డేటింగ్ లవర్స్‌కి టిండర్ యాప్ ఒక వరంలా కనిపిస్తోంది. దీంతో యాప్ స్టార్స్‌లో వేగంగా డౌన్‌లోడ్ అవుతున్న యాప్‌గా టిండర్ టాప్‌ప్లేస్‌లో నిలిచింది. యాప్‌స్టోర్స్‌కు అత్యధికంగా ఆదాయాన్ని ఈ యాప్ సమకూరుస్తోంది. టిండర్ యాప్‌ను లైక్ చేస్తున్న వారి సంఖ్య లక్షల్లో ఉంటోందని ఆన్‌లైన్‌మార్కెట్ డేటా సంస్థ ’యాప్ అన్నే‘ తెలిపింది. ఆరు నెలల కాలంలో అత్యధికంగా డౌన్‌లోడ్ అయిన యాప్స్, వాటి ర్యాంకింగ్స్‌ను ఈ సంస్థ తాజాగా విడుదల చేసింది.
ఈ ర్యాకింగ్స్‌లో టిండర్ మొదటి స్థానంలో ఉంది. టిండర్ తరువాత స్థానంలో నెట్ ఫ్లిక్స్, పండారా, క్లాష్ రాయల్ యాప్స్ ఉన్నాయి. మిగిలిన డేటింగ్ యాప్స్‌తో పోల్చితే.. టిండర్‌లో త్వరగా రిలేషన్‌షిప్ చేసేందుకు అవకాశాలు ఉండడం, లోకల్‌గా ఉండేవారి సమాచారం వేగంగా ఉండండంతో యువత దీనిని ఉపయోగించేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సదరు సంస్థ ప్రకటించింది.