dating app
-
Mumbai Dating Scam: అమ్మాయిలనే ఎరగా వేసి.. యువతకు బురిడి
డేటింగ్ యాప్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువకులను కొందరు కిలేడీలు ట్రాప్ చేసి మోసం చేస్తున్న ఘటనలు ఇటీవల కాలంలో ఘటనలు జరుగుతున్నాయి. అమాయకుల ఆశనే అసరాగా తీసుకుని.. మాటలతో మాయ చేసి అందిన కాడికి దోచుకుని మాయమవుతున్నారు. మ్మాయిల మోజులో పడి చాలా మంది అబ్బాయిలు తమ జేబులను ఖాళీ చేసుకొని చివరకు పోలీస్ స్టేషన్లకు పరుగెడుతున్నారు. అచ్చం అలాంటి ఘటనే.. మహారాష్ట్ర రాజధాని ముంబైలోవెలుగుచూసింది. డేటింగ్ యాప్ స్కామ్ పేరుతో ముంబైలోని అంధేరీ వెస్ట్‌లోని గాడ్‌ఫాదర్ క్లబ్ మోసాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. జర్నలిస్ట్, సామాజిక కార్యకర్త దీపికా నారాయణ్ భరద్వాజ్ శుక్రవారం సోషల్ మీడియా ద్వారా ఈ సమస్యను వెలుగులోకి తీసుకొచ్చారు. పలు డేటింగ్ యాప్‌ల ద్వారా అందమైన అమ్మాయిలతో కనెక్టివిటీ చేస్తారు. అనంతరం అమ్మాయిలు.. అబ్బాయిలను ముగ్గులోకి దింపుతారు. ఫలానా హోటల్‌కు వెళ్దామంటూ తీసుకెళ్తారు. ముందుగా ఆమెకు నచ్చిన పదార్థాలు బుక్ చేసుకుంటుంది. మద్యం హుక్కా, ఖరీదైన ఫుడ్ ఆర్డర్చేస్తుంది. ఆర్డర్లు వచ్చాక ఇప్పుడే వస్తానంటూ యువతులు మధ్యలో జారుకుంటారుఇక బిల్లు చూడగానే గుండె చిల్లు పడినట్లు అవుతుంది. ఏకంగా వేలల్లో బిల్లు రావడం చూసి షాక్ అవుతుంటారు. ఇలా ముంబైలో జరిగిన ఘటనలో పలువురు బాధితులు రూ. 23,000 నుంచి రూ.61, 743 వరకు బిల్లులు కట్టారు. ఒకవేళ బిల్లు కట్టని వారిని క్లబ్ సిబ్బంది, బౌన్సర్లు బెదిరింపులకు పాల్పడతారు. దీంతో భయం, అవమానంతో బిల్లు కట్టేస్తుంటారు. ఇలా ప్రతి రోజూ కొంత మంది అబ్బాయిలు మోసపోతున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో మహిళలు 20, 30 నుంచి కమీషన్ పొందుతున్నారని తెలుస్తోంది. 🚨 MUMBAI DATING SCAM EXPOSE 🚨THE GODFATHER CLUB ANDHERI WEST◾BRAZEN SCAMMING EVERYDAY◾12 victims in touch◾Trap laid through Tinder, Bumble◾Bill amounts 23K- 61K◾3 men trapped by same girl@MumbaiPolice @CPMumbaiPolice @mymalishka @CMOMaharashtra@zomato pic.twitter.com/qGOacFCE9f— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) August 23, 2024 ఇలా గాడ్‌ఫాదర్ క్లబ్ మాత్రమే కాదు ముంబైలో పలు క్లబ్‌లు మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ వైరల్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత క్లబ్‌పై పోలీసులు విచారణ చేపట్టారు. ముందుగా ఈ సంస్థలు పీఆర్ సిబ్బందిని నియమించుకుంటాయి. వారు డేటింగ్ యాప్‌లలో పురుషులను ఎర వేయడానికి యువతులను నియమించుకుంటారు. అబ్బాయిలను ముగ్గులోకి దింపేందుకు ఖరీదైన వస్తువులు లేదా, వ్యక్తిగత ఫోటోలతో ఎరవేస్తారు. అయితే ఢిల్లీ, గురుగ్రామ్, బెంగళూరు మరియు హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. జూన్‌లో, దేశ రాజధాని ఢిల్లీలో రూ. 1.2 లక్షల బిల్లులను చెల్లించి ఓ సివిల్ సర్వీస్ అభ్యర్థి కూడా మోసపోయిన విషయం విదితమే. -
మ్యాట్రిమోనీలో అమ్మాయిలను మోసగించిన వ్యక్తి అరెస్టు
సాక్షి, హైదరాబాద్: డేటింగ్ యాప్‌లలో నకిలీ ప్రొఫైల్స్ పెట్టి, పెళ్లి చేసుకుంటానని అమ్మాయిలను నమ్మించి మోసాలకు పాల్పడుతున్న ఘరానా మోసగాణ్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన చిన్నిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి పలు డేటింగ్ యాప్‌లలో సందీప్ సన్నీ పేరుతో నకిలీ ప్రొఫైల్ సృష్టించాడు. ఆకర్షితురాలైన ఓ బాధితురాలికి గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌నని నమ్మించాడు. స్నేహం పేరుతో బంధాన్ని ప్రారంభించి తర్వాత ప్రేమ, పెళ్లి వరకూ తీసుకెళ్లాడు. వ్యక్తిగత, కుటుంబ కష్టాలు ఉన్నాయని కట్టుకథలు చెప్పి బాధితురాలి నుంచి రూ.6.41 లక్షలు వసూలు చేశాడు. కొట్టేసిన సొమ్మును మేజిస్టిక్ ప్రైడ్, క్యాసినో ప్రైడ్ వంటి ఆన్లైన్ గేమింగ్ యాప్‌లలో పెట్టి పోగొట్టుకున్నాడు. మోసపోయానని గ్రహించిన బాధితురాలు ఫిర్యాదు చేయగా, పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేశారు. సెల్‌ఫోన్, సిమ్ కార్డులను స్వా«దీనం చేసుకున్నారు. -
డేటింగ్ యాప్: అమ్మాయి వలపు వల.. సివిల్స్ అభ్యర్థి’ని కేఫ్‌కి పిలిచి..
ఢిల్లీ: డేటింగ్ యాప్‌ల పేరుతో కొత్త తరహా మోసాలు బయటపడుతున్నాయి. మాటమాట కలుపుతారు.. పరిచయాలు పెంచుకుంటారు. వీరి వలలో చిక్కుకుని లక్షలు పోగొట్టుకుంటున్నారు. నమ్మి చెప్పిన చోటుకు వెళ్తే జేబులు ఖాళీ చేసి పంపిస్తున్నారు. ఢిల్లీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.సివిల్స్‌కి ప్రిపేర్ అవుతున్న ఓ యువకుడికి టిండర్ యాప్‌లో ఓ యువతి పరిచయం కాగా, ఆమె బర్త్‌డే వేడుకకు కేఫ్‌కి పిలిచింది. ఇద్దరూ కేక్‌లతో పాటు డ్రింక్స్ ఆర్డర్ చేశారు. సడన్‌గా ఆ యువతి ఉన్నట్టుండి.. కుటుంబంలో ఒకరికి ఆరోగ్యం బాగోలేదని.. ఎమర్జెన్సీ అంటూ నమ్మించి.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. బిల్ కట్టేసి వెళ్లిపోదామనుకున్న యువకుడికి షాక్ తగిలింది. నాలుగు కేక్‌లు, నాలుగు షాట్స్ డ్రింక్స్‌కే రూ.1.21 లక్షల బిల్ వేశారు. మహా అయితే నాలుగైదు వేలల్లో ఉండే బిల్ ఇలా లక్ష దాటే సరికి యువకుడు నివ్వెరబోయాడు. చివరకు బిల్ కట్టకపోతే చంపేస్తాంటూ కేఫ్ సిబ్బంది బెదిరింపులకు దిగారు. చేసేదేమీ లేక ఆ యువకుడు ఆన్లైన్లో నగదును ట్రాన్స్ఫర్ చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇచ్చాడు.పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ యువతి పేరుతో పాటు వివరాలన్నీ ఫేక్ అని తేలింది. వీళ్లంతా కుమ్మక్కై ఆ యువకుడిని దోచుకున్నారని గుర్తించారు. వెంటనే ఆ యువతిపై నిఘా పెట్టిన పోలీసులు మరో కేఫ్‌లో వేరే అబ్బాయితో ఉండగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌లో కూడా ఇటీవల ఇలాంటి తరహా మోసం కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో చాలా మంది అబ్బాయిలు డేటింగ్ యాప్‌లను ఆశ్రయిస్తున్నారు. ఇలా డేటింగ్ యాప్‌లో అమ్మాయిల ద్వారా పబ్ ఓనర్లు చేస్తున్న దోపిడీ ఇటీవల ఒకటి బట్టబయలైంది. డేటింగ్ యాప్‌లో అమ్మాయిలను ఎరగా వేసి అలా పరిచయమైన వారిని పబ్‌లకు పిలిపిస్తూ వారి చేత ఖరీదైన మద్యం కొనుగోలు చేయిస్తున్నారు. -
హైదరాబాద్ లో వెలుగు చూసిన కొత్త రకం మోసం
-
హైదరాబాద్ పబ్‌ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..
సాక్షి, హైదరాబాద్: నగరంలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొంతమంది పబ్ యజమానులు.. అమ్మాయిలతో కలిసి డేటింగ్ యాప్‌లో కొత్త మోసానికి తెరతీశారు. పబ్ యజమానులు, అమ్మాయిలు.. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు.ఒక వ్యాపారవేత్తకు రితికా అనే యువతి పరిచయం కాగా, పరిచయం అయిన మరుసటి రోజే కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రమ్మంది. మరుసటి రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. వ్యాపారవేత్తను పబ్‌లోకి తీసుకెళ్లి తియ్యని మాటలు చెప్పి గంట లోపల ఖరీదైన మద్యం ఆర్డర్ చేసి తాగింది. రూ. 40,505 రూపాయిలు బిల్‌ను చేతిలో పెట్టి రితిక జారుకుంది. బిల్లును చూసి ఆ వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 45 వేల రూపాయల మద్యం తాగిన రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో విస్మయం చెందిన వ్యాపార వేత్త.. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్ ని అమ్మాయికి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నాడు.పబ్ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఇలాగే ఆ యువతి, పబ్ యాజమానుల చేతిలో చాలా మంది మోసపోయి పోయినట్లు తేలింది. రెండు రోజుల పరిధిలోని ఈ పబ్బులో ఇలాంటి మోసాలు జరిగినట్లు గుర్తించారు. తనకు జరిగిన మోసంపైన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వ్యాపారవేత్త బయటపెట్టాడు. -
ఆన్లైన్ ప్రేమలు.. డేటింగ్ విత్ డిప్రెషన్!
