డేటింగ్ ఏ టైంలో చేయాలో తెలుసా?
డేటింగ్ కోసం ఆన్ లైన్ పాట్నర్ దొరకడం లేదా.. అందుకోసం విసిగివేసారి పోతున్నారా.. అయితే, మీకోసం నీల్సన్ సర్వే ఉపశమనం కలిగించే అంశాలు వివరించింది. ఎన్నో డేటింగ్ యాప్స్ ఉన్నా.. ప్రధానంగా గుర్తొచ్చేది టిండర్, ఆక్కుపిడ్. ఈ యాప్ లలోకి వెళ్లినవారు.. అమ్మాయి అయితే తమకు నచ్చిన అబ్బాయిని, అబ్బాయి అయితే తమకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకొని ఏం చక్కా డేటింగ్ చేస్తుంటారు. కానీ, సరైన టైంలో అందులోకి లాగిన్ అవ్వకుంటే మాత్రం ప్రయోజనం ఉండదు.
అందుకే, వీటిని ఉపయోగించే వారి డేటాను పరిశీలించిన నీల్సన్ ఈ రెండు యాప్ లను ఏ సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారో పరిశీలించి రాత్రి 9గంటల ప్రాంతంలో ఎక్కువమంది డేటింగ్ లో ఉంటున్నారని, ఆ సమయంలోనే ఎక్కువమంది డేటింగ్ కోసం ఎదురుచూస్తుంటారని నీల్సన్ తెలిపింది. ఇప్పటి వరకు ఈ యాప్స్ను ఉపయోగిస్తున్నవారి జాబితాను పరిశీలించగా టిండర్ను ఉదయం 10గంటలకు ఓ మోస్తరుగా 45శాతంమంది డేటింగ్ చేస్తుండగా రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో 55శాతంమంది ఉపయోగిస్తున్నారు.
ఇక ఆక్ కుపిడ్ యాప్ లో అదే ఉదయం పదిగంటలకు 50 నుంచి 55శాతం మంది డేటింగ్ చేస్తుండగా రాత్రి తొమ్మిదిగంటలకు 60 నుంచి 65శాతం మంది ఉపయోగిస్తున్నారు. ఇక తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో మాత్రం రెండు యాప్స్ను ఉపయోగించే వారి సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. ఈ డేటా ప్రకారం ఈ రెండు యాప్ లను కూడా రాత్రి తొమ్మిది గంటలకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారని ఆన్ లైన్లో డేటింగ్ చేసేందుకు రాత్రి 9గంటలే సరైన సమయం అన్నమాట.