Tinder
-
‘5వేల మందిని చూశాడు..చివరికి ఓ అమ్మాయితో పెళ్లికి సిద్ధమయ్యాడు’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ చాట్‌జీపీటీ ఇప్పుడు మరో సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఇన్ని రోజులు యూజర్లు వ్యాపార వ్యవహారాల్ని చక్కబెట్టుకునేందుకు చాట్‌జీపీటీని ఉపయోగించే వారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చాట్‌జీపీటీతో తమ గుణగణాలకు సరిపోయే భాగస్వామిని వెతుక్కుంటున్నారు. తాజాగా, రష్యాకు చెందిన అలెగ్జాండర్ జాదన్ ఇప్పుడు సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారారు. డేటింగ్ యాప్ టిండర్‌లో తనకు తగ్గ యువతిని పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. కానీ విఫలమయ్యాడు. తాను కొత్తగా ఓ అమ్మాయిని కలిసిన ప్రతి సారి ఏదో ఒక ప్రశ్నలు తలెత్తేవి. ఈ ప్రశ్నల ప్రవాహానికి పులిస్టాప్ పెట్టేందుకు చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. చాట్‌జీపీటీని టిండర్‌లో మ్యాచ్మేకర్గా మార్చాడు. ఇందుకోసం ప్రత్యేకంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌ను ఉపయోగించి ఓ బాట్‌ను తయారు చేశాడు. ఆ బాట్ సాయంతో సుమారు టిండర్‌లో తనకు సరిపోయే అమ్మాయి కోసం సుమారు 5240 మందిని తన ప్రొఫైల్‌తో మ్యాచ్ చేసి.. అందులో ఒక్క అమ్మాయిని త్వరలో వివాహం చేసుకోనున్నాడు. Сделал предложение девушке, с которой ChatGPT общался за меня год. Для этого нейросеть переобщалась с другими 5239 девушками, которых отсеила как ненужных и оставила только одну. Поделюсь, как сделал такую систему, какие были проблемы и что вышло с остальными девушками. Тред pic.twitter.com/fbVO7OmZhF — Aleksandr Zhadan (@biblikz) January 30, 2024 టిండర్‌లో తనని ఏడాది నుంచి కమ్యునికేట్ అవుతున్న యువతిని చాట్‌జీపీటీ సాయంతో ఆమెకు ప్రపోజ్ చేశాడు. ఇందుకోసం మెషిన్ లెర్నింగ్‌లో ఓ భాగమైన ఆర్టిఫిషియల్ న్యూరాల్ నెట్‌వర్క్‌తో 5240లో ఒక్క అమ్మాయిని ఎంపిక చేసుకోగలిగానని ట్వీట్ చేశాడు. ఇదంతా ఎలా సాధ్యమైంది? దానికి కథాకమామిషు ఏంటో చెప్పకనే చెప్పాడు. ‘నేను ఓ యువతిని గాఢంగా ప్రేమించాను. కానీ అన్వేక కారణాల వల్ల రెండేళ్లకే విడిపోవాల్సి వచ్చింది. ప్రేమ చేసిన గాయానికి తట్టుకోలేకపోయాను. కొన్ని నెలల పాటు తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. చివరికి దాన్ని నుంచి తేరుకునేందుకు టిండర్‌లో మరో యువతి కోసం ప్రయత్నించా. అలా ఒక యువతితో ప్రారంభమై 5240 మందిని వెతుక్కున్నాను. ఫలితం శూన్యం డేటింగ్ యాప్‌లో తనకు నచ్చిన అమ్మాయిని చూసుకోవడం, ఆమెతో చాటింగ్ చేయడం, నేరుగా కలుసుకోవడం ఇలా చేస్తుండేవాడిని. ఈ ప్రాసెస్‌లో లెక్కలేనన్ని అవమానాలు,రిజెక్షన్లు ఎదుర్కొన్నాను. ఫైనల్‌గా చాట్‌జీపీటీని ఆశ్రయించి నాలోని బాధను వెళ్లగక్కాను. నాకే ఎందుకిలా జరుగుతుందని చాట్‌జీపీని ప్రశ్నించా. ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టూల్‌ను తయారు చేశాను. చివరికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాట్ తనకు భార్యగా కరీనానే సరైన జోడిగా నిర్ణయించింది. త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోబోతున్నానంటూ అలెగ్జాండర్ జాదన్ తన కథను ముగించాడు. -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. మహిళకు పదే పదే ఫోన్ చేసి..