ఆన్లైన్ ప్రపంచంలో ప్రేమలను వెతుక్కోవడం అంటే సముద్రంలో పారబోసుకున్న మంచినీళ్లను దోసిళ్లతో పట్టుకోవాలనుకోవడం లాంటిది. డిజిటల్ యుగంలో ప్రపంచం చిన్నదైనప్పటికీ మనుషుల మధ్య పెరుగుతున్న అంతరాలు ఒంటరితనం వైపుగా పయనిస్తున్నాయి. ఫలితంగా ఒంటరి మనసులు భావోద్వేగాల జడిని కనపడని వ్యక్తులతో పంచుకుంటున్నారు. డేటింగ్ యాప్‌లలో మహిళలు భాగస్వాముల కోసం వెతుకుతూ, వారితో మానసిక అనుబంధాలను పెంచుకొని, కొంతకాలానికి డిప్రెషన్‌కు గురవుతున్నారని, వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది అంటున్నారు మానసిక నిపుణులు. పెరుగుతున్న సమస్య... 35 ఏళ్లు దాటిన వసు (పేరుమార్చడమైనది) లక్షల వ్యాపారాన్ని సులువుగా నిర్వహించే స్టార్టప్‌ను రన్ చేస్తుంది. కానీ, మానసిక సంబంధాన్ని సరిగా నిర్వహించలేక డిప్రెషన్ బారిన పడింది. వసు తల్లి ఈ విషయాన్ని చెబుతూ ‘నా కూతురు సొంతంగా నిలదొక్కుకోవాలనే ఆలోచనతో పెళ్లి విషయంలో ఆలస్యం చేసింది. సెటిల్ అయ్యాక ఇక పెళ్లి చేసుకోవాలనే ఆలోచనతో డేటింగ్ యాప్‌లో ఒక అబ్బాయిని ఇష్టపడింది. అతను కూడా నా కూతురితో రోజూ ఆన్లైన్లో మాట్లాడుతుండేవాడు. ప్రేమిస్తున్నట్టు చెప్పాడు. కొన్నాళ్లు ఇద్దరూ చాటింగ్, వీడియో కాల్స్ చేసుకునేవారు. కానీ, కలవడానికి దూరంగా ఉండేవాడు. నా కూతురు అతనితో ఎమోషనల్‌గా అటాచ్ అయ్యింది. కానీ, ఆ అబ్బాయి సరైనవాడు అని నాకు అనిపించడం లేదు. ఎందుకంటే, కలుద్దామంటే అతను చూడటానికి రావడం లేదు. నా కూతురిని అతని నుంచి దూరంగా ఉంచాలంటే ఏం చేయాలో తెలియట్లేదు’అనేది ఆమె ఆవేదన.‘వర్చువల్ ప్రపంచంలో ప్రేమలు వెతికేవారి సంఖ్య ఇటీవల బాగా పెరుగుతున్న ఈ సమయంలో కూతుళ్ల పట్ల తల్లుల ఆందోళన కూడా పెరుగుతోంది’ అంటున్నారు రిలేషన్షిప్ కౌన్సెలర్ డాక్టర్ మాధవీ సేథ్. ఈ విషయంలో కొన్ని సూచనలు చేస్తున్నారు. తెలివిగా వ్యవహరించాలి... ఈ రోజుల్లో తల్లులు చాలా తెలివిగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే కూతుళ్లు బాగా చదువుకుంటూ, బిజినెస్ ఉమెన్‌గా నిలదొక్కుకుంటున్నవారున్నారు. వారికి తమ మంచి చెడులు బాగా తెలుసు. అందుకని, వాళ్లు చాటింగ్ చేయడాన్ని లేదా అబ్బాయితో మాట్లాడడాన్ని నిషేధిస్తే మీ మాట వినరు. నిఘా పెడితే మీ పై నమ్మకం కోల్పోతారు. నమ్మకాన్ని గెలుచుకోవడం ద్వారా మాత్రమే మీరు మీ కూతురిని అర్థం చేసుకోగలరు. సమయం ఇవ్వండి.. స్త్రీ ఎంతటి సమర్థత, విజయం సాధించినా ప్రేమ విషయంలో చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. కాబట్టి ఆమె అవతలి వ్యక్తి లోపాలను చూడలేదు. కానీ, తెలివిగా ఆమెకు నిజం చెప్పాలి. దీని కోసం మీరు మీ కుమార్తెతో సమయం గడపడం అవసరం. మొదట ఆమె ఆ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో లేదో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. అవును అయితే ఆ విషయం గురించి ప్రేమగానే మాట్లాడాలి. అబ్బాయిని ఇంటికి పిలవమని, అతని తల్లిదండ్రులను కలవడానికి ప్లాన్ చేయమని చెప్పాలి. తర్వాత నెమ్మదిగా సాక్ష్యాధారాలతో ఆ అబ్బాయి గురించి నిజాలను కూతురికి చెప్పాలి. నిజానికి ఈ విషయాలు చెప్పాలంటే కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ‘ఆమె’ ఒంటరితనం ఫీలవుతుంది. ఆమెకు మీ ప్రేమపూర్వక మద్దతు అవసరం. ప్రతి పరిస్థితిలో మీరు ఆమెతో ఉన్నారని మీ కుమార్తెకు భరోసా ఇవ్వండి. వీలైతే మీ కూతురిని కొంతకాలం దూరంగా ఎక్కడికైనా తీసుకువెళ్లండి. దీనివల్ల ఆమె మానసిక స్థితిలో సానుకూలమైన మార్పులు చోటు చేసుకోవచ్చు. వర్చువల్ ప్రపంచం నుండి బయటకు రండి... ఆన్లైన్ ప్రేమ కోసం వెతుకుతున్న యువత వర్చువల్ ప్రపంచం నుండి బయటపడి జనంతో కలిసి΄ోవాలి. ఒకటి లేదా రెండు రోజులు ఆన్లైన్ చాటింగ్ అవతలి వ్యక్తి గురించి ఎక్కువ సమాచారాన్ని అందివ్వవు. డేటింగ్‌యాప్‌లలో మోసం జరిగే అవకాశాలు ఎక్కువ కాబట్టి వాస్తవ ప్రపంచంలో నిజమైన ప్రేమలను వెతుక్కోవాలి. ఒకరికొకరు పరస్పరం కలిసి మాట్లాడుకోవడంలో సాంత్వన ΄÷ందుతారు. ఇటువంటి వాటిలో మోసం, భయం ఉండవు. ప్రేమ సంబంధాలలో నమ్మకం ముఖ్యం. వర్చువల్... నిజాలు... లండన్ లోని ఇంపీరియల్ కాలేజ్ పరిశోధన ప్రకారం దాదాపు 70 శాతం మంది డేటింగ్ యాప్‌లలో భాగస్వాముల కోసం వెతుకుతున్న వ్యక్తులు డిప్రెషన్‌కు గురవుతున్నారనీ, అది వారి మానసిక ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతోందని తేలింది. ఈ రోజుల్లో వ్యక్తులు తరచుగా సంబంధాలను వదులుకోవడానికి చాలా త్వరపడుతుంటారు. ఎందుకంటే, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ ఆ దిశగా అన్వేషణ చేయడం కూడా ఇందుకు కారణం అవుతుంటుంది. కోవిడ్ లాక్డౌన్ మార్పులు కూడా ఈ స్థితికి బాగా కారణమైంది. ఇంటి నుండి పని మొదలు డేటింగ్ యాప్‌లో రొమాన్స్ చేయడానికి ఓ కొత్తమార్గాన్ని ఎంచుకునే అవకాశాన్ని కల్పించింది. మరికొన్ని సూచనలు.. ∙ఒంటరిగా ఉండటం వల్ల కలిగే ప్రతికూలతలపై దృష్టి సారించే బదులు మీరు ఆనందించే అంశాలు, అది తెచ్చే స్వేచ్ఛపై దృష్టి పెట్టాలి ∙జీవితంలో ఏదైనా సాధించాలనే లక్ష్యం, అభిరుచులవైపు మనసును మళ్లించాలి. కుటుంబం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సామాజికంగా కలవాలి... ► ఆన్లైన్ డేటింగ్లో మరొక వ్యక్తి జీవితాన్ని, సంబంధాలను, వివరాలను ఎప్పటికీ తెలుసుకోలేరు. సోషల్ మీడియా ΄ోస్ట్‌లో సంతృప్తికరమైన సంబంధంలా కనిపించేది నిజ జీవితంలో చాలా భిన్నంగా కనిపించవచ్చు ► ఒంటరిగా ఉన్నప్పుడు వర్చువల్ మీట్–అప్‌లను కూడా స్నేహితులతోప్లాన్ చేయడం మంచిది ►వారానికి కొన్నిసార్లు మీ ప్రియమైన వారితో ఫోన్లో చాట్ చేసినా, ఆన్లైన్లో ఇంటరాక్ట్ అవుతున్నా మీ ఒంటరితనం అనే భావన దూరం అవుతుంటుంది ►స్వచ్ఛంద సేవ, స్థానిక స్పోర్ట్స్ క్లబ్‌లలో పాల్గొనడం, రీడర్స్ క్లబ్.. వంటివి ఏర్పాటు చేయడం వల్ల ఒంటరితనం దూరం అవడమే కాదు, మనసులో ఉన్న వ్యక్తులను కలుసుకునే అవకాశం కూడా దొరకవచ్చు ► జీవితం ఒక రేస్ కాదు. ఒక నిర్దిష్ట వేగంతో జీవితంలోని మైలురాళ్లను చేరుకోవాల్సిన అవసరం లేదు. అన్నింటికన్నా ముందు మీకు మీరే ప్రియమైనవారని గుర్తుచేసుకోండి. డేటింగ్ యాప్‌లలోనే కాదు మీ ఆసక్తులు, లక్ష్యాలు, విలువలు పంచుకునే ఒంటరి వ్యక్తులు మీ చుట్టూ పుష్కలంగా ఉన్నారనే విషయం గ్రహించాలి. – డాక్టర్ మాధవీ సేథ్, రిలేషన్షిప్ కౌన్సెలర్ -
కోటీశ్వరుడిగా నకిలీ ప్రొఫైల్, డేటింగ్ వల: అదే కొంపముంచింది!
