Uganda
-
‘బాహుబలి ఫ్యామిలీ’ నెట్టింట వైరల్, ఎవరీ గేమ్ ఛేంజర్!
ఒక భార్య, ఓ నలుగురో , ఐదుగురో కొడుకులు, కుమార్తెలు,20-30 మంది మనవలు మనవరాళ్లతో అలరారే కుటుంబాన్ని పెద్ద కుటుంబం అంటూ ఉంటాం. మరి 12 మంది భార్యలు, 102 మంది పిల్లలు , 578 మంది మనవళ్లు ఉన్న ఫ్యామిలీని ఏమని పిలవాలి? 12 మంది భార్యలా? 102 మంది సంతానమా అని నోరెళ్ల బెట్టకండి. నిత్యం ఆకలి , కరువుతో సతమతమయ్యే ఆఫ్రికా దేశాల్లో ఒకటైన ఉగాండాలో ఉందీ బాహుబలి ఫ్యామిలీ.తూర్పు ఉగాండాలోని ముకిజాకు చెందిన 70 ఏళ్ల ముసా హసహ్య కసేరా (MusaHasahyaKasera) ఈ జెయింట్ ఫ్యామిలీకి మూల పురుషుడు. ఈయనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ సందడి చేస్తోంది. 'దిఇండోట్రెక్కర్' అనే ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ అయిన ఈ వీడియోకు ఒక్క రోజులోనే 8.6 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.1972లో 17 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకోవడంతో అతని పెళ్లిళ్ల పరంపర మొదలైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 12 మందిని వివాహం చేసుకున్నాడు. వీరికి 102 మంది పిల్లలు పుట్టారు. అంటే ఒక్కో భార్యకు దాదాపు తొమ్మిది మంది. అంతేనా మరో 578 మంది వారసులకు తాత కూడా. దశాబ్దాలుగా, అతని కుటుంబం అలా విస్తరిస్తూ పోయింది. అతని పిల్లలు ఇప్పుడు 10 - 50 సంవత్సరాల వయస్సు వరకు ఉన్నారు. అతని భార్యలలో చిన్న ఆమెకు 35 ఏళ్ల వయస్సు. ఇపుడు ఈ సంతానం కడుపు నింపేందుకు నానా పాట్లు పడటమే కాదు, మనవలు,మనవరాళ్ల పేర్లు గుర్తు పెట్టుకోవడం కూడా కష్టంగా ఉందట ముసాకు. అందుకే ఒక రిజిస్టర్‌ను మెయింటైన్ చేస్తున్నారు.అతనికున్న ఆస్తల్లా శిథిలావస్థలో ఇల్లు. రెండు ఎకరాల భూమి. దీంతో ఇల్లు గడవక చాలా కష్టపడుతున్నామని వాపోయింది మూడో భార్య జబీనా. పిల్లలు, మనుమలు చేతికి వచ్చిన పని చేస్తారు. మరికొందరు కుటుంబం కోసం నీళ్లు కట్టెలు తీసుకురావడానికి వారి రోజులు గడుపుతారు. వీరందరూ కడుపు నిండా భోంచేయండం కూడా గగనమే. View this post on Instagram A post shared by Kailash Meena (@theindotrekker)మరోవైపు అతని ఆరోగ్యం క్షీణించడం, ఇంత పెద్ద ఇంటిని నిర్వహించడం కష్టంగా ఉండటంతో, అతని ఇద్దరు భార్యలు వెళ్లిపోయారు. టీచర్‌గా పనిచేస్తున్న అతని కుమారుడు షాబాన్ మాజినో(30) కుటుంబ నిర్వహణలో సహాయం చేస్తాడు.దీంతో నెటిజన్లు ఛలోక్తులతో సందడి చేస్తున్నారు. 'ప్రపంచంలో ఎక్కువ మంది పిల్లలను ఉత్పత్తి చేసిన వ్యక్తి' ఒకరు, “ఇస్కో పరివార్ క్యోం బోల్తే హో ...? జిల్లా ఘోషిత్ క్యోం నహీ దేతే.” (వీళ్లని కుటుంబమని అంటారేంటి...జిల్లాగా ప్రకటించాలి) అంటూ వ్యాఖ్యానించారు. బాహుబలి ఫ్యామిలీ, తాతగారు గేమ్ ఛేంజర్ అంటున్నారు. -
ముంచుకొస్తున్న మిస్టరీ వ్యాధి ’డింగా డింగా’.. బాధితుల్లో వింత లక్షణాలు!
ఆఫ్రికా దేశం ఉగాండాలో వింత వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది. ఈ వ్యాధి పేరు ‘డింగా డింగా’ ఫీవర్. ఈ వ్యాధి పేరు ఎంత భిన్నంగా ఉందో.. ఈ వ్యాధి లక్షణాలు కూడా అంతే వింతగా ఉంటాయి. ఈ వ్యాధి బారినపడిన వారిలో అనియంత్రిత వణుకు ఉంటుంది. దీంతో, వారు డ్యాన్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తారు. ఇక, స్థానిక భాషలో ‘డింగా డింగా అంటే.. కదులుతూ నృత్యం చేయడం’ అని అర్థం’ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు ప్రబలుతున్న వేళ ఉగాండాలో డింగా డింగా వ్యాధి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఉగాండాలోని బుండిబుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా మహిళలు, బాలికల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందడం స్థానికులను, అధికారులను టెన్షన్ పెడుతోంది. స్థానిక నివేదికల ప్రకారం, ఇప్పటివరకు 400 మందికి పైగా వ్యాధి బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే, వ్యాధి కారణంగా ఇప్పటివరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు.ఇక, డింగా డింగా ఫీవర్ వ్యాధి కారణంగా శరీరంలో అనియంత్రిత వణుకు మొదలవుతుంది. దీని కారణంగా వ్యాధి బారినపడిన వ్యక్తి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు. వీరిని దూరం నుంచి చూస్తే బాధితురాలు డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. వణికిపోతున్న చేతులు, కాళ్ల కారణంగా డ్యాన్స్ మాదిరిగా కనపడటం విశేషం. ఇక 2023 ప్రారంభంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా వివరాలు తెలిసి రాలేదు. దీంతో, డింగా డింగాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక తదుపరి విశ్లేషణ కోసం నమూనాలను ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు స్థానిక అధికారులు.మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి వ్యాప్తిని 1518లో ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌లో ‘డ్యాన్సింగ్ ప్లేగు’ వ్యాధితో పోలుస్తున్నారు. అప్పుడు ఫ్రాన్స్‌లో ఈ వ్యాధి ప్రబలిన సమయంలో కూడా బాధితులు.. అనియంత్రితంగా రోజుల తరబడి ఉన్నారని తెలిపారు. అలాగే, ఇది మరణాలకు కూడా దారి తీసినట్టు చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. తాజాగా ఈ వ్యాధి నుంచి కోలుకున్న బాధితురాలు(18) మాట్లాడుతూ..‘నేను చాలా బలహీనంగా ఉన్నాను. నేను నడవడానికి ప్రయత్నించినప్పుడు నా కంట్రోల్లో నేను ఉండటం లేదు. కాళ్లు, చేతులు వణికిపోతున్నాయి. ఇది చాలా ఇబ్బందికరంగా ఉంది. వారం రోజులకు పైగా వ్యాధి కారణంగా ఆసుపత్రిలోనే ఉన్నాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను’ అంటూ చెప్పారు.డింగా డింగా లక్షణాలు..జ్వరం.తలనొప్పి.దగ్గు.ముక్కు కారటం.శరీర నొప్పులు.A mysterious illness locally called 'Dinga Dinga' is rapidly spreading amog women and girls in Uganda's Bundibugyo district, leaving dem dancing and shaking uncontrollably, along with experiencing fever. The illness is treatable with antibiotics. pic.twitter.com/yYEx9unIbR— Common Sense (@keysense_1) December 20, 2024 -
చిన్న ప్యాకెట్ : 30 రోజులైనా పండ్లు, కూరగాయలు పాడుకావు!
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో చిన్న, సన్నకారు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పండ్లు, కూరగాయలు వినియోగదారుల నోటికి చేరే లోగా దాదాపు 30–40 శాతం వరకు కుళ్లిపోతున్నాయని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఎఓ) అంచనా. దుంపలైతే ఏకంగా 40–50% పాడవుతున్నాయి. కోత అనంతర రవాణా వ్యవస్థ, శీతల సదుపాయాలు లేకపోవటం పెద్ద సమస్య. ఈ సమస్యను సమర్థవంతంగా అధిగమించడానికి ఉపయోగపడే గొప్ప ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది. ఉగాండాకు చెందిన ఫ్రెజా నానోటెక్ లిమిటెడ్ అనే స్టార్టప్ సంస్థ సేంద్రియ పదార్థాలతో రూపొంచిన ఇన్స్టంట్ టీ బ్యాగ్ అంత సైజు ఉండే పౌడర్ ప్యాకెట్ కూరగాయలు, పండ్లను కుళ్లిపోకుండా నెల రోజుల వరకు రక్షించగలుగుతుంది. ఎటువంటి రిఫ్రిజిరేషన్ అవసరం లేకుండా, రసాయన రహితంగానే షెల్ఫ్ లైఫ్‌ను గణనీయంగా పెంచే ఈ ఆవిష్కరణ ‘ఎఫ్ఎఓ ఇన్నోవేషన్ అవార్డు–2024’ను ఇటీవల దక్కించుకుంది. శీతల గదుల్లో పెట్టని పండ్లు, కూరగాయలు మగ్గిపోయి కొద్ది రోజుల్లోనే కుళ్లియే ప్రక్రియ ‘ఫాస్ఫోలిపేస్ డి’ అనే ఎంజైమ్ కారణంగానే జరుగుతుంటుంది. ఫ్రెజా నానోటెక్ సంస్థ రూపొదించిన పౌడర్ ఈ ప్రక్రియను నెమ్మదింపజేయటం ద్వారా కూరగాయలు, పండ్లను దీర్ఘకాలం పాటు తాజాగా ఉంచుతుంది.టీ బ్యాగ్ అంతటి చిన్న ప్యాకెట్ (దీని ధర రూ. 20)ను 5 కిలోల పండ్లు, కూరగాయల మధ్య ఉంచితే చాలు.. నెల రోజులైనా అవి కుళ్లిపోకుండా ఉంటాయని ఎఫ్ఎఓ తెలిపింది. పండ్లు, కూరగాయల ఉత్పత్తి మెరుగవుతుంది, పోషకాలలభ్యత పెరుగుతుంది, పర్యావరణ కాలుష్యం తగ్గుతుంది, జీవనోపాధులు మెరుదలపై ఈ ఆవిష్కరణ సానుకూల ప్రభావం చూపుతుందంటూ ఎఫ్ఎఓ డైరెక్టర్ జనరల్ క్యు డోంగ్యు ప్రశంసించారు. కోత అనంతర దశలో రైతులకు ఎదురయ్యే నష్టాలను ఇది తగ్గిస్తుంది. త్వరగా పాడుకావు కాబట్టి రిటైల్ వ్యవస్థలో జరిగే నష్టాల భారం తగ్గుతుంది. ఆవిధంగా వినియోగదారులపై కూడా భారం తగ్గుతుందని ఆయన అన్నారు. -
ఉగాండాలో అరెస్టయిన బిలియనీర్ కూతురు (ఫోటోలు)
-
ఉగాండాలో ఘనంగా గణేష్ చతుర్థి
ప్రపంచవ్యాప్తంగా వినాయక చవితి పండుగ ఘనంగా జరుపుకుంటున్నారు. భారత్‌తో పాటు పలు దేశాల్లో గణనాథున్ని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. ఆఫ్రికా ఖండంలోని ఉగాండాలో గణేష్ చతుర్థి వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అక్కడి సంప్రదాయ డప్పు వాయిద్యాలు వాయిస్తూ ఉగాండా వాసులు గణనాథునికి స్వాగతం పలికిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Auspicious Celebrations of Ganesh Chaturthi in Uganda🇺🇬 pic.twitter.com/iDTGFc3He0— Vertigo_Warrior (@VertigoWarrior) September 6, 2024 ‘లాల్బాగ్ చా’ రాజాకు అంబానీల రూ.20 కిలోల బంగారు కిరీటం..మన దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గణేష్ నవరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. నగరంలోని లాల్‌బాగ్‌లో ప్రతి ఏటా ప్రతిష్టించే అత్యంత ఎత్తైన గణపతికి రిలయన్స్ ఫౌండేషన్ 20 కేజీల బంగారు కిరీటాన్ని విరాళంగా ఇచ్చింది. రూ.15 కోట్ల విలువైన ఈ కిరిటాన్ని గణేష్‌కు అలంకరించే వీడియోను సోషల్‌మీడియాలో ఆసక్తిగా తిలకిస్తున్నారు. కోరిన కోరికలు తీరుస్తాడని లాల్బాగ్ గణపతికి పేరుంది. Undoubtedly he is the "RAJA"!Known as "नवसाचा (मन्नत पूरी करनेवाले) राजा" Lalbaug's Ganpati Bappa has his own Majestic Role.20kg Gold Crown worth ₹15 Crores donated by Reliance Foundation being bestowed upon Lalbaugcha Raja.गणपती बाप्पा मोरया 🙏🚩🚩🚩 pic.twitter.com/BeoJ9G2UOK— BhikuMhatre (@MumbaichaDon) September 6, 2024 -
ఉగాండా మహిళా అథ్లెట్ విషాదాంతం
నైరోబి: తన భాగస్వామితో ఏర్పడిన స్థల వివాదం చివరకు ఉగాండా మహిళా ఒలింపియన్ అథ్లెట్ రెబెకా చెపె్టగె ప్రాణాలను తీసింది. గత నెలలో జరిగిన పారిస్ ఒలింపిక్స్‌లో రెబెకా మారథాన్ ఈవెంట్లో పాల్గొని 44వ స్థానంలో నిలిచింది.పలు అథ్లెటిక్ శిక్షణ కేంద్రాలున్న ట్రాన్స్ ఎన్జొయా ప్రాంతంలో 33 ఏళ్ల రెబెకా స్థలం కొని ఇల్లు కట్టుకుంది. దీనిపై రెబెకా, ఆమె భాగస్వామి డిక్సన్ డియెమా మధ్య గత ఆదివారం పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాతి రోజు సోమవారం డిక్సన్ తనవెంట గ్యాసోలిన్ (పెట్రోలియం ఉత్పాదన)ను క్యాన్‌లో తీసుకొచ్చి రెబెకాపై పోసి నిప్పంటించాడు. వెంటనే ఆమె శరీరమంతా మంటలు అంటుకోవడంతో పాటు డిక్సన్కూ కాలిన గాయాలయ్యాయి. అనంతరం ఇద్దరిని కెన్యాలోని హాస్పిటల్లో చేర్పించగా గురువారం ఉదయం రెబెకా మృతి చెందింది. 30 శాతం కాలిన గాయాలున్న డిక్సన్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని స్థానిక పోలీస్ కమాండర్ జెరెమా ఒలీ కొసిమ్ తెలిపారు. -
కూలిన భారీ చెత్తకుప్ప..18 మంది మృతి
కంపాల: ఉగాండా రాజధాని కంపాలలో డంపింగ్‌యార్డులోని మట్టితో కప్పేసిన భారీ చెత్తకుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో 18 మంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు. మృతిచెందిన వారిలో చిన్నపిల్లలు, మహిళలు ఉన్నారు.వీధుల్లో ప్లాస్టిక్ ఏరుకునే వారు చెత్తకుప్ప కూలిన సమయంలో అక్కడే ఉండటంతో వారు చెత్తకుప్ప కింద పడి మృతి చెందారు. భారీ వర్షాల కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఘటనాస్థలంలో సహాయక చర్యకు వర్షం అడ్డంకిగా మారింది. -
ట్రంప్‌పై కాల్పులు.. రీక్రియేట్ చేసిన పిల్లలు
కంపాలా : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు ప్రపంచాన్ని విస్మయానికి గురి చేశాయి. అయితే ఆ కాల్పుల్ని ఘటనను ఉంగాండాలోని ఓ ప్రాంతానికి చెందిన పిల్లలు రీక్రియేట్ చేశారు. ఈ రీక్రియేషన్ వీడియోలో ట్రంప్ పాత్రను పోషించిన బాలుడు తన పిడికిలిని బిగించి ఫైట్ అని నినాదాలు చేయడం మిలియన్ల మందిని ఆకట్టుకోవడం గమనార్హం. రీక్రియేన్ వీడియోలో ట్రంప్ స్థానంలో ఓ బాలుడు ప్రసంగిస్తుండగా.. కాల్పుల నుంచి బాలుడిని కాపాడేందుకు రక్షణ సిబ్బంది అడ్డుగా నిలబడడం, కాల్పుల తర్వాత ట్రంప్ అన్నట్లుగానే తన పిడికిలిని బాలుడు ‘ఫైట్’..‘ఫైట్’ అంటూ నినాదాలు చేయడం మనకు ఆ వీడియోలో కనిపిస్తుంది.Ugandan Kids re-enact the Trump Assassination Attempt pic.twitter.com/2tck8GNa23— ɖʀʊӄքǟ ӄʊռʟɛʏ 🇧🇹🇹🇩 (@kunley_drukpa) July 17, 2024ఆ బాలుడిని కాపాడేందుకు పిల్లలు చెక్క తుపాకుల్ని, వేదిక కోసం చెక్క డబ్బాల్ని వినియోగించారు. ట్రంప్ మాట్లాడిన విధంగా రీక్రియేట్ చేసిన వీడియోలో బాలుడి మాటలు, ఆహభావాల్ని వ్యక్తం చేయడం మరింతగా ఆకట్టుకుంది. మరో వైపు పిల్లల్లో పెరిగిపోతున్న ఈ తరహా ధోరణి పట్ల నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఇలాంటి వాటిని చూసి అనుకరిస్తున్నారు. ఇది నేటి సమాజాన్ని, ప్రవర్తనను ప్రతిభింస్తుందని సోషల్ మీడియా వేదిక కామెంట్లు చేస్తున్నారు. -
ICC: టీ20 వరల్డ్‌కప్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేగింది. ఓ మాజీ క్రికెటర్ తనకు పదే పదే ఫోన్లు చేస్తూ.. అవినీతికి పాల్పడాల్సిందిగా కోరుతున్నాడంటూ ఉగాండా ప్లేయర్ అంతర్జాతీయ క్రికెట్ మండలికి ఫిర్యాదు చేశాడు.తనను ఫిక్సింగ్‌కు ఉసిగొల్పేలా వ్యవహరించినట్లు సదరు క్రికెటర్ పేర్కొన్నట్లు ఐసీసీ వర్గాలు వార్తా సంస్థ పీటీఐకి వెల్లడించాయి. కాగా అమెరికా- వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి ఉగాండా తొలిసారి అర్హత సాధించింది.వెస్టిండీస్, అఫ్గనిస్తాన్, న్యూజిలాండ్, పపువా న్యూగినియాలతో కలిసి గ్రూప్-సిలో ఉన్న ఉగాండా.. లీగ్ దశలో నాలుగింట కేవలం ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది. పపువా న్యూగినియాపై గెలుపొంది ప్రపంచకప్ టోర్నీలో బోణీ కొట్టింది.ఇదిలా ఉంటే.. గయానాలో మ్యాచ్ సందర్భంగా తనకు బుకీల నుంచి ఫోన్‌కాల్ వచ్చినట్లు ఓ ఉగాండా ప్లేయర్ ఐసీసీకి ఫిర్యాదు చేయడం కలకలం రేపింది. కెన్యాకు చెందిన మాజీ క్రికెటర్ వివిధ ఫోన్ నంబర్ల నుంచి పదే పదే కాల్ చేశాడని.. సదరు ప్లేయర్ ఐసీసీ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ)కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.ఇందుకు సంబంధించి ఐసీసీ వర్గాలు పీటీఐతో మాట్లాడుతూ.. ‘‘పెద్ద జట్లతో పోలిస్తే ఉగాండా వంటి అసోసియేట్ దేశాలకు సంబంధించిన ఆటగాళ్లను టార్గెట్ చేయటమే సులువని భావిస్తారు బుకీలు. వారిని ఈజీగా ట్రాప్ చేయొచ్చనే ఉద్దేశంతో ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడతారు.అయితే, సదరు ప్లేయర్ ముందుగానే ఐసీసీ దృష్టికి ఈ విషయం తీసుకురావడం మంచిదైంది. వరల్డ్‌కప్ వంటి మెగా ఈవెంట్లలో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.కాబట్టి ఐసీసీ ఏసీయూ అధికారులు తప్పకుండా ఓ కన్నేసే ఉంచుతారు. క్రికెట్‌కు మచ్చతెచ్చేలా వ్యవహరించే ఏ ఒక్కరిని ఐసీసీ ఉపేక్షించదు. ఈ ఘటనపై ప్రొటోకాల్ ప్రకారం.. దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నాయి. కాగా ఐసీసీ నిబంధనల ప్రకారం తమకు ఇలాంటి కాల్స్ వస్తే ఆటగాళ్లు మండలి దృష్టికి తీసుకురావాలి. లేదంటే కఠిన చర్యలు ఉంటాయి. కాగా టీ20 ప్రపంచకప్-8లో ఇప్పటికే సూపర్-8 బెర్తులు ఖరారయ్యాయి. గ్రూప్-1లో టీమిండియా, అఫ్గనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్... గ్రూప్-2లో ఇంగ్లండ్, సౌతాఫ్రికా, అమెరికా, వెస్టిండీస్ ఉన్నాయి. -
పసికూనపై ప్రతాపం.. ఎట్టకేలకు తొలి విజయం.. ఏం లాభం?
