సాక్షి, నాగోలు: డేటింగ్ యాప్‌లో యువతుల అర్ధ నగ్న ఫొటోలు పెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండా దేశానికి చెందిన నిర్వాహకురాలితో పాటు ఆ దేశానికి చెందిన యువతిని రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్‌బీనగర్‌లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలను వెల్లడించారు. ఉగాండా దేశానికి చెందిన నముబిరు సియానా (32) నాలుగేళ్ల క్రితం విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి టోలిచౌకిలోని నిజాంకాలనీలో నివాసం ఉంటోంది.
ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో ఆన్‌లైన్ వ్యభిచారం ప్రారంభించింది. ఉగాండా నుంచి ఓ యువ తిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు మీర్ పేట చెరువు వద్ద వారిని అరెస్ట్ చేశారు. సెల్‌ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకొని యువతిని హోమ్‌కు తరలించారు. నముబిరు సియానాపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ తెలిపారు.
మాట్లాడుతున్న సీపీ మహేష్ భగవత్
బాధితులకు పునరావాసం..
మహిళలను, చిన్నారులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకం దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాది ఏర్పాటు చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అక్రమ రవాణా నుంచి మహిళలను కాపాడిందని తెలిపారు. మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించి, పునరావాసం కల్పించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment