపక్ష ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం వెనక్కు పోయింది’’ అని అంగీకరించారు. సభల తీర్మా నాలు, తీర్మానాలుగానే ఉంటాయి, ఆచరణ మాత్రం కేంద్ర కమిటీ అను కున్నదే అవుతుంది అంటూ సుందరయ్య నాడు చేసిన హెచ్చరికను పెడచెవిన పెట్టి పార్టీ ఇంతకాలం అదే బాటలో నడిచిందని తెలుస్తున్నది. పొత్తులతో బలహీనపడ్డ పార్టీ ‘‘పార్టీ స్వతంత్ర శక్తి ఈ ఎన్నికల ఎత్తులు, పొత్తుల వల్ల బలహీన పడింది... చివరకు ఎన్నికల అవసరాల కోసం వామపక్ష, ప్రజాతంత్ర, లౌకికతత్వం లాంటి వాటి ప్రస్తావనే లేని మూడవ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నించే పరిస్థితి దాపురించింది. ఫలితంగా పార్టీ బలంగా ఉన్న బెంగాల్, కేరళలలో పార్లమెంటరిజం వల్ల పార్టీ కొంత బలహీనపడగా, కేంద్రం నిర్దేశించిన ఎన్నికల పొత్తుల వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో మరీ బలహీనపడింది’’ అని 21వ మహాసభ ముసాయిదా అంగీకరించింది. ఇందుకు తిరుగులేని ఉదాహరణ 2009 ఎన్నికల్లో తెలుగుదేశంతో నిర్మించిన మహాకూటమే! ‘‘పార్టీ నానాటికీ ఎన్నికల ఊబిలో కూరుకుపోతూ భారత విప్లవ ఎత్తుగడల పంథాకు తిలోదకాలిచ్చే ప్రమాదం కనిపిస్తోంది’’ అని సుందరయ్య ప్రధాన కార్యదర్శి పదవికి చేసిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. నేటి సీపీఎం ముసాయిదా తీర్మానం అదే విషయాన్ని ‘‘పార్లమెంటరిజానికి’’ అలవాటు పడ్డామంటూ అంగీకరించింది. అంతేకాదు, పార్టీ నేతలు చేసే ప్రకటనలు ఒక్కో సారి పార్టీని ఆత్మరక్షణలో పడేసేవిగా, పార్టీపట్ల చులకన భావం ఏర్పర చేవిగా ఉంటున్నాయని పేర్కొంది. దిద్దుబాటుతోనే పురోగతి రెండున్నర దశాబ్దాలుగా ఈ ధోరణులు పార్టీలో కొనసాగుతున్నాయని, ఇప్పటికైనా మొత్తం రాజకీయ, నిర్మాణ పరిస్థితిని సవ్యంగా, నిజాయితీగా సమీక్షించి, తప్పులను దిద్దుకుని పురోగమించాలన్న లక్ష్యాన్ని సీపీఎం తన ముందుంచుకున్నది. అయితే అది అంత తేలికైన విషయమేమీ కాదు. ‘‘ఏముంది తప్పులు చేశాం, దిద్దుకుంటాం. దానికి ఇంత గగ్గోలు, తీవ్ర విమర్శలు దేనికి?’’ అని దీన్ని తేలిగ్గా తీసుకోవడం సరికాదు. అలా అని ఊరికే గుండెలు బాదుకునీ ప్రయోజనం లేదు. కానీ ఇంత సుదీర్ఘ కాలం పాటూ పార్టీ గాడి తప్పితే ప్రజల్లో పార్టీకి ఉన్న ప్రత్యేక గౌరవాభిమానాలు క్రమేపీ తరిగిపోతాయి. బూర్జువా పార్టీలకిచ్చినట్టుగా తప్పులు చేసే వెసులుబాటును ప్రజలు కమ్యూనిస్టులకు ఇవ్వరు. పైగా వారిని కూడా బూర్జువా పార్టీలతో సమానం చేసి, ‘‘ఆ... వీళ్లూ అంతే, పదవులు-ఎన్నికలు, అవకాశవాద పొత్తులు’’ అని తేలిగ్గా తీసిపారేస్తారనేది వాస్తవం. ఏది ఏమైనా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్యవంటి ఆదర్శ కమ్యూ నిస్టు, విప్లవ నేత స్ఫూర్తిని పెంపొందింపజేసుకొని సీపీఎం వామపక్ష ప్రజా తంత్ర సంఘటనకు అవిశ్రాంతంగా కృషి చేయడానికి ఈ 21వ జాతీయ మహాసభలు నాంది కానున్నాయనే ఆశాభావాన్ని ముసాయిదా రాజకీయ తీర్మానం కలిగించ గలిగింది. ప్రజలపట్ల ప్రేమ, గౌరవాలతో, అంకిత భావంతో కృషి చేస్తే పార్టీ తన తప్పులను దిద్దుకోవడం, తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం సాధ్యమే. మితవాద, మతవాద శక్తులు బలపడుతున్న పరిస్థితుల్లో... పాలకవర్గాలు విచక్షణారహితంగా అమలుచేస్తున్న ఉదారవాద ఆర్థిక విధానాల ఫలితంగా దేశవ్యాప్తంగా పీడిత ప్రజానీకమంతటిలో అసంతృప్తి అలముకుంటున్న నేపథ్యంలో జరుగుతున్న ఈ అఖిల భారత మహాసభలు ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం నిర్మాణానికి, వామపక్ష, కమ్యూనిస్టు ఐక్యతకు ఉత్తేజకరమైన ప్రారంభం కాగలుగుతాయని ఆశించవచ్చా? (ఈ నెల 14-19 తేదీలలో విశాఖపట్నంలో సీపీఐ-ఎం 21వ అఖిల భారత మహాసభలు జరగనున్న సందర్భంగా) (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు 98480 69720) -
పోల‘వరమా’? ‘పట్ట్టు’సీమా?
విశ్లేషణ పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణాకి చేరేది పోలవరం కుడి కాలువ ద్వారానే. దానిలో 43.5 కిలోమీటర్ల భాగం తవ్వకం జరగాలి. హైకోర్టులోని రైతుల దావాలు తేలి 1,820 ఎకరాల భూసేకరణ జరగాలి. అదిగాక అటవీ, గిరిజన భూముల సేకరణ జరగాలి. కనీసం రూ. 400 కోట్ల నిధుల కొరత పూడాలి. ఇవన్నీ జరిగితేనే కాలువ పని మొదలయ్యేది. అది పూర్తికానిదే పట్టిసీమ నీరు కృష్ణానదికి చేరడం అసాధ్యం. సత్వరమే గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తామనే వారు ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం ప్రాజెక్టులపై ప్రస్తుతం వాదోపవా దాలు సాగుతున్నాయి. పోలవరానికి అధిక నిధులను కేటాయించి నాలుగేళ్ల లోనే దాన్ని పూర్తి చేయాలని అన్నిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తు న్నాయి. మరోవంక పట్టిసీమ ఎత్తిపోతలతో ఆరునెల్లలోనే గోదావరి వరద నీటిని కృష్ణానదికి తరలిస్తామని, తద్వారా నాగార్జునసాగర్‌లో ఆదా అయ్యే నీటిని శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు అందిస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఆ రెండు ప్రాజెక్టులను కలిపి పరిశీలించాల్సి ఉంది. మొదటి నదుల అనుసంధాన ప్రాజెక్టయిన పోలవరం ఏపీకి జీవనాడి. దాని అంచనా వ్యయం రూ.16,060 కోట్లు. ఇప్పటివరకు చేసిన ఖర్చు రూ.5,150 కోట్లు. కుడి కాల్వలో 70%, ఎడమ కాల్వలో 65%, హెడ్ వర్క్స్‌లోని స్పిల్‌వే, అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్ పనులలో 10%, శాడిల్ డామ్లు, సొరంగాలలో 80% పనులు పూర్తయ్యాయి. కేంద్రం, దీన్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి ప్రాజెక్టు అథారిటీని కూడా ఏర్పాటు చేసింది. ఏటా వర్షాకాలం 120 రోజులలో 85 రోజులు గోదావరి వరద నీరు లక్షలాది క్యూసెక్కులు సముద్రం పాలవుతుంది. ఆ నీటిని నిల్వ చేసి వరద లేని రోజులలో ఆ ప్రాంతాల తాగు, సాగు, పారిశ్రామిక అవసరాలను తీర్చ డంతోపాటూ, కృష్ణానదికి 80 టీఎంసీల నీటిని తరలించే చిట్టచివరి రిజర్వా యరే పోలవరం. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానమే ఈ ప్రాజెక్టులోని ప్రధానాంశం. తద్వారా 80 టీఎంసీల నీరు కృష్ణాకు చేరుతుంది. కాబట్టి నాగా ర్జునసాగర్ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల ఆగిపోతుంది. ఇలా ఆదా అయిన నీటిలో 35 టీఎంసీలను ఎగువ ప్రాంతాలైన మహారాష్ట్ర, కర్ణాటకలూ, 45 టీఎంసీలు తెలంగాణ, రాయలసీమలూ వినియోగించుకునేట్టు 1978లో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దీనిని 1980నాటి బచావత్ అవార్డు తుది తీర్పులో పొందుపరచారు. ఇప్పుడు పట్టిసీమ ఎత్తిపోతలతోనే 80 టీఎంసీల నీటి తరలింపు లక్ష్యం నెరవేరుతుండగా ఇంకా పోలవరం ప్రాజెక్టు అవశ్యకత ఏమిటని దాన్ని వ్యతిరేకిస్తున్న వారి ప్రశ్న. పోలవరం కుడి కాల్వలోకి పట్టి సీమ పథకం ద్వారా నీటిని తరలిస్తున్నట్టే, మరో ఎత్తిపోతల ఏర్పాటుతో విశాఖ అవసరాలు తీర్చుకోవచ్చని సూచిస్తున్నారు. ఏపీ ప్రభుత్వం మాత్రం పోలవరం పూర్తయ్యేలోగానే తక్షణమే పట్టిసీమతో గోదావరి వరదజలాలను వినియోగంలోకి తెస్తామంటున్నది. కానీ దానివల్ల ఇప్పటికే అంతరాష్ట్ర, పర్యావరణ వివాదాలలో ఉన్న పోలవరం ఆగిపోయే పరిస్థితి వస్తుందనేది ఎందుకు పట్టడం లేదు? కాల్వ లేకుండానే పట్టిసీమ జలాల పరుగులా? పోలవరం దిగువన పట్టిసం వద్ద గోదావరి జలాలను 24 పంపులతో తోడి 3.2 మీటర్ల వ్యాసం గల పైపుల ద్వారా 4.5 కిలోమీటర్ల దూరంలోని పోల వరం కుడికాల్వలోకి చేరుస్తారు. ఇందుకు 150 మెగావాట్ల విద్యుత్తు అవస రం. ఆ భూసేకరణను రైతులు వ్యతిరేకిస్తున్నారు. పట్టిసీమ నుంచి గోదావరి నీరు కృష్ణాలోకి చేరేది పోలవరం కుడికాల్వ ద్వారానే. 174 కిలోమీటర్ల పొడ వైన ఈ కాల్వలో ఇంకా 43.5 కిలోమీటర్ల భాగం తవ్వకం జరగాలి. అందుకు 1,820 ఎకరాల భూసేకరణ జరగాలి. అది జరగాలంటే హైకోర్టులో ఉన్న రైతుల దావాలు తేలాలి. అటవీ, గిరిజన భూముల సేకరణ కూడా జరగాలి. ఇవన్నీ జరిగితేనే పని మొదలయ్యేది. ఈ కాలువ పూర్తికానిదే పట్టిసీమ నీరు కృష్ణానదికి చేరడం అసాధ్యం. 6 నుంచి 9 నెలల్లోనే గోదావరి నీటిని కృష్ణాకు తరలిస్తామనే వారు ఈ విషయాన్ని ఎందుకు విస్మరిస్తున్నారు? కుడికాల్వ వ్యయం రూ. 2,441 కోట్లని ప్రాథమిక అంచనా. ఇప్పటివరకు వ్యయం రూ. 1,345 కోట్లు. ఇంకా రూ. 1,800 కోట్లు కావాలి. పట్టిసీమకు రాష్ట్ర బడ్జెట్ ఇచ్చిన రూ. 257 కోట్లకు తోడు కేంద్ర ప్రభుత్వ ఏఐబీపీ నిధులు రూ. 850 కోట్ల నుంచి రూ. 775 కోట్లను కేటాయించారు. మొత్తం రూ.1,032 కోట్లు. ప్రాజెక్టు వ్యయం 22% పెరిగి రూ. 1,450 కోట్లకు పెరిగింది. మిగతా రూ. 400 కోట్లూ లేకుండానే ఈ ప్రాజెక్టు పూర్తవుతుందా? కుడి కాల్వ పూర్తి కాకుం డానే పట్టిసీమ నీరు కృష్ణాకు, తర్వాత రాయలసీమకు చేరుతుందా? ప్రాజెక్టు లక్ష్య సాధన సంగతెలా ఉన్నా పంట పొట్ట మీదున్న కీలక దశలో నీటి కొరత ఏర్పడుతుందని గోదావరి డెల్టా వారూ, ఇటు పట్టిసీమ నీరు పారక, అటు సాగర్ నుంచి నీరు విడుదలకాక కృష్ణా డెల్టావారు తమ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా అవుతుందని ఆందోళన చెందడం సమంజసం కాదా? గోదావరి నీటి మళ్లింపు జరిగినా, జరగకపోయినా పట్టిసీమలో పం పింగ్ ప్రారంభం కాగానే బచావత్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలు 65 టీఎంసీలను అదనంగా వినియోగిస్తే నష్టపోయేది సీమవాసులే. అందుకే పోలవరం కల సాకారమౌతుందని ఆశలు పెట్టుకున్నవారంతా పట్టిసీమ, పోలవరానికి అడ్డంకి అవుతుందని భయాందోళనలకు గురవుతున్నారు. పట్టిసీమ లేకుండానే సీమకు నీరు సాధ్యం 1. కృష్ణా డెల్టా, నాగార్జునసాగర్ కుడి కాల్వ ఆయకట్టులో కేటాయింపుల కన్నా అధిక నీటి వినియోగాన్ని తగ్గించి నీరు ఆదా చేయవచ్చు. అలాగే పులిచింతలలో 40 టీఎంసీల పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేయొచ్చు. జాతీయ జలరవాణా మార్గం 4లో భాగం, గోదావరి-కృష్ణా అనుసంధా నమైన ఏలూరు కాల్వల ద్వారా 20 టీఎంసీల గోదావరి నీటి తరలింపు నకు ప్రాధాన్యత ఇస్తే సీమకు నీరందించొచ్చు. 2. రాయలసీమకు నీటిని తరలించే పోతిరెడ్డిపాడు ప్రధాన కాల్వతోపాటు, తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు-నగరి, హంద్రీ-నీవా కాల్వలు, నిప్పులవాగులలో ప్రవాహాలకున్న అడ్డంకులను తొలగించి ప్రవాహ సామర్థ్యాన్ని పెంచడం ద్వారా ఇప్పటికంటే రెట్టింపు నీటిని సీమకు తరలించవచ్చు. 3. }Oశెలం రిజర్వాయర్‌లో నీటిమట్టం 854 అడుగులకు పైగా ఉంటేనే పోతి రెడ్డిపాడు ద్వారా సీమకు కృష్ణా జలాలు అందుతాయి. గత ఏడేళ్లలో (2008- 2015) సగటున ఏడాదిలో 198 రోజులు నీటిమట్టం 854పైనే ఉంది. పోతిరెడ్డిపాడు పాత, కొత్త రెగ్యులేటర్ల నీటి విడుదల సామర్థ్యం 55.5 టీఎంసీలు. కానీ అత్యధికంగా జరిగిన నీటి విడుదల 14 వేల క్యూసెక్కులు! దీనికి ప్రధాన కారణం పోతిరెడ్డిపాడు- బనకచర్ల ప్రధాన కాల్వను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయకపోవటమే. 4. అలాగే తెలుగుగంగ కాల్వల ద్వారా బ్రహ్మంగారి మఠం రిజర్వాయర్‌కు నీరు చేరటం లేదు. శ్రీశైలం కుడికాల్వ, గాలేరు-నగరి కాల్వల పరిస్థితీ అంతే. గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్లు పూర్తికాలేదు. హం ద్రీ-నీవా కాల్వకు సిమెంటు లైనింగ్ చేయలేదు. కృష్ణా నుంచి పెన్నాకు, అక్కడి నుంచి సోమశిల, కండలేరుకు నీరు చేర్చే నిప్పులవాగు ప్రవాహ వాగు సామర్థ్యం పెంచలేదు. దీనిపై నిర్మించిన నాలుగు విద్యుత్ కేంద్రాల డ్యామ్‌లు నీటి ప్రవాహానికి ప్రధాన అడ్డంకిగా మారాయి. నీరున్నా తీసుకోలేని దుస్థితి. పోలవరం పూర్తయ్యేలోగానే సీమకు నీరు అందించాలన్న చిత్త శుద్దే ఉంటే ప్రభుత్వం ఈ అడ్డంకులను తొలగిం చడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేగానీ అసాధ్యమైన తక్షణ లక్ష్యాలతో భారీ ప్రాజెక్టు పట్టిసీమ కోసం పట్టు ఎందుకు? కోరికోరి పోలవరానికి అడ్డంకులు సృష్టించడమెందుకు? పాలకుల పంతాలు... ప్రజలకు సంకటాలు రాష్ట్ర విభజన తర్వాత నీటి కష్టాలు పెరిగాయి. ఈ ఏడాది కూడా కృష్ణానదికి వరదలొచ్చాయి, జలాశయాలు నిండాయి. 73 టీఎంసీల నీరు సముద్రం పాలైంది. శ్రీశైలం నీటి మట్టం 854 అడుగులకుపైగా ఉంటేనే సీమకు నీరు అందుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల ఏలికల మధ్య పంతాలు, పట్టింపులతో జల వివాదాలు ముదిరాయి. తెలంగాణ తమకు చెందిన శ్రీశైలం ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి వేలాది క్యూసెక్కుల నీటిని సాగర్‌లోకి విడుదల చేసింది. ఏపీ ప్రభుత్వ అభ్యంతరాలను, రివర్ బోర్డు ఆదేశాలను కూడా ఖాతరు చేయక శ్రీశైలం నీటి మట్టాన్ని తాజాగా 800 అడుగులకు తగ్గించింది. మరోవంక నాగార్జునసాగర్ ఎడమ కాల్వ కింద నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో 3 లక్షల ఎకరాలు, కుడికాల్వ కింద గుంటూరు జిల్లాలో 50 వేల ఎకరాలు, డెల్టాలో 75 వేల ఎకరాలు అనుమతులు లేని దాళ్వా వరి సాగు జరిగింది. ఈ అనుమతులు లేని సాగుకు నీరు అందించ డంలో ఇద్దరు ముఖ్యమంత్రులకూ అంగీకారం కుదిరింది. ఇలా సాగర్ నుంచి నిత్యం 20 నుంచి 25 వేల క్యూసెక్కుల నీటి వినియోగం వలన కనీస నీటి మట్టం (ఎండీడీయల్) 510 అడుగుల కన్నా దిగువనున్న నీటిని వాడుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో రాబోయే ఏడాదికి ముందస్తుగా వాడు కోవడానికి అవసరమైన 150 టీఎంసీల నీటిని క్యారీ ఓవర్‌గా శ్రీశైలం, నాగా ర్జునసాగర్‌లలో నిల్వ ఉంచుకోవాలని సూచించారు. క్యారీ ఓవర్‌గా ఉం చాల్సిన 150 టీఎంసీలను గురించి ఏ మాత్రం ఆలోచించకుండా మొత్తం జలాశయాలన్నీ ఖాళీ చేయడం దురదృష్టకరం. పులిచింతల కృష్ణా డెల్టా మొదటి పంటకు ముందుగా నీరందించే ప్రాజెక్టు. కానీ ఆ నీరూ వాడేశారు. రాబోయే నెలల్లో తాగునీటికి, నారుమళ్లకు నీరు ఎలా ఇస్తారు? ఇప్పటికే శ్రీశైలం, సాగర్‌లో పూడిక వలన 189 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని కోల్పోయాం. ఈసారి కూడా ఆలస్యమైతే కృష్ణా డెల్టాలోని 12 లక్షల ఎకరాల సాగు ప్రశ్నార్థకమే కదా? నీటి దుర్వినియోగాన్ని అరికట్టి, చట్టబద్ధంగా నీటి కేటాయింపులున్న వారికి, దుర్భిక్ష ప్రాంతాల తాగునీటి అవసరాలకు ప్రాధా న్యాన్నిచ్చే విధంగా రెండు ప్రభుత్వాలు సమన్వయంతో వ్యవహరిస్తే రెండు రాష్ట్రాల రైతులకు, ప్రజలకు కొంత మేరకైనా ప్రయోజనం. కేటాయింపులకు మించి అధిక నీటి వినియోగం జరుగుతున్న కృష్ణా, గోదావరి డెల్టాల నుంచి, సాగర్ ఆయకట్టు తదితరాల నుంచి 80 నుంచి 100 టీఎంసీల నీరు ఆదా చేసి తీరాలి. ఆ నీటిని దుర్భిక్ష ప్రాంతాల తాగునీటికి, చెరువులు, జలాశయాలు నింపుట ద్వారా భూగర్భ జలాల పెంపుదలకు వినియోగించాలి. కాబట్టి ఏపీ ప్రభుత్వం ఇప్పటికైనా పట్టిసీమపై పట్టుదలను వీడి, పోలవరం కుడి, ఎడమ కాల్వలను, ప్రాజెక్టును పూర్తి చేయుటకు ప్రాధాన్యం ఇవ్వాలి. పట్టిసీమపై పట్టుదలకు పోతే రాష్ట్ర ప్రయోజనాలకు తీరని నష్టం తప్పదు. దీనికి ఖర్చు చేసే రూ. 1,600 కోట్లు సీమ ప్రాజెక్టులలో అత్యవసర పనులకు వెచ్చించి, రాయలసీమ ప్రయోజనాలను కాపాడాలని రైతాంగ సమాఖ్య డిమాండ్ చేస్తోంది. పట్టిసీమపై పట్టువీడి, పోలవరం పూర్తి చేద్దాం! రాష్ట్ర ప్రయోజనాలను కాపాడదాం! (వ్యాసకర్త ‘రైతాంగ సమాఖ్య’ అధ్యక్షులు ఫోన్ నం: 98495 59955) -
‘నేను’గా మారిన ‘ఆప్’
విశ్లేషణ తొలిదశలో పార్టీ నావ మునకేయకుండా ఉండటానికి పనికొచ్చే బరువుగా సైద్ధాంతిక ఆదర్శవాదం పరిమితమైతే మంచిదని కేజ్రీవాల్ భావించారు. పార్టీని పరిరక్షించడానికిగానీ లేదా ప్రభుత్వాన్ని నడపడానికిగానీ అది పనికిరాదని ఆయన నిర్ణయించారు. అధికారం బుట్టలోంచి ఆయన ప్రతి ఎమ్మెల్యేకు ఓ రొట్టె ముక్కనో లేదా చేపనో వేశారు. వారంతా మంత్రులో లేదా పార్లమెంటరీ కార్యదర్శులో అయ్యారు. ఇక వారు చేసే పనేమిటి? ఎవరికి తెలుసు? తలా ఒక కారూ, కార్యాలయమూ, సొంత డబ్బా కొట్టుకునే హక్కూ లభిస్తాయి. ఫ్రాయిడియన్ చింతనలోని ఏ ఉప స్రవంతిలోంచి ‘‘సాలా’’ అనే పదం భారత ఉపఖండమంతా దూషణాత్మక అసమ్మతిగా మారింది? ఇదో పెద్ద చిక్కు ప్రశ్న. మనమంతా కులం, జాతి, మతం, దేశం వంటి భిన్న వర్గాలుగా విడిపోయి ఉండొచ్చు. కానీ ‘‘సాలా’’ పదానికి వచ్చేసరికి మన సాంస్కృతిక, భాషాపరమైన నిబద్ధతలో అపూర్వమైన ఐక్యత ఉంది. మీరు, హిందీ, ఉర్దూ, బెంగాలీ, భోజ్‌పురీ, పంజాబీ, గుజరాతీ, మరాఠీ తదితర భాషల్లోనూ లేదా ఆరోగ్యకరంగా స్థానికీకరించిన ఇంగ్లిష్‌లో మాట్లాడినా ‘‘సాలా’’ స్థానం మాత్రం అగౌరవ సూచకాల జాబితాలోనే (బెంగాలీలో ‘‘షాలా’’ అన్నా దాని స్థానం అక్కడే). సర్వవ్యాపితమైన ఆ పదాన్ని రకరకాలుగా ఉచ్చరిం చడంపై యాక్టింగ్ స్కూల్లో ఏకంగా ఒక కోర్సునే నడపొచ్చు. ఎందుకు? నాకు తెలీదు. నిజానికి ఆ పదానికి అర్థం, తనకంటే చిన్నవాడైన బావమరిది అని మాత్రమే. అంతకు మించి అందులో ఉద్రేకాన్ని రేకెత్తించేదేమీ లేదు. అది చాలా కుటుంబాల్లో సర్వసామాన్యంగా కనిపించే బంధుత్వ మే. అయినా ‘‘సాలా’’ మనోవిజ్ఞాన విశ్లేషకులందరి సమష్టి శక్తిసామర్థ్యాలకు సైతం అందని ఏదో లోతైన, చీకటి, మార్మిక అపరాధాన్ని లేదా వాంఛను వ్యక్తం చేస్తోందా? ఏదేమైనా దానికి బహిరంగంగా ఉన్న అర్థం బావమరిదే. అది మాత్రం సుస్పష్టం. ఆగ్రహం లేదా దౌర్జన్యం వల్ల ఒళ్లు మరచిన ఆవేశం ఆవహించి ఉన్నప్పుడు ఆ పద ప్రయోగం ఒక ప్రత్యేక విద్వేషపూరిత భావాన్ని సంత రించుకుంటుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మధ్యతరగతి నైతి కతావాదుల పాలిటి అత్యధునాతన కథానాయకుడు. ఇటీవలి కాలంలో ఢిల్లీలో జీవన భద్రతను కోల్పోయినవారి పాలిటి పవిత్ర ఆశాజ్యోతి. అలాం టాయన ఆ పదాన్ని ప్రయోగించారు. అదీ కూడా నేడాయనకు గిట్టకుండా పోయిన ఒకప్పటి సహచరులు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్‌లకు వ్యతిరేకంగా. పైగా ఆయన తన ఆగ్రహ పదజాలానికి ‘‘కమీనా’’ను (ద్రోహి లేదా నీచుడు) కూడా జోడించారు. తద్వారా వారి సవాలును విషపూరిత విద్రోహంగా కొట్టిపారేశారు. ఆయన గొంతుక నుంచి బుసబుసమంటూ పొంగుకొచ్చిన మాటలు ఎన్నటి నుంచో పేరుకుపోతూ వచ్చి, బద్దలయ్యే అవకాశం కోసం ఎదురు చూస్తున్న లావా. కేజ్రీవాల్, భూషణ్, యాదవ్‌లు ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటుచేసి, పూర్తిగా స్థానికమైనవైన రెండు ఎన్నికల విజయాలను జాతీయ వార్తలుగా మార్చిన నాయకత్రయం. వారిలో శాంతిభూషణ్ నిశ్శబ్దంగా పనిచేసు కుపోయే సిద్ధాంతవేత్త. కాగా, యోగేంద్ర యాదవ్ ఆ పార్టీ ప్రధాన వ్యూ హకర్త. ఇక కేజ్రీవాల్ బహిరంగ ప్రచారవేత్త కాబట్టి అందరి దృష్టిలో నాయకునిగా గుర్తింపును, విశ్వాసాన్ని చూరగొన్న నేత. భూషణ్, యాదవ్‌ల సహాయం లేనిదే కేజ్రీవాల్ నేడున్న స్థానానికి చేరగలిగేవారే కాదు. అయితే వైఫల్యం సానుభూతిని రేకెత్తించే చోట విజయం క్రూరమైన దవుతుంది. ఎందుకంటే విజయం అహాన్ని పెంచి పోషిస్తే, ఓటమి ఉద్రే కోద్వేగాలు మొద్దుబారేట్టు చేస్తుంది. ఆందోళనల దశలో కేజ్రీవాల్ తనకు మార్గదర్శకులైన వారితో కలసి బహిరంగ వేదికలను పంచుకోవాల్సివస్తే సంతోషపడేవారు, ఆతురతను సైతం కనబరిచేవారు. అత్యున్నత వేదిక సంగతికి వస్తే అది వేరే కథ. ఆమ్ ఆద్మీకి పొట్టి పేరు‘ఆప్’. అంటే హిందీలో అత్యంత మర్యాదపూర్వకమైన ‘‘మీరు’’ అని అర్థం. ఆనందదాయకమైన ఈ శ్లేషను ఆప్ నేతలు ఓట్లను అభ్యర్థించేటప్పుడు అత్యంత సమర్థవంతంగా ప్రయోగించారు. నేడు అధికారంలో ఉన్న కేజ్రీవాల్ నిర్మొహమాటంగా పంపుతున్న సందేశం ఒక్కటే. ఆప్ ‘‘నేను’’గా మారిపోయింది. ఆమ్ ఆద్మీ ఇక కేజ్రీవాల్ పార్టీ. ఆయన అభీష్టానుసారం ఇతరులంతా పనిచేయాల్సిందే. సమానుల మధ్య ఆయన ప్రథముడు కాడు. ఆయన మాత్రమే ప్రథముడు. ఆపై ఇక ఉండేది ఫుల్స్టాప్ గుర్తు మాత్రమే. ఏ విడాకుల ముచ్చట్లయినా కాసేపే ఉత్సుకతను రేకెత్తిస్తాయి. ఆ తర్వాత మహా విసుగు పుట్టిస్తాయి. చేదు కషాయంలాంటి ఆప్ విడాకుల వ్యవహారం, ఆస్తి హక్కుల వివాదంతో ముడిపడి ఉంది. కాబట్టి ఇంకాస్త ఎక్కవ కాలంపాటూ ఈ ఆసక్తి ఉంటుంది. వివాదాస్పదంగా మారిన ఆప్ ఆస్తుల్లో కపట పవిత్రత కూడా ఒకటి. కాబట్టి వాదోపవాదాలు సైతం ‘నీ కంటే పవిత్రుడను నేనే’ అంటూనే సాగుతాయి. ఆ విషయం ఇప్పటికే కనబడుతోంది కూడా. అయితే నైతికత తమదేనని వాదిస్తున్నది మాత్రం అధికారంలో లేని పక్షమే. కేజ్రీవాల్ పక్షాన ఒక సర్వ సేనాని, 66 మంది సైనికాధికారులు, క్షీణిస్తున్న కాల్బలం ఉన్నాయి. ప్రత్యర్థి వాదనల తిరస్క రణకు నియమ నిబంధనలను అప్పుడే ప్రకటించేశారు. వారి సరికొత్త పవిత్ర ప్రశ్నావళి పేరు ఆచరణతాత్మక రాజకీయాలు. ఈ మార్పు ఇటీవలి ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా రూపు దిద్దుకుంది. నాలుగు రూ. 50 లక్షల చెక్కులను కేజ్రీవాల్, కనీసం ఆ డబ్బు ఎక్కడిదని లేదా వాటి మూలమేమిటని కూడా ప్రశ్నించకుండా పుచ్చు కున్నారు. కేజ్రీవాల్ విహారయాత్ర విడిదిలోకి అవి కనుచూపు మేరలో ఏ ఆధారమూ లేకుండా చూసి మరీ నడచి వచ్చాయి. టికెట్లు కోరే అనుమా నాస్పద వ్యక్తుల నుంచి ఆయన డబ్బు స్వీకరించారు. ఇది బాధ్యతాయు తంగా ఆ సంప్రదాయానికి చేసిన సత్కారం. పోలీసులు కోర్టులో ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం ఆయన పార్టీ అభ్యర్థులు పోలింగ్‌కు ముందు రోజున ఓటర్లకు మద్యం సరఫరా చేశారు. ప్రశాంత్‌భూషణ్, యోగేంద్రయాదవ్‌లు ఢిల్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయాన్ని దెబ్బతీయడానికి శాయశక్తులా ప్రయత్నించారని కేజ్రీవాల్ కోపంతో వివర్ణమైన మొహంతో పదేపదే నొక్కి చెబుతుండటం ఆసక్తికరం. అందుకే ‘‘కమీనా’’ పదప్రయోగం. ఇంతకూ వారు ఆప్ విజయాన్ని దెబ్బ తీసే పని ఏం చేశారు? ఎలా చేశారు? ఏ ఎన్నికల సభలోనూ లేదా పత్రికా సమావేశంలోనూ భూషణ్గానీ, యాదవ్‌గానీ కేజ్రీవాల్‌కు హానికరమైనది ఏదీ మాట్లాడలేదు. వారు తమ భిన్నాభిప్రాయాలను తమలో అలాగే అట్టిపెట్టుకున్నారు. కాబట్టి వారు కేజ్రీవాల్‌తో జనాంతికంగా మాట్లాడి నప్పుడు తామంతా నైతిక నిష్ఠకు, విలువలకు కట్టుబడి ఉండాలని చెప్పి ఉండాలి. పారదర్శకతకు కట్టుబడి ఉంటామని వారు ప్రజలకు వాగ్దానం చేశారు. ప్రశాంత్‌భూషణ్, యోగేంద్ర యాదవ్‌లు పారదర్శకతే తమ పార్టీ విలక్షణత (యూఎస్పీ) అని భావించారు. (యూఎస్పీ- వినియోగదా రులను విశేషంగా ఆకట్టుకునేలా చేసే తమ ఉత్పత్తి లక్షణం) ఆ ప్రత్యేకత వల్లనే ఓటర్లు తమ పార్టీ పట్ల ఆకర్షితులవుతారని నమ్మారు. కేజ్రీవాల్‌కు కూడా వారంతగానే తమ పార్టీ యూఎస్పీని లేదా ప్రత్యేకతను నమ్మారు... కాకపోతే అది కేజ్రీవాల్ మాత్రమేనని భావించారు. ఇక మిగతాదంతా శబ్దార్థ శాస్త్ర వాదోపవాదాలే. పార్టీ ఢిల్లీ కేంద్రమైనదిగానే ఉండాలా? లేక విస్తరించేదిగా ఉండాలా? అనేది అసంబద్ధమైనది. రంగప్రవేశంతోనే పార్టీ నావ మునక వేయకుండా ఉండటానికి పనికివచ్చే బరువుగా మాత్రమే సైద్ధాంతిక ఆదర్శవాదం పరిమితమైతేనే మంచిదని కేజ్రీవాల్ భావించారు. పార్టీని పరిరక్షించడా నికిగానీ లేదా ప్రభుత్వాన్ని నడపడానికిగానీ అది పనికిరాదని ఆయన నిర్ణ యించారు. అధికారం బుట్టలోంచి ఆయన ప్రతి ఎమ్మెల్యేకు ఓ రొట్టె ముక్క నో లేదా చేపనో ఇచ్చారు. వారు మంత్రులో లేదా పార్లమెంటరీ కార్య దర్శు లో అయ్యారు. ఇదమిత్థంగా ఈ పార్లమెంటరీ కార్యదర్శులు చేసే పనేమిటి? ఎవరికి తెలుసు? ఎవరికి పట్టింది? వారికి మాత్రం తలా ఒక కారూ, కార్యాలయమూ, సొంత డబ్బా కొట్టుకునే హక్కూ లభిస్తాయి. 2014లో కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన దిలీప్ కుమా ర్ సినిమాలోని ‘‘ఇన్సాన్ కో ఇన్సాన్ సే హో భాయ్ చారా, యెహీ పైగాం హమారా’’ (మనిషికి మనిషితో ఉన్నది సహోదర బంధం, అదే మా సందే శం) అనే పాటను పాడారు. 2015లో ఆయన సంగీతం జోలికె ళ్లకుండా నిగ్ర హం చూపారు. కానీ ఆయన ఈ దిలీప్‌కుమార్ పాటను పాడి ఉండా ల్సింది: ‘‘సాలా, మైతో సాహబ్ బన్ గయా’’(సాలా, నే నయ్యా యజ మానిని)... అరవింద్ కేజ్రీవాల్ సవరించిన నియమ నిబంధనావళిలో బావమరుదుల గతి ప్రవాస విషాదమే. సంప్రదాయకమైన భ్రష్ట సోదరులెవరికైనా సుస్వాగతం. -
చీకటి చట్టానికి న్యాయమైన చెల్లు చీటీ
విశ్లేషణ ఈ సెక్షన్ మన రాజ్యాంగ నియమాలకూ, స్వేచ్ఛా హక్కు సూత్రాలకూ, ఆర్టికల్ 19(1)లో హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్య్రానికీ పూర్తిగా భంగకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో ఒక చీకటి చ ట్టం అంతమైంది. రాజ్యాంగ మూలసూత్రమైన వాక్ స్వాతంత్య్రానికి సుప్రీం కోర్టు భరోసా ఉంది. ప్రజా స్వామ్య విలువలకు ఊతం దొరికింది. జనం కోసం జైళ్ల్ల తలుపులు తెరిచి ఉంచే ఐటీ చట్టం సెక్షన్ 66ఎ.. సర్వోన్నత న్యాయస్థానం వేటుకు గురైం ది. ఎవరికైనా ఇబ్బంది కలి గించే రాతలు పత్రికలలో రాస్తే నేరం కాదు. ఉత్తరాలు రాస్తే నేరం కాదు. కాని ట్వీటర్ లేదా ఈమెయిల్లో రాస్తే మాత్రం నేరం. ఇదెక్కడి న్యాయం? ప్రపంచంలో ఎక్కడా అసౌకర్యమైన రాతలు, గాయపరిచే మాటలు రాయడాన్ని నేరంగా పరిగణించి శిక్షించే చట్టాలుండవు. కానీ ఐటీ చట్టం 2000, 66ఎ సెక్షన్ ద్వారా జనాన్ని జైళ్ల కు పంపే కొత్త విధానం 2008 నుంచి ఈ దేశంలో ప్రవే శించింది. దాని దెబ్బపడే దాకా మాట్లాడే స్వేచ్ఛకు అదెంత ప్రమాదకరమో చాలా మందికి అర్థం కాలేదు. దీనిని పాలకులూ, పోలీసులూ ఇష్టారాజ్యంగా దుర్విని యోగం చేస్తున్న సందర్భాలలో ఈ వ్యాసకర్త సహా అనేక మంది అనేక సార్లు ఇబ్బందులను ప్రస్తావిస్తూ అనేక వ్యాసాలు రాశారు. ఇలా మీడియాలో కొందరు ప్రచార సంగ్రామం చేసినా ప్రభుత్వం కదలలేదు. సుప్రీం కోర్టు లోనే నేరుగా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. అయినా ఈ సెక్షన్ ఎంతో గొప్పదనీ, దాని అవసరం ఎంతో ఉంద నీ ప్రభుత్వం వాదించింది. ఈ సెక్షన్ మన రాజ్యాంగ నియమాలకూ, స్వేచ్ఛా హక్కు సూత్రాలకూ, ఆర్టికల్ 19(1)లో హామీ ఇచ్చిన వాక్ స్వాతంత్య్రానికీ పూర్తిగా భంగకరమని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జె. చలమేశ్వర్, ఆర్.ఎఫ్. నారిమన్ చరిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో ఒక చీకటి చ ట్టం అంత మైంది. రాజకీయ విమర్శకీ, అసమ్మతికీ, ఉన్నత పదవు లలో ఉన్నవారి అభిప్రాయాలను నిలదీసే, వాటిని వ్యతి రేకించే ఆస్కారం లేకపోతే ప్రజాస్వామ్యం అర్థం పర్థం లేని వ్యవహారంగా మిగిలిపోతుంది. ఇలాంటి స్వేచ్ఛ విశృంఖలమైందేమీ కాదు. ఆర్టికల్ 19(2)లోని ఎనిమిది అంశాల ఆధారంగా చట్టపరమైన పరిమితులు విధించ వచ్చు. ఐటీ చట్టం ఆ ఎనిమిది అంశాలను దాటి, తప్పు రాతలేమిటో స్పష్టంగా నిర్వచించకుండానే కొత్త శిక్షలను విధించిందని సుప్రీంకోర్టు ‘66 ఎ’ను తప్పు పట్టింది. మిలియన్ల మందికి ఒకేసారి చేరే సందేశాలు నేరపూరితమైతే శిక్షిస్తామని ఈ చట్టం పేర్కొంది. కాని ఒకే వ్యక్తికి పంపిన సందేశం వల్ల కూడా ఇదే శిక్షకు గుర య్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ రెంటికి మధ్య తేడాను సెక్షన్ 66ఎ వివరించలేదు. కాబట్టే నిలబ డలేకపోయింది. ఒక వర్గాన్ని రెచ్చగొట్టే రాతలూ, పబ్లిక్ ఆర్డర్ (శాంతి)కి విఘాతం కలిగించే విధంగా ఉన్న రాత లు మాత్రమే శిక్షార్హమని పేర్కొంటే బాగుండేది. అదీ లేదు. రాతలకూ, వాటి ఫలితానికి మధ్య సంబంధం లేకపోయినా శిక్షార్హమైన నేరాలంటారా? ఒక వ్యక్తిని అల్ల రిపెట్టే ఒక్కమాట కూడా నేరమే. దాని వల్ల సమాజా నికి, ప్రశాంతతకు నష్టం ఏమీ లేకపోయినా అతడిని శిక్షించే అవకాశం ఉంది. అట్లా మా ప్రభుత్వం ఎప్పుడూ శిక్షించదు. కేవలం శాంతి భద్రతలను దెబ్బతీసే రచన లను మాత్రమే శిక్షార్హం చేస్తామని ప్రస్తుత ప్రభుత్వం సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది. ఇచ్చిన హామీకి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని నమ్మినా, రాబోయే ప్రభుత్వాలు కూడా కట్టుబడి ఉంటాయా? అమాయ కంగా రాసిన రాతకూ, ఉద్దేశ పూర్వక ప్రమాదకర రచ నకూ తేడా లేకుండా శిక్షించే సౌకర్యం అధికారులకు ఇస్తే దుర్వినియోగం కావడం ఖాయం. చర్చ, వాదన, అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే అవకాశం ఉండాలని రాజ్యాంగం నిర్దేశించింది. ఇబ్బంది పెట్టేది, ప్రమాదకరమైనది, బాధ కలిగించేది అంటూ రాతను శిక్షించే అవకాశం ఇండియన్ పీనల్ కోడ్‌లో లేదు. రెచ్చగొట్టే రచన కాకపోయినా ఇబ్బంది పెడితే అది నేరంగా పరిగణించేందుకు ఈ సెక్షన్ అవ కాశం ఇస్తున్నది. అశ్లీలమైన రచనలను శిక్షార్హం చేయ వచ్చు. శిక్షించవచ్చు. చిక్కేమిటంటే- 66ఎ కింద అశ్లీ లం కాకపోయినా శిక్షించవచ్చు. నేర పూరితం అంటే ఏమిటో తేల్చని అస్పష్టత 66ఎ నిండా ఉంది. ప్రమా ణాలు, మార్గదర్శకాలు, పరిధులు లేకుండా నేర నిర్ణ యం అమాయకులను శిక్షించడానికి ఉపయోగపడుతుం దని అమెరికా ఇంగ్లాండ్ న్యాయశాస్త్రాలు వివరిస్తు న్నాయి. మిగతా సెక్షన్లలో దురుద్దేశంతో, కావాలని, స్వచ్ఛందంగా, మోసపూరితంగా అనే మాటలు ఉన్నా యి. దురుద్దేశపూరితం కాని చర్యలను నేరాలుగా భావిం చడానికి వీలు లేదు. 66ఎ సెక్షన్లో అస్పష్టత ఆ సెక్షన్ మనుగడకు దెబ్బగా పరిణమించిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ట్వీటర్, ఫేస్బుక్ తదితర మీడియాల్లో విమర్శలకు దిగే గొంతులను నొక్కివేయడానికి ఇప్పుడు వీలులేదు. అసమ్మతి, విమర్శ, భిన్నాభిప్రాయం ప్రజా నిర్ణయాలకు మూలాధారాలు. వాటితోపాటు అవేమీ కాని మామూ లు మాటలను కూడా శిక్షార్హంగా పరిగణించడం ఇక చెల్లదు. ‘ఈ బంద్‌లు ఏమిటి?’, ‘ఆయన పోతే నగరం స్థంభించాలా?’, ‘ఆ మంత్రిగారి కొడుక్కున్న ఆస్తులు లెక్కిస్తే అసలు సంగతి తెలుస్తుంది...!’ వంటి మాటలు రాసినందుకు తెల్లవారుఝామునే పోలీసులు రావడం, లాకప్‌కు తరలించడం ఇకపై సాగదు. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
సామాన్యుడి మీద సమరం ‘న్యాయ’మా?