బనశంకరి(బెంగళూరు): ఇంటి నుంచి ఉద్యోగం, చవగ్గా వస్తువులు, ఈకేవైసీ పేరుతోనే కాదు ప్రేమ, స్నేహం చాటున సైబర్ నేరగాళ్లు జనాన్ని దోచుకుంటున్నారు. బెంగళూరులో ప్రైవేటు కంపెనీలో పనిచేసే 37 ఏళ్ల మహిళ. డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని నమ్మి రూ.4.5 లక్షలు మోసపోయింది. వివరాలు.. సుమారు నెలరోజులక్రితం టిండర్ యాప్‌లో అద్విక్ చోప్రా అనే పేరుతో ఓ వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. తనది ముంబై అని, లండన్‌లో మెడిసిన్ చదువుతున్నట్లు చెప్పాడు. ఇద్దరి మధ్య చాటింగ్, కాల్స్ సాగాయి. త్వరలో బెంగళూరుకు వచ్చి కలుస్తానని చెప్పాడు. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో దిగానని, తన వద్ద పైసా కూడా లేదని, ఖర్చుల కోసం డబ్బులు పంపాలని మోసగాడు ఆ మహిళకు ఫోన్ చేశాడు. సరేనని మూడు దఫాసల్లో రూ. 4.5 లక్షలను జమ చేసింది. తరువాత మరో రూ. 6 లక్షలు పంపాలని వంచకుడు డిమాండ్ చేయగా, మహిళకు అనుమానం వచ్చింది. అదే విషయమై అతన్ని ప్రశ్నించగా కాల్ కట్ అయ్యింది. యాప్‌లో ప్రొఫైల్ కూడా తొలగించాడు. బాధితురాలు సైబర్‌క్రై ం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. చదవండి: బంగారం గొలుసు కొట్టేసి.. కాపాడమని పోలీసులను వేడుకున్న దొంగ! -
సైబర్ నేరస్తుల సెక్స్టార్షన్
ప్రభుత్వ విభాగంలో జాయింట్ డైరెక్టర్ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి కొడుకు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఓ రోజు రాత్రి 10 గంటలకు ఫేస్‌బుక్‌లోని మెసెంజర్ ద్వారా వీడియో కాల్ వచ్చింది. ఆన్లైన్లోనే ఉన్న ఆ విద్యార్థి ఆన్సర్ చేశాడు. ఎదురుగా ఓ అమ్మాయి న్యూడ్ పొజిషనల్లో ఉండి మాట్లాడింది. ఓ 30 సెకన్లు కాల్‌లోనే ఉన్న ఆ అబ్బాయి తర్వాత కట్ చేశాడు. అంతలోనే అదే పేరుతో ఉన్న ఐడీ నుంచి అతడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ రాగా యాక్సెప్ట్ చేశాడు. అంతే.. అమ్మాయితో న్యూడ్‌గా చాట్ చేశావని అతడి కాంటాక్ట్ లిస్టులో ఉన్న కుటుంబీకులు, సన్నిహితులకు వీడియో షేర్ చేస్తానని బెదిరింపులు మొదలయ్యాయి. సమస్య నుంచి బయటపడేందుకు అవతలి వ్యక్తి అడిగిన రూ.10 వేలను ఫోన్ పే ద్వారా ఆ అబ్బాయి బదిలీ చేశాడు. పది వేలతో మొదలైన వ్యవహారం రూ.1.50 లక్షల వరకు వెళ్లింది. అయినా వేధింపులు ఆగలేదు. స్నేహితుడి తండ్రి పోలీస్ అధికారి కావడంతో సంప్రదించాడు. సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసి సమస్య నుంచి బయటపడ్డాడు. ఇది కేవలం ఒకరకమైన బెదిరింపు వ్యవహారమే. ఇలాంటి మూడు, నాలుగు రకాల పద్ధతుల్లో బ్లాక్ మెయిల్ చేస్తూ యువతతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ప్రభుత్వ అధికారులు, ప్రొఫెషనల్ ఉద్యోగాల్లో ఉన్న