
మాడభూషి శ్రీధర్
విశ్లేషణ
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సెక్షన్ 4(1) బి కింద సొంతంగా పర్యావరణ అటవీ మంత్రిత్వశాఖ ఈ పాటికే స్వయంగా అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాల్సింది. కానీ దీనికి సంబంధించి ప్రభుత్వ రికార్డులు దొరకకపోవడం తీవ్రమైన వైఫల్యం. అధికారిక ఫైళ్లు పోవడానికి వీల్లేదు.
ఫైళ్లు దొరకడం లేదు, పోయా యి, అనేకచోట్ల చెల్లాచెదు రుగా ఉన్నాయి. కార్యాలయ విభజన వల్ల ఇవ్వలేకపోతు న్నాం. మనకు తరచూ వినిపిం చే సాకులు ఇవి. ఇవేవీ ఆర్టీఐ చట్టం అంగీకరించిన మినహా యింపులు కాదు. ప్రభుత్వ రి కార్డులు దొరకకపోవడం తీవ్ర మైన వైఫల్యం. ఫైళ్లు పోవడానికి వీల్లేదు. పాలన, పాల సీ నిర్ణయాల దస్తావేజులు లేకుండా పోతే, దాచకపోతే అది తీవ్రమైన అసమర్థత. సుపాలన సంగతేమో గాని, పాలనే ఉండదు. ఇది నిష్పాలన కాదు, దుష్పాలన.
పోలవరం జాతీయ ప్రాజెక్టు వివరాలు అడిగిన డి. సురేశ్ కుమార్ హైదరాబాద్ నుంచి వీడియో ద్వారా విచారణలో పాల్గొన్నారు, పర్యావరణ మంత్రిత్వశాఖ సమాచార అధికారి డాక్టర్ పీవీ సుబ్బారావు (పర్యా వరణ శాస్త్రవేత్త) తెలుగు వారు. నేనూ, నా పీఏ కూడా తెలుగువారం కావడంతో ఈ కేసు విచారణను జాతీయ సమాచార కమిషన్‌లో తొలిసారి తెలుగులో జరిపే అవ కాశం కలిగింది. కీలక పత్రాలు, ప్రశ్నలు, సమాధానాలు అన్నీ ఆంగ్లంలో ఉన్నా, అనేక వివరాలు, వాదాలు ప్రతి వాదాలు తెలుగులో సాగాయి. కనుక ఇంగ్లిష్ తీర్పుతో పాటు తెలుగులో కూడా తీర్పు ఇద్దామనుకున్నాం. (సీఐసీ డాట్ ఎన్‌ఐసీ డాట్ ఇన్ అధికారిక వెబ్ సైట్) ఆంగ్లంతో పాటు హిందీ, ప్రాంతీయ భాషల్లోనూ విచా రణ జరిగే వీలుంటే భాష రాని కారణంగా తెలుసు కోలేకపోయే పరిస్థితి ఎవరికీ రాదు. పరాయి భాషలోని చట్టాలు, హక్కులు అమలు కాని పరిస్థితిని ఏ విధంగా తొలగించాలి?
డి. సురేశ్ కుమార్ 1994 నుంచి ఇప్పటివరకు పోల వరం వివరాలు అడుగుతున్నారనీ, కొన్ని పాత దస్తా వేజులు వెతకవలసి ఉందని, ఇవ్వలేమని, ప్రభావ అంచనా విభాగం వారు ఎన్నో ైఫైళ్లు ఇస్తే తప్ప పూర్తి సమాచారం లభించదని, తమ డివిజన్ జోర్‌బాగ్ నుం చి సీజీఓ కాంప్లెక్సుకు మారడం వల్ల చాలా దస్తావేజులు చెల్లాచెదురయ్యాయని సీఐఓ చెప్పారు. ఆ సాకులెన్ని ఉన్నా మొత్తం సమాచారం ఏడు రోజుల్లో ఇవ్వాల్సిందే నని మొదటి అప్పీలు అధికారి ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పరిశోధన, సర్వే కోసం షరతులతో కూడిన అనుమతిని అదనపు సంచాలకులు డాక్టర్ భౌమిక్ సెప్టెంబర్ 19, 2005 నాటి లేఖను మాత్రమే ఇచ్చారు.