విశ్లేషణ ఆశ్చర్యకరంగా భారత ప్రభుత్వ న్యాయవాది (అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా) కూడా తాను పబ్లిక్ అథారిటీ కాదని వాదించారు. పబ్లిక్ అథారిటీ కాదని సీఐసీ దురదృష్టవశాత్తూ తీర్పు ఇచ్చింది. సమాచారం కావాలంటూ జనం సంధిస్తున్న ప్రశ్నాస్త్రా లు అధికార వ్యవస్థల గుండె ల్లో దడపుట్టిస్తున్నవి. మేం పబ్లి క్ అథారిటీ కాదంటూ కోర్టుల కెక్కుతున్నారు. సహ చట్టం పట్టు నుంచి జారిపోవడానికీ, సమాచారం ఇచ్చే బాధ్యత నుంచి పారిపోవడానికే ఆ ప్రయత్నమంతా. కరెంటు బిల్లులతో షాకులందించి జనాన్ని కష్టాల్లో ముంచెత్తుతున్న డిస్కంలు, సర్కారీ డబ్బుతో సహకార ఇళ్ల సంఘాలు పెట్టి లాభపడే కమిటీలను చూస్తున్నాం. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో వైద్యశాలలు కట్టి రోగుల నుంచి కోట్లు కొల్లగొడుతూ, తాము జనానికి జవాబు దారీ కాబోమని కోర్టులకెక్కి ప్రజల్ని వేధించుకు తినే ఆస్పత్రులనూ చూస్తూనే ఉన్నాం. ఆశ్చర్యకరంగా భార త ప్రభుత్వ న్యాయవాది (అటార్నీ జనరల్ ఆఫ్ ఇండి యా) కూడా తాను పబ్లిక్ అథారిటీ కాదని వాదించారు. పబ్లిక్ అథారిటీ కాదని సీఐసీ దురదృష్టవశాత్తూ తీర్పు ఇచ్చింది. దరఖాస్తుదారులు సీఐసీ తీరు్పును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారు. ఏజీఐ సమాధానమూ సమాచారమూ ఇవ్వాల్సిందేనని మార్చి 10, 2015న ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఇది చారిత్రాత్మకమైన నిజని ర్ధారణ. ఆర్కే జైన్, సుభాష్ చంద్ర అగ్రవాల్ ఆర్టీఐ కింద ఏజీఐ కార్యాలయాన్ని కొంత సమాచారం అడిగారు. తాము పబ్లిక్ అథారిటీ కాదని, తమకు సమాచార అధి కారి లేడని, కనుక ఇవ్వబోమని జవాబిచ్చారు. వారు సీఐసీకి ఫిర్యాదు చేసుకున్నారు. మీరు సమాచారం ఇవ్వాల్సిందేనని సీఐసీ ఆదేశించింది. ఏజీ గారు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగం ద్వారా ఏర్పాటైన వ్యవస్థను పబ్లిక్ అథారిటీగా సెక్షన్ 2(హెచ్) నిర్ణయించింది. రాజ్యాంగ అధికరణం ఆర్టికల్ 76 కింద అటార్నీ జనరల్ ఆఫ్ ఇండి యాగా పెద్ద లాయర్‌ను నియమిస్తారు. కోర్టు ధిక్కార చట్టం కింద ఏజీఐ కదిలిస్తేనే ధిక్కార నేరం కేసులు విచా రణ జరుగుతాయి. బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో అధి కారిక హోదాలో సభ్యుడు, న్యాయవాదులకు నాయ కుడు. చట్టపరమైన అంశాలలో కేంద్రానికి సలహా ఇవ్వా లి. రాష్ర్టపతికి కూడా సలహా ఇవ్వాలి. ఆర్టికల్ 88 కింద పార్లమెంటు ముందు హాజరై న్యాయ అంశాలు వివరిం చాలి. ప్రభుత్వం తరఫున కోర్టులో వాదించాలి. జీత భత్యాలు, వనరులు, సౌకర్యాలు, సహాయక సిబ్బంది వారికి ఉండాలి. తాము సాధారణంగా అథారిటీ కాదని, తమకు ఎవరి హక్కులనూ తగ్గించే అధికారం లేనే లేదని ఏజీఐ వాదించారు. కేవలం సలహాలు ఇస్తామని, వాటిని అమలు చేయకపోయినా చేసేదేమీ లేదని కనుక తాను అధికారిని కాదని అన్నారు. వారి పని న్యాయ సలహాలు ఇవ్వడం మాత్రమే అన్నది నిజమే అయినా, ఇతర రాజ్యాంగ అధికారుల కంటే వీరికి తక్కువేమీ లేదని, ఆర్టీఐ చట్టం సెక్షన్ 2 (హెచ్)లో సలహా అధికారులు పబ్లిక్ అథారిటీ కాదని చెప్పే సూచనేదీ లేదని, రాజ్యాంగం, ఇతర అనేక చట్టా లలో ఏజీఐ అధికారాలేమిటో స్పష్టంగా ఉన్నాయని ఢిల్లీ హైకోర్టు వివరించింది. కొన్ని సంస్థలు, అథారిటీలు ఆర్టికల్ 12 కింద స్టేట్ కాబోదని సుప్రీంకోర్టు నిర్ణయించినప్పటికీ, ఆర్టీఐ కింద జవాబు ఇవ్వవలసిన బాధ్యత మాత్రం వాటికి ఉంటుం ది. ఆర్టీఐ అవసరాలకుగాను పబ్లిక్ అథారిటీ అవునో కాదో తేల్చడానికి రాజ్యాంగ కొలమానాలు తీసుకోవల సిన అవసరం లేదని, ప్రజా సంబంధమైన అధికారాలు నిర్వహించవలసి ఉన్న కారణంగా కూడా ఏజీఐ పబ్లిక్ అథారిటీ అవుతారనీ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి విభు బాఖ్రూ నిర్థారించారు. పార్లమెంటు చేసిన చట్టాలను ప్రభుత్వ విధానాలను కోర్టుల్లో నిలబడి సమర్థించ వలసిన ప్రభుత్వ లాయరే చట్టాలలోని నియమాలకు వ్యతిరేకంగా వాదిస్తూ, నియమాలకు అతీతమైన అంశా లను లేవదీస్తూ హైకోర్టులో ప్రజలకూ ప్రభుత్వానికీ వ్యతిరేకంగా కేసులు వేయడం అసలు సిసలు విచిత్రం. ఏ ప్రైవేటు ధనార్జన సంస్థలో, తాము పబ్లిక్ అథారిటీ కాదని, జవాబులు ఇవ్వబోమని వాదిస్తే ఈ ధోరణిని నిరోధిస్తూ, జనం పక్షాన ఉండవలసిన న్యాయవాద అధికారులే చట్టానికి వ్యతిరేకంగా నిలబడితే సమాచార చట్టం ఏమవుతుంది? సమాచార హక్కు చట్టాన్ని సమ ర్థించవలసిన వారే దాన్ని నీరుగార్చే లిటిగేషన్లు సృష్టిస్తూ ఉంటే ఈ కేసులు ఎప్పుటికి తెములుతాయి? సమాచారం జనానికి ఎప్పుడు చేరుతుంది? ప్రభుత్వ సంస్థలూ, అధికారులే సమాచార చట్టా న్ని ఈ విధంగా దెబ్బ తీస్తే రక్షించుకోవలసింది ఇక ప్రజ లే. ఇటువంటి అనవసర వివాదాలు ఏళ్ల తరబడి హైకో ర్టు గుమ్మాల్లో పడిగాపులు పడకుండా ఉండాలంటే సర్కారు వారు ఇటువంటి కేసులను ప్రోత్సహించకుం డా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. ఈ రోజుల్లో హైకోర్టు, సుప్రీంకోర్టులలో పోరాడాలంటే కొన్ని లక్షల రూపాయలు లేదా కోట్ల రూపాయలు అవసరం. ప్రభు త్వం వారు ప్రభుత్వం ఖర్చుతో పౌరుడిపైన న్యాయ సమరం సాగిస్తూ ఉంటే సామాన్యులు తట్టుకోగలరా? ఇప్పటికైనా ఈ న్యాయ పోరాటాన్ని ఏజీఐ గారు తదితర తత్సమాన న్యాయాధినేతలు ఢిల్లీలో హైకోర్టు తీర్పుతోనే ఆపుతారని, సుప్రీంకోర్టు దాకా లాగకుండా పౌరులు అడిగిన సమాచారం ఇవ్వడానికి కావలసిన వ్యవస్థను ఏర్పాటు చేసుకుంటారని ఆశిద్దాం. (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
కామ్రేడ్లకు ‘ఆమ్ఆద్మీ’ పాఠాలు
విశ్లేషణ ప్రతి సమస్యకు కమ్యూనిస్టులు అంతిమ పరిష్కారం వైపే చూపడం నిర్లిప్త ధోరణిని పెంపొం దింపజేస్తుంది. తక్షణ సమస్యలకు, పరిష్కారాలకు ప్రాధాన్యం ఇచ్చి వారు సామాన్య ప్రజానీకంతో మమేకం కావాలి. ఈ పార్టీ మాది, ఈ నేతలు మా వాళ్లు అని ప్రజలు ఆత్మీయంగా స్వీకరించగలగాలి. ఆప్ విజయ రహస్యాల్లో ప్రధానమైనది ఇదే. నాయకుడు సామాన్యునిగా ఉండటం, సామాన్యులతో మమేకం కావడమే అసామాన్య లక్షణం! దీనిని దృష్టిలో ఉంచుకొని కమ్యూనిస్టులు ఆత్మపరిశీలన చేసుకుంటారని ఆశించవచ్చా? ‘ఒక సూర్యుండు సమస్త జీవులకు ఒక్కొక్కడై తోచు పోలిక’ అన్నట్టు ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ సాధించిన విజయం ఒక్కొక్క తరహా ప్రజలకు ఒక్కొక్క విధంగా కన్పించి ఆహ్లాదపరచి ఉండవచ్చు. ఈ గెలుపుతో తమ జీవితాలు ఇక మరింత సులభతరం, సౌకర్యవంతం కావచ్చని పేద, దిగువ మధ్యతరగతి వర్గాల ప్రజలు భావిస్తుండవచ్చు. బీజేపీ ప్రత్యేకించి నరేంద్ర మోదీ ప్రేరిత మతత త్వ, విభజన రాజకీయాల వ్యతిరేక విజయమిది అని లౌకిక శక్తులు అనుకోవచ్చు. కృత్రిమ మత ఘర్షణలకు తావే లేని సామా జిక శాంతిని నెలకొల్పగల విజయమని ఉన్నత మధ్యతరగతి, ధనికవర్గాలు సైతం ఈ విజయాన్ని ఆహ్వానిస్తున్నాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టి వ్యక్తిస్వామ్యంతో ఆర్డినెన్స్‌ల రాజ్ చలాయిస్తున్న మోదీ ‘రోడ్ రోలర్’ పాలనకు ఆప్ అడ్డుకట్ట వేసిందని ప్రజాస్వామికవాదులు అనుకో వచ్చు. పేద, సాద, రైతాంగంపై భారం మోపుతూ కార్పొరేట్ గుత్తాధిపతుల అడుగులకు మడుగులొత్తే కుబేరుల పాలనకు వ్యతిరేకమైన తీర్పుగా దీన్ని వామపక్షాలు భావిస్తుండవచ్చు. అమెరికా అధ్యక్షుని ప్రాపకం కోసం దేశ ఆత్మగౌరవాన్నే కించపరచడానికి వెనుదీయని మోదీ విలాసవంతమైన ఆడంబరానికి, ప్రచార ఆర్భాటానికి ఢిల్లీ ఓటర్లు చెంపపెట్టు పెట్టారని ప్రగతి కాముకులు భావించవచ్చు. వివిధ భాషల, నాగరికతల, సంస్కృతుల ప్రజల సమ్మేళనమైన ఢిల్లీ ‘మినీ భారత్’. అది మన దేశ వైవిధ్యానికి ప్రతీక. ఆ వైవిధ్యాన్ని నిరాకరించి, ఏకశిలాసదృశమైన ఒకే భారత జాతి అనే ధోరణితో పెత్తనం చలాయిస్తున్న అంతర్గత నయా వలసవాదులను ఢిల్లీ ఓడించిందని జాతుల స్వేచ్ఛాప్రియులు ఆనందిస్తుండవచ్చు. పదవీ వ్యామోహానికి, కులమత రాజకీయాలకు, అధికార దుర్వినియోగానికి, అహంకారానికి, డబ్బు దర్పం, మద్యాలకు మారుపేరుగా మారుతున్న రాజకీయ పార్టీలకు విభిన్నమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని ఆప్ విజయం ముందుకు తెచ్చిం దని మరెందరో ఆశిస్తుండవచ్చు. ఏది ఏమైనా ఈ విజయం సామాన్యుని అసామాన్య విజయం అన్నది వాస్తవం. ‘ఆప్’ పరిమితులు...పాఠాలు ఆప్ విజయాన్ని మనసారా ఆహ్వానిస్తూనే, ఈ గెలుపునకు ఉన్న పరిమితు లను సైతం దృష్టిలో ఉంచుకోవాలి. ఇదేదో సమూల, శాశ్వత, గుణాత్మక మార్పుగా విశ్లేషించడం తొందరపాటు. అదలా ఉంటే, సాంప్రదాయక పార్టీల సంగతి ఎలా ఉన్నా కమ్యూనిస్టు పార్టీలు ఆప్ విజయం నుంచి నేర్చుకోవాల్సిన గుణపాఠాలున్నాయి. పార్లమెంటరీ పంథాను, ఎన్నికలను బహిష్కరించే మావోయిస్టుల విషయం ఇక్కడ అప్రస్తుతం. ఉభయ కమ్యూ నిస్టు పార్టీలు, ప్రత్యేకించి కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో వామపక్షాలకు నాయకత్వ శక్తిగా ఉంటూ తరచుగా ప్రభుత్వాలను సైతం నడుపుతున్న సీపీఎం మరింత నిశితంగా ఆప్ అనుభవం నుంచి నేర్చుకొని ఆచరించదగిన అంశాలను పరిశీలించాల్సి ఉంది. వామపక్ష ప్రజాతంత్ర రాజకీయ ప్రత్యామ్నాయాన్ని దేశ ప్రజల ముందుంచాల్సిన బాధ్యత నేడు ఆ పార్టీపైనే అధికంగా ఉంది. కమ్యూనిస్టుల కాలం చెల్లిన నిర్మాణం పేరుకు తగ్గట్టే ఆమ్ ఆద్మీని సామాన్య ప్రజలు సొంతం చేసుకున్నారు. అది వారికి తమకు చెందనిదిగాగానీ, ప్రత్యేక సైద్ధాంతిక, నిర్మాణ స్వరూ పంతో తమకు దూరంగా ఉన్న పార్టీ గాగానీ కనిపించలేదు. కమ్యూనిస్టు పార్టీలు అలా ఉన్నాయా? సామాన్య ప్రజలు తమకు తాముగా స్వచ్ఛందం గా పార్టీలో భాగస్వాములై, దానిని బలోపేతం చేయాలని భావించే విధం గా అవి ఉన్నాయా? కనీసం పార్టీ కార్యకర్తలైనా తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పగల అవకాశం ఉన్న దా? ఎవరైనా అలా ధైర్యం చేసినా వాటిని విని ఆలోచించే పరిస్థితి ఆ పార్టీల లో ఉన్నదా? నిందలుగా గాక ఆత్మ విమర్శనా దృష్టితో ఈ ప్రశ్నలను లోతుగా తరచి చూడటం అవసరం. ‘‘పార్టీలో క్రియాశీ లంగా అంకిత భావంతో పనిచేసే కార్య కర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలే తప్ప, కక్షపూరితంగా వెంటాడి వేధించే ైవె ఖరి తగదని’’ లెనిన్ అన్నాడు. అలాంటి పరిస్థితి కమ్యూనిస్టు పార్టీల్లో ఏ మేరకు ఉందో అవి నిర్భయంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. కార్యకర్తలతో నాయకులు, నిరంకుశాధికార బృందం (బ్యురోక్రటిక్) ధోరణితో, అధికార దర్పంతో వ్యవ హరిస్తుంటే, క్రింది కార్యకర్తల అభిప్రాయాలు, సూచనలను తూష్ణీ భావంతో తిరస్కరిస్తుంటే కార్యకర్తలలో భయం తప్ప సృజనాత్మకత, క్రియాశీలత కనిపించదు. ‘‘నాయకుడు ఓ ప్రతిపాదన చేస్తే బల్ల చుట్టూ ఉన్న మిగతా వారంతా చప్పట్లు కొట్టేయడమే తప్ప.. ప్రశ్నించడం, కామ్రేడ్లీగా చర్చించడం అనేదే ఉండదు. కార్యకర్తల ఈ యాంత్రిక భాగసామ్యం, సృజనాత్మకత కొరవడిన వ్యవహార శైలి పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యానికి, పురోగమనానికి దోహదపడుతుందా?’’ అని లెనిన్ కాలంలోనే రోజా లగ్జెంబర్గ్ ప్రశ్నించారు. నాటి సోవియట్ తరహా పార్టీ నిర్మాణం నేటి మన ఎన్నికల పార్టీలకు సరిపడుతుందా? రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో స్టాలిన్‌కు తప్పనిసరి యైన ఉక్కు క్రమశిక్షణ కలిగిన విప్లవ పార్టీ నిర్మాణం నేటికీ వర్తిస్తుందా? పార్టీ ఎంచుకున్న పార్లమెంటరీ మార్గానికి అనుగుణమైన వెసులుబాటుతనంతో కూడిన సమన్వయం అవసరం లేదా? ఈ విమర్శలు సత్యదూరమైతే సంతోషమే! ఏదిఏమైనా ప్రజలు, కార్యకర్తలు సంతోషంగా, ఉత్సాహంతో పాల్గొనే విధంగా పార్టీ, ప్రజాసంఘాల పునర్నిర్మాణం అవసరం. నిర్ణయాలు రుద్దడంతో అనర్థమే కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట రాష్ట్ర కమిటీలపై బలవంతంగా నిర్ణయా లను రుద్దడాన్ని నిరోధించడం కోసం పార్టీ నిబంధనావళిని సవరించాలని పుచ్చలపల్లి సుందరయ్య జలంధర్ మహాసభలలోనే సూచించారు. ‘‘రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వ పెత్తనం పెరిగిపోయిందని, నిజమైన ఫెడరల్ స్వభావానికి వ్యతిరేకంగా కేంద్రం చేతుల్లో అధికారాలు కేంద్రీకృతమయ్యా యని మనం సబబుగానే విమర్శిస్తాం. కానీ మన పార్టీ నిర్మాణానికి వచ్చేస రికి కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట రాష్ట్ర పార్టీలపై అక్కడి పరిస్థితులకు భిన్నమైన విధానాలను రుద్దడం సమంజసం కాదు’’ అని ఆయన వాదించారు. నాడు పార్టీ నాయకత్వం ఆయన సూచనను తిరస్కరించింది. నిజానికి భారతదేశం బ్రిటిష్ పాలనకు ముందు ఒక దేశంగానే లేదు. వివిధ జాతుల సముదాయంగా ఉండేది. ఆ జాతులను విడిగా తమ సొంత రాజ్యాం గాలను రూపొందించుకునే అవకాశం ఉండే నూతన ప్రజాస్వామిక వ్యవస్థ లుగా గుర్తించాలి. కేంద్రం పరిమితాధికారాలు కలిగిన సమన్వయకర్తగా నే ఉండాలి. కేంద్రీకృత ప్రజాస్వామ్యం పేరిట పార్టీలో కేంద్రీకృతాధి కారం అందుకు భిన్నంగా లేదా? నీళ్లల్లో చేపలుగా మారాల్సిందే ఎన్నికలు, బహిరంగ సభలు, ర్యాలీలు వంటి రూపాలలో ప్రజాసమీకరణ చేసే కమ్యూనిస్టు పార్టీలు తాము కేవలం తమ కమిటీలకే బాధ్యత వహిస్తామంటే కుదరదు. ప్రజల పట్ల సైతం జవాబుదారీతనంతో వ్యవహరించాలి. పైగా ఇది తక్షణ ప్రజాసమస్యలపైనా, క్రమేపీ సైద్ధాంతిక సమస్య లపైనా కమ్యూనిస్టు పార్టీల మధ్య ఐక్య కార్యాచరణను సాధించడం కోసం కృషి చేస్తున్న సమయం. కమ్యూనిస్టు పార్టీల ఐక్యకార్యాచరణే సరిపోదు. ఇతర ప్రజాతంత్ర, పురోగామి శక్తులను, వ్యక్తులను కలుపుకుపోవడం అవసరం. ఈ సమయంలో ఆమ్ ఆద్మీ వంటి సామాన్య ప్రజాపార్టీలతో మైత్రి అవసరమని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అందుకు కాలాను గుణ్యమైన వెసులుబాటుకు వీలులేని (రిజిడ్) కమ్యూనిస్టు పార్టీల నిర్మాణంగానీ, పడికట్టు పదబంధాలతో కూడిన విసుగు పుట్టించే వాటి ఉపన్యాసరీతులు నేటి దశలో సరిపడవు. సాధారణ ప్రజలు, అభివృద్ధి కాముకులు, అన్నిటికీ మించి ఆమ్ ఆద్మీ వంటి పార్టీలు కమ్యూ నిస్టులతో కలసి పనిచేయడానికి తటపటాయించడం సహజం. ఏ సమస్య కైనా పరిష్కారంగా అంతిమ పరిష్కారాన్నే చూపడం ప్రజలలో, కార్యకర్తలలో నిర్లిప్త ధోరణిని పెంపొందింపజేస్తుంది. తక్షణ సమస్యలకు, వాటి పరిష్కా రాలకు ప్రాధాన్యం ఇస్తూ సాధ్యమైనంతగా విశాల సామాన్య ప్రజానీకంతో కమ్యూనిస్టులు మమేకం కావాలి. పార్టీ నేతలు, కార్యకర్తలు ‘నీళ్లల్లో చేప’ల్లా ప్రజాబాహుళ్యంలో కలసిపోవాలి. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ పార్టీ మాది, ఈ నేతలు, కార్యకర్తలు మా వాళ్లు అని ప్రజలు ఆత్మీయంగా స్వీకరిం చగలగాలి. ఆప్ విజయ రహస్యాల్లో ప్రధానమైన అంశం ఇదే. నాయకుడు సామాన్యునిగా ఉండటమే, సామాన్యులతో మమేకం కావడమే అసామాన్య లక్షణం! దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ విమర్శను కమ్యూనిస్టులు కామ్రేడ్లీ దృక్పథంతో స్వీకరించి ఆత్మపరిశీలన చేసుకొని, కర్తవ్యోన్ముఖులు కాగలరని ఆశించవచ్చా? (వ్యాసకర్త మార్క్సిస్టు విశ్లేషకులు మొబైల్ నం : 9848069720) -
ఇది మన ‘స్వయం’ఫ్లూ
విశ్లేషణ మనుషులకు సోకే వ్యాధుల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రజ్ఞానం ఆధునిక పాలనా వ్యవస్థలకు అనూహ్యమైన అవకాశాలు కల్పించింది. కాని లాభాపేక్షపై ఆధారపడి నడుస్తున్న పెట్టుబడిదారీ వ్యవస్థలూ, వాటి పాలకులూ అందివచ్చిన పరిశోధనా ఫలితాలను, ఔషధాలను ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం లేదు. దారిద్య్ర నిర్మూలనకు గాని, పేద, బలహీనవర్గాల కనీస ఆరోగ్య రక్షణకు గాని శ్రద్ధ వహించడం లేదు. ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణలను తలకెత్తుకున్నాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలూ మూతపడ్డాయి. ప్రజారోగ్య సంరక్షణ ప్రభుత్వ కర్తవ్యం కావలసిన చోట ఆరోగ్య వ్యవస్థను క్రమంగా ప్రైవేటు వ్యక్తుల పరం చేస్తూ వచ్చారు. ఆర్థిక సంస్కరణల వల్ల సామాన్య ప్రజ ల ఆరోగ్యం దెబ్బతిని రోగాలూ, రొష్టుల పాలవుతు న్నారు. ఈ దాడి బహుముఖంగా సాగింది. ఫలితం- పోషకాహారం తరిగిపోయింది. అంటువ్యాధులూ, వ్యాధులూ ప్రబలిపోయాయి. మటుమాయమైనాయను కున్న మలేరియా, క్షయ, కాలా అజార్, పోలియో వంటి రోగాలు తిరిగి తలెత్తాయి, పెరిగాయి. అరవింద్ (గ్లోబలైజేషన్: యాన్ ఎటాక్ ఆన్ ఇండియాస్ సావర్నిటీ) రోగాలలో గురక ప్రమాదకరమైనదని అంటారు. ‘గురక’ అంటే పశు వ్యాధి. ఈ వ్యాధికి మూలం పంది. దీనికి వచ్చిన కొత్త పేరే స్వైన్ ఫ్లూ. పందులలో ఇది సాంక్రమిక శ్వాసకోశ వ్యాధి. వాతావరణంలో మార్పు లతో, సీజనల్‌గా వచ్చిపోయే సాధారణ ఫ్లూ, ఇన్ఫ్లు యెంజా వంటి వ్యాధి కాదిది. పందులకూ, పక్షులకూ తోడు మనుషులకు కూడా వ్యాపించే ఇన్ఫ్లుయెంజాకు స్వైన్ ఫ్లూ అని పేరు పెట్టారు. ఇటీవల బాగా భయ పెట్టిన డెంగ్యూ తరువాత అత్యంత ప్రమాదకరమైన వ్యాధిగా దీనినే గుర్తిస్తున్నారు. ఈ రెండింటి తరువాతి స్థానం ఎబోలా వ్యాధిదే. ఏమిటీ వ్యాధి? ఆదిలో పందులు, పక్షుల ద్వారా మనుషులకు సంక్ర మించే వ్యాధిగా స్వైన్ ఫ్లూను శాస్త్రవేత్తలు పరిగణించినా, తరువాత ఒకరి శ్వాస నుంచి మరొకరికి సోకే వ్యాధిగా దీనిని నిర్ధారించవలసి వచ్చింది. అందుకే మనుషులలో వ్యాపించే ఈ వ్యాధికి హెచ్1 హెచ్2 అనే సంకేతనా మాన్ని కూడా తగిలించారు. ఈ మహమ్మారి ఇప్పుడే ఖండాలు దాటిపోతూ వచ్చి మన దేశానికీ, మన తెలుగు రాష్ట్రాలకూ కూడా విస్తరించింది. ప్రజలను భయభ్రాం తులకు గురిచేస్తూ, వైద్యులను కలవరపెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లతో పాటు దక్షిణాదిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులలో ఈ వ్యాధి బాధితులు, మరణాలు నమోదవుతున్నాయి. తెలంగాణలో ఈ వ్యాధి వల్ల చనిపోయిన వారు 13 (జనవరి 25 వరకు) మంది. మరో వర్గం మీడియాలో ఈ సంఖ్య 17 వరకు ఉంది. మొత్తం వేయి మందికి పైగా పరీక్షలు చేయిం చుకోగా, వారిలో 360 మందికి పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు ఈ వ్యాధి ఆంధ్రప్రదేశ్‌కు కూడా వ్యాపిస్తున్నట్టు (ప్రకాశం జిల్లాలో) అంచనా. ఈ వ్యాధి ఒక రకం కాదు. శాస్త్ర పరిభాషలో మళ్లీ దీనిని ఏ బీ సీ అనే తరగతులుగా విభజించారు. వాటి వైరస్, లక్షణాలు వేరు. ఏ, సీ తర గతి ఫ్లూ పందులకూ, మనుషులకూ సంక్రమించేది. సి తరగతి వ్యాధి లక్షణాలను మొదటిసారి జపాన్, అమె రికా పిల్లలలో కనుగొన్నారు. చాలా రకాలే ఉన్నాయి! ఈ వ్యాధిలో కనిపిస్తున్న రకాలకు హెచ్1 ఎన్1, హెచ్1 ఎన్2, హెచ్2 ఎన్1, హెచ్3 ఎన్2, హెచ్2 ఎన్3 అని పేర్లు పెట్టారు. ఇందులో కొన్ని పరిమిత ప్రభా వాన్ని, పరిమిత ప్రాంతంలో మాత్రమే చూపించాయి. స్వైన్ ఫ్లూ (హెచ్1 ఎన్1) వంటి ఉపజాతులు ఖండాం తరాలకు వ్యాపించిన సంగతిని శాస్త్రవేత్తలు గమనిం చారు. దాదాపు 50 రకాలను ఇందులో గుర్తించారు. స్వైన్ ఫ్లూ శ్వాస ద్వారా మనిషి నుంచి మనిషికి సంక్ర మించే వ్యాధిగా పరిణమించగా, చాలా వరకు ఆహార పదార్థాల ద్వారా మాత్రమే సంక్రమిస్తున్నట్టు తేల్చారు. 1918లోనే ఈ ఫ్లూను మొదటిసారి అంటువ్యాధిగా గుర్తించారు. స్వైన్ ఫ్లూ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్న సంగతిని మళ్లీ 20వ శతాబ్దం మధ్య భాగంలో గమనిం చారు. సాధారణ ఫ్లూ, ఇన్‌ఫ్లుయెంజాల వ్యాధి లక్షణాలే- జ్వరం, గొంతు నొప్పి, కండరాల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, దగ్గు, బలహీనత- వంటివి కనిపిస్తాయి. కానీ స్వైన్ ఫ్లూ మాత్రం కొద్ది రోజులకే రోగిని ప్రాణాపాయస్థితికి తీసు కుపోతుంది. అయితే దీనిని పూర్తిస్థాయి అంటువ్యాధిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించి, దేశాలను హెచ్చరించి నది మాత్రం 2010లోనే. నిజానికి 1976 వరకు కూడా ఈ వ్యాధికి వ్యాక్సి నేషన్ వేయడం గురించి ఎవరూ తీవ్రంగా తీసుకోలేదు. అసలు వ్యాక్సినేషన్ వల్ల మను షులు చనిపోతారన్న అపోహ, మొత్తంగా వ్యాక్సినేషన్ పట్ల వ్యతిరేకత ఇం దుకు కారణం. వ్యాక్సినేషన్‌ను వ్యతిరేకించడం వల్లనే ఫలితంగా స్వైన్ ఫ్లూ ముదిరి, అంటువ్యాధిగా దేశాలను అల్లుకుంటూ పోయింది! మూఢాభిప్రాయాల వల్ల పుట్టిన ఈ అపవాదు - వాక్సినేషన్ వల్ల మనుషులు చని పోతారన్న ప్రచారం-వదంతి మాత్రమేననీ సుప్రసిద్ధ వైజ్ఞానిక శాస్త్ర రచయిత పాట్రిక్ డి-జస్టో వివరించే దాకా చలామణిలోనే ఉంది. మానవుల నుంచి మానవులకు శ్వాస ద్వారానే ఈ వ్యాధి కారక వైరస్ వ్యాపిస్తుందని అయోవా (అమెరికా) విశ్వవిద్యాలయ పరిశోధన ద్వారా 2004లో తుదిసారి ధ్రువపడింది. చైనాలో వచ్చిన ఏవి యన్ ఇన్ఫ్లుయెంజా ‘హెచ్3ఎన్2’ వ్యాధి. అది చైనాకే పరిమితమైంది. అది కోళ్లకు వచ్చిన ఇన్ఫ్లుయెంజా! నివారించే అవకాశాలు ఉన్నా... రోగాలు మనుషులకు కాక మానుకు వస్తాయా అన్నది నానుడి. కాని మనుషులకు సోకే వ్యాధుల నివారణకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, శాస్త్రజ్ఞానం ఆధునిక పాలనా వ్యవస్థలకు అనూహ్యమైన అవకాశాలు కల్పిం చింది. కాని లాభాపేక్షపై ఆధారపడి నడుస్తున్న పెట్టు బడిదారీ వ్యవస్థలూ, వాటి పాలకులూ అందివచ్చిన పరిశోధనా ఫలితాలను, ఔషధాలను ప్రజాబాహుళ్యానికి అందుబాటులోకి తేవడం లేదు. దారిద్య్ర నిర్మూలనకు గాని, ఆర్థికంగా పేద, బలహీనవర్గాల కనీస ఆరోగ్య రక్ష ణకు గాని శ్రద్ధ వహించడం లేదు. చివరికి ప్రపంచ బ్యాంకు ప్రజావ్యతిరేక సంస్కరణలను పాలకులు తల కెత్తుకున్న తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పి.హెచ్.సి) కూడా మూతపడ్డాయి. లేదా వాటి పని బాగా కుంటుపడింది. ఈ లోపాన్ని పాలకులు ఎలా కప్పెట్టుకుంటు న్నారు? జాతీయ శాంపుల్ సర్వేల పేరుతో దేశంలో దారిద్య్రం శాతాన్ని తగ్గించి చూపించే చిత్రగుప్తుడి చిట్టా ఆవర్జాలను ప్రజల మొఖాన కొడుతున్నారు! కానీ మన దేశంలో 70-80 కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన, అంటే కటిక దారిద్య్రం అనుభవిస్తున్నారని శాంపుల్ సర్వేలు దీనినే స్పష్టం చేస్తున్నాయి. మన దేశ జనాభాలో 75 శాతం ఆరోగ్య బీమా పరిధిలోనే లేరు. చివరికి ప్రపంచ బ్యాంకు లెక్కల ప్రకారం చూసినా రోజుకు ఒక డాలర్ (రూ.60) కన్నా తక్కువ ఆదాయం ఉన్న జనా భా, మొత్తం జనాభాలో 52.3 శాతం ఉన్నారనీ, రోజుకు 2 డాలర్ల కన్నా తక్కువ ఆదాయం వస్తున్న వారి సంఖ్య 88.8 శాతమనీ తేలింది. ఇక అందుతున్న వైద్య సదు పాయం చూద్దామా! వంద కోట్ల జనాభాలో తల ఒక్కిం టికి ఏటా ప్రజారోగ్యం రక్షణకు చేసే ఖర్చు రూ.1.15 మాత్రమేనని తేలింది. ప్రైవేటుతో ఆరోగ్యానికి ముప్పు దేశంలో ఇంత పేదరికం ఉన్నా ఇక్కడ ప్రజారోగ్య వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా ప్రైవేట్ రం గానికి అంటకాగిపోయింది. ప్రపంచ బ్యాంకు సంస్క రణల తర్వాత అంటువ్యాధుల కట్టడిపై చేసే ఖర్చు దారుణంగా పడిపోయింది. పెట్టుబడి ప్రపంచీకరణ క్రమంలో జరుగుతున్నది దారిద్య్రాన్ని ప్రపంచీకరించ డమే. కాబట్టి ప్రపంచీకరణ కాలంలో ఆరోగ్యంపై పెట్టే ఖర్చు తగ్గిపోయి గ్రామీణ ఆరోగ్య వ్యవస్థ కాస్తా కుప్ప కూలిపోవలసి వచ్చిందని మరచిపోరాదు! 1978 నాటికి ప్రభుత్వ అజమాయిషీలో సుమారు 400 ఔషధాలు ఉం డగా, వాటి సంఖ్య 1994 నాటికి కేవలం 73కు పడిపో యింది. ప్రస్తుతం ప్రభుత్వం అదుపు చేయగలుగుతు న్నది ఈ ఔషధాలను మాత్రమే. దీని ఫలితంగా 20,000 దేశీయ మందుల కంపెనీలు రద్దయి, బహుళ జాతికం పెనీలు ధరవరల నిర్ణయంలో స్వైరవిహారం చేయడానికి రంగం సిద్ధమవుతున్నదని అంచనా. అందుకే ఇండియా పేటెంట్ హక్కులకు అమెరికా యూరోపియన్ బహుళ జాతి కంపెనీలు ఎసరు తెస్తున్నాయని గమనించాలి! ఈ పరిస్థితుల్లో ఎబోలాలు, స్వైన్ ఫ్లూ లాంటి అంటువ్యా ధులు భారత ప్రజల ఆరోగ్యాన్ని మరింతగా పిండుకో వడం ఖాయం! ఇప్పుడిక దేశ విధాన నిర్ణాయక శక్తిగా ప్రణాళికా వ్యవస్థనే మోదీ రద్దు చేయడంతో దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవ! (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
పునఃసమీక్ష తక్షణ అవసరం