సోషల్ మీడియాలో ముక్కూ మోహం తెలియని వారితో పరిచయాలు, ప్రేమ, ఆన్లైన్ డేటింగ్ ఎంత ప్రమాదకరమో తెలిపే ఘటన ఇది. పాపులర్ డేటింగ్ టిండర్‌లో డేటింగ్ చేసిన మహిళ యువకుడిని కిడ్నాప్ చేసి మరీ కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. 2018లో జైపూర్‌లో షాకింగ్ సంఘటన జరిగింది. ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైపూర్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం దుష్యంత శర్మ(28)కు 27 ఏళ్ల ప్రియా సేథ్తో టిండర్ యాప్ ద్వారా పరిచయమైంది. దుష్యంత్ తను అసలు పేరు కాకుండా వివాన్ కోహ్లీ అనే పేరుతో నకిలీ ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. అంతేకాదు నెల కోటిరూపాయలు సంపాదిస్తానని, ఢిల్లీకి చెందిన గొప్ప బిజినెస్‌మేన్ అని గొప్పలు చెప్పుకున్నాడు. కోహ్లి ప్రొఫైల్ చూసిన ప్రియా పథకం ప్రకారమే మెల్లిగా అతనితో స్నేహం నటించింది. దీంతో దుష్యంత్ గాల్లో తేలిపోయాడు. ఇలా 3 నెలల పాటు కొనసాగింది. చివరికి కలవాలని ప్రతిపాదించింది. దీంతో ఎగిరి గంతేశాడు. కానీ అదే అతని ప్రాణాలు తీస్తుందని అసలు ఊహించలేదు. ఇక్కడే అతడిని కిడ్నాప్ చేసిన పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేయాలన్న తన ప్లాన్‌ను ప్రియా అమలుకు పూనుకుంది.. అప్పటికే తనతో లివిన్ రిలేషన్ షిప్లో ఉన్న దీక్షంత్ కమ్రా,లక్ష్య వాలియా ప్రియ కలిసి అతడిని కిడ్నాప్ చే చేసి జైపూర్‌లోని అద్దె ఫ్లాట్‌కు తీసుకెళ్లారు. మాటల్లో అతనుతాము అనుకున్నంత ధనవంతుడి కాదని తెలిసిపోయింది. అయినా తమ ప్లాన్‌ను అమలు చేశారు. దుష్యంత్ తండ్రికి ఫోన్ చేసిన 10 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దుష్యంత్ దగ్గరనున్న ఏటీఎం కార్డునుంచి రూ.20వేలు లాగేసుకున్నారు. ఇంకా డబ్బులు కావాలని ఒత్తిడి చేశారు.లేదంటే అత్యాచార కేసు పెడతామని బెదిరించారు. దీంతో తన దగ్గర అంత డబ్బు లేదని కానీ కొంత ఎరేంజ్ చేస్తానని బతిమాలుకున్నాడు. దీంతో అతని ఫోన్ ద్వారా తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగారు. కొడుకు ప్రాణాలు రక్షించుకోవాలనే ఆశతో ఆయన రూ. 3 లక్షలు జమ చేశారు. అయినా కూడా తమ నేరం వెలుగులోకి వస్తుందనే భయంతో ముగ్గురు నిందితులు దుష్యంత్‌ను హత్య చేశారు. గొంతుకోసి, ముక్కలు, ముక్కలుగా నరికి సూట్ కేసులో కుక్కి ఉన్న దుష్యంత్ మృతదేహాన్ని పోలీసులు అదే ఏడాది మే 4న గుర్తించారు. ఈ కేసులో తుది విచారణ తరువాత కోర్టు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు చెప్పింది. తన కొడుకును హత్య చేసిన వారికి మరణ శిక్ష విధించి ఉంటే అతని ఆత్మ శాంతించేదని దుష్యంత్ శర్మ తండ్రి కన్నీంటి పర్యంతమయ్యారు. అంతేకాదు గతంలో డేటింగ్ ద్వారా ఇలా చాలామంది మోసం చేసిన ఆరోపణల కింద జైలుకెళ్లిందట ప్రియ. -
కొంపముంచిన డేటింగ్ యాప్: ‘ఐస్’తో కిలాడీ నిలువు దోపిడీ
డేటింగ్ యాప్ పరిచయం ఓ యువకుడి కొంప ముంచింది. బంబుల్యాప్లో పరిచయమైన గురుగ్రామ్‌కు చెందిన యువకుడికి మత్తుమందు ఇచ్చి మరీ మహిళ నిలువునా దోచేసింది. బంగారం, నగదు, లగ్జరీ ఐఫోన్‌తో పాటు, బ్యాంకు ఖాతాని ఖాళీ చేసేసింది. విషయం తెలుసుకున్న బాధితుడు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన వెలుగు చూసింది. హర్యానాలోని గురుగ్రామ్‌లో ఈ ఉదంతం చోటు చేసుకుంది. గురుగ్రామ్ వ్యక్తికి బంబుల్ డేటింగ్ యాప్‌లో సాక్షి అలియాస్ పాయల్ అనే ఆ మహిళతో పరిచయం ఏర్పడిందని బాధితుడు రోహిత్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ ఫిర్యాదు ప్రకారం తాను ఢిల్లీకి చెందిన దాన్ననీ, అయితే గురుగ్రామ్‌లో తన అత్తతో నివసిస్తున్నాననిపాయల్ చెప్పింది. గత వారం పాయిల్కు ఫోన్ చేసి, కలుద్దామని రోహిత్‌ను కన్విన్స్ చేసింది. అనుకున్న ప్రకారం రోహిత్ వాళ్ల ఇంట్లో కలుసుకున్నారు. ఆ తరువాత దగ్గర్లోని దుకాణంలో మద్యం కొనుక్కుని ఇంటికి చేరుకున్నారు. ఆ తరువాత ఐస్ తీసుకురమ్మనే నెపంతో అతడి దృష్టి మళ్లించింది. అతడలా ఐస్ కోసం వెళ్లగానే డ్రింక్‌లో ఏ మత్తుమందు తెలిపిందో తెలియదు గానీ అది తాగిన వెంటనే రోహిత్ స్పృహ కోల్పోయాడు. ఆ మత్తు ఎంత ప్రభావితం చేసిందంటే...అక్టోబర్ ఒకటోతేదీ రాత్రి స్పృహ కోల్పోతే..అక్టోబర్ 3వ తేదీ ఉదయం నిద్రలేచేంత.కళ్లు తెరిచి చూసే సరికి ఆమె ఇంట్లో లేదు. బంగారు గొలుసు, ఖరీదైన ఐఫోన్ 14 ప్రో, రూ. 10వేల నగదు, క్రెడిట్,డెబిట్ కార్డులు మాయం. ఇంతలో తన బ్యాంకు అకౌంట్నుంచి రూ. 1.78 లక్షలు విత్‌డ్రా అయినట్లు కూడా గుర్తించాడు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పరారీలో ఉన్న మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ మొదలు పెట్టారు. -
ఐటీ ఉద్యోగిని.. ఎన్జీవో.. ఓ డేటింగ్ యాప్.. వీళ్ల ప్లానే వేరు..
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో హానీట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఎరక్కపోయి కొందరు కిలేడీల చేతికి చిక్కి మోసపోతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్ యాప్‌లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్‌కు తీసుకెళ్లింది. అక్కడ సదరు వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. అనంతరం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు డ్రామా క్రియేట్ చేసి డబ్బు కాజేయాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో హానీట్రాప్‌కు దిగిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్‌కు చెందిన బినితా కుమారి(27) గురుగ్రామ్‌లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అలాగే, హర్యానా రోహతక్‌లోని భాలతో గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహేశ్ ఫోగట్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి డేటింగ్ యాప్(బంబుల్ డేటింగ్ యాప్)లో అమాయకులకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా, డేటింగ్ యాప్‌లో బినితా కుమారి.. ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో గురుగ్రామ్ సెక్టార్-23లోని ఓ హోటల్‌కు రావాలని ఆఫర్ ఇచ్చింది. దీంతో, దొరికిందిలే ఛాన్ అని బాధితుడు హోటల్‌కు వెళ్లాడు. అయితే, హోటల్‌కు వెళ్లిన తర్వాత మనోడికి ఊహించని విధంగా షాక్ తగిలింది. బినితా కుమారి సదరు వ్యక్తిని బీర్ తాగమని బలవంతం చేసింది. తాను ఊహించినదానికి పరిస్థితులు వేరుగా కనిపించడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించావని, లైంగికంగా వేధించావని బెదిరించింది. రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే.. పోలీసు కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. She is Binita Kumari Known as B on Bumble Befriended men on dating apps Chose hotel as meeting place Said she wants to have "beer & fun" Few minutes into meeting cried Rape Went to police & filed complaint NGO guy then called to "strike deal" The gang Extorted LACS ARRESTED!! pic.twitter.com/rXDmX95HvM — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 అనంతరం, ఆమె గురించి ఆలోచించేలోపే మహేష్ ఫోగట్ నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లింది. రూ. 5 లక్షలు ఇస్తేనే సమస్య సెటిల్మెంట్ అవుతుందని బెదిరింపులకు దిగాడు. దీంతో, కంగారుపడిన బాధితుడు చేసేదేమీలేక డీల్‌కు ఒప్పుకుంటూ రూ.2 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ రూ. 50 వేలు ఇచ్చి భరోసా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై డీఎల్ఎఫ్ ఫేజ్-3 పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ అయింది. I was previously contacted by a victim in October too. Same modus operandi. Girl was different in that case. So we don't yet know how big is the gang or how many total victims Their latest victims got in touch We approached higher authorities and @gurgaonpolice swung in action pic.twitter.com/qlVB0b7auk — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 కాగా, ఈ కేసుపై రంగంలోకి దిగిన పోలీసులు.. మిగిలిన డబ్బులు తీసుకోవడానికి మౌల్సరి మార్కెట్ సమీపంలోని సాయి టెంపుల్‌కు రావాలని బాధితుడు ఆ ఇద్దరికీ కాల్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా మహేష్‌ను పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆ తర్వాత బినితా కుమారిని డీఎల్ఎఫ్-3 యూ బ్లాక్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇక, వీరిద్దరూ ఇప్పటి వరకు 12 మందిని మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: వీడియో: అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు.. షాకింగ్ విషయాలు వెల్లడి -