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో న్యూజిలాండ్ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఉగాండాను చిత్తుగా ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది.ఈ మెగా ఈవెంట్లో అఫ్గనిస్తాన్, వెస్టిండీస్, ఉగాండా, పపువా న్యూగినియాలో కలిసి గ్రూప్-సిలో ఉన్న న్యూజిలాండ్.. తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.మొదట అఫ్గనిస్తాన్ చేతిలో 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కేన్ విలియమ్సన్ బృందం.. తదుపరి వెస్టిండీస్ చేతిలో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూపర్-8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.మరోవైపు.. అఫ్గనిస్తాన్, వెస్టిండీస్ వరుస విజయాలతో రాణించి.. సూపర్-8 బెర్తును ఖరారు చేసుకోవడంతో న్యూజిలాండ్ కథ ముగిసిపోయింది.ఈ క్రమంలో మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్‌లలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న కివీస్.. తాజాగా శనివారం నాటి మ్యాచ్‌లో పసికూన ఉగాండాపై ప్రతాపం చూపింది.ట్రినిడాడ్ వేదికగా టాస్ గెలిచిన న్యూజిలాండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. పేసర్లు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ టిమ్ సౌతీ(3/4), ట్రెంట్ బౌల్ట్(2/7), లాకీ ఫెర్గూసన్(1/9).. స్పిన్నర్లు మిచెల్ సాంట్నర్(2/8), రచిన్ రవీంద్ర(2/9) ఆకాశమే హద్దుగా చెలరేగారు.దీంతో ఉగాండా 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఉగాండా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోర్ 11గా నమోదైంది. ఇక అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 5.2 ఓవర్లలో పని పూర్తి చేసింది.ఓపెనర్ ఫిన్ అలెన్ 17 బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ డెవాన్ కాన్వే(15 బంతుల్లో 22), రచిన్ రవీంద్ర(1)తో కలిసి అజేయంగా నిలిచి.. కివీస్ విజయాన్ని ఖరారు చేశాడు.ఫలితంగా వికెట్ నష్టానికి 41 పరుగులు చేసిన న్యూజిలాండ్ వరల్డ్‌కప్-2024లో పాయింట్ల ఖాతా తెరిచింది. తదుపరి జూన్ 17న పపువా న్యూగినియాతో కివీస్ జట్టు తలపడనుంది. కాగా ఉగాండాపై న్యూజిలాండ్ విజయం నేపథ్యంలో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా ఒకటి గెలిచిందని కొంతమంది సంతోషిస్తుంటే.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని మరికొందరు విమర్శిస్తున్నారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
WI Vs UGA: దటీజ్ పావెల్.. టీ20 వరల్డ్‌కప్‌లో భారీ సిక్సర్! వీడియో వైరల్
టీ20 వరల్డ్‌కప్ 2024లో భారీ సిక్స్ నమోదైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఉగండాతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ భారీ సిక్స్ కొట్టాడు. అతడు కొట్టిన షాట్‌కు బంతి 107 మీటర్ల దూరం వెళ్లి స్టేడియం బయటపడింది.ఇన్నింగ్స్ 11వ ఓవర్ వేసిన ఫ్రాంక్ న్సుబుగా.. తొలి బంతిని ఆఫ్-స్పిన్నింగ్ డెలివరీగా సంధించాడు. ఈ క్రమంలో ఫ్రంట్ ఫుట్కు వచ్చిన పావెల్.. లాంగ్-ఆన్ దిశగా భారీ సిక్స్ బాదాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఇంతకుముందు ఈ రికార్డు ఇంగ్లండ్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ పేరిట ఉండేది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సాల్ట్ 105 మీట్లర్ల సిక్స్ బాదాడు. తాజా మ్యాచ్‌తో సాల్ట్‌ను పావెల్ అధిగమించాడు. ఇక ఈ మ్యాచ్‌లో 134 పరుగుల తేడాతో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. 74 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పసికూన ఉగండా.. విండీస్ బౌలర్ల దాటికి కేవలం 39 పరుగులకే కుప్పకూలింది. విండీస్ స్పిన్నర్ అకిల్ హుస్సేన్ 5 వికెట్లతో ఉగండా పతనాన్ని శాసించగా.. జోషఫ్ రెండు, మోటీ, రస్సెల్, షెఫెర్డ్ తలా వికెట్ సాధించారు. ఉగండా బ్యాటర్లలో జుమా మియాగీ(13) టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 173 పరుగుల భారీ స్కోర్ సాధించింది. విండీస్ బ్యాటర్లలో ఓపెనర్ జాన్సన్ చార్లెస్(44) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. రస్సెల్(30 నాటౌట్), పావెల్(23), పూరన్(22) పరుగులతో రాణించారు. View this post on Instagram A post shared by ICC (@icc) -
T20 World Cup 2024: చరిత్ర సృష్టించిన ఉగాండ బౌలర్
43 ఏళ్ల ఉగాండ బౌలర్ ఫ్రాంక్ న్సుబుగా చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో అతి తక్కువ ఎనాకమీతో (1.00) పరుగులు సమర్పించుకున్న బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పపువా న్యూ గినియాతో ఇవాళ (జూన్ 6) జరిగిన మ్యాచ్‌లో ఫ్రాంక్.. 4 ఓవర్ల స్పెల్‌లో 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతని స్పెల్‌లో ఏకంగా 2 మెయిడిన్ ఓవర్లు ఉండటం మరో విశేషం.టీ20 వరల్డ్‌కప్ టోర్నీల చరిత్రలో అతి తక్కువ ఎకానమీతో 4 ఓవర్ల స్పెల్ పూర్తి చేసిన బౌలర్ల వివరాలు..ఫ్రాంక్ న్సుబుగా (ఉగాండ)- 1.00అన్రిచ్ నోర్జే (సౌతాఫ్రికా)- 1.75అజంత మెండిస్ (శ్రీలంక)- 2.00మహ్మదుల్లా (బంగ్లాదేశ్)- 2.00హసరంగ (శ్రీలంక)- 2.00కాగా, గయానా వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఉగాండ.. పీఎన్జీని 77 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూల్చింది. ఉగాండ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేసి పీఎన్జీ బ్యాటింగ్ లైనప్‌ను మడత పెట్టారు.ఫ్రాంక్ న్సుబుగా (4-2-4-2), అల్పేశ్ రాంజానీ (4-1-17-2), జుమా మియాగి (4-0-10-2), కోస్మాస్ క్యేవుటా (3.1-0-17-2), కెప్టెన్ మసాబా (4-0-17-1) అద్భుతంగా బౌలింగ్ చేశారు. పీఎన్జీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. వీరిలో హిరి హిరి (15) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి ఓటమిపాలయ్యేలా కనిపించింది. అయితే రియాజత్ అలీ షా (33), జుమా మియాగి (13) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉగాండను గెలిపించారు. వీరిద్దరు ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. పీఎన్జీ బౌలర్లలో అలెయ్ నావ్ (4-0-16-2), నార్మన్ వనువా (4-0-19-2), చాడ్ సోపర్ (4-0-13-1), అస్సద్ వలా (2-0-10-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టారు. -
T20 World Cup 2024: చిరస్మరణీయం.. తొలి విజయం సాధించిన పసికూన
క్రికెట్ పసికూన, ఆఫ్రికా దేశం ఉగాండ ప్రపంచకప్ టోర్నీల్లో తమ తొలి విజయాన్ని నమోదు చేసింది. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఉగాండ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉగాండ ఆటగాళ్లు, అభిమానులు తమ తొలి విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అభిమానుల కేరింతలు, డ్యాన్స్‌లతో గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియం హోరెత్తిపోయింది. మ్యాచ్ అనంతరం ఉగాండ ఆటగాళ్ల సంబురాలు అంబరాన్ని అంటాయి.Uganda players & fans are dancing & celebrating the victory in Guyana. ❤️- This is the victory of T20I World Cup. pic.twitter.com/vH8uzs4cyf— Johns. (@CricCrazyJohns) June 6, 2024వివరాల్లోకి వెళితే.. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకున్న ఉగాండ.. పీఎన్జీని 77 పరుగులకే (19.1 ఓవర్లలో) కుప్పకూల్చింది. ఉగాండ బౌలర్లు మూకుమ్మడిగా దాడి చేసి పీఎన్జీ బ్యాటింగ్ లైనప్‌ను మడత పెట్టారు. THE VICTORY DANCE BY UGANDA. 🇺🇬- Video of the day! (ICC). pic.twitter.com/l9fiVPN79J— Mufaddal Vohra (@mufaddal_vohra) June 6, 202443 ఏళ్ల స్పిన్నర్ ఫ్రాంక్ న్సుబుగా పీఎన్జీ పాలిట సింహ స్వప్నమయ్యాడు. ఫ్రాంక్ 4 ఓవర్లలో కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఫ్రాంక్ స్పెల్‌లో 2 మెయిడిన్ ఓవర్లు ఉండటం విశేషం. ఫ్రాంక్‌తో పాటు అల్పేశ్ (4-1-17-2), జుమా మియాగి (4-0-10-2), కోస్మాస్ క్యేవుటా (3.1-0-17-2), కెప్టెన్ మసాబా (4-0-17-1) కూడా అద్భుతంగా బౌలింగ్ చేశారు. పీఎన్జీ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. వీరిలో హిరి హిరి (15) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ 26 పరుగులకే సగం వికెట్లు కోల్పోయి దారుణ పరాజయాన్ని మూటగట్టుకునేలా కనిపించింది. అయితే రియాజత్ అలీ షా (33), జుమా మియాగి (13) బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేసి ఉగాండను గెలిపించారు. వీరిద్దరు ఓ మోస్తరుగా రాణించడంతో ఉగాండ 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. రియాజత్, మియాగి మినహా ఉగాండ ఇన్నింగ్స్‌లో ఎవరూ రెండంకెల స్కోర్ చేయలేదు. పీఎన్జీ బౌలర్లలో అలెయ్ నావ్ (4-0-16-2), నార్మన్ వనువా (4-0-19-2), చాడ్ సోపర్ (4-0-13-1), అస్సద్ వలా (2-0-10-1) పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు వికెట్లు తీసి ఉగాండను ఇబ్బంది పెట్టారు. -
T20 World Cup 2024: అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్
ఆఫ్ఘనిస్తాన్ బౌలర్ ఫజల్ హక్ ఫారూఖీ టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన ఫాస్ట్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. టీ20 వరల్డ్‌కప్ 2024లో భాగంగా ఉగాండతో ఇవాళ (జూన్ 4) జరిగిన మ్యాచ్‌లో ఫజల్ హక్ 4 ఓవర్లు బౌల్ చేసి కేవలం 9 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. టీ20 వరల్డ్‌కప్‌ల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవి రెండో అత్యుత్తమ గణాంకాలు. 2009లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో పాక్ ఫాస్ట్ బౌలర్ ఉమర్ గుల్ న్యూజిలాండ్‌పై కేవలం 6 పరుగులిచ్చి 5 వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో ఓ ఫాస్ట్ బౌలర్‌కు ఇవే అత్యుత్తమ గణాంకాలు. ఓవరాల్‌గా టీ20 వరల్డ్‌కప్‌ల్లో అత్యుత్తమ గణాంకాలు శ్రీలంక స్పిన్నర్ అజంత మెండిస్ పేరిట నమోదై ఉన్నాయి. 2012 ప్రపంచకప్‌లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో మెండిస్ 8 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. మెండిస్ తర్వాత టీ20 వరల్డ్‌కప్‌ల్లో రెండో అత్యుత్తమ గణాంకాలు కూడా లంక బౌలర్ పేరిటే నమోదై ఉన్నాయి. 2014 వరల్డ్‌కప్ ఎడిషన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో లంక స్పిన్నర్ రంగన హెరాత్ కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.ఇదిలా ఉంటే, ఉగాండతో జరిగిన నేటి మ్యాచ్‌లో ఫజల్ హక్ ఫారూఖీ విజృంభించడంతో ఆఫ్ఘనిస్తాన్ 125 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. ఓపెనర్లు రహ్మానుల్లా గుర్బాజ్ (76), ఇబ్రహీం జద్రాన్ (70) మెరుపు అర్ద సెంచరీలతో చెలరేగారు. ఉగాండ బౌలర్లలో కోస్మాస్ క్యేవుటా, మసాబా తలో 2 వికెట్లు పడగొట్టారు.184 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఉగాండ.. ఫజల్ హక్‌తో పాటు నవీన్ ఉల్ హక్ (2-0-4-2), రషీద్ ఖాన్ (4-0-12-1), ముజీబ్ (3-0-16-1) విజృంభించడంతో 16 ఓవర్లలో 58 పరుగులకే ఆలౌటైంది. ఉగాండ ఇన్నింగ్స్‌లో రియాజత్ అలీ షా (11), రాబిన్సన్ ఒబుయా (14) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. -
చెలరేగిన అఫ్గాన్ ఓపెనర్లు.. ఉగండా ముందు భారీ టార్గెట్
టీ20 వరల్డ్‌కప్-2024లో భాగంగా గయానా వేదికగా ఉగండాతో జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్ బ్యాటర్లు దంచికొట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 పరుగులు చేసింది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ రెహ్మతుల్లా గుర్భాజ్, ఇబ్రహీం జద్రాన్ అద్బుతమైన ప్రదర్శన కనబరిచారు. వికెట్‌కు వీరిద్దరూ 154 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గుర్భాజ్(45 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 76 పరుగులు), ఇబ్రహీం జద్రాన్(46 బంతుల్లో 9 ఫోర్లు, ఒక సిక్స్‌తో 70) అదరగొట్టారు. ఉగండా బౌలర్లలో కాస్మాస్ క్యూవటా, మసబా తలా రెండు వికెట్లు సాధించగా.. రామ్‌జనీ ఒక్క వికెట్ సాధించాడు. -
టీ20 వరల్డ్‌కప్ కోసం ఉగాండ జట్టు ప్రకటన.. 43 ఏళ్ల స్పిన్నర్‌కు చోటు
జూన్ 1 నుంచి వెస్టిండీస్, యూఎస్ఏ వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం ఉగాండ జట్టును నిన్న (మే 6) ప్రకటించారు. ప్రపంచకప్‌కు తొలిసారి సాధించిన ఈ జట్టుకు బ్రియాన్ మసాబా సారథ్యం వహించనున్నాడు. మసాబాకు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రియాజత్ అలీ షా తోడ్పడనున్నాడు. ఈ జట్టులో 43 ఏళ్ల స్పిన్ బౌలర్ ఫ్రాంక్ న్సుబుగాకు అనూహ్యంగా చోటు దక్కింది. ప్రపంచకప్ కోసం ప్రకటించిన ఉగాండ జట్టులో 2023 ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ నామినీ అల్పేశ్ రాంజానీ కూడా ఉన్నాడు. ప్రపంచకప్‌లో ఉగాండ జర్నీ జూన్ 3న ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో మొదలవుతుంది. View this post on Instagram A post shared by Uganda Cricket Association (@uganda_cricket_association)ఉగాండ జట్టు వెస్టిండీస్, న్యూజిలాండ్, పపువా న్యూ గినియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లతో కలిసి గ్రూప్-సిలో పోటీపడనుంది. ఉగాండ క్వాలిఫయర్స్‌లో తమకంటే చాలా రెట్లు పటిష్టమైన జింబాబ్వేకు షాకిచ్చి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది.టీ20 వరల్డ్‌కప్ కోసం ఉగాండ జట్టు..బ్రియాన్ మసాబా (కెప్టెన్), సైమన్ స్సేసాజి, రోజర్ ముకాసా, కాస్మాస్ క్యూవుటా, దినేష్ నక్రానీ, ఫ్రెడ్ అచెలం, కెన్నెత్ వైస్వా, అల్పేష్ రాంజానీ, ఫ్రాంక్ న్సుబుగా, హెన్రీ సెనియోండో, బిలాల్ హసున్, రాబిన్సన్ ఒబుయా, రియాజత్ అలీ షా (వైస్ కెప్టెన్, జుమా మియాజీ, రోనక్ పటేల్.ట్రావెలింగ్ రిజర్వ్‌లు: ఇన్నోసెంట్ మ్వెబాజ్, రోనాల్డ్ లుటాయా -
ఉగాండ క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ క్రికెటర్
ఉగాండ జాతీయ పురుషుల క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా భారత మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అభయ్ శర్మ నియమించబడ్డాడు. ఈ విషయాన్ని ఉగాండ క్రికెట్ అసోసియేషన్ తమ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. 54 ఏళ్ల అభయ్ శర్మ ఉగాండ క్రికెట్ జట్టుతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూసీఏ పేర్కొంది. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న తమ జట్టుకు అభయ్ అనుభవం, క్రికెట్ పరిజ్ఞానం మేలు చేకూరుస్తుందని ఉగాండ క్రికెట్ అసోసియేషన్ ఆశాభావం వ్యక్తం చేసింది. కాగా, ఉగాండ క్రికెట్ జట్టు పొట్టి ప్రపంచకప్‌కు తొలిసారి అర్హత సాధించింది. జూన్ 1 నుండి యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికగా జరిగే టీ20 వరల్డ్‌కప్ 2024లో ఉగాండ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మెగా టోర్నీకి క్వాలిఫై అయిన 20 జట్లలో ఉగాండ ఒకటి. గతేడాది కాలంలో ఆట పరంగా చాలా మెరుగుపడిన ఉగాండ.. వరల్డ్‌కప్ క్వాలిఫయర్స్‌లో అద్భుత విజయాలు సాధించింది. రాబోయే వరల్డ్‌కప్‌లో ఉగాండ గ్రూప్-సిలో న్యూజిలాండ్, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి మేటీ జట్లతో పోటీ పడనుంది. ఉగాండ ఉండే గ్రూప్‌లో మరో పసికూన (పపువా న్యూ గినియా) కూడా ఉంది.అభయ్ శర్మ విషయానికొస్తే.. ఈ మాజీ ఢిల్లీ వికెట్‌కీపర్ కమ్ బ్యాటర్ అంతర్జాతీయ క్రికెట్ ఆడకపోయినప్పటికీ, దేశవాలీ క్రికెట్లో సత్తా చాటాడు. అభయ్ ఢిల్లీతో పాటు రైల్వేస్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అభయ్ తన కెరీర్లో 89 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో దాదాపు 5000 పరుగులు చేసి 230 వరకు వికెట్లు పడగొట్టడంలో భాగమయ్యాడు. అభయ్ తన కెరీర్లో 9 శతకాలు, 21 అర్దశతకాలు సాధించాడు. ఆటగాడిగా కెరీర్‌కు వీడ్కోలు పలికాక అభయ్ కోచింగ్ బాధ్యతల్లోకి వచ్చాడు. అభయ్.. భారత-ఏ, భారత అండర్-19 జట్టు, ఢిల్లీ రంజీ జట్టు, భారత మహిళా క్రికెట్ జట్లకు కోచింగ్ అందించాడు. -
Maldives Row: మాల్దీవులు-భారత్ విదేశాంగ మంత్రుల కీలక భేటీ
కంపాలా: మాల్దీవులు-భారత్ మధ్య వివాదం నడుస్తున్న వేళ ఇరుదేశాల విదేశాంగ మంత్రులు భేటీ అయ్యారు. ఉగాండ రాజధాని కంపాలాలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, మాల్దీవుల విదేశాంగ మంత్రి మూసా జమీర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలపై చర్చించారు. శుక్రవారం ప్రారంభమయ్యే నాన్-అలైన్డ్ మూవ్మెంట్(NAM) రెండు రోజుల శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఇరువురు నేతలు కంపాలాకు వెళ్లారు. ఈ సందర్భంగా భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని మూసా జమీర్ స్పష్టం చేశారు. నామ్ సమ్మిట్‌లో భాగంగా జైశంకర్‌ని కలవడం ఆనందంగా ఉందని మూసా జమీర్ ట్విట్టర్(ఎక్స్) లో తెలిపారు. మాల్దీవుల నుంచి భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ, అలాగే తమ దేశంలో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చించినట్లు పేర్కొన్నారు. సార్క్, నామ్ల సహకారంపై అభిప్రాయాలను పంచుకున్నట్లు తెలిపారు. భారతదేశంతో సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. Met Maldives FM @MoosaZameer today in Kampala. A frank conversation on 🇮🇳-🇲🇻 ties. Also discussed NAM related issues. pic.twitter.com/P7ResFlCaK — Dr. S. Jaishankar (@DrSJaishankar) January 18, 2024 మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జూ చైనా అనుకూల విధానాలను అనుసరిస్తున్నారు. నవంబర్‌లో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత సైనిక సిబ్బందిని మాల్దీవుల నుంచి తరిమివేస్తానని ఎన్నికల ప్రచారంలో వాగ్దానం చేశారు. దానికితోడు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రులు వివాదాస్పద ట్వీట్లు చేయడం.. భారత్-మాల్దీవుల మధ్య సంబంధాలు ఒత్తిడికి గురయ్యాయి. మాల్దీవుల నుంచి భారత సైన్యాన్ని ఉపసంహరించుకోవాలని మార్చి 15వరకు గడువు కూడా విధించారు. ఈ సందర్భంగా ఇరుదేశాల నేతలు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: హౌతీలపై భూతల దాడులకు యెమెన్ పిలుపు -
70 ఏళ్ల వయసులో కవలలకు జన్మనిచ్చిన వృద్దురాలు
సాధారణంగా 35-40 ఏళ్లు దాటితేనే ప్రెగ్నెన్సీ కష్టమనుకుంటున్న రోజుల్లో 70 ఏళ్ల మహిళ కవల పిల్లలకు జన్మనిచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ అరుదైన ఘటన తూర్పు ఆఫ్రికాలోని ఉగాండాలో చోటు చేసుకుంది.ఉగాండాకు చెందిన సఫీనా నముక్వాయా అనే మహిళ వయసు 70 ఏళ్ల వయసులో కవల పిల్లలకు జన్మనిచ్చింది. నముక్వాయా 1992లో భర్తను కోల్పోయింది. దీంతో నాలుగేళ్లకు మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సుమారు 20 ఏళ్లకు సఫీనా ఐవీఎఫ్ ద్వారా ఓ కుమార్తెకు జన్మనిచ్చింది. అయితే పాప పుట్టిన వెంటనే చనిపోవడంతో సఫీనా చాలా కుంగిపోయింది. దీంతో తల్లి కావలన్నా తన కోరికను 70 ఏళ్ల వయసులో తీర్చుకుంది. రెండోసారి కూడా ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా ఆమె కవలలకు జన్మనిచ్చింది. కవలల్లో ఒకరు పాప కాగా, మరొకరు బాబు ఉన్నారు. ప్రస్తుతం తల్లితో సహా పిల్లలు కూడా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ వయసులో కవలలకు జన్మనిచ్చిన సఫీనా.. ఆఫ్రికాలోనే అత్యంత పెద్ద వయసులో తల్లైన మహిళగా రికార్డు సృష్టించింది. A 70-year-old woman has given birth to twins following IVF treatment, a hospital in Uganda has said. Safina Namukwaya delivered a boy and a girl via caesarean at a fertility centre in the capital, Kampala. pic.twitter.com/XjGBgbkGPV — The Instigator (@Am_Blujay) December 1, 2023 -
2024 టీ20 వరల్డ్‌కప్‌లో పాల్గొననున్న 20 జట్లు ఇవే..
2024 టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనబోయే 20 జట్లు ఏవేవో నిన్నటితో తేలిపోయాయి. ఆఫ్రికా క్వాలిఫయర్ 2023 పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన నమీబియా, ఉగాండ వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి. టోర్నీలో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన మ్యాచ్‌లో రువాండపై విజయం సాధించడం ద్వారా ఉగాండ తొలిసారి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ ఆఫ్రికా జట్టు వరల్డ్‌కప్‌కు అర్హత సాధించిన 20వ జట్టుగా నిలిచింది. ఇదే టోర్నీలో నమీబియా టేబుల్ టాపర్‌గా నిలిచి ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. కాగా 2024 టీ20 వరల్డ్‌కప్ యూఎస్ఏ, కరీబియన్ దీవులు వేదికలుగా వచ్చే ఏడాది జూన్ 4 నుంచి 30వ తేదీ వరకు జరుగనున్న విషయం తెలిసిందే. కరీబియన్ దీవుల్లోని ఆంటిగ్వా అండ్ బర్బుడా, బార్బడోస్, డొమినికా, గయానా,సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్ అండ్ ద గ్రెనడైన్స్ నగరాల్లో .. యూఎస్ఏలోని డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్ నగరాల్లో 2024 పొట్టి ప్రపంచకప్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ ప్రపంచకప్‌లో పాల్గొనే 20 జట్లలో 12 జట్లు నేరుగా అర్హత సాధించగా.. మిగతా 8 జట్లు ఆయా రీజియన్ల క్వాలిఫయర్ల ద్వారా క్వాలిఫై అయ్యాయి. ఆతిధ్య దేశాల హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. గత ఎడిషన్‌లో టాప్-8లో నిలిచిన ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్.. టీ20 ర్యాంకింగ్స్‌లో ఆ తర్వాతి స్థానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించగా.. ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా, నేపాల్, ఓమన్, నమీబియా, ఉగాండ జట్లు క్వాలిఫయర్స్ ద్వారా వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అయ్యాయి. -
T20 WC: ఇక వేట మొదలుపెట్టాల్సిందే! బాబర్ ఆజంపై సెటైర్లు
ఉగాండా క్రికెట్ జట్టు ప్రపంచకప్‌నకు అర్హత సాధించిన క్రమంలో పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం ట్రెండింగ్‌లోకి వచ్చాడు. ఇకపై తనను జింబాబర్ అని కాకుండా.. బగాండా ఆజం అని పిలవాలని కోరతాడేమో అంటూ నెటిజన్లు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు. ఈ మేరకు ఈ మాజీ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌పై పెద్ద ఎత్తున మీమ్స్ షేర్ చేస్తూ సెటైర్లు వేస్తున్నారు. కాగా జూన్ 4 నుంచి టీ20 ప్రపంచకప్-2024 టోర్నీ మొదలుకానున్న విషయం తెలిసిందే. అమెరికా, వెస్టిండీస్ వేదికగా జరుగనున్న ఈ ఐసీసీ ఈవెంట్‌కు ఆఫ్రికా దేశం ఉగాండా తొలిసారి క్వాలిఫై అయింది. ఆఫ్రికా రీజినల్ క్వాలిఫయర్స్‌లో భాగంగా గురువారం రువాండాను.. తొమ్మిది వికెట్ల తేడాతో చిత్తు చేసి వరల్డ్‌కప్ టోర్నమెంట్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఉగాండా గెలుపును పాక్ మాజీ కెప్టెన్ బాబర్ ఆజంతో ముడిపెట్టి నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. కాగా వరల్డ్ క్లాస్ బ్యాటర్‌గా పేరొందిన బాబర్.. పసికూనలు నేపాల్, జింబాబ్వేలపై మాత్రమే ప్రతాపం చూపిస్తాడనే అపవాదు ఉంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా నేపాల్ మీద 151 పరుగులు చేసిన బాబర్.. జింబాబ్వే తో మ్యాచ్‌లలోనూ రెండుసార్లు అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఈ నేపథ్యంలో పటిష్ట జట్లతో మ్యాచ్‌లలో బాబర్ విఫలమైనపుడల్లా అతడిని జింబాబర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ఉగాండా కూడా వరల్డ్ కప్ రేసులోకి రావడంతో బాబర్ పండుగ చేసుకోవడం ఖాయమంటూ సెటైర్లు పేలుస్తున్నారు. నేను ఇక మరో వేటకు సిద్ధం కావాల్సిందే.. ఇకపై నేను జింబాబర్ కాదు.. బగాండా ఆజం అయిపోతా అని అంటున్నట్లుగా మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. బాబర్ షికారుకు మరో పసికూన బలికావడం లాంఛనమే అంటూ సరదాగా ట్రోల్ చేస్తున్నారు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న పొట్టి క్రికెట్ సమరంలో ఏకంగా 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. ఈ మెగా టోర్నీకి ఇప్పటికే 12 జట్లు నేరగా అర్హత సాధించాయి. Uganda qualified for T 20 world cup 2024 Babar Azam pic.twitter.com/gGcRIB09iq — Desi Bhayo (@desi_bhayo88) November 30, 2023 -
జింబాబ్వేకు బిగ్ షాక్.. టీ20 వరల్డ్‌కప్‌కు ఉగాండా ఆర్హత
ఉగాండా క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. యూఎస్ఎ, వెస్టిండీస్ వేదికలగా జరగనున్న టీ20 ప్రపంచకప్-2024కు ఉగాండా అర్హత సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌కు ఉగాండా క్వాలిఫై అవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఆఫ్రికన్ రీజినల్ క్వాలిఫియర్స్‌లో భాగంగా గురువారం రువాండాతో జరిగిన ఫైనల్ రౌండ్ మ్యాచ్‌లో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించిన ఉగాండా.. వరల్డ్‌కప్ బెర్త్‌ను ఖారారు చేసుకుంది. ఈ క్వాలిఫియర్స్‌లో భాగంగా ఆడిన 6 మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన ఉగాండా పాయింట్ల పట్టికలో రెండో స్ధానంలో నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రువాండా కేవలం 65 పరుగులకే ఆలౌటైంది. ఉగండా బౌలర్లలో అల్పేష్ రాంజానీ, దినేష్ నక్రానీ, మసబా, స్సెన్యోండో తలా రెండు వికెట్లతో రువాండా పతనాన్ని శాసించారు. అనంతరం 66 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉగండా కేవలం ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించింది. కాగా ఉగండా విజయంతో మరో ఆఫ్రికా జట్టు జింబాబ్వే టీ20 వరల్డ్‌కప్‌కు అర్హత సాధించలేకపోయింది. పాయింట్ల పట్టికలో జింబాబ్వే మూడో స్ధానంలో నిలిచింది. ఈ క్వాలిఫై టోర్నీలో భాగంగా ఉగండా చేతిలో 5 వికెట్ల తేడాతో జింబాబ్వే ఓటమి చవిచూసింది. అప్పుడే జింబాబ్వే వరల్డ్‌కప్ క్వాలిఫై ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఆఫ్రికన్ రీజినల్ క్వాలిఫియర్స్ నుంచి ఉగండాతో పాటు నబీబియా కూడా టీ20 ప్రపంచకప్-2024కు క్వాలిఫై అయింది. కాగా టీ20 వరల్డ్‌కప్‌కు ఆర్హత సాధించిన ఐదో ఆఫ్రికన్ జట్టుగా ఉగాండా నిలిచింది. 20 జట్లు బరిలోకి.. 2024 టీ 20 వరల్డ్ కప్ లో భాగంగా ఈ సారి ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 20 జట్లు బరిలోకి దిగుతున్నాయి. ఈ మెగా టోర్నీ కోసం ఐసీసీ ఇప్పటికే 12 జట్లకు నేరుగా అర్హత కల్పించింది. ఆతిధ్య దేశ హోదాలో యూఎస్ఏ, వెస్టిండీస్.. టీ20 వరల్డ్‌కప్-2022 టాప్-8లో నిలిచిన జట్లు ఇంగ్లండ్, పాకిస్తాన్, ఇండియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, సౌతాఫ్రికా, నెదర్లాండ్స్ నేరుగా అర్హత సాధించాయి. అదే విధంగా టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం 9, 10 స్ధానాల్లో నిలిచిన ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ కూడా డైరక్ట్‌గా క్వాలిఫై అయ్యాయి. మిగిలిన 8 బెర్తులు వివిధ రీజియన్ల క్వాలిఫయింగ్ పోటీల ద్వారా భర్తీ చేయబడతాయి. క్వాలిఫయర్స్ ద్వారా ఐర్లాండ్, పపువా న్యూ గినియా, స్కాట్లాండ్, కెనడా నేపాల్, ఒమన్ ఇప్పటికే అర్హత సాధించగా.. తాజాగా నబీబియా, ఉగాండా ఈ జాబితాలో చేరాయి. చదవండి: IPL 2024: అతడొక ఫినిషర్.. వేలంలో తీవ్ర పోటీ! రూ.13 కోట్లకు -
అత్యంత క్రూరమైన ‘ఉగాండా కసాయి’ ఎవరు? మృతదేహాలతో ఏం చేసేవాడు?
కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రపంచవ్యాప్తంగా క్రూరమైన పాలకులు చాలామంది ఉండేవారు. ఆ క్రూరమైన నియంతలలో అతనిపేరు తప్పుక వినిపిస్తుంది. హిట్లర్ నియంతృత్వ పోకడల గురించి మనం చాలానే విన్నాం. అయితే ఇప్పుడు మనం ‘ఉగాండా కసాయి’గా పేరొందిన ఒక నియంత గురించి తెలుసుకోబోతున్నాం. ఆ నియంతకు మృతదేహాలతో జీవించడమన్నా, మనిషి మాంసం తినడమన్నా ఎంతో ఇష్టమట. ఈ ‘ఉంగాండా కసాయి’ పాలనలో లక్షలాది మంది హత్యకు గురయ్యారని చరిత్ర చెబుతోంది. ఇప్పుడు మనం ఉగాండా నియంత ఈదీ అమీన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈదీ అమీన్ 1972లో ఉగాండాలో నివసిస్తున్న వేలాది మంది ఆసియావాసులను దేశం విడిచి వెళ్లాలని ఆదేశించించాడు. ఇదీ అమీన్ 130 కిలోలకు మించిన బరువు కలిగివుండేవాడు. ఎత్తు 6 అడుగుల నాలుగు అంగుళాలు. ఈ ‘ఉగాండా కసాయి’కి ఎవరైనా ఎదురైతే ఇక వారి పని అయిపోయినట్టే. ఈదీ అమీన్ అత్యంత క్రూరమైనవాడు. అతని పేరు చెప్పగానే జనం వణికిపోయేవారు. ఈదీ అమీన్ సహచరులు రాసిన కొన్ని పుస్తకాల్లో వెల్లడైన వివరాలు తెలిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. ఈ పుస్తకాల ద్వారానే ఈ నియంత ఎంత క్రూరుడో ప్రపంచానికి తెలిసింది. ఈ ఉగాండా కసాయి తన శత్రువులను హత్య చేసిన తరువాత, వారి మృతదేహాలను మరింత క్రూరంగా హింసించేవాడు. అంతే కాదు మృతదేహాలతో ఒంటరిగా గడపడమంటే ఆయనకు ఇష్టమని కొందరు తమ రచనలలో తెలిపారు. ఇది అతనికి ఎంతో ప్రశాంతతను ఇస్తుందట. ఇంతేకాదు ఆ నియంత మానవ మృతదేహాలను తినేవాడట. అలాగే వారి రక్తాన్ని తాగడాన్ని ఇష్టపడేవాడట. చిరుతపులి మాంసం కంటే మానవ మాంసమే బాగుంటుదని అమీన్ ఓ వైద్యునితో చెప్పాడట. ఇది కూడా చదవండి: ‘లాయర్ల సీనియర్ హోదా’ అంటే ఏమిటి? నిబంధనలు, అర్హతలు ఏవి? -
ఆకులపై జంతువుల డీఎన్ఏ
సాక్షి, అమరావతి: జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు ఏ ప్రాణి.. ఎక్కడ.. ఎలా జీవిస్తోందనే సమాచారం సేకరించేందుకు శాస్త్రవేత్తలు కొత్త పద్ధతులను అన్వేషిస్తున్నారు. ఇప్పటివరకు కెమెరా ట్రాపింగ్, లైన్ ట్రాన్‌సెక్టు్టలను ఉపయోగించి జంతువుల కదలికలను ట్రాక్ చేయడం ద్వారా వన్యప్రాణుల ఉనికిని పర్యవేక్షిస్తున్నారు. ఈ ట్రాకింగ్ నిర్ధిష్ట ప్రాంతం, ప్రత్యేకించి డిజైన్ చేసిన ట్రయల్స్‌గా మాత్రమే ఉంటోంది. ఇందులో ఖరీదైన పరికరాల వాడకం, శ్రమతో కూడుకోవడంతో పాటు ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వస్తోంది. ఒక ప్రాంతంలోని అన్ని జాతులను గుర్తించడం సాధ్యపడటం లేదు. దట్టమైన వర్షారణ్యాల్లో ఈ రకమైన ట్రాకింగ్ కష్టతరంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో అంతర్జాతీయ జీవ వైవిధ్య శాస్త్రవేత్తల బృందం అడవుల్లో జంతువుల డీఎన్ఏ నమూనాల సేకరణ ద్వారా జీవ వైవిధ్యాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో గుర్తించవచ్చని ఓ అధ్యయనంలో పేర్కొంది. గాలిలోకి కణాలుగా జంతు డీఎన్ఏ ఉగాండాలోని కిబలే జాతీయ పార్కులోని వర్షారణ్యంలో అంతర్జాతీయ పరిశోధన బృందం మొక్కలు, చెట్ల ఆకులపై జంతువులు డీఎన్ఏలను కనుగొంది. జంతువులు తమ డీఎన్ఏను గాలిలోకి కణాలుగా విడుదల చేస్తున్నట్టు.. అది కాస్తా అడవిలోని వృక్ష సంపదపై సన్నని మైనం పొర మాదిరిగా అల్లుకుంటున్నట్టు పరిశోధనలో తేలింది. ఆకులపైన స్వాబ్ నమూనాలను కాటన్ బడ్స్ ద్వారా సేకరించి డీఎన్ఏ సీక్వెన్సింగ్ పరీక్ష ద్వారా జాతుల వివరాలను తెలుసుకోవడంతోపాటు జీవ వైవిధ్యాన్ని మ్యాప్ చేయవచ్చని పరిశోధన బృందం చెబుతోంది. పర్యావరణంలోని మార్పులను అర్థం చేసుకుంటూ జీవ వైవిధ్యాన్ని సమర్థవంతంగా నిర్వహించడానికి, అటవీ జనాభాను పర్యవేక్షించడానికి డీఎన్ఏ పరీక్షా విధానం ఎంతగానో ఊతమిస్తోంది. కోవిడ్ తర్వాత డీఎన్ఏ సీక్వెన్సింగ్ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందడం కూడా కలిసి వస్తోంది. ఆకులను శుభ్రపరచడానికి టెక్నాలజీ, ఖరీదైన పరికరాలు, ఎక్కువ శిక్షణ అవసరం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైల్డ్‌లైఫ్ అథారిటీలో పని చేసే సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఇతర జీవ శాస్త్రవేత్తలు దీనిని సులభంగా నిర్వహించవచ్చు. వాస్తవంగా పర్యావరణంలో సేకరించే డీఎన్ఏ చాలా పెద్దస్థాయిలో జీవ వైవిధ్య పర్యవేక్షణకు దోహదపడుతుంది. వర్షాధార పరిస్థితుల్లో, అత్యంత వేడి పరిస్థితుల్లో మాత్రమే ఆకులపై డీఎన్ఏ త్వరగా క్షీణిస్తుంది తప్ప మిగిలిన సందర్భాల్లో పరిశోధనలకు అనుకూలంగా ఉండటంతో ఈ పద్ధతిపై అంచనాలు పెరుగుతున్నాయి. గంటలో 50కి పైగా జాతుల గుర్తింపు కిబలే జాతీయ పార్కు గొప్ప జీవ వైవిధ్యానికి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోని ‘ప్రైమేట్ క్యాపిటల్’ (కోతి జాతులు) నిలయంగా ఉంది. ఇందులో అంతరించిపోతున్న రెడ్ కోలోబస్ కోతి, చింపాజీలతో సహా 13 జాతులు ఇందులో ఉన్నాయి. ఇక్కడ పరిశోధకులు కేవలం ఒక గంటలో 24 కాటన్ బడ్స్ ద్వారా ఆకులపై స్వాబ్ నమూనాలను సేకరించారు. వాటి విశ్లేషణ కోసం ల్యాబ్‌కు పంపగా.. ఏకంగా 50 రకాల క్షీరదాలు, పక్షులు, ఒక కప్ప జాతులను గుర్తించడం గమనార్హం. ప్రతి మొక్క ఆకులపై దాదాపు 8 జంతు జాతులను కనుగొన్నారు. వీటిల్లో పెద్దవైన అంతరించిపోతున్న ఆఫ్రికన్ ఏనుగు నుంచి చిన్న జాతులైన సన్‌బర్డ్ వరకు భారీ జీవ వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. డీఎన్ఏల ద్వారా ఒక మీటరు పొడవాటి రెక్కలుండే గబ్బిలాలు, బయటకు కనిపించని పర్వత కోతులు, బూడిద, ఎరుపు వర్ణాల కోతులు, సుంచు ఎలుకలు, అనేక రకాల చిలుకలు ఉన్నట్టు గుర్తించారు. -
పాఠశాలపై దాడి చేసిన ఉగ్రవాదులు.. 25 మంది మృతి
ఉగాండా: డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో సరిహద్దులో ఉన్న ఒక స్కూలుపై ఏడీఎఫ్ తిరుగుబాటుదారులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారుగా 25 మంది మృతి చెందగా 8 మంది గాయపడ్డారు. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ అనుబంధ సంస్థగా పేరున్న ఏడీఎఫ్ శుక్రవారం రాత్రి పశ్చిమ ఉగాండాలోని పాండ్వేకు చెందిన లుబిరిరా ఉన్నత పాఠశాలపై దాడికి తెగబడింది. తిరుగుబాటుదారుల దాడిలో కనీసం 25 మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని మరో ఎనిమిది మంది గాయపడ్డారని తెలిపారు ఉగాండా పోలీసులు. ఉగాండా పోలీసులు దాడికి సంబంధించిన వివరాలు తెలుపుతూ.. పాండ్వే లుబిరిరా పాఠశాలపై ఏడీఫ్ తీవ్రవాదులు దాడి చేసి పాఠశాల వసతి గృహాన్ని తగలబెట్టి ఆహారాన్ని దొంగిలించుకుపోయారు. ఇప్పటివరకు ఇక్కడ 25 మృతదేహాలను గుర్తించి దగ్గర్లోని బ్వేరా ఆసుపత్రికి తరలించాము.ఇందులో విద్యార్థులు ఎంతమంది చనిపోయారన్న దానిపై స్పష్టత లేదు. దాడి అనంతరం ఉగ్రవాద ముఠా విరుంగా నేషనల్ పార్క్ వైపుగా పారిపోయారని అన్నారు. 1990ల్లో తూర్పు ఉగాండాలో ఆనాటి అధ్యక్షుడు యోవెరీ ముసెవెనికి వ్యతిరేకంగా ఏడీఎఫ్ పుట్టుకొచ్చింది. చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న ఏడీఎఫ్ 2021లో ఉగాండా రాజధాని కంపాలాలో బాంబు దాడికి పాల్పడినట్టు ఆరోపణలు కూడా ఉన్నాయి. మళ్ళీ ఇన్నాళ్లకి ఏడీఎఫ్ మళ్ళీ వెలుగులోకి వచ్చి పిల్లల పాఠశాలపై దాడులు చేయడం పాశవికమని ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్యని అన్నారు ఉగాండా నేత విన్నీ కిజా. ఇది కూడా చదవండి: నిద్రలో హఠాత్తుగా లేచి తుపాకీతో కాల్చుకున్నాడు.. కారణం తెలిస్తే షాక్.. -
స్వలింగ సంపర్కులను వదలరు.. చంపేస్తారక్కడ!