విశ్లేషణ మండు వేసవిలోనూ పచ్చగా కనువిందు చేసే భూములను సమీకరించి రాజధానిని నిర్మిస్తామనీ, రైతుల వాటాకు వచ్చే భూమి కోట్లు పలుకుతుందనీ చంద్రబాబు ప్రభుత్వం అంటోంది. లక్ష ఎకరాల భూమి అభివృద్ధికి యాభై నుంచి వంద ఏళ్లయినా పడుతుంది. రాజధాని ఆకారం వచ్చేసరికే 20 ఏళ్లు దాటుతుంది. నాలుగు ప్రభుత్వాలు మారి, వాటి ప్రాధాన్యాలు మారితే? అన్నీ జరుగుతాయనే నమ్మకం ప్రభుత్వానికే ఉంటే.. ఎవరూ కొనకపోతే తామే ఎకరాను రెండు కోట్లకు కొంటామని హామీ ఎందుకు ఇవ్వదు? నవ్యాంధ్రప్రదేశ్ రాజధానిని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేసి, అన్ని జిల్లాలకు అభివృద్ధిని వికేంద్రీకరిస్తామని నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రకటించినప్పుడు కొద్ది మంది మినహా అంతా హర్షించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని హైదరాబాద్‌లోనే రాష్ట్ర అభివృద్ధి అంతా కేం ద్రీకృతమైంది. దాని పర్యవసానంగానే రాష్ట్ర విభజన జరిగిందనేది విస్మరిం చరాని కఠోర వాస్తవం. అందుకే నవ్యాంధ్రలో అభివృద్ధి వికేంద్రీకరణ ప్రకట నకు సార్వత్రిక హర్షం వ్యక్తమైంది. జిల్లాల వారీగా ఏయే జిల్లాల్లో ఏయే అభి వృద్ధి పథకాలను చేపట్టాలని ప్రభుత్వం భావిస్తున్నదో కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు. కానీ ప్రస్తుతం చంద్రబాబు ఆలోచనా ధోరణి పూర్తిగా విరుద్ధంగా సాగుతోంది. హైదరాబాద్లోలాగే నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని లోనే మొత్తం అభివృద్ధిని కేంద్రీకృతం చేసే పంథాను అనుసరిస్తున్నట్టు అనిపిస్తోంది. 52,000 ఎకరాల విస్తీర్ణంలో రాజధానిని ఏర్పాటు చేసి, ఆ తదు పరి లక్షా ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల వ్యయంతో దాన్ని లక్ష ఎకరాలకు విస్తరింప చేస్తామంటున్నారు. తొలిదశలో తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాలలోని 29 గ్రామాల నుంచి పట్టా భూములు సహా 30 వేల ఎకరాల ను సమీకరిస్తామంటున్నారు. బంగారు పంటల జరీబు భూముల సేకరణా? రాజధాని కోసం కృష్ణానది కరకట్టకు ఆనుకుని ఉండి, ఏడాదికి మూడు లేక నాలుగు పంటలు పండే అత్యంత సారవంతమైన జరీబు భూములే, రైతులు వ్యతిరేకిస్తున్నా ఎందుకు కావాలి? భూగర్భ జలాలు పుష్కలంగా ఉండి, మం డు వేసవిలో కూడా పచ్చదనంతో కనువిందు చేసే ఆ ప్రాంతంలో దాదాపు వంద రకాల పంటలు పండిస్తారు. ఎకరాకు రూ.75,000 నుంచి లక్షన్నరకు పైగా ఆదాయం లభిస్తుంది. అదే ప్రాంతం లోని తాడేపల్లి, పెనుమాక గ్రామా లలో భూసేకరణకు ‘ఉడా’ జారీ చేసిన నోటిఫికేషన్ రద్దు కోసం లోగడ ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఆందోళన జరిపారు. నేడు ఆయనే బోరుపాలెం నుండి ఉండవల్లి వరకు కృష్ణా కరకట్టకు ఆనుకుని ఉన్న గ్రామాల జరీబు భూముల సమీకరణకు దిగారు. భూసేకరణ/సమీకరణకు పూనుకున్నారు. తుళ్లూరు పరిసరాలలో ఉన్న మెట్ట భూములు, తరచుగా కొండవీటి వాగు ముంపునకు గురయ్యే భూములు. వాటిని ఇచ్చేందుకు రైతులు సుము ఖమే. వారి నుంచి గరిష్టంగా 20 వేల ఎకరాలు సేకరించి అధునాతన రాజధా నిని నిర్మించుకోవచ్చు. 15వేల ఎకరాలలో ఏర్పాటైన చండీగఢ్ రాజధానిలో... అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్, శాఖాధిపతుల కార్యాలయాలు మున్నగు నవి ఉండే ‘‘కోర్ క్యాపిటల్’’/‘‘క్యాపిటల్ కాంప్లెక్స్’’ విస్తీర్ణం 500 నుండి 750 ఎకరాలు మాత్రమే. నవ్యాంధ్ర రాజధాని కోర్ క్యాపిటల్ విస్తీర్ణం 2,000 ఎకరాలని ముఖ్యమంత్రి అంటున్నారు. మరి 50 వేలు లేదా లక్ష ఎకరాలు ఎందుకు? గాంధీనగర్, నయా రాయ్‌పూర్‌లలో ‘‘సోషల్ లైఫ్’’ లేదని ఆయన వాదన. విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉన్నది ‘‘సామాజిక జీవనం’’ కాదా? స్టార్ హోటల్స్, కార్పొరేట్ ఆస్పత్రుల నుంచి సామాన్యు లకు అందుబాటులో ఉండే సదుపాయాలు కూడా విరివిగా ఉన్నాయి. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలు తదితర విద్యాసంస్థలున్నాయి. రెండు నగరా ల విస్తీర్ణం మొత్తం 28,500 ఎకరాలు. అంతకన్నా పెద్ద రాజధాని ఎందుకు? సమస్యను పక్కదారి పట్టించడం తగదు? ‘క్రీడా’ (క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ) బిల్లుపై శాసనసభ చర్చలో దాదాపు అన్ని పక్షాలు తుళ్లూరు ప్రాంతంలో రాజధానికి తాము వ్యతిరేకులం కాదని స్పష్టం చేశారు. కాకపోతే 50 వేలు లేదా లక్ష ఎకరాల విస్తీ ర్ణం అవసరమా? అని నిలదీశారు. ప్రభుత్వ భూ సమీకరణ విధానాన్ని, దాని పారదర్శకత లేని నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. దీనిని తుళ్లూరు ప్రాంతంలో రాజధాని నిర్మాణాన్ని వ్యతిరేకించడమేనని ప్రభుత్వం వక్రీకరిం చడం ప్రజలను తప్పుదారి పట్టించడమే. భారీగా సేకరిస్తామంటున్న భూమి ని ఏఏ అవసరాలకు, ఎంతెంత, ఎవరెవరికి కేటాయిస్తారో చెప్పడం లేదు. వాటిని విదేశీ లేక స్వదేశీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టడాన్ని, ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిగా మారడాన్ని రైతాంగం సహించదు. లక్ష కోట్ల రూపాయలు ఎలా వస్తాయి? ఏపీ రాజధాని నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహాయం అందిస్తుందని విభజన చట్టం పేర్కొంది. కానీ రాజధాని కోసం ఉత్తరాఖండ్‌కు రూ. 460 కోట్లు, జార్ఖండ్‌కు రూ. 800 కోట్లు, ఛత్తీస్‌గఢ్‌కు రూ.600 కోట్లు మాత్రమే కేంద్రం అందించింది. ఏపీకి ‘‘ప్రత్యేక హోదా’’పై విభజన చట్టంలోని హామీ అమలు కే ఇతర రాష్ట్రాల అంగీకారం తప్పనిసరని కేంద్ర మంత్రి ఒకరు చెప్పారు. అంటే ఆ ఆశ లూ లేనట్టే. ఈ నేపథ్యంలో లక్షా 26 వేల కోట్ల రూపాయలు ఎలా సమకూరుతాయి? ఎలా ఖర్చు చేస్తారు? సీఎం తొలి సంతకం చేసిన ‘రుణమాఫీ’ అమలే ఇంకా కాగితాల మీద ఉంది. ఇలాంటి స్థితిలో సింగపూర్‌ను మించిన రాజధాని నిర్మాణానికి అవరోధాలు ఏర్పడితే భూము లు కోల్పోయిన రైతుల పరిస్థితి ఏం కావాలి? 2008 నుంచి మొదలైన నయా రాయ్‌పూర్ నిర్మాణం పూర్తికావడానికి ఇంకా కనీసం 6 ఏళ్లు పట్టొచ్చు. 2000లో ఏర్పడ్డ ఉత్తరాఖండ్ రాష్ట్ర పాలన డెహ్రాడూన్ నుంచే సాగుతోంది. మన రాజధాని నిర్మాణం కూడా ఇలా దీర్ఘకాలం సాగి, అప్పటికి అధికారం లోకి వచ్చే ప్రభుత్వాల ప్రాధాన్యాలు మారితే? ఇప్పుడు వ్యవసాయమే జీవనోపాధిగా ఉన్న రైతులు, కౌలు రైతులు, కూలీలు తదితర గ్రామీణ ప్రజలు వలస కూలీలుగా, దిన కూలీలుగా నగరాల బాట పట్టక తప్పుతుం దా? అందువల్లనేగా ఈ భూ సేకరణను అత్యధిక రైతాంగం వ్యతిరేకిస్తున్నది? రాజధానిపై ‘శివరామకృష్ణన్ కమిటీ’ నివేదిక కొన్ని ఉపయోగకరమైన సూచనలను చేసింది. వాటిపై అన్నివర్గాలతో చర్చించకుండానే గత అక్టోబర్ లో ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్’ను (ఈ.ఓ.ఐ) ప్రకటించి, నవంబర్ మొదటి వారానికి సింగపూర్ ప్రభుత్వంతో అవగాహన కుదుర్చుకుని, రాజధానికి మాస్టర్ ప్లాన్ బాధ్యతను అప్పజెప్పేశారు! ఏ కారణాలతో, ఏ షరతులపై సింగపూర్ సంస్థకు ఆ పని పురమాయించారు? ఇవే కాదు, మెకెన్సీ సంస్థ రిపోర్టునూ బహిర్గతం చేయలేదు. దరిమిలా జపాన్ సంస్థలతో అవగాహన కుదుర్చుకున్నారు. అంతా గోప్యమే. కాబట్టే అన్నీ ఇనుమానాలే. ‘‘బూర్జ్ దుబాయ్’’ నిర్మాణంలో పాల్గొన్న భారతీయ సంస్థలుండగా, టెండర్ ప్రక్రియ లేకుండా హడావుడిగా సింగపూర్, జపాన్ సంస్థలతో ఒప్పందాలు ఎందుకు? ఆగమేఘాల మీద భూసమీకరణకు దిగడం ఏమిటి? లాండ్ పూలింగ్ రైతుకు లాభమా? ‘‘రీహాబిలిటేషన్ అండ్ రీ సెటిల్మెంట్ చట్టం 2013’’ ప్రకారం భూ యజమానులకు న్యాయమైన నష్టపరిహారం పొందు హక్కు లభించింది. నీటి వసతి కల భూములను సేకరించరాదు, నిర్వాసితులకు గృహనిర్మాణం, మౌలిక వసతుల కల్పన, కుటుంబాలకు పరిహారం, 20 ఏళ్ల భృతి వంటి పలు ప్రయోజనాలకు ఆ చట్టం హామీ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని భూములకు మార్కెట్ విలువకు 4 నుంచి 5 రెట్లు నష్టపరిహారమే గాక, 20 శాతం అభివృద్ధి చేసిన భూమిని కోరుకునే హక్కును రైతులకు ఇచ్చింది. ఈ వాస్తవాలను దాచిపెట్టి భూసేకరణ కన్నా, భూసమీకరణ (ల్యాండ్ పూలింగ్) వల్లనే రైతులకు అధిక ప్రయోజనమని ప్రభుత్వ వర్గాలు మోసపూరిత ప్రచారం చేశాయి. అమాయక రైతులు కొందరు అందుకే అంగీకార పత్రాలు ఇచ్చారు. అయినా, రెండున్నర మాసాలుగా మంత్రులు, అధికార యంత్రాం గం ఎంతగా ప్రయత్నించినా అది 3,600 ఎకరాలకు మించలేదు. 2013 చట్టం ప్రకారం సేకరించిన భూమిని సదరు పనికి 5 ఏళ్ల లోపు ఉపయోగించకపోతే తిరిగి సొంతదారుల వశం అవుతుంది. 2014 సీఆర్డీఏ చట్టం వల్ల రైతులకు తక్కువ పరిహారం లభించడమే కాదు, మిగతా ప్రయోజ నాలు చాలా వరకు కోల్పోతారు. రైతు నుండి తీసుకున్న భూమిపైనే బ్యాం కుల నుంచి రుణాలు తీసుకుని, దాన్ని డెవలప్ చేసి రైతుల దగ్గరు నుంచి డెవలప్మెంట్ చార్జీలు రాబడతారు. సీఆర్డీఏ ల్యాండ్ పూలింగ్ విధానం 2013 భూసేకరణ చట్టానికి, రాజ్యాంగంలోని 300-ఏ అధికరణకు పూర్తి విరుద్ధం. సమీకరిస్తామంటున్న లక్ష ఎకరాల భూమి అభివృద్ధికి 50 నుంచి వందేళ్లైనా కావాలి. రాజధాని ఆకారం రావడానికే కనీసం 20 ఏళ్లు పడుతుంది. నాలుగు ప్రభుత్వాలు మారి, వాటి ప్రాధాన్యాలు మారితే? కాదు, అంతా అనుకున్నట్లు జరిగినా వాణిజ్య ప్రాంతంలో కేటాయించే ప్లాట్లకు మాత్రమే విలువ పెరుగుతుంది. రైతుల వాటాకు వచ్చే భూముల విలువ కోట్ల రూపాయలు పలుకుతుందంటున్న ప్రభుత్వం... ఎవరూ కొనని పక్షంలో తామే ఎకరాకు రూ. 2 కోట్లు చెల్లించి కొంటామనే హామీని మాత్రం ఇవ్వడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం కృష్ణా కరకట్టను ఆనుకుని ఉన్న పచ్చని పంట పొలాలను ధ్వంసం చేసే ఆలోచనకు స్వస్తి చెప్పాలి. అమరావతి, ధరణికోట వైకుంఠపురం ప్రాంతాల్లో, భవాని ఐలాండ్, కొండపల్లి ఖిల్లా, కనకదుర్గమ్మ గుడి, మంగళగిరి పానకాల స్వామి, ఉండవల్లి గుహలు మొదలైన ప్రాంతాల్లో పర్యాటకాన్ని అభివృద్ధి చేయవచ్చు. ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్టు వ్యవహరిస్తే రైతులు న్యాయస్థానాల ద్వారా తమ న్యాయమైన హక్కులను పరిరక్షించుకోవాల్సి వస్తుంది. (వ్యాసకర్త, మాజీ మంత్రి, వ్యవసాయ రంగ నిపుణులు) -
పా‘తాళపత్రాల’కు విముక్తి ఏది?
విశ్లేషణ ఇక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలను పరిచయం చేస్తూ వాటి వివరాలతో 1933లో ఒక పుస్తకం వెలువడింది. దీనికి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుమాట రాయడం విశేషం. తెలుగుకు ప్రాచీన భాష హోదా తెచ్చుకున్నాం. కానీ భవిష్యత్తులో కూడా మన మాతృభాషను సజీవంగా ఉంచడం ఎలాగో ఆలోచించడం మరిచిపోయాం. రాగి రేకుల మీద, రాతి ఫలకాల మీద ఉన్న ప్పటికీ, తాళపత్రాలలో నిక్షిప్తమై ఉన్నప్పటికీ, ప్రాచీనమైనప్పటికీ భాషా సంపదను పరిరక్షించుకోవడం అందరి కర్తవ్యం. కొత్తగా వచ్చినదంతా ఎలా శిరోధార్యం కాదో, ప్రాచీ నమైనదంతా కూడా తిరస్కరించదగినది కాదు. భాష, సాహిత్యాలు ఆవిర్భావం నుంచి పరిగణనలో నికి తీసుకోవాలి. అప్పుడే అది సంపద అనిపించు కుంటుంది. అందుకే దానిని పరిరక్షించాలి. కానీ, మన రెండు రాష్ర్ట ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించ కపోతే జరిగే నష్టం అపారం. ఉదాహరణకి తంజా వూరు సరస్వతి మహల్, రాజమండ్రి గౌతమి గ్రంథాలయాలలో మగ్గుతున్న తాళపత్ర గ్రంథాల గురించి పరిశీలిద్దాం. ఒకప్పుడు తాళపత్రాలూ, గంటమే రాత పరిక రాలు. సరస్వతీ మహల్, గౌతమి, ఎస్వీ విశ్వవిద్యా లయం, వేటపాలెం వంటి చోట ఇప్పటికీ ఈ తాళప త్రాలు ఉన్నాయి. దూరదృష్టి కలిగిన వారు వాటిని గౌరవిస్తూ రేపటితరాల కోసం పరిరక్షించుకుంటూ వచ్చారు. కానీ ఏ తాళపత్రమైనా రెండుమూడొందల సంవత్సరాలకు మించి ఉండదు. అది శిథిలావస్థకు చేరుతూ ఉండగానే మరోసారి రాయించుకునేవారు. ఇంత శ్రద్ధకు కారణం వాటిలో ఉన్న విషయమే. తాళ పత్రాలంటే కేవలం కావ్యాలు, వేదాంతం బోధించేవ నుకుంటే మూర్ఖత్వం. తంజావూరు గ్రంథాలయం లో మొత్తం 778 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. 11వ శతాబ్దం నుంచి పేర్గాంచిన గ్రంథాలను ఇందు లో గమనిస్తాం. వీటిలో 455 పుస్తక రూపం దాల్చా యి. మరో 232 అచ్చుకు సిద్ధంగా ఉన్నాయి. అంటే పరిష్కృతమైనాయి. అసలు అచ్చుకు సంబంధించి ఎవరి దృష్టికీ రాకుండా ఉండిపోయినవి 91. అలాగే కాగితం మీద రాసి పెట్టి ఉంచిన అముద్రితాలు కూడా కొన్ని ఉన్నాయి. వీటిలో సాహిత్యం, వ్యాకర ణం, ఆర్ష వాజ్ఞయం, తర్కం, జ్యోతిష్యం వంటివా టితో పాటు వైద్యం, గణితం, లోహాల మీద అధ్య యనం వంటివి కూడా ఉన్నాయి. రాయలవారి ‘ఆముక్తమాల్యద’ తాళపత్ర గ్రంథం కూడా వీటిలో ఉంది. వీటిని అక్కడే పని చేస్తున్న రవి అనే గ్రంథా లయాధికారి వర్గీకరించారు. ఇక్కడ ఉన్న తాళపత్ర గ్రంథాలను పరిచయం చేస్తూ వాటి వివరాలతో 1933లో ఒక పుస్తకం వెలువడింది. దీనికి ఆచార్య సర్వేపల్లి రాధాకృష్ణన్ ముందుమాట రాయడం విశే షం. అప్పుడు ఆయన ఆంధ్ర విశ్వకళాపరిషత్ వీసీగా ఉన్నారు. గౌతమి గ్రంథాలయంలో 417 తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. ఇందులో అభిదాన రత్నమాల పేరుతోనే 268 వైద్య గ్రంథాలు కనిపిస్తున్నాయి. గణితం (1), కామశాస్త్రం (1), ఆయుర్వేదం (8), కావ్యాలు (130), ధర్మశాస్త్రాలు (18), కళ (2), వ్యాకరణాలు-నిఘంటువులు (20) వంటివి ఉన్నా యి. ఇవికాక రామాయణ, భారతాలు, భగవద్గీత, ఉపనిషత్తులు, జ్యోతిషం వంటి అంశాల మీద కూడా తాళపత్రాలు ఉన్నాయి. ఈ పురాతన జ్ఞాన సంపద మన పూర్వీకుల వైవిధ్యం ఎంతటిదో కళ్లకు కడుతుంది. ఇలాంటి గ్రంథాలు ఇంకా ఎన్నో! చరిత్ర రచనలో శిలాశాసనాలు, రాగిరేకులు, నాణేలు ఎంతో కీలకపాత్ర వహిస్తాయి. వీటితో పాటు చరిత్ర నిర్మాణానికి సాహిత్య ఆధారాలు కూడా అంతే ప్రాముఖ్యం వహిస్తాయి. కాబట్టి ఈ పురాతన జ్ఞాన సంపదను అలా గాలికి వదిలివేస్తే మన మూలాలకు మనమే చెదలు పట్టించుకున్న వాళ్లం అవుతాం. ఈ తాళపత్రాలకు పుస్తక రూపం ఇచ్చి, అందరికీ అందుబాటులోకి తేవలసిన కర్తవ్యం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మీద కూడా ఉం ది. 2011 జనాభా లెక్కల ప్రకారం అక్షరాస్యతలో ఆం ధ్రప్రదేశ్‌కు 33వ స్థానం మాత్రమే దక్కింది. ఇది అవమానకరం. మన ప్రభుత్వాలు విద్యపట్ల చూపుతున్న నిర్లక్ష్యానికి నిదర్శనాలు. తాళపత్రాల పట్ల నిర్లక్ష్యం అందులో ఒకటి. రెండు రాష్ట్రాలుగా అవత రించిన తరువాత కూడా ఇదే స్థానం కాపాడు కోవా లని నేతలు భావించరాదు. రాష్ట్రాల పునర్ నిర్మాణంలో భాష, సంస్కృతి, ప్రాచీన గ్రంథాల రక్ష ణను భాగంగా చేయాలని ప్రభుత్వాలు భావించాలి. (వ్యాసకర్త ప్రముఖ వైద్యులు, నాణేల విశ్లేషకులు) మొబైల్: 9848018660 -
బోగస్ ఓట్లు, వ్యవస్థకు తూట్లు
విశ్లేషణ ప్రజాస్వామ్యానికి ఎన్నికల ప్రక్రియ ఆధారమైతే, ఆ ఎన్ని కలకు ప్రాతిపదిక ఓటర్ల జాబి తా. ఎవరు ఓటరు, ఎవరు కా దు? ఒక పౌరుడికి ఒక్క ఓటే ఉండాలి. అంటే ఒకే ఓటరు గుర్తింపుకార్డు ఉండాలి. అర్హత లు, వయసులను బట్టి; పౌర సత్వం, నివాసం, వయసు, ధృవీకరణల ఆధారంగానే ఓటరు కార్డు ఇవ్వాలి. చట్టాలూ, నిబంధనలు ఇదే చెబుతున్నాయి. అయినా ఒక్కొక్కరికి రెండు మూడు కార్డులు ఎలా వస్తున్నాయి? ఒకే వ్యక్తికి రెండు వేరే నియోజకవర్గా లలో, లేదా రెండు రాష్ట్రాలలో ఓటరు కార్డులు ఏ విధం గా ఇస్తారు? ఇటువంటివి ఎన్ని? దీని మీద ఫిర్యాదులు ఉన్నాయా? ఎవరైనా పరిశోధించారా? ఈ రకం అన్యా యాలను ఆపలేమా? అనేవి సామాన్యుని ప్రశ్నలు. అవే ఆర్టీఐ రూపాన్ని సంతరించుకున్నాయి. ఈ ప్రశ్నలకు సబ్ డివిజినల్మెజిస్ట్రేట్ సమాధానం చెప్పాలని అనిల్ సూద్ అనే న్యాయవాది సమాచార హక్కు చట్టం కింద డిమాండ్ చేశారు. ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతంలోని ఒక నియోజక వర్గంలో స్త్రీ,పురుషులు, పక్కా నివాసం చిరు నామా ఇచ్చిన వారు, నివసిస్తున్న ఇల్లు కాక, మరొక ఇంటి చిరునామా ఇచ్చినవారు-ఇలా ఎందరికి ఓటరు కార్డులు ఇచ్చారో వెల్లడించాలని ఆయన కోరారు. అయి తే వీటిలో చాలా అంశాలు సమాచారం కిందికే రావనీ, సమాచార హక్కు చట్టంసెక్షన్ 2(ఎఫ్) కింద సమాచా రం కాని అంశాలకు సమాధానం చెప్పనవసరం లేదని అధికారులు వాదించారు. మరోవైపు ఈ సమాచారం ఇవ్వడానికి రూ.7,922 రుసుము చెల్లించాలని సూచిం చారు. అడిగిన సమాచారాన్ని మొదటి అప్పీలు అధికారి ఆదేశించినా ఇవ్వలేదని అనిల్ రెండో అప్పీలు దాఖలు చేశారు. పిఐఓ రూ.7,922 అడగడం, పై అధికారి ఆ డబ్బు చెల్ల్లించాలని ఆదేశించడం ఏకపక్ష నిర్ణయాలే. ఆదేశంలో మొదటి అప్పీలు అధికారి కారణాలు వివరిం చకపోవడం కూడా అన్యాయం, చట్టవిరుద్ధం. ఎంపీ, ఎమ్మెల్యే లేదామునిసిపల్ కౌన్సిలర్ గారో సంతకం చేసి, ఫలానా వ్యక్తి ఫలానా చోట ఉంటున్నా డని ధృవీకరిస్తే, వెంటనే ఓటరు కార్డు ఇవ్వడం ఎంత వరకు సమంజసం? ఈ విధంగా రాజకీయ ప్రజా ప్రతినిధులు, పార్లమెంటు, శాసనసభ, స్థానిక సంస్థల సభ్యులు ధృవీకరిస్తూ వెళ్తే నకిలీ కార్డులు ఏ విధంగా రాకుండా ఉంటాయి అన్నది అనిల్ ఆరోపణ. ఒక ఓటరు ఫలానా చోట ఉంటున్నాడని, లేదా నివసించడం లేదని ఏ విధంగా రుజువుచేస్తారు? ఇది అబద్ధం కాదని, లేదా నిజమేనని ఎంపీ, ఎమ్మెల్యే ఏ విధంగా రుజువు చేస్తారు? ఓటరు కార్డు మంజూరు చేసేందుకు ఇవే అర్హతలుగా నిర్ణయించారా? అన్నది మౌలిక ప్రశ్న. ఇటువంటి కార్డులతో జరిగే ఎన్నికలు స్వేచ్ఛాయు తంగా, న్యాయంగా జరిగినవే అవుతాయా అని అనిల్ సవాలు చేశారు. తన ప్రశ్నలకు జవాబిస్తే ఒక నియోజ కవర్గంలో ఎన్ని బోగస్ కార్డులు ఉంటాయో తేలిపో తుందని ఆయన వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఫిబ్రవరి మొదటి వారంలో ఎన్నికలు జరుగుతున్నందున ఓటర్ జాబితా సరిగ్గా ఉందా, లేదా? అనే విషయం ప్రాధాన్యం సంతరించు కుంది. అంతేకాదు, ఢిల్లీలో వేలకొద్దీ బోగస్ ఓటరు కార్డులు ఉన్నాయని ఢిల్లీ ప్రధాన ఎన్నికల అధికారి ఢిల్లీ హైకోర్టు ముందు ప్రమాణ పత్రం ద్వారా అంగీకరిం చారు. తప్పుడు ఫొటోలు పెట్టి 58 వేల మంది కార్డులు తీసుకున్నారని, మామూలు పౌరుడి ఓటరు కార్డు మీద ఒక సినిమా స్టార్ ఫొటో ఉందంటే బోగస్ కార్డులు ఎంత సులువుగా ఇస్తున్నారో అర్థమవుతుంది. సరైన సమయంలో సమాచారం ఇవ్వకపోవడం, మొదటి అధికారి ఆదేశాన్ని కూడా మన్నించకపోవడం సమాచార హక్కు సెక్షన్ 20 కింద జరిమానాతో శిక్షించ తగిన వివాదాలు అవుతాయి. ఈ విషయమై కారణాలు వివరించాలని నోటీసు జారీ చేయాల్సిందే. ఇన్ని బోగస్ కార్డులున్నాయనే అనుమానం బలంగా ఉన్న తరువాత, ప్రధాన అధికారి స్వయంగా ఒప్పుకున్న తరువాత నివా స ధ్రువీకరణ వివాదాల వల్ల బోగస్ కార్డులు ఉన్నాయో లేదో సమగ్రంగా విచారించాల్సిన అవసరం, ఇంకా సవ రణలకు వీలున్నందున సవరించే అవకాశాలు వదులు కోక,వినియోగించుకోవడం చాలా అవసరం. (అనిల్సూద్ వర్సెస్ ఎస్డీఎం (ఎన్నికలు) ఢిల్లీ ప్రభుత్వం కేసులో ఇచ్చిన తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
అన్నదాతకు ఆర్డినెన్స్ కాటు
విశ్లేషణ నాటి చట్టం భూసేకరణ అనే బలవంతపు ‘సమారాధన’ నుంచి రెండు-మూడు పంటలు పండే భూముల్ని మినహాయించింది. కానీ, ఇప్పుడు కేవలం వర్తక, వ్యాపారులుగా మారిన ఆధునిక పాలకులు - వ్యవసాయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా భూసేకరణ/ సమీకరణ విషయంలో అనేక పంటలు పండే భూములను రైతులే వదులుకునే విధంగా ఒత్తిళ్లకు, వేధింపులకు గురిచేస్తున్నారు. అంటే 1894 నాటి బ్రిటిష్ వలసవాదుల చట్టాన్నే అనుసరిస్తున్నారన్నమాట! ఇది పంట భూములపై రైతుల హక్కుల్ని కాలరాయటమే. ‘పార్లమెంట్‌ను విస్మరించి దొంగచాటుగా అనేక ఆర్డినెన్స్‌లు తెచ్చినందుకు యూపీఏ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శించాల్సి వచ్చింది. నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వం యూపీఏకి మించిపోయి మరింత వేగంగా, ఆరునెలల్లోనే ఆర్డినెన్స్‌ల ప్రహసనాన్ని ఆరంభించింది. ఇది పార్లమెంట్ ప్రతిపత్తినీ, అధి కారాన్నీ నాశనం చేసే పరిణామం’ - కె.సి.త్యాగి, (పార్లమెంటేరియన్ ,1-1-2015) ‘అతనికంటె ఘనుడు ఆచంట మల్లన్న’ అన్న సామెత ఎందుకు పుట్టిందో గాని; బీజేపీ నాయకుడు, ప్రధాని నరేంద్రమోదీకీ, తెలుగుదేశం నాయకుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికీ అది వర్తించినంతగా మరో ఏ ఇద్దరు పాలకులకూ వర్తించదేమో! అటు మోదీ, ఇటు బాబూ కూడబలుక్కున్నారో ఏమోగాని వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలోని బడా మోతుబరుల ప్రయోజనాల రక్షణ కోసం; దేశ, ప్రపంచ బ్యాంక్ సంస్కరణలలో భాగంగా విదేశీ బహుళజాతి కంపెనీల పెట్టుబడి ప్రయోజనాల పరిరక్షణ కోసం కంకణం కట్టుకున్నట్టుంది. ఆర్డినెన్స్లూ, అసంపూర్ణ చర్చలూ రాష్ట్ర శాసనసభలో సమగ్ర చర్చతో నిమిత్తం లేకుండా, ప్రతిపక్షం నోరు నొక్కి ఆంధ్రప్రదేశ్ ప్రాంత అభివృద్ధి సంస్థ పేరిట భూములను కబళించే బిల్లును బాబు ‘పాస్’ చేయించుకున్నారు! రాజధాని నిర్మాణ ం పేరుతో అవసరానికి మించి వేల ఎకరాల సుక్షేత్రాలను, దేశ ఆహార భద్రతకు రక్షణగా ఉన్న ధాన్యాగారాలైన జిల్లాలలో భూములను సేకరించడం దీని ఉద్దేశం. తరువాత, పార్లమెంట్ సమావేశాలు లేని సమయంలో మోదీ ప్రభుత్వం యూపీఏ జమానాలో చట్టంగా రూపొందిన ‘భూసేకరణ - పునరావాస నిర్వాసితుల పునః స్థిరీకరణ’ చట్టాన్ని (2013) సవరిస్తూ దొడ్డిదారిలో ఆర్డినెన్స్ తెచ్చింది. రాష్ట్రపతి ఆమోదముద్రను సంపాదించుకుంది! యూపీఏ -2 తన ఐదేళ్ల (2009-2014) పాలనలో 25 ఆర్డినెన్సులను విడుదల చేస్తే, మోదీ ప్రభుత్వం ఆరేడు నెలలపాలనలోనే 8 ఆర్డినెన్సులు తెచ్చింది! అటు యూపీఏ (2013) చట్టంలోనూ, ఇటు మోదీ ప్రభుత్వం హోంశాఖ ద్వారా (2014) చొప్పించిన ఆర్డినెన్స్లోనూ కొన్ని సమాన ధర్మాలున్నాయి. అంతేకాదు, యూపీఏ అమలు చేయడానికి సాహసించలేని కొన్ని అంశాలూ ఎన్డీఏ ఆర్డినెన్స్‌లో కనిపిస్తున్నాయి. మొత్తం మీద యూపీఏ, ఎన్డీఏ కూటముల లక్ష్యం ఒక్కటే - దేశ, విదేశీ గుత్త పెట్టుబడులను భారీ స్థాయిలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలోకి దించి, శాసించి, రైతాంగ వ్యవసాయ కూలీల, పారిశ్రామిక కార్మికుల జీవనాన్ని నియంత్రించడమే. రైతాంగాన్ని కూలీలుగా మార్చి, వ్యవసాయ కార్మికుల్ని పంట పొలాలపై ఆధారపడ కుండా పట్టణాలకు వలస పోయేస్థితిని కల్పించటం కూడా. ఇది 1894 నాటి వలసపాలనా చట్టానికి ఆధునికమైన నకలుగా భావించాలి. అమెరికా తరహా కార్పొరేట్ వ్యవసాయాన్ని ఇండియాలోనూ ప్రవేశపెట్టడం కోసమే గత వలసపాలనా చట్టానికి 1991లోనే ప్రపంచ బ్యాంక్ ప్రజావ్యతిరేక సంస్కరణను ప్రతిపాదించిందన్న సంగతి మరచిపోరాదు! గడచిన 15 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ కలిపి) సహా యావద్భారతంలో దాదాపు నాలుగు లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం దీని ఫలితమే. యూపీఏ, బీజేపీ- ఈ రెండు రకాల పాలనా వ్యవస్థలకూ ఆచరణలో తేడా లేదనడానికీ ఒకే ఒక ఉదాహరణ చాలు - 2013లో రైతాంగ ప్రయోజనాలకు భిన్నంగా యూపీఏ తెచ్చిన చట్టాన్ని ఎలాంటి మినహాయింపులు లేకుండా ఏడాదిన్నర క్రితం పార్లమెంటులో ఆమోదించిన బీజేపీ, నేడు అదే చట్టాన్ని గుత్త వ్యాపార బనియా వర్గాలకు మరింత అనుకూలంగా మారుస్తూ ‘సవరణలు’ తెచ్చి ‘సత్వర ఆదేశం’గా (ఆర్డినెన్సు) రైతుల నెత్తిన రుద్ద బోవటం ఏలాంటి నీతి? అయితే,2013 నాటి చట్టం భూసేకరణ అనే బలవంతపు ‘సమారాధన’ నుంచి రెండు-మూడు పంటలు పండే భూముల్ని మినహాయించింది. కానీ, ఇప్పుడు కేవలం వర్తక, వ్యాపారులుగా మారిన ఆధునిక పాలకులు - వ్యవసాయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా భూసేకరణ/సమీకరణ విషయంలో అనేక పంటలు పండే భూములను రైతులే వదులుకునే విధంగా ఒత్తిళ్లకు, వేధింపులకు గురిచేస్తున్నారు. అంటే 1894 నాటి బ్రిటిష్ వలసవాదుల చట్టాన్నే అనుసరిస్తున్నారన్నమాట! ఇది పంట భూములపై రైతుల హక్కుల్ని కాలరాయటమే. 2013 చట్టం ప్రకారం, భూసేకరణ జరిపే సమయంలో నష్టపోయే రైతులలో 70 శాతం మంది, ఇతర ప్రయివేట్, ప్రభుత్వ-ప్రయివేట్ (సి.పి.పి.) ప్రాజెక్టుల విషయంలో అయితే కనీసం 80 శాతం మంది ఆమోదం తప్పనిసరి. కానీ ఈ వెసులు బాటును కూడా 2014-15లో మోదీ ప్రభుత్వం తొలగించింది. ఫలితంగా రైతుల అంగీకారం లేకుండానే భూముల్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వానికి అవకాశం దొరికింది. మాతృసంస్థకూ అనిష్టమే ఈ సందర్భంగా భారత ప్రభుత్వ జలవనరుల శాఖ మాజీ కార్యదర్శి, నిపుణుడు రామస్వామి అయ్యర్ వ్యాఖ్య గమనించదగింది: ‘‘2013 నాటి భూసేకరణ చట్టంపైన పారిశ్రామికవేత్తలు, వారికి అనుకూలంగా వ్యాఖ్యాతలు వెలిబుచ్చిన వ్యతిరేకతను పట్టించుకోవలసిన పనిలేదు. అలాగే, పారిశ్రామికాభివృద్ధిని త్వరితం చేయాలన్న ప్రభుత్వ ఆశయాన్ని చట్ట విరుద్ధమైనదని కూడా భావించకూడదు. ఈ విషయంలో కొందరి అభిప్రాయాలు ఏమైనప్పటికీ, ఈ సందర్భంగా వ్యక్తమైన ఆందోళనల దృష్ట్యా చేయవలసిన పని- 2013 చట్టంపైన, పంట భూముల్ని భూసేకరణ నుంచి మినహాయించాలంటూ ఆ చట్టం చేసిన నిర్దేశం పైన ఇప్పటి ఎన్డీఏ ప్రభుత్వం చర్చకు అనుమతించి ఉండాల్సింది. తద్వారా సంబంధిత వర్గాలు సమన్వయ పూర్వకమైన పరిష్కారానికి వచ్చేలా చేయవలసింది. 2013 చట్టం మీద ఇంతవరకూ సమీక్షే జరగలేదు. కాగా, ఎన్డీఏ పాలకులు ఆ చట్టానికి సవరణలు తెస్తూ ఆకస్మికంగా ఆర్డినెన్స్ జారీచేశారు. ఈ ఆర్డినెన్స్ మంచి చెడ్డల గురించిన చర్చ అలా ఉంచితే, ఎన్డీఏ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు నిరంకుశం, పాక్షికం. ప్రజాస్వామ్య విరుద్ధం.’’ కాబట్టి, దేశ ఆహార భద్రతను దెబ్బతీసే నియంత్రణ రహితమైన భూమి బదలాయింపులు అనర్థమని ఆయన విశ్లేషించారు. రెండు మూడు పంటలు పండే భూముల్ని భూసేకరణ నుంచి మినహాయించాలని 2013 చట్టం ఆదేశించినప్పటికీ అది పరిశ్రమాభివృద్ధిని వ్యతిరేకించలేదనీ, ఈ అంశమే ప్రస్తుత ఎన్డీఏ ఆర్డినెన్స్‌లో కొరవడిందనీ స్పష్టమవుతోంది! చివరికి ఆర్డినెన్స్‌ను జారీ చేయడానికి ఒకరోజు ముందే మోదీ ప్రభుత్వానికి అండగా నిలబడిన ఆర్.ఎస్.ఎస్. పరివార్‌లోని ‘స్వదేశీ జాగరణ మంచ్’ కూడా ఆ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకించిన విషయాన్ని గమనించాలి. అంతేగాదు, అంతకుముందు 15 రోజుల క్రితం ఇదే పరివార్ జాతీయ సదస్సులో ‘వ్యవసాయ రంగంలో విదేశీ పెత్తనాన్ని నిలిపివేయాలం’టూ తీర్మానం (నం.4) ఆమోదించిన విషయాన్ని గమనించాలి! అంతకన్నా విచిత్రమైన విషయం - ఏ బీజేపీ (మోదీ) ప్రభుత్వానికి ఆదేశాలిచ్చే ‘సైద్ధాంతిక’ శక్తిగా ‘థింక్ టాంక్’గా ఏ శక్తయితే ఉందో, అదే శక్తి, అంటే ఆర్.ఎస్.ఎస్. దేశ ఉత్పత్తుల పేటెంట్‌కు సంబంధించిన హక్కుల్ని కాపాడవలసిన ప్రభుత్వ విధానం గాడి తప్పిపోవడాన్ని ప్రశ్నించాల్సి వచ్చింది! ఎందుకంటే, దేశీయ పేటెంట్ల హక్కుకు సంబంధించి ఒక విధానాన్ని రూపొందించడానికి మోదీ ప్రభుత్వం ‘చింతనా సంఘాన్ని’ (థింక్ టాంక్) నియమించింది. అయితే, ఈ సంఘం దేశీయ ‘చింతన’కు స్వస్తి చెప్పి ఏం చేస్తోంది? భారతదేశంలోనే ‘వస్తు సముదాయాన్ని ఉత్పత్తి చేయాల’ని ఢిల్లీ కోట నుంచి అరుస్తున్న మోదీ ప్రభుత్వం ‘‘తమ థింక్ టాంక్ అమెరికాతో చేతులు కలిపి ఏర్పాటు చేసిన సంయుక్త కార్యనిర్వహణా గ్రూపు (జాయింట్ వర్కింగ్ గ్రూప్) నీడలో పనిచేస్తోంద’’ని ఆర్.ఎస్.ఎస్. బట్టబయలు చేసింది! ప్రభుత్వాలకు ఎక్కడిది హక్కు? కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు రాజ్యాంగం ఆదేశిక సూత్రాలుగా పేర్కొన్న 38-39వ అధికరణలకు పూర్తి విరుద్ధం. పౌరుల జీవించే హక్కును, వ్యక్తి స్వేచ్ఛను హరించరాదన్న రాజ్యాంగ ఆదేశానికి ఇది పూర్తిగా అపవాదు. పార్లమెంట్ నిర్ణయాలు, అది చేసే చట్టాల చట్టబద్ధతను సమాజ పరిస్థితుల దృష్ట్యా నిర్ణయించాలని సుప్రీంకోర్టు అనేక సందర్భాలలో (ఉదా: 1976/2007/2008) ఆదేశించింది. రాజ్యాంగం మౌలిక చట్టాల ప్రకారం అమలు కావాలి. అంతేగాని, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి సర్వసత్తాక (సావరీన్) ప్రతిపత్తి లేదనీ, ప్రభుత్వ ఆచరణ పరిధులు రాజ్యాంగ నిర్వచనకు లోబడి ఉండాలనీ, ఒక చట్టాన్ని రాజ్యాంగం విరుద్ధమని ప్రకటించే హక్కు న్యాయవ్యవస్థకు మాత్రమే ఉందనీ సమాఖ్య రాజ్యాంగ లక్షణాలను విశదీకరిస్తూ న్యాయశాస్త్ర కోవిదుడు పి.ఎం.బక్షీ స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు లేవు కాబట్టి (123వ రాజ్యాంగ అధికరణ ప్రకారం) ఆర్డినెన్సు జారీ చేయగల హక్కు రాష్ట్రపతికి ఉంది. కాని ఆర్డినెన్సును జారీ చేసే అధికారం రాజ్యాంగ మౌలిక స్వభావానికి బద్ధమై ఉండాలి. ఒక రెగ్యులేషన్, లేదా ఆర్డినెన్స్ సదరు చట్టం ఉద్దేశానికి హేతుబద్ధంగా లేనప్పుడు న్యాయస్థానం తప్పనిసరిగా జోక్యం చేసుకోవాలని కూడా బక్షీ స్పష్టం చేశారు. ఎందుకంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు చట్టం చేయడానికి అధికారం లేదని రాజ్యాంగం నిర్దేశిస్తున్నప్పుడు, ఆర్డినెన్సును కూడా పరోక్ష చట్టంగా పాలకులు భావిస్తున్నందున రాష్ట్రపతి సదరు ఆర్డినెన్సును కూడా తన పరిధిలో ప్రశ్నించవచ్చు! కాని అందుకు రాష్ట్రపతి సాహసించలేని ఒక నిరంకుశ చట్రంలో ఎప్పటికప్పుడు ప్రభు త్వాలు బిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విభజనకు యూపీఏ ప్రవేశపెట్టిన తప్పుడు బిల్లును తనకున్న ‘వీటో’ అధికారంతో రాష్ట్రపతి ప్రశ్నించలేక పోయారు! ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం భూమిపై రైతాంగహక్కుల్ని హరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ విషయంలోనూ అదే జరిగింది. (వ్యాసకర్త మొబైల్: 9848318414) -
సంజయ్ @సినీపీడియా
తెలుగు సినీ చరిత్రకారునిగా, విశ్లేషకునిగా, విమర్శకుడిగా, కాలమిస్ట్‌గా సంజయ్ కిషోర్‌ది దశాబ్దాల అనుభవం. తెలుగు సినిమాపై అభిమానం అతన్ని సినీపీడియాగా మార్చేసింది. సినిమాలకు సంబంధించి ఏ ఫొటో కావాలన్నా, ఏ సమాచారం కావాలన్నా అందరికీ తన పేరే గుర్తొచ్చేంతగా ఎదిగారు సంజయ్ కిషోర్. ఈ సినీ నిధికి రాగరాగిణి ఆర్ట్ అసోసియేషన్ ఆదివారం ‘సినీ పరిజ్ఞాన ప్రవీణ’ బిరుదును ప్రదానం చేసింది. ఈ సందర్భంగా సంజయ్ కిషోర్‌తో సిటీప్లస్ మాటామంతి. నా చిన్నప్పుడు మా కుటుంబం గుంటూరులో ఉండేది. మా అమ్మ ధనలక్ష్మి నాయుడు మహానటి సావిత్రికి ఉత్తరాలు రాసేది. ఆ మహానటి తన ఫొటో జత చేసి ప్రత్యుత్తరాలు పంపేది. అలా పంపిన ఒక ఫొటోను అమ్మ నాకు చూపించింది. అప్పుడు నా మనసులో కలిగిన ఆలోచన ఇప్పటికీ ఒక యజ్ఞంలా సాగుతోంది. తొమ్మిదో తరగతి నుంచి స్టిల్ ఫొటోల కోసం ఎన్నో ఏళ్లు, ఎన్నో ఊళ్లు తిరిగాను. ఎంతో ఖర్చు పెట్టి వాటిని సేకరించాను. నటీనటులు, డిస్ట్రిబ్యూటర్లు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానులు, జర్నలిస్ట్‌లు ఇలా అందరి నుంచి దాదాపు 70 వేలకుపైగా ఫొటోలను సేకరించి భద్రపరిచాను. ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే సావిత్రి తొలి స్టిల్ ఫొటో నా ఒక్కని దగ్గరే ఉంది. జీవితమే సినిమా రంగం.. నా జీవితం సినిమాతోనే ముడిపడి ఉంది. పాత్రికేయుడిగా ఎందరో సినీప్రముఖులను ఇంటర్వ్యూ చేశాను. ఎన్నో కాలమ్స్, రివ్యూలు రాశాను. ప్రింట్ మీడియాతో పాటు, ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా సినీ నేపథ్యం ఉన్న కార్యక్రమాలు నిర్వహించాను. నాలుగేళ్లు సెన్సార్ బోర్డులో సభ్యుడిగా, సినిమా నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్‌గా కూడా చేశాను. ‘సంగమం’ సంస్థ ఎన్నో వైవిధ్యభరితమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. సినిమాలతో ముడిపడి ఉన్న ప్రతి క్షణం నేను ఎప్పటికీ మరచిపోలేను. నా దగ్గర ఉన్న ఫొటోలతో ఓ మ్యూజియం ఏర్పాటు చేయాలని ఉంది. -కోన సుధాకర్‌రెడ్డి -
ఆర్టీఏ ప్రతీకార బాణం కాదు
విశ్లేషణ ప్రశ్నల ద్వారా అడిగే సమాచారం ఏమిటో స్పష్టత లేకుండా, ఒక ఉద్యోగి సర్వీసు రికార్డులో ఉండే వివరాలన్నీ తనకు కావాలని అడగడం న్యాయం కాదు. సర్వీసు బుక్ ఉద్యోగి వ్యక్తిగతమైంది. ఆయనకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేని వ్యక్తిగత సమాచారం అని న్యాయస్థానాలు పేర్కొన్నాయి. ఆ అధికారి విధులు, పనివేళలు, అధికారాలు మొదలైన అధికారిక వివరాలు తప్ప ఇతర వ్యక్తిగత సమాచారం ఇవ్వడానికి ఈ కేసులో వీల్లేదని కమిషనర్ ఆదేశం. ఒక వీర పౌరుడు విపరీతంగా సహ బాణాలు విసురుతూ పదిరూపాయల అభ్యర్థనలో పదినుంచి ఇరవై ప్రశ్నలు సంధిస్తూ వస్తున్నాడు. ఎందుకు అడుగుతున్నావో కారణాలు చెప్పమని అడగకూడదని చట్టం నిర్దేశిస్తున్నది. మరో వైపు ప్రజాశ్రేయస్సు కోసం అడిగే సమాచారం ఇవ్వవచ్చు అనీ, ప్రజాశ్రేయస్సు కాకుండా మరొక ఉద్దేశంతో కోరితే ఇవ్వనవసరం లేదని మినహాయింపులు ఉన్నాయి. వీర పౌరుడు అడిగే సమాచారం ఇస్తే అది కొన్ని టన్నులు అవుతుందేమో. కాకపోతే కొన్ని కిలోలు. ఎంత అడిగినా అతను ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడో చెప్పడం లేదు. ఒకవేళ అతను అడిగిన సమాచారం ఇస్తే అంత సమాచారం ఏం చేసుకుంటాడో అర్థం కాదు. వార్షిక నివేదికలు, ముద్రిత పుస్తకాలు, దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి ఈ ప్రశ్నకు జవాబుఇచ్చే తేదీ వరకు ఆరంభించిన పథకాలు ఎన్ని, నిధులు ఎన్ని ఇచ్చారు వంటి ప్రశ్నలకు ఇచ్చే సమాచారం కొన్ని కిలోలు ఉండే అవకాశం ఉంది. అసలు ఇతను ఎవరు, ఎందుకు అడుగుతున్నాడు అని ఆరా తీస్తే తేలిందేమంటే వీర పౌరుడు వేస్ట్ పేపర్‌ను అమ్ముకునే వ్యాపారి అని. అయితే రెండు రూపాయలకు పేజి చొప్పున డబ్బు ఖర్చుచేసి సమాచారం తీసుకుని కిలో లెక్కన ఏ వ్యాపారి కూడా అమ్ముకోవడం సాధ్యం కాదు. ఇందులో మరొక కుట్ర కూడా ఉంది. అదేమంటే కావాలని సమాచార సమాధానం ఆలస్యం చేయించి, ఆ తరువాత చట్టం ప్రకారం ఉచితంగా సమాచారం తీసుకునే నియమాన్ని కూడా వాడుకునే దుర్మార్గ ప్రయత్నం ఉందని తేలింది. ఇటువంటి చెత్త ఆలోచనలు రావడం చాలా దురదృష్ట్టకరం. వ్యక్తిగత ద్వేషంతో సమాచారం అడగడం ఆ హక్కును దుర్వినియోగం చేయడమే అవుతుంది. సమాచార హక్కు ప్రజాశ్రేయస్సు కోసం వినియోగించవలసిన సాధనం, అప్పుడే ఆయుధం అవుతుంది. సొంత అవసరాలకోసం లేదా పక్కవాడిని సతాయించడం కోసం సమాచారం కోరడం మొదలు పెడితే ఆ హక్కు తెచ్చిన పరమలక్ష్యం దెబ్బతింటుంది. ఒక్కోసారి సొంత హక్కుల రక్షణ కూడా అవసరమే. అందుకు కావలసిన సమాచారం అడగడంలో తప్పు కూడా లేదు. కాని ఆ పేరుమీద మరెవరినో వేధించడానికి సమాచార హక్కును వినియోగించడం దుర్మార్గం. మహేందర్ అనే పౌరుడు ఢిల్లీ ఆహార సరఫరా శాఖలో నాలుగో మండలాధికారిగా పనిచేసే వ్యక్తి ఎప్పుడు నియమితుడైనాడు, అతనికి ఎన్ని పోస్టులు అప్పగించారు. ఎప్పటినుంచి, ఎన్ని సార్లు బదిలీ అయ్యాడు, ఎందుకు ఎప్పుడు, అతని పైన ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఎన్నిటిమీద విచారణలు జరిగాయి, ఆయన కుల సర్టిఫికెట్, భార్య పేరున ఉన్న బ్యాంక్ అకౌంట్, అతనికి ఎన్ని స్థిర చరాస్తులు ఉన్నాయి? బంగారం ఎంత ఉంది, ఆయన పిల్లలు ఏ పాఠశాలల్లో చదువుతున్నారు, వారిని ఆ పాఠశాలల్లో చదివించేంత డబ్బు ఆయనకు ఎక్కడనుంచి వచ్చింది, ఆయన ఎన్ని విచారణలు నిర్వహించాడు? వంటి అనేకానేక వివరాలు అడిగాడు. పిఐఓ ఆ వివరాలు తమ శాఖ దగ్గర లేవని ఒక్క సమాధానంతో తిరస్కరించి తరువాత మొదటి అప్పీలుకు వెళ్లడం అక్కడ కూడా తిరస్కారం రావడంతో కమిషన్ ముందుకు రావడం జరిగింది. ఎస్ కె పౌల్ అనే అధికారి గురించి ఇతను ఆరా తీస్తున్నాడు. ఆయనే స్వయంగా కమిషన్ ముందుకు వచ్చి విచారణకు హాజరయ్యారు. ఈ సమాచారం కోరడం వెనుక ఉన్న ప్రజా ప్రయోజనమేమిటి అని కమిషన్ ఎన్నిసార్లు అడిగినా సమాధానం లేదు. పైగా మీరు ప్రశ్నలు అడగడానికి కారణాలు అడిగే వీలు లేదని , చట్టం కారణాలు అడగకుండానే సమాచారం ఇవ్వాలని నిర్దేశించిందని వాదించారు. అదే చట్టంలో ప్రజాప్రయోజనం ఉంటేనే కొన్ని సమాచారాలు ఇవ్వాలని నిర్దేశించిందని కమిషన్ వివరించవలసి వచ్చింది. మీరెవరు అని కూడ అడగడానికి వీల్లేదని దరఖాస్తు దారు వాదించారు. నిజానికి ఆయన వాదం చట్టబద్దమైందే. తానెవరో అడగకుండా, తాను ఎందుకు సమాచారం కోరుతున్నాడో అడగకుండానే సమాచారం ఇవ్వతగినైదతే ఇవ్వాలని చట్టం వివరిస్తున్నది. అయితే ఆయన కోరిన సమాచారం ఇవ్వతగినదా కాదా అని విచారించడానికి ప్రజా ప్రయోజనం ఉందా లేదా అనే విచారణ అవసరమవుతుందని కూడా అదే చట్టం నిర్దేశిస్తున్నది. సమాచార చట్టం కింద అధికారికంగా తమంత తామే ఇవ్వవలసిన సమాచారాన్ని ఆ విధంగా ఇవ్వకపోతే ఎవైరనా అడగవచ్చు, ఎందుకోసమైనా అడగవచ్చు. కాని మినహాయింపులకు లోబడిన సమాచారాన్ని చెప్పమని అడిగే వ్యక్తులు ఆ సమాచారం ఏ ప్రయోజనాలకోసం అవసరమో చెప్పవలసి ఉంటుంది. ముఖ్యంగా సెక్షన్ 8 (1)(జె) కింద వ్యక్తిగత సమాచారం అడిగినపుడు, మూడో వ్యక్తి సమాచారం లేదా అతని కుటుంబానికి సంబంధించిన సమాచారం, ప్రజా కార్యక్రమాలతో ఏమాత్రం లేని సమాచారం, అతని వ్యక్తిగత గుట్టును దెబ్బతీసే సమాచారం ఇవ్వడానికి వీల్లేదని నిషేధిస్తున్నది. అయితే బహుళ ప్రజాప్రయోజనాలు ఉంటే ఆ సమాచారాన్ని కూడా ఇవ్వాలని కమిషన్ నిర్ణయించవచ్చునని ఆ సెక్షన్లో మినహాయింపు వివరిస్తున్నది. కనుక ప్రయోజనం గురించి, దరఖాస్తుదారు గుణగణాల గురించి అడగడం చట్టపరమైన అవసరం. మీరెవరు అంటే సోషల్ వర్కర్ అన్నాడాయన. అంటే ఏమిటో వివరించలేదు. ఏం పనిచేసారు? సమాజ సేవ అందులోఎంత? అనే ప్రశ్నలకు జవాబు లేదు. పోనీ మీకు ఆ వ్యక్తి మీద ఏమైనా పగ ఉందా అంటే చాలా నిర్లక్ష్యంగా ఏమో ఉంటే ఉండవచ్చు అని సమాధానం చెప్పాడు. ప్రశ్నల ద్వారా అడిగే సమాచారం ఏమిటో స్పష్టత లేకుండా, ఒక ఉద్యోగి సర్వీసు రికార్డులో ఉండే వివరాలన్నీ తనకు కావాలని అడగడం న్యాయం కాదు, నిజానికి ఈ కేసులో సమాచార అభ్యర్థనలో అడిగిన సమాచారం అంతా ఒక వ్యక్తి సర్వీసు రికార్డులో ఉంటుంది. ఇవ్వవలసి ఉంటే మొత్తం సర్వీసు బుక్ కాపీ ఒకటి ఆయన చేతిలో పెట్టాలి. కాని సర్వీసు బుక్ ఉద్యోగి వ్యక్తిగతమైంది. ఆయనకు తప్ప మరెవరికీ ఇవ్వడానికి వీల్లేని వ్యక్తిగత సమాచారం అని న్యాయస్థానాలు పేర్కొన్నాయి. ఆ అధికారి విధులు, పనివేళలు, అధికారాలు మొదలైన అధికారిక వివరాలు తప్ప ఇతర వ్యక్తిగత సమాచారం ఇవ్వడానికి ఈ కేసులో వీల్లేదని కమిషనర్ ఆదేశం. ఇది సమాచార హక్కును వ్యక్తిగత పగలు తీర్చుకోవడానికి వాడుకునే దుర్వినియోగం, ప్రజల మేలుకోసం వాడవలసిన సమాచార హక్కును వ్యక్తి గత స్వార్థం కోసం లేదా సరదాగా లేదా ఏడిపించడం కోసం వాడుకో వాలనుకునే వారు ప్రజా ధనాన్ని అంతకు మించిన ప్రజాసమయాన్ని వృధా చేయడమే గాకుండా, ఆ సమయాన్ని ప్రజా ప్రయోజనపూరితమైన సమాచారాన్ని సేకరించి ఇచ్చేందుకు సద్వినియోగం చేయకుండా నిరోధిం చడం అవుతున్నది. ఇటువంటి దుర్వినియోగాలను అరికట్టవలసిన ఆవశ్యకత ఎంతో ఉంది. పగ తీర్చుకోవడానికి ఆర్టీఐని బాణంగా ఉపయోగించకూడదు. ఆ ప్రయత్నం చేస్తే ప్రజాసంస్థలు ధనుస్సులు కాకూడదు, కమిషనర్లు అల్లె తాడు లాగే భుజాలు చేయకూడదు. ఆర్టీఐ బాణాలు వ్యర్థంగా విసరకూడదు. (మహేందర్ సింగ్ వర్సెస్ ఢిల్లీ ఆహార సరఫరా శాఖ కేసు 2014,490, డిసెంబర్ మూడో వారం తీర్పు ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
మధ్యతరగతి మౌనం వీడాలి
విశ్లేషణ - కొత్త కోణం ప్రభుత్వాలు తప్పులు చేయడం సహజం. అయితే నోరున్న మధ్యతరగతి మేధావి వర్గం స్పందిస్తే ప్రభుత్వాలు పునరాలోచనలో పడతాయి. లేదంటే మౌనాన్ని పూర్తి అంగీకారంగా భావించి తప్పుడు విధానాలనే కొనసాగిస్తాయి. కార్పొరేట్ రంగం నేడు వేగంగా గ్రామాలను, వ్యవసాయాన్ని, కులవృత్తులను ధ్వంసం చేస్తోంది. దళితులు, గిరిపుత్రులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. కార్పొరేట్ రంగం అల్లిన రంగుల కలల ప్రపంచం నుంచి మధ్యతరగతి వర్గం బయటపడాలి. జన్మనిచ్చిన పల్లెకు, బతుకునేర్పిన సమాజానికి అండగా నిలవాలి. మేధావులంటే పండితులే కావాల్సిన అవసరంలేదు. పండితులంతా మేధావులూ కానవసరంలేదు. ఏదో ఒక రంగంలో నైపుణ్యం కలిగి, అవస రమైతే అధికారాన్ని ప్రశ్నించగలిగిన వారే మేధావులు. అందుకే ప్రముఖ చరిత్రకారిణి రొమిల్లా థాపర్ ఇటీవల ఒక సభలో పాండిత్యం ఉంటే మేధావులు అవుతారనేది అబద్ధం అని వ్యాఖ్యానించారు. ప్రముఖ జర్నలిస్టు నిఖిల్ చక్రవర్తి స్మారకోపన్యాసం చేస్తూ ఆమె భారత మేధావుల తీరు పట్ల ఆందోళన వెలిబుచ్చారు. అధికారాన్ని ప్రశ్నించకపోవడం దేశ ప్రగతికి ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. అది కేవలం ఆందోళన మాత్రమే కాదు పచ్చి వాస్తవం కూడా. చనిపోవడానికి ముందు సోక్రటీస్ ప్రశ్నించేవాడే మేధావి పాశ్చాత్య ప్రపంచంలో గ్రీకు తత్వవేత్త సోక్రటీస్ మొదలుకొని ఎంతో మంది మేధావులు అధికారాన్ని ప్రశ్నించారు. అలా ప్రశ్నించే హక్కు కోసం ఎన్ని త్యాగాలకైనా సిద్ధపడ్డారు. మన దేశంలో ప్రత్యక్షంగా అలాంటి ధిక్కార సంప్రదాయానికి గౌతమ బుద్ధుడిని మూలపురుషునిగా చెప్పుకోవచ్చు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో అల్లకల్లోలం రాజ్యమేలు తున్న కాలంలో ఆయన అందుకు కారకులైన వారిని నిలదీ శాడు. అంతేకాదు ప్రత్యామ్నాయాలను చూపి, సమాజ విముక్తికి మార్గం చూపించాడు. బౌద్ధం ఆ రోజుల్లో ఒక విప్లవంగా చరిత్రలో నిలిచిపోయింది. ప్రశ్నించడంతోనే బుద్ధుడి సామాజిక జీవితం మొదలైంది. ఆయన వృద్ధుడిని, రోగిని, శవాన్ని, పేదవాడిని చూసి సన్యాసం తీసుకున్నాడని ప్రచారంలో ఉన్న కథ అసత్యం. ఆయన జన్మించిన శాక్య తెగకు, పొరుగున ఉన్న కొలియ తెగలకు మధ్య రోహిణి నది నీటి కోసం ఘర్షణలు సాగేవి. ఆ సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని, యుద్ధం వద్దని అన్నందుకు ఆయన దేశం వదిలిపెట్టి పోవాల్సివచ్చింది. ఆ విధంగా ఇంటిని వదలిన గౌతముడు సమాజాన్ని ఆకళింపు చేసు కొని, పరిష్కార మార్గాలను కనుగొని బుద్ధుడిగా మారాడు. ఆయన ఆరోజు శాక్య గణసభను ప్రశ్నించి ఉండకపోతే, సుఖాలను త్యజించి సమాజం కోసం తపించకపోతే ఏం జరిగేదో చెప్పలేం. అదేవిధంగా భారత స్వాతంత్య్ర పోరా టానికి పునాదులు వేసిన దాదాభాయి నౌరోజి, మహదేవ్ గోవింద్ రనడే లాంటి వారి ప్రశ్నల కొడవళ్లే భారత జాతిని జాగృతం చేశాయి. ఆ ప్రశ్నల నుంచే గాంధీ నెహ్రూ లాంటి నాయకులు ఉద్భవించారు. భారత కుల సమా జాన్ని అత్యంత శాస్త్రీయంగా విశ్లేషించిన అంబేద్కర్ అంటరానితనాన్ని రూపు మాపకపోతే ఈ సమాజానికి నిష్కృతిలేదని భావించారు. ధైర్యంగా దాన్ని ధిక్కరించారు, తిరుగుబాటు చేశారు. లేకపోతే మన రాజ్యాంగం అంటరాని తనాన్ని నిషేధించి ఉండేదేకాదు. చరిత్రనిండా మేధావులు అధికారాన్ని, అధి కార భావజాలాన్ని ధిక్కరించిన ఉదాహరణలెన్నో. సమాజం నేడు ఈ స్థాయి లో అభివృద్ధి చెందడానికి కారణం ఎందరో మేధావులు చేసిన త్యాగాలే. పన్నులు కట్టే దెవరు? రాయితీలు ఎవరికి? మేధావులకు ఒక ముఖ్యవనరు అయిన మధ్యతరగతి నేడు సమాజ శ్రేయస్సు గురించిగాక, తమ బాగుకోసం మాత్రమే ఆలోచిస్తోంది. అంతేకాదు, దేశ సంపదను, వనరులను గుప్పిట పట్టిన కార్పొరేట్ శక్తులకు వెన్నుదన్నుగా నిలిచి, సమాజంలో నిరాదరణకు గురవుతున్న, వివక్షకు బలౌతున్న వర్గాల పట్ల వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారు. ఆర్థిక సంస్కరణల అనంతరం ఈ ధోరణి మరింతగా పెరిగింది. రకరకాల ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న మధ్యతరగతి వర్గాన్ని మార్కెటీకరణ వెలుగు జిలుగులు అమితంగా ఆకర్షిస్తు న్నాయి. ప్రభుత్వాలు కూడా ఇటువంటి వర్గాలు మరింతగా వ్యక్తిగత ప్రయో జనాలకు అంటిపెట్టుకునేలా వారికి రాయితీలను ఇస్తున్నాయి. ఇటువంటి విధానాలు పేదలకు, మధ్యతరగతికి మధ్యన పెద్ద అగాధాన్ని సృష్టిస్తున్నా యి. ఇటీవల జరిగిన ఒక సర్వేలో దేశంలోని నూటికి 80 శాతం మంది కేవలం రోజుకు 25 రూపాయల ఆదాయం, ఖర్చుతో జీవిస్తున్నట్టు తేలింది. దీన్ని బట్టి దేశంలోని పేదల జీవన విధానానికి, సంపన్నుల జీవన విధానానికి మధ్యనున్న అంతరం ఎంత విపరీతంగా పెరిగిపోయిందో తేలిపోతోంది. ఈ దుస్థితిని దృష్టిలో పెట్టుకొని యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గ్రామీణ ఉపాధి హామీ పథకంపై నాటి నుండి నేటి వరకు మేధావులు, పట్టణ మధ్య తరగతి వర్గాలు విమర్శలను గుప్పిస్తూనే ఉన్నాయి. నిజానికి అర్హులైన కూలీ లలో సగం మంది మాత్రమే ఈ పథకాన్ని ఉపయోగించుకున్నారు. ఉపయో గించుకున్నవారికి కూడా నిర్దేశించిన దానిలో సగం దినాలు మాత్రమే పని లభించిందని ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయి. అదేవిధంగా ఆహార భద్రతా చట్టం విషయంలోనూ మధ్యతరగతి చాలా తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించిం ది. కొందరు దీన్ని ప్రజాధన దుర్వినియోగం అన్నారు. మరికొందరు తాము కడుతున్న పన్నులతో ఖజానాకు సమకూరిన ధనాన్ని సంక్షేమ కార్యక్రమాల పేరిట వృథా చేస్తున్నారని వాపోయారు. ఇక్కడే ఒక ప్రశ్న ఉత్పన్నం అవు తుంది. నిజానికి పన్నులు కడుతున్నదెవరు? ప్రయోజనం పొందుతు న్నదెవరు? ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో మధ్యతరగతి, ధనికులు ప్రత్యే కించి చెల్లించే ఆదాయం పన్ను కేవలం పది నుంచి పదిహేను శాతం మాత్రమే. మిగిలిన 85 నుంచి 90 శాతం రాబడి ప్రజలందరూ కొనుగోలు చేసే వస్తువుల మీద వేసే కమర్షియల్ ట్యాక్సెస్ ద్వారా చేకూరుతోంది. అం దులో ఎక్కువ శాతం పేద, దిగువ మధ్య తరగతుల నుండే వస్తోంది. నిజా నికి పన్నుల్లో అధిక భాగాన్ని చెల్లిస్తున్న 80 శాతం జనాభా కోసం ప్రభుత్వం చేస్తున్న ఖర్చు బాగా తక్కువగా ఉంటోంది. కానీ ఎక్కువ భాగం కార్పొరేట్, ధనిక, ఉన్నత మధ్యతరగతి వర్గాల సౌకర్యాల కోసమే ఖర్చవుతోంది. అందుకే మధ్యతరగతి ప్రభుత్వాల ప్రజావ్యతిరేక చర్యలను ప్రశ్నించకుండా మౌనం వహిస్తోంది. రంగుల కలల నుంచి బయటపడాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం కోసం మూడు కాలాలు పచ్చగా ఉండే పంట పొలాలను ధ్వంసం చేసి వేలాది మంది పల్లె ప్రజలను వీధుల్లోకి గెంటేస్తుంటే పల్లెల నుండి ఎదిగి వచ్చిన మధ్యతరగతి ధనిక వర్గాలు సైతం మౌనం వహిస్తున్నాయి. ఇది ఎంత మాత్రం వాంఛనీయం కాదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన భూసేకరణ ఆర్డినెన్స్ పట్ల కూడా ఈ వర్గాల్లో కదలిక లేకపోవడం విచారకరం. ఇది భవిష్యత్తులో చాలా విపరీత పరిణామాలకు దారితీస్తుంది. ప్రభుత్వాలు తప్పులు చేయడం సహజం. అయితే నోరున్న మధ్యతరగతి మేధావి వర్గం స్పందిస్తేనే ప్రభుత్వాలు పునరాలోచనలో పడతాయి. లేదంటే మౌనాన్ని పూర్తి అంగీకారంగా భావించి తప్పుడు విధానాలనే కొనసాగిస్తాయి. ఇది మొత్తం సమాజ పురోభివృద్ధినే దెబ్బతీస్తుంది. అందుకే మధ్యతరగతి పై అంతస్తులకు ఎదిగిన వర్గం పాలకులను ప్రశ్నించడం అవసరం. దేశ ఆర్థిక, రాజకీయ రంగాలపై ఆధిపత్యాన్ని నెరపుతున్న కార్పొరేట్ రంగం మధ్యతరగతి వర్గానికి కొన్ని తాయిలాలు ఇస్తూ వారిలోని ప్రశ్నించే తత్వాన్ని చంపేయాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రభావం తాత్కాలికమే. ఇదే మధ్యతరగతి వర్గం సమాజంలో సాగుతున్న అణచివేత, దోపిడీలకు వ్యతిరేకంగా ముందు వరుసలో నిలబడి పోరాడిన సందర్భాలు చరిత్రలో ఎన్నో ఉన్నాయి. ఇటీవల సాగిన తెలంగాణ ఉద్యమంలో మధ్యతరగతి వర్గం నిర్వహించిన పాత్ర కీలకమైనది. అయితే భవిష్యత్తులో, తెలంగాణ నిర్మాణంలో కూడా వారు అదే పాత్రను పోషిస్తారో, లేదో చూడాల్సిందే. గ్రామాల్లోని రైతులు, కూలీలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలను కార్పొరేట్ రంగం చేతిలో కీలుబొమ్మలుగా ఉన్న ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నాయి. గ్రామాలను, వ్యవసాయాన్ని, కుల వృత్తులను ధ్వంసం చేసే పనిని కార్పొరేట్ రంగం అతివేగంగా సాగిస్తోంది. అదే సమయంలో తరతరాలుగా అంటరానితనానికి గురైన దళితులు, సమాజానికి దూరంగా బతుకుతున్న గిరిపుత్రులు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. ఈ పరిస్థితి మారాలంటే కార్పొరేట్ రంగం అల్లిన రంగుల కలల ప్రపంచం నుంచి మధ్యతరగతి వర్గం బయటపడాలి. జన్మనిచ్చిన పల్లెకు, బతుకునేర్పిన సమాజానికి అండగా నిలవాలి. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్ నం: 9705566213 -
రాయడం రాదు.. చదవ డం రాదు
ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు: 3.25లక్షలు విశ్లేషణకు తీసుకున్న విద్యార్థుల సంఖ్య: 1.61లక్షలు తెలుగు చదవలేని వారు: 75 శాతం తెలుగు రాయలేని వారు: 77శాతం చతుర్విధ ప్రక్రియలో విఫలం: 85శాతం రంగారెడ్డి జిల్లా :ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రతిభ మసకబారుతోంది. ఏటా వారంతా తరగతుల్లో ఒక్కో మెట్టు ఎక్కుతున్నప్పటికీ.. సామర్థ్యం మాత్రం క్రమంగా పతనమవుతోంది. చదవడం, రాయడంతోపాటు చతుర్విధ ప్రక్రియల్లో విద్యార్థి సామర్థ్యాన్ని పరిశీలించిన అనంతరం ఫలితాలను చూసిన విద్యాశాఖ అధికారులకు దిమ్మతిరిగింది. మెజారిటీ సంఖ్యలో విద్యార్థులు తెలుగు పదాలను సైతం చదవలేకపోతున్నారు. రాయడంలోనూ బాగా వెనకబడ్డారు. అదేవిధంగా చతుర్విధ ప్రక్రియలైన కూడికలు, తీసివేతలు, గుణించడం, భాగించడంవంటి చతుర్విత ప్రక్రియల్లో ఏకంగా 85శాతం మంది విద్యార్థులు విఫలమవ్వడం గమనార్హం. జిల్లాలో 2,316 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 1,639, ప్రాథమికోన్నత పాఠశాలలు 259, ఉన్నత పాఠశాలలు 418 ఉన్నాయి. వీటి పరిధిలో దాదాపు 3.25లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రతి విద్యార్థికి చదవడం, రాయడంతో పాటు చతుర్విధ ప్రక్రియల్లో కనీస సామర్థ్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ ఏడాది ‘ట్రిపుల్ ఆర్’ పేరిట సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. గతేడాది నవంబర్ 14వతేదీలోగా ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించింది. ఇందులో భాగంగా చర్యలకు దిగిన ఉపాధ్యాయగణం.. అమలులో ఘోరంగా విఫలమైంది. 75శాతం విద్యార్థులు తెలుగు చదవలేకపోతుండగా.. 77శాతం మంది రాయలేకపోతున్నట్లు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. -
సాగు కన్నీటి వాగేనా!