వారి నుంచి సైబర్ నేరగాళ్లు భారీగా దండుకుంటున్నారు. ఫేస్బుక్, టిండర్, వాట్సాప్.. ఇలా మూడు వేదికల ద్వారా ఎదుటి వ్యక్తులను మానసికంగా హింసించి దోపిడీకి పాల్పడుతున్నారు. అశ్లీల వీడియోల లైవ్ లింక్‌ను వాట్సాప్, ఫేస్బుక్ మెసెంజర్ల ద్వారా షేర్ చేసి అవతలి వ్యక్తికి వీడియో కాల్ చేస్తారు. కాల్ ఆన్సర్ చేయగానే లైవ్ లింక్‌లో అశ్లీలత మొదలవుతుంది. దీనికి కొంత మంది యుక్త వయస్కులు ఆక్షరణకు గురై సైబర్ నేరస్థుడి చేతికి దొరికిపోతున్నారు. అవతలి వ్యక్తులు వీడియో కాల్‌ను ఆటోమేటిక్ రికార్డు చేసి బెదిరిస్తున్నారని సైబర్ ఎక్స్పర్ట్స్ తెలిపారు. ఎలా టార్గెట్ చేస్తారు? ఎవరైనా అమ్మాయి పేరు, నకిలీ ఫొటోతో నకిలీ ఫేస్బుక్ ఐడీని సైబర్ నేరగాళ్లు రూపొందిస్తారు. లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తికి ఫేస్బుక్లో ఆ ఐడీ ద్వారా ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడతారు. అవతలి వ్యక్తి యాక్సెప్ట్ చేయగానే మెల్లెగా చాట్‌లోకి లాగుతారు. అలా మొదలైన చాట్ కాస్తా మొబైల్ నంబర్లు ఇచ్చి పుచ్చుకునే వరకూ వెళ్తుంది. ఆ తర్వాత వాట్సాప్ చాట్‌లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడం.. అడల్డ్ కంటెంట్, న్యూడ్ చాట్ చేసుకునే వరకు తీసుకొస్తారు. ఇక్కడి నుంచే అసలు కథ మొదలవుతుంది. చాట్ నుంచి వీడియో కాల్స్‌లోకి లాగుతారు. అవతలి వైపు నుంచి రికార్డు చేసిన ఓ న్యూడ్ వీడియోను వాట్సాప్ కాల్లో లైవ్లాగా చిత్రీకరించి ఎదుటి వ్యక్తిని న్యూడ్ చాట్‌లోకి తీసుకొస్తారు. ఈ మొత్తం కాల్‌ను రికార్డు చేసి తర్వాత అదే వ్యక్తి వాట్సాప్‌కు వీడియో షేర్ చేస్తారు. ఇలా షేర్ చేసిన వీడియోతో డబ్బులివ్వకపోతే యూట్యూబ్‌లో పెడతామని బెదిరిస్తారు. యువతులను బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి అమ్ముకుంటున్నారని ప్రచారం చేస్తామని బ్లాక్ మెయిల్ చేస్తారు. ఇలాంటి ఎక్స్టార్షన్ కాల్స్ దాదాపు 90 శాతం.. రాత్రి 9 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట మధ్యే జరుగుతున్నాయని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. – సాక్షి, హైదరాబాద్ దేశంలో ఒక్క ఏడాదే 2.5లక్షల కేసులు వాట్సాప్, ఫేస్బుక్, టిండర్ ద్వారా సెక్స్ ఎక్స్టార్షన్ వ్యవహారంలో 2020లో (కరోనా సమయం) దేశవ్యాప్తంగా 2.5 లక్షల కేసులు నమోదయ్యాయని కేంద్ర హోం శాఖ లెక్కల్లో స్పష్టమైంది. రాజస్థాన్, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్ నుంచి ఇలాంటి నెట్‌వర్క్‌ను సైబర్ మాఫియా నడిపిస్తోందని దర్యాప్తు విభాగాల ద్వారా బయటపడింది. ఇలాంటి కేసులకు సంబంధించి 2021లో ఢిల్లీ పోలీసులు 70 మంది గ్యాంగ్‌ను అరెస్టు చేశా రు. రాష్ట్రంలోనూ సైబరాబాద్, హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్లలో