తేనె పూసిన కత్తులు! హనీ ట్రాప్‌లు ఎన్నో రకాలు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హనీట్రాప్ (వలపు వల). ఎదుటివారిని తమ వైపు ఆకర్షింపజేసుకుని, తమకు కావాల్సిన పని చేయించుకునేందుకు యువతులు/యువతుల పేరిట కేటుగాళ్లు వాడుతున్న అస్త్రం. గతంలో దేశ సరిహద్దుల రక్షణలో ఉండే కీలక అధికారులను లొంగ తీసుకునేందుకు శత్రుదేశాల గూఢచారులు ఈ విధమైన వల విసిరేవారు. ఇప్పుడిది అన్నిరకాల పనులకూ విస్తరిస్తోంది. తాజాగా టీఎస్పీఎస్సీ టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ పేపర్ లీకేజీ ఉదంతంలో కూడా ఇదే తరహాలో టీఎస్పీఎస్సీ సిబ్బందిని ట్రాప్ చేసినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే ఈ విధమైన వలపు వలలను ముందుగానే గుర్తించవచ్చని, తగిన జాగ్రత్తలు పాటిస్తే చిక్కుల్లో పడకుండా తప్పించుకోవచ్చని సైబర్ భద్రత నిపుణులు చెబుతున్నారు. నిత్యం సోషల్ మీడియా అకౌంట్లు వాడుతున్న ప్రతి ఒక్కరూ సోషల్ ప్రొఫైలింగ్‌కు గురికాకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. ఇటీవల జరిగిన కొన్ని హనీ ట్రాప్‌లు భారతీయురాలి పేరిట పాక్ నుంచి వాడుతున్న ఓ ఫేస్బుక్ అకౌంట్‌తో.. సరిహద్దుల్లో సున్నితమైన ప్రాంతాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత సైన్యంలోని 60 మంది జవాన్లు టచ్‌లో ఉన్నట్టు మిలటరీ ఇంటెలిజెన్స్ గుర్తించింది. పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కుకుని క్షిపణుల తయారీకి సంబంధించిన కీలక సమాచారాన్ని చేరవేశాడన్న ఆరోపణలపై డీఆర్డీఎల్ కాంట్రాక్టు ఉద్యోగి దుక్క మల్లికార్జున్‌రెడ్డిని 2022 జూన్‌లో రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. పాకిస్తాన్ ఏజెంట్ల హనీ ట్రాప్‌లో చిక్కి భారత నౌకాదళ సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్న 13 మంది ఇండియన్ నేవీ అధికారులను ఏపీ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ అధికారులు సంయుక్త ఆపరేషన్‌లో పట్టుకున్నారు. వీరందరినీ అరెస్టు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. హనీ ట్రాప్‌లు.. ఎన్నో రకాలు సోషల్ మీడియా ఆధారిత ట్రాప్‌లు: అందమైన యువతుల ఫొటోలు, పేర్లతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి వాటిని సోషల్ మీడియా ఖాతాల్లో ఉంచడం ద్వారా పలువురిని ట్రాప్ చేస్తున్నారు. ఆన్లైన్ వీఓఐపీ కాల్స్ (ఇంటర్నెట్ కాల్స్)తో వల: వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రొటోకాల్ (వీఓఐపీ) టెక్నాలజీ ఆధారిత కాల్స్ చేసి హనీ ట్రాప్‌కు పాల్పడతారు. తర్వాత వాట్సాప్, ఇతర యాప్స్ ద్వారా వ్యక్తిగత, వృత్తిపరమైన సమాచారం సేకరిస్తారు. ఇన్స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫాంల ద్వారా: ఆన్లైన్లో రియల్ టైం టెక్ట్స్ చాటింగ్ యాప్‌ల ద్వారా మెసేజ్‌లు పెడుతూ పరిచయం పెంచుకుని సైబర్ నేరగాళ్లు వలపు వలలోకి దించుతారు. అశ్లీల వెబ్సైట్ల ఆధారిత హనీ ట్రాప్‌లు: అశ్లీల వెబ్సైట్లు, అశ్లీల వీడియోలు, ఫొటోల లింక్‌లు పంపి, వాటి ద్వారా ఎదుటి వారిని లోబరుచుకుంటారు. ఈ మెయిల్లో లింక్‌ల ద్వారా..: ఈ మెయిల్స్‌లో లింక్‌లు పంపుతారు. క్రమంగా పరిచయం పెంచుకుని కావాల్సిన కీలక సమాచారాన్ని సేకరిస్తారు. డేటింగ్ యాప్‌లతో: డేటింగ్ యాప్‌లలో నగ్న వీడియో కాల్స్, ఫొటోలు పంపి ఆకర్షిస్తారు. ఎదుటి వారి నగ్న వీడియోలు, ఫొటోలు సేకరించి ఆ తర్వాత బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. ♦ అపరిచితుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. ♦ పనిచేసే కార్యాలయం వివరాలు, వృత్తి పరమైన అంశాలు సోషల్ మీడియా ఖాతాల్లో పంచుకోవద్దు. ♦ మిలటరీ, పోలీస్, ఇతర కీలక ఉద్యోగాల్లో ఉండేవారు వారి వృత్తిపరమైన సమాచారం, ఫొటోలు సోషల్ మీడియా ఖాతాల్లో పెట్టకపోవడమే ఉత్తమం. ♦ సోషల్ మీడియా ఖాతాల్లో వచ్చే పోర్న్ వీడియో లింకులను ఓపెన్ చేయవద్దు. సోషల్ ప్రొఫైలింగ్ అంటే ఏమిటి? సైబర్ నేరగాళ్లు, తమకు అనుకూలంగా ఇతరులను మార్చుకోవాలనుకునే వారు సోషల్ ఫ్రొఫైలింగ్ ద్వారా టార్గెట్స్‌ను ఎంచుకుంటున్నారు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ఖాతాలను విరివిగా వాడేవారికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, కుటుంబ, వృత్తి సంబంధిత వివరాలను వీరు సేకరిస్తారు. వాటి ద్వారా ఎదుటివారి బలహీనతలపై ఒక అంచనాకు వస్తారు. దాని ఆధారంగా వలపు వలలోకి లాగుతారు. అలా అడిగితే అనుమానించాల్సిందే హనీ ట్రాప్‌ల ముప్పు పెరుగుతోంది. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు అంగీకరించవద్దు. మన వ్యక్తిగత, వృత్తిపరమైన సున్నిత సమాచారం అడుగుతున్నారంటే అనుమానించాలి. వెంటనే అలాంటి సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేయాలి. వారిని అన్‌ఫ్రెండ్ చేయాలి. అవసరమైతే పోలీసుల్ని సంప్రదించాలి. – పాటిబండ్ల ప్రసాద్, సైబర్ ఇంటెలిజెన్స్ నిపుణుడు, ఢిల్లీ -
శ్రద్ధా హత్య కేసులో ట్విస్ట్.. ప్రియురాలి శవాన్ని ఫ్రిజ్‌లో ఉంచి.. మరో యువతితో..
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ ప్రేయసి హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగులోకి వస్తున్నాయి. ప్రియురాలు శ్రద్దా వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పునావాలా.. ప్రియురాలు మృతదేహం అపార్ట్మెంట్లో ఉండగానే మరో యువతిని తరచూ ఇంటికి తీసుకొచ్చేడని పోలీసుల విచారణలో తేలింది. శ్రద్ధాను చంపిన 15, 20 రోజుల్లోనే అప్తాబ్ డేటింగ్ యాప్ ఇన్స్టాల్ చేసి యువతుకలు గాలం వేసేవాడని పోలీసులు పేర్కొన్నారు. గతంలో అదే డేటింగ్ యాప్‌లో శ్రద్ధాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఇలా మరో యువతితో పరిచయం పెంచుకొని.. ప్రియురాలి శవం ఫ్రిజ్‌లో ఉండగానే జూన్, జూలై నెలలో ఆమెను ఇంటికి పిలిపించినట్లు తెలిసింది. అయితే కొత్త గర్ల్‌ఫ్రెండ్‌ను ఇంటికి తీసుకువచ్చినప్పుడు.. శ్రద్ధా శరీర భాగాలను అల్మారాకు తరలించేవాడని తెలిపారు. అంతేగాక డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన పలువురు మహిళలను అతడు ఇంటికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. చెఫ్‌గా శిక్షణ పొందిన అఫ్తాబ్, శ్రద్ధా శరీరాన్ని ముక్కలుగా చేసే ముందు రక్తపు మరకలు ఎలా శుభ్రం చేయాలో గూగుల్ చూసి నేర్చుకున్నట్లు, శరీరాన్ని ముక్కలు చేయడం కోసం హ్యుమన్ అనాటమీని చదివినట్లు పేర్కొన్నారు. క్రైం థ్రిల్లర్స్, వెబ్ సిరీస్‌లు చూసే అలవాటున్న అఫ్తాబ్.. అమెరికన్ వెబ్ సిరీస్ ‘డెక్సటర్’ ద్వారా ప్రేరణ పొంది శ్రద్ధాను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో భద్రపరిచాడు. ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు అగర్బత్తీలు వెలిగించడం, ఫ్రిజ్‌లో దాచిన ఆమె ముఖాన్ని అప్పుడప్పుడు తీసి చూసుకునేవాడు. త్వరగా చెడిపోతున్న శరీర భాగాలను ముందుగా పారేసేవాడు. అతడి స్నేహితులు, ఫుడ్ డెలివరీ బాయ్స్, ఇతరులు.. తరచుగా ఇంటికి వస్తున్నా…ఇంట్లో కొన్నాళ్ల నుంచి మృతదేహం విడిభాగాలు ఉన్న విషయం ఎవరికీ అనుమానం రాకుండా జాగ్రత్త వహించాడు. చదవండి: శ్రద్ధా హత్య కేసు: కటకటాల్లో అఫ్తాబ్ సుఖనిద్ర! శ్రద్ధా హత్య తెలియకుండా ఉండేందుకు ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను అఫ్తాబ్ ఉపయోగించేవాడు. దాని నుంచి తన స్నేహితులకు మెసెజ్ చూస్తూ ఉండేవాడు. ఆమె క్రెడిట్ కార్డు బిల్లులు కూడా చెల్లించేవాడు. అయితే రెండు నెలలుగా శ్రద్ధా ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో అనుమానం వచ్చిన ఆమె స్నేహితులు యువతి తల్లిదండ్రులకు విషయం చెప్పారు. దీంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. హత్య జరిగిన ఆరు నెలలకు ఈ ఉదంతం బయటకు రావడం గమనార్హం. ఇప్పటికే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు శ్రద్ధాను హత్య చేసేందుకు ఉపయోగించిన కత్తి కోసం గాలిస్తున్నారు. కాగా 24 ఏళ్ల శ్రద్ధాకు అఫ్తాబ్‌తో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. దాదాపు మూడేళ్లు కలిసి జీవించారు. వీరి ప్రేమకు యువతి తల్లిదండ్రులు అడ్డు చెప్పడంతో ఇద్దరు కలిసి ఈ ఏడాది ఏప్రిల్ ఢిల్లీకి మకాం మార్చారు. తనను పెళ్లి చేసుకోవాలని శ్రద్ధ ఒత్తిడి తీసుకురావడంతో వీరి మధ్య తరుచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మే 18న మరోసారి ఇద్దిరి మధ్య గొడవ జరగడంతో శ్రద్ధను అత్యంత అమానుషంగా గొంతు కోసి చంపాడు. అనంతరం ఆమె శరీర భాగాలను 35 ముక్కలుగా కట్ చేసి పాడవకుండా ఉండేందుకు భారీ ఫ్రిజ్‌లో అమర్చాడు. తరువాత వాటిని ఒక్కొక్కొటిగా ఢిల్లీ నగరమంతా పారేశాడు. -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. కలుసుకుందామని చెప్పడంతో