విశ్లేషణ ఆ రంగానికి చాలినంత విద్యుత్ కూడా అందడం లేదు. దేశంలో ఉపరితల నీటి పారుదల నిర్వహణ సమర్థంగా జరగడం లేదు. వ్యవసాయానికి అనువైన భూమిలో కేవలం 40 శాతమే అందుకు నోచుకుంటోంది. నిజానికి మరికొంత భూమిలో సేద్యం చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, వినియోగించుకోవడం లేదు. భూగర్భ జలాల పంపిణీ కూడా సమంగా సాగడంలేదు. ఆర్థికంగా శక్తి ఉండి, మంచి పరికరాలను, పంపులను ఉపయోగించుకుంటున్నవారు మాత్రమే భూగర్భ జలాలలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుంటున్నారు. ఏ కర్షకుడైనా తను పండించగలిగేది పండించవచ్చు. కాని తన శ్రమ ఫలితాన్ని మార్కెట్లో అమ్ముకోవడం దగ్గర మాత్రం అతడు దారుణమైన క్షోభకు గురౌతున్నాడు. 1980 - 2011 మధ్య భారతదేశంలో సేద్యమే వృత్తిగా ఉన్నవారి సంఖ్య దాదాపు యాభై శాతం ఉంది. ఎన్ఎస్ ఎస్ఓ (నేషనల్శాంపుల్ సర్వే ఆఫీస్) గణాంకాల ప్రకారం దేశంలోని 57.8 కోట్ల కుటుంబాలలో, గ్రామీణ ప్రాంతా లలోని 15.61 కోట్ల కుటుంబాలు వ్యవసాయం మీద ఆధారపడినవే. సేద్యమే ఆధారంగా ఉన్న కుటుంబాలు సగటున నెలకు రూ. 6,426 ఆర్జిస్తున్నాయి. మొత్తం వ్యవ సాయ కుటుంబాలలో మళ్లీ 33 శాతం కుటుంబాలకు 0.4 హెక్టార్ల కంటె తక్కువ భూమే ఉంది. కేవలం ఒక్క హెక్టార్ భూమి కలిగి ఉండి, రోజు గడవడం కూడా కష్టంగా ఉన్న కుటుంబాలు 65 శాతం ఉన్నాయి. మొత్తం వ్యవసాయ కుటుంబాలలో సగం, అంటే 50 శాతం, రుణబాధతో గడు పుతున్నవే. ఆ కుటుంబాలన్నీ సగటున రూ.47,000 అప్పుతో సతమతమౌతున్నాయి. ఈ పరిస్థితులు రైతులం దరినీవడ్డీవ్యాపారుల బారినపడేటట్టు చేస్తున్నాయి. గ్రామీ ణ రుణభారంలో దాదాపు 26 శాతం ఇలాంటి రుణమే. వీరంతా 20 శాతం వడ్డీల కింద చెల్లిస్తూ దారిద్య్రం నుంచి ఎప్పటికీ బయటపడలేని దుస్థితిలో చిక్కుకుని ఉన్నారు. దిగుబడి మొత్తంలో 30 శాతం ఖర్చుల రూపంలో పోతోంది. ఎరువులు, కూలీరేట్లు విపరీతంగా పెరగడం వల్ల ఈ ఖర్చు మరింత పెరిగింది. గ్రామీణప్రాంతాలలో చెల్లించే కనీస వేతనం 2007 నుంచి బాగా పెరగడంతో ద్రవ్యోల్బ ణానికి దారి తీసింది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంఎన్ఆర్ఇజీఎస్) వల్ల గ్రామీణ ప్రాంత కూలీలకు ఎక్కువ వేతనాలను కోరే శక్తి పెరిగింది. వ్యవ సాయ రంగంలో ఖర్చులకు తగినట్టు, ఉత్పత్తి మీద రాబడి రావడం లేదు. దీనితో ద్రవ్యోల్బణం మరింత పెరు గుతోంది. రైతుకు మేలు చేయని వ్యవసాయోత్పత్తుల ధరలు ఈ మొత్తం వ్యవస్థ దొడ్డిదారి వ్యవహారాల వల్ల, దళారుల గుత్తాధిపత్య ధోరణులవల్ల చతికిలపడింది. దీనితో రైతు లకు ప్రయోజనం కూర్చని రీతిలో వ్యవసాయోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. వ్యవసాయ రంగంలో మౌలిక వసతుల కల్పన సంపూర్ణంగా అభివృద్ధి చెందని కారణం గా (ఉదా: శీతల గిడ్డంగులు, రవాణా సదుపాయాలు లేక పోవడం) 25 శాతం దుబారా చోటుచేసుకుంటున్నది. అస మర్థ ప్రజాపంపిణీ వ్యవస్థ కారణంగా 40 శాతం వ్యవసాయోత్పత్తి వ్యర్థమవుతోంది. అలాగే సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు నిలకడ లేని ఆర్థిక వ్యవస్థకు కారణ మవుతున్నాయి. చాలని సాగు నీటి పారుదల సౌకర్యం సాగునీటి పారుదల వ్యవస్థ ద్వారా వ్యవసాయానికి లభిం చే నీరు అవసరాలకు చాలినంతగా లేదు. అలాగే నీటి పారుదల వ్యవస్థ వాతావరణ మార్పుల వల్ల సులభంగా ప్రభావితమయ్యే స్థితిలోనే ఉంది. ఆ రంగానికి చాలినంత విద్యుత్ కూడా అందడం లేదు. దేశంలో ఉపరితల నీటి పారుదల నిర్వహణ సమర్థంగా జరగడం లేదు. వ్యవ సాయానికి అనువైన భూమిలో కేవలం 40 శాతమే అం దుకు నోచుకుంటోంది. నిజానికి మరికొంత భూమిలో సేద్యం చేయగలిగిన సామర్థ్యం ఉన్నప్పటికీ, వినియోగిం చుకోవడం లేదు. భూగర్భ జలాల పంపిణీ కూడా సమం గా సాగడంలేదు. ఆర్థికంగా శక్తి ఉండి, మంచి పరికరా లను, పంపులను ఉపయోగించుకుంటున్నవారు మాత్రమే భూగర్భ జలాలలో ఎక్కువ భాగాన్ని వినియోగించుకుం టున్నారు. నిజానికి వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతులతో చేయడానికి అవసరమయ్యే పెట్టుబడులలో రాయితీలు అందుబాటులో ఉన్నప్పటికీ రైతాంగం వాటిని అందుకునే స్థితిలో లేకపోవడంవల్ల కొత్త సాంకేతిక విధానాలను ప్రవేశపెట్టలేకపోతున్నారు. విద్యుత్‌ను ఆదా చేయాలి రైతాంగం పాత పంపుసెట్లను పక్కన పెట్టి, విద్యు త్ను 20 శాతం ఆదా చేయగలిగే కొత్త పరికరాలను తెచ్చు కోవాలి. వ్యవసాయ రంగానికి పరిమితంగా విద్యుత్ అందుతున్న ఈ నేపథ్యంలో ఇలాంటి పంపులను వినియోగించడం ద్వారానే పూర్తి అవసరాలు తీర్చుకోగలుగుతారు. అలాగే భూగర్భ జలాలు మరీ పాతాళంలోకి వెళ్లిపోతుంటే, పరి ష్కారం ఏమిటి? బిందుసేద్యమే ఇందుకు సమాధానం. ఉపరితల నీటిపారుదల వ్యవస్థను విస్తరించడం ద్వారా, బిందుసేద్యాన్ని ఆచరించేవారికి ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించడం ద్వారా నీటి అందుబాటు సౌకర్యాన్ని మరింత మెరుగుపరచవచ్చు. వర్షం నీటిని కాపాడుకోవడం, భూ గర్భ జలాలను పునరుద్ధరించుకోవడం ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించుకుని కూడా వ్యవసాయోత్పత్తిని పెంపొందించవచ్చు. సమన్వయం లేని క్రమబద్ధీకరణ పుణ్యమా అని వ్యవసాయ రంగం గందరగోళ పరిస్థితులను ఎదుర్కొం టున్నది. ఉదాహరణకి వ్యవసాయ ఉత్పత్తుల గిడ్డంగుల వ్యవహారమే తీసుకుందాం. ఆ రంగం ప్రయోజనం మేరకు ఉత్పత్తులను ప్రైవేటు వ్యక్తులు సయితం నిల్వ చేయడానికి అత్యవసర వస్తువుల చట్టం అనుమతిస్తున్నది. వ్యవసాయదారుల ప్రయోజనాల కోసం రహస్య బిడ్ల ద్వారా హోల్‌సేల్ మార్కెట్‌ను కూడా ప్రభుత్వం నిర్వహిం చవచ్చు. నిజానికి సిద్ధాంత పరంగా చూస్తే భారత వ్యవ సాయ విధానం మంచిదే. కాని దాని నుంచి ఫలితాలను రాబట్టుకోవడంలో వైఫల్యం ఎదురైంది. నాఫెడ్ ఏర్పాటు ఉద్దేశం అలాంటిదే. వ్యవసాయంలో పోటీ మార్కెట్లను పెంపొందించడం, రైతులకు మార్కెటింగ్‌లో, ప్రోసెసిం గ్లో సహకరించడం నాఫెడ్ లక్ష్యం. కానీ నిర్వహణా లోపంతో ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో తలె త్తిన సంక్షోభాలను ఇది నివారించలేకపోయింది. ఉల్లి ధర అదుపులేకుండా పెరగడం ఇందుకు ఒక ఉదాహరణ. అటు సంప్రదాయం, ఇటు ఆధునిక విధానం సేద్యంలో ఎదురయ్యే ప్రమాదాల (రిస్క్) నుంచి రైతు లను కాపాడడంలో ప్రభుత్వం సాయపడవచ్చు. దేశంలో పంటల బీమా చాలా తక్కువ. ఇలాంటి రిస్క్‌ల నుంచి కాపాడుకోవడానికి, ఎరువులు, మందులు, కూలీల మీద వెచ్చించే ఖర్చులు తగ్గించడానికి రైతులు సంఘాలుగా ఏర్పడవచ్చు. దీర్ఘకాల గ్రామీణ రుణ విధానాన్ని ప్రవేశ పెట్టడం కూడా అవసరం. ఇందువల్ల బ్యాంకులకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. మార్కెట్ ఒడిదుడుకులను కూడా ఈ విధానం కట్టడి చేస్తుంది. పంటల మార్పిడి, భూమిని చదునుచేయడం, కప్పడం వంటి సంప్రదాయ వ్యవసాయ పద్ధతులు ఇప్పటికీ అవసరమైనవే. నిజానికి వీటి ప్రయో జనం ఏ మేరకో రైతులకు సంపూర్ణంగా తెలియకపోయినా ఈ పద్ధతుల వల్ల కొంత మేలు ఉంది. నిజానికి ఇలాంటి తక్కువ ఖర్చు పద్ధతుల వల్ల వ్యవసాయ పెట్టుబడులు తగ్గుతాయి. భూమి కోతను నివారించి, భూసారాన్ని పెం చుతాయి. అలాగే శ్రీవరి పద్ధతి (తక్కువ నీటి సౌకర్యంతో అవసరాల మేరకు పండించడం), ఫెర్టిగేషన్ (సూక్ష్మ సేద్య పరికరాలతో ఎరువులను సమంగా పంపిణీ చేయడం) విధానాలను ప్రోత్సహించాలి. పరిమితంగా ఉన్న వనరు లను, వాటి వినియోగాన్ని దృష్టిలో ఉంచుకుని, నీటిని సమర్థంగా ఉపయోగించుకుని పండించిన వ్యవసాయో త్పత్తులకు, అందులోని రకాలకు మేలైన మద్దతు ధరలను ప్రకటించడం ద్వారా అలాంటి వాటిని ప్రోత్సహించాలి. ఈ ప్రోత్సాహకాల ద్వారా అలాంటి విధానాలను రైతులు అవలంబించేటట్టు చేయాలి. 70 శాతం చేలకు దుర్భిక్ష ప్రమాదం వాతావరణంలో మార్పులు మన వ్యవసాయ రంగాన్ని దారుణంగా ప్రభావితం చేస్తున్నాయి. దేశంలో ఉన్న సాగు భూమిలో 70 శాతం దుర్భిక్షం పాలు కావడానికి అవకాశం ఉన్నదే. 12 శాతం భూమి వరదల వల్ల, 8 శాతం తుపాన్ల జోన్లలో ఉండడం వల్ల ఆ సాగు భూమి కరువుకాటకా లతో ప్రభావితమవుతోంది. ఉష్ణోగ్రతలలో కొద్దిపాటి పెరుగుదల కనిపించినా అది వ్యవసాయోత్పత్తులను తగ్గిస్తుంది. అయితే దేశంలో విడుదల అవుతున్న ఉద్గా రాలలో 20 శాతం వ్యవసాయ రంగానికి చెందినవే. అం దువల్ల ఒక విపత్తును ఒకటి పెంచుతూ ఇదంతా విషవల యంలా మారింది. అయితే వ్యవసాయరంగంలో నిలకడ సాధించే లక్ష్యంతో భారత్ ఇప్పటికే (ఎన్ఎంఎస్ఏ -నేష నల్ మిషన్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ ద్వారా) ప్రత్యేక కృషిని ప్రారంభించింది. వ్యవసాయ రంగం ఎదు ర్కొంటున్న సవాళ్లను గుర్తించినా, వైఫల్యాలను కనుగొ నడం దగ్గర, కొత్త విధానాలను పరిచయం చేయడం దగ్గర, సేద్యంలో ఇప్పటికీ కొనసాగుతున్న అసమర్థ విధా నాలను తొలగించే పనిలోను ఎన్ఎంఎస్ఏ కృషి నిరాశా జనకంగానే ఉంది. సాంకేతిక పురోగతి కావాలి భారత వ్యవసాయ రంగంలో సరికొత్త సాంకేతిక పరిజ్ఞా నాన్ని ప్రవేశపెట్టాలి. వారికి కొత్త విధానాలను అందుబా టులోకి తెచ్చి, ఆర్థిక ప్రోత్సాహకాలను కల్పించి మరింత ఆదాయాన్ని తెచ్చే పంటల వైపు దృష్టి మళ్లించే విధంగా చేయాలి. అంటే పండ్లతోటల పెంపకం వంటి వాటి మీద శ్రద్ధ పెట్టేలా చేయాలి. ఇలాంటి సంస్కరణలు భవిష్య త్తులో అయినా తక్కువ పెట్టుబడులకు ఆస్కారం కల్పిస్తా యి. తనను పట్టించుకునే స్వేచ్ఛా విఫణి వైపు రైతు నడవ డానికి ప్రోత్సహిస్తాయి. ధరవరలను నిర్ణయించుకునే వెసులుబాటు రైతుకు కలగడంతో పాటు, ఆహారభద్రతకు కూడా భరోసా ఏర్పడుతుంది. (వ్యాసకర్త బీజేపీ ఎంపీ / కేంద్ర మంత్రి మేనకా గాంధీ కుమారుడు) ఇకపై వరుణ్ గాంధీ ‘సాక్షి’ పాఠకుల కోసం వ్యాసాలు అందించనున్నారు. -
‘రవాణా’ అడ్డతోవలతోనే ఘోరాలు
విశ్లేషణ 2003 నుంచి యువతులతో అసభ్యంగా ప్రవర్తించే అలవాటు ఉన్న శివకుమార్ గొలుసుకట్టు లైంగిక అత్యాచారాలతో నేరచరిత్రను పెంచుకున్నాడు. అయినా కొద్ది సంవత్సరాలుగా అతడు ట్యాక్సీ నడుపుతున్నాడు. అతనికి లెసైన్స్ ఉందో లేదో తనిఖీ చేసిన వారు లేరు. ‘అతనికి లెసైన్స్ ఉంది, మంచి వ్యక్తి అని ఒక సర్టిఫికెట్ ఉంది’, కనుక నమ్మాం అని ఉబర్ అనే నెట్వర్క్ వాదిస్తోంది. రవాణా అథారిటీకి ఎన్నో అధి కారాలున్నాయి. ైలెసైన్స్ లేకుం డా వాహనాలు నడిపేందుకు అనుమతించకూడదు. కొనుగో లు చేసిన వాహనాలకు రిజిస్ట్రేష న్ ఉండాలి. పన్ను కట్టి ఉండాలి. ట్యాక్సీకి ైలెసైన్స్ తీసుకోవాలి. ఢిల్లీ వంటి మహానగరాల్లో ప్రత్యేక బాడ్జి తీసుకోవాలి. ైవైద్య పరీక్షలు తృప్తికరంగా ఉండాలి. అభ్యర్థి నేరచరిత్రను పోలీసులు తనిఖీ చేయాలి. ఆ తరు వాత ట్యాక్సీ నడపడానికి అనుమతి మంజూరు చేయాలి. ఢిల్లీలో నలుపు పసుపు ట్యాక్సీలు, రేడియో ట్యాక్సీ లు, ఎకానమీ రేడియో ట్యాక్సీలు, టూరిస్ట్ ట్యాక్సీలు, గ్రామ సేవా వాహనాలు ఉన్నాయి. వీటి పర్మిట్ షరతులు ఏమిటో చెప్పాలని రాకేశ్ అగర్వాల్ (ఒక ఎన్జీవో అధినేత) సమాచార హక్కు చట్టం కింద అడిగాడు. రవాణాశాఖ కొంత సమాచారం ఇచ్చింది. నలుపు పసుపు ట్యాక్సీల (డి ఎల్ 1 టి టైప్)కు, టూరిస్ట్ పర్మిట్ ట్యాక్సీల (డిఎల్1 ైవై)కు ప్రత్యేకమైన పర్మిట్ నిబంధనలేవీ లేవని దాని సారాంశం. ఈ రకం ట్యాక్సీలకు బాడ్జీలు అవసరమే లేదని కూడా సమాధానం వచ్చిందని అగర్వాల్ వివరించారు. బ్యాడ్జీ అవసరమైతే డ్రైవర్‌కు మూడురోజుల తప్పని సరి శిక్షణ ఇవ్వాలి. ఆ ్రైడైవర్ ఉండే చోటికి వెళ్లి నేర చరిత్ర ఏైదైనా ఉందా అని ఆరాతీయాలి. బ్యాడ్జీలు అవసరమే లేక పోతే పూర్వాపరాల సేకరణ ప్రక్రియ జరగదు. పోలీసులు పట్టుకుని చేసేదేమీ ఉండదు. వంద రూపాయల జరిమా నాతో సరి. కాని బ్యాడ్జీ అవసరం అయిన ట్యాక్సీ డ్రైవర్ నియమాలు ఉల్లంఘిస్తే పదివేల రూపాయల జరిమానా కట్టవలసి వస్తుంది. మోటార్ వాహనాల చట్టం సెక్షన్ 192 కింద ఏడాది జైలు శిక్ష కూడా విధించవచ్చు. ఢిల్లీ మహిళపై అత్యాచారం ఘటనలో ఉపయోగిం చిన ట్యాక్సీకి కూడా నిబంధనలను అమలు చేసి ఉంటే, ఓనర్, ్రైడైవర్ల పూర్వాపరాలను విచారించే అవకాశం లభించేది. రవాణా శాఖ సక్రమంగా తనిఖీ చేసినా నేరం జరిగేదేకాదేమో! నడుస్తున్న బస్సులో 2012 డిసెంబర్లో జరిగిన మహిళ లైంగిక అత్యాచారం సంచలనం సృష్టించింది. మళ్లీ 2014 డిసెంబర్లో ట్యాక్సీలో ప్రయాణిస్తున్న 27 ఏళ్ల వనితపై జరిగిన అత్యాచారం ఆ నగరాన్నీ, దేశ ప్రజలను కలవరపరిచింది. ఈ నేరాలను ఆపలేమా? చట్టాలు పకడ్బందీగా అమలు చేయడం కోసం కమిటీలు వేసుకుం టున్నాం. సవరణలు చేసుకుంటున్నాం. కాని నేరాలు ఆగ డం లేదు. తాజా అత్యాచారం ఘటనలో ఆరోపణలు ఎదు ర్కొంటున్న ఢిల్లీ ట్యాక్సీ డ్రైవర్ శివకుమార్ యాదవ్ గతం లోను అనేక నేరాలకు పాల్పడ్డాడని తేలింది. పోలీసులు వ్యూహం పన్ని మధురలో అరెస్ట్ చేశారు. టాక్సీలకు అను మతినిచ్చే విధానంలో లోపం వల్ల, నియమాలు సక్రమం గా లేకపోవడం వల్ల, వాటినైనా అమలు చేసే వారే లేక పోవడం వల్ల నేరాలు జరుగుతున్నాయని ఆర్టీఐ అర్జీదారు రాకేశ్ అగర్వాల్ సమాచార కమిషన్ ముందు వాదించారు. 2003 నుంచి యువతులతో అసభ్యంగా ప్రవర్తించే అలవాటు ఉన్న శివకుమార్ గొలుసుకట్టు లైంగిక అత్యా చారాలతో నేరచరిత్రను పెంచుకున్నాడు. అయినా కొద్ది సంవత్సరాలుగా అతడు ట్యాక్సీ నడుపుతున్నాడు. అతనికి లెసైన్స్ ఉందో లేదో తనిఖీ చేసిన వారు లేరు. ‘అతనికి లెసైన్స్ ఉంది, మంచి వ్యక్తి అని ఒక సర్టిఫికెట్ ఉంది’, కనుక నమ్మాం అని ఉబర్ అనే నెట్వర్క్ వాదిస్తోంది. అయితే రెండు వేల రూపాయలు లంచం ఇచ్చి, ‘మంచి వాడ’నే పత్రం తెచ్చుకున్నాడన్న ఆరోపణలు రావడంతో, ఆ దొంగ సర్టిఫికెట్ ఇప్పించిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు. కొనుగోలు చేసిన ట్యాక్సీలకు బ్యాడ్జీలు అవసరం లేదనే విధానం వెనుక కారణాలేమిటి అని వివరించాల్సిన బాధ్యత సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 4 (1) సి కింద రవాణా శాఖ మీద ఉంది, ప్రజల మీద తీవ్ర ప్రభా వం చూపే విధాన నిర్ణయాలకు ఆధారమైన పరిస్థితులు, కారణాను వివరించాల్సిన అవసరం ఉంది. అడగకుం డానే తమంత తామే ఈ విధాన ప్రకటన ప్రజలకు అం దించవలసిన బాధ్యత ఉంది. నేరాలకు దోహదం చేసే లోప భూయిష్టమైన నియ మాలెందుకు తయారు చేశారు? ఢిల్లీ నగర వీధుల్లో తిరిగే ట్యాక్సీలలో మహిళలపై జరిగే నేరాలను నివారించడానికి రవాణా శాఖ ఏవిధమైన విధానం రూపొందిస్తుంది, ఇంకా కొత్త పర్మిట్ నియమాలేమైనా విధిస్తుందా అనే విష యాలను వివరించాలని సమాచార కమిషనర్ రెండో అప్పీలు ఫిర్యాదును విచారిస్తూ ఆదేశించవలసివచ్చింది. ఈ తరహా నేరాలను నివారించడానికి రవాణా అథారిటీ నిబంధనలను సక్రమంగా అమలు చేస్తే చాలా ఉపయో గం ఉంటుందనడానికీ, లేకపోతే ఎంతటి ఘోరాలనైనా ఆపలేమనడానికీ ఢిల్లీ ఉబర్ నెట్వర్క్ ్రైడైవర్ చేసిన నేరమే ఉదాహరణ. రవాణా శాఖ అధికారులు తమ శాఖలోని లంచగొండితనాన్ని నిరోధించకుంటే నేరాలు ఆపడం కష్టం. శివకుమార్ యాదవ్‌కు శిక్ష పడుతుందో లేదో, ఎంత శిక్ష పడుతుందో ఎవరూ చెప్పలేరు. కాని ఆ నేరాలు జరగకుండా ఆపగలిగే నియమాలను అమలుజరిపి, లం చాలు తీసుకుని నేరగాళ్లను వదిలేసే ధోరణిని అదుపు చేయడం అత్యవసరమన్న సంగతిని ఈ సంఘటన వెల్ల డించింది. ఆర్టీఏ లోపాలను ప్రతి పౌరుడు ఆర్టీఏ చట్టం తోనే ఎండగట్టవచ్చు. విధానపరమైన బలహీనతలను అడిగే పౌర శక్తి అవసరం. (రాకేశ్ అగర్వాల్ వర్సెస్ ఢిల్లీ రవాణా శాఖ కేసులో ఆదేశం ఆధారంగా) (వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్) professorsridhar@gmail.com -
అస్పృశ్యత ఇంకెంత కాలం?
విశ్లేషణ అంటరానితనం దేశవ్యాప్తంగా విస్తృతంగా అమలవుతోందని ఎన్సీఏఈఆర్ తాజా సర్వేలో వెల్లడైంది. రెండున్నర వేల ఏళ్లుగా ఉనికిలో ఉన్న అస్పృశ్యత ఇంకా బలంగా కొనసాగడానికి ప్రధాన కారణం హిందూ సమాజం మెదళ్లలో ఉన్న గుడ్డి వ్యతిరేకతే. దళిత కులాలతో సామరస్యంగా వ్యవహరించకపోవడం, వారిని తమతో సమానమైన మనుషులుగా గుర్తించకపోవడం, వారి అవకాశాలను అడ్డుకోవడం వంటివన్నీ కుల సమాజ లక్షణాలే. వారి వెనుకబాటుకు కారణాలే. ఇంకెన్నాళ్లీ రిజర్వేషన్లు? అనే ప్రశ్నకు సమాధానం చెప్పాల్సింది హిందూ సమాజం. ఆ మాటకొస్తే దళితేతర సమాజమే. ఆరున్నర దశాబ్దాలుగా భారత రాజ్యాంగం అమలులో ఉన్నా, నేటికీ అంటరానితనాన్ని పాటిస్తున్నామని బహిరంగంగా అంగీకరించే వారు చాలా మందే ఉన్నారు. దాదాపు అన్ని కులాల వారు తర తమ స్థాయిల్లో అంటరానితనాన్ని పాటిస్తున్నామని తమదైన భాషలో ఆ విషయాన్ని చెబుతున్నారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్ (ఎస్.సి.ఎ.ఈ.ఆర్.) సంస్థ ఇటీవల జరిపిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ‘భారత మానవ అభివృద్ధి సర్వే’ పేరిట ఈ సంస్థ దేశవ్యాప్తంగా 42 వేల ఇళ్లను సర్వే చేసింది. 2015లో సర్వే పూర్తి వివరాలను వెల్లడిస్తారు. 2011-12లో నిర్వహించిన ఈ సర్వేకు డాక్టర్ అమిత్ థోరాట్ ప్రధాన పరిశోధకులు. బ్రాహ్మణులు, అగ్రకులాలు, ఓబీసీలను విడివిడిగా వారి అభిప్రాయాలను అడిగారు. ఇందులో 52 శాతం బ్రాహ్మణులు, 24 శాతం అగ్రకులాల వారు, 33 శాతం ఓబీసీలు అంటరానితనాన్ని పాటిస్తున్నట్లు చెప్పారు. మతాల వారీగా, హిందువులు 35 శాతం, జైనులు 30 శాతం, సిక్కులు 23 శాతం, ముస్లింలు 18 శాతం, క్రైస్తవులు 5 శాతం, బౌద్ధులు ఒక శాతం అంటరానితనాన్ని ఆచరిస్తున్నామని తెలిపారు. ఈ లెక్కలు అంటరానితనం అమలవుతున్న తీరును, దాని తీవ్రతను మాత్రమే తెలియజేస్తాయి. నిజానికి అంటరానినాన్ని పాటిస్తున్నా ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోని వారు ఇంతకంటే ఎక్కువగానే ఉంటారు. ‘‘తప్పు అంటరాని కులాలది కాదు’’ అంటరానితనాన్ని, కులాల అంతరాలను సమసిపోయేట్టు చేయాలని ఇప్పటికే చాలామంది చాలా ప్రయత్నాలు చేశారు. స్వాతంత్య్రం పొందిన అనంతరం మనం రూపొందించుకున్న రాజ్యాంగంలో అంటరానితనాన్ని నిషేధించే నిబంధనను కూడా ఏర్పాటు చేసుకున్నాం. తద్వారా నాటి నాయకులు ఆశించిన ఫలితాలు ఇంకా పూర్తిగా అనుభవంలోకి రాకపోవడం విచారకరం. 1949 నవంబర్, 29వ తేదీన భారతదేశం ఒక చరిత్రను సృష్టించింది. అప్పటి వరకు అంటరానితనంపై ఎలాంటి చట్టపరమైన ఆంక్షలు లేవు. పైగా అందుకు ధర్మశాస్త్రాల ఆమోదం ఉండేది. అయితే చరిత్రాత్మకమైన ఆ రోజు హేయమైన, సిగ్గుచేటైన ఈ దురాచారానికి చట్టపరంగా ముగింపు పలికింది. ఆనాటి చర్చలో పాల్గొన్న నజీరుద్దీన్ అహ్మద్, వి.ఎల్.మునిస్వామి పిళ్లై, డాక్టర్ మన్మోహన్ దాస్, శ్రీమతి దాక్షాయణి వేలాయుథన్, కె.టి.షా, శంతన్ కుమార్ దాస్ తదితరులు అంటరానితనం నిర్మూలనను చరిత్రాత్మక బాధ్యతగా పేర్కొన్నారు. మన్మోహన్ దాస్ మాట్లాడుతూ... ఇంతవరకూ అంటరాని వారిగా ఉన్న వారికి 1949 నవంబర్, 29 ఎన్నటికీ మరువలేని రోజు అని అభివర్ణించారు. రాజ్యాంగ నిర్ణాయక సభకు ైచైర్మన్‌గా ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ చర్చను నడిపించిన తీరును ప్రత్యేకించి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. ఆయన అంటరానితనాన్ని పాటిస్తున్న కులాలకు, సమూహాలకే సభలో ఎక్కువగా మాట్లాడే అవకాశమిచ్చారు. అంబేద్కర్ సభాధ్యక్ష పాత్రకే పరిమితమయ్యారు. వాదనా పటిమతో కూడిన గంభీరోపన్యాసాలు చేసే ప్రయత్నమే చేయలేదు. ఎందుకంటే, అంటరానితనం నిర్మూలన బాధ్యత హిందూ సమాజ నాయకులదేనని ఆయన భావించారు. అంటరాని కులాలు మాత్రమే ఆ దురాచారాన్ని నిర్మూలించాలనుకుంటే అది సాధ్యం కాదని ఆయన అభిప్రాయం. 1946లో ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంబేద్కర్ సరిగ్గా అదే అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చారు: ‘‘అంటరాని కులాలు మొదటి నుంచి ఈ సమాజంలో భాగం కావాలని ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కానీ హిందూ కులాలే అందుకు అంగీకరించడం లేదు. చాలా మంది భ్రమపడుతున్నట్టు ఇది అంటరాని కులాల తప్పు కాదు. అంటరాని వాళ్లుగా ఉండాలనే కోరిక వారికి లేదు. హిందూ కులాల మనసుల్లో పరివర్తన కలగాలి. అప్పుడే వారు సమా జంలో కలసిపోవడం సాధ్యమవుతుంది. అంతవరకు ఇది ఒక స్వప్నంగానే మిగిలిపోతుంది. హిందూ సమాజం, దాని సంప్రదాయాలే అంటరానితనానికి మూలం’’ అని స్పష్టం చేశారు. దళితేతర సమాజానిదే బాధ్యత ఇంకా హిందూ సమాజం కులాన్ని, అంటరానితనాన్ని పాటిస్తున్నందువల్లనే ఎన్.సి.ఎ.ఈ.ఆర్. సర్వేలో అంటరానితనం విస్తృతంగా ఉన్నట్టు తేలింది. రెండున్నర వేల ఏళ్లుగా ఉనికిలో ఉన్నట్టు తెలుస్తున్న అంటరానితనం ఇంకా బలంగా కొనసాగడానికి ప్రధాన కారణం హిందూ సమాజం మెదళ్లలో ఉన్న గుడ్డి వ్యతిరేకతే. కుల భేదాలు ఉన్నప్పటికీ విభిన్న కులాల మధ్య ఉన్న వైరుధ్యాలు క్రూరంగా ఉండవు. కానీ మొత్తం సమాజానికి, అంటరాని కులాలకు మధ్య ఉన్న భేదం పూర్తిగా శత్రుపూరితంగా మారింది. దీనికి రాజకీయ సామాజిక కారణాలున్నాయి. బౌద్ధాన్ని అనుసరించే వాళ్లను ఆనాటి హిందుత్వ శక్తులు క్రూరంగా అణచివేశారని, మిగిలిన కొద్ది మందిని సమాజం నుంచి వెలివేశారని, వాళ్లే అంటరాని కులాలుగా ఉన్న వాళ్లనే విషయాన్ని బాబా సాహెబ్ అంబేద్కర్ ‘‘అంటరానివారెవరు?’’ అనే తన పరిశోధనల్లో వెల్లడించారు. అయితే ఈ రోజు అది మరింత పెద్ద మానసిక సమస్యగా తయారైంది. ఆర్థిక భేదాలను తొలగించడం ఒక రకంగా సులువు. ప్రభుత్వాలు తలచుకుంటే బలవంతంగానైనా ఆస్తులున్న వారి నుంచి లాక్కొని, అందరికీ సమానంగా పంపిణీ చేయవచ్చు. కానీ కులాన్ని నిర్మూలించాలంటే చట్టాలు, రాజ్యాంగ రక్షణలు మాత్రమే సరిపోవు. సామాజిక పరివర్తన, మానసిక సంసిద్ధత కావాలి. అయితే, హిందూ సమాజం, ఇతర మతాలు పాటిస్తున్న అంటరానితనం వలన అంటరాని కులాలుగా గుర్తింపు పొందుతున్న దళితులు తరతరాలుగా సామాజిక వెలివేతకు, ఆర్థిక దోపిడీకి, రాజకీయ అణచివేతకు గురవుతూ ఉనారు. ముందుగా దీనికి పరిష్కారాలు వెతకాలి. ఇక్కడ హిందూ సమాజంతో పాటు ఇతర మతాల, వర్గాల పాత్ర కూడా చర్చనీయాంశం అవుతుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా రక్షణలు, సంక్షేమ పథకాలు, అమలులో ఉన్నాయి. కానీ అవి అనుకున్నంతగా అమలు జరగడం లేదు. దీనికి ప్రధాన కారణం దళితేతర సమాజంలో ఉన్న వ్యతిరేకతా భావమే. ఇది పోవాలి. దళిత సమాజం తన పోరాటాలతో ఆ సమస్యలను ఏ మేరకు వెలుగులోకి తెస్తుందనేదే దాని ముందున్న సమస్య. అయితే వాటిని పరిష్కరించే బాధ్యత దళితేతర సమాజానిది మాత్రమేనని గుర్తుంచుకోవాలి. రిజర్వేషన్లు, అత్యాచారాల నిరోధక చట్టం ఇవన్నీ దళితుల రక్షణకు గాక, ఇతరులకు వ్యతిరేకంగా పని చేస్తున్నాయి, దుర్వినియోగం అవుతున్నాయనే వాదనలు తరచుగా వినిపిస్తుంటాయి. ఇంకెన్నాళ్లీ రిజర్వేషన్లు? అనే ప్రశ్న కూడా పదే పదే ముందుకొస్తుంటుంది. దీనికి సమాధానం చెప్పాల్సింది కేవలం దళితులు కాదు... హిందూ సమాజం. ఆ మాటకొస్తే దళితేతర సమాజం. ఎవరైతే ఈ దేశం, ఈ జాతి అంతా ఒక్కటని భావిస్తున్నారో వాళ్లే ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సి ఉంటుంది. అంటరాని కులాలతో సామరస్యంగా వ్యవహరించక పోవడం, కనీసం వారిని తమతో సమానమైన మనుషులుగా గుర్తించకపోవడం, అడుగడుగునా వారి అవకాశాలను అడ్డుకోవడం వంటివన్నీ కుల సమాజ లక్షణాలే. దళితుల వెనుకబాటుకు ఇవే కారణాలు. దళిత జనాభివృద్ధితోనే దేశాభివృద్ధి అంబేద్కర్ తర్వాత కుల సమస్యపై అంత తీవ్రంగా స్పందించిన వారిలో రామ్ మనోహర్ లోహియా ముఖ్యులు. దళిత, బడుగు కులాలకు అవకాశాల కల్పన వల్లనే కుల సమాజంలోని అంతరాలు కొంత మేరకైనా తగ్గుతాయని ఆయన చెప్పారని గమనించాలి. ఇటీవల అన్ని రాజకీయ వర్గాల నుంచి, ముఖ్యంగా హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శక్తుల నుంచి ఈ అంశంపై కొంత సానుకూల స్పందన వస్తున్నది. ఇది ఆచరణ రూపంలో మరింత శక్తివంతంగా ముందుకు రావాలి. ముఖ్యంగా దళిత యువతలో, విద్యార్థుల్లో నైరాశ్యం నెల కొని ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో అరకొరగా అందిన చదువు వారికి ఎలాంటి బతుకుతెరువును చూపడం లేదు. పైగా భూమి లాంటి ఆర్థిక వనరులు రోజు రోజుకీ కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం అవుతుండటంతో సెంటు భూమి కూడా వారికి మిగలడం లేదు. దాదాపు నూటికి తొంభై శాతం ఉద్యోగాలు ప్రైవేట్ రంగంలోకి వెళ్లిపోయిన తర్వాత ఉద్యోగ రిజర్వేషన్లు నామ్‌కే వాస్తేగా తయారయ్యాయి. వీటన్నింటి నేపథ్యంలో కులాలకు అతీతంగా అంతా ఐక్యంగా ముందుకు పోవాలనుకునే శక్తులు... జనాభాలో 20 శాతంగా ఉన్న అంటరాని కులాల బాగోగులను పట్టించుకోకపోతే, దేశాభివృద్ధి మిథ్యగానే మిగిలిపోక తప్పదు. ప్రపంచంలోని అన్ని దేశాలకు దీటుగా మన దేశాన్ని నిలబెట్టాలనుకునే కల దళితులు అభివృద్ధి చెందనిదే నెరవేరదు. అందుకే అంటరానితనాన్ని, కులాల అంతరాలను నిర్మూలించడాన్ని అత్యవసరమైన, ప్రథమశ్రేణి ప్రాధాన్యాలలో ఒకటిగా తీసుకుని దృఢ సంకల్పంతో కృషి చేస్తే తప్ప భారతదేశం ప్రపంచంలో తల ఎత్తుకొని నిలబడలేదు. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు-మొబైల్ నం: 9705566213) -
పరుష వ్యాఖ్యల వెనక అసలు ఆంతర్యం?!