ఇలాంటి కేసులు భారీగా నమోదవుతున్నాయి. సెక్స్ ఎక్స్టార్షన్ కు సంబంధించి గతేడాది 650కి పైగా కేసులు నమోదైనట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. భయపడొద్దు.. అశ్లీల వీడియో కాల్స్ వస్తే వెంటనే సంబంధిత అకౌంట్‌ను బ్లాక్ చేయడంతో పాటు బాధిత వ్యక్తి వారి ఫేస్బుక్ అకౌంట్‌ను తాత్కాలికంగా డీ యాక్టివ్ చేసుకుంటే మంచిది. ఆ వీడియో ద్వారా వాట్సాప్ కాంటాక్ట్ నుంచి ఎవరైనా బెదిరింపులకు పాల్పడితే సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయాలి. బయపడి సైబర్ నేరస్థుడికి డబ్బులు పంపితే వేధింపులు పెరుగుతాయని గుర్తించాలి. – ప్రసాద్ పాటిబండ్ల, డైరెక్టర్, సీఆర్‌సీఐడీఎఫ్ -
జల్సా రాజా: కాస్ట్లీ ట్రాప్‌తో ఎర.. నిండా మునిగిన యువతులెందరో!
అమ్మాయిలను పడేయడం అందరి వల్లా కాదురా.. అది ఒక ఆర్ట్ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ, ఆ పడేయడంలోనూ సినిమాటిక్ కోణాన్ని చూపించాడు ఓ గురుడు. ఈ టెక్నికల్ ఏజ్‌లో దేశ విదేశాల్లో అంతే హైటెక్ మోసానికి పాల్పడ్డాడు. ఊహించని రేంజ్ విలాసాలను ప్రదర్శించడమే కాదు.. అమ్మాయిలను అంతే ఎమోషనల్‌గా ముగ్గులోకి దించి చివరికి డబ్బుతో ఉడాయించాడు. ఆ దెబ్బకు దివాళా తీసి రోడ్డున పడ్డ ఆ అమ్మాయిలు.. తమ వ్యధను తెరపైకి ‘ది ట్విండర్ స్విండ్లర్’(ట్విండర్ మోసగాడు) తీసుకొచ్చి హాట్ టాపిక్‌గా మారారు. The Twinder Swindler యూకేలో నెంబర్ వన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా ఉంది. అంత క్రేజ్ ఎందుకు అంటారా? అది ఒక వాస్తవిక గాథ కాబట్టి!. డేటింగ్ పేరుతో ఓ వ్యక్తి చేసిన మోసం తాలుకా సాక్ష్యం ఇది. ది టిండర్ స్విండ్లర్ డాక్యుమెంటరీ.. గత కొన్నిరోజులుగా ట్రెండింగ్‌లో నిలవడమే కాదు.. ఈ కేసులోని బాధితుల, నిందితుడి తరపున చర్చనీయాంశంగా మారుతోంది ఇప్పుడు. ఆ మోసగాడి పేరు షిమన్ హయత్. ఇజ్రాయెల్ డైమండ్ మొఘల్ లెవ్ లెవెయివ్ కొడుకుగా సిమన్ లెవెయివ్ పేరుతో ప్రచారం చేసుకుంటూ డేటింగ్ యాప్ టిండర్‌లో డేటింగ్ వ్యవహారానికి తెర లేపాడు. ప్రైవేట్ విమానాల్లో విహారయాత్రలు, విలాసవంతమైన హోటళ్లలో లంచ్‌లు డిన్నర్లతో డేటింగ్ చేసిన అమ్మాయిలకు గాలం వేసేవాడు. ఆపై ఎమోషనల్ ట్రాప్‌తో వాళ్ల నుంచి డబ్బు తీసుకుని ఉడాయించేవాడు. అలా ఎంత మందిని మోసం చేశాడో తెలియదు. కానీ, 10 మిలియన్ డాలర్లకుపైనే మోసానికి పాల్పడినట్లు ఒక అంచనా. షిమన్ దెబ్బకు అప్పుల పాలై పీకలి లోతు అప్పులోకి మునిగిపోయిన ముగ్గురు యువతులు.. ఫండ్ రైజ్ ద్వారా కోలుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ది ట్విండర్ స్విండ్లర్ డాక్యుమెంటరీ వాళ్ల లాంటి ఎందరో బాధితులను వెలుగులోకి తీసుకొస్తోంది. తననూ ముగ్గులోకి దించే ప్రయత్నం చేశాడని, కానీ, అనుమానం రాగా.. తెలివిగా తప్పించుకున్నానని అర్జెంటీనాకు చెందిన ఓ యువతి వెల్లడించింది. అయితే 200 కే మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న షిమన్.