స్వలింగ వివాహాల చట్టబద్ధతపై మన దగ్గర సర్వోన్నత న్యాయస్థానంలో రాజ్యాంగ ధర్మాసనం చట్టసభ పరిధిలోని అంశమని, అయితే వాళ్ల హక్కుల పరిరక్షణ బాధ్యత మాత్రం ప్రభుత్వాలదేనని స్పష్టం చేసింది. అయితే.. ఇది సహేతుకం కాదని కేంద్రం వద్దంటోంది. స్వేచ్ఛా హక్కులో భాగంగా వివాహ హక్కు కల్పించాలని కొందరు కోరుతున్నారు. ఈ క్రమంలో.. ఆ మధ్య ప్రపంచంలోనే అత్యంత కఠినమైన స్వలింగసంపర్క వ్యతిరేక చట్టాన్ని తెర మీదకు తీసుకొచ్చి ఆసక్తికర చర్చకు దారి తీసింది ఆఫ్రికా దేశం ఉగాండా. తూర్పు ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేక చట్టానికి ఈ ఏడాది మే నెలలో ఆ దేశ అధ్యక్షుడు యోవెరీ ముసెవెని(78) ఆమోద ముద్ర వేశారు.దీంతో.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన చట్టాన్ని తీసుకొచ్చిన దేశంగా నిలిచింది ఉగాండా. ఆఫ్రికా ఖండం మొత్తంలో 30 దేశాల్లో సేమ్ సెక్స్ రిలేషన్స్ అనేది నేరం. అందుకుగానూ కఠిన శిక్షలే ఉంటాయి. కానీ, ఉగాండా మాత్రం ఒక అడుగు ముందుకు వేసింది. ఏకంగా.. మరణ శిక్ష అమలు చేయాలని నిర్ణయించింది. 👉 ఉగాండా చట్టాల ప్రకారం.. స్వలింగ సంపర్కుల బంధం తీవ్ర నేరం. హెచ్ఐవీ/ఎయిడ్స్‌లాంటి ప్రాణాంతక సుఖవ్యాధులు వ్యాప్తి చెందుతాయి. కాబట్టి, అలాంటి రిలేషన్షిప్లో కొనసాగితే.. తీవ్రంగా పరిగణిస్తారు. జైలు శిక్ష లేదంటే దేశ బహిష్కరణ లాంటి శిక్షలు అమలు చేస్తారు. మరోవైపు అనధికారికంగా.. సంఘం నుంచి సామాజిక బహిష్కరణతో పాటు రాళ్లతో తరిమి తరిమి కొట్టి చంపిన దాఖలాలు, మూక హత్యల ఘటనలూ అక్కడ నమోదు అయ్యాయి. ఉగాండా తాజా చట్టం ప్రకారం.. ఒకే లింగానికి చెంది ఉండి.. చట్టాన్ని ఉల్లంఘిస్తూ పదే పదే పరస్పర శృంగారంలో పాల్గొనడం, బంధంలో కలిసి జీవించడం, వివాహాలు.. లాంటి నేరాలు చేస్తే వాళ్లకు మరణ శిక్ష విధిస్తారక్కడ. అలాగే హోమో సెక్సువాలిటీని ప్రమోట్ చేసినందుకుగానూ 20 ఏళ్ల జైలు శిక్ష సైతం విధిస్తారు. 👉 గోల్డ్ పెన్‌తో అధ్యక్షుడు యోవెరీ ముసెవెని చట్టం ప్రతులపై సంతకం చేసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే.. ఉగాండా తీసుకున్న ఈ నిర్ణయంపై పలు దేశాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 👉 అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉగాండా తాజా నిర్ణయాన్ని మానవ హక్కులకు సంబంధించిన విషాదకరమైన ఉల్లంఘనగా అభివర్ణించారు. మానవ హక్కుల ఉల్లంఘనను అమెరికా ఎప్పుడూ తీవ్రంగానే పరిగణిస్తుంది. అందుకు తగ్గట్లే ఆంక్షలు, నిషేధాజ్ఞల దిశగా ఆలోచన చేస్తామని ప్రకటించారాయన. 👉అంతేకాదు సొంత దేశంలో పలు గ్రూపులు కోర్టును ఆశ్రయించాయి కూడా. మరోవైపు ఉగాండా స్ఫూర్తితో కెన్యా, టాంజానియాలు కూడా కఠిన శిక్షలు అమలు చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. 👉 ఉగాండాలో ఎల్జీబీటీక్యూ వ్యతిరేకచట్టంపై చర్చ ఈనాటిది కాదు. 2014లో ఉగాండా చేసిన ప్రయత్నాలను గమనించిన పాశ్చాత్య దేశాలు సహాయం నిలిపేయడం, ఆంక్షలు విధించడం, భద్రతా సహకారంపై కోతలు విధించడం లాంటి తీవ్ర నిర్ణయాలు తీసుకున్నాయి. 👉 అంతకు ముందు 2009లో.. kill the gays(గేలను చంపేయడం) లాంటి ప్రతిపాదనను తీసుకురాగా.. ప్రపంచ దేశాలు, కీలక సంస్థల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఒక అడుగు వెనకేసింది. ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ అదే చట్టానికి అధ్యక్షుడి ఆమోద ముద్ర పడేలా చేసుకుంది. -
ఓ పోలీసు చేతిలో ఉగాండా భారతీయ బ్యాంకర్ హతం: వీడియో వైరల్
డ్యూటీలోని ఓ పోలీసు చేతిలో భారతీయ ఫైనాన్షియల్ బ్యాంకర్ హతమయ్యాడు. అతను తన రుణం విషయమై సదరు బ్యాంకర్‌తో వాదించి మరీ కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటన ఉగాండా రాజధాని కంపాల నగరంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..పోలీసులు తెలిపిన కథనం ప్రకారం..మే 12న ఉత్తమ్ భండారీ అనే ఫైనాన్షియల్ బ్యాంకర్‌పై 30 ఏళ ఇవాన్ వాబ్‌వైర్ కాల్పులు జరిపాడు. నిజానికి భండారీ టీఎఫ్ఎస్ ఫైనాన్షియల్ సర్వీసెస్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. వాబ్‌వైర్ అతడి క్లయింట్. వాబ్‌వైర్ సంస్థ నుంచి మొత్తం రూ. 46 వేలు లోన్(రుణం) తీసుకున్నాడు. ఆ విషయమై ఇద్దరి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో వాబ్‌వైర్ ఏకే 47తో కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో భండారీ అక్కడికక్కడే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు అతడిని అదుపులో తీసుకుని అరెస్టు చేశారు. దర్యాప్తులో పోలీసులు వాబ్‌వైర్ డ్యూటీలో లేని ఓ పోలీసుగా పేర్కొన్నారు. తన సహచర ఉద్యోగి నుంచి ఏకే 47ని దొంగలించి మరీ అతడిపై కాల్పులు జరిపినట్లు విచారణలో తేలిందన్నారు. వాబ్‌వైర్ మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని, అందుకోసం రెండుసార్లు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్న చరిత్ర కూడా ఉందని చెప్పారు. అతను ఈ విషయమై ఐదేళ్ల వరకు తుపాకిని కలిగి ఉండకుండా నిషేధించారని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఉగాండాలో ఈ విషయమై ఆందోళన చెందుతున్న భారతీయ కమ్యూనిటీలను కలుసుకుని వారి భద్రత విషయమై హామి ఇచ్చారు. కాగా, అందుకు సంబంధించిన వీడియో నెట్లింట వైరల్ అవుతోంది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: (చదవండి: మళ్లీ అమెరికాలో కాల్పుల మోత.. ముగ్గురు మృతి) -
మంత్రిపై బాడీగార్డు కాల్పులు.. స్పాట్లోనే మృతి
కంపాలా: ఉగాండా దేశంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఉగాండా దేశ మంత్రిపై తన బాడీగార్డు కాల్పులు జరపడంతో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. దీంతో, ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఉగాండా రాజధాని కంపాలాలో ఆ దేశ కార్మిక శాఖ సహాయమంత్రి, రిటైర్డ్ కల్నల్ చార్లెస్ ఎంగోలా నివాసంలో ఆయనకు బాడీగార్డుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో బాడీగార్డ్ తన వద్ద ఉన్న తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో మంత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం, బాడీగార్జ్ కూడా అదే తుపాకీతో తనను తాను కాల్చుకుని మృతి చెందాడు. అయితే, మంత్రి వద్ద బాడీగార్డ్‌గా పనిచేస్తున్న సదరు వ్యక్తికి చాలా కాలంగా వేతనాలు చెల్లించడం లేదని సమాచారం. ఈ కారణంతోనే మంత్రిని బాడీగార్డు కాల్చి చంపినట్లు సమాచారం. ఇక, ఈ కాల్పుల ఘటనపై ఆర్మీ అధికారులు దురదృష్టకరమని.. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టినట్లు ఆర్మీ ప్రతినిధి ఫెలిక్స్ కులాయిగ్వే వెల్లడించారు. ఎంగోలా హత్యకు దారితీసిన కారణాలు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. Col Charles Engola shot dead by the Body Guard. RIP.😭 ! BREAKING NEWS ! pic.twitter.com/CVmbWzMTqU — Davic Films Bsa (@davic_films) May 2, 2023 ఇది కూడా చదవండి: డింగ్ డాంగ్ డిచ్ కేసు: ముగ్గురిని బలిగొన్న ఎన్నారై చంద్రను దోషిగా తేల్చిన కోర్టు -
విషాదం: షాపింగ్ మాల్లో తొక్కిసలాట.. 9 మంది మృతి
కంపాలా: కొత్త ఏడాది సెలబ్రేషన్స్ కోసం షాపింగ్‌కి వెళ్లి పలువురు ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో ఆదివారం జరిగింది. దేశ రాజధాని కంపాలా ప్రాంతంలోని ఫ్రీడమ్ సిటీ షాపింగ్ మాల్లో తొక్కిసలాట జరిగింది. ఈ విషాద సంఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో వినియోగదారులు తీవ్రంగా గాయపడినట్లు స్థానిక మీడియో వెల్లడించింది. ఫ్రీడమ్ సిటీలో ఏర్పాటు చేసిన బాణసంచా కొనుగోలు చేసేందుకు భారీగా జనం ఎకబడడంతో తొక్కిసలాట జరిగినట్లు మీడియా పేర్కొంది. దీంతో షాపింగ్ కోసం వచ్చిన పలువురు ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: కాబూల్ ఆర్మీ ఎయిర్పోర్ట్ వద్ద భారీ పేలుడు.. 10 మంది మృతి -
రెండేళ్ల బాలుడ్ని అమాంతం మింగేసిన నీటిగుర్రం.. చివరకు ఏమైందంటే?
ఉగాండాలో మిరాకిల్ జరిగింది. సరస్సు సమీపంలోని ఓ ఇంటి బయట ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడ్ని నీటిగుర్రం(హిపోపాటమస్) అమాంతం మింగేసింది. అక్కడున్న ఓ వ్యక్తి గట్టిగా అరుస్తూ రాళ్లు విసిరేయడంతో వెంటనే బాలుడ్ని బయటకు ఉమ్మేసింది. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆస్పత్రికి తరలించగా అతను క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ బాలుడి పేరు పాల్. సరస్సుకు అతి సమీపంలో వీళ్ల ఇల్లు ఉంది. డిసెంబర్ 4న సరదాగా బయటకు వెళ్లి ఆడుకుంటున్నాడు. తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నారు. సరస్సు నుంచి వచ్చిన నీటిగుర్రం బాలుడ్ని తలపై నుంచి అమాంతం మింగేసింది. సగానికిపైగా శరీరాన్ని నోట్లోకి తీసుకుంది. ఇంతలో అటువైపు నుంచి వెళ్తున్న క్రిస్పస్ బగోంజా అనే వ్యక్తి ఇది గమనించి నీటిగుర్రంపైకి రాళ్లు విసిరాడు. దీంతో అది బాలుడ్ని వదిలేసింది. అయితే హిపోపాటమస్ పళ్లు గుచ్చుకొని చిన్నారి చేతికి గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించగా వైద్యులు ముందు జాగ్రత్తగా రేబిస్ ఇంజెక్షన్ ఇచ్చారు. అనంతరం చికిత్స అందించారు. నీటిగుర్రాలు శాఖహారులు అయినప్పటికీ.. బాగా భయపడినప్పుడు వేగంగా దాడులు చేస్తాయి. కొన్నిసార్లు పడవలను కూడా ఎత్తిపడేస్తాయి. నీటిగుర్రాల దాడుల వల్ల ఆఫ్రికాలో ఏటా 500 మంది చనిపోతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచంలోని ఏ ఇతర జంతువు కారణంగా ఇన్ని మరణాలు నమోదు కావడం లేదు. అత్యంత ప్రమాదకర జంతువుల్లో హిపోపాటమస్ కూడా ఒకటి. దీని దంతాలు సింహం కంటే మూడు రెట్లు ఎక్కువ బలంగా ఉంటాయి. చదవండి: 2,00,000 బలగాలతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడేందుకు రష్యా ప్లాన్! -
అంధుల స్కూల్లో అగ్ని ప్రమాదం.. 11 మంది దుర్మరణం
కంపాలా: అంధుల పాఠశాలలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉగాండాలో జరిగింది. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులే ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉగాండా రాజధాని కంపాలాకు సమీప ముకోనో జిల్లాలో సలామా అంధుల రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దాంతో కంటిచూపు లేని చిన్నారులు అగ్నిలోనే ఆహుతయ్యారు. వసతి గృహంలో పిల్లలు నిద్రిస్తున్న సమయంలో మంటలు చెలరేగాయని పాఠశాల హెడ్మాస్టర్ ప్రాన్సిస్ కిరుబే తెలిపారు. ప్రాణాలు కోల్పోయిన వారందరూ ఏడు నుంచి పదేళ్ల వయసు పిల్లలేనని.. వారి శరీరాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని మరో అధికారి వెల్లడించారు. స్కూల్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు అందిరిని కలిచివేశాయి. తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో స్కూల్స్‌లో అగ్ని ప్రమాదాలు ఇటీవల ఎక్కువైనట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. కిక్కిరిసిపోయే తరగతి గదులు, విద్యుత్ కనెక్షన్లు సరిగా లేకపోవడం వంటివి అగ్ని ప్రమాదాలకు కారణమవుతున్నట్లు అధికారులు పేర్కొన్నాయి. నవంబర్, 2018లో దక్షిణ ఉగాండాలోని ఓ పాఠశాలలో అగ్ని ప్రమాదం జరిగి 11 మంది చిన్నారులు మరణించారు. 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. 2006లో పశ్చిమ ఉగాండాలో ఇస్లామిక్ పాఠశాలలో 13 మంది చిన్నారులు దుర్మరణం చెందారు. ఇదీ చదవండి: ‘వరల్డ్ డర్టీ మ్యాన్’.. 67 ఏళ్ల తర్వాత స్నానం.. నెలల వ్యవధిలోనే మృతి -
దినేశ్‌కు మూడు కాంస్యాలు
సాక్షి, హైదరాబాద్: ఉగాండా పారా బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన రామ్‌కో సిమెంట్స్ ఉద్యోగి దినేశ్ రాజయ్య రాణించి మూడు కాంస్య పతకాలు సాధించాడు. దినేశ్ ఎస్ఎల్–3 సింగిల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్ఎల్4 డబుల్స్‌లో, ఎస్ఎల్3–ఎస్యు5 మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సొంతం చేసుకున్నాడు. ఈ టోర్నీ సందర్భంగా దినేశ్‌ను ఉగాండాలో భారత హైకమిషనర్‌గా ఉన్న ఎ.అజయ్ కుమార్ సన్మానించి అభినందించారు. మొత్తం 20 దేశాల నుంచి వివిధ కేటగిరీల్లో కలిపి 191 మంది క్రీడాకారులు ఈ టోర్నీలో పాల్గొన్నారు. భారత్‌కు 12 స్వర్ణాలు, 14 రజతాలు, 16 కాంస్యాలతో కలిపి మొత్తం 42 పతకాలు లభించాయి. -
హైదరాబాద్‌లో కొత్తరకం సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. పోలీసులు సైతం షాక్
సాక్షి, హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని నార్సింగి పోలీసులు రెండు వారాల క్రితం గుట్టురట్టు చేసిన విదేశీ సెక్స్ రాకెట్ వ్యవహారంలో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ గ్యాంగ్‌ను కస్టడీలోకి తీసుకుని విచారించిన అధికారులు హైటెక్ పద్దతిలో దందా చేస్తున్నట్లు గుర్తించారు. వ్యభిచార గృహం నిర్వాహకుడితో పాటు ఉగాండా జాతీయురాలు, విటుడిని అరెస్టు చేసిన పోలీసులు వారిపై పీటా యాక్ట్‌తో పాటు విదేశీయురాలిపై పాస్‌పోర్ట్, ఫారెనర్స్ యాక్ట్ కిందా కేసు నమోదు చేశారు. మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న మరో ఉగాండా జాతీయుడి కోసం గాలిస్తున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న విదేశీయుడు... విజిట్ వీసాపై వచ్చి పుప్పాలగూడలోని ఫ్రెండ్స్ కాలనీలో నివసిస్తున్న ఓ ఉగాండా జాతీయుడు, స్థానిక వ్యక్తితో కలిసి తమ ఫ్లాట్‌లోనే వ్యభిచార కేంద్రం ఏర్పాటు చేశాడు. సదరు ఉగాండా జాతీయుడు తమ దేశానికి చెందిన మహిళలు, యువతులను విజిట్ వీసాపై టూరిస్టుల మాదిరిగా రప్పిస్తున్నాడు. ఆపై వీరి ఫొటోలను డేటింగ్ యాప్స్‌లో పొందుపరుస్తున్నాడు. వీటిని చూసి ఆకర్షితులైన వారు సదరు యాప్ ద్వారా అతడిని సంప్రదిస్తున్నారు. అలాంటి వారికి నిర్వాహకుడు సూచించిన వాట్సాప్ నంబర్ ఇచ్చే యువతి అతడితో చాటింగ్ చేస్తుంది. ఇదే వాట్సాప్‌ను వాట్సాప్ వెబ్ ద్వారా నిర్వాహకుడు, మధ్యవర్తి గమనిస్తుంటారు. గూగుల్ పే ద్వారా చెల్లింపుల తర్వాత... విటుడితో చాటింగ్, బేరసారాల అనంతరం రేటు ఖరారవుతుంది. ఈ మొత్తాన్ని విటుడు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా చెల్లిస్తూ ఆ స్క్రీన్ షాట్‌ను వాట్సాప్ ద్వారానే యు వతికి పంపిస్తాడు. దీనిని పర్యవేక్షించి మిగిలిన ఇద్దరూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాత సదరు యువతి తమ ఫ్లాట్ లోకేషన్‌ను విటుడికి షేర్ చేస్తుంది. దీనిని వేర్వేరు వ్యక్తులకు షేర్ చేసే అవకాశం లేకుండా లాక్డ్ లోకేషన్ షేర్ చేస్తూ, అది కేవలం ఒకరికి మాత్రమే ఓపెన్ అయ్యేలా సెట్ చేస్తున్నారు ఆ నిర్వాహకులు. లోకేషన్‌ను అన్‌లాక్ చేయడానికి ఉపకరించే కోడ్‌ను విడిగా వాట్సాప్‌లో విటుడికి పంపిస్తున్నారు. కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా... అలా వ్యభిచార గృహం నడిచే ఫ్లాట్‌కు విటుడు చేరుకుంటున్నాడు. ఫ్రెండ్స్ కాలనీ కేంద్రంగా కొన్నాళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా దందా నడుస్తోంది. దీనిపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు రెండు వారాల క్రితం దాడి చేసి ముగ్గురిని అరెస్టు చేయడంతో పాటు పరారీలో ఉన్న ఉగాండా జాతీయుడి కోసం గాలిస్తున్నారు. ఫ్లాట్ నుంచి విటుడు తిరిగి వెళ్లేప్పుడు అతడి ఫోన్ తనిఖీ చేసే యువతి అందులోని తమ చాటింగ్‌తో పాటు నంబర్‌ను డిలీట్ చేస్తోందని పోలీసులు గుర్తించారు. పోలీసులకు ఆధారాలు చిక్కకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్లు ఓ అధికారి వివరించారు. చదవండి: వనపర్తిలో మరో ‘సర్ప్రైజ్’ ఘటన.. ఈసారి భర్త ‘బలి’ -
క్వార్టర్ ఫైనల్లో బంగ్లాదేశ్‌తో తలపడనున్న టీమిండియా..