విశ్లేషణ ఈ వారం ఒక కేంద్ర మంత్రి భారతీయులను రామ్జాదాలు (హిందువులని అర్థం) లేక హరా మ్జాదాలు (అక్రమ సంతానం) అంటూ వేరు పర్చడాన్ని మనం చూశాం. భారతీయ జనతా పార్టీలో చేరిన పలువురు నిరక్షర లేదా అర్థ నిరక్షర సాధ్విలలో ఈమె కూడా ఒకరు. మీడి యా విరుచుకుపడ్డాక మంత్రి సాధ్వి నిరంజన ముక్తసరిగా ఒక పశ్చాత్తాప ప్రకటన చేశారు. ఇలాంటి అసభ్య భాషను హిందుత్వ పార్టీలు తమ పునాదిని బలపర్చు కోవడం కోసం తరచుగా ఉపయోగించేవి. మీడియాలో రచ్చ జరిగాక ప్రతిపక్షం దాన్ని పార్లమెంటు దృష్టికి తీసుకొచ్చింది. కేంద్రమంత్రి అరు ణ్ జైట్లీ, సాధ్వి నిరంజన ప్రకటనను ఖండించారు. ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం వెంటనే ఈ అంశంపై స్పందించలేదు. అలాంటి వ్యాఖ్య ల వెనుక ఉన్న సంకేతం ప్రబలమైనదని ఆయనకు తెలుసు. ఆ తర్వాత ప్రధాని దీనిపై ఒక వార్తను లోపాయికారిగా లీక్ చేశా రు. నేతలు తమ మాటల విషయంలో జాగ్రత్త పడాలని మోదీ అంతర్గ త సమావేశంలో హెచ్చరించారన్నదే ఆ వార్త. అయితే ఈ హెచ్చరికలో ఖండనను పోలిన స్పష్టత లేకపోవడం గమనార్హం. తన మంత్రులు, ఎంపీలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించబోనంటూ మోదీ గట్టి సందే శాన్ని ఇవ్వాలనుకుని ఉంటే, మంత్రివర్గం నుంచి నిరంజనను తొలగిం చడమే సరైన చర్య అయి ఉండేది. పాత్రధారిని నేరుగా విమర్శించ కుండా ఆమె చర్యలను మాత్రమే విమర్శించడం వల్ల ఏమీ ఒరగదు. వాస్తవానికి మంత్రి రాజీనామాను డిమాండ్ చేస్తున్న ప్రతిపక్ష పార్టీల దాడులను దారి మళ్లించడానికి క్షమాపణను ప్రతిపాదించినట్లు కనబ డుతోంది. ప్రతిపక్షం మోదీ చేసిన ఈ తప్పును పసిగట్టి దాన్ని అనుకూ లంగా మార్చుకోవడానికి మరింత ఒత్తిడి చేసింది. అప్పుడు మాత్రమే మోదీ పార్లమెంటుకు వచ్చి ఎవరైనా సరే అలాంటి వ్యాఖ్యలను చేయ కూడదంటూ వివరణ ఇచ్చారు. అయితే హిందుత్వ తరపున వ్యవహరి స్తున్నవారు అలాంటి మాటలు ఎందుకు వాడుతున్నారన్నదే ప్రశ్న. బీజేపీ అనామక అభ్యర్థి గిరిరాజ్ సింగ్ ఎన్నికల ప్రచార కార్యక్ర మంలో ఒక వ్యాఖ్య చేయడం ద్వారా ఉన్నట్లుండి వెలుగులోకి వచ్చారు. ఆయన మాటల ప్రకారం ‘నరేంద్రమోదీని అడ్డుకోవాలని భావిస్తున్న వారు పాకిస్తాన్ మద్దతుకోసం చూస్తున్నారు. రాబోయే రోజుల్లో, ఇలాం టి వ్యక్తులకు భారత్‌లో, జార్ఖండ్‌లో చోటు ఉండదు. ఎందుకంటే పాకిస్తానే వారికి సరైన చోటు’. అదేసమయంలో వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా గుజరాత్లో ఒక సభలో మాట్లాడిన టేప్ లీక్ అయింది. దావూది బోహ్రా అనే వ్యక్తి ఆస్తి కొనుగోలు ఘటనలో పొరుగున నివసిస్తున్న ఒక హిందువు తొగాడియా సలహాను అర్థించారు. భారత్ లోని సంపన్న కమ్యూనిటీల్లో బోహ్రా ఒకటి. వీరు సున్నీ ముస్లింలతో కలిసి జీవించలేరు. హిందువులు అధికంగా ఉండే పట్టణ ప్రాంతాల్లో నివసించడానికే బోహ్రాలు మొగ్గు చూపుతారు. కాని తొగాడియాను సల హా కోరిన హిందూ వ్యక్తి, ఈ బోహ్రా కుటుంబం తమ పక్కన నివసిం చడానికి ఇష్టపడలేదు. దాంతో బోహ్రా కుటుంబంలో చీలికలు, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి వారు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఆస్తి నుంచి వారిని పక్కకు తప్పించే ప్రయత్నం చేయాలని తొగాడియా సల హా ఇచ్చారు. ఇది వీడియోలో కూడా రికార్డయింది. ఈ రెండు ఘటనలు ఒకే సమయంలో జరిగాయి. దాంతో తమ కేంపెయిన్‌ను దారి మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారంటూ మోదీ ఒక సాధారణ ట్వీట్‌తో సరిపెట్టేశారు. మోదీ తర్వాత గిరిరాజ్‌ను మంత్రిని చేసేశారు. గుజరాతీ మాట్లాడలేని వారు తొగాడియా మాటలను తప్పు గా అర్థం చేసుకుని ఉండవచ్చని ఆరెస్సెస్ కూడా బొంకింది. (కాని నేను ఆ పూర్తి పాఠాన్ని లైవ్‌మింట్.కామ్ నుంచి యథాతథంగా అనువ దించాను.) తొగాడియా వీహెచ్‌పీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. దీనికి కారణం ఉంది. ఒకవైపు ముక్తసరిగా అర్థ ఖండనలు చేస్తున్న ప్పటికీ మరోవైపు మోదీ, ఆరెస్సెస్ ఇలాంటి అభ్యంతరకర ప్రకట నలను ఆమోదిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను ప్రోత్స హిస్తున్నారు. ఎందుకంటే భారత్‌లోని ఒక సువిశాల ప్రాంతం ఇలాంటి వ్యక్తులపట్ల అనుకూలంగా స్పందిస్తోంది మరి. (వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత) -
పదునెక్కిన మన దౌత్యనీతి
విశ్లేషణ ప్రధాని నరేంద్రమోదీ తరచుగా సాగిస్తున్న విదేశీ పర్యటనలపై ప్రత్యర్థుల దాడి చేయడం మొదలైంది. బీజేపీ ఒకప్పుడు రాజీవ్‌గాంధీని కూడా ఇలాగే విమర్శించింది. ప్రధాని అంటే ముఖ్యమంత్రో లేక జిల్లా పరిషత్ చైర్మనో కాదు. దేశ రక్షణ, భద్రత, ఆర్థిక సుస్థిరతలను కాపాడటం కేంద్ర ప్రభుత్వ ప్రధాన కర్త వ్యం. ఉత్కృష్ట దౌత్య నీతితోనే వాటికి భరోసా కలుగుతుంది. మే 26న మోదీ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. జూన్ 15న భూటాన్‌కు, జూలైలో బ్రెజి ల్కు, ఆగస్టులో నేపాల్‌కు, సెప్టెంబర్‌లో జపాన్‌కు వెళ్లారు. అదే నెలలో ఆయన అమెరికాలో పర్యటించి, అధ్యక్షుడు బరాక్ ఒబామాను కలుసుకున్నారు. నవంబర్‌లో బర్మా, ఆస్ట్రేలియాలను సందర్శించారు. తిరిగి వస్తూ ఫిజీకి వెళ్లా రు. అక్కడి జనాభాలో సగం భారతీయ సంతతికి చెందినవారే. 30 ఏళ్లుగా ఏ భారత ప్రధానీ ఆస్ట్రేలియా, ఫిజీలకు వెళ్లలేదు. గత ఆరు నెలల్లో మోదీ ప్రపం చంలోని 46 దేశాల నేతలను కలుసుకున్నారు. మన దేశం ఇద్దరు బద్ధ శత్రువుల తో కూడిన అత్యంత స్నేహరహితమైన వాతావరణంలో ప్రాంతంలో ఉంది. మన భూభాగాన్ని కోరుతున్న చైనా, పాకిస్తాన్లతో మనకున్న సమస్యలను పరిష్కరించుకోవడం కష్టం. అవే దౌత్య రంగంలో మనం ఎదుర్కొంటున్న రెం డు ప్రధాన సమస్యలు. అందువల్లే మన బడ్జెట్లో చాలా పెద్ద భాగాన్ని రక్షణ, హోం, విదేశీ వ్యవహారాల శాఖలకే కేటాయించాల్సి వస్తోంది. ఇక నేపాల్, బర్మా, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంకలతో మనకు పెద్దగా సమస్యలేమీ లేవు. 1962 నుండి చైనా-పాక్ మైత్రి దృఢంగా ఉంది. భారత్‌తో మంద్ర స్థాయి యుద్ధాన్ని కొనసాగించేలా పాక్‌ను అది ప్రోత్సహిస్తోంది. పాక్ తన ఆక్రమ ణలోని కశ్మీర్ భూభాగాన్ని చైనాకు అప్పగించినంత పని చేసింది. బదులుగా చైనా దానికి అణు సాంకేతికతను కానుకగా ఇచ్చింది. వాస్తవానికి భారత వ్యతిరేకత కలిగిన దేశాలు నేడు మన దేశాన్ని చట్టుముట్టేసి ఉన్నాయి. ‘‘భారత విదేశాంగ విధానం అత్యంత దుర్బలమైనది. అదే దాని అతి పెద్ద శత్రువు’’ అని ‘ఫారిన్ ఎఫైర్స్’అనే ప్రముఖ పత్రిక 2013లో రాసింది. చలనశీల దౌత్య నీతి మన శత్రువులు సైతం ఆందోళనకు, ఉద్విగ్నతకు గురై సతమతమవుతుండేలా చేసే చలనశీలమైన విదేశాంగ విధానం మనకిప్పుడు అవసరం. భారత దౌత్యాన్ని ఎదుర్కొనే పోరులో చైనా, పాక్‌లు తమ సమయాన్ని, వనరులను వృథా చేసుకోవాలి. 1959లో టిబెట్ మత గురువు దలైలామాకు ఆశ్రయమి చ్చినందుకు చైనా ఎన్నటికీ భారత్‌ను క్షమించలేదు. భారత్‌లో కూడా ఎన్నటికీ సుస్థిరత నెలకొనకుండా చేయాలని అది భావిస్తోంది. మనం మన ఆర్థిక వ్యవస్థపై దృష్టిని కేంద్రీకరించడాన్ని చైనా, పాక్‌లు ఎన్నడూ సహించలేవు. వాటిని ఎదుర్కోవడానికి భారత్‌కు ఉన్న ఏకైక మార్గం దౌత్యం. మోదీ చేస్తున్నది అదే. విదేశీ నేతలను కలుసుకోవడం ద్వారా ఆయన చైనా, పాక్‌లలో ఆందోళనను రేకెత్తిస్తున్నారు. మోదీ ఫిజీ వెళ్లి వచ్చిన నాలుగు రోజులకు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ కూడా అక్కడకు వె ళ్లి వచ్చారు! 1. మోదీ జపాన్ పర్యటన చైనా శత్రువులతో భారత్ చెయ్యి కలుపుతోం దనే సందేశం చైనాకు చేరింది. ఆయన భూటాన్‌కు వెళ్లటంతో... చైనా ఆ దేశానికి దూరంగా ఉండాలనే సందేశం దానికి చేరింది. భారత్-నేపాల్ పాత ఒప్పందాన్ని సమీక్షిస్తామని, అన్ని విషయాల్లోనూ దానికి శాయశక్తులా సహకరిస్తామని నేపాల్ పర్యటనలో మోదీ హామీనిచ్చారు. నేపాల్‌ను భారత్‌కు వ్యతిరేకంగా రెచ్చగొడుతున్న చైనా, పాక్‌లు రెండిటికీ అది కలవరపాటును కలిగించింది. 2. చైనా రెండు దశాబ్దాలుగా మైన్మార్ సహజ వనరులను దోచుకుంటోంది. మోదీ పర్యటనతో చైనా ఇకపై పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది, మైన్మార్ వనరులకు అది అధిక ధరలు చెల్లించాల్సి వస్తుంది. 3. బంగ్లాదేశ్‌తో భౌగోళిక సరిహద్దు ఒప్పందం కుదుర్చుకోడానికి మోదీ ప్రయత్ని స్తున్నారు. భూభూగాల పరస్పర మార్పిడి ద్వారా భారత్ కంటే బంగ్లాదేశ్‌కు 6 వేల ఎకరాల భూమి ఎక్కువగా లభిస్తుంది. అయితే దీనివల్ల బంగ్లాదేశ్ కు భారత్‌పై విశ్వాసం ఏర్పడుతుంది. 4. హార్వార్డ్ ప్రొఫెసర్ జోసెఫ్ న్యే ‘‘సున్నిత శక్తి’’ని ‘‘సంస్కృతి, విలువలు, విదేశాంగ విధానం తదితరాలతో నీకు కావా ల్సిందాన్ని బలవంత పెట్టడం లేదా మూల్యం చెల్లించడం ద్వారా గాక ఆకర్షణ తో సంపాదించుకోగలిగే సామర్థ్యం’’గా నిర్వచించారు. న్యూయార్క్‌లో18,000 మంది, ఆస్ట్రేలియాలో 15,000 మంది మోదీ ప్రసంగానికి వచ్చారంటే అందుకు కారణం ఆయన భారత్‌ను ‘‘సున్నిత శక్తి’’గా ఆవిష్కరించడమే. 5. అక్కడ సరిహద్దుల్లో చైనా సేనలు మన పోస్టులపై దాడులు చేస్తుండగా ఇక్కడ మోదీ చైనా అధ్యక్షునికి, ఆయన సతీమణికి ఆతిథ్యం ఇవ్వడంపై విమర్శలు వచ్చాయి. కానీ జీ సతీమణి కూర్చున్న ఉయ్యాలను మోదీ గౌరవపూర్వకంగా ఊపుతున్న ఫొటో చైనా సోషల్ మీడియాలో అత్యంత ప్రాచుర్యం పొందింది. హావభావాలకు, మర్యాదామన్ననలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే కన్ఫ్యూషి యన్ బోధనలకు 2,500 ఏళ్ల తర్వాత ఇప్పుడు చైనాలో ఆదరణ లభిస్తోంది. 6. మోదీ ప్రభుత్వంతో వ్యవహరించడమంటే తేలికేమీ కాదనే సందేశం పాక్‌కు చేరింది. భారత్ తన మెత్తటి శక్త్తిని, ఆర్థిక శక్తిని ప్రయోగించి పాక్ ప్రతిష్టను క్షీణంపజేయగలదు. మోదీ అదే చేశారు. ఈ ఏడాది భారత రిపబ్లిక్ దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నానని అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రకటించగా.... దారిలో పాక్‌లో ఆగాలని నవాజ్ షరీఫ్ కోరారు. పాక్‌లో పరిస్థితిని మెరుగుపరచినప్పుడు ఆగుతానని ఒబామా చెప్పారు. ఇది పాక్‌కు పెద్ద ఎదురు దెబ్బ. భారత్, పాక్‌లను ఒకే గాటన కట్టలేమనే సందేశం. 7. అమెరికా పర్యటనలో మోదీ... ఆఫ్రికా నేతలు తప్ప మరే విదేశీ నేతలు సందర్శించని మార్టిన్ లూథర్ కింగ్ స్మారక స్థలిని సందర్శించారు. దౌత్య సంప్రదాయాలను విడనాడి ఒబామా ఆయనతో పాటూ వెళ్లారు! పైగా ఒబామా తమ వలస విధానాన్ని మార్చారు. దీంతో అమెరికాలోని లక్షలాదిమంది భారతీయులకు మేలు జరుగుతుంది. 8. మోదీ జపాన్ పర్యటనే చైనాకు ఒక సందేశం. అది జపాన్‌తో భారత్ అనుబంధం పట్ల చైనా తీవ్రంగా ఆందోళన చెందేట్టు చేసింది. జాతీయ ప్రయోజనాలకు పట్టం గట్టాలి ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, వియత్నాం, ఫిలిప్పీన్స్ తదితర ఆసియా దేశా లు చైనా ఆధిపత్యవాదానికి వ్యతిరేకంగా ఒక్కటి కావాలని ప్రయత్నిస్తున్నాయి. అడుగడుగునా భారత్‌కు శత్రువుగా నిలుస్తున్న చైనాను ఎదుర్కోవడానికి మోదీ ఆస్ట్రేలియా, అమెరికా, జపాన్‌లను సందర్శించారు. భారత్‌కు వ్యతిరేకంగా పాక్‌ను ప్రోత్సహించే విధానాన్ని చైనా కొనసాగిస్తే భారత్ చైనా శత్రువులతో చేతులు కలుపుతుందనే సందేశాన్ని తద్వారా ఆయన పంపారు. భారత్ చడీచప్పుడు లేకుండా ‘‘చైనాను కట్టడి చేసే’’ విధానానికి మద్దతు పలుకుతోంది. అఫ్ఘానిస్థాన్‌లో తమ సేనలను 2015 వరకు ఉంచుతామని అమెరికా ప్రకటించడం భారత్ సాధించిన ఒక ప్రధాన విజయం. మోదీ ఒబామాను కలుసుకున్న తర్వాతే ఈ విధాన ప్రకటన వెలువడింది. అమెరికా సేనల ఉనికి అఫ్ఘాన్‌లోని తాలిబన్, పాక్ ఆధారిత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఈ ప్రాంతా న్నంతా బలోపేతం చేస్తుంది. మహాభారతంలో కౌరవులు పాండవులు తమలో తాము ఎప్పుడూ కలహించినా ‘‘మాలో మేము కలహిస్తామేమోగానీ బయటి వారికి మాత్రం మేం 105 మందిమే’’ అని చెప్పేవారు. బీజేపీ వ్యతిరేక పార్టీలు కూడా అలాగే జాతీయ ప్రయోజనాలను సంకుచిత రాజకీయాలకు అతీతంగా నిలపాలి. నెహ్రూ, ఇందిరాగాంధీల తర్వాత, దాదాపు 30 ఏళ్ల అంతరాయం తర్వాత విదేశీ వ్యవహారాలకు ప్రాధాన్యం లభిస్తోంది. అయితే మోదీ విదేశాంగ మంత్రి, తదితరులను చురుగ్గా విదేశాంగ వ్యవహారాల్లో పాల్గొననివ్వాలి. లేక పోతే మోదీయే విదేశాంగ విధానంగా మారిపోయే అవకాశం ఉంది. ఏది ఏమైనా ‘‘ఏనుగు పోతుంటే కుక్కలు మొరిగిన’’ చందంగా వ చ్చే చిల్లర మల్లర విమర్శలను పట్టించుకోక మోదీ విదేశీ సంబంధాలపై దృష్టిని కేంద్రీకరించాలి. (వ్యాసకర్త రాజకీయ విశ్లేషకులు) -
సంఘ సంస్కర్త, జాతి నిర్మాత
విశ్లేషణ రేపు అంబేద్కర్ వర్ధంతి 1950-51 మధ్య కాలంలో డాక్టర్ అంబేద్కర్, నెహ్రూలు హిందూ స్మృతిని పార్లమెంటులో ఆమోదింపచేయటం కోసం ప్రయత్నించారు. కానీ నిలువెత్తు ప్రతిఘటనతో బిల్లును పక్కన పెట్టాల్సివచ్చింది. ఇందుకు నిరసనగానే అంబేద్కర్ మంత్రి మండలికి రాజీనామా చేశారు. డాక్టర్ బీఆర్ అంబే ద్కర్ (ఏప్రిల్ 14, 1891 - డిసెంబర్ 6, 1956) సంస్కర్త, ఉదార ప్రజాతంత్ర వాది. అణగారిన వర్గా లు, ప్రత్యేకించి ఎస్సీ/ ఎస్టీల ప్రయోజనాల కోసం పాటుపడ్డ వ్యక్తిగా ప్రధానంగా చెప్పుకోవడం పరిపాటి. దీనితో మొత్తం జాతి నిర్మాణానికి ఆయన అందించిన సేవలు మరుగున పడ్డాయి. భారత రా జ్యాంగ నిర్మాతగా ఆయన చరిత్రలో స్థిరపడిపోయినా ఈ బహుముఖ ప్రజ్ఞాపా టవాల గురించి చర్చ నడవలేదు. 1927లో హిల్టన్ యంగ్ కమిషన్‌కు అంబేద్కర్ ఇచ్చిన మహాజరు ఆధారంగానే రిజర్వు బ్యాంకు విధి విధానాలు రూపుదిద్దుకున్నా యి. భారతీయ ద్రవ్యం, ఆర్థిక సమస్య లపై ఏర్పడ్డ రాయల్ కమిషన్ అంబేద్కర్ రాసిన ‘రూపాయి సమస్యలు, పుట్టుక, పరిష్కారం’ అన్న గ్రంథంతో తీవ్రంగా ప్రభావితమైంది. 1934లో భారత రిజర్వు బ్యాంకు చట్టంవచ్చింది. 1942-46 మధ్య కాలంలో వైశ్రాయ్ మంత్రిమండలిలో ఆయన కార్మిక, నీటిపారుదల, విద్యుత్ శాఖమంత్రిగా పనిచేశారు. కేంద్ర జలవన రుల సంఘం, దేశంలో విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మౌలిక వనరులు సమకూర్చ టానికి ఉద్దేశించిన కేంద్ర సాంకేతిక విద్యు త్ బోర్డుకు కూడా ఆయనే ఆద్యుడు. అంబేద్కర్ జీవితాన్ని, కృషిని అధ్య యనం చేసిన వారికి కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి. ఆయన దృక్ప థం అందరికీ సమాన హక్కులు కోరు తోంది. రాజ్యాంగ పరిషత్ లో తన చివరి ప్రసంగంలో తన ఆలోచనను మరింత విఫులీకరించారు. ‘‘మనం సాధించిన రాజకీయ ప్రజా స్వామ్యాన్ని, సామాజిక ప్ర జాస్వామ్యంగా మార్చాల్సి న అవసరం ఉంది. పునాది లో సామాజిక ప్రజాస్వా మ్యం లేనిదే రాజకీయ ప్రజాస్వామ్య మనుగడ సాగించజా లదు’’ అన్నారు. ప్రథమ న్యాయశాఖ మంత్రిగా మహిళా హక్కులను చట్టబద్ధం చేయటానికి ఆయన ఎనలేని ప్రాధాన్యత ఇచ్చారు. అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి కాకముందే మహిళా ఉద్ధరణ కోసం పని ప్రారంభించారు. లోథియన్ కమిషన్ (1932) విచారణలోనూ 1933-34లో ఏ ర్పాటైన జాయింట్ సెలెక్ట్ కమిటీ ముం దూ మహిళల హక్కుల కోసం వాదించా రు. దాని ఫలితంగానే 1935 భారత ప్రభుత్వ చట్టంలో తొలిసారి మహిళలకు ఓట హక్కు దక్కింది. రాజ్యాంగ ముసా యిదాలో కూడా 14-16 అధికరణాల ద్వారా మహిళలకు పౌర హక్కులు దఖలు పర్చటంతో పాటు, కన్యాశుల్కా నికి స్వస్తి చెప్పటంలో ఆయనదే ప్రధాన పాత్ర. స్వాతంత్య్రానికి ముందే మంత్రివర్గం లో చేరమని డాక్టర్ అంబేద్కర్‌ను నెహ్రూ ఆహ్వానించారు. ఆ నాటికి హిందూ చట్టం గురించి ఉన్న వేర్వేరు వ్యాఖ్యానాలను క్రోడీకరించి ఒకే చట్టాన్ని దేశం ముందుం చే క్రమంలో డాక్టర్ అంబేద్కర్ హిందూ స్మృతిని ప్రతిపాదించారు. విప్లవాత్మకమైన ఈ చట్టం మహిళలకు సమాన హక్కులు కల్పించటంతో పాటు కుల పరమైన వ్యత్యాసాలకు తా వు లేకుండా చేసింది. బీఎన్ రావు కమిటీ ప్రతిపాదిం చిన ముసాయిదాను కూ లంకషంగా పరిశీలించిన ఆయన అనేక ముఖ్యమైన సవరణలతో హిందూ స్మృ తి బిల్లు ప్రతిపాదించారు. దీనితో మొదటిసారిగా వితంతువులు, కూతుళ్లు, కొడుకులతో పాటు తండ్రి ఆస్తిలో సమాన హక్కుదారు లయ్యారు. గృహహింస లేదా భర్తలు నిర్ల క్ష్యం చేయటం కారణంగా భార్యలకు విడా కులు తీసుకునే హక్కు దక్కింది. భర్త రెం డో భార్యను పెళ్లాడటాన్ని నిషేధించింది. వేర్వేరు కులాలకు చెందిన స్త్రీ పురుషులు హిందూ చట్టం కింద వివాహమాడే అవకా శం వచ్చింది. 1949లో అప్పటికే అఖిల భారత హిందూ స్మృతి వ్యతిరేక కమిటీ ఈ బిల్లుకు వ్యతిరేకంగా పని ప్రారంభించింది. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ఆరెస్సెస్ ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. 1950-51 మధ్య కాలంలో డాక్టర్ అంబే ద్కర్, నెహ్రూలు హిందూ స్మృతిని పార్ల మెంటులో ఆమోదింపచేయటం కోసం ప్రయత్నించారు. కానీ నిలువెత్తు ప్రతిఘ టనతో బిల్లును పక్కన పెట్టాల్సివచ్చింది. ఇందుకు నిరసనగానే అంబేద్కర్ మంత్రి మండలికి రాజీనామా చేశారు. బహుశా భారతదేశ చరిత్రలోనే మహిళలకు హక్కు లు కల్పించాలన్న డిమాండ్‌తో కేంద్రమం త్రి రాజీనామా చేయటం ఇదే తొలి సంఘటన. తొలి సార్వత్రిక ఎన్నికలలో ఘన విజ యం సాధించిన నెహ్రూ హిందూ స్మృతి ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశ పెట్టారు. అయితే ఒకే చట్టంగా కాక హిం దూ వివాహ చట్టం, విడాకుల చట్టం, వార సత్వ చట్టం, దత్తత చట్టం పేర్లతో వివిధ భాగాలుగా ప్రవేశపెట్టారు. వీటిని మహి ళా సభ్యులతో పాటు విఎన్ గాడ్గిల్, పం డిట్ ఖుజ్రు వంటి సభ్యులు సమర్థించారు. తరువాత సంస్కరణవాదులు, మితవా దులు అనివార్యంగా బలపర్చాల్సిన పరి స్థితి వచ్చింది. ఈ బిల్లులు 1955-56లో చట్టాల రూ పం దాల్చాయి. అనంతరం కొంత కాలా నికి డాక్టర్ అంబేద్కర్ స్వర్గస్థులయ్యారు. ఆయనకు సంతాపం ప్రకటిస్తూ నెహ్రూ, ‘‘హిందూ సమాజంలోనే అన్ని రకాల అణ చివేతతో కూడిన లక్షణాలపై తిరుగుబాటు ప్రకటించిన వ్యక్తిగా అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోతారు. అంతేకాదు. హిందూ స్మృ తికి సంబంధించి ఆయన ప్రదర్శించిన ఆసక్తి, ఎదుర్కొన్న ఇబ్బందుల దృష్ట్యా కూడా ఆయన చరిత్రలో నిలిచిపోతారు. ఆయన జీవించి ఉండగానే ఆయన ప్రతి పాదించిన సంస్కరణల్లో అనేకం ఆయన ప్రతిపాదించిన రూపంలో కాకపోయినా వివిధ భాగాలుగా చట్ట రూపం తీసుకో వటం సంతోషకరం’’ అని ప్రకటించారు. నెహ్రూ 125వ జయంతి సందర్భంగా భారతీయ సమాజ నిర్మాణంలో నెహ్రూ, బాబా సాహెబ్ అంబేద్కర్ల సంయుక్త కృషిని స్మరించుకోవటం ఇరువురికీ సమ ర్పించగలిగిన నివాళి. (వ్యాసకర్త ఏఐసీసీ ఎస్.సి.విభాగం అధ్యక్షులు) -
సాగు పండుగ కావాలంటే...
విశ్లేషణ వ్యవసాయాన్ని దేశ సమగ్రాభివృద్ధిలో విడదీయరాని భాగంగా చూడకపోవడం, వ్యవసాయాధారిత రంగాలన్నిటినీ బలోపేతం చేయనిదే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడం సాధ్యం కాదని విస్మరించడమే నేటి రైతన్న దుస్థితికి ప్రధాన కారణం. పాలకులు ఇప్పటికైనా పర్యావరణం దెబ్బతినకుండా, సాంకేతికంగా సరితూగే, ఆర్థికంగా లాభసాటియైన, రైతులకు ప్రయోజనం చేకూర్చే వ్యవసాయాభివృద్ధిపై దృష్టి సారించాలి. అప్పుడే వ్యవసాయం సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి దోహదపడుతుంది. వ్యవసాయం దండుగ అన్న పాలకుల కుటిల నీతికి చరమగీతం పాడగలుగుతాం. గింజ గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందని సామెత. ఆరుగాలం కష్టించి పండించిన రైతన్నకు పంట మీద ఆవగింజంత హక్కైనా లేకుండా పోతోంది. తనద నుకున్న భూమి మీద, ప్రకృతి ప్రసాదించిన నీటి మీదే కాదు, పండించిన పంట మీద కూడా రైతుకు హక్కు లేకుండా చేసిందెవరు? దేశానికి వెన్నెముకైన రైతన్న వెన్ను విరిచిందెవరు? అని గతంలో చాలాసార్లే చర్చ జరిగింది. ఇలాంటి సవాళ్లన్నిటికీ ఇప్పుడిక ఏలికలు రైతన్నకు జవాబు చెప్పక తప్పదు. దేశ సమగ్రాభివృద్ధిలో విడదీయరాని భాగంగా వ్యవసాయాన్ని చూడకపోవడం. వ్యవసాయా ధారిత రంగాలన్నిటినీ బలోపేతం చేయనిదే వ్యవసాయ రంగాన్ని నిలబెట్టడం సాధ్యం కాదనే విషయాన్ని విస్మరిం చడమే నేటి రైతన్న దుస్థితికి, వ్యవసాయరంగ అధోగతికి ప్రధాన కారణం. పాలకుల స్వీయప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టేయడం నిరాటంకం గా సాగిపోతోంది. కార్పొరేట్ కమీషన్ల కక్కుర్తికి మన విత్త నాలపై పెత్తనం ఎవడికో ధారాదత్తం చేస్తున్న పాలకులకు రైతు సంక్షేమం, ప్రజాప్రయోజనాల పట్ల ఉన్న చిత్తశుద్ధి ఎంతో తెలుస్తూనే ఉంది! ప్రభుత్వ విధానాలు వ్యవసాయ రంగానికి, రైతాంగానికి బాసటగా నిలవకపోగా, వారిని నిరాశానిస్పృహలకు గురిచేసి, వ్యవసాయాన్ని వీడిపో యేలా చేయడానికే తోడ్పడుతున్నాయి. ఫలితంగా వ్యవ సాయం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. నేడు వ్యవసా యరంగాన్ని పట్టి పీడిస్తున్న ప్రధాన సమస్యలు ఇవీ: భూమి సమస్య నీటిపారుదల యాంత్రీకరణ మార్కెటింగ్ నిల్వ సదుపాయాలు పెట్టుబడి రవాణా విత్తనాలు ఎరువులు భూసార పరిరక్షణ పరిశోధన, విస్తరణ పర్యావరణ పరిరక్షణ ఉమ్మడి భూములు మటుమాయం గతంలో ప్రతి గ్రామానికీ నిర్దిష్టమైన భూ వినియోగ ప్రణా ళిక ఉండేది. గ్రామ నిర్మాణం దగ్గర నుంచి, చెరువుల నిర్మా ణం వరకు ఒక క్రమపద్ధతి ఉండేది. తాగునీటి చెరువు, సాగునీటి చెరువులు వేర్వేరుగా ఉండేవి. పశువుల మేతకు సరిపడా భూమిని ప్రత్యేకంగా కేటాయించే వారు. ఆ భూములను ‘మందోట’ అని పిలిచేవారు. ఊరు చుట్టూ పండ్ల చెట్లు పెంచే వారు. ఇవి ఏవీ ఎవరి సొంత భూము లు కావు, ఊరి ఉమ్మడి ఆస్తులుగా అందరి అవసరాలను తీర్చేవి. ఇదంతా పాతకాలపు మాట. ఆధు నికమైన నేటి కాలంలో అడుగు నేలను కూడా ఊరి ఉమ్మడి అవసరాలకు వదలడం లేదు. ఒకప్పటి ఊరుమ్మడి భూములు సామా జిక, ఆర్థిక ఆధిపత్యం కలవారి సొంత ఆస్తులుగా మారిపో యాయి. దీంతో వ్యవసాయం, గ్రామీ ణ పర్యావరణ సమ తుల్యం పూర్తిగా దెబ్బతినిపోయింది. ఏ హక్కులూ లేని కౌలుదారులు ఇదిలా ఉండగా జనాభా పెరుగుతున్న కొద్దీ భూమి క్రమంగా చిన్న చిన్న కమతాలుగా విడిపోతుండటం మరొక సమస్య. ఒక వ్యక్తికి రెండెకరాల భూమి ఉంటే, దాన్ని నలుగురు సంతానికి పంచితే అది నాలుగు అర ఎకరం కమతాలుగా మారిపోతాయి. అలా ఏర్పడే అతి చిన్న కమతాలలో సాగు లాభసాటి కానిదిగా తయారైంది. పైగా ఒక రైతుకు రెండు మూడుచోట్ల చిన్న కమతాలుం డటం మరో సమస్య. ఇక కీలకమైన మూడో అంశం భూమిపై హక్కు. గ్రామాల్లో భూములున్నా ఉద్యోగాలు, వ్యాపారాల రీత్యా పట్టణాల్లో స్థిరపడ్డవారి సంఖ్య గణ నీయంగా ఉంది. ఆ భూములను సాగుచేస్తున్న కౌల్దారు లకు దాదాపు ఏ హక్కులూ లేవు. అత్యధిక శాతం కౌలు దార్లు కౌలుదారులుగానే నమోదు కారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సాయమూ వారికి అందదు. ఇందువల్లనే కౌలు రైతుల్లో ఆత్మహత్యలు ఎక్కువగా ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. సమగ్ర భూవినియోగ విధానం కావాలి భూవినియోగానికి సంబంధించి పైన పేర్కొన్న మూడు సమస్యలకు పరిష్కారాలు కావాలి. గత అనుభవాలను, పద్ధతులను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న మొత్తం భూమిని ఎలా వినియోగించాలనేదానికి ఒక సమ గ్ర విధానం ఉండాలి. కానీ ఇటీవల మన ప్రభుత్వాలు పరి శ్రమలు, వ్యాపారాల పేరుతో లక్షలాది ఎకరాల సాగు యోగ్యమైన భూములను ఆక్రమిస్తున్నాయి. వ్యవసా యానికి, పరిశ్రమలకు, గృహనిర్మాణాలకు, భారీ ప్రాజెక్టు లకు ఎలాంటి భూములను, ఎక్కడెక్కడ ఎలా కేటాయిం చాలో వాటి ప్రాధాన్యాలను బట్టి నిర్ణయించే ఒక శాస్త్రీయ దృక్పథం ఉండాలి. అదే విధంగా చిన్న కమతాల సమ స్యలను పరిష్కరించడానికి రెండు మార్గాలున్నాయి. అందులో కమతాల ఏకీకరణ మొదటి అంశం. ఒక రైతుకు రెండు, మూడు చోట్ల ఉన్న భూమిని ఒక చోట చేర్చడానికి నిజాం పాలనలో అమలుచేసిన ‘రద్దు బదిలీ’ విధానం సత్ఫలితాలను ఇచ్చినట్టు చరిత్ర చెబుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఇటువంటి విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తున్నది. అది సత్వరం అమలు జరిగేలా చూడాల్సిన అవసరం ఉంది. ఇక చిన్న కమతాలు లాభదాయకం కావాలంటే సహకార వ్యవసాయ విధానం అత్యుత్తమమైనదని శాస్త్ర వేత్తల అభిప్రాయం. ప్రభుత్వాలు చొరవ చూపి రైతులను భాగ స్వాములను చేయగలిగితే సహకార వ్యవసాయం అద్భుత ఫలితాలను ఇస్తుంది. గిట్టుబాటు ధరలకు, పరపతికి హామీ ఇవ్వాలి గిట్టుబాటు ధరలు లభించకపోవడం రైతులను కుంగ దీస్తున్న మరొక సమస్య. బ్రిటిష్ పాలనలో ప్రవేశించిన వ్యాపార పంటలు క్రమంగా వ్యవసాయాన్ని వ్యాపా రంగా, పెట్టుబడి మీద ఆధారపడినదిగా మార్చింది. దీనితో రైతులు వడ్డీ వ్యాపారుల మీద, షావుకారుల మీద ఆధారపడటం పెరిగింది. దానికి తోడు పండిన పంటలను నిలువ ఉంచుకొనే వసతులు లేకపోవడం వల్ల వెంట వెం టనే తక్కువ ధరలకు తెగనమ్ముకొనే పరిస్థితి ఏర్పడు తోంది. షావుకారులు, వడ్డీ వ్యాపారులు అప్పు కింద రైతు పంటను పొలం దగ్గరే లాగేసుకునే దుస్థితి దాపురించింది. రైతులు షావుకార్లకు, వ్యాపారులకు, దళారులకు అమ్మే ధరకు, చివరకు వినియోగదారుడు కొనుగోలు చేసే ధరకు మధ్య అంతులేని వ్యత్యాసం పెరిగింది. దీంతో అటు రైతు, ఇటు వినియోగదారుడు తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు పెట్టుబడి కంటే కనీసం యాభై శాతం అధికంగా ఆదాయం వచ్చే విధంగా గిట్టుబాటు ధరల నిర్ణయం జర గాలని వ్యవసాయ కమిషన్లు ఘోషించాయి. కానీ అమ లుకు నోచుకోలేదు. జాతీయ బ్యాంకులు రైతుల పెట్టుబడి అవసరాలను కొంత వరకు తీర్చ గలుగుతున్నా, ఎక్కువగా ఆత్మహత్య లకు పాల్పడుతున్న కౌలు రైతులను మాత్రం అవి పట్టిం చుకోవడం లేదు. మొత్తంగా వ్యవసాయ రంగాన్ని వడ్డీ వ్యాపారులు, దళారుల పట్టు నుండి పూర్తిగా విముక్తం చేయాలంటే సంస్థాగతంగా, చౌకగా పరపతి సౌకర్యాలను సంతృప్త స్థాయిలో కల్పించక తప్పదు. రైతుల అవస రాలకు సరిపడా గిడ్డంగుల సదుపాయాలను కల్పించడం ద్వారానే రైతు గిట్టుబాటు ధర వచ్చినప్పుడే పంటను అమ్ముకోవడం సాధ్యమవుతుంది. రైతులు పండించే ఉత్ప త్తులను నేరుగా వినియోగదారుడికి చేరే విధంగా మార్కె టింగ్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరిస్తేనే అటు రైతుకు, ఇటు వినియోగదారునికి ప్రయోజనం. గ్రామీణ వికాసంతోనే దేశాభివృద్ధి పంటలు వేసే విషయంలో రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడానికి శిక్షితులైన సిబ్బంది లేకపోవడం వల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. వ్యవసాయ పరిశోధనరంగం నేడు ప్రధానంగా ప్రైవేట్ సంస్థల చేతుల్లో ఉంది. ఫలితంగా రైతులకు ప్రయోజనాల కోసంగాక లాభాల కోసం పరిశో ధనలు సాగుతున్నాయి. ముఖ్యంగా విత్తనాల ఉత్పత్తి పూర్తిగా కార్పొరేట్ రంగం చేతుల్లోకి పోవడం రైతుల సం ప్రదాయక విత్తన నిల్వలను దెబ్బతీసింది. గతంలో రైతు లు, తమ విత్తనాలను తామే భద్రపరుచుకొనే వ్యవస్థ ఉం డేది. కార్పొరేట్ కంపెనీల విత్తనాల వల్ల రైతులు కోట్లాది రూపాయల పంటలను నష్టపోతుండటం పరి పాటిగా మారింది. నీటిపారుదల రంగం వ్యవసాయానికి జీవధార లాంటిది. పరిస్థితులు ప్రదేశాలను బట్టి తగు సాగునీటి విధానాలు లేకపోవడంవల్ల ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయి. వీటిని పరిష్కరించడానికి ప్రభు త్వాలు ఒక శాస్త్రీయ విధానాన్ని రూపొందించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే పర్యావరణం దెబ్బతిన కుండా, సాంకేతికంగా సరితూగే, ఆర్థికంగా లాభసాటి యైన, రైతులకు ప్రయోజనం చేకూర్చే నిలకడ కలిగిన వ్యవసాయాభివృద్ధిపై ప్రభుత్వాలు దృష్టి సారించాలి. అప్పుడే వ్యవసాయం సంపూర్ణ గ్రామీణాభివృద్ధికి, ఆర్థిక పురోగతికి దోహదపడగలుగుతుంది. వ్యవసాయం దం డుగ అన్న పాలకుల కుటిల నీతికి చరమగీతం పాడ గలుగుతాం. (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు - మొబైల్ నం: 9705566213) -
నేత నాలుకకు మడతలెన్నో!