సాక్షి, హైదరాబాద్: డేటింగ్ యాప్‌లో పరిచయమైన వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు లాక్కున్న వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే... బీహెచ్ఈఎల్లో పనిచేస్తున్న యువకుడు(25) ఓ సాఫ్ట్వేర్ సంస్థలో పనిచేస్తున్నాడు. అతడికి బ్లూడ్ అనే స్వలింగ సంపర్కుల యాప్‌లో అమీర్ అలియాస్ వంశీనాయుడు అనే పేరుతో ఓ వ్యక్తి పరిచయమయ్యాడు. అతడి ప్రొఫైల్ పిక్చర్ చూసిన బాధిత యువకుడు కలుసుకుందామని చెప్పడంతో ఈ నెల 21న రాత్రి బంజారాహిల్స్ రోడ్ నెం 12కు వచ్చాడు. అయితే ప్రొఫైల్‌లో పెట్టిన ఫొటోకు.. తనను కలిసేందుకు వచ్చిన వ్యక్తికి పోలికలు లేకపోవడంతో పాటు వచ్చిన వ్యక్తి ట్రాన్స్‌జెండర్‌గా గుర్తించిన బాధితుడు తనకు నచ్చలేదని చెప్పి వెనక్కి వెళ్లిపోయేందుకు సిద్ధపడ్డాడు. దీంతో ఆగ్రహానికి గురైన అమీర్ అలియాస్ వంశీకృష్ణ కత్తి బయటికి తీసి డబ్బులు ఇవ్వాలని బెదిరించారు. తనవద్ద డబ్బు లేదని చెప్పినా వినిపించుకోకుండా ఫోన్ లాక్కుని గూగుల్‌పే, ఫోన్‌పే ద్వారా రూ. 31 వేలు ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు. బాధితుడు శనివారం రాత్రి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చదవండి: Hyderabad: భర్తతో సినిమాకు వెళ్లి.. కనిపించకుండా పోయిన భార్య -
డేటింగ్ యాప్‌కు బానిసగా వైద్యుడు.. రూ.1.53 కోట్లు కొట్టేశారు
సాక్షి, హైదరాబాద్: పద్మారావునగర్‌కు చెందిన ఓ వైద్యుడిని డేటింగ్ యాప్‌కు బానిసగా మార్చి, 2020 నుంచి మూడు విడతల్లో రూ.కోటికి పైగా కాజేసిన ముఠాలో ఓ నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారుల కోసం గాలిస్తున్నామని సంయుక్త సీపీ డాక్టర్ గజరావ్ భూపాల్ తెలిపారు. ఏసీపీ కేవీఎం ప్రసాద్‌తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వరంగల్‌లోని కాకతీయ వైద్య కళాశాల నుంచి వైద్య పట్టా పొందిన బాధితుడు కేంద్ర సర్వీసులో వైద్యుడిగా ఉన్నారు. ఈయన 2020లో జిగోలో ప్లేబాయ్ సర్వీసెస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ డేటింగ్ యాప్ నిర్వాహకులే కొందరు యువతులను నియమించుకున్నారు. బాధితులతో చాటింగ్, ఫోన్ కాల్స్ చేస్తున్నారు. నగరవాసి వారికి కాల్ చేయగా.. కొందరు మాట్లాడి కొన్ని ఫొటోలు పంపి వాటిలో ఉన్న యువతులు డేటింగ్‌కు సిద్ధమన్నారు. దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకుని, కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. అలా ఆ ఏడాది జూన్ 6 నుంచి ఈ వైద్యుడు ‘చెల్లింపులు’ మొదలెట్టారు. చదవండి: (‘పుట్టిన రోజే ఇలా చేశావేమయ్యా’) ఈ కథను వాట్సాప్‌లోకి మార్చిన నేరగాళ్లు ఆ యువతులే చాట్ చేస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు సృష్టించారు. తమను కలుసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని చెప్పించారు. వైద్యుడు నమ్మేయడంతో పలు దఫాలుగా నగదు వేయించుకుంటూ వెళ్లారు. ప్రతి సందర్భంలోనూ చెల్లించిన మొత్తంలో కొంత రిఫండ్ అన్నారు. ఏ దశలో అయినా డబ్బు చెల్లించడం ఆపేస్తే ఏమాత్రం తిరిగి రాదంటూ బెదిరించారు. దీంతో బాధితుడు 2020 అక్టోబర్ వరకు రూ.41.5 లక్షలు, కొంత విరామం ఇచ్చినా 2021 మార్చి వరకు మరో రూ.30 లక్షలు చెల్లించేశాడు. జీతంలో దాచుకున్న దానితో పాటు అప్పులు చేసి, చివరకు ప్రావిడెంట్ ఫండ్ లోన్లు తీసుకుని డబ్బు చెల్లించేశాడు. ఇలా మూడు దఫాలుగా మొత్తం రూ.1.53 కోట్లు వారికి పంపేశాడు. రెండుసార్లు కేసు నమోదైనా బాధితుడి ఒత్తిడితోనే మూతపడింది. చివరకు జూలైలో మరో కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీకి చెందిన అరుణ్ ఖాతాలో రూ.30 లక్షలు పడినట్లు గుర్తించి అతడిని అరెస్టు చేశారు. ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న సూత్రధారులు మోహిత్, దీపక్, మంజిత్, నీతు, సోలంకి కోసం గాలిస్తున్నారు. -
ఆన్లైన్ డేటింగ్‌కు బానిసైన డాక్టర్.. పట్టమంటాడు... వదలమంటాడు!
సాక్షి, సిటీబ్యూరో: ఆన్లైన్ డేటింగ్ బానిసగా మారిన ఓ వైద్యుడు సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. తనను మోసం చేసిన నిందితులను పట్టుకోవాలని రెండుసార్లు, పట్టుకున్న వారిని వదిలేయాలని ఓసారి ఇప్పటికే ఈ అధికారులను వేధించాడు. తాజాగా సోమవారం మరోసారి సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేస్తూ ఇప్పటి వరకు తన నుంచి రూ.1.5 కోట్లు కొట్టేసిన ‘లొకంటో క్రిమినల్స్’ను కటకటాల్లోకి పంపాలని వేడుకున్నాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. పద్మారావ్‌నగర్‌కు చెందిన వ్యక్తి (60) కేంద్ర సర్వీసులో వైద్యుడిగా గుజరాత్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. కొన్నాళ్లుగా నగరంలోనే ఉంటున్నాడు. ఇతను 2020లో లొకంటో సైట్లో కనిపించిన ప్రకటనకు ఆకర్షితుడయ్యాడు. సైబర్ నేరగాళ్లు యువతుల ఫొటోలు అందులో పోస్టు చేసి సెల్ నంబరు ఇచ్చారు. డేటింగ్‌పై ఆసక్తి ఉంటే కాల్ చేయాల్సిందిగా సూచించారు. ♦సదరు వైద్యుడు వారికి కాల్ చేయగా... కొందరు వ్యక్తులు మాట్లాడి ఆ ఫొటోలు ఉన్న యువతులు డేటింగ్‌కు సిద్ధమన్నారు. దానికోసం రిజిస్ట్రేషన్ చేసుకుని, కొంత మొత్తం అడ్వాన్స్‌గా చెల్లించాలంటూ తమ బ్యాంకు ఖాతా వివరాలు అందించారు. ♦అలా ఆ ఏడాది జూన్ 6 నుంచి అతను ‘చెల్లింపులు’ మొదలెట్టాడు. ఈ కథను వాట్సాప్‌లోకి మార్చిన నేరగాళ్లు ఆ యువతులే చాట్ చేస్తున్నట్లు, మాట్లాడుతున్నట్లు నమ్మించారు. తమను కలుసుకోవాలంటే మరికొంత మొత్తం చెల్లించాలని చెప్పించారు. ♦వైద్యుడు నమ్మేయడంతో దఫదఫాలుగా నగదు వేయించుకుంటూ వెళ్లాడు. ప్రతి సందర్భంలోనూ చెల్లించిన మొత్తంలో కొంత రీఫండ్ అన్నారు. ఏ దశలో అయినా డబ్బు చెల్లించడం ఆపేస్తే ఏమాత్రం తిరిగి రాదంటూ బెదిరించారు. ♦దీంతో బాధితుడు 2020 అక్టోబర్ వరకు రూ.41.5 లక్షలు, కొంత విరామం ఇచ్చినా 2021 మార్చి వరకు మరో రూ.30 లక్షలు చెల్లించేశాడు. జీతంలో దాచుకున్న దానితో పాటు అప్పులు చేసి, చివరకు ప్రావిడెంట్ ఫండ్ లోన్లు తీసుకుని డబ్బు చెల్లించాడు. ♦విషయం కుటుంబీకులకు తెలియడంతో రెండుసార్లు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దర్యాప్తు చేసిన అధికారులు గతేడాది ఢిల్లీకి చెందిన నిందితుడిని అరెస్టు చేశారు. అతడి ఖాతాలో రూ.18 లక్షలు పడినట్లు ఆధారాలు సేకరించారు. ♦నేరం అంగీకరించిన అతగాడు రూ.12 లక్షలు తిరిగివ్వడానికీ ఒప్పుకున్నాడు. నెల అతడు జైల్లో ఉన్న తర్వాత వైద్యుడు అడ్డం తిరిగాడు. తనతో ఫోన్లో మాట్లాడి మోసం చేసిన వ్యక్తి గొంతు, ఇతడి గొంతు వేరుగా ఉన్నాయని, అతడిచ్చే డబ్బు తనకు వద్దన్నాడు. ♦కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసి, నిందితుడిని వదిలి పెట్టే వరకు సైబర్ క్రైమ్ పోలీసులను తనదైన శైలిలో వేధించాడు. ఆపై మళ్లీ ఇతడికి సైబర్ నేరగాళ్ల నుంచి ఫోన్లు రావడం మొదలైంది. యువతులు మాట్లాడటం, రీఫండ్ అంటూ చెప్పడంతో డబ్బు చెల్లించడమూ కొనసాగించారు. ♦ఈ కాలంలో మరో రూ.80 లక్షలు వరకు చెల్లించేశాడు. కనీసం ఇంటి ఖర్చులకు డబ్బులేని స్థితికి చేరడంతో సమీప బంధువు విషయం తెలుసుకున్నాడు. ఆయన ద్వారా సోమవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశాడు. ♦వైద్యుడితో పాటు అతడి కుటుంబం పరిస్థితిని పరిగణలోకి తీసుకున్న ఏసీపీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. దీంతో ఇన్స్పెక్టర్ ప్రశాంత్ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. చదవండి: ఐ లవ్యూ డాడీ.. అమ్మను గొంతుకోసి చంపేశా! క్షమించు -
యువతి మాయలో బ్యాంక్ మేనేజర్.. రూ. 5.70 కోట్లు బదిలీ!
