
శ్మశానానికి తరలిపోతున్న చెట్లు
విశ్లేషణ
⇒అవినీతిని నిలదీసే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం ఇచ్చింది. పెద్ద
⇒అవినీతి కుంభకోణాలను మాత్రమే మీడియా పట్టించుకుంటుంది. కాని
⇒కొన్ని లక్షల సంఖ్యలో చిన్న స్థాయి అవినీతి రోజూ జరుగుతూ ఉంటుంది.
రాజధాని ఢిల్లీలో గాంధీ పేరున ఒక పెద్ద ప్రదర్శన శాల, గ్రంథాలయం ఉంది. దాని చుట్టూ తోటలు, చెట్లు, పచ్చదనం పుష్కలం. ఎక్కడ ధనం ఉంటుందో అక్కడ అవి నీతి నరకం, ఎక్కడ పచ్చదనం ఉంటుందో అక్కడ అవినీతి నరకడం ఉంటుంది. భ్రష్టాచా రానికి ఎవరు ఏమిటీ అనే తేడా ఉండదు. నిర్వాహకులు సహకరిస్తే అవినీతి ఎవరి పేరునైనా పరిఢవిల్లుతుంది. జాతీయ గాంధీ ప్రదర్శనశాల ఆవరణలో చెట్లను నరక డం వెనుక అవినీతిని ఒక ఆర్టీఐ మిత్రుడు నిలదీశాడు. డబ్బేమైనా చెట్లకు కాస్త్తుందా అని మనవాళ్లు అంటూ ఉంటారు. చెట్లు నరికితే డబ్బే డబ్బు అని ఈ ఆర్టీఐ కథ నిరూపించింది. జీఎల్ వర్మ తరచూ గాంధీ గ్రంథాల యానికి వెళ్తూ ఉంటారు. ఓ రోజు 25 చెట్లు కుప్పకూలి పోవడం చూసి ఆశ్చర్యపోయాడు.
తుపాను, గాలి వాన కాదు, డబ్బు గొడ్డలి దెబ్బకు కూలిపోయాయి. మ్యూజి యం వెనుక కూడా కొన్ని చెట్లు కూల్చారు. కూలే ప్రమా దం లేనపుడు చెట్లను కూకటివేళ్లతో సహా కూల్చవలసిన అవసరం ఏమిటి? ఈ మ్యూజియం నిర్వహణ బాధ్యత తీసుకున్న ఎన్‌జీఓకు అప్పగించారు వారే చెట్లు కూల్చా రని అందుకు కారణాలు, ఏ చర్యలు తీసుకున్నారో, చెట్లు కూల్చడానికి అనుమతుల వివరాలు ఇవ్వాలని అడిగారు. మామూలుగానే ఇటువంటి ప్రశ్నలకు జవా బు ఇవ్వరు. ఇవ్వలేదు. మొదటి అప్పీలులో అధికారి ఇచ్చి తీరాలని ఆదేశించారు. అయినా ఇవ్వకపోవడం పీఐఓలకు అలవాటైంది.
పెరిగిపోయిన చెట్లను సమంగా కత్తిరించడానికి ఉన్న అనుమతిని చెట్లను పూర్తిగా నరికివేయడానికి వాడుతున్నారు. 2013లో గాంధీ మ్యూజియం నుంచి 67 చెట్లు శ్మశానాలకు తరలిపోయాయి. సమంగా కత్తి రించే అనుమతి ఇవ్వడానికి కొన్ని షరతులు ఉన్నాయి. కత్తిరించే ముందు, తరువాత చెట్లను ఫొటో తీయాలి. తీయలేదు. కత్తిరించిన కొమ్మలను పుల్లలను శ్మశానా లకు విక్రయించే అవకాశం ఉంది. సత్ నగర్ అనే శ్మశా నంలో ఆ పుల్లలను అమ్మినట్టుగా దొంగ రశీదులు తయారు చేశారని వర్మ అనుమానిస్త్తున్నారు. నిజంగా మామూలు పుల్లలే అయితే దగ్గరలో ఉన్న ఏ శ్మశాన వాటిక నిర్వాహకులైనా తీసుకునేవారు.