విశ్లేషణ ‘వ్యవసాయం దండుగమారిద’ని ప్రబోధించిన చంద్రబాబు అందుకు అనుగుణంగానే ఇప్పుడు రెండు, మూడు పంటలిచ్చే భూములనే బదనాం చేయడానికి కంకణం కట్టుకున్నారు. కొత్త రాజధాని, 13 ‘నాజూకు నగరాల’ (స్మార్ట్‌సిటీల) నిర్మాణం ఆయన తలపెట్టిన రైతాంగ వ్యతిరేక ‘యజ్ఞం’లో భాగంగా జరుగుతున్నవే. బతుకుతెరువు మీద భరోసా పోయి లక్షలాది ప్రజలు, వ్యవసాయ కార్మికులు బెంగపడుతున్న సమయంలో నాయకులు బుల్లెట్ రైళ్ల కోసం, ఖరీదైన కార్ల తయారీ పరిశ్రమల కోసం జపాన్‌కు పరుగులు పెడుతున్నారు! ‘తుళ్లూరు ప్రాంతాన్ని ఏపీ రాజధానిగా నిర్ణయించిన తరువాత ఆ విషయం గురించి కొందరు అపరిపక్వంగా మాట్లాడుతున్నారు. తుళ్లూరును కాదంటే, భూసేకరణ మీద గొడవ చేస్తే దొనకొండకో, నూజివీడుకో రాజధాని తరలి పోతుంది.’ (28-11-2014న విజయవాడలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లిన రైతు సంఘాల ప్రతినిధులతో వెంకయ్యనాయుడు) ‘వాస్తు ప్రకారమే తుళ్లూరును రాజధానిగా నిర్ణయించాం. ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఈ నిర్ణయం మారే అవకాశం లేదు’ (18-11-2014న హైదరాబాద్‌లో జరిగిన రైతుల సమావేశంలో చంద్రబాబు నాయుడు) ముహూర్తాలూ, వాస్తు గురించి తెలుగులో రెండు సామెతలున్నాయి- ‘ముహూర్తం మంచిదయితే ముండమోపి ఎలా అయ్యాడురా!’, ‘వాస్తు గల వారి కోడలు ఒక వరహా ఇచ్చి క్షవరం చేయించుకుంది’ అనీ. తెలుగుజాతిని చీల్చడానికి గత ప్రభుత్వం చేసిన కుట్రకు అనుకూలంగా లేఖ రాసిచ్చిన చంద్రబాబు ఇప్పుడు సమస్యలను ఎదుర్కొంటున్నారు. దానితోపాటు తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి కూడా ఆయన అనుభవానికి వచ్చి ఉండాలి. ఒక తప్పిదాన్ని సరిదిద్దుకొనే క్రమంలో వరుసగా ఎన్ని తప్పిదాలకు పాల్పడాలో రోజుకొక తీరున ఆయన అనుభవానికి వస్తోంది. విభజన తరు వాత చేతికి వచ్చిన ఆంధ్రప్రదేశ్‌కు రాజధానిని నికరం చేసే పనిలో ఎన్ని అడ్డ దారులు తొక్కవలసి వస్తోందో! కానీ ఈ సమస్యలకు పరిష్కారాలను ఆయన సింగపూర్‌లోనూ, జపాన్‌లోనూ వెతుకుతున్నారు. హామీలు ఏమైపోయినట్టు? విభజన సమయంలో కొత్త రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి ప్రకటించాలనీ, కొత్త రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్లు కావాలని కోరినట్టు, అందుకు కేంద్ర నాయకత్వం హామీ ఇచ్చినట్టు వారి మాటగా చంద్రబాబు ప్రజలకు చెప్పిన సం గతి మనందరికీ తెలుసు. దీనికి తగ్గట్టుగానే ‘ముందు మీరు విభజించండి! మిగతా సంగతి రేపు అధికారంలోకి వచ్చే మా ప్రభుత్వం చూసుకుంటుంద’ న్నట్టు చిత్రవిచిత్రమైన హావభావ ప్రదర్శనల ద్వారా రాజ్యసభలో నాడు బీజేపీ సీనియర్ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ, నాటి న్యాయశాఖ మంత్రి కపిల్ సిబల్ సౌజ్ఞలు ఇచ్చుకోవడం టీవీ చానళ్లలో ప్రజలు గమనించక పోలేదు. ఇప్పుడు ఏం తేలింది? కొత్త రాష్ట్రం ఎదుగుదల, రాజధాని నిర్మా ణానికి కావలసిన నిధుల విషయంలో ఇరు పక్షాల నేతల నాలుకలు మడతపడు తున్నాయి. ‘ప్రత్యేక ప్రతిపత్తి’ కాస్తా, ప్రత్యేక ప్యాకేజీగా దిగజారింది. రూ. 5 లక్షల కోట్ల మాట మళ్లీ వినపడితే ఒట్టు. ఇలా మాట నిలకడ లేకుండా దారి తప్పిన ఇరువురు నాయుడు బావలు ఇప్పుడు ఎవరికి తోచిన పద్ధతిలో వారు రాజధాని నిర్ణయంలో, స్థల సేకరణ/సమీకరణ విషయంలో రైతులను అదిలిం పులకు, బెదిరింపులకు గురిచేస్తున్నట్టు పత్రికల్లోనూ, టీవీ చానళ్లలోనూ వార్తలు వస్తున్నాయి. తమ తప్పిదాలకు సమర్థనగా చివరికి అవసరమైన పరిస్థితులలో బలవంతంగా అయినా సరే భూ సమీకరణకు రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థకు సర్వాధికారాలు దఖలు పరచడం కూడా జరిగింది. కమిటీ సిఫారసులు ఎందుకు చేదు? అసలు నూతన రాజధాని నిర్మాణం గురించి సిఫారసు చేయడానికే ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ చేసిన మంచి సూచనలను పక్కకు నెట్టేసి ఒంటెత్తు పోక డతో రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలు చేయటం అనేక అనర్థాలకు దారితీసింది. చేసేది లేక కేబినెట్ ఉపసంఘమనీ, రాజధాని నిర్మాణానికి భూసమీకరణ కోసమని ‘ప్రాధికార సంస్థ’ను ఏర్పాటు చేసినా సమస్య ఎటూ తేలక సింగపూర్, జపాన్ యాత్రలు తలపెట్టవలసివచ్చింది. తీరా బాబు బృందం సింగపూర్ యాత్ర బెడిసికొట్టినట్టుంది. రాజధాని నిర్మాణానికి కాదు, అసలు దాని రూపకల్పనకే, ఒక ‘మాస్టర్ ప్లాన్’ తయారు చేయడానికే రూ.1,200 కోట్లు ఇచ్చుకోండని సింగ పూర్ ప్రభుత్వం కోరడంతో ముఖ్యమంత్రి బాబుకి పాలుపోని పరిస్థితి! కేవలం రాజధాని నిర్మాణ పథకం నివేదికను తయారు చేయడానికే రూ.1,200 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చేసరికి అధికారులు కూడా గుడ్లు తేలవేసే పరిస్థితి వచ్చిం ది! రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రత్యేక ప్రతిపాదన (స్పెషల్ పర్పస్ వెహి కిల్) కూడా సింగపూర్ ప్రభుత్వానికి నచ్చనట్లు రాష్ట్ర అధికారులు కూడా భావి స్తున్నారని వార్తలొచ్చాయి. అంతేకాదు, రైతులు తమ భూములను ఇవ్వడానికి అంగీకరించిన సందర్భాల్లో కూడా ఆ రైతులకు అదే ప్రాంతంలో ముదరాగా కొంత భూమిని కేటాయించడానికి వీలులేదని సింగపూర్ ప్రభుత్వం సూచించిం ది. వచ్చే జనవరిలోనే హైదరాబాద్ రావాలని ఒక సందర్భంలో సింగపూర్ అధి కారులు, అక్కడి ప్రభుత్వం నిర్ణయించిన్పటికీ, ఇప్పుడు ఎందుకు తటపటాయి స్తున్నారు? లాభం లేనిదే వ్యాపారి వరదన పోవడానికి సాహించాడు. అదే పరి స్థితి సింగపూర్ ప్రభుత్వానిది కూడా. అసలు సింగపూర్ ప్రభుత్వమే 7,000 కంపెనీలు, బహుళజాతి గుత్త సంస్థల ప్రతినిధి! అందువల్ల సింగపూర్ ప్రభు త్వం ప్రతి ఒక్క అంశాన్నీ వ్యాపార దృష్టితోనే, లాభలబ్ధి కోణం నుంచే అం చనా కట్టుకుంటుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు స్పష్టం చేస్తున్నారు. (ఎన్ఎన్. ఆచార్యులు: దక్కన్ క్రానికల్; నవంబర్ 25). ఈ బాగోతమంతా మొత్తం రాజధాని నిర్మాణ ఖర్చు కోసం పెట్టే పెట్టుబడిలో సింగపూర్‌కు 43 శాతం వాటా, మిగతాది రాష్ట్ర ప్రభుత్వం వాటా (57 శాతం) అని రాష్ట్ర ప్రభు త్వం హామీ పడిన తర్వాత కూడా నడిచిందని మరచిపోరాదు. నాజూకు వలసగా మారుస్తారా? సింగపూర్ యాత్ర కథ అలా ముగియగా, గత వారంలో ప్రారంభమై, ముగిసిన బాబు జపాన్ యాత్రది మరొక తంతు! ఒకనాడు ‘వ్యవసాయం దండుగమారి ద’ని ప్రబోధించిన బాబు అందుకు అనుగుణంగానే ఇప్పుడు రెండు మూడు పంటలిచ్చే భూములనే బదనాం చేయడానికి కంకణం కట్టుకోవడం దురదృ ష్టకరం. కొత్త రాజధాని, 13 ‘నాజూకు నగరాల’ (స్మార్ట్ సిటీల) నిర్మాణం ఆయ న తలపెట్టిన రైతాంగ వ్యతిరేక ‘యజ్ఞం’లో భాగంగా జరుగుతున్నవే. బతుకు తెరువు మీద భరోసా పోయి లక్షలాది ప్రజలు, వ్యవసాయ కార్మికులు బెంగప డుతున్న సమయంలో నాయకులు బుల్లెట్ రైళ్ల కోసం, ఖరీదైన కార్ల తయారీ పరిశ్రమల కోసం జపాన్‌కు పరుగులు పెడుతున్నారు! రేపో మాపో పదవి నుంచి దిగిపోయే ప్రస్తుత జపాన్ ప్రధాన మంత్రి షింజో అబేతో సమావేశమై ఆయన కనుసన్నల్లో జాపనీస్ గుత్త వ్యాపార సంస్తల ద్వారా రాష్ట్రంలో పరిశ్రమ నిర్మాణానికి ఒప్పందాలు కుదుర్చుకున్నా ఆచరణలో అమలు జరగడానికి అనేక షరతులను బాబు నెరవేర్చవలసి ఉంటుంది. అక్కడి ‘సుమితోమో’ లాంటి కంపెనీలతో కుదుర్చుకున్న ‘వ్యవసాయ యాంత్రీకరణ ఒప్పందం’ వ్యవసాయ కూలీలు లక్షల సంఖ్యలో ఉపాధి కోల్పోయి పట్టణాలకు, నగరాలకు వలసలు పోయే ప్రమాదముంది. బహుశా ‘నాజూకు (స్మార్ట్) నగరాలు’ మాదిరిగానే వీటిని కూడా ‘నాజూకు వలసలు’గా పాలకులు నామకరణం చేస్తారేమో! జపాన్ ఆంధ్రను ఉద్ధరిస్తుందా? కానీ జపాన్ ఆర్థిక వ్యవస్థ లోగడ మాదిరిగా అమెరికా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్న రెండవ స్థానంలో నేడు లేదు. అది కునారిల్లి పోతుండగా, అమెరికాకు పోటీ ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతూ జపాన్ స్థానా న్ని చైనా ప్రజారిపబ్లిక్ ఆక్రమించేసింది. అందుకే తన వస్తూత్పత్తి కోసం (మాన్యుఫాక్చరింగ్) చౌకగా శ్రామికశక్తి లభించే ఇండియా లాంటి దేశాలకు పరిశ్రమలను తరలించి లాభాలను తాము జమ కట్టుకోవాలని జపాన్ ప్రభు త్వం ఆలోచిస్తోంది. ఎందుకంటే, ఇప్పటికే ‘సుమితోమో’ లాంటి సంస్థలు సహా ఫుడ్‌ప్రాసెసింగ్, వ్యవసాయ యాంత్రీకరణపై కేంద్రీకరించిన కార్పొరేట్ సంస్థలు, సూపర్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ కార్పొరేషన్లు, నెడో, జె.బి.ఐ.సి. లాం టి నిధులు సమకూర్చే వెయ్యి కంపెనీలను పనికిమాలినవిగా ‘స్టాండర్డ్ అండ్ పూర్’, మూడీ లాంటి మదింపు సంస్థలు ప్రకటించాయి. ఇలా ప్రకటించబడ్డ సంస్థలన్నీ తమ సంపాదనలను, ఆస్తిపాస్తుల వివరాలను గోరంతలు కొండం తలుగా చూపి బ్యాంకులను మోసగించాయని బ్లాక్ లిస్ట్‌లో పెట్టారు! ఈ నేప థ్యంతో ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల పేరిట ప్రవేశించే జపాన్‌తో ఎలాంటి సమ స్యను ఎదుర్కోవాలో ఎవరు చెప్పగలరు? రియల్ ఎస్టేట్ రంగం జపాన్‌లో ఎం దుకు ఎలా కూలుతూవచ్చిందో రుచిర్ శర్మ అనే ఆర్థికవేత్త రాశాడు! ఎరిగి ఎరిగి చేసుకున్న పాపం ఏడ్చి ఏడ్చి పోగొట్టుకుంటేగాని తొలగిపోదట! -
క్యాట్-2014 విశ్లేషణ
ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)లలో పీజీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) తొలి దశ నవంబర్ 16న ముగిసింది. దేశ వ్యాప్తంగా దాదాపు వంద కేంద్రాల్లో విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. నవంబర్ 22న రెండో దశ పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో కొత్త మార్పులతో నూతన విధానంలో తొలివిడత జరిగిన క్యాట్- 2014పై విశ్లేషణ... గతంకంటే ఎక్కువ ప్రశ్నలు, పరీక్ష కాల వ్యవధితో క్యాట్-2014 అభ్యర్థుల ముందుకొచ్చింది. గత కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న క్యాట్‌తో పోల్చితే ఈ ఏడాది మార్పులు అభ్యర్థులకు అనుకూలంగా ఉన్నాయని చెప్పొచ్చు. గతేడాది 20 రోజుల్లో 40 స్లాట్స్‌లో పరీక్ష నిర్వహించగా.. ఈ సంవత్సరం రోజుకు రెండు సెషన్ల చొప్పున రెండు రోజులు మాత్రమే పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. స్వరూపంలో మార్పులివే! ముందుగా ప్రకటించినట్లుగానే క్యాట్ -2014 పేపర్‌ను రెండు విభాగాల్లో ఇచ్చారు. 1) క్వాంటిటేటివ్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్‌ప్రిటేషన్; 2) వెర్బల్ ఎబిలిటీ అండ్ లాజికల్ రీజనింగ్. ప్రతి విభాగంలో 50 ప్రశ్నలున్నాయి. పరీక్ష వ్యవధి 170 నిమిషాలు. గతేడాది ఒక్కో విభాగంలో 30 ప్రశ్నలు ఇచ్చి, 140 నిమిషాల్లో పరీక్షను పూర్తి చేయమన్నారు. ఈసారి ప్రశ్నల సంఖ్యలో, పరీక్ష వ్యవధిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అలాగే పరీక్ష ప్రారంభంలో ఉండే 15 నిమిషాల ట్యుటోరియల్ను కూడా ఈ ఏడాది తొలగించారు. దానికి బదులుగా తగిన సూచనలతో, ఎఫ్ఏక్యూస్తో కూడిన సమగ్రమైన డెమో పరీక్షను ముందుగానే విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. దాంతో పరీక్ష విధానంపై ముందస్తు అవగాహనకు వీలుపడింది. ప్రశ్నల క్లిష్టతలో వ్యత్యాసాలు దేశ వ్యాప్తంగా తొలి స్లాట్‌లో పరీక్ష రాసిన విద్యార్థుల అభిప్రాయం ప్రకారం కంటెంట్‌లో నాణ్యత, క్లిష్టత స్థాయిలో గత క్యాట్లకు ప్రస్తుత పరీక్షకు స్థూలంగా పెద్ద తేడా లేదు. అయితే విభాగాల వారీగా క్లిష్టతలో వ్యత్యాసాలు చోటుచేసుకున్నాయి. సెక్షన్-1లోని క్వాంటిటేటివ్ ఎబిలిటీ విభాగంలో గత పరీక్షలతో పోల్చితే కఠినమైన కాన్సెప్ట్స్, క్లిష్టమైన ప్రశ్నల స్థానంలో కొంచెం సరళమైన ప్రశ్నలు అడిగారు. డేటా ఇంటర్‌ప్రిటేషన్ విభాగంలో మాత్రం గతం కంటే కష్టమైన ప్రశ్నలు వచ్చాయి. సెక్షన్-2లోని వెర్బల్ ఎబిలిటీ విభాగంలో గత పరీక్షల మాదిరి ప్రశ్నల కాఠిన్యత స్థాయి ఉందని చెప్పొచ్చు. అయితే లాజికల్ రీజనింగ్ మాత్రం మరింత కష్టంగా ఉంది. కోర్ కాన్సెప్టులను పక్కాగా ప్రిపేరైన అభ్యర్థులు సులువుగానే క్యాట్ పరీక్షను ఎదుర్కొన్నారు. మాక్ పరీక్షలు రాసిన విద్యార్థులు సైతం సమర్థంగా రాణించేందుకు అవకాశం లభించింది. సదుపాయాల కొరత- మానసిక ఒత్తిడి: పరీక్ష కేంద్రాల్లోకి విద్యార్థులను అనుమతించేందుకు క్యాట్ వెబ్సైట్లో పేర్కొన్న విధంగా వివిధ స్థాయిల్లో తనిఖీలు నిర్వహించినప్పటికీ కొన్ని కేంద్రాల్లో ఎలాంటి తనిఖీలు లేవని విద్యార్థులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే మరికొన్ని కేంద్రాల్లో సరైన మౌలిక వసతులు లేవని తెలిపారు. ఏసీ, కంప్యూటర్ సిస్టమ్స్ విషయంలో పరీక్ష కేంద్రాల సమన్వయకర్తలు సరిగా దృష్టి కేంద్రీకరించలేదని వారు అభిప్రాయపడ్డారు. ఇలాంటి సదుపాయాల కొరత విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తుందని విద్యా నిపుణులు పేర్కొంటున్నారు. ఒత్తిడిని దరిచేరనీయొద్దు.. నవంబర్ 22న జరిగే క్యాట్-2014కు హాజరయ్యే అభ్యర్థులు తమ ప్రిపరేషన్ విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. తొలి దశ, మలి దశ పరీక్షల్లో ప్రశ్నల కాఠిన్యత ఒకే విధంగా ఉండకపోవచ్చు. పరీక్ష విధానం, పర్సైంటైల్ తదితర అంశాలపై ఊహాగానాలను నమ్మి అనవసరంగా ఒత్తిడికి గురికాకూడదు. పటిష్ట ప్రిపరేషన్‌ను నమ్ముకుంటే పరీక్షను సమర్థంగా ఎదుర్కోవచ్చు. - రామ్‌నాథ్ కనకదండి, కోర్సు డెరైక్టర్, క్యాట్, టైమ్. -
ఈ విప్లవాత్మక మార్పులెవరికని అడిగితే!
విశ్లేషణ మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకే వెలుగునిచ్చాయి. సామాజిక జీవనం మారకుండా పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబా లాంటి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. విద్యారంగంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పు లు వచ్చాయి. కానీ ఆ మార్పులన్నీ ఏ వర్గాలకు ఉపయోగపడ్డాయన్నది కీ లకమైనది. విద్యలో మా ర్పులు, సాంకేతిక సమాచార రంగంలోని విప్లవా లు నేటికీ కొన్ని వర్గాలకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. మన విద్యారంగం సగం చీకటి, సగం వెలుగుగా మారింది. విద్యారంగంలో వచ్చిన గొప్ప మార్పులన్నీ ఉన్నత వర్గాలకు మరింత వెలుగునిచ్చాయి. అదే దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, ఆదివాసీ వర్గాలలో రావాల్సినంత మార్పు జరగలేదు. 20 శాతం మంది పేద వర్గాల విద్యార్థులకు ఈ విద్యా వెలుగులు అందకపోతే దేశాభివృద్ధి కుంటుపడిపోతుంది. చరిత్రాత్మకమైన కొఠారి కమిషన్ మొట్టమొదటిసారి కామన్ స్కూల్ విధానాన్ని (సీఎస్ఎస్) ప్రవేశపెట్టింది. ఈ విధానంవల్ల సమాజంలోని ఆర్థిక అంతస్తులను తగ్గించడం ప్రధాన ఉద్దేశంగా కొఠారి కమిషన్ నిర్దేశించింది. జాతీయ సమగ్రతకు దోహదపడటం కోసం ఒక రాష్ట్రం విద్యార్థులను మరొక రాష్ట్ర విద్యార్థులతో కలపటం కూడా ఇందులో ముఖ్యమైనది. ప్రాథమిక దశలో విద్యార్థులందరికీ, ముఖ్యంగా బీసీ కులాల పిల్లలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పిల్లలకు, ఆడపిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలన్నది కొఠారి కమిషన్ సూచనలలో కీలకమైనది. కానీ దీన్ని ఏవిధంగా అమలు జరపాలో చెప్పకపోవటం వలన అది కాగితాలకే పరిమితమైంది. 1986లో మానవ వనరులశాఖ ఒక పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించేందుకు పూనుకున్నది. దీంతోనే 1986లో రాజీవ్‌గాంధీ నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత 1992లో విద్యారంగంపై కేంద్ర ప్రభుత్వం పునర్ విమర్శన చేసింది. వెనుకబడిన వర్గాల పిల్లల నుంచి డిమాం డ్ లేనందున జాతీయ విద్యావిధానం (ఎన్పీఈ) అంతగా అమలుజరగలేదు. బీద పిల్లలకు నాణ్యమైన చదువు ఇప్పించటం వరకే అక్కడక్కడ ప్రయత్నాలు జరిగాయి. దీనివలన విద్యలో సమత్వం రా దని 1992లో ప్లానింగ్ కమిషన్ పునర్ సమీక్ష చేసిం ది. ఎస్సీ, ఎస్టీలు, బలహీనవర్గాల పిల్లలు బడికి వ చ్చేందుకై కొన్ని రాయితీలివ్వాలని తీర్మానించింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పిల్లలకు ప్రత్యేక హాస్టల్స్ తెరవాలని, గిరిజన ప్రాంతంలో ఆశ్రమ స్కూల్స్‌ను ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీ నివాస ప్రాంతాలలోనే బడులు ఏర్పాటు చేయాలని ఎన్పీఈ కమిషన్ సూచించింది. నవోదయ బడులలో కేంద్రీయ విద్యాలయాల్లో ఎస్సీ, ఎస్టీ పిల్లలకు రిజ ర్వేషన్లు కల్పించాలని ఆదేశించింది. కానీ ఇవి అంతగా అమలు జరగలేదు. కారణాలు ఎన్నో. ఎస్సీ, ఎస్టీ స్కూళ్ల నిర్వహణలో తీవ్ర లోపాలున్నాయి. వీటికి ప్రభుత్వం డబ్బు కేటాయించకపోగా హాస్టల్స్‌లో నాసిరకమైన ఆహారాన్ని అందిస్తున్నా రు. ఎన్పీఈ సిఫార్సులు విద్యారంగంలో మరొక అంతస్తును సృష్టించాయి. ఆశ్రమ స్కూళ్లకు, ట్రైబల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో వ్యత్యాసమే ఇంకో అగాధాన్ని సృష్టించింది. జనరల్ స్కూళ్లలో ఎస్సీలకు రిజర్వేషన్లు ఇచ్చినా వారి స్థితిగతులను మార్చకుం డా పాఠశాలల్లో చేర్పించినా వారిని నిలబెట్టుకోవటమే కష్టమైపోయింది. మొదటి తరగతిలో చేరిన వాళ్లు రెండో తరగతి వచ్చేసరికి డ్రాప్ అవుట్స్ అయ్యారు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే 2013-14 విద్యాసంవత్సరంలో 5వ తరగతి వరకు చదివే విద్యార్థులలో 22.23 శాతం, 1వ తరగతి నుంచి 7వ తరగతి మధ్య 32.56 శాతం, 1 నుంచి 10వ తరగతి వరకు బడి మానేసిన విద్యార్థుల సంఖ్య 38.21 శాతంగా ఉన్నాయని, ఇటీవల తెలంగాణ ప్రభుత్వ బడ్జెట్ పేర్కొంది. ఇదే నిష్పత్తిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా డ్రాప్ అవుట్ల సంఖ్య కనిపిస్తుంది. ఆ డ్రాప్ అవుట్ విద్యార్థులను పట్టించుకోకపోవటం వలన వారు చదువులో వెనుకబడిపోయారు. ఎన్పీఈ వలన 20 శాతం వర్గాల ఆడపిల్లల చదువులో మార్పు వచ్చింది. వెనుకబడిన వర్గాల ఆడపిల్లల చదువులో అంతగా మార్పు రాలేదు. సామాజిక జీవనం మారకుండా ఆ పిల్లల విద్యలో మార్పు తేవటం కష్టసాధ్యం. క్యూబాలాం టి దేశాలలో ఎంతో శ్రద్ధ తీసుకుని వెనుకబడిన పిల్లల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేశారు. అట్టడుగు వర్గాలలో చైతన్యం కలిగించి వారిని విద్య వైపు మళ్లిం చాలి. భారతదేశ తొలి విద్యామంత్రి మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ జయంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీని జాతీయ విద్యా దినోత్సవంగా పాటిస్తున్నారు. ఈ నేపథ్యంలో, బడికిరాని పిల్లల పైన ప్రత్యేకంగా విచారించే యంత్రాంగం కావాలి. డ్రాప్ అవుట్స్‌కు విరుగుళ్లు వెతకాలి. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త) -
ప్రా(ప్రొ)జెక్ట్ మేనేజ్మెంట్
ఎన్నో నిర్మాణాలు.. మరెన్నో ఉత్పత్తులు.. అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగం.. అయినప్పటికీ సకాలంలో ఆశించిన లక్ష్యాలు చేరుకోని సందర్భాలు అనేకం. మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ఉత్పాదక లక్ష్యాల పరంగా ఎన్నో కార్యకలాపాలు చోటు చేసుకుంటున్న భారత్‌లో.. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదే. ఈ సమస్యకు పరిష్కారంగా ఆవిష్కృతమైన విభాగం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఒక నిర్దిష్ట లక్ష్యం చేరుకునే క్రమంలో.. ప్రతిపాదన దశ నుంచి ఆచరణలోకి తీసుకువచ్చే వరకు ఎంతో ముఖ్యమైన భూమిక పోషించే విభాగం ఇది. దేశం ప్రగతి పథంలో దూసుకెళ్లడంలో కీలక పాత్ర పోషిస్తూ.. యువతకు కెరీర్ అవకాశాలు కల్పిస్తున్న ప్రాజెక్ట్ మేనేజ్మెంట్పై విశ్లేషణ.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్వరూపం వ్యాపారం, విధులు, విభిన్న అవసరాలు.. వీటన్నిటికీ ఒక లక్ష్యం ఉంటుంది. నిర్దిష్ట లక్ష్యాలను చేరుకునే దిశగా ప్రణాళిక, నిర్వహణ, సంరక్షణ, నేతృత్వం, వనరుల సమర్థ వినియోగం వంటి విధులు నిర్వర్తించడమే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. ఆయా నిపుణులు తమ నైపుణ్యాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని వాస్తవ రూపంలో అనువర్తించే విభాగం ఇదే. ఇటీవల కాలంలో దేశంలో చేపడుతున్న పలు ప్రాజెక్ట్‌ల దృష్ట్యా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో ప్రత్యేక నైపుణ్యాలు కలిగిన మానవ వనరుల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది. మరోవైపు ప్రాజెక్ట్ నిర్వహణ, కార్యాచరణకు సంబంధించిన లోపాలతో పలు ప్రాజెక్ట్‌లు మధ్యలోనే ఆగిపోతున్న పరిస్థితి ఉంది. కొన్నిసార్లు ప్రాజెక్టు పూర్తయ్యేందుకు ఆలస్యమై వ్యయ అంచనాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వీటన్నిటికీ సమాధానం నిపుణులైన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్. అన్ని విభాగాల్లోనూ అవసరం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్.. కేవలం నిర్మాణ రంగం లేదా మౌలిక సదుపాయాల కల్పన వంటి విభాగాలకే పరిమితం కాదు. కార్పొరేట్ హౌస్‌లలో, బహుళ అంతస్తుల భవనాల్లో కార్యకలాపాలు సాగించే ఐటీ సంస్థల నుంచి ఆర్కిటెక్చర్ వరకు అన్ని రంగాల్లోనూ ఆయా సంస్థలు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకునేందుకు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులు కావాలి. ఉదాహరణకు ఐటీని దృష్టిలో పెట్టుకుంటే.. ఒక ఐటీ కంపెనీ క్లయింట్ అవసరాల మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించే ప్రక్రియ చేపడుతుంది. ఈ క్రమంలో క్లయింట్ వాస్తవ అవసరాలు, వ్యయ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటూ.. సదరు ప్రొడక్ట్‌ను రూపొందించేందుకు ఒక బృందం విధులు నిర్వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణుల అవసరం ఎంతో ఉంటుంది. ప్రాజెక్టును నిపుణులు సమర్థంగా అమలు చేయడం ద్వారానే క్లయింట్ తో జరిగిన అవగాహన మేరకు నిర్ణీత కాల వ్యవధిలో, నిర్దేశించిన వ్యయంలో ప్రొడక్ట్‌ను రూపొందించడం సాధ్యమవుతుంది. ఇదే విధంగా టెలికం, ఆటోమొబైల్, ఫైనాన్స్ తదితర రంగాల్లో కూడా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణుల అవసరం ఏర్పడింది. 4 లక్షల మంది కావాలి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులకు మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో ఎర్నెస్ట్ యంగ్ ఇండియా విడుదల చేసిన నివేదిక తెలుపుతోంది. దీని ప్రకారం.. 2020 వరకు ప్రతి ఏటా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ అవసరం 4 లక్షల మేర ఉండనుంది. ఔత్సాహికులు ఈ రంగంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవాలనేది ఈ రంగంలో నిపుణుల సూచన. అవకాశాలకు వేదికలివే కెరీర్ పరంగానూ ఢోకాలేని విభాగం.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. పలు సంస్థలు ఆయా రంగాల్లోని ఆర్థిక ఒడిదుడుకుల కారణంగా ఖర్చులు నియంత్రించుకుంటున్న సందర్భాల్లోనూ కొత్తగా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నిపుణులను నియమించుకోవడమే.. కెరీర్ పరంగా ఈ విభాగంలో లభించే భరోసాకు నిదర్శనం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందిన అభ్యర్థులకు ఐటీ, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆటోమేషన్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్, అర్బన్ డెవలప్మెంట్, రిస్క్ మేనేజ్మెంట్, న్యూ ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి పలు రంగాల్లో అవకాశాలు లభిస్తాయి. ఎంట్రీ లెవల్లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ హోదాతో ఉద్యోగం లభిస్తుంది. తర్వాత అనుభవం, పనితీరు ఆధారంగా ప్రాజెక్ట్ కో-ఆర్డినేటర్, ప్రాజెక్ట్ షెడ్యూలర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ మేనేజర్ వంటి కీలక హోదాలు లభిస్తాయి. అంతేకాకుండా ప్రారంభంలో కనీసం నెలకు రూ. 20 వేల జీతం గ్యారంటీ. అవసరమైన లక్షణాలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ రంగంలో రాణించాలనుకునే అభ్యర్థులకు లీడర్షిప్ స్కిల్స్, కమ్యూనికేషన్, ప్లానింగ్, టీం బిల్డింగ్ స్కిల్స్ వంటి నైపుణ్యాలు అవసరం. కోర్సులూ అందుబాటులోకి ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో కెరీర్ కోరుకునే వారికి ఇప్పుడు అకడమిక్‌గా ఎన్నో కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. పలు ఇన్స్టిట్యూట్లు ఎంబీఏ స్థాయిలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్స్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో అకడమిక్ నైపుణ్యాలు అందించడంలో దేశంలోనే ప్రత్యేకత పొందిన సంస్థ.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి అంతర్జాతీయ గుర్తింపు ఉన్న పలు సర్టిఫికేషన్ ప్రోగ్రామ్‌లను అందిస్తోంది. కోర్సుల వివరాలు పైన చిత్రంలో చూడొచ్చు. సర్టిఫైడ్ అసోసియేట్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు సంబంధించి ప్రాథమిక నైపుణ్యాలపై శిక్షణనందించే ఈ కోర్సుకు ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులు అర్హులు. దీంతోపాటు 1500 గంటల ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ అవసరం. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో అయిదేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్‌స డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో నాలుగేళ్లు, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగంలో ఏడేళ్ల అనుభవం గడించిన అభ్యర్థులు లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ విభాగాల్లో నాలుగేళ్లు చొప్పున అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ అర్హతతోపాటు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్లో ఏడేళ్ల పని అనుభవం లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్లో నాలుగేళ్ల పని అనుభవం ఉంటే ఈ ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పీఎంఐ ఏజిల్ సర్టిఫైడ్ ప్రాక్టీషనర్ ఇప్పటికే ఈ రంగంలో అనుభవం గడించిన వారికి మరింత నైపుణ్యాలు అందించే లక్ష్యంగా రూపొందించిన ప్రోగ్రామ్ ఇది. పీఎంఐ ప్రొఫెషనల్ ఇన్ బిజినెస్ అనాలిసిస్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, బిజినెస్ అనాలిస్ విభాగంలో అయిదేళ్ల అనుభవం లేదా నాలుగేళ్ల వ్యవధిలోని బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు మూడేళ్ల అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ కోర్సుకు అర్హులు. అద్భుతమైన భవంతిని నిర్దిష్ట గడువులోగా నిర్మించాలి.. ఒక రహదారి నిర్మాణాన్ని నిర్ణీత వ్యయ పరిమితితో పూర్తి చేయాలి.. ఓ కొత్త ఉత్పత్తిని తక్షణమే మార్కెట్లోకి తేవాలి.. అంటే.. ముందుగానే నిర్ణయించిన వ్యయ అంచనాలు- కాల పరిమితులు సిద్ధం. వీటిని తూచా తప్పకుండా పాటిస్తూ ఆయా ప్రమాణాల పరిధిలోనే లక్ష్యాలు పూర్తిచేయాలి. అందుకోసం అనుసరించాల్సిన, అమలు చేయాల్సిన వ్యూహాలకు సంబంధించిన విభాగమే.. ప్రాజెక్ట్ మేనేజ్మెంట్!! దరఖాస్తు విధానం ఔత్సాహిక అభ్యర్థులు తమకు సరిపడేకోర్సును గుర్తించాలి. తర్వాత ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో మెంబర్‌గా నమోదు చేసుకోవడం ద్వారా సదరు ప్రోగ్రామ్‌కు దరఖాస్తు చేసుకోవాలి. ఆ తర్వాత ఇన్స్టిట్యూట్ ఆయా ప్రోగ్రామ్‌లకు నిర్దేశించిన వ్యవధి పూర్తయ్యాక నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికేషన్ లభిస్తుంది. దేశవ్యాప్తంగా నాలుగు చాప్టర్ల ద్వారా శిక్షణ సదుపాయాలు కల్పిస్తోంది. పలు సంస్థలతో ఒప్పందాలు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్- ఇండియా.. ఆయా సర్టిఫికేషన్లు, బోధనపరంగా దేశవ్యాప్తంగా పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని అభ్యర్థులకు శిక్షణ సదుపాయం కల్పిస్తోంది. అంతేకాకుండా అకడమిక్ స్థాయిలోనే ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు అందించే విధంగా ఆయా కోర్సుల కరిక్యులంలో మార్పులు చేయాలని భావిస్తోంది. అందుకోసం బీటెక్, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశపెట్టదగిన ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ శిక్షణ అంశాలను రూపొందించింది. పీఎంఐ రిస్క్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత, ప్రాజెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్లో 4,500 గంటల పని అనుభవం లేదా నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు 300 గంటల పని అనుభవం ఉన్న అభ్యర్థులు అర్హులు. పీఎంఐ షెడ్యూలింగ్ ప్రొఫెషనల్ ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణతతోపాటు ప్రాజెక్ట్ షెడ్యూలింగ్‌లో అయిదు వేల గంటల పని అనుభవం లేదా బ్యాచిలర్స్ డిగ్రీతోపాటు 3,500 గంటల పని అనుభవం ఉండాలి. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.pmi.org.in దేశంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కోర్సులను అందిస్తున్న ఇన్స్టిట్యూట్లు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్-ముంబై; కోర్సు- ప్రొఫెషనల్స్ ఇన్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ భారతీయ విద్యాపీఠ్ డీమ్డ్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఐటీ - పుణె; కోర్సు- పీజీ డిప్లొమా ఇన్ ప్రాజెక్ట్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ - ముంబై; కోర్సు- పీజీ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ - హైదరాబాద్; కోర్సు - పీజీ ప్రోగ్రామ్ ఇన్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ - నోయిడా; కోర్సు - ప్రాజెక్ట్ మేనేజ్మెంట్, ప్లానింగ్ అండ్ మానిటరింగ్ సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ - పుణె; కోర్సు- ఎంబీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్. అత్యంత ఆవశ్యకం ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో అత్యంత ఆవశ్యకమైన అంశంగా మారింది. అన్ని రంగాల్లోనూ ఈ విభాగంలో స్పెషలైజ్డ్ ప్రొఫెషనల్స్ అవసరం ఏర్పడింది. ఉత్పత్తి పరంగా, వ్యాపారపరంగా ఏదైనా ఒక లక్ష్యం నెరవేరాలంటే సరైన ప్రణాళిక ఉండాలి. దానికి సంబంధించి శిక్షణ ఇచ్చే కోర్సు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్. అందుకే అకడమిక్ స్థాయి నుంచే దీన్ని ఒక కోర్సుగా బోధించాలి. ఈ విషయంలో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్- ఇండియా కూడా చొరవ తీసుకుంటోంది. ప్రతి కోర్సులో కనీసం ఒక ఎలక్టివ్గానైనా తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పీఎంఐ - హైదరాబాద్ చాప్టర్ గతేడాది నుంచి నిట్-వరంగల్‌లో ఒక ఎలక్టివ్‌గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్కు శ్రీకారం చుట్టింది. కెరీర్ పరంగానూ అవకాశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి ఔత్సాహిక విద్యార్థులు అకడమిక్స్‌లో లేకున్నప్పటికీ.. పీఎంఐలో పేరు నమోదు చేసుకోవడం ద్వారా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో కోర్ సర్టిఫికేషన్స్‌కు మార్గం ఏర్పరచుకోవచ్చు. లీడర్షిప్ స్కిల్స్, టీం కల్చర్ ఉంటే కెరీర్లో మరింత మెరుగ్గా రాణించేందుకు వీలవుతుంది. - కె.శ్రీనివాస్, ప్రెసిడెంట్, పీఎంఐ-పెర్ల్ సిటీ హైదరాబాద్ చాప్టర్ అకడమిక్ నైపుణ్యంతో.. అద్భుత భవిష్యత్తు ప్రాజెక్ట్ మేనేజ్మెంట్లో డొమైన్ నాలెడ్జ్ ఉంటే అద్భుత భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. ప్రస్తుతం కొన్ని ఇన్స్టిట్యూట్లు ఈ విభాగాన్ని ఒక సబ్జెక్ట్‌గా బోధిస్తున్నప్పటికీ.. వాస్తవ అవసరాలకు అనుగుణంగా పూర్తి స్థాయి నైపుణ్యాలు పొందే అవకాశం తక్కువగా ఉంది. కారణం.. విద్యార్థులు తమ కోర్ సబ్జెక్ట్లపై ప్రధానంగా దృష్టి సారించడం. ఈ విభాగంలో పూర్తి స్థాయి కోర్సుల ఆవశ్యకత నెలకొంది. ఇది ఔత్సాహిక విద్యార్థులకు చక్కటి మార్గం కూడా. అందుకే ఈ నైపుణ్యాలు అందించే విధంగా పీఎంఐ-ఇండియాతో ఒప్పందం ద్వారా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్లో ఎంబీఏ కోర్సును అందిస్తున్నాం. -ప్రొఫెసర్ ప్రకాశ్ వాక్నిస్,హెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్, సింబయాసిస్ సెంటర్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ -
కలలో చిలుకా... కాస్త చెప్పవా!
స్వప్నలిపి చిలకది చూడచక్కని రూపం. ఏ చెట్టుపైనో చిలకను చూసీ చూడగానే ‘ఆహా’ అనుకుంటాం. మరి కలలో కనిపిస్తే? ‘ఆహా’ అనడం మాట అలా ఉంచి, కాస్త ఆలోచించాల్సిందే అంటున్నారు స్వప్నవిశ్లేషకులు. వారి విశ్లేషణల్లో కొన్ని... చిలక మీ కలలో కనిపించింది అంటే, మీరు చేయకూడని వారితో స్నేహం చేస్తున్నారని అర్థం. చిలక ఈకలు కలలో కనిపించడం అనేది... మీకు ఉన్న స్నేహితులలో బూటకపు స్నేహితులు, పక్కదారి పట్టించే స్నేహితులు ఎక్కువ ఉన్నారనేదాన్ని ప్రతిబింబిస్తుంది. ‘పంజరంలో చిలక’ కలలో కనిపిస్తే ... మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని పక్కదోవ పట్టిస్తున్నాయని లేదా ఊపిరి సలపని పనితో ఉక్కిరిబిక్కిరి అవుతూ ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అర్థం. చిలక మిమ్మల్ని కొరికినట్లు కల వస్తే... మిమ్మల్ని చూసి కొందరు ఈర్ష్యపడుతున్నారని అర్థం. వేరే వాళ్లను చిలక కొరికినట్లు కల వస్తే... ఏదో విషయంలో ఆ వ్యక్తిని మీరు అప్రతిష్ఠపాలు చేస్తున్నట్లు అర్థం. రెక్కలు దెబ్బతిన్న చిలక... ఎగరలేక ఇబ్బంది పడుతున్న దృశ్యం మీ కలలోకి వస్తే, మీరు మార్పు కోరుకుంటున్నప్పటికీ, ఆ మార్పుకు అవసరమైన పరిస్థితులు మీకు అనుకూలంగా లేవని అర్థం. ఏం మాట్లాడినా...వల్లె వేసే చిలక కలలోకి వస్తే... మీకంటూ సొంత అభిప్రాయం లేకుండా ఉన్నారని, ఎవరు ఏది చెప్పినా దాన్ని గుడ్డిగా సమర్థించడం తప్ప, వాస్తవ ప్రాతిపాదికగా మీరు అభిప్రాయ ప్రకటన చేయడం లేదని అర్థం చేసుకోవాలి. చేతిపైన చిలక వచ్చి కూర్చున్నట్లు యువతులకు కల వస్తే వారి ప్రేమ ఫలించడానికి సూచనగా అర్థం చేసుకోవాలి. -
డేటాను ఒడిసిపట్టి, విశ్లేషించే.. బిజినెస్ ఎనలిస్ట్
టాప్ స్టోరీ ఎనలిటికల్ స్కిల్స్ : అందుబాటులో ఉన్న డేటాను విశ్లేషించి, దాన్ని నిర్ణయాలు తీసుకునేందుకు వీలుగా క్లుప్తీకరించడానికి ఎనలిటికల్ టూల్స్ అవసరం. వీటికి సంబంధించిన స్కిల్స్ ఉండాలి. బిజినెస్ స్కిల్స్ : ఓ కంపెనీ కార్యకలాపాలు, లక్ష్యాలు, సమస్యలను అర్థం చేసుకునే నైపుణ్యం అవసరం. అప్పుడే సంబంధిత బిజినెస్ డెరైక్టర్లకు అవసరమైన సమాచారాన్ని అందుబాటులో ఉంచగలరు. క్రియేటివ్ స్కిల్స్: సృజనాత్మకంగా ఆలోచించడం ప్రధానం. విశ్లేషణ నివేదికలను బార్/లైన్ గ్రాఫ్స్; సర్క్యులర్ గ్రాఫ్స్ తదితర రూపాల్లో అందించాల్సి ఉంటుంది. అందువల్ల తప్పనిసరిగా గ్రాఫికల్ కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి. ఒక కంపెనీ/సంస్థ కొత్త ప్రణాళికలను రూపొందించు కునేందుకు డేటా ఎనలిటిక్స్ ఉపయోగపడుతుంది. కంపెనీ వ్యాపార అభివృద్ధికి ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంలో ఎనలిటిక్స్ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారు. ఉదాహ రణకు ఒక కంపెనీ నగరంలో రిటైల్ ఔట్‌లెట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే వ్యాపారానికి అవకాశమున్న ప్రాంతం, అందుబాటులో ఉన్న వినియోగదారులు, వారి అభిరుచులు, ఆర్థిక పరిస్థితులు, ఏయే వస్తువులు ఉండాలని కోరుకుం టున్నారు? ఏయే వస్తువులకు డిమాండ్ ఉంది? రిటైల్ రంగంలో ఉన్న ఇతర పోటీదారుల పరిస్థితి ఎలా ఉంది? ఇలా వివిధ కోణాల్లో సమాచారాన్ని సేకరించి.. విశ్లేషించి.. సమగ్ర నివేదిక రూపొందించడమే డేటా ఎనలిటిక్స్. ఎనలిటిక్స్ కోర్సులను అందిస్తున్న సంస్థలు ఐఐటీ - హైదరాబాద్ కోర్సులు: సర్టిఫికెట్ కోర్స్ ఇన్ అడ్వాన్స్డ్ బిజినెస్ ఎనలిటిక్స్, ఫౌండేషన్స్ ఆఫ్ ప్రిడెక్టివ్ ఎనలిటిక్స్ వ్యవధి: ఐదు రోజులు వెబ్సైట్: www.iith.ac.in/analy/index.html ఐఎస్బీ- హైదరాబాద్ హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. సర్టిఫికెట్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ (సీబీఏ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల కోర్సు. క్లాస్‌రూం, టెక్నాలజీ ఆధారిత విధానాల ద్వారా బోధన ఉంటుంది. వెబ్సైట్: www.isb.edu ఐఐటీ - బాంబే కోర్సు: అడ్వాన్స్డ్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్; వెబ్సైట్: www.iitb.ac.in ఐఐఎం- బెంగళూరు ఎనలిటిక్స్‌లో ఏడాది వ్యవధి ఉన్న సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. బహుళజాతి సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఈ కోర్సును ప్రవేశపెట్టింది. ఇంటర్‌డిసిప్లినరీ పరిశోధనల్లో డేటాను వినియోగించడం కోసం ప్రత్యేకంగా డేటా సెంటర్‌ను, ఎనలిటిక్స్ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. వివరాలకు www.iimb.ernet.in ఐఐఎం- కోల్‌కతా ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రాం ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ (ఉ్కఆఅ)ను ఆఫర్ చేస్తోంది. ఇది ఏడాది వ్యవధి గల ఎగ్జిక్యూటివ్ కోర్సు. 50 శాతం మార్కులతో బీఎస్సీ/బీటెక్ ఉత్తీర్ణతతోపాటు రెండేళ్ల పని అనుభవం. ఏదైనా కంపెనీలో పనిచేస్తుండాలి. వెబ్సైట్: www.iimcal.ac.in ఐఐఎం-లక్నో కెల్లీ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఇండియానా యూనివర్సిటీ, యూఎస్ఏలతో సంయుక్తంగా ఐఐఎం-లక్నో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ ఇన్ బిజినెస్ ఎనలిటిక్స్ ఫర్ ఎగ్జిక్యూటివ్స్‌ను ఆఫర్ చేస్తోంది. క్లాస్‌రూం, ఆన్లైన్ విధానాల్లో బోధన ఉంటుంది. వెబ్సైట్: www.iiml.ac.in ఐఐఎం- అహ్మదాబాద్ మేనేజ్మెంట్ నిపుణుల కోసం అడ్వాన్స్డ్ ఎనలిటిక్స్‌లో ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్లో కోర్సులను అందిస్తూ విశేష ఆదరణ పొందిన మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్).. తన ప్రొవైడర్స్ ఎడెక్స్ (www.edx.org), కోర్సెరా (www.coursera.org) ద్వారా ఎనలిటిక్స్‌లో ఎన్నో సర్టిఫికెట్ కోర్సులను ఆఫర్ చేస్తోంది. ఇవేకాకుండా ఐఐటీ - ఖరగ్‌పూర్, ఐఐటీ - రూర్కీ.. బిజినెస్ ఎనలిటిక్స్‌లో స్వల్పకాలం వ్యవధి ఉన్న కోర్సులను అందిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో ఎన్ఐఐటీ లిమిటెడ్.. బిజినెస్ ఎనలిటిక్స్‌లో సర్టిఫికెట్ కోర్సును ఆఫర్ చేస్తోంది. ఎవరు అర్హులు? కొన్ని సంస్థలు కోర్సుల్లో ప్రవేశానికి ఇంజనీరింగ్/బిజినెస్ మేనేజ్ మెంట్/సైన్స్/కామర్స్/ మ్యాథమెటిక్స్/స్టాటిస్టిక్స్ తదితర అంశాల్లో బ్యాచిలర్‌స డిగ్రీని అర్హతలుగా పేర్కొంటున్నాయి. మరికొన్ని మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలని నిర్దేశిస్తున్నాయి. పని అనుభవాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. అయితే విశ్లేషణా సామర్థ్యం, అకడమిక్స్‌లో మంచి ప్రతిభ ఉంటే ఫ్రెషర్స్‌కు కూడా కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. నగరంలో ఎన్నో ఉద్యోగాలు సిటీలో ఎన్నో బహుళజాతి సంస్థలు, స్వదేశీ సంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఐటీ సర్వీసెస్; ఎడ్యుకేషన్; మ్యానుఫ్యాక్చరింగ్; మార్కెటింగ్; ట్రావెల్ అండ్ టూరిజం; హెల్త్‌కేర్, బ్యాంకింగ్, బీమా, ఈ-కామర్స్ సంస్థల వరకు ఎన్నో నగరంలో కొలువుదీరాయి. ఇవి వ్యాపారాభివృద్ధికి బిజినెస్ ఎనలిటిక్స్ నిపుణులపైనే ఆధారపడ్డాయి. ఇందుకోసం భారీ స్థాయిలో జీతాలు ఇవ్వడానికీ సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి నగరంలో బిజినెస్ ఎనలిస్టులకు అవకాశాలు కోకొల్లలు. ఔత్సాహికులు ఫ్రెషర్స్‌గా లేదా రెండు-మూడేళ్ల పని అనుభవంతో బిజినెస్ ఎనలిటిక్స్‌లో కెరీర్‌ను ప్రారంభించవచ్చు. అందుబాటులో ఉన్న ఉద్యోగాలు.. జూనియర్ బిజినెస్ ఎనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్; సీనియర్ బిజినెస్ ఎనలిటిక్స్ ఎగ్జిక్యూటివ్; అసిస్టెంట్ మేనేజర్ (బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమర్ ఎనలిటిక్స్); డేటా మోడలర్(బిజినెస్ ఇంటెలిజెన్స్ అండ్ ఎనలిటిక్స్); బిజినెస్ కన్సల్టెంట్ (ఫైనాన్షియల్ ఎనలిటిక్స్); బిజినెస్ కన్సల్టెంట్ (బీపీవో/కేపీవో/ఐటీఈఎస్); ప్రాజెక్టు మేనేజర్ (ఎనలిటిక్స్); టీమ్ లీడర్. వేతనాలు ప్రతిభ ఉన్న ఎనలిటిక్స్ నిపుణులకు కార్పొరేట్ కంపెనీలు నెలకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు ఆఫర్ చేస్తున్నాయి. స్కిల్డ్ ఎనలిస్ట్లకు భారీ డిమాండ్ ‘‘మార్కెటింగ్‌లో ఊహించని మార్పులను విశ్లేషించి చెప్పగలిగే నిపుణులే.. ఎనలిస్ట్‌లు. గతం, వర్తమాన, భవిష్యత్తు అంశాలను విశ్లేషించగలిగే నేర్పు, ఓర్పులే ఎనలిస్ట్ కావాలనుకునే వారికి ఉండాల్సిన ప్రాథమిక లక్షణాలు. ప్రస్తుతం జాబ్మార్కెట్లో స్కిల్డ్ ఎనలిస్ట్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నప్పటికీ సరిపడినంత నిపుణులు లేరు. ఈ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలను కుంటే మ్యాథమెటిక్స్, అల్గారిథమ్, స్టాటిస్టిక్స్, గ్రాఫ్ థియరీ, అపరేషన్ రీసెర్చ్ వంటి అంశాల్లో పరిజ్ఙానం పెంచుకోవాలి. ఐఐటీ ముంబై, కాన్పూర్, చెన్నై, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, బెంగళూరు క్యాంపస్‌లలో డేటా ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. డేటా ఎనాలసిస్‌లో పూర్తిస్థాయి నైపుణ్యం సంపాదిస్తే అద్భుతమైన కెరీర్‌ను సొంతం చేసుకోవచ్చు’’ - ప్రొఫెసర్ పి.కృష్ణారెడ్డి, ఐటీఆర్ఏ ప్రోగ్రాం డెరైక్టర్, ట్రిపుల్ ఐటీ, హైదరాబాద్ -
వయ్యారంగా వెక్కిరించడమే!
