
భార్యాభర్తల బంధానికి పునాది నమ్మకం. పరస్పరం విశ్వాసమే ఏ బంధాన్నైనా పటిష్టంగా ఉంచుకుంది. ఆ నమ్మకం వమ్ము అయినపుడు అపోహలు, అనుమానాలకు తావిస్తుంది. పైగా స్మార్ట్ యుగం. చేతిలో స్మార్ట్‌ఫోన్‌లేనిదే క్షణం నడవదు. ప్రేమ మొదలు, షాపింగ్ దాకా అంతా అన్‌లైన్‌లోనే. అందుకే తమ భాగస్వాములను వ్యవహారాల్ని పసిగట్టేందుకు స్మార్ట్‌ఫోన్‌ను మించిన డిటెక్టర్ లేదు. దీనికి డేటింగ్ యాప్‌లుకూడా తోడయ్యాయి. ఈ నేపథ్యంలోనే భర్త మొబైల్ ఫోన్‌ను చెక్ చేయాలనే కోరిక భార్యకు ఉంటుంది. భార్య ఫోన్‌లో ఎవరితో చాట్ చేస్తుంది, ఎవరితో టచ్‌లో ఉందో అనే ఆరాటం కూడా భర్తలకు ఎక్కువగా. అన్నట్టు ఇది నేరుగా ఉండదు సుమా. గుట్టుచప్పుడు గాకుండా సాగుతుందన్నట్టు అచ్చం వాళ్లు మోసం చేస్తున్నట్టే. ఏదైనా తేడా వచ్చిందో... అంతే సంగతులు. ఇంతకీ విషయం ఏమిటంటే.. తెలుసుకుందాం.
CheatEye.ai నివేదిక ప్రకారం, మహిళలు తమ భాగస్వాములను అనుమానించే నగరంగా లండన్ నిలుస్తోంది. భార్యలు భర్తల ఫోన్లను ఎంత చెక్ చేస్తున్నారనే విషయంపై ఈ స్టడీ జరిగింది. లండన్‌లో జరిగిన టిండర్-సంబంధిత శోధనలలో 27.4శాతం మంది తమ భాగస్వామి గుట్టును వెలికితీయడంపై దృష్టి సారించారని ఇటీవలి విశ్లేషణలో వెల్లడైంది. ముఖ్యంగా, ఈ శోధనలలో 62.4శాతం తమ భర్తలు లేదా బాయ్‌ఫ్రెండ్‌లు డేటింగ్ యాప్‌ను రహస్యంగా ఉపయోగిస్తున్నారా అని నిర్ధారించుకోవడానికే ఈ యాప్‌లోకి వస్తున్నారట.
ఇక లండన్ తరువాత మాంచెస్టర్ బర్మింగ్‌హామ్ తరువాతి టాప్ ప్లేస్‌లో నిలిచాయి. భాగస్వాములపై అనుమానంతో జరిగి టిండర్ చెకింగ్స్‌లో మాంచెస్టర్‌లో, 8.8శాతంగా బర్మింగ్‌హామ్‌లో 8.3శాతంగా ఉన్నాయి. అయితే, బర్మింగ్‌హామ్ లో 69 అనుమానాస్పద శోధనలు పురుష భాగస్వాములపై మహిళలే నిర్వహింనవే ఎక్కువట. గ్లాస్గో నగరం కూడా కూడా ఈ జాబితాలో కనిపించింది, 4.7శాతం టిండర్-సంబంధిత శోధనలు అవిశ్వాసం గురించి ఆందోళనలతో ముడిపడి ఉన్నాయి. ఈ స్కాటిష్ నగరంలో, 62.1శాతం మంది అనుమానాస్పద కార్యకలాపాలు పురుష భాగస్వాములను లక్ష్యంగా ఉన్నాయట.
దీనికి ప్రధాన నగరాల్లో, ముఖ్యంగా యువకులలో డేటింగ్ యాప్‌లకు పెరుగుతున్న ప్రజాదరణ కారణమని నిపుణురాలు సమంతా హేస్ విశ్లేషించారు."లండన్ వంటి నగరాల్లో, డేటింగ్ అనేది డైనమిక్‌గా ఉంటుంది. ఇది సహజంగానే భాగస్వాముల కార్యకలాపాలపై అనుమానం పరిశీలనకు దారితీస్తుంది" అని ఆమె వివరించారు. 18 నుండి 24 సంవత్సరాల వయస్సు గల యువకులు తమ భాగస్వాముల విశ్వసనీయత గురించి ముఖ్యంగా ఆందోళన చెందుతున్నారని హేస్ తెలిపారు.
ఇలాంటి సర్వే మన ఇండియాలో జరిగితే పరిస్థితి ఏంటి భయ్యా అంటున్నారు నెటిజన్లు. జర జాగ్రత్త భయ్యో అంటూ కమెంట్ చేస్తున్నారు వ్యంగ్యంగా. భార్యభర్తల మధ్య నమ్మకం ఉండాలి బ్రో.. మూడో వ్యక్తి రాకూడదు. అప్పుడ అది నూరేళ్ల బంధం అవుతుంది అంటున్నారు మరికొంతమంది.
Comments
Please login to add a commentAdd a comment