టరోబా: అండర్– 19 క్రికెట్ ప్రపంచకప్‌లో భారత జట్టు అసాధారణ గెలుపుతో లీగ్ దశ ను ముగించింది. గ్రూప్ ‘బి’ మ్యాచ్ లో యువ భారత్ 326 పరుగుల భారీ తేడాతో ఉగాండాపై నెగ్గింది. మొదట భారత్ 50 ఓవర్లలో 5 వికెట్లకు 405 పరుగుల భారీస్కోరు చేసింది. రాజ్ అంగద్ బావా (162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు), అంగ్కృష్ (144; 22 ఫోర్లు, 4 సిక్స్‌లు) చెలరేగారు. తర్వాత ఉగాండా 19.4 ఓవర్లలో 79 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో నిషాంత్ 4, రాజ్వర్ధన్ 2 వికెట్లు తీశారు. ఈనెల 29న జరిగే క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్‌తో భారత్ తలపడుతుంది. -
చెలరేగిన టీమిండియా.. 326 పరుగుల తేడాతో ఘన విజయం
టరోబా (ట్రినిడాడ్): అండర్–19 ప్రపంచకప్‌లో ఉగాండాతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యువ భారత్ 326 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఉగాండాకు అలసటే తప్ప 50 ఓవర్లపాటు ఊరటే లేదు. ఈ మ్యాచ్‌లో భారత కుర్రాళ్లు ఉప్పెనలా చెలరేగారు. మిడిలార్డర్ బ్యాటర్ రాజ్ బావా (108 బంతుల్లో 162 నాటౌట్; 14 ఫోర్లు, 8 సిక్సర్లు), ఓపెనర్ అంగ్కృష్ రఘువంశీ (120 బంతుల్లో 144; 22 ఫోర్లు, 4 సిక్సర్లు) ఎదురే లేని బ్యాటింగ్‌తో ఉగాండా బౌలర్లపై విధ్వంసం సృష్టించారు. గ్రూప్ ‘బి’ నుంచి ఇది వరకే క్వార్టర్ ఫైనల్ చేరిన భారత అండర్–19 జట్టు అనామక జట్టుపై ఆకాశమే హద్దుగా చెలరేగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీస్కోరు చేసింది. కాగా 406 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఉగండా కేవలం 79 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో కెప్టెన్ నిశాంత్ సింధు నాలుగు వికెట్లు పడగొట్టగా, హంగర్గేకర్ రెండు వికెట్లు పడగొట్టాడు. టాపార్డర్‌లో ఓపెనర్ హర్నూర్ సింగ్ (15), కెప్టెన్ నిషాంత్ సింధు (15) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. అయితే మరో ఓపెనర్ రఘువంశీ, రాజ్ బావా దుర్బేధ్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇద్దరు శతక్కొట్టడంతో పాటు మూడో వికెట్‌కు 206 పరుగులు జోడించారు. జట్టు స్కోరు 291 పరుగుల వద్ద రఘువంశీ పెవిలియన్ చేరడంతో... క్రీజులో పాతుకుపోయిన రాజ్ బావా తర్వాత వచ్చిన కౌశల్ తాంబే (15), దినేశ్ బన (22), అనీశ్వర్ గౌతమ్ (12 నాటౌట్)లతో కలిసి జట్టు స్కోరును 400 పరుగులు దాటించాడు. మనోళ్లు ఇంతలా చెలరేగినప్పటికీ కుర్రాళ్ల వన్డేల్లో ఇదే అత్యధిక స్కోరు కాదు. 2004 ప్రపంచకప్‌లో స్కాట్లాండ్పై భారత అండర్–19 జట్టు 425/3తో అత్యధిక స్కోరు నమోదు చేసింది. భారత్‌కు ఇది రెండో అత్యధిక స్కోరు. అండర్–19 ప్రపంచకప్‌లో అత్యధిక స్కోరు సాధించిన బ్యాటర్‌గా శిఖర్ ధావన్ (155) రికార్డును రాజ్ బావా అధిగమించాడు. -
ఆ రెండు దేశాల్లో ఫేస్‌బుక్‌కు గట్టి దెబ్బ
Most Used Social Media 2021: సోషల్ మీడియా ఈ కాలంలో స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతీ ఒక్కరి జీవితంలో భాగమై ఉండొచ్చు. కానీ, అందులోని ప్లాట్‌ఫామ్స్ మాత్రం కాదు!. అవసరం, ఆసక్తిని బట్టి యాప్స్‌ని ఉపయోగించడం యూజర్ ఇష్టం. ఈ తరుణంలో మోస్ట్ యూజింగ్ ప్లాట్‌ఫామ్‌గా పేరున్న ఫేస్‌బుక్‌కు పెద్ద షాకే తగిలింది. జపాన్, ఉగాండాలో ఫేస్‌బుక్‌ను ట్విటర్ గట్టి దెబ్బ కొట్టింది. అది అలా ఇలా కూడా కాదు. 2021లో మోస్ట్ యూజ్డ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై స్టాట్‌కౌంటర్ అనే వెబ్ ట్రాఫిక్ అనలిసిస్ కంపెనీ ఒక నివేదికను విడుదల చేసింది. కిందటి ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 72.4 శాతం ట్రాఫిక్ ఫేస్‌బుక్‌కు దక్కింది. ఆ తర్వాతి ప్లేస్‌లో ట్విటర్ జస్ట్ 8.8 శాతంతో నిలిచింది. పింటెరెస్ట్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, రెడ్డిట్, టంబ్లర్, ఇతరాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. కానీ.. జపాన్‌లో మాత్రం ట్విటర్‌కు ఎక్కువ ఆదరణ లభించింది. 48.65 శాతం యూజర్లు ఆసక్తి చూపించగా.. ఆ తర్వాతి స్థానంలో ఇమేజ్ షేర్ సోషల్ మీడియా యాప్ పింటెరెస్ట్ నిలిచింది. ఫేస్బుక్ 16 శాతం ట్రాఫిక్‌తో మూడో స్థానానికి పరిమితమైంది. ఉగాండా విషయానికొస్తే.. ట్విటర్ 49. 79 శాతంతో ట్విటర్ టాప్ పొజిషన్లో నిలిచింది. రెండో స్థానంలో పింటెరెస్ట్ (23.09), మూడో స్థానంలో ఫేస్బుక్ కేవలం 12 శాతం ట్రాఫిక్కే పరిమితమైంది. కారణాలు? ఫేస్బుక్ మీద వస్తున్న విమర్శల కారణంగానే జపాన్ ఇంటర్నెట్యూజర్లు.. ఫేస్‌బుక్‌కు దూరంగా ఉంటున్నట్లు ఫీడ్‌బ్యాక్, కామెంట్ల ద్వారా తెలుస్తోంది. 2017 చివర్లో జపాన్‌లో ఫేస్బుక్ మార్కెట్ హఠాత్తుగా పడిపోవడం మొదలై.. ఇప్పటికీ అలాగే కొనసాగుతోంది. అయినప్పటికీ ఫేస్బుక్ పేరెంట్ కంపెనీ మెటా ఆందోళన చెందడడం లేదు. అందుకు కారణం.. ఇన్‌స్టాగ్రామ్‌కు క్రమక్రమంగా జపాన్‌లో పెరుగుతున్న ఆదరణ. ఇక ఉగాండాలో ట్విటర్ ఆదరణకు, ఫేస్బుక్ వ్యతిరేకత పట్ల గల కారణాలపై స్పష్టత లేదు. మరవైపు వెనిజులాలో సైతం ట్విటర్‌కు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటున్నప్పటికీ.. ఫేస్బుక్ స్ట్రాంగ్ మార్కెట్‌తో గట్టి పోటీ ఇస్తోంది. చదవండి: యూజర్ల ప్రైవసీతో చెలగాటం..! గూగుల్, మెటా సంస్థలకు దిమ్మతిరిగే షాక్..! -
ఉగాండా మహిళ పొట్టలో కేజీ కొకైన్
న్యూఢిల్లీ: ఉగాండా దేశానికి చెందిన మహిళ నుంచి సుమారు కిలో బరువున్న కొకైన్ అనే మత్తుపదార్థాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఐజీఐ) కస్టమ్స్ అధికారులు తెలిపారు. సదరు ప్రయాణికురాలు కొన్ని రోజుల క్రితం ఉగాండా నుంచి ఢిల్లీకి వచ్చింది. విమానాశ్రయంలో అధికారులు ఆమె కదలికలు, ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో ఆమె క్యాప్యూళ్ల రూపంలో ఉన్న కొకైన్‌ను మింగినట్లు ఒప్పుకుంది. వెంటనే ఆస్పత్రిలో ఆమెకు పరీక్షలు చేయించగా అనేక క్యాప్యూళ్లు పెద్ద పేగు వద్ద చిక్కుకుని ఉన్నట్లు తేలింది. దీంతో నిపుణుల పర్యవేక్షణలో వాటన్నిటినీ బయటకు తీసేందుకు కొన్ని రోజులు పట్టింది. మొత్తం 992 గ్రాముల బరువున్న 91 క్యాప్సూళ్లు బయటపడ్డాయి. వీటిల్లో ఉన్నది సుమారు రూ.14 కోట్ల విలువైన కొకైన్ అని ధ్రువీకరించుకున్నారు. ఈ మేరకు సదరు మహిళను అరెస్ట్ చేసి, ఈనెల 29వ తేదీన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని అధికారులు తెలిపారు. ఈనెల మొదటి వారంలో నైజీరియా మహిళ నుంచి ఐజీఐ అధికారులు 2,838 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
U 19 World Cup 2022: ఉగాండ, సౌతాఫ్రికా, ఐర్లాండ్‌తో పాటు భారత్..
U 19 World Cup 2022: India In Group B With Uganda Ireland South Africa: వచ్చే ఏడాది వెస్టిండీస్‌లో జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు జరిగే అండర్–19 క్రికెట్ ప్రపంచకప్ గ్రూప్ వివరాలను ప్రకటించారు. 16 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్ ‘బి’లో ఉగాండ, దక్షిణాఫ్రికా, ఐర్లాండ్‌లతో కలిసి గత ప్రపంచకప్ రన్నరప్ భారత్‌కు చోటు కల్పించారు. గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ బంగ్లాదేశ్, కెనడా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఇంగ్లండ్... గ్రూప్ ‘సి’లో పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, జింబాబ్వే, పాపువా న్యూగినియా... గ్రూప్ ‘డి’లో ఆ్రస్టేలియా, వెస్టిండీస్, శ్రీలంక, స్కాట్లాండ్ జట్లు ఉన్నాయి. చదవండి: Kurnool: ఇండియన్ క్రికెట్ టీంకు ఎమ్మిగనూరు విద్యార్థి ఎంపిక -
Uganda: ఆత్మాహుతి బాంబు దాడులు.. ముగ్గురు మృతి
కంపాలా: ఉగాండలో ఉగ్రమూకలు రెచ్చిపోయారు. రాజధాని నగరం కంపాలాలో ఆత్మాహుతి బాంబు దాడులకు తెగబడ్డారు. పార్లమెంట్ భవనాన్ని లక్ష్యంగా చేసుకుని ఆత్మహుతి దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు పౌరులు మృతి చెందగా, మరో 33 మంది పౌరులు తీవ్రంగా గాయపడ్డారు. -
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి అందరూ కృషి చేయాలి : కేవీ రమణాచారి
తెలంగాణ భాషాభిమానాన్ని పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడమే కాళోజీ సరైన నివాళి అని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు వంశీ డాక్టర్ సినారె విజ్ఞాన పీఠం ,తెలుగు అసోసియేషన్ ఆఫ్ ఉగాండా సంయుక్త ఆధ్వర్యంలో శనివారం దృశ్య మాధ్యమం ద్వారా జరిగిన 107 వ జయంతి తెలంగాణ భాషా దినోత్సవంలో రమణాచారి మాట్లాడుతూ కాళోజీ పట్ల గౌరవ భావంతో తెలంగాణ ప్రభుత్వం కాళోజీ జయంతి తెలంగాణ భాషా దినోత్సవం గా నిర్వహిస్తూ స్ఫూర్తిని పంచుతుందని తెలిపారు. వంశీ రామరాజు తొలుత స్వాగతం పలుకుతూ కాళోజీ వ్యక్తిగతంగా తన వివాహం దగ్గరుండి జరిపించారని,కవిగా వంశీ ఆర్ట్ థియేటర్స్ నిర్వహించిన సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. కాళోజీ సినారె స్ఫూర్తితో యాభై ఏళ్లుగా సాంస్కృతిక సేవతోపాటు సామాజిక సేవ చేస్తున్నానని అన్నారు .తెలంగాణ సారస్వత పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఈ కార్యక్రమానికి అనుసంధానం చేశారు.ఉగాండ తెలుగు సంఘం అధ్యక్షులు వేణుగోపాల్ రావు, ప్రస్తుత అధ్యక్షుడు వెల్దుర్తి పార్థసారధి తమదేశంలో కాళోజీ స్ఫూర్తితో తెలుగు భాషకు తెలుగువారికి సేవలు అందిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి కాళోజీ పురస్కారాలు స్వీకరించిన ప్రముఖ కవులు ఆర్ సీతారాం ,డా.అంపశయ్య నవీన్, రామా చంద్రమౌళి ప్రసంగిస్తూ కాళోజి చెప్పిందే ఆచరించారని, గొప్ప ప్రజాస్వామ్యవాది అని అన్నారు సామాన్యులను సైతం చేరేలా కవిత్వం రాస్తూనే అందులో అరుదైన కవితా శిల్పాన్నిపొదిగారని అన్నారు. కాళోజీ ఫౌండేషన్ అధ్యక్షులు నాగిళ్ల రామశాస్త్రి ,కార్యదర్శివి.ఆర్. విద్యార్థి ,కాళోజి కుమారుడు రవికుమార్ ,ఉగాండకు చెందిన రచయిత వ్యాస కృష్ణ బూరుగుపల్లి తదితరులు ప్రసంగిస్తూ కాళోజీ కవిత్వంలో, వ్యక్తిత్వంలో అనేక విశిష్టతలను వివరించారు. -
అరంగేట్ర మ్యాచ్‌లోనే నలుగురిని మన్కడింగ్ చేసిన బౌలర్
కంపాలా: అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో ఆటగాళ్లు సెంచరీలు, హ్యాట్రిక్‌లు సాధించడం వంటి రికార్డులను క్రికెట్లో సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం. కామెరూన్‌కు చెందిన మేవా డౌమా తన అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్‌లో ఓ రికార్డు సాధించింది. ఏకంగా ఐదుగురుని ఔట్ చేసింది. అయినప్పటికీ తమ బ్యాట్స్‌మెన్ ప్రత్యర్థి విసిరిన 191 పరుగుల టార్గెట్‌ను ఛేదించలేక చేతులెత్తేశారు. కేవలం 36 పరుగులకే ఆలౌట్ అయి ఘోర ఓటమిని మూటగట్టుకున్నారు. ఇక ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో మేవా డౌమా సాధించిన రికార్డు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఆమె తీసిన ఐదు వికెట్లలో నాలుగు వివాదాస్పద మన్కడింగ్ ద్వారానే రావడం గమనార్హం. కామెరూన్, ఉగాండా జట్ల మధ్య ఆదివారం జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఈ విశేషం చోటుచేసుకుంది. మొత్తం మీద తన నాలుగు ఓవర్ల కోటాలో ఐదుగురిని పెవిలియన్ పంపిన మేవా డౌమా మన్కడింగ్‌తో కాకుండా ఒక వికెట్ మాత్రమే తీసింది. అయితే, మన్కడింగ్ ద్వారా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ పంపినప్పటికీ అప్పటికే స్కోరు బోర్డు పరుగులు పెట్టడంతో ఉగాండా ముందు భారీ లక్ష్యం నిలిచింది. మన్కడింగ్ అంటే ఏమిటి? క్రికెట్ నియమావళిలోని వివాదాస్పద నిబంధనల్లో ఇదొకటి. రూల్ 41.16 ప్రకారం బౌలర్ బంతి విసరకముందే నాన్ స్ట్రయికర్ క్రీజ్ దాటినప్పుడు అతడిని అవుట్ చేసే అవకాశం ఈ నిబంధన కల్పిస్తుంది. అయితే దీన్ని1947–48 ఆస్ట్రేలియా పర్యటనలో తొలిసారిగా భారత దిగ్గజ బౌలర్ వినూ మన్కడ్ ఉపయోగించారు. దీంతో.. క్రికెట్ నిబంధనలు రూపొందించే ఎంసీసీ (మెరిలిన్ క్రికెట్ క్లబ్) ఆయన పేరుమీదుగా మన్కడింగ్ నిబంధనగా నియమావళిలో చేర్చింది. చదవండి: Virat Kohli: అవన్నీ తప్పుడు ప్రచారాలు.. అతడే కెప్టెన్: బీసీసీఐ క్లారిటీ pic.twitter.com/KjVCYGvQoh — hypocaust (@_hypocaust) September 12, 2021 -
టోలిచౌకి: యువతుల అర్ధ నగ్న ఫొటోలతో వ్యభిచారం
సాక్షి, నాగోలు: డేటింగ్ యాప్‌లో యువతుల అర్ధ నగ్న ఫొటోలు పెట్టి వ్యభిచారం నిర్వహిస్తున్న ఉగాండా దేశానికి చెందిన నిర్వాహకురాలితో పాటు ఆ దేశానికి చెందిన యువతిని రాచకొండ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ వివరాలను వెల్లడించారు. ఉగాండా దేశానికి చెందిన నముబిరు సియానా (32) నాలుగేళ్ల క్రితం విజిటింగ్ వీసాపై ఇండియాకు వచ్చి టోలిచౌకిలోని నిజాంకాలనీలో నివాసం ఉంటోంది. ఖర్చులకు డబ్బులు సరిపోకపోవడంతో ఆన్లైన్ వ్యభిచారం ప్రారంభించింది. ఉగాండా నుంచి ఓ యువ తిని తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. డెకాయ్ ఆపరేషన్ నిర్వహించిన పోలీసులు మీర్ పేట చెరువు వద్ద వారిని అరెస్ట్ చేశారు. సెల్ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకొని యువతిని హోమ్‌కు తరలించారు. నముబిరు సియానాపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని సీపీ తెలిపారు. మాట్లాడుతున్న సీపీ మహేష్ భగవత్ బాధితులకు పునరావాసం.. మహిళలను, చిన్నారులను అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు. ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేకం దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడారు. గతేడాది ఏర్పాటు చేసిన హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అక్రమ రవాణా నుంచి మహిళలను కాపాడిందని తెలిపారు. మానవ అక్రమ రవాణా బాధితులను రక్షించి, పునరావాసం కల్పించినట్లు తెలిపారు. -
పైలట్ కలల్ని పక్కన పెట్టి వ్యవసాయం, సంపాదన ఎంతంటే?
చదివిన చదువుకు, చేస్తున్న ఉద్యోగానికి సంబంధం లేకుండా జీవనాన్ని సాగిస్తున్నవారిని మనచుట్టూ చాలామందినే చూసి ఉంటాం. కానీ జీవితంలో ఏదైనా సాధించాలంటే రిస్క్ తీసుకోక తప్పదన్నదట్టు.. అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కొందరి జీవితాల్ని పూర్తిగా మార్చేస్తుంది. అలాంటి కథే ఆఫ్రికాలోని ఉగాండాకు చెందిన మహిళా పైలట్ గ్రేస్ ఓమురాన్‌ది. పైలట్‌గా ఆకాశంలో విమానంలో గంటల తరబడి చక్కర్లు కొట్టాలనేది గ్రేస్ ఓమురాన్ డ్రీమ్. ఉగాండాకు చెందిన గ్రేస్ తొలిసారి 2015-2016లో విమాన కార్యకలాపాలను అధ్యయనం చేసినప్పుడు ఎలాగైనా పైలట్ కావాలని పట్టుబట్టి చదివింది. చివరికి 2017లో ఈస్ట్ ఆఫ్రికన్ సివిల్ ఏవియేషన్ అకాడమీలో శిక్షణ పొంది, 2019 నాటికి క్యాడెట్ పైలట్‌గా అవతరించింది. చదువు పూర్తియ్యేనాటికి గర్భవతి అని తెలిసింది. దాంతో ప్రసవం కోసం ఇంటికి చేరింది. అక్కడే ఆమె జీవితం పూర్తిగా మలుపు తిరిగింది. ఖాళీగా పడి ఉన్న తన తండ్రి భూమిని చూసి ఏదైనా చేయాలని భావించింది. క్షణం ఆలస్యం చేయకుండా మామాడి, నారింజ, జీడి చెట్లను పెంచాలని నిర్ణయించింది. అయితే దీనికి ముందుగా నర్సరీ ద్వారా ప్రారంభించింది. తద్వారా గ్రేస్ సిట్రస్ అండ్ మ్యాంగో ఆర్చర్డ్ వ్యాపారానికి శ్రీకారం చుట్టింది. మొదట రెండు ఎకరాల (సుమారు 0.81 హెక్టార్ల) అంటు వేసిన మామిడి చెట్లను నాటగా, మామిడి విరగకాశాయి. అంతే ఇక వెను దిరిగి చూడలేదు. మిగిలిన ఏడు ఎకరాల భూమిలో జీడి, అవకాడోను నాటించింది. అలా ప్రస్తుతం మొత్తం 12 ఎకరాల భూమిలో చక్కటి పండ్ల తోటను ఏర్పాటు చేసింది. దీంతో కొత్త ఆదాయ వనరు దొరకడంతో తన కాక్‌పిట్ కలలను పూర్తిగా మర్చిపోయి ఇపుడు సంతోషాన్ని అనుభవిస్తున్నానని ఒమురాన్ తెలిపింది. వాస్తవానికి ఫ్లయింగ్ ప్రతిష్టాత్మకమైనదే వ్యవసాయంలోనే సాయం ఉందని తాను విశ్వసిస్తున్నట్టు చెప్పింది. విమానయాన పరిశ్రమ ద్వారా చాలా వివిధ ఆఫర్లు వచ్చినప్పటికీ, ఒమురాన్ వ్యవసాయం నుండి బయటపడేది లేదని ఆమె స్పష్టం చేసింది. తనకున్న విజ్ఞానంతో తన ఉత్పత్తులకు మార్కెటింగ్ టెక్నాలజీని ఒంటపట్టించుకున్నారు.కెన్యాలోని వివిధ పరిశ్రమలు ముఖ్యంగా టెసో ఫ్రూట్ ఫ్యాక్టరీ, డిలైట్ ఫ్యాక్టరీతో సంబంధాల ద్వారా మార్కెటింగ్‌కు ఇబ్బంది లేకుండా చేసుకున్నారు. మొదలు పెట్టిన రెండు సంవత్సరాల్లో ఆరు పంటకోత సీజన్ల ద్వారా సగటున ప్రతి పంటకు 5,000 యూఎస్ డాలర్లు (సుమారు 3 లక్షల, 72 వేల రూపాయలు, అంటే 6 సీజన్లకు 22 లక్షలు ఆదాయం) చేతికి వస్తున్నాయని ఆమె చెప్పారు. ప్రధానంగా నర్సరీ మొక్కల ద్వారా ఎక్కువ సంపాదిస్తున్నానని చెప్పారు. అలాగే తన విజయానికి యూత్ ప్రధాన కారణమని ఓమురాన్ గర్వంగా ప్రకటించింది. 30 మంది నైపుణ్యం కలిగిన యువకులకు ఉపాధి కల్పిస్తున్నట్టు చెప్పారు. యువతతో పనిచేయడం ఇష్టపడతాననీ, జిల్లాలో యువజన గ్రూపులను ఏర్పాటు చేసి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు. వాటిని తిరిగి ఆచరణలో పెడతారని ఆమె చెప్పు కొచ్చింది. అయితే కరోనా మహమ్మారి సంక్షోభం తమను కూడా తాకిందని, కానీ సవాళ్లను స్వీకరించి ముందుకు సాగినట్టు వెల్లడించింది. ఇతర వ్యాపారాల మాదిరిగానే, వ్యవసాయంలో కూడా కష్టాలుంటాయని, కానీ శక్తివంతంగా పోరాడాలని సూచించింది. అలాగే చైనాలో వ్యవసాయ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానాలపై పరిశోధన చేస్తున్నానని, అది తన వ్యవసాయ క్షేత్రం అభివృద్దికి దోహదపడుతుందని భావిస్తున్నాననిపేర్కొంది. రాబోయేకాలంలో తన కృషిని మరింత విస్తరిస్తానని చెప్పింది. అంతేకాదు దేన్నైనా చిన్నగా ప్రారంభించ డానికి సంకోచించకూడదని, తొలి అడుగు ఎపుడూ చిన్నగానే ఉంటుందంటూ యువతకు పిలుపునివ్వడం విశేషం. -
Tokyo Olympics: కరోనా కలకలం.. ఫస్ట్ కేసు గుర్తింపు!