విశ్లేషణ ఈ పాట నుండి ఉద్భవించేది సాముదాయకమైన రసం. పాటలో విషయం భాగ్యవంతుణ్ణి ఆక్షేపించడం. ఒళ్లొంచి పని చేయకుండా సుఖాలనుభవించేవారిని వయ్యారంగా వెక్కిరించడం. హాల్లో జనంలో చాలామంది ‘బీదలే’- అంటే కష్టపడి పనిచేసి పొట్టపోసుకునేవారే. వారికి సినిమా కసి ఉంటుంది. ఆ ‘కసి’ ఈ పాట ద్వారా బయటపడుతుంది. వారి మనస్సులో రహస్యంగా ఉన్న ఆవేదన, వ్యధ, ఇతరులతో పంచుకోవడంతో తగ్గుతుంది. అందుకని, ఈ పాట సినిమా హాల్లో బాగా రక్తి కడుతుంది. హాల్లో జనం ఏ పదిమందో ఉండి సినిమా చూస్తే చిత్రం ఎంత మంచిదైనా రక్తికట్టదు. సామూహిక ఉద్రేకానికి అంతటి ప్రభావం ఉంది. ఈ పాట వచ్చిన కొత్తలో ‘‘చాలా బాగుందండీ పాట’’ అన్నాను శ్రీశ్రీగారితో, ఆయనే వ్రాశాడనుకుని. కానీ, వ్రాసింది ఆయన కాదట. ఆచార్య ఆత్రేయట. కానీ నేను పెదవి కొరుక్కోనక్కర్లేదు- మీరూ అంతే!! (‘తోడికోడళ్ళు’ చిత్రానికి ఆత్రేయ రచించిన ‘కారులో షికారుకెళ్లే...’ సినీగీతం గురించి రచయిత బుచ్చిబాబు) -
బీజేపీపై టీడీపీ ఎదురుదాడి
బీజేపీ స్థానాల్లోంచి ఉపసంహరించుకోని టీడీపీ అభ్యర్థులు బలహీన అభ్యర్థులంటూ చంద్రబాబు వ్యాఖ్యలపై దుమారం టీ డీపీపై బీజేపీ నేతల ఆగ్రహ జ్వాలలు రెండు పార్టీలకూ ఓటమి తప్పదంటున్న విశ్లేషకులు సాక్షి,విజయవాడ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వెన్నుపోటు రాజకీయాన్ని ప్రత్యక్షంగా చవిచూసిన సీమాంధ్ర బీజేపీ నేతలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించిన కడప, సంతనూతలంపాడు, గుంతకల్లు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇవ్వడాన్ని బీజేపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఉపసంహరింపచేయాలని బీజేపీ జాతీయ నేత ఎం.వెంకయ్యనాయుడు విజ్ఞప్తి చేసినప్పటికీ టీడీపీ నేతలు ఏ మాత్రం పట్టించుకోకుండా నామినేషన్లు ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఇప్పుడు తమ మాట పట్టించుకోవడం లేదని చెప్పడం ఎంతమేరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ స్థానాల్లో పోటీ చేసిన అభ్యర్థులను పార్టీ నుంచి సస్పెండ్ చేయకుండా చంద్రబాబు జిమ్మిక్కులు ప్రదర్శిస్తున్నారనే భావన బీజేపీ నేతల్లో ఉంది. ఎన్నికలకు కొద్దిరోజులు ముందు చంద్రబాబు మూడు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులపై కంటి తుపుడు చర్యగా చర్యలు తీసుకున్నా, ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ నేతలకు ఏ మాత్రం ఉపయోగ పడే అవకాశం లేదు. బలహీన అభ్యర్ధులపై దుమారం.... ‘బీజేపీ బలహీన అభ్యర్థుల్ని నిలబెట్టిందంటూ’ చంద్రబాబు గతంలో చేసిన ప్రకటన పై రెండుపార్టీల్లోనూ దుమారం లేపుతోంది. బీజేపీ అభ్యర్థులు ఓడిపోతే.. మేము ముందే చెప్పాం అంటూ చంద్రబాబు యాగీ చేస్తారనే భయం నేతల్లో ఉంది. టీడీపీ పోటీ చేసే స్థానాలన్నింటిలోనూ బలమైన అభ్యర్థుల్నే నిలబెడితే 160కు పైగా స్థానాల్లో టీడీపీ విజయం సాధిస్తుందా? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యామ్ కిశోర్ ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ప్రకటన బీజేపీ అభ్యర్థుల ఆత్మస్ధైరాన్ని నైతికంగా దెబ్బతీయడమేనని అంటున్నారు. టీడీపీ ఎదురుదాడి.. పొత్తు ధర్మాన్ని విస్మరించిన టీడీపీ నేతలు ఇప్పుడు తాము వెన్నుపోటు పోడవలేదంటూ ఎదురుదాడికి దిగుతున్నారు. గురువారం విజయవాడలో జరిగిన విలేకర్ల సమావేశంలో టీడీపీ ఎంపీ సుజనా చౌదరి మాట్లాడుతూ బీజేపీకి కేటాయించిన కడప,సంతనూతలంపాడు, గుంతకల్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు బీఫారాలు ఇస్తామని బీజేపీ నేతలకు ముందుగానే చెప్పామని బుకాయించారు. ముందు బీఫారాలు ఇస్తామని, తరువాత అవసరమైతే ఉపసంహరింప చేస్తామని హామీ ఇచ్చామని, ఇప్పుడు అభ్యర్థులు ఉపసంహరించుకోకపోవడం చంద్రబాబు తప్పేమీ కాదంటూ ఎదురుదాడికి దిగారు. బీజేపీ స్థానాల్లో పోటీ చే స్తున్న టీడీపీ అభ్యర్ధులపై ఎప్పటిలోగా క్రమశిక్షణా చర్యలుతీసుకుంటారో కూడా స్పష్టంగా చెప్పలేకపోయారు. ఇదే విషయం పై శుక్రవారం బీజేపీ రాష్ట్ర కార్యదర్శి జమ్ములశ్యామ్ కిశోర్, సీమాంధ్ర ఉద్యమ కన్వీనర్ యు.శ్రీనివాసరాజులు మాట్లాడుతూ తమకు కేటాయించిన స్థానాల్లో టీడీపీ అభ్యర్ధులకు బీఫారాలు ఇస్తామన్న విషయం తమకు ముందు చెప్పామన్న టీడీపీ నేతల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో సుజనా చౌదరి మాటలు నమ్మాల్సిన అవసరం లేదంటున్నారు. రెండు పార్టీలకు ఓటమి తప్పదా! బీజేపీకి కేటాయించే స్థానాల్లో టీడీపీ అభ్యర్థుల్ని నిలబెట్టడం వల్ల అక్కడ అటు బీజేపీ,ఇటు టీడీపీలు రెండూ నష్టపోయే అవకాశాలు కనపడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తమకు జరిగిన నష్టంపై ఆగ్రహంతో ఉన్న బీజేపీ శ్రేణులు టీడీపీ అభ్యర్థులు ఓడించడానికి వెనుకాడరని ఆ పార్టీ నేతలు అంటున్నారు. -
గండికోట లోయలు పెన్నానది హొయలు...
ఇరుకు లోయల్లో మలుపులు తిరిగిన పెన్నానది హొయలు దట్టమైన అడవుల మధ్య ఎత్తై ఎర్రమల గిరులు గత వైభవానికి ప్రతీకగా నిలిచిన శిథిలమైన కోట జైన, శైవ, వైష్ణవ ఆలయాలు, మసీదుల నిర్మాణ శైలులు ఎటుచూసినా చారిత్రక వైభవం అడుగడుగునా మనోహరమైన ప్రకృతి సౌందర్యం కనులకు విందు చేసే ఈ ప్రాంతం వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు తాలూకాలోని గండికోట గ్రామంలో ఉంది. ‘గండికోట’ పేరు వినగానే ‘గండికోట రహస్యం’ సినిమా గుర్తుకొస్తుంది చాలామందికి. నిజంగా గండికోట ఉందా! అని ఆశ్చర్యపడేవారు ఇప్పటికీ ఉన్నారు. చారిత్రక వైభవా న్ని కళ్లకు కడుతూ కనువిందుచేస్తోన్న గండికోట గురించి తెలుసుకోవాలంటే..! మలుపులుగా పెన్నా నది జమ్మలమడుగు మండలానికి పడమర దిక్కుగా సుమారు 14 కి.మీ దూరంలో గల ఎర్రమల పర్వతశ్రేణికి వెళ్లాలి. పర్వత పాద భాగంలో పెన్నా నది ఒంపులుగా ప్రవహిస్తోంది. 1000 అడుగుల వెడల్పు 500 వందల అడుగుల లోతుతో 5 కి.మీ పొడవున సహజంగా ఏర్పడిన కందకం ఉంటుంది. దీనినే గండి అంటారు. గంభీరంగా... గండికోట... లోయకు తూర్పున ఎత్తై ఎర్రమల కొండల మీద నిర్మించబడింది గండికోట. 12వ శతాబ్దంలో కల్యాణ చాళుక్యుల పరిపాలనలో ఈ ప్రాంతాన్ని ‘ములికినాడు సీమ’గా పిలిచేవారట. ములికినాడు సీమకు రాజప్రతినిధిగా నియమింప బడిన కాకరాజు ఈ ప్రాంతాన్ని శత్రుదుర్భేద్యంగా గుర్తించి, కోటను నిర్మింపచేశాడని, ఆ తర్వాత కాలంలో విజయనగరసామంతరాజు పెమ్మసాని తిమ్మనాయుడు కోట చుట్టూ ఉన్న మట్టి గోడను తొలగించి 101 బురుజులున్న రాతి కోట నిర్మించి ‘గండికోట సీమ’ గా పేరు మార్చాడని చెబుతారు. మాధవస్వామి ఆలయం, శివాలయాలతో పాటు నీటి కొలనుల నిర్మాణాలు ఇతని హయాంలోనే జరిగాయి. గండికోట అత్యంత వైభవంగా విలసిల్లి, ప్రజాదరణకు నోచుకుంది ఇతని కాలంలోనే! విజయనగర సామ్రాజ్యం విచ్ఛిన్నమైన తరువాత గోల్కొండ సుల్తాన్ అబ్దుల్ కుతుబ్‌షా సైన్యాధికారి మీర్ జుమ్లా ఈ కోటను స్వాధీనం చేసుకున్నాడు. గండికోటను కడప నవాబులు కూడా పాలించినట్లు తెలుస్తోంది. శిల్పకళా సంపద... మాధవస్వామి దేవాలయం నాలుగు అంతస్తుల గోపురంతో నాలుగువైపులా ద్వారాలతో తూర్పుముఖంగా ఉంటుంది. లోపల నైఋతి మూల ఎత్తై శిలాస్తంభాలతో మధ్యన కల్యాణ మండపం, ఆగ్నేయంగా పాకశాల, అలంకారశాల, ఉత్తరాన ఆళ్వారుల ఆలయం, దాని పక్కగా 55 స్తంభాలతో వసారా ఉన్నాయి. గర్భగుడి, నాట్య మండపాలలోని శిల్పకళ కళ్లు చెదిరేలా ఉంటుంది. అందుకే ఫ్రెంచ్ ట్రావెలర్ టావెర్నీర్ గండికోట ప్రాభవం చూసి దానిని రెండవ హంపీగా పేర్కొన్నారు. కోట ధాన్యాగారానికి ఉత్తరాన ఉన్న ఎత్తై గుట్టపై రఘునాథ ఆలయం ఉంది. ఈ ఆలయప్రాకారంలో ఉన్న కళ్యాణమండపం, గర్భగుడి చుట్టూ ఉన్న శిల్ప సౌందర్యం అబ్బురపరుస్తాయి. గండికోట లోపల, వెలుపల మొత్తం పన్నెండు దేవాలయాలు ఉన్నాయి. కోట లోపల ‘రాయల చెరువు’ ఉంది. నాడు ఇక్కడ నుండే కోటలోపల వ్యవసాయ భూములకు, ప్రజలకు నీరు అందేదట. ఇది కాకుండా పెన్నానది నుంచి నీటిని తీసుకునేవారట. మరికొన్ని... గండికోటలోని జుమా మసీదు, ధాన్యాగారం, కారాగారం, కత్తుల కోనేరులు పర్యాటకులకు ఆసక్తిని పెంచుతాయి. ప్రాచీనశైవక్షేత్రమైన కన్యతీర్థం, ఆరవ శతాబ్దం నాటి దానవులపాడు, జైనక్షేత్రం, శైవక్షేత్రమైన... గురప్పనికోన, అగస్తీశ్వరకోన, పీర్గైబుసాకొండ చూడదగినవి. టూరిజమ్ వారిచే ఏర్పాటు చేసిన హోటల్లో ఎసి, నాన్ ఎసి గదులు అందుబాటులో వున్నాయి. ఈ ప్రాంతంలోని కట్టడాలపై దృష్టి సారించి మరమ్మతులు చేస్తే గండికోట మరో గోల్కొండగా సాక్షాత్కరిస్తుంది. - అబ్దుల్ బషీర్, న్యూస్‌లైన్, జమ్మలమడుగు ఇలా వెళ్లాలి కడప నుంచి జమ్మలమడుగు 70 కి.మీ. ఇక్కడ రైల్వేస్టేషన్ ఉంది. జమ్మలమడుగు నుంచి దక్షిణంగా వెళితే గండికోట 14 కి.మీ. హైదరాబాద్ నుంచి 7వ నంబర్ జాతీయ రహదారి కర్నూలు మీదుగా బనగానపల్లి, కోవెలకుంట్ల, జమ్మలమడుగు చేరుకోవచ్చు. కర్నూలు నుండి తిరుపతి వెళ్లే దారి గుండా నంద్యాల, ఆళ్ళగడ్డ, మైదుకూరు నుండి కుడివైపుకి తిరిగి పొద్దుటూరు మీదుగా జమ్మలమడుగు చేరుకోవచ్చు. -
విశ్లేషణాత్మక అధ్యయనమే విజయ మంత్రం
ఎన్. విజయేందర్ రెడ్డి జనరల్ అవేర్నెస్ ఫ్యాకల్టీ, హైదరాబాద్. ఐఏఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్, ఇతర సెంట్రల్ సర్వీసుల (గ్రూప్ ఏ, గ్రూప్ బీ) కోసం నిర్వహించే సివిల్ సర్వీసెస్- 2014 నోటిఫికేషన్ మే 17న వెలువడనుంది. సివిల్స్ మహాయజ్ఞంలో తొలి అంకమైన ప్రిలిమ్స్ ఆగస్టు 24న జరగనుంది. ఈ తరుణంలో ప్రిలిమ్స్‌లోని పేపర్-1 (జనరల్ స్టడీస్) పరీక్ష విధానం, ప్రశ్నల తీరు తదితరాలపై ఫోకస్.. దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి వాటికి నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షలో ప్రిలిమ్స్ (ఆబ్జెక్టివ్ విధానం), మెయిన్స్ (రాత పరీక్ష), పర్సనాలిటీ టెస్ట్ (మౌఖిక పరీక్ష) దశలుంటాయి. ప్రిలిమ్స్‌లోని పేపర్ 1 (జనరల్ స్టడీస్)లో వంద ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులకు ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. 2011 నుంచి జనరల్ స్టడీస్ ప్రశ్నల సరళిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అంతకుముందు ఈ పేపర్లో ఫ్యాక్ట్స్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వచ్చేవి. 2010 పేపర్లో వచ్చిన కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం.. Which of the following is/are treated as artificial currency? a) ADR b) GDR c) SDR d) Both ADR and SDR Ans: c n In India, the interest rate on savings accounts in all the nationalised commercial banks is fixed by? a) Union Ministry of Finance b) Union Finance Commission c) Indian Banks Association d) None of the above 2011 నుంచి జనరల్ స్టడీస్ పేపర్లో స్టేట్మెంట్స్, మ్యాచింగ్, ఒకటి కంటే ఎక్కువ ఆప్షన్లు ఉండే జవాబులు, అసెర్షన్-రీజన్ ప్రశ్నల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ప్రశ్నల సరళి ప్రామాణికంగా, క్లిష్టంగా ఉంటోంది. 2013లో వచ్చిన కొన్ని ప్రశ్నలను చూద్దాం.. 1. Which of the following bodies does not/do not find mention in the constitution? 1. National Development Council 2. Planning Commission 3. Zonal Councils n Select the correct answer using the codes given below.. a) 1 and 2 only b) 2 only c) 1 and 3 only d) 1, 2 and 3 Ans: d n Which one of the following pairs is correctly matched? Graphical Feature Region a) Abyssinian Plateau Arabia b) Atlas Mountains North Western Africa c) Guiana Highlands South Western Africa d) Okavango Basin Patagonia Ans: b n Who among the following constitute the National Development Council? 1. The Prime Minister 2. The Chairman, Finance Commission 3. Ministers of Union Cabinet 4. Chief Ministers of the States a. 1, 2 and 3 only b. 1, 3 and 4 only c. 2 and 4 only d. 1, 2, 3 and 4 Ans: b విశ్లేషణాత్మక దృక్పథం అవసరం:వర్తమాన అంశాల నుంచి డెరైక్ట్ ప్రశ్నలు రావడం లేదు. జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్, పర్యావరణం తదితర అంశాలను వర్తమాన అంశాలతో జోడించి ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి అభ్యర్థులు ఈ కోణంలో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఉదాహరణకు భారత్ తాజాగా స్వతంత్ర నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ సాధన కోసం పీఎస్ఎల్వీ-సీ24 ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్-1బీ ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఈ పరిణామానికి సంబంధించి ప్రత్యక్షంగా ప్రశ్నలు రాకున్నా, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ఉపయోగా లపై ప్రశ్నలు వచ్చే అవకాశముంది. అందువల్ల ఒక సమకాలీన పరిణామంతో సంబంధమున్న అన్ని అంశాలను విశ్లేషణాత్మకంగా అధ్యయనం చేయాలి. దినపత్రికల సహకారంతో: వర్తమాన వ్యవహారాలపై పట్టు సాధించేందుకు ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతూ ముఖ్యాంశాలను రాసుకోవాలి. 2013, ఆగస్టు నుంచి చోటుచేసుకున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలను చదవాలి. అంటే పరీక్షకు ఏడాది ముందు నాటి నుంచి వర్తమాన అంశాలను విశ్లేషణాత్మకంగా చదవాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ దినపత్రికలను చదవడం వల్ల పేపర్-2లోని వొకాబులరీ, రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాలకు కూడా ఉపయోగపడుతుంది. ప్రతి సబ్జెక్టుకు సంబంధించిన ప్రాథమిక అంశాలపై పట్టు సాధించాలి. దీనికోసం ఎన్సీఈఆర్టీ ఆరు నుంచి 12వ తరగతి వరకు పుస్తకాలను చదవాలి.ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ సిలబస్‌లోని చాలా అంశాలు, మెయిన్స్ రాత పరీక్షలోనూ ఉన్నాయి కాబట్టి రెండు పరీక్షలనూ దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ సాగించాలి. ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉన్నప్పటికీ ప్రిపరేషన్‌ను డిస్క్రిప్టివ్ కోణంలో ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల సబ్జెక్టులోని అన్ని అంశాలపై సమగ్ర అవగాహన ఏర్పడుతుంది. ఒక అంశం నుంచి ప్రశ్న ఎలా వచ్చినా, సమాధానం గుర్తించే సామర్థ్యం సొంతమవుతుంది. పర్యావరణం కీలకం: పర్యావరణం నుంచి రెండు కోణాల్లో ప్రశ్నలు అడుగుతున్నారు. అవి.. కాన్సెప్చువల్, ఫ్యాక్ట్ ఓరియెంటెడ్. కాన్సెప్చువల్ దృక్పథంలో ఏదైనా నిర్దిష్ట సమస్యకు సంబంధించి అన్ని కోణాలను స్పృశించేలా ప్రశ్నలు అడుగుతుండగా.. ఫ్యాక్ట్ ఓరియెంటెడ్ దృక్పథంలో పర్యావరణ అంశాలకు సంబంధించి ఇటీవల సదస్సులు, సమావేశాలు, నియామకాలు వంటి ప్రశ్నలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఇటీవల కాలంలో ‘పర్యావరణ కాలుష్యం’ చర్చనీయాంశమైన నేపథ్యంలో దీనిపై మరింత దృష్టి సారించాలి. జాతీయ, అంతర్జాతీయ అంశాలు: రాజకీయ అంశాల్లో దేశంలో ప్రధానంగా చోటు చేసుకున్న రాజకీయ సంఘటనలను పరిశీలించాలి. రాజ్యాంగ సవరణలు, ప్రభుత్వ కొత్త పథకాలు, కమిటీలు, కమిషన్లు, కొత్త పార్టీల ఏర్పాటు, ఎన్నికల్లో వాటి విజయాలు, సాధించిన స్థానాలు వంటి వాటిని వివిధ కోణాల్లో అధ్యయనం చేయాలి. అంతర్జాతీయ సదస్సులు, ఒప్పందాలు, వివిధ దేశాల్లోని సంక్షోభ పరిస్థితులు వంటి వాటి గురించి చదవాలి. ఆర్థిక అంశాలు: ప్రిలిమ్స్ పేపర్-1 గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఎకానమీ సంబంధిత అంశాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. సాధారణంగా అభ్యర్థులు ‘ఎకానమీ పరిధిలోనివి’ అని భావించే ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వాటికి సంబంధించిన నేప థ్యం.. అంటే.. సదరు పథకంపై ప్రభుత్వ విధానాలు, ఆ విధాన రూపకల్పనకు కారణాలు, లక్షిత వర్గాలు, ఆ పథకాల ప్రస్తుత అమలు తీరు, విజయాలు, వైఫల్యాలు తదితర అన్ని కోణాల నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. మొత్తం ప్రశ్నల్లో ఎక్కువగా ఇలాంటి ప్రశ్నలే ఉంటున్నాయి. పాలిటీలో కూడా పలు కోణాల్లో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కోర్ పాలిటీకి ప్రాధాన్య తగ్గి కాంటెంపరరీ అంశాల అనుసంధానంతో అడిగే ప్రశ్నలు పెరుగుతున్నాయి. కాబట్టి తాజా రాజ్యాంగ సవరణలు, కారణాలు, వాటి వల్ల ఆశించే ఫలితాలు, పర్యవసానాలపై పట్టు సాధించి అడుగులు వేయాలి. శాస్త్ర, సాంకేతిక అంశాలు: ఇందులో అంతరిక్షం, రక్షణ, పర్యావరణం, ఆరోగ్యం, ఇంధనం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు సంబంధించి చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు గుర్తుంచుకోవాలి. అంతరిక్ష రంగానికి సంబంధించి ఉపగ్రహాలు, వాహక నౌకల ప్రయోగాలు, రక్షణ రంగంలో పరీక్షించిన క్షిపణులు, వాటి పరిధి తదితర అంశాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సూపర్ కంప్యూటర్లు, ఇతర సరికొత్త ఆవిష్కరణలు ఉంటాయి. పర్యావరణానికి సంబంధించి ప్రభుత్వ పథకాలు, వివిధ తుపాన్లకు పెట్టిన పేర్లు, భూకంపాల సమాచారం గుర్తుండాలి. ఇంధనం కూడా మరో ప్రధానమైన అంశం. ఇందులో సంప్రదాయేతర, పునర్వినియోగ ఇంధనాలు, సోలార్ మిషన్ వంటివాటి సమాచారం అవసరం ఉంటుంది. 2013 ప్రిలిమ్స్ జనరల్ స్టడీస్ అంశం పశ్నల సంఖ్య భారత దేశ చరిత్ర, స్వాతంత్రోద్యమం 16 జాగ్రఫీ 20 పాలిటీ 17 ఎకానమీ 18 ఎకాలజీ 7 జనరల్ సైన్స్ 22 రిఫరెన్స్: ఎన్సీఈఆర్టీ పుస్తకాలు (హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, సైన్స్). ఇండియా ఇయర్ బుక్, ఎకనమిక్ సర్వే, బడ్జెట్. యోజన, కురుక్షేత్ర మేగజీన్లు. హిస్టరీ: ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్- బిపిన్‌చంద్ర; మాడర్న్ ఇండియా- బిపిన్‌చంద్ర; హిస్టరీ ఆఫ్ మెడీవల్ ఇండియా- సతీశ్ చంద్ర. జాగ్రఫీ: ఆక్స్ఫర్డ్ అట్లాస్; సర్టిఫికెట్ ఫిజికల్ అండ్ హ్యూమన్ జాగ్రఫీ- గో చెంగ్ లియోంగ్. ఎకానమీ: ఇండియన్ ఎకానమీ- దత్తా అండ్ సుందరమ్; ఇండియన్ ఎకానమీ- మిశ్రా అండ్ పూరి. సైన్స్- సైన్స్ రిపోర్టర్. పాలిటీ- యాన్ ఇంట్రడక్షన్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా- డి.డి.బసు. అవర్ కాన్స్టిట్యూషన్- సుభాష్ కశ్యప్; అవర్ పార్లమెంట్- సుభాష్ కశ్యప్. ముఖ్యమైన తేదీలు: నోటిఫికేషన్ తేదీ: మే 17, 2014. దరఖాస్తుకు చివరి తేదీ: జూన్ 16, 2014. ప్రిలిమ్స్ తేదీ: ఆగస్టు 24, 2014. సివిల్స్ మెయిన్స్: డిసెంబర్ 14, 2014 నుంచి -
వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
2న వేర్వేరుగా పరీక్షలు 64 వీఆర్వో పోస్టులకు 54,013 దరఖాస్తులు 403 వీఆర్ఏ పోస్టులకు 7,592 దరఖాస్తులు వీఆర్వోకు 115, వీఆర్ఏకు 12 పరీక్షా కేంద్రాలు సాక్షి, మచిలీపట్నం : జిల్లాలో ఉద్యోగ పరీక్షకు నిరుద్యోగ యువత సిద్ధమైంది. వీఆర్వో (గ్రామ పరిపాలనాధికారులు), వీఆర్ఏ (గ్రామ సహాయకుల)) పోస్టులకు పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. ఫిబ్రవరి 2న ఉదయం వీఆర్వో పోస్టులకు, మధ్యాహ్నం వీఆర్ఏ పోస్టులకు పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు పర్యవేక్షణలో పరీక్ష కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది నియామకం, వారికి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు బుధవారానికి పూర్తయ్యాయి. ప్రత్యేక చర్యలు ఇవీ... వీఆర్వో, వీఆర్ఏ పరీక్షలు సక్రమంగా జరిగేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇన్విజిలేటర్లకు, చీఫ్ సూపరింటెండెంట్లకు, సిట్టింగ్ స్క్వాడ్లకు, ఫ్లయింగ్ స్క్వాడ్లకు, పరిశీలకులకు బుధవారం ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండే పరీక్షా కేంద్రాలను ఏర్పాటుచేశారు. పరీక్ష సమయంలో విద్యుత్ కోత లేకుండా ఏపీ ట్రాన్స్‌కో ఎస్ఈకి ఆదేశాలు ఇచ్చారు. పరీక్షలు జరిగే తీరును వీడియో తీయిస్తారు. పరీక్షా కేంద్రాల సమీపంలో 144 సెక్షన్ అమలులో ఉంటుంది. పరీక్షా కేంద్రాలకు సమీపంలోని జిరాక్స్ షాపులు మూసివేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు హాల్‌టిక్కెట్‌తో మాత్రమే రావాలి. సెల్ఫోన్లు, కాలిక్యులేటర్లు అనుమతించరు. కంట్రోల్ రూం ఏర్పాటు.. పరీక్షలు సజావుగా జరిగేలా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అధిగమించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయంలో ల్యాండ్‌లైన్ నంబర్ 0866 2574454, మొబైల్ నంబర్ 92900 09918లకు రాత్రి ఎనిమిది గంటల వరకు సమాచారం ఇవ్వొచ్చు. ఎప్పటికప్పుడు పరీక్షలను పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా 13 మంది మానిటరింగ్ సెల్ ఇన్చార్జిలను నియమించారు. మొత్తం 127 పరీక్షా కేంద్రాల ఏర్పాటు జిల్లాలో 64 గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్వో) పోస్టులు ఖాళీగా ఉండగా 54 వేల 13 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. 403 గ్రామ రెవెన్యూ అసిస్టెంట్ (వీఆర్ఏ) పోస్టులు ఖాళీగా ఉండగా 7,592 మంది దరఖాస్తులు చేశారు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులు రెండింటికీ కొందరు దరఖాస్తు చేసే అవకాశం ఉండటంతో ఈ రెండు పరీక్షలను ఒకే రోజున వేర్వేరు సమయాల్లో నిర్వహిస్తున్నారు. ఈ నెల 2న ఉదయం 10 గంటల నుంచి 12 వరకు వీఆర్వో, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు వీఆర్ఏ పోస్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. విజయవాడ నగరంతో పాటు దాని పరిసర ప్రాంతాల్లో ఈ పరీక్షలు నిర్వహించేలా కేంద్రాలను ఎంపిక చేశారు. వీఆర్వో పరీక్షల కోసం 115, వీఆర్ఏ పరీక్షల కోసం 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. పరిశీలకులుగా జిల్లా స్థాయి అధికారులను నియమించారు. వీఆర్వో పరీక్షలకు 15 జోన్లు.. 38 రూట్లుగా, వీఆర్ఏ పరీక్షలకు ఒక జోన్.. నాలుగు రూట్లుగా విభజించారు. పరీక్షలు సజావుగా నిర్వహించేలా 115 మంది చీఫ్ సూపరింటెండెంట్లను, 129 మంది సిట్టింగ్ స్క్వాడ్, 13 మంది ఫ్లయింగ్ స్క్వాడ్, 17 మంది పరిశీలకులను నియమించారు. వ్యవధి దాటితే అనుమతించం విజయవాడ సిటీ : గ్రామ పరిపాలనాధికారులు, గ్రామ సహాయకుల పోస్టుల భర్తీకి ఫిబ్రవరి రెండున జరగనున్న పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు తెలిపారు. పరీక్షలు సరిగ్గా 10 గంటలకు ప్రారంభిస్తామని, ఆ తరువాత వచ్చినవారిని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపేస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు హాజరు కావాలని ఆయన సూచించారు. బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ సర్వీసులో ఉండి పరీక్షలకు హాజరవుతున్న అభ్యర్థులు విధిగా వారి శాఖాధిపతుల అనుమతి పొందాల్సి ఉందన్నారు. నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులకు సూచనలివీ... హాల్టిక్కెట్లకు సంబంధించి అభ్యర్థులదే పూర్తి బాధ్యత. వెబ్సైట్లలో అభ్యర్థులే డౌన్లోడ్ చేసుకోవాలి. హాల్‌టిక్కెట్‌పై ఫొటోలు సక్రమంగా లేకపోయినా, కనబడకపోయినా, అభ్యర్థి తనకు సంబంధించిన మూడు పాస్‌పోర్టు సైజు ఫొటోలను గెజిటెడ్ ఆఫీసర్‌తో ధృవీకరించి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. పరీక్షా కేంద్రంలోకి హాజరైన అభ్యర్ధులను పూర్తి టైము అయ్యే వరకు బయటకు వెళ్లకూడదు. పరీక్షా కేంద్రాల వద్ద సెల్ఫోన్లు భద్రపరిచేందుకు ఎటువంటి కౌంటర్లూ ఏర్పాటు చేయటం లేదు. ఎవరి వస్తువులు వారే భద్రపరుచుకోవాలి. -
క్యూ3లో ఐటీ అంతంతే!
న్యూఢిల్లీ: దేశీ ఐటీ కంపెనీలకు ఈ ఏడాది మూడో త్రైమాసికంలో (క్యూ3) రాబడుల వృద్ధి అంతంతమాత్రంగానే ఉండొచ్చా? అవుననే అంటున్నారు విశ్లేషకులు. సెప్టెంబరు త్రైమాసికంతో పోలిస్తే డిసెంబర్ క్వార్టర్లో టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి దిగ్గజ ఐటీ కంపెనీల ఆదాయల్లో 2-4 శాతం మాత్రమే వృద్ధి ఉండొచ్చనేది బ్రోకరేజి సంస్థల అంచనా. ‘అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్ సాధారణంగా ఐటీ కంపెనీలకు కాస్త బలహీనంగా ఉంటుంది. క్లయింట్ల దేశాల్లో సంవత్సరాంతపు మూసివేతలు, సెలవుల కారణంగా క్యూ3లో తక్కువ పనిదినాలుంటాయి. ఈ పరిణామాలన్నీ బేరీజు వేస్తే.. ఈ క్వార్టర్లో ఆదాయ వృద్ధి 3.2 శాతానికి పరిమితం కావచ్చు’ అని నొమురా ఈక్విటీ రీసెర్చ్ తన నివేదికలో పేర్కొంది. ఆదాయాల వృద్ధిలో టీసీఎస్, విప్రో కాస్త ముందుండొచ్చని... ఇన్ఫీ వెనుకబడొచ్చని అంచనా వేసింది. అయితే, కాగ్నిజంట్, హెచ్‌సీఎల్ టెక్, టెక్ మహీంద్రాలకు క్యూ3 మెరుగ్గా ఉండే అవకాశం ఉందని కూడా నొమురా తెలిపింది. ఇన్ఫీతో బోణీ... 10న ఈ నెల 10న ఇన్ఫోసిస్ ఫలితాలతో క్యూ3 ఆర్థిక ఫలితాలు ఆరంభం కానున్నాయి. తర్వాత వరుసలో హెచ్‌సీఎల్ టెక్(16న), విప్రో(17న) ఉన్నాయి. టీసీఎస్ ఇంకా ఫలితాల తేదీని ప్రకటించలేదు. కాగా రిటైల్, తయారీ, సేవలు తదితర రంగాల్లోని కంఎనీల్లో ఐటీ వ్యయాల తగ్గుముఖం, సంవత్సరాంతంలో ప్లాంట్ల మూసివేతలు, తక్కువ పనిదినాల ప్రభావంతో క్యూ3లో ఐటీ కంపెనీల రాబడుల వృద్ధిని తగ్గించవచ్చని ఏంజెల్ బ్రోకింగ్ పేర్కొంది. రూపాయి ప్రభావం కూడా... గడిచిన మూడునెలల్లో సగటున రూపాయి విలువ కాస్త పెరగడం కూడా ఆదాయ వృద్ధిపై ప్రతికూల ప్రభావం చూపొచ్చని, గత త్రైమాసికంతో పోల్చినపుడు ఆపరేటింగ్ మార్జిన్లు 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒక శాతానికి సమానం) మేర తగ్గొచ్చనేది ఏంజెల్ అంచనా. క్యూ3లో రూపాయి ప్రాతిపదికన టాప్ ఐటీ కంపెనీల ఆదాయాల్లో వృద్ధి 1-3 శాతంగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. టయర్-2 ఐటీ కంపెనీల విషయంలో ఈ వృద్ధి 0.5-2.7 శాతంగా అంచనా. అయితే, రానున్న క్వార్టర్లలో కంపెనీల పనితీరు బాగానే ఉంటుందని ఏంజెల్ బ్రోకింగ్ వెల్లడించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఐటీ సేవలకు డిమాండ్ మెరుగుదల కొనసాగవచ్చని కూడా అభిప్రాయపడింది. యూరప్‌లో ఆఫ్‌షోర్ సేవల విస్తరణ, అమెరికా ఆర్థిక వ్యవస్థ రికవరీ నేపథ్యంలో వ్యయాలు పెరిగొచ్చనే అంచనాలే దీనికి కారణమని తెలిపింది.