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయడంతో పాటు ఈ వ్యవహారంలో తనను ఇరికించే కుట్ర జరుగుతుందంటూ చివరి మెసేజ్‌ను ఉంచడం కొసమెరుపు. రివెంజ్ తీర్చుకునేందుకు బాధిత యువతులందరూ ఏకమవుతున్న తరుణంలో.. షిమన్ కౌంటర్ యాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 2020లో ఇజ్రాయెల్ కోర్టు కేవలం 47 వేల డాలర్లు మాత్రమే చెల్లించాలంటూ తక్కువ శిక్షతో సరిపెట్టడం బాధితులను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడంతోపాటు శారీరకంగా, ఆర్థికంగా దోచుకున్న ఆ జల్సా రాజాకి సరైన గుణపాఠం చెప్పాలని పోరాడుతున్నారు. వీళ్లకు మద్దతు ఇచ్చే వాళ్లు కొందరైతే.. గుడ్డిన నమ్మి మోసపోయారంటూ బాధితులనే తిట్టిపోసేవాళ్లు మరికొందరు!. -
బాయ్‌ఫ్రెండ్‌గా కొనసాగాలంటే..బాండ్ మీద సంతకం చేయాల్సిందే..!
టిండర్ ఈ యాప్ గురించి మనలో చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా..! టిండర్ ఒక డేటింగ్ యాప్. ఈ యాప్‌తో తమకు నచ్చిన వ్యక్తులను పరిచయం చేసుకోని వారితో డేటింగ్ చేస్తూ వారి అభిరుచులను తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. ఈ యాప్‌తో కలుసుకున్న జంటలు కొన్ని పెళ్లి వరకు కూడా పోయాయి. మరి కొంత మందికి సరైన జోడి వెతుకులాటలో మోసపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. చదవండి: Apple : మూఢనమ్మకాలను నమ్ముతున్న ఆపిల్..! ఎంతవరకు నిజం..? తాజాగా అమెరికాకు చెందిన యానీ రైట్ అనే మహిళ టిండర్‌లో పరిచయమైన మైక్ హెడ్‌తో మొదటిసారి డేటింగ్ చేశాక తన బాయ్‌ఫ్రెండ్‌గా స్వీకరించడంకోసం విచిత్రమైన ఐడియాతో ముందుకొచ్చింది. గతంలో తనకు జరిగిన పొరపాటును తిరిగి పునరావృతం కాకుండా ఉండడం కోసం పకడ్బందీగా ఒక బిజినెస్ డీల్ లాగా 17 పేజీల బాండ్‌పై సంతకం చేసి తనకు హమీ ఇవ్వాలని కాబోయే బాయ్‌ఫ్రెండ్‌కు తెలిపింది. బాండ్లో ఉన్న కట్టుబాట్లకు కచ్చితంగా నడుచుకుంటాననే హమీ ఇస్తేనే బాయ్‌ప్రెండ్‌గా స్వీకరించడానికి సిద్ధమని మైక్ హెడ్‌తో పేర్కొంది. తొలుత షాక్‌కు గురైన మైక్ హెడ్ 17 పేజీల బాండ్‌పై సంతకం చేసి యానీకి బాయ్ ఫ్రెండ్‌గా కొనసాగుతున్నాడు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఇరువురు నిజాయితీని, ఒకరికొకరికి కావాల్సిన అవసరాలను తీర్చడంలో, ఇరువురు మధ్య స్పష్టమైన కమ్యూనికేషన్ ఉండాలని ఒప్పందంలో ఉన్నాయి. కాగా ఈ జోడీ ఈ బంధాన్ని బిజినెస్ డీల్‌గానే చూస్తామనడం కొసమెరుపు. చదవండి: అగ్రరాజ్యాలను వెనక్కినెట్టి సరికొత్త రికార్డు సృష్టించిన భారత్..! -
టిండర్... టిండర్..!