సమ్మర్ ఒలింపిక్స్ 2020(2021)లో కరోనా కలకలం మొదలైంది. వేడుకలకు ఐదు వారాల ముందే ఆటగాళ్లలో మొట్టమొదటి కేసును అధికారులు గుర్తించారు. టోక్యో గడ్డపై అడుగుపెట్టిన ఉగాండాకు చెందిన ఓ అథ్లెట్‌కు కరోనా పాజిటివ్ సోకడంతో అంతా ఉలిక్కి పడ్డారు. టోక్యో: ఒలింపిక్స్ కోసం శనివారం రాత్రి ఎనిమిది మందితో కూడిన ఉగాండా టీం టోక్యోలోని నారిటా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో దిగింది. ఆ మరుసటి రోజు వీళ్లు ఆతిథ్య పట్టణం ఒసాకాకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈలోపు ఆ బృందానికి టెస్ట్‌లు నిర్వహించగా.. ఓ ఆటగాడికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతన్ని అటు నుంచి అటే ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వ్యాక్సిన్ వేసుకున్నా.. అయితే ఉగాండా టీంలోని అథ్లెట్లంతా చాలా రోజుల క్రితమే కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారు. బయలుదేరే ముందు చేసిన టెస్టుల్లో అందరికీ నెగెటివ్ నిర్ధారణ అయ్యింది కూడా. అయినా కూడా ఆ అథ్లెట్‌కు కరోనా ఎలా సోకిందనేది అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఆ ఆటగాడి పేరును వెల్లడించేందుకు అధికారులు ఇష్టపడడం లేదు. ఇక జపాన్‌లో అంతర్జాతీయ ప్రయాణికులకు రెండువారాల క్వారంటైన్ అమలులో ఉన్నప్పటికీ.. ఒలింపిక్స్ ప్లేయర్స్ కోసం ఆ నిబంధనను మార్చారు. వ్యాక్సిన్ వేయించుకోకున్నా ఫర్వాలేదని పేర్కొంటూ.. బయో బబుల్స్, సోషల్ డిస్టెన్స్ పాటించడం, రోజూవారీ పరీక్షల్లో పాల్గొన్నా సరిపోతుందని పేర్కొంది. విమర్శలు.. కరోనా టైంలో ఒలింపిక్స్ నిర్వాహణపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. వేల మంది ఆటగాళ్ల మధ్య కరోనాను ఎలా కట్టడి చేస్తారని మండిపడుతున్నారు. ఇక తాజా పరిణామం(ఉగాండా ఆటగాడికి పాజిటివ్)తో విమర్శలు మరింత ఎక్కువయ్యాయి. ఇక ఈసారి ఒలింపిక్స్‌ను వీక్షించేందుకు ప్రేక్షకులను అనుమతించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు సోమవారం టోక్యో ఒలింపిక్స్ కమిటీ భేటీ కానుంది. చదవండి: కండోమ్‌లు ఇక ఇంటికి తీసుకెళ్లండి -
వయసు 75 ఏళ్లు.. 80 మంది ప్రాణాలు తీసింది
కంపాలా(ఉగాండా): ఒకప్పుడు అల్ ఖైదా నేత ఒసామా బిన్ లాడెన్ పేరు చెబితే పాశ్చాత్య దేశాలు, అమెరికాకు వెన్నులో వణుకు పుట్టేది. అయితే ఉగాండాలోని విక్టోరియా సరస్సులో ఉండే ఒసామా బిన్ లాడెన్ అనే ఓ మొసలి(75) అక్కడి పిల్లలకు, పెద్దలకు దశాబ్దాలపాటు వెన్నులో వణుకు పుట్టించింది. ఒసామా 1991 నుంచి 2005 మధ్య కాలంలో దాదాపు 16 భారీ సరిసృపాలను తినేసింది. అంతేకాకుండా లుగాంగా అనే గ్రామంలోని జనాభాలో పదోవంతు మంది కనిపించకుండా పోయారు. కొన్ని నివేదికల ప్రకారం.. ఒసామా ఇప్పటివరకు గ్రామంలోని 80 మందికి పైగా స్థానికులను పొట్టన బెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఫిషింగ్ బోట్ల క్రింద దాక్కుని సరస్సులో నీటి కోసం వచ్చే పిల్లలను పట్టుకునేదని స్థానికుల కథనం. ఇక మత్స్యకారులు వేటకు బయలు దేరినప్పుడు వారిపై దాడి చేసి చంపేసేది. భయానక ఘటన: పాల్ కైవాల్యాంగా మాట్లాడుతూ.. “మేము చేపలు పడుతున్నాం. అయితే ఓ రోజు ఒసామా నీటిలో నుంచి పడవలో దూకింది. దాంతో నేను కూర్చున్న పడవ వెనుక భాగం మునిగిపోయింది. ఆ భయంకరమైన మొసలి నా తమ్ముడు పీటర్ కాళ్లను పట్టుకుని నీటిలోకి ఈడ్చుకుపోయింది. పీటర్ అరుస్తూ ఐదు నిమిషాల పాటు దానితో పోరాడాడు. అతన్ని కాపాడటానికి నేను ఎంత ప్రయత్నించిన లాభం లేకుండా పోయింది. కొన్ని రోజుల తరువాత అతని తల, చెయ్యి నీటిలో తేలుతూ కనిపించాయి.’’ అంటూ కన్నీటిపర్యంతమయ్యాడు. కాగా గ్రామస్తులు 2005లో అధికారులను సహాయం కోరారు. 50 మంది స్థానిక పురుషులు, వన్యప్రాణి అధికారుల సహాయంతో ఆ భారీ మొసలిని పట్టుకున్నారు. ఇంకా ఉంది: అయితే ఒసామా కథ అక్కడితో ముగిసిపోలేదు. గ్రామస్తులు ఆ మొసలిని వెంటనే చంపాలని అనుకున్నారు. కానీ ఉగాండాలో దీనికి అనుమతి లేదు. ఒసామాకు కూడా జీవించే హక్కు ఉందని, శిక్షగా చంపలేమని అధికారులు తెలిపారు. చంపకుండా ఈ మొసలిని ఉగాండాలోని మొసళ్ల పెంపకం కేంద్రానికి ఇచ్చారు. ఈ మొసలి ద్వారా కలిగే సంతానం తోలుతో హ్యాండ్‌బ్యాగులు తయారు చేసి ఇటలీ, దక్షిణ కొరియాకు ఎగుమతి చేయవచ్చని భావించారు. కాగా ఒసామా వచ్చినప్పటి నుంచి ఈ సంతానోత్పత్తి కేంద్రం పర్యాటకులతో రద్దీగా ఉంది. ఇక్కడ ప్రస్తుతం 5000 మొసళ్ల దాకా ఉన్నాయి. చదవండి: హాంకాంగ్‌లో ఘోర అగ్ని ప్రమాదం.. 12 మంది మృతి.. మరో 132 మంది -
గర్భం దాల్చే విషయంలో వారి నిర్ణయం కూడా..
న్యూఢిల్లీ: వెనుకబడిన దేశాల్లోని మహిళలకు మొబైల్ ఫోన్లు అందించడం ద్వారా సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను చేరుకోవచ్చని మెక్‌గిల్ యూనివర్సిటీ(కెనడా), యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్(ఇంగ్లండ్), బొకోని యూనివర్సిటీ(ఇటలీ) పరిశోధకులు అభిప్రాయపడ్డారు. స్మార్ట్ఫోన్ల వాడకం మహిళా సాధికారికతకు దోహదపడుతుందని.. సొంతంగా నిర్ణయాలు తీసుకునేలా వారిని ప్రోత్సహిస్తుందని వెల్లడించారు. లింగ వివక్ష, వ్యక్తిగత శుభ్రత, గర్భనిరోధక విధానాలు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అభివృద్ధి పరంగా వెనుకబడిన దేశాలైన అంగోలా, బురుండి, ఇథియోపియా, మలావీ, టాంజానియా, ఉగాండ, జింబాబ్వే తదితర దేశాల్లో దాదాపు లక్ష మంది మహిళల అభిప్రాయాలను సేకరించి ఈ మేరకు విశ్లేషించినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన విషయాలను ప్రఖ్యాత ‘ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ ది సైన్సెస్’ జర్నల్‌లో పొందుపరిచారు. ఈ మార్పు హర్షణీయం ఈ నేపథ్యంలో ఉప సహారా దేశాల్లోని ఫోన్ వాడుతున్న మహిళలు మిగతా మహిళలతో పోలిస్తే, గర్భం దాల్చే విషయంలో భాగస్వామితో చర్చించి.. నిర్ణయం తీసుకునే అవకాశం 1 శాతం ఎక్కువగా ఉందని తేలిందన్నారు. అదే విధంగా 2 శాతం మంది అవాంఛిత గర్భనిరోధక విధానాలు, 3 శాతం మంది హెచ్ఐవీ టెస్టు ఎలా చేయించుకోవాలన్న విషయాలపై ఫోన్ల వాడకం ద్వారా అవగాహన పొందుతున్నారని తెలిపారు. అదే విధంగా కుటుంబ వ్యవహారాల్లో కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు.(మీ ముద్దు మాకొద్దు) ముఖ్యంగా ఐసోలేటెడ్ ఏరియాల్లో నివసిస్తున్న పేద మహిళల్లో ఈ మేరకు మార్పు రావడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇక విషయం గురించి పరిశోధక బృందంలో ఒకరైన ప్రొఫెసర్ లుకా మారియా పెసాండో మాట్లాడుతూ.. ‘‘విద్యా సంస్థల స్థాపన- విస్తరణ, ఆర్థిక పురోగతికై చర్యలు తదితర అంశాలతో పాటుగా వెనుక బడిన దేశాల్లో మొబైల్ ఫోన్లు, సాంకేతికతను అభివృద్ధి చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు పొందవచ్చని మా పరిశోధనలో తేలిందని పేర్కొన్నారు. ఆ విషయంలో కాస్త వెనుకబడే ఉన్నారు ఇదిలా ఉండగా.. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మొబైల్ నెట్‌వర్క్‌ల విస్తరణ పెరుగుతున్పప్పటికీ పురుషులతో పోలిస్తే.. సొంతంగా ఫోన్లు కలిగి ఉన్న మహిళలు తక్కువ మందే ఉన్నారని పరిశోధన బృందం పేర్కొంది. కొంతమంది మహిళల చేతిలో ఫోన్ ఉన్నా దానిని ఎలా వినియోగించాలో తెలియక తికమక పడుతున్నారని, మగవారితో పోలిస్తే కమ్యూనికేషన్ స్కిల్స్, సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో కాస్త వెనుకబడి ఉన్నారని అభిప్రాయపడింది. -
ప్రపంచ ప్రఖ్యాత గొరిల్లా హతం!
కంపాలా : ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్ బ్యాక్ గొరిల్లా వేటగాళ్ల చేతుల్లో మృత్యువాతపడింది. ఈ సంఘటన ఉగాండాలోని బ్విండి ఇంపినిట్రేబుల్ నేషనల్ పార్కులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రఫికి అనే ప్రపంచ ప్రఖ్యాత సిల్వర్ బ్యాక్ గొరిల్లా ఉగాండా బ్విండి ఇంపినిట్రేబుల్ నేషనల్ ఉంటోంది. 25ఏళ్ల ఈ మగ గొరిల్లా ప్రమాదంలో పడ్డ కొండ జాతి గొరిల్లాల గ్రూపునకు నాయకుడు. కొద్దిరోజుల క్రితం నలుగురు వేటగాళ్లు రఫికిని చంపేసినట్లు ఉగాండా వైల్డ్‌లైఫ్ అథారిటీ అధికారులు ప్రకటించారు. దారుణానికి పాల్పడ్డ నలుగురిలో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అయితే ఆత్మరక్షణ కోసమే గొరిల్లాను చంపేసినట్లు పోలీసుల అదుపులో ఉన్న బయామికామా ఫెలిక్స్ అనే వేటగాడు అంగీకరించాడు. రఫికిని చంపిన కేసులో ఆ నలుగురు వేటగాళ్లకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. ( గాళ్‌ఫ్రెండ్ ప్రేమను ఒప్పుకుందేమో అందుకే..) పోలీసుల అదుపులోని వేటగాడు -
గోవాలో అక్రమంగా ఉంటున్నవారి అరెస్టు
పనాజీ: గోవాలో అక్రమంగా నివసిస్తున్న 10 మంది బంగ్లాదేశీయులను, 18 మంది ఉగాండా వాసులను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. గోవా పోలీసులు, విదేశీయుల రిజిస్ట్రేషన్ విభాగం అధికారులు (ఎఫ్ఆర్ఆర్ఓ) సంయుక్త ఆపరేషన్‌లో వీరు పట్టుబడ్డారు. సరైన పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించిన 10 మంది బంగ్లా కుంటుంబ సభ్యులు ఉత్తర గోవా ప్రాంతంలో ఉంటున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దాంతోపాటు.. విదేశీ వీసాపై భారత్‌కు వచ్చిన 18 మంది ఉగాండా వాసులు ఆరాంబోల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉన్నట్టు తెలిసింది. వారందరిపై పది రోజులుగా నిఘా వేసిన పోలీసులు, ఎఫ్ఆర్ఆర్ఓ అధికారులు అదుపులోకి తీసుకుని మాపుస పట్టణంలోని డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. -
భార్య స్ర్తీ కాదని తెలిసి..
జకార్తా : కొత్తగా పెళ్లయిన ఉగాండా ఇమాం రెండు వారాల తర్వాత తన భార్య స్త్రీ కాదని, పురుషుడని తేలడంతో షాక్‌లో మునిగిపోయారు. ఇమాం మహ్మద్ ముతుంబా సరిగ్గా పదిహేను రోజుల కిందట తన ‘భార్య’తో వివాహ ఒప్పందం చేసుకున్నారు. పెళ్లికి ముందు తాము శారీరకంగా కలవలేదని, వివాహానంతరం కూడా వధువు తనకు రుతుక్రమం నడుస్తోందని చెప్పారని ఇమాం డైలీ నేషన్ పత్రికతో మాట్లాడుతూ వాపోయారు. ఇంతచేసి ఆమె స్ర్తీ కాదని గుర్తించింది ఇమాం కాకపోవడం గమనార్హం. ఇమాం భార్య గోడ దూకి మరీ తమ ఇంట్లో వస్తువులను చోరీ చేయడంతో ఈ విషయం వెల్లడైందని పొరుగింటి వారు తేల్చిచెప్పారు. తమ ఇంట్లో నుంచి ఆమె టీవీ, దుస్తులను దొంగిలించారని అప్పుడే తాము ఆమెను అతడుగా కనుగొన్నామని వారు చెప్పుకొచ్చారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఇమాం ఆమె ‘భార్య’ ను పిలిపించి విచారణ చేపట్టారు. మహిళా పోలీస్ అధికారి అనుమానితురాలిని పరిశీలించగా ఆమె కాస్తా స్త్రీ వేషధారణలో ఉన్న పురుషుడని తేలడంతో అవాక్కయ్యారు. ఇమాంను మోసం చేసినందుకు అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇమాంను డబ్బు కోసమే స్త్రీలా నటించి పెళ్లి చేసుకున్నానని నిందితుడు పేర్కొన్నాడు. కాగా ఓ మసీదులో బురఖా ధరించిన నిందితుడిని చూసి తాను మోసపోయానని, ఆ సమయంలో ఆమెకు ప్రపోజ్ చేయగా అంగీకరించిందని, అయితే తన తల్లితండ్రులకు వధువు కట్నం చెల్లించేవరకూ తాము శారీరకంగా కలవద్దని తనతో చెప్పినట్టు బాధిత ఇమాం వాపోయారు. నిందితుడిపై చీటింగ్, చోరీ కేసులను నమోదు చేశామని పోలీసులు తెలిపారు. -
ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి
సాక్షి, ఢిల్లీ: జాతి నిర్మాణంలో యువతకు భాగస్వామ్యం ఇచ్చినప్పుడే మెరుగైన సమాజం ఏర్పడుతుందని, ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అది సాకారం అవుతుందని శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఇటీవల ఉగాండాలోని కంపాలలో జరిగిన 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులో పాల్గొన్న అనంతరం ఢిల్లీ చేరుకున్న స్పీకర్ సోమవారం ఏపీ భవన్లో మీడియాతో మాట్లాడారు. 58 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న అన్ని పరిణామాలపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని వివరించారు. నిరుద్యోగ సమస్య, దాని ప్రభావాలు, వాతావరణ మార్పు, బ్రెగ్జిట్, లైంగిక వేధింపుల నివారణ, స్పీకర్ల వ్యవస్థలో ఉన్న సవాల్లు, పార్లమెంటరీ వ్యవస్థలో పారదర్శకత వంటి అనేక అంశాలపై చర్చ జరిగిందన్నారు. జాతి నిర్మాణంలో, దేశ విధానపరమైన నిర్ణయాల్లో యువతకు భాగస్వామ్యం కల్పించాలని, వారి ఆలోచనలకు చోటు కల్పించే అవకాశాలు ఇవ్వాలని, అప్పుడే నిరుద్యోగ సమస్యను పరిష్కరించగలమని సదస్సులో వెల్లడించినట్టు చెప్పారు. గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి, అందులో యువతకు భాగస్వామ్యం కల్పించేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థలను ప్రవేశపెట్టారని, వీటి ద్వారా మూడు నెలల్లో 5 లక్షల మందికి ఉపాధి కల్పించిగలిగారని వివరించానన్నారు. దీనిపై సదస్సుకు హాజరైన ప్రతినిధులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. ఇక ఈ విదేశీ పర్యటనలో పలువురు పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమర్థ నాయకత్వం, పారదర్శక పాలన, అపార అవకాశాలను వివరించి పెట్టుబడులు ఆహ్వానించామని తెలిపారు. -
కామన్వెల్త్ వేదికపై ఏపీ స్పీకర్
ఉగాండాలో జరిగిన 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు రాష్ట్ర శాసన సభాధిపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నిర్వహిస్తున్న తీరు, చట్టాల అమలుతోపాటు ఇటీవల ఆమోదం పొందిన పలు కీలక బిల్లుల విశేషాలను తన ప్రసంగంలో సవివరంగా తెలియజేశారు. సతీమణితో కలిసి వెళ్లిన ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఉగాండాలో నివసిస్తున్న తెలుగువారు స్పీకర్ దంపతులకు ఘన సన్మానం చేశారు. సాక్షి, శ్రీకాకుళం : ఉగాండాలో జరిగిన 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు (సీడబ్ల్యూసీ) ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. తమ్మినేనితోపాటు ఆయన సతీమణి వాణీసీతారాం కూడా వెళ్లారు. స్పీకర్ దంపతులకు ఉగండాలో కంపల ఎయిర్‌పోర్టులో అక్కడ ఎంపీ, ప్రొటోకాల్ అధికారులు ఘన స్వాగతం పలికారు. శ్రీలంక ఎంబసీ కమలనాథ్న్తోపాటు ఇండియన్ ఎంబసీతో కలిసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. సీడబ్ల్యూసీ కాన్ఫరెన్స్‌లో సీతారాం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో శాసనసభ నిర్వహిస్తున్న తీరు, చట్టాలు అమలుతోపాటు పలు కీలక బిల్లులపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించారు. కామన్వెల్త్ సభ్య దేశాలు, రాష్ట్రాల నుంచి హాజరైన స్పీకర్లు, ముఖ్యులు పాల్గొని తమ అనుభవాలను, తమ ప్రాంతాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న అనుభూతులను తెలిజేశారు. పలు కొత్త అంశాలు తెలుసుకుని రానున్న సమావేశాల్లో వాటిని అమలుచేసేందుకు ఇటువంటి ఎంతో సమావేశాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఉగాండాలో నివసిస్తున్న తెలుగువారు స్పీకర్ దంపతులకు సన్మానించారు. స్పీకర్ దంపతులు పలు ప్రాంతాలను తిరిగి అక్కడి ఆచారాలు, పుణ్యక్షేత్రాల్లో నిర్వహిస్తున్న తీరును తెలుసుకున్నారు. -
స్పీకర్ తమ్మినేని సీతారాం విదేశీ పర్యటన
సాక్షి, అమరావతి : విదేశీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉగాండాలో పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 7వ తేదీ వరకు ఆ దేశంలో జరిగే 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు స్పీకర్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో యువత, నిరుద్యోగిత, ప్రభుత్వ పాత్ర అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాల కల్పన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. అనంతరం స్విట్జర్లాండ్, పారిస్‌లోనూ స్పీకర్ పర్యటించనున్నారు. -