దగ్గరలో రెండు చోట్ల అటువంటి రశీదులు ఇవ్వడానికి నిర్వాహకులు అంగీకరించకపోవడం వల్ల చాలా దూరం వెళ్లి రశీదులు సంపాదించారని. అంటే చెట్లు ఎక్కడో అమ్మేసి శ్మశా నాల్లో అమ్మినట్టు రికార్డు తయారు చేసి ఉంటారని దర ఖాస్తుదారు వర్మ ఆరోపించారు. కనుక ఆ పనులకు సం బంధించిన అన్ని కాగితాలు రశీదులు అనుమతులు ఫొటోల ప్రతులు ఇవ్వాలని, అందుకు కాపీ తయారు చేసే ఖర్చు భరిస్తానని వర్మ వాదించారు. అవినీతి బయ టపడుతుందనే భయంతో ఏవో సాకులతో జవాబులు ఇవ్వడం లేదని, కావలసిన కాగితాల ధృవపత్రాలు ఇవ్వ డం లేదని వర్మ కమిషన్‌కు వివరించారు.
నాలుగు నెలల కాలహరణం తరువాత ఇచ్చిన సమాచారం అసం పూర్ణం అనీ, ఇంకా ఎంతో దాచారని, ఇచ్చిన సమాచా రం కూడా తప్పుల తడకలుగా ఉందని ఆయన వాదిం చారు. చెట్లు నరికి, తరలించి అమ్మివేయడంలో కొందరు అటవీ సంరక్షణాధికారుల హస్తం కూడా ఉందని ఆయ న అన్నారు. ఉప అటవీ సంరక్షణాధికారి ఈ చెట్లను నర కడానికి ముందు తరువాత కూడా ఇక్కడికి వచ్చి చూశా రు. అంటే ఖచ్చితంగా వారి హస్తం కూడా ఉన్నట్టే అని ఆయన వివరించారు. ఉద్యానవనం మధ్య ఉన్న మ్యూజియం నిర్వహణలో ఇటువంటి అక్రమ లాభాల ను పొందే అవకాశాలున్నాయి. ఒక్క చెట్టు విలువ కనీ సం 28 వేల రూపాయలు ఉంటుందని, మొత్తం 19 లక్షల రూపాయల దాకా అక్రమార్జన ఉండి ఉంటుందని ఆయన అనుమానం.
ఇంతే కాదు 2012లో కూడా ఈ విధంగానే చెట్లు నరికారని కనీసం ఐదు లక్షల రూపాయలు అక్రమంగా సంపాదించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపైన ఓపీ నారంగ్ అనే అధికారి విచారణ జరిపారు. ఎస్‌ఎస్ రహేజా అనే అధికారి చెట్లు నరికినా, వాటిని బయటకు తరలించినా మౌనంగా ఉన్నారంటే దానికి కారణం స్వప్రయోజనాలే అనే అనుమానం వస్తుందని నారంగ్ తమ నివేదికలో వివరించారు.
వర్మ అడిగిన మొత్తం సమాచారం ఇవ్వాలని, కోరిన కాగితాల ధృవీకరించిన ప్రతులను కూడా ఇవ్వా లని రెండో అప్పీలులో సమాచార కమిషనర్‌గా ఆదేశిం చవలసివచ్చింది. మొదటి అప్పీలు అధికారి ఆదేశించినా సమాచారం ఇవ్వకపోవడం ద్వారా సమాచార హక్కును భంగపరిచారని, అసమగ్ర సమాచారం తప్పుడు సమా చారం ఇచ్చారని, అందుకు సెక్షన్ 20 కింద జరిమానా ఎందుకు విధించకూడదో వివరించాలని షోకాజ్ నోటీసు కూడా జారీ చేయడం జరిగింది.
అవినీతిని నిలదీసే అవకాశాన్ని సమాచార హక్కు చట్టం ఇచ్చింది. పెద్ద అవినీతి కుంభకోణాలను మాత్ర మే మీడియా పట్టించుకుంటుంది. కాని కొన్ని లక్షల సం ఖ్యలో చిన్న స్థాయి అవినీతి రోజూ జరుగుతూ ఉంటుం ది. దీన్ని ఏసీబీ కూడా పట్టించుకోదు. బ్లాక్ మెయిల్ చేసుకుని బతికే వారికి తప్ప పత్రికలకు ఈ విషయం పట్టదే. పెద్ద కుంభకోణాలు పెద్ద నేరాలు, వీఐపీ లంచా లకు ఇచ్చిన ప్రాధాన్యం ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇవ్వకపోవడం వల్ల ఆర్టీఐ ఒక్కటే దిక్కు.
మాడభూషి శ్రీధర్
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com.