డేటింగ్ లవర్స్‌కి టిండర్ యాప్ ఒక వరంలా కనిపిస్తోంది. దీంతో యాప్ స్టార్స్‌లో వేగంగా డౌన్లోడ్ అవుతున్న యాప్‌గా టిండర్ టాప్‌ప్లేస్‌లో నిలిచింది. యాప్స్టోర్స్కు అత్యధికంగా ఆదాయాన్ని ఈ యాప్ సమకూరుస్తోంది. టిండర్ యాప్‌ను లైక్ చేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోందని ఆన్లైన్మార్కెట్ డేటా సంస్థ ’యాప్ అన్నే‘ తెలిపింది. ఆరు నెలల కాలంలో అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్స్, వాటి ర్యాంకింగ్స్‌ను ఈ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఈ ర్యాకింగ్స్లో టిండర్ మొదటి స్థానంలో ఉంది. టిండర్ తరువాత స్థానంలో నెట్ ఫ్లిక్స్, పండారా, క్లాష్ రాయల్ యాప్స్ ఉన్నాయి. మిగిలిన డేటింగ్ యాప్స్‌తో పోల్చితే.. టిండర్‌లో త్వరగా రిలేషన్షిప్ చేసేందుకు అవకాశాలు ఉండడం, లోకల్‌గా ఉండేవారి సమాచారం వేగంగా ఉండండంతో యువత దీనిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది. -
డేటింగ్ ఏ టైంలో చేయాలో తెలుసా?
డేటింగ్ కోసం ఆన్ లైన్ పాట్నర్ దొరకడం లేదా.. అందుకోసం విసిగివేసారి పోతున్నారా.. అయితే, మీకోసం నీల్సన్ సర్వే ఉపశమనం కలిగించే అంశాలు వివరించింది. ఎన్నో డేటింగ్ యాప్స్ ఉన్నా.. ప్రధానంగా గుర్తొచ్చేది టిండర్, ఆక్కుపిడ్. ఈ యాప్ లలోకి వెళ్లినవారు.. అమ్మాయి అయితే తమకు నచ్చిన అబ్బాయిని, అబ్బాయి అయితే తమకు నచ్చిన అమ్మాయిని ఎంపిక చేసుకొని ఏం చక్కా డేటింగ్ చేస్తుంటారు. కానీ, సరైన టైంలో అందులోకి లాగిన్ అవ్వకుంటే మాత్రం ప్రయోజనం ఉండదు. అందుకే, వీటిని ఉపయోగించే వారి డేటాను పరిశీలించిన నీల్సన్ ఈ రెండు యాప్ లను ఏ సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారో పరిశీలించి రాత్రి 9గంటల ప్రాంతంలో ఎక్కువమంది డేటింగ్ లో ఉంటున్నారని, ఆ సమయంలోనే ఎక్కువమంది డేటింగ్ కోసం ఎదురుచూస్తుంటారని నీల్సన్ తెలిపింది. ఇప్పటి వరకు ఈ యాప్స్‌ను ఉపయోగిస్తున్నవారి జాబితాను పరిశీలించగా టిండర్‌ను ఉదయం 10గంటలకు ఓ మోస్తరుగా 45శాతంమంది డేటింగ్ చేస్తుండగా రాత్రి తొమ్మిదిగంటల ప్రాంతంలో 55శాతంమంది ఉపయోగిస్తున్నారు. ఇక ఆక్ కుపిడ్ యాప్ లో అదే ఉదయం పదిగంటలకు 50 నుంచి 55శాతం మంది డేటింగ్ చేస్తుండగా రాత్రి తొమ్మిదిగంటలకు 60 నుంచి 65శాతం మంది ఉపయోగిస్తున్నారు. ఇక తెల్లవారు జామున 5గంటల ప్రాంతంలో మాత్రం రెండు యాప్స్‌ను ఉపయోగించే వారి సంఖ్య దాదాపు సమానంగానే ఉంది. ఈ డేటా ప్రకారం ఈ రెండు యాప్ లను కూడా రాత్రి తొమ్మిది గంటలకే ఎక్కువమంది ఉపయోగిస్తున్నారని ఆన్ లైన్లో డేటింగ్ చేసేందుకు రాత్రి 9గంటలే సరైన సమయం అన్నమాట. -
‘టిండర్’తో ప్రేమలో పడిపోతున్నారు!