నలబై ఏళ్లలో 44 మందికి జన్మనిచ్చింది
కంపాలా: ఈ రోజుల్లో ఒక్క బిడ్డని పెంచి పోషించడమే చాలా మందికి చాలా కష్టంగా మారిపోతోంది. అలాంటిది ఉగాండాలో ఓ మహిళ ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 44 మందికి జన్మనిచ్చింది. ఏ మహిళలైనా నలభై ఏళ్లకే నలభైనాలుగు మంది పిల్లల్ని కనడాన్ని ఎవరూ నమ్మలేకపోవచ్చు. కానీ అసాధ్యమైన అంశాన్ని ఆమె సుసాధ్యం చేసింది. అయితే అది ఆమె ఇష్టంతో చేసిన పనికాదు. ఒకవైపు దయనీయ పరిస్థితి, మరోవైపు తన శరీరంలో జన్యువుల అసాధారణ స్థితి. ఆమెను 44 మంది పిల్లలకు తల్లిని చేశాయి. ఆమె పేరు మరియమ్ నబాటాంజీ. నివాసముండేది అత్యంత వెనుకబడిన ఉగాండాలోని ముకనో జిల్లాలో. ఆమెకు 12 ఏళ్లకే వివాహమైంది. గత రెండు దశాబ్దాలలో ఏటా కనీసం ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వడంతో.. ఇప్పుడు ఆ సంఖ్య 44 మందికి పెరిగింది. దీంతో ఆమె ఆ దేశంలో ఓ సరికొత్త రికార్డును నమోదు చేశారు. మొట్ట మొదటి సంతానం 12 ఏళ్లకే సంభవించింది. తొలి సంతానమే కవలలు. అతంటితో ఆగకుండా ప్రతి ఏడాది పిల్లలు పుడుతూనే ఉన్నారు. ఆమెకే ఎందుకిలా జరుగుతుందనే దానిపై దేశంలోని ప్రముఖ వైద్యలంతా పరీక్షలు నిర్వహించారు. వైద్య పరంగా కూడా ఎంతో ప్రత్యేకమైన కేసుగా వైద్యులు అభివర్ణిస్తున్నారు. ఆమె ఒవేరియన్ పెద్దదిగా ఉండడమే దానికి కారణమని తెలిపారు. బర్త్ కంట్రోల్ పిల్స్ వేసుకునే అవకాశం ఉన్నా, అది అంత క్షేమకరం కాదనీ, ఆరోగ్యరీత్యా సమస్యలు వస్తాయని వైద్యులు సూచించడంతో కుటుంబ నియంత్రణ పాఠించలేదు. సాధారణంగా ఆఫ్రికాలో సరాసరిన ఓ మహిళ ఐదు నుండి ఆరుగురు పిల్లల వరకూ జన్మనిస్తుంటుంది. ప్రపంచ సగటు ఈ విషయంలో 2.4 మాత్రమేననీ గణాంకాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు ఆమె కన్న 44 మంది పిల్లల్లో ఆరుగురు రకరకాల కారణాల వల్ల చనిపోగా, ప్రస్తుతం 38 మంది జీవించి ఉన్నారు. తన జీవితంలో ఇంతమంది పిల్లల్ని కనే విషయంపై ఆమె మాట్లాడుతూ 'నాకు 12 సంవత్సరాల వయసులోనే పెళ్లయింది. అప్పటికే నా భర్త వయసు 28 సంవత్సరాలు. చిన్నప్పుడు చాలా పేదరికం అనుభవించాను. మాకు తిండి లేని సమయంలో అన్నంలో గాజుముక్కలు కలిపి తినిపించి పిల్లల్ని చంపేసింది. నేను మాత్రం ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాను. ఆ తర్వాత నన్ను బలవంతంగా ఓ వ్యక్తికి కట్టబెట్టారు. ఆయన నన్ను లైంగిక బానిసగా మార్చేశాడు' అని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు 18 మంది పిల్లలు పుట్టాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకోవాలని భావించానని, కానీ ప్రతికూల పరిస్థితుల వల్ల అది వీలుపడలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తోబుట్టువులను కోల్పోయిన నబతాంజీ తన పిల్లల్లోనే తన తోబుట్టువులను చూసుకోవాలని అనుకుంది. 38 మంది పిల్లలతో కనీస వసతులు సరిగా లేని ఓ ఇంట్లో ధైర్యంగా జీవిస్తోంది. ప్రతీరోజూ 25 కిలోల మైజ్ ఫ్లోర్ ఆహారంగా ఆ కుటుంబానికి అవసరం. చేపలు, మాంసం చాలా చాలా అరుదుగా మాత్రమే తింటారు. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా. శనివారం అందరూ కలిసి పని చేసుకుంటారట. పిల్లలందర్నీ అలా చూస్తుంటే తాను జీవితంలో పడ్డ కష్టాలన్నింటినీ మర్చిపోతానంటోంది నబతాంజీ. రెండేళ్ల కిందట ఆమెకు కుటుంబ నియంత్రణ చికిత్స చేశారు. -
కొండచరియలు పడి 34 మంది మృతి
కంపాలా: ఉగాండాలో కురిసిన అధిక వర్షాల కారణంగా ఈశాన్య ప్రాంతంలో నది ఉధృతంగా ప్రవహించడంతో కొండచరియలు విరిగిపడి కనీసం 34 మంది మృతి చెందారు. బుడుదా జిల్లాలోని బుకలాసి ప్రాంతంలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. కొండచరియలు విరిగి దిగువనున్న నివాసాలపై పడటంతో శిథిలాలకింద చాలామంది చిక్కుకుపోయారు. బాధితుల్ని కాపాడేందుకు ప్రభుత్వం సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ‘‘ఈ ఘటనలో కనీసం 34 మంది మృతి చెందారు. ఇంకా ఎంతమంది కన్పించకుండా పోయారో తెలియాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి సోషల్‌మీడియాలో కొండ చరియలు విరిగిపడి ధ్వంసమైన నివాస ప్రాంతాల ఫొటోలు పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అరటి చెట్ల మధ్య చిక్కుకున్న కొన్ని మృతదేహాలను పోలీసులు బయటకు తీశారు. బాధితులను కాపాడేందుకు సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే రెడ్‌క్రాస్ సంస్థ దుప్పట్లు, టార్పాలిన్లు, తాగునీరు, ఆహార పదార్థాలు, మందుల్ని చేరవేసింద’’ని ఉగాండా రెడ్ క్రాస్ అధికార ప్రతినిధి ఐరేన్ నకసిత చెప్పారు. బుడుద జిల్లాలో 2010లో, 2012లో ఇలాగే కొండచరియలు విరిగిపడి కనీసం వందమంది ప్రాణాలు కోల్పోయారు. -
నా పెళ్లి ఎప్పుడో అయిపోయిందిగా..!!
లులూ జెమియా.. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ విద్యార్థిని... మొన్న ఆగస్టుతో ఈమెకు 32 ఏళ్లు నిండాయి.. అయితే మామూలుగా అందరికీ ఎదురయ్యే ప్రశ్నే లులూకూ, ఆమె తల్లిదండ్రులకు ఎదురైంది. పెళ్లెప్పుడు.. ఈ ప్రశ్న వినీ వినీ విసిగిపోయిన లులూ.. తల్లిదండ్రుల కోసం వధువుగా మారింది. వరుడు లేకుండానే వివాహ తంతు పూర్తి చేసుకుంది. అదేంటి అలా ఎలా అనుకుంటున్నారా? ‘నాకు పదహేరేళ్లు వచ్చిన నాటి నుంచే మా నాన్న నాకోసం వెడ్డింగ్ స్పీచ్ రాయడం మొదలు పెట్టాడు. ఇక మా అమ్మ అయితే నా ప్రతీ పుట్టిన రోజున ప్రార్థనలతో ఆ దేవుడిని ప్రాధేయపడేది. నన్ను ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా చూసుకునే భర్త రావాలని మొరపెట్టుకునేది. కానీ నాకు మాత్రం ఇన్నేళ్ల జీవితంలో అలాంటి వ్యక్తి ఒక్కరూ తారసపడలేదు. అలా అని అమ్మానాన్నల ఆశను తీర్చకుండా ఉండలేను. అందుకే ఈ పుట్టిన రోజున(ఆగస్టు 29) నన్ను జాగ్రత్తగా చూసుకునే నా సోల్‌మేట్‌ని వివాహమాడాను. అదెవరో కాదు లులూ జెమియానే. అంటే నేనే’ అంటూ తనను తానే పెళ్లాడిన లులూ చెప్పుకొచ్చింది. గోఫండ్‌మీ అనే పేజీ క్రియేట్ చేసి తన పెళ్లికి ఖర్చులకు డబ్బులు సమకూర్చుకున్న లులూ.. అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో పెళ్లి చేసుకుంది. సోదరుడు తన కోసం తయారు చేసిన కేక్ కట్ చేసి బర్త్‌డేతో పాటుగా వెడ్డింగ్‌ను కూడా సెలబ్రేట్ చేసుకుంది. అయితే తల్లిదండ్రులు తన పెళ్లి చూడలేకపోయారనే లోటు మాత్రం మిగిలిపోయిందట. తమకు చెప్పకుండా లులూ ఇలాంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె తల్లిదండ్రులు షాకయ్యారు. లులూతో మాట్లాడటం మానేశారు. కానీ ఎలాగైతేనేం పెళ్లి చేసుకోవాలనే ఆలోచన అయితే తనకు వచ్చింది. ‘మా కోసం ఇలాంటి వింత నిర్ణయం తీసుకోవడానికి సిద్ధపడింది. కాబట్టి త్వరలోనే మనసు మార్చుకుంటుంది. ఈసారి జరిగే పెళ్లిలో తన పక్కన వరుడు కూడా ఉండాలి దేవుడా’ అంటూ మళ్లీ ప్రార్థించడం మొదలుపెట్టారు. మరి ఆ తల్లిదండ్రుల కోరిక ఎప్పుడు నెరవేరుతుందో!? -
సుదృఢ బంధానికి 10 సూత్రాలు
న్యూఢిల్లీ: భారత్, ఆఫ్రికా దేశాల బంధం బలోపేతం కావడానికి ప్రధాని నరేంద్ర మోదీ 10 మార్గదర్శక సూత్రాలను ప్రతిపాదించారు. ఆఫ్రికా ఆర్థికాభివృద్ధికి, పర్యావరణ సవాళ్లు, ఉగ్ర ముప్పు ఎదుర్కొనేందుకు ఇవి దోహదపడతాయన్నారు. రక్షణ, పర్యావరణం, సైబర్ భద్రత, వ్యవసాయం, సముద్ర వనరుల సద్వినియోగం తదితరాలకు సంబంధించి ఈ సూత్రాలను వివరించారు. అంతర్జాతీయ సంస్థల్లో ఆఫ్రికా దేశాలకు సమాన ప్రాధాన్యత లభించేంత వరకూ, అందులో సంస్కరణల కోసం భారత్ చేస్తున్న కృషి సంపూర్ణం కాదని తెలిపారు. ఉగాండా పర్యటనలో ఉన్న మోదీ బుధవారం ఆ దేశ పార్లమెంటులో ప్రసంగిం చారు. సమానత్వం, గౌరవం, పారదర్శకత కోసం ఆఫ్రికా చేస్తున్న ప్రయత్నాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మరోసారి ఆఫ్రికా వైరి రాజకీయాలకు వేదిక కాకుండా, యువత ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా భాసిల్లాలని వ్యాఖ్యానించారు. మిగతా ప్రపంచంతో కలసి ఆఫ్రికా దేశాలు ముందుకు సాగాలని, భారత్ వాటితో కలసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని అన్నారు. అపారమైన ఖనిజ వనరులు, వార సత్వ సంపదకు నిలయమైన ఉగాండాకు తమ ఆఫ్రికా విధానంలో కేంద్రక స్థానం ఉంటుంద ని చెప్పారు. వలస పాలన, స్వాతంత్య్ర ఉద్యమం, తీరప్రాంత సంబంధాలు తదితరాల్లో రెండు దేశాలకు చాలా సారూప్యతలు ఉన్నా యని చెప్పారు. సముద్ర సంపద నుంచి అన్ని దేశాలు ప్రయోజనం పొందేలా, భారత్ ఆఫ్రికా దేశాలతో కలసిపనిచేస్తుందని మోదీ అన్నారు. తూర్పు ఆఫ్రికా, తూర్పు హిందూ మహాసముద్రాల్లో సహకారం తప్ప పోటీ ఉండొద్ద న్నారు. ఉగాండా పార్లమెంట్లో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా మోదీ నిలిచారు. రాజధాని కంపాలాకు 85 కి.మీ దూరంలోని జింజా అనే గ్రామంలో జాతిపిత గాంధీ జ్ఞాపకార్థం వారసత్వ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని చెప్పారు. కాగా, బ్రిక్స్ సదస్సులో పాల్గొనేం దుకు మోదీ దక్షిణాఫ్రికా చేరుకున్నారు. -
సోషల్‌మీడియా పన్ను : యువత విలవిల
సాక్షి, వెబ్ డెస్క్ : ‘సోషల్ మీడియా పన్ను’ఈ మాట ప్రస్తుతం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. సాంకేతికత వృద్ధి చెందిన తర్వాత నిద్ర లేచిన దగ్గర నుంచి మళ్లీ నిద్రలోకి జారుకునే వరకూ ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, స్కైప్ ఇలా పలు రకాల మాద్యామాల వినియోగానికి ప్రపంచం అలవాటు పడింది. ఇలాంటి సమయంలో సోషల్ మీడియా వినియోగించాలి అంటే ప్రత్యేకంగా పన్ను చెల్లించాలనే వార్తకు యువత నోట మాట రావడం లేదు. కేవలం వార్తకే ఇలా ప్రపంచ యువత షాక్‌కు గురవుతుంటే, జులై 1న ఉగాండా ప్రభుత్వం అధికారికంగా సోషల్ మీడియా ట్యాక్స్‌ను విధించడం ప్రారంభించింది. దీనిపై ఆ దేశవ్యాప్తంగా యువత నిరసన తెలుపుతోంది. అయితే, ఉగాండా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉన్నట్లుండి ఏమీ తీసుకోలేదు. ముందుగానే ఈ పన్నును విధించబోతున్నట్లు ప్రకటించింది. ఈ నెల 1 నుంచి వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, స్కైప్ వంటి సోషల్ మాధ్యమాలను వినియోగించడానికి రోజుకు 200 ఉగాండా షిల్లింగ్స్‌ను చెల్లించాలి.దేశంలోని యువతను అదుపు చేసేందుకు ఉగాండా ప్రభుత్వం ఇంటర్నెట్పై ఆంక్షలు విధించడం కొత్తేమి కాదు. 2016లో ఆ దేశ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ(టీఆర్ఏ) ఎన్నికల సందర్భంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. సోషల్ మీడియా వల్ల దేశ ఆదాయం, సమయం వృథా అవుతోందని దేశాధ్యక్షుడు యోవేరి ముసెవేని ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది సోషల్ మీడియా పన్నును ప్రవేశపెట్టాలని ప్రభుత్వానికి టీఆర్ఏ సూచించింది. అమల్లోకి వచ్చిన పన్నును ఎలా చెల్లించాలనే దానిపై ఎంటీఎన్, ఎయిర్టెల్, ఆఫ్రిసెల్‌లు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశాయి. కాగా, ప్రపంచబ్యాంకు లెక్కల ప్రకారం ఉగాండాలో 22 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్ను వినియోగిస్తున్నారు. పోర్న్‌పైనా దృష్టి పోర్న్ కంటెంట్‌నూ అదుపు చేసేందుకు ఉగాండా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ ప్రత్యేక డివైజ్‌ను ఆ దేశం ఇందుకోసం తెప్పించినట్లు సమాచారం. దీని ద్వారా దేశంలో ఇంటర్నెట్ వినియోగించే ప్రతి ఒక్కరి కంప్యూటర్లను, మొబైల్ ఫోన్లను స్కాన్ చేస్తారని తెలిసింది. అయితే, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల సహకారం లేకుండా ఇది అసాధ్యమని నిపుణులు అంటున్నారు. ఆదాయం కోసమే సోషల్ మీడియా పన్ను దేశ ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకునే ఈ పన్నును విధిస్తున్నట్లు ప్రభుత్వ పేర్కొంది. తూర్పు ఆఫ్రికాలో ఉగాండాది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. ఆయిల్ నిక్షేపాలను వెలికితీసేందుకు ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటోంది. సోషల్ మీడియా పన్ను ద్వారా ఏటా 360 మిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఆ దేశాధ్యక్షుడు ముసేవేని భావిస్తున్నారు. ఈ డబ్బును ఆయిల్‌ను వెలికి తీయడానికి ఉపయోగించాలని అనుకుంటున్నారు. -
విషాదం: చిన్నారి పుర్రె మాత్రమే మిగిలింది
కంపాలా: ఉగాండలోని క్వీన్ ఎలిజిబెత్ నేషనల్ పార్క్‌లో చిన్నారి ఉదంతం విషాదంగా ముగిసింది. మూడేళ్ల పిల్లాడిని ఎత్తుకెళ్లిన చిరుత చంపి తినేసింది. చిన్నారి పుర్రె, దుస్తుల అవశేషాలను అధికారులు గుర్తించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఫారెస్ట్ రేంజర్ డోరీన్ అయేరా కొడుకు ఎలిషా నబుగ్యేరే(3) ఆయాతో క్వార్టర్స్ బయట ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నారి వెనకాలే వచ్చిన చిరుత ఒక్క దూటుతో లాక్కెల్లింది. ఆయా అరుపులు విన్న సిబ్బంది కాల్పులు ప్రారంభించగా చిరుత పొదల్లోకి పారిపోయింది. వెంటనే భారీగా అటవీ సిబ్బంది రంగంలోకి గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆదివారం ఉదయం పిల్లాడి పుర్రె, దుస్తులు లభ్యం కావటంతో చిన్నారి మృతి చెందినట్లు అటవీ అధికారులు ప్రకటించారు. దీంతో చిన్నారి కుటుంబంలో విషాదం నెలకొంది. క్వార్టర్స్ వద్ద కంచె(ఫెన్సింగ్) లేకపోవటంతోనే చిరుత దాడి చేసిందని అధికారులు తెలిపారు. నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై వేటు వేసినట్లు ఫారెస్ట్ అధికారి బషీర్ హంగ్ ప్రకటించారు. చిరుత మళ్లీ దాడి చేసే అవకాశం ఉండటంతో దానిని మట్టుపెట్టుందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. -
భార్యలను కొట్టడం తప్పుకాదన్న ఎంపీ
కంపాలా: హుందాగా ప్రవర్తించాల్సిన చట్ట సభ ప్రతినిధులు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇటీవలి కాలంలో సర్వసాధారణమైపోయింది. తాజాగా ఉగాండాకు చెందిన ఎంపీ ఒనెమస్ ట్వినామసికో మహిళల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసి ఇబ్బందుల పాలయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో..‘ప్రతీ పురుషుడు భార్యపై పైచేయి సాధించాలి. మహిళలను క్రమశిక్షణలో పెట్టాలనుకున్నపుడు వారిని కొట్టడంలో ఏమాత్రం తప్పులేదం’టూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆగ్రహించిన ఉగాండా మహిళలు #OnesmusTwinamasikoMustResign హాష్‌ట్యాగ్‌తో ట్వినామసికో రాజీనామా చేయాలంటూ ట్విటర్ వేదికగా ఉద్యమం చేపట్టారు. ఉగాండా పార్లమెంట్ స్పీకర్ రెబెకా కడగా, ఆమెతోపాటు పార్లమెంట్‌లోని మహిళా ప్రతినిధులంతా ఎంపీ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలంటూ డిమాండ్ చేశారు. వారి డిమాండ్లకు ఆయన తలొగ్గక తప్పలేదు. మహిళలంటే తనకెంతో గౌరవముందని, మహిళల పట్ల జరుగుతున్న హింసకు తాను వ్యతిరేకమంటూ పార్లమెంట్‌కు లేఖ రాశారు. మహిళలకు క్షమాపణ తెలుపుతూ వివరణ ఇచ్చారు. ఉగాండా అధ్యక్షుడు యొవేరీ ముసేవేని ఆడవారిని హింసించే మగవారంతా పిరికిపందలంటూ సందేశం ఇచ్చినరోజే ఎంపీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అక్కడ ఇవేమీ కొత్తకాదు.. 2016లో విడుదల చేసిన ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ప్రతీ ఐదుగురు మహిళల్లో ఒకరు లైంగిక, భౌతిక పరమైన దాడులు ఎదుర్కొంటున్న వారే. 14 నుంచి 49 ఏళ్ల వయసున్న ఆడవారు వివిధ రకాలుగా వేధింపబడుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. -
అంత డబ్బులేదు బాసూ!