బనశంకరి: డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ యువతి మాయలో పడిన బ్యాంక్ మేనేజర్ తన స్వంత డబ్బు రూ.12 లక్షలు, ఖాతాదారులకు చెందిన రూ.5.70 కోట్లు ఆమె ఖాతాకు బదిలీ చేసి కటకటాల పాలైన ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. హనుమంతనగర ఇండియన్ బ్యాంకులో అనిత అనే మహిళ రూ.1.32 కోట్లు డిపాజిట్ చేసింది. డిపాజిట్ ఆధారంగా ఆమె రూ.75 లక్షల రుణం తీసుకుంది. అనంతరం బ్యాంక్ మేనేజర్ హరిశంకర్, అసిస్టెంట్ మేనేజర్ కౌసల్య, క్లర్క్ మునిరాజు పథకం ప్రకారం అనిత డిపాజిట్ ఖాతా లీన్‌మార్క్‌ను అనధికారికంగా ఉంచి.. ఆమె డిపాజిట్ ఆధారంగా మే 13వ తేదీ నుంచి 19వ తేదీ మధ్య ఓవర్‌డ్రాప్ట్ ఖాతాలు తెరిచారు. అందులోకి రూ.5.82 కోట్లు జమ చేశారు. ఈ డబ్బును పశ్చిమ బెంగాల్‌లోని 28 బ్యాంక్ అకౌంట్లకు, రాష్ట్రంలోని రెండు బ్యాంకు అకౌంట్లకు 6 రోజుల వ్యవధిలోనే 136 సార్లు జమ చేశారు. ఈ విషయం బ్యాంకు అధికారుల దృష్టికి వెళ్లడంతో అంతర్గత విచారణ జరిపారు. ఖాతాదారు పేరుతో రుణం తీసుకున్నట్లు తెలిసి బ్యాంక్ రీజనల్ మేనేజర్ డీఎస్ మూర్తి హనుమంతనగర పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేరళకు చెందిన హరిశంకర్ భార్య కాన్పు కోసం పుట్టింటికి వెళ్లింది. దీంతో అడ్డదార్లు తొక్కడం మొదలుపెట్టిన హరిశంకర్ డేటింగ్ యాప్‌లో ఓ యువతితో పరిచయం పెంచుకున్నాడు. యువతి మాయమాటల్లో పడి ఆమె ఖాతాకు తన స్వంత డబ్బు రూ.12 లక్షలు, ఖాతాదారులకు చెందిన రూ.5.70 కోట్లు జమ చేసినట్లు హరిశంకర్ పోలీసుల ముందు అంగీకరించాడు. కాగా, బ్యాంకు మేనేజర్ గుర్తుతెలియని యువతికి ఇంత పెద్ద మొత్తంలో నగదు జమ చేయడంపై అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు అతని సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. యువతితో జరిగిన సంభాషణ, ఇతర వ్యవహారాలపై నిర్ధారణ కోసం నిపుణుల సాయం తీసుకుంటున్నారు. పోలీసులు హరిశంకర్‌ను కోర్టులో హాజరు పరిచిన అనంతరం 10 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు. -
జల్సా రాజా: కాస్ట్లీ ట్రాప్‌తో ఎర.. నిండా మునిగిన యువతులెందరో!
అమ్మాయిలను పడేయడం అందరి వల్లా కాదురా.. అది ఒక ఆర్ట్ అంటూ ఓ సినిమాలో డైలాగ్ ఉంటుంది. కానీ, ఆ పడేయడంలోనూ సినిమాటిక్ కోణాన్ని చూపించాడు ఓ గురుడు. ఈ టెక్నికల్ ఏజ్‌లో దేశ విదేశాల్లో అంతే హైటెక్ మోసానికి పాల్పడ్డాడు. ఊహించని రేంజ్ విలాసాలను ప్రదర్శించడమే కాదు.. అమ్మాయిలను అంతే ఎమోషనల్‌గా ముగ్గులోకి దించి చివరికి డబ్బుతో ఉడాయించాడు. ఆ దెబ్బకు దివాళా తీసి రోడ్డున పడ్డ ఆ అమ్మాయిలు.. తమ వ్యధను తెరపైకి ‘ది ట్విండర్ స్విండ్లర్’(ట్విండర్ మోసగాడు) తీసుకొచ్చి హాట్ టాపిక్‌గా మారారు. The Twinder Swindler యూకేలో నెంబర్ వన్ నెట్‌ఫ్లిక్స్ సిరీస్‌గా ఉంది. అంత క్రేజ్ ఎందుకు అంటారా? అది ఒక వాస్తవిక గాథ కాబట్టి!. డేటింగ్ పేరుతో ఓ వ్యక్తి చేసిన మోసం తాలుకా సాక్ష్యం ఇది. ది టిండర్ స్విండ్లర్ డాక్యుమెంటరీ.. గత కొన్నిరోజులుగా ట్రెండింగ్‌లో నిలవడమే కాదు.. ఈ కేసులోని బాధితుల, నిందితుడి తరపున చర్చనీయాంశంగా మారుతోంది ఇప్పుడు. ఆ మోసగాడి పేరు షిమన్ హయత్. ఇజ్రాయెల్ డైమండ్ మొఘల్ లెవ్ లెవెయివ్ కొడుకుగా సిమన్ లెవెయివ్ పేరుతో ప్రచారం చేసుకుంటూ డేటింగ్ యాప్ టిండర్‌లో డేటింగ్ వ్యవహారానికి తెర లేపాడు. ప్రైవేట్ విమానాల్లో విహారయాత్రలు, విలాసవంతమైన హోటళ్లలో లంచ్‌లు డిన్నర్లతో డేటింగ్ చేసిన అమ్మాయిలకు గాలం వేసేవాడు. ఆపై ఎమోషనల్ ట్రాప్‌తో వాళ్ల నుంచి డబ్బు తీసుకుని ఉడాయించేవాడు. అలా ఎంత మందిని మోసం చేశాడో తెలియదు. కానీ, 10 మిలియన్ డాలర్లకుపైనే మోసానికి పాల్పడినట్లు ఒక అంచనా. షిమన్ దెబ్బకు అప్పుల పాలై పీకలి లోతు అప్పులోకి మునిగిపోయిన ముగ్గురు యువతులు.. ఫండ్ రైజ్ ద్వారా కోలుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ది ట్విండర్ స్విండ్లర్ డాక్యుమెంటరీ వాళ్ల లాంటి ఎందరో బాధితులను వెలుగులోకి తీసుకొస్తోంది. తననూ ముగ్గులోకి దించే ప్రయత్నం చేశాడని, కానీ, అనుమానం రాగా.. తెలివిగా తప్పించుకున్నానని అర్జెంటీనాకు చెందిన ఓ యువతి వెల్లడించింది. అయితే 200 కే మిలియన్ల ఫాలోవర్స్ ఉన్న షిమన్.. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌ను డిలీట్ చేయడంతో పాటు ఈ వ్యవహారంలో తనను ఇరికించే కుట్ర జరుగుతుందంటూ చివరి మెసేజ్‌ను ఉంచడం కొసమెరుపు. రివెంజ్ తీర్చుకునేందుకు బాధిత యువతులందరూ ఏకమవుతున్న తరుణంలో.. షిమన్ కౌంటర్ యాక్షన్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. 2020లో ఇజ్రాయెల్ కోర్టు కేవలం 47 వేల డాలర్లు మాత్రమే చెల్లించాలంటూ తక్కువ శిక్షతో సరిపెట్టడం బాధితులను స్థిమితంగా ఉండనివ్వడం లేదు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడంతోపాటు శారీరకంగా, ఆర్థికంగా దోచుకున్న ఆ జల్సా రాజాకి సరైన గుణపాఠం చెప్పాలని పోరాడుతున్నారు. వీళ్లకు మద్దతు ఇచ్చే వాళ్లు కొందరైతే.. గుడ్డిన నమ్మి మోసపోయారంటూ బాధితులనే తిట్టిపోసేవాళ్లు మరికొందరు!. -
డేటింగ్ యాప్‌లో పరిచయం.. చాటింగ్‌లో మునిగితేలారు.. చివరకు
సాక్షి, బనశంకరి(కర్ణాటక): సిలికాన్ సిటీలో ఆన్లైన్ బందిపోట్లు దోచేస్తున్నారు. ఉద్యోగాల పేరుతో యువతీ యువకులను బురిడీకొట్టించి లక్షలాది రూపాయలు వంచనకు పాల్పడుతున్నారు. తాజాగా బెంగళూరు నగరంలో ఇద్దరు మహిళలు లక్షలాది రూపాయల వంచనకు గురయ్యారు. ఆన్లైన్లో ఉద్యోగమని మహిళను నమ్మించి రూ.19.67 లక్షలను స్వాహా చేశారు. ఈ ఘటనపై ఆగ్నేయ విభాగం సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మడివాళ మారుతీనగరకు చెందిన 33 ఏళ్ల మహిళ బాధితురాలు. గృహిణి అయిన ఆమె ఇంటి వద్ద నుంచి పార్ట్‌టైం జాబ్ చేసి డబ్బు సంపాదించవచ్చని ఇంటర్నెట్లో పలు ప్రకటనలను చూసింది. ఓ వెబ్సైట్లో శోధించగా, వంచకులు పరిచయమయ్యారు. వస్తువుల విక్రయం ద్వారా దండిగా కమీషన్ పొందవచ్చునని ఆశచూపారు. దరఖాస్తు భర్తీ చేయాలని ఆమె వాట్సప్‌కి ఒక లింక్‌ను పంపించగా క్లిక్‌చేసి భర్తీ చేసింది. ఇక రిజిస్ట్రేషన్ తదితర ఫీజులను చెల్లించాలని ఆమె నుంచి విడతలవారీగా రూ.19.67 లక్షలను రాబట్టారు. చివరకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వకపోగా, ఫోన్లు కూడా స్విచాఫ్ చేసుకున్నారని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది. ఆగ్నేయ విభాగ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేసి కేటుగాళ్ల కోసం గాలిస్తున్నారు. ముంచేసిన డేటింగ్ పరిచయం మొబైల్ డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన మోసగాని వల్ల బెంగళూరు మహిళ రూ.18.29 లక్షలు పోగొట్టుకుంది. ఈ ఘటనపై కేంద్ర విభాగ సైబర్‌క్రైం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆస్టిన్‌టౌన్ నివాసి అయిన 37 ఏళ్ల మహిళ డేటింగ్ యాప్‌లో ఖాతా తెరిచింది. ఆ యాప్‌లో ఆమెకు ఓ వ్యక్తితో పరిచయమైంది. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఫోన్లో మాట్లాడుకోవడం, చాటింగ్‌లో మునిగితేలారు. ఇద్దరూ ఫోటోలు వినిమయం చేసుకున్నారు. విదేశాల్లో స్థిరపడినట్లు చెప్పుకున్న వంచకుడు ఆమెను వివాహం చేసుకుంటానని చెప్పగా అంగీకరించింది. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయని నమ్మించి ఆమె నుంచి పలు దఫాలుగా రూ.18.29 లక్షలు జమ చేయించుకున్నాడు. ఓ రోజు వంచకుడు డేటింగ్ యాప్ నుంచి అకౌంట్‌ను తొలగించి ఫోన్ స్విచాఫ్ చేసుకున్నాడు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు. -