పశ్చిమగోదావరి, కృష్ణా, తూర్పుగోదావరి విశాఖ పట్టణం జిల్లాలలోని ఎత్తు ప్రాంతాలలో 7.20 లక్షల ఎక రాల భూమికి సాగునీటిని అందించేందుకు 21 క్యూ మెక్స్ మంచినీటిని సరఫరా చేసేందుకు, 960 మెగా వాట్ల జలవిద్యుచ్ఛక్తి ఉత్పాదనకు, ఇతర పారిశ్రామిక అవసరాలకు ప్రతిరోజూ 1.80 గీ 10 క్యూమెక్స్ జలం పంపిణీ చేయడానికి పోలవరం గ్రామంలో ఆర్థర్ కాటన్ బ్యారేజీకి 42 కి.మీ. ఎగువన పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టును ప్రతిపాదించారు. దీనివల్ల 276 గ్రామాలలో లక్షా 17 వేల 34 మంది ఆదిమవాసులు నిర్వాసితులవుతారు. ఖమ్మం, తూర్పు గోదావరి, పశ్చి మగోదావరి జిల్లాల్లోని ఏడు మండలాల్లో, ఛత్తీస్‌గఢ్ లోని 13 గ్రామాల్లో, ఒడిశాలోని 13 గ్రామాల్లో, 38 వేల 186 హెక్టార్ల భూమి మునిగిపోతుంది. రాష్ర్ట ప్రతిపాద నలు, ప్రాజెక్టు స్థల నివేదిక పరిశీలించిన తరువాత కొన్ని షరతులతో సర్వేకు అనుమతి ఇచ్చినట్టు భౌమిక్ పేర్కొ న్నారు. పంటల వ్యవస్థ, పర్యావరణ అధ్యయనం, కమాండ్ ఏరియా అభివృద్ధి, నీటి నిలువ సమస్య, పున రావాసం, భూకంప ప్రమాదం, ప్రమాద నిర్వహణ ప్రణాళిక, మౌలిక వనరుల నిర్మాణం, రోడ్లు, క్వారీల నిర్మాణం మొదలైన వివరాలతో కూడిన సమగ్రమైన పర్యావరణ ప్రభావ నివేదికను ఈ లేఖ అందిన 18 నెలల్లో ఇవ్వాలని తొలి షరతు. ప్రజా విచారణలో వచ్చి న సూచనలను జత చేయాలి. సమగ్రమైన పర్యావరణ ప్రభావ నివేదికను తయారు చేసేందుకు నిర్దిష్ట స్థలంలో సర్వే పరిశోధనల కోసం మాత్రమే ఈ అనుమతి అని గమనించాలి. ఎట్టి పరిస్థితిలోనూ ఈ అనుమతిని పర్యా వరణ అనుమతిగా పరిగణించడానికి వీల్లేదని, అను మతి వస్త్తుందని అంచనా వేసి శాశ్వత నిర్మాణాలేవీ చేప ట్టరాదనీ స్పష్టంగా పేర్కొన్నారు. పర్యావరణ వివరా లన్నీ పొందుపరచి ప్రణాళికలు రూపొందిన తరువాత పర్యావరణ అనుమతిని కోరాలి. అటవీ భూములను సేకరించడానికి అటవీ మంత్రిత్వ శాఖ అనుమతిని ప్రత్యేకంగా తీసుకోవాలి. ప్రాజెక్టు ఆర్థిక స్తోమతను, ప్రయోజనాన్ని అంచనా వేయడానికి వీలుగా పర్యావ రణ సంబంధమైన నిధి అవసరాలను బడ్జెట్‌ను కూడా సమర్పించాలి. పరిశోధన దశలోనే మంత్రిత్వ శాఖ అవసరమైతే పర్యావరణ రక్షణకు సంబంధించి అదనపు చర్యలను సూచించే హక్కు కలిగి ఉంటుందని కూడా ఈ లేఖలో పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని సెక్షన్ 4(1) బి కింద సొంతంగా పర్యావ రణ అటవీ మంత్రిత్వ శాఖ ఈ పాటికే స్వయంగా అధి కారిక వెబ్‌సైట్‌లో ఉంచాల్సింది. తొలి సర్వే అనుమతి, పదేళ్ల తరువాత పునఃపరిశీలన కాగితాలను, మిని ట్స్‌ను, కేంద్ర ప్రభుత్వం ఏపీ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాలకు రాసిన ఉత్తరాలు, ఆ రాష్ట్రాలు ఇచ్చిన ప్రత్యు త్తరాల ప్రతులను నెలరోజుల్లో ఇవ్వాలని పర్యావరణ మంత్రిత్వ శాఖను సీఐసీగా ఈ రచయిత ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
(డి. సురేశ్ కుమార్ వర్సెస్ పర్యావరణ
మంత్రిత్వశాఖ కేసులో సీఐసీ తీర్పు ఆధారంగా)
(వ్యాసకర్త కేంద్ర సమాచార కమిషనర్)
professorsridhar@gmail.com