ఉగాండాకు చెందిన సెమాండా.. అక్కడి కటాబా అనే టౌన్లో రోడ్డుపై ఆహారపదార్థాలు అమ్ముకుంటూ ఉంటాడు. వయసు 50 ఏళ్లు. గత నెలలో ఆఫ్రికా మొత్తం సెమాండా పేరు వార్తల్లో ప్రముఖంగా కన్పించింది. ఎందుకంటే అతడు పెళ్లి చేసుకున్నాడు. అక్కడ పెళ్లి చేసుకుంటే కూడా వార్తేనా అవాక్కవకండి! ఎందుకంటే ఒకేసారి మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే ఆ వయసులో పెళ్లి చేసుకున్నందుకు వార్తల్లోకి ఎక్కలేదు..! ముగ్గురిని ఒకేసారి ఎందుకు పెళ్లి చేసుకున్నాడో ఆయన చెప్పిన సమాధానానికి అక్కడి జనం అవాక్కయ్యారు. వార్తల్లో నిలిచాడు. ఆ సమాధానం ఏంటంటే.. ముగ్గురిని మూడుసార్లు పెళ్లి చేసుకునేంత డబ్బు తనవద్ద లేదని.. అందుకే ముగ్గురినీ ఒకేసారి చేసుకున్నానని చెప్పాడు. దీంతో ఫేమస్ అయిపోయాడు. మరి డబ్బే లేనప్పుడు ముగ్గురిని ఎలా పోషిస్తావు అని అడిగితే ‘‘వారికి నేనంటే ఇష్టం.. వారంటే నాకు చాలా ఇష్టం. నలుగురం బతికేందుకు ఇంకా ఇంకా కష్టపడతాను’ అని సమాధానం ఇచ్చాడు. ఆ ముగ్గురు భార్యల్లో ఒకరికి 48 ఏళ్లు.. మరో ఇద్దరికి 27, 24 ఏళ్లు.. -
క్రిస్మస్ సంబరాల్లో విషాదం.. 30 మంది మృతి
కంపాలా: ఉగాండాలో క్రిస్మస్ సంబరాల్లో విషాదం చోటుచేసుకుంది. ఒక గ్రామానికి చెందిన ఫుట్‌బాల్ టీం సభ్యులు, అభిమానులు పడవలో క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటుండగా పడవ నదిలో మునిగింది. ఆదివారం లేక్ ఆల్బర్ట్‌లో జరిగిన ఈ దుర్ఘటనలో 30 మంది మరణించినట్లు పోలీస్ కమాండర్ జాన్ రుటాగిరా చెప్పారు. ‘పడవలో సామర్థ్యానికిమించి 45 మంది ఉన్నారు. ఆ సమయంలో కొంతమంది డ్యాన్స్ చేస్తుండగా, మరికొంతమంది మద్యం తాగుతున్నారు. ఒక్కసారిగా అందరూ ఒకేవైపునకు వెళ్లడంతో పడవ తిరగబడింది’ అని చెప్పారు. 15 మందిని రక్షించారు. -
సాహస వీరుడు మృత్యువాత
కడప: వైఎస్సార్ జిల్లా కడప నగరానికి చెందిన సహస వీరుడు మదన్మోహన్(38) ఉగాండాలో సాహస కృత్యాలు చేస్తూ మృత్యువాత పడ్డారు. అక్టోబర్ 27న ఉగాండాలోని ఎన్ఆర్ఐల పిలుపు మేరకు అక్కడ సాహసకృత్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు మదన్‌మోహన్‌రెడ్డి మరో ఇద్దరు విశ్రాంత ఎయిర్‌ఫోర్సు అధికారులు అక్కడికి వెళ్లారు. అయితే ఈనెల 13వ తేదీకి ఆయన తిరిగి రావాల్సి ఉండగా.. 13వ తేదీనే ఆయన తుదిశ్వాస వదిలారు. శిక్షణ ఇస్తున్న క్రమంలో తలెత్తిన సాంకేతికలోపమో.. లేక పరికరాల్లో నాణ్యత లోపమో తెలియదు కానీ మదన్‌మోహన్‌రెడ్డి ఈనెల 6వ తేదీన ప్రమాదానికి గురయ్యారు. దీంతో అక్కడి అధికారులు హాస్పిటల్లో చేర్పించారు. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయన ఆదివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో (భారత కాలమానం ప్రకారం) తుదిశ్వాస వదిలారు. ఈనెల 15 లేదా 16 తేదీల్లో ఆయన భౌతికకాయాన్ని కడపకు తీసుకువచ్చేందుకు ఎయిర్‌ఫోర్సు అధికారులు ఏర్పాట్లు చేశారు. 12 ప్రపంచ రికార్డులు ఆయన సొంతం.. మొదటి నుంచి వినూత్న ఆలోచనలు.. సాహసకృత్యాల పట్ల విపరీతమైన ఆసక్తి ఉన్న ఈయన ఎయిర్‌మెన్‌గా ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగంలో చేరినప్పటి నుంచి వివిధ రకాల సాహసకృత్యాల్లో పాల్గొనేవాడు. పారాగ్లైడింగ్, పారాసైయిలింగ్, పారామోటార్, పవర్ట్‌హెంట్ గ్లెడింగ్, పారాజంపింగ్ వంటి అంశాల్లో ఎన్నో ప్రదర్శనలు చేశారు. ఈయేడాది ఫిబ్రవరిలో 'ప్రదక్షిణ' పేరుతో 12 రాష్ట్రాల మీదుగా ఆకాశంలో పారామోటార్ గ్లైడింగ్ చేస్తూ 10వేల కిలోమీటర్లు ప్రయాణించి ప్రపంచ రికార్డు సృష్టించారు. దీంతో పాటు హిమాలయాలతో పాటు వివిధ పర్వతారోహణలో సైతం రికార్డులు సృష్టించారు. 2012లో 20,540 ఫీట్ల ఎత్తువరకు మోటార్‌బైక్‌ను పర్వతారోహణ చేసి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో 2013లో పేరు నమోదు చేసుకున్నారు. హిమాలయ పర్వతాల్లో 926 కిలోమీటర్లను 51 గంటల్లో మోటార్‌బైక్ ద్వారా ఎక్కి రికార్డు సృష్టించారు. ప్రపంచ పారామోటార్ ఛాంపియన్షిప్ పోటీల్లో సైతం పతకాలు సాధించిన ఈయన మొత్తం మీద 12 ప్రపంచరికార్డులను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో జూనియర్ వారెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. -
ఒక్కరోజు అక్కడ సోషల్ మీడియా బంద్!
కంపాలా: ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఈ రోజు సోషల్ నెట్ వర్కింట్ సైట్లను బ్యాన్ చేయనున్నట్లు ఉగాండా నిర్ణయించుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాపై ఆ ఒక్క రోజు ఆంక్షలు తప్పవని ఉగాండా ప్రభుత్వం పేర్కొంటుంది. ప్రస్తుత అధ్యక్షుడు యోవేరి మస్వేనీని ఐదోసారి అధికారపీఠం వరించనుందో లేదో అన్నదానిపై దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు. గత 30 ఏళ్లుగా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. 1986 నుంచి యోవేరి మస్వేనీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గత ఎన్నికలు (2011) సమయంలో కూడా ఇలాంటి నిషేధాన్ని అమలుచేశారు. 2006లోనే అధ్యక్ష పదవి పోటీకి అతడు అనర్హుడు కావాలి కానీ, అధ్యక్ష పదవికి ఎన్నిసార్లు అయినా పోటీచేయవచ్చునని 2005లో చేసిన రాజ్యాంగ సవరణతో బయటపడ్డారు. మొబైల్ మనీ ట్రాన్స్ఫర్ సేవలకు కూడా ఎలక్షన్ రోజు కోత పడనున్నట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలోనూ అసత్య ప్రచారం బాగా వ్యాపించిన కారణంగా ప్రస్తుత ఎన్నకల్లో ఆ ప్రభావం తగ్గించడానికి, ఓటింట్ జరిగే రోజు పుకార్లు వ్యాపించనున్న నేపథ్యంలో సోషల్ మీడియాపై ఆంక్షలవైపే ఆ ప్రభుత్వం మొగ్గుచూపినట్లు తెలుస్తోంది. ముబైల్ సర్వీసులు, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడం.. భావవ్యక్తీకరణ హక్కును హరించినట్లేనని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ డిప్యూటీ రీజనల్ డైరెక్టర్ సారా జాక్సన్ అభిప్రాయపడ్డారు. -
కోనసీమ వాసిపై ఉగాండాలో కాల్పులు.. మృతి
అమలాపురం టౌన్: తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం ఎ.వేమవరప్పాడుకు చెందిన సంజయ్(47) అనే వ్యక్తి ఉగాండాలో హత్యకు గురయ్యాడు. సంజయ్ 17 ఏళ్ల నుంచి వ్యాపార, ఉద్యోగ రీత్యా కుటుంబసభ్యులతో కలిసి ఉగాండాలోనే ఉంటున్నారు. ప్రస్తుతం గ్రోమోర్ సీడ్స్ కంపెనీ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో 3వ తేదీ రాత్రి కంపాల నగరంలో సంజయ్‌ను ఓ సెక్యూరిటీ గార్డు తుపాకీతో కాల్చి హత్య చేశాడు. సెక్యూరిటీ గార్డు డబ్బులు డిమాండ్ చేయగా ఇవ్వడానికి సంజయ్ నిరాకరించటంతో అతడీ కాల్పలకు తెగబడ్డాడని తెలుస్తోంది. ఎనిమిది బుల్లెట్లు శరీరంలోకి దూసుకుపోయి తీవ్రంగా గాయపడ్డ సంజయ్‌ను ఆస్పత్రికి తరలించారు. అత్యవసర చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. కేసు నమోదు చేసిన ఉగాండా పోలీసులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని భారత్‌కు తరలించారు. మృతదేహం ఆదివారం ఉదయం హైదరాబాద్‌కు రాగా అక్కడ నుంచి రాత్రికి ఎ.వేమవరప్పాడు తరలిస్తున్నారు. సంజయ్‌కు భార్య సుహాసిని, కుమార్తె ఉదయ సాయి సాధన, కుమారుడు విష్ణురాజ్ ఉన్నారు. -
నేడు 9 అక్టోబర్, 1962
బుగాండా టు ఉగాండా స్వాతంత్య్రం వచ్చింది. బ్రిటిష్ ఉక్కుచెర నుంచి బయటికి వచ్చిన ఉగాండా స్వాతంత్య్రదేశంగా స్వేచ్ఛాపతకాన్ని ఎగరేసింది. 1894కు ముందు... ఉగాండా అనేది అనామక ప్రాంతం. ‘ఈ ప్రాంతాన్ని కాపాడడానికి వచ్చిన రక్షకులం మేము’ అంది బ్రిటన్. చరిత్ర మాత్రం ఈ సత్యాన్ని పెద్దగా ధ్రువీకరించలేదు. ఏది ఏమైనా... ఒక స్వాతంత్య్ర దేశంగా స్వేచ్ఛావాయువుల రుచి చూసిన ఈ ప్రాంతం- ‘హో! ఉగండా... ల్యాండ్ ఆఫ్ బ్యూటీ’ అని జాతీయగీతం పాడుకుంది. పచ్చని కొండల అందాలు, తేయాకు తోటల ఘుమ ఘుమలు... ఉగాండా ఒక అద్భుత చిత్ర దృశ్యం. ‘బుగాండా రాజ్యం’ నుంచి ‘ఉగాండా’ పేరు వచ్చింది. దేశపాలకులు ‘ల్యాండ్ ఆఫ్ బ్యూటీ’ విశేషణంతోనే సంతృప్తిపడకుండా ఉండి ఉంటే, దేశ అభివృద్ధి కోసం కష్టపడి ముందస్తు ప్రణాళికలు వేసుకొని ఉంటే... ప్రపంచంలోని పేద దేశాలలో ఉగాండా ఒకటయ్యేది కాదు. సరే, ఈ ఆర్థిక పేదరికం మాట ఎలా ఉన్నా... ప్రకృతి సంపద, సాంస్కృతిక, పురా చారిత్రక సంపద... ఆ దేశాన్ని సంపద్వంతం చేస్తూనే ఉన్నాయి. -
ఆత్మీయ క్షణాలు...
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఒకసారి ఆఫ్రికన్‌దేశం ఉగాండాలో పర్యటించాడు. ఆ సమయంలో అక్కడ ఒక గ్రామాన్ని సందర్శించాడు. ఆ వేళా విశేషంలో తనకు పుట్టిన పిల్లాడిని అమెరికా అధ్యక్షుడి చేతిలో పెడుతూ అతడి చేత నామరణం చేయించి, క్లింటన్ పేరే తన కొడుకుకూ పెట్టుకొంది ఒక తల్లి. కొంతకాలానికి క్లింటన్ అధ్యక్ష పదవీ కాలం ముగిసింది. క్లింటన్ యూనెస్కోతో కలిసి పనిచేస్తున్న సమయంలో అనుకోకుండా మరోసారి ఉగాండా వెళ్లాడు. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన పరిణామం చోటు చేసుకొంది. క్లింటన్ వస్తున్న విషయం తెలుసుకొన్న ఒక 14 యేళ్ల కుర్రాడు విమానాశ్రయంలోనే ఆయనను కలిసేందుకు అనుమతి తీసుకొన్నాడు. విమానం దిగిన క్లింటన్‌కు తనను తను పరిచయం చేసుకొంటూ, తన పేరు కూడా క్లింటన్ అని చెప్పి ‘నాకు పేరు పెట్టింది మీరే..’ అంటూ ఒకప్పటి ఫోటోలను చూపించాడు. ఆ విషయం గుర్తుకు తెచ్చుకొన్న క్లింటన్ కూడా ఆశ్చర్యపోయాడు. ఆ ఆత్మీయ క్షణంలో ఆ ఇద్దరూ భావోద్వేగానికి లోన య్యారు.. క్లింటన్ పొత్తిళ్లలో చిన్నారి ఒదిగి ఉన్న ఫొటో 1998లో తీసింది, రెండో ఫొటో 2012లో తీసింది. -
ఉగండాలో తెలుగు సాప్ట్వేర్ ఉద్యోగి హత్య
-
ఉగాండాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ కాల్చివేత
=మృతుడు రెడ్డికాలనీవాసి =బోరున విలపించిన కుటుంబ సభ్యులు వరంగల్‌క్రైం, న్యూస్‌లైన్ : ఉగాండా దేశంలో దుండగులు జరిపిన కాల్పుల్లో హన్మకొండ రెడ్డికాలనీకి చెందిన దాస రి రఘరామ్(27) ఆదివారం మృతి చెందాడు. బంధువులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకా రం వివరాలిలా ఉన్నాయి. రెడ్డికాలనీకి చెందిన దాసరి సాంబయ్య, అనసూయ దంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండో కుమారుడు రఘురామ్ ఉద్యోగ నిమిత్తం ఏడాదిన్నర క్రితం ఉగాండా దేశానికి వెళ్లి అక్కడ నెట్వర్స్ సెక్యూరిటీస్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి డబ్బు కోసం కొంతమంది దుండగులు రఘురామ్‌ను బెదిరించి దారుణంగా కాల్చి చంపారు. కాగా, ఆదివారం ఉదయం రఘురామ్ మృతిచెందిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బోరున విలపించారు. ఇదిలా ఉండగా, రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి బస్వరాజు సారయ్య, ఎంపీ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ అర్బన్ అధ్యక్షుడు తాడిశెట్టి విద్యాసాగర్, ముదిరాజ్ మహా సభ జిల్లా అధ్యక్షుడు పి. అశోక్ ఆదివారం మ ధ్యాహ్నం రఘురామ్ ఇంటికి చేరుకుని ఆయ న కుటుంబ సభ్యులను పరామర్శించారు. రఘురామ్ మృతదేహాన్ని ఇక్కడికి త్వరగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు వారు సూచించారు. -
ఉగాండాకు ‘రైతు’ గండం
‘ఆఫ్రికా ప్రధాన సమస్య నాయకులే కానీ ప్రజలు కారు’ అని నిస్సంకోచంగా చెప్పినవాడు... ఉగాండా దేశాధినేత యొవేరీ ముసెవెని. ఆ మాటలు నేటివి కావు పాతికేళ్ల క్రితం నాటివి. నేటి ఉగాండా ప్రధాన సమస్యగా మారి మరీ ఆయన తన మాటలను రుజువు చేస్తున్నారు! అలా అని ఇతర ఆఫ్రికా దేశాధినేతల్లాగా ఆయన జాతి సంపదను కొల్లగట్టి కోట్లకు పడగలెత్తినవాడు కాడు. గత 27 ఏళ్లుగా దేశాధినేతగా ఉన్న ఆయన నేటికీ ‘మంచి రైతు.’ రాజధాని కంపాలాలో కంటే తన వ్యవసాయ క్షేత్రంలో, పశువుల మందలతోనే ఎక్కువగా గడుపుతారు. అక్కడి నుంచే చాలా వరకు పరిపాలనా వ్యవహారాలను చక్కబెడుతుంటారు. ఆ ‘మంచి రైతు’ పాలనే వ్యవసాయంపై ఆధారపడ్డ 90 శాతం ప్రజలను పెద్ద పామై కాటేస్తుండటమే విషాదం. జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే (89)లాంటి వారి అవినీతి, ఎన్నికల అక్రమాలను గోరంతలు కొండంతలు చేసి గగ్గోలు పెట్టే అమెరికాలాంటి దేశాలకు ముసెవెని నియంతృత్వం కనిపించదు. 2005లో రాజ్యాంగాన్ని సవరించి అధ్యక్ష పదవిని ఎన్నిసార్లయినా చేపట్టడానికి ఆయన దారిని సుగమం చేసుకున్నారు. తాజాగా అధ్యక్ష పదవికి 75 ఏళ్ల వయోపరిమితిని రద్దు చేశారు. ఉగాండాలోని ఎన్నికల్లో రిగ్గింగు, ప్రత్యర్థుల దేశబహిష్కారం, వారిని మటుమాయం చేయ డం పరిపాటి. ఇవేవీ పాశ్చాత్య దేశాలకు కనడకపోవడానికి తగిన కారణమే ఉంది. 1979లో నరహంతక నియంత ఈదీ అమీన్‌ను కూలదోయడంలోనూ, 1985లో మిల్టన్ ఒబొటె నియంతృత్వాన్ని కూలదోయడంలోనూ ముసెవెనీ కీలక పాత్ర పోషిం చారు. ‘తూర్పు ఆఫ్రికా సింహం’గా 1986లో దేశాధ్యక్షుడైన ఆయన అంతర్గత సైనిక కుమ్ములాటలను, ప్రాంతీయ యుద్ధాలను అధిగమించి సుస్ధిర పాలన నెలకొల్పారు. ఆ పై కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వంది మాగధులకు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఉగాండా అనినీతికి, అసమర్థ పాల నకు మారుపేరయింది. అల్బర్ట్, విక్టోరియా సరస్సులేగాక, తెల్ల నైలు ప్రవహించే ఉగాం డా ఒకప్పుడు తూర్పు ఆప్రికాలోని సంపన్న దేశం. దేశమంతటా వర్షాలు కురిసేవి. 90 శాతం ప్రజలకు నేటికీ వ్యవసాయం, పశుపోషణలే ఆధారం. ప్రపంచబ్యాంకు వృద్ధి మార్గం పట్టిన ముసెవెని ప్రభుత్వం సువిశాల పచ్చిక మైదానాలను పాశ్చాత్య దేశాల హరిత ఇంధన అవసరాల కోసం కార్పొరేట్ గుత్త సంస్థల పరం చేస్తోంది. సంచార పశుపాలకులను స్థిర వ్యవసాయం చేపట్టాలని నిర్బంధిస్తోంది. తూర్పు ఆఫ్రికాపై వాతావరణ మార్పుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఫలి తంగా ఉగాండా తరచుగా దుర్భిక్షానికి, వరదలకు గురవుతోంది. అధిక ఉష్ణోగ్రతలకు ఉపరితల జల వనరుల ఇంకిపోతున్నాయి. ‘పచ్చిక బీళ్ల వెంబడి సంచరించే పశుపాలక సంచార జీవితమే ఉగాండాలోని వాతావరణ మార్పులను తట్టుకొని, కరువును, ఆకలి చావులను నివారించడానికి హామీ’ అని ‘ఇం టర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్’ ఘోషిస్తోంది. పైగా ఉగాండా, కెన్యా, ఇథియోపియాలలోని సంప్రదాయక పశుసంపద అత్యాధునికమైన ఆస్ట్రేలియా, అమెరికా పశు క్షేత్రాలకంటే శ్రేష్టమైన మాంసాన్ని, ఎక్కువగా అందిస్తాయని, హెక్టారుకు వచ్చే రాబడి కూడా చాలా ఎక్కువని ఆ సంస్థ రుజువు చేసింది. అయితేనేం, పాశ్చాత్య దేశాల జీవ ఇంధనాల కోసం సంప్రదాయక పశు సంతతి, పశుపాలకులు అంతరించిపోక తప్పదు. పరాధీనమైన ఆధునిక డెయిరీ ఫార్మ్‌ల విస్తరణ రైతు కుటుంబాల, పశుపాలకుల ఆహారపు అలవాట్లపై దుష్ర్పభావం చూపుతోంది. ఉగాండా, కైన్యా, ఇథియోపియాలలో ఆవుల నెత్తురును క్రమబద్ధంగా తీసి, పాలతో కలిసి ‘ఎకాసెల్’ అనే సంప్రదాయక పౌష్టికాహారా న్ని తయారుచేస్తారు. సంప్రదాయక పశుసం పదతోపాటూ ‘ఎకాసెల్’ రుచిని కూడా తూర్పు అఫ్రికా మరిచిపోక తప్పదు. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ పద్ధతుల కోసం పరిశోధనలు సాగిస్తున్న పాశ్చా త్య దేశాలే ఇంధన అవసరాల కోసం వాతావరణ మార్పులను తట్టుకునే సంప్రదాయ పశుసంపదను, పశుపోషక జీవనవిధానాన్ని నిర్మూలిస్తున్నాయి. తూర్పు ఆఫ్రికా ప్రజలను కరువు రక్కసి నోట్లోకి నెడుతున్నాయి. అం దుకు సహకరించే ముసెవెని లాంటి నేతలంటే అందుకే వారికి అంత ముద్దు. - పిళ్లా వెంకటేశ్వరరావు