టోలిచౌకి: యువతుల అర్ధ నగ్న ఫొటోలతో వ్యభిచారం
సాక్షి, నాగోలు: డేటింగ్ యాప్‌లో యువతుల అర్ధ నగ్న ఫొటోలు పెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండా దేశానికి చెందిన నిర్వాహకురాలితో పాటు ఆ దేశానికి చెందిన యువతిని రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలను వెల్లడించారు. ఉగాండా దేశానికి చెందిన నముబిరు సియానా (32) నాలుగేళ్ల క్రితం విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి టోలిచౌకిలోని నిజాంకాలనీలో నివాసం ఉంటోంది. ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో ఆన్లైన్ వ్యభిచారం ప్రారంభించింది. ఉగాండా నుంచి ఓ యువ తిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు మీర్ పేట చెరువు వద్ద వారిని అరెస్ట్ చేశారు. సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకొని యువతిని హోమ్‌కు తరలించారు. నముబిరు సియానాపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ తెలిపారు. మాట్లాడుతున్న సీపీ మహేష్ భగవత్ బాధితులకు పునరావాసం.. మహిళలను, చిన్నారులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకం దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాది ఏర్పాటు చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అక్రమ రవాణా నుంచి మహిళలను కాపాడిందని తెలిపారు. మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించి, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. -
బర్త్ డేకు యువకుడి సర్ప్రైజ్.. నమ్మిన యువతి.. మత్తులో
ముంబై: ప్రస్తుతం యువతీయువకుల మధ్య సరికొత్త బంధాలకు డేటింగ్ యాప్‌లు వేదికవుతున్నాయి. కొత్త వ్యక్తులతో పరిచయం కావడం.. వారితో స్నేహం దారుణ సంఘటనలకు దారి తీస్తోంది. యువతీయువకులతో పాటు గే డేటింగ్ యాప్‌లు కూడా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఆ యాప్‌లను ఉపయోగించుకున్న వారు పలు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఓ యువతిని తన పుట్టినరోజుకు పిలిచి స్టార్ హోటల్లో అత్యాచారం చేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముంబైకి చెందిన ఓ యువతికి డేటింగ్ యాప్‌లో ఓ యువకుడు నెల కిందట పరిచయమయ్యాడు. అతడితో చాటింగ్ కొనసాగుతోంది. ఇక సోమవారం (జూలై 26వ తేదీ)న ఆమె పుట్టినరోజు ఉండడంతో అతడు ముంబైలోనే అత్యంత ఖరీదైన ప్రాంతంగా ఉన్న వర్లీలోని ఓ స్టార్ హోటల్లో బర్త్ డే ఏర్పాట్లు చేశాడు. నీ కోసం ఈ ఏర్పాట్లు చేశానని చెప్పి ఆమెను హోటల్‌కు ఆహ్వానించాడు. అక్కడకు చేరుకున్న యువతికి అతడు మందు గ్లాస్ ఇచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా మత్తులోకి జారుకుంది. అనంతరం అతడు హోటల్ గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. తేరుకున్న అనంతరం తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని గుర్తించి షాక్‌కు గురయ్యింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. నిందితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
KPHB Colony: డేటింగ్ యాప్‌లో ప్రొఫైల్.. పెళ్లైన విషయం దాచి
సాక్షి, కేపీహెచ్‌బీకాలనీ: పెళ్లి అయిన విషయాన్ని దాచిపెట్టి మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు యత్నించిన వైద్యుడిని కేపీహెచ్‌బీ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం.. నిజాంపేట రోడ్డులోని నాగార్జున హోమ్స్‌లో నివాసముండే ఓ యువతి గతేడాది బంబుల్ డేటింగ్ యాప్‌లో తన ప్రొఫైల్ ఫొటో అప్లోడ్ చేసింది. ఏఐజీ హాస్పిటల్లో న్యూరో సర్జన్‌గా విధులు నిర్వర్తిస్తున్న బంజారాహిల్స్ సుజాత స్టెర్లింగ్ హోమ్స్‌లో నివాసముండే డాక్టర్ అభిరామ్ చంద్ర గబ్బిత (32), ఆమె ఫొటోను చూసి మాటలు కలిపాడు. ఇలా ఒకరికొకరు పరిచయమై పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే అభిరామ్ చంద్రకు గతంలోనే పెళ్లి జరిగిందని తెలుసుకున్న బాధితురాలు తనను మోసం చేసేందుకు ప్రయత్నించాడని పోలీసులను ఆశ్రయించగా బుధవారం అభిరామ్ చంద్రను రిమాండ్‌కు తరలించారు. -
శారీరక సుఖం కోసం ఆశపడి 1.29 కోట్లు పోగొట్టుకున్నాడు
రాజ్‌కోట్ : శారీరక వాంఛ, అత్యాశ ఓ వ్యక్తిని నిండా ముంచాయి. ఆ వ్యక్తి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి ఏకంగా 1.29 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. రాజ్‌కోట్ జిల్లా గోండల్ పట్టణానికి చెందిన అశ్విన్ విసారియాకు ఎర్త్ మూవింగ్ మిషిన్లతో పాటు బాగా పొలంకూడా ఉంది. గత సంవత్సరం ఫిబ్రవరి నెలలో అతడి మొబైల్‌కు ఓ మెసేజ్ వచ్చింది. ‘‘ మీకు అందమైన హై ప్రోఫైల్ మహిళలతో డేటింగ్, శృంగారం కావాలంటే సంప్రదించండి..’’ అని అందులో ఉంది. అది చదివిన అశ్విన్ ఆసక్తిగా ఉన్నట్లు రిప్లై ఇచ్చాడు. అవతలినుంచి వాట్సాప్ కాల్ చేసిన ఓ నిందితుడు డేటింగ్ క్లబ్లో మెంబర్ షిప్ ఫీజుగా రూ. 2,500 చెల్లించమంటే అశ్విన్ చెల్లించాడు. కొద్దిరోజులకు మరింత డబ్బు చెల్లించి అందులో వీఐపీ మెంబర్ అయ్యాడు. అయితే, అతడికి ప్రతిఫలంగా ఏమీ దక్కలేదు. దీంతో తన డబ్బు తిరిగి చెల్లించాలని నిందితులను అడగటం మొదలుపెట్టాడు. ఈ నేపథ్యంలో నిందితులు డబ్బులు తిరిగి చెల్లించకపోగా.. మరో కొత్త స్కీము గురించి చెప్పారు. తమ స్కీములో డబ్బులు పెట్టుబడిగా పెడితే ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పారు. మోసగాడి మాటలు నమ్మిన అతడు ఈ సారి భారీ మొత్తాలను పెట్టుబడిపెట్టి మోసపోయాడు. మొత్తంగా 1.29 కోట్ల రూపాయలు పోగొట్టుకున్నాడు. తాను మోసపోయానని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పలువురిపై మోసం, నేర కుట్ర కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
డేటింగ్ యాప్‌లో ఫొటోతో నటికి వేధింపులు
సాక్షి, హైదరాబాద్: కొందరు పోకిరీలు తన ఫొటోను డేటింగ్ యాప్‌లో పెట్టారంటూ సినీ నటి గీతాంజలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. డేటింగ్ యాప్‌లో తన చిత్రాలు పెట్టడంతో పాటు తనను తీవ్రంగా వేధిస్తున్నారని వాపోయింది. తనకు అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని చెప్పిన నటి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు గీతాంజలి మీడియాతో మాట్లాడుతూ.. 'సోషల్ మీడియా, డేటింగ్ యాప్‌లో నా ఫోటో పెట్టినట్లు తెలిసింది. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను. సెలబ్రిటీల ఫోటోలు పెట్టుకుని డబ్బులు సంపాదించే వారిపై చర్యలు తీసుకోవాలి. మరో అమ్మాయికి ఇలాంటి ఘటన జరగకూడదు' అని పేర్కొంది. దీనిపై ఐపీసీ 501 సెక్షన్ కింద హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. నటి ఫిర్యాదుపై విచారణ చేపట్టామని ఏసీపీ ప్రసాద్ తెలిపారు. చదవండి: నారప్ప కంటే ముందుగా దృశ్యం- 2! -
ఆన్లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచారం.. కస్టమర్‌గా ఫోన్‌చేసి..