లండన్: యువ‘తరం’ మారింది. ప్రేమ తీరు మారింది. ఓ కలువ బాల, ఓ వెన్నెల రేడ! అంటూ యుగళ గీతాలు గుర్తుకు తెచ్చుకోవడం, నీ కోసమే నే జీవించునది, నీ కోసమే నే తపియుంచునది! అంటూ పరస్పరం పేజీలకొద్ది కవిత్వాలు రాసుకోవడం, చలం ‘ప్రేమ లేఖలు’ ఇచ్చి పుచ్చుకోవడం నిన్నటి తరంతోనే ముగిసిపోయింది. ప్రేమ పుస్తకాలకు, కవిత్వానికి, ప్రేమ పాటలకు ఈ తరంలో పూర్తిగా కాలం చెల్లిపోయిందని, వాటి స్థానాన్ని డేటింగ్ యాప్స్ ఆక్రమించాయని లండన్‌కు చెందిన ప్రముఖ చరిత్రకారులు లూజీ వర్సిలీ తెలియజేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో యువతీ యువకులు పరస్పర ప్రేమ సంబంధాల కోసం ‘టిండర్’లాంటి డేటింగ్ యాప్స్‌ను ఆశ్రయిస్తున్నారని, టిండర్‌ను 2012లో ప్రారంభించగా, ఇప్పటికే ఐదు కోట్ల మంది ఆ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నారని 41 ఏళ్ల లూజీ తెలిపారు. స్మార్ట్ ఫోన్ యాప్ టిండర్ జీపీఎస్ వ్యవస్థను ఉపయోగించడం వల్ల, తమకు కాబోయే భాగస్వామి వయస్సెంతో, ఎంత దూరంలో ఉన్నారో, చూడడానికి ఎలా ఉంటారో తదితర వివరాలను కచ్చితంగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతోందని, అందుకనే ఇది డేటింగ్ యాప్స్‌లో ఎంతో ప్రాచుర్యం పొందుతోందని ఆమె చెప్పారు. ఈ యాప్‌ను ఉపయోగించడం వల్ల 24 గంటల్లో దాదాపు రెండున్నర కోట్ల మంది ప్రేమ జంటలవుతున్నారని, వారిలో 16 ఏళ్ల నుంచి 24 ఏళ్లలోపు యువతీ యువకులు 38 శాతం ఉండగా, 25 ఏళ్ల నుంచి 34 ఏళ్ల లోపువారు 45 శాతం మంది, 45 ఏళ్ల పైబడిన వారు కేవలం నాలుగు శాతం మంది ఉన్నట్లు ఓ అధ్యయనంలో తేలిందని లూజీ వివరించారు. ఈ యాప్ కారణంగా ఒక్కరోజు భార్యా భర్తలుగా గడిపిన వారు కూడా ఎక్కువే ఉన్నారని ఆమె అన్నారు. ప్రేమ పుస్తకాలను చదివే ఓపిక, తీరిక నేటి యువతరానికి లేకుండా పోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.