సాక్షి, చైతన్యపురి: ఆన్లైన్ డేటింగ్ పేరుతో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగాండా వాసులు అయిదుగురిని రాచకొండ యాంటి హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం, చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన మేరకు.. లొకాంటో యాప్ ద్వారా యువతుల చిత్రాలు పోస్ట్ చేసి వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి వారి ఆటకట్టించాలని పోలీసులు నిర్ణయించారు. డెకాయ్ బృందంలోని సభ్యుడు కస్టమర్‌గా యాప్‌లోని ఫోన్‌కు కాల్ చేసిన సాలి మిల్లి అలియాస్ నాగబాలా షేక్ అలియాస్ షీలాను సంప్రదించాడు. ముగ్గురు యువతులు ఉన్నారని చెప్పడంతో దిల్సుఖ్నగర్ రాజధాని థియేటర్ వద్దకు రావాలని లోకేషన్ షేర్ చేశాడు. గురువారం సాయంత్రం 5గంటల సమయంలో ఇద్దరు నిర్వాహకులతోపాటు ముగ్గురు యువతులు రావడంతో అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నిషేధిత నార్కోటిక్స్ డ్రగ్స్ (మత్తుమందు) కలిగి ఉన్నట్లు గుర్తించారు. వారి నుంచి అయిదు సెల్ఫోన్లు, రూ.5500 నగదు, 5గ్రాముల కెటామైన్ డ్రగ్, 17 గ్రాముల గుర్తుతెలియని మత్తుమందు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. వీరంతా విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి చట్టవిరుద్ధంగా ఇక్కడే ఉంటున్నారని పోలీసులు గుర్తించారు. టోలిచౌకిలో వీరు నివాసముంటున్నారు. చదవండి: జూబ్లీహిల్స్: ఓయో రూమ్‌లో వ్యభిచారం.. -
డేటింగ్ యాప్‌లో.. బ్లడ్ డోనార్స్!
కరోనాకు ముందు డేటింగ్ యాప్‌లకు మంచి డిమాండ్ ఉండేది. టిండర్ లాంటి డేటింగ్ యాప్ యూజర్లంతా తమ జీవిత భాగస్వామి కోసం తెగ స్వైప్ చేశారు. కరోనా దెబ్బకు డేటింగ్ యాప్‌లు చప్పబడ్డాయి. కానీ ఇప్పటి విపత్కర పరిస్థితుల్లో టిండర్ మరోసారి యాక్టివేట్ అయ్యింది. అయితే ఈసారి లైఫ్ పార్టనర్ కోసం కాదు. తమ బ్లడ్ గ్రూప్ ఉన్న వారికోసం. అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన వారికి రక్తదానం చేస్తున్నారు. డేటింగ్ యాప్ ద్వారా ..రక్తదాతలు, పేషంట్లకు మధ్య వారధిగా నిలుస్తూ ఇద్దరి మధ్య సమన్వయాన్ని ఏర్పరుస్తున్నారు చెన్నైకి చెందిన వైద్యవిద్యార్థి రియా గుప్తా డేటింగ్ యాప్ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందుతున్న ఎంతోమందికి రక్తం అందిస్తున్నారు. ఇటీవల రెండునెలల వయసున్న భవన్ కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు రక్తం అవసరమైంది. కరోనా సమయంలోఎక్కడా రక్తదానం చేసేవారు దొరకలేదు. ఈ విషయం అర్ధరాత్రి రెండు గంటల ప్రాతంలో రియాకు తెలియడంతో.. తనకు తెలిసిన వాళ్లు, స్నేహితులకు ఫోన్లు చేయడం, సోషల్ మీడియా, వాట్సాప్‌లలో బ్లడ్ డోనార్స్ కావాలని పోస్టులు పెట్టింది. ఎట్టకేలకు ఆమె పోస్టులకు టిండర్ అకౌంట్లో ఒక దాత అర్ధరాత్రి మూడు గంటలకు స్పందించారు. దీంతో మరుసటిరోజు ఉదయం ఎనిమిది గంటలకు భవన్‌కు శస్త్రచికిత్స నిర్వహించారు. ఇలా అవసరంలో ఉన్న వారెందరికో రియా బ్లడ్డోనార్స్ను ఏర్పాటు చేస్తోంది. ప్లాస్మాడోనర్ ప్రేరణతో.. ‘‘మనదేశంలో కరోనా రెండోసారి విజృంభిస్తోన్న ఈ సమయంలో ‘‘ఫలానా గ్రూపు రక్తం కావాలి! సాయం చేయండి ప్లీజ్!’’ అని సోషల్ మీడియాలో కోకొల్లలుగా మెసేజులు వస్తున్నాయి. అలా ఓ నెలరోజులు పాటు నేను నా ఫ్రెండ్స్ వాళ్ల రిక్వెస్ట్‌లు చూసేవాళ్లం. కరోనా సమయంలో సాయం చేయడానికి ముందుకొచ్చేవారు తక్కువే. వ్యాక్సిన్ వేసుకున్న వారు 28 రోజులు గడవందే రక్తదానం చేయకూడదు. దీంతో రక్తదాతలు దొరకడం చాలా కష్టమైంది. ఇలా అనుకుంటున్న సమయంలో ఓరోజు.. ‘‘టిండర్ అకౌంట్ ద్వారా ప్లాస్మా డోనర్ దొరికారు’’ అని ఒకతను చెప్పడం మేము విన్నాం. అప్పుడు అతనిలాగే బ్లడ్ డోనర్స్ కోసం టిండర్ డేటింగ్ యాప్‌ను వాడాలనుకున్నాం. ఈ క్రమంలోనే నా స్నేహితులతో కలసి ‘‘బ్లడ్‌డోనర్స్ కావాలి’’ అని టిండర్‌లో పోస్టులు పెట్టాము. దానికి మంచి స్పందన లభించడంతో..స్లాక్, టిండర్, వాట్సాప్ గ్రూపులను ఎగ్మోర్ చిల్డ్రన్స్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్, మెటర్నిటి ఆసుపత్రి, అడయార్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మొదలైన వాటిని సమన్వయపరిచాం. ఈ సంస్థల నుంచి ‘‘బ్లడ్ కావాలని రిక్వెస్ట్ వచ్చినప్పుడు ఆ రిక్వెస్ట్‌ను టిండర్ గ్రూపులో పోస్టు చేస్తాం! రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన వారికి పేషంట్లు లేదా ఆసుపత్రి సిబ్బందిని నేరుగా కలుసుకునే Ðð సులుబాటు కల్పిస్తాం’’ అని రియా చెప్పింది. ఇప్పటిదాక వందమందికిపైగా డోనర్స్‌తో రక్తదానం చేయించాము. నా ఇన్స్టాగ్రామ్ పేజి బ్లడ్ డోనార్ కనెక్ట్‌కు రక్తం కావాలని ఏదైనా మెస్సేజ్ వచ్చిందంటే అరగంట నుంచి గంటలోపు రక్త దాతను వెదికి రిక్వెస్ట్ పెట్టిన వారికి చేరుస్తాము. త్వరలో మా సేవలను మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తాము’’ అని రియా వివరించింది. రియా చేస్తున్న సాయం గురించి తెలుసుకున్న రెడ్ క్రాస్ ఇండియా, చెన్నై ట్రైకలర్ వంటి ఎన్జీవోలు సైతం రక్తం కోసం రియాను సంప్రదించడం విశేషం. -
‘ప్రియుడి’ హత్య.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు
ముంబై: పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు.. 30 ఏళ్ల పీహెచ్డీ స్కాలర్ని హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. కారణం ఏంటంటే ఈ ఇద్దరు యువకులు కొద్ది నెలలుగా ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం పీహెచ్డీ స్కాలర్‌కి పెళ్లి కుదరడంతో.. తట్టుకోలేకపోయిన నిందితుడు అతడిని హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ వివరాలు.. ఇంటీరియర్ డిజైనర్‌గా పని చేస్తోన్న రవిరాజ్ క్షీరసాగర్(24)కి, పుణె నేషనల్ కెమికల్ లాబొరేటరీలో పీహెచ్డీ స్కాలర్‌గా ఉన్న సుదర్శన్ బాబురావు పండిట్(30)తో ఓ డేటింగ్ యాప్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ బంధం కొన్ని నెలల పాటు కొనసాగింది. ఇంతలో సుదర్శన్‌కి కుటుంబ సభ్యులు వేరే యువతితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం రవిరాజ్ చేవిన పడింది. తనను వదిలి పెట్టి మరోక యువతిని వివాహం చేసుకోవడానికి వీల్లేదని సుదర్శన్‌ని హెచ్చరించాడు రవిరాజ్. అయితే సుదర్శన్ ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల 27న రవిరాజ్, సుదర్శన్ పీహెచ్డీ చేస్తోన్న నేషనల్ కెమికల్ లాబొరేటరీకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని సుదర్శన్ తేల్చి చెప్పాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవిరాజ్ అతడిని దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి.. ముఖాన్ని రాళ్లతో కొట్టి గుర్తుపట్టరాని విధంగా మార్చాడు. ఆ తర్వాత రవిరాజ్ తన నివాసానికి వెళ్లి ఆత్మహత్యయాత్నం చేశాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. ఇక నేషనల్ లాబొరేటరీలో హత్యకు గురైన సుదర్శన్ గురించి పోలీసులకు సమాచారం అందించారు. అతడి వద్ద లభించిన డాక్యుమెంట్స్‌ని బట్టి మరణించిన వ్యక్తిని సుదర్శన్‌గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. రవిరాజ్‌తో అతడికున్న ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు రవిరాజ్ గురించి వాకబు చేయగా.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది. దాంతో పోలీసులు హస్పిటల్‌కి వెళ్లి రవిరాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల దర్యాప్తులో తానే సుదర్శన్‌ని హత్య చేశానని అంగీకరించాడు రవిరాజ్. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: డేటింగ్ యాప్: నగ్నంగా వీడియో కాల్.. ‘డేటింగ్ ఫ్రెండే’ దోచేసింది